Uttam
-
తెలంగాణలో రెండో రోజు గ్రామసభల్లోనూ గందరగోళం
-
కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు... డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు
హైదరాబాద్: తెలంగాణలో 6 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులూ, తప్పులు సరిచేయడం తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తామని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్‌పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో సోమవారం (డిసెంబర్ 18) కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) భేటీ జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గురించి మంత్రులు, కాంగ్రెస్ నేతలకు మంత్రి ఉత్తమ్ కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 నుంచి దరఖాస్తులు స్వీకరించి, గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో సుమారు ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ లేదు. ఉన్న కార్డుల్లో పేర్ల నమోదుకు కూడా అవకాశం ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్నవారికి ఎదురుచూపులే మిగిలాయి. రేషన్ కోసమే కాకుండా, ఆరోగ్యశ్రీ తదితర సేవలకూ రేషన్ కార్డులు తప్పనిసరి అయ్యాయి. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఆయా సేవలు అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. -
ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ లో అలజడి
-
ఒరిజినల్ కాంగ్రెసును కాపాడుకోవడమే మా లక్ష్యం : ఉత్తమ్
-
ఉత్తమ్ గాల్వాకు తగ్గిన నష్టాలు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మెటల్స్ కంపెనీ ఉత్తమ్ గాల్వా స్టీల్స్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర నష్టం భారీగా తగ్గి రూ. 26 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇ దే కాలంలో రూ. 68 కోట్ల నికర నష్టం నమోదైంది. క్యూ4లో కోల్డ్ రోల్డ్, గాల్వనైజ్డ్ స్టీల్ తయారీకి కంపెనీ ఆదాయం సైతం రూ. 197 కోట్ల నుంచి రూ. 252 కోట్లకు బలపడింది. మొత్తం వ్యయాలు రూ. 264 కోట్ల నుంచి రూ. 278 కోట్లకు పెరిగాయి. -
సన్ ఫార్మా- ఉత్తమ్ గాల్వా.. భళా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్ రంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించడంతో మెటల్ రంగ కంపెనీ ఉత్తమ్ గాల్వా స్టీల్ కౌంటర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టారు. వెరసి సన్ ఫార్మా కౌంటర్ వరుసగా రెండో రోజు లాభాలతో సందడి చేస్తుంటే.. ఉత్తమ్ గాల్వా అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. వివరాలు చూద్దాం.. సన్ ఫార్మాస్యూటికల్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో సన్ ఫార్మాస్యూటికల్ నికర లాభం 70 శాతం ఎగసి రూ. 1,813 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 5 శాతమే పెరిగి రూ. 8,553 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 3.6 శాతం మెరుగుపడి 25.6 శాతాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో సన్ ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 6.5 శాతం జంప్‌చేసి రూ. 518ను అధిగమించింది. ప్రస్తుతం 5 శాతం లాభంతో రూ. 508 వద్ద ట్రేడవుతోంది. వెరసి గత రెండు రోజుల్లో ఈ షేరు 11 శాతంపైగా ర్యాలీ చేసింది. ఉత్తమ్ గాల్వా స్టీల్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఉత్తమ్ గాల్వా స్టీల్ రూ. 19.3 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2లో రూ. 335 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 142 కోట్ల నుంచి రూ. 195 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 321 కోట్ల నుంచి రూ. 176 కోట్లకు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ్ గాల్వా షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 6.50 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. కంపెనీకి సంబంధించి కార్పొరేట్ రుణచెల్లింపుల రిజల్యూషన్ చేపట్టేందుకు ఎస్బీఐకు ఎన్సీఎల్టీ అనుమతించింది. -
ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు సంబంధించి టీఆర్ఎస్, టీడీపీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం సాయంత్రం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తదితరుల సమక్షంలో గాంధీ భవనలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. వీరిలో ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తలతోపాటు సీపీఐ (ఎంఎల్)కు చెందిన నాయకులు కూడా ఉన్నారు. వీరందరికీ ఉత్తమ్, భట్టిలు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఖమ్మం డీసీసీ నేత పూవ్వాళ్ల దుర్గాప్రసాద్, ఇల్లందు మున్సిపాలిటీ కాంగ్రెస్ పక్ష ఫ్లోర్ లీడర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థకు దెబ్బ
సాక్షి, హైదరాబాద్: నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మద్దతు ఇచ్చారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్ నుంచి పీపుల్స్‌ప్లాజా వరకు కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దుయ్యబట్టారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దీనివల్ల నల్లధనం మార్చుకోవడం అక్రమార్కులకు సులువైందని ఆయన వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీది చీకటి నిర్ణయమని సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి విమర్శించారు. నోట్ల రద్దును సమర్థించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్థిక వ్యవస్థపై దాడి: జానారెడ్డి ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు .. ఆర్థిక వ్యవస్థపై దాడి అని అభివర్ణించారు. ప్రజలు సంయమనం పాటించినా ప్రయోజనాలు రాలేదన్నారు. నియంతృత్వ పాలనకు నోట్ల రద్దు నిర్ణయం పరాకాష్ట అని విమర్శించారు. చిన్న పరిశ్రమలు మూతపడ్డాయని, కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని అన్నారు. కాంగ్రెస్‌ను దూషిస్తూ కేంద్రం అసహనాన్ని ప్రదర్శిస్తోందన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి సంక్షోభంలో ఉందన్నారు. మాజీ ఎంపీ మధు యాష్కీ మాట్లాడుతూ దేశానికి ప్రధాని చేసిన మోసాన్ని ఎండగట్టాలన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయం మెదడు లేని నిర్ణయమన్నారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్‌కు, కూతురు కవితకు, అల్లుడు హరీశ్‌రావుకు ఈడీ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమో కాదో చెప్పాలని మధు యాష్కీ డిమాండ్ చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ మోదీ ఓ క్రిమినల్ అని వ్యాఖ్యానించారు. నోట్లరద్దులో సంపన్న వర్గాలకు కొమ్ముకాశారని ఆరోపించారు. -
రేవంత్ రాకను స్వాగతించాల్సిందే
-
రేవంత్ రాకను స్వాగతించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత ఎ.రేవంత్‌రెడ్డి చేరికను పార్టీ నేతలంతా స్వాగతించాల్సిందేనని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా స్పష్టం చేశారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో గోల్కొండ హోటల్లో వేర్వేరుగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి చేరికపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు వర్తమాన రాజకీయ పరిస్థితులపై పార్టీ నేతల మనోగతాన్ని చెప్పుకోవడానికి ఏఐసీసీ నుంచి అవకాశం కల్పించే ఉద్దేశంతో కుంతియా వారితో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మాజీమంత్రి, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ తదితరులు కుంతియాతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ నెల 31న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్‌రెడ్డి చేరిక ఉంటుందని పార్టీ నేతలకు కుంతియా అధికారికంగా వెల్లడించారు. రేవంత్‌కు పార్టీలో ఎలాంటి అవకాశాలు వస్తాయనే అంశం పూర్తిగా రాహుల్ గాంధీ పరిధిలో ఉంటుందని వివరించారు. పెద్దనోట్ల రద్దుపై నవంబర్ 8న నిరసన పాటిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా తెలంగాణలో నవంబర్ నెలలో రాహుల్ గాంధీ బహిరంగసభ ఉంటుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డి చేరిక పార్టీకి అవసరమేనని కుంతియా చెప్పారు. దీనికి రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు అంగీకరించినట్టుగా తెలిసింది. షరతులేమీ లేవు.. పనితీరే ప్రామాణికం: కుంతియా రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా షరతులేమీ ఉండవని, నాయకుల పనితీరును బట్టి పదవులు, ప్రాధాన్యం ఉంటుందని కుంతియా స్పష్టం చేశారు. పార్టీ నేతలతో భేటీ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అందుబాటులో ఉన్న ముఖ్యనేతలను కలుస్తున్నట్టుగా చెప్పారు. రాహుల్ గాంధీ సమక్షంలో 31న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారని చెప్పారు. రేవంత్ రాకను రాష్ట్ర నాయకులెవరూ వ్యతిరేకించడం లేదన్నారు. ఈ అంశంపై మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌నేత డి.కె.అరుణతో ఇప్పటికే చాలాసార్లు మాట్లాడినట్టు ఆయన చెప్పారు. అరుణ కూడా పెద్దగా వ్యతిరేకించడంలేదన్నారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు టచ్‌లో ఉన్నారని, త్వరలోనే వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వెల్లడించారు. అధిష్టానం చెప్పినట్టు పనిచేస్తాం: డీకే కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా స్వాగతిస్తామని, అధిష్టానం ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేస్తామని మాజీమంత్రి డి.కె.అరుణ చెప్పారు. పార్టీకోసం పనిచేస్తున్న తమలాంటి వారి పాత్ర ఎలా ఉందో రేవంత్‌రెడ్డి పాత్ర కూడా అలాగే ఉంటుందని అన్నారు. అధికారపార్టీ నుంచి చేరికలు: ఉత్తమ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. అలాగే ఇతర పార్టీల నేతలు మాట్లాడుతున్నారని, అవన్నీ సరైన సమయంలో ఉంటాయని అన్నారు. నవంబర్ రెండో వారంలో రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా మహబూబాబాద్‌లో గిరిజన గర్జన పేరుతో బహిరంగసభ ఉంటుందన్నారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన మాటలను కూడా అమలుచేయడంలేదని ఉత్తమ్ విమర్శించారు. -
‘సమితుల’ రద్దు కోసం సత్యాగ్రహం
సాక్షి, హైదరాబాద్: ‘రైతు సమన్వయ సమితులు రద్దు కావాలి, గ్రామ పంచాయతీలు బలపడాలి’అన్న నినాదంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సత్యాగ్రహం చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సోమవారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజలను కష్టాల సుడిగుండంలోకి నెడుతుందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారని, అన్ని స్థాయిల్లో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను అక్రమంగా చేర్చుకుంటున్నారని, ఇతర పార్టీల ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాజాగా తమ నిరంకుశ చర్యలకు పరాకాష్టగా జీవో 39ని ప్రభుత్వం తెచ్చిందని.. ఈ జీవో ఆధారంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. మంత్రులు సభ్యులను నామినేట్ చేస్తూ.. టీఆర్ఎస్ కార్యకర్తలను నింపుతున్నారని ఆరోపించారు. దీనివల్ల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, నీటి వినియోగదారుల సంఘాల చైర్మన్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, పాలక వర్గాల సభ్యుల పాత్ర నామమాత్రం కానుందని వివరించారు. భూ రికార్డుల ప్రక్షాళన, అమ్మకాలు, కొనుగోళ్లలో కూడా రైతు సమన్వయ సమితులు జోక్యం చేసుకుని ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తాయని, అవినీతికి పాల్పడతాయని, భూ రికార్డులను చేతిలో పెట్టుకుని గ్రామీణ ప్రజలను, ఇతర పార్టీల, సంఘాల కార్యకర్తలను, వ్యక్తులను బెదిరించి లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాయని అనుమానం వ్యక్తం చేశారు. గ్రామాలపై టీఆర్ఎస్ గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టడానికే ఈ సమితులు ఉపయోగపడే ముప్పుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిరంకుశ చర్యలను అడ్డుకోకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతారని, కాంగ్రెస్ నాయకులుగా, కార్యకర్తలుగా ప్రజల పక్షాన నిలబడటం బాధ్యతన్నారు. -
మెట్రో పని మాది.. పేరు మీదా?
-
మెట్రో పని మాది.. పేరు మీదా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన కృషి ఫలితమే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టని.. ఈ పనిని తాము ప్రారంభిస్తే.. ఇప్పుడు టీఆర్ఎస్ సర్కారు పేరు పెట్టుకుంటోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, పార్టీ నేతలు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్, దానం నాగేందర్, సర్వే సత్యనారాయణతో కలసి బుధవారం ఆయన నగరంలోని సుల్తాన్‌బజార్, మలక్‌పేట్, లక్డికాపూల్ మెట్రోస్టేషన్లను పరిశీలించారు. సుల్తాన్‌బజార్‌లో ఆస్తులు కోల్పోయిన బాధితులతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులను అనుమతించకపోవడంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మొత్తం పూర్తయ్యాకే ప్రారంభించాలి: దానం మూడు కారిడార్లలో 72 కి.మీ. మార్గంలో మెట్రో పనులు పూర్తయ్యాకే ప్రాజెక్టును ప్రారంభించాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేయాలని సర్కారుకు తెలియజెప్పేందుకే తాము మెట్రో స్టేషన్లను సందర్శిస్తున్నామని చెప్పారు. స్వల్ప దూరాలకు మెట్రో ప్రారంభిస్తే ప్రజలకు ఉపయోగం ఉండదని, ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్ హయాంలోనే బీజం పడిందని, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోనే పనులు మొదలయ్యాయని గుర్తుచేశారు. కేసీఆర్, మోదీకి ఈ ప్రాజెక్టుతో సంబంధంలేదన్నారు. పాతనగరంలో మూసీ మీదుగా మెట్రో అలైన్‌మెంట్‌ను మార్చడం దారుణమన్నారు. మెట్రో పనుల ఆలస్యం కారణంగా ఎల్అండ్టీ సంస్థకు రూ.4 వేల కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం లోపాయికారిగా అంగీకరించడంతోనే పాతనగరంలో మెట్రో పనులు తాజాగా మొదలయ్యాయన్న అనుమానం కలుగుతోందని చెప్పారు. యూపీఏ ఘనతే: సర్వే మెట్రో ప్రాజెక్టును సాధించిన ఘనత నాటి యూపీఏ, కాంగ్రెస్ సర్కారుతోపాటు సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌లకు దక్కుతుందని సర్వే సత్యనారాయణ చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. కేసీఆర్ రాష్ట్రానికి శనిలా దాపురించారని మండిపడ్డారు. మెట్రో ప్రాజెక్టులో రహస్యం ఏముంది: ఉత్తమ్ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో పనులను పరిశీలించేందుకు వచ్చిన తమను లోనికి అనుమతించకపోవడం దారుణమని, ఈ ప్రాజెక్టులో రహస్యం ఏముందని ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టు తెలంగాణ ప్రజలదని, హైదరాబాద్ ప్రజల సొత్తని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలపై ఆంక్షలు విధించి లోనికి అనుమతించక పోవడంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలైన్మెంట్ మార్పు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల మెట్రో ప్రాజెక్టు మూడేళ్లు ఆలస్యమవ్వడమేకాక.. ప్రభుత్వంపై రూ.3,500 కోట్ల ఆర్థికభారం పడిందని ఉత్తమ్ విమర్శించారు. మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇతర మెట్రో అధికారులు ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారన్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఘనత కాంగ్రెస్‌దే: షబ్బీర్ ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే, గోదావరి ప్రాజెక్టు, మెట్రో ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని షబ్బీర్ అలీ అన్నారు. తాము చేసిన పనులను ఇప్పుడు టీఆర్ఎస్ వారు చేసినట్లు చెప్పుకోవడం దారుణన్నారు. కేసీఆర్, కేటీఆర్ నగర అభివృద్ధికి చేసింది ఏమీ లేదని, మూడున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు వెచ్చించలేదని చెప్పారు. నగరంలో రహదారులు అధ్వానంగా మారాయని, డ్రైనేజీ సమస్యలతో జనం అవస్థలు పడుతున్నారని, ఈ ప్రభుత్వానిది జీరో పాలన అని ఎద్దేవా చేశారు. -
నగదు కొరతతో అప్పుల ఊబిలోకి రైతులు
- తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరిన టీపీసీసీ బృందం - రైతుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల్లో నగదు కొరత వల్ల రైతులు అప్పుల ఊబిలోకి పోతున్నారని, రైతును ఆదుకోవడానికి తగిన చర్యలను తీసుకోవాలని గవర్నర్‌కు టీపీసీసీ బృందం విజ్ఞప్తి చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో నేతల బృందం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో శనివారం కలిసింది. రైతుల సమస్యలు, నగదు కొరత, నకిలీ విత్తనాల వంటి వాటిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని వివరిం చారు. ప్రతిపక్షనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, పీఏసీ చైర్పర్సన్ గీతారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రులు డీకే అరుణ, దానం నాగేందర్, టీపీసీసీ కిసాన్‌సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి, మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు బృందంలో ఉన్నారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ మూడేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, తమ సొంత ఖాతాల్లోని డబ్బును కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. కూలీలకు ఉపాధి హామీ జీతాలివ్వడం లేదని విమర్శించారు. రుణమాఫీ 4 విడతల్లో చేయడం వల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, వడ్డీమాఫీ పథకంగా మారిపోయి బ్యాంకులకు ఉపయోగపడిందని విమర్శించారు. రైతుల పంటరుణాలపై వడ్డీభారం ప్రభుత్వమే భరిస్తుందని ఆరు నెలల క్రితం సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే హామీ ఇచ్చారని ఉత్తమ్ గుర్తుచేశారు. అయినా అమలు కాలేదన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్న కాంగ్రెస్ నేతలను అక్రమ కేసుల్లో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వరంగల్‌లో టీఆర్ఎస్ కార్పొరేటర్ హత్య కేసులో స్థానిక కాంగ్రెస్ నేత రాజేందర్‌రెడ్డిని అక్రమంగా ఇరికిస్తున్నారని, దీనిపై డీజీపీతో మాట్లాడినట్లు చెప్పారు. కేసు నుంచి రాజేందర్‌రెడ్డి పేరును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. పొంగులేటి మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసులో సంబంధమున్న వారందరిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. -
భూములు ఇచ్చారనడం అవాస్తవం
పీసీసీ అధ్యక్షుడి విమర్శలను తిప్పికొట్టిన ఎమ్మెల్యే రెడ్యానాయక్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లినందుకే తనకు హఫీజ్‌పూర్‌లో భూమిని నజరానాగా ఇచ్చారన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపణలు అవాస్తవమని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. హఫీజ్‌పూర్ సర్వే నంబర్ 80లో 2006 జనవ రిలో భూమి కొన్నామని, 2008లోనే తిరిగి అమ్మేశానని, అవి పూర్తిగా ప్రైవేట్ భూములని వివరించారు. టీఆర్ఎస్లో చేరాక, సెంట్ భూమి కొన్నానని ఆధారాలు చూపిస్తే, ఆ భూమి ఉత్తమ్‌కే రాసిస్తానన్నారు. -
అందరి చిట్టాలూ బయటపెడతాం
భూ అక్రమాల వ్యవహారంపై హరీశ్‌రావు ► మియాపూర్‌లో ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదు ► అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని బయటపెట్టింది సర్కారే ► సీఎం కుటుంబ సభ్యులు ఉన్నారంటూ గోబెల్స్ ప్రచారం ► పీసీసీ చీఫ్ ఉత్తమ్ తన ఆరోపణలు రుజువు చేయాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ అక్రమాల వ్యవహారంలో విపక్ష నేతలు సహా అందరి చిట్టాలూ బయటపెడతామని.. ఎవరినీ వదలబోమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నా రు. మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ప్రభుత్వ భూమి ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదని.. ఖజానాకు నయాపైసా నష్టం జరగలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీలు ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని ఆరోపిస్తున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... ఎవరెవరు న్నారో చెప్పాలని, లేదంటే హైదరాబాద్ అబిడ్స్ సెంటర్లో ముక్కు నేలకు రాయాలని సవాల్ చేశారు. గురువారం టీఆర్ఎస్ శాసన సభాపక్ష కార్యాలయంలో ఎంపీ బాల్క సుమన్, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ ప్రశాంత్ రెడ్డితో కలిసి హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో విపక్షాలు తీవ్ర నిరాశా, నిస్పృహల్లో ఉన్నాయని.. ప్రభుత్వా నికి మంచి పేరు రావడం ఇష్టం లేకనే అడ్డగోలు విమర్శలకు దిగుతున్నాయన్నారు. కాంగ్రెస్, టీడీపీల పాపాల వారసత్వం.. నిజాం హయాంలోని జాగీరు భూములను అప్పట్లోనే తగిన పరిహారం చెల్లించి ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నాయని.. కానీ ఆ తర్వాత వారసులమని చెప్పుకుంటూ కొందరు వివాదాలు సృష్టిస్తూ వచ్చారని హరీశ్ చెప్పారు. అప్పటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పట్టించుకోనందువల్లే ఆ పాపాలు వారసత్వంగా వచ్చాయన్నారు. ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది కూడా కేసీఆర్ అని.. మీడియానో, ప్రతిపక్షాలో కాదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వమే అక్రమ రిజిస్ట్రేషన్ల అంశాన్ని బయటకు తెచ్చి కఠిన చర్యలు చేపట్టిందని... ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేశామని, ఏసీబీ దాడులు జరిగాయని, సీబీసీఐడీకి దర్యాప్తు అప్పజెప్పామన్నారు. ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’తో నష్టం జరుగుతోందని గుర్తించి దానిని రద్దు చేశామని.. సబ్ రిజి స్ట్రార్లకు విచక్షణాధికారాలు కల్పిస్తున్న సెక్షన్–47 రద్దు చేశామని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులను ప్రక్షాళన చేశామని.. ప్రభుత్వ భూముల వివరాలను అన్ని రిజి స్ట్రేషన్ కార్యాలయాలకు పంపామని చెప్పా రు. 1971 జాగీర్దార్ భూచట్టంలో సమూల మార్పులు తీసుకువచ్చి, వివాదాలకు తెర దించుతామని తెలిపారు. ఇలా ప్రభుత్వమే అన్ని చర్యలూ చేపట్టిందన్నారు. విపక్షాలు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నా యే తప్ప ఒక్క డాక్యుమెంటునైనా బయట పెట్టాయా అని ప్రశ్నించారు. భూముల దగ్గరకు వెళ్లి ఫొటోలు దిగడం తప్ప విపక్ష నేతలు చేసిందేమిటని నిలదీశారు. అవినీతికి పునాదులు వేసింది కాంగ్రెస్, టీడీపీలే... ‘‘రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచా లను పెంచి పోషించింది కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కాదా..? రూపాయి లంచం ఇవ్వకుండా గతంలో ఎన్న డన్నా పని జరిగిందా..’’ అని హరీశ్ నిలదీశారు. అవినీతికి పునాదులు వేసిం దే వారని విమర్శించారు. రిజి స్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలను నిర్మూలిం చేందుకు త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు. వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతాం అసలు భూముల కుంభ కోణాల చరిత్ర కాంగ్రెస్‌దేనని హరీశ్‌రావు విమ ర్శించారు. ‘‘ఈఎన్టీ, ఈఎస్ఐ ఆసుపత్రుల భూములను అప్పట్లో హైదరా బాద్‌కు చెందిన కాంగ్రెస్ మంత్రులు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పలేదా? భూదాన్ భూములు, అమీన్పూర్ స్వాతంత్య్ర సమర యోధుల భూములు, ఐఎంజీ భూములు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణాలన్నీ ఎవరివి? వరంగల్‌లో దళి తులకు ఇచ్చిన అసైన్డ్ భూములు కొన్న పొన్నాల లక్ష్మయ్య అసెంబ్లీ హౌస్‌కమిటీ విచారణను ఎదుర్కోవడం లేదా’’ అని నిలదీశారు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ అంశమూ లేనందునే విపక్షాలు భూముల అంశంపై రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఇకపై విపక్ష నేతల చిట్టాలను కూడా బయట పెడతామన్నారు. అక్రమాలకు పాల్పడిన వారు ఏ స్థాయి వారైనా, ఏ పార్టీ వారైనా ఉపేక్షించబోమని... కాంగ్రెస్ నేతల సంగతి కూడా బయటపెడతామని అన్నారు. వాస్తవాలను ప్రజల ముందు పెడతామన్నారు. కోదండరాంకు ప్రభుత్వం కంపు లాగా ఎందుకు కనబడుతోందో అర్థం కావడం లేదన్నారు. మరి ఆయనకు కాంగ్రెస్ నేతల కంపు కనబడడం లేదా అని.. ఆయన ప్రొఫెసరా, మరేమిటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. -
2,964 మంది రైతుల ఆత్మహత్య
- టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ - సీఎం ఇలాఖాలోనే 112 మంది రైతుల బలవన్మరణాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2,964 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే 112 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పార్టీ నేతలు టి.జీవన్‌రెడ్డి, మల్లు రవితో కలసి బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మూడేళ్లలో 2,964 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారిలో మూడో వంతు కుటుంబాలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోలేదని ఆరోపించారు. లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేసినట్టుగా సీఎం కేసీఆర్ చెబుతున్నారని, రుణమాఫీ అయితే బ్యాం కులు రైతులకు పాసు పుస్తకాలను ఎందుకు ఇవ్వడంలేదో టీఆర్ఎస్ నేతలు చెప్పాలని నిలదీశారు. రుణాలపై కేవలం వడ్డీ మాత్రమే మాఫీ అయిందని, కొత్త రుణాలు రైతులకు అందడంలేదని అన్నారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని, నకిలీ విత్తన కంపెనీలపై చర్యల్లేవని ఉత్తమ్ విమర్శించారు. ఫసల్ బీమా యోజన కింద రైతులు 2016 ఖరీఫ్‌లో బీమా కంపెనీలకు రూ.17 వేల కోట్లు చెల్లిస్తే, రైతులకు కేవలం రూ.6,800 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. దీనివల్ల బీమా కంపెనీలకే లాభం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అ«ధికారంలోకి వస్తుందని, రైతులకు రెండు లక్షల రూపాయలదాకా పంట రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఏడాది నుంచే రైతులకు ఎకరానికి రూ.4వేలు పంటసాయాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర కోసం నిరసన చేస్తున్న రైతులను మధ్యప్రదేశ్‌లో పోలీసులు కాల్చి చంపడం దారుణమని అన్నారు. కేంద్రంలో ప్ర«ధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత లక్షన్నరకోట్లు కార్పొరేటు రుణమాఫీ చేసిందని, రైతులకు మద్దతు ధర ఎందుకు ఇవ్వడంలేదని ఉత్తమ్ ప్రశ్నించారు. మియాపూర్ భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. -
ప్రతిష్టాత్మకంగా రాహుల్ సభ
► ‘తెలంగాణ ప్రజాగర్జన’ సభ ఏర్పాట్లు పరిశీలించిన ఉత్తమ్ ► జన సమీకరణ, ఏర్పాట్లపై జిల్లా నేతలతో సమావేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటై మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 1న సంగా రెడ్డిలో నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజా గర్జన’ సభను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసు కుంది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరవుతున్న ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు, అదేస్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కృషి చేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని, రైతులకు వ్యవసాయ పనుల ఒత్తిడి ఉన్న ఈ సమయంలో సభను నిర్వహించొద్దని అధి ష్టానానికి పలువురు నేతలు విన్నవించినా రాహుల్ పట్టించుకోకుండా సభకు హాజరవు తున్నారని ఓ టీపీసీసీ నేత వెల్లడించారు. ఈ సభను భారీగా నిర్వహించి సత్తా చూపించాలని ఉత్తమ్ సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు పార్టీవర్గాలు చెబుతు న్నా యి. ఇప్పటికే జిల్లాల వారీగా నేతలతో ఉత్తమ్ సమావేశమై జనసమీకరణ ఏర్పాట్లపై సమీక్షించారు. సంగారెడ్డి జిల్లా నుంచి లక్షమంది వరకు జనాన్ని సమీకరిం చాలని స్థానిక నేతలకు సూచించారు. మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి మరో లక్ష మందిని సమీకరించేందుకు అక్కడి నేతలను అప్రమత్తం చేశారు. జూన్ 1న రాష్ట్రానికి రాహుల్.. జూన్ 1న రాహుల్ రానున్న నేపథ్యంలో బేగంపేట ఎయిర్‌పోర్టును ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి కుంతియా సోమవారం పరిశీలిం చారు. మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నేతలు అంజన్‌కుమార్, మర్రి శశిధర్‌రెడ్డి కూడా ఏర్పాట్లను పరిశీలించారు. -
ప్రతిష్టాత్మకంగా రాహుల్ సభ
- టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడతాం - పార్టీ శ్రేణుల్లో విశ్వాసం పెంచడానికి ప్రజాగర్జన - పీసీసీ అనుబంధ సంఘాలు, జిల్లాల నేతలతో భేటీ సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని పెంచడానికి సంగారెడ్డిలో నిర్వహించబోయే తెలంగాణ ప్రజాగర్జనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. పీసీసీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, పలు జిల్లాల పార్టీ ముఖ్యులతో గాంధీభవన్‌లో మంగళవారం వేర్వేరుగా సమావేశమయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియాతో పాటు పలువురు ముఖ్యనేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, విధానాలపై సంగారెడ్డిలో జరిగే సభలో చార్జిషీట్ ప్రకటిస్తామన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలైన నల్లధనం తెప్పిస్తామని, ఉద్యోగాలను ఇస్తామని, ఉపాధి కల్పిస్తామని, ధరలను నియంత్రిస్తామని, నోట్ల రద్దు, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాయడం, రైతులపై నిర్లక్ష్యం, ఆత్మహత్యలు వంటి అంశాలను ప్రజల్లో ఎండగడతామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలు, రైతుల ఆత్మహత్యలు, రైతులకు బేడీలు వేయడం, మద్దతుధర ఇవ్వకపోవడం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య, నిరుద్యోగం, ఫీజుల రీయింబర్స్‌మెంటు, ధర్నాచౌక్ వంటి అంశాలపై బహిరంగ సభలో ప్రజల ముందు పెడతామని ఉత్తమ్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రెండు లక్షల రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ. మూడు వేల భృతి, పంటలకు మద్దతు ధర, లక్షన్నర ఉద్యోగాలను వెంటనే చేపడతామన్నారు. సంగారెడ్డి వేదిక కాంగ్రెస్ పార్టీకి ఎంతో సెంటిమెంట్ ఉన్న ప్రాంతమని, ఇందిరాగాంధీ ఈ ప్రాంతంలో సమావేశం నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందని, తిరుగు లేకుండా అధికారంలో ఉందని చెప్పారు. సమావేశంలో అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎం.కోదండరెడ్డి, చిత్తరంజన్ దాస్, ఆరేపల్లి మోహన్, అనిల్‌కుమార్‌యాదవ్, నేరేళ్ల శారద, కె.జనార్దన్‌రెడ్డి, ఫకృద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మహిళల రిజర్వేషన్లకు మద్దతు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టం తీసుకురావడానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతునిస్తుందని ఉత్తమ్ ప్రకటించారు. చట్టసభలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కావాలంటూ టీపీసీసీ మహిళా విభాగం మంగళవారం ప్రారంభించిన సంతకాల సేకరణలో ఉత్తమ్, కుంతియా తదితరులు సంతకాలు చేశారు. నియోజకవర్గాలవారీగా సమావేశాలు సంగారెడ్డిలో జరగనున్న సమావేశానికి ఏర్పాట్లు, జనసమీకరణపై నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించుకోవాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని ప్రతీ పల్లె నుంచి పది మంది తప్పకుండా సమావేశానికి వచ్చేలా చూడాలని, పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని సూచించారు. ఈ నెల 25న జిల్లాల్లో, 27న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలను నిర్వహించాలని ఆయన ఆదేశించారు. -
కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయి
సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం సిగ్గుచేటు: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు రోజులు దగ్గర పడ్డాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళ వారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. రైతును ఏడిపించే రాజ్యం, ఎద్దేడ్చిన ఎవుసం ఎన్నటికీ ముందుకు పోవని హెచ్చ రించారు. ముఖ్యమంత్రి ఇంటి ముందే రైతు ఆత్మహత్యకు పాల్పడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని, అంతకంటే సిగ్గు చేటు ప్రభుత్వానికి ఏముంటుందని ప్రశ్నిం చారు. రైతుల పట్ల ఎంత పాశవికంగా, నిర్ద యగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుటనే గద్వాలకు చెందిన రైతు మల్లేశం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని, ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉండదన్నారు. వ్యవసాయం చేసి అప్పుల పాలయ్యా నని, ఆదుకోవాలని గతంలో ఎన్నోసార్లు క్యాంపు కార్యాలయానికి మల్లేశం వచ్చాడని వివరించారు. ప్రగతిభవన్‌లో రాచరికపు భోగాలు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలను కలవడానికి సమయం లేకుండా పోయిందని విమర్శించారు. కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరిహారం ఇప్పిస్తా మని చెప్పడంతో ఆశ పడిన మల్లేశం కాగితాలు పట్టుకొని క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడని వివరించారు. ఎన్నిసార్లు తిరిగినా కనికరించకపోవడంతో అవమానభారంతో, విరక్తితో మల్లేశం ఆత్మహత్యాయత్నం చేశాడని పేర్కొన్నారు. ఈ రైతు చావుబతుకులతో కొట్టు మిట్టాడుతున్నా ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కూడా పరామర్శించలేదని విమర్శించారు. మిర్చి పంటలకు గిట్టు బాటు ధరలు కావాలని అడిగితే లాఠీచార్జ్ చేసి, రైతులను రౌడీలుగా చిత్రీకరించి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, చేతులకు బేడీలు వేసి హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధలతో ఇప్పటికే 3,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో సీఎం ఇంటి ముందు రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటి సమస్యలను పక్కన పెట్టి వచ్చే ఏడాది ఖరీఫ్ గురించి మాయమాటలు చెబుతున్నారని, ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
రైతులు కష్టాలు పడుతుంటే.. సంబురాలా?
సీఎం కేసీఆర్‌పై కెప్టెన్ ఉత్తమ్ ఫైర్ మఠంపల్లి: పంటలకు గిట్టు బాటు ధర లభించక, అప్పులు తీర్చే మార్గం లేక రైతులు కష్టాలు పడుతుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం నిస్సి గ్గుగా టీఆర్ఎస్ పార్టీ సంబు రాలు జరుపుకొంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గురువారం సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో ఎత్తిపోతల రైతులు, కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పత్తి, మిర్చి, ధాన్యం రైతులు గిట్టుబాటు ధర లేక లబోదిబోమంటుంటే టీఆర్ఎస్ పాలకులు గులాబీ కూలీ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేవలం కేసీఆర్ ప్రభుత్వంలోనే 3 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులిస్తామని, నియామకాలు చేస్తామని మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవంలో విద్యార్థుల ముందు సీఎం ప్రసంగించే సాహసం ఎందుకు చేయలేదో తెలపాలన్నారు. -
కాంగ్రెస్‌వి దివాలాకోరు రాజకీయాలు
⇒ గవర్నర్ ప్రసంగంపై పీసీసీ నోట్ చిత్తు కాగితం: హరీశ్ ⇒ ఆ పార్టీ నేతలది దిగజారుడుతనం, అవగాహనా రాహిత్యం ⇒ అక్కసుతోనే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మరోసారి తన గుడ్డి వ్యతిరేక తను బయట పెట్టుకుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం అబద్ధాలతో ఉందంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ విడుదలచేసిన నోట్ ఒక చిత్తు కాగితమన్నారు. కాంగ్రెస్ దిగజారుడు, దివాలాకోరు రాజకీ యాలకు, అవగాహనా రాహిత్యానికి అది నిదర్శనమన్నారు. సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్వద్ద హరీశ్ మాట్లాడారు. ఉత్తమ్ విడుదల చేసిన 40 పేజీల నోట్లో ఒక్క పేజీ కూడా పనికిరాద ని, ఒక్క వాక్యంలో కూడా వాస్తవం లేదన్నారు. పూర్తి అవాస్తవాలతో నోట్ ఇచ్చి ప్రజలను తప్పుదో వ పట్టించేందుకు ప్రయత్నించారన్నారు. జీఎస్డీపీని కేంద్రానికి చెందిన గణాంక శాఖ ఖరారు చేస్తుందని, ఈ విషయం కూడా ఉత్తమ్‌కు తెలియకపోవడం అవివేకమన్నారు. జాతీయ సగటుకన్నా తెలంగాణ ఎక్కువ వృద్ధి రేటు సాధించిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల తీరు హాస్యాస్పదం పెట్టుబడుల్లో తెలంగాణ నంబర్ వన్‌గా ఉంద ని గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా చెప్పలేదని.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు పెరి గిన వైనాన్ని పారదర్శక, సుపరిపాలన గురిం చి ప్రస్తావించారని హరీశ్ తెలిపారు. కానీ తెలంగాణ నంబర్ వన్ అని గవర్నర్ ప్రసం గించినట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తమ ప్రభుత్వం రికార్డు సృష్టిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కనీసం 6 గంటలు కూడా విద్యుత్ సరఫరా చెయ్యలేద న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమున్న కర్ణాటకలో కరెంట్ కోతలపై ఆ పార్టీ నేతలు జవాబి వ్వాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఆస్పత్రులకు వెళ్లి పరిశీలించుకోండి హెల్త్ కార్డుల ద్వారా లక్షా 6వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందాయని.. గత మూడు నెలల్లోనే 4,100మంది వైద్య సేవలు పొందారని హరీశ్ చెప్పారు. కానీ హెల్త్ కార్డుల ద్వారా ఒక్కరికై నా వైద్యసేవలు అందలేదంటూ కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని.. దమ్ముంటే కిమ్స్, యశోద, కేర్ వంటి ఆసుపత్రులకు వెళ్లి పరిశీలించవచ్చని సవాలు విసిరారు. చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టళ్ల విద్యార్థులకు వందల కోట్లు వెచ్చించి సన్నబియ్యం అంది స్తున్నామని తెలిపారు. మిషన్ కాకతీయ, భగీరథ వంటి చరిత్రాత్మక కార్యక్రమాల్లో అబద్ధాలేమున్నాయని ప్రశ్నించారు. కరువు, వలసలకు కేరాఫ్‌గా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామన్నారు. కాంగ్రెస్ నాయకు లకు దమ్ముంటే మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ దామని సవాల్ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు అవుతు న్నారని.. లబ్ధిదారులకు తమ చేతుల మీదుగా చెక్కులు సైతం అందజేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తాం.. గతేడాది ప్రాజెక్టులకు భారీగా నిధుల కేటాయింపు జరిగినా.. భూసేకరణ, పునరావాసం విషయంలో కాంగ్రెస్ నేతలు సృష్టించిన అడ్డంకులు, కోర్టు కేసుల కారణంగా జాప్యమవుతున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయని, ఇకపై ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను చాలా వరకు ఈ ఏడాదిలోనే పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిందని చెప్పారు. మిషన్ కాకతీయ కింద ఇప్పటికే 17 వేల చెరువుల పునరుద్ధరణ పూర్తయిందని, వాటి కింద 7.5 లక్షల ఎకరాల మేర ఆయకట్టు సాగవుతోందని తెలిపారు. ఈ ఏడాది మరో 7 వేల చెరువులను పునరుద్ధరించనున్నామని వెల్లడించారు. కేంద్ర పథకాల నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏదేమైనా కోటి ఎకరాలకు నీళ్లిచ్చి బంగారు తెలంగాణ చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. -
‘పాలమూరు’ను పాడెక్కించొద్దు!
-
‘పాలమూరు’ను పాడెక్కించొద్దు!
‘పాలమూరు–రంగారెడ్డి’ రౌండ్ టేబుల్ భేటీలో అఖిలపక్షం సాక్షి, హైదరాబాద్: పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. ‘పాలమూరు– రంగారెడ్డి’ ప్రాజెక్టును అంతర్రాష్ట్ర వివా దాలు, అనవసర రాద్ధాంతాల్లోకి లాగుతోందని మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి హరీశ్‌రావు హిట్లర్‌లా ఒంటెత్తు పోకడలు పోతున్నారని విమర్శించారు. సోమవారం ‘పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల–ఓ తప్పులతడక.. ఓ దోపిడీ.. ఓ దగా’ పేరుతో గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ వర్కింగ్ ప్రెసి డెంట్ రేవంత్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రామ్మో హన్‌రెడ్డి తదితరులు భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే రూ.7 వేల కోట్లతో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు లను చేపట్టిందని డీకే అరుణ చెప్పారు. మరో వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే అవి పూర్తయ్యే అవకాశమున్నా.. టీఆర్ఎస్ ప్రభుత్వం అలా చేయకుండా అంచనాలను దారు ణంగా పెంచిందని పేర్కొన్నారు. ప్యాకేజీ–1 లోని లిఫ్టు–1 కింద నవయుగ కంపెనీ మార్పులు కోరగానే కేవలం 123 ఎకరాల అటవీ భూమిని తప్పించిందని, దాంతో ప్రభుత్వంపై అదనంగా రూ.1,000 కోట్ల భారం పడిందని ఆమె విమర్శించారు. ఇంట్లో టెండర్ల ఖరారు: ఉత్తమ్ పాలమూరు ప్రాజెక్టులో రూ.29 వేల కోట్ల టెండర్లను సీఎం, మంత్రి వారి ఇంట్లో కూర్చొని ఖరారు చేశారని ఉత్తమ్ ఆరోపించారు. దాంతో నవయుగ వంటి సంస్థలకు సింగిల్ టెండర్లతో పనులు దక్కాయని.. పనులు మొదలుపెట్టకుండానే పాలమూరు ప్రాజెక్టు ప్యాకేజీ–1లో నవయుగ కంపెనీకి ప్రభుత్వం రూ.1,000కోట్లు అప్పనంగా కట్టబెట్టే యత్నం చేస్తోందని విమర్శించారు. తన 14 ఏళ్ల ఉద్యమ జీవితంలో కేసీఆర్ ఏనాడూ ప్రాజెక్టుల రీడిజైన్ అనలేదని, మిషన్ భగీరథ పేరెత్తలేదని.. భేతాళ మాంత్రికుడు ఆవహించాకే వాటికి రూప కల్పన చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రాజె క్టుల టెండర్లపై తాను సుప్రీంకోర్టుకు వెళ్లి వాటిని ఆపి తీరుతానని నాగం చెప్పారు. -
కోమటి బ్రదర్స్ వివాదం కొలిక్కి వచ్చినట్టేనా !
-
కష్టకాలంలో ఐక్యంగా ఉండాలి
కోమటిరెడ్డి సోదరులకు దిగ్విజయ్ సూచన సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్య దర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి సోమవారం సమావేశమయ్యా రు. రాష్ట్ర పర్యటనలో ఉన్న దిగ్విజయ్‌సింగ్ ను హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్ లో కోమటిరెడ్డి సోదరులు కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై వ్యాఖ్యల నేపథ్యంలోనే దిగ్విజయ్‌తో వీరు సమావేశ మయ్యారు. టీపీసీసీ చేసిన సర్వే బోగస్ అని, ఉత్తమ్ గడ్డం పెంచుకుంటే అధికారం లోకి రాలేమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు, వాటికి దారి తీసిన కారణాలపై దిగ్విజయ్‌కు కోమటిరెడ్డి సోదరులు వివరణ ఇచ్చారు. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో 2,300 ఓట్లతో కాంగ్రెస్ ఓడిందని, ఇటీవలే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిం దని వివరించారు. అలాంటి నకిరేకల్‌లో కాంగ్రెస్ ఓడిపోతుందని చేసిన సర్వేను మాత్రమే తప్పుబట్టామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. ఈ సర్వేతో రాజ కీయంగా తమను దెబ్బకొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. పార్టీపై, పార్టీ నిర్ణయాలపై, పార్టీ అధినేతపై అపారమైన విశ్వాసం ఉందని వెల్లడించారు. దీనిపై ఉత్తమ్‌తోనూ దిగ్విజయ్ చర్చించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను, పార్టీ అధ్యక్షుడిగా తనకు ఎదు రైన ఇబ్బందులను దిగ్విజయ్‌కు ఉత్తమ్ వివ రించినట్టుగా తెలిసింది. రాష్ట్రంలో పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని, ఈ సమయంలో నాయకుల మధ్య కలహాలు మంచివి కావని దిగ్విజయ్ వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకు లంతా ఐక్యంగా ఉండాలని, అభిప్రాయ భేదాలుంటే పరిష్కరించుకోవాలన్నారు. అంతర్గత వ్యవహారం: దిగ్విజయ్ పార్టీ నాయకుల మధ్య తలెత్తిన అంతర్గత అంశంపై వ్యాఖ్యానించాల్సిందేమీ లేదని దిగ్విజయ్‌సింగ్ అన్నారు. తనను కలసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాటా ్లడుతూ ఇరువర్గాల వాదనలు విన్నామని, వాటిపై తగిన నిర్ణయం తీసుకుంటా మన్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో ఉత్తమ్, కోమటిరెడ్డి మధ్య వివాదం ముగిసిన అధ్యాయమని, రాజీ కుదిరిందని జీవన్‌రెడ్డి వెల్లడించారు. -
ఇది కాంగ్రెస్ పోరాట ఫలితమే
జీవో 38పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోరాటం వల్లనే కేసీఆర్ ప్రభుత్వం దిగివచ్చి నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ కోసం జీవో నంబర్ 38ను విడుదల చేసిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ జీవో ద్వారా కాంగ్రెస్ పాక్షిక విజయాన్ని సాధించిందన్నారు. అయితే వివిధ ప్రాజెక్టుల కోసం భూమి కోల్పోయి నిర్వాసితులవుతున్న రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారు, తదితర బాధితులకు పూర్తి న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించదన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలపై రైతాంగం చేసిన పోరాటం, దానికి కాంగ్రెస్ అండగా నిలిచిన ఫలితంగానే ఈ నెల 14న జీవో 38ను రెవెన్యూ శాఖ జారీ చేసింద న్నారు. తెలంగాణ తమ జాగీరు కాదని ఇప్పటికైనా సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాల న్నారు. గురువారం సాయంత్రం గాంధీభవన్‌లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రచట్టం, 2013 ప్రకారం భూసేకరణ జరగాలని చట్టం చెబుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుగోలుగా వ్యవహారిస్తోందని ధ్వజమెత్తారు. నిరుపేదల భూములను ఆక్రమించుకోవాలని చూస్తే కాంగ్రెస్ ఊరుకోదన్నారు. ప్రభుత్వం జీవో 123 ప్రకారం భూమి సేకరించడం చట్టవిరుద్ధమని కాంగ్రెస్ ముందునుంచి చెబుతూ వచ్చిందన్నారు. జీవో 123 పూర్తిగా చట్టవ్యతిరేకం కాగా, కాంట్రాక్టర్లకు దోచిపెట్టే విధంగా ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేస్తోందని ఆరోపించారు. భూసేకరణ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. చిన్న, సన్నకారు రైతుల భూములను లాక్కొని పారిశ్రామిక వర్గాలకు అప్పగించడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకి స్తోందన్నారు. ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు: దామోదర ప్రభుత్వం ఇప్పుడు కళ్ళు తెరచి జీవో నంబర్ 38 తీసుకొచ్చిందని దామోదర రాజనర్సింహ అన్నారు. అయితే ఈ జీవో ద్వారా కూడా భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగదన్నారు. జీవో 38 లో పేదల భూమి పై ఇంకా స్పష్టత ఇవ్వలేదన్నారు. దీని ద్వారా రైతులు నష్టపోనున్నందున 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 123 ద్వారా భూసేకరణా, కొనుగోలా..? అన్న అర్థం లేకుండా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ప్రాజెక్ట్ లను కాంగ్రెస్ అడ్డుకుంటోందని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తమ పార్టీ ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకం కాదని, రీ డిజైనింగ్‌కు వ్యతిరేక మని అన్నారు. కాంగ్రెస్ నేతల వీపులు పగులుతాయని మంత్రి కేటీఆర్ అంటున్నారని, కొన్ని రోజులు ఆగితే ప్రజలు ఎవరి వీపులు పగలగొడుతారో తెలుస్తుందని అన్నారు. అబద్దాలకు సీఎం కేసీఆర్ ప్రతిరూపంగా ఉన్నారని ధ్వజ మెత్తారు. మల్లన్న సాగర్ రైతులకు పరి హారం, పునరావాసం 2013 భూసేకరణ చట్టంతోనే సాధ్యమన్నారు. -
నేడు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: పీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈనెల 29న గాంధీభవన్‌లో జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారని వివరించారు. బీసీలపై చిన్నచూపెందుకు: వీహెచ్ బీసీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, మైనారిటీ సమస్యలపై, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. బీసీలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బీసీ సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్కు కౌంట్‌డౌన్ షురూ
2019లో కాంగ్రెస్‌దే అధికారం: ఉత్తమ్ సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారు స్థాయి మరిచి మరీ ఎంపీ కవిత విమర్శలు నోట్ల రద్దుపై ప్రధాని మోదీతో కేసీఆర్ కుమ్మక్కు తాము అధికారంలోకి రాగానే ఇందిరమ్మ బిల్లులు చెల్లిస్తామని వ్యాఖ్య టీపీసీసీ ఆధ్వర్యంలో జన ఆవేదన సమ్మేళనం హైదరాబాద్: ప్రజలను మాయమాటల తో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం లోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. నోట్ల రద్దుకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం సికింద్రాబాద్‌లో జన ఆవేదన సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఏఐసీసీ తరఫున కొప్పుల రాజు, ఆర్.సి.కుంతియా, కె.బి.కృష్ణమూర్తి, కర్ణాటక మంత్రి శివకుమార్ ప్రతినిధులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడు తూ.. రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు భూమి, యువతకు ఉద్యోగాలు వంటి హామీ లతో సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండున్న రేళ్లు దాటినా 300 డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా పూర్తి చేయలేదన్నారు. టీఆర్ఎస్కు పతనం ప్రారంభమైందని.. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ల బిల్లు బకాయిలు చెల్లిస్తామని.. అదనంగా మరో గది కూడా మంజూరు ఇస్తామని హామీ ఇచ్చారు. స్థాయి మరిచి ఎంపీ కవిత విమర్శలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి సోనియాగాంధీ రాష్ట్రం ఇచ్చారని.. కానీ అధికారంలోకి వచ్చామనే అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన టీఆర్ఎస్ ఎంపీ కవిత ఏకంగా రాహుల్‌గాంధీపై నోరు పారేసుకున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. ‘‘రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కవితదా? సోనియాగాంధీ దయతో మీ అయ్య కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కావాలంటే మీ అయ్యను అడిగి తెలుసుకో..’’అని వ్యాఖ్యానించారు. పేదలపై సర్జికల్ స్ట్రైక్ నోట్ల రద్దు ద్వారా ప్రధాని మోదీ సామాన్యులు, పేదలపై సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడ్డారని ఏఐసీసీ ఎస్సీసెల్ చైర్మన్ కొప్పుల రాజు విమర్శించారు. ఇది వ్యూహాత్మక దోపిడీ అని.. కమలం పార్టీ అంటేనే పేదలను లూటీ చేస్తున్న పార్టీ అని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుపై వచ్చే నెల 6 నుంచి వారం పాటు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో జన ఆవేదన పంచాయతీలను నిర్వహించాలని ఏఐసీసీ పిలుపు ఇచ్చినట్టు కర్నాటక మంత్రి శివకుమార్ వెల్లడించారు. నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్నవారి వీడియోలను ఏఐసీసీకి పంపించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపై అసెంబ్లీలో నిలదీసినందుకే ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం పెట్టారని.. సబ్‌ప్లాన్ నిధులపై కేసీఆర్‌ను నిలదీస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. భూసేకరణ చట్టానికి ప్రభుత్వమే తూట్లు పొడుస్తుంటే ఆపకుండా.. గవర్నర్ కూడా సీఎం కేసీఆర్‌కు భజనమండలిగా మారారని షబ్బీర్ అలీ విమర్శించారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారో గవర్నర్ చెప్పాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు ప్రజావ్యతిరేక నిర్ణయమని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. బంగారు వడ్డాణాలు ఇస్తామంటేనే కార్యక్రమాలకు వెళ్తున్న కవితకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే స్థాయిలేదని మాజీ ఎంపీ మధుయాష్కీ విమర్శించారు. ముఖ్యమంత్రులు అవుతామనే కలలు కనడమే కాకుండా పార్టీ కేడర్‌ను కాపాడుకోవాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి నేతలకు సూచించారు. విభేదాలను విడనాడి పార్టీకోసం పనిచేయాలన్నారు. సమావేశంలో సీనియర్ నేతలు కె.జానారెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, మల్లు రవి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, ఉద్దెమర్రి నర్సింహారెడ్డి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌ది దిక్కుమాలిన పని ప్రధాని మోదీ అహంకారంతో, అనాలోచితంగా నోట్లు రద్దు చేశారని... దానికి సీఎం కేసీఆర్ మద్దతిచ్చి దిక్కుమాలిన పనిచేశారని ఉత్తమ్ మండిపడ్డారు. మోదీ, కేసీఆర్‌ల మధ్య రహస్య బంధమే దీనికి కారణమని ఆరోపించారు. కేసీఆర్ నిస్సిగ్గుగా నోట్ల రద్దుకు అనుకూలంగా అసెంబ్లీలో మాట్లాడారని విమర్శించారు. నోట్ల రద్దుతో ఆదాయం తగ్గిందని, రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయలేమన్న కేసీఆర్... దానికి ఎందుకు మద్దతు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నగదు ఉపసంహరణపై ఆంక్షలు ఎత్తివేయాలని, పేద మహిళల ఖాతాల్లో 25 వేలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. -
వ్యవసాయ రంగంపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ
-
కోమటిరెడ్డివి పగటి కలలు: పాల్వాయి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి అవుతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పగటి కలలు కంటున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘కోమటిరెడ్డికి పిచ్చిలేచి ఉండాలి, లేదా సీఎం అవుతానని పగటికలలైనా వచ్చి ఉండాలి. డబ్బులు పెట్టి పదవులను కొనుక్కోవాలని చూస్తున్నాడు. డబ్బులకు హైకమాండ్ అమ్ముడుపోదు. 2019 ఎన్నికల్లోనూ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమారే ఉంటారు’ అని అన్నారు. ‘పాదయాత్ర చేయడానికి కోమటిరెడ్డి ఏమైనా వైఎస్ రాజశేఖరరెడ్డినా? పాదయాత్ర చేసినంత మాత్రాన వైఎస్ స్థాయి నాయకుడు కోమటిరెడ్డి కాలేడు. పాదయాత్ర చేస్తానని అనుకుంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉంటది’ అనిఎద్దేవా చేశారు. మునుగోడు నుంచి అసెంబ్లీకి పోటీచేయాలని రాజగోపాల్‌రెడ్డి ఆలోచిస్తే మంచిదికాదని, అది ఆయన తాత జాగీరు కాదన్నారు. -
నువ్వు లేచి.. నేను లేచి..!
మంత్రి హరీశ్‌రావుకు ప్రతిపక్ష నేత జానా క్లాస్ - కౌంటర్లు వేసుకుంటే సమయం వృథా అవుతుంది - సభ్యులు మాట్లాడిన తర్వాతే మంత్రి వివరణ ఇవ్వాలి సాక్షి, హైదరాబాద్: శాసనసభ వ్యవహారాల్లో విలక్షణంగా వ్యవహరించే ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి బుధవారం మంత్రి హరీశ్‌రావుకు క్లాస్ తీసుకున్నారు. అందరూ మాట్లాడిన తర్వాతే మంత్రులు మాట్లాడాలని, ఇది గతం నుంచి కొనసాగుతున్న సంప్రదాయమని హితవు పలి కారు. వ్యవసాయంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతుండగానే.. హరీశ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సంద ర్భంగా కోమటిరెడ్డి, సంపత్ పేర్లను ప్రస్తావించారు. హరీశ్ వివరణ అనంతరం ఉత్తమ్ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. తర్వాత డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ఐఐఎం సభ్యుడు మొజాంఖాన్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో మంత్రి తమ పేర్లు ప్రస్తావించినందున తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి, సంపత్ కోరారు. అందుకు ఆమె అంగీకరించకపోవ డంతో గందరగోళం ఏర్పడింది. ఆ సమ యంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరిన జానా తనదైన శైలిలో మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన అంశాలన్నింటినీ నోట్ చేసుకుని, ఆ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశంపైనే మంత్రులు వివరణ ఇవ్వాలని, అప్పుడు ప్రభుత్వం చెప్పిన విషయాలు సరైనవా? ప్రతిపక్షాలు చెప్పినవి సరైనవా అనే విషయాన్ని ప్రజలే నిర్ణయిం చుకుంటారని చెప్పారు. ‘‘మంత్రులు మధ్యలో జోక్యం చేసుకోవద్దు. హరీశ్ కాంగ్రెస్‌నుద్దేశించి మాట్లాడిన మాటలకు నాకు కూడా కౌంటర్ ఇవ్వాలని ఉంది. నువ్వు లేచి నేను లేచి.. నువ్వు కౌంటర్ ఇచ్చి.. నేను కౌంటర్ ఇచ్చి.. ఇలా దానికే సమయం సరిపోతుంది. అంతా అయిపోయిన తర్వాతే మంత్రులు మాట్లాడాలి. ఇది గతం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం’’ అని క్లాస్ తీసుకున్నారు. రైతులను విస్మరించిన ప్రభుత్వం వ్యవసాయ పరిస్థితిపై చర్చ జరుగుతున్న సం దర్భంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయంపై చేసిన కృషిని వివరించారు. రైతులకు ఇచ్చిన హామీలను మోదీ పూర్తిగా విస్మరించారని ఆరోపిం చారు. స్పందించిన కిషన్‌రెడ్డి తాను మాట్లాడుతున్న సమయంలో సింహ భాగం కేంద్రం తీసుకుంటున్న చర్యలు గురించే వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా రూ.790 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ రాలేదని, వేపపూత పూసిన ఎరువులను సరఫరా చేయడం ద్వారా బ్లాక్‌మార్కెటింగ్‌ను మోదీ ప్రభుత్వం అరికట్టిందని చెప్పారు. పెద్దాయన ఇబ్బంది సభలో జానారెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పీకర్ అటువైపు దృష్టి సారించలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వెనుక నుంచి ‘పెద్దాయన అడుగుతున్నారు కదా? ఆయన్నెందుకు ఇబ్బంది పెడ తారు..?’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు హరీశ్ స్పం దిస్తూ.. ‘పెద్దాయనకు మేమివ్వాల్సిన గౌరవం ఇస్తు న్నాం. మేమెంత గౌరవం ఇస్తున్నామో.. మీరెంత గౌరవం ఇస్తున్నారో రోజూ పత్రికలు రాస్తు న్నా యి. పెద్దాయనను ఎవరు ఇబ్బంది పెడు తున్నారో అందరికీ తెలుసు..’ అని ఎద్దేవా చేశారు. -
సాగు సంక్షోభంలో పడింది
అసెంబ్లీలో ప్రభుత్వంపై ఉత్తమ్ మండిపాటు - తెలంగాణ వచ్చాక దయనీయంగా రైతుల పరిస్థితి - వ్యవసాయ ఉత్పత్తులన్నీ తగ్గిపోయినా పట్టించుకోరా? - రైతుల ఆదాయం సగానికి పడిపోయిందని ఆవేదన - 37 లక్షల మంది రైతుల పాస్‌పుస్తకాలు తాకట్టులో ఉన్నాయి - రుణమాఫీ ఏకకాలంలో ఎందుకు చేయడం లేదని ప్రశ్న సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని, రైతాంగం పరిస్థితి దయ నీయంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. పంట ఉత్పత్తులు, రుణాల మంజూరు, సాగు విస్తీర్ణం... ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవసాయ అనుబంధమైన అన్ని రంగాల్లో తగ్గుదల కనిపిస్తోందని పేర్కొంది. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో ప్రభుత్వం సమా ధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. వ్యవసాయ ఆధునీకరణ, రైతు రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ అంశంపై బుధవారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో కాంగ్రెస్ తరఫున ఆయన మాట్లాడారు. ‘‘రైతులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ హామీని ఏకకాలంలో ఎందుకు అమలు చేయలేదు? ఎన్నికల సమయంలో ఒకమాట.. గెలిచాక ఇంకోమాట.. 2015లో ఒకటి, 2016లో ఇంకొకటి చెబుతున్నారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనలను సడలించి రుణ శాతాన్ని 3 నుంచి 3.5 శాతానికి పెంచితే రుణమాఫీని ఏకకాలంలో అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పారు. కేంద్రం నిబంధనలు సడలిం చింది. ప్రభుత్వం దాదాపు రూ.29 వేల కోట్లు అప్పుగా తెచ్చుకుంది. అయినా ఇప్ప టివరకు ఏకకాలంలో రుణమాఫీని ఎందుకు విడుదల చేయలేదు?’’ అని ఉత్తమ్ ప్రశ్నిం చారు. వాటర్గ్రిడ్లాంటి ప్రాజెక్టులకు వేల కోట్లు అప్పుగా తెస్తున్న ఈ ప్రభుత్వానికి రైతాంగాన్ని ఆదుకునేందుకు ఎందుకు మనసొప్పడం లేదంటూ నిలదీశారు. రాష్ట్రంలో 37 లక్షల మంది రైతుల పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో తాకట్టులో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింట్లోనూ తగ్గుదలే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాలు అభివృద్ధి చెందకపోగా, అన్నిఅంశాల్లో తగ్గుదల కని పిస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘2014లో తెలంగాణ ఏర్పాటయి నపుడు రాష్ట్రంలో 107.49 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంటే అది 2015లో 72 లక్షల టన్నులకు, 2016లో 49 లక్షల టన్నులకు తగ్గిపోయింది. పత్తి ఉత్పత్తి 2014లో 42 లక్షల బేళ్లు ఉంటే 2015లో 35 లక్షల బేళ్లకు తగ్గింది. తెలంగాణలో పండే పంటల విలువ 2014లో రూ.44 వేల కోట్లు ఉంటే 2015లో రూ.41 వేల కోట్లకు, 2016లో రూ.36 వేల కోట్లకు తగ్గిపోయింది. మొత్తమ్మీద ఈ ప్రభుత్వ హయాంలో రైతుల ఆదాయం సగానికి సగం తగ్గిపోయింది’’ అని ఆయన వివరించారు. కేంద్ర నిధులు ఇతర పథకాలకా? ఇన్పుట్ సబ్సిడీ కింద రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.790 కోట్లు ఏప్రిల్‌లోనే మంజూరు చేసిందని, అయితే ఆ నిధులను ప్రభుత్వం రైతులకు ఇవ్వకుండా ఇతర పథకాలకు మళ్లించిందని ఉత్తమ్ అన్నారు. అధికారంలోనికి వస్తే 100 రోజుల్లో నిజాం షుగర్స్‌ను తెరిపిస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు 1000 రోజులవుతున్నా ఏమీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత 2,580 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిలో కనీసం 10 శాతం మందికి కూడా పరిహారం పంపిణీ చేయలేదన్నారు. ఈ సందర్భంగా తన వద్ద ఉన్న 2,580 మంది రైతు ఆత్మహత్యల జాబితాను స్పీకర్‌కు పంపారు. -
సచివాలయాన్ని కూల్చొద్దు
గవర్నర్‌ను కలసిన ఉత్తమ్, జానా, షబ్బీర్ ►ప్రజాధనం వృథా చేయకుండా సీఎంను అడ్డుకోవాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యల పరిష్కారానికి నిధుల్లేవంటున్న ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోట్లాది రూపా యలను వృథా చేయకుండా తగిన చర్యలను తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు టీపీసీసీ విజ్ఞప్తి చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ప్రతి పక్షనాయకులు కె.జానా రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి వినతిపత్రాన్ని సమర్పిం చారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, వాస్తు బాగా లేదనే సాకుతో సచి వాలయాన్ని కూల్చే యాలని సీఎం కేసీఆర్ నిర్ణరుుంచడం దుర్మార్గమన్నారు. పటిష్టంగా ఉన్న భవనాలతో రెండు రాష్ట్రాలకు సరిపోయే స్థారుులో సచివాలయం ఉందన్నారు. వాస్తు పేరుతో కూల్చివేయడానికి, కొత్తగా నిర్మించడానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో కోర్టు వివరణ కోరిందని, సచివాలయంలో అగ్ని ప్రమాదాలకు సంబంధించి సరైన జాగ్రత్తలు లేవని, అవన్నీ పాతభవనాలు అని.. ప్రభుత్వం వాదించడం వింతగా ఉందన్నారు. సచి వాలయంలోని చాలా భవనాలను ఇటీవలనే నిర్మించారని, మరో 20 ఏళ్ల వరకు వాటి మనుగడకు ఇబ్బందిలేదని అన్నారు. జెడ్‌ప్లస్ భద్రతలో ఉన్న ముఖ్యమంత్రులుగా వై.ఎస్. రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు అంతకుముందు చాలామంది ఇదే సచివాలయంలో పనిచేశారని ఉత్తమ్ గుర్తుచేశారు. రైతుల రుణమాఫీ, విద్యా ర్థులకు ఫీజు రీరుుంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ కి నిధుల్లేవంటున్న ముఖ్యమంత్రి.. సచివాలయాన్ని కూల్చడానికి వందలకోట్లు ఎందుకు వృథా చేస్తున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు. ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే పండుగలు, వాస్తుదోషాలు అంటూ కోట్లాది రూపా యల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తు న్నారని విమర్శించారు. ప్రజల సొమ్ము దుర్వినియోగంపై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చామని, ఆయన ప్రజల ప్రయోజ నాలను కాపాడతారనే విశ్వాసం తమకుం దని ఉత్తమ్ చెప్పారు. సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సచివాలయం ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉం దన్నారు. కేవలం తన కొడుకు ముఖ్యమంత్రి కాడేమోననే భయంతోనే సచివాలయాన్ని కూల్చాలని సీఎం కేసీఆర్ ప్రయత్ని స్తున్నారని ఆరోపిం చారు. ప్రజల అవసరాల కోసం కాకుండా, కేవలం తన వ్యక్తిగత విశ్వాసాలకోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మంచిదికాదని జీవన్‌రెడ్డి హితవు పలికారు. -
మాఫీ నిధులిచ్చేందుకు మనసొప్పడం లేదా?
దేవరకొండ ‘రైతు రణభేరి’ద్వారా కేసీఆర్‌ను ప్రశ్నించిన ఉత్తమ్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘అధికారంలోకి రాగానే రైతులకు రూ.లక్ష రుణమాఫీ అన్నా రు. మాట మార్చి విడతల వారీగా చెల్లిస్తామన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలవుతోంది. కానీ, మూడో దఫా రుణమాఫీ కింద రూ.4 వేల కోట్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మనసొప్పడం లేదా? అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కేంద్రం ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చిన రూ.980 కోట్లను కాంట్రాక్టర్లకు మళ్లించిన ప్రభుత్వం.. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ‘రైతు రణభేరి’ పేరిట గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన సభలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని 37లక్షల మంది రైతాంగాన్ని ఈ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. మూడో విడత రుణమాఫీ కింద ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్ల నిధులను ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. రెండేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, ఆరోగ్యశ్రీకి నిధులివ్వడం లేదని, కనీసం ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లిం చేందుకూ ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న వారు కనీసం ఊరికో ఉద్యోగం అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ‘ఇదేం ఖర్మో కానీ.. వీళ్లు అడుగుపెట్టిన దగ్గరి నుంచి తెలంగాణలో వ్యవసాయం భ్రష్టు పట్టిపోయింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చివరి ఏడాది తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 107 లక్షల టన్నులుంటే, గతేడాది 49 లక్షలకు తగ్గింది. ఇదేనా అభివృద్ధి?’ అని ఉత్తమ్ ప్రశ్నించారు. కరీంనగర్‌ను లండన్ చేస్తానని, హైదరాబాద్‌ను డ ల్లాస్ చేస్తానని, వరంగల్‌ను న్యూయార్క్ చేస్తానని, ట్యాంక్‌బండ్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు కట్టిస్తానని చెబుతున్న కేసీఆర్ గ్రామీణ తెలంగాణ గురించి పట్టించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని విమర్శించారు. రైతు ఆత్మహత్యలను కూడా చెప్పుకోలేనంత నామోషీగా ఈ ప్రభుత్వం తీరు ఉందని దుయ్యబట్టారు. తప్పులను ఎండగడితే జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని, తనను ఏం చేసినా ఫర్వాలేదని, కాంగ్రెస్‌పార్టీ రైతాంగం పక్షాన నిలబడి పోరాడుతుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర లేదు: జానా తెలంగాణను తీసుకురావడంలో కానీ, అభివృద్ధి చేయడంలోకానీ కేసీఆర్ పాత్ర ఏమీలేదని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అధికారులు పరుగెత్తికెళ్లి రూ.1.5 లక్షల పరిహారం ఇచ్చి ఆ కుటుం బాన్ని ఆదుకునేవారని, ఇప్పుడు రూ.6 లక్షలు ఇస్తామని మాటలు చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రైతుకు కూడా పరిహారం చెల్లించలేదన్నారు. ప్రభుత్వానికి కళ్లు మూసుకుపోయాయని, రైతు రణభేరి ద్వారానైనా కనువిప్పు కలగాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ వైఎస్సార్ అధికారంలో ఉండగా, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిందే తడవుగా నక్కలగండి మంజూరు చేసి నల్లగొండ జిల్లాలో కరువు పీడిత ప్రాంతాలను సస్యశ్యామలం చేసేం దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసిం దన్నారు. కానీ, ఇప్పుడు దానినే డిండి ఎత్తిపోతలగా మార్చి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంద న్నారు. మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భారతీ రాగ్యానాయక్, రైతు సంఘం నేత ఎం.కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మహా’ నష్టంపై ప్రజల్లోకి... : టీపీసీసీ
టీపీసీసీ నిర్ణయం * ముఖ్య నేతలు, సాగునీటిరంగ నిపుణులతో ఉత్తమ్ భేటీ * సీఎం నిర్ణయంతో తెలంగాణకు శాశ్వత నష్టం: పొన్నాల * కేంద్ర మధ్యవర్తిత్వంతో ఒప్పందం చేసుకొని ఉంటే మేలు జరిగేదని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలు, మహారాష్ట్ర ఒప్పందంతో జరిగే నష్టంపై ప్రజల్లోకి వెళ్లాలని టీపీసీసీ నిర్ణయించింది. సాగునీటిరంగ నిపుణులు, ముఖ్య నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో శుక్రవారం సమావేశం జరిగింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీమంత్రి మర్రి శశిధర్ రెడ్డి, జలసాధన సమితి నాయకులు నైనాల గోవర్ధన్, పలువురు రిటైర్డు ఇంజనీర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించాలని గతంలోనే చర్చలు జరిగాయని, ఇందుకు సూత్రప్రాయమైన అంగీకారం కూడా వచ్చిందని భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్యయ్య వివరించారు. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించడానికి ఒప్పందం చేసుకుని వచ్చిన సీఎం కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణకు శాశ్వతంగా నష్టం జరుగుతుందని హెచ్చరించారు. కేంద్రం మధ్యవర్తిత్వంతో చర్చలు, ఒప్పం దాలు చేసుకుంటే తెలంగాణకు మేలు జరిగేదన్నారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును నిర్మిస్తే ఒక్క మహారాష్ట్రతోనే ఒప్పందం సరిపోదన్నారు. ఛత్తీస్‌గఢ్, ఏపీతోనూ ఒప్పందాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. కమీషన్లు దండుకునేందుకే... పలువురు నిపుణులు, నాయకులు మాట్లాడుతూ.. రీడిజైనింగ్ పేరుతో ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా జలాశయాలు నిర్మించి, అశాస్త్రీయంగా, సాంకేతిక లేమితో ప్రతిపాదనలను చేస్తున్నారన్నారు. దీని వల్ల ప్రాజెక్టుల నిర్మాణం, ముంపు, విద్యుత్, నిర్వహణ, దీర్ఘకాలిక సమస్యలు చాలా వస్తాయని హెచ్చరించారు. ప్రాణహిత వద్ద 120 రోజుల వరకు నీరు లభ్యమయ్యే అవకాశాలున్నాయని, పంట రోజులు కూడా 120 రోజులు ఉండటం వల్ల జలాశయాలు నిర్మించుకోవాల్సిన అవసరం లేదని విశ్లేషించారు. ప్రస్తుతం జరుగుతున్నదంతా రిజర్వాయర్ల నిర్మాణంతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి కమీషన్లు దండుకోవడానికి చేస్తున్న కుట్ర మాత్రమేనని విమర్శించారు. వీటిని ప్రజలకు సమగ్రంగా వివరించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌పై ఉందన్నారు. ప్రాణహిత వద్దనే ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందని, మేడిగడ్డ వద్ద చేపడితే ముంపు, నిర్వహణతోపాటు సహా చాలా నష్టాలుంటాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాలు, ఒప్పందాల వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఇందులో జరుగుతున్న అవినీతి, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో నిజాలను ప్రజలకు అర్థమయ్యేలా మాధ్యమాలను ఎంచుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎంపీ పాల్వాయి, రెడ్డి, ఎమ్మెల్యేలు జి.చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత, సబితా ఇంద్రారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి పాల్గొన్నారు. -
ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌వి అబద్ధాలు : ఉత్తమ్
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు, అవాస్తవాలను మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలపై ప్రజలకు వివరించడానికి నిపుణులు, ఇంజనీర్లతో శుక్రవారం ఇక్కడ సమావేశం అవుతున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టు గురించి సీఎం కేసీఆర్ నోటికొచ్చిట్టుగా అబద్ధాలను మాట్లాడుతున్నారన్నారు. వీటిని మరింత సమగ్రంగా, లోతుగా చర్చించి ప్రజలకు వివరిస్తామని ఉత్తమ్ తెలిపారు. -
ఊహాగానాల్లో ఉత్తమ్: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్తో కలసిపోయినట్టుగా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఊహాగానాలతో మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఒక ప్రకటనలో విమర్శించారు. టీఆర్ఎస్, ఎంఐఎంతో కలసి అధికార దాహాన్ని తీర్చుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఎద్దేవా చేశారు. పతనమవుతున్న కాంగ్రెస్‌ను చూసి దిక్కుతోచక ఉత్తమ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పొత్తులు పెట్టుకునే కాంగ్రెస్ నేతలు గురివింద గింజల్లాగా నీతులు మాట్లాడుతున్నారని అన్నారు. -
తెలంగాణా ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది
హైదరాబాద్: ప్రముఖ కవి, గేయ రచయిత గూడ అంజయ్య మృతి పట్ల ఏపీసీసీ ఛీఫ్ రఘువీరారెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కోట్లాది పేద ప్రజాలను తన పాటలతో చైతన్య పరిచిన గూడ అంజయ్య లేని లోటు తీరనిదన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గూడ అంజయ్య మృతిపట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలంగాణా ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ శాసనపక్ష ప్రతిపక్ష నేత శ్రీ కుందూరు జానారెడ్డి తమ సంతాపాన్ని ప్రకటించారు. అంజన్న మృతి తెలంగాణా సమాజానికి తీరని లోటని జానారెడ్డి అన్నారు. ఉద్యమ నేపథ్యంలో ఆయన రాసిన పాటలు, గేయాలు ఎంతో ఉత్తేజాన్ని కలిగించాయన్నారు. గూడ అంజన్న ఆత్మకు శాంతి చేకూరాలని..ఆయన కుటుంబ సభ్యులకు జానారెడ్డి సానుభూతి తెలిపారు. -
'మీ తగాదాల వల్లే కాంగ్రెస్‌ను వీడా'
- వ్యక్తిగత విమర్శలు చేస్తే సరైన సమాధానం చెబుతా - 'దొరికిన దొంగ' రేవంత్ రెడ్డి - సాంఘిక బహిష్కరణ చేయాల్సింది ఆయన్నే నల్లగొండ : పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డిల గ్రూపు తగాదాల వల్లే తాను కాంగ్రెస్ పార్టీని వీడానని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లగొండలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని గుత్తా ఘాటైన విమర్శలు చేశారు. '2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్, కోమటిరెడ్డి పరస్పరం ఓడించుకోవాలని ప్రయత్నం చేశారు. ఒకరిపై మరొకరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. నాయకుల మధ్య నెలకొన్న ఈ గొడవల వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లింది. పార్టీలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలను భరించలేకనే విసిగి వేసారి పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది' అని ఆయన వివరించారు. మీ నియోజకవర్గాల్లో ఎంపీలంటే కనీసం గౌరవం ఉండడం లేదని గుత్తా అన్నారు. చావుకు లేదా పెళ్లికి పోయినా మీ అంగీకారం ఉండాల్సిందేనని ఆయన విమర్శించారు. నియోజకవర్గాలను తమ సామ్రాజ్యాలుగా చేసుకొని ఏలుతున్నారు అని గుత్తా మండిపడ్డారు. 'మా దగ్గర మీ చిట్టాలు చాలా ఉన్నాయి.. కానీ చెప్పను. అది మా సంస్కృతి కాదు. ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. సరైన సమాధానం చెబుతాం' అని హెచ్చరించారు. ఉత్తమ్.. స్వశక్తి కలిగిన నాయకుడా? కాంగ్రెస్ కార్యకర్తల త్యాగాల వల్లనే సుఖేందర్ రెడ్డి ఎంపీ అయ్యారని.. స్వశక్తి కలిగిన నాయకుడు కాదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై గుత్తా ఫైరయ్యారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో పనిచేసి రాత్రికి రాత్రే టికెట్ తెచ్చుకుని కోదాడలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉత్తమ్ స్వశక్తి కలిగిన నాయకుడా..? అని గుత్తా ప్రశ్నించారు. తాను రెండు ఎన్నికల్లో ఎంపీగా గెలిచానంటే అందుకు ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డి, జానారెడ్డిల సహకారం ఉన్న సంగతి వాస్తవమేనని చెప్పారు. ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు కట్టుబడి ఉన్నానని, ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ఉప ఎన్నికకు వెళ్లి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరియైంది కాదని భావించి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ఎంపీ చెప్పారు. రేవంత్.. దొరికిన దొంగ పార్టీలు మారిన ఎంపీ గుత్తా, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్ర కుమార్‌లను సాంఘిక బహిష్కరణ చేయాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ ఘాటుగానే బదులిచ్చారు. 'నువ్వు దొరికిన దొంగ.. జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర నీది! నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో.. సాంఘిక బహిష్కరణ చేయాల్సి వస్తే ముందు నిన్ను చేయాలి' అని గుత్తా హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో నెల రోజుల పాటు చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించిన రేవంత్ రెడ్డి.. స్థాయికి మించి విమర్శలు చేయడం సరియైంది కాదన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ పచ్చి రాజకీయ వ్యభిచారానికి పాల్పపడుతున్నారని ఎంపీ విమర్శించారు. నీ భార్యకు ఏం అర్హత ఉంది?: ఎమ్మెల్యే భాస్కర్‌రావు అనామకుడైన భాస్కర్‌రావును మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలిపించింది కాంగ్రెస్ కార్యకర్తలేనని పీసీసీ నేత ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే భాస్కర్ రావు కొట్టిపారేశారు. 'నీ భార్య పద్మావతికి ఏం అర్హత ఉందని కోదాడ ఎమ్మెల్యే సీటు తెప్పించుకున్నావ్?' అని భాస్కర్ రావు ప్రశ్నించారు. 44 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాకంటే నువ్వు చాలా జూనియర్ అని ఉత్తమ్‌ను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కాసులు, కాంట్రాక్టుల కోసమే..
కాంగ్రెస్‌ను వీడిన టీఆర్ఎస్ నేతలపై దిగ్విజయ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాజకీయాలను వ్యాపారంగా చేసేవారే పార్టీలు మారుతున్నారని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ధ్వజమెత్తారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు కాంట్రాక్టులకు, పదవులకు, డబ్బులకు ఆశపడే కాంగ్రెస్‌ను వీడారని ఆరోపించారు. టీఆర్ఎస్ భారీగా డబ్బు, కాంట్రాక్టులు ఆశ చూపి వలసలను ప్రోత్సహిస్తోందంటూ మండిపడ్డారు. ‘‘వలసలను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ అప్రజాస్వామిక, రాజ్యాంగవిరుద్ధ చర్యలపై సమాధానం చెప్పాలి. ఫిరాయింపు నేతలపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ మారిన నేతల నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెడతామని ప్రకటించారు. పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం గాంధీభవన్‌లో పీసీసీ సమన్వయకమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఏఐసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు కొప్పుల రాజు, ఉత్తమ్, సీఎల్పీ నాయకుడు కె.జానా రెడ్డి, పార్టీ రాష్ట్ర పరిశీలకుడు ఆర్.సి.కుంతియాలతో కలిసి దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు. కొందరు నాయకులు పోయినా కాంగ్రెస్ పార్టీ బలహీనపడబోదని, రెట్టించిన స్ఫూర్తితో పని చేస్తామని చెప్పారు. అధికార టీఆర్ఎస్ రెండేళ్ల వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. తెలంగాణలో టీడీపీ, బీజేపీ సహా ఇతర పార్టీలేమీ లేవని, ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. ‘‘పార్టీలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు తదితరాలపై భేటీలో చర్చించాం. అంతా క్రమశిక్షణతో ఉండాలని నిర్ణయించాం’’ అని వెల్లడించారు. గాంధీభవన్ వీడి గ్రామాలకు వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు. మల్లన్నసాగర్‌తో పాటు అన్ని ప్రాజెక్టుల పరిధిలో రైతుల పక్షాన పోరాటాలు చేస్తామని ప్రకటించారు. అవినీతికి తలుపులు తెరిచారు.. సాగు, తాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచుతూ అవినీతికి తలుపులను బార్లాగా తెరిచారని దిగ్విజయ్ ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. భూ సేకరణ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతులను ఒత్తిడి చేసి భూములు తీసుకుంటున్నారని విమర్శించారు. భూములు లేని పేదవారిని ఎలా ఆదుకుంటారో ప్రభుత్వం చెప్పడం లేదంటూ తప్పుబట్టారు. రంజాన్‌కు బట్టలు పంచుతున్న కేసీఆర్, ముస్లింలకు అంతకుముందు ఇచ్చిన హామీలను ఏం చేశారని ప్రశ్నించారు. వారికి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీపై బదులివ్వాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోతున్న వారికి జరుగుతున్న అన్యాయంపై ప్రజల్లో ఉద్యమిస్తామని, న్యాయ పోరాటం చేస్తామని కొప్పుల రాజు హెచ్చరించారు. పునరావాసం విషయంలో నిర్వాసితులకు, రైతులకు, రైతు కూలీలకు న్యాయం చేయాలన్నారు. జీవో 123తో రైతులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూ సేకరణ చట్టాన్ని నీరుగార్చేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. బూత్ స్థాయి నుంచి పటిష్టం: ఉత్తమ్ మల్లన్నసాగర్ కోసం ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కుంటోందని ఉత్తమ్ ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ పోరాడుతుందని ప్రకటించారు. పోలింగ్ బూత్‌స్థాయి నుంచి కాంగ్రెస్‌ను పటిష్టపరుస్తామని చెప్పారు. ‘‘జూన్ 30లోపు మండల కమిటీలను పూర్తి చేస్తాం. జూలైలో శిక్షణా తరగతులు పూర్తి చేస్తాం. ఆగస్టులో పోలింగ్‌బూత్ స్థాయిలో కమిటీలు వేస్తాం’’ అని వివరించారు. భూ సేకరణ చట్టంపై అవగాహన కోసం గురువారం గాంధీభవన్‌లో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకోసం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. వాటి ఏర్పాటు జ్యుడీషియరీ కమిషన్ ద్వారా జరగాలని డిమాండ్ చేశారు. -
అది సోనియాను తప్పుబట్టినట్లే:జానా
సాక్షి, హైదరాబాద్: పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఇతర నేతలపై సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత జానారెడ్డి ఖండించారు. పార్టీలో ఉన్నత పదవులు, కార్యవర్గాలు సోనియాఆమోదంతోనే జరుగుతాయని, అటువం టి కార్యవర్గాన్ని దూషించడమంటే ఆమె నిర్ణయాన్ని తప్పుపట్టడమేనని ఓ ప్రకటన లో పేర్కొన్నారు. ఉత్తమ్‌పై వెంకటరెడ్డి వ్యక్తిగత దూషణలు సమర్థనీయం కాదన్నారు. పార్టీకి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని... ఈ తరుణంలో పార్టీ పటిష్టతకు సీనియర్ నాయకులు కృషి చేయాల్సి ఉందని సూచించారు. -
ఆ అర్హత టీపీసీసీకి లేదు
- షోకాజ్ నోటీసుపై సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి - అసలు ఈ అధ్యక్షుడినే నేను గుర్తించడం లేదు - స్వయంగా సోనియా వద్దకు వెళ్లి పరిస్థితులన్నీ తెలియజేస్తా - కాంగ్రెస్ పార్టీని ఉత్తమ్ నాశనం చేస్తున్నాడని విమర్శ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తనకు షోకాజ్ నోటీసు ఇచ్చే అర్హత టీపీసీసీకి లేదని సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అసలు తాను పీసీసీ అధ్యక్షుడినే గుర్తించనప్పుడు తనకు పీసీసీ నుంచి షోకాజ్ నోటీసులివ్వడమేమిటని ప్రశ్నించారు. తనను వివరణ అడిగే అర్హత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి మాత్రమే ఉందన్నారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ పీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసు ఇవ్వడంపై కోమటిరెడ్డి నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. తాను ఎవరికీ వివరణ ఇచ్చేది లేదని, ఏదైనా ఉంటే నేరుగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలసి చెప్పుకుంటానని.. రాష్ట్రంలోని పరిస్థితులను ఆమెకు తెలియజేస్తానని చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడిగా పనికిరాడని, ఆయన నాయకత్వంలో తాను పనిచేసే ప్రసక్తే లేదని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. 60 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి అధ్యక్షుడిని తాను చూడలేదని, కుళ్లు కుతంత్రపు రాజకీయాలకు ఉత్తమ్ మారుపేరని విమర్శించారు. కార్యకర్తలతో మాట్లాడడం కూడా ఉత్తమ్‌కు తెలియదని, బంగారం లాంటి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడని పేర్కొన్నారు. తెలంగాణ కోసం తాను త్యజించిన మంత్రి పదవిని ఇస్తే తీసుకుని అనుభవించిన తెలంగాణ ద్రోహి ఉత్తమ్ అని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోలీసు దెబ్బలు తిన్న తన లాంటి నేతలు పార్టీలో 100 మంది ఉన్నారని, అందులో ఎవరికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా బాగుంటుందన్నారు. తాను పార్టీ మారుతానని ఎప్పుడూ చెప్పలేదని, మీడియానే ఆ ప్రచారం చేసిందని పేర్కొన్నారు. -
ఎడ్లబండిని డీకొన్న లారీ.. ఇద్దరు మృతి
ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మాంజ్రి గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఎడ్లబండిని లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. మాంజ్రి గ్రామానికి చెందిన తొమ్మిది మంది పాంగ్రి గ్రామ పంచాయతీలోని ఆలయాల్లో భజన కార్యక్రమాలు ముగించుకుని 1 గంట సమయంలో తిరిగి స్వగ్రామానికి వెళుతున్నారు. ఆ క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఎడ్లబండిని ఢీకొంది. ధర్మాజీ, ఉత్తమ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. వారిని భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. -
కేసీఆర్‌వి దిగజారుడు మాటలు
వెంకటరెడ్డి మరణిస్తే అదృష్టం కలిసొచ్చినట్లా..?: ఉత్తమ్ సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘మానవత్వంతో పాలేరులో సుచరితారెడ్డిని ఏకగ్రీవం చేయాలని అన్ని పార్టీలను కోరాం. ఇందుకు వైఎస్సార్సీపీ, టీడీ పీ ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. సంప్రదాయానికి తిలోదకాలిచ్చి ఎమ్మె ల్సీ, మంత్రిగా ఉన్న తుమ్మలను పోటీలోకి దించారు. కేసీఆర్, టీఆర్ఎస్ పెద్దలకు మానవత్వం లేదు. సీఎం ఖమ్మం సభలో మాట్లాడు తూ.. అదృష్టం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నారు. అంటే 50 ఏళ్లకు పైగా ప్రజాజీవి తంలో ఉన్న వెంకటరెడ్డి కేన్సర్‌తో మరణిస్తే.. అదృష్టం కలిసొచ్చినట్లా? ఇంత దిగజారుడుగా ముఖ్యమంత్రి మాట్లాడతారా?’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో శని వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఎమ్మెల్యేలకు వైద్య చికిత్స కోసం రూ.లక్షలు, రూ.కోట్లలో రీయింబర్స్మెం ట్ చేశాయన్నారు. రాంరెడ్డి వెంకటరెడ్డి చికిత్స కోసం టీఆర్ఎస్ పార్టీ జేబు నుంచి డబ్బు ఇవ్వలేదన్నారు. తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నం దున హుజూర్‌నగర్‌లో పోటీ చేశానని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్రాన్ని వ్యతిరేకించిన తుమ్మలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. మంత్రిని చేశారని, అయితే ఓడిపోయిన శ్రీకాం తాచారి తల్లికి పదవి ఎందుకు ఇవ్వలేదని ఉత్తమ్ ప్రశ్నిం చారు. సమావేశంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి
* పాలేరు ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్‌కి ఉత్తమ్ లేఖ * ఈవీఎం ప్రింటర్లు ఏర్పాటు చేయండి * అధికార టీఆర్ఎస్ అక్రమాలు అడ్డుకోవాలని వినతి సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరులో జరగనున్న ఉప ఎన్నికను ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం లేఖ రాశారు. ఈ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికలో పేపర్ బ్యాలెట్‌ను వినియోగించాలని, ఈవీఎంలను వినియోగించాలనుకుంటే ప్రింటర్లు ఏర్పాటుచేయాలని కోరారు. స్థానిక అధికారులు పూర్తిగా అధికారపార్టీ కనుసన్నల్లో, వారి ఆదేశాల ప్రకారమే పనిచేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఖమ్మం జిల్లా కలెక్టరును, ఎస్పీని, రిటర్నింగ్ అధికారిని బదిలీ చేసినా స్థానికంగా ఉన్న అధికారులు అక్రమాలను ఆపలేదన్నారు. ఉప ఎన్నిక సమయంలోనే ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీకి అనుమతి ఇవ్వొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినా అనుమతించారని ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. దీనివల్ల ఖమ్మం పట్టణం అంతా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, పోస్టర్లు, జెండాలతో నింపేశారని వివరించారు. ఖమ్మం కార్పొరేషన్‌లోని కొన్ని ప్రాంతాలు పాలేరు నియోజకవర్గంలో ఉన్నాయన్నారు. సీఎం, మంత్రులు ప్రభుత్వ ఖర్చుతోనే ప్లీనరీలో పాల్గొన్నారని.. ప్లీనరీ ఖర్చును టీఆర్ఎస్ అభ్యర్థి ఖాతాలో వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభలోనే టీఆర్ఎస్ను గెలిపించాలని కూడా కోరారని తెలిపారు. టీఆర్ఎస్ అనుకూల అధికారులను వెంటనే బదిలీచేయాలని కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీఆర్ఎస్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. -
ఫాసిస్టులా కేసీఆర్: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి సొమ్ముతో అహంకారం, ఫాసిస్టు ధోరణితో వ్యవహరిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవినీతి సొమ్ముతో రాజకీయాలను, ప్రజాస్వామ్యాన్ని శాసించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ మీదనే ఉందన్నారు. పాలేరులో ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తామంటే సమయం ఇవ్వలేదన్నారు. పాలేరులో పార్టీని గెలిపించే బాధ్యతను యూత్ కాంగ్రెస్ తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ ఇతర ముఖ్యనేతలు సమావేశంలో పాల్గొన్నారు. కాగా ఖమ్మంలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ ఖర్చులను పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థి ఖాతాలో జమచేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో వారు గురువారం విలేకరులతో మాట్లాడారు. -
‘ఫిరాయింపు’పై జానా వర్సెస్ ఉత్తమ్
సీఎల్పీ సమావేశంలో వాడీవేడి చర్చలు * గాంధీభవన్ నుంచి లీకులు వస్తున్నాయి: జానారెడ్డి * పీసీసీ చీఫ్ ఎందుకు ఖండించరంటూ ఆగ్రహం * నాకేం సంబంధం అని ప్రశ్నించిన ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. అసెంబ్లీలోని పార్టీ కార్యాలయంలో జానారెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఫిరాయింపుల అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటామాటా పెరిగినట్లు సమాచారం. పార్టీ ఫిరాయింపులు, దానికి కారణాలు, వలసలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, నాయకత్వం బాధ్యత, పార్టీలో అంతర్గత విభేదాలు, పార్టీ పటిష్టత, పాలేరు ఉప ఎన్నికపై ఈ సమావేశంలో చర్చించారు. భేటీలో సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ... తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్టుగా వార్తలు రావడం బాధాకరమన్నారు. ఇలాంటి వార్తలు గాంధీభవన్ నుంచి, పీసీసీ ఆఫీసు బేరర్ల నుంచి వస్తున్నాయన్నారు. గాంధీభవన్ నుంచి ఇలాంటి తప్పుడు లీకులు ఇస్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఎందుకు ఖండించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉత్తమ్ స్పందిస్తూ.. ‘‘ఆఫీసు బేరర్లు ఎవరు లీక్ చేశారో నాకెలా తెలుస్తుంది? ఎవరైనా పార్టీ ఫిరాయిస్తున్నారని వార్తలు వస్తే ఇతరులెలా ఖండిస్తారు..’’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య వాగ్వాగం జరిగింది. పార్టీ సీనియర్ నేతలు జీవన్‌రెడ్డి, డీకే అరుణ తదితరులు జోక్యం చేసుకుని వారిని సముదాయించారు. అనంతరం జానా మాట్లాడుతూ... సీఎల్పీ నేతగా తాను కొనసాగడం ఇష్టం లేకుంటే తప్పుకుంటానని, ఈ బాధ్యతలను ఎవరైనా తీసుకోవచ్చన్నారు. దాంతో ఇప్పుడు నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగడం, మార్పుపై చర్చ అనవసరమని సీనియర్లు అభిప్రాయపడ్డారు. సొంత ప్రయోజనాల కోసమే వీడుతున్నారు కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు ఫిరాయింపులకు దిగుతున్నారనే అంశంపై భేటీలో తీవ్ర చర్చ జరిగింది. సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి కాంగ్రెస్‌ను వదిలి అధికార పార్టీలోకి వెళ్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్లోకి వెళ్లిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వం సరిగా లేదని నోటికొచ్చినట్టుగా మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. నాయకత్వం అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలని కూడా పలువురు ప్రశ్నించారు. పార్టీ టికెట్ ఇచ్చి, గెలవడానికి వనరులను సమీకరించిన తర్వాత కూడా పార్టీ మారితే ఇక ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. పార్టీ మారుతామంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లాలని జానారెడ్డి అన్నారు. పార్టీలో నేతలపై పరస్పరం నమ్మకం ఉండాలన్నారు. ఈ మధ్య పార్టీ మారిన పువ్వాడ అజయ్‌కు కాంగ్రెస్‌తో అనుబంధం లేదన్నారు. పాలేరు ఉప ఎన్నికలో అంతా ఏకమై పనిచేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. పాలేరు ఎన్నిక వ్యయం కోసం పార్టీ ఎమ్మెల్యేలంతా ఒకనెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీలకు నో ఎంట్రీ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం అంటూ విప్ సంపత్ కుమార్ నుంచి, సీఎల్పీ కార్యాలయ సిబ్బంది నుంచి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు సమాచారం అందింది. అయితే సమావేశం ప్రారంభానికి ముందు ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ సమావేశం పరిమితమని సిబ్బంది చెప్పారు. దీంతో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల సమావేశమే అయితే ఎమ్మెల్సీలను ఎందుకు ఆహ్వానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జానా, ఉత్తమ్ బయటకు వచ్చి షబ్బీర్ అలీని, పొంగులేటి సుధాకర్ రెడ్డిని విశ్రాంతి గదిలోకి తీసుకువెళ్లారు. కాగా, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి నియామకం, అయోమయ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమావేశం నుంచి అలిగి వెళ్లిపోయారు. -
కేసీఆర్ మాట నిలబెట్టుకో..
ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి పెంచినందున ఒకేసారి మాఫీ చేయాలి: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... సీఎం కేసీఆర్ మాట మీద నిలబడి ఒకేసారి పూర్తి రుణమాఫీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి పెంచితే ఒకేసారి రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటన చేశారని గుర్తుచేశారు. గురువారం కాంగ్రెస్ సీనియర్ నేతలు మధుయాష్కీ, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబులతో కలసి గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.లక్ష వరకు ఉన్న పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. రెండేళ్లు పూర్తి కావస్తున్నా వాయిదాలు వేయడం తప్ప రైతులను రుణ విముక్తులను చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. కరువు తీవ్రత వల్ల గ్రామాల్లోనూ తాగునీటికి కటకట నెలకొందని, పశుగ్రాసం లేక పశువులను అమ్ముకుంటున్నారని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలుచేయాలని... కూలీలకు పని కల్పించి, గ్రామాల నుంచి వలస పోకుండా నివారించాలని ఉత్తమ్ కోరారు. పంచాంగం ఆవిష్కరణ: తెలంగాణ జాయింట్ స్ట్రగుల్ కమిటీ నేతృత్వంలో రూపొందించిన దుర్ముఖి నామ సంవత్సర పంచాంగాన్ని ఉత్తమ్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలను తెలియజేశారు. -
మేయర్ అభ్యర్థిగా విక్రమ్: ఉత్తమ్
-
మేయర్ అభ్యర్థిగా విక్రమ్: ఉత్తమ్
ఈ నెల 29, 30న ప్రచారానికి దిగ్విజయ్, ఆజాద్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా ఎం.విక్రమ్ గౌడ్‌ను టీపీసీసీ అధికారికంగా ప్రకటించింది. పార్టీలోని సీనియర్లతో చర్చించి, అందరి ఆమోదం తీసుకుని విక్రమ్‌ను నిర్ణయించినట్టుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ప్రకటించారు. మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు, యువకుడు అయిన విక్రమ్‌ను మేయర్ అభ్యర్థిగా నిర్ణయించామన్నారు. పార్టీకి చెందిన జాతీయ నేతలు, రాష్ట్రంలో అనుభవజ్జులైన నాయకులు గ్రేటర్లో ఎన్నికల ప్రచారం చేస్తారని వెల్లడించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ఈ నెల 29న, కేంద్ర మాజీమంత్రి గులాంనబీ ఆజాద్ 30న హైదరాబాద్‌లో ప్రచారంచేస్తారని వివరించారు. పాతబస్తీలో నిర్వహించే బహిరంగసభల్లో వారు ప్రసంగిస్తారని తెలిపారు. దీనితోపాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచార వ్యూహం, సమన్వయం చేయడానికి అనుభవజ్ఞులతో ప్రచార కమిటీని ఏర్పాటుచేసినట్టుగా ఉత్తమ్ వెల్లడించారు. ఏఐసీసీ కార్యదర్శి, ఎంపీ వి.హనుమంతరావు చైర్మన్‌గా ప్రచార కమిటీ ఏర్పాటైందన్నారు. పార్టీ సీనియర్లు సర్వే సత్యనారాయణ, నంది ఎల్లయ్య, ఎం.ఏ.ఖాన్, రేణుకా చౌదరి, పి.సబితా ఇంద్రారెడ్డి, ఎం.శశిధర్ రెడ్డి, జి.ప్రసాద్‌కుమార్, ఎం.అంజన్‌కుమార్ యాదవ్, పి.సుధాకర్ రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించారు. -
గ్రేటర్ ఎన్నికలు : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
-
ఎంఐఎం, బీజేపీ మధ్య రహస్య అవగహన
-
'కాంగ్రెస్ కేడర్ అప్రమత్తంగా ఉండాలి'
-
చిన్నారి ఉత్తమ్ కిడ్నాప్ కథ సుఖాంతం
-
చిన్నారి ఉత్తమ్ కిడ్నాప్ కథ సుఖాంతం
తిరుపతి : తిరుపతిలో కిడ్నాప్ అయిన 27 రోజుల చిన్నారి ఉత్తమ్ ఆచూకీ లభ్యమైంది. తమిళనాడు రాష్ట్రం చిదంబరంలోని వేలూరులో ఉత్తమ్‌ని పోలీసులు ఆదివారం గుర్తించారు. చిన్నారిని తీసుకుని పోలీసులు చిత్తూరు బయలుదేరారు. మరికాసేపట్లో చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. అయితే చిన్నారిని కిడ్నాప్ చేసినట్లుగా భావిస్తున్న పూజను పోలీసులు అదుపులోకి తీసుకుని... ప్రశ్నిస్తున్నారు. తిరుపతి రూరల్‌లోని విద్యా నగర్ కాలనీ నివసిస్తున్న నేపాల్‌కి చెందిన దంపతులు సంతోష్ కుమార్, బాటుకు ఇటీవలే బాబు జన్మించాడు. ఆ చిన్నారిని శనివారం మధ్యాహ్నం ఆగంతకులు కిడ్నాప్ చేశారు. దాంతో దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా బాలుడి ఆచూకీ కోసం పలు బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో బాలుడు వేలూరులో ఉన్నట్లు గుర్తించారు. -
నేడు వికారాబాద్‌కు పొన్నాల
- సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టనున్న కాంగ్రెస్ - హాజరుకానున్న జానా, డీఎస్, ఉత్తమ్ సహా పలువురు నేతలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలోనే అత్యధికంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఓటమి భారంతో కుంగిపోకుండా.. శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం వికారాబాద్‌లో జరిగే నియోజకవర్గ స్థాయి కార్యకర్తలసమావేశంలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుడుతోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యే ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత జానారెడ్డి సహా అగ్రనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొంటారని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు గౌలికార్ ఫంక్షన్లో సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభించ నున్నట్లు ఆయన పేర్కొన్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. తనపై నమ్మకంతో రెండోసారి డీసీసీ పదవి కట్టబెట్టిన కాంగ్రెస్ అధిష్టానం నమ్మకాన్ని నిలబెడతానని క్యామ మల్లేశ్ స్పష్టం చేశారు. శనివారం గాంధీభవన్‌లోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో క్యామ మాట్లాడారు. సీనియర్లతో ఏలాంటి బేధాభిప్రాయాలకు తావివ్వకుండా సమన్వయంతో వ్యవహరిస్తానని చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలపై ప్రభుత్వంపై నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా ఉద్యమాలు సాగిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో 109 హామీలిచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. గద్దెనెక్కిన తర్వాత కేవలం రెండు, మూడు హామీలను మాత్రమే అమలు చేసిందని, మిగతావాటిని బుట్టదాఖలు చేసే యత్నం చేస్తోందని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచైనా హామీలు అమలు చేసేలా ఒత్తిడి చేస్తామని మల్లేశ్ స్సష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 48డివిజన్లలో పార్టీని పటిష్టంచేసేందుకు త్వరలోనే డివిజన్లవారీగా సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ సత్తాచాటేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు. శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు స్వీకరిస్తూ పార్టీ బలోపేతానికి పాటుపడతానని క్యామ మల్లేశ్ అన్నారు. -
ధూపవిచిత్రాలు!
సృజన ప్రశాంతంగా ఆరుబయట మంచం మీద పడుకుని ఆకాశంకేసి చూస్తుంటే... నీలిమేఘాలు భారంగా కదులుతుంటే, తెల్లని మేఘాలు దూదిపింజల్లా తేలిపోతుంటాయి. ఆ మబ్బుల్లో ఆకారాలను వెతుక్కోవడం భలే సరదా. అంతటి సృజనాత్మకతను ఆస్వాదించడం అలవాటైన మనసు ఊరుకుంటుందా? అగరువత్తి నుంచి వెలువడే ధూపంలోనూ ఆకారాలు వెతుక్కుంటుంది. అలా ఒక రూపం ఇచ్చి ‘స్మోక్ ఆర్ట్’ అని పేరు పెట్టారు రవిబాబు. సృజనాత్మకత, సాంకేతికతల మేళవింపు ఆ బొమ్మలు. స్మోక్ ఆర్ట్ మీద ఆసక్తి కలిగిన సందర్భం! ‘‘దాదాపుగా పదేళ్ల క్రితం ఒకసారి ఇంటర్నెట్లో ఒక ఫొటో చూశాను. ఒక ఫొటోగ్రాఫర్ ధూపాన్ని ఫొటో తీసి దానికి ఫొటోషాప్‌లో ఒక ఇమేజ్‌ని అనుసంధానం చేశాడు. దానిని చూసినప్పుడు నాకు కలిగిన ఆలోచన ఇది. చిత్రకారుడిగా ఎన్నో ప్రయోగాలు చేశాను. దేవుడి ముందున్న సాంబ్రాణి కడ్డీ నుంచి వెలువడే ధూపం గాల్లో కలిసేలోపు ఎన్ని రూపాలు సంతరించుకుంటుందో! మనం ఎన్ని కోణాల్లో చూస్తే అన్ని రూపాలు కనిపిస్తాయి. నేను ఆసక్తిగా చేసుకున్న అ అలవాటుకి అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్ స్ఫూర్తితో ఒక రూపం ఇవ్వగలిగాను. మొదట్లో ఒక బొమ్మ వేయడానికి ఒక రోజు పట్టింది. ఇప్పుడు గంట సేపటికి ఒక బొమ్మ సిద్ధమవుతోంది’’ అన్నారు రవిబాబు. బ్రష్ లేదు... పెయింట్ లేదు..! స్మోక్ ఆర్ట్ వేయడానికి రంగులు, కుంచెలు అక్కర్లేదు. ఒక రూపాన్ని ఊహించుకుని దానిని కంప్యూటర్ స్క్రీన్ మీద డ్రాయింగ్ వేస్తారు. ఫొటోషాప్‌లో మరికొన్ని ఎఫెక్ట్లిస్తారు. కంప్యూటర్ మౌస్తో అన్ని ఆకారాలనూ గీయడం కష్టం. అలాంటి వాటిని కాగితం మీద పెన్సిల్‌తో గీసి స్కాన్ చేయాలి. ఆ సాఫ్ట్ కాపీ ఆధారంగా కంప్యూటర్ పెన్సిల్ టూల్‌తో బొమ్మ పూర్తి చేస్తారు. డిజిటల్ పెయింటింగ్‌లో ఇదో ప్రక్రియ. బొమ్మను చూస్తే పొగను ఫొటో తీసినట్లు అనిపిస్తుంది. కానీ ఇది నిజమైన పొగ కాదు, పొగలా కనిపించే ఒక రకమైన చిత్రకళ. ‘‘ఇందులో సృజనాత్మకత ప్రధానం. ఆ దృష్టి ఉంటే మన చుట్టూ కనిపించే ఏ వస్తువునుంచి అయినా కళారూపాన్ని సృష్టించవచ్చు. ఈ రకమైన రూపకల్పన నాతోనే మొదలైందని అనుకుంటున్నాను. నేను చిత్రకారుడిగా శిక్షణ పొందలేదు. ఉత్తమ్ గారి ఏకలవ్య శిష్యుణ్ని. ఆయనను కలిసి బొమ్మవేయడంలో మెలకువలు అడిగినప్పుడు... మెటీరియల్ వాడకం గురించి సలహాలిచ్చారు. ‘బొమ్మ ఎలా వేయాలనేది చిత్రకారుడే నిర్ణయించుకోవాలి. ఎవర్నీ అనుకరించకూడదు, అనాటమీ తప్పకూడదు’... అన్నారు. నేను ఆ మాటలనే అనుసరిస్తున్నాను’’ అంటారు రవిబాబు. -
సీఎం పర్యటన విషయం తెలియదు : ఉత్తమ్
హుజూర్నగర్ : ఈ నెల 27 లేదా 30వ తేదీలలో పులిచింతల ప్రాజెక్టు ప్రారంభానికి జిల్లాకు సీఎం వస్తున్నారన్న సమాచారం తనకు పూర్తిస్థాయిలో తెలియదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. బహుశా ప్రాజెక్టును గుంటూరు జిల్లానుంచే ప్రారంభించవచ్చని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన హుజూర్‌నగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటనను అడ్డుకుంటారా అని విలేకరులు ప్రశ్నించగా తెలంగాణ ప్రాంతంలోఆయన పర్యటనే లేదని, అలాంటప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రచ్చబండ-3లో గృహనిర్మాణశాఖ ద్వారా 13 లక్షల 65వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధికి అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు.