janareddy
-
తీన్మార్ మల్లన్న ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందన
-
జైల్లో చిప్పకూడు తినిపిస్తా
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కాలు విరిగిందని, అధికారం పోయిందని, కూతురు జైలుకెళ్లిందని ఇన్నాళ్లూ సంయమనం పాటించామని.. సైలెంట్‌గా ఉన్నామని ఏదిపడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తాను జానారెడ్డి టైపు కాదని.. తప్పుడు మాటలు మాట్లాడితే అంగీ, లాగు ఊడదీసి చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తానని హెచ్చరించారు. గతంలోనే తాను చెప్పినట్టు కేసీఆర్, కూతురు, అల్లుడు, కుటుంబం ఉండేట్టు అందులో డబుల్ బెడ్రూం కట్టిస్తానని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ ప్రసంగించారు. బీఆర్ఎస్తోపాటు బీజేపీపై, ఆ పార్టీల నేతలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే..‘‘ఇన్నాళ్లూ కుక్కలు మొరిగినయ్. ఇప్పుడో నక్క వచ్చింది. మొన్న సూర్యాపేటకు, నిన్న కరీంనగర్‌కు వెళ్లింది. కేసీఆర్ తననేం పీకుతారని అడుగుతున్నారు. వెంట్రుక కూడా పీకలేరని అంటున్నారు. అది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? పదేళ్లుగా రాష్ట్రాన్ని పీడించి, దోచుకున్న దొంగలు వాళ్లు. ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం.. గత ఏడాది సెప్టెంబర్ 17న సోనియాగాంధీ ఇదే చోట సభలో ఆరు గ్యారంటీలిచ్చి తెలంగాణలో మూడు రంగుల జెండాను రెపరెపలాడించారు. ఇప్పుడు మళ్లీ అదే విధంగా దేశానికి ఐదు గ్యారంటీలను రాహుల్‌గాంధీ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుంది. జూన్ 9న ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను తుక్కుతుక్కుగా ఎలా తొక్కారో.. అదే ఊపు, ఉత్సాహం, పట్టుద లతో బీజేపీని తొక్కడానికి లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సభకు వచ్చారు. వైబ్రెంట్ తెలంగాణ నినాదాన్ని జాతీయ స్థాయిలో వినిపిస్తాం. మా పాలనను మీ ముందు పెట్టాం మా 100 రోజుల పాలనను మీ ముందు పెట్టాం. మేం మంచి పాలన ఇస్తే, సంక్షేమ పథకాలు అమ లు చేస్తే, ఆరు గ్యారంటీల అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నించామని అనుకుంటే మమ్మల్ని 14 సీట్లలో గెలిపించండి. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి భారీగా నిధులు, అనుమతులు తెచ్చుకోవాలన్నా తెలంగాణ నుంచి 14 మంది ఎంపీలు గెలవాలి. మోదీ.. గాంధీ కుటుంబం మధ్య పోరాటం.. విదేశాలు తిరుగుతూ గంటకో డ్రెస్ మార్చే మోదీ దేశ ప్రధాని కావాలో.. దేశం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి చుట్టివస్తున్న రాహుల్ గాంధీ కావాలో తేల్చుకోవాలి. రాబోయేవి ఎన్నికలు కావు. పోరాటం. నరేంద్ర మోదీ కుటుంబం, గాంధీ కు టుంబం మధ్య పోరాటం. మోదీ కుటుంబంలో ఈవీఎం, ఈడీ, ఐటీ, సీబీఐ ఉన్నాయి. గాంధీ కుటుంబంలో ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీతోపా టు ప్రధాని, రాష్ట్రపతి వంటి పదవులను త్యాగం చేసిన సోనియాగాంధీ, దేశం కోసం ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడిన రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, దేశంలో దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నారు. నమో అంటే నమ్మితే మోసం.. రాజ్యాంగాన్ని మార్చాలనే మోదీ ప్రయత్నా లను ఆపాలంటే తెలంగాణ రాహుల్ గాంధీ వెంట నడవాలి. అసలు బీజేపీకి ఎందుకు ఓటే యాలి? ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని మోసం చేసినందుకా? రైతులను చంపినందుకా? దేశంలోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టినందుకా? హైదరాబాద్‌లో వరదలు వస్తే ఈ సిగ్గులేని కిషన్‌రెడ్డి ఒక్క రూపాయి అయినా వరద సాయం తెచ్చారా? నమో అంటే నమ్మితే మోసం. 2024 నాటికి ప్రతిపేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తామని మోదీ చెప్పారు. మరి తెలంగాణలో ఎన్ని ఇళ్లు ఇచ్చా రో బీజేపీ నేతలు లెక్కచెప్పి ఓట్లడగాలి..’’ అని రేవంత్ డిమాండ్ చేశారు. -
సీఎం రేవంత్‌తో భేటీ..జానారెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : కొత్త ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి కోరారని మాజీ మంత్రి జానారెడ్డి తెలిపారు. సోమవారం సీఎం తనతో భేటీ అయిన సందర్భంగా జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ప్రజాభిమానం చూరగొనేలా పనిచేయాలని సీఎం రేవంత్‌కు చెప్పాను. ప్రభుత్వంలో నా పాత్ర ఏమి ఉండదు. నా సలహాలు సూచనలు కావాలంటే ఇస్తా. కొత్త ప్రభుత్వం తమకున్న బాధలు,ఇబ్బందులు వెల్లడించడం శుభపరిణామం ’ అని జానారెడ్డి తెలిపారు. ‘కేసీఆర్ ఆస్పత్రిలో ఉండడం చాలా బాధాకరం.నేను వెళ్లి కలిసే ప్రయత్నం చేశాను కానీ ఆయన నిద్రలో ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావులను కలిసి వచ్చాను. కేసీఆర్ కోలుకుని కొత్త ప్రభుత్వానికి ఆయన సలహాలు సూచనలు ఇవ్వాలి.నేను పార్లమెంట్ కు పోటీ చేస్తాను అని గతంలో చెప్పా. అధిష్టానం ఆదేశిస్తే ఆలోచిస్తా’ అని జానారెడ్డి చెప్పారు. ఇదీచదవండి..స్పీకర్ ఎన్నిక 14న..ఆయనకే ఛాన్స్ ! -
మాజీ మంత్రి జానారెడ్డి నామినేషన్లు తిరస్కరణ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) సోమవారం పూర్తయింది. ఈ నెల 10వ తేదీ వరకు మొత్తం 428 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 73 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 355 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఎన్నికల అధికారులు ఓకే చెప్పారు. అత్యధికంగా తుంగతుర్తి, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. మునుగోడులో మాత్రం ఒక్క నామినేషన్ మాత్రమే తిరస్కరణకు గురైంది. నామినేషన్లను ఆయా నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు నిశితంగా పరిశీలించి.. సరిగా లేనివాటిని తిరస్కరించారు. తిరస్కరణకు గురైన వాటిలో మాజీ మంత్రులు జానారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు నామినేషన్లు ఉన్నాయి. వారితో పాటు పలువురు స్వతంత్రుల నామినేషన్లు ఉన్నాయి. ఇక ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువుగా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఆ తర్వాత బరిలో ఉండేది ఎంతమంది అనే విషయం తేలనుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లు ఇవీ.. ► నల్లగొండ నియోజకవర్గంలో 39మంది నామినేషన్లు వేయగా అందులో ముగ్గురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ► నకిరేకల్‌లో 33 మంది అభ్యర్థులకుగాను ఇద్దరి నామినేషన్లు తిరస్కరించారు. ► మునుగోడులో 51 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో ఒక్కరి నామినేషన్‌ను తిరస్కరించారు. ► దేవరకొండలో 18 మంది నామినేషన్లు వేయగా ఐదుగురివి తిరస్కరణకు గురయ్యాయి. ► మిర్యాలగూడ నియోజకవర్గంలో 45 మంది నామినేషన్లు వేయగా, అందులో 12 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. ► నాగార్జునసాగర్‌లో 28 నామినేషన్లకు గాను ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రపోజర్స్ సంతకాలు సరిపడా చేయించకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇద్దరు ప్రపోజర్స్ సంతకాలు చేయాల్సి ఉండగా.. కేవలం ఒక్కరే చేశారు. ► సూర్యాపేట నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, 10 మంది అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ► తుంగతుర్తి నియోజకవర్గంలో 33 మంది నామినేషన్లు వేయగా, అందులో 12 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన మోత్కుపల్లి నర్సింహులు అఫిడవిట్ సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. ► హుజూర్‌నగర్‌లో 40 మంది నామినేషన్లను దాఖలు చేయగా, ఐదుగురి నామినేషన్లను తిరస్కరించారు. ► కోదాడ నియోజకవర్గంలో 39 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ముగ్గురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ► ఆలేరు నియోజకవర్గంలో 31 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 9 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ► భువనగిరిలో 29 మంది నామినేషన్లు వేయగా నలుగురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. రేపటి వరకు ఉపసంహరణ నామినేషన్లు ఉపసంహరించుకోవడాని మంగళ, బుధవారాల్లో అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు కొందరు బరిలో నిలిచేందుకు స్వతంత్రంగా నామినేషన్లు వేశారు. వారిని బుజ్జగించే పనిలో ముఖ్య నాయకులు ఉన్నారు. స్వతంత్రులను కూడా తమవైపునకు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి ఉపసంహరణ ప్రక్రియ ముగిసి బరిలో ఉండే అభ్యర్థులు ఎవరో తేలనున్నారు. -
తాతకు మళ్లీ లగ్గం...తెలంగాణ పప్పు..
-
హస్తం పార్టీ నుంచి.. ఆరుగురు ఖరారు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆరు అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. నల్లగొండ, నకిరేకల్, నాగార్జునసాగర్, హూజూర్‌నగర్, కోదాడ, ఆలేరు నియోజకవర్గాల నుంచి పోటీలో ఉంచే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. దీంతో కొంత కాలంగా ఆశావహులు, పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు, పార్టీ కేడర్ ఎదురు చూపులకు తెరపడింది. ఇక మిగతా స్థానాల్లో పోటీలో నిలిచే అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. మరోవైపు జిల్లాలో కమ్యూనిస్టులకు కేటాయించే స్థానాలపైనా స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ అధిష్టానం పొత్తులకు సంబంధించిన సీట్ల ఖరారు విషయంలో తర్జనభర్జన పడుతోంది. ముఖ్య నేతలకు ముందుగానే టికెట్లు.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొదటి జాబితాలో ముఖ్యనేతలకు టికెట్లను కేటాయించింది. సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్‌ను ప్రకటించింది. అలాగే మాజీ పీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హుజూర్నగర్, ఆయన సతీమణి పద్మావతిరెడ్డికి కోదాడ టికెట్‌ను కేటాయించింది. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డికి నాగార్జునసాగర్, నకిరేకల్ టికెట్‌ను ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు, ఆలేరు టికెట్‌ను బీర్ల అయిలయ్యకు కేటాయించింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాల్లో ఆరు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. త్వరలోనే రెండవ జాబితాలో మిగిలిన ఆరు సీట్లకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. కమ్యూనిస్టుల సీట్లపై రాని స్పష్టత.. పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు కేటాయించే సీట్ల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో నిిమిర్యాలగూడ తమకు ఇవ్వాలని సీపీఎం కోరుతుండగా, మునుగోడు కావాలని సీపీఐ పట్టు పడుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుంచి ఒత్తిడి తీవ్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది. పోటీ ఉన్న చోట బుజ్జగింపులు టికెట్ కోసం పోటీ ఉన్న చోట బుజ్జగింపుల పర్వానికి తెర తీసింది. గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఖర్చులను భరించగలిగే స్థోమత కలిగిన వారివైపే మొగ్గు చూపుతోంది. అయితే నియోజకవర్గాల్లో పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారిని పక్కన పెట్టాల్సి వస్తుండడంతో వారిని బుజ్జగించే పనిలో పడింది. భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి, దేవరకొండ స్థానాల్లోని ఆశావహులతో మాట్లాడుతోంది. ఏకాభిప్రాయం వచ్చాక రెండో జాబితాలో ఆ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. ఆరోసారి నల్లగొండ బరిలో వెంకట్‌రెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోసారి నల్లగొండ అసెంబ్లీ బరిలో నిలువబోతున్నారు. 1999, 2004, 2009, 2014 వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య మంత్రివర్గంలో ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా పనిచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో కూడా మౌలిక వసతులు, పెట్టుబడులు, రేవుల శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు నల్లగొండ నుంచి మరోసారి బరిలో ఉండబోతున్నారు. హుజూర్నగర్ నుంచే ఉత్తమ్ కోదాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 1994, 1999, 2004 ఎన్నికల్లో మూడుసార్లు పోటీ చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 1999, 2004లో గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత హుజూర్నగర్ నుంచి 2009, 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా విజయం సాధించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు నాలుగోసారి ఆయన హుజూర్నగర్ నుంచి బరిలో దిగబోతున్నారు. రాష్ట్రపతి భవన్లో ఉన్నత ఉద్యోగం చేస్తున్న నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి 1994లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. నకిరేకల్‌లో వీరేశం నకిరేకల్ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన వేముల వీరేశం ఇప్పుడు అదే నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలువబోతున్నారు. వీరేశం 2009లో రాజకీయాల్లో అడుగు పెట్టారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన వీరేశం ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 2009, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచారు. ఆ తరువాత పార్టీ మారిన చిరుమర్తి ఇప్పుడు బీఆర్ఎస్నుంచి పోటీలో ఉన్నారు. మొదటిసారి జైవీర్‌రెడ్డి, అయిలయ్య నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి వారసుడిగా కుందూరు జైవీర్‌రెడ్డి మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. 2009 నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పని చేస్తున్న ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రియాశీలకంగా పని చేశారు. ప్రస్తుతం జానారెడ్డి ఆశీస్సులతో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలువబోతున్నారు. ఇక ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీర్ల అయిలయ్య బరిలో దిగబోతున్నారు. 1991లో ఎన్ఎస్యూఐలో చేరిన ఆయన సర్పంచ్‌గా, ఎంపీటీసీ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో పని చేశారు. ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. -
అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్న జానారెడ్డి.. మొత్తంగా 13 శాఖలకు మంత్రిగా సేవలు
సూర్యపేట్: సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించిన కుందూరు జానారెడ్డి ఈసారి అసెంబ్లీ బరినుంచి తప్పుకున్నారు. తన కుమారుడు జైవీర్‌రెడ్డిని ఈసారి పోటీలో దింపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అనుముల గ్రామంలో జన్మించిన ఆయన రాజకీయ ప్రస్థానం 1974లో ప్రారంభమైంది. అప్పట్లో జయప్రకాష్ నారాయణ్ చేపట్టిన సంపూర్ణ క్రాంతి ఉద్యమానికి ఆకర్షితులై 1977లో జనతా పార్టీలో చేరి.. అదేపార్టీ నుంచి 1978లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో దిగారు. 55 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటివరకు అసెంబ్లీకి 11సార్లు పోటీ చేయగా, నాలుగు సార్లు ఓడిపోయిన ఆయన ఏడుసార్లు గెలుపొందారు. అందులో 14 ఏళ్లకు పైగా మంత్రిగా సేవలు అందించారు. చలకుర్తి నుంచి మొదటిసారిగా పోటీ.. 1967లో చలకుర్తి నియోజకవర్గం ఏర్పాటు కాగా 2004 వరకు అదే పేరుతో కొనసాగింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009 నుంచి చలకుర్తిని నాగార్జునసాగర్ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. జానారెడ్డి 1978లో చలకుర్తి నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరఫున తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మల రాములు చేతిలో ఓడిపోయారు. 1983 ఎన్నికల్లో జానారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఆ ఎన్నికల్లో నిమ్మల రాములుపై గెలిచి ఆ తరువాత టీడీపీలో చేరారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాగ్యానాయక్‌పై గెలిచారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన జానారెడ్డి 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా, టీడీపీ అభ్యర్థి గోపగాని పెద నర్సయ్యపై గెలుపొందారు. 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ చేతిలో ఓడిపోయారు.1999, 2004లో జరిగిన ఎన్నికల్లో గుండెబోయిన రాంమూర్తి యాదవ్‌పై గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తేరా చినపరెడ్డిపైనా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై గెలుపొందారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయారు. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో జానారెడ్డి తన కుమారుడు జైవీర్‌రెడ్డిని రంగంలోకి దింపారు. రాష్ట్రంలోనే సీనియర్ మంత్రిగా జానారెడ్డి రికార్డు.. పలు కీలక శాఖల మంత్రి పదవుల్లో కొనసాగిన కుందూరు జానారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. అత్యధిక కాలం మంత్రిగా (14 ఏళ్ల 11 నెలలు) పని చేశారు. 1988లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయి సొంతంగా తెలుగు మహానాడు పార్టీని స్థాపించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన జానారెడ్డి హోం, వ్యవసాయ, హౌజింగ్, సహకార, పంచాయతీ రాజ్, రవాణా, రోడ్లు, ఫారెస్ట్, తూనికలు, భవనాలు, గ్రామీణాభివృద్ధి తదితర 13 శాఖలకు మంత్రిగా సేవలందించారు. -
TS Election 2023: సాగర్ బరిలో జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డి
నల్లగొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తొలి విడతలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకుడు జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డి టికెట్ దక్కింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భగత్ పోటీ చేస్తుండగా ఈ సారి అందరి చూపు నాగార్జునసాగర్ వైపే మళ్లింది. జానారెడ్డి మొదటిసారి ఎన్నికలకు దూరం కావడం విశేషం. ఇద్దరు యువ నాయకులకు యూత్ పాలోంగ్ ఉన్న నేపథ్యంలో పోరు రసవత్తరంగా మారనుంది. జానారెడ్డి చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి గిరిజన చైతన్య యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లారు. పెద్దవూర మండలం గేమ్యా నాయక్ తండా నుంచి పాదయాత్రను మొదలు పెట్టిన జైవీర్‌రెడ్డి.. తనతండ్రి జానారెడ్డి హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయ చదరంగంలో నడయాడిన జానారెడ్డి.. తనయుని విజయం కోసం వెనక నుంచి పాటుపడనున్నారు. అయితే.. తన రాజకీయ వారసత్వాన్ని కాపాడుకోవడంలో ఎంత వరకు సఫలమవుతారో చూడాలి మరి..! -
పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
వాళ్ళంతా పార్టీలో సీనియర్లు.. సూపర్ సీనియర్లు.. హస్తం పార్టీ తమవల్లే చాలాసార్లు గెలిచిందంటారు. తమను గౌరవించాలని.. మాట వినాలని డిమాండ్ చేస్తారు. కాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ సీనియర్లలో చాలా మంది వెనకాడుతున్నారు. పోటీ చేయకుండా కొత్తవారికి అవకాశం ఇస్తారా అంటే.. కుదరదంటారు. అసలు టీ.కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? పోటీకి వెనకాడుతున్న నాయకులెవరు? తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు ఎన్నికలు అంటేనే భయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము నెట్టుకురాగలమా అని ఆందోళన చెందుతున్నారట. పాలిటిక్స్ గతంలో మాదిరిగా లేవు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పెరిగింది. దీంతో నేతలు ఎన్నికలంటేనే భయపడుతున్నారు. కొందరు నేతలు అక్కడా.. ఇక్కడా తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని స్టేట్మెంట్స్ ఇస్తున్నారట. దీంతో కొందరు సీనియర్ల వ్యవహారం పై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో తామే ముందుండాలని, తమకు ప్రత్యేక ఆసనాలు వేయాలని కోరుకునే సీనియర్లు ఎన్నికలంటే భయపడుతున్నారని టాక్ నడుస్తోంది. రేణుక చౌదరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి లాంటి నేతలు సైతం ఎన్నికలు అనే సరికి వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగతా నేతలంతా వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో ఎన్నికలు అనే సరికి భయపడే పరిస్థితి వచ్చిందంటున్నారు కొందరు. వారసుల కోసం.. సిటింగ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ అంటేనే భయమేస్తోందని కామెంట్ చేశారు. ఉమ్మడి ఏపీలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనర్సింహ సైతం ఎన్నికలు అంటేనే భయపడుతున్నారట. దామోదర తన కూతురుని పోటీలో ఉంచితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డిలు సైతం వచ్చే ఎన్నికలను ఎదుర్కోగలమా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారట. జానారెడ్డి లాంటి నేతలు రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చి కొడుకులను రంగంలోకి దింపే ప్లాన్ చేస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య సైతం కోడలు వైశాలిని మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావాలనే యోచన చేస్తున్నారట. మాజీ ఎంపీ రేణుక చౌదరి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇలా సీనియర్ లు అని చెప్పుకునే నేతలు సైతం ఎన్నికలు అంటే జంకుతున్నారు. కాని పోటీకి దూరం అని చెప్తున్నప్పటికీ ఈ నేతలెవరు తమ నియోజకవర్గంలో మరో నేతకు అవకాశం ఇవ్వడం లేదు. తమ వారసులనే బరిలో దించాలని ఉబలాటపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల ఖర్చు భారీగా పెరిగింది. దీంతో పాటు చాలా మంది కొత్త నేతలు వెలుగులోకి వచ్చారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఓ యువనేతపై ఓడిపోవడం సీనియర్లను కలవర పెడుతోంది. కొత్త ఓటర్లతో.. సీనియర్ నేతలకు వచ్చిన గ్యాప్ పూడ్చుకోవడం సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితుల్లోనే వారు ఎన్నికలంటే భయపడే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోటీకి దూరం అనేది నిజమా? లేక ఏదైనా ఎత్తుగడతో ఇలా అంటున్నారా? అనేది నిదానంగా కాని తేలదు. చదవండి: గులాబీ ఎమ్మెల్యే ఎందుకు టెన్షన్లో ఉన్నారు?.. అక్కడ ఇదే హాట్ టాపిక్ -
జానారెడ్డి వ్యాఖ్యలు వక్రీకరించారు: అద్దంకి దయాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. జానారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తప్పదనుకుంటే బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని కామెంట్స్ చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలసి పని చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది.. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. బీజేపీపై పోరుకు, ఎన్నికలకు సంబంధం లేదన్నారు. ఇక, జానారెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో మరోసారి కలకలం సృష్టించాయి. జానారెడ్డి కామెంట్స్‌పై తాజాగా టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్పందించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్తో పొత్తు అనేది వెయ్యి శాతం సాధ్యం కాదు. జానారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అనే చర్చను ఎవరూ నమ్మవద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక, అంతకు ముందు కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్తో కాంగ్రెస్‌కు పొత్తు ఉండదని క్లియర్ కట్‌గా చెప్పారు. ఇది కూడా చదవండి: వచ్చే ఎన్నికల్లో నా కొడుకు పోటీ చేస్తాడు: జానారెడ్డి -
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం: జానారెడ్డి
హాలియా: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలోనూ కాంగ్రెస్ పారీ్టదే అధికారమని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలిచ్చి వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించా రు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులను కోరారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు. ఏ అధికారి అయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే తనకు సమాచారం అందించాలని సూచించారు. చదవండి: 26 నుంచి రేవంత్ రెడ్డి ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ -
టిఫిన్‌కి జానారెడ్డి ఇంటికి.. లంచ్‌కి కోమటిరెడ్డి ఇంటికి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతల తీరు కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. నాయకుల కీచులాటలు, పరస్పర విమర్శలపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఎప్పుడు.. ఏ నేత.. ఎవరిపై ఎలా మాట్లాడతాడో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొంది. అప్పుడే బాగున్నట్టు కనిపిస్తారు.. అంతలోనే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తుంటారని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ఏకంగా పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చి గాంధీభవన్‌లో చేసిన సూచనలను సైతం గాలికొదిలేశారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నేతలందరినీ ఐకమత్యంగా ఉంచి ఒక గాడిలో పెట్టేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ముఖ్యనేతలు ఆదివారం నిర్వహించనున్న కార్యక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. టిఫిన్ అక్కడ.. లంచ్ ఇక్కడ.. డిన్నర్ మరోచోట.. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డి ఆదివారం ఉదయం తన నివాసంలో టిఫిన్‌కి ఆహ్వానించారు. అయితే ఇది ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమమా? లేక పార్టీ అంతర్గత నిర్ణయం ప్రకారం జరుగుతోందా.. అన్నదానిపై స్పష్టమైన సమాచారం లేదు. నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నమే ఇది అని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇకపోతే లంచ్ ఏర్పాట్లు భువనగిరి ఎంపీ, పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంట్లో జరుగుతున్నాయి. మాణిక్యం ఠాగూర్‌తో పాటు ముఖ్య నేతలందరూ మధ్యాహ్న భోజనానికి అక్కడికి హాజరుకావాలన్న సమాచారం పార్టీ నుంచి వెళ్లినట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే రేవంత్‌రెడ్డిపై గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమం కూడా ఐకమత్యం కోసమేనన్న టాక్ వినిపిస్తోంది. అలాగే పార్టీ కార్యవర్గం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా డిన్నర్‌ను జూబ్లీహిల్స్‌లోని క్లబ్లో ఏర్పాటు చేశారు. దీనికి కూడా కీలక నేతలు, సీనియర్ నాయకులంతా హాజరవుతారు. కలరింగ్.. కవరింగ్.. అధిష్టానం నియమించిన ఇన్చార్జీల దగ్గరగానీ, వారు పాల్గొనే సమావేశంలో గానీ రాష్ట్ర నేతల కలరింగ్, కవరింగ్ ఒక స్థాయిలో ఉంటుందని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్నట్టుగా కనిపిస్తుందని నేతలు చర్చించుకుంటున్నారు. తీరా ఇన్చార్జి నేతలు హైదరాబాద్ నుంచి విమానం ఎక్కగానే ఆ రోజు రాత్రి నుంచే కీచులాటలు, ఫిర్యాదుల పర్వం మొదలవుతుందని, ఒకరిపై ఒకరు దూషించుకోవడం చేస్తున్నారని పార్టీ అధిష్టానికి ఫిర్యాదులు వెళ్లినట్టు తెలిసింది. తాజాగా ఆదివారం జరగబోయే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. వ్యవహారాలు ఏ స్థాయిలో పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకువస్తాయన్నదానిపై కేడర్‌లో ఆసక్తి నెలకొంది. -
నన్ను చెప్పనిస్తే ఉంటా.. లేదంటే వెళ్తా: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. టీపీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు సీనియర్లు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై చర్చించేందుకుగాను బుధవాంర గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. నాలుగు గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఓటమికి నేనే బాధ్యత వహిస్తా అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జానారెడ్డి తప్పు పట్టారు. ‘‘నువ్వు ఒక్కడివే బాధ్యుడివి ఎలా అవుతావు’’ అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ‘‘నేను చెప్పేది చెప్పనిస్తే ఉంటా... లేదంటే సంతకం పెట్టి వెళ్ళిపోతా’’నంటూ జానారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. (చదవండి: Congress Party: ‘హుజురాబాద్’ ఫలితం.. 60 వేల నుంచి 3 వేలకు..) ఓటమికి సమిష్టి బాధ్యత ఉంటుంది కానీ.. ఒక్కడి బాధ్యతే ఉండదన్నారు జానారెడ్డి. రేణుకా చౌదరి జానారెడ్డి వ్యాఖ్యలకు మద్దతు పలికారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీది బ్యాడ్ షో అని ఉత్తమ్, వీహెచ్, మదు యాష్కీ తెలిపారు. ఇప్పటికే మళ్లీ మీడియాతో మాట్లాడను అని జగ్గారెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: ఈ రోజు లాస్ట్ మీటింగ్.. గాంధీ భవన్లో మాట్లాడాలా వద్దా అనేది తేల్చుకుంటా ఓటమి కి గల కారణాలు తెలుసుకునేందుకు కమిటీ వేస్తాం: షబ్బీర్ అలీ రెండు రోజుల పాటు మెంబర్ షిప్ డ్రైవ్‌పై శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తాం.. నవంబర్ 14 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ లీడర్ల పాదయాత్ర చేస్తారని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి గల కారణాలను సమీక్షించుకున్నాం. హుజూరాబాద్ ఎన్నిక పార్టీల మధ్య జరగలేదు.కేసీఆర్, ఈటల మధ్య జరిగిన ఫైట్ అన్నారు. ‘‘టీఆర్ఎస్, బీజేపీలు 6 నుంచి 10 వేలు పెట్టి ఓక్కో ఓటు కొన్నారు. ఈటల రాజెందర్ ఎక్కడ తాను బీజేపీ అని చెప్పలేదు. ఓటమి కి గల కారణాలు తెలుసుకునేందుకు ఓ కమిటీ వేస్తాం’’ అని షబ్బీర్ అలీ తెలిపారు. -
జానాకు షాక్.. ఒక్కరౌండ్‌లో మాత్రమే...!
సాక్షి, నల్గొండ: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో వరుస రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇప్పటి వరకు కేవలం ఒక్క 14వ రౌండ్లో మాత్రమే ఆధిక్యంలోకి వచ్చారు. జానాకు కంచుకోటగా ఉన్న సాగర్‌లో టీఆర్ఎస్ మరోసారి సత్తాచాటింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరపున ఇక్కడి నుంచి పోటీచేసిన జానారెడ్డి దివంగత నోముల నర్సింహయ్య చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిదే. ఇక ప్రస్తుత కౌంటింగ్ సరళి చూస్తుంటే కారు పార్టీకి షాకిస్తామని ప్రచారంతో హోరెత్తించిన కాంగ్రెస్ చతికిలపడ్డట్టు స్పష్టమవుతోంది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలన నిజం చేస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మంచి మెజారీటీతో దూసుపోతున్నారు. నోముల భగత్‌ను వ్యూహాత్మంగా సాగర్ బరిలో దించిన టీఆర్ఎస్ ఓటర్ల దృష్టిని తమవైపునకు తిప్పుకోవడంలో సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. తండ్రి నోముల నర్సింహయ్యపై ఉన్న అభిమానాన్ని ప్రజలు భగత్‌పైనా చూపించారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు గట్టిపోటీచ్చిన బీజేపీ సాగర్‌లో గెలవాలని చాలా ప్రయత్నాలే చేసింది. అయితే, క్షేత్రస్థాయిలో అధికార టీఆర్ఎస్ బలం ముందు కాషాయదళం తేలిపోయింది. ఇప్పటివరకు 19 రౌండ్ల కౌంటింగ్ జరగ్గా ఒక్క రౌండ్లో కూడా బీజేపీ చెప్పుకోదగ్గ ఓట్లు సాధించలేదు. టీఆర్ఎస్ 14వేల ఓట్ల మెజారీతో తొలి స్థానంలో ఉండగా.. కాంగ్రెస్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన అధికార టీఆర్ఎస్ సాగర్ ఉప ఎన్నికలో వ్యూహాత్మంగా వ్యవహరించింది. చివరివరకు అభ్యర్థిని ప్రకటించడకుండా ఆఖరి క్షణంలో నరసింహయ్య కొడుకునే బరిలోకి దించింది. తద్వారా ప్రత్యర్థి పార్టీల అంచనాలకు అందకుండా జాగ్రత్త పడింది. జానా కోటలో పాగా వేసేందుకు మరోసారి సిద్ధమైంది! -
నాగార్జునసాగర్ లో జానారెడ్డి గెలుపు ఖాయం :ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
మమ్మల్ని బండబూతులు తిట్టడం సరికాదు: తలసాని
హాలియా : సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు తమను బండ బూతులు తిట్టడం సరికాదని పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలోని బాధ్యతగల వ్యక్తులు నీచమైన భాష మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. గురువారం హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్‌లో ఉప ఎన్నికలు ఉన్నందున ప్రచారం ఎవ్వరైనా చేసుకోవచ్చు, చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడంలో తప్పులేదన్నారు. ఎప్పుడూ నీతి సూత్రాల గురించి మాట్లాడే జానారెడ్డికి ఎలా మాట్లాడాలో తెలియాదా అని ప్రశ్నించారు. సాగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం లేక, ఓటమి తప్పదనే భయంతో జానారెడ్డి ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యల నివారణకు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉపయోగం లేదని, ఎవరు ఆ పార్టీని నమ్మడం లేదని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన యువకుడు, విద్యావంతుడు భగత్‌కు ఓటేసి గెలిపిస్తే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, యడవెల్లి మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్తో సబ్బండ వర్గాలకు న్యాయం మాడుగులపల్లి : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సబ్బండ వర్గాలకు న్యాయం జరిగిందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ధర్మాపురం, గోపాలపురం గ్రామాల్లో ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జానారెడ్డి 40ఏళ్లుగా చేయలేని అభివృద్ధి ఈ సారి చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో నాయకులు చింతరెడ్డి యాదగిరి రెడ్డి,మాజీ ఎంపీపీ దాసరి నరసింహ్మ,పగిళ్ల సైదులు,రాములు పాల్గొన్నారు. -
ఒక్క పింఛన్ తీసేసినా.. ప్రభుత్వాన్నే ఊడదీస్తా..!
పెద్దవూర: ‘‘టీఆర్ఎస్కు ఓటు వేయకుంటే పింఛన్ తీసేస్తామని ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తున్నారంట.. ఒక్కరి పింఛన్ తీసేసినా ఈ ప్రభుత్వాన్నే ఊడదీస్తా’’ అని సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి హెచ్చరించారు. గురువారం మండలంలోని బట్టుగూడెం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శాసనమండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి రాజకీయాలు మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా ఉన్న భూమిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టలేని చేతగాని ప్రభుత్వం టీఆర్ఎస్ అని అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజలందరినీఅరాచకవాదులుగా తయారుచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉప ఎన్నికలో తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దళితులకు మూడెకరాల భూమి, రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇళ్లు వంటి హామీల అమలు ఏమయ్యాయని ప్రశ్నించా రు. రాష్ట్రంలో ఒక కొత్త చరిత్రను సృష్టించటానికి, ఆదర్శవంతమైన రాజకీయం, ఇచ్చిన హామీలు నెరవేర్చటానికి జానారెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, స్థానిక ఎంపీటీసీ కత్తి మహాలక్ష్మీముత్యాల్‌రెడ్డి, కూన్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, ముస్కు నారాయణ, సువర్ణ, కూతాటి అర్జున్, నక్కల రామాంజిరెడ్డి, కత్తి కనకాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిక తిరుమలగిరి : మండలంలోని గోడుమడకలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు గురువారం జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బూడిద కొండలు, గుడాల వెంకటయ్య, బాలు, సోమయ్య, రంగయ్య, వెంకటయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవడం చారిత్రక అవసరం పెద్దవూర: సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి గెలవడం రాష్ట్రానికి చారిత్రక అవసరమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గురువారం మండలంలోని బసిరెడ్డిపల్లి, వెల్మగూడెం, బట్టుగూడెం, కొత్తగూడెం, కటికర్లగూడెం గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు పబ్బు యాదగిరిగౌడ్, ఎంపీటీసీ కత్తి మహాలక్ష్మీముత్యాల్‌రెడ్డి, కూన్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, చంద్రారెడ్డి, బక్కయ్య, శంకర్ పాల్గొన్నారు. -
సాగర్ ఉపఎన్నిక: ఇక దూకుడే..
హైదరాబాద్: చావోరేవో తేల్చుకోవాల్సిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు మంత్రం జపించనుంది. ఇప్పటికే పార్టీ అభ్యర్థి కె.జానారెడ్డి విజయం కోసం నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ నేతలు శనివారం నుంచి దాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు మిగిలిన నాయకులు శనివారం నుంచి నియోజకవర్గంలోనే మకాం వేయనున్నారని, పోలింగ్ ముగిసే వరకు ప్రచారంలో అధికార టీఆర్ఎస్కు తీసిపోకుండా ముందుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. గత నెల 27న హాలియాలో జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రచారంలో ఊపు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రచార గడువు ముగిసేలోపు మరోమారు నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తోంది. చివరి వారం రోజుల్లో నియోజకవర్గాన్ని చుట్టుముట్టి పోలింగ్‌కు ఉత్సాహంగా సిద్ధం కావాలని నేతలు భావిస్తున్నారు. మండలాలవారీగా ఇన్చార్జీలు ఇతర పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అంతకు రెండు నెలల ముందు నుంచే జానారెడ్డితోపాటు ఆయన తనయులు రఘువీర్, జైవీర్‌లు నియోజకవర్గంలో రెండు దఫాలుగా పర్యటించారు. స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహించడం, వారిని ఎన్నికలకు సిద్ధం చేయడంతోపాటు దూరమైన కొందరు నేతలను కలుపుకుని పోయే ప్రయత్నం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జానా అండ్ కో గత నెల 27న హాలియాలో నిర్వహించిన జనగర్జన బహిరంగ సభకు ఆశించిన మేర జనం హాజరు కావడం, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ సభకు రావడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జానా, ఆయన తనయులకు ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా తోడు కానుంది. ఇప్పటికే టీపీసీసీ పక్షాన మండలాలవారీ ఇన్చార్జీలను నియమించిన ఉత్తమ్ శనివారం నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ప్రచారానికి హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆదివారం నుంచి ముఖ్యులంతా నియోజకవర్గంలోనే ఉండి టీఆర్ఎస్ను తలదన్నేలా ప్రచారం చేయాలని టీపీసీసీ నాయకత్వం నిర్ణయించింది. సాగర్ ఎన్నికల ప్రచారంపై టీపీసీసీ అ«ధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘టీఆర్ఎస్ డబ్బులు వెదజల్లి, మద్యం పారించి గ్రామాల్లో హల్చల్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ ఎన్ని డబ్బులిచ్చినా, ఎంత మద్యం పోసినా జానారెడ్డి గెలుపు ఖాయం. కాంగ్రెస్ కేడర్ విజయంపట్ల పూర్తిస్థాయి విశ్వాసంతో ప్రచారంలో ముందుకెళుతోంది. ఈ ఎన్నికల్లో జానా గెలుపే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులంతా ఐక్యంగా, ప్రణాళిక ప్రకారం ప్రచారంలో పాల్గొంటారు’అని వ్యాఖ్యానించారు. చివరి వారమే కీలకం ఎన్నికల ప్రచారంలో చివరి వారంరోజులు చాలా కీలకమని, ఆ సమయంలో విస్తృత ప్రచారానికి ఏర్పాట్లు చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ మరోమారు ఇక్కడ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉండటం, ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నేపథ్యంలో తాము ఎక్కడా తగ్గలేదనే విధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లేలా రూట్‌మ్యాప్ తయారు చేసుకున్నారు. కోవిడ్‌తో ఇంటికే పరిమితమైన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఈ నెల 5 తర్వాత ప్రచారంలో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. సీఎం బహిరంగసభ నిర్వహించే తేదీని బట్టి మరోమారు తాము కూడా బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్‌తోపాటు జానాతో సన్నిహిత సంబంధాలున్న జాతీయ నేతలను కూడా ఆహ్వానించాలని యోచిస్తున్నారు. చివరి వారంపాటు నియోజకవర్గంలోని గడప గడపనూ తొక్కి జానా గెలుపు కోసం ఓటర్లను అభ్యర్థించే వ్యూహంతో టీపీసీసీ సిద్ధమవుతోంది. -
సాగర్‌లో గెలిస్తేఆ పదవి ఆయనకే!
-
మంత్రిగా పనిచేశాడు.. సొంత వాహనం కూడా లేదు!
నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కె.జానారెడ్డికి ఒక కుంట వ్యవసాయ భూమి కూడా లేదు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటున్న, అత్యధిక మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహించి, ఎక్కువకాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి పేరున సొంత వాహనం కూడా లేదు. నివాస భవనాలూ లేకపోగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో 600 గజాల స్థలం (విలువ రూ.2,73,80,000) ఉంది. అలాగే ఆయన వద్ద రెండు లైసెన్స్డ్ తుపాకులు.. 32 బోర్ రివాల్వర్, 0.25 పిస్టల్ ఉన్నాయి. జానాకు రూ.36,21,930 విలువైన చరాస్తి, రూ.33,46,000 విలువైన స్థిరాస్తి ఉంది. ఆయన భార్య సుమతికి ఏకంగా రూ. 5,13,16,724 విలువైన చరాస్తి ఉండగా, రూ.9,88,96,260 విలువైన స్థిరాస్తి ఉంది. జానా చేతిలో రూ.3,45,000 నగదు ఉండగా ఆయన భార్య చేతిలో రూ.2,75,000 నగదు ఉంది. జానాకు ఎస్బీఐ సెక్రటేరియట్ బ్రాంచ్‌లో రూ.4,89,626, యూకో బ్యాంక్, హైదరాబాద్‌లో రూ.1,67,776 నగదు ఉన్నాయి. భార్య పేరున యూకో బ్యాంక్, హైదరాబాద్‌లో రూ.6,81,012, ఎస్బీఐ సెక్రటేరియట్ శాఖలో రూ.8,83,336 నగదు ఉన్నాయి. భారీ మొత్తంలో షేర్లు జానారెడ్డి పేరిట ఆరతి ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.21,70,000 విలువైన ఈక్విటీ షేర్లు ఉండగా భార్య పేరున ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.3,85,74,560 విలువైన షేర్లు, ఆరతి ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.34,26,640 విలువైన షేర్లు, తరండా హైడ్రో పవర్ ప్రైవేట్‌లిమిటెడ్‌లో రూ.35,90,000 విలువైన షేర్లు ఉన్నట్లు జానా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. నోముల భగత్ ఆస్తుల వివరాలివీ.. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, ఆయన భార్య భవాని పేరిట పేరిట రూ.84.52 లక్షల అప్పులు ఉన్నాయి. భగత్ పేరిట రూ.55,33,719 విలువైన చరాస్తి, రూ.30,32,000 విలువైన స్థిరాస్తి ఉండగా, ఆయన భార్య పేరిట రూ.71,84,650 విలువైన చరాస్తి, రూ.1,75,000 విలువైన స్థిరాస్తి ఉంది. భగత్ చేతిలో రూ.19,000 నగదు ఉండగా ఆయన భార్య వద్ద రూ. 15,000 నగదు ఉంది. భగత్ పేరిట ఎస్బీఐ నకిరేకల్‌లో రూ.1,85,307, యాక్సిస్ బ్యాంక్, ఎల్బీ నగర్లో రూ.1,63,217 ఉన్నాయి. ఆయన భార్య పేరిట ఎస్బీఐ చౌటుప్పల్‌లో రూ.15,97,221, యాక్సిక్ బ్యాంక్, ఎల్బీ నగర్లో రూ.72,420 ఉన్నాయి. భగత్ పేరిట రెండు వాహనాలు, భార్య పేరిట ఒక వాహనం ఉన్నాయి. భగత్ పేరిట 16.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఆయన భార్యకు అర ఎకరం ఉంది. భగత్‌కు వ్యవసాయేతర భూములు, నివాస భవనాలు కూడా ఉన్నాయి. -
బంపర్ బొనాంజా.. సాగర్‌లో గెలిస్తే ఆ పదవి ఆయనకే!
హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలవేళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ మొదలయ్యింది. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితంవస్తే ఎన్నికల అనంతరం రాష్ట్ర పార్టీలో భారీ మార్పులుంటాయని, ఈ విషయమై పార్టీ అధిష్టానం వద్ద ఇటీవల కీలక చర్చ జరిగిందని తెలుస్తోంది. గాంధీభవన్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కె.జానారెడ్డి గెలిస్తే, ఆయన్నే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా నియమించాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం లో ఏం చేయాలనే ఆలోచనలో ఉన్న పార్టీ పెద్దలు.. ‘పెద్దాయన’అనే మంత్రంతో జానాను తెరపైకి తెచ్చి ఎలాంటి విభేదాలు, గొడవలు లేకుండా కార్యక్రమాన్ని ముగిస్తారని తెలుస్తోంది. అదే విధంగా 2023 ఎన్నికలను ఎదుర్కొనే బాధ్యతలను కూడా జానారెడ్డికి అప్పగించి, ప్రత్యామ్నాయ నేతగా ప్రతిపాదించి, ఆయన సారథ్యంలోనే ఎన్నికలకు వెళతారనే చర్చ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఆయనైతే అందరికీ ఓకే టీపీసీసీ అధ్యక్ష వ్యవహారాన్ని సాగర్ ఉప ఎన్నికల వరకు వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినా, ఇటీవల 10 జన్‌పథ్‌లో తెలంగాణ కాంగ్రెస్ గురించి కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన కీలక నేత ఒకరు ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్భంగా అధిష్టానంలోని ముఖ్య నాయకులతో ఇదే విషయమై చర్చించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించిన మరో పెద్దాయన సూచన మేరకు ఈ ప్రతిపాదన పార్టీ ముందుంచి అధిష్టానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించారనే గుసగుసలు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. ‘రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష వ్యవహారం తలనొప్పిగా మారింది. ఏకాభిప్రాయం వచ్చే అవకాశాలు అసలే కనిపించడం లేదు. జానారెడ్డి అయితే పార్టీలో చాలా సీనియర్. పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో సీఎల్పీ నేతగా పనిచేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే సీఎల్పీ నాయకుడిని చేయాలి. కానీ, ఆ పదవిలో దళిత నాయకుడు భట్టి విక్రమార్క ఉన్నారు. దళితుడిని ఆ పదవి నుంచి తొలగించి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం పార్టీకి నష్టం కలిగిస్తుంది. అలాగని ఎమ్మెల్యేగా జానారెడ్డి గెలిచిన తర్వాత కూడా ఆయనకు ఏ పదవి ఇవ్వకుండా పీసీసీ హోదాలో మరో నేతను కూర్చోబెట్టడం ఆయన స్థాయికి తగింది కాదు. పార్టీలో ఏ స్థాయి నేతలనైనా సమన్వయం చేసుకునే సామర్థ్యం జానాకు ఉంది. పీసీసీ అధ్యక్ష పదవి ఆశించిన కోమటిరెడ్డి, రేవంత్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని కాదనలేరు. వారికి ఇంకో రూపంలో కీలక బాధ్యతలు అప్పగించవచ్చు. అప్పుడు అధిష్టానం పని కూడా సులువవుతుంది.’అని ఆయన రాహుల్ అండ్ టీమ్‌కు వివరించినట్టు చర్చ జరుగుతోంది. అంతా విన్న 10 జన్‌పథ్ ముఖ్య నేతలు ఈ విషయంలో స్పష్టత ఇవ్వనప్పటికీ, ముందు నాగార్జునసాగర్‌లో గెలిచి రావాలని చెప్పినట్టు సమాచారం. ముందస్తు వ్యూహంతోనే..! వాస్తవానికి, గత రెండేళ్లుగా టీపీసీసీ అధ్యక్షుడి మార్పు వ్యవహారం అదుగో, ఇదుగో అంటూ నానుతూ వస్తోంది. ఈ పదవి కోసం పోటీ పడే నేతల జాబితా చాంతాడంత ఉండడం, షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత కూడా ఏకాభిప్రాయం రాకపోవడంతో అధిష్టానానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఫలానా నాయకుడికి ఇవ్వాలని కొందరు, ఇవ్వొద్దని కొందరు, ఆయనకు తప్ప ఎవరికి ఇచ్చినా తమకు ఓకేనని కొందరు, ఫలానా నేతకు పగ్గాలిస్తే పార్టీ వీడతామని మరికొందరు చెప్పడంతో అధిష్టానం కూడా వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే, గత రెండు నెలల క్రితం టీపీసీసీ అధ్యక్ష వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందని, ఆ పదవికి సీనియర్ కాంగ్రెస్ నేత టి.జీవన్‌రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసిందనే లీకులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన జానా, మరికొందరు నేతలు అధిష్టానంతో సంప్రదింపులు జరిపి టీపీసీసీ అధ్యక్ష ప్రకటన నిలిపి వేయించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడిని ప్రకటిస్తే తలనొప్పులు వస్తాయని, త్వరలోనే తాను పోటీ చేయబోయే సాగర్ ఉప ఎన్నిక వస్తున్నందున అప్పటివరకు ప్రకటించవద్దని నేరుగా అధిష్టానంతో మాట్లాడిన జానా.. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌తో అధికారిక ప్రకటన కూడా చేయించారు. సాగర్‌లో గెలిస్తే రాష్ట్ర పార్టీని హస్తగతం చేసుకోవాలనే వ్యూహంతోనే ఆయనతో పాటు ఆయనకు మద్దతిచ్చే కీలక నాయకులు ఈ వ్యూహాన్ని అమలు చేశారనే చర్చ ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
అసత్య ప్రచారం.. ఆ నాయకులకే నష్టం: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో కొంత మంది పార్టీ నాయకులపైనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇతరులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి అధికమవుతున్నాయని, కొంత మంది నాయకుల అభిమానులు ఇలాంటివి చేస్తున్నారని మండిపడ్డారు. దీని ద్వారా ఆ నాయకుడికే నష్టం జరుగుతుందని హితవు పలికారు. ఇలాంటివి జరిగితే పార్టీ కూడా చాలా సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఇటువంటి వాటిని పీసీపీ కూడా పట్టించుకోకపోతే హైకమాండ్ దృష్టికి తీసుకెళతానని అన్నారు. నాయకులు కూడా క్రమశిక్షణతో మెలాగాల్సిన అవసరం ఉందన్నారు. అందరం సమావేశమై అందరి నాయకుల అభిమానులను హెచ్చరించాల్సిన అవసరం ఉందని జానారెడ్డి తెలిపారు. చదవండి: త్వరగా సీరం సర్వే చేయాలి.. -
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నాం
సాక్షి, నల్గొండ : గాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు నల్గొండ పట్టణంలో రామగిరిలో మహాత్మా గాంధీ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకుడు జానారెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, దుబ్బాక నర్సింహా రెడ్డి సహా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక బిల్లులకు నిరసనగా సంతకాల సేకరణను చేపట్టారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. 'వ్యవసాయ బిల్లులను పార్లమెంటరీ సంప్రదాయాన్ని అనుసరించకుండా మూజువాణి ఓటుతో తీసుకోచ్చారు. ఈ బిల్లులు వ్యవసాయదారులకి, వినియోగదారులకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వీటి వల్ల మార్కెట్ వ్యవస్థ పోయి కార్పొరేట్ వ్యవస్థ వచ్చే అవకాశం ఉంది. దీనికి వ్యతిరేకంగా సంతకాలను సేకరించి కేంద్రానికి అందచేస్తాం' అని తెలిపారు. ప్రజాస్వామ్యంపై, మహిళలపై, దళితులపై, ప్రశ్నించే వారిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దాడులకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీపై పోలీసులు ప్రవరర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాల్సిందిగా పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. -
కాంగ్రెస్ జలదీక్ష భగ్నం
చింతపల్లి/సాక్షి, వికారాబాద్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ మంగళవారం తలపెట్టిన జలదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేపట్టేందుకు అనుమతి లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నల్లగొండ జిల్లాలో టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలను, కొడంగల్‌లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, పరిగిలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తుండగా..: నల్లగొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పరిశీ లించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలను పోలీసులు నిలువరించారు. మొదటగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చింతపల్లి మండల పరిధిలో ని మాల్ పట్టణానికి చేరుకోగానే అప్పటికే పంప్‌హౌస్ వద్ద ఉన్న పోలీసులు ఆయన కారును బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీనికి నిరసనగా ఆయన హైదరాబాద్–నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై బైఠాయించడం తో వాహనాల రాకపోకలకు గంటపాటు అం తరాయం ఏర్పడింది. కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో రహదారిపై ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు ఆయన్ను అరె స్టు చేసి మాల్ పంప్‌హౌస్‌కు తరలించారు. అనంతరం ఉత్తమ్, జానారెడ్డి వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు.. వారినీ మాల్ వద్దే అడ్డుకొని మాల్ పంప్‌హౌస్ వద్దకు తరలించారు. సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉంచడంతో పార్టీ శ్రేణులు పంప్‌హౌస్‌కు తరలివచ్చారు. దీంతో ముగ్గురు నేతల ను చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి గంటపాటు స్టేషన్లోనే ఉంచారు. ఇందుకు అభ్యంతరం తెలుపుతూ కార్యకర్తలు స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించగా 5 గంటలకు నేతలను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది.. పోలీసుస్టేషన్ నుంచి విడుదలైన అనంతరం పంప్‌హౌస్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచేందుకు ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీ ఓ నంబర్ 203ని రద్దు చేసే వరకు పోరాడతామన్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలపై మా ట్లాడకుండా ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని విమర్శించారు. సొంత జిల్లా కు తమను వెళ్లనీయకుండా సీఎం కేసీఆర్ అ వమానపర్చారని మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, జిల్లాపై పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల జిల్లాలోని ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదముందన్నారు. కుర్చీ వేసుకొని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఎన్నికల సభలో చెప్పిన కేసీఆర్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ మేధావిగా చెప్పుకుంటున్నా ఆయన ఒక నియంత అని దుయ్యబట్టారు. కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ ప్రారంభానికి వేల మంది హాజరైనప్పుడు అడ్డుకోని ప్రభుత్వం జలదీక్షను భగ్నం చేసేలా వ్యవహరించడం ఏమిటని నిలదీశారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, మధ్యలో నిలిచిపోయి న వాటికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో జలదీక్ష చేపట్టాలనుకున్న రేవంత్‌రెడ్డిని పోలీసులు మంగళవారం కొడంగల్‌లో హౌస్అరెస్ట్ చేశారు. ఆయ న ఇంటి వద్దే దీక్షకు పూనుకోగా అదుపులోకి తీసుకొని కుల్కచర్ల పోలీస్టేషన్‌కు తరలించా రు. అరెస్టుకు ముందుకు రేవంత్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నియంతలా వ్య వహరిస్తున్నారన్నారు. పాలమూరు–రంగారె డ్డి ప్రాజెక్టుకు నిధులు విడుదలచేసి వెంటనే పూర్తి చేయాలని, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 10 టీఎంసీలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాగా, పరిగిలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. -
‘చలో రాజ్‌భవన్’ భగ్నం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ఆర్థిక చర్యలకు నిరసనగా రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనల్లో భాగంగా శుక్రవారం టీపీసీసీ జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడితో పాటు హైదరాబాద్‌లో నగర కమిటీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గాంధీభవన్ నుంచి వెలుపలికి రాకుండా నిలువరించే ప్రయత్నంలో పోలీసులు, పార్టీ నేతలు, శ్రేణుల మధ్య వాగ్వాదంతో పాటు తోపు లాట చోటుచేసుకుంది. గాంధీభవన్ నుంచి జీపు లో రాష్ట్ర పార్టీ ఇన్చార్జి ఆర్సీ కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ నేతలు బోసురాజు, కె.జానారెడ్డి, ఎం.కోదండరెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్ చౌరస్తా వరకు వెళ్లాక వారిని అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా ర్యాలీ నాంపల్లికి చేరుకున్న సమయంలో పోలీసుల తోపులాటలో చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్చార్జి కె.వెంకటేశ్ కిందపడ్డారు. ర్యాలీ వెనక వస్తున్న పోలీసు వాహనం ఢీకొనడంతో ఆయన ఎడమ కాలు ఫ్రాక్చరైంది. ప్రాజెక్టుల్లో అవినీతిపై విచారణ చేపట్టాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాలపై పార్టీ నేతలు కుంతియా, భట్టి విక్రమార్క, బోసురాజు, మర్రి శశిధర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్, ఎం.కోదండరెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, వెంకటస్వామి, అనిల్‌కుమార్‌యాదవ్ తదితరులు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణా?: కుంతియా అనంతరం కుంతియా మీడియాతో మాట్లాడుతూ.. మళ్ళీ బంగారం అమ్ముకుని దేశాన్ని పాలిం చే పరిస్థితిని బీజేపీ తీసుకొచ్చిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేయలేదని, నోట్ల రద్దుతో దేశాన్ని ఆర్థికంగా వెనక్కునెట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. దేశంలో ఎయిరిండియా, బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఎంతవరకు సబబని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, చర్యలతో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. లక్షల కోట్లు అప్పులు చేశారని, తప్పు డు లెక్కలు చెబుతున్నారన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయొద్దని గవర్నర్‌ను కలసి కోరామన్నారు. -
‘ఆ మాట కేసీఆరే చెబుతున్నారు’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించిన అవకాశవాదులే ప్రస్తుతం పార్టీని వీడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కండువా కప్పుకోగా.. మాజీ మంత్రి, సీనియర్ నేత డీకే అరుణ కమలం గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీకే అరుణను పార్లమెంటుకు పోటీచేయమని చెబితే నిరాకరించారని ఉత్తమ్ అన్నారు. టీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, అసెంబ్లీ ,కౌన్సిల్‌ను ప్రగతి భవన షిఫ్ట్ చేస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా చేసేది శూన్యమని...ఐదేళ్లు తన ఎంపీలతో ఏదీ సాధించని కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కులేదని ఉత్తమ్ ధ్వజమెత్తారు. విభజన హామీలు సాధించలేని కేసీఆర్.. మతతత్వ బీజేపీకి సహకరించడం తప్ప చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ మళ్ళీ ఓటేస్తే ..మోరీలో వేసినట్లేనని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని.. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే ఒక ప్రాజెక్ట్‌కు జాతీయ హోదాతో పాటు..విభజన హామీలన్నీ సాధిస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ‘ఐటీఐఆర్ తెస్తాం ..కొత్త ఉద్యోగాలు ఇస్తాం ఎస్టీ ,ముస్లింలకు జనాభా దామాషా ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు. నైతిక విలువలకు తిలోదకాలు కాంగ్రెస్ సీనియర్ నేత కె. జానారెడ్డి మాట్లాడుతూ..ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్ట్ కూడా సాధించలేని కేసీఆర్‌కు ఓటు అడిగే అర్హత లేదని విమర్శించారు. నైతిక విలువలను మంటకలుపుతూ...కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్షాలని లేకుండా చేయాలనుకుంటున్న ..కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. మరోవైపు హామీల అమలులో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని జానారెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ ఎంపీలను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికలు మలుపు తిప్పుతాయి కేసుల భయంతోనే కేసీఆర్ ప్రధాని మోదీకి వంతపాడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలతో కేసీఆర్‌కు అసలు సంబంధమే లేదని.. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని ఆయన గుర్తించాలని హితవు పలికారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పాలన పారిశ్రామికవేత్తలకే పరిమితం అయ్యిందని విమర్శించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఈ పార్లమెంటు ఎన్నికలు తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయని జోస్యం చెప్పారు. దమ్ముంటే నా సవాల్ స్వీకరించు 16 ఎంపీ సీట్లు గెలవకపోతే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్మూ, ధైర్యం ఉంటే కేటీఆర్, కేసీఆర్ తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ‘పార్టీలో అందరూ కాంగ్రెస్‌తో లాభపడ్డవారే అవకాశవాదులు. స్వార్థంతోనే కొందరు టీఆరెఎస్లోకి వెళుతున్నారు. టీఆర్ఎస్తో తలపడేందుకు సిద్ధం. భువనగిరి, నల్గొండ పార్లమెంట్ స్థానాలతో పాటు.. మెజారిటీ ఎంపీలను గెలుస్తాం. అభ్యర్థుల ముఖం కాదు ..నా ముఖం చూసి కేసీఆర్ ఓటేయమంటున్నారు అంటే టీఆర్ఎస్ అభ్యర్థులందరూ డమ్మీలే అని కేసీఆర్ చెబుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కొలిమిలా మార్చిన కేసీఆర్‌కు ప్రజలు తొందర్లోనే బుద్ధి చెబుతారన్నారు. -
నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఎవరి బలమెంత..?
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం మొదలు కావడంతో నల్లగొండ పార్లమెంట్ పరిధిలో విజయం ఎవరిదన్నది జోరుగా చర్చ సాగుతోంది. బరిలో ఉండే అభ్యర్థులు ఎవరన్నది పార్టీలు ప్రకటించకున్నా ఏ పార్టీ విజయం సాధిస్తుందోనన్న రాజకీయ విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. గత పార్లమెంట్, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయని నేతలు, ఎంపీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు లెక్కలేస్తున్నారు. 2014లో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యం గత పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు గాను ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఆధిక్యత రాగా ఒక్క నియోజకవర్గంలోనే టీఆర్ఎస్కు మెజార్టీ వచ్చింది. 2014 ఎన్నికల్లో గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఆయన సమీప టీడీపీ ప్రత్యర్థి టి.చిన్నపురెడ్డిపై 1,93,156 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గుత్తాకు 4,72,093 ఓట్లు రాగా, చిన్నపురెడ్డికి 2,78,937 వచ్చాయి. టీఆర్ఎస్ పక్షాన పోటీ చేసిన పి.రాజశ్వేరరెడ్డికి 2,60,677 ఓట్లు వచ్చి మూడో స్థానంలో నిలిచారు. సీపీఎం అభ్యర్థి ఎన్.నరసింహారెడ్డికి 54,423 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దేవరకొండలో 10,046, సాగర్‌లో 23,478, మిర్యాలగూడలో 29,623, కోదాడలో 18,316, హుజూర్‌నగర్‌లో 34,646, నల్లగొండలో 26,628 ఓట్ల మెజార్టీ రాగా, టీఆర్ఎస్కు సూర్యాపేటలో 2,652 ఓట్ల ఆధిక్యత వచ్చింది. న ల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. సూర్యాపేటను టీఆర్ఎస్, దేవరకొండను సీపీఐ కైవసం చేసుకుంది. ఆ తర్వా త మారిన రాజకీయ సమీకరణాలతో మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్దే హవా.. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ పరిధిలో టీఆర్ఎస్ హవా కొనసాగింది. ఏడు నియోజకవర్గాల్లో హుజూర్నగర్ మినహా ఆరు నియోజకవర్గాలు ఆపార్టీ ఖాతాలో చేరాయి. అయితే ఓట్ల పరంగా చూస్తే ఆరు నియోజకవర్గాల్లో మొత్తం టీఆర్ఎస్కు 1,07,692 ఓట్ల మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ హుజూర్‌నగర్‌లో మాత్రమే 7,466 ఓట్ల మెజార్టీ సాధించింది. సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేసింది. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఈ అసెంబ్లీ ఎన్ని కల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల పరంగా చూస్తే టీఆర్ఎస్కే మెజార్టీ ఉంది. çహుజూర్‌నగర్‌లో కాం గ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 7,466 ఓట్ల ఆధిక్యత పొందారు. అలాగే సూర్యాపేట ని యోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజ యం సాధించిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 5,967 ఓట్ల మె జార్టీ సాధించారు. కోదాడలో బొల్లం మల్లయ్యయాదవ్‌కు 756 ఓట్ల మెజార్టీ, మిర్యాలగూడ నియోజకవర్గంలో భాస్కర్‌రావుకు 30,652, నాగా ర్జునసాగర్‌లో నోముల నర్సింహయ్యకు 7,771, దేవరకొండ నియోజకవర్గంలో రమావత్ రవీంద్రకుమార్‌కు 38,848, నల్లగొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డికి 23,698 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఎవరి అంచనా వారిదే.. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజార్టీ రావడం.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు రావడంతో నేతలు ఎవరి అంచనాల్లో వారున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నల్లగొండ, భువనగిరి, ఖమ్మం పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈ నియోజకవర్గాల్లో ఆపార్టీకి.. టీఆర్ఎస్కు మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల తేడా తక్కువగా ఉండడంతో విజయంపై ఆశలు పెట్టుకుంది. అయితే ప్రధానంగా నల్లగొండ పార్లమెంట్ స్థానం విజయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్‌గా తీసుకున్నారు. ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉండడంతో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే.. కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వాలని బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెజార్టీ పెరుగుతుందని టీఆర్ఎస్, అసెంబ్లీ ఎన్నికల ఓట్లతో సంబంధం లేకుండా పార్లమెంట్ స్థానానికి ఎక్కువ ఓట్లు తమకు పడతాయని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
ఆ నాలుగు స్థానాలపై కోర్టుకు..
సాక్షి, హైదరాబాద్: చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన ధర్మపురి, తుంగతుర్తి, కోదాడ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ విషయమై ఎన్నికల అధికారులను కోరినా పట్టించుకోలేదని, దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించింది. పోలైన ఓట్లకు, కౌంటింగ్ జరిగిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉన్న స్థానాల్లో కూడా వివరాలు సేకరించి ఆ నియోజకవర్గాల విషయంలో కూడా కోర్టును ఆశ్రయించేందుకు పార్టీ నేతల నుంచి వివరాలు కోరింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు సోమవారం హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సమావేశానికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో పాటు ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ అహ్మద్, టీపీసీసీ ముఖ్య నేతలు షబ్బీర్‌అలీ, సంపత్, పద్మావతిరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, దామోదర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, అజారుద్దీన్, మధుయాష్కీగౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, బలరాంనాయక్ హాజరయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను నియోజకవర్గాలు, జిల్లాల వారీగా నేతలు సమీక్షించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌తో పాటు, కౌంటింగ్, పోలింగ్ ఓట్లు సరిపోలకపోవడం, రైతుబంధు చెక్కులను ఎన్నికల సమయంలోనే జమ చేయడం, పంటలు సాగు చేయకపోయినా భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ నగదు రూపంలో జమ చేయడం లాంటి కారణాలతో ఓటమి పాలైనట్లు అభిప్రాయపడ్డారు. కొందరు కలెక్టర్లు తమ అభ్యర్థుల విజ్ఞప్తులను పట్టించుకోలేదని, కనీసం పనిచేయని ఈవీఎంల సమాచారం కూడా ఇవ్వలేదని, వీటన్నింటిపై సమగ్ర ఆధారాలను తీసుకుని కోర్టుకు వెళ్లాలని నేతలు నిర్ణయించారు. గెలిచిన నేతలతో ప్రత్యేక భేటీ గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు). హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), శ్రీధర్‌బాబు (మంథని), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు), పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు)లతో పాటు మాజీ ఎంపీ విజయశాంతి హాజరయ్యారు. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాసమస్యల పరిష్కారం విషయంలో రాజీపడకుండా అసెంబ్లీలో ప్రభుత్వంపై కొట్లాడాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో వ్యూహంపై చర్చ.. ‘తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా పార్టీ నిర్మాణం ఎలా ఉండాలన్న దానిపై సమావేశం జరిగింది. పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం’ – మాజీ మంత్రి జానారెడ్డి ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలన ‘నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజాస్వామ్య విధానాల మీద పాలన నడవాలి. మెజార్టీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలన నడుస్తోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగాలని కోరుకుంటున్నా.’ – పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి ఓట్లు తొలగించారు.. ‘సీనియర్ నేతలతో సమావేశం జరిగింది. ఈవీఎంల్లో తప్పులు జరగడం వల్లే టీఆర్ ఎస్ గెలిచింది. కాంగ్రెస్ బలం గా ఉన్న దగ్గర ఓట్లు తొలగించారు. రీకౌంటింగ్ అడిగిన చోట్ల కూడా ఎన్నికల అధికారులు పట్టించుకోలేదు. ఈ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు అన్ని రాష్ట్రాల నేతలను కలుస్తాం. – ఆర్.సి.కుంతియా న్యాయపోరాటం చేస్తాం.. ‘తెలంగాణ ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరిగింది. ధర్మపురి, తుం గతుర్తి, కోదాడ, ఇబ్రహీం పట్నంల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయాం. అక్కడ న్యాయపోరాటం చేస్తాం. తమ ఎమ్మెల్యేలు పంచాయతీ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను తీసుకుంటారు. పంచాయతీ ల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం’ – ఉత్తమ్ వారిదే బాధ్యత త్వరలో జరగనున్న పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు చర్చించారు. పార్టీ గెలిచిన స్థానాల్లోని పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతలను ఎమ్మెల్యేలే తీసుకోవాలని సూచించారు. ఓటమి పాలైన చోట్ల నేరుగా పీసీసీ పర్యవేక్షించడంతో పాటు పోటీచేసిన అభ్యర్థులు, సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు చొరవ తీసు కుని వీలున్నన్ని పంచాయతీ స్థానాలు గెలుచుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని నిర్ణయించారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పోటీకి సిద్ధం కావాలని, ఇప్పటి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీ సమీక్షలు, పార్టీ సమావేశాలు నిర్వహించాలని, లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఓడిపోయినా అందరం కలిసికట్టుగా ఉండాలని, ప్రజావ్యతిరేక విధానాలపై అధికార పార్టీతో తలపడాల్సిందేనని నేతలు అభిప్రాయపడ్డారు. పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఇందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేయాలని నిర్ణయించారు. -
సామాజిక న్యాయంలో కాంగ్రెస్‌దే పైచేయి: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం అమలు చేయడంలో కాంగ్రెస్‌కు మించిన పార్టీ లేదని, అణగారిన వర్గాలను ఆదుకోవడమే తమ పార్టీ మూల సిద్ధాంతమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై టీఆర్ఎస్ అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ న్యా యపోరాటానికి సిద్ధమవుతుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 134వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఉత్తమ్ మాట్లాడారు. ట్రిపుల్ తలాక్ విషయంలో బీజేపీ ఏకపక్ష తీరును విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అవకతవకల వల్లే తాము ఓడిపోయామని, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్దనరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండ్లగణేశ్, ప్రధాన కార్యదర్శులు కైలాశ్, బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
దోచిన డబ్బుతో ఓట్లను కొన్నారు
త్రిపురారం: కేసీఆర్ రాష్ట్రంలో దోచుకున్న డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చారని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, గడిచిన నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఓ కార్పొరేషన్ లాగా రాష్ట్రాన్నంతా దోచుకుందని అన్నారు. ప్రభుత్వం దోచుకున్న రూ.1500 కోట్ల నుంచి రూ. 2 వేల కోట్లను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఖర్చు చేసిందని, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలు ఒక సారి ఆలోచించాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ధాన్యానికి మద్దతు ధర రూ.1500 చేసిందని, అటవీ హక్కుల చట్టం ద్వారా రాష్ట్రంలోని గిరిజనులకు 10 లక్షల ఎకరాలను పంపిణీ చేసిందని గుర్తు చేశారు. ‘కేసీఆర్ ఏదో పదవిని జానారెడ్డికి ఇస్తడు అని ఎవరో అన్నారని, అసలు కేసీఆర్‌కు పదవి ఇచ్చిందే జానారెడ్డి’అని అన్నారు. కేసీఆర్ దగ్గర పుచ్చుకునే వ్యక్తి జానారెడ్డి కాదని కార్యకర్తలు, యువకులు అర్థం చేసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వయసు రీత్యా విశ్రాంతి తీసుకుంటానని, అంతే తప్ప పనికిమాలిన పదవులు తీసుకునే మనిషిని కాదని చెప్పారు. -
మట్టికరిచిన మహామహులు...కోలుకోలేని దెబ్బ
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గెలుపొందిన స్థానాల(63) కంటే కూడా ఎక్కువ స్థానాలు(ప్రస్తుతం 85) కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు తెలంగాణలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరుగా దూసుకుపోతోంది. ఇప్పటికే 85 స్థానాలను కైవసం చేసుకున్న గులాబీ పార్టీ మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీతో జట్టుకట్టిన కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఎన్నడూలేని విధంగా పార్టీ సీనియర్ నేతలు ఓటమి పాలవడంతో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. సొంత నియోజకవర్గాల్లో ప్రచారానికే పరిమితమైనప్పటికీ టీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఇద్దరు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు సహా ప్రతిపక్ష నేత జానారెడ్డి, సీఎం అభ్యర్థులుగా ప్రచారం పొందిన డికె అరుణ వంటి మహామహులు సైతం మట్టికరిచారు. అంతేకాకుండా లోక్‌సభ నుంచి అసెంబ్లీకి మారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసిన మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, పోరిక బలరాం నాయక్‌లకు కూడా ఓటమి రూపంలో నిరాశే ఎదురైంది. జగిత్యాల నియోజకవర్గంలో తిరుగులేని నేతగా గుర్తింపు పొంది.. గత ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా నుంచి గెలుపొందిన ఏకైక నాయకుడిగా నిలిచిన జీవన్‌రెడ్డి సైతం టీఆర్ఎస్ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. ఇక చివరి నిమిషంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొండా సురేఖకు ఓటమి తప్పలేదు. కాగా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాల్లో మాత్రమే గెలుపొంది మరో 1 సీటు సొంతం చేసుకునే అవకాశం కన్పిస్తోంది. ఇక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడినా గెలిచినా తనదే పూర్తి బాధ్యత అన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి హూజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిపై స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు పేరు నియెజకవర్గం ప్రత్యర్థి పార్టీ మెజారిటీ రేవంత్ రెడ్డి కొడంగల్ పట్నం నరేందర్‌రెడ్డి టీఆర్ఎస్ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ గంగుల కమలాకర్ టీఆర్ఎస్ జానారెడ్డి నాగార్జున సాగర్ నోముల నర్సింహులు టీఆర్ఎస్ డికె అరుణ గద్వాల బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి టీఆర్ఎస్ జీవన్‌రెడ్డి జగిత్యాల డాక్టర్ సంజయ్‌కుమార్ టీఆర్ఎస్ దామెదర రాజనర్సింహ ఆందోల్ క్రాంతికిరణ్ టీఆర్ఎస్ జె. గీతారెడ్డి జహీరాబాద్ మాణిక్‌రావు టీఆర్ఎస్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్ఎస్ పొన్నాల లక్ష్మయ్య జనగామ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి టీఆర్ఎస్ కొండా సురేఖ పరకాల చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్ సర్వే సత్యనాయణ సికింద్రాబాద్ కంటోన్మెంట్ జి. సాయన్న టీఆర్ఎస్ బలరాం నాయక్ మహబూబాబాద్ బానోత్ శంకర్‌నాయక్ టీఆర్ఎస్ సంపత్‌కుమార్ ఆలంపూర్ అబ్రహం టీఆర్ఎస్ చిన్నారెడ్డి వనపర్తి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి టీఆర్ఎస్ ముఖేష్ గౌడ్ గోషామహల్ రాజాసింగ్ బీజేపీ మల్లురవి జడ్చర్ల చర్నకోల లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ -
టీఆర్ఎస్ ఆపరేషన్ సక్సెస్.. సీనియర్ నేతలకు స్పాట్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టీ కాంగ్రెస్ సీనియర్ నేతలకు గట్టి షాక్‌నిచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలుగా పేరొందిన పలువురు ఈసారి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న పలువురు నేతలు సైతం సొంత నియోజకవర్గాల్లో పరాభవం ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ దిగ్గజాలుగా పేరొందిన గత సీఎల్పీ మాజీ నేత, మాజీ హోంమంత్రి జానారెడ్డి, ఇటీవల టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి.. ప్రచారంలో పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా వెలుగొందిన ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి, మహబూబ్‌నగర్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ, పరాజయమే ఎరుగని సీనియర్ నేత జీవన్‌రెడ్డి తదితరులు ఓటమిపాలయ్యారు. మాజీ మంత్రి, నల్లగొండ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఓటమిదిశగా సాగుతున్నారు. అగ్రనేతలంతా భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీని కలవరపరిచే అంశం. హఠాత్తుగా వచ్చిన ముందస్తు ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, టీజేఎస్, సీపీఎం తదితర పార్టీలతో మహాకూటమిగా ఏర్పడి.. ఎన్నికల్లోకి వెళ్లినప్పటికీ.. ఫలితాల్లో మాత్రం ఆ పార్టీ తీవ్ర నిరాశే ఎదురైంది. మహాకూటమి ఏమోగానీ, చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. గెలుస్తాయనుకున్న సీనియర్ నేతల స్థానాలు సైతం కారు ప్రభంజనంలో కొట్టుకుపోయాయి. వరుసగా గెలుస్తూ వస్తూ.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న పలువురు నేతలు సైతం సొంత నియోజకవర్గాల్లోనే గల్లంతు అయ్యారు. గులాబీ అధినేత వ్యూహం ఫలించింది! కాంగ్రెస్ సీనియర్ నేతలను వారి సొంత నియోజకవర్గంలో ఓడించడానికి టీఆర్ఎస్ పక్కా వ్యూహంతో వెళ్లింది. హస్తం సీనియర్ నేతల నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా టీఆర్ఎస్ అంటేనే ఒంటికాలితో లేచే నేతలను టార్గెట్ చేసింది. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీకే అరుణ, జానారెడ్డి, జీవన్‌రెడ్డి తదితర నేతలను ఓడించేందుకు అత్యంత పటిష్టమైన వ్యూహాలతో వెళ్లింది. మొత్తానికి కాంగ్రెస్ అగ్రనేతలను ఓడించాలన్న గులాబీ అధినేత కేసీఆర్ వ్యూహం పూర్తిగా ఫలించినట్టు కనిపిస్తోంది. జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సిహా, జీవన్‌రెడ్డి వంటి హేమాహేమీలే కాదు.. గెలుస్తారనుకున్న షబ్బీర్ అలీ, సర్వే సత్యనారాయణ.. తదితరులు ఓటమి పాలు కావడం కాంగ్రెస్ పార్టీని దిగ్భ్రాంతపరుస్తోంది. దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో సత్తా చాటిన కాంగ్రెస్.. తెలంగాణలో మాత్రం ఘోరంగా చతికిలపడింది. -
జనంపై జానారెడ్డి ఫైర్
-
తొలిసారి అసెంబ్లీ బరిలో ముగ్గురు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా ఎన్నికల రంగం వేడెక్కింది. ఏ నియోజకవర్గంంలో ఎవరెవరు ప్రత్యర్థులో... ఏయే నియోజకవర్గంలో ఎలాంటి పోటీ జరగనుందో దాదాపు స్పష్టమైంది. మెజారిటీ స్థానాల్లో ఈసారి ద్విముఖ పోటీలే కనిపిస్తున్నాయి. కాగా, కొన్నిచోట్ల మాత్రం బహుముఖ పోటీ తప్పేలా లేదు. టీఆర్ఎస్ పదకొండు, కాంగ్రెస్ పదకొండు స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించాయి. వీరిలో ఇప్పటికే అత్యధికులు నామినేషన్లు కూడా వేశారు. చివరి రోజు అయిన 19వ తేదీన ఎక్కువ నామినేషన్లు దాఖలు కానున్నాయి. టీఆర్ఎస్ కోదాడలో, కాంగ్రెస్ మిర్యాలగూడ స్థానానికి ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికల బరిలో నిలిచిన వారిని పరిగణనలోకి తీసుకుంటే ఈసారి కూడా హేమాహేమీలు పోటీ పడుతున్నారు. దీంతో పోటీ కూడా హోరాహోరీగా సాగనుంది. ఆ.. ఐదుగురు నేతలు టీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్న వారిలో ఒక్కరు మినహా మిగిలిన పది మంది రెండో సారి అంతకంటే ఎక్కువ పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేస్తున్నవారే. ఇక, కాంగ్రెస్‌లో నలుగురు నాయకులు, ఒక ఇండిపెండెంట్ మొత్తంగా ఐదుగురు అభ్యర్థులు నాలుగు అంతకంటే ఎక్కువ సార్లు అసెంబ్లీ బరిలో నిలుస్తున్నవారే కావడం గమనార్హం. ప్రధానంగా సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ఎనిమిదో విజయం కోసం నాగార్జున సాగర్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య పోటీలో ఉన్నారు. బీజేపీ, బీఎల్ఎఫ్ అభ్యర్థులు కొందరు తొలి ఎన్నికలను ఎదుర్కొంటున్న వారే. హుజూర్‌నగర్‌లో టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఐదో విజయంపై కన్నేశారు. ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి తొలి సారిగా ఎస్.సైదిరెడ్డి పోటీలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి రెండో సారి పోటీలో ఉన్నారు. నల్లగొండలో కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐదో విజయం కోసం పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి చేతిలో ఓడిపోయిన కంచర్ల భూపాల్ రెడ్డి ఈ సారి టీఆర్ఎస్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డిపై కాంగ్రెస్, బీజేపీల నుంచి సీనియర్లే పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఆర్.దామోదర్ రెడ్డి, బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వర్ రావు గత ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారే. ఈసారి మరో మారు ఈ ముగ్గురు నేతలూ తలపడుతున్నారు. ఆలేరు బరిలో బీఎల్ఎఫ్ మద్దతుతో బీఎల్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోత్కుపల్లి నర్సింహులు కూడా అత్యధిక పర్యాయాలు విజయాలు సాధించిన నేతనే కావడం గమనార్హం. ఇక్కడనుంచి ప్రభుత్వ విప్‌గా పనిచేసిన గొంగిడి సునిత టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ పోటీ పడుతున్నారు. ఇక, మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఎం పార్టీల నుంచి పోటీ పడుతున్న నేతల్లో అత్యధికులు రెండో సారి, అంత కంటే ఎక్కువ సార్లు పోటీ పడుతున్న వారే. అసెంబ్లీ బరిలోకి తొలిసారి ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ బరిలోకి తొలిసారి దిగుతున్న వారు ఎక్కువ మందే ఉన్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (ఎంపీగా పనిచేశారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు) ఎమ్మెల్యే పదవి కోసం తొలిసారి పోటీ పడుతున్నారు. భువనగిరి నుంచి కాంగ్రెస్ తరపున కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, హుజూర్నగర్ నుంచి టీఆర్ఎస్ తరఫున ఎస్.సైదిరెడ్డి మొదటిసారి పోటీ పడుతున్నారు. బీజేపీ, బీఎల్ఎఫ్, సీపీఎం నుంచి తొలిసారి పోటీ చేస్తున్నవారూ ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బరిలో నిలిచిన వారిలో అత్యధికులు సీనియర్లే కావడంతో పోటీ కూడా హోరా హోరీగా సాగనుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
అక్కడ ఆయనకు తిరుగులేదు..!
త్రిపురాదం(నాగర్జునసాగర్) : పర్యాటకకేంద్రంగా పేరొందిన నాగార్జునసాగర్ నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నుంచి ఏడు పర్యాయాలు విజయం సాధించిన కుందూరు జానారెడ్డి సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. అదే విధంగా ఎన్టీఆర్ మంత్రి వర్గంలో 1983, 1985లో కుందూరు జానారెడ్డి 13 శాఖల మంత్రిగా రికార్డుకెక్కారు. నిమ్మల రాములు వరుసగా మూడు పర్యాయాలు గెలుపొంది హ్యాట్రిక్ సాధించగా కుందూరు జానారెడ్డి డబుల్ హ్యాట్రిక్ దాటి చరిత్ర సృష్టించారు. 1962లో పెద్దవూర నియోజకవర్గంలో జరిగిన తొలి ఎన్నికల్లో సీపీఐ పార్టీ అభ్యర్థిగా పీ.పర్యతరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జీఎన్.రెడ్డిపై 2,302 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలి ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాత 1967లో చలకుర్తి నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడ జరిగిన తొలి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిమ్మల రాములు సీపీఎం నుంచి ఎం. ఆదిరెడ్డిపై 6656 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1967 నుంచి 2004 వరకు చలకుర్తి నియోజకవర్గంగా కొనసాగింది. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన అనంతరం చలకుర్తి నియోజకవర్గ స్థానంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పేరుతో 2009లో కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది. సాగర్ నియోజకవర్గంలో అనుముల, నిడమనూరు, త్రిపురారం, పెద్దవూర, గుర్రపోడు, తిరుమలగిరి మండలాలు ఉన్నాయి. 1962లో సీపీఐ నుంచి గెలిచిన పీ.పర్వతరెడ్డి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగలేదు. 2009లో నాగార్జునసాగర్ నియోజకవర్గం ఏర్పాటు 1952 నుంచి జరిగిన మార్పు, చేర్పుల వల్ల 2009లో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఏర్పడింది. 1952లో ఈ నియోజకవర్గం కొంత ప్రాంతం పెద్దమునిగల్ నియోజకవర్గంలో ఉంది. 1957లో దేవరకొండ నియోజకవర్గం పరిధిలోకి వచ్చింది. ఆ తరువాత 1962లో పెద్దవూర నియోజకవర్గంగా ఏర్పడింది. 1967లో చలకుర్తి నియోజకవర్గంగా మారింది. తిరిగి 2009లో నాగార్జునసాగర్ నియోజకవర్గంగా ఏర్పాటైంది. అప్పటివరకు చలకుర్తిలో ఉన్న దామరచర్ల మండలాన్ని మిర్యాలగూడలోకి కలిపి దేవరకొండలో ఉన్న గుర్రంపోడు మండలాన్ని సాగర్ నియోజకవర్గంలో కలిపారు. సుదీర్ఘకాలం మంత్రిగా జానారెడ్డి రికార్డు నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఏడుసార్లు ప్రాతినిధ్యం వహించిన కుందూరు జానారెడ్డి రాష్ట్ర శాసనసభ చరిత్రలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక కాలం 15ఏళ్లకు పైబడి మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. అంతేకాదు ఎన్టీఆర్ మంత్రి వర్గంలో 13 మంత్రిత్వశాఖలు చేసి జానారెడ్డి రికార్డుకెక్కారు. అదేవిధంగా ఏకంగా ఏడు ఎన్నికల్లో జానారెడ్డి విజయం సాధించి ఎనిమిదో విజయంపై దృష్టి సారించారు. 1978 ఎన్నికల్లో అరంగేట్రం చేసిన ఆయన జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా 1983, 1988 ఎన్నికల్లో టీడీపీ తరపున విజయం సాధించారు. ఆ తరువాత 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. అనంతరం 1994 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన జానారెడ్డి ఆ తర్వాత వరుసగా 1999, 2004, 2009, 2014 నాలుగు ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు తొమ్మిది పర్యాయాలు ఎన్నికల బరిలో నిలిచిన జానారెడ్డి రెండుసార్లు ఓటమి పాలుకాగా, ఏడు పర్యాయలు విజయం సాధించి 2018 ఎన్నికల్లో ఎనిమిదో విజయం సొంతం చేసుకోవడంపై గురిపెట్టారు. నిమ్మల, జానారెడ్డి మధ్యే ఎక్కువసార్లు పోటీ 1967, 1972, 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడు పర్యాయాలు ఇండిపెండెంట్, కాంగ్రెస్ తరుపున పోటీచేసి నిమ్మల రాములు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1967, 1972లో సీపీఎం, ఇండిపెండెంట్ తరపున పోటీ చేసిన ఎం. ఆదిరెడ్డిపై ,1978లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన జానారెడ్డిపై నిమ్మలరాములు వరుసగా మూడు సార్లు గెలుపొందారు. అప్పటి వరకు నిమ్మల రాములు పేరున ఉన్నహ్యాట్రిక్ రికార్డును కుందూరు జానారెడ్డి అధిగమించి డబుల్ హ్యాట్రిక్‌ను దాటిపోయారు. డబుల్ హ్యాట్రిక్ దాటిన జానారెడ్డి రికార్డును ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేదు. 1994 ఎన్నికల్లో జానారెడ్డిపై టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన గుండెబోయిన రాంమ్మూర్తియాదవ్ విజయం సాధించారు. ఈ ఎన్నికలో మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో జానారెడ్డి ఏడు పర్యాయాలు విజయం సాధించారు. వ్యవసాయమే ఆధారం నాగార్జునసాగర్ నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఈ ప్రాంతంలోని 80శాతం మంది వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. నియోజకవర్గంలో అనుముల, నిడమనూరు, త్రిపురారం మండలాల గుండా సాగర్ ఎడమ కాల్వ ప్రవహిస్తుంది. కానీ సగమే ఆయకట్టు కాగా మిగిలిన సగం ఆయకట్టేతర ప్రాంతం. ఆయకట్టు ప్రాంతంలో రైతులు వరిసాగుచేస్తుండగా, ఆయకట్టేతర ప్రాంతంలో మెట్టపంటలను పండిస్తున్నారు. గుర్రంపోడు, పెద్దవూర మండలాల్లో కొంత వరకు ఎస్ఎల్బీసీ ద్వాదా సాగునీరందుతుంది. -
దాడిని తీవ్రంగా ఖండించిన జానారెడ్డి
-
ఎన్నికల బరిలో.. హేమాహేమీలు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల బరిలో ఈసారి కూడా హేమాహేమీలైన నేతలే పోటీ పడనున్నారు. కాంగ్రెస్‌నుంచి ఇంకా అభ్యర్ధిత్వాలు ఖరారు కాకున్నా, సిట్టింగులు అందరికీ టికెట్లు వస్తాయన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. అదే మాదిరిగా, జిల్లాలో సీనియర్లుగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ మరో సీనియర్ నాయకుడు ఆర్.దామోదర్‌రెడ్డి సైతం టికెట్ వస్తుందన్న ఆశతో ఉన్నారు. వీరందరినీ పరిగణనలోకి తీసుకుని చూసినప్పుడు మెజారిటీ నియోజకవర్గాల్లో సీనియర్లే బరిలో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆయా పార్టీల్లోని నేతలు, జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకులుగా గుర్తింపు ఉన్నవారంతా ఎన్నికల గోదాలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లోనూ పోరుహోరాహోరీగా ఉండే పరిస్థితులే కనిపిస్తున్నాయి. జానా .. ఎనిమిదోసారి ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు ఉన్న కుందూరు జానారెడ్డి ఎనిమిదో విజయంపై దృష్టి సారించారు. ఇప్పటివరకు ఆయన ఏకంగా ఏడు ఎన్నికల్లో విజయం సాధించారు. 1978 ఎన్నికల్లో అరంగేట్రం చేసిన ఆయన జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా.. 1983, 1988 ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి గెలిచారు. అనంతరం 1994 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన జానా ఆ తర్వాత వరుసగా 1999, 2004, 2009, 2014 నాలుగు ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు తొమ్మిది పర్యాయాలు ఎన్నికలో బరిలోకి దిగిన జానారెడ్డి రెండుసార్లు ఓటమి పాలుకాగా, ఏడు పర్యాయాలు విజయం సాధించి ఈ ఎన్నికల్లో (2018) ఎనిమిదో విజయాన్ని సొంతం చేసుకోవడంపై గురిపెట్టారు. అదే బాటలో... మోత్కుపల్లి, ఆర్డీఆర్ టీడీపీ ఆవిర్భావంతో నేరుగా ఎన్నికల రాజకీయాల్లోకి అడుగెపెట్టిన మోత్కుపల్లి నర్సింహులు సైతం ఇప్పటికు ఆయన ఆరు పర్యాయాలు విజయం సాధించి, ఏడో విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. 1983, 1985 ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున విజయం సాధించిన మోత్కుపల్లి, 1989లో ఇండిపెండెంటుగా, 1994లో తిరిగి టీడీపీ నుంచి, 1999లో కాంగ్రెస్ నుంచి, 2009లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మళ్లీ టీడీపీ నుంచి విజయాలు సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంటుగానే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. మోత్కుపల్లి తర్వాత స్థానం ఆర్.దామోదర్ రెడ్డి (ఆర్డీఆర్)దే. ఆయన తుంగతుర్తి నియోజవర్గం నుంచి 1985, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున, 1994లో ఇండిపెండెంటుగా, 2004లో తిరిగి కాంగ్రెస్‌నుంచి గెలుపొందారు. ఆ తర్వాత తుంగుర్తి ఎస్సీలకు రిజర్వు కావడంతో సూర్యాపేట నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో విజయం సా«ధించిన ఆయన ఇప్పుడు ఆరో విజయం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇద్దరు నేతలు ...ఐదో సారి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి .. ఈ ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఇపుడు ఐదో విజ యం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి 1999, 2004 ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి, 2009, 2014 ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇప్పుడు హుజూర్నగర్ స్థానం నుంచే ఐదో గెలుపుపై దృష్టి పెట్టారు. మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నియోజకవర్గం నుంచి వరుసగా 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయనా ఐదో విజయంపై గురిపెట్టారు. నాలుగో విజయం కోసం .. జూలకంటి సీపీఎం సీనియర్ నాయకుడు జూలకంటి రంగా రెడ్డి అభ్యర్థిత్వాన్ని సీపీఎం ఇప్పటికే ప్రకటిం చింది. ఆయన మిరాల్యగూడనుంచి ఇప్పటికే మూడు పర్యాయాలు ..1994, 2004, 2009 ఎన్ని కల్లో గెలుపొందారు. నాలుగోసారి ఇదే స్థానం నుంచి విజయం సాధించేందుకు శ్రమిస్తున్నారు. మూడో విజయంపై ఇద్దరు నేతల కన్ను ఇక, ఇప్పటికే రెండు పర్యాయాలు విజయం సాదించిన జాబితాలో టీఆర్ఎస్ అభ్యర్థులు నోము ల నర్సింహయ్య (నాగార్జున సాగర్), ఆర్.రవీం ద్ర కుమార్ (దేవరకొండ) ఉన్నారు. వీరిద్దరూ గతంలో వామపక్ష పార్టీలకు చెందిన వారే కావడం గమనార్హం. నోముల నర్సింహయ్య సీపీఎం తరఫున 1999, 2004 ఎన్నికల్లో విజయం సాధిం చారు. గత ఎన్నికల్లో ఆయన నాగార్జునసాగర్ నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడియారు. ఈసారి టీఆర్ఎస్ టికెట్‌పైనే సాగర్ నుంచి పోటీలో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో గట్టెక్కి మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. దేవరకొండ నుంచి ఆర్.రవీంద్రకుమార్ సీపీఐ నుంచి 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. రెండేళ్ల కిందట ఆయన సీపీఐ నుంచి టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా అదృష్టాన్నిపరీక్షించుకుంటున్నారు. ఈసారి గెలిస్తే మూడో గెలుపు ఆయన ఖాతాలో చేరనుంది. కాగా, రెండో సారి విజయం కోసం సంకినేని వెంకటేశ్వర రావు (బీజేపీ), టీఆర్ఎస్ అభ్యర్ధులు వేముల వీరేశం (నకిరేకల్), గాదరి కిశోర్ కుమార్ (తుంగతుర్తి), గొంగిడి సునిత (ఆలేరు), పైళ్ల శేఖర్ రెడ్డి (భువనగిరి), కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (మునుగోడు), ఎన్.భాస్కర్ రావు(మిర్యాలగూడ) దృష్టి పెట్టారు. నకిరేకల్ నుంచి కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్న చిరుమర్తి లింగయ్య, దేవరకొండ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న జెడ్పీ చైర్మన్ బాలునాయక్ కూడా రెండో విజయం కోసం ఎదురు చూస్తున్నవారే కావడం గమనార్హం. అయితే.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరికి టికెట్లు లభిస్తాయన్న అంశం తేలాల్సి ఉంది. -
బీజేపీతో కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం
మిర్యాలగూడ: బీజేపీతో కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్లారని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌తో పాటు పలువురు మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌కు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు వస్తే రాష్ట్రంలో ఎంఐఎంతో ఒప్పందం కుదరదని, అందుకే అటు బీజేపీతో, ఇటు ఎంఐఎంతో అవగాహన కుదుర్చుకోవడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రూపొందించిన బంగారుతల్లి పథకానికి పేరుమార్చి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఇచ్చిన మాట నిలుపుకోలేని కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారని, సకల జనులను మోసం చేసిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పడం అవసరమని అన్నారు. -
మెత్తగా మాట్లాడితే ఎలా?.. జానాకు జైపాల్‌రెడ్డి సలహా!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సీఎల్పీ నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి గురించి ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డి ఎప్పుడూ వెనుకంజ వేసే వ్యక్తి కాదని, అలాగని దూకుడుగా కూడా ఉండరని ఆయన చెప్పుకొచ్చారు. జానారెడ్డి ప్రత్యేక వక్తిత్వం కలిగిన వ్యక్తి అని, పుస్తకాల్లో ఉన్నవి తెలుసుకోవడమే కాకుండా నిపుణులతో చర్చించి పలు విషయాల మీద మాట్లాడుతారని జైపాల్‌రెడ్డి అన్నారు. జానారెడ్డి నిజం చెప్పేందుకు వెనకంజ వేయబోరని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో జానారెడ్డి అంతా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి మరొకరు లేరని పేర్కొన్నారు. రాజకీయంలో అజాత శత్రువుగా ఉండడం ఎంత ముఖ్యమో.. అవసరమైనప్పుడు ధర్మాగ్రహం ప్రదర్శించాలని, మెత్తగా మెల్లగా మాట్లాడితే బలహీనతగా చూస్తారని, అందుకే అప్పుడప్పుడు దూకుడుగా ఉండాలని జానారెడ్డికి జైపాల్‌రెడ్డి హితవు పలికారు. -
అక్టోబర్ 4న నల్లగొండకు కేసీఆర్
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. ఉమ్మడి జిల్లాకు కలిపి అక్టోబర్ 4వ తేదీన నల్లగొండలో ఎన్నికల బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా నాయకత్వానికి సమాచారం అందింది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో సీనియర్లు, ముఖ్యులు జిల్లానుంచే ప్రాతినిధ్య వహిస్తున్నారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈసారీ బరిలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నల్లగొండతోపాటు కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాలలో ఓటమి పాలైంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి జిల్లానుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో జిల్లాపై తిరుగులేని పట్టును నిరూపించుకోవాలని టీఆర్ఎస్ నాయకత్వం పట్టుదలగా ఉంది. కాంగ్రెస్‌కు జిల్లానుంచే గండి కొట్టాలన్న వ్యూహంలో భాగంగానే కేసీఅర్ రాష్ట్రంలో పాల్గొంటున్న మూడో సభ కోసం నల్లగొండను ఎంపిక చేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులపై వస్తున్న వ్యతిరేకతకూ చెక్ పెట్టాలని నాయకత్వం భావిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంపై పట్టు బిగించేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగా కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని సూచనలు అందాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ ఈసారి కంచర్ల భూపాల్‌రెడ్డిని బరిలోకి దింపుతోంది. -
మిర్యాలగూడ చుట్టూ కాంగ్రెస్ రాజకీయం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది..? రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ ఇంత వరకు ఒక్క టికెట్టూ ప్రకటించకున్నా, ఎక్కడి సిట్టింగులు అక్కడే పోటీ చేస్తారన్న సాధారణ అభిప్రాయం ఉంది. అదే సమయంలో రాష్ట్రస్థాయిలో వివిధ పార్టీలతో కాంగ్రెస్ పొత్తుల చర్చలు జరుపుతుండడంతో ఆ పార్టీ నాయకులు ఏ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారో అన్న అంశం చర్చనీయాంశమైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్‌లో ముఖ్య నేతలంతా ఉమ్మడి నల్లగొండ జిల్లానుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో సహజంగానే ఇక్కడి కూర్పుపై ఆసక్తి నెలకొంది. ముందస్తు ఎన్నికల కోసం టీఆర్ఎస్ చాలా ముందుగానే టికెట్లు ఖరారు చేయడంతో వారిపై ఎవరు పోటీ చేస్తారన్న అంశం చర్చలకు తావిస్తోంది. ప్రధానంగా సీఎల్పీ మాజీ నేత జానా రెడ్డి పోటీ విషయం గడిచిన రెండు మూడు రోజులుగా రాజకీయ వర్గాల్లో బాగా చర్చల్లో ఉంది. ఆయన నాగా ర్జునసాగర్ నుంచి మిర్యాలగూడకు మారుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. జానా రాజకీయ జీవి తంలో ఒకసారి మినహా అప్రతిహతంగా గెలుస్తూ వస్తు న్న నాగార్జున సాగర్‌ను వదిలి మిర్యాలగూడ ఎందుకు రావాలనుకుంటున్నారో అంచనా కూడా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడినుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ఎన్.భాస్కర్‌రావు ఆ తర్వాత టీఆర్ఎస్ గూటికి చే రారు. ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా మం గళవారం బైక్‌ర్యాలీతో ప్రచారం మొదలు పెట్టారు. మిర్యాలగూడ.. ఎందుకు ? ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆశల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు సురక్షితమైన స్థానాలు వెదుక్కుంటున్నారని చెబు తున్నారు. ప్రధానంగా సీఎం రేసులో జానారెడ్డి ఉ న్నారని అంటున్న ఆ పార్టీ నాయకులు, ఎలాం టి ఇబ్బందీ లేకుండా గెలవగలిగే స్థానంపై దృష్టి పె ట్టారని, తమ పట్టు ఎక్కువగా ఉందని భావిస్తున్న స్థానాల్లో గెలుపు తేలికవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. అంతే కాకుండా, గత ఎన్నికల్లో భాస్కర్ రావును గెలిపించింది తామేన ని, జానారెడ్డికి ఈ నియోజకవర్గంపై ఉన్న పట్టుతోనే భాస్కర్ రావు గెలిచారని విశ్లేషిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీచేసే వరకు ప్రత్యక్ష రాజ కీయాలతో పెద్దగా సబంధం లేని భాస్కర్‌రావు జానారెడ్డికి చేదోడు వాదోడుగా మాత్రమే ఉన్నార ని, ఆయన పనిమొత్తం తెరవెనుకే చేసేవారు కాబ ట్టి ఆయనకున్న పరిచయాలు, స్నేహాలు కూడా జానారెడ్డికి సబంధించినవేనని విశ్లేషిస్తున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. టీఆర్ఎస్ అభ్యర్తిగా ఉన్న భాస్కర్‌రావుపై మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ తేలిగ్గా గెలుస్తుందని అంచనా కు వచ్చిన పార్టీ నాయకులు, జానారెడ్డి ఇక్కడినుంచి పోటీ చేస్తారని విశ్లేషించి చెబుతున్నారు. ఒకవేళ జానారెడ్డి మిర్యాలగూడ నుంచి పోటీ చే యడం ఖాయమైతే టీఆర్ఎస్ కూడా పునరాలో చన చేసే అవకాశం లేకపోలేదని, మరో బలమైన అభ్యర్థిని వెదికే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తూ అందుకు తగినట్టుగానే కాంగ్రెస్ తమ ప్ర ణాళికను సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ఈ కారణంగానే తానే స్వయంగా బరిలోకి దిగితే విజ యం మరింత తేలికవువుతుందన్న అభిప్రాయంతోనే ఇక్కడి మారాలనుకుంటున్నారని పేర్కొం టున్నారు. మరి.. సాగర్? సుదీర్ఘకాలంగా నాగార్జున సాగర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన జానారెడ్డి అక్కడ పోటీనుంచి తప్పుకుంటే ఇక్కడినుంచి మరెవరు పోటీ చేస్తారు? ఈ ప్రశ్నకూ కాంగ్రెస్ నేతల దగ్గర రెడీమేడ్ సమాధానం ఉంది. జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీలో ఉంటారని చెబుతున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులకు టికెట్లు ఇస్తారా అంటే.. ఇప్పటికే నిర్ణయం జరిగిందని, రంగారెడ్డి జిల్లాలో కూడా ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇవ్వనున్నారని పార్టీ నాయకత్వం చెబుతోంది. ముందునుంచీ జరుగుతున్న ప్రచారం మేరకైతే.. జానారెడ్డి నాగార్జునసాగర్ నుంచి ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి మిర్యాలగూడ నుంచి పోటీ చేయాల్సి ఉంది. కానీ, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తండ్రీ కొడుకులు బరిలోకి దిగడం ఖాయమని, కాకుంటే స్థానాలు అటు ఇటవుతాయని పార్టీ వర్గాల సమాచారం. సాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారైన నోముల నర్సింహయ్య స్థానికేతరుడని, తమలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని ఇప్పటికే ఆ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ పార్టీలో అసమ్మతి తారస్థాయికి చేరుకుంది. ఎంసీ కోటిరెడ్డి, తేరా చిన్నపరెడ్డి తదితర నేతలు అసమ్మతి సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్లో కనిపిస్తున్న ఈ అభిప్రాయ బేధాలు, అసమ్మతి తొలిసారి పోటీచేసే ఎవరికైనా లాభిస్తుందని, ఆ లెక్కన రఘువీర్‌రెడ్డి తేలిగ్గా బయట పడతారన్నది కాంగ్రెస్ నేతల అంచనా. మిర్యాలగూడలోనూపార్టీ సీనియర్‌నాయకుడు అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి వర్గం భాస్కర్‌రావుకు టికెట్ ఇవ్వడాన్ని వ్య తిరేకించడంతోపాటు ఆయనకు సహకరించే అవకాశాల్లేవంటున్నారు. ఇది తమకెంతో ఉపయోగడుతుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
కేంద్రంలో అధికారంలోకొస్తే..జీఎస్టీలోకి పెట్రో ధరలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అయితే పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. తద్వారా పెట్రోల్, డీజిల్‌తోపాటు నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గి పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు. సోమవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, మాజీ మంత్రి జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీతో కలసి ఉత్తమ్ మాట్లాడారు. పెట్రో ధరల పెరుగుదలకు ప్రధాని మోదీతోపాటు సీఎం కేసీఆర్ కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 2014లో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ. 70, డీజిల్ ధర రూ.55 ఉండేదన్నారు. కానీ 2018లో లీటర్ పెట్రోల్ ధర రూ. 85కు, డీజిల్ ధర రూ.79కి పెరిగిందన్నారు. యూపీ ఏ హయాంతో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్నా దేశంలో పెట్రో ధరలు పెరుగుతూ సామాన్యుల నడ్డివిరుస్తున్నాయ ని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ ని 12 సార్లు పెంచారని, 3.5 శాతం ఉన్న డ్యూటీ 15 శాతానికి పెరిగిందన్నారు. ఒక దేశం, ఒక పన్ను నినాదమిచ్చిన మోదీ పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తేలేదని ప్రశ్నించారు. పెట్రో ధరల తగ్గింపు కోసం కేంద్రంతో కొట్లాడాల్సిన సీఎం కేసీఆర్ కేంద్రంతో పోటీపడి ధరలు పెంచడం దురదృష్ట కరమన్నారు. దేశంలోని 23 రాష్ట్రాలకన్నా పెట్రోల్‌పై వ్యాట్ తెలంగాణలోనే ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్‌పై 35 శాతం, డీజిల్‌పై 28 శాతం వ్యాట్ వసూలు చేస్తోందన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక పెట్రోల్‌పై 4 శాతం, డీజిల్‌పై 5 శాతం పన్ను పెంచారని విమర్శించారు. పెట్రో ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన భారత్ బంద్‌ను రాష్ట్రంలో విజయవంతమైందని ఉత్తమ్ తెలిపారు. బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారంటూ వారికి కృతజ్ఞతలు చెప్పారు. బంద్ సందర్భంగా పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ఖండించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకొచ్చాక ప్రతి పేద కుటుంబానికి ఏటా 6 వంటగ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు మధు యాష్కీ, బోసురాజు, సలీం అహ్మద్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. అతిత్వరలో పొత్తు చర్చలు ప్రారంభం... రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గ పాలనను అంతమొందించేందుకు రాజకీయ, రాజకీయేతరపక్షాలు, విద్యార్థు లు, ప్రభుత్వోద్యోగులు, ఎన్జీవోలు, మహిళలు, పౌరసమాజం తమతో కలసి రావాలని ఉత్తమ్ మరోసారి పిలుపునిచ్చారు. తెలుగుదేశం సహా ఇతర పార్టీలతో అతిత్వరలోనే పొత్తు చర్చలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. పొత్తులపై అందరం సమన్వ యంతో ముందుకెళ్తామన్నారు. బుధవారం ఆజాద్ సమక్షంలో పార్టీలో చేరికలుంటాయన్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంను త్వరలోనే కలుస్తామని ఓ ప్రశ్నకు ఉత్తమ్ బదులిచ్చారు. నేటి నుంచి కాంగ్రెస్ జెండా పండుగ... రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మంగళవారం నుంచి ఈ నెల 18 వరకు ‘కాంగ్రెస్ జెండా పండుగ’నిర్వహించనున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. గ్రామాలతోపాటు పార్టీ కార్యకర్తల ఇళ్లు, వాహనాలపై కాం గ్రెస్ జెండా ఎగురవేయాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి సమావేశాలు ఏర్పాటుచేసి ఓటర్ల జాబితాలో మార్పుచేర్పులపై చర్చించాలని సూచించారు. రేపు హైదరాబాద్‌కు ఆజాద్.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ బుధవారం హైదరాబాద్ వస్తున్నట్లు ఉత్తమ్ చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశంలో ఆజాద్ పాల్గొంటారని, అనంతరం సాయంత్రం 6 గంటలకు సంగారెడ్డిలో జరిగే మైనారిటీల సదస్సుకు హాజరవుతారన్నారు. ప్రభుత్వాలను ప్రజలు నిలదీయాలి: జానారెడ్డి దేశంలో, రాష్ట్రంలో పెట్రోల్, డీజీల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాలను ప్రజ లు నిలదీయాలని పిలుపునిచ్చారు. భారత్ బంద్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నును తగ్గించాలని డిమాండ్ చేశారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 139–140 డాలర్లుగా ఉండేదని, దీంతో అప్పుడు పెట్రోల్ లీటర్‌కు రూ.81గా ఉండేదని కుంతియా పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం క్రూడాయిల్ ధర బ్యారెల్ 75–85 డాలర్ల మధ్యే ఉన్నా లీటర్ పెట్రోల్ ధర రూ. 81కి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
నాకేం అభ్యంతరం లేదు: నోముల
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జానా రెడ్డికి కొన్ని అంశాలు గుర్తు చేయాల్సిన సమయం వచ్చిందని టీఆర్ఎస్ నేత నోముల నర్సింహ్మయ్య వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తే మా పార్టీకి ప్రచారం చేస్తానని జానారెడ్డి గతంలో అన్నారని వెల్లడించారు. వరద కాలువకు ఇరవై ఏండ్ల కింద శంకుస్థాపన చేస్తే మీ హయాం వరకు ఎందుకు పని పూర్తి కాలేదని ప్రశ్నించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే రైతుబంధు కింద రూ.100 కోట్లు వచ్చాయి...జానారెడ్డి చెక్కులు పంపిణీకి వస్తే మంచిదని అన్నారు. జానారెడ్డి మాకు ప్రచారం చేసినా, మా కండువా కప్పుకున్నా నాకేం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఇంకా మాట్లాడుతూ..‘ మా నాయకుడు కేసీఆర్ ఏం చెప్పినా వింటాం. కరెంటు విషయంపై మీరు(జానారెడ్డి) అప్పుడు జోష్‌లో అన్నారు. అది గుర్తు చేసుకోండి. ప్రజా తీర్పు కోసం శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. కేసీఆర్ కిట్ వల్ల ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. 36 పార్టీలను తెలంగాణ కోసం ఏకం చేసిన ఘనత కేసీఆర్‌ది. మీరు ఎంత మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించినా నిజం అదే. రైతు బీమాతో రైతు ధీమాగా ఉన్నాడు. డబుల్ బెడ్రూం గురించి మీరు కబుర్లు చెబుతున్నారు. మీ కన్నా బాగా ఇండ్లను నిర్మిస్తే దానిపై కూడా విమర్శలా..ప్రాజెక్టులు నిర్మిస్తే వాటిపై కేసులు వేస్తారు. నల్గొండ జిల్లాలో మీ కోటలు కూలడం ఖాయం. పన్నెండు సీట్లకు పన్నెండు గెలుస్తా’మని వ్యాఖ్యానించారు. -
నిరూపించు.. లేదంటే క్షమాపణ చెప్పు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి జానారెడ్డికి కోపం వచ్చింది. ఎలాంటి పరిణామాలనైనా నిబ్బరంగా ఎదుర్కొని నిదానంగా మాట్లాడే ఆయన తన సహజశైలికి భిన్నంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ అధినేత తనకు తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 24 గంటలు కరెంటిస్తే తాను గులాబీ కండువా కప్పుకుంటానని అసెంబ్లీలో చెప్పినట్లు శుక్రవారం హుస్నాబాద్ సభలో ముఖ్యమంత్రి వాఖ్యానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘నాకు నిజాయితీ ఉంటే కండువా కప్పుకోవాలంటుండు.. నేను అనని మాటలు నాకు ఆపాదించడమేంటి? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అనే మాటలేనా ఇవి. నేనెప్పుడూ అలా అనలేదు. అనను. అవసరమైతే అసెంబ్లీ రికార్డులు పరిశీలించండి. నేను అన్నట్లు మీరు రుజువులు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. లేకపోతే 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి’’అని జానారెడ్డి డిమాండ్ చేశారు. పొద్దున ఒకటి, రాత్రి ఒకటి మాట్లాడే రకం కాదు.. రెండు పంటలకు నీరిచ్చి, కోటి ఎకరాలు సాగులోనికి తెస్తే తాను టీఆర్ఎస్ ప్రచారకర్తగా ఉంటానని అన్నానని, దానికి కట్టుబడి ఉంటానని జానారెడ్డి చెప్పారు. కానీ, రెండు పంటలకు నీరు ఎక్కడ వస్తుందో చూపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కానీ, ఎత్తిపోతల పథకాలు కానీ ఉద్దేశించిందే ఒక్క పంటకు నీళ్లివ్వడానికని చెప్పారు. తాను అనని మాటలను అన్నానని చెప్పడం ద్వారా కేసీఆర్ తన స్థాయి తగ్గించుకున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో విలువలు పెంచాలే కానీ, అబద్ధాలతో విలువలు తగ్గించవద్దని హితవు పలికారు. పొద్దున ఒకటి, రాత్రి ఒకటి మాట్లాడే రకం తాను కాదని, జానారెడ్డి చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అంటూ ఆవేశంలో ఊగిపోతూ అన్నారు. విలేకరుల సమావేశంలో భాగంగా 2లక్షల ఇండ్లు కట్టించకపోతే తాను ఓట్లడగబోనని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఫుటేజీ రికార్డులను ఆయన మీడియాకు చూపెట్టారు. -
‘వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే ముందస్తు’
సాక్షి, హైదరాబాద్: తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని మాజీ మంత్రి కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం తన నివాసంలో మండలిలో విపక్ష నేత షబ్బీర్‌అలీ, మాజీ మంత్రులు డి.కె.అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నేత విక్రంగౌడ్‌లతో సమావేశమైన జానా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారన్న ప్రశ్నకు కేసీఆర్ ఇప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. టీఆర్ఎస్ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే చేటు తెచ్చేలా ఉందని, అకారణంగా ముందస్తు ఎన్నికలకు వెళుతూ త్యాగం అంటున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ నష్టపోతుం దని తెలిసినా ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీదే నిజమైన త్యాగమన్నారు. స్వాతంత్య్రం కోసం జైలు శిక్ష అనుభవించి, ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన గాంధీ కుటుంబంపై నోరు పారేసుకునేందుకు కేసీఆర్‌కు సంస్కారం ఉండాలని అన్నారు. -
కాంగ్రెస్ మరోదశ బస్సుయాత్ర
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకుగాను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న ‘ప్రజా చైతన్య బస్సు యాత్ర’మరో దశ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నెలంతా యాత్ర నిర్వహించాలని, అనంతరం అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్భం గా రాష్ట్రంలో ఎక్కడైనా బహిరంగ సభ నిర్వహించాల ని టీపీసీసీ నిర్ణయించింది. మంగళవారం గాంధీభవన్‌లో బస్సుయాత్ర సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, కార్యదర్శి సలీం, కమిటీ కన్వీనర్ షబ్బీర్‌అలీ, కోకన్వీనర్ మహేశ్వర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్సుయాత్ర మరోదశ నిర్వహణపై కూలంకషంగా చర్చించారు. ఈ సారి 3, 4 చోట్ల సభలు నిర్వహించాలని, అవి ఒకే నియోజకవర్గంలో అయినా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. షెడ్యూల్ తుదిరూపు నేడో, రేపో వెలువడే అవకాశాలుండగా, సెప్టెంబర్1 నుంచి ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా పార్టీ కొంత బలహీనంగా ఉందని భావిస్తున్న ఉత్తర తెలంగాణలో సోనియాగాంధీ పాల్గొనేలా ఆహ్వానించాలని, పార్టీ అధినేత రాహుల్ చేత దక్షిణ తెలంగాణలో మరోసారి పర్యటింపచేయాలని కూడా నిర్ణయించారు. బస్సుయాత్ర ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తల ఇండ్లు, వాహనాలపై పార్టీ జెండాలు ఎగురవేయించాలని కూడా నిర్ణయించారు. బస్సుయాత్ర సమన్వయం కోసం మరో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. -
అధ్యయనం చేశాకే హామీలు
సాక్షి, హైదరాబాద్: తాము అసాధ్యపు హామీలను ఇవ్వడం లేదని, అన్ని వివరాలను అధ్యయనం చేసిన తర్వాతే ఎన్నికల హామీలు ఇస్తున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ చెపుతున్నట్టు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అసాధ్యమేమీ కాదని, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.300 కోట్లు కేటాయించడం కష్టమేమీ కాదని వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి మహ్మద్‌సలీం, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌తో కలసి ఆయన మాట్లాడారు. నిరుద్యోగ భృతి విషయంలో సీఎం కేసీఆర్ వ్యక్తం చేసిన అనుమానాలు సరైనవి కావన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున భృతి ఇవ్వడానికి కేవలం రూ.300 కోట్లు అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు నికరంగా రూ.10,500 కోట్ల ఆదాయం వస్తోందని సీఎం స్వయంగా చెప్పారని, అలాంటప్పుడు నిరుద్యోగులకు రూ.300 కోట్లు కేటాయించలేమా అని ప్రశ్నించారు. ఉపాధి కల్పన కార్యాలయాల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగులకు భృతి ఇచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు మేం రెడీ.. ఎన్నికలు ముందస్తు జరిగినా, షెడ్యూల్ ప్రకారం జరిగినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఉత్తమ్ చెప్పారు. సెప్టెంబర్‌లో తాము కూడా అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. భావసారూప్య పార్టీలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకునే విషయాన్ని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రాహుల్‌నుద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చిల్లర మాటలని పీసీసీ చీఫ్ అన్నారు. కేటీఆర్ రాజకీయ అవగాహన లేని చిన్న పిల్లాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లు దిగజారి మాట్లాడుతున్నారని, సూర్యుని మీద ఉమ్మి వేస్తే వారి మీదే పడుతుందన్న విషయాన్ని వారు గ్రహించాలని హితవు పలికారు. టీఆర్ఎస్ కంటే భారీ సభ... అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. తాము అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించాకే ప్రజలకు హామీలిస్తున్నామని ఉత్తమ్ చెప్పారు. సెప్టెంబర్‌లో టీఆర్ఎస్ నిర్వహించే సభ కన్నా భారీ సభను తామూ నిర్వహిస్తామన్నారు. త్వరలో బస్సుయాత్ర ప్రారంభిస్తామని, సెప్టెంబర్‌లో కూడా రాహుల్ రాష్ట్రానికి వస్తారని చెప్పారు. అభ్యర్థుల ప్రకటన కోసం త్వరలోనే ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు వేస్తామన్నారు. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాల పట్ల రాహుల్ చాలా సంతృప్తిగా ఉన్నారని, ఈ విషయా న్ని ఆయనే స్వయంగా చెప్పారని వెల్లడించారు. రాహుల్ టూర్ సక్సెస్ రాహుల్‌గాంధీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన అద్భుతంగా సాగిందని, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు ఊహించిన దాని కన్నా ఎక్కు వ మంది వచ్చారని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ముఖ్యంగా విద్యార్థులు, యువతలో ఉన్న ఆగ్రహానికి ప్రతీకగా ఈ సభ నిలుస్తుందని చెప్పారు. రాహుల్ టూర్‌తో కేసీఆర్‌కు దడ పుట్టిందని, అందుకే మహిళా సంఘాలకు ఉన్న బకాయిల్లో రూ.960 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారని తెలిపారు. మహిళా సంఘాలకు ఇచ్చిన ప్రతి హామీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. పోలింగ్ బూత్ స్థాయిలోని కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ పట్ల రాహుల్ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. సెటిలర్లకు ఇచ్చిన హామీలను కూడా చిత్తశుద్ధితో నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. -
రాహుల్‌గాంధీ భేటీల్లో గందరగోళం
-
జానారెడ్డి ఇక రిటైర్మెంట్ తీసుకోవాలి!
సాక్షి, నల్లగొండ : కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇక రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చదువుకున్న అజ్ఞాని.. కోమటిరెడ్డి చదువుకోని అజ్ఞాని.. ఇవి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యలు.. ఆయన సోమవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు పగటి కలల్లో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చదువుకున్న అజ్ఞాని అయితే, కోమటిరెడ్డి చదువుకోని అజ్ఞాని అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పీసీసీ చీఫ్ కుటుంబంలో ఇద్దరు, కోమటిరెడ్డి కుటుంబంలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, వీరిదంతా ఫ్యామిలీ పార్టీ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని విమర్శించారు. -
ఎన్ని సీట్లో చెప్పలేం.. విజయం మాత్రం మాదే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో మాత్రం ముందుగానే చెప్పలేమన్నారు. ‘‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ఎన్ని సీట్లు అన్నది అంచనా వేయలేం. అది 70 కావచ్చు... 60 కావచ్చు, 59 కావచ్చు. సీట్లు ఎన్నొచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసేది మాత్రం కాంగ్రెస్ పార్టీయే. కర్ణాటకలో కేవలం 38 సీట్లు సాధించిన జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే తరహాలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’అని జానారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా హాల్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కతో కలసి జానారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ విసిరిన సవాల్‌పై ఆయన స్పందించారు. ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ సవాల్ హాస్యాస్పదమన్నారు. అయినా ఏ కారణంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగబద్ధంగా ఐదేళ్లు ఉండాల్సిందే. కానీ రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు, విపత్తులు ఏర్పడితే ముందస్తు ఎన్నికలకు వెళతారు. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల కోసం కొన్ని రాష్ట్రాలతో కలసి ముందస్తుకు పోదామని అనుకుంటోంది. కేంద్రం ఆలోచనలో భాగంగా తెలంగాణ సైతం ముందస్తుకు పోవాలని భావిస్తున్నట్లుంది. అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే ఎందుకు వెళుతున్నారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వివరణ ఇచ్చి ఆ తర్వాత ముందస్తుకు వెళ్లాలి’’అని జానారెడ్డి సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తాము అందుకు సిద్ధంగా ఉంటామన్నారు. పీసీసీ మార్పు ఉందనుకోను... రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి మార్పు అంశాన్ని జానారెడ్డి కొట్టిపారేశారు. పీసీసీ మార్పు ఉందని తనకు సమాచారం లేదని, మార్చేలా అధిష్టానం ఆలోచనలు చేయడం లేదని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని తాను భావించడం లేదన్నారు. కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేత డి. శ్రీనివాస్ తిరిగి పార్టీలోకి వస్తున్నారన్న సమాచారం తనకు తెలియదని జానారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందన్న దానం నాగేందర్ వ్యాఖ్యలు అబద్ధమని ఆయన కొట్టిపారేశారు. గద్వాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా తమ పార్టీ అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని జానారెడ్డి ఖండించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. పోలీస్ రాజ్యం నడుపుతామనుకోవడం అవివేకం అన్నారు. నియంతృత్వ దేశాల్లో కూడా ఇంతటి నిర్బంధం లేదని విమర్శించారు. సమస్యల గురించి ప్రశ్నిస్తే నిర్బంధిస్తారా? అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా అని నిలదీశారు. ప్రభుత్వ విధానాలను ప్రజలు గమనించాలని కోరారు. రేషన్ డీలర్లపై ప్రభుత్వ చర్యలను జానారెడ్డి ఖండించారు. వారి ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోకుండా కఠిన చర్యలకు దిగడాన్ని ఆయన తప్పుబట్టారు. డీలర్లను చర్చలకు పిలిచి సామరస్యంగా వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు. సంపత్ హౌస్ అరెస్ట్ అప్రజాస్వామికం: భట్టి ఎమ్మెల్యే సంపత్ కుమార్ హౌస్ అరెస్ట్ అప్రజాస్వామికమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క విమర్శించారు. గత పుష్కరాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సంపత్ మెమొరాండం ఇవ్వాలనుకుంటే ఆయన్ను పోలీసు నిర్బంధంలో ఉంచడం దారుణమని, దీన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజాస్వామికవాదులందరూ దీన్ని ఖండించాలని కోరారు. -
ముస్లిం రిజర్వేషన్లు ఏమయ్యాయి?
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పూర్తిగా విఫలమయ్యారని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి విమర్శించారు. గిరిజన, ఉద్యానవన విశ్వ విద్యాలయం, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి అంశాల సాధన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ముస్లిం, మైనారిటీలకు 12% రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తీర్మానం చేసినా ఇంతవరకూ అతీగతీ లేదన్న జానారెడ్డి, ఈ అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీతో భేటీలో సీఎం కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఎస్టీలకు 10% రిజర్వేషన్ల అంశాన్నీ సీఎం కేసీఆర్ విస్మరించారన్నారు. ఆదివారం జరిగే నీతిఆయోగ్ భేటీలో అయినా ఈ అంశాల్ని ప్రస్తావించాలని సూచించారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్లో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్‌లతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మంలో బయ్యారం స్టీలు ప్లాంటు ఏర్పాటుకు ప్రధానిని ఒప్పించాలని జానా కోరారు. విభజన అంశాల సాధనలో అధికార పార్టీ చేసే పోరాటానికి కాంగ్రెస్ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. బయ్యారంపై నోరు విప్పడం లేదెందుకు?: పొంగులేటి ‘బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు’అని నినదించిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఈ అంశంపై నోరెందుకు విప్పడం లేదని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నిం చారు. ఏపీలోని కడప స్టీలు ప్లాంటుపై అధికార పక్షం, ప్రతిపక్షనేత, ఇతర పార్టీలు పోరాడుతుంటే ఉద్యమ నేతగా చెప్పుకునే కేసీఆర్ గొంతెందుకు మూగబోయిందన్నారు. మూడు రోజులుగా బయ్యారం ఉక్కుపై ఆందోళన నెలకొన్నా ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క ప్రకటన లేదన్నారు. కేసీఆర్‌కు ప్రజా సమస్యలు పట్టడం లేదని, రాజకీయ, వ్యక్తిగత ఎజెండానే కీలకంగా మారిందని విమర్శించారు. బయ్యారంపై సోమవారం ఖమ్మంలో జరిగే అఖిలపక్ష సమావేశంలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం సంతకాల సేకరణ చేపడతామని ఆయన తెలిపారు. బలరాం నాయక్ మాట్లాడుతూ, కేసీఆర్ మాటలకూ, చేతలకూ పొంతన లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలను కేసీఆర్ మోసం చేస్తున్నారని, వారి సమస్యలపై పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నోరు మెదపడం లేదన్నారు. -
జాబితా మళ్లీ తీసుకు రండి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు ఓ కొలిక్కి రావడం లేదు. ఈ నెల 15 లోపే కమిటీల ప్రకటన ఉంటుందని భావించినా నేతల పేర్ల విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో వాయిదా పడాల్సి వచ్చింది. ఈ కమిటీల విషయమై ఇటీవల పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో చర్చించారు. అయితే ఆయన ప్రతిపాదించిన పేర్లలో అధిష్టానం కొన్ని సవరణలు సూచించింది. పార్టీలో సీనియార్టీతోపాటు గతంలో నిర్వహిం చిన పదవులు, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని ఎన్నిసార్లు విజయం సాధించారు, ఏ సామాజిక వర్గానికి చెంది న వారు అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని మరోసారి జాబితాను తేవాలని ఆదేశించినట్టు సమాచారం. కర్ణాటక ఎపిసోడ్ ముగిశాక రాష్ట్ర కమిటీలపై అధిష్టానం దృష్టి సారిస్తుందని తెలుస్తోంది. ఆ రెండు పదవుల్లో ఒక మార్పు పీసీసీ, సీఎల్పీ నేతలుగా ఒకే జిల్లాకు చెందిన వారు ఉండడంతో ఆ రెండు పదవుల్లో ఒక మార్పు తప్పక ఉంటుందనే ప్రచారం గాంధీభవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఢిల్లీ టూర్‌కి వెళ్లిన ఉత్తమ్‌కు పార్టీ నిర్మాణ బాధ్యతలు చూసే అశోక్ గెహ్లాట్, అధ్యక్షుడు రాహుల్‌గాంధీలను కలిసే అవకాశం రాకపోవడం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, కొప్పుల రాజులతో మాత్రమే చర్చలు జరిపి రావడంతో ఈ విషయంపై స్పష్టత రాలేదు. పీసీసీ చీఫ్ మార్పు ఉండకపోవచ్చనే సమాచారం ఉన్నా.. సీఎల్పీ నేతగా ఉన్న జానారెడ్డిని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని అంటున్నారు. ఆయన స్థానంలో ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మల్లుభట్టి విక్రమార్కను ఎంపిక చేస్తారన్న ప్రచారం ఇటీవల ఊపందుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తానొక్కడిని ఉంటే ఫర్వాలేదని, ఇంకో ఇద్దరు, ముగ్గురిని నియమిస్తే తనను ఆ పదవిలో కొనసాగించాల్సిన అవసరం లేదని భట్టి పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతగా భట్టికి సీఎల్పీ పదవి దక్కవచ్చని అంటున్నారు. ఇక మిగిలిన పదవులకు వీహెచ్, శ్రీధర్‌బాబు, డీకే అరుణ, దానం నాగేందర్, ఎస్.సంపత్‌కుమార్, రాజనర్సింహ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కి, రేవంత్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. -
అవన్నీ మా పథకాలే!
జైపూర్ (చెన్నూర్): రైతుబంధు పథకాన్ని తాము స్వాగతిస్తున్నామని సీఎల్పీ నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. ఎకరానికి రూ.4 వేలు సరిపోవని, ఇంకా పెంచాలని సూచించారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపాన్ని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అధిష్టాన నిర్ణయం మేరకు అందరూ కలసి పని చేయాల్సిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన పథకాలే టీఆర్ఎస్ ప్రభుత్వం పేర్లు మార్చి అమలు చేస్తోందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకంతో ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందించగా.. అదే పథకాన్ని ప్రధాని మోదీ రూ.5 లక్షలకు పెంచి దేశంలో అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. తాము ముందు చూపుతో సాగునీటి ప్రాజెక్టులు, జైపూర్, భూపాల్‌పల్లిలో పవర్‌ప్లాంటు నిర్మించగా.. 80 శాతం నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించి తమ ఘనత అని గొప్పులు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్‌తో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లు జానారెడ్డి తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్ పాలనపై మాట్లాడే అర్హత టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అణచివేత విధానాలు, నిరంకుశత్వ ధోరణి అవలంబిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. ప్రజాసంఘాలకు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదన్నారు. ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఫిరాయింపులను ప్రోత్సహించిందని జానా మండిపడ్డారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్ గిన్నిస్‌రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. -
నాకంటే అర్హులెవరు?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో తన కంటే అర్హులెవరూ లేరని, తనను కాదంటే ప్రజలు కూడా అంగీకరించబోరని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కుందూరు జానారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం తన నివాసంలో జరిగిన సీఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎప్పుడూ తన మనసులో మాటలను బయటకు పంచుకోని ఆయన పలు అంశాలపై అభిప్రాయాలను నిర్మొహమాటంగా మీడియాతో పంచుకున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి నిర్వర్తించేందుకు కూడా తనకు అన్ని అర్హతలున్నాయని చెప్పారు. గతంలోనే ఆ పదవి రావాల్సి ఉన్నా రాలేదని, అయినా పార్టీకి నష్టం జరగకూడదనే ఆలోచనతోనే తానెప్పుడూ నోరెత్తలేదని చెప్పారు. ఇక, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తనది కీలకపాత్ర అని, సోనియా గాంధీని ఈ విషయంలో ఒప్పించి రాష్ట్రం ఇప్పించింది కూడా తానేనని అన్నారు. ఈ విషయం ప్రజలకు తెలియడం కన్నా సంతోషం ఏముంటుందని అన్నారు. తనకు అర్హత ఉన్నప్పటికీ సీఎం పదవి రాకపోయినా ఫర్వాలేదని, తెలంగాణ ఇప్పించానన్న సంతృప్తి చాలని వ్యాఖ్యానించారు. తానెప్పుడూ పదవుల కోసం పాకులాడ లేదని చెప్పారు. ఆరునెలల ముందు తెలంగాణ ఇచ్చి ఉంటే కాంగ్రెస్‌కు ప్రయోజనం జరిగి ఉండేదనే అభిప్రాయంపై స్పందిస్తూ ‘అప్పటి పరిస్థితులు వేరు. 25 మంది ఎంపీలు బయటకు వెళ్తే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే తెలంగాణే వచ్చేది కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ అన్నీ ఆలోచించి చివర్లో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది’అని జానా చెప్పుకొచ్చారు. సీఎల్పీ పనితీరుపై .. సీఎల్పీ సరిగా పనిచేయడం లేదన్న ఆరోపణపై జానా తనదైన శైలిలో స్పందించారు. ‘క్రికెట్లో టీం కెప్టెన్ సెంచరీలు కొట్టినా అన్నిసార్లు మ్యాచ్‌లు గెలవలేరు. లీడర్ టెన్ రన్స్ కొట్టినా జట్టు సభ్యుల ప్రదర్శన బాగుంటే మ్యాచ్‌లు గెలవచ్చు. మా స్పిరిట్ కూడా అంతే’అని వ్యాఖ్యానించారు. తమ ఎమ్మెల్యేలను బహిష్కరించిన విషయంలో పోరాటం చేస్తున్నామని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ దుర్మార్గాన్ని దేశ ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్‌ను సుప్రీంకోర్టులో సాక్ష్యంగా చూపేందుకే తాము రాజ్యసభ బరిలో నిలిచామని చెప్పారు. ఎలిమినేటి మాధవరెడ్డి, పట్లోళ్ల ఇంద్రారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి వంటి ఎంతోమందికి తానే రాజకీయబాట చూపించానని, అయినా తానెప్పుడూ గొప్పలు చెప్పుకోలేదని జానారెడ్డి చెప్పారు. -
ప్రజల్లో తిరుగలేకపోతున్నా: సంపత్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో శనివారం సీఎల్పీ సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భట్టివిక్రమార్క, సంపత్‌కుమార్, జీవన్‌రెడ్డి, పద్మావతి, వంశీచంద్‌రెడ్డి, ఆకుల లలిత తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు ఎమ్యెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికాలో ఉన్నందున ఈ సమావేశానికి హాజరుకాలేదు. సంపత్ అసహనం ఈరోజు జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా శాసనసభాపక్షం సరిగా స్పందించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని సంపత్ ఆవేదన చెందారని సమాచారం. సీఎల్పీ తీరు వల్ల ప్రజల్లో తిరుగలేక పోతున్నట్లు సహచర సభ్యుల వద్ద ఆయన వాపోయారని చెబుతున్నారు. కనీసం గన్మెన్ల పునరుద్ధరణపై డీజీపీని కూడా కలవలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో స్పీకర్, డీజీపీ, చీఫ్ సెక్రటరీలను కలిసి కోర్టు తీర్పు కాపీని త్వరలో అందజేయాలని సీఎల్పీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎల్పీ సమావేశం ఇంతవరకూ ఇళ్లలో జరగలేదంటూ కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ దాటరని విమర్శించే తాము ఇంట్లో సీఎల్పీ సమావేశాలు జరపడమేంటని కొందరు నేతలు ప్రశ్నించారట. ఇదే అంశాన్ని పలువురు జానారెడ్డితో నేరుగా చెప్పినట్టు తెలుస్తోంది. -
పీవీకి భారతరత్న ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: దివంగత ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించి సముచితంగా గౌరవించాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధానికి లేఖ రాశా రు. 60 దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రధానిగా, ఏపీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి విశిష్ట సేవలు అందించారని లేఖలో గుర్తు చేశారు. ప్రధానిగా పనిచేసిన సమయంలో దేశ జీడీపీని పరుగులు పెట్టించారని తెలిపారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారతరత్న ఇవ్వడం సముచితంగా ఉంటుందన్నారు. పౌర సేవల హక్కు చట్టంపై లేఖ.. పాలనలో పారదర్శకతకు రూపొందిస్తున్న పౌర సేవల హక్కు చట్టం రూపకల్పనలో ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని జానారెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం ఆయన సీఎంకు లేఖ రాశారు. చట్టం విషయంలో పూర్తి సహకారం అందిస్తామన్నారు. చట్టంపై లోక్‌సత్తా సమర్పించిన ముసాయిదాను లేఖతో పాటు కేసీఆర్‌కు పంపారు. -
కాగ్ నివేదికలో అక్రమాలు బట్టబయలు
మిర్యాలగూడ టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) నివేదిక బట్టబయలు చేసిందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ఆ నివేదికను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఈ నెల 4, 5 తేదీల్లో మీడియా సమావేశంలో వెల్లడిస్తామన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాగ్ నివేదిక టీఆర్ఎస్ సర్కార్‌ను దోషిగా నిలబెడుతుంటే, సీఎం కేసీఆర్ మాత్రం ఆ నివేదికే తప్పుల తడకంటూ బుకాయిస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని తెలిపారు. కేసీఆర్ ఇంకా మాయ మాటలతో గారడి చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఇక ఆయన మాటలు నమ్మే స్థితిలో లేరని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. కేసీఆర్ రాజ్యాంగ వ్యవస్థనే తప్పుదోవ పట్టించేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల అభీష్టం మేరకు నడుచుకుంటుందన్నారు. రాజకీయ అవగాహన లేని వారి వెకిలి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. -
మాకు మద్దతివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్ని కల్లో మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీ టీడీపీని కోరింది. మంగళవారం సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ అభ్యర్థి బలరాంనాయక్‌కు మద్దతివ్వాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను కోరినట్లు తెలిపారు. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎమ్మెల్యేలు వెంకటవీరయ్య, ఆర్.కృష్ణయ్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ టీడీఎల్పీలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసినా గెలిచే పరిస్థితి లేనందున తటస్థంగా ఉండటమే మేలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అధికారిక నిర్ణయాన్ని బుధవారానికి వాయిదా వేశారు. విప్‌గా రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ శాసనసభా పక్షం విప్‌గా ఎస్.ఎ.సంపత్‌కుమార్ స్థానంలో పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి నియమితులయ్యారు. సంపత్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించడం తో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, కార్యదర్శి నర్సింహాచార్యులకు సీఎల్పీ నేత కె.జానారెడ్డి మంగళవారం లేఖలు రాశారు. -
సస్పెన్షన్‌తో జానాకే మేలు: జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షనేత జానారెడ్డిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం ఆయనకే మేలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో బుధవారం తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ జానారెడ్డిని సస్పెండ్ చేయకుంటే టీఆర్ఎస్తో కలసిపోయారని కాంగ్రెస్‌వాళ్లే పార్టీ నుంచి సస్పెండ్ చేసేవారన్నారు. మరో ఇద్దరు సభ్యులను సస్పెండ్ చేసే అంశం స్పీకరు, శాసనసభ పరిధిలోని అంశమన్నారు. -
మాకు నీతులు చెప్పుడు మానండి
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ‘జానారెడ్డి నీతులు చెప్పుడు మానుకోవాలి. అడ్డం పొడుగు మాట్లాడే నేతలను, అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించే నాయకులను మీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? నల్లగొండలో జరిగిన హత్య విషయంలో మీపార్టీ నాయకుడు.. మొండాలు మురికి కాల్వల్లో తేలాలన్నడు. పక్కనే కూర్చున్న జానా ఏం చేశారు. మాకు నీతులు చెప్పడం మానేయండి..’అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు హితవు పలికారు. నల్లగొండ జిల్లా చండూరులో సోమవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మునుగోడు నియోజకవర్గ ప్రగతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, జిల్లా ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిషోర్‌కుమార్, పైళ్ల శేఖర్‌రెడ్డి, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘నల్ల గొండకు ఫ్లోరోసిస్ శాపం ఎవరి వల్ల వచ్చింది? 1956లో ఏపీలో తెలంగాణ కలవక ముందు ఇక్కడ ఫ్లోరోసిస్ సమస్య లేదు. 50 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఫ్లోరోసిస్ సమస్య ఉత్పన్నం అయింది. వారి ఆస్తులు పెరిగాయి.. ఆకారాలు పెరిగాయి.. అహంకారం పెరిగింది.. అదే స్థాయిలో నీటిలో ఫ్లోరోరైడ్ పెరిగింది’ అని దుయ్యబట్టారు. జిల్లాలో 2 లక్షల మంది ఫ్లోరైడ్ బా«ధితులుగా మారడానికి కాంగ్రెసే కారణమని, జిల్లాను ఆ పార్టీ నేతలు ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలకు మానసిక ఆందోళన ‘టీఆర్ఎస్ ప్రభుత్వంపై దిగజారి మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో మైక్ విరగొట్టి, హెడ్ఫోన్లు విసిరి కొట్టారు. గతంలో టీఆర్ఎస్ ఇలా దాడి చేయలేదా అని సమర్థించుకుంటున్నారు. అధికారం కోసం వారు మానసిక ఆందోళన చెందుతున్నారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం తక్కువ చేసిందో జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పాలన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను.. ఏం చేసుకుంటారో చేసుకోమన్నప్పుడు ఎవరన్నా నిలదీశారా? అని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే బతుకంతా చీకటి అయితదని శాపాలు పెడితే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్కరన్నా మాట్లాడారా? అని కేటీఆర్ నిలదీశారు. ఎందుకు తిరుగుతున్నరు? 2004లో కరెంటు కోసం పోరాడిన వారిని నాటి టీడీపీ పాలకులు కాల్చి చంపితే, ముదిగొండలో కాంగ్రెస్ పాలకులు రైతులను కాల్చి చంపారని కేటీఆర్ ఆరోపించారు. ‘ఇపుడు రైతును రాజును చేస్తామని అంటున్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో విత్తనాలు, ఎరువులు, కరెంటు కోసం రైతులు ఆందోళనలు చేసేవారు. ఇపుడు కరెంటు వద్దని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కేసీఆర్ గొప్ప కాదా? రైతుల సాగు పెట్టుబడుల కోసం ఎకరాకు రూ.4వేలు ఇవ్వడం దేశంలో కేసీఆర్ తప్ప మరొకరు ఆలోచన చేశారా? కాంగ్రెస్ ఎందుకు సర్కస్ ఫీట్లు చేస్తోంది. తిన్నది అరగక తిరుగుతున్నరు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్లు కేటాయించడం కాంగ్రెస్‌కు కడుపు మంటగా ఉంది’ అని ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు ఆడపిల్లల బాధ్యత గురించి తెలుసు కాబట్టే కల్యాణలక్ష్మి పేర రూ.75,116 ఇస్తున్నారన్నారు. -
మద్యం తాగలేదు.. చైర్మన్‌కు గాయం కాలేదు!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడినట్టు అయింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నించారు. ఈ క్రమంలో గవర్నర్ లక్ష్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెడ్‌ఫోన్ విసిరేయడం.. అదికాస్తా మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు తగిలి కంటికి స్వల్పగాయం కావడం.. తీవ్ర దుమారం రేపింది. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు తమ సభ్యులపై వచ్చిన ఆరోపణలను, అధికార పార్టీ చేస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. శాసనసభలో ప్రతిపక్ష నేత, పీసీసీ సీనియర్ నేత జానారెడ్డి ఈ వివాదంపై స్పందించారు. కాంగ్రెస్ సభ్యులెవరూ మద్యం తాగి.. అసెంబ్లీకి రాలేదని, మద్యం తాగి సభకు వచ్చారన్న ఆరోపణలు అవాస్తవమని ఆయన ఖండించారు. సభలో తమ ఎమ్మెల్యేల పట్ల మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. అయినా, తాము ప్రజాస్వామికంగానే సభలో నిరసన తెలిపామని ఆయన చెప్పారు. మరో సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సభలో అసలు మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు గాయమే కాలేదని అన్నారు. ఆయన బయటకు రాగానే గాయమైనట్టు చెప్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో టీఆర్ఎస్ ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసునని అన్నారు. కనీసం పోడియం వద్దకు ప్రతిపక్ష సభ్యులను అనుమతించకపోవడం దారుణమని అన్నారు. స్పీకర్ వద్ద ఉండాల్సిన మార్షల్స్ తమ వద్దకు ఎందుకు వచ్చారని భట్టి ప్రశ్నించారు. -
నాలుగేళ్లలో ఏం చేశారు?
మిర్యాలగూడ : టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు తెలియజేయాలని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం మిర్యాలగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. నాలుగేళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టు నిర్మించారా? ఒక్క పరిశ్రమ కట్టారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నాయకులకు అభివృద్ధి చేయడం చేతకాదని, వారికి ఇతర పార్టీల నాయకుల గురించి అపహాస్యంగా మాట్లాడటమే తెలుసని అన్నారు. నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మిస్తే కాలువకు నీళ్లిచ్చి గతంలో ఎన్నడూ నీళ్లు రానట్లుగా తామే ఇచ్చామనేవిధంగా గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. నాలుగేళ్లలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ పట్టణంలో తమ హయాంలో నిధులు మంజూరు చేసి నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని టీఆర్ఎస్ నాయకులు ప్రారంభించి తాము నిర్మించినట్లు చెబుతున్నారని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామానికైనా కొత్తగా మంచినీటి సదుపాయం కల్పించారా? పట్టణంలోని ఆడిటోరియం నిర్మించారా? అని జానారెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్కు ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెబుతారని అన్నారు. సమావేశంలో దామరచర్ల జెడ్పీటీసీ శంకర్‌నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, పీసీసీ సభ్యులు పగిడి రామలింగయ్య, చిరుమర్రి కృష్ణయ్య, స్కైలాబ్‌నాయక్, పట్టణ అధ్యక్షుడు కరీం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి రమేష్, కార్యదర్శి బండారు కుశలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముజ్జు రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
అది ప్రజల మాటే
సాక్షి, హైదరాబాద్: ‘జానాబాబా 40 దొంగలు’అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన కుసంస్కారానికి నిదర్శనమంటూ సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించడాన్ని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తప్పుబట్టారు. రాష్ట్రాన్ని 60 ఏళ్లు పాలించి దోచుకున్న కాంగ్రెస్ నేతల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మంత్రి కేటీఆర్ కూడా అదే మాట అన్నారని, ఇందులో అనుచితమేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను నిత్యం బండ బూతులు తిట్టే కాంగ్రెస్ నేతలు నీతులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పార్టీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, పూల రవీందర్‌తో కలసి శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. గుడ్డలు ఊడదీసి కొడతాం, దవడలు పగులగొడతామంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే ఆ పార్టీ పెద్దలకు సంస్కా రం గుర్తురాలేదా అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. జానారెడ్డికి కాంగ్రెస్‌లో గౌరవం లేకు న్నా, సీఎం కేసీఆర్ గౌరవం ఇస్తున్నారని చెప్పారు. నల్లగొండ సభలో జాతీయ నాయకుల ముందే కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన నాయకులు అసభ్యంగా మాట్లాడితే జానారెడ్డి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిపై ప్రజలు సంతో షంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలను ఇంటికి పంపించడానికే ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. మంత్రి కేటీఆర్ ప్రజల మెప్పు పొంది నాయకుడయ్యారని జగదీశ్‌రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని, కాంగ్రెస్ నేతలకు చేతనైతే అసెంబ్లీలో మాట్లాడాలని సవాల్ చేశారు. కాంగ్రెస్‌పైనే ప్రజాగ్రహం తెలంగాణ వస్తే చీకటి రోజులు వస్తాయంటూ నాటి కాంగ్రెస్ నేత, ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బెదిరించారని...కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రజలు, రైతులకు 24 గంటల నిరంతర కరెంటును ఇస్తున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. విత్తనాల కోసం రోజుల తర బడి క్యూలలో నిలబెట్టిన పాలన కాం గ్రెస్ పార్టీదని... ఇంటికే విత్తనాలను పంపిస్తున్న పార్టీ తమదన్నారు. మోస కారి కాంగ్రెస్ నేతలపై ప్రజలకు కోపం ఉంటుందా లేక అన్ని హామీలనూ నెరవేరుస్తున్న టీఆర్ఎస్ మీద ప్రజలకు కోపం ఉంటుందా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి వల్ల తెలంగాణ పేరు మూడేళ్లలోనే ప్రపంచంలో మారుమోగిపోతోందన్నారు. గ్రామస్థాయి నుంచి కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని విమర్శించారు. -
ఐక్యంగా కాంగ్రెస్ చైతన్య యాత్ర
మిర్యాలగూడ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కాంగ్రెస్ పార్టీ చైతన్య యాత్రను పార్టీ నాయకులంతా ఐక్యంగా ఉండి నిర్వహిస్తారని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడుతూ చైతన్య యాత్ర రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో సాగుతుందని చెప్పారు. ప్రభుత్వం విస్మరించిన హామీలు, ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన తీరుతోపాటు కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను కూడా తెలుసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల పథకం, ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లుల మంజూరు, రుణమాఫీపై ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడం వల్ల రైతులకు వడ్డీల భారం అయిందని, ఇలా చెప్పుకుంటూ పోతే 50 హామీలు విస్మరించారని అన్నారు. అధికారం పోతుందని టీఆర్ఎస్ నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. సంస్కార హితంగా, ప్రజాహితంగా, వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుందని హితవు పలికారు. -
‘పెద్దోళ్లంతా’ లోక్‌సభకే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలను ఈసారి లోక్‌సభకు పోటీ చేయించాలని ఆ పార్టీ అధిష్టానం యోచిస్తోంది. ముఖ్యంగా వారసులను బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్న నేతలను పార్లమెంటుకు పంపాలని, వారసులకు రాష్ట్రంలో అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో చాలా మంది నేతలు సీఎం రేసులో ఉండటం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కసరత్తు పకడ్బందీగా జరగకపోతే నష్టం తప్పదన్న అంచనాలు, పార్టీలోని నేతల మధ్య పోటీకి చెక్ పెట్టడం లక్ష్యంగా పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతోపాటు సీనియర్లు పోటీచేసే లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు అన్నివిధాలా భరోసా కల్పించినట్లు అవుతుందని అంటున్నారు. కుటుంబ సభ్యులకు సీట్లు..! రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు చాలామంది వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులకు కూడా అవకాశం కల్పించాలని పార్టీకి ప్రతిపాదిస్తున్నారు. అయితే సీట్ల సర్దుబాటు, ప్రాంతాలు, సామాజిక సమీకరణాల దృష్ట్యా కుటుంబ సభ్యులకు సీట్లు కోరుకునే నేతలందరినీ సంతృప్తిపరిచే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులకు సీటు కావాలంటే.. లోక్‌సభకు వెళ్లాలని సీనియర్లకు మెలిక పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. సీనియర్ నేతలు కోమటిరెడ్డి, పొన్నాల, జానా, సబిత, డీకే అరుణ, సర్వే సత్యనారాయణ, గీతారెడ్డి, రాజనర్సింహ తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు. – సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను నల్లగొండ లోక్‌సభకు పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ అసెంబ్లీ నుంచి సోదరుడు, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డికి లైన్‌క్లియర్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. – జానారెడ్డి కుమారుడు రఘువీర్ గత ఎన్నికల సమయంలోనే మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. కానీ వీలుకాలేదు. ఈసారి ఎమ్మెల్యే బరిలో దిగాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. ఆయనకు అవకాశమిస్తే.. జానాను నల్లగొండ లేదా మల్కాజ్గిరి నుంచి లోక్‌సభకు పోటీ చేయించే అవకాశాలున్నట్లు సమాచారం. – సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తీక్ కోసం గత ఎన్నికల్లోనే అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నారు. ఆ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా పోటీచేసిన కార్తీక్.. ఈసారి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బరిలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో సబితను చేవెళ్ల ఎంపీ స్థానంలో పోటీకి దింపే అవకాశాలున్నాయి. – పొన్నాల లక్ష్మయ్య కూడా కోడలు వైశాలిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నారు. ఆమె జనగామ నుంచి పోటీ చేయాలనుకుంటే పొన్నాలను భువనగిరి ఎంపీ స్థానంలో పోటీ చేయాలని కోరవచ్చని అంటున్నారు. – డీకే అరుణ తన కుమార్తె స్నిగ్ధారెడ్డిని ఎమ్మెల్యే చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అదే జరిగితే అరుణను లోక్‌సభకు పంపవచ్చని.. మహబూబ్‌నగర్ నుంచిగానీ, మరో చోట గానీ పోటీలోకి దింపవచ్చని తెలుస్తోంది. – సీనియర్ నేత జైపాల్‌రెడ్డిని ఈసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లోకి తీసుకుంటారని, వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నుంచి బరిలో ఉంటారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే జైపాల్‌రెడ్డి సీఎం రేసులో ఉంటారు. కానీ తనకు సీఎం కావాలన్న ఆలోచన లేదని, ఈసారికి ఎంపీ బరిలోనే ఉంటానని జైపాల్‌రెడ్డి సన్నిహితుల వద్ద చెబుతున్నారు. – ఇక పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఆయన సతీమణి పద్మావతీరెడ్డి ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కుటుంబంలో ఒకరికే అసెంబ్లీ అవకాశమనే నిర్ణయం నేపథ్యంలో.. ఉత్తమ్ హుజూర్నగర్ అసెంబ్లీకే పోటీచేస్తారని, పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలో మరొకరికి అవకాశమిస్తారని చెబుతున్నారు. దీంతో ఇతర నేతల నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉండదనే చర్చ జరుగుతోంది. ఆ ఎంపీ స్థానాల కోసం.. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడు లోక్‌సభ స్థానాలైన వరంగల్, పెద్దపల్లి విషయంలో కాంగ్రెస్ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితిలో ఉంది. గత ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేసిన రాజయ్య కుటుంబ సమస్యల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పెద్దపల్లి నుంచి పోటీ చేసిన వివేక్ టీఆర్ఎస్లో చేరారు. అయితే కాంగ్రెస్ వరంగల్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను నిలబెట్టింది. ఈసారీ ఆయననే బరిలోకి దింపవచ్చని అంటున్నారు. లేదా గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ పేర్లను కూడా పరిశీలించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. గీతారెడ్డి కుమార్తె మేఘనారెడ్డి, రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డిల పేర్లు కూడా ఈసారి ఎన్నికల బరిలో వినిపిస్తున్నాయి. -
‘లోఫర్’ వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై జానారెడ్డి ఆగ్రహం
-
‘కేటీఆర్ మాటలు, తీరు జుగుప్సాకరం’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ‘లోఫర్ వ్యాఖ్యలు’ చిచ్చును రాజేశాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలంతా వరుసబెట్టి కేటీఆర్‌పై మండిపడుతున్నారు. ఈ క్రమంలో సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్ మాటలు, తీరు జుగుప్సాకరంగా ఉందని ఆక్షేపించారు. టీఆర్ఎస్ తీరు మారటం లేదు... ‘కేటీఆర్ వాడిన పదజాలాన్ని సీఎల్పీ నేతగా నేను ఖండిస్తున్నా. ఇది రాజకీయ అహం, దిగజారుడు తనానికి నిదర్శనం. ఎదుటి వారిని చులకన చేస్తే వారు ఉన్నతం అనుకోవడం మంచిది కాదు. ఏహ్యమైన మాటలు వారికి అలవాటుగా మారాయి. రాజకీయాల్లో సంస్కారం, వ్యవహార తీరును ప్రతీసారి నేను గుర్తు చేస్తూనే ఉన్నాను. రోజూ నా చుట్టు తిరిగినోళ్లు .. సీఎం లు, మంత్రులు అయ్యారని చులకన చూస్తాన్నానా? లేదుకదా!. వారి హోదాకు కూడా గౌరవం ఇస్తున్నా. అలాగే అధికార పార్టీ నేతలకు కూడా మొదటి నుంచి సభ్యతతో మెదగాలని చెబుతున్నా. కానీ, వారి తీరు ఎంత మాత్రం మారటం లేదు’ అని జానారెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ఓ బ్రోకర్ పార్టీ... సీఎం కేసీఆర్, తెరాస వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా.. కాంగ్రెస్ వాళ్లకు మాత్రం తాను అదే రీతిలో స్పందించవద్దని సూచించానని... కానీ, అది అలుసుగా తీసుకుని ఇలాంటి పదజాలం వాడటం సంస్కారం అనిపించుకోదని ఆయన హితవు పలికారు. ఇలాంటి మాటల వల్ల రాజకీయ విలువలు దిగజారుతాయన్నారు. ‘మాట్లాడాలంటే.. మేమూ మాట్లాడగలం. కాంగ్రెస్ లోఫర్ అన్నప్పుడు... ప్రతిగా తెరాస ఓ బ్రోకర్ పార్టీ అని ఎవరైనా అంటే ఏం చేస్తారు?. మీడియాలో ఆర్భాటం కోసమే వాళ్లు ఇదంతా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని కాలి గోరు తో పోల్చారు. మరి కాళ్ళు పట్టుకున్న సంగతి మరిచిపోయారా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కనీస గౌరవం ఇవ్వకపోవడం ప్రజలనూ బాధిస్తుంది’ అని జానారెడ్డి పేర్కొన్నారు. రాహుల్ పప్పు కాదు... ప్రజలు సమయం కోసం ఎదురు చూస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారని జానా పేర్కొన్నారు. ఇక కేటీఆర్.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన విమర్శలను కూడా జానారెడ్డి తప్పుబట్టారు.‘130 కోట్ల ప్రజల పార్టీకి రాహుల్ నాయకుడు.. ప్రధాని అవ్వడానికి అవకాశం ఉన్నా త్యాగం చేసిన నేత నేత. గుజరాత్ లో మోడీని మూడు చెరువుల నీళ్లు తాగించారు. అలాంటి వ్యక్తిపై వ్యాఖ్యలు చేసే అర్హత కేటీఆర్‌కు లేదు’ అని జానా తెలిపారు. తాను శుష్క సవాళ్లు చేయనని.. పబ్లిసిటీ కోసం మాట్లాడనని జానారెడ్డి వెల్లడించారు. సీట్లు, సర్వేలు కాదు.. 2019 లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉన్నమాటే కదా : ఎమ్మెల్సీ కర్రె సాక్షి, హైదరాబాద్ : జానారెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వెంటనే స్పందించింది. ఉన్నమాటంటే కాంగ్రెస్ నేతలకు ఉలుకెందుకనీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రజలు వాడే భాషనే మంత్రి కేటీఆర్ వాడారు. ఆయన కాంగ్రెస్ గురించి చెప్పిన ప్రతీ మాట అక్షర సత్యం. నిజాలు మాట్లాడితే వారికి సహించటం లేదు అని కర్నె చెప్పారు. ఇక తెలంగాణకు కేసీఆర్ బాహుబలి అయితే.. కాంగ్రెస్ నేతలు కాలకేయ సైన్యంలా మారిందని కర్నె ఎద్దేవా చేశారు. -
‘ముందస్తు’కు మేం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరగదన్నదే తమ అభిప్రాయమన్నారు. బుధవారం గాంధీభవన్‌లో వారిద్దరూ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సమయం, ఇతర పరిస్థితుల దృష్ట్యా నియోజకవర్గాల పునర్విభజన సా ధ్యం కాదనుకుంటున్నట్లు చెప్పారు. ‘‘ఎన్నికల సమయంలో కూటముల ఏర్పాటు ప్రయత్నాలు సహజం. కూటమి ఏర్పాటుపై పార్టీలో ఏదైనా స్పష్టత వచ్చాక ప్రకటిస్తాం. వచ్చే ఎన్నికల్లో 102 సీట్లు గెలుస్తామని టీఆర్ఎస్ చెప్పుకోవడం మా పార్టీ శ్రేణులను బలహీన పరిచేందుకు ఆడుతున్న మైండ్‌గేమ్. రాష్ట్రంలో 62 శాతం మంది రైతులు రెండున్నర ఎకరాల లోపే భూమి కలిగి ఉన్నారు. ఈ లెక్కన మెజారిటీ రైతులకు రూ.2 వేల నుంచి రూ.3 వేల లోపే పెట్టుబడి సాయం అందుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో క్వింటాలుకు రూ.100 తగ్గినా ఇచ్చే పెట్టుబడి సాయం చెల్లుకు చెల్లవుతుంది. అదనంగా రైతులకు ఒరిగేదేమీ ఉండదు’’అని పేర్కొన్నారు. తమ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగానే ఉన్నారని చెప్పారు. -
‘టీఆర్ఎస్లో చేరనందుకే హత్య చేశారు’
హైదరాబాద్ : టీఆర్ఎస్లోకి రానందుకే కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేశారని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..ముమ్మాటికీ ఇది రాజకీయ హత్యేనన్నారు. సీబీఐ విచారణ కోసం కోర్టును ఆశ్రయించామని తెలిపారు. కాల్ డేటా ఇవ్వబోమని సీఎం చెంచాలు చెబుతున్నారని..ఆ మాట హోం మంత్రి లేదా డీజీపీ చెప్పాలని అడిగారు. సీఎం హత్యారాజకీయాలకు ప్రణాళికలు రచించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మార్చిలోపు 50 శాతం అభ్యర్థులను ప్రకటించాలని తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి కుంతియాకు చెప్పానని తెలిపారు. హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించానని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి పాదయాత్ర చేయాలని చెప్పానని, బాధ్యతలిస్తే తెలంగాణ అంతా తిరుగుతానని, లేదంటే నల్గొండలో అన్నీ స్థానాలు గెలిపించే ప్రయత్నం చేస్తానని అన్నారు. మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగానే ఉన్నాడని తెలిపారు. తన కంటే ముందు రాజీనామా చేసిన వాళ్లవి స్పీకర్ ఇంకా ఆమోదించలేదని, తనది కూడా పెండింగ్‌లో పెడతారేమోననే ఉద్దేశంతో ఆగాడని స్పష్టం చేశారు. ముందు ఇచ్చిన వారివి ఆమోదిస్తే తక్షణం రాజీనామా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని వ్యాఖ్యానించారు. -
ఆ వర్గాలపై దాడులు పెరుగుతున్నాయ్: ఉత్తమ్
హైదరాబాద్ : తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని, దళిత, గిరిజన, బడుగు, బలహీల వర్గాలపై దాడులు మితిమీరిపోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. 133 వ జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గాంధీ భవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో..సీఎల్పీనేత జానారెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, సేవదల్ ఛైర్మెన్ జనార్దనరెడ్డి తదీతరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీకి 133 ఏళ్ల చరిత్ర ఉందని, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. దేశానికి స్వాతంత్రం తేవడంలో, తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ పాత్ర క్రియాశీలకమైందన్నారు. అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ గురించి అన్ని పార్టీలు ఒప్పుకున్నా కూడా సీఎం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపోలేదని గుర్తు చేశారు. మందకృష్ణను అక్రమంగా అరెస్ట్ చేసి అనేక కేసులు పెట్టి జైల్లో పెట్టారని విమర్శించారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి(ఏఐసీసీ కార్యదర్శి) మాట్లాడుతూ.. దేశంలో గాడ్సే వాదుల ఆగడాలు ఎక్కువయ్యాయని, రాజ్యాంగాన్ని మారుస్తామంటూ కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే మాట్లాడటం దారుణమన్నారు.అనంతకుమార్ హెగ్డే ను తక్షణం బర్తరఫ్ చేయాలని కోరారు. అంబెడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కించపరచడం అంటే మనకళ్లు మనము పొడుచుకోవడమేనని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని మార్చాలనే వ్యాఖ్యలు దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. కుందూరు జానారెడ్డి(శాసనసభాపక్ష నాయకుడు) మాట్లాడుతూ.. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమి మనదేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర మరువలేనిదని అన్నారు. లౌకికవాదం, ప్రజాసామ్య విలువల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. దేశరక్షణ రంగాన్ని పటిష్ట పరిచి మన శతృదేశాలకు దీటుగా సమాధానం చెప్పగలిగే స్థాయికి దేశాన్ని తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. షబ్బీర్ ఆలీ(శాసనమండలి ప్రతిపక్షనేత) మాట్లాడుతూ... సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహించలేమని ప్రభుత్వం చేతులెత్తాయడం సిగ్గు చేటన్నారు. సైన్స్ కాంగ్రెస్ మణిపూర్ తరలిపోవడం తెలంగాణకు అవమానకరమని వ్యాఖ్యానించారు. ఓయూలో నిరసనలకు భయపడి కేసీఆర్ సైన్స్ కాంగ్రెస్‌కు నో చెప్పారని విమర్శించారు. ఓయూ పట్ల కేసీఆర్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్ దృష్టిలో ఓయూలో రౌడీలు ,టెర్రరిస్టులు ఉన్నారా అని ప్రశ్నించారు. సర్కార్ తీరుతో ఓయూ, తెలంగాణ పరువు పోయిందని, కేసీఆర్ ఓ అసమర్థ సీఎంగా పేరు తెచ్చుకున్నారని విమర్శించారు. మల్లు భట్టి విక్రమార్క(టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్) మాట్లాడుతూ.. జాతి సమగ్రతకై కొట్టుకునే వారికి కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజు ఓ పండుగ అని వ్యాఖ్యానించారు. రాహుల్ నాయకత్వంలో తెలంగాణాలో, కేంద్రంలో 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. పోలీసు వలయంలో తెలంగాణ ప్రభుత్వం ఉందని, తెలంగాణాలో ప్రజాస్వామ్యం లేదన్నారు. రాజ్యాంగాన్ని మార్చుతామంటున్న కేంద్ర మంత్రి అనంత్ కుమార్ రాజద్రోహి అని అన్నారు. కులాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి మార్పు దిశగా నడిపిస్తున్నకాంగ్రెస్ పార్టీ లౌకిక వాదం అనే బలమైన పునాదులపై ఏర్పడిందన్నారు. జాతిని విభజించి అధికారం కోసం ఆరాటపడుతున్న పార్టీలకు భిన్నంగా కాంగ్రెస్ ఏకత్వం కోసం పనిచేస్తుందని చెప్పారు. -
వచ్చే ఎన్నికల్లో ఓడిపోనున్న జానా, ఉత్తమ్
సాక్షి, చౌటుప్పల్ (మునుగోడు): ప్రస్తుతం బీరాలు పలుకుతున్న సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిపోనున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. యాదాద్రి భువనగికి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గ స్థానాలను టీఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తిరిగి మరోసారి టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, ఈ విషయాన్ని ఇప్పటికే జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం వెల్లడించాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లోపు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీరు అందిస్తామన్నారు. -
ఆ విషయం చెప్పినవారినే అడగండి: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని తాను ఎప్పుడు చెప్పలేదని, చెప్పినవారినే ఆ విషయం అడగాలని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. మీడియాతో ఆయన శుక్రవారం చిట్‌చాట్ చేశారు. ‘ అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదు. ప్రభుత్వం తమకు నచ్చిన అంశాలనే తీసుకొస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, ఇళ్ల నిర్మాణంపై చర్చకు వెనకాడుతోంది.’ అని జానారెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. కాగా ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఆ సమయంలో ఆయా అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు వివరంగా సమాధానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు, నకిలీ విత్తనాలు, కొత్త రహదారులు, ఇంటర్ విద్య, వ్యవసాయం, నూతన జిల్లా సముదాయాలు, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ వంటి అంశాలపై మంత్రులు సమాధానమిచ్చారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం పిటిషన్ అవర్ కొనసాగించారు. సభ్యులు లేవనెత్తిన పలు సమస్యలను సంబంధిత మంత్రులు నోట్ చేసుకుని పరిష్కరిస్తామని చెప్పారు. తదనంతరం సభకు 15 నిమిషాల పాటు టీ విరామం ఇచ్చారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో కేసీఆర్ కిట్లపై లఘు చర్చ చేపట్టారు. చర్చ అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి మధుసూదనాచారి ప్రకటించారు. -
విపక్ష సభ్యులంటే లెక్కలేదా?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో విపక్ష సభ్యులంటే లెక్కలేనట్లుగా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని విపక్ష నేత జానారెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష నేత వాదన ఏమిటో కూడా వినే పరిస్థితుల్లో అధికార సభ్యులు లేరని.. సభ జరుగుతున్న విధానం అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు. అందుకే అసెంబ్లీని ఒక రోజు బహిష్కరించామన్నారు. మంగళవారం అసెంబ్లీని బహిష్కరించిన అనంతరం జానారెడ్డి మీడియా పాయింట్లో మాట్లాడుతూ ‘‘ప్రజల ఆశలకు అనుగుణంగా టీఆర్ఎస్ పనిచేస్తుందనుకున్నాం. కానీ సభలో అధికార పార్టీకే ప్రాధాన్యం లభిస్తోంది. మేం చెప్పిన విషయాలు అధికార సభ్యులు వినాలి. కానీ మావైపు చూడటం లేదు. మైక్ ఇచ్చినా మాట్లాడేలోపే కట్ చేస్తున్నారు. సభ్యులను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు’’అని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గంటల తరబడి మాట్లాడితే గొప్పా అంటూ అధికార పార్టీ నేతలను నిలదీశారు. ప్రసార సాధనాలు ప్రభుత్వపక్షం తీరునే చూపిస్తున్నాయని, ప్రతిపక్షాల గొంతును వినిపించడం, చూపించడంలేదని.. ఈ అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం రాలేదన్నారు. బీఏసీ నిర్ణయానికి తాము కట్టుబడటం లేదన్న ప్రభుత్వ వాదన అవాస్తవమన్నారు. ‘‘అసలు వాయిదా తీర్మానానికి అర్థం ఉందా లేదా? బీఏసీలో జరిగింది వేరు... వాళ్లు చెబుతున్నది వేరు. ప్రశ్నోత్తరాల తర్వాతే వాయిదా తీర్మానాలని ఏకపక్షంగా నిర్ణయించారు. ఏకగ్రీవంగా అంగీకరించామని ఇప్పుడు హరీశ్ చెప్పడం సరికాదు. వాయిదా తీర్మానం రూల్‌లో ఉందా లేదా? ప్రజల తరఫున మాట్లాడేందుకు అవకాశం లేకపోతే ఎలా? స్పీకర్ స్పష్టత ఇవ్వకపోతే ఎవరిస్తారు..? సమస్యలు సభ ద్వారా పరిష్కారమవుతాయని ఎలా ఆశించాలి? అని జానారెడ్డి ప్రశ్నించారు. వాయిదా తీర్మానం అంటే అత్యవసర విషయంపై చర్చించడమేనని, సభలో కాంగ్రెస్ సభ్యుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అసెంబ్లీ పబ్లిక్ మీటింగ్ కాదు: భట్టి అసెంబ్లీలో ప్రతిపక్షం లేచి నిలబడితే మైక్ ఇవ్వడం సంప్రదాయమని, కానీ విపక్ష నేత లేచి పదేపదే మైక్ అడిగినా ఇవ్వకపోవడం సభా సంప్రదాయాలను తుంగలో తొక్కడమేనని ఎమ్మెల్యే భట్టి విక్రమార్క విమర్శిం చారు. రెండ్రోజులుగా ప్రతిపక్ష నేత మైక్ అడిగితే ఇవ్వటం లేదని.. ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు. ‘బీఏసీలో బిజినెస్ ఏమిటో తెలియదు. సమావేశంలో సభ్యులెవరూ లేకుండా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ పబ్లిక్ మీటింగ్ వేదిక కాదు.. చట్ట సభ అని గుర్తుంచుకోవాలి. సభలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు రాజ్యాంగం మాట్లాడే హక్కు కల్పించింది. నిబంధనలకు అనుగుణంగా స్పీకర్ వ్యవహరించడం లేదు. సభ్యులకు అగౌరవం ఎదురవుతోంది’’అని ఆందోళన వ్యక్తం చేశారు. -
సీఎం ఎవరు? బాహుబలి ఎవరు? కాంగ్రెస్ అద్వానీ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సీఎల్పీ నాయకుడు జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ అద్వానీలాంటివాడినని, ముఖ్యమంత్రి పదవిని అడగబోనని చెప్పారు. కానీ, అందరూ కోరితే సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధం అంటూ తన మనస్సులోని మాటను చెప్పకనే చెప్పేశారు. మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు గెలిపిస్తే.. వారే బాహబలి అని అన్నారు. పార్టీలో చేరగానే బాహుబలి కారంటూ పరోక్షంగా రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ బాహుబలి ఉన్నాడని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఆయన గట్టెక్కిస్తాడని హస్తం శ్రేణుల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా జానారెడ్డి విమర్శలు చేశారు. అసెంబ్లీలో సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, వాయిదా తీర్మానాలను తిరస్కరించాలని బీఏసీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. 'ప్రభుత్వం సభలో మా గొంతు నొక్కుతోంది. మీడియా కూడా ఆవేదనను ప్రజలకు తెలుపడం లేదు. ఇక మేం ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వంపై పోరాడుతాం' అని జానారెడ్డి అన్నారు. -
జానారెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారు
-
'జానారెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారు'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో మంగళవారం ఉదయం కాంగ్రెస్ వాయిదా తీర్మానంపై చర్చించాలని జానారెడ్డి చేసిన డిమాండ్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. కొంతమంది కాంగ్రెస్ సభ్యులు.. సీనియర్ సభ్యుడైన జానారెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఓవైసీ పేర్కొన్నారు. జానారెడ్డి వాకౌట్ చేస్తే మిగతా కాంగ్రెస్ సభ్యులు సభలో ఉంటున్నారని చెప్పారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. కాంగ్రెస్, టీడీపీ హయాంలో కొశ్చన్ అవర్ తర్వాతే వాయిదా తీర్మానాలను ఇవ్వాలని నాటి ముఖ్యమంత్రులు చెప్పిన విషయాన్ని ఓవైసీ గుర్తు చేశారు. వాయిదా తీర్మానాలు పెట్టేందుకు ఓ పద్ధతి ఉంటుందన్నారు. వాయిదా తీర్మానాలపై కాంగ్రెస్, బీజేపీ వైఖరి సరికాదన్నారు. ఈ మూడున్నరేండ్లలో ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానంపై చర్చించాలని కాంగ్రెస్ ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా డిమాండ్ చేయడమేంటని ఓవైసీ ప్రశ్నించారు. -
ఏం జరిగినా సర్కారుదే బాధ్యత!
-
ఏం జరిగినా సర్కారుదే బాధ్యత!
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తలపెట్టిన 'ఛలో అసెంబ్లీ'కి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ పార్టీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్ని నిర్బంధాలు విధించినా 'ఛలో అసెంబ్లీ' కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. 'ఛలో అసెంబ్లీ'కి వ్యతిరేకంగా మంత్రి హరీశ్‌రావు కుట్రపన్నారని, అందుకే 'ఛలో అసెంబ్లీ' సందర్భంగా ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా 'ఛలో అసెంబ్లీ' నిర్వహించి తీరుతామని, ఈ సందర్భంగా ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరడం తప్పా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ బయటకు వస్తే.. ఆయనకు రైతుల కష్టాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. 'ఛలో అసెంబ్లీ' విషయంలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు జానారెడ్డి మండిపడ్డారు. 'ఛలో అసెంబ్లీ'కి వచ్చేవారిని పోలీసులు ఎక్కడ ఆపితే.. అక్కడే నిరసన తెలుపాలని ఆయన పిలుపునిచ్చారు. రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజల సమస్యలను ఆందోళనల రూపంలో చెప్పడం తమ బాధ్యత అని, అందుకే 'ఛలో అసెంబ్లీ'కి పిలుపునిచ్చామని ఆయన అన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
జానారెడ్డిని ఎవరాపుతున్నారు: కొప్పుల
సాక్షి, హైదరాబాద్: ఎన్నో మాట్లాడాల్సి వస్తుందంటున్న జానారెడ్డిని ఎవరు ఆపుతున్నారని ప్రభుత్త చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. శాసన మండలి విప్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, నారదాసు లక్ష్మణ్‌రావులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జానారెడ్డి ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడాలన్నారు. టీఆర్ఎస్కు పెరుగుతున్న ప్రజాదరణను ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలంటే కేవలం ఎన్నికల పార్టీలుగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. సింగరేణి నుంచే ఎన్నికల పతనం ప్రారంభం అవుతుందని హెచ్చరించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సింగరేణి ఎన్నికలను టీడీపీ నేత రేవంత్ రెడ్డి వంటి వారు మలినం చేశారని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ కళ్లతో కోదండరాం చూస్తున్నారని, ఉన్న గౌరవాన్ని పోగొట్టుకున్నారన్నారు. నీతులు చెబుతున్న జానారెడ్డి తన పార్టీ నేతలకు బుద్ధి చెప్పాలన్నారు. -
అప్పట్లో నాతో మాట్లాడే సత్తా ఉండేదా నీకు?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి ఫైర్ అయ్యారు. విపక్షాలనుద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు అత్యంత హేయంగా, అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఆక్షేపించారు. ‘‘రాజకీయాలను ప్రజలు ఛీదరించుకుంటున్నారు. అబద్ధాలు మాట్లాడితే, ఆచరణసాధ్యం కాని విషయాలు చెబితే, ‘నువ్వేమన్నా కేసీఆర్వా?’అంటూ అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది. కేసీఆర్! ఇలా దిగిజారి మాట్లాడి ఇంకా ప్రజల అసహ్యానికి గురి కావొద్దు’అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనన్నారు. అధికారం శాశ్వతం కాదంటూ హితవు పలికారు. విర్రవీగి మాట్లాడొద్దని హెచ్చరించారు. ‘‘కోదండరాంను నమ్మడం వల్లే కాంగ్రెస్ పరిస్థితి ఇలా అయిందని కేసీఆర్ అంటున్నడు. కానీ నిజానికి కేసీఆర్‌ను నమ్మడం వల్లే మా పరిస్థితి ఇలా అయింది’’ అంటూ వ్యాఖ్యానించారు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో కలసి శనివారం జానా విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ మాటలు వింటుంటే కలతతో, కలవరపడి, భయపడి మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయన్నారు. మంచిచెడులను గమనించడానికి ప్రజలున్నారని, దేవుడున్నాడని హెచ్చరించారు. నిజానికి తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్‌కు తనతో మాట్లాడే సత్తా గానీ, శక్తి గానీ ఆనాడు లేవని జానా అన్నారు. ‘‘ఉద్యమ సందర్భంగా నాతో కేసీఆర్ ఏమేమి మాట్లాడినాడో చెప్పడానికి ఆత్మాభిమానం అడ్డొస్తున్నది. జేఏసీ ఏర్పాటు సందర్భంగా జరిగిన చర్చలను ప్రజలకు వివరించడానికి త్వరలోనే బహిరంగ లేఖ రాస్తా. అది చదివాక ఎవరెలాంటివారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. జేఏసీ ఏర్పాటు సమయంలో ఎవరేం మాట్లాడారో చెప్పాలనుకుంటే సీఎం కేసీఆర్, నేను బహిరంగంగా మాట్లాడుకుంటే అసలు విషయాలు అందరికీ తెలుస్తాయి’’ అని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిన నెహ్రూను, ఇందిరాగాంధీని, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని కేసీఆర్ తిట్టిన తీరును ప్రజలు గమనిస్తున్నారని జానా హెచ్చరించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నేతల గురించి హీనంగా మాట్లాడటం సరికాదన్నారు. జేఏసీ చైర్మన్‌గా కోదండరామ్ పేరును కేసీఆర్ ప్రతిపాదిస్తే తాను బలపర్చానని వెల్లడించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను కోదండరామ్ రాశారంటూ కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని, వీటిని ఖండిస్తున్నట్టుగా చెప్పారు. కోదండరామ్ ఎప్పుడూ కాంగ్రెస్‌కు అనుకూల వ్యక్తి కాడన్నారు. నీతిమాలినతనం నా జీవితంలో లేదు: జానా బ్లాక్ మెయిల్ రాజకీయాలు, నీతి మాలినమాటలు తన జీవితంలో లేవని జానా అన్నారు. ‘‘నేనెన్నడూ పదవుల కోసం పాకులాడలేదు. ఎవరినీ ఎమ్మెల్యే టికెట్ కూడా అడగలేదు. టీడీపీని వీడినప్పుడు పొలిట్‌బ్యూరోకు, శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశా. తెలంగాణ కోసమే వేదిక ఏర్పాటు చేశా తప్ప పదవుల కోసం కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కృషి వల్లనే తెలంగాణ వచ్చింది. మేం అప్పుడే రాజీనామా చేసి ఉంటే, తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదనే ఆలోచనకు మా అధిస్టానం వచ్చేది. కాంగ్రెస్‌లో ఉంటూ పోరాటం చేయడం వల్లే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, రాష్ట్రం వచ్చాక కూడా మేం అవమానాలను భరిస్తున్నాం’’అన్నారు. దీన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. సకల జనులు పోరాడి తెలంగాణ సాధించుకున్నారన్నారు. ‘‘ప్రజాస్వామ్యంలో చిల్లర పార్టీలే టోకు పార్టీలయిన సందర్భాలున్నాయి. టోకు పార్టీలు చిల్లర పార్టీలయిన సందర్భమూ ఉంది. టోకు పార్టీ అనుకుంటున్నప్పుడు చిల్లర మాటలు మాట్లాడకుంటే మంచిది’’అని సూచించారు. ఆ భాష మాకూ వచ్చు: భట్టి జానారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఉపసంహరించుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని మల్లు హెచ్చరించారు. ‘‘జానాను వాడు వీడంటూ మాట్లాడటం దుర్మార్గం. కేసీఆర్ భాష అందరికీ వచ్చు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి మంచిది కాదనే ఆగుతున్నాం. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తాం’’అని చెప్పారు. సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు గెలుపే కాదన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి, డబ్బు, వెండి గ్లాసులు పంచినా ఓట్ల తేడా కేవలం 4,000 మాత్రమేనన్నారు. జానారెడ్డిని పెద్దలు అంటూ సంబోధించిన కేసీఆర్ ఇప్పుడు దొంగ అంటున్నారంటే వినాశకాలే విపరీత బుద్ధి అని పొంగులేటి అన్నారు. కేసీఆర్ కులమే తెలంగాణ తెచ్చిందని మాట్లాడటం గర్వానికి, అహంకారానికి పరాకాష్ట అన్నారు. కోదండరాంపై, కాంగ్రెస్ నేతలపై నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్న కేసీఆర్ నమ్మకద్రోహి అని మాజీ ఎంపీ వి.హన్మంతరావు అన్నారు. ఉద్యమంలో కోదండరాంను వాడుకుని, ఇప్పుడు వాడువీడు అని తిట్టడం కేసీఆర్ ద్రోహానికి నిదర్శనం. సీఎం మాట్లాడాల్సిన భాష ఇదేనా? ఆయన మెదడు చెడినట్టుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ దొరేఅయితే దేశం కోసం సరిహద్దులో పోరాడేవాడు కాదు. కేసీఆర్‌వే దొర లక్షణాలు’’ అంటూ దుయ్యబట్టారు. -
కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి దుర్మార్గం
సీఎల్పీ నేత జానారెడ్డి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతిపక్షనేతల అభిప్రాయం చెప్పకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుకుని దాడులకు దిగడం దుర్మార్గమని కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన శాసన మండలి విపక్షనేత షబ్బీర్ అలీతో కలసి విలేక రులతో మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు కలసి దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. ఈ దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రాజెక్టులు నిర్మిం చాలా, వద్దా అని అధికారులు ప్రశ్న అడగడమే సరైందికాదని జానారెడ్డి అన్నారు. ప్రాజెక్టులు కట్టొద్దని ఎవరు అంటారు అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాలని, భూము లు కోల్పోతున్న నిర్వాసితులను ఆదుకోవాలని సూచించారు. ప్రాజెక్టులు కట్టొద్దనేది కాంగ్రెస్ పార్టీ అభిమతం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు అడ్డుపడుతోందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడం భావ్యంకాదన్నారు. భూముల సమగ్ర సర్వే విధివిధానాలను బయటపెడితే సమాచారం తెలుస్తుందన్నారు. భూ సమగ్ర సర్వేపై తాము కూడా నిర్మాణా త్మక సూచనలు చేస్తామన్నారు. భూముల సర్వేను శాస్త్రీయంగా నిర్వహిస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని జానారెడ్డి అన్నారు. పోలీసులకు బుద్ధి రాలేదు: షబ్బీర్ అలీ నేరెళ్ల సంఘటనతోనూ పోలీసులకు బుద్ధి రాలేదని, వ్యవస్థను కాపాడాల్సిన పోలీసులే చెడగొడుతున్నారని శాసనమండలి విపక్ష నాయకుడు షబ్బీర్ అలీ విమర్శించారు. పోలీసులను వాడుకుని ప్రజావ్యతిరేక నిర్ణయా లను అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్ని స్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణకు పోలీసు లను మోహరించి, ప్రజలను భయభ్రాం తులకు గురిచేస్తున్నదన్నారు. అనుభవరాహి త్యం, మొండితనంతో కేసీఆర్ పాలనకు ఎదు రుదెబ్బలు తగులుతున్నాయన్నారు. భూముల సర్వేను శాస్త్రీయంగా నిర్వహించాలన్నారు. ఇప్పుడు సంతోషంగానే ఉన్నా ఇప్పుడున్న పదవితో సంతోషం గానే ఉన్నానని సీఎల్పీనేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. గురు వారం సీఎల్పీ కార్యాలయంలో తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ ఏమోకానీ... బతికే తెలంగాణ ఉంటే చాలునని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే చెప్పానన్నారు. కాగా, పీసీసీ చీఫ్ పదవికోసం ఏనాడూ ప్రయత్నించలేదని, ఇప్పుడూ ప్రయత్నించడంలేదని అన్నారు. ‘సీఎల్పీ నేతగా ఉండి చేయలేనిది పీసీసీ అధ్యక్షుడిని అయ్యి ఏంచేస్తా ?’ అని ప్రశ్నించారు. అందరి అభిప్రా యంతోనే పీసీసీ పనిచేస్తుందన్నారు. ఏ పార్టీలో అయినా కొంతమంది నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉం టాయన్నారు. ఇప్పటిదాకా అధిష్టా నాన్ని ఏ పదవీ అడగలేదన్నారు. అధిష్టానం ఏ బాధ్యతలను అప్పగిం చినా నిర్వహిస్తూ వచ్చానని జానారెడ్డి పేర్కొన్నారు. -
టీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు: జానారెడ్డి
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణలో అభిప్రాయం చెప్పకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని సీఎల్పీ నేత జానా రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి, టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. అభిప్రాయం చెప్పకూడదని అధికార పార్టీ భావించడం అప్రజాస్వామికమన్నారు. ప్రాజెక్టు కట్టలా.. వద్దా అని అధికారులు ప్రశ్న అడగటం సరి కాదన్నారు. ప్రాజెక్టులు కట్టొద్దు అనేది కాంగ్రెస్ అభిమతం కాదని, కాంగ్రెస్ పార్టీయే ప్రాజెక్టులకు అడ్డుపడుతోందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడం భావ్యం కాదని చెప్పారు. -
కేసీఆర్ భాష అభ్యంతరకరం: జానారెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ నేతలు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన గురువారం తెలంగాణ సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ప్రభుత్వ వ్యవహారం అరాచకంగా ఉంది. కేసీఆర్ మాటలు టీఆర్ఎస్కే వర్తిస్తాయి. ఆయన వ్యాఖ్యలను చాలా తీవ్రంగా తీసుకుంటున్నాం. ప్రతిపక్ష పార్టీగా చాలా సంయమనంగా ఉన్నాం. సీఎం పదజాలాన్ని తీవ్రస్థాయిలో ఖండించాల్సిన అవసరం ఉంది. ఇష్టానుసారంగా పాలన చేస్తానంటే ఎలా?. తప్పు కాంగ్రెస్‌పై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మాపై నిందలు వేస్తున్నారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కోర్టులకు వెళ్లేవారితో కాంగ్రెస్‌కు సంబంధం లేదు. కడుపు మండినవాళ్లే కోర్టుకు వెళుతున్నారు. గతంలో జాగృతిలో పనిచేసినవారే కోర్టులో కేసు వేశారు. అసంబద్ధ నిర్ణయాలు కోర్టులో నిలబడటం లేదు. రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ సహకరిస్తుంది. సింగరేణి కారుణ్య నియామకాలపై అసెంబ్లీలో మద్దతు ఇచ్చాం.’ అని గుర్తు చేశారు. కాగా అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ చేపట్టిన ప్రజాసంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి తమకు పుట్టగతులుండవనే భయంతో కాంగ్రెస్ కేసుల పురాణం మొదలు పెట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రజల పాలిట కాంగ్రెస్ పిశాచిలా, భూతంలా తయారైందని నిప్పులు చెరిగారు. కొత్త రాష్ట్రాన్ని గొంతు నులిమేసేందుకు విషపూరిత వైఖరిని అవలంబిస్తోందని, తెలంగాణకు అప్పుడూ ఇప్పుడూ విలన్ నంబర్ వన్ కాంగ్రెస్సేనని దుయ్యబట్టారు. కేసుల రూపంలో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు ఆ పార్టీ శిఖండి పాత్ర పోషిస్తోందని అన్నారు. -
ఉత్తమ్ x జానా
పీసీసీ పీఠం కోసం పోటాపోటీ.. ‘చీఫ్’గా ఉండటమే ‘ముఖ్య’0 - సన్నిహితులతో జానా వ్యాఖ్యలు.. ఢిల్లీ పెద్దలతో జోరుగా భేటీలు - జానా ఎత్తులకు ఉత్తమ్ పైఎత్తులు.. శ్రేణులు, నేతలతో మంతనాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సారథ్య పదవి చేజిక్కించుకునే దిశగా పార్టీ శాసనసభాపక్ష నాయకుడు కుందూరు జానారెడ్డి పావులు కదుపుతున్నారు. ఆయన ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కలిసి తన మనోగతాన్ని వెల్లడించినట్టు సన్నిహితులు, ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు కూడా లేనందున, పార్టీ నాయకత్వ స్థానంలో ఉంటేనే అనంతరం ‘ముఖ్య’పదవి చేజిక్కుతుందన్న యోచనతో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా జానాకు దీటుగా పై ఎత్తులు వేస్తున్నట్టు చెబుతున్నారు. తన సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లేలా ఆయనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు అగ్ర నేతల తెర వెనక పోరు రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చనీయంగా, ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ స్థాయిలో వ్యూహాలు సీఎల్పీ నేతగా కంటే పీసీసీ సారథిగా ఉంటేనే పార్టీపై పట్టు చిక్కుతుందన్నది జానా అభిమతంగా తెలుస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ పెద్దలతో ఆయన ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారని తెలిసింది. మండలిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేతతో కలిసి ఇప్పటికే అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్ తదితరులతో జానా సమావేశమైనట్టు సమాచారం. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కూడా జానా కలిశారని ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా అన్ని కీలక శాఖలకూ జానా మంత్రిగా పని చేయడం తెలిసిందే. కాబట్టి సీఎం మినహా మరే పదవైనా తనకు చిన్నదేననే భావనలో ఆయన ఉన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు బహిరంగంగానే వెల్లడించారు కూడా. అందుకే ఇప్పుడే పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టి అధికారంలోకి తేగలిగితే తన చిరకాల వాంఛ నెరవేరుతుందన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. ఉత్తమ్ పై ఎత్తులు మరోవైపు జానా వ్యూహాలను పసిగట్టిన ఉత్తమ్, ప్రతి వ్యూహాల్లో తలమునకలుగా ఉన్నారు. పార్టీపై క్రమంగా పట్టును పెంచుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీలో ప్రభావం చూపగలిగే ముఖ్య నేతలతో ఉత్తమ్వ్యక్తిగతంగా భేటీ అవుతున్నారు. పార్టీలో తనను వ్యతిరేకిస్తున్న వారి విషయంలోనూ కాఠిన్యానికి పోకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వీటికి తోడు రాష్ట్రంలో విస్తృత పర్యటనలకు తెర తీశారు. రాష్ట్ర స్థాయిలోనూ పార్టీ కార్యక్రమాలు పెరిగాయనే సంకేతాన్ని పీసీసీ శ్రేణులకు పంపి వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా సభలు తదితరాల్లో విరివిగా పాల్గొంటున్నారు. మరోవైపు ఢిల్లీలో తనకున్న పరిచయాలు, సన్నిహిత సంబంధాలను కాపాడుకుంటూ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్‌లను మెప్పిస్తూ సాగే వ్యూహంతో వ్యవహరిస్తున్నారు. ‘‘ఈ ఎత్తుగడల్లో ఉత్తమ్ ఇప్పటికే ముందున్నారు. ఇటీవలి సంగారెడ్డి సభలో రాహుల్ కూడా ‘ఉత్తమ్ నాయకత్వంలో గ్రామగ్రామానికి వెళ్లండి’అని తన ప్రసంగంలో శ్రేణులకు స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. తద్వారా రాష్ట్రం లో ఆయన నేతృత్వంలోనే వచ్చే ఎన్నికలకు పార్టీ సిద్ధమవా లనే సందేశాన్ని రాహుల్ నోటే అందరికీ ఇప్పించినట్టయింది’’అని పీసీసీ సీనియర్లు కొందరు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర పార్టీలో ఉత్తమ్‌ను తమకు, పార్టీకి అత్యంత విశ్వసనీయ, నమ్మకమైన వ్యక్తిగా గాంధీ కుటుంబం కూడా భావిస్తోందని ఢిల్లీ పెద్దలతో సన్నిహిత సంబంధమున్న నాయకుడొకరు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జానా ఎత్తుగడలెలా ఉంటాయోనని పీసీసీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. -
‘తూతూగానా?.. మాట్లాడే చాన్స్ ఇవ్వరా!’
హైదరాబాద్: తూతూ మంత్రంగా తెలంగాణ రాష్ట్ర భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఆమోదించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రతిపక్షనాయకుడు జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. మిర్చీ రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టదా అని జనారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర భూసేకరణ చట్ట సవరణపై ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అయింది. పది నిమిషాల్లోనే బిల్లుపై చర్చ జరగకుండానే బిల్లుకు ఆమోదం తెలిపి సభను నిరవధిక వాయిదా వేసింది. దీంతో ప్రతిపక్ష పార్టీ నేతలు జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీజేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులు స్పందించారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలను సీఎం చిన్నగా చేసి మాట్లాడుతున్నారని అన్నారు. మూడేళ్లలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు దారుణంగా పడిపోయాయని చెప్పారు. రూ.1000కోట్లు కేటాయించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భూసేకరణ చట్టం సవరణ బిల్లుపై తమ పోరాటం ఆగదని చెప్పారు. త్వరలో రాష్ట్రపతిని కలిసి బిల్లును ఆమోదించొద్దని రాష్ట్రపతిని కోరతామన్నారు. అలాగే, కోదండరాం మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టాన్ని యధావిధిగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. సవరణ బిల్లును కేంద్రం ఆమోదించకూడదని కోరారు. త్వరలో భూ నిర్వాసితులను కలుస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
బాహుబలులు అధికారంలోకి రారు
హైదరాబాద్: బాహుబలి సినిమా పేరు ప్రస్తావించే వారు సినిమాలకో, కుస్తీపోటీలకు పొతే మంచిదని కాంగ్రెస్ నేత మల్లు రవి సలహా ఇచ్చారు. అసెంబ్లీలో జానారెడ్డి చేసిన బాహుబలి కామెంట్లపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ కుస్తీపోటీల పార్టీ కాదని అన్నారు. రాజకీయాల్లో బాహుబలికి స్థానం లేదని తెలిపారు. రాజకీయాలంటే సినిమాలు కాదని, రాజకీయాల్లో బాహుబలులు ఉండరు అని తెలిపారు. ‘నెహ్రూ ..ఇందిర.. వైఎస్’లు బాహుబలులు కారని అన్నారు. సామాన్యప్రజల మద్దతు కూడగట్టడం ద్వారానే అధికారంలోకి వస్తారుని తెలిపారు. బాహుబలులు అయితే అధికారంలోకి రారని జానారెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్‌లో ‘బాహుబలి’ రచ్చ!
-
కాంగ్రెస్‌లో ‘బాహుబలి’ రచ్చ!
- పార్టీలో సమర్థులు లేరని జానారెడ్డి చెప్తారా..? - సీనియర్లలో అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను ఓడించడానికి బాహుబలి వస్తాడని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సద్దుమణిగినా ఆ పార్టీలో అంతర్గతంగా రగులుతున్నట్టుగానే కనిపిస్తోంది. టీఆర్ఎస్ బలంగా ఉన్నట్టు, కేసీఆర్‌ను ఓడించడానికి బయటనుంచి ఎవరో రావాలన్నట్టుగా జానారెడ్డి మాట్లాడారని పలువురు సీనియర్లు అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అగ్రనేతగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న జానా స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ శ్రేణుల మనో స్థైర్యాన్ని దెబ్బతీయదా అని ప్రశ్నిస్తున్నారు. ‘తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కి, రాష్ట్ర ఏర్పాటు సమయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చూపించిన పట్టు దల, చిత్తశుద్ధిపై తెలంగాణవాదుల్లో, ముఖ్యంగా యువతలో సానుకూల దృక్పథం ఉందని వారు అన్నారు. కాంగ్రెస్ పట్ల ఉన్న అనుకూలతను వచ్చే ఎన్నికల్లో వినియోగించుకుని, పార్టీకి పూర్వవైభ వం తీసుకురావాల్సిన బాధ్యత ఉన్న నాయకుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ‘పార్టీలో సమర్థులు లేరన్నట్టుగా, బయట పార్టీల నుంచి వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీని కాపాడలేరని అన్నట్టుగా కీలక నాయకుడు మాట్లాడటం తప్పు డు సంకేతాలను పంపించదా’ అని పార్టీ సీనియర్ నాయకుడొకరు ప్రశ్నించారు. ‘శాసనసభలో కేసీఆర్‌ను ఎదిరించే బాహుబలి లేరేమోకానీ, టీపీసీసీలో చాలామంది బాహుబలిలు ఉన్నారు’ అని టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. అధిష్టానానికి ఫిర్యాదు.. ఆరా.. అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన జానాపై చర్యలు తీసు కోవాలని పార్టీలోని కొందరు సీనియర్లు అధిష్టా నానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. దీనిపై అధిష్టానం కూడా ఆరా తీస్తున్నట్టుగా టీపీసీసీ నాయకుడొకరు చెప్పారు. జానా వ్యాఖ్యలు.. దాని వెనుకనున్న ఉద్దేశమేమిటనేది అధిష్టానంలో ని ముఖ్యులు కొందరు ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది. -
తెలంగాణ బాహుబలి కేసీఆరే: కవిత
కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే బాహుబలులు కావాలేమో గానీ.. తెలంగాణకు, టీఆర్ఎస్కు తమ ముఖ్యమంత్రి కేసీఆరే అసలైన బాహుబలి అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఎప్పుడో వచ్చే బాహుబలి కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తోందని, తమవద్ద బాహుబలి ఎప్పటినుంచో ఉన్నారని ఆమె అన్నారు. టీఆర్ఎస్ను ఓడించడానికి, కేసీ ఆర్‌ను ఎన్నికల్లో కొట్టడానికి రాష్ట్రంలోనూ ఒక బాహుబలి వస్తాడేమోనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నేత జానారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే.. జానారెడ్డే తమ బాహుబలి కావచ్చని నల్లగొండ జిల్లాకే చెందిన మరో సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజలకు బాహుబలి మానియా పట్టిందని జానారెడ్డి కూడా బాహుబలి గురించి మాట్లాడి ఉంటారని అన్నారు. ఆ బాహుబలి జానారెడ్డే కావొచ్చు, మరెవరైనా కావొచ్చునని చెప్పారు. -
మమ్మల్ని గెలిపించడానికి బాహుబలి వస్తాడు
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి బాహుబలి వస్తాడని ప్రతిపక్ష నేత కే జానారెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ నాశనమవుతుందని, ఆయన ఐరన్ లెగ్ అని వస్తున్న విమర్శలపై జానారెడ్డి స్పందిస్తూ.. రాహుల్ ఐరన్ లెగ్గో కాదో తర్వాత తేలుతుందని అన్నారు. ఆదర్శ రాజకీయాలకు తాను విత్తనం లాంటోడినని చెప్పారు. ఇక నుంచి తాను అసెంబ్లీలో బడ్జెట్‌పై మాట్లాడనని, ఎన్నిసార్లు చెప్పినా అవే లెక్కలు, అవే తప్పులని విమర్శించారు. వచ్చే ఏడాది అసెంబ్లీలో బడ్జెట్‌పై మాట్లాడేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలకు అవకాశమిస్తానని జానారెడ్డి చెప్పారు. -
అంకెల రంకెలు మనకే చేటు: జానారెడ్డి
-
అంకెల రంకెలు మనకే చేటు: జానారెడ్డి
⇒ బడ్జెట్ గణాంకాలు సప్త సముద్రాలు దాటుతున్నా అభివృద్ధి ఏది? ⇒ ఆశల పల్లకిలో ఊరేగించారు.. భ్రమింపజేసే బడ్జెట్ ఇది వాస్తవికతకు దూరంగా ఉంది.. ⇒ గతబడ్జెట్ అసలు లెక్కలు మరిచిపోయారా? ⇒ లోటును దాచి లేని మిగులు చూపితే కేంద్రం నుంచి మనకే నిధులు తగ్గుతాయి ⇒ వ్యవసాయం గొప్పగా ఉంటే ఆహారధాన్యాల ఉత్పత్తి ఎందుకు తగ్గింది? సాక్షి, హైదరాబాద్: ‘‘నైరాశ్యం నుంచి ఆశావహం వైపు పయనం సాగిస్తున్నామని బడ్జెట్లో పేర్కొన్నారు. నిజమే.. ప్రజలకు ఆశలు కల్పించేలా అంకెలు చూపారు. అభివృద్ధి ఎల్లలు దాటుతోందని చెప్పారు. బడ్జెట్ గణాంకాలు సప్త సముద్రాలు దాటుతున్నాయి.. మరి నిజమైన అభివృద్ధి ఎటుపోయింది? ఏ రాష్ట్రంలో కూడా బడ్జెట్ అంకెల పెరుగుదల రేటు ఇంతగా లేదు. ప్రజలను గొప్ప ప్రగతి అంటూ భ్రమింపజేసే ప్రయత్నం భేషుగ్గా జరిగింది. ఆశల పల్లకిలో ఊరేగించేశారు. ఏ రకంగానూ ఇది వాస్తవిక బడ్జెట్ కాదు..’’అని ప్రతిపక్ష నేత జానారెడ్డి దుయ్యబట్టారు. ఆర్భాటాలకు పోయి ప్రభుత్వం బడ్జెట్ గణాంకాలను భారీగా చూపి తుదకు రాష్ట్రానికి భారీ నష్టాన్ని తేబోందని హెచ్చరించారు. లోటు కనపడకుండా అంకెల్లో మిగులును చూపి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు మోకాలొడ్డి రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకంగా మారుతోందంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా అసెంబ్లీలో గురువారం ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో అనుమానాలుంటే నివృత్తి చేయాలి తప్ప వాటిని కొట్టిపడేయొద్దని, తాము అలా కొట్టేశాం కాబట్టే మమ్మల్ని ఇలా కొట్టిపడేశారని వ్యాఖ్యానించారు. లోటు ఉంటే మిగులు ఎలా చూపుతారు? వ్యవసాయం గొప్పగా ఉందంటున్న ప్రభుత్వం ఈ లెక్కలకు సమాధానం చెప్పాలంటూ జానారెడ్డి కొన్ని గణాంకాలను సభ ముందుంచారు. 2013–14లో ఆహారధాన్యాల ఉత్పత్తి 107 లక్షల టన్నులుంటే తదుపరి రెండు సంవత్సరాల్లో వరుసగా 72 లక్షల టన్నులు, 51 లక్షల టన్నులకు పడిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ‘‘2015–16 కాగ్ ఆడిట్ నివేదికలో.. రెవెన్యూ రాబడి రూ.73 వేల కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.77 వేల కోట్లుగా ఉంది. ఆ నివేదిక రూ.4 వేల కోట్ల లోటు చూపిస్తుంటే మీ లెక్కలు మాత్రం మిగులును చూపుతున్నాయి, అభివృద్ధి ఎల్లలు దాటిందంటే ఇదేనా?’’అని జానారెడ్డి ప్రశ్నించారు. ‘‘గత బడ్జెట్లో పన్నుల ఆదాయం రూ.46 వేల కోట్లకు మించదు అని నేను చెప్పా.. సవరించిన అంచనాలు దాన్ని దాదాపు నిజం చేసిన మాట మరిచారా? ఈసారి రూ.62 వేల కోట్లు అంటున్నారు. అది రూ.52 వేల కోట్లను మించదు. వివిధ ఆదాయాల్లో దాదాపు రూ.25 వేల కోట్ల మేర తగ్గుదల ఉండబోతోంది. అలాంటపుపడు బడ్జెట్‌ను రూ.1.49 లక్షల కోట్లుగా ఎలా చూపుతారు?’’అని ప్రశ్నించారు. గత బడ్జెట్ రూ.1.30 లక్షల కోట్లుగా చూపి సవరణలో రూ.1.12 లక్షల కోట్లుగా చూపారని, అందులోనూ మరో రూ.10 వేల కోట్ల తేడా ఉండబోతోందన్నారు. దీన్ని చూసైనా వాస్తవ అంకెలు పేర్కొనాల్సిందని అభిప్రాయపడ్డారు. సంక్షోభంలో వ్యవసాయం.. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జానారెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీలో జాప్యంతో, అప్పులు దొరక్క అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని, పావలా వడ్డీ సకాలంలో చెల్లించటం లేదని, బడ్జెట్లో వ్యవసాయ కేటాయింపులు తగ్గాయని.. ఇవన్నీ వ్యవసాయ సంక్షోభాన్ని సూచించటం లేదా అని ప్రశ్నించారు. కరెంటు కొనుగోలు, ఇతర అంశాల్లో ప్రభుత్వ నిర్వాకం భవిష్యత్‌లో తీవ్ర సంక్షోభానికి కారణమవుతుందన్నారు. ఇప్పుడు కోతలు లేవని సంబరపడ్డా భవిష్యత్‌లో వాతలు తప్పవని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్ కరెంటు విషయంలో ప్రణాళిక లేకుండా వ్యవహరించి ఖజానాపై తీవ్ర భారం మోపబోతున్నారన్నారు. ఈఆర్సీ ధర నిర్ణయించకుండానే కరెంటు తీసుకుంటున్నారని, ఛత్తీస్‌గఢ్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ప్రకారం మెగావాట్‌కు రూ.9 కోట్లు ఖర్చవుతుందని, కొనే కరెంటుకు ఆ మేరకు ధర నిర్ణయిస్తే భారీగా భారం పడుతుందన్నారు. మహేశ్వరం కారిడార్ సిద్ధం కాకుండానే కరెంటును బుక్ చేసుకోవటం వల్ల ఏప్రిల్ నుంచి పవర్ వాడినా వాడకున్నా వపర్ గ్రిడ్‌కు సరఫరా ఖర్చు కింద యూనిట్‌కు 45 పైసలు, ఛత్తీస్‌గఢ్‌కు ఫిక్స్డ్ కాస్ట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. టీఎస్ఐపాస్తో భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతున్నా... కొత్తగా ఉపాధి పొందినవారి సంఖ్య నిరాశాజనకంగా ఉందని విమర్శించారు. ఈ విషయాన్ని సామాజిక, ఆర్థిక సర్వే కూడా స్పష్టం చేసిందన్నారు. జానా మాటల్లో కొన్ని విరుపులు.. – ప్రభుత్వం తీరును నిలదీస్తే విమర్శలంటూ ఎదురుదాడి చేస్తున్నారు. కానీ సభలో నేను సరిగా మాట్లాడకుంటే పాలక పక్షంతో కుమ్మక్కయ్యారా అని ప్రజలు నన్ను అడుగుతారు. – మీలాగా మేం కూడా కొన్ని ఆర్భాటపు ప్రకటనలు చేశాం. అవి తప్పని తెలుసుకుని తేరుకునే సరికి ఇక్కడొచ్చి కూర్చోవాల్సి వచ్చింది. – అధికారంలోకి వచ్చాక ఇక ధర్నాలు లేవంటున్నారు. కానీ రాష్ట్రంలో యువత ఇప్పుడు తీవ్ర నైరాశ్యంలో ఉంది. తెలంగాణ రావటానికి ఉద్యమంలో ముందుండి నిలబడింది ఆ యువతేనన్న విషయాన్ని పాలకపక్షం మరిచిపోయినట్టుంది. ధర్నాలే లేవంటూ.. అసలు ధర్నాలకు అవకాశం లేకుండా ధర్నా చౌక్‌ను తొలగిస్తున్నారు. -
కేసీఆర్ మార్కులు పట్టించుకోను: జానారెడ్డి
తాను అస్సలు సర్వేలు నమ్మబోనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ప్రజల తీర్పునే తాను నమ్ముతానని ఆయన చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన మార్కులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన సరదాగ సీఎల్పీలో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి చేయించిన సర్వేలపై జానారెడ్డిని ప్రశ్నించగా తాను కేసీఆర్ సర్వేలు పట్టించుకోనని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న దుబారాలో ఇదొకటి అని, అసలు ప్రభుత్వ సొమ్ముతో ఇలా సర్వేలు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలే తీర్పే ఫైనల్ అని చెప్పారు. ఈ రోజుల్లో మీడియా కూడా సరిగా సర్వేలు చేయలేకపోతోందని చెప్పిన జానా.. తాను ఓడిపోతానని ఎన్నోసార్లు సర్వేల పేరిట కథనాలు రాశారని గుర్తు చేశారు. తాను సర్వేలపై ఆధారపడే మనిషిని కాదని జానా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ పార్టీతోనూ తమకు అవగాహన లేదని చెప్పారు. ‘ఇతర పార్టీలతో అవగాహనలన్నీ ఎన్నికల ముందు ఉండే తతంగాలు. నేను సీఎం అని పదిమందితో అనిపించుకుంటాను. అంత మాత్రాన అవుతామా? ఎవరో అనగానే సీఎం అయిపోతామని నేను భ్రమించను. అభిమానంతో వాళ్ల అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. అర్హత ఉందని నేను అనుకుంటా. అంత మాత్రాన అయిపోతామని కాదు. రకరకాల కారణాలతో నిర్ణయాలు ఉంటాయి. సీఎం అవుతానని నేనెప్పుడు చెప్పలేదు. హిందీ నేర్చుకుంటుంటే కూడా రకరకాల ప్రచారం చేశారు’ అని జానారెడ్డి చెప్పారు. -
‘కేసీఆర్ తుగ్లక్‌లా చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ తుగ్లక్ పనులు చేసి చాలా గొప్పగా చేశానంటూ చెప్పుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. గవర్నర్‌తో రాజకీయ ప్రసంగం చదివించారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో స్పష్టత లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా మీడియా వద్ద టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి తదితరులు మాట్లాడారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఏం మాట్లాడారంటే.. ..‘తెలంగాణ ఏర్పడిన తర్వాత గవర్నర్‌ది నాలుగో ప్రసంగం. సాధారణంగా గవర్నర్ ప్రభుత్వ కేబినెట్ ఏది రాసిస్తే అదే చదువుతారు. నేటి ప్రసంగంలో ప్రధాన అంశాలు మాత్రం ఇందులో లేవు. గతంలో ప్రకటించిన పథకాలపై నిర్ధిష్టమైన ప్రణాళిక లేదు. గవర్నర్ చేత పలు చోట్ల అబద్ధాలు చెప్పించారు. పవర్ సప్లయ్ విషయంలో కాంగ్రెస్ హయాంలో పూర్తయినవి తప్ప వీళ్లు మొదలుపెట్టిన ప్రాజెక్టులతో ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. అందించలేదు. వేరే రాష్ట్రాల నుంచి విద్యుత్ తీసుకొచ్చే పనులు కూడా గత ప్రభుత్వమే మొదలుపెట్టింది. ఏదో అద్భుతం చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. పరిశ్రమలు వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పించారు. తెలంగాణ రాష్ట్రంలోకి పెట్టుబడులు తక్కువగా వస్తున్నాయని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వెబ్ సైట్ ఇచ్చిన నివేదిక 2017 తెలిపింది. 31 జిల్లాల గురించి గొప్ప చేసినట్లు చెబుతున్నారు. అన్ని తుగ్లక్ పనులు చేసి గొప్ప పనులని కేసీఆర్ అంటున్నారు. జిల్లాల విభజనలో ప్రజల మనోభవాలు పట్టించుకోలేదు. జీడీపీ గ్రోత్ రేట్ పెరిగిందని చెప్పారు.. దానిపై అనుమానం ఉంది. రబీలో తెలంగాణ రైతు బ్రహ్మాండంగా చేశారని కేసీఆర్ అంటున్నారు. కానీ, ఏది నిజమో రైతులకు తెలుసు. పంటపండింది తక్కువ చెప్పుకుంటుంది ఎక్కువ. వాస్తవానికి తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ముస్లింలు, గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న 12శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వలేదు’ . జానారెడ్డి ఏం మాట్లాడారంటే.. ‘ప్రభుత్వ విధివిధానాలను వివరించే విషయంలో ముఖ్యంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు.. మూడెకరాల భూమి, 12శాతం మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు, సబ్ ప్లాన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ స్పీచ్ చాలా బాధా కలిగించింది. డబుల్ బెడ్రూం, మూడు ఎకరాల భూమిపై ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేం కూడా కొత్త ప్రభుత్వం అని సహకరించాం. వారు చేసిన తప్పిదాన్ని వారికి తెలియజేసేందుకే మేం వాకౌట్ చేశాం’ అని అన్నారు. -
జానారెడ్డి ఇంటి వద్ద మాలమహానాడు ధర్నా
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కుందూరు జానారెడ్డి ఇంటి ఎదుట మాలమహానాడు కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రతిపక్ష నాయకులు, విపక్ష నాయకులు అసెంబ్లీలో మాట్లాడటంతో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఇదే క్రమంలో శుక్రవారం కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇంటిని ముట్టడించారు. ఎస్సీ వర్గీకరణకు ఒప్పుకుంటే నాయకులు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు. ధర్నాకు దిగిన మాలమహానాడు కార్యకర్తలను పోలీసులు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రేపు బీజీపే శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేస్తామని మాలమహానాడు కార్యకర్తలు తెలిపారు. -
పార్టీ ఫిరాయింపులపై మళ్లీ హాట్ హాట్ గా చర్చ
-
పార్టీ ఫిరాయింపులపై మళ్లీ హాట్ హాట్ గా చర్చ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో టీ-పాస్ చర్చ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై మరోసారి వాడివేడిగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్‌కు స్పీకర్ మైక్ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ పక్ష ఉపనేత జీవన్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. పార్టీ మారిన వ్యక్తికి కాంగ్రెస్ తరఫున మాట్లాడే అవకాశం ఎలా ఇస్తారని నిలదీశారు. పువ్వాడ అజయ్ ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ శాసనసభ సభ్యుడిగా అజయ్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలపగా, మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్ స్పీకర్ వ్యాఖ్యలను సమర్థించారు. స్పీకర్ అధికారాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. 2004-14 వరకూ ఫిరాయింపులపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభాపక్షనేత జానారెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ వాళ్లకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ పార్టీ వాళ్లే మాట్లాడాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా సభ జరిగితే ప్రశ్నిస్తామని అన్నారు. అధికారం ఉందికదా అని ఏమైనా చేస్తామనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు. సభ్యులను స్పీకర్ కంట్రోల్ చేయాలని అన్నారు. మరోవైపు పువ్వాడ అజయ్ మాట్లాడుతూ సభ్యుడిగా తన హక్కులను కాలరాయడం సరికాదన్నారు. తాను మాట్లాడే అవకాశం అడిగితే స్పీకర్ అనుమతి ఇచ్చారని, ఇందులో తప్పుపట్టాల్సిందేమీ లేదన్నారు. -
టీఆర్ఎస్ను తిట్టారా? పొగిడారా?..
హైదరాబాద్ : తరచుగా సొంత పార్టీని ఇరుకున పెట్టేలా అధికార టిఆర్ఎస్కు అనుకూలించేలా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డి మరోసారి పరోక్షంగా అలాంటి వ్యాఖ్యలే చేశారు. శనివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జిల్లాల పునర్ వ్యవస్ధీకరణపై కాంగ్రెస్ నేతలు డీకె అరుణ, పొన్నాల లక్ష్మయ్య, సంపత్ కుమార్ చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా జానారెడ్డి ప్రసంగించారు. అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించలేక టీఆర్ఎస్ సర్కార్ కొత్త జిల్లాల పేరుతో సెంటిమెంట్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ప్రజాభిప్రాయం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇంత వరకు బాగానే ఉంది... కానీ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా తీరును ప్రజలు వ్యతిరేకించకుండా ఇంకా సీఎం కేసీఆర్ హామీల అమలుపై ఆశతో ఉన్నారని కూడా జానా వ్యాఖ్యానించారు. ఐదు లక్షల ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నా లబ్ధిదారులు కేసిఆర్ సర్కార్ ప్రశ్నించడం లేదని... అయితే కాంగ్రెస్ నేతలం మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని అన్నారు. జానారెడ్డి ఎవరికి అనుకూలంగా, ఎవరికి ప్రతికూలంగా మాట్లాడారనేది అక్కడున్న కొంతమందికి అర్థం కాలేదట. దీంతో సొంతపార్టీలోనే జానా వైఖరి ఏమిటో తెలియక అయోమయం నెలకొంది.ఇంతకీ జానారెడ్డి టీఆర్ఎస్ను తిట్టారా? పొడిగారా? -
టీఆర్ఎస్కు అనుకూలంగా జానా..!
హైదరాబాద్: పార్టీ శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డి తీరుపై టీ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరుపై ఏకంగా పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసే యోచనలో వారు ఉన్నారు. గోదావరి నదిపై ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో గతంలో ఎలాంటి ఒప్పందం జరగలేదంటూ జానారెడ్డి టీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడటమే ఇందుకు కారణం. జానా తీరుతో కాంగ్రెస్ ఇమేజ్ దెబ్బతింటుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు మాట్లాడారంటూ జానాకు పలువురు టీ కాంగ్రెస్ నేతలు ఫోన్ చేసి అడిగినట్లు సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రూ.5 భోజనాన్ని గతంలో జానారెడ్డి మెచ్చుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన పలుసార్లు కేసీఆర్ సర్కార్ కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో సొంతపార్టీలోనే జానా వైఖరి ఏమిటో తెలియక అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో జానారెడ్డి తీరుతో పార్టీకి నష్టం జరుగుతున్నదంటూ.. ఇక ఆయన ధోరణిని సహించేది లేదని, ఆయనపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ ముఖ్యలు కాంగ్రెస్ ముఖ్యలు భావిస్తున్నట్టు సమాచారం. -
‘ఊత పదాలు కాదు...హుందాగా వ్యవహరించాలి’
హైదరాబాద్ : ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో టీఆర్ఎస్ సర్కారు ప్రతిపక్ష కాంగ్రెస్‌ను విమర్శించడాన్ని తెలంగాణ శాసనసభాపక్ష నేత జానారెడ్డి తప్పుపట్టారు. ప్రశ్నిస్తే జైలుకు పంపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం సరికాదని ఆయన అన్నారు. జానారెడ్డి గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని ఆయన అన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలని తాను ఇరిగేషన్ మంత్రికి, కార్యదర్శికి లేఖ రాస్తే ఇప్పటి వరకూ సమాధానం లేదన్నారు. రెండేళ్లలో రెండు పంటలకు నీరిస్తామని చెప్పిన కేసీఆర్ అది చేసి చూపించగలరా అని ప్రశ్నించారు. అంచనాలు పెంచి ప్రాజెక్టులు కట్టిస్తున్న టీఆర్ఎస్ సర్కారు తీరును ప్రజలు గమనిస్తున్నారని.. సరైన సమయంలో బుద్ధి చెబుతారని జానారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రాజెక్టుల రీ డిజైన్ వల్ల రాష్ట్రంపై 50 నుంచి 60వేల కోట్ల భారం పడుతుందన్నారు. గతంలో తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టును తాము ప్రతిపాదించామన్నారు. తమ ప్రతిపాదనను మహారాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తామందని, ఆ ప్రతిపాదనపై కేసీఆర్ చర్చించకుండా 148 అడుగులకు ఒప్పందం కుదుర్చుకోవడం చారిత్రక తప్పిదం కాదా? అని జానారెడ్డి ప్రశ్నించారు. లోపాలను ఎత్తిచూపే బాధ్యత ప్రతిపక్షంగా తమకు హక్కు ఉందన్నారు. టెండర్లు పారదర్శకంగా జరగకపోవడంతో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం తన పాదర్శకతను నిరూపించుకోవాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చెప్పిన అంశాలను నివృత్తి చేయకుండా కేసీఆర్ ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారన్నారు. వ్యక్తులను టార్గెట్ చేయడం సరికాదని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అధికార దర్పంతో మాట్లాడటం సీఎం హోదాకు తగదన్నారు. సీఎం ఉన్న వ్యక్తి ఊతపదాలు కాదని, హుందాగా వ్యవహరించాలన్నారు. గతం అంటూ గందరగోళం చేయడం కాదని, ఇప్పుడేమి చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నీళ్ళు ఇస్తే ప్రభుత్వానికి ప్రచారం చేస్తానని మాట నిలబెట్టుకుంటానని..మాటకు మాట మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనన్నారు. కేసీఆర్ చేస్తున్న అవక తవకలను సరిదిద్దడం దేవుడి తరం కూడా కాదన్నారు. గద్వాల పై ప్రజల అభిప్రాయం బలంగా వినిపిస్తున్నారని, పెద్ద జిల్లా అయిన పాలమురును 4 జిల్లాలు చేయలని జానారెడ్డి సూచించారు. -
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
మిర్యాలగూడ : టెయిల్‌పాండ్ ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద భూ నిర్వాసితులు చేపడుతున్న రిలే దీక్షలకు గురువారం ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. టెయిల్‌పాండ్ ప్రాజెక్టు వల్ల ప్రస్తుతం నాలుగు గ్రామాలు నీటమునిగే అవకాశం ఉందన్నారు. అంతే కాకుండా ఎనిమిది ఎత్తిపోతల పథకాలు కూడా మునిగిపోతున్నాయని, వాటి పరిధిలోని నాలుగు వేల ఎకరాల భూమి బీడుగా మారనుందని పేర్కొన్నారు. 42 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తిరిగి యధావిధిగా ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని, ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాల కల్పించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా గతంలో కేవలం ఎకరానికి 1.25 లక్షల రూపాయలే చెల్లించారని, ప్రస్తుతం ముంపు గ్రామాల ప్రజలకు ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లింలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు భూసేకరణ చట్టం –2013 ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ సత్యనారాయణరెడ్డితో సమావేశమై భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భారతీ రాగ్యానాయక్, కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్‌నాయక్, పగిడి రామలింగయ్య, చిరుమర్రి కృష్ణయ్య, కందిమళ్ల లక్షా్మరెడ్డి, సీపీఎం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి, రవినాయక్, చంద్రశేఖర్‌యాదవ్, కమిటీ నాయకులు హనుమంతునాయక్, లాలునాయక్, మునినాయక్, బాబి, సేవానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంసెట్-2 పేపర్ లీకేజీ ప్రభుత్వ వైఫల్యమే
- సీఎల్పీనేత జానారెడ్డి నాగార్జునసాగర్(నల్గొండ జిల్లా) ప్రభుత్వం వైఫల్యంతో ఎంసెట్-2 పేపర్ లీకవడంతో విద్యార్థుల భవిష్యత్ అశనిపాతంగా మారిందని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రభుత్వ క్షోభకు గురిచేసిందన్నారు. పేపర్ లీకేజీలో పాత్రధారులు, సూత్రధారులందరినీ చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సూచించారు. -
జానారెడ్డి, షబ్బీర్ అలీ అరెస్ట్
హైదరాబాద్ : మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులను పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీలను పోలీసులు మధ్యలో అడ్డుకున్నారు. మెదక్ జిల్లా ములుగు మండలం ఒంటిమామిడి వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు, నేతలకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. జానారెడ్డి, షబ్బీర్ అలీని బీహెచ్ఈఎల్ రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ నేతల వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కూడా పోలీసులు అనుమతించలేదు. కాగా మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలు పర్యటనతోపాటు... ముంపు ప్రాంత ప్రజల ఆందోళనలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన వారిని పరామర్శించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ నెల 26న ఛలో మల్లన్న సాగర్‌కు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు మాత్రం ఛలో మల్లన్నసాగర్ పర్యటనకు వెళ్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ లు చేశారు. ఈ నేపథ్యంలో టీ.కాంగ్రెస్ నేతలు మళ్లీ మల్లన్నసాగర్ బయలుదేరారు. అయితే రెండోసారి కూడా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అరెస్ట్‌లకు భయపడేది లేదు: కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై తాము పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అరెస్టులకు తాము భయపడబోమని కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంగళవారం వారు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు తాము అండగా ఉంటామని కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టీ హామీ ఇచ్చారు. -
కమ్యూనిస్టు యోధుడు ఉజ్జిని ఇకలేరు
హైదరాబాద్: తొలితరం కమ్యూనిస్టు యోధుడు, నల్లగొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు(90) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. మంగళవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని సైదాబాద్‌లోని తన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు నివాసానికి తరలించారు. మాజీ మంత్రి జానారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు ఉజ్జిని భౌతికకాయాన్ని సందిర్శించి నివాళులు అర్పించారు. అనంతరం భౌతికకాయాన్ని ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గడియగౌరారం గ్రామానికి తరలించారు. అక్కడ నల్లగొండ జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. నారాయణరావు మూడుసార్లు మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, రజాకార్లకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన నాయకుడిగా పేరు గడించారు. నారాయణరావు మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. కమ్యూనిస్టు సీనియర్ నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా పేదల పక్షాన అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. సీపీఐ సంతాపం: ఉజ్జిని నారాయణరావు మృతి పట్ల సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. సైదాబాద్‌లోని ఆయన నివాసంలో నారాయణరావు భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలుంచి చాడ, ఇతర నేతలు పల్లా వెంకటరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్ తదితరులు నివాళులర్పించారు. నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి ఇతర నేతలతో కలసి ఎంతో కృషి చేశారని తమ కుటుంబ సభ్యులను పార్టీ సభ్యులుగా, నాయకులుగా ఆయన తీర్చిదిద్దారని సురవరం సంతాప సందేశంలో పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా పొల్కంపల్లి వెంకటరామారావుతో కలసి ఆంధ్ర మహాసభలో చేరి ప్రజాసమస్యలపై స్పందించి కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగారని, భూ పోరాట ఉద్యమాల్లో పాల్గొన్నారని చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రజా ఉద్యమానికి అంకితం కమ్యూనిస్టు ఉద్యమం తీవ్ర నిర్బంధానికి గురైన కాలంలో కూడా నారాయణరావు ప్రజా ఉద్యమానికి అంకితమై పనిచేశారని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన మృతికి నివాళులర్పించారు. ఉన్నత కుటుంబంలో పుట్టినా పేద రైతాంగం పట్ల నిబద్ధతతో కృషి చేశారని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు. -
'తెలంగాణ సత్తా ఏంటో పార్లమెంట్లో చూపిస్తాం'
కరీంనగర్ : హైకోర్టు విభజన జరిగేవరకూ పార్లమెంట్ సమావేశాలను స్తంభింపచేస్తామని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ తెలంగాణ సత్తా ఏంటో పార్లమెంట్లో చూపిస్తామన్నారు. ప్రాజెక్టులు నిర్మిస్తే రాజకీయ పునాదులు కదులుతాయని కాంగ్రెస్, టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. తమది కూడా భూ నిర్వాసితుల కుటుంబమే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి జానెడు జాగా కూడా ఏ ప్రాజెక్ట్‌లో పోలేదని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. నిర్వాసితులకు ఉండే బాధ జానారెడ్డికి తెలియకనే 123 జీవో ప్రకారం పరిహారాన్ని అడ్డుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. -
అలా చేస్తే టీఆర్ఎస్కు ప్రచారం చేస్తా: జానారెడ్డి
నల్లగొండ: సీఎల్పీ నేత జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లాలోని యాదాద్రిని జానారెడ్డి ఆదివారం సందర్శించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, సాగర్ కింద రెండో పంటకు నీరు అందిస్తామన్న హామీలను నెరవేరిస్తే టీఆర్ఎస్కు ప్రచార సాధకుడిగా పని చేస్తానని వ్యాఖ్యానించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
హైకోర్టు విభజన ప్రక్రియను వెంటనే చేపట్టాలి: జానా
హైదరాబాద్ : హైకోర్టు విభజనలె జాప్యం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల నియామకంలో అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఈ మేరకు జానారెడ్డి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు న్యాయమూర్తుల ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. న్యాయమూర్తులపై సస్పెన్షన్ వేయటాన్ని జానారెడ్డి ఖండించారు. న్యాయమూర్తులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే హైకోర్టు విభజనకు తగు చర్యలు చేపట్టాలన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుతో సంప్రదింపులు జరపాలన, అందుకు తమ మద్దతు ఉంటుందని జానారెడ్డి తెలిపారు. -
తెలంగాణా ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది
హైదరాబాద్: ప్రముఖ కవి, గేయ రచయిత గూడ అంజయ్య మృతి పట్ల ఏపీసీసీ ఛీఫ్ రఘువీరారెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కోట్లాది పేద ప్రజాలను తన పాటలతో చైతన్య పరిచిన గూడ అంజయ్య లేని లోటు తీరనిదన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గూడ అంజయ్య మృతిపట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలంగాణా ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ శాసనపక్ష ప్రతిపక్ష నేత శ్రీ కుందూరు జానారెడ్డి తమ సంతాపాన్ని ప్రకటించారు. అంజన్న మృతి తెలంగాణా సమాజానికి తీరని లోటని జానారెడ్డి అన్నారు. ఉద్యమ నేపథ్యంలో ఆయన రాసిన పాటలు, గేయాలు ఎంతో ఉత్తేజాన్ని కలిగించాయన్నారు. గూడ అంజన్న ఆత్మకు శాంతి చేకూరాలని..ఆయన కుటుంబ సభ్యులకు జానారెడ్డి సానుభూతి తెలిపారు. -
వాహ్ ఏం మాట్లాడిండు భయ్...!
తమ పార్టీ సీనియర్ నేతల ముదురు రాజకీయాల ముందు ఎవరైనా బలాదూరేనని టీ కాంగ్రెస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అసలు వారి రాజకీయ వ్యూహాలు, చిత్రవిచిత్రమైన జిమ్మిక్కుల ముందు ఎవ్వరూ నిలబడలేరని ఒకింత వ్యంగ్యంగానే తమలో తాము మాట్లాడుకుంటున్నారట. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌లో చిక్కుకుని దశల వారీగా కాంగ్రెస్ నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నా.. అందుకు అవసరమైన వాదనను కూడా సీనియర్‌నేతలు తయారు చేసుకుంటుండడంపై విస్మయం వ్యక్తమవుతోందట. తాజాగా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరడంపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. టీసీఎల్పీ నేత జానారెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యే పార్టీ మారిన నేపథ్యంలో తనపై విమర్శల వర్షాన్ని తప్పించుకునేందుకు అన్ని పదవులకు రాజీనామా చేయనున్నట్లు జానా ప్రకటించడం రాజకీయ ఎత్తుగడలో భాగమేనంటున్నారు. ఫిరాయింపులను నియంత్రించడంలో ముఖ్యనేతలు విఫలమయ్యారనే విమర్శలు పెల్లుబికి, తమ పదవులకు పెద్ద నేతలు రాజీనామా చేయాలనే డిమాండ్ రాకముందే ఆయన ఆ ప్రకటన చేయడంతో ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేయగలిగారంటున్నారు. రెండోరోజే తమ రాజీనామాను పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అనుమతిస్తేనే అని షరతులతో కూడిన ప్రకటన చేయడంతో రాజకీయమంటే ఇదేనని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారట. అటు కర్ర విరగకుండా పాము చావకుండా చేయడం తమ ప్రకటనలతో జాణతనాన్ని ప్రదర్శించడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందని పార్టీ నాయకులు గుసగుసలు పోతున్నారట.... -
రాజీనామాకు నేను సిద్ధం: జానారెడ్డి
హైదరాబాద్: ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. రూ.5 భోజనం బాగుందంటూ జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను సర్వే మరోమారు లేవనెత్తారు. దీనిపై స్పందించిన జానా పదేపదే అదే విషయాన్ని లేవనెత్తడం సరికాదని అన్నారు. పార్టీని బలపరచడంలో జానా దూకుడుగా లేరని సర్వే ఆరోపించారు. ఆ సమయంలోనే.. ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని జానారెడ్డి చెప్పడంతో రాజీనామా అవసరం లేదని, పదవీలోనే కొనసాగాలని ఎమ్మెల్యేలు కోరారు. కాగా, సమావేశంలో షబ్బీర్ అలీ, సర్వేల మధ్య కూడా స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై దళితుడైన తనను షబ్బీర్ అలీ టార్గెట్ చేస్తున్నారని సర్వే అన్నారు. పబ్లిక్ మీటింగ్ లోనే పార్టీ నాయకత్వ తీరుపై సర్వే వ్యాఖ్యలు చేయడం సరికాదని షబ్బీర్ వ్యాఖ్యానించారు. సమావేశంలో షబ్బీర్ అలీ, సర్వే సత్యనారయణతో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
పార్టీని వీడిన నేతల గురించి ఆందోళన వద్దు: వీహెచ్
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. హైదరాబాద్ లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. పదవీ త్యాగాలకు సిద్ధపడొద్దని జానారెడ్డికి ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీని వీడిన నేతల గురించి ఆవేదన చెందొద్దని చెప్పారు. సీఎల్పీ నేతగా జానారెడ్డి తప్పుకుంటే కాంగ్రెస్ కేడర్ స్థైర్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆపదలో ఉన్నందున జానారెడ్డి లీడర్ గా ముందు నిలిచి పార్టీని నిలబెట్టాలని సూచించారు. రెండేళ్ల పాలనలో కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు వివరించాలన్నారు. సీఎం కేసీఆర్ వైఫల్యాలను గ్రామగ్రామాన ఎండగట్టేందుకు కాంగ్రెస్ కేడర్ సిద్ధపడాలని వీహెచ్ పిలుపునిచ్చారు. పార్టీ ప్రతిష్ట కోసం సీఎల్పీ పదవి వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జానారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వీహెచ్ మీడియా సమావేశంలో పాల్గొని పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. -
సీఎం పదవి ఇస్తామన్నా అందుకే వద్దన్నా: జానా
హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫిరాయింపులు హేయమన చర్యగా ఆయన అభివర్ణించారు. టీఆర్ఎస్ అనైతిక రాజకీయాలు పరాకాష్టకు చేరాయని జానారెడ్డి మంగళవారమిక్కడ మండిపడ్డారు. భ్రష్ట రాజకీయాలతో బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ఆయన సూటిగా ప్రశ్నించారు. పార్టీని వీడినవారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ఫిరాయింపుల చట్టాన్ని కేంద్రం సవరించాల్సి ఉందని ఆయన అన్నారు. పార్టీ ప్రతిష్టత కోసం సీఎల్పీ పదవి వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జానారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నా తెలంగాణ కోసం తాను వద్దానన్నానని ఆయన తెలిపారు. కాగా కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, వినోద్‌తో పాటు ఎమ్మెల్యే భాస్కరరావు కూడా ఈ నెల 15న టీఆర్ఎస్లో చేరనున్న విషయం తెలిసిందే. -
టీఆర్ఎస్పై ఇంకా భ్రమలున్నాయి
సీఎల్పీ నాయకుడు జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్పై ప్రజలకు ఇంకా భ్రమలున్నాయని సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి వాఖ్యానించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏదో చేస్తుందని నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేయాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. పాలేరులో విజయం సాధించిన తుమ్మల నాగేశ్వర్రావుకు ఆయన శుభాకాంక్షలను తెలియజేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని జానారెడ్డి అన్నారు. ఈ ఓటమితో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరాశచెందాల్సిన అవసరం లేదన్నారు. ఓడిపోయినప్పుడు నిరాశ, బాధ సహజమే అయినా కాంగ్రెస్ శ్రేణులు ఈ ఓటమిని సవాలుగా తీసుకుని గెలుపుకోసం కష్టపడాలని సూచించారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతం కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందని అన్నారు. చట్టం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాల్సిన అవసరం లేదని జానా అన్నారు. చట్ట విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా, మాట్లాడినా కేసులు పెట్టడం సహజమన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌పై నమ్మకం వచ్చేదాకా వేచి చూస్తామని జానారెడ్డి చెప్పారు. జానాతో లక్ష్మణ్ భేటీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ శుక్రవారం సీఎల్పీ నేత జానారెడ్డితో భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో వీరు సుమారు పావుగంటపాటు సమావేశమయ్యారు. పాలేరు ఎన్నిక ఫలితాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్ష పార్టీలు, నేతలపై మాట్లాడిన తీరును వీరు చర్చించుకున్నట్టుగా తెలిసింది. -
ప్రతిపక్ష నేతలతో కలిసి కేసీఆర్ విందు భోజనం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రతిపక్ష నేతలతో కలిసి విందు భోజనం చేశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ కుమార్తె ఇవాళ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా ఈటల రాజేందర్, పలువురు మంత్రులు హాజరయ్యారు. అలాగే ప్రతిపక్ష నేతలు జానరెడ్డి, షబ్బీర్ అలీ, వివేక్ తదితరులు విచ్చేశారు. అధికార, ప్రతిపక్ష నేతల రాకతో అక్కడ రాజకీయ సందడి నెలకొంది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా వివాహ వేడుకలో ఒకే టేబుల్‌పై కేసీఆర్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వివేక్ తదితరులతో కలిసి భోజనం చేశారు. -
‘ఫిరాయింపు’పై జానా వర్సెస్ ఉత్తమ్
సీఎల్పీ సమావేశంలో వాడీవేడి చర్చలు * గాంధీభవన్ నుంచి లీకులు వస్తున్నాయి: జానారెడ్డి * పీసీసీ చీఫ్ ఎందుకు ఖండించరంటూ ఆగ్రహం * నాకేం సంబంధం అని ప్రశ్నించిన ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. అసెంబ్లీలోని పార్టీ కార్యాలయంలో జానారెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఫిరాయింపుల అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటామాటా పెరిగినట్లు సమాచారం. పార్టీ ఫిరాయింపులు, దానికి కారణాలు, వలసలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, నాయకత్వం బాధ్యత, పార్టీలో అంతర్గత విభేదాలు, పార్టీ పటిష్టత, పాలేరు ఉప ఎన్నికపై ఈ సమావేశంలో చర్చించారు. భేటీలో సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ... తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్టుగా వార్తలు రావడం బాధాకరమన్నారు. ఇలాంటి వార్తలు గాంధీభవన్ నుంచి, పీసీసీ ఆఫీసు బేరర్ల నుంచి వస్తున్నాయన్నారు. గాంధీభవన్ నుంచి ఇలాంటి తప్పుడు లీకులు ఇస్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఎందుకు ఖండించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉత్తమ్ స్పందిస్తూ.. ‘‘ఆఫీసు బేరర్లు ఎవరు లీక్ చేశారో నాకెలా తెలుస్తుంది? ఎవరైనా పార్టీ ఫిరాయిస్తున్నారని వార్తలు వస్తే ఇతరులెలా ఖండిస్తారు..’’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య వాగ్వాగం జరిగింది. పార్టీ సీనియర్ నేతలు జీవన్‌రెడ్డి, డీకే అరుణ తదితరులు జోక్యం చేసుకుని వారిని సముదాయించారు. అనంతరం జానా మాట్లాడుతూ... సీఎల్పీ నేతగా తాను కొనసాగడం ఇష్టం లేకుంటే తప్పుకుంటానని, ఈ బాధ్యతలను ఎవరైనా తీసుకోవచ్చన్నారు. దాంతో ఇప్పుడు నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగడం, మార్పుపై చర్చ అనవసరమని సీనియర్లు అభిప్రాయపడ్డారు. సొంత ప్రయోజనాల కోసమే వీడుతున్నారు కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు ఫిరాయింపులకు దిగుతున్నారనే అంశంపై భేటీలో తీవ్ర చర్చ జరిగింది. సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి కాంగ్రెస్‌ను వదిలి అధికార పార్టీలోకి వెళ్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్లోకి వెళ్లిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వం సరిగా లేదని నోటికొచ్చినట్టుగా మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. నాయకత్వం అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలని కూడా పలువురు ప్రశ్నించారు. పార్టీ టికెట్ ఇచ్చి, గెలవడానికి వనరులను సమీకరించిన తర్వాత కూడా పార్టీ మారితే ఇక ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. పార్టీ మారుతామంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లాలని జానారెడ్డి అన్నారు. పార్టీలో నేతలపై పరస్పరం నమ్మకం ఉండాలన్నారు. ఈ మధ్య పార్టీ మారిన పువ్వాడ అజయ్‌కు కాంగ్రెస్‌తో అనుబంధం లేదన్నారు. పాలేరు ఉప ఎన్నికలో అంతా ఏకమై పనిచేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. పాలేరు ఎన్నిక వ్యయం కోసం పార్టీ ఎమ్మెల్యేలంతా ఒకనెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీలకు నో ఎంట్రీ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం అంటూ విప్ సంపత్ కుమార్ నుంచి, సీఎల్పీ కార్యాలయ సిబ్బంది నుంచి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు సమాచారం అందింది. అయితే సమావేశం ప్రారంభానికి ముందు ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ సమావేశం పరిమితమని సిబ్బంది చెప్పారు. దీంతో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల సమావేశమే అయితే ఎమ్మెల్సీలను ఎందుకు ఆహ్వానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జానా, ఉత్తమ్ బయటకు వచ్చి షబ్బీర్ అలీని, పొంగులేటి సుధాకర్ రెడ్డిని విశ్రాంతి గదిలోకి తీసుకువెళ్లారు. కాగా, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి నియామకం, అయోమయ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమావేశం నుంచి అలిగి వెళ్లిపోయారు. -
కేసీఆర్‌ది పచ్చి మోసం: కాంగ్రెస్
ముస్లింల స్థితి, రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రజెంటేషన్ 12 శాతం రిజర్వేషన్ హామీపై చర్యలేవీ: ఉత్తమ్ ఓట్ల కోసం వాడుకుని గాలికి వదిలేశారని విమర్శ కేసీఆర్‌వన్నీ ఉత్త మాటలే.. చేతల్లేవు: జానారెడ్డి టీఆర్ఎస్ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళతాం: షబ్బీర్ అలీ సాక్షి, హైదరాబాద్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... 24 నెలలవుతున్నా ఆ హామీని అమలుచేయడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ముస్లింలను ఓట్ల కోసం వాడుకుని, అధికారంలోకి వచ్చాక నిండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ముస్లింల స్థితిగతులు, రిజర్వేషన్లు తదితర అంశాలపై రూపొందించిన సీడీలను ఉత్తమ్, కె.జానారెడ్డి తదితరులు మంగళవారం ఇందిరాభవన్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఈ అంశంపై షబ్బీర్ అలీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల లబ్ధిపొందినవారి సక్సెస్ స్టోరీలను ప్రదర్శించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌పై 2014 ఏప్రిల్ 19న షాద్‌నగర్‌లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. 24 నెలలు కావస్తున్నా దీనిపై కనీసం ప్రతిపాదనలను కూడా రూపొందించలేదని మండిపడ్డారు. కేసీఆర్ ముస్లింలను ఓట్లకోసం వాడుకుని, అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నారని ఆరోపించారు. ముస్లింలకు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడుతామన్నారు. కాంగ్రెస్ నుంచి కేసీఆర్ నేర్చుకోవాలి..: జానా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. దానిని అమలుచేసి చూపించిందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి పేర్కొన్నారు. దానివల్ల లక్షలాది మంది ముస్లింలకు మెడికల్, ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యావకాశాలు, ఉన్నతోద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, స్వయం ఉపాధి రుణాలు అందాయని చెప్పారు. కాంగ్రెస్ ఏ హామీ ఇచ్చినా అమలుచేసి చూపిస్తుందని... ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాలను చూసి సీఎం కేసీఆర్ నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌వి మాటలు తప్ప చేతలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం: షబ్బీర్ సీఎం కేసీఆర్ ముస్లింలను ఓటుబ్యాంకుగా చూస్తున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు. ముస్లింల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు, ఇప్పటిదాకా చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. తాము ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను సీడీల ద్వారా ప్రజల్లో ప్రచారం చేస్తామని.. కేసీఆర్ చేసిన మోసాన్ని ఎండగడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జె.గీతారెడ్డి, డీకే అరుణ, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ ఆకుల లలిత, బలరాంనాయక్, సబితా ఇంద్రారెడ్డి, వివేక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంతర్యమేమిటో?
*ఉత్తమ్, కోమటిరెడ్డి విరుద్ధ వ్యాఖ్యలతో రసకందాయంలో జిల్లా రాజకీయం *ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై చెరోమాట *ఢిల్లీ దృష్టికి సీఎల్పీ ఉపనేత వ్యాఖ్యలు *ఇద్దరు నేతల వ్యాఖ్యలపై జిల్లాలో రసవత్తర చర్చ *ఉగాది నాటికి డీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం *జెడ్పీ ఫ్లోర్ లీడర్ నియామకంలోనూ తాజా మెలిక..! టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్, అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఈ పరిణామం రసవత్తర రాజకీయానికి తెర లేపింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం ప్రజెంటేషన్‌పై పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేయడం, పెద్దాయన జానారెడ్డి సెలైంట్‌గా ఉండడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. నల్లగొండ: తెలంగాణ అసెంబ్లీలో సీఎం ప్రజెంటేషన్‌పై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం ప్రజెంటేషన్ తెల్లారే నల్లగొండలో విలేకరులతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పదునైన వ్యాఖ్యలు చేశారు. అసలు రీడిజైనింగే పెద్ద కుంభకోణం అని వ్యాఖ్యానించిన ఆయన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు టెండర్లను రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. అయితే, ఉత్తమ్ వ్యాఖ్యలు పత్రికల్లో వచ్చిన రోజే ఆయనకు కౌం టర్ అన్నట్టు సీఎల్పీ ఉపనేత ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడం చర్చకు దారితీస్తోంది. సీఎం ప్రజెంటేషన్ ఆకట్టుకుందనడంతో పాటు ఉత్తమ్ అసెం బ్లీలో చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేయ డం, డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తే టీఆర్ఎస్ తరఫున వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తాననడం ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు నేతల మధ్య ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు తాజా పరిణామాలతో తారస్థాయికి చేరినట్టయింది. ఉగాదికి పదవుల పందేరం ఇదిలా ఉంటే, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గాన్ని ఉగాది నాటికి ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడో ప్రకటించాల్సి ఉన్నా నేతల మధ్య సమన్వయం లేకపోవడం, పేర్లు ఖరారు కాకపోవడంతో కావాల్సినంత ఆలస్యం జరి గింది. ఈ పరిస్థితుల్లో కచ్చితంగా ఉగాది నాటికి డీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించి స్థానిక నేతలకు పదవులిచ్చే ఆలోచన జిల్లా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో కాకపోయినా 20-25 పేర్లతో జిల్లా కార్యవర్గాన్ని ఉగాదిలోపు ప్రకటించనున్నట్టు స మాచారం. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్, గుండాల జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి టీఆర్ఎస్లోనికి వెళ్లడంతో జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పదవి ఖాళీ అయింది. ఈ పదవిని నార్కట్‌పల్లి జెడ్పీటీసీ దూది మెట్ల సత్తయ్య యాదవ్‌కు ఇవ్వాలని పార్టీ పెద్దలు భావించినా, దామరచర్ల జెడ్పీటీసీ శంకర్‌నాయక్ కూడా రంగంలోనికి రావడంతో మళ్లీ మెలిక పడింది. దీనిపై కూడా జిల్లా కాంగ్రెస్‌లో త్వరలోనే ఓ స్పష్టత రానుందని సమాచారం. -
సభలో కంటతడి పెట్టిన డిప్యూటీ స్పీకర్
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కంటతడి పెట్టారు. సంస్కారం లేనివారు సభను నిర్వహిస్తున్నారంటూ మంగళవారం సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ వ్యాఖ్యలు చేశారు. దీంతో మనస్తాపం చెందిన పద్మా దేవేందర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు జోక్యం చేసుకుని 'మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు తగవు.సభాపతిని డిక్టేట్ చేయడం సరికాదని, డీకే అరుణ వెంటనే క్షమాపణ చెప్పాలని' డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే సస్పెండ్ చేయడానికి వెనుకాడేది లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఏపీ శాసనసభలో ఏం జరిగిందో అందరికీ తెలుసు అని, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ మహిళ ఎమ్మెల్యేను ఏడాదిపాటు సభనుంచి సస్పెండ్ చేశారని, అయితే తాము అలాంటి చర్యకు పోదలచుకోలేదని అన్నారు. గతంలో తాము సభలో మాట జారితే తమ నాయకుడు...మంత్రులతో క్షమాపణ చెప్పించారని హరీశ్ రావు గుర్తు చేశారు. అది తమ సంస్కారమని, క్షమాపణ చెబితే కిరీటమేమీ పడిపోదని ఆయన అన్నారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తనపై చేసిన వ్యాఖ్యలకు సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ సభలో అందరూ హుందాగా వ్యవహరించాలని సూచించారు. సభాపతిపై ప్రతిపక్షానికి గౌరవముందని, సభ్యులు ఆవేశపడినా గతంలో తాము సర్ధుబాటు చేసిన ఘటనలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై వాదాపవాదాలు వద్దని అందరూ సమన్వయం పాటించాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై డీకే అరుణ మాట్లాడుతూ... తాను ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. -
ఆయన ద్వి‘భాషి’...!
ప్రతిపక్ష నేత కె.జానారెడ్డికి తెలుగుభాష లోనే రెండు రకాల భాషలు వస్తాయట. ఆయన ప్రసంగశైలిపై కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తెలుగులోనే మాట్లాడినా వినేవారికి అయోమయం, గందరగోళం కలిగించే విధంగా, ఏం చెప్పారో అర్థంకాకుండా మాట్లాడటం జానా రెడ్డికి వచ్చునట. అందరికీ అర్థమయ్యేవిధంగా మాట్లాడటంలోనూ ప్రావీణ్యముందట. విషయం అర్థమయ్యేటట్టు చెప్పాల్నా, అర్థంకాకుండా అటూఇటూ తిప్పి చెప్పాల్నా అనేదానిపై సారుకు ఉన్న స్పష్టతను బట్టి భాషను ఉపయోగిస్తారట. చెప్పిందే తిప్పితిప్పి చెప్పి, ఎన్నిసార్లు చెప్పినా అర్థంకాని పడికట్టు పదాలతో కూడిన తెలుగుభాషను అయోమయం చేయాలనుకుంటే ప్రయోగిస్తారట. చెప్పాలనుకున్నప్పుడు సూటిగా, స్పష్టంగా చెప్పేస్తారట. బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగం సందర్భంగా సాధారణ భాషలో మాట్లాడి, పార్టీలో పరువును నిలబెట్టుకున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ఉల్లాసంగా ఉత్సాహంగా జానా ప్రసంగం!
హైదరాబాద్: ప్రభుత్వం ఉత్తర్వుల (జీవోల) వివరాలు తెలియజేసే వెబ్‌సైట్‌ను తెలంగాణ ప్రభుత్వం మూసివేసిందని, దీనిని వెంటనే తిరిగి తెరువాలని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ బడ్జెట్‌పై ఆయన గురువారం కూడా అసెంబ్లీలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. 2014-15 బడ్జెట్లో 60శాతం నిధులను మాత్రమే ఖర్చు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేసినట్టు చూపినప్పటికీ, నిజానికి ఆ కేటాయింపులకు తగిన రాబడి ఖజానాకు లేదని జానారెడ్డి విమర్శించారు. నిన్నటిమాదిరిగానే జానారెడ్డి ఉల్సాసంగా, ఉత్సాహంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. బడ్జెట్లోని అన్ని అంశాలను వివరంగా ప్రస్తావించాల్సి ఉన్పప్పటికీ, ఇతర సభ్యులకు కూడా అవకాశం ఇవ్వాలన్న ధోరణితో ఒక్కో అంశాన్ని మాత్రమే ఉదాహరణగా ప్రస్తావిస్తున్నానని ఆయన చెప్పారు. గ్రామీణాభివృద్ధి అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మంత్రి సభలో లేనందున.. దానిని తర్వాత ప్రస్తావిస్తానని ఆయన పేర్కొన్నారు. అయితే పెద్దలు జానారెడ్డి నింపాదిగా తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించవచ్చునని, ఆయన ప్రసంగానికి ఆంటకం కలిగించకుండా, ఆయన ప్రస్తావించిన అంశాలను రాసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారని, అందుకే తామంతా శ్రద్ధగా జానారెడ్డి ప్రసంగాన్ని వింటున్నామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ బదులిచ్చారు. దీంతో తన సహజ ధోరణిలో జానారెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు. జానారెడ్డి తన ప్రసంగంలో ఏమన్నారంటే.. ప్రాణహిత ప్రాజెక్టుపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలి ప్రాణహిత ప్రాజెక్టుపై జాతీయ సంస్థతో ప్రభుత్వం అధ్యయనం చేయించాలి -
నవ్వులు పూయించిన జానారెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి తెలంగాణ అసెంబ్లీలో నవ్వులు పూయించారు. బడ్జెట్ అంటేనే సాధారణంగా గందరగోళ అంశమని, అలాంటి బడ్జెట్ లెక్కలను చేతులకు ఇచ్చి మంత్రి ఈటల రాజేందర్ మరింత గందరగోళంలో పడేశారని అన్నారు. ఈ లెక్కలు చాలా జాగ్రత్తగా ఎమ్మెల్యేలు చదువుకోవాలని చెప్పారు. దీంతో అందరూ నవ్వారు. 'సభలో చాలామంది సభ్యులు లేరు. మంత్రులు ఎవరు లేరు. మండలికి పోయినరా' అని చక్కగా తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ సభలో నవ్వులు విరభూయించారు. తాను ఎంతమేరకు అంచనా వేసి చెప్పానో అంతమేరకే ఈటల బడ్జెట్ కేటాయింపు చేశారని అన్నారు. మిషన్ కాకతీయ నిధుల విషయంలో కూడా అదే జరిగిందని తెలిపారు. తాను పారదర్శకంగా ఉంటానని, అలాంటి పాలనను అందించాలని కోరుకుంటానని జానా అన్నారు. తాను సక్రమంగా లేకుంటే అధికార పక్షం చెప్తే సరవుతానని, లేదంటే అధికార పార్టీ సరవ్వాలని చెప్పారు. ఈటల బడ్జెట్‌పై చిన్న కవిత లాంటిది కూడా జానా చదివారు. బడ్జెట్ అంకెలతో ఆటపట్టించారని, లెక్కలతో గారడీ చేశారని, ప్రజలను భ్రమింపజేయడానికి ప్రయత్నించారని చెప్పారు. -
'ఏపీ అసెంబ్లీలాగా మనది ఉండొద్దనే..'
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం వస్తే చాలా మార్పు వస్తుందని ప్రజలు ఆశించారని తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. ఆ విధంగానే కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకుపోవాలని సూచించారు. బుధవారం 12.30గంటల ప్రాంతంలో తెలంగాణ బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైంది. ప్రతిపక్ష నేత జానారెడ్డి ఈ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అనేక పార్టీలు అధికారంలోకి వచ్చాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ తమ ఆకాంక్షలను నెరవేరుస్తుందని ప్రజలు పట్టంకట్టారని, దాన్ని తాము కూడా స్వాగతించామని చెప్పారు. ప్రజలు ఆశించినట్లుగా ప్రభుత్వ పనిచేస్తే సహకారం ఇస్తామని, లేదంటే ప్రజల పక్షాన ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తామని తెలిపారు. ఈ రాష్ట్రంలో మరో పార్టీ ఉండకూడదని పలువురు మంత్రులు మాట్లాడతారని, అసలు అలా ఎలా మాట్లాడుతారని, ఇలా చేయడానికి వచ్చారా, లేక ప్రజలకోసం వచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా అవే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. ప్రజాస్వామ్య ముసుగులో ఇది నియతృత్వం అని అన్నారు. అయిన సర్దుకుపోతున్నామని చెప్పారు. వారెన్ని మాట్లాడితే అంతకు రెట్టిపు మాట్లాడగలం అని, కానీ దానివల్ల ఏం ప్రయోజనం కలుగుతుందని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీలో ఉన్న లొల్లి మాదిరిగా తెలంగాణ అసెంబ్లీలో ఉండకూడదని సంయమనంతో వ్యవహరిస్తున్నామని జానారెడ్డి అన్నారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని, ఒకనాడు ఒక్కతిగా ఉన్న జయలలిత నేడు పరిపాలన చేస్తోందని, కొన్ని ప్రాంతాలకు పరిమితమైన బీజేపీ నేడు దేశాన్ని పాలిస్తుందన్న విషయం అధికార పార్టీ గుర్తుంచుకోవాలని చెప్పారు. -
కునుకు పడితే.. మనసు కాస్త కుదుట పడతది!
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల సమయమిది. కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ నేపథ్యంలోనే పార్టీ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో నగరంలోని చింతల్ బస్తీ లో సమావేశం. ఓ వైపు ఆయన నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆ మాటలు జోల పాటలా అనిపించాయో..ఇంతకంటే మంచి సమయం దొరకదనుకున్నారో వేదికపైనున్న కీలక నేతలు వి.హనుమంతరావు, జానారెడ్డి, కుంతియాలు మెల్లగా ఓ కునుకు తీశారు. ఇలా కునికి పాట్లు పడితే ..ఎన్నికలయ్యాక కలత తప్పదంటూ ఓ కార్యకర్త వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
కాంగ్రెస్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
ప్రతిపక్షం లేకుండా చేసే కుట్ర జరుగుతోంది: జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి, షబ్బీర్ అలీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, పార్టీ సీనియర్లు డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్, బి.బిక్షమయ్య ఇతర ముఖ్యనేతలు వారిని అభినందించారు. ప్రమాణ స్వీకారం అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రశ్నించేందుకు ప్రతిపక్షం లేకుండా చేసేందుకు అధికార టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుసరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు. ప్రజల పక్షాన పోరాడుతాం: కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డి టీఆర్ఎస్ బెదిరింపులకు ఎదురొడ్డి తమను గెలిపించిన ప్రజల పక్షాల మండలిలో పోరాడతామని ఎమ్మెల్సీలు రాజగోపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. తమను ఓడించేందుకు టీఆర్ఎస్ కుట్రలు, ప్రలోభాలు, బెదిరింపులకు దిగిందని, వాటికి భయపడకుండా తమను గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
'తెలంగాణలో అభివృద్ధికి పునాదే పడలేదు'
హైదరాబాద్: తెలంగాణలో అసలు అభివృద్ధికి పునాదే పడలేదని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి విమర్శించారు. కానీ టీఆర్ఎస్ నేతల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని దుయ్యబట్టారు. ప్రజలను టీఆర్ఎస్ నేతలు మబ్బి పెడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్థానిక నేతలను బెదిరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జానా ధ్వజమెత్తారు. అయినా నల్లగొండ, మహబూబ్ నగర్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపు అడ్డుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ప్రతపక్షం ఉండకూడదన్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను తెలంగాణ వాదులు తిప్పికోట్టాలని పిలుపునిచ్చారు. అధికార టీఆర్ఎస్ ఏకపక్ష వైఖరి వ్యవహరిస్తోందని జానారెడ్డి విమర్శించారు. -
'మీరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా'
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలను టీఆర్ఎస్లో చేర్చుకోవడంపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలపై తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు సమాధానమిచ్చారు. మంత్రి హరీష్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిని చూసే ఇతర పార్టీ నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదా అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరికపై ఇప్పుడు మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. 'మీరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా' అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలపై మండిపడ్డారు. -
'ఆ బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదు'
హైదరాబాద్: శాశనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్అలీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి పేర్కొన్నారు. ఆ అగంతకులను టీఆర్ఎస్ ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీఆర్ఎస్కు కూడా ప్రమేయం ఉందని భావించాల్సి ఉంటుందన్నారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీల గెలుపు కోసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లను బెదరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్నదే టీఆర్ఎస్ అజెండాగా ఉందని విమర్శించారు. టీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానాలు పరాకాష్టకు చేరాయని దుయ్యబట్టారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఆగడాలపై కోర్టులను ఆశ్రయించామని ఉత్తమ్, జానా తెలిపారు. టీఆర్ఎస్ బెదిరింపులకు కాంగ్రెస్ కేడర్ భయపడదని ఘాటుగా సమాధానమిచ్చారు. టీఆర్ఎస్ ఫిరాయింపు రాజకీయాలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కేడర్ సిద్ధంగా ఉండాలని ఉత్తమ్, జానారెడ్డి పిలుపునిచ్చారు. కాగా, తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయనీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లడితే చంపుతామని ఫోన్లో బెదరిస్తున్నట్టు శుక్రవారం షబ్బీర్‌అలీ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
'సాగునీరిస్తే టీఆర్ఎస్ ప్రచారకర్తగా ఉంటా'
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హామీ ఇచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా సాగునీటిని అందిస్తే టీఆర్ఎస్కు ప్రచారకర్తగా ఉంటానంటూ చేసిన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీటి అవసరం చాలా ఉందన్నారు. ఈ జిల్లాలకు మూడేళ్లలో సాగునీటిని అందిస్తే తప్పకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి, టీఆర్ఎస్కు ప్రచారకర్తగా ఉండిపోతానని స్పష్టం చేశారు. వరంగల్‌లో ఓటమి తీర్పు ప్రజలేదనన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును పార్టీలో అంతర్గతంగా సమీక్షించుకుంటామన్నారు. ప్రతిపక్షాలకు అసహనం ఉంటే టీఆర్ఎస్కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నష్టంలేదని జానా అన్నారు. ప్రజల్లో అసహనం, అసంతృప్తి రాకుండా చూసుకోవాలన్నారు. సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని, అభివృద్ధి చేస్తామని టీఆర్ఎస్ చెబుతున్న మాటలను ప్రజలు నమ్మి వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించారని చెప్పారు. రాజకీయాల్లో పొత్తులు సహజమేనన్నారు. 2019 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, ఆ ఎన్నికల్లో ఎవరు, ఎవరితో పొత్తు పెట్టుకుంటారనేది ఇప్పుడు అప్రస్తుతం, అసందర్భం అని జానా స్పష్టం చేశారు. ఈ ఓటమితో ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని కోల్పోవద్దని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరారు. ఒకసారి గెలిస్తే విర్రవీగడం, ఓడిపోతే కృంగిపోవడం వంటివి చేయకూడదన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటమి సహజమన్నారు. ఓడిపోవడానికి కారణాలు ఏమిటి, ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ఏం చేయాలనేదానిపై లోతుగా విశ్లేషించుకుందామని జానారెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్య విలువలకు అంకురార్పణ చేసింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. ప్రజల విశ్వాసం పొందడానికి నిరంతరం పోరాటం చేయాలని, ప్రజల పక్షాన ఆలోచన చేయాలని పార్టీ శ్రేణులకు జానా సూచించారు. -
రాజయ్య ఇంట్లో జరిగిన ఘటన దురదృష్టకరం
-
సీఎం కేసీఆర్‌పై జానారెడ్డి ఫైర్
హైదరాబాద్: అలివికానీ హామీలు ఇచ్చింది తామా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీనా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ప్రశ్నించారు. 'సమస్యలు పట్టించుకోకుండా నిబంధనలు గుర్తు చేస్తారా అవి తెలియదా మాకు' అంటూ ఆయన మండిపడ్డారు. సభ్యుల సస్పెన్షన్ అప్రజాస్వామికం అన్నారు. ఈ విషయం ప్రజలు, రైతులు తప్పకుండా గుర్తించాలని చెప్పారు. సోమవారం అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్షాలు ఆందోళనకు దిగడంతో వారిపై స్పీకర్ మూకుమ్మడిగా సస్పెన్షన్ వేటు వేశారు. మజ్లిస్ పార్టీ, జానారెడ్డి మినహా మొత్తం 29మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే, సస్పెన్షన్ ఎమ్మెల్యేలతోపాటే బయటకు వచ్చిన జానారెడ్డి విపక్ష సభ్యుల తరుపున మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై విరుచుపడ్డారు. ఇది ప్రజాసమస్యలను చర్చించే వేదిక కాదని, నిరంకుశ పరిపాలకులు ఉన్న వేదిక అని ఆరోపించారు. రెండు రోజులపాటు రైతుల ఆత్మహత్యలపైనే చర్చ చేపట్టామని ప్రభుత్వం చెప్పినా అందులో రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయిందని, స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయిందని అన్నారు. రైతుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను స్తంభింపజేయడం తమ ఉద్దేశం కాదని, ఏ సమస్య ఉన్నా ముందు రైతుల సమస్యలు తీర్చేలా వారి ఘోషను ప్రభుత్వానికి వినిపించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం కనీసం విజ్ఞప్తి చేసే అవకాశం లేకుండా చేసిందని చెప్పారు. రైతులకు రుణమాఫీని తక్షణమే ప్రకటించాలని, బ్యాంకులనుంచి రుణాలు ఇప్పించాలన్నదే తమ ముఖ్యమైన డిమాండ్ అని, అలాగైతే రైతుల ఆత్మహత్యలు నిలువరించినట్లవుతుందని చెప్పాలనుకున్నా ప్రభుత్వం తమను లెక్కచేయడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పకుండా తమ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని, నిబంధనలను తమకు గుర్తు చేస్తున్నారని, మాకు నిబంధనలు తెలియదా అని నిలదీశారు. అలివికానీ హామీలు ఇచ్చిన టీఆర్ఎస్కు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని అన్నారు. -
జానా ఛాంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డి ఛాంబర్లో సోమవారం ఉదయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. రైతు రుణమాఫీపై అసెంబ్లీని స్తంభింప చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. కాగా రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని ప్రతిపక్షాలు శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. మరోవైపు అసెంబ్లీ ఆవరణలో సీనియర్ మంత్రులు భేటీ అయ్యారు. విపక్షాల వాయిదా తీర్మానంపై చర్చ జరిపారు. విపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నారు. -
జానా పాసా... ఫెయిలా..!
కాకలు తీరిన రాజకీయ యోధునిగా, అపార రాజకీయ అనుభవమున్న నేతగా అసెంబ్లీలో, బయటా నింపాదిగా, నెమ్మదిగా వ్యవహరిస్తున్న ప్రతిపక్షనేత జానారెడ్డిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. దూకుడుగా వ్యవహరించడం లేదని, టీఆర్ఎస్ ప్రభుత్వంపై వాడివేడి అస్త్రాలు సంధించడం లేదని పార్టీలోని యువతరం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరుతో అందరినీ ఆశ్చర్యంలో పడవేశారు. అసెంబ్లీ సమావేశాల మొదటిరోజే కాంగ్రెస్ పనైపోయిందని, విపక్షాలపై అధికారపక్షం తిరుగులేని వ్యూహాలతో విజయం సాధించిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఇక పదిరోజుల పాటు సభ నిస్సారంగా అధికారపక్షం ఎట్లా చెబితే అట్లా నడవాల్సిందేనా అన్న సందేహాలు కూడా కాంగ్రెస్‌తో సహా వివిధపక్షాల ఎమ్మెల్యేల్లో వ్యక్తమైంది. రెండోరోజు సభ ముగిసేప్పటికీ అనూహ్యంగా విపక్షాలన్నింటిని జానారెడ్డి ఒకతాటిపైకి తీసుకురావడం ప్రభుత్వవర్గానికే ఆశ్చర్యానికి గురిచేసింది. మూడోరోజు కూడా అదే పంథాలో సాగి అధికారపక్షాన్ని నిలదీయడం, రోడ్డుపై బైఠాయించడం, ఎంఐఎం మినహా ఇతరవిపక్షాల సభ్యులను పోలీస్‌స్టేషన్‌కు తరలించడం వంటివి చకచకసాగిపోయాయి. ఈ పరిణామాలతో జానారెడ్డి నేతృత్వంలో విపక్షాలు పైచేయిని సాధించినట్లుగా అయ్యింది. ఇక సోమవారం నుంచి జరగనున్న సమావేశాల్లో వ్యూహ,ప్రతివ్యూహాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుత సమావేశాలు ముగిసేనాటికి స్లో అండ్ స్టడీ విన్స్‌ది రేస్ అన్నట్లుగా వ్యవహరిస్తున్న జానారెడ్డి ప్రభుత్వాన్ని ఇరకునపెట్టగలుగుతారా లేక అధికారపక్షమే విపక్షాలను పూర్తిగా నిలవరించి సత్తాను చాటుకుంటుందా అన్నది చర్చనీయాంశమైంది. అయితే తరువాతి లేదా చివరి అస్త్రంగా జానారెడ్డి అవిశ్వాసతీర్మానం వంటిదాన్ని తీసుకొచ్చి ప్రతిపక్షాలన్నింటికి ఒకేతాటిపైకి తీసుకువస్తారా ? అన్నది వేచి చూడాలని పార్టీ ముఖ్యులు చెవులు కొరుక్కుంటున్నారట... చివరకు ఏమి జరుగుతుందోనని రాబోయే రోజుల కోసం ఒకింత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారట...! -
'భోజనం చేశాక బాగా మాట్లాడుకోవచ్చు'
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ముగిశాక తెలంగాణ అసెంబ్లీలో కొన్ని అప్యాయతతో నిండిన మాటలు వినిపించాయి. రైతుల ఆత్మహత్యల విషయంపై తాను సలహాలు ఇవ్వాలనుకుంటున్నకాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడుతూ తన సలహా సుదీర్ఘంగా ఉంటుందని, మీకు అభ్యంతరం లేకుంటే సగం ఇప్పుడు.. మరో సగం భోజన కార్యక్రమం ముగించుకొని వచ్చాక చెబుతానని సభకు తెలియజేశారు. లేదంటే సభ్యులు భోజనం పూర్తి చేశాకే మాట్లాడదామని, అంతా మీ ఇష్టం అని అన్నారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. 'భోజనం చేస్తేనే బాగా మాట్లాడుకుంటాం, విస్తృతంగా చర్చించుకుంటాం. అందుకే భోజనం తర్వాత మీ సలహాలు ఇవ్వండి' అని అన్నారు. అందుకు జానారెడ్డి స్పందిస్తూ భోజనం చేశాక మీరూ వస్తారా అని ప్రశ్నించగా తప్పకుండా వస్తాను.. అందరం మంచిగా చర్చించుకుందాం అదేందే అట్లాంటారు. భోజనం చేసి వద్దాం నో ప్రాబ్లమ్' అనగానే సభలో నవ్వులు విరిశాయి. దీంతో స్పీకర్ సభను అరగంట పాటు భోజన కార్యక్రమం కోసం వాయిదా వేశారు. -
మంత్రుల తీరుపై జానారెడ్డి సీరియస్
-
మంత్రుల తీరుపై జానారెడ్డి సీరియస్
రైతుల సమస్యలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రులు వ్యవహరిస్తున్న తీరు, వాళ్ల పద ప్రయోగంపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి మండిపడ్డారు. ''మీరు మాట్లాడుతున్న తీరు, ప్రతి మంత్రి లేస్తున్న తీరును ఈ సభ చూస్తోంది.. సభలో మంత్రుల వైఖరి సరిగా లేదు. ఈ పాపం మీదే అని ఒప్పుకోవాలి. ఏదైనా సమస్య చర్చకు వస్తే వాళ్ల ఫీలింగ్ ఏంటి అనేది చూడాలి. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు, మజ్లిస్, బీజేపీల సమస్య కాదు.. ప్రజల సమస్య. ప్రజల ఆవేదనను, బాధలను ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలని ప్రభుత్వం యోచించడానికి ఇది ఉపయోగపడాలి. ప్రజల బాధలను చెబుతున్నాం తప్ప కాంగ్రెస్ బాధ చెప్పడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల బాధలను వినిపించడానికి ప్రతిపక్షం ఉంది, సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం ఉంది. ప్రజలు అన్నీ గమనించిన తర్వాత తీర్పు ఇస్తారు. ఈలోపే ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణం అంటే సబబు కాదు. దీన్ని పదే పదే అంటున్నారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి చెబుతున్నాను. నువ్వెంత అంటే నువ్వెంత అనడానికి ఈ సభ లేదు. అలాంటి పదాలు ప్రయోగిస్తే సభ సజావుగా జరగదని చెబుతున్నా'' అని ఆయన స్పష్టం చేశారు. దానికి సీఎం కేసీఆర్ స్పందించారు. ''జానారెడ్డి సూచన స్వీకరించాల్సిందే. పరస్పర నిందారోపణకు బదులు అసలు సమస్యపై దృష్టిపెట్టాలి. సభా సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని మాట్లాడాలి. ఇక దీనిపై మాట్లాడకుండా అసలు సమస్యలోకి వెళ్దాం. పూర్తిస్థాయిలో సభ జరగాలని కోరుకుంటున్నాం. ప్రతిపక్షాల నుంచి ఉత్తమ సలహాలు వస్తాయని భావిస్తున్నా. నిర్మాణాత్మకమైన సలహాలను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. అవి అందరూ అందించండి'' అని ఆయన చెప్పారు. -
రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో నిలదీస్తాం
కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు జానారెడ్డి * మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి * ప్రభుత్వం తప్పించుకోవాలని చూడడం సరికాదు * రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి: ఉత్తమ్ నారాయణఖేడ్ రూరల్: అన్నదాతల ఆత్మహత్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు జానారెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు ఆదివారం వచ్చిన ఆయన మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉన్నందున ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, సాగులో నష్టాల కారణంగా రైతు ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. 1997 నుంచి 2004 వరకు రైతు ఆత్మహత్యలు కొనసాగడంవల్ల అనంతరం వచ్చిన తమ ప్రభుత్వం విద్యుత్, విత్తనాలు, ఎరువుల సమస్యలను పరిష్కరించిందని గుర్తుచేశారు. రూ.1,300 కోట్లు మాఫీచేసి రైతులకు ఊరట కలిగించినట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అట్టహాసాలు, ప్రదర్శనలు, అధికార పటాటోపం తప్ప రైతులను ఆదుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ లింబయ్య మరణంపై ప్రభుత్వం వాద ప్రతివాదనలకు పోకుండా ఆదుకోవాలన్నారు. రైతు ఆత్మహత్యలపై కమిటీల ద్వారా పరిశీలించి సత్యాసత్యాలు నిర్ధారించి బయటపెట్టాలని తెలిపారు. ప్రతీదానికి తప్పించుకోజూడటం సరికాదని ప్రభుత్వానికి హితవుపలికారు. కలసికట్టుగా పనిచేయాలి భేదాభిప్రాయాలు విడనాడి కాంగ్రెస్ గెలుపు కోసం కలసికట్టుగా పాటుపడాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు జానారెడ్డి పిలుపునిచ్చారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి సంతాప సభను ఆదివారం నారాయణ ఖేడ్‌లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. కిష్టారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉత్తమ్, జానా మాట్లాడుతూ, భేదాభిప్రాయాలున్నా మాజీ ఎంపీ సురేశ్ షెట్కర్, కిష్టారెడ్డిలు పార్టీ శ్రేయస్సు కోసం కలసి పనిచేశారన్నారు. ఏదైనా ప్రభుత్వ పథకానికి కిష్టారెడ్డి పేరు పెట్టాలని అసెంబ్లీలో అడుగుతామన్నారు. సురేష్ షెట్కర్ మాట్లాడుతూ... వైఎస్ అప్పట్లో తనను, కిష్టారెడ్డిని కూర్చోబెట్టి మాట్లాడి ఒక్కటి చేశారన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను పార్లమెంట్ స్థానానికి, కిష్టారెడ్డిని అసెంబ్లీకి పోటీచేయించి కాంగ్రెస్ గెలిచేలా పాటుపడ్డారన్నారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి సునీతారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, కిష్టారెడ్డి కుమారులు సంజీవరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు. రైతులను వేధిస్తే కేసులు: ఉత్తమ్ బలవంతపు వసూళ్లతో రైతులను వేధింపులకు గురిచేసే ప్రైవేట్ వడ్డీవ్యాపారులపై ప్రభుత్వం కేసులు నమోదు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. మరణించిన రైతుల సంఖ్యను ప్రభుత్వం తగ్గించి చెప్పడం, ఆత్మహత్యలను దాచడానికి ప్రయత్నించడం సరికాదని ఉత్తమ్ అన్నారు. -
'అధికారమదంతో గూండాయిజం సరికాదు'
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడిని తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్షనేత కె.జానారెడ్డి తీవ్రంగా ఖండించారు. అధికారమదంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూండాయిజం చేయడం సరికాదని సూచించారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జోక్యం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే దాడి ఘటన స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే బాలరాజుపై కేసు నమోదు చేయాలని జానారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
'రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు'
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయని మాజీ మంత్రి, సీఎల్పీ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. రైతులు ఇబ్బందులు పడుతూ తీవ్ర ఆందోళనలో ఉన్నారని జానా ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతుల సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలని ప్రభుత్వానికి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అవతకలపై సీఐడీ విచారణను ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. అవతవకలకు ఎవరు పాల్పడినా బయటపెట్టాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యపై సీఎంతో చర్చించేందుకు సచివాలయానికి వచ్చిన వివిధ పార్టీల నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల నుంచి వినతులు తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో చర్చించి సమ్మెను విరమింపచేయాలని జానారెడ్డి సూచించారు. -
మోతే ఘాట్‌లో ప్రముఖల స్నానాలు
బూర్గంపాడు: ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతే గోదావరి ఘాట్‌లో సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం పుష్కర స్నానం చేశారు. అనంతరం వారు భద్రాచలం సీతారాములను దర్శనం చేసుకున్నారు. కాగా, బుధవారం ఉదయం మోతే పుష్కర ఘాట్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. -
జానారెడ్డిని మార్చం
హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ నేతగా జానారెడ్డి మార్చే ఉద్దేశం లేదని ఏఐసీసీ నేత కుంతియా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాను ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి అభిప్రాయాన్నిసేకరించలేదన్నారు. డీఎస్ వంటి వారు అధికారం కోసం పార్టీ మారుతున్నారని, ఆయన మారడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఏఐసీసీ నేత కుంతియా విమర్శించారు. తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామని కుంతియా వెల్లడించారు. ఇందుకోసం విరాళాలు సేకరిస్తామన్నారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ నెలాఖరుకల్లా ఈ కార్యక్రమం దాదాపు 25 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 24న రాహుల్ గాంధీ అనంతపురంలో రాహుల్ పర్యటిస్తారని తెలిపారు. సుమారు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే వరంగల్ ఉపఎన్నికల్లో పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మీరాకుమార్ ప్రస్తావన రాలేదన్నారు. రంజాన్ సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ము స్లిం సోదరులకు ఇప్తార్ విందులను ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. -
'తిట్టించుకుని.. మళ్లీ అక్కడికే వెళ్లారు'
హైదరాబాద్: సీనియర్ నేత డీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ పేర్కొన్నారు. వారు గురువారం మీడియాతో మాట్లాడారు. పదవి లేకుండా డీఎస్ నెల రోజులు కూడా ఉండలేక పోయారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. డీఎస్ ను దూషించిన కేసీఆర్ వద్దకే ఆయన వెళ్లారని చెప్పారు. పదే పదే పెద్ద పదవులు తనకే ఉండాలనడం డీఎస్ స్థాయి వ్యక్తికి సరికాదని పేర్కన్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎస్ కు ఉన్నత పదవులు ఇచ్చిందని, ఆయనకు పార్టీలో సముచిత గౌరవమే దక్కిందని వివరించారు. అన్ని పదవులూ అనుభవించి పార్టీని వీడడాన్ని ప్రజలెవరూ హర్షించరని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. డీఎస్ పార్టీని వీడడం బాధాకరమని, ఆయనది అనాలోచిత నిర్ణయమని జానారెడ్డి అన్నారు. ఆయన రాజీనామా ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను అవమానించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా తాను పార్టీ సిద్ధాంత ప్రకారమే నడుచుకుంటున్నానని తెలిపారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ ను విలీనం చేసే పనిని హైకమాండ్ ఎవరికి అప్పగించిందో తెలియదని, ఆ పనిని పార్టీ నేతలు సరిగా డీల్ చేయలేదని డీఎస్ ఎలా వ్యాఖ్యానించారో ఆయనే వివరించాలని జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో డీఎస్‌కు పదవులు దక్కాయే తప్ప, అవమానాలు పడ్డారనడం వాస్తవం కాదని భట్టి విక్రమార్క అన్నారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే డీఎస్ టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. -
'తిట్టించుకుని.. మళ్లీ అక్కడికే వెళ్లారు'
-
జానారెడ్డితో విభేదించిన భట్టి విక్రమార్క
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి వ్యాఖ్యలతో విభేదించారు. తన భాష హుందాతనం గురించి జానా ఏం మాట్లాడారో తెలియదని భట్టి విక్రమార్క అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఏ సన్నాసితో (పూర్తి కథనం) మాట్లాడారో తెలియదని చెప్పానని, ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై మాట్లాడటం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కాగా భట్టి విక్రమార్క హుందాగా వ్యవహరించాలని జానారెడ్డి సూచించిన విషయం తెలిసిందే. కేసీఆర్ పరుష పదజాలం వాడితే తప్పుపడుతున్న కాంగ్రెస్ నేతలు ఆ పదాన్ని వాడటం సరికాదని జానా అన్నారు. -
ఐదో అభ్యర్థిని నిలబెట్టాలని టీఆర్ఎస్ నిర్ణయం
-
ఐదో అభ్యర్థిని నిలబెట్టాలని టీఆర్ఎస్ నిర్ణయం
హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అయిదో సీటుపై కన్నేసిన టీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టేందుకు నిర్ణయించింది. బుధవారం రాత్రికి అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రకటించనుంది. కాగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే ప్రధాన పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రాత్రికల్లా టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలు ప్రకటించనున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేత జానారెడ్డి ఈ రోజు ఉదయం టీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావుతో భేటీ అయిన విషయం తెలిసిందే. -
టీఆర్ఎస్ సీనియర్ నేత కేకేతో జానారెడ్డి భేటీ
హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి బుధవారం ఉదయం టీఆర్ఎస్ సీనియర్ నేత కేకేతో భేటీ అయ్యారు. కాగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఐదో సీటుపై టీఆర్ఎస్ కన్నేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే ఇంటికి కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి వెళ్లడం చర్చనీయాంశమయ్యింది. కాగా భేటీ అనంతరం కేకే మాట్లాడుతూ తమ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. దాంతో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిపై ఉత్కంఠ నెలకొంది. క్యాండిడేట్ ఎవరనేది అధిష్టానం బుధవారం సాయంత్రానికి ప్రకటించనుంది. పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు కోసం 40 మంది నేతలు పోటీ పడుతున్నారు. టి కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లు ఎమ్మెల్సీ టికెట్ కోసం నెలల తరబడిగా పార్టీ హై కమాండ్‌తో లాబీయింగ్ చేసుకుంటున్నారు. అభ్యర్ధి ఎంపిక అధికారం సోనియాదైతే సీనియర్లకు... రాహుల్ సిఫారసే కీలకమైతే జూనియర్లకు కూడా ఎమ్మెల్సీ ఛాన్స్ రావచ్చనేది టి కాంగ్రెస్ నేతల అంచనా. క్యాండిడేట్ సెలక్షన్‌పై హై కమాండ్ నేతలు బుధవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలతో ఫోన్లో మాట్లాడుతారని సమాచారం. -
మూడో రోజూ ముంచెత్తిన వాన
రెండు అల్పపీడన ద్రోణులతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పదేళ్ల తర్వాత కీలకమైన ఎండాకాలంలో ఈ పరిస్థితి గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు 59 వేల హెక్టార్లలో పంటలకు నష్టం రూ.400 కోట్ల మేర నష్టం ఉండొచ్చంటున్న ప్రభుత్వ వర్గాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. ఇక మంగళవారం కూడా రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. వేల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. ఆల్ట్రోస్ట్రాటస్ మేఘాల వల్లే.. ఏప్రిల్‌లో భారీ వర్షాలు కురవడం చర్చనీయాంశమైంది. వేసవిలో ఉరుములు, వడగళ్ల వాన కురవడం సాధారణమైనా.. ఎడతెరిపి లేకుండా 4 రోజుల పాటు భారీ వర్షాలు కురవడం అసాధారణమేనని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు ఒక అల్పపీడన ద్రోణి, లక్షద్వీప్ నుంచి గుజరాత్ వరకు కర్ణాటక మీదుగా మరో అల్పపీడన ద్రోణి ఏర్పడ్డాయని... వీటి మూలంగా ‘ఆల్ట్రోస్ట్రాటస్’ పేరుగల దట్టమైన మేఘాలు ఏర్పడి, వర్షాలు కురుస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షం పడుతూ, మళ్లీ ఎండలు కాస్తూ ఉంటాయని.. అదే ఆల్ట్రోస్ట్రాటస్ మేఘాల వల్ల కొద్దిరోజుల పాటు నిరంతరాయంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు పేర్కొంటున్నారు. మారిపోయిన పరిస్థితి.. వాతావరణం గంట గంటకూ మారుతోంది. వాతావరణ శాస్త్రవేత్తలు ఉదయం ఒక అంశాన్ని నిర్ధారిస్తే.. సాయంత్రానికి ఆ పరిస్థితి మారిపోతోంది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రతినిధి నర్సింహారావు ‘సాక్షి’కి చెప్పారు. కామారెడ్డిలో కుండపోత.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో 11 సెంటీమీటర్ల వర్షం పడింది. కొన్నిచోట్ల అరకిలో మేర వడగళ్లు పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో అనేకచోట్ల భారీ చెట్లు కూడా నేలకూలాయి. పంట పొలాలు, మామిడి చెట్లు నేలమట్టమయ్యాయి. భారీగా నష్టం:రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంగళవారం నాటికి వేసిన అంచనా ప్రకారం... 34,216 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, పెసర పంటలు ధ్వంసమైనట్లు వ్యవసాయశాఖ అదనపు డెరైక్టర్ విజయ్‌కుమార్ వెల్లడించారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 15,125 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వరి 20,724 హెక్టార్లలో, మొక్కజొన్న 1,466 హెక్టార్లలో, నువ్వులు 7,807 హెక్టార్లలో, సజ్జ 3,235 హెక్టార్లలో, జొన్న 933 హెక్టార్లలో, పెసర 51 హెక్టార్లలో నష్టపోయినట్లు తెలిపారు. ఇక 25 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామని ఆ శాఖ ఉన్నతాధికారి చెప్పారు. మొత్తంగా వ్యవసాయ, ఉద్యానవన పంటల నష్టం రూ.400 కోట్ల మేర ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. పంటలకు జరిగిన నష్టం (హెక్టార్లలో..) జిల్లా నష్టం కరీంనగర్ 15,125 నిజామాబాద్ 7,039 నల్లగొండ 6,446 ఆదిలాబాద్ 2,401 మహబూబ్‌నగర్ 1344 రంగారెడ్డి 763 మెదక్ 584 ఖమ్మం 434 వరంగల్ 78 మొత్తం 34,216 రాజధానిలో నలుగురు బలి సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షం రాజధాని హైదరాబాద్‌లో 4 నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఉప్పుగూడ అరుంధతీ నగర్ కాలనీలోని ఓపెన్‌నాలాలో పడిపోయి సంజ య్(7) అనే బాలుడు మృతిచెందాడు. తుకారాంగేట్ వద్ద రైల్వే వరద కాల్వలో పడి గుర్తుతెలియని వ్యక్తి(50) మృత్యువాత పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. భారీ వర్షంతో తెగిపడిన విద్యుత్ తీగల కారణంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచెర్లకు చెందిన కె.లక్ష్మణ్ రాజు(18), సోమరాజు(12) ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం 11 గంటలకు మియాపూర్ ఆల్విన్ కాలనీ వద్ద ఉన్న నాలాలో ఇనుప చువ్వలు ఏరుకుంటుండగా.. అక్కడ తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి వారు మరణించారు. ఇక హైదరాబాద్‌లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం 11 వరకు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం అతలాకుతలమైంది. ప్రధాన రహదారులపై మోకాళ్లలోతున వరదనీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు ఈ వర్షాలతో నగరానికి ఆనుకొని ఉన్న జంట జలాశయాల్లో అర అడుగు మేర నీటిమట్టాలు పెరిగాయి. తడిసిన ధాన్యంపై హరీశ్‌రావు సమీక్ష సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యంపై మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తడిసిన ధాన్యం వల్ల రైతులకు కలిగే ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ జిల్లా రామన్నపేట మార్కెట్ యార్డులో వెయ్యి క్వింటాళ్ల ధాన్యం, నకిరేకల్ మార్కెట్ యార్డులో 800 క్వింటాళ్ల ధాన్యం వర్షం వల్ల తడిసిపోయిందని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తడిచిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మద్దతు ధరకు కొనేందుకు అంగీకరించిందని వెల్లడించారు. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడవకుండా వాతావరణ శాఖ సూచనలను రైతులకు తెలపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇది తీరని నష్టం..: జానా 48 గంటల్లో ఆదుకోవాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: అకాలవర్షాల వల్ల రైతులకు తీరని నష్టం జరిగిందని, 48 గంటల్లోగా వారిని ఆదుకోవాలని సీఎల్పీ నేత కె.జానారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. గత ఏడాది రబీలో తీవ్రమైన వర్షాభావంతో పంటలు ఎండిపోవడంతో పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయన్నారు. ఈ ఏడాది కరువు ఉన్నా ఆశతో అప్పులు చేసి, సాగుచేసుకున్న పంటలు ఈ వర్షాలతో పూర్తిగా పాడైపోయాయని జానారెడ్డి వివరించారు. మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్టుగా రైతులు ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉంటే ఈ అకాల వర్షాలు వారికి మరింతగా నష్టాన్ని తీసుకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. 48 గంటల్లోగా నష్టాన్ని అంచనావేసి, తక్షణ సాయం అందించాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. -
'పోలీసులు సరిగానే వ్యవహరించారు'
హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం శివారులో శనివారం ఉదయం ఎన్కౌంటర్ ఘటనలో పోలీసులు సరిగ్గా వ్యవహరించినట్లు సీఎల్పీ నేత కుందూరు జానా రెడ్డి పేర్కొన్నారు. దుండగులు జరిపిన ఎదురు కాల్పులలో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందగా, ఆత్మకూరు ఎస్ఐ సిద్ధయ్య, రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ నాగరాజు నాగరాజు కుటుంబానికి జానారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సూర్యాపేట ఘటనలో, ఈ రోజు జరిగిన ఎదురు కాల్పులలో పోలీసులు మృతి చెందడం దురదృష్టకరం అన్నారు. -
'వాటర్ గ్రిడ్ కాదు.. స్కాం గ్రిడ్, కరప్షన్ గ్రిడ్'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన వాటర్ గ్రిడ్ పథకం అవినీతి మయమైందని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ మండిపడ్డారు. శనివారం ఇక్కడ వారు మీడియాతో మాట్లాడుతూ.. అది వాటర్ గ్రిడ్ కాదు.. స్కాం గ్రిడ్, కరప్షన్ గ్రిడ్ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడికి రూ.40వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చే విధంగా టెండర్లలో అవకతవకలు జరిగాయని వారు విమర్శించారు. ముడుపుల కోసం తమకు కావాల్సిన కంపెనీలు క్వాలీఫై అయ్యేవిధంగా స్వల్ప తేడాతోనే టెండర్లు వేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాంట్రాక్టుల్లో ఒక్క తెలంగాణ కాంట్రాక్టరుకు కూడా చోటు దక్కలేదని.. వెంటనే వీటిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిబంధనలు సవరించి మరోసారి టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. అధికారం ఉందనే అహంకారంతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. మంత్రి కేటీర్ తన తీరు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వాటర్ గ్రిడ్‌లో అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా న్యాయపరమైన చర్యలు చేపడుతామని ఉత్తమ్, జానారెడ్డి, భట్టి, షబ్బీర్ అన్నారు.