Pranahitha project
-
Photo Feature: టీకా రికార్డు, 105 ఏళ్ల బామ్మకు వ్యాక్సిన్
ఆంధ్రప్రదేశ్‌లో రికార్డులో ఒక్కరోజులో 13 లక్షల 59 వేల 300 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. గతంలో ఒక్కరోజులో 6.32 లక్షల డోసుల టీకాలు వేసిన రికార్డును తానే అధిగమించింది. మరోవైపు తొలకరి వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఔత్సాహికులు యోగాసనాలతో సందడి చేశారు. మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి.. -
ప్రాణహిత ఆపేందుకు ప్రభుత్వ కుట్ర
నెన్నెల(బెల్లంపల్లి): ప్రాణహితపై ప్రాజెక్టు కట్టకుండా కాళేశ్వరంకు నీటిని పంపించి ఇతర జిల్లాలకు తాగునీరు ఇచ్చే విధంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ మంచిర్యాల జిల్లా కమిటీ నాయకులు ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కొమురంభీం, మంచిర్యాల జిల్లాలను ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ప్రాణహితపై ప్రాజెక్టు కట్టి మంచిర్యాల జిల్లాకు నీరు అందిస్తానని ప్రకటించిన ప్రభుత్వం 50 వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును యుద్దప్రాతిపదికపై కట్టి ఇప్పుడు పద్ధతి మార్చారని విమర్శించారు. ప్రాణహితపై ప్రాజెక్టు కట్టకపోవడం ఈ రెండు జిల్లాల రైతులకు తీవ్రంగా నష్టపర్చడమేనన్నారు. తక్షణమే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఎండి చాంద్‌పాషా, శ్రీనివాస్, లాల్‌కుమార్, బ్రాహ్మనందం, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు రత్నం తిరుపతి పాల్గొన్నారు. -
‘ప్రాణహిత’ సాధించే వరకు పోరాటం
మంచిర్యాలటౌన్: వార్దానది ప్రాజెక్టును ఆపే వరకు పోరాడి, ప్రాణహిత ప్రాజెక్టును సాధించే వరకు పోరాటం తప్పదని అఖిలపక్షం నేతలు అన్నారు. పట్టణంలోని ఎఫ్సీఏ ఫంక్షన్‌హాలులో గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నీటికి కొదువ లేదని, కానీ ఒక్క ఎకరానికి కూడా సాగునీటిని అందించే ప్రాజెక్టులు లేవన్నారు. మన జిల్లాలో పారుతున్న నదుల నీటిని ఇతర జిల్లాలకు తరలిస్తున్నారని, అక్కడ రెండు నుంచి మూడు పంటలకు సాగునీరు అందుతుందని, మన వద్ద కనీసం ఒక్క పంటకు కూడా సరిపడా నీటిని అందించని దౌర్భాగ్యపు పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే సాగునీటి ప్రాజెక్టులను ఒక ప్రణాళిక ప్రకారం డిజైన్ చేసి, వాటి నిర్మాణం కోసం కృషి చేస్తే, కేసీఆర్ ఆ ప్రాజెక్టుల డిజైన్లు మార్చి, దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీటిని అందించే వరకు తమ పోరాటం తప్పదన్నారు. అనంతరం ఇతర నేతలు మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టును వార్ధానదిపైకి మార్చి కేసీఆర్ తమ ముంబాయి 148 మీటర్ల ఒప్పందాన్ని తనే తుంగలో తొక్కారని, కమీషన్ల కోసం కాళేశ్వరానికి మార్చి ప్రాణహిత ప్రాణం తీశారని అన్నారు. కేసీఆర్ నిర్ణయంపై మరో తెలంగాణ ఉద్యమం మాదిరి, నీటి కోసం ఉద్యమాన్ని చేపడతామని, గతంలో ప్రాణహిత ప్రాజెక్టు కోసం 70 శాతం పైప్‌లైన్ పనులను పూర్తి చేసిందని, కేవలం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తే సరిపోయేదని అన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు మార్పుతో కనీసం వెయ్యి ఎకరాలకు కూడా నీరు పారేందుకు అవకాశం లేదని, ప్రజల్లోకి ఇదే విషయాన్ని తీసుకెళ్లి, ప్రభుత్వంతో పోరాటం చేసేందుకు అన్ని పార్టీల నేతలు సిద్ధంగా ఉండాలని కోరారు. తెలంగాణకు ఎనలేని మేలుచేసే ప్రాణహితను 148 మీటర్ల మైలారం నుంచి 138 మీటర్ల గోదావరి(సుందిళ్ల 132 మీ)లకు అనుసంధానం చేస్తే సంపూర్ణ గ్రావిటీ కాలువకు, కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న వార్దా్టకు బదులు ప్రాణహిత ప్రాజెక్టును మార్చే నిర్ణయం గొడ్డలిపెట్టులాంటిది అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్, సీపీఐ(ఎంఎల్), కాంగ్రెస్ పార్టీకి చెందిన దుర్గం అశోక్, చిట్ల సత్యనారాయణ, గరిగంటి కొమురయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గోపతి మల్లేశ్, ఐఆర్‌సీపీ నాయకులు నైనాల వెంకటేశ్వర్లు, జయరావు, జలసాధన సమితి అధ్యక్షుడు నైనాల గోవర్దన్, రాజేశ్ నాయక్, రఘునాథరెడ్డి, తెలంగాణ జనసమితి నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, క్యాతం రవికుమార్, దుర్గం నరేశ్, బదావత్ రమేశ్ నాయక్, వొడ్నాల శ్యాం, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణహిత ప్రాణం తీసిన ప్రభుత్వం
దహెగాం(సిర్పూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పుట్టిన ప్రాణహిత ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించకుండా వార్ధానదికి తరలించి ప్రాణహిత ప్రాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసిందని సీపీఐ బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ , జల సాధన సమితి అధ్యక్షుడు నైనాల గోవర్ధన్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా మండల కేంద్రం సమీపంలో అసంపూర్తిగా ఉన్న ప్రాణహిత కాలువను సందర్శించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రాణహిత వద్ద ప్రాజెక్టు నిర్మించకుండా వార్ధా నదికి మార్చడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి జిల్లాకు కేసీఆర్ తీరని ద్రోహం చేయడమే అన్నారు. ప్రాణహిత తుమ్మిడిహెట్టి 148 మీటర్ల, మైలారం 138, గోదావరి సుందిళ్ల 132 మీటర్లకు అనుసంధానం చేసే సంపూర్ణ గ్రావిటీ కాలువకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న వార్ధానదికి ప్రాజెక్టు మార్చే నిర్ణయం గొడ్డలి పెట్టులాంటిదన్నారు. ప్రాణహిత ప్రాజెక్టుకు వైఎస్సార్ హయాంలో అంబేద్కర్ సుజల స్రవంతిగా నామకరణం చేశారని నేడు అంబేద్కర్ పేరును లేకుండానే ఈ ప్రభుత్వం చేస్తోందన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరానికి ఈ ప్రాజెక్టును తరలించారన్నారు. జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును 148 మీటర్ల ఎత్తుకు సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి ఒప్పందం కుదుర్చుకొని ఒంటెలపై ఊరేగింపు చేసుకున్న సీఎం.. చారిత్రక ద్రోహం చేశారన్నారు. అనంతరం సిర్పూర్ నియోజకవర్గం నాయకుడు పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం ఇక్కడే జరగడానికి ప్రాణహితకు అడ్డంగా పడుకొని నియోజకవర్గానికి సాగునీటికోసం నీళ్లు ఇప్పిస్తామన్న చెప్పిన ఎమ్మెల్యే నేడు ప్రాజెక్టు తరలిపోతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మన చుట్టూ నీళ్లు ఉన్నా మన పొలాలకు సాగు నీరు అందక పోవడం పాలకుల కుట్రలో భాగమే అన్నారు. అఖిలపక్షం నాయకులు బద్రి సత్యనారాయణ, చాంద్‌పాషా, లాల్‌కుమార్, అంబాల ఓదెలు, వెంకట నారాయణ, నాగుల తిరుపతి, కోండ్ర రాజా గౌడ్, చిలువేరు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. -
విడగొట్టి.. వదిలేశారు!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు చేపట్టిన ప్రాణహిత ప్రాజెక్టు పడకేసింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును ప్రాణహిత, కాళేశ్వరం ఎత్తిపోతలుగా విభజించాక.. ప్రాణ హితను ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించాల్సిన తమ్మిడిహెట్టి బ్యారేజీ వద్ద మూడున్నరేళ్లుగా తట్టెడు మట్టి తీయలేదు. భూ సేకరణ, అటవీ అను మతులపై అసలు పట్టింపే లేకపోవడంతో ప్రాజెక్టు అతీగతీ లేకుండా పోతోంది. రూ.6,465 కోట్ల ప్రాజెక్టు ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని గతంలో నిర్ణయించగా, మరో 1.44 లక్షల ఎకరాలు కలిపి 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా కొత్త ప్రణాళిక రూపొందించారు. తమ్మిడిహెట్టి వద్ద 4.5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు రూ.965 కోట్లు అవసరమవుతాయని తొలుత అంచనా వేశారు. కానీ తర్వాత దాన్ని రూ.1,918.7 కోట్లకు సవరించారు. 70 కిలోమీటర్ల ప్రధాన, నెట్వర్క్ కాల్వలకు నీటి పంపిణీకి కలిపి మొత్తంగా రూ.6,465 కోట్లు అవసరమవుతుందని తేల్చారు. ఈ అంచనాలు పూర్తయి ఏడాదిన్నర గడుస్తున్నా అటవీ అనుమతులు, భూ సేకరణ కారణంగా అడుగు ముందుకు పడటం లేదు. ఒక్క ఎకరా కూడా.. తమ్మిడిహెట్టి బ్యారేజీకి 965 ఎకరాల భూ సేకరణ అవసరం ఉండగా ఇప్పటివరకు ఒక్క ఎకరం కూడా సేకరించలేదు. ఇందులో మహారాష్ట్ర పరిధిలోనూ 60 ఎకరాలు ఉండగా ఆ ప్రక్రియ కూడా ముందుకెళ్లలేదు. ప్రాజెక్టులో పూర్తి నిర్మాణాలకు 8,709.5 ఎకరాలు అవసరమని అంచ నా వేశారు. ఇందులో రిజర్వ్ అటవీ భూమిలోని 508 హెక్టార్ల బదిలీకి కేంద్రం అంగీకరించింది. కానీ పరిహారం చెల్లించక రెండోదశ ప్రక్రియ మొదలవలేదు. తమ్మిడిహెట్టి బ్యారేజీ 2.15 కిలోమీటర్ల నిర్మాణ ప్రాంతం రాష్ట్ర పరిధిలో.. కవ్వాల్, మహారాష్ట్ర పరిధిలో ఉంది. అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో భాగంగా భూమి ఇచ్చేందుకు మహారాష్ట్ర సమ్మతించడంతో పర్యావరణ, అటవీ అనుమతులు దక్కాయి. కానీ పరిహారం చెల్లింపులో అటవీ శాఖ జాప్యంతో అడుగు ముందుకు పడలేదు. మరో 1,155 ఎకరాలు (622 హెక్టార్లు) టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉంది. ‘గ్రావిటీ’సర్వే గాల్లోనే.. కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల బ్యారేజీకి తమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు చేపట్టిన సర్వే పనులపై వ్యాప్కోస్ దాగుడుమూతలు ఆడుతోంది. తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో 44 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జల సంఘం చెప్పింది. ఈ నేపథ్యంలో తమ్మిడిహెట్టి రెగ్యులేటర్ ఎత్తును 145 మీటర్ల నుంచి మరో మీటర్‌కు తగ్గిస్తే మరో 20–30 టీఎంసీల లభ్యత పెరుగుతుందని, మొత్తంగా 70 టీఎంసీలను గ్రావిటీతో 72వ కిలోమీటర్ వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి కాలువ ద్వారా సుందిళ్లలో కలపాలని సర్కారు ప్రతిపాదించింది. ఆ సర్వే బాధ్యతలను 2016 మార్చి 18వ తేదీన వ్యాప్కోస్‌కు అప్పగించి రూ.6.67 కోట్లు కేటాయించింది. అయితే హెలికాప్టర్లో లోపాలు, జూన్ వర్షాలతో సర్వేకు బ్రేక్ పడింది. తర్వాత కాళేశ్వరంలోని మల్లన్నసాగర్–సింగూరు, నార్లాపూర్–డిండి అలైన్మెంట్లో బిజీగా ఉండటంతో సుందిళ్ల వైపు వ్యాప్కోస్ కన్నెత్తి చూడలేదు. మరోవైపు సర్వే నిధులు సవరించి 9.35 కోట్ల రూపాయలు కేటాయించాలని వ్యాప్కోస్ కోరడం గమనార్హం. -
'ప్రాణహిత’పై పర్యావరణ కమిటీకి ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రాణహిత’ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) అనుమతులకు సంబంధించి కేంద్ర పర్యా వరణ శాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) ఎదుట రాష్ట్ర అధికారులు గురువారం ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాణ హిత నీటిని తమ్మిడిహెట్టి ద్వారా మళ్లించే ప్రక్రియ పర్యావరణ, ఆర్థిక, నిర్వహణ పరంగా అనుసరణీయంగా ఉంటుందని వివరించారు. పర్యావరణ మదింపు చేసుకునేందుకు విధి విధానాలను (టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్–టీఓఆర్)ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. తొలుత రూ.1,919 కోట్ల అంచనా, 56 వేల ఎకరాలకు నీరందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. అయితే తర్వాత రూ.4,231 కోట్ల అంచనాతో 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొం దించారు. తమ్మిడిహెట్టి వద్ద 4.5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి.. 14.4 టీఎంసీల నీటిని తరలి స్తారు. ఈ అన్ని అంశాలపై ఈఏసీ కమిటీ ముందు ప్రాజెక్టు సీఈ భగవంతరావు వివరణ ఇచ్చారు. -
ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌వి అబద్ధాలు : ఉత్తమ్
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు, అవాస్తవాలను మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలపై ప్రజలకు వివరించడానికి నిపుణులు, ఇంజనీర్లతో శుక్రవారం ఇక్కడ సమావేశం అవుతున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టు గురించి సీఎం కేసీఆర్ నోటికొచ్చిట్టుగా అబద్ధాలను మాట్లాడుతున్నారన్నారు. వీటిని మరింత సమగ్రంగా, లోతుగా చర్చించి ప్రజలకు వివరిస్తామని ఉత్తమ్ తెలిపారు. -
తమ్మిడిహెట్టి-సుందిళ్ల గ్రావిటీ సర్వేకు బ్రేక్
♦ హెలికాప్టర్లో సాంకేతిక లోపంతో ఆగిన పనులు ♦ పునరుద్ధరణకు మరో 3, 4 రోజులు పట్టే అవకాశం సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి నుంచి నీటిని గ్రావిటీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్లకు తరలించేందుకు చేపట్టిన సర్వే పనులకు బ్రేక్ పడింది. సర్వే బాధ్యత తీసుకున్న వ్యాప్కోస్ సంస్థ వినియోగిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో 3 రోజులుగా సర్వే పనులు నిలిచిపోయాయి. సర్వే పనులు తిరిగి కొనసాగించేందుకు 3, 4 రోజులు పట్టే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ వర్గాలు తెలిపా యి. ప్రాణహిత మొదటి డిజైన్ ప్రకారం తమ్మిడిహెట్టి నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసి అక్కడ్నుంచి 72 కిలోమీటర్ల మేర గ్రావిటీ, తర్వాత చిన్న లిఫ్టు ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించాలని అధికారులు ప్రణాళిక వేశారు. సుమారు 60 క్యూసెక్కుల నీటి తరలింపునకు వీలుగా 69 మీటర్ల వెడల్పుతో కాల్వల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అయితే తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో 44 టీఎంసీల నీటి లభ్యత ఉందని సర్వే సంస్థ అంచనా వేయడంతో తమ్మిడిహెట్టి నుంచి తీసుకునే నీటి పరిమాణాన్ని 50 క్యూసెక్కులకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం తెరపైకి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాణహితను కలుపుకుంటే 5,200 మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఉండటంతో గ్రావిటీ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. తమ్మిడిహెట్టి రెగ్యులేటర్ ఎత్తును 145 మీటర్ల నుంచి మరో మీటర్‌కు తగ్గిస్తే మరో 20 నుంచి 30 టీఎంసీల నీటిని తరలించవచ్చనే అంచనా నేపథ్యంలో వీలైనంత ఎక్కువ నీటిని గ్రావిటీ ద్వారా 72వ కిలోమీటర్ వరకు తెచ్చి అక్కడ్నుంచి వేరే కాల్వ ద్వారా సుందిళ్ల బ్యారేజీలో కలపాలనే ప్రతిపాదన చేశారు. ఇందుకోసం సర్వే బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించారు. 72వ కిలోమీటర్ పాయింట్ నుంచి సుందిళ్లకు నీటిని కలిపే వ్యవస్థపై ఈ సంస్థ లైడార్ సర్వే మొదలుపెట్టింది. సర్వే మేరకు ఈ అలైన్మెంట్ దారిలో మైనింగ్ క్షేత్రాలు ఉన్నాయని, వాటిల్లో టన్నెల్ నిర్మాణాలను చేపట్టడం వీలుపడదని సంస్థ గుర్తించింది. దీనిపై లోతుగా పరిశీలించడంతోపాటు గ్రావిటీ ద్వారా వచ్చే నీటి అవకాశాలను మెరుగుపరిచేందుకు లైడార్ సర్వే చేస్తోంది. గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలున్న నేపథ్యంలో కాల్వల వెడల్పు తగ్గించడం సబబు కాదంటూ 60 క్యూసెక్కుల నీటి తరలింపు ప్రణాళికనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే పూర్తయితేనే తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత, అక్కడ్నుంచి సుందిళ్లకు నీటి తరలింపు అంశం కొలిక్కి వస్తుంది. -
కాళేశ్వరంలో ఎత్తిపోతలు తగ్గిద్దామా..?
తమ్మిడిహెట్టి నుంచి నీటి తరలింపుపై పరిశీలన వ్యాప్కోస్‌కు ప్రభుత్వ ఆదేశం హైదరాబాద్: ప్రభుత్వ ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో గణనీయంగా ఉన్న విద్యుత్ అవసరాలను తగ్గించే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎత్తిపోతలను తగ్గించి.. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న సుందిళ్ల వరకు తరలించే మార్గాలపై అన్వేషణ చేయాలని నిర్ణయించింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం వ్యాప్కోస్‌కు కట్టబెట్టింది. పెరిగిన విద్యుత్ అవసరాలను తగ్గించడంలో భాగంగా తమ్మిడిహెట్టి రెగ్యులేటర్ ఎత్తును 145 మీటర్ల నుంచి మరో మీటర్‌కు తగ్గించి, వీలైనంత ఎక్కువ నీటిని గ్రావిటీ ద్వారా 72వ కిలోమీటర్ వరకు తేవడం, అక్కడి నుంచి వేరే కాల్వ ద్వారా సుందిళ్ల బ్యారేజీలో కలపడం అనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అయితే దీని సాధ్యాసాధ్యాలను పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉన్న దృష్ట్యా, ఆ బాధ్యతను వ్యాప్కోస్‌కు కట్టబెట్టింది. వారు తేల్చిన అనంతరమే ఏదైనా నిర్ణయానికి రానుంది. సబ్స్టేషన్ల నిర్మాణంపై చర్చలు కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమయ్చే విద్యుత్‌ను సమకూర్చే బాధ్యతను తీసుకున్న ట్రాన్స్‌కో డెరైక్టర్ సూర్యప్రకాశ్‌తో ప్రాజెక్టు సీఈలు హరిరామ్, వెంకటేశ్వర్లు భేటీ అయ్యారు. విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం, టెండర్లు, ఇతర సాంకేతిక అంశాలపై ఆయనతో చర్చించారు. ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా చేసే సబ్స్టేషన్ల నిర్మాణానికి 4,100 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. నిర్మాణ పనులపై స్పష్టత వచ్చిన తర్వాత ఈ పనులను త్వరగా ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. -
పాత నమూనాలోనే ప్రాణహిత కాల్వలు
నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గతంలో నిర్ధారించిన నమూనాలోనే ప్రాణహిత ప్రాజెక్టు కాలువల నిర్మాణ పనులు కొనసాగించాలని మంత్రి హరీశ్‌రావు నిర్ణయించారు. తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణ డిజైన్లను మహారాష్ట్ర ప్రభుత్వానికి పంపించి త్వరితగతిన అనుమతులు పొందాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాణహిత, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల నిర్మాణంపై బుధవారం సచివాలయంలో అధికారులతో హరీశ్ సమీక్ష నిర్వహించారు. ప్రాణహితకాల్వ 78వ కి.మీ. నుంచి సుందిళ్ల బ్యారేజీకి టేకుమట్ల వాగు ద్వారా నీటిని గ్రావిటీతో తరలించేందుకు సర్వే జరిపి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి కొండపోచమ్మ జలాశయం వరకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సబ్ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను వెంటనే చెల్లించి పనులకు ఆటంకం కలగకుండా చూడాలని ప్రధాన కాంట్రాక్టర్లకు సూచించారు. నిర్మాణ సంస్థలకు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించి ప్రతి వారం సమీక్ష జరపాలని అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టుపై సమీక్షిస్తూ గోదావరి నుంచి కిన్నెరసాని, ముర్రేడు వాగు వరకు ప్రాజెక్టు పనులకు ఈ నెలాఖరు దాకా టెండర్లు పిలవాలని ఆదేశించారు. భక్తరామదాసు ప్రాజెక్టు పనులను, శ్రీరాంసాగర్ రెండో దశ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. -
మా తరఫున పోరాడండి
పొన్నాలను కోరిన మల్లన్నసాగర్ ముంపు బాధితులు సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల బాధితులు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను గురువారం కలిశారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్థ్యంపై కొరవడిన స్పష్టత, అధికారుల నిర్లక్ష్యం, స్థానిక ప్రజా ప్రతినిధుల ఆగడాలతో ముంపు గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పొన్నాలకు వివరించారు. భూములను ప్రజల అవసరాల కోసం తీసుకుంటున్నప్పుడు రైతులకు ఇచ్చే పరిహారం విషయంలోనూ, హక్కుల విషయంలోనూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. తమ పక్షాన పోరాడాలని పొన్నాలకు వివిధ గ్రామాల రైతులు విన్నవించారు. -
హడావుడి నిర్ణయాలు వద్దు
రీడి జైనింగ్పై బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో హడావుడి నిర్ణయాలు తీసుకోవద్దని బీజేపీ శాసన సభాపక్ష నేత లక్ష్మణ్ పేర్కొన్నారు. భారీ అంచనాలు, పాత ప్రాజెక్టుల పునరాకృతుల నేపథ్యంలో ప్రజల్లో కొన్ని సందేహాలు రావడం సహజమేనని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో పునరావాసంపై కూడా భరోసా ఇవ్వాలన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, ప్రాణహిత ప్రాజెక్టు రద్దు నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాకు ఏ విధంగా నీటిని ఇస్తారో ఆ జిల్లా వాసులకు స్పష్టత ఇవ్వాలని కోరారు. తమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత బ్యారేజీ ఎత్తు తగ్గించినా భవిష్యత్తులో పెంచుకునేలా పునాదులు నిర్మించాలన్నారు. జల విధానంపై ముఖ్యమంత్రి అందరికీ అర్థమయ్యేలా ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు అభినందించారు. కాగా తెలంగాణకు నీటి వినియోగంలో అదనపు హక్కులు పొందేలా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వద్ద గట్టిగా వాదనలు వినిపించాలని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కోరారు. -
‘మహా’ ఒప్పందాలపై రేపు తొలి భేటీ
హైదరాబాద్ రానున్న మహారాష్ట్ర అధికారులు అంతర్రాష్ట్ర ఒప్పందాల అమలు, మేడిగడ్డ ఎత్తుపైనే ప్రధాన చర్చ హైదరాబాద్: తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణ ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లే దిశగా అధికారుల స్థాయిలో తొలి సమన్వయ కమిటీ భేటీ శనివారం హైదరాబాద్‌లో జరుగనుంది. ప్రాణహిత ప్రాజెక్టు (తుమ్మిడిహెట్టి బ్యారేజీ), కాళేశ్వరం ప్రాజెక్టు (మేడిగడ్డ బ్యారేజీ)లపై చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో మొదటి దశ చర్చలు జరుగనున్నాయి. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై ఇప్పటికే మహారాష్ట్ర నుంచి సానుకూలత లభించగా, మేడిగడ్డ ఎత్తుపై మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. దీనిపైనే ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తుపైనే చర్చ ఉండనుంది. ప్రభుత్వం మేడిగడ్డ వద్ద 103 మీటర్ల వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది. అయితే ఈ ఎత్తులో 3వేల ఎకరాల వరకు ముంపు ఉంటుందని తేల్చారు. దీనిపై స్వయంగా సర్వే చేయించిన మహారాష్ట్ర ముంపును నిర్ధారించుకోవాల్సి ఉంది. ఈ సర్వే కొలిక్కి వచ్చినా ముంపు ఎంత తేలిందన్నది ఇంకా తెలియలేదు. తెలంగాణ చెప్పినట్లుగా 103 మీటర్ల ఎత్తుకే ఒప్పుకుంటారా? లేక 102, 101 మీటర్లకు తగ్గించాలంటారా? తెలియాల్సి ఉంది. అయితే ముంపును దృష్టిలో పెట్టుకొని బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అభ్యంతరం చెబితే దాన్ని ఒకట్రెండు మీటర్లకు తగ్గించేందుకు తెలంగాణ ఇప్పటికే సమ్మతి తెలిపింది. అయితే మేడిగడ్డ ద్వారా మహారాష్ట్రలో సుమారు 50వేల ఎకరాలకు నీరందిస్తున్నందున 103 మీటర్ల ఎత్తును ఒప్పుకోవాలని తెలంగాణ కోరే అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండే అంతర్రాష్ట్ర బోర్డు ప్రధాన కార్యాలయ ఏర్పాటుపైనా చర్చలు జరిగే అవకాశం ఉంది. -
'ఏం సాధించారని సంబరాలు'
కరీంనగర్: ఏం సాధించారని టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి పేరు వస్తుందనే అక్కసుతో రీ డిజైనింగ్ పేరుతో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుతో ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి నీళ్లు తరలించేందుకు ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. రీడిజైన్ తో ఎన్ని ఎకరాలకు నీరు అందిస్తారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
'విమర్శలు చేసే వారు ఎపుడూ ఉంటారు'
-
'విమర్శలు చేసే వారు ఎపుడూ ఉంటారు'
హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టు పై కొందరు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రతి విషయంలోనూ విమర్శలు చేసేవారు ఎప్పుడూ ఉంటారని ఆయన ఘాటుగా స్పందించారు. పోతిరెడ్డిపాడుపై పెదవి విప్పని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు ప్రాణహితపై మాట్లాడే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నపుడు ఉత్తమ్, భట్టి నోరు మెదపలేదని ఆయన ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా.. తెలంగాణ రైతులకు నీరందిస్తాయని ఈ సందర్భంగా హరీశ్ రావు పేర్కొన్నారు.