కొందరు వ్యక్తులు నిస్వార్థంగా జనం కోసం చేసే పనులు విశేషంగా నిలుస్తాయి. ప్రకృతిమీద, మానవాళి మీద వారి ప్రేమను చెప్పకనే చెబుతాయి. రాజస్థాన్‌కు చెందిన ముఖేష్ అలాంటి కోవలోకే వస్తారు. బోగన్ విల్లా మొక్కలతో అందమైన షెల్టర్ తయారుచేసిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బెటర్ ఇండియా షేర్ చేసిన ఈ వీడియో పారిశ్రామికవేత్త ఆనంద్‌మహీంద్రను కూడా ఆకట్టుకుంది.
రాజస్తాన్‌లోని భిల్ వారాకుచెందిన ముఖేష్ జనానికి చక్కటి గిఫ్ట్ అందించాడు. 12 సంవత్సరాలకు పైగా కష్టపడి బోగన్‌విల్లా మొక్కలతో షెల్టర్‌ను అందంగా తీర్చి దిద్దాడు. గులాబీ రంగులో విరబూసిన ఈ పువ్వులు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. ఇది అందంగా ఉండటమే కాదు అందరికీ నీడను పంచుతోంది.
Over 12 years, Mukesh turned a Bougainvillea shrub into, literally, a pavilion, giving shade to all travellers.
— anand mahindra (@anandmahindra) March 28, 2024
One individual, passionately built a thing of beauty.
Sustainability may eventually come from the collection of such individual deeds…pic.twitter.com/l2XhN918UY
Comments
Please login to add a commentAdd a comment