రోమ్: ఇటలీలో మహిళా జర్నలిస్టు గిలియా కోర్టిస్‌కు కోర్టు రూ.4.5లక్షల(5వేల యూరోలు) జరిమానా విధించింది. ప్రధాని జార్జియా మెలోని పొడవుపై మూడేళ్ల క్రితం ఎక్స్(ట్విటర్)లో కోర్టిస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీనిపై మెలోని కోర్టులో దావా వేశారు. ఈ దావాపై విచారణ పూర్తి చేసిన కోర్టు జర్నలిస్టు కోర్టిస్‌కు ఫైన్ వేసింది. ఫైన్ మొత్తాన్ని మెలోనికి చెల్లించాలని ఆదేశించింది. తనకు జరిమానా విధించడంపై కోర్టిస్ స్పందించారు.
ఇటీవలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో ఉందని వ్యాఖ్యానించారు. స్వతంత్ర జర్నలిస్టులకు ఇటలీలో కష్టకాలం కొనసాగుతోందన్నారు. కోర్టు ద్వారా వచ్చే మొత్తాన్ని మెలోని చారిటీ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేస్తారని ఆమె న్యాయవాది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment