G 20 Summit
-
జీ-20: మోదీ మెలోని భేటీ...
రియో డీ జెనీరో: బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో జరుగుతున్న జీ-20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంతోపాటు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చించారు.సమావేశం అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో ఆయన పలు ఫోటోలను పంచుకుంటూ ఇలా రాశారు.. రియో డీ జెనీరో జీ- 20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని జార్జియా మెలోనిని కలవడం చాలా ఆనందంగా ఉంది. మా చర్చలో ఇరు దేశాల రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతికత తదితర అంశాలలో సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. దీనితో పాటు భారత్, ఇటలీ మధ్య స్నేహం గురించి కూడా చర్చించా మన్నారు. #WATCH | Prime Minister Narendra Modi and Italian Prime Minister Giorgia Meloni hold bilateral meeting on the sidelines of the 19th G-20 summit, Rio de Janeiro, Brazil(Source - DD News) pic.twitter.com/mVjOKkuJ4O— ANI (@ANI) November 18, 2024జీ-20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్‌తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు ఇండోనేషియా, పోర్చుగల్ నేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, రక్షణ వంటి రంగాల్లో ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధాని మోదీ చర్చించారు.Glad to have met Prime Minister Giorgia Meloni on the sidelines of the Rio de Janeiro G20 Summit. Our talks centred around deepening ties in defence, security, trade and technology. We also talked about how to boost cooperation in culture, education and other such areas.… pic.twitter.com/BOUbBMeEov— Narendra Modi (@narendramodi) November 18, 2024భారత్-ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరింపజేస్తామని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ట్విట్టర్లో ఆయన ఇలా పేర్కొన్నారు. ‘ఇండియా-ఇండోనేషియా: 75 సంవత్సరాల స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నాయి. జీ 20 బ్రెజిల్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటోతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు’ అని తెలిపారు.ఇది కూడా చదవండి: భారత్ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం -
మూడు దేశాల టూర్‌కు బయల్దేరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ శనివారం(నవంబర్ 16) సాయంత్రం మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో జీ 20 సదస్సు జరిగే బ్రెజిల్‌తో పాటు భాగంగా నైజీరియా,గ్వామ్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు.ఐదు రోజులపాటు మోదీ మూడు దేశాల్లో పర్యటిస్తారు. భారత్‌తో ఆయా దేశాల బంధాన్ని బలపరిచే దిశగా ప్రధాని ఈ పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా మోదీ పలువురు దేశాధినేతలతో పాటు ఆయా దేశాల్లోని ప్రవాస భారతీయులను కలుస్తారు. ఇదీ చదవండి: రాహుల్‌గాంధీ బ్యాగులు తనిఖీ చేసిన ‘ఈసీ’ -
అందరి చూపు బైడెన్ వైపే..ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు
-
జీ20 సదస్సుకు జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్
బీజింగ్: భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మంకంగా నిర్వహిస్తోన్న జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడి స్థానంలో ఆ దేశ ప్రీమియర్ హాజరు కానున్నట్లు తెలిపింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సదస్సుకు హాజరు కావడం లేదని మొదట రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించగా ఆయనను అనుసరిస్తూ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ స్పోక్స్‌పర్సన్ మావో నింగ్ కీలక ప్రకటన చేశారు. మావో నింగ్ మాట్లాడుతో.. భారత్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న 18వ జీ20 సమావేశాలకు చైనా ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవుతారని అన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో రెండు దేశాల దౌత్యపరమైన సంబంధాల విషయమై ఏకాభిప్రాయాన్ని సాధించి అభివృద్ధికి దోహద పడతామని అన్నారు. రెండు దేశాల సంబంధాలకు చైనా ఎప్పుడూ అధిక ప్రాధాన్యతనిస్తూనే వచ్చిందని దీనికి సంబంధించి జరిగిన అనేక సమావేశాల్లో కూడా తాము చురుగ్గా పాల్గొన్నామని గుర్తు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశాల్లో సమాఖ్య దేశాల ఐక్యతను బలోపేతం చేసి ప్రపంచ ఆర్ధికాభివృద్ధికి మిగతా దేశాలతో కలిసి పనిచేసే విషయమై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ చైనా అభిప్రాయాలను వెల్లడిస్తారని తెలిపారు మావో నింగ్. స్థిరమైన ప్రపంచ ఆర్ధిక పునరుద్ధరణ, సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించేందుకు మిగతా జీ20 భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని ఈ సమావేశాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఇది కూడా చదవండి: ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ కాంతిలో ఉల్కపాతం -
సాంస్కృతిక సంబంధాల మెరుగుతోనే ఆర్థిక వృద్ధి
(వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడటం ద్వారా దేశాల మధ్య ఆర్థిక, దౌత్యపరమైన పురోభివృద్ధి సాధ్యమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. భారత్ నుంచి ఎన్నో విలువైన పురాతన విగ్రహాలు, వెలకట్టలేని అతి పురాతన విగ్రహాలు దేశం దాటి వెళ్లాయని, వాటిని తిరిగి భారత్‌కు తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వారణాసిలో జరుగుతున్న జీ20 సాంస్కృతిక శాఖల మంత్రులు, అధికారుల సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2014 ముందు ప్రభుత్వాలు విదేశాల నుంచి కేవలం 13 పురాతన విగ్రహాలను దేశానికి తిరిగి రప్పిస్తే, మోదీ అధికారంలోకి వచ్చాక దాదాపు 400 పురాతన విగ్రహాలను రప్పించి ఆయా రాష్ట్రాలకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వనిత దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొన్నాయని, అందరి సమ్మతితో శనివారం వారణాసి జీ20 డిక్లరేషన్ ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం అధికారుల స్థాయిలో జరిగిన చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందన్నారు. విలేకరుల సమావేశంలో ఆ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ, ఆ శాఖ కార్యదర్శి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. యూత్ టూరిజం క్లబ్స్దే కీలకపాత్ర విద్యార్థుల్లో వివేకం పెంపొందించేందుకు యూత్ టూరిజం క్లబ్స్ కీలకపాత్ర పోషిస్తాయని కిషన్‌రెడ్డి అన్నారు. ‘సాంస్కృతిక విరాసత్ స్పర్ధ –2023’లో భాగంగా యువ టూరిజం క్లబ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత భవిష్యత్తు అంతా విద్యార్థులదేనని, అందుకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అందిస్తున్న కృషి ఎనలేనిదన్నారు. 99 శాతం విద్యపై దృష్టి పెడితే.. కనీసం ఒక్క శాతమైనా పాఠ్యేతర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. స్పోర్ట్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో గానీ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో గానీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సేవా తత్పరతతోపాటు దేశం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతోనే ‘యువ టూరిజం క్లబ్స్’ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతీ ఇంట్లో కుటుంబసమేతంగా పర్యాటక క్షేత్రాలను సందర్శించాలంటే.. ఎక్కడకు వెళ్లాలో నిర్ణయించేది ఆ కుటుంబంలోని చిన్నారులు, విద్యార్థులేనని అన్నారు. అందుకే వారికి దేశంలోని, సమీపంలోని పర్యాటక క్షేత్రాలపై, ప్లాస్టిక్ రహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
హైదరాబాద్‌లో జీ–20 వ్యవసాయ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన జీ–20 వ్యవసాయ మంత్రుల సమావేశాలు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈ మేరకు హెచ్ఐసీసీలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశాల్లో జీ–20లో భాగమైన ఇండోనేసియా, బ్రెజిల్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యూఎస్ఏ, ఇండియాలతోపాటు సదస్సుకు ఆహ్వానించిన 10 దేశాలు బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, ఒమన్, నైజీరియా, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియత్నాంల వ్యవసాయ మంత్రులు.. ఇక్రిశాట్, ఓఈసీడీ, ఏడీబీ, ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ బ్యాంకు తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. మొత్తంగా 30 దేశాలకు చెందిన 180 మంది ప్రతినిధులు రానున్నట్టు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. నాలుగో వ్యవసాయ సదస్సు జీ–20 దేశాల సదస్సులో భాగంగా ఇప్పటివరకు మూడు వ్యవసాయ సంబంధిత సమావేశాలు జరిగాయి. ఇప్పుడు నాలుగో వ్యవసాయ సదస్సు హైదరాబాద్‌లో జరుగుతోంది. దీనిలో మంత్రులు పాల్గొననున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి తమ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను వివరిస్తారు. ఆధునిక, వినూత్న సాంకేతిక ఆవిష్కరణల ప్రదర్శన ఉండనుంది. -
జమ్ము కశ్మీరులో విజయవంతంగా ముగిసిన G20 సదస్సు
-
G 20 Summit 2023 Vizag: సాగర తీరాన జీ–20 సదస్సు సందడి.. ప్రతినిధులతో సీఎం జగన్ (ఫొటోలు)
-
G20 summit: చైనా డుమ్మా ఖాయమైనట్లే!
భారత్ ఈ ఏడాదికి అధ్యక్షత వహిస్తూ.. ఆతిథ్యం ఇవ్వబోతున్న జీ20 సదస్సుకు చైనా డుమ్మా కొట్టడం దాదాపుగా ఖాయమైనట్లేనని సంకేతాలు అందుతున్నాయి. ఈ మేరకు ఆదివారం ఇటానగర్(అరుణాచల్ ప్రదేశ్)లో జరిగిన జీ20 సన్నాహాక సమావేశాలకు చైనా దూరంగా ఉండిపోయింది. జీ 20 సదస్సులో భాగంగా.. దేశంలోని యాభై ప్రధాన నగరాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా.. రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇన్షియేటివ్, గ్యాదరింగ్ థీమ్‌తో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆదివారం ఇటానగర్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించింది. అత్యంత గోప్యంగా భావించే ఈ సమావేశానికి.. మీడియా కవరేజ్‌ను అనుమతించలేదు. కాకపోతే ప్రతినిధుల బృందం అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీని, ఇటానగర్‌లో ఉన్న బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా కొందరు ఫొటోలు తీశారు. తద్వారా చైనా నుంచి ప్రతినిధులెవరూ హాజరు కాలేదన్న విషయం బయటకు వచ్చింది. దీంతో.. సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా జరగబోయే జీ-20 సదస్సుకు చైనా హాజరు కావడంపై అనుమానాలు కలుగుతున్నాయి. నిరసనల్లో భాగంగానే చైనా ఇలా సమావేశానికి దూరంగా ఉండిపోయిందా? లేదంటే మరేయితర కారణం ఉందా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పరిణామంపై విదేశాంగ శాఖగానీ, చైనా గానీ స్పందించలేదు కూడా. ఇదిలా ఉంటే.. అరుణాచల్ ప్రదేశ్‌ను టిబెట్‌లో అంతర్భాగమంటూ చైనా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ మాత్రం చైనా వాదనను తోసిపుచ్చి.. అది తమ దేశంలోని అంతర్భాగమేనని స్పష్టం చేస్తోంది. మరోవైపు వాస్తవ నియంత్రణ రేఖ వెంట ఇరు దేశాల మధ్య ఆమధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కూడా. ఇదీ చదవండి: అమెరికాలోని గురుద్వార్‌లో కాల్పులు -
ఖరీదైన కారులో వెళ్లి పూలకుండీల దొంగతనం.. వీడియో వైరల్..
ఖరీదైన లగ్జరీ కారు. పైగా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్. వీళ్ల బిల్డప్ చూస్తే చాలా రిచ్ అనుకుంటారు. కానీ వీళ్లు చేసిన పని తెలిస్తే మాత్రం ఇదేం బుద్ధిరా నాయనా అంటారు. ఔను మరి.. వీళ్లు పట్టపగలు కారులో వెళ్లి రోడ్డుపై ఉన్న పూలకుండీలను ఎంచక్కా డిక్కీలో ఎక్కించుకుని వెళ్లిపోయారు. గురుగ్రాంలోని శంకర్ చౌక్‌లో ఈ ఘటన జరిగింది. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు పూలకుండీలను ఎత్తుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఇద్దరి తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. జీ-20 కార్యక్రమం కోసం శంకర్ చౌక్‌లో ప్రత్యేకంగా ఈ పూలను అలంకరించినట్లు తెలుస్తోంది. రంగురంగుల పుష్పాలు, రకరకాల పూల కుండీలతో ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వీటిని చూసిన ఈ ఇద్దరికీ ఏమనిపించిందో ఏమో తెలియదు గానీ.. ఎంచక్కా కారులో వచ్చి పూలకుండీలను దర్జాగా ఎత్తుకెళ్లారు. #G20 के सौंदर्यीकरण के "चिंदी चोर" गुरुग्राम में शंकर चौक पर #Kia कार सवार ने दिनदहाड़े पौधों के गमले उड़ाए ।।@gurgaonpolice @DC_Gurugram @cmohry @MunCorpGurugram @OfficialGMDA @TrafficGGM pic.twitter.com/aeJ2Sbejon — Raj Verma-Journalist🇮🇳 (@RajKVerma4) February 27, 2023 అయితే వీరిద్దరు నిజంగా దొంగలేనా? పూలకుండీలను చోరీ చేశారా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. వీరిని గుర్తించేందుకు నెటిజన్లు ప్రయత్నించారు. కారు నంబర్‌ప్లేట్‌ను కనిపెట్టి పోలీసులకు క్లూ అందించేందుకు తమ వంతు కృషి చేశారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగితో బీజేపీ నేత డిష్యూం డిష్యూం.. వీడియో వైరల్.. -
ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. జీ-20 అఖిలపక్ష సమావేశంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. కాగా, భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ20 దేశాల సదస్సును విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 5న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇటీవల ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న గ్రూప్ ఆఫ్ ట్వంటీ (జీ 20) దేశాలకు 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు భారత్ నేతృత్వం వహించనుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి వివిధ నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. భారతదేశం నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశాలను విజయవంతం చేయడం ద్వారా దేశ సత్తాను ప్రపంచానికి తెలియచేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. -
బయో ఇంధన కూటమికి డిమాండ్ చేస్తాం: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సోలార్ కూటమి విజయం సాధించిన మాదిరే.. అంతర్జాతీయంగా బయో ఇంధన కూటమి కోసం ప్రయత్నిస్తామని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇందుకు జీ20 నాయకత్వాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. కేపీఎంజీ ఎన్రిచ్ 2022 సదస్సులో భాగంగా మంత్రి మాట్లాడారు. బయో ఇంధనాలను వినియోగిస్తున్న బ్రెజిల్ నుంచి అమెరికా తదితర దేశాలతో కూడిన కూటమి.. బయో ఇంధనాలకు సంబంధించి ప్రమాణాలను రూపొందించడం, ఇంజన్లు, టెక్నాలజీ సహకారం దిశగా కృషి చేస్తుందన్నారు. భారత్ ఇప్పటికే పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ లక్ష్యాన్ని 2030కు బదులు 2024–25 నాటికే సాధించాలని నిర్ణయించినట్టు తెలిపారు. జీ20లో భాగంగా ఉన్న అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండోనేషియా, చైనా తదిత దేశాలు బయో ఇంధనాలను తయారు చేస్తుండడం గమనార్హం. (అమెజాన్‌కు ఏమైంది? వారంలో మూడో బిజినెస్‌కు బై..బై..!) -
భారత్ కు G-20 అధ్యక్ష బాధ్యతలు
-
అమెరికా ఆధిపత్యానికి రోజులు దగ్గర పడ్డాయ్
రష్యా ఆక్రమణకు వ్యతిరేకంగా.. అమెరికా దాని మిత్రపక్షాలు కేవలం గ్లోబల్ ఆధిత్యం కోసమే ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని మండిపడ్డారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అంతేకాదు.. ఉక్రెయిన్‌పై అణుదాడికి పాల్పడతారనే ఊహాగానాలపైనా ఆయన ఒక స్పష్టత కూడా ఇచ్చారు. తైవాన్ విషయంలో చైనా వాదనకు మద్దతు పలికిన పుతిన్.. అమెరికా విషయంలో సౌదీ అరేబియా వ్యవహరిస్తున్న తీరుపైనా ప్రశంసలు గుప్పించారు. పాశ్చాత్య ఉదారవాదానికి వ్యతిరేకంగా రష్యాను సంప్రదాయవాద విలువల విజేతగా చూపించాలన్నదే తన అభిమతమని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారాయన. రష్యా ఆక్రమణ నుంచి ఉక్రెయిన్ పోరాడేందుకు అమెరికా, దాని మిత్రపక్షాలు ఆయుధాల సరఫరా చేస్తున్నాయి. ఇందులో వాళ్ల తీరు గ్లోబల్ వైడ్‌గా ఆధిపత్యం చెలాయించాలన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని గురువారం జరిగిన ఓ వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. అంతేకాదు.. ఉక్రెయిన్ను పిచ్చుకతో పోల్చిన ఆయన.. ఆ దేశంపై అణు ఆయుధాల ప్రయోగ ఉద్దేశమే రష్యాకు లేదని స్పష్టం చేశారు. రష్యా, పాశ్చాత్య దేశాలకు శత్రు దేశం కాదని ప్రకటించిన పుతిన్.. అమెరికా ఆధిపత్యం ముగింపు దశకు చేరుకుందని పేర్కొన్నారు. అంతేకాదు.. తైవాన్ వ్యవహారంలో చైనా ప్రజాస్వామిక్యంగా వ్యవహరిస్తోందని.. అమెరికా జోక్యంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని మండిపడ్డారాయన. జాతి ప్రయోజనాల కోసం అగ్రరాజ్యం నుంచి విమర్శలు ఎదురైనా పట్టించకోవడంపై సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు పుతిన్. ఇక.. వచ్చే నెల ఇండోనేషియాలో జరగబోయే జీ-20 సదస్సుకు హాజరు అయ్యే అవశం ఇంకా పరిశీలనలోనే ఉందని.. బహుశా వెళ్లవచ్చనే సంకేతాలు అందించారు. ఇదిలా ఉంటే.. మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ సహా క్రెమ్లిన్ అధికారులంతా ఉక్రెయిన్ విషయంలో అణు యుద్ధం తప్పదనే దిశగా సంకేతాలు, హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా జోరుగా చర్చ నడిచింది. మరోవైపు ఉక్రెయిన్ డర్టీ బాంబు ప్రయోగం ఆరోపణలతో రష్యా.. అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఈ తరుణంలో అణు దాడి ఉండబోదని పేర్కొన్న పుతిన్.. అగ్రరాజ్యం సహా యూరప్ దేశాలను ఏకీపడేయడం గమనార్హం. ఇదీ చదవండి: అణ్వాయుధాలు ప్రయోగించం: పుతిన్ -
సౌదీ పర్యటన; బీజేపీ ఎంపీ స్వీయ నిర్బంధం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు కరోనా భయాల నేపథ్యంలో స్వీయ నిర్బంధం విధించుకున్నారు. భారత్ తరపున జీ20 సదస్సు ప్రతినిధిగా ఉన్న ఆయన ఇటీవల సౌదీ అరేబియా వెళ్లొచ్చారు. వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్ అని వచ్చినప్పటికీ 14 రోజులపాటు హోమ్ క్వారైంటన్లో ఉండనున్నారు. దీంతో ఆయన పార్లమెంట్ సమావేశాలకు దూరం కానున్నారు. ఈమేరకు ఆయన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. ‘రాబోయే జీ20 సదస్సుకు సంబంధించి సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్‌లో మార్చి 10న నిర్వహించిన సమావేశానికి హాజరయ్యాను. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నా. రిజల్ట్ నెగటివ్‌గానే వచ్చింది. అయినప్పటికీ నియంత్రణ చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్లో ఉండాలని నిర్ణయించుకున్నా. ఐసోలేషన్ సమయం ముగిసేవరకూ పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేను. పార్లమెంటు సభ్యులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నా’అని సురేష్ ప్రభు లేఖలో పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. కేరళలోని ఓ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి మరళీధరన్ సైతం ఇంట్లోనే స్వీయ నిర్బంధం విధించుకున్న సంగతి తెలిసిందే. ఆయన సందర్శించిన ఆస్పత్రి వైద్యుడొకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. -
ఉగ్రవాదంపై కఠిన చర్యలు
ఒసాకా: ఉగ్రవాద ముఠాలకు ఆర్థిక సాయం అందకుండా చూడటంతోపాటు, తమ భూభాగాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రపంచ దేశాలన్నీ కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలు శుక్రవారం కోరాయి. ఉగ్రవాదంపై తాము పోరాడతామనీ, అక్రమ నిధుల ప్రవాహాన్ని అడ్డుకుంటామని ఆ ఐదు దేశాలు ప్రతినబూనాయి. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ–20 దేశాల సదస్సు కోసం అక్కడకు వచ్చిన బ్రిక్స్ దేశాధినేతలు ప్రత్యేకంగా ఓ అనధికారిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల అధ్యక్షులు వరుసగా షీ జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్, సిరిల్ రమఫోసా, జాయిర్ బోల్సొనారోలు ఆ భేటీలో పాల్గొన్నారు. నల్లధనం, అవినీతి, అక్రమ ఆర్థిక నిధుల ప్రవాహంపై కూడా కలిసికట్టుగా, ఒకరికొకరు సహకరించుకుంటూ పోరాడాలని ఐదు దేశాల అధినేతలు నిర్ణయించారు. ఆర్థిక వ్యవస్థలకూ నష్టమే: మోదీ మానవాళికి ఉగ్రవాదమే అతిపెద్ద ముప్పు అని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఒసాకాలో జరిగిన బ్రిక్స్ దేశాధినేతల భేటీలో అన్నారు. ఉగ్రవాదం అనే భయంకర భావజాలం వల్ల అమాయకుల ప్రాణాలు పోవడమే కాకుండా దేశాల ఆర్థికాభివృద్ధి, సామాజిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)ను తక్షణం బలోపేతం చేయడం, రక్షణాత్మక వర్తక విధానాలను గట్టిగా వ్యతిరేకించడం, అందరికీ ఇంధన భద్రత కల్పించడం, ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవడం అనేవి ప్రపంచ దేశాల తక్షణ కర్తవ్యాలని మోదీ పేర్కొన్నారు. పుతిన్, జిన్‌పింగ్‌లతో త్రైపాక్షిక భేటీ ఒసాకాలోనే పుతిన్, జిన్‌పింగ్‌లతో కలిసి మోదీ ప్రత్యేకంగా ఆర్ఐసీ (రష్యా, ఇండియా, చైనా) సమావేశంలోనూ పాల్గొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు సహా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. ‘ప్రపంచపు ఆర్థిక, రాజకీ, భద్రత పరిస్థితులపై మనం చర్చించడం ముఖ్యం’ అని మోదీ పేర్కొన్నారు. -
అమెరికా ఒత్తిళ్లు
తమ సరుకులపై భారత్ సుంకాలు టారిఫ్‌లు సమ్మతం కాదని, వాటిని ఉపసంహరించుకు తీరాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీటర్ ద్వారా హెచ్చరించిన 24 గంటల తర్వాత జపాన్‌లోని ఒసాకా నగరంలో జీ–20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఎటూ మోదీతో ఒసాకాలో భేటీ ఉంది కదా అని ఆయన మౌనంగా ఉండలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇద్దరు అధినేతలూ సమావేశమయ్యారు. మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడాన్ని, ఆయన పార్టీ సాధించిన విజయాన్ని ట్రంప్ కీర్తించారు. ఇలాంటివి దౌత్య మర్యాదల్లో భాగం. కీలకమైన, సమస్యాత్మక అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే వైఖరిని ఇరుపక్షాలూ ఎంతవరకూ ప్రదర్శి స్తాయన్నది ముఖ్యం. సమస్యల విషయంలో ట్రంప్ తీరుతెన్నులెలా ఉంటాయో ఎవరికీ తెలియ నిది కాదు. తన అభిప్రాయాలను సవరించుకోవడానికీ, అవతలి పక్షం మనోభావాలు తెలుసు కోవడానికీ ఆయన పెద్దగా ప్రయత్నించరు. మోదీ అఖండ విజయం సాధించి రెండో దఫా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నారు. కానీ ట్రంప్‌కు వచ్చే ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలున్నాయి. అందులో విజయం సాధించడం ఆయనకు ముఖ్యం. అంతకన్నా ముందు అందుకు పార్టీ అభ్యర్థిత్వాన్ని సాధించడం ప్రధానం. 2016నాటి అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా అక్కడి ఓటర్లకు ఆయన చాలా వాగ్దానాలిచ్చారు. విదేశాలకు తరలిపోతున్న ఉపాధిని సరిహద్దులు దాటనీయనని ఊరించారు. వలసల వల్ల అట్టడుగు శ్వేతజాతీయుల ఉద్యోగాలు గల్లంతవుతున్నాయి గనుక... కఠిన నిబంధనలతో వలసలను అరికడతామని చెప్పారు. మన ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లు విధిస్తున్న దేశాలు అమెరికా ‘మెతకవైఖరి’ని ఆసరా చేసుకుని ఇక్కడ తక్కువ టారిఫ్‌లతో లాభాలు గడిస్తున్నాయని ఆరోపించారు. వాణిజ్యపరంగా ఉన్న ఈ అసమతుల్యతను సరిచేస్తానని వాగ్దానం చేశారు. ‘అమెరికాను గొప్పగా చేద్దామ’న్న నినాదంతో క్రితంసారి విజయం సాధించిన ట్రంప్ ఇప్పుడు ‘మరోసారి అమెరికాను గొప్పగా చేద్దామ’ంటూ నినదిస్తున్నారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గాలంటే ఇవన్నీ చేసినట్టు కనబడటమే కాదు...వాటి ఫలితం కళ్లముందుండేలా చూడాలి. అందుకే ప్రపంచ దేశాలను ఆయన వివిధ మార్గాల్లో బెదిరిస్తున్నారు. హార్లీ డేవిడ్సన్ బైక్‌లపై విధిస్తున్న వందశాతం సుంకాలు తగ్గించమని మన దేశంపై ఒత్తిళ్తు తెచ్చారు. వాటిని సగానికి తగ్గించినా ఆయనకు సంతృప్తి లేదు. మరింతగా తగ్గించాలంటున్నారు. మనకు అయిదు దశాబ్దాలుగా అమలు చేస్తున్న సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ(జీఎస్పీ) వెసు లుబాటును ఈనెల మొదటివారం నుంచి రద్దుచేశారు. దానికి ప్రతిగా మన దేశం కూడా 28 రకాల అమెరికా సరుకులపై అదనపు సుంకాలు విధిస్తే వాటిని ఉపసంహరించుకోమని ఒత్తిడి చేస్తున్నారు. అలాగే 5జీ స్పెక్ట్రమ్ విషయంలో తమకు దీటైన పోటీనిస్తున్న చైనా టెలికాం సంస్థ హువీని కాక తమ సంస్థలనే ఆదరించాలంటున్నారు. హెచ్–1బీ వీసా జారీ నిబంధనలను కఠినం చేయడం మన దేశానికి తలనొప్పిగా మారింది. ఈ–కామర్స్ విషయంలో మన ప్రభుత్వ వైఖరిని ట్రంప్ తప్పుపడుతున్నారు. ఇరాన్‌తో అమెరికాకూ, మరో ఆరు దేశాలకూ 2015లో కుదిరిన అణు ఒప్పందంనుంచి బయటికొచ్చి ఏ దేశమూ దాంతో లావాదేవీలు సాగించకూడదని ఆంక్షలు విధించారు. కొన్ని ఇతర దేశాలతోపాటు మనకు కూడా గత నెల 2 వరకూ ఇరాన్ చమురు కొను గోలుకు అనుమతినిచ్చారు. ట్రంప్ అభీష్టం మేరకు మన దేశం ఇరాన్ నుంచి చమురు కొను గోలును నిలిపివేసింది. ఇలా ప్రపంచ దేశాలన్నిటిపైనా ఒత్తిళ్లు తెచ్చి ఏదోరకంగా దేశానికి లబ్ధి చేకూర్చి వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలవాలని ఆయన తాపత్రయపడుతున్నారు. అయితే అందుకోసం ఆయన అనుసరించే విధానాల వల్ల వేరే దేశాలతోపాటు మనకూ సమస్యలు ఎదురవుతున్నాయి. రష్యా రూపొందించిన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ ఎస్–400 కొనుగోలుకు ఆ దేశంతో మనం కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా గుర్రుగా ఉంది. దాన్ని రద్దు చేసుకోవాలని కోరుతోంది. తమ మాట వినకపోతే మన దేశంపై ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తోంది. ఇలా ఇరు దేశాలమధ్యా ఉన్న ఈ విభేదాలు ఒకటి రెండు సమావేశాలతో ముగిసిపోవు. అందుకు సమయం పడుతుంది. వాణిజ్య రంగంలో తలెత్తిన విభేదాలపై ఇంతవరకూ ఇరు దేశాల వాణిజ్యమంత్రుల మధ్యా చర్చలు జరగలేదు. రక్షణ కొనుగోళ్లు, భద్రత వగైరా అంశాలపై పాంపియో మన విదేశాంగ మంత్రితో చర్చించిన అంశాలు మోదీ, ట్రంప్ సమావేశంలో కూడా చర్చకొచ్చే ఉంటాయి. రష్యాతో ఎస్–440 ఒప్పందం కుదుర్చుకున్న కారణంతో మన దేశాన్ని దూరం చేసుకోవాలనుకుంటే అధికంగా నష్టపోయేది అమెరికాయే. వందలకోట్ల విలువ చేసే అపాచే సైనిక హెలికాప్టర్లు, శత్రువును వేటాడటానికి ఉపయోగపడే గార్డియన్ ద్రోన్ల కొను గోలుకు ఇప్పటికే మన దేశం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. పైగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మన సహకారాన్ని తీసుకుంటేనే చైనాకు చెక్ పెట్టడం సాధ్యమవుతుందన్న సంగతి దానికి తెలుసు. వీటిద్వారా నెరవేరే ప్రయోజనాలను వదులుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదు. కనుక ఒక స్థాయికి మించి అది ఒత్తిళ్లు తీసుకురావడం అసాధ్యం. జీ–20 సంస్థలో సభ్యత్వమున్న బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, భారత్, దక్షిణాఫ్రికా) దేశాలు శుక్రవారం విడిగా సమావేశమయ్యాక విడు దల చేసిన సంయుక్త ప్రకటనను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలకు విరుద్ధంగా ఆత్మరక్షణ విధానాలు అవలంబించే ధోరణులను ఆ సమా వేశం నిరసించింది. వాణిజ్యమనేది పారదర్శకంగా, వివక్షారహితంగాఉండాలని కోరింది. ఇదంతా అమెరికాను ఉద్దేశించిందే. ఏతావాతా వర్తమాన పరిస్థితుల్లో ఏ దేశమూ మరో దేశాన్ని శాసించ లేదు. ఆచితూచి అడుగులేస్తే మన ప్రయోజనాలను పరిరక్షించుకోవడం అసాధ్యం కాదు. -
జపాన్‌లో అగ్ర నేతల భేటీ
-
ట్రంప్‌తో మోదీ చర్చించిన అంశాలివే..
టోక్యో : జపాన్‌లో జరుగుతున్న జీ 20 సదస్సు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. ఇరాన్ వ్యవహారాలు, 5జీ నెట్వర్క్, వాణిజ్య, రక్షణ రంగాలకు సంబంధించి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రక్షణ సహకారం పెంపుదల, శాంతి సుస్ధిరతలను కాపాడటం, వర్తక లోటును అధిగమించడం సహా పలు అంశాలపై ఇరువురు నేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారని వైట్ హౌస్ ట్వీట్ చేసింది. మరోవైపు ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై చర్చ జరిగిందని భారత్ వాణిజ్యపరంగా తీసుకుంటున్న చర్యలను ట్రంప్ స్వాగతించారని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారు. ట్రంప్, మోదీల భేటీ ఫలవంతంగా సాగిందని అన్నారు. 5జీ సాంకేతికతను సమర్ధంగా వినియోగించుకునేందుకు భారత్ చేపడుతున్న చర్యలను వివరించగా ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారని, ఈ అంశంలో అమెరికా-భారత్ కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. ప్రధాని మోదీ రెండోసారి అధికార పగ్గాలు అందుకున్న అనంతరం అమెరికా అధ్యక్షుడితో భేటీ కావడం ఇదే తొలిసారి. లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మళ్లీ అధికార పీఠం అధిష్టించిన మోదీకి ట్రంప్ అభినందనలు తెలిపారు. ఇంతటి భారీ విజయానికి మీరు అర్హులని ప్రధాని మోదీని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా ట్రంప్, మోదీ పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారని పీఎంఓ ట్వీట్ చేసింది. -
జీ-20లో వందేమాతరం, జైశ్రీరామ్ నినాదాలు
-
జీ-20లో వందేమాతరం, జైశ్రీరామ్ నినాదాలు
టోక్యో : జీ-20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. కోబ్‌లోని హ్యోగో ప్రిఫెక్చర్ గెస్ట్ హౌస్‌లో జీ-20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ఆ ప్రాంగణం అంతా హోరెత్తిపోయింది. మోదీ ప్రసంగం అనంతరం వందేమాతరం, జై శ్రీరామ్ నినాదాలతో సభ మారుమోగింది. ఈ సదస్సులో మోదీ మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచం దేశాలతో సత్సంబంధాలు పెంచుకోవడంలో జపాన్ పాత్ర కీలకమన్నారు. జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేతో పలు అంతర్జాతీయ వేదికలపై తను పాల్గొనే విధానం తమ మధ్య ఉన్న స్నేహబంధం స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు. తాను 2014లో భారత దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత షింజో అబెతో దౌత్యపరమై సంబంధాలను ఇరు దేశాల ప్రజల్లోకి తీసుకువెళ్లామన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి భారతదేశ ప్రముఖులు స్వామి వివేకనందా, మహాత్మ గాంధీ, సుభాష్ చంద్రబోస్ తదితరులు జపాన్‌తో మంచి సంబంధాలను కొనసాగించారని వెల్లడించారు. రెండో ప్రపంచ ముద్దం అనంతరం భారత్, జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెరిగాయన్నారు. జీ-20 సదస్సు కు స్వాగతించిన తీరుకు మోదీ.. షింజో అబే, జీ-20 సదస్సు చైర్మన్‌కు అభినందనలు తెలిపారు. ఇరువురు దేశాధినేతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, విపత్తు నిర్వహణ, ఆర్థిక నేరస్థులపై సుదీర్ఘంగా చర్చించారు. అక్టోబర్‌లో జరిగే జపాన్ చక్రవర్తి నరుహిటో పట్టాభిషేక వేడుకకి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరువుతారని పేర్కొన్నారు. నరేంద్రమోదీ రెండోసారి ప్రధానిగా ఎనికైన తర్వాత జపాన్ ప్రధానితో సమావేశమవడం ఇదే తొలిసారి. -
‘మరేం పర్లేదు.. బాగానే ఉన్నాను’
బెర్లిన్ : జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మార్కెల్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గురువారం జపాన్‌లోని ఒసాకాలో ప్రారంభమైన జీ 20 సమావేశాల్లో పాల్గొనేందుకు ఏంజెలా సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విమానం ఎక్కడానికి కొన్ని గంటల ముందు జర్మనీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఈ వేడుకలో అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టెర్ పక్కన నిల్చున్న ఏంజెలా వణకడం ప్రారంభించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆమె దగ్గరికి వచ్చి మంచినీళ్లు అందించబోయారు. కానీ ఏంజెలా సున్నితంగా వారి సహాయాన్ని నిరాకరించారు. కాసేపటి తర్వాత తనకు తానుగా నడుచుకుంటూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. కాగా గత మంగళవారం కూడా ఏంజెలా ఇలాగే అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఛాన్స్లర్ ఆరోగ్య విషయంలో ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో.. ఏంజెలా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆమె కార్యాలయ వర్గాలు తెలిపాయి. జీ 20 సమావేశంలో ఏంజెలా పాల్గొంటారని.. ఆమె పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశాయి. కాగా ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళగా ఏంజెలా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అదే విధంగా యూరోపియన్ దేశాల్లో అత్యంత ప్రభావశీల నేతగా ఖ్యాతికెక్కిన ఏంజెలా.. 2021 వరకూ రాజకీయాల నుంచి వైదొలగుతానని ప్రకటించిన విషయం విదితమే. వయసు పైబడటమే కాకుండా ఆరోగ్యం కూడా సహకరించనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. ఇక వచ్చే నెలలో ఆమె 65వ పడిలో అడుగుపెట్టనున్నారు. -
జీ 20 భేటీ : జపాన్ ప్రధానితో మోదీ చర్చలు
టోక్యో : జీ 20 సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జపాన్ ప్రధాని షింజో అబేతో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ప్రపంచ వాణిజ్యం, వాతావరణ మార్పులు సహా ద్వైపాక్షిక అంశాలపైనా చర్చించారు. ఇండో-జపాన్ సంబంధాలపైనా విస్తృతంగా సంప్రదింపులు జరిపారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టుతో పాటు వారణాసిలో నిర్మించే కన్వెన్షన్ సెంటర్‌పైనా వారిరువురూ చర్చించారని అధికారులు వెల్లడించారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని పీఎంఓ ట్వీట్ చేసింది. మరోవైపు భారత్, అమెరికా, జపాన్ దేశాధినేతల త్రైపాక్షిక చర్చల సందర్భంగా ఇరువురు నేతలు శుక్రవారం మరోసారి సమావేశం కానున్నారు. కాగా అంతకుముందు జీ 20 సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం జపాన్ చేరుకున్నారు. జీ 20 భేటీ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సహా పలు దేశాధినేతలతో సంప్రదింపులు జరపనున్నారు. అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన పలు అంశాలతో పాటు భారత్ దృక్కోణాన్ని ఈ చర్చల సందర్భంగా అంతర్జాతీయ నేతల ముందు ప్రధాని మోదీ వెల్లడిస్తారని పీఎంఓ ట్వీట్ పేర్కొంది -
జీ 20 భేటీ : జపాన్ చేరుకున్న ప్రధాని
టోక్యో : జీ 20 సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం జపాన్ చేరుకున్నారు. జీ 20 భేటీ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సహా పలు దేశాధినేతలతో సంప్రదింపులు జరపనున్నారు. ప్రధాని మోదీ బధవారం రాత్రి భారత్ నుంచి బయలుదేరి నేటి ఉదయం ఒసాకా చేరుకున్నారు. ‘ఉదయాన్నే ఒసాకా చేరుకున్నాం..జీ20 సదస్సుతో పాటు రానున్న రెండు రోజుల్లో ద్వైపాక్షిక, దౌత్య చర్చల కోసం వేచిచూస్తున్నా’మని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. కాగా, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన పలు అంశాలతో పాటు భారత్ దృక్కోణాన్ని ఈ చర్చల సందర్భంగా ప్రధాని అంతర్జాతీయ నేతల ముందు వెల్లడిస్తామని పీఎంఓ ట్వీట్ పేర్కొంది. జపాన్‌లో భారత సంతతికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారని పీఎంఓ తెలిపింది. ఈనెల 28-29న ఒసాకాలో జరిగే జీ20 భేటీ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఆరవ జీ20 సదస్సు కావడం గమనార్హం. -
జీ20 సదస్సుకు ప్రధాని మోదీ
బ్యూనస్ ఎయిర్స్: జీ–20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ఎయిర్స్ చేరుకున్నారు. నేడు, రేపు జరిగే ఈ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్సహా పలువురు నేతలు పాల్గొననున్నారు. వచ్చే పదేళ్లలో ప్రపంచం ఎదుర్కోనున్న సవాళ్లు, వాటిని ఎదుర్కొనే మార్గాలపై వివిధ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలతో కలిసి మోదీ చర్చించనున్నారు. వచ్చే 48 గంటల్లో ఆయన జీ–20 సమ్మిట్‌తోపాటు ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చల్లో మోదీ పాలుపంచుకుంటారని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ పేర్కొన్నారు.