హైదరాబాద్: ప్రముఖ కవి, గేయ రచయిత గూడ అంజయ్య మృతి పట్ల ఏపీసీసీ ఛీఫ్ రఘువీరారెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కోట్లాది పేద ప్రజాలను తన పాటలతో చైతన్య పరిచిన గూడ అంజయ్య లేని లోటు తీరనిదన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గూడ అంజయ్య మృతిపట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలంగాణా ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ శాసనపక్ష ప్రతిపక్ష నేత శ్రీ కుందూరు జానారెడ్డి తమ సంతాపాన్ని ప్రకటించారు. అంజన్న మృతి తెలంగాణా సమాజానికి తీరని లోటని జానారెడ్డి అన్నారు. ఉద్యమ నేపథ్యంలో ఆయన రాసిన పాటలు, గేయాలు ఎంతో ఉత్తేజాన్ని కలిగించాయన్నారు. గూడ అంజన్న ఆత్మకు శాంతి చేకూరాలని..ఆయన కుటుంబ సభ్యులకు జానారెడ్డి సానుభూతి తెలిపారు.