ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఇస్లాం మతంపై చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఇస్లాం సంస్కృతి, యూరోపిన్ నాగరికతలోని విలువలు.. హక్కులకు చాలా తేడాలు ఉన్నాయి. అందుకే యూరప్‌లో ఇస్లాంకు చోటు ఉండబోదని అభిప్రాయపడ్డారామె. ఈ సందర్భంలో సౌదీ అరేబియాను, షరియా చట్టాల కఠినతత్వాన్ని ఆమె తప్పుబట్టారు.
ఇస్లాం సంస్కృతికి, మా యూరోపియన్ నాగరికతకు చాలా తేడాలున్నాయ్. సౌదీ అరేబియా.. ఇటలీలో పలు చోట్ల ఇస్లామిక్ సెంటర్లకు నిధులు అందిస్తున్నాయి. అది తప్పు. ఆ విషయంలో కూడా నాకు సదాభిప్రాయం లేదు అని అన్నారామె. ఈ సందర్భంగా.. సౌదీ అరేబియాలో పాటిస్తున్న కఠినమైన షరియా చట్టాలను ఆమె తప్పుబట్టారు.
🚨Watch: #GiorgiaMeloni: "I believe... there is a problem of compatibility between Islamic culture and the values and rights of our civilization... Will not allow Sharia law to be implemented in italy.... values of our civilization are different! pic.twitter.com/VGWNix7936
— Geopolitical Kid (@Geopoliticalkid) December 18, 2023
షరియా చట్టాల్లో మతభ్రష్టత్వము, స్వలింగ సంపర్కం వంటి విధానాలు తీవ్రమైన నేరాలని తెలిపారు. షరియా అంటే వ్యభిచారానికి కఠిన శిక్ష విధించడం, స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించడమని తెలిపారు. ఈ విధానాలను ఎక్కడైనా అమలుచేయాలని తెలిపారు. యూరప్‌లోని తమ నాగరికత విలువలకు.. ఇస్లాం విధానాల మధ్య చాలా తేడాలు ఉన్నాయని.. అలా సారూప్యత సమస్య తలెత్తుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, బిలియనీర్ ఎలన్ మ్కాస్‌లు కూడా పాల్గొన్నారు.
చదవండి: Mexico: నేరస్తుల చేతికి ప్రభుత్వ డేటా? మెక్సికోలో ఏం జరుగుతోంది?
Comments
Please login to add a commentAdd a comment