ఒక విద్యార్థిని బ్యాగ్‌లో పాము పెద్ద కలకలం సృష్టించింది. ఆమె తన బ్యాగ్‌లో ఏదో మెదలుతుందని గ్రహించకుండా ఉండి ఉంటే ఆ పాఠశాల్లోని విద్యార్థులు, టీచర్లు ఏమై ఉండేవారో ఊహించడానికే భయంగా ఉంది కదా!. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో షాజ్‌పూర్‌లోని బడోని స్కూల్‌లో చోటు చేసుకుంది. ఉమా రజాక్ అనే పదో తరగతి విద్యార్థి తన బ్యాగ్‌లో ఏదో మెదులుతున్నట్లు అనిపిస్తోందని టీచర్‌కి చెప్పింది.
అతడు ఆ స్కూల్ బ్యాగ్‌ని పూర్తిగా క్లోజ్‌చేసి ఆరుబయటకు తీసుకువచ్చి నెమ్మదిగా జిప్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా అందులో ఉన్న పుస్తకాలన్నీ తీసేశాడు. ఆ తర్వాత బ్యాగ్‌ని తలకిందులుగా చేసి దులపగానే ఒక్కసారిగా తాచుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. ఒక్కసారిగా విద్యార్థులు, సదరు ఉపాధ్యాయుడు షాక్ అయ్యారు.
ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి చెప్పినదాన్ని సీరియస్‌గా తీసుకోకుండా ఉండి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం సంభవించిందో చెప్పనవసరం లేదు. అదీగాక అదృష్టవశాత్తు ఆ పాము ఆ బ్యాగ్ నుంచి బయటపడ్డాక వారిపై దాడి చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు వారంతా. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది. మీర కూడా ఓ లుక్కేయండి.
कक्षा 10 की छात्रा कु. उमा रजक के बैग से, घर से स्कूल आकर जैसे ही बैग खोला तो छात्रा को कुछ आभाष हुआ तो शिक्षक से शिकायत की, कि बस्ते में अंदर कुछ है, छात्रा के बैग को स्कूल के बाहर ले जाकर खोला तो बैग के अंदर से एक नागिन बाहर निकली, यह घटना दतिया जिले के बड़ोनी स्कूल की है। pic.twitter.com/HWKB3nktza
— Karan Vashistha BJP 🇮🇳 (@Karan4BJP) September 22, 2022
(చదవండి: వందేళ్ల బామ్మకి గౌరవ డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా )
Comments
Please login to add a commentAdd a comment