హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం సభలో మాట్లాడుతూ రాజ్యాంగ నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని జానారెడ్డి ఆరోపించారు.
రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సభ్యుల పార్టీ ఫిరాయింపులు సరికాదని ఆయన అన్నారు. సభలో ప్రభుత్వ తీరే బాగోలేదని అన్నారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. సభ్యుల నిరసనలు, నినాదాలతో అసెంబ్లీ సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి.