
ఉల్లాసంగా ఉత్సాహంగా జానా ప్రసంగం!
హైదరాబాద్: ప్రభుత్వం ఉత్తర్వుల (జీవోల) వివరాలు తెలియజేసే వెబ్‌సైట్‌ను తెలంగాణ ప్రభుత్వం మూసివేసిందని, దీనిని వెంటనే తిరిగి తెరువాలని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ బడ్జెట్‌పై ఆయన గురువారం కూడా అసెంబ్లీలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. 2014-15 బడ్జెట్‌లో 60శాతం నిధులను మాత్రమే ఖర్చు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్‌లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేసినట్టు చూపినప్పటికీ, నిజానికి ఆ కేటాయింపులకు తగిన రాబడి ఖజానాకు లేదని జానారెడ్డి విమర్శించారు.
నిన్నటిమాదిరిగానే జానారెడ్డి ఉల్సాసంగా, ఉత్సాహంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. బడ్జెట్‌లోని అన్ని అంశాలను వివరంగా ప్రస్తావించాల్సి ఉన్పప్పటికీ, ఇతర సభ్యులకు కూడా అవకాశం ఇవ్వాలన్న ధోరణితో ఒక్కో అంశాన్ని మాత్రమే ఉదాహరణగా ప్రస్తావిస్తున్నానని ఆయన చెప్పారు. గ్రామీణాభివృద్ధి అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మంత్రి సభలో లేనందున.. దానిని తర్వాత ప్రస్తావిస్తానని ఆయన పేర్కొన్నారు. అయితే పెద్దలు జానారెడ్డి నింపాదిగా తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించవచ్చునని, ఆయన ప్రసంగానికి ఆంటకం కలిగించకుండా, ఆయన ప్రస్తావించిన అంశాలను రాసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారని, అందుకే తామంతా శ్రద్ధగా జానారెడ్డి ప్రసంగాన్ని వింటున్నామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ బదులిచ్చారు. దీంతో తన సహజ ధోరణిలో జానారెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
జానారెడ్డి తన ప్రసంగంలో ఏమన్నారంటే..
ప్రాణహిత ప్రాజెక్టుపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలి
ప్రాణహిత ప్రాజెక్టుపై జాతీయ సంస్థతో ప్రభుత్వం అధ్యయనం చేయించాలి