Gurugram Man Seen Doing Push-Ups On Top Of Moving Car, Video Viral - Sakshi
Sakshi News home page

Video: మద్యం మత్తులో హల్‌చల్‌.. కారుపై పుష్‌అప్స్‌ చేస్తూ..

Published Wed, May 31 2023 9:14 AM | Last Updated on Wed, May 31 2023 9:33 AM

Gurugram Man Seen Doing Push-Ups On Top Of Moving Car Video Viral - Sakshi

గురుగ్రామ్‌: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా, చలాన్లు విధించినా కొందరు మాత్రం మారడం లేదు. చట్టాలు తమకు వర్తించవన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రన్నింగ్‌లో ఉన్న కారుపై పుష్‌అప్స్‌ చేశాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. హర్యానా నెంబర్‌ ప్లేట్‌తో(HR72F6692) ఉన్న ఆల్టో కారు రాత్రి హైవేపై వెళ్తోంది. ఈ క్రమంలో కారులో నలుగురు వ్యక్తులు ఫుల్‌గా మద్యం సేవించి డ్యాన్స్‌లు, పుష్‌అప్స్‌ చేస్తూ హల్‌చల్‌ చేశారు. అయితే, కారు రన్నింగ్‌లో ఉండగా ఓ వ్యక్తి కారుపై పుష్‌ అప్స్‌ చేయడం స్టార్ట్‌ చేశాడు. ఈ సందర్భంగా కారులో ఉన్న అతడి ఫ్రెండ్స్‌ ఎంకరేజ్‌ చేశారు. దీంతో, సదరు వ్యక్తి మరింత రెచ్చిపోయాడు. అనంతరం, చేతిలో మద్యం బాటిల్‌ తాగుతూ కేకలు వేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో గురుగ్రామ్‌ పోలీసుల దృష్టికి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు రూ.6,500 జరిమానా విధించారు. 

అనంతరం, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారున స్వాధీనం చేసుకుని వాహనం యజమాని లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ట్రాఫిక్ డీసీపీ వీరేందర్ విజ్ తెలిపారు.

ఇది కూడా చదవండి: అందాల పోటీల్లో భార్య ఓటమి.. కోపంతో భర్త ఏం చేశాడంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement