Yoga Day
-
జస్ట్ ఐదేళ్లకే యోగా గురువుగా చిన్నారి..!
ఫొటోలో కనిపిస్తున్న ఈ బాలుడు ఐదేళ్ల వయసులోనే యోగా గురువు స్థాయికి చేరుకున్నాడు. రాజస్థాన్‌కు చెందిన ప్రత్యక్ష్ విజయ్ అతి పిన్న వయసు యోగా గురువుగా, ప్రతిష్ఠాత్మక గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నాడు. నాలుగేళ్ల వయసు నుంచే ప్రత్యక్ష్ , తన తల్లిదండ్రులతో కలసి యోగా సాధన చేయటం మొదలు పెట్టాడు. రెండువందల గంటల యోగా టీచర్స్ ట్రైనింగ్ కోర్సును పూర్తి చేసిన ఈ బాలుడు, గత ఏడాది జులై 27న ఆనంద్ శేఖర్ యోగా పాఠశాల నుంచి యోగా గురువు ధ్రువపత్రాన్ని అందుకున్నాడు. కోర్సు సమయంలో ప్రత్యేక యోగాకు సంబంధించి అనేక మెలకువలను నేర్చుకున్నాడు. యోగాలోని ‘అలైన్మెంట్, అనాటమిక్ ఫిలాసఫీ’ వంటి క్లిష్టమైన అంశాలను నేర్చుకున్నాడు. ప్రత్యక్ష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, యోగా అనేది శారీరక భంగిమలు, శ్వాస గురించి మాత్రమే కాదు, మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా అని గ్రహించా’ అని తెలిపాడు. ప్రస్తుతం అతడు పెద్దలతోపాటు పిల్లలకు కూడా యోగా నేర్పిస్తున్నాడు. ఆన్లైన్లో వర్చువల్ రియాలిటీ క్లాసులు కూడా తీసుకుంటున్నాడు. వీటితోపాటు కొన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులకు యోగా శిక్షణ ఇస్తున్నాడు. (చదవండి: కిడ్స్ మేకప్ కోసం ఈ బ్యూటీ కిట్..!) -
ఆఫ్రికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఆఫ్రికాలో భారతీయులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 30వ తేదీ ఆదివారం నిర్వహించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా దారుసలెమ్ భారతీయ రాయబార కార్యాలయ ఉద్యోగి డాక్టర్ సౌమ్య చౌహన్ ఆధ్వర్యంలో టాంజానియా రాష్ట్రం ఎంబీఈఎఫ్వై టౌన్లో 9వ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు సౌమ్య చౌహన్ మాట్లాడుతూ.. "యోగా అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు. ఇది అంతర్గత శాంతికి, స్వీయ-ఆవిష్కరణకు, ప్రకృతితో సామరస్యానికి ఒక మార్గం. "అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వాహకుడు ఆంధ్రప్రదేశ్ తిరువూరు వాసి రామిశెట్టి వెంకట నారాయణ (సత్య) మాట్లాడుతూ ..." ప్రధాని మంత్రి మోదీగారు పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయలు శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సుకు, సమగ్ర ఐక్యతకు యోగ ఒక మంచి సాధనమన్నారు. రోజువారీ ఒత్తుడులు, వ్యక్తిగత జీవితాల తోపాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిచడంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుంది" అని అన్నారు. ఈ యోగా అభ్యాసకులలో మానసిక ప్రశాంతతా, ఐక్యత భావాన్ని పెంపొందించి, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతుందని యోగ సాధకుడు రోహిత్ పేర్కొన్నారు. (చదవండి: డాలస్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు) -
మహాత్మా గాంధీ స్మారక స్థలి వద్ద యోగా దినోత్సవ వేడుకలు
అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద 10వ అంతర్జాతీయ యోగాదినోత్సవ వేడుకలు ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగాయి. గౌరవ కాన్సుల్ జెనరల్ అఫ్ ఇండియా, డి. సి. మంజునాథ్ ముఖ్యఅతిథిగా హాజరై గౌరవ భారత ప్రధాని నరేంద్రమోడి 10 సంవత్సరాల క్రితం ఐక్యరాజ్య సమితిలో ఇచ్చిన పిలుపుననుసరించి నేడు విశ్వవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21 వ తేదీని అంతర్జాతీయ యోగాదినోత్సవంగా పాటించడం ముదావహం అన్నారు. అనునిత్యం యోగాభ్యాసం చెయ్యడంవల్ల అనేక ప్రయోజనాలున్నాయన్నారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర గౌరవ కాన్సుల్ జెనరల్ అఫ్ ఇండియా, డి. సి. మంజునాథ్ కు స్వాగతం పలుకుతూ గత పది సంవత్సరాలగా ఈ మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అంతర్జాతీయ యోగాదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని, ప్రతి సంవత్సరం హజరవుతున్నవారి సంఖ్య పెరుగుతున్నదని, ఇది కేవలం ఒకరోజు వేడుక కాకూడదని, అన్ని కార్పోరేట్ మరియు విద్యాసంస్థలలో ప్రతిరోజు యోగాభ్యాసం చేసే విధాననిర్ణయాలు తీసుకుని, దానికి తగిన ఏర్పాట్లుకల్పిస్తే అందరూ శారీరక, మానసిక ఆరోగ్యాలలో సత్ఫలితాలు సాధించవచ్చునని అన్నారు.డా. ప్రసాద్ తోటకూర మహత్మాగాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులందరితో కలసి గౌరవ కాన్సుల్ జెనరల్ అఫ్ ఇండియా, డి. సి. మంజునాథ్ కు మహాత్మాగాంధీ చిత్రపటాన్ని బహుకరించి, ఘనంగా సన్మానించారు. ముందుగా మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల సభను ప్రారంభించి ముఖ్యఅతిథికి, బోర్డుసభ్యులకు, పాల్గొన్న వారందరికీ స్వాగతం పలికారు.ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షురాలు, మరియు మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యురాలు అయిన సుష్మ మల్హోత్రా క్రమక్రమంగా యోగావేడుకలలో పాల్గొంటున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఈ సంవత్సరం డి.ఎఫ్.డబ్ల్యు హిందూ టెంపుల్, యోగభారతి, హార్ట్ఫుల్నెస్, ఈషా, ది యూత్ ఎక్ష్సలెన్స్ లాంటి సంస్థలు వారి సభ్యులతో పాల్గొనడం చాలా సంతోషం అన్నారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు రావు కల్వాల, జాన్ హామండ్, రన్నా జానీ, మురళి వెన్నం, సుష్మా మల్హోత్రా, కమల్ కౌశల్, రాజీవ్ కామత్, బి. యెన్. రావు మరియు ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ కార్యవర్గ సభ్యులు ృ మహేందర్ రావు, దినేష్ హూడా, ఉర్మీత్ జునేజా, దీపక్ కాల్ రా, ఆమన్ సింగ్, అమిత్ బూచె, సమర్నిక రౌత్ మొదలైన వారు తగు ఏర్పాట్లుచేసి యోగావేడుకలు విజయవంతంగావడంలో కీలకపాత్ర వహించారు. విశాలమైదానంలో రెండుగంటలకు పైగా సాగిన ఈ యోగావేడుకలలో అన్ని వయస్సులవారు ఉత్సాహంగా పాల్గొని, యోగాభ్యాసం అనంతరం ‘పీకాక్ ఇండియా రెస్టారెంట్’ వారు ఏర్పాటు చేసిన ఫలాహారాలను ఆస్వాదించి ఆనందించారు. -
ఆరోగ్యానికి శుభయోగం
ఆధునిక జీవితంలో ఒత్తిడి వల్ల ఎంతోమంది కష్టపడుతున్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా ఉపయోగించడం, ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వంటి వాటి వల్ల శారీరక, మానసిక సమస్యలు వస్తున్నాయి. వాటికి చెక్ పెట్టే శక్తి యోగాకు ఉంది. ఎందుకంటే ఇది శారీరక వ్యాయామం మాత్రమే కాదు... మానసిక, ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉంటుంది. ప్రశాంతతను అందిస్తుంది. అయితే యోగాను ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరెవరు చేయవచ్చు, యోగా చేసేవారు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటి... వంటి వివరాలు తెలుసుకుందాం.తీసుకోవాల్సిన ఆహారంయోగా చేసేవారికోసం కొత్త ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం శరీరానికి, మనసుకు అనువైన ఆహారాన్ని తినాలని చెబుతోంది. శాకాహారం తినడమే యోగా సాధనకు మంచిదని వివరిస్తోంది. ముప్పై ఏళ్ల వయసు దాటిన వ్యక్తి లేదా అనారోగ్యం, అధిక శారీరక శ్రమ వంటివి పడుతున్న వ్యక్తులు తప్ప మిగతా వారంతా రోజుకు రెండు పూటలా తింటే సరి΄ోతుందని, అది కూడా శాకాహారం తింటే మంచిదని చెబుతోంది ఆయుష్.యోగా వల్ల ఈ రోగాలన్నీ పరార్ప్రతిరోజూ యోగా చేస్తే శారీరక, మానసిక ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి. వైద్య పరిశోధనలు కూడా యోగా అనేక రోగాలను దూరం పెడుతుందని చెబుతున్నాయి. ప్రతిరోజూ ΄ావుగంట నుంచి అరగంట ΄ాటు యోగా చేస్తే చాలు శారీరక దృఢత్వంతో ΄ాటు కార్డియోవాస్కులర్ అనారోగ్యాలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. మధుమేహం, అధిక రక్త΄ోటు, శ్వాసకోశ వ్యాధులు వంటివాటిని అదుపు చేయడంలో యోగా ఎంతో సాయపడుతుంది.జీవనశైలి సంబంధిత రుగ్మతలను తట్టుకోవడంలో యోగా ముందుంటుంది. ఎవరైతే డిప్రెషన్, మానసిక ఒత్తిడి, అలసట వంటి వాటితో బాధపడుతున్నారో వారు ప్రతిరోజు యోగా చేయడం చాలా అవసరం. ఇక మహిళలు ప్రతిరోజు యోగా చేయడం వల్ల నెలసరి సమస్యలు తగ్గుతాయి. యోగా అనేది ఆరోగ్యమైన శరీరాన్ని అందించడమే కాదు, మనసును స్థిరంగా ఉంచే ప్రక్రియ. ఇది సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి ఒక దారి చూపిస్తుంది.యోగా చేసే ముందు...ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకోండి. యోగాభ్యాసాన్ని ఖాళీ ΄÷ట్టతో చేయాలి లేదా తేలిక΄ాటి ఆహారాన్ని తిన్నాక చేయాలి. మరీ బలహీనంగా అనిపిస్తే గోరువెచ్చని నీటిలో కాస్త తేనె వేసుకొని తాగి యోగా చేయవచ్చు. యోగాభ్యాసాన్ని చేసే ముందు మూత్రాశయం, పేగులు ఖాళీగా ఉండాలి. అంటే ముందుగానే కాలకృత్యాలు తీర్చుకుంటే మంచిది. తేలికైన, సౌకర్యవంతమైన కాటన్ దుస్తులను ధరించి చేయడం మంచిది. ఎవరైతే తీవ్ర అలసటతో, అనారోగ్యాలతో బాధపడుతున్నారో అలాంటివారు యోగా చేయకూడదు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా యోగాభ్యాసాలను చేసేముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. గర్భం ధరించిన వారు, నెలసరిలో ఉన్నవారు కూడా యోగా చేసేముందు యోగా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
యోగ డే పేరుతో రచ్చ రచ్చ..
-
International Yoga day 2024 ప్రముఖులు, సెలబ్రిటీల యోగ పోజులు (ఫొటోలు)
-
శ్రీనగర్ లో యోగా డేలో పాల్గొన్న ప్రధాని మోదీ
-
International Yoga Day 2024: స్పెషల్ ఈవెంట్ ఫోటోలు
-
International Day of Yoga 2024: యోగా... మరింత సౌకర్యంగా!
యోగా చేయడానికి సౌకర్యవంతమైన ప్రదేశం మాత్రమే కాదు అనువైన దుస్తులు ఉండటం కూడా అవసరం. నవతరం అభిరుచికి తగినట్టు ఇటీవల యోగా వేర్ కొత్తగా రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా నేతన్నలు చరఖాతో దారం వడికి మగ్గంపై నేసిన కాటన్‌తో తయారైన యోగా వేర్కి డిమాండ్ పెరుగుతోంది. మేనికి హాయిగొలిపేలా సౌకర్యంగా, వదులుగా ఉండే దుస్తుల డిజైన్లే యోగా వేర్లో కీలకమైన అంశాలు. యోగా డే సందర్భంగా సౌకర్యవంతమైన హంగులను మనమూ సొంతం చేసుకుందాం.– కాటన్ స్మోక్డ్ వెయిస్ట్ క్రాప్ టాప్ బాటమ్‌గా బ్లాక్ హారమ్ ప్యాంట్ ధరించడంతో క్రీడాకారిణి లుక్ వచ్చేస్తుంది.– ఆర్గానిక్ కాటన్‌తో డిజైన్ చేసిన ప్రింటెడ్ క్రాప్ టాప్, హారమ్ ప్యాంట్ ఇది.– మిడ్ లెంగ్త్ స్లీవ్స్ కాటన్ టాప్, సైడ్ పాకెట్స్ ఉన్న కాటన్ ప్యాంట్‌తో యోగా కదలికలలో సౌకర్యంగా ఉంటుంది.– కాటన్ షార్ట్ కుర్తీ లేదా క్రాప్ టాప్స్‌ని ధోతీ ప్యాంట్‌తో జత చేస్తే యోగసాధనలో సౌకర్యవంతమైన సంప్రదాయ శైలి కనిపిస్తుంది.– కాటన్ బెల్టెడ్ టాప్‌కి, పెన్సిల్ కట్ ప్యాంట్ యోగావేర్లో స్మార్ట్ లుక్‌తో ఆకట్టుకుంటుంది.– యోగా వేర్లో జంప్‌సూట్ డిజైన్స్ సౌకర్యాన్ని ఇస్తాయి.పర్యావరణ స్పృహ, వ్యక్తిగత శైలి, సౌకర్యం.. వీటిని దృష్టిలో పెట్టుకుని యోగా డ్రెస్ డిజైన్స్‌ని మెరుగుపరచవచ్చు.యోగా సాధనలో సౌకర్యవంతంగా, పర్యావరణ స్పృహని కలిగించే సంప్రదాయ యోగా డ్రెస్సులను ఎంచుకోవచ్చు. వీటికి ఆధునిక డిజైన్స్నీ కలపవచ్చు.లేత రంగులు, ప్లెయిన్‌గా ఉండే చేనేత వస్త్రాలు యోగా చేయడానికి సౌకర్యంతోపాటు హుందాతనాన్నీ పరిచయం చేస్తాయి.నడుము దగ్గర కాటన్ బెల్ట్, కాలి మడమల దగ్గర ప్రత్యేకమైన డిజైన్ని జోడించడం ద్వారా యోగా డ్రెస్సులను ఆకర్షణీయంగా మార్చేయవచ్చు.యోగాలో సౌకర్యం చాలా ముఖ్యమైనది. శ్వాసక్రియకు పర్యావరణ అనుకూలమైన దుస్తులను ఎంచుకుంటే ఫ్యాషన్‌గానే కనిపిస్తాం.శరీర కదలికలకు తగినట్టు డ్రెస్ కూడా ఉండాలి. మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా సహజ రంగులను ఉంచుకోవాలి.స్టైల్‌గా ఉండాలనుకుంటే హై వెయిస్టెడ్ ప్యాంట్స్, ర్యాప్టాప్ల వంటివి మార్కెట్లో లభిస్తున్నాయి. హైవెయిస్ట్ లెగ్గింగ్స్, క్రాప్‌టాప్స్, స్పోర్ట్స్ బ్రాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.హెయిర్ హెడ్ బ్యాండ్స్, సన్నని బ్రాస్లెట్స్, స్టడ్స్ లేదా చెవి ΄ోగులు వంటి తేలికైన ఆభరణాలను ధరించాలి.పార్క్ లేదా యోగా క్లాసులకు వెళ్లేటప్పుడు వెంట ఆర్గానిక్ కాటన్ లేదా రీ సైకిల్ చేసిన బ్యాగ్‌లో యోగాకు ఉపయోగించే మ్యాట్‌ను, వాటర్ బాటిల్‌నూ వెంట తీసుకెళ్లవచ్చు.యోగా ప్రయోజనాన్ని ఆనంద దాయకంగా మార్చుకోవాలంటే మాత్రం మీ అభ్యాసమే ముఖ్యమైనది. -
కేంద్ర విద్యాశాఖ మంత్రికి చేదు అనుభవం
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఉదయం యోగా డే వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లారాయన. అయితే అక్కడ ఆయనకు నల్లజెండాలతో విద్యార్థులు స్వాగతం పలికారు.నీట్, యూసీజీ-నెట్ పరీక్షలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ యోగా డే కార్యక్రమం కోసం వెళ్లిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యార్థులు అడ్డుకునే యత్నం చేశారు. నల్లజెండాలతో అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పోలీసులు అప్పటికే బారికేడ్లను ఏర్పాటు చేయగా.. వాటిని తోసుకుంటూ ముందుకు వచ్చే యత్నం చేశారు. ఈ నిరసనలతో ఆయన యోగా డేలో పాల్గొనకుండానే వెనక్కి వెళ్లిపోయారు.ఇదీ చదవండి: నీట్ పేపర్ లీకేజీ నిజమే మరోవైపు.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనగా ధర్మేంద్ర ప్రధాన్ నివాసం బయట ఈ ఉదయం యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. యూజీసీ నెట్‌ను రద్దు చేసిన కేంద్రం, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో నిన్న ధర్మేంద్ర ప్రధాన్ ప్రెస్ మీట్ నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడబోమంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇవాళ కూడా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. దీంతో కీలక ప్రకటన ఏదైనా వెలువడే అవకాశం లేకపోలేదు. -
నేడు కశ్మీర్‌కు ప్రధాని మోదీ.. భారీగా బలగాల మోహరింపు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి రెండు రోజుల పాటు జమ్ము కశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రేపు(జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.కాగా, ప్రధాని మోదీ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో ‘ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్ఫార్మింగ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే, జమ్ము, కశ్మీర్లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. ఇక, వ్యవసాయరంగానికి పెద్దపీట వేసే క్రమంలో వాటికి సంబంధించిన అనుబంధ రంగాల ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్టు పీఎంలో ఓ ప్రకటనలో తెలిపింది. Jammu and Kashmir Police have strengthened security in Srinagar ahead of Prime Minister Narendra Modi’s two-day visit starting Thursday.#JammuKashmir #Srinagar #Kashmir pic.twitter.com/6bnIVaGowZ— Kashmir Local News (@local_kashmir) June 20, 2024 ఇక, రేపు (జూన్ 21న) అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఉదయం 6.30 గంటలకు శ్రీనగర్‌లోని ఎస్కేఐసీసీలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. అనంతరం, జమ్ము, కశ్మీర్ అభివృద్దితో పాటు తన పర్యటనకు సంబంధించిన అంశాలపై ప్రసంగించే అవకాశం ఉంది. కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 2015 నుంచి ఢిల్లీలోని కర్తవ్యపథ్, చండీగఢ్, డెహ్రాడూన్, రాంచీ, లక్నో, మైసూరు లాంటి మహానగరాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. మరోవైపు.. మోదీ కశ్మీర్ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతాను ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో పోలీసులు, భద్రతా బలగాలు మోహరించాయి. -
ప్రధాని మోదీ శశాంకాసనం.. ప్రయోజనాలివే
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రధాని మోదీ ఈసారి కూడా తన యోగాసనాల ఏఐ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానిలో శశాంకాసనం వేసే విధానాన్ని వివరించారు.ఈ వీడియోను సంస్కృత భాషలో రూపొందించారు. శశాంకాసనం వేసేటప్పుడు శరీరం కుందేలు మాదిరి పొజీషన్లోకి వస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ దూరమవుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలో వీడియోలో చూపించారు. ఈ ఆసనం వేయడానికి ముందుగా వ్రజాసన భంగిమలో కూర్చోవాలి. మోకాళ్లపై చేతులను ఉంచాలి. ఇప్పుడు రెండు మోకాళ్లను వీలైనంత వరకు సౌకర్యవంతమైన భంగిమలో విస్తరించాలి. అరచేతులను మోకాళ్ల మధ్య ఉంచాలి. వాటిని ముందుకు చాస్తూ, శరీరాన్ని కిందకు వంచాలి. అప్పుడు చేతులు సమాంతరంగా ముందుకు చాచాలి. అదే పొజీషన్లో ముందుకు చూస్తూ కొంత సమయం పాటు ఈ భంగిమలో ఉండాలి. తరువాత వ్రజాసన భంగిమకు రావాలి.మలబద్ధకంతో బాధపడుతున్నవారు ఈ ఆసనం వేయడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా ఈ ఆసనం వేస్తే కోపం అదుపులోకి వస్తుంది. వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు ఈ ఆసనాన్ని వేయకూడదు. తీవ్రమైన వెన్నునొప్పి ఉన్నవారు కూడా ఈ ఆసనం వేసేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలి. హైబీపీ ఉన్నవారు ఈ ఆసనం వేసే విషయమై వైద్యులను సంప్రదించడం ఉత్తమం. Here is why you must practice Shashankasana regularly… pic.twitter.com/95kwzrKYTD— Narendra Modi (@narendramodi) June 19, 2024 -
Yoga Day: తొలిసారి వ్యోమగాముల యోగాసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్ 21) నాడు తొలిసారిగా వ్యోమగాములు కూడా యోగాసనాలు వేయనున్నారు. ఇందుకోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ‘యోగా ఫర్ స్పేస్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొననున్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భారీ కార్యక్రమం జరగనుంది. దీనిలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఆరోజు వేలాది మంది యోగాభ్యాసకులతో పాటు ప్రధాని మోదీ కూడా యోగాసనాలు వేయనున్నారు. ఈ సందర్భంగా యూనియన్ ఆయుష్ సెక్రటరీ రాజేష్ కోటేచా మాట్లాడుతూ గత 10 ఏళ్లలో యోగా దినోత్సవం నాలుగు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పిందని తెలిపారు. 2015లో 35,985 మంది భారతీయులు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి రాజ్‌పథ్‌లో యోగా చేశారు. ఈ యోగా సెషన్లో మొత్తం 84 దేశాలు పాల్గొన్నాయి.2015లో రాజస్థాన్‌లోని కోటాలో 1.05 లక్షల మంది ఒకేసారి యోగా సాధన చేశారు. 2023లో మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రపంచంలోని 23.4 కోట్ల మంది పాల్గొన్నారు. దృష్టిలోపం కలిగినవారు యోగాను సులభంగా నేర్చుకోవడానికి ఇటీవల బ్రెయిలీ స్క్రిప్ట్‌ను రూపొందించారు. అలాగే ‘ప్రొఫెసర్ ఆయుష్మాన్’ పేరుతో పిల్లలు యోగాసనాలు నేర్చుకునేందుకు కామిక్ పుస్తకాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. -
International Yoga Day: న్యూయార్క్ నగరంలో ప్రధాని మోదీ యోగా (ఫొటోలు)
-
దేశవ్యాప్తంగా యోగా దినోత్సవం (ఫొటోలు)
-
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో యోగా మహోత్సవం
-
అసమాన యోగయజ్ఞం
మైసూరు: ప్రపంచానికి యోగా శాంతిని బోధిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం ఉదయం ప్రఖ్యాత మైసూరు అంబా విలాస్ ప్యాలెస్ ఆవరణలో ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. వేలాది మంది యోగ సాధకులతో కలిసి మోదీ పలు యోగాసనాలను ఆచరించారు. బాలలు, యువత పెద్దసంఖ్యలో తరలిరావడంతో వేడుక కళకళలాడింది. సుమారు నలభై నిమిషాల పాటు వేలాది మంది ఎంతో దీక్షగా ఆసనాలను వేశారు. మోదీ అందరికీ అభివాదం చేస్తూ పలకరిస్తూ రావడంతో జనం ఉత్సాహంగా స్పందించారు. ప్యాలెస్‌లో మోదీకి అల్పాహార విందు యోగా కార్యక్రమం తరువాత ప్యాలెస్‌లో రాజ కుటుంబీకులు యదువీర్ ఒడెయర్– త్రిషిక దంపతులు, రాజమాత ప్రమోదాదేవి ఒడెయర్‌లను మోదీ కలిశారు. మసాలా దోసె, మసాలా వడ, సాంబార్, మైసూరు పాక్ లతో కూడిన అల్పాహార విందును ప్రధాని ఆరగించారు. ప్రమోదాదేవి మాట్లాడుతూ తమ ప్యాలెస్‌లో అల్పాహారాన్ని స్వీకరించాలని ప్రధాని మోదీకి ముందే లేఖ రాయగా, ఆయన అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. ఆయనకు ఏ వంటకాలు ఇష్టమైనప్పటికీ, తాము దక్షిణాది వంటకాలనే వడ్డించామని ఆమె చెప్పారు. యోగా ఎగ్జిబిషన్ ప్యాలెస్ ఆవరణలోని ఉన్న దసరా వస్తు ప్రదర్శనశాలలో యోగాకు సంబంధించిన ఆయుష్ డిజిటల్ ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ప్రధాని వీక్షించారు. సుమారు 15 నిమిషాల పాటు వివిధ స్టాళ్లలోని ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. ముగిసిన పర్యటన మోదీ రెండురోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. ప్యాలెస్‌లో అల్పాహారం స్వీకరించిన అనంతరం ఆయన మండకళ్లి విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. గవర్నర్ గెహ్లాట్, సీఎం బసవరాజ బొమ్మై తదితరులు ఆయనకు వీడ్కోలు పలికారు (చదవండి: కోర్టులో జడ్జి ముందు కాలు మీద కాలేసుకోవడం తప్పా? నేరమా?) -
విశ్వానికి దివ్య యోగం
సాక్షి, హైదరాబాద్: ‘యోగా విద్యకు ఎల్లలు లేవు.. కులం లేదు.. మతం లేదు.. ప్రాంతం లేదు.. ఇది విశ్వవ్యాప్తంగా అనుసరణీయం’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవా రం ఉదయం జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ యోగాను ఐక్యరాజ్య సమితి వరకూ తీసుకెళ్లి విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించిన ప్రధాని మోదీని అభినందిస్తున్నానన్నారు. ప్రస్తుత తరం యోగా ప్రాధానాన్ని తెలుసుకునేలా ఈ ఏడాది యోగా థీమ్‌ను ‘యోగా ఫర్ స్పిరిట్యువాలిటీ’గా ఎంచుకున్నట్టు తెలిపారుæ. కోవిడ్ వల్ల శారీరకం గా, మానసికంగా సమస్యలు ఎదురయ్యాయని, ఈ నేపథ్యంలో ఒత్తిడి నివారణకు యోగా ఉపకరి స్తుందని చెప్పారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే ఈటల సహా పలువురు బీజేపీ నాయకులు, నటుడు అడివి శేషు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా వర్చ్యువల్ సందేశాన్ని వినిపించారు. -
డాలస్‌లో వైభవం గా యోగాడే వేడుకలు
డాలస్ (టెక్సాస్): మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అమెరికాలోనే అతి పెద్దదైన, డాలస్‌లో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిపారు. 2022 జూన్ 21న ప్రవాస భారతీయులు ఉత్సాహంగా యోగా శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇండియన్ కాన్సుల్ జనరల్ అసీం మహాజన్‌కి స్వాగతం పలికారు. భారత దేశం ప్రపంచానికి అందించిన యోగా కేవలం జూన్ 21నే కాకుండా నిత్యం అభ్యాసం చెయ్యవలసిన కార్యక్రమమన్నారు. యోగావల్ల శరీరం, మనస్సు స్వాధీనంలో ఉంటాయని తెలియజేశారు. యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా విశ్వవ్యాప్తంగా జూన్ 21 వ తేదీన యోగా కార్యక్రమం జరపడం ఎంతో సంతోషదాయకమని ఇండియన్ కాన్సుల్ జనరల్ అసీం మహాజన్ అన్నారు. ప్రతి రోజూ యోగా చెయ్యడం వల్ల ఒనగూరే ప్రయోజనాలు వివరించారు. ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ ఉత్తరాధ్యక్షుడు దినేష్ హూడా, బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, షబ్నం మోడ్గిల్, పలు సంస్థల సభ్యులు, ప్రవాస భారతీయులు, చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారను. ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యడంలో సహాయపడిన కార్యకర్తలకు, యోగా శిక్షణ ఇచ్చిన యోగా మాస్టర్ విజయ్, ఐరిస్, ఆనందీలకు, ముఖ్య అతిథి కాన్సల్ జనరల్ అసీం మహాజన్ కు, మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యుడు దినేష్ హూడా కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: అగ్రరాజ్యాన అంగరంగ వైభవంగా అచ్యుతుడి కల్యాణం -
మైసూర్ ప్యాలెస్‌లో ప్రధాని మోదీ యోగాసనాలు
బెంగళూరు: ప్రపంచానికి భారత్ అందించిన అద్భుత కానుక.. యోగా. ఇవాళ(జూన్ 21) అంతర్జాతీయ యోగ దినోత్సవం. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, మంగళవారం వేకువజామున మైసూర్ ప్యాలెస్(కర్ణాటక) గ్రౌండ్లో నిర్వహించిన యోగా డే వేడుకలకు నేతృత్వం వహించి.. ప్రసంగించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్రమంత్రి సోనోవాల్ తదితర ప్రముఖులతో పాటు సుమారు పదిహేను వేల మందికిపైగా ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నట్లు సమాచారం. వేదాలు, ఉపనిషత్తుల్లో యోగా ప్రస్తావన ఉంది. యోగా ఫర్ హ్యూమానిటీ థీమ్‌తో ఈసారి వేడుకలను, గార్డియర్‌రింగ్ పద్ధతిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. మైసూర్ అధ్యాత్మికానికి కేంద్రం. ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాల్లో మాత్రమే యోగా చేసేవాళ్లు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగా చేస్తున్నారు అని పేర్కొన్నారు. ..ఈ 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో యోగా సాధన జరుగుతోంది. యోగా మనకు శాంతిని కలిగిస్తుంది. యోగా వల్ల కలిగే శాంతి వ్యక్తులకు మాత్రమే కాదు, మన దేశాలకు, ప్రపంచానికి శాంతిని తెస్తుంది. అంతర్గత శాంతితో కోట్ల మంది ప్రజలు ప్రపంచ శాంతి వాతావరణాన్ని సృష్టిస్తారు. ఆ విధంగా యోగా ప్రజలను, దేశాలను కలుపుతుంది. ఇలా.. యోగా మనందరికీ సమస్య పరిష్కారానికి దారి తీస్తుంది అని ప్రధాని పేర్కొన్నారు. విశ్వ మానవాళి ఆరోగ్యమే లక్ష్యం.. ఇదే అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉద్దేశం. మనసు, శరీరం అదుపు చేసే శక్తి యోగాకు ఉంది సూర్యుడి కదలికలను అనుసరిస్తూ యోగాసనాలు వేయాలి. ప్రపంచవ్యాప్తంగా 25కోట్ల మంది.. ఈ దఫా వేడుకల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. Karnataka | Prime Minister Narendra Modi arrives at Mysuru Palace Ground where he will perform Yoga, along with others, on #InternationalDayOfYoga Union Minister Sarbananda Sonowal, CM Basavaraj Bommai and others are also present here. pic.twitter.com/cfj84smyB6 — ANI (@ANI) June 21, 2022 Prime Minister Narendra Modi leads the #InternationalDayOfYoga celebrations from Karnataka's Mysuru pic.twitter.com/DDumTiIYVf — ANI (@ANI) June 21, 2022 -
ఇలా చేశారంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
మచిలీపట్నం(కృష్ణా జిల్లా): ఉరుకులు, పరుగుల జీవన గమయనంలో సరైన వ్యాయామం లేక మనిషి ఆరోగ్యం దెబ్బతింటోంది. చదువులు, కొలువులు, ఇళ్లల్లో సపరిచర్యలతో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురువుతున్నారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రోజులో కొంత సమయమైనా వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న జనం వీటిపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. అందుకనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగా వైపు ప్రజలు దృష్టి సారించేలా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. చదవండి: బూమ్.. బూమ్ సాఫ్ట్వేర్.. కంప్యూటర్ కోర్సులదే హవా.. రేపు జిల్లా వ్యాప్తంగా వేడుకలు అంతర్జాతీయ 8వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా స్థాయి వేడుక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా పోలీసు, రెవెన్యూ, విద్య, వైద్య ఆరోగ్య, ఆయుష్, సమాచార, విద్యుత్, స్పోర్ట్స్ అథారిటీ, ఎలక్ట్రికల్, ముని సిపల్ శాఖల జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే రీతిన గుడివాడ, ఉయ్యూరు, డివిజన్ కేంద్రాల్లో ఆర్డీఓల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ఆసనాలతో ఆరోగ్యం యోగాలో భాగంగా వివిధ రకాల ఆసనాలు వేయటం ద్వారా ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది. ఒక్కో ఆసనం ద్వారా ఒక్కో రకమైన అనారోగ్య సమస్యకు పరిష్కారం లభిస్తుంది తాడాసనం: ఈ ఆసనం ఎత్తు పెరగడానికి సహకరిస్తుంది. పొత్తి కడుపు, వెన్నెముక నిటారుగా సాగడం ద్వారా జీర్ణ కోశం శుభ్రమవుతుంది. పేగుల్లో, పొట్టలో కొవ్వులను కరిగింది ఆరోగ్య వంతంగా చేస్తుంది. వృక్షాసనం: రోజూ ఈ ఆసనం చేస్తే కాళ్ల కీళ్లు, మోకాళ్లు చీలమండల సడలించబడతాయి. కాళ్ల కండరాలకు సుభావన కలుగ జేస్తుంది. కీళ్ల (రుమాటిక్) నొప్పులు తగ్గుతాయి. వజ్రాసనం: ఈ ఆసనం ద్వారా తొడ, పిక్క కండరాలకు సుభావన కలుగుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. వెన్నెముకకు ఆధారమై నిటారుగా ఉంటుంది. ఈ ఆసనం చేస్తే ఆయాసం తగ్గుతుంది. భుజంగాసనం: అధిక శ్రమ మల్ల కలిగే నడుం నొప్పులు తొలగిపోతాయి. స్థాన చలనం కల వెన్నెముక పూసలు యథాస్థానానికి వస్తాయి. మెడ నొప్పులు, ఉబ్బసం రోగులకు ఈ ఆసనం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. భోజనాలు చేసిన తరువాత వాయువులు (గ్యాస్ ట్రబుల్) వెళ్లే వారికి ఇది మంచి ఆసనం, వాత రోగాలు తగ్గుతాయి. పవన ముక్తాసనం: పవన అంటే గాలి, ముక్త అంటే విడిచి పెట్టడం. కడుపులోని చెడుగాలిని బయటకు పంపడం ఈ ఆసనంలో ప్రత్యేకత. మలబద్ధకం, తరచు వచ్చే త్రేన్పులు తగ్గి జీర్ణ శక్తి వృద్ధి చెందుతుంది. వెన్నెముక వెనుక కండరాలు, నరాలు ఉత్తేజమవుతాయి. ప్రాణాయామం–నాడీ శోధనం: గాలి రాక పోకలను క్రమపరుస్తుంది. మనస్సుకు ఏకాగ్రత ఇస్తుంది. హెచ్చు రక్తపోటుగలవారు కూడా దీనిని చేయవచ్చు. పద్మాసనం: జ్ఞానానికి, మానసిక ప్రశాంతతకు, ఏకాగ్రత సాధనకు ఇది ఎంతో ఉపయుక్తకరమైన ఆసనం. రుషులు, మహర్షులు ఇదే ఆసనాన్ని చేసేవారు. భ్రామరీ ప్రాణాయామం: ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. అందరికీ ఆరోగ్యమే లక్ష్యం అందరికీ ఆరోగ్యమే లక్ష్యంగా ఆయుష్ విభాగం ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నాం. యోగా ఆవశ్యకతను అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజల్లో కూడా దీనిపై ఆసక్తి పెరిగింది. కలెక్టర్ సూచనల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రజలంతా దీనిలో పాల్గొనాలి. – డాక్టర్ కల్పన, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు, మచిలీపట్నం యోగా సర్వరోగ నివారిణి యోగా చేయటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రతి రోజూ యోగా చేసే వారిలో శారీరకంగానే కాక, మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. ప్రజానీకంలో మార్పు కనిపిస్తోంది. యోగాకు ఆదరణ పెరుగుతోంది. ప్రత్యేక శిబిరాల ద్వారా మరింత చైతన్యం తీసుకొస్తున్నాం. – జి.గురునాథబాబు, యోగా గురువు, మచిలీపట్నం -
Viral Video: దేవతలా యోగా ఫోజు, పట్టుతప్పి..
ఆరోగ్యం కంటే.. అవతలి వాళ్లను ఆకర్షించడానికే చాలామందికి ఇప్పుడు యోగా ఉపయోగపడుతోంది. రకరకాల ఆసనాలతో ఇంటర్నెట్ అటెన్షన్ కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది. ముఖ్యంగా సెలబ్రిటీలైతే రకరకాల భంగిమల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాళ్లను వాళ్లు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక ఓ యువతి విచిత్రమైన ఆసనం కోసం ప్రయత్నించి బొక్కాబోర్లా పడ్డ వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ప్రమాదకరంగా ఉన్న ఫీట్‌ను ఆ యువతి ప్రయత్నించడం విశేషం. బార్ టేబుల్‌పై కొంచెం ఎత్తులో రెండు మందు బాటిళ్లపై కాళ్లు పెట్టి.. చాలా కష్టతరమైన ఫోజు కోసం ఆ యువతి ప్రయత్నించింది. దేవతా మూర్తి తరహాలో ఫోజు ఇవ్వడానికి ప్రయత్నించింది. ఇంకేం బ్యాలెన్స్ ఆగక వెల్లకిల్లా పడిపోయింది. Hold my beer while I do the goddess yoga pose 🍺🧘♀️ pic.twitter.com/dfQASdfL2S — 🍺 Hold My Beer 🍺 (@HldMyBeer) June 25, 2021 అయితే ఆ యువతికి ఏం జరిగిందనేది, వీడియో ఎక్కడిది? ఎప్పటిది? అనే విషయాలపై మాత్రం క్లారిటీ లేదు. హోల్డ్ మై బీర్ అనే ట్విటర్ అకౌంట్ నుంచి వైరల్ అయిన ఈ వీడియోను షేర్ చేస్తున్న పలువురు ‘డోంట్ ట్రై దిస్’ అనే క్యాష్షన్ను ఉంచుతున్నారు. ఫొటోలు: బమ్ చిక్..బమ్ చిక్..చెయ్యిబాగా -
యోగా ఇండియా లో పుట్టలేదు: నేపాల్ ప్రధాని
ఖాట్మండూ: ప్రపంచమంతటా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో యోగా పుట్టలేదని, నేపాల్‌లోనే యోగా పుట్టిందని వ్యాఖ్యానించారు. భారత్ ఓ దేశంగా ఏర్పడక ముందే నేపాల్‌లో యోగా ప్రాక్టీస్ చేసేవారు అని అన్నారు.అసలు యెగా కనుగొన్నప్పుడు భారత్ ఏర్పాటు కాలేదని అయన వ్యాఖ్యానించారు.యోగా కనుగొన్న మా పూర్వికులు ఎవరికీ మేం గుర్తింపు ఇవ్వలేదు. యోగా ప్రొఫెసర్స్, వారి సేవల గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం తప్ప మేమెప్పుడూ ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో యోగా కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని చెప్పారు.గతంలోనూ కేపీ శర్మ ఓలి శ్రీరాముడు నేపాల్ లో పుట్టాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో సారి తన వాదనను పునరుద్ఘాటించారు.రాముడు భారత్‌లోని అయోధ్యలో జన్మించలేదని, ఆయన నేపాల్‌లోని చిత్వాన్ జిల్లా అయోధ్యపురి వద్ద వాల్మీకి ఆశ్రమంలో పుట్టాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే అక్కడ రాముడు, సీత, లక్ష్మణ ఇతరుల ఆలయ నిర్మాణాలు చేపట్టాలని కూడా ఆదేశించినట్లు తెలిపారు. చదదవండి:చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్సంగ్ -
Photo Feature: టీకా రికార్డు, 105 ఏళ్ల బామ్మకు వ్యాక్సిన్
ఆంధ్రప్రదేశ్‌లో రికార్డులో ఒక్కరోజులో 13 లక్షల 59 వేల 300 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. గతంలో ఒక్కరోజులో 6.32 లక్షల డోసుల టీకాలు వేసిన రికార్డును తానే అధిగమించింది. మరోవైపు తొలకరి వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఔత్సాహికులు యోగాసనాలతో సందడి చేశారు. మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి.. -
Yoga Family: టీవీ, పుస్తకాల్లో చూసి ఆసనాలు, జాతీయ స్థాయిలో సత్తా!
సాక్షి, నవాబుపేట(మహబూబ్‌నగర్): గురువు లేకున్నా.. కేవలం టీవీలో చూడటం, పుస్తకాల్లో చదవుతూ యోగా ఆసనాలు వంట పట్టించుకున్నాడు మరికల్‌కు చెందిన పురుష్తోత్తం. ఎలాంటి ఆసనాలైన సులువుగా చేయగల సమర్థుడు. ఏకంగా గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు. యోగా ఆసనాల్లో ఆయనది ప్రత్యేక రికార్డు. మూడు సార్లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కాగా.. ఎనిమిది సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో మొదటి బహుమతి సాధించాడు. యోగా కుటుంబం.. నవాబుపేట మండలంలోని మరికల్కి చెందిన పురుషోత్తం గురువు లేకుండానే యోగాలో అగ్రస్థాయికి ఎదిగాడు. తనతో పాటు భార్య నిర్మల, కూతురు ఝాన్సిరాణి, కుమారుడు చరణ్‌లకు సైతం యోగాలో తానే శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాడు. దీంతో ఆయన కుటంబమే యోగా కుటుంబంగా మారింది. ఇప్పటికే ఆయన కూతురు, కుమారుడు పాఠశాల, కళాశాల సారథ్యంలో జిల్లా స్థాయి పథకాలు సాధించారు. భార్య మరికల్లో మహిళలకు.. పురుషోత్తం యువకులకు శిక్షణ ఇస్తున్నారు. సాధించిన పథకాలు.. ► 2014లో యోగా ఫెడరేషన్ ఆప్ ఇండియా ద్వారా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రాçష్ట్ర స్థాయి పోటీల్లో మొదటి బహుమతి సాధించి బంగారు పథకం. ► 2015లో నిజామాబాద్‌లో రాష్ట్ర స్థాయి ద్వితీయ పథకం పొందాడు. 2016లో మరోసారి రాష్ట్ర స్థాయి బంగారు పతకం పొందాడు. ► 2016లో కర్ణాటక రాష్ట్రం మంగళూరులో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరోసారి 5వ స్థానంలో నిలిచాడు. ► 2016లో దక్షిణ భారత దేశ జాతీయ స్థాయి పోటీల్లో మొదటి బహుమతి సాధించాడు. ► 2017– 2018 సంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని నాల్గవ స్థానం సాధించాడు. చదవండి: International Yoga Day 2021: ధ్యానం... ఒక యోగం -
International Yoga Day: ప్రపంచ గురువుగా భారత్
నిరంతరం ఉరుకులు పరుగుల జీవితంలో మన శరీరం, మనస్సు రెండూ ఒత్తిడికి గురవుతున్నాయి. అలాంటి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే ఔషదమే యోగా. ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసింది మనదేశమే. క్రీస్తు పూర్వమే పతంజలి మహార్షి యోగాను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత భారత దేశం నుంచి ఉద్భవించిన హిందూ, జైన, బౌద్ధ , సిక్కు మతాలు యోగాకు ప్రత్యేక స్థానం కల్పించాయి. 20వ శతాబ్ధం తర్వాత ఆరోగ్య పరిరక్షణలో యోగా ఒక భాగంగా చేసుకుంటున్న ప్రజల సంఖ్య పెరుగుతోంది. యోగాకు సంబంధించి ప్రపంచానికే భారత్ గురువుగా ఉంది. 2,000 ఏళ్ల చరిత్ర కలిగిన మన ప్రాచీన వారసత్వానికి వాస్తవమైన గుర్తింపును ఆపాదించే యోగాకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం ఉన్నా కొన్ని వర్గాలకే అది పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టాక కేవలం ఆరు నెలల్లోనే యోగాకు పెద్దపీట వేశారు. ప్రపంచం అనారోగ్యం నుంచి ఆరోగ్యంవైపు వెళ్లేందుకు యోగానే సన్మార్గమంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో యోగా ప్రాధాన్యం గురించి ఆయన ప్రసగించారు. ఆ తర్వాత భారత ప్రధాని చూపిన చొరవతో, ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 177కు పైగా దేశాలు మద్దతు పలుకగా, మరో 175 దేశాలు తీర్మానాన్ని సమర్థించాయి. అప్పటి నుంచి ప్రతీ ఏడు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాను ప్రాక్టీస్ చేసే ఎందరో ఈ రోజు జరిగే వేడుకల్లో భాగం అవుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో క్రమంగా యోగాకు ప్రాచుర్యం పెరుగుతోంది. చాలా దేశాల్లో యోగాను ఆచరిస్తున వారి సంఖ్య క్రమ క్రమంగా పెంజుకుంటోంది. వివిధ వ్యాయామాల సమాహారమే యోగ. ఈ ప్రక్రియను నిత్యం ఆచరించడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. యోగాలోనే ఒక భాగమైన హఠయోగాన్ని నేర్చుకుంటే వందల ఏళ్లు బతకొచ్చంటూ యోగాపై అపార అనుభవం ఉన్న వారు చెబుతుంటారు. పవాహారిబాబా నుంచి స్వామి వివేకనంద వరకు హఠయోగం నేర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. -
సులభమైన యోగాసనాలు మీకోసం: మాధురీ దీక్షిత్
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని యోగా ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా యోగా ఎంతో ఆదరణను పొందుతోంది. ఇప్పుడు ప్రపంచ ప్రజలంతా యోగా వైపే చూస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగాతో ఆరోగ్యాన్నిపెంపొందించుకుంటున్నారు. ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా యోగాతో అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే మన సినీ తారలంతా యోగా ఆసనాలు వేసి వారి అందాన్ని మరింత పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తప యోగా వీడియోను షేర్ చేశారు. ‘యోగా నా రోజు వ్యాయమంలో ఒక భాగం అయ్యింది. త్వరలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని సులభమైన యోగా ఆసనాలు మీకోసం. రండి నాతో పాటు మీరు కూడా ఈ ఆసనాలు చేయండి’ అంటూ మాధురి దీక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసనాలు వేసి చూపించారు. View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
సీతు పాప సింపుల్ యోగాసనాలు
హైదరాబాద్: నేడు(జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆద్య, సితారలు అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా సులువైన యోగాసనాలు ఎలా వేయాలో వివరిస్తూ ఓ వీడియోను తమ ఏ అండ్ ఎస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. సునాయసంగా వేసే యోగాసనాలతో పాటు, ఆ ఆసనాలతో కలిగే లాభాలను చక్కగా వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక వీరి ప్రయత్నానికి, డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ సూపర్బ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. (సితార డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా) ఇక మహేశ్‌బాబు ముద్దుల కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్య ఇద్దరూ కలిసి ఏ అండ్ ఎస్ అనే యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆటలు, విజ్ఞానం, వినోదానికి సంబంధించిన పలు వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదల తర్వాత మహేశ్, రష్మికలను ఈ ఇద్దరు చిచ్చరపిడుగులు ఇంటర్వ్యూచేసి అకట్టుకున్నారు. ఆడియన్స్‌కు ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ పలు వీడియోలను పోస్ట్ చేస్తుండటంతో ఏ అండ్ ఎస్ యూట్యూబ్ ఛానల్‌కు అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. (మా నాన్న మాకు మంచి ఫ్రెండ్) -
శాస్త్రవేత్తలకూ అంతుపట్టని యోగాసనాలు
మన భారతీయ ప్రాచీన ఆరోగ్య విద్య యోగా ద్వారా కరోనాను అల్లంత దూరంలో ఉంచడం సాధ్యమే అంటున్నారు సాధకులు! అంతర్జాతీయ యోగా దినోత్సవమైన ఈ రోజు (జూన్ 21, ఆదివారం)న ఒక్కసారి.. ఆధునిక సైన్స్ కూడా నిర్ధారించిన యోగాసన ప్రయోజనాలు ఏమిటో?.. కరోనాను అడ్డుకునేందుకు, రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు ఏం చేయాలో చూద్దామా? జూన్ 21.. అంతర్జాతీయంగా భారత ఖ్యాతి ఇనుమడించే రోజిది. దేశదేశాల్లో చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా కొన్ని కోట్లమంది యోగాసనాలు ఆచరించే రోజు. ప్రాచీన భారతీయ సంస్కృతిని కొనియాడే రోజు. ఆరేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్ణయించింది మొదలు ఏటికేడాది దీని ప్రాభవం, ప్రాముఖ్యత పెరుగుతూనే ఉన్నాయి. భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ యోగా దినోత్సవాలకు పిలుపునివ్వడం ఒక విశేషమైతే.. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం దీన్ని గుర్తించి అందరూ యోగా ద్వారా స్వస్థత పొందాలని కోరడం ఇంకో విశేషం. అయితే ప్రస్తుత కరోనా కష్టకాలంలో మునుపటిలా బహిరంగంగా యోగాసనాలు వేయడం సాధ్యం కాకపోవచ్చుగానీ.. వర్చువల్ యోగా దినోత్సవాలకు మాత్రం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. (కోటి మంది యోగా చేస్తారు) ‘‘ఆరోగ్యం కోసం యోగా.. ఇంట్లోనే యోగా’’ అనే ఇతివృత్తంతో ఈ రోజు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రీసెర్చ్‌తో కలిసి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఓ వీడియో బ్లాగింగ్ పోటీని కూడా ఏర్పాటుచేసింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ‘‘ఇంట్లోనే యోగా.. కుటుంబంతో కలిసి యోగా’ పేరుతో ఇప్పటికే ప్రచారం చేపట్టింది. ఆదివారం ఉదయం 6.30 నిమిషాలకు దూరదర్శన్ చానల్లో ఓ యోగ సాధన కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. అలాగే మైసూరు జిల్లా యంత్రాంగం, ఇంటర్నేషనల్ నేచురోపతి ఆర్గనైజేషన్లు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాయి. కర్ణాటకలోని పుణ్యక్షేత్రం ధర్మస్థలలో ఉదయం ఏడు గంటలకు యోగాభ్యాసం మొదలుకానుంది. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే అమెరికాలోని టెక్సాస్‌తోపాటు అనేక ఇతర రాష్ట్రాల వారికి యోగా పాఠాలను బాబా రామ్‌దేవ్ ఆన్లైన్ ద్వారా అందించనున్నారు. హ్యూస్టన్‌లోని భారతీయ కౌన్సిల్ జనరల్ ఉదయం పది గంటలకు రెండు గంటల లైవ్ యోగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. టెక్సాస్‌లోని సాన్‌ఆంటోనియోలో రోజంతా యోగథాన్ జరగనుంది. నెదర్లాండ్స్ పోలీస్ విభాగం కూడా ఆన్లైన్ మాధ్యమంలో యోగాసనాలను ప్రదర్శించనున్నట్లు సమాచారం. సైన్స్ చెప్పే యోగా లాభాలు... మానసిక ఒత్తిడికి కారణమైన హార్మోన్ కార్టిసోల్ మోతాదులను తగ్గించేందుకు యోగా ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి. ధ్యానం వంటివాటిని కలిపి యోగా ఆచరిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలుంటాయని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడును శాంతపరిచేందుకు ఉపయోగపడే సెరటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది కాబట్టి మనో వ్యాకులతకూ యోగా మంచి మందని అధ్యయనాలు చెబుతున్నాయి. తాగుడు వ్యసనాన్ని మాన్పించేందుకు జరిపిన ఒక కార్యక్రమంలో సుదర్శన క్రియ యోగాను అభ్యాసం చేయించినప్పుడు వారిలో మనో వ్యాకులతకు సంబంధించిన లక్షణాలు బాగా తగ్గిపోయాయి. వారానికి కనీసం రెండు రోజుల చొప్పున రెండు నెలలపాటు యోగా కొనసాగిస్తే మానసిక ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇదంతా ఎలా జరుగుతుందో మాత్రం శాస్త్రవేత్తలకూ అంతుపట్టకపోవడం గమనార్హం. వారానికి కనీసం రెండు రోజుల చొప్పున రెండు నెలలపాటు యోగా కొనసాగిస్తే మానసిక ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇదంతా ఎలా జరుగుతుందో మాత్రం శాస్త్రవేత్తలకూ అంతుపట్టకపోవడం గమనార్హం. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా కూడా తోడైతే గుండె జబ్బులు సోకే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. యోగాభ్యాసం చేసే వారి రక్తపోటు, పల్స్ రేట్ ఇతరుల కంటే తక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనం స్పష్టం చేయగా గుండెజబ్బులు ముదరకుండా కూడా యోగా రక్షణ కల్పిస్తుందని ఇంకో పరిశోధన ద్వారా తెలుస్తోంది. నిస్సత్తువ, భావోద్వేగాలను మెరుగుపరిచేందుకు యోగా మేలైన మార్గమని పరిశోధనలు చెబుతున్నాయి. 135 మంది వయోవృద్ధులపై జరిగిన ఒక పరిశోధనలో యోగాభ్యాసం చేసే వారి జీవన నాణ్యత ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించేందుకూ యోగా పనికొస్తుంది. కీమోథెరపీ చేయించుకున్న వారు యోగా సాధన చేస్తే వాంతులు, తలతిరుగుడు వంటి దుష్ఫలితాలు తగ్గుతాయని, నొప్పి తగ్గడమే కాకుండా చురుకుదనమూ పెరుగుతుందని తేలింది. అలాగే హాయిగా నిద్రపోవాలన్నా యోగా ప్రాక్టీస్ చేయడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఊబకాయం, అధిక రక్తపోటు, మనో వ్యాకులత వంటి లక్షణాల కారణంగా నిద్రలేమి సమస్య ఎదుర్కొన్న వారు యోగాభ్యాసం మొదలుపెట్టిన తరువాత ఎంతో ఉపశమనం పొందారని 2005 నాటి అధ్యయనం ఒకటి చెబుతోంది. సుఖనిద్రకు కారణమైన మెలటొనిన్ హార్మోన్ అధికోత్పత్తికి యోగా కారణమవుతుందని అంచనా. రోగ నిరోధక శక్తికి ఆరు ‘యోగాలు’ ఈ కరోనా కాలంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు యోగ సాధన ద్వారా కూడా రోగ నిరోధకశక్తిని కాపాడుకోవచ్చు. సలంబ భుజంగాసనం, పరివృత్త ఉత్కటాసనం, అనువిత్తాసన, గరుడాసన, త్రికోణాసనం, ఆనంద బాలాసనం వంటి ఆరు యోగాసనాలు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. సలంబ భుజంగాసనం సలంబ భుజంగాసనం నేరుగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. బొక్కబోర్లా పడుకుని నడుము పైభాగాన్ని నిటారుగా ఉంచడం ఈ ఆసనంలోని ముఖ్యాంశం. ఈ క్రమంలో ముంజేతుల వరకు నేలపై ఆనించి ఉంచాలి. ముక్కు ద్వారా ఊపిరిపీల్చాలి. నోటి ద్వారా వదలాలి. పరివృత్త ఉత్కటాసనం పరివృత్త ఉత్కటాసనం సాధారణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండాలు, జీర్ణావయవాలను మెలితిప్పడం ద్వారా శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. కాళ్లను కొద్దిగా వంచి చేతులు జోడించి నడుము భాగాన్ని ఒకవైపునకు తిప్పి పైకి చూడటం ఈ యోగాసనంలో కనిపిస్తుంది. మోచేతులను తొడలకు తాకుతూ ఉండాలి. సాధారణ స్థితికి వచ్చే సమయంలో ఊపిరి వదలాలి. అనువిత్తాసనం అనువిత్తాసనం.. ఇది శరీరంలోని కొన్ని గ్రంథులను శుద్ధి చేస్తుంది. శ్వాసవ్యవస్థను చైతన్యపరిచేందుకూ ఈ యోగాసనం పనికొస్తుంది. నడుము కింది భాగంలో రెండు చేతులు ఉంచుకుని వీలైనంత వరకూ వెనక్కి వంగడమే ఈ అనువిత్తాససనం. ఊపిరి తీసుకుంటూ వెనక్కి వంగడం.. అదే స్థితిలో కొంత సమయం ఉండటం ఆ తరువాత ఊపిరి వదులుతూ నెమ్మదిగా సాధారణ స్థితికి రావడం ఈ ఆసన క్రమం. -
రేపొక్క రోజే ఏడు రోజులు
ఇండిపెండెన్స్ డే.. రిపబ్లిక్ డే...దేశం ఇంకా ఏదైనా సాధిస్తే ఆ డే..ఇవీ మనకు దినోత్సవాలు.తిథుల్ని బట్టి పండుగలూ ఉంటాయి.‘థీమ్’ పాటింపు ‘డే’లు.. కొత్తవి.మంచి ఎక్కడున్నా తీసుకోవలసిందే.రేపొక్క రోజే ఏడు ‘డే’ లున్నాయి.‘డూమ్స్‌డే’ అని కూడా అంటున్నారు.దాన్నొదిలేసిమిగతా ‘డే’లను స్వాగతిద్దాం యోగా డే (ఒక్క ఆసనమైనా నేర్చుకుందాం) భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచనపై ఐక్యరాజ్యసమితి జూన్ 21ని ‘అంతర్జాతీయ యోగా దినం’గా గుర్తించింది. 2015 నుంచి యోగా డేను జరుపుకుంటున్నాం. ఈ రోజును సూచించినది కూడా మోదీనే. ఏడాది మొత్తం మీద పగటిపూట ఎక్కువగా ఉండే జూన్ 20–21–22.. ఈ మూడు రోజుల మధ్య రోజైన 21న యోగా డేకి మోదీ ఎంపిక చేశారు. మ్యూజిక్ డే (ఒక మంచి పాట విందాం) వరల్డ్ మ్యూజిక్ డే తొలిసారి పారిస్‌లో 1982 జూన్ 21న జరిగింది. ఆ తర్వాతి నుంచి ఇండియా సహా 120 దేశాలు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఔత్సాహిక, ఉద్ధండ సంగీతకారులను సత్కరించుకోవడం ఈ డే ఉద్దేశం. ఫ్రెంచి సాంస్కృతిక శాఖ మంత్రి జాక్ లాంగ్, ఫ్రెంచి సంగీతకారుడు ఫ్లు హెమోవిస్ కలిసి మ్యూజిక్ డే నెలకొల్పారు. వరల్డ్ హ్యూమనిస్డ్ డే (సాటి మనిషికి చేయూతనిద్దాం) హ్యూమనిస్ట్స్ ఇంటర్నేషనల్ సంస్థ ‘వరల్డ్ హ్యూమనిస్డ్ డే’ ప్రారంభించింది. మానవత్వమే జీవిత పరమార్థం అనే తాత్విక భావనను వ్యాప్తి చేయడానికి ప్రపంచ దేశాలలోని అనేక మానవ హక్కుల సంస్థలు చేతులు కలపడంతో హ్యూమనిస్ట్ డే ఆవిర్భవించింది. 1980ల నుంచి ఒక పరిణామక్రమంలో ఈ ‘డే’ జరుగుతూ వచ్చిందే కానీ, కచ్చితంగా ఫలానా సంవత్సరం నుంచి ప్రారంభం అయిందని చెప్పడానికి తగిన ఆధారాల్లేవు. అయితే జూన్ 21 అందుకు ఫిక్స్ అయింది. హ్యాండ్ షేక్ డే(విశ్వంతోకరచాలనంచేద్దాం) ఇది ఈ ఏడాది గానీ, మరికొన్నేళ పాటు గానీ ఈ ‘డే’ జరిగే అవకాశాలు లేవు. కరోనాతో భౌతిక దూరం తప్పని సరైంది కనుక ఈ ‘వరల్డ్ హ్యాండ్‌షేక్ డే’ కి తాత్కాలికంగా కాలం చెల్లినట్లే. నిజాకిది చేతులు చేతులు కలిపే హ్యాండ్‌షేక్ డే గా మొదలవలేదు. సముద్రపు నీళ్లలో చెయ్యి పెట్టి, చేతిని కదిలిస్తూ ప్రపంచమంతటికీ షేక్‌హ్యాండ్ ఇచ్చినట్లుగా అనుభూతి చెందడంతో ప్రారంభం అయింది. ఇవాన్ జుపా అనే ఒక అలౌకిక చింతనాపరునికి కలిగిన ఆలోచన నుంచి సముద్రానికి హ్యాండ్‌షేక్ ఇవ్వడం అనే ఆధ్యాత్మిక భావన అంకురించిందని అంటారు. ఏటా జూన్ 21న ఈ డే ని జరుపుకుంటున్నారు. ఫాదర్స్ డే (నాన్న దీవెనలు కోరుకుందాం) తేదీ ఏదైనా గానీ మదర్స్ డే మే రెండో ఆదివారం వస్తే, ఫాదర్స్ డే జూన్ మూడో ఆదివారం వస్తుంది. ఈ ఏడాది ఫాదర్స్ డే జూన్ 21న వచ్చింది. కుటుంబం పాటు పడుతుండే తండ్రిని గౌరవించుకోవడం కోసం ప్రపంచం ఆయనకొక రోజును కేటాయించింది. జూన్ మూడో వారమే ఫాదర్స్ డే ఎందుకు? ఆ ‘డే’న గుర్తిస్తూ ప్రభుత్వ సంతకాలు అయిన రోజది. మదర్స్ డే కూడా అంతే. హైడ్రోగ్రఫీ డే (నీటికి నమస్కరిద్దాం) హైడ్రోగ్రఫీ అంటే జల వనరుల భౌతిక స్వరూపాల, కొలమానాల విజ్ఞాన శాస్త్రం. నదులు, సముద్రాలు, మహా సముద్రాలు, సరస్సులు, ఇతర జలాశయాలను అన్ని రంగాల ఆర్థికాభివృద్ధికి హైడ్రోగ్రఫీ తోడ్పడుతుంది. ‘ఇంటర్నేషనల్ హైడ్రోగ్రఫిక్ ఆర్గనైజేషన్’ ఐక్యరాజ్య సమితి గుర్తింపుతో 2005 నుంచి జూన్ 21న ‘వరల్డ్ హైడ్రాలజీ డే’ ని నిర్వహిస్తోంది. టీ షర్ట్ డే (ట్రెండేమిటో తెలుసుకుందాం) సాధారణంగా ‘డే’లన్నీ యు.ఎస్. నుంచి ప్రపంచానికి విస్తరిస్తాయి. టీ షర్ట్ డే మాత్రం జర్మనీలో మొదలైంది. తొలిసారి బెర్లిన్‌లో 2008లో ఇంటర్నేషనల్ టీ షర్ట్ డే జరిగింది. జర్మనీలోని ఫ్యాషన్ దుస్తుల ఉత్పత్తిదారులు వ్యాపారం కోసం టీ షర్ట్ డేని ఏర్పరిచారు తప్ప ఇందులో సంఘహితం ఏమీలేదు. అయితే వ్యక్తి సౌలభ్యం ఉంది. ధరించడానికి సులువుగా ఉండటం, ఒక స్టెయిల్ స్టేట్మెంట్ అవడంతో యూత్ ఎక్కువగా ఈ ‘డే’ని ఫాలో అవుతుంటారు. ఫాలో అవడమే సెలబ్రేషన్. జూన్ 21న దీనినొక ఉత్సవంలా కొన్నిదేశాలలో నిర్వహిస్తారు. -
యోగా దివస్ పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాకు ప్రాచుర్యం కల్పించినందుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ ‘అంతర్జాతీయ యోగా దివస్ మీడియా సమ్మాన్’పురస్కారాలను 30 మీడియా సంస్థలకు ప్రకటించింది. ఆ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ అవార్డులు అందజేశారు. రేడియో, టీవీ, ప్రింట్ మీడియా కేటగిరీల వారీగా మొత్తం 30 అవార్డులు అందజేశారు. రేడియో విభాగంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి ఈ అవార్డు దక్కింది. ఆకాశవాణి హైదరాబాద్ స్టేషన్ డైరెక్టర్ మల్లాది శైలజా సుమన్ ఈ పురస్కారాన్ని మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. ప్రింట్ మీడియా విభాగంలో విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ‘సంచలన వార్త పత్రిక లీడర్’అనే తెలుగు వార్తా పత్రికకు ఈ అవార్డు లభించింది. ఈ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు వి.వి.రమణమూర్తి.. మంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ‘యోగా దివస్’కు సంబంధించిన వార్తా కథనాలు 15 రోజులపాటు ప్రచురించడం వల్ల ఈ ఘనత దక్కిందని రమణమూర్తి తెలిపారు. 40 ఏళ్ల కిందట అనకాపల్లి ఆంధ్రజ్యోతి విలేకరిగా జర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించానని, తాను స్థాపించిన ‘లీడర్’సాయంకాలం దినపత్రిక ఇటీవలే 20 ఏళ్ల ఉత్సవం జరుపుకుందని వివరించారు. -
వాల్పరైసోలో ఘనంగా యోగా డే
సుబ్బాయమ్మ నాగుబడి ఆధ్వర్యంలోని వినోద్ నాగుబడి ఈచ్ లైఫ్ ఈస్ ప్రిషియస్, డాక్టర్ నీతా ఫియోనా నాగుబడి ఆధర్యంలోని మ్యాంగో నెట్వర్స్క్ సంయుక్తంగా ఐదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాల్పరైసోలో జరిగిన ఈ కార్యక్రమానికి రిచార్డ్స్ లీగల్ నుంచి హషీ నాగుబడి రిచర్డ్స్, ఆల్ స్టార్ బ్రైట్ నుంచి జాజ్ రిచర్డ్స్, ఎథ్నిక్ ఈవెంట్స్ నుంచి నీతా ఫియోనా స్పాన్సర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ నుంచి ప్రత్యేక అతిథిగా యోగాచార్య డాక్టర్ ప్రేరణ ఆర్య హాజరయ్యారు. ఆమెకు వాల్పరైసో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ డైరక్టర్ మ్యాగి క్లిఫ్టన్ రోజా పూలతో స్వాగతం పలికారు. తొలుత భారత్, అమెరికా జాతీయ గీతాలు, ప్రేరణ ఆర్య సంగఠన్ మంత్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రిచర్డ్ డెలుకా క్లాసిక్ యోగా, కరెన్ కిన్సే సంపూర్ణ యోగా చేశారు. అనంతరం భారత ప్రభుత్వ విధానాలను అనుసరించి ప్రేరణ యోగా కార్యక్రమం నిర్వహించారు. వాల్పరైసో వైఎంసీఏ అనిత చైర్ యోగా నిర్వహించారు. స్థానిక యోగా టీచర్ సుజానే చిక్ కూడా కార్యక్రమానికి హాజరయిన వారిచే పలు యోగాసనాలు వేయించారు. చివరిగా ప్రేరణ శాంతి మంత్రంతో ఈ కార్యక్రమాన్ని ముగించారు. కాగా, వరుసగా రెండో ఏడాది ఇలా యోగా వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని నిర్వహకులు అంటున్నారు. -
డాలస్‌లో 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'
డాలస్ : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఇర్వింగ్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం జరిగింది. దాదాపు 300 మంది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టొఫర్ ముఖ్య అతిథిగాను, కాన్సుల్ రాకేష్ బనాటి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సంస్థ కార్యదర్శి రావు కల్వల అతిథులకు స్వాగతం పలికి, యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. సంస్థ ఉపాధ్యక్షుడు బి.ఎన్ రావుమాట్లాడుతూ అందరూ ఒక చోట చేరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రధాన వేధిక కావడం సంతోషంగా ఉందన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే యోగా అనే ప్రక్రియను భారతదేశం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప కానుక అన్నారు. యోగా చేయడానికి వయస్సు, జాతి, మతం, కులం అడ్డు కావని అందుకే 170 దేశాలకు పైగా కోట్లాది ప్రజలు జూన్21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారని అన్నారు. యోగా సంవత్సరానికి ఒక సారి వచ్చే పండుగలా కాకుండా దైనందిన జీవితంలో ఒక భాగం కావాలని అన్నారు. ఈ యోగాను ఇర్వింగ్ నగరంలో ఉన్న అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని ఇర్వింగ్ మేయర్‌కు సూచించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టొఫర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ఎన్నో దేశాల ప్రజలు యోగాను తమ జీవితాలలో ఒక ముఖ్య భాగంగా చేసుకోవడం విశేషమని, యోగాను ఆవిష్కరించిన భారతదేశానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాన్సుల్ రాకేష్ బనాటి మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అనుసరించి ఐక్యరాజసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించటంతో ప్రపంచవ్యాప్తంగా యోగా జరువుకోవడం భారతదేశానికి గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, డాలస్ విద్యార్థులకు మహాత్మా గాంధీ మెమోరియల్ సంస్థ 2,000 డాల్లర్ల స్కాలర్షిప్ను యూనివర్సిటీ ఏషియా సెంటర్ డైరెక్టర్ మోనిక్ వేడేర్బర్న్ కు మేయర్ చేతుల మీదుగా అందజేశారు. “92వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలలో” విజేతలుగా నిలిచిన అభిజాయ్ కొడాలి, సోహుమ్ సుఖతన్కర్, రోహన్ రాజాలను, వారి తల్లిదండ్రులను డా. ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు, మేయర్ రిక్ స్టొఫర్, కాన్సుల్ రాకేష్ బనాటిలు ఘనంగా సత్కరించారు. దాదాపు రెండు గంటల పాటు యోగా గురువులు విజయ్, పెగ్గీ నేతృత్వంలో యోగాలోని మెళకువలను ఉత్సాహంగా ప్రవాస భారతీయులు నేర్చుకొని సాధన చేశారు. సంస్థ కోశాధికారి అభిజిత్ రాయిల్కర్ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి తోడ్పడిన స్వచ్చంద సేవకులకు, విచ్చేసిన అతిధులకు, మీడియా మిత్రులకు, ఫోటోగ్రఫీ, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసిన వారికి, వాటర్ బాటిల్స్ ఉచితంగా అందజేసిన సరిగమ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం అనంతరం విచ్చేసిన వారందరికీ గాంధీ మెమోరియల్ సంస్థ వారు యోగ్యతా పత్రాలను, అల్పాహారం అందజేశారు. -
ఇమ్రాన్ ఖాన్‌కు ఆమెకు తేడా ఏముంది?
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై బీజేపీ నేతలు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. కానీ బెంగాల్లో మమత సర్కార్ మాత్రం ఎలాంటి వేడుకలను నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో మమతను.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పోల్చూతూ.. స్థానిక బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ వ్యాఖ్యానించారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా యోగా డేను నిర్వహించారు. పాకిస్తాన్, బెంగాల్ మాత్రమే నిర్వహించలేదు. ఇమ్రాన్‌కు, మమతకు పెద్దగా తేడాఏం లేదని దీంతో అర్థమయింది’ అని అన్నారు. యోగాపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. ఆయన మానసిక స్థితి సరిగ్గాలేదని అన్నారు. ఆర్మీ డాగ్ యూనిట్ వెల్లడించిన రెండు ఫోటోలను శుక్రవారం ట్విటర్లో షేర్ చేసిన రాహుల్ దానికి ఇచ్చిన క్యాప్షన్‌తో విమర్శలకు తావిచ్చారు. ‘సైనిక సిబ్బందితో కలిసి కుక్కలు యోగాసనాలు వేస్తున్నాయి..ఇదే న్యూ ఇండియా’ అంటూ ఇచ్చిన క్యాప్షన్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. రాహుల్ యోగా డేపై చేసిన వ్యాఖ్యలతో దేశాన్ని, సైనిక పాటవాన్ని అవమానించారని నెటిజన్లు మండిపడ్డారు. -
నగరంలో ఘనంగా యోగ దినోత్సవం
-
అన్నిటికీ అతీతం యోగా
రాంచీ/ న్యూఢిల్లీ/ ఐరాస: భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా అన్నిటికీ అతీతమైందని, దీనిని జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన యోగా డే కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అదేవిధంగా పార్లమెంట్ హాల్లో, ఐక్యరాజ్యసమితిలో, ఇతర దేశాల్లోనూ ఈ కార్యక్రమాలు జరిగాయి. రాంచీలోని ప్రభాత్ తారా గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో 40 వేల మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుడిగా మారిన ప్రధాని మోదీ వివిధ ఆసనాల విశిష్టతను వివరిస్తూ ఆసనాలు వేయించారు. ఆరోగ్యం కోసం యోగా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా కుల, మత, వర్ణ, లింగ, ప్రాంతీయ వంటి విభేదాలకు అతీతమైంది. అందుకే దీనిని జీవితంలో అంతర్భాగంగా మార్చుకోవాలి’ అని సూచించారు. ‘నగరాల నుంచి పల్లెలు, గిరిజన ప్రాంతాలకు యోగాను వ్యాపింపజేయాలి. గిరిజనుల జీవితాల్లో యోగాను విడదీయరాని భాగంగా మార్చాలి. ఆరోగ్యవంతమైన శరీరం, స్థిరమైన మనస్సు, ఏకాత్మతా భావం అనే మూడు యోగా విశిష్టతలు ఏమాత్రం మారలేదు. జ్ఞానం, కర్మ, భక్తి అనే మూడింటి సమ్మేళనమే యోగ’ అని ప్రధాని వివరించారు. శాంతి, సామరస్యాలను సాధించే యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తప్పనిసరిగా ఆచరించాలన్నారు. ‘ఈ రోజుల్లో యువత గుండె జబ్బులకు ఎక్కువగా గురవుతున్నారు. గుండె జబ్బుల బెడద నుంచి కాపాడుకునేందుకు యోగా మంచి ఆయుధం. ఈ దిశగా వారిని అప్రమత్తం చేయాల్సి ఉంది. అందుకే ఈ ఏడాది యోగా డేకు ‘హృదయం కోసం యోగా’ నినాదాన్ని ఇతివృత్తంగా పెట్టుకున్నాం. అనారోగ్య సమస్యల నుంచి రక్షించే ముఖ్య సాధనంగా యోగాను మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని చెప్పారు. తెల్లటి దుస్తులు, టీ షర్టు, స్కార్ఫుతో వచ్చిన ప్రధాని ప్రసంగం అనంతరం స్టేజీ దిగి అందరితో కలిసి కూర్చుని వివిధ ఆసనాలు, ప్రాణాయామం చేయించారు. రాష్ట్రపతి భవన్లో..: రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. పార్లమెంట్ పరిసరాల్లో జరిగిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. ఢిల్లీ రాజ్‌పథ్‌లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోహ్తక్లో హోం మంత్రి అమిత్ షా, నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కారీ పాల్గొన్నారు. ప్రవాసీ భారతీయ కేంద్రంలో విదేశాంగ మంత్రి జై శంకర్ నేతృత్వంలో జరిగిన యోగాడే కార్యక్రమంలో 60 దేశాల రాయబారులు పాల్గొన్నారు. చైనా, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాల్లోనూ యోగా డే పాటించారు. అంతర్జాతీయ యోగా ఉత్సవాల్లో పాల్గొన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేల్ ప్రధాని కేపీ శర్మ ఓలీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఐరాసలో మార్మోగిన ఓం శాంతి... అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ హాల్లో ఓం శాంతి మంత్రం మార్మోగింది. ప్రపంచ నేతలు ప్రసంగించే విశ్వ వేదిక జనరల్ అసెంబ్లీ హాల్లో యోగా డే సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులు, అధికారులు, శిక్షకులు, గురువులు వివిధ ఆసనాలు వేశారు. ఐరాస జనరల్ అసెంబ్లీ హాల్లో ఈ తరహాలో యోగా ఉత్సవం జరపడం ఇదే ప్రథమం. రాహుల్ ట్వీట్ కలకలం న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫొటోలు వివాదానికి దారితీశాయి. ఆర్మీకి చెందిన జాగిలాలు, వాటి శిక్షకులు యోగా చేస్తున్న ఫొటోలు పోస్ట్ చేసిన రాహుల్ వాటికి ‘నవ భారతం’ అనే వ్యాఖ్యను జోడించారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. యోగా డేను అపహాస్యం చేశారని, ఆర్మీ బలగాలను రాహుల్ అవమానపరిచారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విమర్శించారు. ‘కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేక ధోరణితోనే ఉంటుంది. ట్రిపుల్ తలాక్‌కు మద్దతిచ్చినప్పుడే ఈ విషయం పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు యోగాడేను అపహాస్యం చేయడమే కాకుండా ఆర్మీ బలగాలను అవమానపరిచారు. వారిలో సానుకూల ధోరణి పెరగాలని ఆశిస్తున్నాను’అంటూ అమిత్ షా ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ఓ సీనియర్ రాజకీయవేత్త యోగాడేను ఇలా అవమానపరచడం బాధాకరం. ఓటు బ్యాంకు రాజకీయాలే వారిని ఇలా భారతీయ సంస్కృతులు, సంప్రదాయాలను అవమానించేలా చేస్తున్నట్లు ఉంది’అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధి ట్విట్టర్లో దుయ్యబట్టారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నవ భారత్ అవతరించింది. తన ఆధ్వర్యంలో కొత్త కాంగ్రెస్ ఎలా ఉందో రాహుల్ గాంధీ ట్వీట్లో అర్థమైంది’అంటూ బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లి ఎద్దేవా చేశారు. ‘రాహుల్‌కు జీవితం అంటే ఓ జోక్‌గా మారింది. తన పెంపుడు కుక్కను గుర్తు చేసుకుంటూ పోస్టులు చేస్తున్నట్లు ఉన్నారు’ అంటూ చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు. బ్రిటన్‌లోని స్టోన్‌హెంజ్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆసనాలు వేస్తున్న ప్రజలు శిక్షకులతో కలిసి యోగా చేస్తున్న ఆర్మీ జాగిలాలు -
యోగా మనదేశ సంపద: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: యోగా భారత దేశంలో పుట్టిన గొప్ప సంపద అని, నేడు ప్రపంచ వ్యాప్తంగా మేధావులు, విద్యావంతులు సాధన చేయడం గర్వకారణమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 5వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియా టూరిజం–తెలంగాణ టూరిజం సంయుక్తంగా హుస్సేన్ సాగర్‌లోని బుద్ధ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవనం యాంత్రికంగా మారడంతో మానసికంగా అంతా అలసిపోతున్నారని, శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, మెదడుకు కూడా యోగా ద్వారా వ్యాయామం అవసరమని సూచించారు. మన దేశంలో పుట్టిన యోగా, మెడిటేషన్‌లను ప్రపంచమంతా సాధన చేస్తుండటం గర్వకారణమని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం.. హరీశ్ ఎక్కడ?
సాక్షి, సిద్దిపెట : తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. సిద్ధిపేట జిల్లాలో నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం సిద్ధిపేట జిల్లాలోని రంగాదాంపల్లి అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన హరీశ్.. అనంతరం రంగనాయ సాగర్ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే హరీశ్ రావు యోగా డేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగామవ్వాలని సూచించారు. యోగా చేస్తూ ఆరోగ్య సమాజం నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రొ. జయశంకర్‌కు నివాళలర్పించిన హరీశ్ ప్రొ. జయశంకర్ వర్థంతి సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు జయశంకర్ సార్‌కు నివాళర్పించారు. సిద్ధిపేటలోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంత కర్త జయశంకర్ అని గుర్తుచేశారు. బంగారు తెలంగాణకు బాటలు చూపిన మహాత్మ అని కొనియాడారు. సార్ స్ఫూర్తిని చెదరకుండా తమ గుండెల నిండా పదిలంగా ఉంచుకున్నట్లు తెలిపారు. జయహో జయశంకర్ సార్. పిడికిలెత్తి పలుకుతోంది తెలంగాణ జోహార్ అని పేర్కొన్నారు. అందుకే కాళేశ్వరం ప్రారంభోత్సవంలో పాల్గొనలేదు : కొత్త ప్రభాకర్‌రెడ్డి సీఎం కేసీఆర్ మినహా ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలందరూ వారి వారి నియోజకవర్గాల్లోనే కాళేశ్వరం ప్రారంభ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని టీఆర్ఎస్ లోక్‌సభపక్ష ఉపనేత కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. హారీశ్ రావు సైతం సిద్దిపేటలో జరుగుతున్న కాళేశ్వరం సంబరాల్లో పాల్గొన్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి అందుతున్నాయని, అందుకే ఈ ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని అన్నారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా ఎంపీలు కాళేశ్వరం ప్రారంభోత్సవంలో పాల్గొనలేకపోయామని వివరించారు. కాగా కాళేశ్వరం ప్రారంభ ఉత్సవాలను టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో వెంకటేశ్వరస్వామి, దుర్గమాతకు పూజలు నిర్వహించి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. -
యోగ మనసుకు ఆహ్లాదాన్నీ ఇస్తుంది
-
ఎర్రకోటలో ప్రత్యేక యోగా కార్యక్రమం
-
ప్రపంచవ్యాప్తంగా యోగా డే వేడుకలు
-
ఆయుష్ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు
సాక్షి, విజయవాడ : దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఎన్ఏసీ కళ్యాణమండపంలో ఆయుష్ ఆధ్వర్యంలో యగా డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఆయుష్ కమీషనర్ పీఏ శోభ, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొన్నారు. నూజీవీడు ట్రీపుల్ ఐటీ విద్యార్థులతో యోగా కార్యక్రమాన్ని డైరెక్టర్ ఆచార్య డి.సూర్యచంద్రరావు నిర్వహించారు. ఈ ఈవెంట్లో రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
రాజ్ భవన్లో యోగా డే సెలబ్రేషన్స్
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా యోగా డే కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే వేడుకలు జరుగుతుండగా.. రాజ్‌భవన్‌లోని సంస్కృతి భవనంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. యోగ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అందరికి యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగ అనేది మనుసుకు ఆహ్లాదాన్ని ఇస్తుందన్నారు. ఇకపై రోజు యోగ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు యోగ చేయాలని సూచించారు. యోగ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. రాజ్ భవన్ స్టాఫ్ అందరి కోసం యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ట్యాంక్‌బండ్ యోగాడేలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్యాంక్‌బండ్ వద్ద జరుగుతున్నయోగా డే సెలబ్రేషన్స్‌లో టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్, టూరిజం సెక్రటరీ బుర్రా వెంకటేశం పాల్గొన్నారు. బుద్దుని విగ్రహం దగ్గర నిర్వహించిన ఈ వేడుకల్లో మంత్రి ఆసనాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. మనదేశంలో యోగ పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం యోగ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యోగాను తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రపంచ దేశాలు మన యోగాను ఫాలో అవుతున్నాయన్నారు. టూరిజంస్పాట్‌లో యోగాను ప్రమోట్ చేస్తామని తెలిపారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
యాకుత్‌పురా: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం చార్మినార్ కట్టడం వద్ద యోగాసనాలు వేశారు. కార్యక్రమం లో ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. చార్మినార్ నుంచి మదీనా చౌరస్తా వరకు నిజామియా టిబ్బి కళాశాల వైద్య విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పత్తర్‌గట్టి కార్పొరేటర్ సయ్యద్ సోహేల్ ఖాద్రీ, ఆయూష్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణి, నిజామియా టిబ్బి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ షహజాదీ సుల్తానా, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిరాజ్ ఉల్ హక్, ప్రభుత్వ యునానీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.ఎ.వకీల్ పాల్గొన్నారు. -
చార్మినార్ వద్ద యోగా దినోత్సవ వేడుకలు
-
డాలస్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
డాలస్ : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంస్థ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాన్సులేట్ ఆఫ్ ఇండియా హౌస్టన్ వారి సహకారంతో 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జూన్ 22న ఉదయం 7:30 నుండి 9:30 వరకు మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా, ఇర్వింగ్ నగరంలో నిర్వహిస్తున్నట్టు ప్రసాద్ తోటకూర తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టొఫర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కాన్సుల్ జనరల్ ఆఫ్ హ్యూస్టన్ డా. అనుపమ్ రే ప్రత్యేక అతిథిగా పాల్గోనున్నారు. ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకమైన 92వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్స్ గా ఎనిమిది మంది గెలిస్తే, అందులో ఏడుగురు భారతీయ సంతతికి చెందిన వారు కావడం ఎంతో గర్వకారణంగా ఉందని ప్రసాద్ తోటకూర అన్నారు. వారిలో డల్లాస్ నుంచి గెలిచిన అభిజాయ్ కొడాలి, సోహుమ్ సుఖతన్కర్, రోహన్ రాజాలను సత్కరించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి యోగా చేయడానికి యోగా మాట్స్, అల్పాహారంను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డా. ప్రసాద్ తోటకూర నేతృత్వంలోని ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంస్థకు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గా జాన్ హేమండ్, బి.ఎన్. రావు, రావు కాల్వల, అభిజిత్ రాయిల్కర్, తాయబ్ కుండవాలా, అక్రమ్ సయ్యద్, పీయూష్ పటేల్, కమల్ కౌషల్ భాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు www.mgmnt.org ను సంప్రదించాలని, ఈ యోగా దినోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
‘యోగా చేస్తే మతం నుంచి బహిష్కరించారు’
మాచారెడ్డి: యోగా చేసినందుకు తనను మతం నుంచి బహిష్కరించారని కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన షహనాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. యోగా డే సందర్భంగా మండల కేంద్రంలోని ఓం శాంతి కేంద్రంలో యోగా చేశానని, పలువురు ముస్లిం యువకులు తనపై దాడి చేసి మతం నుంచి బహిష్కరించారని వాపోయారు. ఆరోగ్యం కోసం యోగా చేయడం తప్పెలా అవుతుం దని ఆమె ప్రశ్నించారు. తన మీద దాడి చేసినప్పుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసి పరువు తీశారన్నారు. తనతో ఎవరు మాట్లాడినా రూ. 5 వేల జరిమానా విధిస్తామని బెదిరించడంతో ఎవరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మసీదుకు చందా ఇవ్వడానికి వెళ్తే తీసుకోవడం లేదని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్న ఆమె..తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. -
యోగా.. ఓ బిజినెస్ మంత్ర!
యోగా.. సాధకులకు శారీరక, మానసిక, సంపూర్ణ ఆరోగ్య ప్రదాయిని అయితే.. మరి కొందరు ఔత్సాహికులకు ఆర్థిక ఆరోగ్యాన్ని కూడా అందించే బిజినెస్ మంత్ర కూడా. దాదాపు నాలుగేళ్ల కిత్రం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21వ తేదీని నిర్ధారించినప్పటి నుంచీ.. యోగా వ్యాపారం దినదిన ప్రవర్ధమానమవుతోంది. యోగా నేర్పించే సంస్థల దగ్గర్నుంచి యోగాసనాలు చెయ్యడానికి వాడే చాపలు, యోగా డ్రింక్స్, యోగా చేసే సమయంలో వాడే దుస్తులు వంటి వాటి చుట్టూ గత మూడేళ్లుగా వ్యాపారం బాగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా యోగాతో ఇంచుమించుగా రూ.5 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరుగుతూ ఉంటే, భారత్‌లో 85 వేల కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోందని తాజా నివేదికలు చెబుతున్నాయి. గత అయిదేళ్లలోనే యోగా సెంటర్లు, యోగాకి సంబంధించిన ఉత్పత్తుల చుట్టూ జరిగే వ్యాపారం 87 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది యోగాను ఫాలో అవుతున్నారని, వారిలో అమెరికాలోనే 3 కోట్ల మంది ఉన్నారని అంచనా. అమెరికాలో వ్యాపార పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో యోగాది నాలుగో స్థానం. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, న్యూజిలాండ్, యూరప్, ఐర్లాండ్‌ల్లో యోగాకి క్రేజ్ ఎక్కువ. భారత్‌లో మెట్రోనగరాల్లో యోగా పట్ల ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య ఇప్పుడు బాగా పెరుగుతోంది. శిల్పాషెట్టి, కరీనాకపూర్ వంటి సెలబ్రిటీల యోగా వీడియోలు సామాన్య జనాల్లోనూ యోగా పట్ల ఆసక్తిని పెంచాయి. యోగా శిక్షకులకి వచ్చే ఏడాదిలో 30 నుంచి 35% డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. బాబా రామ్‌దేవ్ తనకున్న యోగా ఇమేజ్‌తోనే పతంజలి వ్యాపార సామ్రాజ్యాన్ని 10 వేల కోట్లకి విస్తరించారు. యోగా జల్.. యోగా బార్ యోగా చుట్టూ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మన దేశంలో కొన్ని స్టార్టప్ కంపెనీలు కొత్త వ్యూహాల్ని రచిస్తున్నాయి. కొత్త, కొత్త ఉత్పత్తులతో యోగా సాధకుల్ని ఆకట్టుకుంటున్నాయి. యోగా సాధన కోసం ప్రత్యేకంగా వాడే మ్యాట్స్కి ఇటీవల డిమాండ్ పెరుగుతోంది. జూట్, నేచరల్ రబ్బరు కలగలిపిన మిశ్రమంతో తయారు చేసే ఈ మ్యాట్స్ చాలా తేలికగా ఉంటాయి. మడతపెట్టి ఎక్కడికైనా చాలా సులభంగా తీసుకువెళ్లవచ్చు. చెన్నైలో తయారవుతున్న ఈ మ్యాట్స్కి బాగా క్రేజ్ పెరిగింది. బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ యోగా జల్‌ను తయారు చేస్తోంది. ఇందులో కృత్రిమ రంగులేవీ వాడరు. ఇందులో 8 నుంచి 10 శాతం సల్ఫర్ ఫ్రీ షుగర్ ఉంటుంది. బెంగళూరుకు చెందిన మరో స్టార్టప్ కంపెనీ యోగా బార్స్‌ని తయారు చేస్తోంది. మామూలు చాక్లెట్స్ బార్స్ బదులుగా వీటిని తీసుకోవడం ఆరోగ్యకరం అని ఆ సంస్థ ప్రచారం చేస్తోంది. రసాయనాలు వాడకుండా సహజసిద్ధ పదార్థాలు, విటమిన్లు వినియోగించి తయారు చేస్తున్న ఈ యోగా బార్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ‘ఫరెవర్ యోగా’ పేరుతో ఈ నాటి యూత్ ఫ్యాషన్లను దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తున్న దుస్తులకు కూడా మంచి మార్కెట్టే ఏర్పడింది. ఇక బెంగుళూరుకు చెందిన అక్షర పవర్ యోగా సెంటర్ ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందింది. యోగా టీచర్లకి కూడా ఈ సెంటర్లో శిక్షణనిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తోంది. ► ప్రపంచవ్యాప్తంగా యోగా చేస్తు న్నవారి సంఖ్య – 30 కోట్లకి పైగా.. ► భారత్‌లో యోగా శిక్షకుల సంఖ్య – 2 లక్షల మంది ► ఇంకా కావల్సిన శిక్షకుల సంఖ్య – 5 లక్షలు ► చైనాలో యోగా పాఠాలు చెబుతున్న ఇండియన్లు – 3 వేలు ► భారతీయులు ప్రతీ నెలా యోగాపై ఖర్చు చేస్తున్నది – రూ. 5 వేల నుంచి 25 వేలు(సగటున) ► అంతర్జాతీయ యోగా డే కోసం 2015, 2016ల్లో భారత్ ఖర్చు చేసింది – రూ. 35.50 కోట్లు ► యోగా చుట్టూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాపారం – 8 వేల కోట్ల డాలర్లు (రూ. 5, 42, 000 కోట్లు) ► భారత్‌లో జరుగుతున్న వ్యాపారం – రూ. 85 వేల కోట్లు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
యోగా సంబరం నేడే
న్యూఢిల్లీ: నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఔత్సాహికులు గురువారం యోగాసనాలు వేసేందుకు సమాయత్తమయ్యారు. డెహ్రాడూన్‌లోని అటవీ పరిశోధన సంస్థ మైదానంలో జరిగే ప్రధాన కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సుమారు 55 వేల మంది పాల్గొననున్నారు. బుధవారం రాత్రే మోదీ డెహ్రాడూన్‌కు చేరుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 5వేల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయు ష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఢిల్లీతో పాటు వేర్వేరు రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలకు పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. ఢిల్లీలో 8 చోట్ల ఈ వేడుకలు జరగనుండగా, ప్రధాన కార్యక్రమానికి రాజ్‌పథ్ ఆతిథ్యమివ్వనుంది. బ్రహ్మకుమారీలు ఎర్రకోట వద్ద నిర్వహిస్తున్న కార్యక్రమంలో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ దళాలకు చెందిన మహిళా సిబ్బందితోపాటు 50 వేల మంది పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అక్కడి భారత రాయబార కార్యాలయాలు ఏర్పాట్లు చేశాయి. గుజరాత్‌వ్యాప్తంగా జరిగే యోగా వేడుకల్లో 1.25 కోట్ల మంది పాల్గొననున్నారు. అందులో 8 వేల మంది దివ్యాంగులు, 4 వేల మంది గర్భిణీలున్నారు. గిన్నిస్ రికార్డు ప్రయత్నంలో భాగంగా అహ్మదాబాద్‌లో సుమారు 1200 మంది దివ్యాంగులు ‘సైలెంట్ యోగా’ చేస్తారు. -
స్టార్ యోగ
సినిమా స్టార్లు బిజీగా ఉంటారు. ఎంత బిజీగా ఉంటే మైండ్ అండ్ బాడీ అంత ఫ్రెష్‌గా ఉండాలి. ఫీల్డ్ అలాంటిది. అందుకే కాజల్, రాశీఖన్నా, అదాశర్మ, సంజన.. తమ డైలీ లైఫ్‌లో యోగాకు ప్రాధాన్యం ఇచ్చారు. ముందు యోగా. ఆ తర్వాతే మిగతా షెడ్యూల్స్. ఎక్కడికెళ్లినా యోగా మ్యాట్: కాజల్ చిన్నప్పుడు నాకు స్పోర్ట్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అందుకే, ఐ హేట్ పీటీ (ఫిజికల్ ట్రైనింగ్) క్లాస్. కానీ మార్చ్ ఫాస్ట్ అంటే ఇష్టంగా చేసేదాన్ని. కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత ఫిట్నెస్ మీద అవగాహన ఏర్పడింది. ఫస్ట్ నేను ఏరోబిక్స్ క్లాస్‌లో జాయిన్ అయ్యాను. తర్వాత జిమ్‌కు వెళ్లటం స్టార్ట్ చేశాను. ఓసారి యోగా ట్రై చేశాను. అంతే.. అప్పటినుండి యోగా నా జీవితంలో భాగమైపోయింది. బేసికల్లీ నేను ఫుడ్ లవర్ని. ఎంత ఇంట్రెస్ట్‌గా తింటానో ఫిట్నెస్ కోసం అంతే ఇష్టంగా వర్కవుట్ చేస్తాను. యోగా చేస్తే చాలు.. కేలరీలు ఇట్టే కరిగిపోతాయి.యోగా చేయడానికి ఎక్విప్మెంట్స్ ఏవీ అవసరంలేదు. అది అందరికీ తెలిసిందే. మనకు కావాల్సింది జస్ట్ ఒక్క యోగా మ్యాట్ మాత్రమే. నేను ఎక్కడికెళ్లినా నాతో పాటు యోగా మ్యాట్ని కంపల్సరీ తీసుకెళతాను. సో.. నో బ్రేక్ ఫర్ యోగా. వారానికి మూడు రోజులు రోజుకు గంటన్నర చొప్పున తప్పనిసరిగా యోగా చే స్తాను. వారంలో మరో మూడు రోజులు వెయిట్ బ్యాలెన్స్ ట్రైనింగ్ చేస్తాను. సూర్య నమస్కారాలు బెస్ట్. నేను రోజూ ఏ ఆసనం వేసినా వేయకపోయినా సూర్య నమస్కారాలు మాత్రం మానను. 150 సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేస్తాను. నా ఫిట్నెస్ సీక్రెట్స్లో యోగాకి ఫస్ట్ ప్లేస్. టీనేజ్ నుంచే: రాశీ ఖన్నా యోగా గొప్పదనం గురించి నా టీనేజ్లోనే నేను తెలుసుకున్నాను. నేను యోగా చేయడం మొదలుపెట్టినప్పుడు నా వయసు9 16. అప్పటినుంచి ఇప్పటివరకూ యోగా చేస్తున్నాను. యోగా వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మనసు, శరీరం రెంటికీ మంచిది. నిజానికి యోగా అంటే బరువు తగ్గడానికి అని చాలామంది అనుకుంటారు. అయితే అది మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది.సూర్య నమస్కారాలు నా ఫేవరెట్ ఆసనం. ఈ అసనంవల్ల శరీరంలో అన్ని కండరాల్లో కదలిక వస్తుంది.యోగా వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. అంత త్వరగా దేనికీ హర్ట్ అవ్వం.ఆ మధ్య నేను కొంత బరువు తగ్గాను. దానికి ముఖ్య కారణం యోగా. ఆ టైమ్‌లో వాకింగ్ కూడా బాగా చేశాన.నాది నైట్ టు ఫైవ్ జాబ్ కాదు. కొన్నిసార్లు రోజుకి 12, 13 గంటలు షూటింగ్ చేస్తుంటాను. అప్పుడు కూడా నాకు అలుపు అనిపించదు. దానికి ఒక కారణం యోగా. ఉదయం ఓ గంట సేను చేసే యోగా రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. నా గురువు మా అమ్మగారే: అదాశర్మ నాకు యోగాను పరిచయం చేసింది మా అమ్మగారే. నా చిన్నప్పుడు మా అమ్మగారు రోజూ యోగా చేయడం చూశాను. మెల్లిగా నాకూ అలవాటు చేశారు. నా యోగా గురువు మా అమ్మగారే.యోగాతో పాటు నేను వేరే ఎక్సర్సైజులు కూడా చేస్తాను. అయితే అవి చేసే ముందు యోగా చేస్తాను.నేను సూర్య నమస్కారాలు బాగా చేస్తాను. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించేది. అలవాటైన తర్వాత సూర నమస్కారాలు చేయని రోజున చాలా వెలితిగా ఉంటుంది.యోగాలో మెడిటేషన్ ఓ భాగం. ధాన్యం చేసి చూడండి. ఏకాగ్రత పెరుగుతుంది.నేను వెజిటేరియన్‌ని. అంతకు మించిన హెల్దీ ఫుడ్ లేదని నా ఒపీనియన్.ఎలాంటి పరిస్థితుల్లో అయినా నా మైండ్ చాలా బ్యాలెన్డ్స్‌గా ఉంటుంది. దానికి కారణం యోగానే.ప్రతి రోజూ ఉదయం యోగా చేయడానికి ట్రై చేయండి. రోజంతా ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. మనసు శరీరం బాగుంటాయి: సంజన యోగా నా జీవితం. యోగా వల్లే నేను సక్సెస్‌ఫుల్‌గా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నా. అంతా బాగున్నప్పుడు ఎవరైనా హ్యాపీగా ఉంటారు. బాధలో ఉన్నప్పుడు కూడా నాకు సంతోషం ఇచ్చేది యోగానే.యోగా చేసేవారిలో ఒక ప్రత్యేకత ఏంటంటే.. ఎప్పుడూ చాలా ధైర్యంగా ఉంటారు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. మానసికంగా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరిచేయటానికి ఎక్కువ ధైర్యం ఉంటుంది.నా జీవితంలో యోగా అన్నది ఓ పెద్ద పార్ట్. నాకు సొంత యోగా అకాడమీ (అక్షర్) ఉంది. బెంగళూర్‌లో మూడు యోగా అకాడమీలతో స్టార్ట్ చేసి, ఇప్పుడు మొత్తం 20 అకాడమీలు నిర్వహిస్తున్నాం. ప్రతి అకాడమీలో 500 నుంచి 600 మంది క్లైంట్స్ ఉన్నారు. టీచర్స్ ట్రైనింగ్ కోర్స్, ఇలా పాజిటివ్ కోర్స్లతో ఎంతోమందికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాం. మా ‘అక్షర్’ యోగాకి ఇప్పుటికి పదేళ్లు అయింది. యోగా అనేది నాకు డబ్బు సంపాదన కాదు. నా జీవితం నడవడానికి, డబ్బు సంపాదించటానికి సినిమాలు చేస్తాను కానీ, యోగా మాత్రం నా ఆత్మతృప్తి కోసం చేస్తా. మనవల్ల ఎంతో మంది బాగుండాలనే ఒక మంచి మనసుతో యోగా అకాడమీ పెట్టాను. యోగా పట్ల నాకు ఎంత ప్రేమ, భక్తి ఉన్నాయో నేను వేసే ఆసనాలను గమనిస్తే అర్థమవుతుంది. నేను చేసే అసనాలకు సంబంధించిన ఫొటోలు చూసి, చాలామంది ఇంప్రెస్ అయ్యారు. అయితే అలాంటి ఆసనాలు ట్రైనర్ లేకుండా ఇంట్లో ట్రై చేయకూడదు అనుభవం సంపాదించుకునేంతవరకూ ట్రైన్ సమక్షంలో చేయడమే బెటర్.యోగా చేస్తున్నవాళ్లు ఎప్పటికీ కంటిన్యూ చేయండి. చేయనివాళ్లు ఈరోజు నుంచి మొదలుపెట్టండి. మనసు, శరీరం రెండూ బాగుంటాయి. -
ఈజిప్టు పిరమిడ్ల వద్ద ...
అలెగ్జాండ్రియా నుంచి ఇస్మైలియా దాకా పలు నగరాల్లో యోగా డేను నిర్వహిస్తున్నట్లు భారత రాయబారి సంజయ్ భట్టాచార్య తెలిపారు. పిరమిడ్లు, కైరోలోని తాహ్రిర్ స్క్వేర్ వద్ద ‘ఫ్లాష్ మాబ్’ (అకస్మాత్తుగా కొందరు యువతీయువకులు గుమిగూడి కాసేపు నృత్యం చేసి... అంతేవేగంగా వెళ్లిపోతారు. జనం దృష్టిని ఆకర్షించడానికి ఈ ఫ్లాష్‌మాబ్‌లు నిర్వహిస్తుంటారు)కు భారత రాయబార కార్యాలయం ప్లాన్ చేసింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లోని రబిన్ స్క్వేర్ వద్ద వేలాదిగా జనం యోగా డేలో పాల్గొననున్నారు. అయ్యంగార్, అస్థాన, త్రి యోగా, విన్యాస యోగా, ఆక్రో యోగాలలో తరగతులు నిర్వహించనున్నారు. యోగా, ఆయుర్వేదంపై అవగాహన పెంచడానికి సమాచార కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. -
కాబోయే తల్లి కోసమే!
‘‘మీ గదిలో చక్కటి బేబీ ఫొటోలు, గొప్ప వ్యక్తుల ఫొటోలు తగిలించరా’’ అని తల్లి కొడుకుకి పురమాయించడం... ‘‘ఎవరి ముఖమో చూస్తే అలాంటి పిల్లలు పుడతారా అమ్మా? మన మొహాలెలా ఉంటే అలాగే పుడతారు కానీ’’ కొడుకు తుంచేయడం, ఆ మాటతో కోడలి మనసు చివుక్కుమనడం... దాదాపుగా జరిగేవే. పైకి అలా అన్నప్పటికీ... సాయంత్రానికి నాలుగైదు ఫొటోలు పిల్లలవి, మరో నాలుగైదు దేశనాయకుల ఫొటోలు... ఎంపిక చేతకాక ఇతరత్రా ఏవో కొన్ని ఫొటోలు వచ్చి ఇంట్లో అన్ని గదుల గోడలకూ వేళ్లాడతాయి. ‘నేషనల్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగ(సిసిఆర్వై)’ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ఈ నెల 21వ తేదీన యోగాడే సందర్భంగా విడుదల చేసిన ఒక బుక్‌లెట్‌లో మహిళలు, పిల్లల ఆరోగ్యం గురించి అనేక సంగతులను ఉదహరించింది. గర్భిణిగా ఉన్నప్పుడు కోపం, ఆవేశం, వ్యామోహం, దురాశ, దుర్గుణ సాంగత్యాలకు దూరంగా ఉండాలని చెప్పింది. అలాగే చక్కటి కథలు చదవడం, మంచి వ్యక్తులతో కలివిడిగా ఉండడం, గొప్ప వ్యక్తుల జీవితాలను చదవడం, ఆధ్యాత్మిక చింతన, మంచిని తలుస్తూ ఉండే సానుకూల దృక్పథం, అందమైన ఫొటోలను చూడడం అలవాటుగా ఉండాలని కూడా చెప్పింది సిసిఆర్వై. దీంతోపాటు మాంసాహారాన్ని మినహాయిస్తే మంచిదని కూడా సూచించింది. ‘మనం ఏది తలిస్తే అదే ప్రాప్తిస్తుంది’ మంచి తలిస్తే మంచి చెడు తలిస్తే చెడు... అనేది ఒక్కమాటలో చెప్పే సూక్తి. కడుపులో బిడ్డ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం చక్కగా ఉండడానికి ఇవి ఉపయోగపడతాయనడంలో సందేహం అక్కర్లేదు. కానీ ఆహారం విషయానికి వస్తే... గర్భిణిగా ఉన్నప్పుడు... దేహం దేనిని కోరుతుంటే నాలుక వాటినే స్వీకరిస్తుందనేది కూడా అధ్యయన పూర్వకంగా నిరూపితమైంది. అలాగే కడుపులో బిడ్డ దేనిని స్వీకరించదలుచుకుంటే తల్లి కడుపు దానినే ఇముడ్చుకుంటుందనేది కూడా అంగీకరించాల్సిన అధ్యయనమే. మాంసాహారంలో మాత్రమే ఎక్కువ పోషకాలుంటాయనే అపోహతో గర్భిణి చేత బలవంతంగా తినిపించే ప్రయత్నం వద్దు. ఆమెకు తినాలనిపించినప్పుడు తగిన మోతాదులో తినడం మంచిదే. ఎందుకంటే ఒక రుచిని తినాలనే కోరిక కలిగినప్పుడు, దానిని బలవంతంగా అణచుకోవడం అంత మంచిది కాదు. -
లక్నోలో యోగా దినోత్సవం
న్యూఢిల్లీ: నవాబుల నగరం, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ ఏడాది అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహించనున్నారు. జూన్ 21న లక్నోలో నిర్వహించనున్న మూడో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. లక్నోలో వేడుకలు జరపాలని అధికారులు నిర్ణయించినప్పటికీ నగరంలో వేదిక ఖరారు కాలేదు. ఈ విషయమై ప్రధాని కార్యాలయం తుది నిర్ణయం తీసుకుంటుందని వారు స్పష్టం చేశారు. 2015 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా జూన్ 21తేదీని యోగ దినోత్సవంగా జరుపుకోవడం తెలిసిందే. మార్చిలో యూపీ ప్రభుత్వం యోగా మహోత్సవం పేరిట మూడు రోజులపాటు ఉత్సవం జరిపింది. భారత్‌లో జరిగే ఈ కార్యక్రమానికి భోపాల్, జైపూర్, అహ్మాదాబాద్, రాంచీకి అవకాశం ఈ సారి ఇవ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. గతేడాది చండీగఢ్‌కు అవకాశం రాగా, 2015లో మొదటిసారిగా న్యూఢిల్లీ వేదికగా నిలిచింది. దేశంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని జరిపించాలని కేంద్రం యోచిస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అన్ని వర్సిటీల్లో తప్పకుండా యోగా దినోత్సవాన్ని జరపాలని వైస్ చాన్సలర్లను ఆదేశించింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ వెబ్సైట్లో యోగా ప్రతిజ్ఞ పేజీని ఇప్పటికే 2.6లక్షల మంది సందర్శించారు. 2015లో 175దేశాలు, 2016లో 192దేశాలు యోగా దినోత్సవం జరుపుకున్నాయి. -
వసుధైక ‘యోగా’
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ నుంచి సిడ్నీ హార్బర్ వరకూ యోగాడే చండీగఢ్‌లో ప్రధాని మోదీ ఆసనాలు ఖర్చులేని ఆరోగ్య బీమా యోగాతోనే సాధ్యం: మోదీ - యోగాలో కృషి చేసేవారికి జాతీయ, అంతర్జాతీయ అవార్డుల ఏర్పాటు - రాష్ట్రపతి భవన్‌లోనూ సంబరాలు - సియాచిన్ మంచుకొండపైనా యోగా - ఫరీదాబాద్‌లో లక్షమందితో రికార్డు - ఐరాస సంబరాల్లో జగ్గీవాసుదేవ్ చండీగఢ్/న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎటు చూసినా యోగా సంబరమే... ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకూ, ఆఫ్రికా నుంచి యూరప్ వరకూ మంగళవారం ‘యోగా’తో మైమరచిపోయాయి. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్... పారిస్ ఈఫిల్ టవర్, యూరోపియన్ యూనియన్ పార్లమెంట్, సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ ఇలా అన్ని చోట్ల ప్రాచీన భారతీయ సంప్రదాయం వెలిగిపోయింది. ఇక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నుంచి ఐక్యరాజ్యసమితి వరకూ ప్రత్యేక కార్యక్రమాలు మార్మోగాయి. దేశవ్యాప్తంగా లక్షకు పైగా కార్యక్రమాలతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 191 దేశాలు మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నాయి. భారత్‌తో పాటు విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది యోగాసనాలతో సందడిచేశారు. చండీగఢ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 30 వేల మంది ప్రజలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... మొబైల్ ఫోన్స్లాగానే యోగాను కూడా జీవితంలో భాగం చేసుకోవాలని, యోగాతో మధుమేహాన్ని నయం చేయవచ్చని చెప్పారు. ‘యోగా మత సంబంధ వ్యవహారం కాదు. మన మనసులో శాంతి పొందేందుకు, ఆరోగ్యకర శరీరం కోసం, సమాజంలో ఐకమత్యం కోసం యోగా మనకు శక్తినిస్తుంది. పైసా ఖర్చు పెట్టకుండా ఆరోగ్య బీమా అనేది ఈ ప్రపంచంలో లేదు. ఎలాంటి ఖర్చు లేకుండా యోగా మనకు ఆరోగ్య బీమా ఇస్తుంది’ అని అన్నారు. ఈ సందర్భంగా యోగా కోసం కృషి చేసే వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రెండు అవార్డుల్ని ప్రకటించారు. దివ్యాంగులతో కాసేపు ముచ్చటించారు. దేశమంతా ‘యోగా’మయం.. రాష్ట్రపతి భవన్లో జరిగిన యోగా ఉత్సవంలో వెయ్యి మంది పాల్గొన్నారు. యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోరారు. దేశవ్యాప్తంగా 57 మంది కేంద్ర మంత్రులు పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో కలిసి ఆసనాలు వేశారు. లక్నోలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్షంలోనే యోగా చేశారు ముంబైలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌లు పాల్గొన్నారు. సియాచిన్ మంచుకొండపై.. గడ్డకట్టించే చలిలో సియాచిన్ మంచుకొండపై 20 వేల అడుగుల ఎత్తున సైనికులు, అధికారులు ఆసనాలు వేశారు. లేహ్, కార్గిల్, సరిహద్దు వెంట ఉన్న పలు ముఖ్య ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. లేహ్ యోగాసనాల్లో 900 మంది సైనికులు పాల్గొన్నారు. యుద్ధ నౌకల్లో సిబ్బంది ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు. వివాదాలు, నిరసనలు, గైర్హాజర్లు.. అక్కడక్కడ కొన్ని వివాదాలు, నిరసనలు కూడా చోటు చేసుకున్నాయి. తిరువనంతపురంలో సంస్కృత శ్లోకాల్ని ఉచ్చరించేందుకు కేరళ వైద్య మంత్రి కేకే శైలజ అభ్యంతరం తెలిపారు. చండీగఢ్‌లో ప్రధాని పాల్గొన్న కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు ముందస్తుగా వారిని అదుపులోకి తీసుకున్నారు. బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. దీంతో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పట్నాలో వేలమందితో కలిసి యోగా చేశారు. పుదుచ్చేరిలో ఆ రాష్ట్ర సీఎం వి.నారాయణసామి, ఇతర మంత్రులు ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయ్యారు. ఢిల్లీ సంబరాల్లో 15 వేల మందికి పైగా ప్రజలు, 70 మంది దౌత్యవేత్తలు పాల్గొన్నారు. కన్నాట్ ప్లేస్ కార్యక్రమంలో 10 వేల మంది యోగాసనాలు వేశారు. ప్రపంచవ్యాప్తంగా యోగా సంబరం న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద వేలాది మంది ఔత్సాహికులు సోమవారం ఉదయం నుంచే యోగాసనాలు ప్రారంభించారు. సిడ్నీ హార్బర్ వద్ద యోగాసనాలు వేశారు. పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, మయన్మార్‌ల్లో వేలమంది ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రఖ్యాత చైనా గోడ వద్ద యోగా- తాయ్ చి(మార్షల్ ఆర్ట్స్) జుగల్బందీ నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన యోగా సంబరాల్లో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ పాల్గొన్నారు. యోగా విశ్వవ్యాప్తం అన్నారు. నేటి నుంచి యోగాసదస్సు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఢిల్లీలో 2 రోజుల అంతర్జాతీయ యోగా సదస్సు జరగనుంది. 32 దేశాలనుంచి 70 మంది ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రారంభిస్తారు. -
సెల్ ఫోన్ లాగే ఇది కూడా ..: మోదీ
చండీగఢ్: సెల్ ఫోన్లలాగే యోగా కూడా జీవితంలో ఒక భాగం కావాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా చండీగఢ్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడి క్యాపిటల్ కాంప్లెక్స్‌లో నిర్వంచిన కార్యక్రమంలో 30 వేల మందితో కలసి మోదీ యోగాసనాలు వేశారు. అంతకుముందు ఆయన యోగా ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం అనేది ప్రపంచంలో ఒక సామూహిక ఉద్యమంలా మారిపోయిందని ఆయన అన్నారు. యోగ అనేది మతపరమైన కార్యక్రమం కాదని, ఇది మనసును నియంత్రించి, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుందని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. యోగా దినోత్సవ జరుపుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. యోగాను భారత్ నుంచి ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. మానసిక ఏకాగ్రత యోగా వల్ల మాత్రమే సాధ్యమన్నారు. అందరికీ యోగా ఎంతో అవసరమన్నారు. దీనికి ధనిక, పేద తేడాలు లేవన్నారు. దీనికి పైసా కూడా ఖర్చు కాదన్నారు. యోగాతో శరీరం, మనస్సు, బుద్ధి అన్ని వృద్ధి చెందుతాయని ఆయన చెప్పారు. యోగా ఫిట్నెస్ కాదు వెల్నెస్ అన్నారు. చిన్నారులకు, గర్భిణులకు, పెద్దలు అందరు ఆరోగ్యంగా ఉండేందుకు యోగా అవసరమని చెప్పారు. మన దేశంలో చాలామంది ప్రజలు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని, వారికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, యోగా చేయడం ద్వారా షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చన్నారు. అన్ని రోగాలను యోగా ద్వార నియంత్రించవచ్చాన్నారు. ప్రసంగం ముగిసిన అనంతరం మోదీ స్టేడియం ప్రాంగణంలో తిరిగి యోగా చేస్తున్న వారిని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమ వేదికను ఫ్రెంచ్ వాస్తుశిల్పి లే కోర్‌బ్యూసియర్ రూపొందించారు. ప్రాంగణంలో భారీ ఎల్ఈడీ తెరలతో ఏర్పాటు చేశారు. ప్రధాని రాక నేపథ్యంలో చండీగఢ్‌లో 5 వేల మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా లక్ష కార్యక్రమాలు ఏర్పాటుచేయగా, ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తోన్న భారీ ఉత్సవాల్లో 57 మంది కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా పలు దేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సుమారు 135 దేశాలు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పాటిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితిలో భారతదేశ ప్రతినిధి తెలిపారు. -
లోకాసనం
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇవాళ లోకం ఆసనం వేయబోతోంది. ఇంటర్నేషనల్ యోగా డే కదా. ఇంతటి మహోన్నతమైన యోగఫలాన్ని లోకమంతా ఆస్వాదిస్తుంటే మరి మీ లోకం ఏం చేస్తోంది? అదేనండీ మీ ఫ్యామిలీ... అవును. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికీ పనికొచ్చే ఆసనాలు ఇవిగో. రండి. లోకాసనం వేద్దాం. ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం. ‘అంతర్జాతీయ యోగా దినం’ అంటూ ఒకటి ఉండాలని 2014 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి (ఐ.రా.స) సర్వప్రతినిధి సభలో ప్రసంగిస్తున్నప్పుడు భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదించారు. ఆ ఏడాది డిసెంబర్లో ఐ.రా.స. దానికి ఆమోదం తెలుపుతూ, జూన్ 21వ తేదీని ‘అంతర్జాతీయ యోగా దినం’గా ప్రకటించింది. ప్రాచీనమైన యోగ విద్యకు భారతదేశం పుట్టినిల్లు. ఈ విద్య ఎప్పుడు పుట్టిందనేందుకు కచ్చితమైన ఆధారాలేవీ లేవు గాని, సింధూలోయ నాగరికత నాటికే ఉనికిలో ఉండేదని చరిత్రకారుల అంచనా. క్రీస్తుపూర్వం 500-200 సంవత్సరాల మధ్య కాలంలో హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు కూడా యోగసాధన చేసేవారు. ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలిస్తే, రుగ్వేదంలో తొలిసారిగా ‘యోగ’ గురించిన ప్రస్తావన ఉంది. ఆ తర్వాత భగవద్గీతలోను, మహాభారతంలోని శాంతిపర్వంలోను ‘యోగ’ ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుశకం నాలుగో శతాబ్దికి చెందిన పతంజలి మహర్షి యోగసూత్రాలు రచించిన తర్వాత ఈ విద్య విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రాచీన కాలంలో మోక్షగాములైన ముముక్షువులే ఎక్కువగా యోగసాధన చేసేవారు. వారు కూడా భక్తి, ధ్యాన యోగాల్లోనే నిమగ్నమయ్యేవారు. శారీరక దారుఢ్యానికి, శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తి కోసం కూడా యోగసాధన సామాన్యులకు సైతం ఉపయోగపడుతుందని చరకుడు తొలిసారిగా తన ‘చరక సంహిత’లో చాటాడు. మనసును నియంత్రించుకోవడమే మనసు కళ్లెంలేని గుర్రంలాంటిది. అదుపు చేసే సాధనమేదీ లేకపోతే దిశారహితంగా ఆలోచనలు పరుగులు తీస్తూనే ఉంటాయి. పతంజలి మహర్షి నిర్వచనం ప్రకారం ‘యోగః చిత్తవృత్తి నిరోధః’ అంటే మనసును నియంత్రణలోనికి తెచ్చుకునే నైపుణ్యమే యోగ విద్య. ఈ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికే ఆయన యోగ సూత్రాలను రచించాడు. ఈ సూత్రాలలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి మార్గాలను బోధించాడు. ఆధునిక కాలంలో యోగవిద్య ఎన్నెన్ని కొత్త కొత్త పోకడలు పోతున్నా, పతంజలి రచించిన యోగ సూత్రాలే వాటన్నిటికీ మూలాధారం. మన యోగులు పతంజలి మొదలుకొని భారతదేశంలో చాలామంది యోగ గురువులు ఈ విద్యను వ్యాప్తిలోకి తెచ్చారు. స్వామీ వివేకానంద అమెరికా పర్యటన దరిమిలా, ఈ విద్యకు పాశ్చాత్య దేశాల్లోనూ విశేష ప్రాచుర్యం లభించింది. మహావతార్ బాబా శిష్యపరంపరకు చెందిన పరమహంస యోగానంద కూడా పాశ్చాత్య దేశాల్లో యోగవిద్యకు ప్రాచుర్యం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఆధునిక కాలంలో తిరుమలై కృష్ణమాచార్య యోగవిద్యకు పునరుత్తేజం కల్పించి, ‘ఆధునిక యోగ పితామహుడు’గా ఖ్యాతి పొందారు. మైసూరు మహారాజు ఆశ్రయం పొందిన తిరుమలై కృష్ణమాచార్య ఆరోగ్య వృద్ధి కోసం యోగసాధన ఆవశ్యకతను సామాన్యులకు వివరిస్తూ, హఠయోగ సాధన పద్ధతులను బోధిస్తూ దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి, ఈ విద్యను జనసామాన్యానికి చేరువ చేశారు. కృష్ణమాచార్య శిష్యుడైన బి.కె.ఎస్.అయ్యంగార్ పతంజలి యోగసూత్రాలను సులభతరమైన రీతిలో జనానికి బోధించారు. ఆయన రచించిన ‘లైట్ ఆన్ యోగా’ పుస్తకం 19 భాషల్లో అనువాదమై, 30 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయింది. హై బీపీ: శైథిలాసనం బోర్లా పడుకుని గడ్డాన్ని నేలకు ఆనించి చేతులను శరీరానికి రెండు పక్కల చాచి నేలపై (అరచేతులు ఆకాశాన్ని చూడాలి) ఉంచాలి. తలను ఎడమవైపుకు తిప్పి కుడి చెవి నేలకు ఆనించి, ఎడమ చేతిని ముఖానికి ఎదురుగా తీసుకువచ్చి... అరచేతిని, మోచేతిని నేలకు ఆనించాలి.ఎడమకాలిని మడిచి, ఆ పాదాన్ని కుడి మోకాలిని తాకుతూ ఉంచాలి. ఈ స్థితిలో సాధారణంగా శ్వాస తీసుకోవాలి.వెనక్కు రావడం: ఎడమ కాలిని నిటారుగా చాచి, తలను పైకి లేపి నిటారుగా తిప్పి, మెల్లగా వెల్లకిలా తిరగాలి. డయాబెటిస్ అర్ధ మత్స్యేంద్రాసనం నేల మీద కూర్చుని కాళ్లను చాపి, చేతులను తాకించాలి. వెన్ను నిటారుగా ఉండాలి. ఎడమకాలిని మడిచి కుడి తొడ కిందగా ఉంచాలి. కుడికాలిని ఎడమమోకాలి పక్క నుంచి తీసుకుని పాదం నేలకు తాకేటట్లు ఉంచాలి. ఎడమ చేతితో కుడికాలి చీలమండను పట్టుకోవాలి. కుడి చేతిని శరీరం వెనక్కు తీసుకోవాలి. మెడను తిప్పి భుజం మీద నుంచి నేరుగా చూడాలి. వెనక్కు రావడం: కుడిచేతిని ముందుకు తీసుకువచ్చి ఎడమ చేతిని యథాస్థితికి తీసుకురావాలి. కుడికాలిని నిటారుగా చాపి రిలాక్స్ కావాలి. ఇలాగే ఎడమ కాలితో కూడా సాధన చేయాలి. మైగ్రేన్: శశాంకాసనం వజ్రాసనంలో కూర్చోవాలి (మోకాళ్లను వంచి పాదాల మీద కూర్చోవాలి. వెన్ను, భుజాలు నిటారుగా ఉండాలి).చేతులను వెనక్కు తీసుకుని లాక్ చేసినట్లు పట్టుకోవాలి.(వెన్ను వంచకుండా నడుము వంచుతూ గడ్డాన్ని నేలకు తాకించాలి (సాధన తొలి దశలో గడ్డం ఆనదు. తల, నుదురు ఆనిస్తూ, గడ్డం ఆనే వరకు సాధన చేయాలి).లాక్ చేసిన చేతులను నిటారుగా పైకి లేపాలి, తర్వాత చేతులు ముందుకు తెచ్చి మోచేతులు, అరచేతులను నేల మీద ఆనించాలి.వెనక్కు రావడం: ఆసనం పొజిషన్లోకి శ్వాస వదులుతూ వెళ్లాలి. వెనక్కు వచ్చేటప్పుడు శ్వాస తీసుకుంటూ రావాలి. వెన్నునొప్పి భుజంగాసనం బోర్లాపడుకుని అరచేతులను నేలకు ఆన్చి రెండు మోచేతులను వంచుతూ ఛాతీకి దగ్గరగా తీసుకురావాలి.తల, మెడ, ఛాతీ పెకైత్తాలి. ఈ స్థితిలో నాభి నేలను తాకుతూ ఉండాలి, మెడ వీలయినంతగా సాగినట్లుండాలి. నిండుగా గాలిపీల్చుకుని శ్వాసను బంధించి ఉండగలిగినంత సేపు ఉండాలి.వెనక్కు రావడం: శ్వాస వదులుతూ నెమ్మదిగా తలను దించుతూ గడ్డాన్ని నేలకు తాకించి విశ్రాంతి స్థితిలోకి రావాలి. నెక్ పెయిన్: గోముఖాసనం కాళ్లను ముందుకు చాచి కూర్చోవాలి. కుడిమోకాలిని వంచి కుడికాలి మడమను ఎడమ పిరుదుకు ఆనించాలి.ఇప్పుడు ఎడమ మోకాలిని వంచి ఎడమ పాదాన్ని కుడి పిరుదు కింద ఉంచాలి. చేతులను కుడిమోకాలి మీద ఉంచాలి.కుడి చేతిని పెకైత్తి మోచేతిని వంచి అరచేతిని వీపు వెనుక బోర్లించి ఉంచాలి. ఎడమ చేతిని వెనక్కు తీసుకుని కుడిచేతి వేళ్లతో కలిపి పట్టుకోవాలి. ఈ స్థితిలో శ్వాసను సాధారణంగా తీసుకోవాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మెల్లగా యథాస్థితికి రావాలి.వెనక్కు రావడం: ముందుగా ఎడమచేతిని వదిలించుకుని ఆ తర్వాత కుడిచేతిని మామూలు స్థితికి తీసుకురావాలి. ఆ తర్వాత కాళ్లను వదులు చేయాలి. అలాగే ఎడమ చేతిని పెకైత్తి వీపు మీదకు వంచి ఎడమచేతిని పట్టుకుని కూడా చేయాలి. యోగ చేసే ముందు... ఎప్పుడూ ఖాళీ కడుపుతోనే యోగా చేయాలి. మహా అయితే, అతి స్వల్పంగా ఆహారం తిని ఉన్నా ఫరవాలేదు కానీ, కడుపు నిండుగా ఉండకూడదు.మంచి చాప, లేదా జంపఖానా వేసుకొని దానిపై యోగాసనాలు సాధన చేయాలి.యోగాసనాలు వేసే ముందు ప్రశాంత చిత్తం కోసం ముందుగా ప్రార్థన చేయడం రివాజు. చేసిన తరువాత... చివరలో ధ్యానం చేస్తూ, యోగ శిక్షణను ముగించాలి.దేహాన్ని బిగుతుగా ఉంచుకోకూడదు. వీలైనంత వదులుగా ఉంచుకోవాలి. ఎవరికి వారు తమ వ్యక్తిగత శారీరక సామర్థ్యానికి తగ్గట్లే యోగా చేయాలి. దాన్ని మించకూడదు.యోగసాధన పూర్తయ్యాక 20 నుంచి 30 నిమిషాల తరువాతనే స్నానం చేయాలి.అలాగే, యోగా చేశాక దాదాపు 20 - 30 నిమిషాల విరామం తరువాతే ఏదైనా ఆహారం తీసుకోవాలి. జాగ్రత్తలు యోగాసనాలు వేస్తున్నప్పుడు వదులుగా, సౌకర్యంగా ఉండే నూలు దుస్తులు ధరించాలి.బాగా అలసటగా ఉన్నప్పుడూ, అనారోగ్యంతో ఉన్నప్పుడూ ఆసనాలు వేయకూడదు. దేహాన్నీ, మనస్సునూ ప్రశాంతంగా ఉంచుకొని, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఆసనాలు వేయాలి.గర్భవతిగా ఉన్నప్పుడూ, ఋతుస్రావ సమయంలో, మరేదైనా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడూ యోగాసనాలు వేసే విషయంలో నిపుణుల సలహా తీసుకోవాలి. ఎప్పుడూ ముక్కు రంధ్రాల ద్వారానే శ్వాసక్రియ జరపాలి. ఎప్పుడూ సొంతంగా కాకుండా, నిపుణుల ఆధ్వర్యంలో ఆసనాలు వేయడం నేర్చుకొని, సాధన చేయాలి. లాభాలు యోగా వల్ల శారీరక దార్ఢ్యం పెరుగుతుంది. కండరాలు, ఎముకల పనితీరు మెరుగవుతుంది. గుండె కండరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.మధుమేహం, శ్వాసకోశ సంబంధ సమస్యలు, అధిక రక్తపోటు, అలాగే ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే అనేక ఇబ్బందులకు యోగా మంచి పరిష్కారం. ఒంటికే కాదు... మనసుకూ మంచిది యోగా. మానసికంగా నిరాశా నిస్పృహలు, అలసట, మానసిక ఆందోళన, ఒత్తిడి లాంటి వాటన్నిటికీ ఇది పరమౌషధం.ఆడవారిలో ఋతుక్రమం ఆగిపోయే వయస్సులో వచ్చే ఇబ్బందుల్ని నియంత్రిస్తుంది. 2015 నుంచి ప్రపంచమంతటా యోగా దినోత్సవాన్ని జరుపుకోవడంమొదలైంది. ఇప్పుడిది రెండో సంవత్సరం. ఈసారి దాదాపు 192 దేశాల్లో ప్రజలు ప్రాణాయామం చేస్తూ, శ్వాసపై ధ్యాస పెడుతున్నారు. దేహాన్నీ, మనస్సునూ నియంత్రణలోకి తెస్తున్నారు. ఆరోగ్యానికీ, మానసిక శ్రేయస్సుకూ సమగ్రమైన విధానం ఈ ప్రాచీన భారతీయ యోగశాస్త్ర విజ్ఞానమేనని ఇప్పుడు ప్రపంచమంతా అంగీకరిస్తోంది. -
యోగా దినోత్సవ వేదిక మారింది
విజయవాడ : మంగళవారం విజయవాడలో జరగబోయే యోగా దినోత్సవం వేదిక మారింది. వాతావరణ పరిస్థితుల కారణంగా వేదికను ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఏ కన్వెన్షన్ సెంటర్‌కు మార్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు హాజరవుతున్నారు. -
'మోదీజీ.. ముందు తాగుడు మాన్పించండి'
పాలము: ప్రధాని నరేంద్రమోదీపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనదైన శైలిలో మరోసారి విమర్శలు కురిపించారు. యోగాపై ధ్యాస పెట్టే ముందు మద్యం గురించి ఆలోచించాలని అన్నారు. మద్యపాన నిషేధం చేయకుండా యోగా నిష్ఫ్రయోజనం అని చెప్పారు. 'యోగాలో మొదటి నిబంధన మద్యపానాన్ని వినియోగానికి దూరం చేయడం. నిజంగా మీకు యోగాపై అంత తీవ్రమైన ఆలోచన ఉన్నట్లయితే ముందు మద్యంపై నిషేధాన్ని విధించండి' అంటూ ఆయన అన్నారు. యోగా అనేది ఏ ఒక్కరోజో గుర్తు చేసుకునేది కాదని, ఒక్కరోజు చేసే పని కాదని, అది జీవిత క్రమంలో నిత్యం జరగాల్సిన ప్రక్రియ అని చెప్పారు. 'ప్రధాని మోదీ ఎప్పటి నుంచి యోగా చేస్తున్నారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఎన్నో ఏళ్లుగా చేస్తున్నా.. ఆసనా, ప్రాణయామ, యోగా నిద్రాణ్' చేస్తుంటా. యోగా మొదటి నిబంధన మద్యపానానికి దూరంగా ఉండటం. యోగా డే సందర్భంగా ఆ నిర్ణయం తీసుకోలేకుంటే ఆ యోగా విఫలమే' అని చెప్పారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాలములోని పార్టీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌లో మద్యపానం నిషేధాన్ని అమలుచేయాలని జేడీయూ డిమాండ్ చేస్తుందని చెప్పారు. తాను గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని పొందడానికి అత్యంత కీలకమైన అంశం ఇదేనని చెప్పారు. జార్ఖండ్‌తో ఉన్న సరిహద్దులో లిక్కర్ షాపులు ఏర్పాటుచేయడం వల్ల బిహార్‌లో మద్యపాన నిషేధం గడ్డు సమస్యగా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో మద్యపానం నిషేధించాలని అన్నారు. -
అమెరికాలో యోగా దినోత్సవాలు
షికాగో: అంతర్జాతీయ రెండో యోగా దినోత్సవాన్ని అమెరికాలో గురువారం నుంచి జూన్ 25 వరకు వారం రోజుల పాటు భారత్ నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలను శాండ్విచ్ నగరంలో నిర్వహిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రారంభ వేడుకలకు శాండ్విచ్ నగర మేయర్ రిక్ ఊల్సన్, నగర ప్రముఖులు హాజరయ్యారు. నగర మేయర ఊల్సన్తో కలిసి భారత కౌన్సిల్ జనరల్ ఆసఫ్ సయూద్ మాట్లాడుతూ జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా యోగా డే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
వద్దమ్మ....ప్లీజ్...
న్యూఢిల్లీ : 'మీతో కలసి సెల్ఫీ తీసుకుంటా' అనిని ఎవరైనా కోరితే ఒకే చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ యోగా డేలో మాత్రం అందుకు నిరాకరించరు. యోగా డే సందర్భంగా నిన్న రాజ్‌పథ్‌లో ప్రసంగం అనంతరం ఆయన యోగా చేయడానికి ముందు వరసలోకి వెళ్లగా వలంటీర్‌గా ఉన్న ఓ యువతి ఆయన వద్దకు వెళ్లి మీతో కలసి సెల్ఫీ తీసుకుంటానని కోరింది. అందుకు మోదీ రెండు చేతులు జోడించి ప్లీజ్..వద్దమ్మ...అంటూ సున్నితంగా తిరస్కరించారు. తర్వాత ఆయన ఆసనాలు వేస్తుండగా ఆమె సహచర వలంటీర్‌తో తిరిగొచ్చి ఆయన వెనక వైపు కూర్చుని ఆసనాలు వేయసాగింది. సివిల్ దుస్తుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఆమెను పక్కకు పంపారు. తలపాగా ధరించిన మరో వ్యక్తి ప్రధానితో సెల్ఫీ తీసుకునేందుకు దగ్గరకు రాగా అతన్నీ వారు పక్కకు పంపారు. -
ఒంటికి యోగా మంచిదేగా
- యోగా చేయండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి - యోగా దినోత్సవంలో సీఎం చంద్రబాబు - 35 నిమిషాలు యోగా, ధ్యానం, ప్రాణాయామం - కృష్ణానది పక్కనే రివర్సిటీ నిర్మిస్తానని హామీ - ‘నాలుగో సింహం’ యాప్ ఆవిష్కరణ సాక్షి, విజయవాడ బ్యూరో : యోగా జీవన వికాసానికి మార్గమని, అదో సైన్స్ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. యోగా వల్లే మానవాళి మొత్తం భారతదేశంవైపు చూస్తోందని, ఇది భారత జాతికి పూర్వీకులు ఇచ్చిన వరమని కొనియాడారు. నగరంలోని ఎ.కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం ఉదయం యోగా దినోత్సవాన్ని సీఎం ప్రారంభించి ప్రసంగించారు. అంతకుముందు ఆయన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ ఈరోజు నుంచి యోగాను ప్రారంభించి.. కొనసాగించి.. జీవన సరళిని మార్చుకోవాలని పిలుపునిచ్చారు. 192 దేశాలు ఆమోదించి యోగాను నేర్చుకోవడానికి సిద్ధమయ్యాయని, ఇది గర్వించదగిన విషయమన్నారు. యోగా చేసిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యం, మనోనిబ్బరం పెరుగుతుందని తెలిపారు. సంపూర్ణ యోగాను పాటిస్తే మూడు గంటల్లో చదివే విద్యార్థులు అరగంట చదివితే సరిపోతుందని, పది గంటల్లో చేసే పనిని మూడు, నాలుగు గంటల్లోనే చేయవచ్చని తెలిపారు. 1994లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో యోగా చేయించానని, ఇటీవల మళ్లీ ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులు శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సమాజంలో అందరూ ఒత్తిడికి గురవుతున్నారని, అది లేని జీవితం గడపాలంటే యోగా చేయాలని సూచించారు. బతికున్నంత వరకూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆలోచనా విధానం మారాలని, అది యోగా వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. మంత్రులు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, ఎంపీలు కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణరావు, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధతోపాటు అధికారులు, ఎన్సీసీ విద్యార్థులతో కలిసి 35 నిమిషాల పాటు ముఖ్యమంత్రి యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేశారు. కార్పొరేషనలో మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చిన ఆవుల చిరంజీవిని సీఎం అభినందించారు. రివర్ సిటీ.. అందుకే బ్యూటీ.. కృష్ణానది విజయవాడకు మరింత అందాన్ని తెచ్చిందని, ఇలాంటి అందమైన ప్రాంతం మరెక్కడా లేదని ఎ.కన్వెన్షన్ సెంటర్లోనే జరిగిన ‘నాలుగో సింహం’ యాప్ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతి వరకూ 30 కిలోమీటర్ల పొడవు, నాలుగు కిలోమీటర్ల వెడల్పుతో నది చాలా ఆకర్షణీయంగా ఉంటుందని, హెలికాప్టర్ నుంచి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడల్లా ఎంతో ఆహ్లాదం కలుగుతుందన్నారు. నదికి రెండువైపులా ఎత్తయిన భవనాలను నిర్మించి రివర్ సిటీ నగరాన్ని నిర్మిస్తామని, ‘కాలువల బ్యూటిఫికేషన్’ పూర్తయితే విజయవాడ మరింత అందంగా కనిపిస్తుందన్నారు. అనంతరం సీఎం వెదురు తోటల పెంపకంపై అధ్యయన యాత్రను ప్రారంభించారు. పంటల మార్పిడి విధానాలపై అవగాహన పెంచుకోవాలని రైతులకు సూచించారు. అంతర పంటలపై కూడా దృష్టి పెట్టాలని చెప్పారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ మూడు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్లారు. అంతా పసుపుమయం యోగా దినోత్సవ సభా వేదికను పూర్తిగా పసుపు రంగుతో తీర్చిదిద్దారు. చివరికి యోగా చేసే మ్యాట్లు కూడా పసుపు రంగులోనివే కావడం విశేషం. అధికారిక కార్యక్రమాల్లోనూ టీడీపీ జెండాలోని పసుపు రంగును బాగా ఉపయోగిస్తున్న అధికారులు చివరికి జాతీయ కార్యక్రమమైన యోగా సభను కూడా పసుపుమయం చేయడం విశేషం. -
యోగాడేలో రాష్ట్రపతి ప్రణబ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రపతి భవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు యోగాతో శాంతి, సుఖాలతో ఉండాలని ప్రణబ్ కోరారు. సమస్యలు లేని జీవనానికి యోగా సాధనమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. -
యోగాడేలో గవర్నర్ నరసింహన్
హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పాల్గొన్నారు. రాజ్ భవన్లో ఆదివారం ఉదయం నిర్వహించిన యోగాసనాల్లో గవర్నర్‌తో పాటు ఆయన సతీమణి విమలా నరసింహన్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా 'యోగా'ను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. అలా చేయటం వల్ల ఒత్తిడిని జయించవచ్చని తెలిపారు. -
నేడు యోగా డే
చెన్నై, సాక్షి ప్రతినిధి:అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం రాష్ట్రం మొత్తం సిద్దమైంది. ఆదివారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, విద్యాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు యోగా డే కోసం సన్నాహాలు పూర్తిచేసుకున్నాయి. ఈనెల (జూన్) 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించగానే దేశం యావత్తు ఇందుకు సిద్దమైంది. యోగా ఒక మతానికి పరిమితమని కొన్ని రాజకీయ పార్టీలు, మితవాద సంస్థలు విమర్శలు గుప్పించినా ఎక్కడిక క్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు సాగాయి. ఐక్యరాజ్యసమితి పిలుపునందుకున్న కేంద్రప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహించేందుకు నడుంబిగించింది. ప్రధాని నరేంద్రమోదీ డిల్లీలో లక్షలాది మందితో కలిసి యోగాలో పాల్గొంటున్నారు. ఇక తమిళనాడుకు సంబంధించి ప్రభుత్వ పరంగా భారీ ఎత్తున కార్యక్రమాల రూపకల్పన సాగలేదు. అయితే ఇతరత్రా అపూర్వ స్పందన నెలకొంది. ముఖ్యంగా విద్యాసంస్థలు భారీస్థాయిలో జరిపేందుకు సిద్దమైనారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఈషా ఫౌండేషన్ వారు చెన్నై వైఎమ్‌సీఏ మైదానంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో 40 వేల మంది పాల్గొంటారని అంచనా. ప్రముఖ గురువు జగ్గీ వాసుదేవన్ సమక్షంలో సాగే యోగా కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శనివారం ఉదయం 6.15 గంటలకు జ్యోతి వెలిగించి ప్రారంభిస్తారు. ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు సుధా రఘునాధన్ గాత్ర కచ్చేరీని సైతం ఏర్పాటు చేసారు. అలాగే కోడంబాకంలో బ్రహ్మకుమారీలు పలు కార్యక్రమాలను జరుపుతున్నారు. రాజయోగం, అవగాహ న, ధ్యానం క్లాసులను నిర్వహిస్తున్నారు. చెన్నై పచ్చపాస్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రయివేటు పాఠశాల మైదానంలో యోగా నిర్వహిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో మెరీనాబీచ్లోనూ, సైనికదళాల ఆధ్వర్యంలో థీవుతిడల్లో, నౌకాదళం నేతత్వంలో గస్తీదళాల మైదానంలో యోగా నిర్వహిస్తారు. అలాగే చెన్నై సచివాలయంలో సైతం ప్రత్యేక యోగా క్లాసులు జరపాలని నిర్ణయించారు. డీఎండీకే కార్యాలయంలోనూ యోగా జరుపుతారు. యోగా నిర్వహణ పట్ల కొందరు మత విద్వేషాలను వెదజల్లడంతో పోలీసు వర్గాలు అప్రమత్తమైనాయి. ముఖ్యమైన కూడళ్లు, భారీ సంఖ్యలో యోగా నిర్వహించే చోట్ల భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా వ్యవహరించాల్సిందిగా పోలీసు అధికారులకు ఆదేశాలు అందాయి. శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడే యోగాకు కొందరు మతం రంగుపులమడం దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వం సైతం పెద్దగా స్పందించక పోవడం విచారకరమని అన్నారు. ప్రజలందరికీ ప్రయోజనకరమైన యోగాను తరగతుల్లో పాఠ్యాంశంగా చేర్చాలని, ప్రతిరోజు విద్యార్థులకు యోగా శిక్షణ నివ్వాలని పీఎంకే యువజన విభాగం అధ్యక్షుల డాక్టర్ అన్బుమణి రాందాస్ సూచించారు. -
'మా రాష్ట్రంలో యోగా డే నిర్వహించం'
చండీగఢ్(పంజాబ్): జూన్ 21న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న యోగా డే కార్యక్రమాన్ని పంబాబ్ లో చేపట్టడంలేదని అకాలీదళ్ ప్రభుత్వం నిర్ణయించింది. బీజేపీ మిత్రకూటమి అయిన అకాలీదళ్ పంజాబ్ లో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రధాని మోదీపై గుర్రుగుర్రుగా ఉన్నారని పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. పవిత్ర నగరం ఆనంద్‌పూర్ సాహిబ్ సందర్శనకు రావాల్సిందిగా మోదీని పంబాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ఆహ్వానించారు. మోదీ ఈ సందర్శనను రద్దుచేసుకున్న కారణంతో ఆయనపై ఆగ్రహంగా ఉన్న అకాలీదళ్ 'యోగా డే' నిర్వహించేందుకు ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తుంది. విద్యార్థులంతా యోగా డే కు హాజరుకావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తున్నప్పటికీ, వేడుకకు దూరంగా ఉంటామన్న అకాలీదళ్ రాష్ట్ర విద్యాసంస్థలకు ఈ విషయాన్ని తెలపలేదు. పైగా విద్యార్థులకు జూన్ 30 వరకు వేసవి సెలవులలో ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. 1993లో ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న టెర్రరిస్టు దేవిందర్ సింగ్ బుల్లార్‌ను స్థానిక తీహార్ జైలు నుంచి పంబాబ్ లోని అమృత్సర్ జైలుకు తరలించారు. అయితే ఈ విషయంలో బీజేపీ, అకాలీదళ్ మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తుంది. బుల్లార్ విషయాన్ని పంజాబ్ బీజేపీ నేతలు కొందరు మోదీతో సమావేశమై చర్చించడంతో ఆయన ఈ కార్యక్రయాన్ని రద్దుచేసుకున్నారని తెలుస్తుంది. మతపరమైన అంశాలు ఇందులో భాగమైనవని వారు ప్రధానికి తెలపడంతో ఆయన ఆనంద్‌పూర్ సాహిబ్ పట్టణ సందర్శనను రద్దుచేసుకున్నారని అకాలీదళ్ పార్టీకి చెందిన ఓ నేత పేర్కొన్నారు. సిక్కుల గురువు గోబింద్ సింగ్ 1699లో స్థాపించిన పవిత్ర నగరం ఆనంద్‌పూర్ 315వ వార్షికోత్సవానికి ప్రధానిని ప్రకాశ్ సింగ్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, బుల్లార్ నేపథ్యంలో ఆయన ఈ సందర్శన రద్దు చేసుకోగా, పంజాబ్ ప్రభుత్వం మాత్రం పట్టుదలకు పోయి యోగా డే కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. -
రికార్డు 'యోగా' ప్రయత్నం..
వికారాబాద్ రూరల్ (రంగారెడ్డి జిల్లా) : జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వికారాబాద్‌లోని అనంతపద్మనాభ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందుకుగాను ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపల్ దత్తాత్రేయరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 21న జరిగే యోగా దినోత్సవానికి పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు చెందిన 750 మందికిపైగా ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు హాజరు కానున్నారని, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. -
'యోగా చేసి అహంకారం తగ్గించుకోండి'
జంషెడ్ పూర్: బీహార్ సీఎం నితీశ్ కుమార్ అహంకారి, గర్విష్ఠి అని బీజేపీ నాయకుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ధ్వజమెత్తారు. తన పొగరు తగ్గించుకునేందుకు నితీశ్ నిత్యం యోగా చేయాలని సూచించారు. యోగా చేయడానికి సరిపోయే ఒళ్లేనా నీది, ప్రతి రోజూ శ్రద్ధగా ఇంట్లోనే యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కు నితీశ్ సలహాయిచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పాట్నాలో ఈనెల 21న జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఆయనను ఉద్దేశించే నితీష్ ఈ విమర్శలు చేశారు. నితీశ్ వ్యాఖ్యలపై రఘువర్ ఘాటుగా విధంగా స్పందించారు. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆయనకు గుణపాఠం చెబుతారని అన్నారు. బీహార్ ఎన్నికల్లోనూ జార్ఖండ్ తరహా ఫలితాలే వస్తాయని పేర్కొన్నారు. -
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మమ్మురంగా ఏర్పాట్లు
-
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యోగా నాటకం: దిగ్విజయ్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యోగా కార్యక్రమాల పేరుతో కొత్త నాటకానికి తెర తీశారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కేంద్రం నిర్ణయించడాన్ని బుధవారం ఆయన ట్విటర్లో తప్పుబట్టారు. మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని చెప్పడం తప్పుకాదని, అయితే దాన్ని ఓ మతపరమైన, రాజకీయపరమైన కార్యక్రమంగా నిర్వహించాలని అనుకోవడం దురదృష్టకరమన్నారు. తానూ 40 ఏళ్లుగా ప్రాణాయామం చేస్తున్నానని పేర్కొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌పథ్‌లో భారీ కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. దేశంలోని అన్ని పాఠశాలల్లో 21న యోగా కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఎంపీఎల్బీ) సహా పలు ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని దిగ్విజయ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.