push-ups
-
శారీరక శిక్షణే అతిపెద్ద 'గేమ్ ఛేంజర్'.!: విశ్వనాథన్ ఆనంద్
మాజీ చెస్ గ్రాండ్‌మాస్టర్(Chess Grandmaster) విశ్వనాథన్ ఆనంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. 16వ ఏటనే జాతీయ ఛాంపియన్ షిప్ చేజిక్కించుకున్నాడు. 1987లో ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆ నేపథ్యంలోనే ఆయన గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించారు. ఎంతటి విజేతకైనా అప్పడప్పడూ ఓటమి పలకరిస్తుంటుంది. తడబాటులు తప్పవు. అలాంటప్పుడూ ఒక్కసారిగా ఎదురయ్యే నైరాశ్యం నుంచి బయటపడేందుకు తన భార్య ఇచ్చిన పనిష్మెంట్ తనకు ఉపకరిస్తుందని అంటున్నారు ఆనంద్. అది తనకు పెద్ద 'గేమ్ ఛేంజర్' అని చెబుతున్నారు. అదేంటో తెలుసుకుందామా..!విశ్వనాథన్ ఆనంద్(Vishwanathan Anand) అర్జెంటీనాలో ఒక టోర్నమెంట్ (Tournament)లో ఆడుతున్నాడు. ఆ టోర్నమెంట్ గెలిచాడు కానీ ప్రారంభంలో రెండు పరాజయాలను ఎదుర్కొనక తప్పలేదు. అయితే అక్కడ ఆనంద్ చేసినవి చాలా సిల్లీ తప్పులట. దీంతో అతడి భార్య అరుణకు ఆయన మీద పిచ్చకోపం వచ్చి..ఈ రాత్రికి డిన్నర్ కావాలంటే.. ముందు చకచకా 50 పుష్అప్లు(Pushups) చేయండని ఆదేశించిందట. అసలే ఓటమితో భారంగా ఉన్న ఆనంద్ చేసేదేమిలేక మారు మాట్లాడకుండా పుష్అప్లు చేసి తర్వాత డిన్నర్ కానిచ్చారట. ఆ తర్వాత బాడీ అలసిపోవడంతో మంచి నిద్ర పట్టేసిందట. మరుసటి రోజు ఆ ఓటమి తనని శారీరకంగా గానీ మానసికంగా(Mental) డిస్ట్రబ్ చేయలేదట.దీంతో రిఫ్రెష్‌గా కొత్త ఎత్తులతో గేమ్ ఆడి ప్రత్యర్థిని మట్టికరిపించాడట. అందుకే ఆయన శారీరక శిక్షణ అనేది చాలా పెద్ద గేమ్ ఛేంజర్ అని నమ్మకంగా చెబుతున్నారు. నిజానికి అందరూ చదరంగం ఒక మానసిక గేమ్ అని భావిస్తారు కానీ అది తెలియకుండానే ఫిజికల్ గేమ్‌గా మారుతుందని తన భార్య తరచు చెబుతుంటుందని అన్నారు. ఇక్కడ రికార్డులు బ్రేక్‌చేసే క్రీడాకారుడికి తప్పనిసరిగా శారీక బలం తోపాటు, మానసిక దృఢత్వం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఆటల్లో ఓటమి తెలియని ఒత్తిడికి గురయ్యేలా చేసి అలసట తెప్పిస్తుందట. చెప్పాలంటే ఇక నావల్ల కాదనేలా కుంగిపోతారట. అలాంటప్పుడు శారీరక శిక్షణ వారిని ఉత్సాహవంతుడిగా మార్చి విజయాన్ని కైవసం చేసుకునేలా ప్రేరేపిస్తుందని వెల్లడించారు నిపుణులు. ఆ పనే ఇక్కడ ఆనంద్ భార్య అరుణా చేశారు. ఇక్కడ ఆతడి భార్య తన ఆర్థిక లావదేవీలు చూసే మేనేజర్‌గానే కాకుండా వ్యక్తిగతంగా స్ట్రాంగ్ ఉండేలా చేసే శిక్షకురాలిగా సూచనలిచ్చింది. ఫిట్నెస్, ఆరోగ్యం అనేవి మానసిక క్షేమంతో ముగిపడి ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ అరుణ చెప్పిన పుష్ అప్లు ఏకగ్రాతతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మెదడు సహజ స్థితి పెంచేలా ఎండార్ఫిన్లను విడుదల చేసి ఒత్తిడి, ఆందోళనలను నివారిస్తుందని తెలిపారు. తద్వారా ఆయా వ్యక్తుల్లోని ఆత్మవిశ్వాసం పుంజుకుని, మనసును లక్ష్యంపై స్థిరంగా ఉండేలా చేస్తుందట. ప్రయోజనాలు..ఇది ఆటగాళ్లకే ఇంత ప్రయోజనాలందిస్తే..రోజువారీ టెన్షన్లు, ఆందోళనలతో నలిగిపోయే సామాన్యులకు కూడా ఇంకెన్ని ప్రయోజనాలను ఇవ్వగలదో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కోర్ కండరాలను బలోపేతం చేయడమే గాక మొత్తం శరీరం, మనసును బలోపేతం చేసే వ్యాయామం ఇది. అయితే దీనిని సరైన విధంగా చేయాలి. ఇప్పుడే కొత్తగా మొదలుపెడుతున్నవారు.. వ్యాయామ నిపుణుల సలహాలు సంప్రదింపులతో చేయడం మంచిది. View this post on Instagram A post shared by CircleChess (@circlechess) (చదవండి: ముంచుకొస్తున్న హెచ్ఎంపీవీ..నఖ శిఖం పరిశుభ్రంగా ఉందామిలా..!) -
Video: మద్యం మత్తులో హల్చల్.. కారుపై పుష్అప్స్ చేస్తూ..
గురుగ్రామ్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా, చలాన్లు విధించినా కొందరు మాత్రం మారడం లేదు. చట్టాలు తమకు వర్తించవన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రన్నింగ్‌లో ఉన్న కారుపై పుష్అప్స్ చేశాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హర్యానా నెంబర్ ప్లేట్‌తో(HR72F6692) ఉన్న ఆల్టో కారు రాత్రి హైవేపై వెళ్తోంది. ఈ క్రమంలో కారులో నలుగురు వ్యక్తులు ఫుల్‌గా మద్యం సేవించి డ్యాన్స్‌లు, పుష్అప్స్ చేస్తూ హల్చల్ చేశారు. అయితే, కారు రన్నింగ్‌లో ఉండగా ఓ వ్యక్తి కారుపై పుష్ అప్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ సందర్భంగా కారులో ఉన్న అతడి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు. దీంతో, సదరు వ్యక్తి మరింత రెచ్చిపోయాడు. అనంతరం, చేతిలో మద్యం బాటిల్ తాగుతూ కేకలు వేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో గురుగ్రామ్ పోలీసుల దృష్టికి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు రూ.6,500 జరిమానా విధించారు. అనంతరం, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారున స్వాధీనం చేసుకుని వాహనం యజమాని లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ట్రాఫిక్ డీసీపీ వీరేందర్ విజ్ తెలిపారు. pls take action @gurgaonpolice @mlkhattar @DGPHaryana @HTGurgaon @DC_Gurugram @TrafficGGM @dcptrafficggm @Gurgaon_Tweets @Vikas_dayal_9 pic.twitter.com/5xYkTUtfMd — Ravi Potliya (@RaviKan82888324) May 31, 2023 ఇది కూడా చదవండి: అందాల పోటీల్లో భార్య ఓటమి.. కోపంతో భర్త ఏం చేశాడంటే.. -
8 కేజీల వెడ్డింగ్ లెహంగాతో వధువు పుష్ అప్స్.. వీడియో వైరల్
పెళ్లి అంటేనే సందండి. అందంగా రెడీ అవ్వడం, ఫోటోలు దిగడం, సంతోషంగా గడపడం ఇదంతా సర్వసాధారణమే.. అదే వివాహంలో వర్కౌట్స్ చేస్తే ఎలా ఉంటుంది. చాలా కొత్తగా ఉంటుంది కదూ.. సరిగ్గా ఇలాగే తమ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయేలా రొటీన్‌కు భిన్నంగా ఆలోచించింది ఓ జంట. పెళ్లి మండపాన్ని జిమ్‌గా మార్చి, వేదికపైనే వధూవరులిద్దరూ పుషప్స్ చేశారు. పెళ్లి దుస్తుల్లోనే వర్కౌట్స్ చేయడం నెటిజన్లను సర్ప్రైజ్ చేస్తోంది. వరుడు కాస్త నెమ్మదిగా పుష్ అప్స్ చేస్తన్నప్పటికీ వధువు మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తూ వారెవ్వా అనిపించింది. ఇంతకీ కొత్త జంట పేర్లు చెప్పలేదు కదూ.. వధువు అరోరా వరుడు ఆదిత్య మహాజన్.. వీరిద్దరూ ఫిట్నెస్ కోచ్‌లు. చదవండి: వైరల్: అదిరిపోయే స్టెప్పులతో మాధురి దీక్షిత్‌ను దించేసిన బామ్మ ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు గానీ..ఈ వీడియోను వధువు అరోరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ‘కలిసి ఎత్తే జంట చివరికి వివాహంతో ఏకమైంది’ అంటూ షేర్ చేయగా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. దీనిపై స్పందించిన ఓ నెటిజన్.. ఎన్ని సెట్లు, రరేపెటిషన్స్ అని అడగ్గా.. ‘8 కిలోల లెహంగాతో 1సెట్ 10 రెప్స్ లోడ్ చేసిన పుషప్స్’ అని వధువు రిప్లై ఇచ్చింది. దీంతో 8 కిలోల బరువైన వెడ్డింగ్ లెహంగాను ధరించి ఈ విధంగా అందరూ చేయలేరని పెళ్లి కూతురిని నెటిజనులు అభినందిస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి. చదవండి: బుల్లెట్టు బండి: సూపర్.. జూనియర్ సాయి పల్లవిలా.. View this post on Instagram A post shared by Akshita Arora Mahajan | Coach (@fit.arora) -
కారుపైన యువకుడి పుషప్స్.. ఊహించని ట్విస్ట్
‘ఆనందాన్ని ఎవరు కోరుకోరు... కానీ ఎంత మూల్యానికి’ అని థియేటర్లలో, టీవీలలో కనిపించే ప్రకటన గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాంటి ఓ సంఘటనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రన్నింగ్ కారు పైకి ఎక్కి పుషప్స్ చేసిన ఓ వ్యక్తికి యూపీ పోలీసులు ఊహించని ట్విట్స్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఉజ్వల యాదవ్ అనే కుర్రాడు సోలోగా కారు డ్రైవింగ్ చేస్తూ షికారు కెళ్లాడు. రహదారిపైకి రాగానే స్టన్నింగ్ స్టంట్స్ చేద్దామని భావించి డ్రైవ్ చేస్తున్న స్టీరింగ్ వదిలేసి కారు పైకి ఎక్కాడు.. రన్నింగ్‌లో ఉన్న కారుమీదనే పుషప్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 61 వేల మంది వీక్షించడంతోపాటు వందలాది మంది కామెంట్ చేశారు. నెట్టింటా చక్కర్లు కొట్టిన ఈ వీడియో కాస్తా చివరికి ఉత్తర ప్రదేశ్‌లో పోలీసుల కంటికి చిక్కింది. ఇంకేముంది ఉజ్వల్ చేసిన ఘనకార్యానికి పోలీసులు తగిన మూల్యం విధించారు. ‘కొన్ని పుషప్స్ మిమ్మల్ని చట్టం దృష్టిలో పడేస్తాయి. ఎంతో కష్టపడ్డావ్ కదా. నీ కష్టానికి ఇదిగో బహుమతి’ అంటూ అతనికి భారీగానే చలాన్ విధించారు. డ్రైవింగ్ చేస్తూ విన్యాసాలు చేయడం నేరమని. ఇది మీతోపాటు ఇతరులకు హానీ కలిగించవచ్చు అని యూపీ పోలీసులు తమ ట్విటర్లో పేర్కొన్నారు. అలాగే ఇలా ఎవరైన చేస్తే కఠిన చర్యలు తప్పవని ఐపీఎస్ అధికారి అజయ్ కమార్ హెచ్చరించారు. దీంతో పోలీసుల పనితీరుపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక స్టంట్స్‌తో హీరో అవుదామనుకున్న ఉజ్వల్‌కు చివరికి పోలీసులు షాక్ ఇవ్వడంతో ఖంగుతిన్నాడు. అయితే అలా చేసినందుకు క్షమాపణలు కోరుతూ.. మరోసారి రిపీట్ చేయనంటూ చెప్పడం కొసమెరుపు. చదవండి: గాలి మోటార్ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ ఈ అమ్మడుకు భయమే లేదు అసలు..! -
షూటింగ్ క్లోజ్: ఎడారిలో తాప్సీ వర్కవుట్!
'ఝుమ్మంది నాదం' సినిమాతో రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టింది హీరోయిన్ తాప్సీ. ఆ సినిమా మ్యూజికల్ హిట్ అవడంతో తెలుగు, తమిళంలో ఎన్నో అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. వచ్చిన ఛాన్స్‌ను మిస్ చేసుకోకుండా చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు హీరోలతో కలిసి నటించిన ఆమె 'ఛష్మి బద్దూర్'తో బాలీవుడ్‌కి మకాం మార్చింది. తర్వాత పూర్తిగా అక్కడే సెటిలైన ఈ భామ తాజాగా 'రష్మీ రాకెట్' అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. సోమవారం గుజరాత్లో ఈ సినిమా షూటింగ్ పూర్తవగా అక్కడి ఎడారి దారులను భారంగా వీడుతూ ముంబైకి తిరుగు ప్రయాణం అయింది తాప్సీ. (చదవండి: కృష్ణ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా ఇది) ఈ క్రమంలో తెల్లని ఉప్పు ఎడారిగా ప్రసిద్ధి చెందిన రాణ్ ఆఫ్ కచ్‌లో పుషప్స్ చేసిన వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. "ఓ పర్యాటకురాలిగా ఈ అందమైన ప్రదేశంలో ఏదైనా చేయాలనిపించింది. అందుకే పుషప్స్ చేస్తున్నా. మట్టిని తాకిన అనుభూతి చెందాలంటే మీరు కూడా జాకెట్‌ను తీసేయండి, మీలో ప్రవహించే కొత్త బలాన్ని అనుభూతి చెందండి. కొన్ని పుషప్స్ చేశాక నా మొహం వీడియోలో కనిపించడం లేదని అర్థమైంది. కాబట్టి ఏదైనా చేసేముందు అది మీరే అని గుర్తించేలా మీ తల కాస్త తిప్పండి. అయినా ఎన్ని చేసినా ఏం లాభం లేదు అని అర్థమయ్యాక మీ బిస్తరు సర్దుకుని వెళ్లిపోండి. నెక్స్ట్ టైమ్ పుషప్స్ కాకుండా మరేదైనా చేద్దాం" అంటూ చెప్పుకొచ్చింది. క్రీడా నేపథ్యంలో సాగే 'రష్మీ రాకెట్' చిత్రానికి ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తుండగా రోనీ స్క్రూవాలా, నేహా ఆనంద్, ప్రంజల్ ఖంద్‌దియా నిర్మిస్తున్నారు. (చదవండి: తేజ సినిమా: కాజల్ పోయి.. తాప్సీ వచ్చే) -
82వ వసంతంలోకి ఉషా సోమన్
న్యూఢిల్లీ : పుష్-అప్స్, లాంగ్రన్స్తో ఫిట్‌నెస్‌లో తనకు తానే సాటిగా నిరూపించుకున్న ఉషా సోమన్ 82వ వసంతంలోకి అడుగుపెట్టారు. బర్త్‌డే సందర్భంగా ఒకేసారి ఏకధాటిగా 15 పుష్అప్స్ చేసి మరోసారి తన మార్క్ చూపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బామ్మగారి ఫిట్నెస్కి ఎంతోమంది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఫ్యాన్స్ ఉన్నారు. ఫిట్నేస్ ప్రియులకు గట్టి పోటినిస్తూ సవాలు విసురుతున్న ఉషా సోమన్.. మన టాప్ ఇండియన్ మోడల్ మిలింద్ సోమన్ తల్లి. . గతంలోనూ మిలింద్ భార్య అంకితా కొన్వర్తో కలిసి ఆమె ఒంటి కాలితో బాక్స్ జంప్స్ చేయడమే కాకుండా కొడుకుతో సమానంగా పుష్-అప్స్, వర్కఅవుట్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఉష సోమన్ తన కొడుకు మిలింద్‌తో కలిసి చీరలో పుష్-అప్లు చేస్తున్న వీడియో కూడా ఫిట్నెస్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవల ఉష, తన కొడుకు మలింద్కు పోటీగా ఒకేసారి 16 పుష్-అప్లు చేసిన వీడియోను ఉమెన్స్ డే సందర్భంగా షేర్ చేశాడు. అలాగే 2016లో మహరాష్ట్రలోని నిర్వహించిన ఓ మరథాన్‌లో మలింద్తో పాటు ఆయన తల్లి ఉష కూడా పాల్గొన్న వీడియో మదర్స్ డే సందర్భంగా పంచుకున్నాడు. ఇలా వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యవంతమైన ఫిట్నెస్తో యువతతో పాటు వృద్ధులకు కూడా సవాలుగా నిలిచిన తన తల్లి ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను తరచూ మలింద్ సోషల్ మీడియాలో పంచుకంటుంటాడు. (వైరల్: సినిమాను తలపించే పోలిస్ ఛేజింగ్! ) View this post on Instagram 3rd July 2020. 81 amazing years celebrated with birthday in lockdown. Party with 15pushups and a jaggery vanilla almond cake baked by @ankita_earthy 😀 happy birthday Aai 🤗🤗🤗 keep smiling !! . . . #livetoinspire #keepmoving #neverstop #FitnessAddict #love #health #happybirthday A post shared by Milind Usha Soman (@milindrunning) on Jul 4, 2020 at 11:48pm PDT -
బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే ఇలా చేయండి
బెల్లి ఫ్యాట్.. ప్రతి ఒక్కరిలో కనిపించే సాధారణ సమస్య. పొట్ట చుట్టూ కొవ్వు బాగా పేరుకుపోవడం వల్ల ఇది ఏర్పడుతుంది. సమయానికి భోజనం చేయకపోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం, ఒత్తిళ్లతో కూడిన జీవితం, జంక్‌ఫుడ్ ఎక్కువగా తినడం. వ్యాయామం చేయకపోవడం ఇలాంటి కారణలతో ఈ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఓ వ్యక్తి, మహిళ చూడటానికి ఎంత అందంగా ఉన్నా తనకున్న బెల్లి ఫ్యాట్ ఆ అందాన్ని తగ్గిస్తుంది. లేదా ఆ అభిప్రాయాన్ని వెంటనే మార్చుతుంది. దీని నుంచి విముక్తి పొందాలనుకుంటే మాత్రం కొంచెం ఒళ్లు వంచి కాలరీలు కరిగించాల్సిందే. రోజూ ఉదయం అయిదు నిమిషాలు చేసే వ్యాయామం ద్వారా మనం బరువు తగ్గించవచ్చు అన్న విషయం మీకు తెలుసా.. లేదా కేవలం రెండు నిమిషాల పాటు చేసే వ్యాయామం మనలోని కొవ్వును అంతం చేస్తుందన్న విషయం తెలుసా.. అవునండి వాస్తవాలే. అలసటను తగ్గిస్తుంది. ఉదయం పూట చేసే వ్యాయామం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది నిద్రను మెరుగుపరుస్తుందని పరిశోధనలో రుజువైంది. దీనివల్ల బరువు, బెల్లి ఫ్యాట్ కూడా తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలసటను తగ్గించి రోజంతా మనకు ఉల్లాసాన్ని, శక్తిని అందిస్తుంది. అదే విధంగా మానసిక స్థితి మెరుగుదలకు దోహదపడి ఏకాగ్రతను పెంచుతుంది. ఈ వేళలో ప్రసరించే అల్ట్రా వయోలెట్ కిరణాలు ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికడతాయి. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నందునే ఉదయం వేళలో వ్యాయామం చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తారు. అయితే ఉదయం చేసే వ్యాయామం తమ ఫిట్నెస్ దినచర్యకు అనుగుణంగా ఉంటాలని నిపుణులు సూచిస్తున్నారు. (కరోనా: వర్క్ ఫ్రం హోం వాళ్లు ఇలా చేయండి!) బరువు తగ్గడానికి ఉదయం చేసే ఉత్తమ వ్యాయామాలు బెల్లి ఫ్యాట్, బరువు తగ్గేందుకు అయిదు నిమిషాలు రోజూవారి వ్యాయామం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇది నేర్చుకోవడం కూడా ఎంతో సులభం. ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఎక్కడైన చేయవచ్చు. దీన్ని సులభంగా దినచర్యలో భాగం చేయవచ్చు. ఇది బెల్లి ఫ్యాట్‌ను తగ్గించి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. 1.. పవర్ పుష్-అప్స్ జీవక్రియను పునరుద్ధరించడానికి, బరువు తగ్గడానికి అలాగే కండరాలను బలోపేతం చేయడానికి పుష్అప్స్ సహాయపడతాయి. ఉదయం పూట మీరు చేయగలిగే వ్యాయామాలలో ఇది ఉత్తమైనది. పవర్ పుష్-అప్స్ చేయడం వలన మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. బలమైన ఉదర కండరాలను నిర్మించడంలో ఇది సహాయపడుతుంది. పవర్ పుష్-అప్స్ ఎలా చేయాలి: ► తలక్రిందులుగా ఉన్న ‘V’ భంగిమలో ఉండి, మోకాళ్ళతో వంగి, నడుము వెనక భాగాన్ని పైకి ఉంచి ప్రారంభించండి. ► మీ చేతులను భుజం-వెడల్పు కంటే కొంచెం వెడల్పుగా ఉంచి ఫోటోలో చూపించినట్లు ఉంచండి. ► మీ మోకాళ్ళను వంచి, మీ మోచేతులను పూర్తి పుష్-అప్ స్థానంలో వంచినప్పుడు బరువును ముందుకు ఉంచడి. ► V భంగిమను కొనసాగిస్తూ, మొదట ప్రారంభించినట్లు నడుము వెనక భాగాన్ని పైకి అనండి. ► రెండు భంగిమల మధ్య ముందుకు వెనుకకు బౌన్స్ అవుతూ సుమారు 5 నిమిషాలు వీటిని చేయండి. జంపింగ్ జాక్స్ ఇతర కార్డియో వర్కౌట్ల మాదిరిగా, ఉదయపు వ్యాయామంలో దీని చేర్చడం వల్ల మంచి ఆరోగ్య ఫలితాను ఇస్తుంఇ. ఇది ఆరోగ్యకరమైన గుండెకు ఉపయోగపడుతుంది. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జంపింగ్ జాక్స్ ఎలా చేయాలి: ► మీ పాదాలతో నిటారుగా నిలబడండి. ►ఫోటోలో చూపించినట్టుగా ఒక్కసారిగా పైకి ఎగిరి మీ కాళ్లను కొంచెం దూరంగా విస్తరించడండి. మీ చేతులను మీ తలపైకి తీసుకువచ్చేటప్పుడు భుజం కంటే పైకి తీసుకురండి. ►మళ్లీ మీ చేతులను యధాస్థితికి తీసుకు వచ్చి, మీ కాళ్లను ఒకచోట చేర్చండి. ►ఒకవేళ మీకు ఈ వ్యాయామంలో అనుభవం ఉంటే తక్కువ వేగంతో చేయండి. ఇలా పదిసార్లు కొద్ది కొద్ది సమయం గ్యాప్‌తో చేయండి. ►దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి ప్రతిరోజూ ఈ వ్యాయామం కోసం నిర్ధిష్ట సమయాన్ని కేటాయించండి. కేవలం 10 నిమిషాలు అయినా సరిపోతుంది. ► ఒకవేళ ఉదయం ఈ వ్యాయామం చేయలేకపోతే ఫర్వాలేదు. సాయంత్రం అయినా మీరు ఈ దినచర్యను కొనసాగించండి. -
విద్యార్థినికి శిక్ష: టీచర్‌పై కేసు నమోదు
సాక్షి, కొల్హాపూర్ : హోం వర్క్ చేయలేదని టీచర్ రాక్షసుడిగా మారాడు. పసిపల్ల అని చూడకుండా దారుణ శిక్ష విధించాడు. హోంవర్క్ చేయకుండా స్కూల్ వచ్చినందుకు 300 గుంజిళ్లు తీయాలంటూ ఆదేశించాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని చంద్‌గఢ్ తహసీల్దార్ పరిధిలోని కానూర్ బుద్రిక్ గ్రామంలో జరిగింది. ఆలస్యంగా జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉండే శ్రీ భువనేశ్వరి సందేష్ విద్యాలయలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని నవంబర్24న స్కూల్ వెళ్లింది. అయితే ఆ రోజు ఇంట్లో విద్యార్థిని టీచర్ ఇచ్చిన హోం వర్క్ చేయలేదు. దీంతో ఆగ్రహించిన టీచర్ అశ్వనీ అశోక్ దేవన్ అనే ఉపాధ్యాయుడు.. 300 గుంజిళ్లు తీయాలంటూ ఆదేశించాడు. విద్యార్థిని కొన్ని గుంజిళ్లు తీసిన తరువాత స్పృహ తప్పి పడిపోయింది. తరువాత విద్యార్థినికి నడిచేందుకు కూడా కాళ్లు సహకరించలేదు. దీంతో ఆమెను.. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. పనిష్మెంట్ పేరుతో విద్యార్థిని తీవ్రంగా హింసించిన అశోక్ దేవన్‌పై తల్లిదండ్రులు పోలీస్ కేసు పెట్టారు. ఇదిలా ఉండగా.. సదరు టీచర్‌కు పాఠశాల యాజమాన్యం దీర్ఘకాలిక సెలవును మంజూరు చేసింది. అశోక్ దేవన్ తీసుకున్న నిర్ణయం.. విద్యార్థుల హక్కులను కాలరాయడమేనని జిల్లా విద్యాశాఖాధికారి స్పస్టం చేశారు. అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హోంవర్క్ చేయలేదన్న చిన్నారికి ఒక టీచర్ స్కూల్లో దారుణ శిక్ష విధించాడు. విద్యార్థిని స్పృహ తప్పి పడిపోవడంతో.. టీచర్‌పై కేసు నమోదు చేశారు. -
పుషప్.. పుల్అప్స్తో ఆయువు
వ్యాయామం అంటే కొందరికి నడక.. ఇంకొందరికి జాగింగ్, రన్నింగ్.. మరికొందరికి పుషప్స్, పుల్అప్స్.. మరి ఏ వ్యాయామం చేసినవారు ఎక్కువ కాలం బతికే అవకాశముంది? ఆసక్తికరమైన ప్రశ్న కదూ.. సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అంచనాలు నిజమైతే.. పుషప్స్, పుల్అప్స్ చేసే వారు కొంచెం ఎక్కువ కాలం బతికే అవకాశముంది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్లలో దాదాపు 80 వేల మందిపై జరిగిన సర్వేలో సేకరించిన వివరాలను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చినట్లు ప్రొఫెసర్ ఎమ్మాన్యుయేల్ స్టామాటాకిస్ తెలిపారు. వయసు, ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి, చదువు వంటి కొన్ని అంశాల ప్రభావాన్ని తొలగించి చూడగా కండరాల పటుత్వం కోసం వ్యాయామం చేసే వారు అకాల మృత్యువు పాలయ్యే అవకాశాలు 23 శాతం తక్కువని, కేన్సర్ సంబంధిత మరణం సంభవించేందుకు ఉన్న అవకాశం 31 శాతం వరకు తక్కువని స్పష్టమైనట్లు వివరించారు. -
మీరు ఎక్కువకాలం బతకాలనుకుంటున్నారా?
ఫిట్‌గా దృఢంగా ఉండి.. ఎక్కువకాలం జీవించాలనుకుంటున్నారా? అయితే, ఇందుకోసం కొంచెం ఒళ్లు వంచండి. జిమ్‌కు వెళ్లకపోయినా పర్వాలేదు. ఇంట్లోనే రోజూ క్రమంతప్పకుండా కసరత్తులు చేయండి అంటున్నారు శాస్త్రవేత్తలు. బస్కీలు (పుష్అప్స్), గుంజీలు (సిట్అప్స్) వంటి కసరత్తులను క్రమంతప్పకుండా చేసేవారు.. తమ జీవితకాలానికి మరికొన్నేళ్లు జోడించుకొని ఆయుష్షును పెంచుకోవచ్చునని తాజా అధ్యయనంలో వెల్లడైంది. శారీరక బలాన్ని పెంపొందించుకునేందుకు కసరత్తులు చేసేవారిలో అకాలపు మరణాలు సంభవించే అవకాశం 23శాతం తక్కువ అని, అదేవిధంగా క్యాన్సర్ సంబంధిత మరణాలు 31శాతం తగ్గే అవకాశముందని తాజా అధ్యయనంలో తేలింది. 'శారీరక బలాన్ని పెంపొందించుకొనే ఎక్సర్సైజ్లు.. సైక్లింగ్, జాగింగ్లాగా ఆరోగ్యానికి కీలకమైనవే కాకుండా క్యాన్సర్ మరణాల ముప్పును తగ్గించడంలో ఇవి అత్యంత ముఖ్యమైనవని మా అధ్యయనంలో తేలింది' అని సిడ్నీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎమాన్యుయేల్ స్టామటకిస్ తెలిపారు. మొత్తం 80,306మందిని రెండేళ్లపాటు పరిశీలించి.. వయస్సు, లింగభేదం, ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి వంటి వాటి ఆధారంగా కొన్ని మార్పులు సూచించి.. ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారందరూ గుండె వ్యాధి లేదా క్యాన్సర్ సోకి ప్రారంభదశలో ఉన్నారు. ఈ పరిశోధన కాలంలో చనిపోయిన వారిని మినహాయించి మిగతావారిపై అధ్యయనం కొనసాగించారు. 'ప్రత్యేకమైన పరికరాలు ఏమీలేకుండా సొంతంగా చేసే శారీరక ఎక్సర్సైజ్లు.. జిమ్ ట్రైనింగ్ అంతటి ప్రభావాన్ని చూపిస్తాయి. కసరత్తులు అనేగానే.. ప్రజలు జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తాలని భావిస్తుంటారు. నిజానికి అది అవసరం లేదు. చాలామంది ఖర్చు కారణంగా, తమ పని సంస్కృతి కారణంగా జిమ్‌కు వెళ్లడానికి భయపడుతుంటారు. అలాంటి వారు ఇంట్లో లేదా పార్కులో పుష్అప్స్, సిట్అప్స్, ట్రైసెప్స్ డిప్స్ వంటివి చేయడం ద్వారా ఆరోగ్యాన్ని దృఢంగా పెంపొందించుకోవచ్చు' అని పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలను అమెరికన్ జర్నల్ ఎపిడెమియాలజీలో ప్రచురించారు. -
మూడు పుష్అప్స్కే చేతులెత్తేసిన స్టీఫెన్ కర్ర్రీ
-
పండగ చేసుకున్న పాకిస్థాన్ క్రికెటర్లు
లార్డ్స్: ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ టీమ్ విభిన్నంగా విజయోత్సవం జరుపుకుంది. లార్డ్స్ మైదానంలో 20 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ లో గెలవడంతో పాక్ క్రికెటర్ల సంబరాలు మిన్నంటాయి. పాకిస్థాన్ ప్లేయర్లు ఐదేసి పుష్-అప్లు తీశారు. జాతీయ గీతం పడుతూ తమ జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. ఆదివారం ఇక్కడ ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాక్ 75 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ ఆటగాళ్లందరినీ ఒక్కచోటుకు చేర్చి ఈ విన్యాసాలు చేయించాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన తర్వాత కెప్టెన్ మిస్బా కూడా పుష్-అప్ లు తీశాడు. లార్డ్స్ మైదానంలో తొలి సెంచరీ సాధించడంతో తన ఆనందాన్ని ఇలా వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌పై సెంచరీ చేసిన ప్రతిసారి పుష్-అప్లు తీస్తానని పాకిస్థాన్ సైన్యానికి ప్రమాణం చేసినట్టు మిస్బా వెల్లడించాడు. మ్యాచ్ లో విజయం సాధించడంతో సహచరులు కూడా అదేవిధంగా హర్షాతిరేకాలు తెలిపారు.