ఏడాదైతే వాళ్లే మా పార్టీలోకి వస్తారు: వైఎస్ జగన్
ఏడాదైతే వాళ్లే మా పార్టీలోకి వస్తారు: వైఎస్ జగన్
Published Thu, Feb 25 2016 1:44 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
హైదరాబాద్: ఎమ్మెల్యేలను కొనడం వల్ల ప్రభుత్వాలు నిలబడవని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తేనే ప్రభుత్వాలు నిలబడతాయని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో గురువారం ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ 'నలుగురైదుగురు ఎమ్మెల్యేలను తీసుకోవడం వల్ల ఏమీ కాదు. మొట్టమొదట పార్టీలో అమ్మ, నేను మాత్రమే ఉన్నాము. ఆ తర్వాత 18 మంది ఎమ్మెల్యేలు వస్తే రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాము. అనంతరం మా బలం 67 కు చేరుకుంది. అధికార పార్టీ పట్టిసీమ, జెన్ కో, రాజధాని భూముల్లోని అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కోనుగోలు చేస్తోంది.
ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 నుంచి 30 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక చంద్రబాబు ప్రతిపక్షం గొంతు నొక్కే పనిలో పడ్డారు. టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల నియెజక వర్గాల్లో అంతకంటే మెరుగైన నాయకులు వస్తారు. ఆ నాడు ఎన్టీఆర్ గెలిపించిన ఎమ్మెల్యేలను తీసుకుని దొడ్డి దారిన చంద్రబాబు సీఎం అయ్యారు. ఆయనకు సిగ్గుంటే పార్టీలోకి తీసుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. అప్పుడు ఎన్నికలకు వెళ్దాం..ప్రజలు ఎవరి వైపు నిలబడతారో చూద్దాం. చంద్రబాబు ఈ సవాల్ ను ఛాలెంజ్ గా తీసుకోవాలి. ప్రజలకు మాకు తోడున్నామంటూ భరోసా ఇస్తున్నారు. ఇంకో ఏడాదైతే టీడీపీ ఎమ్మెల్యేలే మా పార్టీలోకి వస్తారు. అప్పడు నైతికంగా వాళ్లతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తా' మని తెలిపారు.
Advertisement