Giorgia Meloni
-
జీ-20: మోదీ మెలోని భేటీ...
రియో డీ జెనీరో: బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో జరుగుతున్న జీ-20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంతోపాటు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చించారు.సమావేశం అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో ఆయన పలు ఫోటోలను పంచుకుంటూ ఇలా రాశారు.. రియో డీ జెనీరో జీ- 20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని జార్జియా మెలోనిని కలవడం చాలా ఆనందంగా ఉంది. మా చర్చలో ఇరు దేశాల రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతికత తదితర అంశాలలో సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. దీనితో పాటు భారత్, ఇటలీ మధ్య స్నేహం గురించి కూడా చర్చించా మన్నారు. #WATCH | Prime Minister Narendra Modi and Italian Prime Minister Giorgia Meloni hold bilateral meeting on the sidelines of the 19th G-20 summit, Rio de Janeiro, Brazil(Source - DD News) pic.twitter.com/mVjOKkuJ4O— ANI (@ANI) November 18, 2024జీ-20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్‌తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు ఇండోనేషియా, పోర్చుగల్ నేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, రక్షణ వంటి రంగాల్లో ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధాని మోదీ చర్చించారు.Glad to have met Prime Minister Giorgia Meloni on the sidelines of the Rio de Janeiro G20 Summit. Our talks centred around deepening ties in defence, security, trade and technology. We also talked about how to boost cooperation in culture, education and other such areas.… pic.twitter.com/BOUbBMeEov— Narendra Modi (@narendramodi) November 18, 2024భారత్-ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరింపజేస్తామని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ట్విట్టర్లో ఆయన ఇలా పేర్కొన్నారు. ‘ఇండియా-ఇండోనేషియా: 75 సంవత్సరాల స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నాయి. జీ 20 బ్రెజిల్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటోతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు’ అని తెలిపారు.ఇది కూడా చదవండి: భారత్ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం -
ఇటలీ ప్రధానితో డేటింగ్? స్పందించిన మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇటీవల వీరు ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. ఇద్దరు వారు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్న ఫొటోలు చక్కర్లు కొడుతుండటంతో నెట్టింట్లో రూమర్లు గుప్పుమన్నాయి. ఇద్దరూ డేటింగ్లో ఉన్నట్లు పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఓ నెటిజన్ స్పందిస్తూ ‘వీరు డేట్‌కు వెళ్తారని అనుకుంటున్నారా?’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో మస్క్ తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. తమ మధ్య డేటింగ్ జరగడం లేదంటూ ఆయన పోస్టు చేశారు.Do you think They’ll date? 🤣 pic.twitter.com/XXs1U45kjb— Tesla Owners Silicon Valley (@teslaownersSV) September 24, 2024కాగా మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో.. అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డును మస్క్ మెలోనీకి అందజేశారు. మస్క్ ఆమెకు పురస్కారాన్ని అందజేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇటలీ ప్రధానికి అవార్డును అందజేయడం గర్వంగా భావిస్తున్నట్లు మస్క్ అన్నారు. కనిపించే అందం కన్నా..ఆమె మనసు మరింత అందమైందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నాయకుల గురించి కొన్ని పదాలను ఎప్పుడూ చెప్పలేం. కానీ, మెలోనీ అలా కాదని, ఆమె నిజాయతీ గల విశ్వసనీయమైన వ్యక్తిగా ప్రశంసించారు. -
ఇటలీ ప్రధాని పొడవుపై కామెంట్స్.. జర్నలిస్టుకు జరిమానా
రోమ్: ఇటలీలో మహిళా జర్నలిస్టు గిలియా కోర్టిస్‌కు కోర్టు రూ.4.5లక్షల(5వేల యూరోలు) జరిమానా విధించింది. ప్రధాని జార్జియా మెలోని పొడవుపై మూడేళ్ల క్రితం ఎక్స్(ట్విటర్)లో కోర్టిస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మెలోని కోర్టులో దావా వేశారు. ఈ దావాపై విచారణ పూర్తి చేసిన కోర్టు జర్నలిస్టు కోర్టిస్‌కు ఫైన్ వేసింది. ఫైన్ మొత్తాన్ని మెలోనికి చెల్లించాలని ఆదేశించింది. తనకు జరిమానా విధించడంపై కోర్టిస్ స్పందించారు. ఇటీవలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో ఉందని వ్యాఖ్యానించారు. స్వతంత్ర జర్నలిస్టులకు ఇటలీలో కష్టకాలం కొనసాగుతోందన్నారు. కోర్టు ద్వారా వచ్చే మొత్తాన్ని మెలోని చారిటీ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేస్తారని ఆమె న్యాయవాది తెలిపారు. -
Watch: మెలోనీకి విసుగు తెప్పించిన బైడెన్!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురించి వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తున్నాం. అయితే.. ఇటలీ పీఎం మెలోనీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విసుగు తెప్పించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి సంబంధించిన మూమెంట్స్ కొన్ని సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుండడం చూస్తున్నాం. ముఖ్యంగా భారత ప్రధాని మోదీకి, ఆమెకు మధ్య ప్రత్యేకంగా ‘మెలోడీ’(మోదీ+మెలోనీ) మూమెంట్స్ పేరిట ప్రత్యేకంగా వైరల్ అవుతుంటాయి కూడా. అయితే..వాషింగ్టన్లో జరిగే నాటో సదస్సు కోసం వెళ్లిన ఇటలీ ప్రధాని మెలోనీకి, అమెరికా అధ్యక్షుడు బైడెన్ విసుగు తెప్పించారు. మూడో రోజు సదస్సు ప్రారంభం కోసం సభ్యదేశాల ప్రపంచ దేశాల అధినేతలంతా ఎదురు చూస్తున్నారు. ఆ నిరీక్షణ మెలోనీకి చిరాకు తెప్పించినట్లుంది. ఎదురుగా ఉన్న ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో సంభాషిస్తూనే.. అంత ఇంకా ఎంత టైం? అంటూ అన్నారామె. దానికి అధ్యక్షుడు స్టబ్ తన ఫోన్ బయటకు తీసి టైం చూసి ఏదో చెప్పారు. దీంతో ఆమె మరోసారి కళ్లతో సైగ చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. Giorgia #Meloni in top eye-rolling form as leaders at the #NATO summit wait for Stoltenberg and Biden to arrive for the first session today. pic.twitter.com/KVSobO8QNU— Life On Earth (@e_jagat_) July 12, 2024సుమారు 40 నిమిషాలు ఆలస్యంగా బైడెన్, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్‌తో కలిసి వచ్చారు. మొత్తంగా ఉదయం 10గం.లకు ప్రారంభం కావాల్సిన ఆ సదస్సు.. లేట్‌గా ప్రారంభమైంది. అన్నట్లు మెలోనీ-బైడెన్ మధ్య ఈ తరహా వైరల్ ఇన్సిడెంట్లు ఇంతకు ముందు కూడా వచ్చాయి.WHAT IS BIDEN DOING? pic.twitter.com/iY33K2srII— RNC Research (@RNCResearch) June 13, 2024 -
హాట్‌టాపిక్‌గా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ డ్రెస్సింగ్ స్టైల్..!
రోమ్‌లోని గార్మెటెల్లా జన్మించిన జార్జియా ఇటలి తొలి మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు. మహిళల్లో స్ఫూర్తినింపేలా ఆమె కెరీర్ సాగింది. ఆమె పవర్ఫుల్ ప్రధానిగా బాధ్యతల నిర్వర్తించడమే గాక చాకచక్యమైన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడ ఆమె దేశ ప్రధానిగా హుందాగా ఉంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ని సెట్ చేశారు. ప్రధాని అంటే ఇది డ్రెస్సింగ్ స్టైల్ అనేలా ఉంటుంది ఆమె ఆహార్యం..!ప్రపంచవ్యాప్తంగా జార్జియా మెలోని డ్రెస్సింగ్ స్టైల్ హాట్‌టాపిక్‌గా ఉంది. ఆ ధరించే ఫ్యాట్ అంటూ సూట్ ఓ ప్రత్యేకతను ఆకర్షణగా హైలెట్‌గా నిలుస్తాయి. జార్జియా ధరించే అర్మానీ బ్రాండ్ సూట్ ఆమె అధికార దర్పాన్ని చూపించేలా ఉంటాయి. ఒక శక్తిమంతమైన మహిళ అనేలా ఆమె ఆహర్యం కనిపిస్తుంది. మంత్రలతో సమావేశం అయ్యేటప్పుడూ అర్మానీ నల్ల చొక్కా మారిది సూట్‌ని ధరిం చింది. ఆ తర్వాత హ్యాండ్ఓవర్ మీటింగ్ కోసం అర్మానీ బ్రాండ్ ముదురు చొక్కా సూట్‌ని ఎంచుకుంది. వీటితోపాటు మధ్య మధ్యలో నేవీ బ్లూ అర్మానీ కూడా ధరిస్తుంది. చెప్పాలంటే అదొక ఆఫీస్ యూనివఫాంలా ఉండి తన చుట్టు ఉన్నవారిని అలర్ట్ చేసేలా ఉంటుంది జార్జియా ఫ్యాషన్. ఆ డ్రెస్సింగ్ శైలి అధికారులు తమ పనిలో అలర్ట్‌గా వ్యవహరించేలా, వినేలా చెలాయస్తున్నట్లుగా ఉంటుందని చెబుతుంటారు అధికారులు. ఆమె దుస్తులు నుంచి జుట్టు వరకు ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇటాలియన్ ఫ్యాషన్‌కు ఐకాన్‌గా ఉంటారు జార్జియా. ఆమె అర్మానీ సూట్లు మేడ్ ఇన్ ఇటలీ అని చెబుతున్నట్లు కనిపిస్తాయి. రాజకీయనాయకులు డ్రెస్సింగ్ శైలీ విభిన్నంగా ఉంటుదని తెలిసిందే. కానీ ఇక్కడ జార్జియా మాత్రం తప డ్రెస్సింగ్ స్టైల్‌తోనే తన పవర్ ఏంటన్నది చూపిస్తుంది. ఇక జార్జియా కేవలం 15 ఏళ్ల వయసులో ఇటాలియన్ సోషల్ మూవ్మెంట్ యువజన విభాగంలో రిజస్టర్ అయ్యి చురుగ్గా పాల్గొనేది. అంతేగాదు సోషల్ మీడియాలో ఆమె క్లిష్ట పరిస్థితులను అవలీలగా ఎదర్కొనే శక్తిమంతమైన మహిళగా మంచి ఫ్యాన్ ఫోలోయింగ్ ఉది ఆమెకు. (చదవండి: ఒకప్పుడు నాన్న అంటే హడల్..కానీ ఇప్పుడు..!) -
Italian Premier Giorgia Meloni: రష్యా ప్రతిపాదన.. ఓ ఎత్తుగడ
బోర్గో ఎగ్నాజియా(ఇటలీ): సరిగ్గా జీ7 శిఖరాగ్ర భేటీ మొదలైన రోజే షరతులు ఒప్పుకుంటే ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ తక్షణం అమలుచేస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనను ప్రచార ఎత్తుగడగా అని ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ అభివరి్ణంచారు. ఇటలీ సారథ్యంలో ఈ ఏడాది జీ7 భేటీ జరిగాక శనివారం విలేకరుల సమావేశంలో మెలోనీ మాట్లాడారు. ‘‘ కుదిరితే జపాన్, లేదంటే అమెరికా, బ్రిటన్, కెనడాలు సంయుక్తంగా ఉక్రెయిన్‌కు 50 బిలియన్ డాలర్లమేర రుణాలు ఈ ఏడాది చివరికల్లా అందిస్తాయి. యూరప్‌లో స్తంభింపజేసిన రష్యా ఆస్తులను వాడుకుని తద్వారా ఈ రుణాలను చెల్లిస్తాయి. యురోపియన్ యూనియన్ సభ్య దేశాలకు ఈ రుణాలతో ఎలాంటి సంబంధం లేదు. అమెరికా, బ్రిటన్ వంటి జీ7 దేశాలే ఈ రుణ అంశాలను చూసుకుంటాయి’ అని స్పష్టంచేశారు. గాజా స్ట్రిప్‌పై భీకర దాడులతో వేలాది మంది అమాయక పాలస్తీనియన్ల మరణాలకు కారణమైన ఇజ్రాయెల్‌ను జీ7 దేశాలు ఎందుకు శిఖరాగ్ర సదస్సులో తీవ్రంగా మందలించలేదు? అని మీడియా ప్రశ్నించింది. ‘‘ అసలు ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరు అనేది మీరొకసారి గుర్తుచేసుకోండి. హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి 1,200 మందిని పొట్టనపెట్టుకున్నారు. హమాస్ పన్నిన ఉచ్చులో ఇజ్రాయెల్ పడింది’ అని మెలోనీ వ్యాఖ్యానించారు. ‘‘ అక్రమ వలసలకు వ్యతిరేకంగా జీ7 కూటమి స్పందించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆఫ్రికా దేశాలకు నిధుల మంజూరు, పెట్టుబడులు పెంచడం ద్వారా ఆయా దేశాల నుంచి ఐరోపాకు వలసలను తగ్గించవచ్చు’ అని చెప్పారు. ఐరోపా దేశాలకు వలస వస్తున్న ఆఫ్రికా పేదలకు ఇటలీ ముఖద్వారంగా ఉన్న విషయం విదితమే. -
G7 Summit 2024: మరో ‘మెలోడీ’ క్షణం
బరీ(ఇటలీ): జీ7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆతీ్మయ భేటీని ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. మూడు సెకన్ల సెల్ఫీ వీడియోను తీసి ‘ఎక్స్’లో షేర్చేశారు. మెలోనీ, మోదీ పేర్లను కలిపి మెలోడీ అనే కొత్త పదాన్ని సృష్టించి దానికి హ్యాష్‌ట్యాగ్‌ను తగిలించి గతంలోనే ఆమె విస్తృత ట్రెండింగ్ చేసిన విషయం తెల్సిందే. అదే పంథాలో మరోసారి కొత్త వీడియోను తీసి అందరితో పంచుకున్నారు. శుక్రవారం జీ7 శిఖరాగ్ర సదస్సు జరిగిన ఇటలీలోని అపూలియాలో ఉన్న రిసార్ట్ ఇందుకు వేదికైంది. మోదీని మెలోనీ సాదరంగా ఆహా్వనించినపుడు నమస్కారంతో ఇరువురూ పలకరించుకున్న విషయం తెల్సిందే. తర్వాత ద్వైపాక్షి చర్చలు జరిపాక ఆయనతో కలిసి మెలానీ ‘హలో ఫ్రమ్ ది మెలోడీ టీమ్’ అంటూ ఒక సెల్ఫీ వీడియోను తీసుకున్నారు. ఈ వీడియోను శనివారం ఆమె ‘ఎక్స్’లో షేర్చేయడంతో అది తెగ వైరల్ అయింది.PM Narendra Modi and Italy's PM Giorgia Meloni's selfie on the sidelines of the G7 summit, in Italy. pic.twitter.com/wE1ihPHzeq— ANI (@ANI) June 15, 2024 Hi friends, from #Melodi pic.twitter.com/OslCnWlB86— Giorgia Meloni (@GiorgiaMeloni) June 15, 2024 ‘భారత్–ఇటలీ స్నేహబంధం శాశ్వతంగా కొనసాగాలి’ అని ఆ వీడియోను మోదీ మళ్లీ షేర్ చేశారు. గతేడాది డిసెంబర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వేదికగా జరిగిన ‘కాప్28’ సదస్సు సందర్భంగా మెలోనీ, మోదీ తీసుకున్న సెల్ఫీ ఆనాడూ తెగ వైరల్ అయిన విషయం విదితమే.1. #COP28 summit in Dubai.2. #G7 summit in Italy#Melodi #Selfie #G7Italie #G72024 pic.twitter.com/otVV1YGaMh— Rai Sahab 🇮🇳 (@raiparas) June 15, 2024 The Moment we all have been waiting for ☺️☺️😂 pic.twitter.com/5hdahECYMa— Amit Shah (Parody) (@Motabhai012) June 14, 2024 Had a very good meeting with PM @GiorgiaMeloni. Thanked her for inviting India to be a part of the G7 Summit and for the wonderful arrangements. We discussed ways to further cement India-Italy relations in areas like commerce, energy, defence, telecom and more. Our nations will… pic.twitter.com/PAe6sdNRO9— Narendra Modi (@narendramodi) June 14, 2024 -
G7 Summit 2024: మోదీకి మెలోనీ సాదర స్వాగతం
భేటీకి వస్తున్న మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఎదురెళ్లిమరీ సాదర స్వాగతం పలికారు. మోదీ ఆమెకు నమస్కారం చేశారు. తర్వాత ఇద్దరూ పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జీ7 భేటీకి వచి్చన అగ్రనేతలనూ మోదీ కలిశారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్, జోర్డాన్ రాజు అబ్దుల్లా, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తోనూ మోదీ మాట్లాడారు. -
Meloni: డీప్‌ఫేక్ వీడియోలపై దావా వేసిన ఇటలీ ప్రధాని
రోమ్: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని డీప్‌ఫేక్ కంటెంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. స్వయంగా తానే బాధితురాలినంటూ మీడియా ముందుకు వచ్చారామె. అంతేకాదు.. ఆ వీడియోలను అప్లోడ్ చేసిన వ్యక్తులపై లక్ష యూరోలకు పరువు నష్టం దావా వేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పేరిట వీడియోలు అశ్లీల సైట్లలో అప్లోడ్ అయ్యాయి. ఓ పోర్న్‌స్టార్ ముఖానికి మెలోనీ ముఖాన్ని డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి ఆ వీడియోలను అప్లోడ్ చేశారు ఇద్దరు. ఆ వీడియోలను అమెరికాలో గత కొన్ని నెలలుగా కొన్ని లక్షల మంది వీక్షించారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఆమె సత్వరమే స్పందించారు. ఆ ఇద్దరిపై లక్ష యూరోల(మన కరెన్సీలో 90 లక్షల రూపాయల దాకా) పరువు నష్టం దావా వేశారామె. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జులై 2వ తేదీన ఆమె కోర్టుకు హాజరు కానున్నారు. ఇక.. ప్రధాని లాంటి ఉన్నత పదవిలో ఉన్న తానే డీప్‌ఫేక్‌కు వ్యతిరేకంగా ముందుకు వచ్చానని, బాధితులు ముందుకు వచ్చి ధైర్యంగా పోరాడాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఇక ఈ కేసులో నిందితుల నుంచి తీసుకునే పరిహారాన్ని హింసకు గురైన మహిళలకు విరాళంగా మెలోనీ ఇస్తారని ప్రధాని లీగల్ టీం ప్రకటించింది. నిందితులను తండ్రీ కొడుకులుగా(40, 72 ఏళ్లు) గుర్తించిన దర్యాప్తు అధికారులు.. స్మార్ట్ ఫోన్ ద్వారా ఆ వీడియోలను అప్లోడ్ చేసినట్లు నిర్ధారించారు. అయితే.. మెలోనీ ప్రధాని కాకముందే 2022లో ఆ వీడియోలు అప్లోడ్ కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇటలీ చట్టాల ప్రకారం ఇలాంటి పరువు నష్టం దావాలు తీవ్రంగా నేరాలుగా పరిగణించబడ్తాయి. బాధితులకు పరిహారం ఇప్పించడంతో పాటు నిందితులకు జైలు శిక్ష విధిస్తారు కూడా. సంబంధిత వార్త: ఇంటర్నెట్ నిండా ఫేక్ ఫొటోలు, అశ్లీల వీడియోలు! -
ఇస్లాంపై ఇటలీ ప్రధాని వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఇస్లాం మతంపై చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఇస్లాం సంస్కృతి, యూరోపిన్ నాగరికతలోని విలువలు.. హక్కులకు చాలా తేడాలు ఉన్నాయి. అందుకే యూరప్‌లో ఇస్లాంకు చోటు ఉండబోదని అభిప్రాయపడ్డారామె. ఈ సందర్భంలో సౌదీ అరేబియాను, షరియా చట్టాల కఠినతత్వాన్ని ఆమె తప్పుబట్టారు. ఇస్లాం సంస్కృతికి, మా యూరోపియన్ నాగరికతకు చాలా తేడాలున్నాయ్. సౌదీ అరేబియా.. ఇటలీలో పలు చోట్ల ఇస్లామిక్ సెంటర్లకు నిధులు అందిస్తున్నాయి. అది తప్పు. ఆ విషయంలో కూడా నాకు సదాభిప్రాయం లేదు అని అన్నారామె. ఈ సందర్భంగా.. సౌదీ అరేబియాలో పాటిస్తున్న కఠినమైన షరియా చట్టాలను ఆమె తప్పుబట్టారు. 🚨Watch: #GiorgiaMeloni: "I believe... there is a problem of compatibility between Islamic culture and the values and rights of our civilization... Will not allow Sharia law to be implemented in italy.... values of our civilization are different! pic.twitter.com/VGWNix7936 — Geopolitical Kid (@Geopoliticalkid) December 18, 2023 షరియా చట్టాల్లో మతభ్రష్టత్వము, స్వలింగ సంపర్కం వంటి విధానాలు తీవ్రమైన నేరాలని తెలిపారు. షరియా అంటే వ్యభిచారానికి కఠిన శిక్ష విధించడం, స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించడమని తెలిపారు. ఈ విధానాలను ఎక్కడైనా అమలుచేయాలని తెలిపారు. యూరప్‌లోని తమ నాగరికత విలువలకు.. ఇస్లాం విధానాల మధ్య చాలా తేడాలు ఉన్నాయని.. అలా సారూప్యత సమస్య తలెత్తుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, బిలియనీర్ ఎలన్ మ్కాస్‌లు కూడా పాల్గొన్నారు. చదవండి: Mexico: నేరస్తుల చేతికి ప్రభుత్వ డేటా? మెక్సికోలో ఏం జరుగుతోంది? -
మెలోనీ ‘మెలోడీ’కి మోదీ ఫిదా
న్యూఢిల్లీ: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చేసిన ‘మెలోడీ’కి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు నెటిజన్లంతా ఫిదా అయ్యారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానులిద్దరి మధ్య నడిచిన పోస్టులు వైరల్‌గా మారాయి. శుక్రవారం దుబాయ్‌లో కాప్28 సదస్సు సందర్భంగా వారిద్దరూ భేటీ కావడం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీతో తీసుకున్న సెల్ఫీని మెలోనీ శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.‘కాప్28 సదస్సులో మంచి మిత్రులు’అనే క్యాప్షన్‌తో పాటు, తామిద్దరి పేర్లనూ అందంగా కలుపుతూ ‘మెలోడీ’అంటూ హాష్టాగ్ జత చేశారు. దాంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. చూస్తుండగానే దానికి ఏకంగా 2.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీనికి మోదీ కూడా సరదాగా స్పందించారు. ‘మిత్రులతో కలయిక ఎప్పుడూ ఆహ్లాదకరమే’అనే క్యాప్షన్‌తో మెలోనీ సెల్ఫీని రీపోస్ట్ చేశారు. వారి పోస్టులు ఇప్పుడు ఇంటర్నెట్లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. జీ20 నుంచీ ట్రెండింగ్‌లోనే.. నిజానికి ‘మెలోడీ’ హా‹Ùటాగ్ గత నెలలో భారత్ తొలిసారి ఆతిథ్యమిచి్చన జీ20 శిఖరాగ్ర సదస్సు జరిగినప్పటి నుంచీ ఇంటర్నెట్లో వైరలైంది. సోషల్ సైట్లలో తెగ తిరుగుతోంది. ఆ సదస్సు ఆద్యంతం మోదీ, మెలోనీ పరస్పరం స్నేహపూర్వకంగా మెలిగిన తీరు అందరి దృష్టినీ బాగా ఆకర్షించింది. ఆతిథ్య దేశ సారథిగా మిగతా దేశాధినేతలతో పాటు మెలోనీని కూడా మోదీ సాదరంగా సదస్సుకు ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఆమె మోదీతో కరచాలనం చేశారు. కాసేపు ముచ్చటించుకుని ఇరువురూ నవ్వుల్లో మునిగి తేలారు. ఇదే ఒరవడి తాజాగా కాప్28 సదస్సులోనూ కొనసాగింది. -
ప్రియుడికి గుడ్ బై: ఇకపై నాకు సంబంధంలేదు: ఇటలీ ప్రధాని
PM Georgia Meloni Announces Separation ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన విషయాన్ని ప్రకటించారు. తన చిరకాల ప్రియుడు టెలివిజన్ జర్నలిస్ట్ ఆండ్రియా గియాంబ్రూనో నుండి విడిపోతున్నట్లు ఎక్స్ (ట్విటర్(ద్వారా) శుక్రవారం ప్రకటించారు. ఇటీవల ఆండ్రియా చేసిన అభ్యంతర వ్యాఖ్యలే ఈ పరిణామానికి దారితీసినట్టు తెలుస్తోంది. ‘ఆండ్రియా జియాంబ్రూనోతో దాదాపు 10 సంవత్సరాల పాటు కొనసాగిన బంధం ముగిసింది’’ అని ప్రధాని మెలోని వెల్లడించారు. గత కొంతకాలంగా తమదారులు వేరుగా ఉన్నాయి. ఇక ఇపుడు వాటిని చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ ఆమె ట్వీట్ చేశారు. అతనితో కలిసి గడిపిన అద్భుతమైన కాలానికి, ఎదుర్కొన్న ఇబ్బందులకు ఇక స్వస్తి. తన జీవితంలో గినేవ్రా పాపను అందించినందుకు అతనికి కృతజ్ఞతలు అంటూ ఆమె పోస్ట్ చేశారు. అంతేకాదు ఆ ఎపిసోడ్ తర్వాత మెలోని తన భాగస్వామి చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాల్ని చేయవద్దని, భవిష్యత్తులో జియాంబ్రూనో ప్రవర్తనకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం తాను ఇవ్వబోనని ప్రధాని మెలోని తేల్చి చెప్పారు. గత పదేళ్ళుగా సహజీవనం చేస్తున్న మెలోనీ, ఆండ్రియా ఈ దంపతులకు ఏడేళ్ల కుమార్తె ఉంది. కుమార్తె బాధ్యతలను మెలోనీ తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రముఖ టీవీ ఛానెల్ లో వ్యాఖ్యాతగా పని చేస్తున్న ఆండ్రియా మహిళా సహోద్యోగిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిచ్చింది. 2015లో మెలెనీ కనిపించిన ఒక టీవీ షో రచయితగా ఆండ్రియాను కలిసారు. -
అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య ఒప్పందం
మిలన్: ఆఫ్రికా దేశాల నుడి ఐరోపా దేశాలకు అక్రమంగా వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆర్ధికంగా వెనుకబడిన ఆఫ్రికా దేశాల నుండి వలసదారులు పొట్టకూటి కోసం పడవల మీద ప్రయాణించి ఇటలీ పరిసర ఐరోపా దేశాలకు వలస రావడం పరిపాటిగా మారింది. ఇదే క్రమంలోనే ఇటీవల కొన్ని పడవలు సముద్ర మధ్యలో బోల్తాపడి ఎందరో వలసదారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐరోపా - ట్యునీషియా ఈ ఒప్పందానికి తెరతీశారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. ఆదివారం రోమ్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించగా ఐరోపా దేశాల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా వలసదారులు అక్రమంగా చొరబడకుండా వారికి చట్టబద్ధమైన ప్రవేశం కల్పించడంపైనా, ఆయా దేశాల్లో ఉపాధి కల్పించే విషయంపైనా చర్చలు సాగాయి. ఐరోపా దేశాలు-ట్యునీషియా ఒప్పంద సమావేశంలో మొత్తం 27 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సరిహద్దు భద్రత పటిష్టం చేసి వలసలను తగ్గించడమే అజెండాగా సమావేశంలో లిబియా, సిప్రస్, యూఏఈ, ట్యునీషియా దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అత్యధిక వలసదారులు ఈ దేశాల నుండే వస్తున్నారని, ఇకపై ఈ దేశాల నుండి అక్రమ వలసలు లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు యూఏఈ అక్రమ వలసల నియంత్రణ కోసం పాటుపడే సంస్థలకు 100 మిలియన్ డాలర్లు సాయమందించనున్నట్లు ప్రకటించింది. ఇదే వేదికగా ఆఫ్రికా ఉత్తర దేశాలకు ఆర్ధిక ఊతాన్నిచ్చేనందుకు 27 దేశాల వారు కలిపి 1.1 బిలియన్ డాలర్లు కూడగట్టడానికి సంకల్పించారు. ఈ సందర్బంగా ఇటలీ ప్రధాని మెలోని మాట్లాడుతూ.. ఐరోపా దేశాలకు అక్రమంగా వచ్చే వలసదారుల వలన క్రిమినల్ సామ్రాజ్యం విస్తరించడం తప్ప మరో ప్రయోజనం లేదన్నారు. వారు వలసదారులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పి డబ్బులు సంపాదించుకుంటున్నారని అన్నారు. మనం కఠినంగా ఉంటే క్రిమినల్స్ కు చెక్ పెట్టి వలసారులను ఆర్ధిక ప్రగతికి దోహద పడవచ్చని తెలిపారు. ఇది కూడా చదవండి: అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్ -
చరిత్రలో తొలిసారి.. ఇటలీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మహిళ
రోమ్: ఇటలీ చరిత్రలోనే తొలిసారి ఓ మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రైట్ వింగ్‌కు చెందిన బ్రదర్స్ ఆఫ్ ఇటీలీ పార్టీ అధ్యక్షురాలు జియార్జియా మెలోని(45) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఫలితంగా అత్యంత అరుదైన ఘనత సాధించారు. ప్రధాని అయ్యాక మెలోని ఫైర్ బ్రాండ్‌గా ముందుకుసాగుతారని అంతా భావిస్తున్నారు. ఇటలీ అంతర్జాతీయ సంబంధాలు, వలసదారుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. అలాగే దేశ అప్పులను తగ్గించేందుకు స్థిరమైన బడ్జెట్‌ను ప్రవేశపెడాతరని అనుకుంటున్నారు. సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మెలోని సారథ్యంలోని బ్రథర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ మొత్తం 400 స్థానాలకు 118 స్థానాలు గెలుచుకుంది. అయితే ఇతరుల మద్దతుతో 237 సీట్ల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మెలోని ఇప్పటికే కేబినెట్‌ను కూడా ప్రకటించారు. చదవండి: ‘రిషి సునాక్.. ప్రధాని ఛాన్స్ నాకివ్వు!’ -
చరిత్రలోనే తొలిసారి.. ఇటలీ ప్రధానిగా ఓ మహిళ.. ఎవరీ జార్జియా మెలోని?
జార్జియా మెలోని(45).. ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా అవతరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి ప్రధానిగా ఆమె చరిత్ర పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నారు. అంతేగాక ఇటలీ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన పూర్తి అతివాద ప్రభుత్వం కూడా ఇదే. బ్రదర్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అతివాద జార్జియా మెలోని ఇటీవల(ఆదివారం) జరిగిన ఎన్నికల్లో మారియో డ్రాఘీపై భారీ మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో కేవలం 4 శాతం మాత్రమే ఓట్లు సాధించిన మెలోనీ పార్టీ ఈసారి 25 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది. ఆమె నేతృత్వంలోని కూటమి 43 శాతానికి పైగా ఓట్లను గెలుచుకుంది. ప్రధానిగా గెలిచిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాము అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్తామని, ఎవరినీ మోసం చేయమని తెలిపారు.ఈ నెలాఖరులోగా ప్రధాని పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది Meet Giorgia Meloni, Italy's first female Prime Minister. pic.twitter.com/RHMYYS1rPn — Rishi Bagree (@rishibagree) September 27, 2022 ఎవరీ జర్జియా మెలోని.. జార్జియా గ్రాబ్టెల్లాలోని ఓ కార్మిక కుటుంబంలో జన్మించారు. ఆమె పుట్టిన వెంటనే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో మెలోని తన తల్లి వద్దే పెరిగింది. 15 ఏళ్ల వయసులో ఫాసిస్టు నియంత బెనిటో ముస్సోలినీ మద్దతుదారులు స్థాపించిన ‘ఇటాలియన్ సోషల్ మూవ్మెంట్’ యూత్ విభాగంలో చేరారు. 1990లో నేషనల్ అలయెన్స్ (ఏఎన్)లో ఎంఎస్ఐ భాగమైంది. ఆ తర్వాత మాజీ ప్రధాని సిల్వియో బెర్లస్కోనీ స్థాపించిన ప్రధాన కన్జర్వేటివ్ గ్రూపులో విలీనమైంది. చదవండి: క్వీన్ ఎలిజబెత్ హ్యాండ్‌బ్యాగ్ వెనక ఇంత రహస్యముందా? ‘బ్రదర్ ఆఫ్ ఇటలీ’ స్థాపన 2012లో మెలోని ఏఎన్లోని ఇతర సభ్యులు అందులో నుంచి బయటకు వచ్చి ‘బ్రదర్ ఆఫ్ ఇటలీ’ పార్టీని స్థాపించారు. ఇటలీ జాతీయ గీతంలోని తొలి పంక్తులనే ఈ పార్టీకి పేరుగా పెట్టారు. ఓ ఇంటర్వ్యూలో మెలోని మాట్లాడుతూ.. తన పార్టీని యూఎస్ రిపబ్లికన్ పార్టీ, బ్రిటన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీతో పోల్చారు. తన పార్టీ దేశభక్తికి, కుటుంబ సంప్రదాయ విలువలకు ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు. 21 ఏళ్లకే రాజకీయాల్లోకి మెలోని తన 21 ఏళ్ల వయసులోనే అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పోటి చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించారు. 2008 బెర్లుస్కోనీ ప్రభుత్వంలో ఆమె యూత్ పోర్ట్‌ఫోలియో మంత్రిగా పనిచేశారు. అప్పటికి ఆమె వయసు 31 ఏళ్లు. అతిచిన్న వయసులో ఆ ఘనత సాధించిన మహిళగా మెలోని రికార్డులకెక్కారు. 2019లో మెలోని ‘నేను జార్జియా, నేను మహిళను, నేను తల్లిని, నేను ఇటాలియన్‌ని, నేను క్రిస్టియన్. నా నుంచి వీటిని వేరుచేయలేరు’ అంటూ చేసిన ప్రసంగం ఆమె మద్దతుదారులను ఉత్సాహపరిచింది. ఎల్జీబీటీకి వ్యతిరేకం జూన్‌లో ఇచ్చిన మరో ప్రసంగంలో ఆమె సంప్రదాయ కుటుంబాలకు మద్దతు ఇస్తానని ప్రకటించారు. లైంగిక గుర్తింపు, ఎల్జీబీటీ లాబీని తీవ్రంగా వ్యతిరేకించారు. లింగపరమైన గుర్తింపునకు ఓకే కానీ, జెండర్ భావజాలానికి తాను వ్యతిరేకమని చెప్పారు. సురక్షితమైన సరిహద్దులకు ఓకే కానీ.. ఇస్లాం హింసకు వ్యతిరేకమని తెలిపారు. మన ప్రజల కోసం పనిచేయాలని కానీ అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల కోసం కాదని జార్జియా స్పష్టం చేశారు. స్పానిష్ రైటిస్ట్ పార్టీ వోక్స్ మద్దతుదారులను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఐరోపా పార్లమెంట్‌లోని మితవాద యూరోపియన్ కన్జర్వేటివ్, రిఫార్మిస్ట్ గ్రూప్‌కు మెలోని అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇందులో ఆమె బ్రదర్స్ ఆఫ్ ఇటలీ, పోలాండ్ నేషనలిస్ట్ లా అండ్ జస్టిస్ పార్టీ, స్పెయిన్ రైట్ వోక్స్ మితవాద స్వీడన్ డెమొక్రాట్లు ఉన్నాయి.. దేశ రాజకీయాల్లో మార్పులు కాగా ఇటలీ ప్రధానిగా మెలోని బాధ్యతలు స్వీకరిస్తే ఆ దేశ రాజకీయాల్లో కీల మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనికి కారణం ఆమె ఎల్జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ఆమె తన గళాన్ని వినిపించడం. అలాగే ఇటలీ నౌకాదళం లిబియా సముద్ర మార్గాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక దేశంలోని ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా తరచూ హెచ్చరికలు జారీ చేశారు. చదవండి: NASA's DART Mission: నాసా ప్రయోగం దిగ్విజయం.. గ్రహశకలాల్ని ఇక దారి మళ్లించగలం!