G7 Summit 2024: మరో ‘మెలోడీ’ క్షణం  India's Prime Minister Narendra Modi and Italy's PM Giorgia Meloni take a selfie at the G7 Summit. Sakshi
Sakshi News home page

G7 Summit 2024: మరో ‘మెలోడీ’ క్షణం 

Published Sat, Jun 15 2024 11:42 AM

G7 Summit 2024: PM Narendra Modi Selfie With Giorgia Meloni At G7 summit

బరీ(ఇటలీ): జీ7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆతీ్మయ భేటీని ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. మూడు సెకన్ల సెల్ఫీ వీడియోను తీసి ‘ఎక్స్‌’లో షేర్‌చేశారు. మెలోనీ, మోదీ పేర్లను కలిపి మెలోడీ అనే కొత్త పదాన్ని సృష్టించి దానికి హ్యాష్‌ట్యాగ్‌ను తగిలించి గతంలోనే ఆమె విస్తృత ట్రెండింగ్‌ చేసిన విషయం తెల్సిందే. 

అదే పంథాలో మరోసారి కొత్త వీడియోను తీసి అందరితో పంచుకున్నారు. శుక్రవారం జీ7 శిఖరాగ్ర సదస్సు జరిగిన ఇటలీలోని అపూలియాలో ఉన్న రిసార్ట్‌ ఇందుకు వేదికైంది. మోదీని మెలోనీ సాదరంగా ఆహా్వనించినపుడు నమస్కారంతో ఇరువురూ పలకరించుకున్న విషయం తెల్సిందే. తర్వాత ద్వైపాక్షి చర్చలు జరిపాక ఆయనతో కలిసి మెలానీ ‘హలో  ఫ్రమ్‌ ది మెలోడీ టీమ్‌’ అంటూ ఒక సెల్ఫీ వీడియోను తీసుకున్నారు. ఈ వీడియోను శనివారం ఆమె ‘ఎక్స్‌’లో షేర్‌చేయడంతో అది తెగ వైరల్‌ అయింది.

 

 

 ‘భారత్‌–ఇటలీ స్నేహబంధం శాశ్వతంగా కొనసాగాలి’ అని ఆ వీడియోను మోదీ మళ్లీ షేర్‌ చేశారు. గతేడాది డిసెంబర్‌లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌ వేదికగా జరిగిన ‘కాప్‌28’ సదస్సు సందర్భంగా మెలోనీ, మోదీ తీసుకున్న సెల్ఫీ ఆనాడూ తెగ వైరల్‌ అయిన విషయం విదితమే.

 

 

 

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement