జీ-20: మోదీ మెలోని భేటీ... | PM Modi and Giorgia Meloni hold Bilateral Meeting on Sidelines of G20 Summit | Sakshi
Sakshi News home page

జీ-20: మోదీ మెలోని భేటీ...

Published Tue, Nov 19 2024 8:47 AM | Last Updated on Tue, Nov 19 2024 9:01 AM

PM Modi and Giorgia Meloni hold Bilateral Meeting on Sidelines of G20 Summit

రియో డీ జెనీరో: బ్రెజిల్‌లోని రియో ​​డీ జెనీరోలో జరుగుతున్న జీ-20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంతోపాటు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చించారు.

సమావేశం అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌లో ఆయన పలు ఫోటోలను పంచుకుంటూ ఇలా రాశారు.. రియో డీ జెనీరో జీ- 20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని జార్జియా మెలోనిని కలవడం చాలా ఆనందంగా ఉంది. మా చర్చలో ఇరు దేశాల రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతికత తదితర అంశాలలో సంబంధాలను  బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. దీనితో పాటు భారత్, ఇటలీ మధ్య స్నేహం గురించి కూడా చర్చించా మన్నారు.
 

జీ-20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్‌తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు ఇండోనేషియా, పోర్చుగల్‌ నేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, రక్షణ వంటి రంగాల్లో  ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధాని మోదీ చర్చించారు.

భారత్-ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరింపజేస్తామని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ట్విట్టర్‌లో ఆయన ఇలా పేర్కొన్నారు. ‘ఇండియా-ఇండోనేషియా: 75 సంవత్సరాల స్నేహపూర్వక సంబంధాలను  కొనసాగిస్తున్నాయి. జీ 20 బ్రెజిల్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటోతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు’ అని తెలిపారు.

ఇది కూడా చదవండి: భారత్‌ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement