
ఖరీదైన లగ్జరీ కారు. పైగా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్. వీళ్ల బిల్డప్ చూస్తే చాలా రిచ్ అనుకుంటారు. కానీ వీళ్లు చేసిన పని తెలిస్తే మాత్రం ఇదేం బుద్ధిరా నాయనా అంటారు. ఔను మరి.. వీళ్లు పట్టపగలు కారులో వెళ్లి రోడ్డుపై ఉన్న పూలకుండీలను ఎంచక్కా డిక్కీలో ఎక్కించుకుని వెళ్లిపోయారు.
గురుగ్రాంలోని శంకర్ చౌక్‌లో ఈ ఘటన జరిగింది. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు పూలకుండీలను ఎత్తుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఇద్దరి తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
జీ-20 కార్యక్రమం కోసం శంకర్ చౌక్‌లో ప్రత్యేకంగా ఈ పూలను అలంకరించినట్లు తెలుస్తోంది. రంగురంగుల పుష్పాలు, రకరకాల పూల కుండీలతో ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వీటిని చూసిన ఈ ఇద్దరికీ ఏమనిపించిందో ఏమో తెలియదు గానీ.. ఎంచక్కా కారులో వచ్చి పూలకుండీలను దర్జాగా ఎత్తుకెళ్లారు.
#G20 के सौंदर्यीकरण के "चिंदी चोर"
— Raj Verma-Journalist🇮🇳 (@RajKVerma4) February 27, 2023
गुरुग्राम में शंकर चौक पर #Kia कार सवार ने दिनदहाड़े पौधों के गमले उड़ाए ।।@gurgaonpolice @DC_Gurugram @cmohry @MunCorpGurugram @OfficialGMDA @TrafficGGM pic.twitter.com/aeJ2Sbejon
అయితే వీరిద్దరు నిజంగా దొంగలేనా? పూలకుండీలను చోరీ చేశారా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. వీరిని గుర్తించేందుకు నెటిజన్లు ప్రయత్నించారు. కారు నంబర్‌ప్లేట్‌ను కనిపెట్టి పోలీసులకు క్లూ అందించేందుకు తమ వంతు కృషి చేశారు.
చదవండి: ప్రభుత్వ ఉద్యోగితో బీజేపీ నేత డిష్యూం డిష్యూం.. వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment