విద్యార్థినికి శిక్ష: టీచర్‌పై కేసు నమోదు | Teacher makes sick 13-year-old girl do 300 push-ups as punishment | Sakshi
Sakshi News home page

విద్యార్థినికి దారుణ శిక్ష: టీచర్‌పై కేసు నమోదు

Published Thu, Dec 14 2017 9:33 AM | Last Updated on Thu, Dec 14 2017 9:59 AM

Teacher makes sick 13-year-old girl do 300 push-ups as punishment - Sakshi

సాక్షి, కొల్హాపూర్‌ : హోం వర్క్‌ చేయలేదని టీచర్‌ రాక్షసుడిగా మారాడు. పసిపల్ల అని చూడకుండా దారుణ శిక్ష విధించాడు. హోంవర్క్‌ చేయకుండా స్కూల్‌ వచ్చినందుకు 300 గుంజిళ్లు తీయాలంటూ ఆదేశించాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని చంద్‌గఢ్‌ తహసీల్దార్‌ పరిధిలోని కానూర్‌ బుద్రిక్‌ గ్రామంలో జరిగింది. ఆలస్యంగా జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

స్థానికంగా ఉండే శ్రీ భువనేశ్వరి సందేష్‌ విద్యాలయలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని నవంబర్‌24న స్కూల్‌ వెళ్లింది. అయితే ఆ రోజు ఇంట్లో విద్యార్థిని టీచర్‌ ఇచ్చిన హోం వర్క్‌ చేయలేదు. దీంతో ఆగ్రహించిన టీచర్‌ అశ్వనీ అశోక్‌ దేవన్‌ అనే ఉపాధ్యాయుడు.. 300 గుంజిళ్లు తీయాలంటూ ఆదేశించాడు. విద్యార్థిని కొన్ని గుంజిళ్లు తీసిన తరువాత స్పృహ తప్పి పడిపోయింది. తరువాత విద్యార్థినికి నడిచేందుకు కూడా కాళ్లు సహకరించలేదు. దీం‍తో ఆమెను.. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు.

పనిష్మెంట్‌ పేరుతో విద్యార్థిని తీవ్రంగా హింసించిన అశోక్‌ దేవన్‌పై తల్లిదండ్రులు పోలీస్‌ కేసు పెట్టారు. ఇదిలా ఉండగా.. సదరు టీచర్‌కు పాఠశాల యాజమాన్యం దీర్ఘకాలిక సెలవును మంజూరు చేసింది. అశోక్‌ దేవన్‌ తీసుకున్న నిర్ణయం.. విద్యార్థుల హక్కులను కాలరాయడమేనని జిల్లా విద్యాశాఖాధికారి స్పస్టం చేశారు. అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హోంవర్క్‌ చేయలేదన్న చిన్నారికి ఒక టీచర్‌ స్కూల్లో దారుణ శిక్ష విధించాడు. విద్యార్థిని స్పృహ తప్పి పడిపోవడంతో.. టీచర్‌పై కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement