
ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌వి అబద్ధాలు : ఉత్తమ్
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు, అవాస్తవాలను మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలపై ప్రజలకు వివరించడానికి నిపుణులు, ఇంజనీర్లతో శుక్రవారం ఇక్కడ సమావేశం అవుతున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టు గురించి సీఎం కేసీఆర్ నోటికొచ్చిట్టుగా అబద్ధాలను మాట్లాడుతున్నారన్నారు. వీటిని మరింత సమగ్రంగా, లోతుగా చర్చించి ప్రజలకు వివరిస్తామని ఉత్తమ్ తెలిపారు.