
వద్దమ్మ....ప్లీజ్...
న్యూఢిల్లీ : 'మీతో కలసి సెల్ఫీ తీసుకుంటా' అనిని ఎవరైనా కోరితే ఒకే చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ యోగా డేలో మాత్రం అందుకు నిరాకరించరు. యోగా డే సందర్భంగా నిన్న రాజ్‌పథ్‌లో ప్రసంగం అనంతరం ఆయన యోగా చేయడానికి ముందు వరసలోకి వెళ్లగా వలంటీర్‌గా ఉన్న ఓ యువతి ఆయన వద్దకు వెళ్లి మీతో కలసి సెల్ఫీ తీసుకుంటానని కోరింది. అందుకు మోదీ రెండు చేతులు జోడించి ప్లీజ్..వద్దమ్మ...అంటూ సున్నితంగా తిరస్కరించారు.
తర్వాత ఆయన ఆసనాలు వేస్తుండగా ఆమె సహచర వలంటీర్‌తో తిరిగొచ్చి ఆయన వెనక వైపు కూర్చుని ఆసనాలు వేయసాగింది. సివిల్ దుస్తుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఆమెను పక్కకు పంపారు. తలపాగా ధరించిన మరో వ్యక్తి ప్రధానితో సెల్ఫీ తీసుకునేందుకు దగ్గరకు రాగా అతన్నీ వారు పక్కకు పంపారు.