
ఆంధ్రప్రదేశ్‌లో రికార్డులో ఒక్కరోజులో 13 లక్షల 59 వేల 300 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. గతంలో ఒక్కరోజులో 6.32 లక్షల డోసుల టీకాలు వేసిన రికార్డును తానే అధిగమించింది. మరోవైపు తొలకరి వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఔత్సాహికులు యోగాసనాలతో సందడి చేశారు. మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి..

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని 13వ డివిజన్‌లో 105 సంవత్సరాల బాడికి మీనాక్షమ్మకు ఆదివారం కోవిడ్ టీకా వేశారు.

విజయనగరం జిల్లా వేపాడ మండలంలో కొండపై ఉన్న మారిక గ్రామానికి వ్యాక్సిన్ తరలింపు

కర్నూలు జిల్లా తారాపురం గ్రామంలో పొలానికి వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్న వైద్య సిబ్బంది

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గడ్చిరోలి జిల్లా నుంచి వచ్చే ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ ఏడాదిలో మొదటిసారి ప్రాణహిత నదికి వరద పొటెత్తడంతో జలకళ సంతరించుకుంది. దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోంది. – కోటపల్లి(చెన్నూర్)

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పరిధిలోని తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి నీటి మట్టం 73.5 మీటర్ల ప్రవాహంతో కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ, అన్నారంతో పాటు ఇతర బ్యారేజీలకు వర్షం నీరు అధికంగా వస్తోంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంజనీరింగ్ అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా సమ్మక్క సాగర్ వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతూ వస్తోందని ప్రాజెక్టు ఈఈ జగదీష్ తెలిపారు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి జలాశయంలోకి ఒకే రోజు 13.31 టీఎంసీల నీళ్లు వచ్చి చేరాయి. ఈ సీజన్‌లో 24 గంటల్లో ఈ స్థాయిలో ఆల్మట్టిలోకి వరద ప్రవాహం రావడం ఇదే తొలిసారి.

ముంబైలోని ‘నేషనల్ సొసైటీ ఫర్ ఈక్వల్ ఆఫర్చునిటీస్ ఫర్ ది హ్యాండీక్యాప్‌డ్’ వద్ద ఆదివారం నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో టీకా వేసుకుంటున్న ఓ దివ్యాంగుడు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పం రూపొందించిన సుదర్శన్ పట్నాయక్

చైనా రాజధాని బీజింగ్‌లో ఆదివారం భారత ఎంబసీ వద్ద యోగసనాలు వేస్తున్న విద్యార్థులు

న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ఆదివారం యోగాసనాలు వేస్తున్న ఔత్సాహికులు

అమెరికా ప్రభుత్వం తైవాన్‌కు ఆదివారం 25 లక్షల మోడెర్నా కోవిడ్ టీకా డోసులు పంపింది. ఇందుకు కృతజ్ఞతగా రాజధాని తైపీలోని 101 అంతస్తుల టవర్‌ను ‘అమెరికా –తైవాన్ స్నేహం వర్దిల్లాలి’ అంటూ రంగరంగుల విద్యుద్దీపాలతో అలంకరించింది.
Comments
Please login to add a commentAdd a comment