cobra snake
-
Snake: పాము గాయాలకు శస్త్రచికిత్స
మైసూరు: నాగుపామును చూడగానే జడుసుకుని అంత దూరం పరిగెడతారు. కానీ వీరు మాత్రం దానికి వైద్యం చేశారు. పొలంలో మట్టిని నింపుతున్న సమయంలో హిటాచీ యంత్రంలో నాగుపాము తీవ్రంగా గాయపడింది. మైసూరు తాలూకాలోని వరగొడు గ్రామంలో ఓ పొలంలో పాము ఈ ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో హిటాచి వాహనం పామును జాగ్రత్తగా సంచిలో వేసుకుని మైసూరులోని పశువుల ఆస్పత్రికి తీసుకొచ్చాడు. డాక్టర్. యశ్వంత్‌కుమార్ నాగుపామును పరిశీలించగా పలుచోట్ల పెద్ద గాయాలు కనిపించాయి. శస్త్రచికిత్స ద్వారా 24 కుట్లు వేసి మందు అంటించాడు. తరువాత దూరంగా అడవిలో వదిలేశారు. -
7 అడుగుల నాగు..17 ఏళ్ల వయసు
వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని చందాపూర్ రోడ్డు పీర్లగుట్ట సమీపంలోని ఓ ఇంట్లోకి అతి పెద్ద నాగుపాము వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంటి యజమాని రాంబాబు బాత్రూంలోకి వెళుతుండగా.. బుసలు కొడుతున్న శబ్దం విని ఆగిపోయాడు. ఆ తర్వాత చూడగా పెద్ద నాగుపాము కనిపించింది. దీంతో భయపడిన రాంబాబు సాగర్ స్నేక్ సొసైటీ నిర్వాహకుడు చీర్ల కృష్ణసాగర్‌కు ఫోన్ చేశాడు.వెంటనే ఆయన తన బృందంతో అక్కడకు చేరుకొని పామును పట్టుకున్నా డు. పాము పొడవు ఏడు అడుగులు ఉండగా, వయసు 16 నుంచి 17 ఏళ్లకు పైబడి ఉంటుందని కృష్ణసాగర్ చెప్పాడు. తాను ఇప్పటి వరకు 7,013 పాములు పట్టుకున్నానని, కానీ ఇంతపెద్ద నాగుపామును చూడటం ఇదే మొదటిసారి అని కృష్ణసాగర్ తెలిపాడు. ఈ విషయంపై వెటర్నరీ ఏడీ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ పాము వయసు ఎక్కువే ఉండొచ్చని.. దాన్ని సమీపంలోని అడవిలో వదిలిపెట్టినట్టు తెలిపారు. -
పెనుకొండ ఆస్పత్రిలో నల్లనాగు కలకలం
పెనుకొండ: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నల్లనాగు కలకలం సృష్టించింది. బుధవారం 9 గంటలకు ట్రామా కేర్ సెంటర్లో విధులకు హాజరైన సూపర్వైజర్ శ్రీనివాసులు.. అక్కడి డిప్యూటీ డీఎంహెచ్ఓ చాంబర్లో శబ్దం రావడంతో అటుగా వెళ్లి చూశారు. లోపల పడగ విప్పిన నల్లనాగు కనిపించడంతో భయంతో ఎటూ కదల్లేకుండా ఉండిపోయాడు. కాసేపటి తర్వాత తేరుకుని తోటి ఉద్యోగులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేయడంతో సిబ్బంది, ప్రజలు ట్రామాకేర్ సెంటర్‌కు వద్దకు భారీగా చేరుకున్నారు. కొందరు పాలు తీసుకువచ్చి పాము సమీపంలో ఉంచారు. మరికొందరు పాముకు దండాలు పెట్టారు. దీంతో పాము ఎటూ వెళ్లలేక అక్కడే పడగ విప్పి నిలబడిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక రామమందిరం ప్రాంతానికి చెందిన యువకుడు రాజు అక్కడకు చేరుకుని పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పాము కాటు వేసింది. అయినా ఆ యువకుడు పామును పట్టుకుని ఆస్పత్రి వెనుక పొదల్లోకి వదిలాడు. అనంతరం రాజుకు అక్కడే ఉన్న వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం పుట్టపర్తికి తరలించారు. విష ప్రభావం ఎక్కువగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై రాజుకు అనంతపురం వైద్యులు చికిత్స చేస్తున్నారు. -
విష సర్పాల వ్యాపారం గుట్టురట్టు.. 26 నాగుపాములు స్వాధీనం
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బలియాపాల్ తహసీల్ పంచుపాలి ప్రాంతంలో విష సర్పాల అక్రమ వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా అనుబంధ వర్గాలు చేపట్టిన దాడిలో ఈ ముఠా వ్యవహారం బట్టబయలైంది. అటవీ శాఖ అధికారులు ఆకస్మికంగా చేపట్టిన దాడుల్లో బుధవారం 26 నాగుపాములను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. బాలాసోర్ జిల్లా లంగేశ్వర్ అటవీ కార్యాలయానికి సమీపంలో ని ఈ అక్రమ వ్యాపార శిబిరం కొనసాగడం సంచలనం రేపింది. బాలాసోర్ అటవీ విభాగం మరియు స్నేక్ హెల్ప్‌లైన్ వర్గాలు ఉమ్మడిగా ఈ శిబిరంపై దాడి చేశాయి. పట్టుబడిన ముఠాలో ఉన్న దంపతు లు అంతర్ రాష్ట్ర రాకెట్‌ను నడుపుతున్నట్లు తేలింది. పలు ప్రాంతాలకు తరలింపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పాములను సేకరించి వాటి విషాన్ని తీసి వివిధ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు స్నేక్ హెల్ప్‌లైన్ కార్యదర్శి సువేందు మల్లిక్ మీడియాతో మాట్లాడారు. నాగుపాముల అక్రమ వ్యాపారం (స్మగ్లింగ్) గురించి విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. సమాచారం అందడంతో తక్షణమే భువనేశ్వర్ నుంచి తెల్లవారు జామున 3 గంటలకు బయల్దేరి విష సర్పాల అక్రమ వ్యాపార శిబిరానికి చేరినట్లు వివరించారు. విషయం స్థానిక అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో వారు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారన్నారు. వీరి ఆధ్వర్యంలో జరిగిన దాడిలో 26 నాగుపాములకు స్వేచ్ఛ కల్పించి నట్లు పేర్కొన్నారు. పాములను రంధ్రాలతో ప్ర త్యేకంగా రూపొందించిన ప్లాస్టిక్ కంటైనర్లలో అక్రమార్కులు బందీచేసి ఉంచినట్లు దృష్టికి వచ్చిందన్నారు. ఈ వ్యవహారంలో మరింత మంది వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపా రు. దర్యాప్తు కొనసాగుతోందని బాలాసోర్ అటవీ విభాగం ఏసీఎఫ్ శోభన్ చాంద్ వెల్లడించారు. -
అరుదుగా కనిపించే శ్వేత నాగు.. చూసేందుకు ఎగబడ్డ జనం
వనపర్తి: పట్టణంలోని కమలానగర్ కాలనీలో బుధవారం తెల్లని నాగుపాము(శ్వేతనాగు) కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు సాగర్స్ స్నేక్ సొసైటీ నిర్వాహకులు చీర్ల కృష్ణసాగర్ అక్కడికి వెళ్లి పామును పట్టుకున్నారు. అరుదుగా కనిపించే తెల్ల నాగుపాము (శ్వేతనాగు)ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. సైన్స్ ప్రకారం తన్యులోపం వల్ల తెల్లని వర్ణంలో పాములు ఉంటాయని నిపుణులు తెలిపారు. శ్వేతనాగును అచ్చంపేట అటవి ప్రాంతంలో వదిలేస్తామని సొసైటీ నిర్వాహకులు తెలిపారు. -
ఆలయంలో నాగుపాము దర్శనం
కర్ణాటక: జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో మురుగన్ ఆలయం వద్ద ఉన్న పుట్ట నుంచి నాగుపాము బయటకొచ్చి పూజలు నిర్వహిస్తున్న భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. క్రిష్ణగిరి– బెంగళూరు హైవే ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి సమీపంలోని సికారిమేడు బస్టాప్ వద్ద పెద్ద పుట్ట ఉంది. కొన్నేళ్ల కిందట పుట్ట పక్కనే మురుగన్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో స్థానిక ప్రజలు రోజూ పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం కొంత మంది భక్తులు పూజలు నిర్వహిస్తుండగా ఓ నాగుపాటు బయటకొచ్చి ఆలయ ఆవరణలో పడగెత్తి ఆడింది. కొద్దిసేపటికి మళ్లీ పుట్టలోకి వెళ్లిపోయింది. కాగా ఈ దృశ్యాలను గమనించిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. -
వామ్మో.. 35 నాగులు!
బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా): ఇంటిముందు అరుగు బండ కింద 35 పాములు బయటపడ్డాయి. వీటిని చూసిన గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురై వాటిని చంపేశారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట సమీపంలోని డేగానిపల్లెలో మంజు ఇంటివద్ద పొడవాటి అరుగు బండ ఉంది. దాని అడుగు నుంచి ఓ పాము బయటకు రాగా.. గమనించిన గ్రామస్తులు భయంతో చంపేశారు. ఆ తరువాత ఒకదాని వెంట మరొకటిగా పాములు రావడంతో గ్రామస్తులు బండను తొలగించి చూడగా.. మొత్తం 35 పాములు కనిపించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నివాస గృహాల మధ్య అరుగు బండకింద పాము గుడ్లు పెట్టగా.. వాటి నుంచి పిల్లలు బయటకొచ్చాయి. ఇవన్నీ నాగుపాము జాతికి చెందినవని గ్రామస్తులు తెలిపారు. -
పంచాంగం చూస్తుండగా కాటేసిన నాగుపాము
కరీంనగర్: మానవహక్కుల సంఘం మాజీ చైర్మన్ ఎరబాటి భాస్కర్‌రావు సోదరుడు స్వాతంత్య్ర సమరయోధుడు సీనియర్ సిటిజన్ హరిహర ఆలయం నిర్మాణకర్త రాజేశ్వర్‌రావును కాల్వశ్రీరాంపూర్‌లోని ఆయన నివాసంలో బుధవారం నాగుపాము కాటువేసింది. ఉగాది పండుగ సందర్భంగా పంచాగం చూస్తుండగా పెరట్లో నుంచి పామువచ్చి కాలుపై కాటువేసి అక్కడినుంచి వెళ్లిపోయింది. గమనించిన రాజేశ్వర్‌రావు అప్రమత్తమై ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు ఫోన్‌చేయగా హూటాముటిన కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యానికి 108లో కరీంనగర్‌కు తరలించారు. రాజేశ్వర్‌రావు కుమారుడు హైకోర్టు న్యాయవాది హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యస్థితిపై స్థానికులు ఆందోళన చెందుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సర్పంచ్ ఆడెపు శ్రీదేవిరాజు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రఘుపతిరావు, తదితరులు ఉన్నారు. -
హోటల్లో నాగుపాము హల్చల్.. భయంతో కస్టమర్ల పరుగులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఓ పాము హల్చల్ చేసింది. తిరుత్తణి బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లోని వంట గదిలోకి 5 అడుగుల పొడవైన పాము ప్రవేశించింది. నాగుపామును గుర్తించిన సిబ్బంది, కస్టమర్లు భయంతో హోటల్ నుంచి బయటకు పరుగులు తీశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హాటల్లోని వంటగదిలో దాక్కున్న పామును పట్టుకున్నారు. అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. చదవండి: వాట్ ఏ గట్స్ బాస్! నీ ఆత్మవిశ్వాసానికి సెల్యూట్! -
ఎంత దూరంలో వదిలిపెట్టినా!..మళ్లీ గంటలో ప్రత్యక్షమవుతున్న పాము
సాక్షి, బి.కొత్తకోట: ఓ నాగుపాము అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పెద్ద చెరువు కట్టపై తిష్టవేసింది. ఎక్కడికి తీసుకెళ్లి వదిలినా మళ్లీ అక్కడికే వస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి ఈ పాము స్థానికుల నుంచి పూజలు అందుకుంటోంది. పది రోజుల క్రితం 4 అడుగుల నాగుపామును పెద్దచెరువు కట్టపై రోడ్డు పక్కన (ఆయకట్టు భూములున్న చోట) స్థానికులు చూశారు. పాము అక్కడి నుంచి వెళ్లిపోతుందని ఎవరిదారిన వారు వెళుతూ వస్తున్నారు. రెండు,మూడు రోజులు గడిచినా పాము అక్కడి నుంచి కదల్లేదు. గత ఆదివారం స్థానికులు పామును చెరువుకట్ట ఆయకట్టు భూమిలోకి తీసుకెళ్లి వదిలేశారు. అంతటితో పాము కథ ముగిసిందని భావించారు. ఊహించని విధంగా పాము సోమవారం పెద్దచెరువు కట్టపైకి వచి్చంది. దీనిపై ఆసక్తి పెంచుకున్న స్థానికులు మళ్లీ కొంత దూరంలో పాముని వదిలిరాగా..కొన్ని గంటలకే మళ్లీ అది యధాస్థానంలోకి వచ్చేసింది. బుధవారం నుంచి ఈ పాము ఉదంతంపై ప్రచారం విస్తృతమైంది. గురువారం స్థానికులు చెరువుకట్టపైకి క్యూ కట్టారు. వందల సంఖ్యలో ప్రజలు వచ్చి పామును చూసి వెళ్తున్నారు. కట్టపై ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని స్థానికులు శుక్రవారం సాయంత్రం పామును మళ్లీ కొంత దూరం తీసుకెళ్లి వదిలేశారు. అయితే మళ్లీ మామూలే..గంటకల్లా పాము మళ్లీ తొలిసారి ఎక్కడికి వచ్చి ఉందో అక్కడికే వచ్చేసింది. విషయం తెలుసుకొన్న మహిళలు రాత్రి కట్టపైకి చేరుకుని పాముకు పాలుపెట్టి హారతులు పట్టి పూజలు చేశారు. పాము పడగపై కుంకుమ పెట్టారు. కొంతమంది పామును మెడలో వేసుకుని విన్యాసాలు చేస్తున్నారు. (చదవండి: పాపను కాపాడబోయి.. జిల్లా హాకీ కార్యదర్శి గిరి మృతి) -
కాలనాగుతో ఆటలు.. చావుబతుకుల్లో యూట్యూబర్!
జైపూర్: అతను తన క్రేజీ వీడియోలతో దేశంలోనే అత్యధిక ఆదాయం అర్జిస్తున్న యూట్యూబర్లలో ఒకడు. ఉన్నత చదువులు చదివాడు. ఆ చదువుకు తగ్గట్లు మంచి ప్యాకేజీతో ఉద్యోగం దక్కదే. కానీ, విచిత్రంగా యూట్యూబ్ వీడియోల వైపు ఆసక్తి చూపించాడు. అది అతనికి కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతోంది. అయితే.. చివరికి వ్యూస్ కోసం చేసిన యత్నమే ఆ యూట్యూబర్ ప్రాణం మీదకు తెచ్చింది. 24 ఏళ్ల వయసున్న అమిత్ శర్మ.. రాజస్థాన్‌లో టాప్ యూట్యూబర్. అల్వార్ అతని స్వస్థలం. ఐఐటీ రూర్కీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగ ప్రయత్నం చేయకుండా.. యూట్యూబ్ ఛానెల్ వైపు అడుగులు వేశాడు. క్రేజీ ఎక్స్‌వైజెడ్ అనే పేరుతో గత ఐదేళ్లుగా ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు అతను. స్నేహితుల సహకారంతో నడిపిస్తున్న ఆ ఛానెల్‌కు 25 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు కూడా. ఈ ఛానెల్ ద్వారా నెలకు అతని సంపాదన రూ. 9 కోట్లు అని, అన్బాక్సింగ్(కొత్త ప్రొడక్టుల డెమో, రివ్యూల) ద్వారా అతని ప్రత్యేక ఛానెల్ ద్వారా నెలకు మరో రూ.2.5 కోట్లు సంపాదిస్తున్నాడంటూ అక్కడి మీడియా ఛానెల్స్ కథనాలు ప్రచురిస్తుంటాయి. అయితే.. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ మీద వీడియోలు తీసే అమిత్ శర్మ.. తాజాగా కాలనాగుతో ఓ వీడియో తీయాలని యత్నించాడట. ఆ ప్రయత్నంలోనే అది వేలిని కాటేసింది. కాసేపు అతను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదట. ఆపై విషం శరీరానికి వ్యాపించడంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. బాడీ మొత్తం పాము విషం వ్యాపించడంతో చావు బతుకుల్లో ఉన్నట్లు అతని స్నేహితులు ఓ వీడియోను పోస్ట్ చేశారు. అతను ప్రాణాపాయం నుంచి బయటపడాలని, త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని వ్యూయర్స్‌ను, సబ్‌స్క్రయిబర్స్‌ను కన్నీళ్లతో వాళ్లు కోరారు. అమిత్ శర్మ వీడియోలకు అక్కడ క్రేజ్ ఉంది. అతను బతకాలని, త్వరగా కోలుకుని మళ్లీ వీడియోలు తీయాలని అతని ఫాలోవర్స్ పోస్టులు పెడుతున్నారు. -
వైరల్ వీడియో: కోబ్రాకే గురిపెట్టి.. పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్పులు ఆ తర్వాత..
-
కోబ్రాకే గురిపెట్టి.. పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్పులు ఆ తర్వాత..
వైరల్: పాములకు సంబంధించిన చాలా వీడియోలు చూశాం. కానీ ఈ వీడియోలోని సన్నివేశం మాత్రం సినిమాల్లోనే చూశాం గానీ రియలిస్ట్‌గా సాధ్యం కాదు. నిజంగా పాములపై కాల్పులు జరిపితే కోపంతో వెంటాడి మరీ కాటేస్తాయా! అనుకుంటాం. ఔను! అనిపించేలా ఆ వీడియోలోని వ్యక్తి రియల్స్టిక్గా చేసి చూపించాడు. ఒక వ్యక్తి కారులో కూర్చొన ఉన్నట్లు వీడియోలో. ఎదురుగా కోబ్రా ఉంటుంది. మనోడు ఏకంగా కోబ్రాకే పాయింట్ బ్లాక్‌లో గురి పెట్టి కాల్చేందకు ప్రయత్నించాడు. ఐతే రెండు రౌండ్డలు కాల్చాడు గానీ, అవి గురి తప్పాయి. అంతే కోబ్రాకి కోపం వచ్చి కస్సు బుస్సుమంటూ జరజర అతడిని భయభ్రాంతులకు గురి చేసేలా మీదకు దూసుకువచ్చింది. ఆ తర్వాత ఆ వ్యక్తికి ఏమైందన్నది తెలియరాలేదు. అందుకు సంబంధించిన వీడియోకి 'కోబ్రాతో ఫైట్‌కి దిగాలనుకుంటే తుపాకీతో దిగొద్దు' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటజన్లు కోబ్రా రెండే ఛాన్సులు ఇస్తుంది, మరో ఛాన్స్ అదే తీసుకుంటుంది అని కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. వీడియో కోసం క్లిక్ చేయండి (చదవండి: ఒంటిపై అండర్వేర్ తప్ప నులుపోగులేదు ..అలానే దొంగలను పరిగెత్తించాడు) -
Viral Video: ఇలాంటి సెక్యూరిటీ గార్డును ఎప్పుడైనా చూశారా..?
-
భయానకం.. ఇలాంటి సెక్యూరిటీ గార్డును ఎప్పుడైనా చూశారా?
వైరల్: కొన్ని వీడియోలకు ఎన్నేళ్లు అయినా.. క్రేజ్ తగ్గదు. రిపీట్ మోడ్‌లో వైరల్ అవుతూనే ఉంటాయవి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. బహుశా.. ఆ వీడియోను గనుక మీరు ఇంతకు ముందు చూడకపోయి ఉంటే ఇప్పుడు చూసేయండి.. సెఫెస్ట్ సెక్యూరిటీ సిస్టమ్ అంటూ ఓ వ్యక్తి సరదా క్యాప్షన్‌తో ఆ వీడియోను పోస్ట్ చేశాడు. ఓ నాగుపాము తలుపు సందులోంచి పడగవిప్పి బుసలు కొడుతూ కనిపించింది. తనను వీడియో తీస్తున్న వ్యక్తిని తదేకంగా చూసి ఆ నాగు.. ఒక్కసారిగా కాటేసే యత్నం చేసింది కూడా. అయితే.. The safest security system! 😂 pic.twitter.com/QwSesTD7HE — Figen (@TheFigen_) December 26, 2022 I would simply have heart attack and be done — troy pachner (@CoachPachner) December 26, 2022 That's huge? Were they able to get him out? Assuming that's in India or possibly South Africa or Australia? Yikes! — C9597 (@MarsBrightStar) December 26, 2022 Never been a fan of the hoodie. — Scott DeSpain (@de_spain1) December 26, 2022 And all I got was a ring doorbell! — XRP_LOON (@LoonXrp) December 26, 2022 Better than a barking dog. — Dennis Cox (@DennisC46601860) December 27, 2022 Haha we need one of those! — Gidgit VonLaRue (@GidgitVonLaRue) December 26, 2022 ఆ ఇంటి వెనక ఒకావిడ భయంతో చూస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. కాకపోతే మన దేశంలోనే జరిగినట్లు తెలుస్తోంది. బహుశా.. అది అలా తలుపులో దూరి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఈ భయానక వీడియోకు కామెంట్లు రకరకాలుగా వస్తున్నాయి. -
వైరల్ వీడియో : కుక్కపిల్లలను కాటేసిన కసాయి నాగు
-
ఫ్రిజ్‌లో నాగుపాము
తుమకూరు: తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా కొత్తగెరె గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తికి చెందిన ఇంటిలో నాగుపాము దూరింది. శనివారం ఉదయం ఇంటిలోకి ప్రవేశించిన నాగుపాము ఫ్రిజ్ వెనుకభాగంలోకి చేరింది. కుటుంబ సభ్యులు స్నేక్ నిపుణుడు మహాంతేశ్కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని పామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు. -
నాగుల చవితి రోజున నాగుపాముకి బర్త్ డే విషెస్ చెప్పిన కుర్రాళ్లు..
-
‘షూ’లో నక్కిన నాగు పాము.. తస్మాత్ జాగ్రత్త!
బెంగళూరు: పని మీద వెళ్తున్నప్పుడు గమనించకుండానే చెప్పులు, షూ ధరిస్తుంటారు చాలా మంది. అయితే, వాటిల్లో విష పురుగులు ఉంటే ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. ఎంత అర్జెంట్ పని ఉన్నా ఓసారి చూసి ధరించటం మంచింది. ఓ సారి ఈ సంఘటన చూడండి. షూలో భారీ నాగు పాము నక్కింది. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా పడగ విప్పి బుసలు కొడుతోంది. కర్ణాటకలోని మైసూర్లో జరిగిన ఈ సంఘటన వీడియోను ట్విటర్లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి రోజూ మాదిరిగానే షూ ధరించేందుకు వెళ్లగా అందులో నాగు పాము కనిపించి షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి పామును షూ నుంచి తీసేందుకు ప్రయత్నించాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆ పాము పడగ విప్పి బుసలు కొట్టింది. ఈ సంఘటన ప్రతి ఒక్కరికి హెచ్చరికగానే చెప్పాలి. షూ ధరిస్తున్నప్పుడు కచ్చితంగా దానిని పరిశీలించిన తర్వాత వేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. Shocking video of cobra #snake in Mysore, Karnataka hiding inside the shoe. #ViralVideo #Cobra #Rescued #Shoes #Karnataka pic.twitter.com/rJmVN5W1ne — Bharathirajan (@bharathircc) October 10, 2022 ఇదీ చదవండి: 10 ఏళ్ల వయసులో జైలుకు.. 53 ఏళ్లప్పుడు నిర్దోషిగా విడుదల -
విద్యార్థిని బ్యాగ్‌లో పాము కలకలం.. జస్ట్ మిస్ లేదంటే...: వీడియో వైరల్
ఒక విద్యార్థిని బ్యాగ్‌లో పాము పెద్ద కలకలం సృష్టించింది. ఆమె తన బ్యాగ్‌లో ఏదో మెదలుతుందని గ్రహించకుండా ఉండి ఉంటే ఆ పాఠశాల్లోని విద్యార్థులు, టీచర్లు ఏమై ఉండేవారో ఊహించడానికే భయంగా ఉంది కదా!. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో షాజ్పూర్లోని బడోని స్కూల్లో చోటు చేసుకుంది. ఉమా రజాక్ అనే పదో తరగతి విద్యార్థి తన బ్యాగ్‌లో ఏదో మెదులుతున్నట్లు అనిపిస్తోందని టీచర్‌కి చెప్పింది. అతడు ఆ స్కూల్ బ్యాగ్‌ని పూర్తిగా క్లోజ్‌చేసి ఆరుబయటకు తీసుకువచ్చి నెమ్మదిగా జిప్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా అందులో ఉన్న పుస్తకాలన్నీ తీసేశాడు. ఆ తర్వాత బ్యాగ్‌ని తలకిందులుగా చేసి దులపగానే ఒక్కసారిగా తాచుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. ఒక్కసారిగా విద్యార్థులు, సదరు ఉపాధ్యాయుడు షాక్ అయ్యారు. ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి చెప్పినదాన్ని సీరియస్‌గా తీసుకోకుండా ఉండి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం సంభవించిందో చెప్పనవసరం లేదు. అదీగాక అదృష్టవశాత్తు ఆ పాము ఆ బ్యాగ్ నుంచి బయటపడ్డాక వారిపై దాడి చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు వారంతా. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. మీర కూడా ఓ లుక్కేయండి. कक्षा 10 की छात्रा कु. उमा रजक के बैग से, घर से स्कूल आकर जैसे ही बैग खोला तो छात्रा को कुछ आभाष हुआ तो शिक्षक से शिकायत की, कि बस्ते में अंदर कुछ है, छात्रा के बैग को स्कूल के बाहर ले जाकर खोला तो बैग के अंदर से एक नागिन बाहर निकली, यह घटना दतिया जिले के बड़ोनी स्कूल की है। pic.twitter.com/HWKB3nktza — Karan Vashistha BJP 🇮🇳 (@Karan4BJP) September 22, 2022 (చదవండి: వందేళ్ల బామ్మకి గౌరవ డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా ) -
పగ తీర్చుకున్నాడు.. కాటేసి చంపేసిన పామును.. మెడలో వేసుకుని..
సాక్షి, భువనేశ్వర్: మనిషి పగతో పాము కథ ముగిసింది. మనిషి కాటుతో పాము మృతి చెందింది. ఇది కథ కాదు వాస్తవం. బాలేశ్వర్ జిల్లా దొరొడా గ్రామంలో బుధవారం ఉదయం ఈ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. భోళా శంకరుడి తరహాలో కాటేసి చంపేసిన పామును.. మెడలో వేసుకుని ఊరంతా తిరిగాడు ఓ ప్రబుద్ధుడు. మనసంతా నిండిన ఉక్రోషంతో పాము పట్ల పగ తీర్చుకున్నాడు. ఈ దృశ్యం గ్రామస్తులు, చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే... బాలేశ్వర్ జిల్లా దొరొడా గ్రామానికి చెందిన సలీమ్ నాయక్ తన పొలంలో బుధవారం ఉదయం తిరుగాడుతుండగా కాలిపై నాగుపాము కాటేసింది. అక్కడి నుంచి పారిపోతున్న సర్పాన్ని.. వెంబడించి పట్టుకున్నాడు. తనకు కాటేసినట్లే తాను కూడా పాముని కాటేసి చంపేయాలనుకున్నాడు. పాము రెండు చివర్లు తల, తోక పట్టుకుని మిగిలిన భాగం అంతా ఎక్కడికక్కడ కొరికేశాడు. మాంసం బయట పడేంత వరకు పట్టు వదలకుండా కొరికి, శాంతించాడు. బాధ తాళలేని పాము.. తన నోటితో తానే కాటేశాలా చేశాడు. దీంతో చనిపోయిన సర్పాన్ని మెడలో చుట్టుకుని ఊరిలో ఊరేగాడు. ఇది చూసిన వారి నోటమాట రాకుండా నివ్వెర పోయారు. అయితే పాము కాటుకు మాత్రం ఎటువంటి వైద్యం చేసుకోలేదు. పాము మంత్రం తెలిసిన తాంత్రికునిగా చెప్పుకొని, చికిత్స, వైద్యం నిరాకరించాడు. సంప్రదాయం ప్రకారం చంపిన పాముని దహనం చేయకుండా ఖననం చేయనున్నట్లు వివరించాడు. ఈ ఘటన పట్ల వన్యప్రాణుల సంరక్షణ వర్గాలు ఇంతవరకు స్పందించ లేదు. చదవండి: బొగ్గు కుంభకోణం, బెంగాల్ న్యాయమంత్రిపై సీబీఐ -
వామ్మో పాము.. అలిపిరి నడక మార్గంలో కలకలం
తిరుమల: అలిపిరి నడక మార్గంలోని నరసింహస్వామి ఆలయ సమీపంలో శుక్రవారం ఆరు అడుగుల పొడవైన నాగుపాము కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఎన్ఎస్ ఆలయానికి సమీపంలో నాగుపామును చూసిన స్థానిక సిబ్బంది... టీటీడీ అటవీ విభాగం ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. వెంటనే ఆయన వచ్చి నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఆ పామును అటవీప్రాంతంలో విడిచిపెట్టడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ‘బర్డ్’లో ఉచితంగా గ్రహణం మొర్రి ఆపరేషన్లు తిరుపతి తుడా: గ్రహణం మొర్రితో బాధపడుతున్న పేద పిల్లలకు తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న బర్డ్ ఆస్పత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తామని ఆస్పత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్పరెడ్డి శుక్రవారం తెలిపారు. శస్త్రచికిత్సల కోసం ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీలో పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అపాయింట్మెంట్, ఇతర వివరాల కోసం 7337318107 నంబరులో సంప్రదించాలని సూచించారు. (క్లిక్: వయసులో తండ్రీ కొడుకులకు ఏడేళ్లే తేడా!) -
వారం రోజులపాటు కారులోనే దాగి ఉన్న కోబ్రా... బిత్తరపోయిన యజమాని
తిరువనంతపురం: కేరళలోని ఆర్పూకర నివాసి సుజిత్ ఆగస్టు 2న మలప్పురం వెళ్లారు. అక్కడ వజికడవు చెక్‌పోస్ట్ వద్ద తన కారు ఆగింది. ఆ సయమంలోనే ఒక విషసర్పం కారు వద్దకు వచ్చి అందులో దాగి ఉంది. ఈ విషయం తెలియని కారు యజమాని సుజిత్ ఆర్పూకర్లో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. సుజిత్ ఒక రోజు కారులో వేలాడుతున్న కుబుసం చూసి ఒక్కసారిగా హడలిపోతాడు. దీంతో ఈ విషసర్పం ఇక్కడే ఎక్కడే సంచరిస్తుందని సుజిత్ తన ఇంటి కాంపౌండ్‌ని, కారుని మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేస్తాడు. అయినా ప్రయోజం ఉండదు. దీంతో సుజిత్ కుటుంబం ఒకింత భయబ్రాంతులకు గురైంది. ఈ విషయాన్ని తన చుట్టుపక్కల వాళ్లకు తెలియజేశాడు. ఐతే అక్కడ ఉన్న కొంతమంది స్థానికు పాము కారు వద్ద ఉండటం చూశామని చెప్పడంతో వన్యప్రాణుల సిబ్బందిని పిలిపించారు. వారు వచ్చినప్పుడూ గానీ తెలియలేదు పాము ఎక్కడ ఉందనేది. ఆ విషసర్పం ఏకంగా కారు ఇంజన్ బేస్‌లో ఉంది. బహుశా వజికడుపు చెక్ పోస్ట్ వద్ద ఆగినప్పుడే ఈ పాము వచ్చి ఉంటుందని భావించారు అంతా. అంతేకాదు ఈ పాము ఏకంగా కారు ఇంజన్ బేలోనే వారం రోజులపాటు ఉంది. అలాంటి విషసర్పం సంచరించని ప్రదేశంలోకి వస్తే ఎవరైన కలవరపాటుకి గురవ్వడం సహజమే. (చదవండి: బస్సులో నుంచుని వెళ్లడం ఇష్టం లేక...ఏం చేశాడంటే...) -
మహిళపై పడగవిప్పిన నాగు పాము.. ఆమె ఏం చేసిందంటే?
బెంగళూరు: పొలంలో నిద్రిస్తున్న ఓ మహిళ నాగుపాము కాటు నుంచి తప్పించుకుంది. ఆమెపైకి ఎక్కిన నాగుపాము పడగవిప్పి కాసేపు అలాగే ఉండిపోయింది. ఈ సంఘటన కర్ణాటకలోని కలబురిగి జిల్లా మల్లాబాద్ గ్రామంలో జరిగింది. ఈ దృశ్యాలను స్థానికుడు ఒకరు ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి. పొలంలో ఏర్పాటు చేసుకున్న మంచెపై మహిళ నిద్రపోగా.. నాగుపాము ఆమెపైకి ఎక్కి పడగవిప్పింది. పాము కదలికలతో మేల్కొన్న మహిళ పడగవిప్పిన నాగును చూసి.. కదలకుండా అలాగే ఉండిపోయింది. ఈ ప్రమాదం నుంచి కాపాడు దేవుడా అంటూ వేడుకుంది. కొద్దిసేపు అలాగే పడగవిప్పుకొని ఉన్న పాము మహిళకు ఎలాంటి హాని చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో బాధితురాలు ఊపిరి పీల్చుకుంది. An incident of a cobra ascending on the body of a woman who was sleeping in her field at Mallabad village of Afzalpur taluk on Friday afternoon has come to light on Saturday. However the snake moved out from her body without harming her after few minutes.@XpressBengaluru pic.twitter.com/YJdvwzAfI6 — Ramkrishna Badseshi (@Ramkrishna_TNIE) August 27, 2022 ఇదీ చదవండి: ప్యాంటులో దాచి 60 పాములు, బల్లుల స్మగ్లింగ్.. అధికారులే షాక్! -
బస్సులో నాగుపాము రభస
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం కెఎస్ఆర్టిసి బస్టాండు నుంచి బస్సులో ప్రయాణికులను ఎక్కించుకొని శిడ్లఘట్ట వైపు వెళుతుండగా బస్సులో కలకలం రేగింది. అందరూ ఏమిటా అని చూడగా ఒక నాగుపాము బస్సులో ప్రయాణం చేస్తూ ఉంది. ప్రయాణికులు భయంతో ఒకరిపై ఒకరు పడి కిందకు దిగడానికి ప్రయత్నించారు. ఈ అల్లరితో పాము ఇంజన్ వద్దకు జారుకుంది. పాముల నిపుణుడు పృథ్వీరాజ్‌ను పిలిపించగా, ఆయన పామును పట్టి దూరంగా వదిలేశారు. బస్సు శిడ్లఘట్టకు వెళ్లిపోయింది. (చదవండి: అయ్యో పాపం.. ప్లాస్టిక్ దారంతో విలవిల్లాడిన అడవి కుక్క) -
భయానక వీడియో: కాలనాగు నుంచి బిడ్డను కాపాడుకుంది
వైరల్: కర్ణాటక మాండ్య నుంచి భయానక వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతోంది. ఓ తల్లి సమయస్ఫూర్తితో భారీ విష సర్పం కాటు నుంచి బిడ్డను రక్షించుకుంది. రెప్పపాటులో ఆ బిడ్డకు ఘోర ప్రమాదమే తప్పింది. ఆ తల్లీబిడ్డలు ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వస్తున్న టైంలో ఈ ఘటన జరిగి ఉంటుందని స్పష్టం అవుతోంది. ఇంటి బయట మెట్ల కింద నుంచి పాము వెళ్తోంది. ఆ సమయంలో పామును గమనించకుండా ఆ చిన్నారి కిందకు కాలు వేయబోయాడు. అంతలో.. ఆ తల్లి చూపించిన తెగువ, సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు పలువురు. ఎంతైనా అమ్మ కదా! View this post on Instagram A post shared by India Today (@indiatoday) -
వామ్మో.. షూలో నాగుపాము.. ‘షూ’ వేసుకుందామనేసరికి.. బుసలు కొడుతూ..
శివమొగ్గ(కర్ణాటక): ఓ వ్యక్తి ‘షూ’ లోపల నాగుపాము పడకేసింది. ‘షూ’ వేసుకుందామని కదిలించేసరికి.. బుసకొడుతూ బెంబేలెత్తించింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ శివారులోని బొమ్మానకట్టెలో మంగళవారం చోటుచేసుకుంది. బొమ్మానకట్టెకు చెందిన మంజప్ప మంగళవారం ఉదయం ఇంటి బయట ఉంచిన షూ వేసుకోవడానికి ప్రయత్నించగా.. ఒక్కసారిగా నాగుపాము బుసలు కొట్టింది. చదవండి: వేరే మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్య సహించలేక.. దీంతో భయభ్రాంతులకు గురైన కుటుంబసభ్యులు వెంటనే బయటకు పరుగు తీశారు. దీని గురించి స్నేక్ కిరణ్‌కు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న కిరణ్.. పామును జాగ్రత్తగా బయటకు తీసి గ్రామానికి దూరంగా తీసుకెళ్లి వదిలివేశాడు. వర్షాకాలంలో షూ వేసుకునేముందు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని స్నేక్ కిరణ్ సూచించాడు. -
పురాతన శివాలయం.. గర్భగుడిలో నాగుపాము ప్రత్యక్షం
సాక్షి, ఖమ్మం జిల్లా: కూసుమంచిలోని కాకతీయుల కాలం నాటి శివాలయం లో ఓ నాగు పాము ప్రత్యక్ష మైంది. సోమవారం కావడంతో తెల్లవారు జామునే ఆలయ పూజారి శేషగిరి శర్మ.. శివునికి పూజలు చేసేందుకు గుడి తలుపులు తీశారు. అప్పటి వరకు శివలింగంపైన ఉన్న నాగుపాము కిందకు దిగి శివలింగం పక్కనే పడగ విప్పి ఉండటంతో అక్కడకు వచ్చిన భక్తులు అంతా శివుని మహిమే అంటూ నాగుపాముకు దండం పెట్టుకుని శివునికి పూజలు చేశారు. ఓ పావుగంట గర్భ గుడిలో ఉన్న నాగుపాము గుడిలో నుంచి బయటకు వచ్చింది. చదవండి: అలా జరిగింది.. రూపాయితో 20 వేలు! -
నాగుపాముకి అరుదైన శస్త్రచికిత్స
ఒడిశా (భువనేశ్వర్) : నాగుపాముకి అరుదైన శస్త్రచికిత్స చేసి, దాని పొట్టలో ఇరుక్కున్న సారా సీసా మూతను వైద్యులు తొలగించారు. ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్న పాము ఆరోగ్య పరిస్థితులను దాదాపు వారం రోజుల పాటు పరిశీలిస్తారు. నాలుగు రోజుల తర్వాత దానికి ద్రవ పదార్థాలను మాత్రమే ఆహారంగా ఇచ్చి, క్రమంగా కోలుకునేలా జాగ్రత్త వహిస్తారు. వివరాలిలా ఉన్నాయి.. స్థానిక వాసుదేవ్ నగర్‌లోని నిర్మాణ దశలో ఉన్న ఓ భవనం దగ్గరున్న కొట్టు గదిలో మూడున్నర అడుగుల నాగుపాముని అక్కడి కార్మికులు గుర్తించి, స్నేక్ హెల్ప్‌లైన్‌కు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది పామును చాకచక్యంగా పట్టుకుని, పరిశీలించగా, పాము పొట్ట భాగంలో ఏదో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ మూగజీవాల చికిత్స విభాగానికి తరలించగా, అక్కడ తీసిన ఎక్స్–రేలో పాము పొట్టలో సీసా మూత ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మూగజీవాల శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ ఇంద్రమణి నాథ్, రేడియాలజీ నిపుణులు డాక్టర్ సిద్ధార్థ్ శంకర బెహరా ఆ పాముకు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి, సీసా మూతను తొలగించారు. -
Viral Video: కొ.. కొ.. కోబ్రా! లగెత్తండ్రోయ్!!.. ఆగండి..!
మీకు పాములంటే భయం లేదా.. ఐతే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీ అభిప్రాయం మార్చుకుంటారు. పెద్ద కోబ్రాను ఏమాత్రం జంకుబొంకు లేకుండా, అసలుతత్తరపాటే లేకుండా ఓ మహిళ ఒట్టిచేతులతోనే పట్టుకుందండీ! ఈ వీడియో చూస్తేనే గుండెకాయ గొంతులోకొచ్చినంత పనౌతుంది! ధైర్యముంటే.. మీరు చూడండి. ఓ పాడుబడ్డ ఇంటిలో పడగ విప్పి బుసలు కొడుతున్న భారీ కోబ్రాను ఒక మహిళ ఒట్టి చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. చుట్టూ చూస్తున్న జనాలు భయంతో దూరంగా పారిపోగా ఆమె మాత్రం చాలా చాకచక్యంగా, ధైర్యంగా కోబ్రాను చేతులతో పట్టుకుని ఇంటి నుంచి బయటికి తెచ్చి, బయట రోడ్డు పక్కన వదిలిపెడుతుంది. ఐతే కోబ్రా మళ్లీ అదే ఇంటివైపు వెళ్లడానికి ప్రయత్నించగా, ఆమె కోబ్రా తలను గట్టిగా పట్టుకుని గోనె సంచిలో వేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ మొత్తం వీడియోలో కోబ్రా అనేక సార్లు సదరు మహిళపై దాడి చేయగా, ఆమె మాత్రం చాలా అలవోకగా దాని దాడి నుంచి తప్పించుకుంటుంది. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! నాలుగు నిముషాల నిడివిగల ఈ వీడియోను ‘అమేజింగ్ క్యాచ్ స్నేక్ బై హ్యాండ్’ క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది పాత వీడియో అయినప్పటికీ ఇపుడు సామాజిక మాధ్యమాల్లో మళ్లీ వైరల్ అవుతోంది. ఆ మహిళ పాము పట్టే నైపుణ్యాన్ని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. దీంతో లక్షల మంది ఆసక్తిగా ఈ వీడియోను వీక్షిస్తున్నారు. ఇక వేలల్లో లైకులు, విభిన్న కామెంట్లతో తిరిగి వార్తల్లో నిలిచింది. చిన్న పామును కిలోమీటరు దూరం నుంచి చూసినా.. నాకు హార్ట్ అటాక్ వస్తుందని ఒకరు, మృత్యువుతో ఆటలాడినందుకు ఆమెకు ఒలంపిక్ మెడల్ ఇవ్వాలని మరొకరు, ఈ క్యాచింగ్ స్టైల్ చాలా ప్రమాదకరమైనది. ఆమె అదృష్టం బాగుందని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ దైర్యంగా ఉండటం మంచిదేకానీ విష సర్పాల జోలికి వెళ్లే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. చదవండి: Viral Video: బాబోయ్..! చావును ముద్దాడాడు.. -
పాఠశాలలో నాగుపాము కలకలం
చెన్నారావుపేట: మండలంలోని పాపయ్యపేట హైస్కూల్లో పాము కలకలం రేపింది. పాఠశాలలోని ఓ గదిలో నాగుపాము దర్శనమిచ్చింది. బుధవారం అన్ని గదులు శానిటైజర్ చేశారు. తొమ్మిదో తరగతి గదిని గురువారం శానిటైజర్ చేయడానికి తలుపులు తీయగా ఆ గదిలో నాగుపాము కనిపించింది. ఇన్ని రోజులు పాఠశాలలు తెరిచి లేకపోవడంతోనే పాము కిటికి నుంచి లోపలకి వచ్చి ఉంటుందని ఉపాధ్యాయులు తెలిపారు. అనంతరం పామును సురక్షింతంగా పంట పొలాల్లోకి వెళ్లగొట్టినట్లు హెచ్ఎం స్వామి, వేణు, నాగరాజు, ఎస్ఎంసీ చైర్మన్ జాటోత్ యాకూబ్, జీపీ సిబ్బంది జున్న శ్రీను, తదితరులు ఉన్నారు. -
అయ్యో పాపం ఉత్తర.. త్వరలోనే ఆ దుర్మార్గుడికి శిక్ష!
కేరళలో గత ఏడాది నుంచి వరకట్న వేదింపుల సమస్యలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మే 7, 2020న కొట్టరక్కాకు చెందిన ఉత్తర అనే దివ్యాంగురాలైన వివాహిత పాము కాటుతో మరణించినట్లుగా తొలుత వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే, ఉత్తర తల్లిదండ్రులకు అనుమానం వచ్చి కేసు నమోదు చేయగా ఆస్తి కోసం ఆమెను పెళ్లాడిన భర్త సూరజ్ పకడ్బందీగా ప్లాన్ చేసి చంపినట్లుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఈ క్రమంలో దర్యాప్తు ముమ్మరం చేసిన కేరళ పోలీసు బృందం సజీవ పాము, డమ్మీ చేతిని ఉపయోగించి సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు ప్రయత్నించారు. కొల్లం జిల్లాలోని అరిప్పలో అటవీ శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర శిక్షణా కేంద్రంలో ఈ ప్రయత్నం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను గురువారం మీడియాకు విడుదల చేశారు. కోర్టుకు సమర్పించిన ప్రదర్శన వీడియో ప్రాసిక్యూషన్ కేసులో కీలకం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. మంచంపై పడుకున్న డమ్మీ బొమ్మపై నాగుపామును విడిచారు. If you don't like snakes, don't watch. Kerala police tried to reconstruct Uthra’s murder using a live cobra and a dummy pic.twitter.com/NNwkSicbIi — Dhanya Rajendran (@dhanyarajendran) August 26, 2021 ఈ విషయం గురించి మహీంద్రా వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ ఛైర్మన్ మనీష్ కుమార్ చెబుతూ.. "మేము చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. పామును డమ్మీ శరీరంపై రెండు, మూడు సార్లు పడేశాను, కానీ అది ఆ బొమ్మను ఏమీ చేయలేదు. ఆ తర్వాత మా బృందం పామును రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. చికెన్ మాంసం ముక్కను డమ్మీ చేతికిచుట్టూ చుట్టి పాము ముందు అనేకసార్లు ఊపారు. అయితే, నాగుపాము ఆ చేతిని కరవలేదు. ఎందుకంటే నాగుపాము జాతులు సాధారణంగా రాత్రి పూట చాలా చురుకుగా ఉండవు. పామును అంతగా రెచ్చగొట్టినప్పటికీ అది దాడి చేయలేదు" అని మనీష్ కుమార్ అన్నారు.(చదవండి: అమ్మా.. నీవు లేని లోకంలో నేనుండలేను..) If you don't like snakes, don't watch. Kerala police tried to reconstruct Uthra’s murder using a live cobra and a dummy. This is the video pic.twitter.com/C8XPTy1m3y — Dhanya Rajendran (@dhanyarajendran) August 26, 2021 పామును డమ్మీ చేతి ద్వారా తాకడానికి ప్రయత్నించినప్పుడు అనేక ప్రయత్నాల తర్వాత నాగుపాము కరుస్తుంది. ఈ సహజ కాటును బృందం కొలిచింది. అప్పుడు ఆ కాటు వెడల్పు 1.7 సెం.మీ. దీని తర్వాత బృందం పాము తలను పట్టుకొని దాని కోరలను డమ్మీ చేతికి చుట్టిన చికెన్ మాంసాన్ని కరిపించారు. "కోరల వెడల్పులో మార్పులను మేము గమనించాము. మొదటి కాటు 2 సెం.మీ, రెండవ కాటు 2.4 సెం.మీ" అని మనీష్ కుమార్ చెప్పారు. ఈ బృందం.. పాము కదిలే దవడను ఒక స్కేలును ఉపయోగించి కొలిచింది. దాని దవడ 2 నుంచి 2.5 సెం.మీ వెడల్పు ఉంది. అందువల్ల సహజ కాటు మధ్య మార్పులు ఉన్నాయి అని అన్నారు. 2020 మే 7న కొల్లంలోని అంచల్ లోని తన తల్లిదండ్రుల ఇంట్లో ఇరవై ఆరేళ్ల ఉత్తర శవమై కనిపించింది. ఆమె భర్త సూరజ్ ఒక బ్యాంకు ఉద్యోగి. పాము పట్టే వ్యక్తి నుంచి కొనుగోలు చేసిన విషపూరిత పాము చేత ఆమెను చంపించాడు. ఉత్తర తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసు స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేశారు. అతను అరెస్టు అయిన తర్వాత సూరజ్ నేరాన్ని అంగీకరించాడని, అతను ఉత్తర నిద్రమాత్రల వల్ల మత్తులో ఉన్నప్పడు నాగుపామును ఆమెపై వేస్తే అది కరవడం వల్ల ఆమె చనిపోయినట్లు పేర్కొన్నాడు.(చదవండి: ఉసురు తీసిన మద్యం మత్తు) ఉత్తర చంపడానికి సూరజ్ చేసిన రెండవ ప్రయత్నం ఇది అని పోలీసులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు మార్చి 2020లో ఉత్తర కొరకే ఆ పామును అద్దెకు తీసుకున్నాడు. అయితే, ఆమె తన తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉన్నప్పడు ఆమె నాగుపాము కాటుకు గురై చనిపోయింది. అతని తల్లిదండ్రులు, సోదరి ఆమెను చంపడంలో సహాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసు ఇప్పుడు తీర్పు స్థాయికి వచ్చింది. అందుకే కోర్టుకు సమర్పించిన ప్రదర్శన వీడియో(సీన్ రీకన్స్ట్రక్షన్) ప్రాసిక్యూషన్ కేసులో కీలకం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. -
cannibalism: నాగుపామును మింగేసిన మరో నాగుపాము
భువనేశ్వర్ : కన్నిబలిజం.. ఈ మాట అంత పాపులర్ కాకపోయినా.. అప్పుడప్పుడూ తెరపైకి వస్తూ ఉంటుంది. కన్నిబలిజాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తే ‘స్వజాతి భక్షణ’ అని అర్థం. మరింత వివరంగా చెప్పాలంటే ఓ మనిషి, మరో మనిషిని తినటం.. ఓ సింహం మరో సింహాన్ని తినటం అన్న మాట. తాజాగా, కన్నిబలిజానికి సంబంధించిన ఓ వార్త ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఒరిస్సా, కదురా జిల్లాలోని బాలకటి గ్రామంలో నాలుగు అడుగుల నాగుపాము.. మూడు అడుగుల నాగుపామను చుట్టి మింగేసింది. ఇది గమనించిన స్థానికులు సుదేందు మాలిక్ అనే వన్యప్రాణి సంరక్షకుడికి ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అతడు.. పామను పట్టుకుని అడవిలో వదిలేశాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ 3 అడుగుల నాగుపామును మింగేసినందుకు.. 4 అడుగుల నాగుపాము మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయండి’’.. ‘‘నాదో అనుమానం.. వన్యప్రాణి సంరక్షకుడికి ఎవరు ఫోన్ చేశారు.. 3 అడుగుల పామా? నాలుగు అడుగుల పామా?’’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. చదవండి : ఆన్లైన్ క్లాస్‌లోకి హ్యాకర్.. పోర్న్ వీడియోలతో రచ్చ -
పాముకు ఊపిరి ఊది ప్రాణం నిలిపిన యువకుడు, వీడియో వైరల్
భువనేశ్వర్: శ్వాస అందక.. ఎవరైనా ప్రాణాపాయ స్ధితిలో ఉంటే నోట్లో నోరు పెట్టి ఊపిరి అందించడం చూసివుంటాము. అయితే, జంతువులు, సరిసౄపాలకు ఆ సమస్య వస్తే సాయం అందించేదెవరు? వాటి ప్రాణం నిలిపేదెవరు? ముఖ్యంగా విష సర్పాలు కనిపిస్తేనే అంత దూరం పరుడెత్తడం మానవ నైజం. కానీ, ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఓ యువకుడు ఏకంగా ప్రాణాపాయంలో ఉన్న పాముకు ఊపిరి ఊది ప్రాణం పోసాడు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మల్కన్‌గిరిలోని నౌగుడా గ్రామంలో ఓ ఇంట్లో పాము చొరబడింది. దానిని చూసి స్థానికులు వణికిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్ స్నేహాశీష్ అనే యువకుడికి సమాచారం ఇచ్చారు. అతడు స్థానికంగా పాములను పట్టి అడవుల్లో వదిలిపెడుతుంటాడు. ఇంట్లోకి చొరబడిన పామును చాకచక్యంగా పట్టి బయటకు తీసుకొచ్చాడు. అది దాదాపు 10 అడుగుల పొడవు ఉంది. కానీ ఆ పాము అపస్మారక స్థితికు చేరుకుంది. శ్వాస అందక పాము విలవిల్లాడుతోందని గుర్తించిన.. స్నేహాశీష్ ఊపిరి ఊదితే బతుకుతుందని అనుకున్నాడు. కానీ, పాము ఊపిరి ఊదడం ఎలా అని చూస్తుండగా.. అక్కడ ఓ స్ట్రా కనిపించింది. దాన్ని తీసుకుని పాముని పట్టుకుని దాని నోట్లోకి స్ట్రా పెట్టి ఊపిరి ఊదాడు. అలా కొన్నిసార్లు చేసినా పాము కదల్లేదు. దాదాపు 15 నిమిషాలపాటు స్నేహాశీష్ పాముకు ఊపిరి అందిస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఆ పాము స్పృహలోకి వచ్చింది. పాముకు ప్రాణాపాయం తప్పిందనుకున్న తర్వాత సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఇక పాముకు ప్రాణం పోసిన యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి:Odisha: హిజ్రాలకు పోలీసు ఉద్యోగాలలో అవకాశం.. -
పాముతో చెలగాటం.. వ్యక్తి మృతి
బైరెడ్డిపల్లె (చిత్తూరు జిల్లా): పామును పట్టుకుని ఆటలాడిన ఓ వ్యక్తి.. అదే పాము కాటుకు గురై మృత్యువాత పడ్డాడు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె పట్టణంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బైరెడ్డిపల్లె మెయిన్‌రోడ్డులో ఉన్న ఓ జ్యువెలరీ షాపులోకి సోమవారం మధ్యాహ్నం ఓ నాగుపాము చొరబడింది. షాపు యజమాని ఏమీ చేయలేని పరిస్థితిలో నిమ్మకుండిపోయాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న అసాదుల్లా (52) దుకాణంలో ఉన్న నాగుపామును చూసి చేతిలోకి తీసుకుని దాంతో కొంతసేపు ఆటలాడాడు. పామును తల వద్ద పట్టుకుని ఏమరపాటుగా ఉన్న సమయంలో అది అతని చేతిపై కాటు వేసింది. దీంతో పామును చితకబాది చంపేశాడు. అయితే, అదే రోజు సాయంత్రం అసాదుల్లా పరిస్థితి విషమించడంతో గుట్టూరు జేఎంజే ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం పలమనేరుకు తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కుమారులున్నారు. -
పేషెంట్ బెడ్ కింద పాము.. రోగుల పరుగులు
సాక్షి, ఆదిలాబాద్ : రిమ్స్‌లో నాగుపాము కలకలం రేపింది. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు కానీ మెటర్నటీ వార్డులోకి చొరబడిన నాగుపాము కాసేపు వార్డులో సంచరించింది. వార్డులో ఉన్న వారు బిగ్గరగా కేకలు వేయడంతో వారి శబ్ధానికి అక్కడి నుంచి మూత్రశాలలోకి వెళ్లింది. మూత్రశాలలో చెత్తాచెదారం ఉండడంతో ఎంత వెతికినా పాము దొరకలేదు. చివరకు వార్డు నుంచి రోగులను వేరే గదికి మార్చారు. కాగా రిమ్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే, తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. జిల్లా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. చదవండి: ఒక తల్లి పాము..70 పిల్ల పాములు.. -
5 అడుగుల విషనాగు.. ఒంటి చేత్తో పట్టుకొంది!
భువనేశ్వర్: సాధారణంగా మనలో చాలా మంది చిన్న బల్లిని చూస్తేనే అరిచి గోల గోల చేస్తుంటారు. అలాంటిది పామును చూస్తే ఇంకేమైనా ఉందా! పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది ఓ మహిళ మాత్రం ఐదడగుల పామును సునాయాసంగా చేత్తో పట్టుకుని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉండే స్వరూప భట్నాగర్ బయటకు వెళ్దామని ఇంటి తలుపు తీసింది. సరిగ్గా అప్పుడే అనుకోని అతిథి ఇంటికి రావడాన్ని చూసి షాక్‌కు గురైంది. వెంటనే లోపలికి వెళ్ళి డోర్ పెట్టేసుకుంది. ఇంతకీ ఆ అతిథి ఏవరోకాదు.. 5 అడుగుల నాగుపాము. దాని భయంతో ఇంట్లోనే ఉండిపోయిన ఆమె ఆ సర్పం అక్కడ నుంచి వెళ్లిపోయిందా? లేదా? అని కిటికిలో నుంచి తొంగి చూసింది. ఆ నాగుపాము బయట పార్కింగ్ చేసిన ఒక స్కూటీపై ఎక్కి పడగ విప్పింది. ఇది గమనించిన స్వరూపభట్నాగర్ వెంటనే, స్నేక్ క్యాచర్ సుబేందు మల్లిక్‌కు సమాచారం అందించింది. పాములను పట్టుకొవడంలో మంచి ఎక్స్పర్ట్ అయిన సుబేంద్ క్షణాల్లో అక్కడకు చేరుకుంది. బుసలు కొడుతున్న నాగుపామును ఒక కర్ర సహయంతో పట్టుకుని అటవీ ప్రదేశంలో వదిలేసింది. సాధారణంగా పాములు ఆహరం కోసం బయట సంచరిస్తాయని, ఆ క్రమంలోనే ఇక్కడకు వచ్చి ఉంటుందని చెప్పింది. గత కొన్నిరోజులుగా ఆ పాముకు ఆహారం కరువైనట్లు కనిపిస్తోందని, దానివల్ల కొంత నీరసంగా ఉందని తెలిపింది. చదవండి: వైరల్: చేతిలో పైథాన్, భుజంపై చిలుక.. -
అరుదైన దృశ్యం: పాముకు నీరు తాగించాడు..
అరుదైన దృశ్యం.. నాగుపాముకు ఓ వ్యక్తి బాటిల్‌తో నీరు తాగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియోను అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా మంగళవారం షేర్ చేయడతో వైరల్‌గా మారింది. దీనికి ‘ప్రేమ, నీరు.. ఈ రెండు జీవితంలో ముఖ్యమైనవి’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ వీడియోలో ఓ వ్యక్తి దాహంతో ఉన్న నాగుపాముకు దగ్గరగా వెళ్లి దాని నోటికి వాటర్ బాటిల్ అందించాడు. అప్పుడు ఆ పాము నీరు గుటగుట తాగేస్తున్న ఈ వీడియోకు ఇప్పటి వరకు 9వేలకు పైగా వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికి వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. పాముకు దగ్గరగా వెళ్లి మరీ నీరు తాగిస్తున్న సదరు వ్యక్తి ధైర్యానికి అవాక్కవుతూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘విషపూరితమైన నాగుపాముకు అంత దగ్గర వెళ్లడమంటే సాధారణ విషయం కాదు’, ‘ధైర్యం, కరుణ రెండూ ఒకేసారి పనిచేస్తున్నాయి’, ‘ఇది నిజంగా నమ్మశక్యం కాని దృశ్యం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Love & water... Two best ingredients of life pic.twitter.com/dy3qB40m6N — Susanta Nanda IFS (@susantananda3) February 16, 2021 (చదవండి: త్వరపడండి: పద్యాలు చెప్తే లీటర్ పెట్రోల్ ఉచితం!) (ప్రీ వెడ్డింగ్ ఫోటోలను షేర్ చేసిన ప్రియాంక గాంధీ) -
ఇంట్లో నాగుపాముల గుట్ట
-
వామ్మో.. ఇంట్లోనే నాగుపాముల గుట్ట
భువనేశ్వర్ : భద్రక్ జిల్లాలోని కొలై పంచాయతీ, రంగరాజ్‌పూర్ ప్రాంతంలోని బిజయ్ బిశ్వాల్ ఇంట్లో నాగుపాముల గుట్ట బయటపడింది. దాదాపు వారం రోజుల నుంచి పాముల బుసలబుసల చప్పుడు వినబడడంతో సందేహించిన కుటుంబ సభ్యులు స్నేక్ హెల్ప్ లైన్ అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో మీర్జా అరీఫ్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన స్నేక్ హెల్ప్ లైన్ బృందం సుమారు 6 గంటల పాటు శ్రమించి, 43 నాగుపాము పిల్లలతో పాటు ఓ తల్లి నాగుపామును పట్టుకున్నారు. వీటితో పాటు పొదగని 58 పాము గుడ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన పాముపిల్లల దృష్ట్యా సంఘటన స్థలంలో కనీసంగా 3 తల్లి పాములు ఉండొచ్చని అధికారులు అభిప్రాయ పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కటి మాత్రమే పట్టుబడగా, మరో 2 పెద్దపాములు ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. -
ష్... గిరినాగు!
గిరినాగు... దట్టమైన అరణ్యాలకే పరిమితమైన పాము. అత్యంత విషపూరితమే అయినా ప్రకృతిలో ఇతరత్రా విషపూరిత, విషరహిత పాములను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. తద్వారా అవి అసంఖ్యాకంగా పెరిగిపోకుండా ప్రజలకు పరోక్షంగా మేలు చేస్తోంది. చాలా అరుదుగానే కనిపించే ఈ పాము ఇటీవల పొలాలు, జనవాసాల మధ్యకు వచ్చేస్తోంది. గత రెండు నెలల కాలంలోనే జిల్లాలోని తెనుగుపూడి అటవీ ప్రాంతంలో ఐదు ప్రత్యక్షమయ్యాయి. ఒక దాన్ని ప్రాణభయంతో రైతులు చంపేశారు. వాటి సంరక్షణపై అవగాహనతో కొంతమంది ఇచ్చిన సమాచారంతో నాలుగు సర్పాలను అటవీశాఖ అధికారులు, తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ ప్రతినిధులు కాపాడారు. సాక్షి, విశాఖపట్నం: మన జిల్లాలోని ఏజెన్సీతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో విస్తరించిన తూర్పు కనుమల్లో అటవీ ప్రాంతం గిరినాగులకు ఆవాసంగా ఉంది. జిల్లాలో ముఖ్యంగా దేవరాపల్లి, చీడికాడ మండలాలతో పాటు అనంతగిరి, హుకుంపేట మండలాల్లో కొంతమేర విస్తరించి ఉన్న సుమారు 10వేల హెక్టార్ల తెనుగుపూడి అటవీ ప్రాంతంలో గిరినాగులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. వీటి పొడవు పది నుంచి పద్నాలుగు అడుగులు. (వైరల్ వీడియో.. కింగ్ కోబ్రాకు తలస్నానం) అత్యంత ప్రమాదకర కాలం... మార్చి నుంచి జూన్ నెల వరకూ ఆడ, మగ గిరినాగులు సంగమించే కాలం. మగ పాములను ఆకర్షించేందుకు ఆడ గిరినాగు ఫెరామోన్స్ అనే ఒకవిధమైన రసాయన పదార్థాన్ని తన శరీరం నుంచి వెదజల్లుతుంది. ఆ వాసనను బట్టి మగ గిరినాగులు ఎక్కడున్నా వాటిని అనుసరిస్తుంటాయి. అలాగే ఈ వేసవిలో అటవీ ప్రాంతంలో జలవనరులు తగ్గిపోయినప్పుడు నీటి చెమ్మను వెతుక్కుంటూ పొలాల్లోకి వచ్చేస్తుంటాయి. ఇక రబీ సీజన్ తర్వాత పొలాల్లో నాగుపాములు, రక్తపొడ, కట్లపాము వంటి విషపూరిత పాములతో పాటు జెర్రిగొడ్డు వంటి విషరహిత పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. వాటిని తినేందుకు వచ్చేస్తుంటాయి. ఒకరకంగా చెప్పాలంటే గిరినాగులకు ఈ నాలుగు నెలల కాలమూ ప్రాణసంకటమే. ఇవి కనిపించినపుడు ప్రాణభయంతో రైతులు చంపేస్తున్నారు. (ఇంటి పై కప్పు మీద నాగుపాము) ఇటీవలే చీడికాడ మండలంలో భారీ గిరినాగును కొట్టి చంపేశారు. వీటిపై అవగాహన ఉన్నవారు ఏమాత్రం సమాచారం ఇచ్చినా అటవీశాఖ అధికారులు, తూర్పు కనుమల వన్యప్రాణుల సంస్థ ప్రతినిధులు స్పందిస్తున్నారు. సకాలంలో చేరుకొని గిరినాగులను పట్టుకుంటున్నారు. తర్వాత వాటిని అటవీ ప్రాంతంలో వదిలేస్తున్నారు. ఇలా గత ఏడాది కాలంలో జిల్లాలో పది గిరినాగులను సంరక్షించారు. వాటిలో నాలుగు గత రెండు నెలల్లో దొరికినవే ఉన్నాయి. ఒకదాన్ని మాత్రం దేవరాపల్లి మండలంలో ఇటీవల కొంతమంది రైతులు ప్రాణభయంతో చంపేశారు. గిరినాగు కనిపిస్తే అటవీ శాఖ స్థానిక సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. గిరినాగుల సంరక్షణ కోసం పనిచేస్తున్న తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ ప్రతినిధులకు 86391 24883 నంబరులో సంప్రదించాలి. వారు వచ్చి ఆ పామును పట్టుకుంటారు. దాన్ని సురక్షితంగా రక్షిత అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి జనావాసాలకు దూరంగా వదిలిపెడతారు. పదేళ్ల నుంచి సర్వే చేస్తున్నాం... గిరినాగు అరుదైన సర్పజాతి. కాటేస్తే పది నిమిషాల్లోనే ప్రాణం పోయే ప్రమాదం ఉంది. వీటిని కాపాడటానికి అటవీశాఖ సహకారంతో పదేళ్లుగా సర్వే చేస్తున్నాం. నాలుగేళ్ల క్రితం విశాఖ డివిజన్లో ప్రారంభించాం. గిరినాగు సహా వన్యప్రాణులను చంపవద్దని, మాకు సమాచారం ఇస్తే వాటిని పట్టుకుంటామని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. పాము కనిపిస్తే వెంటనే సమాచారం ఇస్తున్నారు. – మూర్తి కంతిమహంతి, తూర్పు కనుమల వన్యప్రాణుల సంస్థ ప్రతినిధి కనిపిస్తే సమాచారం ఇవ్వండి... తెనుగుపూడి అటవీ ప్రాంతంలో ఇటీవల కాలంలో నాలుగు గిరినాగు పాములను పట్టుకున్నాం. వీటిని జనావాసాలకు దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేశాం. పాములు కనిపించినపుడు ప్రాణభయంతో చంపేయవద్దు. అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. హోర్డింగ్‌లను ఏర్పాటు చేశాం. – ఎం.రమేష్‌కుమార్, అటవీశాఖ అధికారి, తెనుగుపూడి ఫారెస్ట్ ఏరియా -
ఎక్కడా చోటు లేదని ఇక్కడ దాక్కున్నావా..
-
ఎక్కడా చోటు లేదని ఇక్కడ దాక్కున్నావా..
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో వారి వాహనాలను కూడా ఎవరు బయటికి తీయడం లేదు. రోడ్డు మీద జనాలు కనిపించకపోవడంతో అడవుల్లో ఉండాల్సిన జంతువులు రోడ్డు మీద సంచరిస్తున్న వీడియోలు ఎన్నో చూశాం. అయితే ఇక్కడ మాత్రం ఒక పాము ఎక్కడా చోటు లేనట్టు యాక్టివా బైక్ హెడ్ లైట్స్లోకి దూరి ప్రశాంతంగా నిద్రపోయింది. అయితే బండి తీద్దామని దగ్గరకు వచ్చిన యజమానికి శబ్దం వినిపించడంతో అప్రమత్తమయ్యాడు. బైక్‌లో నుంచి పాము చేసే శబ్ధం స్పష్టంగా వినిపిస్తుడడంతో వెంటనే పాములను పట్టే నిపుణులకి సమాచారం అందించాడు. కాగా నిపుణుడు వచ్చి బైక్‌ను పరీక్షించగా బండి హెడ్‌లైట్‌లో ఉన్నట్లు తెలిసింది. బండికున్న డోమ్ తీసి పామును బయటికి తీయాలని చూడగా అది ఒక్కసారిగా బుసలు కొడుతూ ఉవ్వెత్తున పైకి లేచింది. దీంతో పామును తెలివిగా ఏమారుస్తూ తన వెంట తెచ్చుకున్న వాటర్క్యాన్లోకి పంపించి మూత పెట్టేశాడు. ఆ తర్వాత దానిని వదిలేందుకని మూత తీయగా పాము మెడకు క్యాప్ చుట్టుకుపోయింది. దాంతో పాము విలవిలలాడుతూ బుసలు కొట్టే ప్రయత్నం చేసింది. దీంతో కొద్దిసేపు మూతను బయటికి తీయడానికి ప్రయత్నించి చివరకు ఎలాగోలా దానిని బయటికి తీసి పామును వదిలిపెట్టారు. ప్రసుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. -
ఏకంగా 47 నాగు పాములు ...
సాక్షి, మెదక్ : సాధారణంగా పాము మన కంటపడితేనే గుండె అదిరి అల్లంత దూరం పారిపోతాం. అలాంటి ఏకంగా 47 నాగుపాములు ఓ ఇంట్లో దర్శనమిస్తే..! నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ఇది నిజం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కొంక లచ్చల్ అనే వ్యక్తి తన ఇంటికి మరమ్మతులు చేసేందుకోసం మెట్లకింద ఉన్న పాత సామగ్రిని తీస్తుండగా 47 నాగు పాములు బయట పడ్డాయి. ఒకేసారి అన్ని పాములు బయట పడడంతో భయాందోళకు గురైన లచ్చల్, ఇరుగుపొరుగు వారి సాయంతో వాటిని మట్టుబెట్టాడు. -
బ్యాంకులో నాగుపాము హల్చల్
సాక్షి, తిరుత్తణి : బ్యాంకులో చొరబడిన నాగుపాము హల్చల్ రేపింది. దీంతో ఖాతాదారులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన తిరుత్తణిలో మంగళవారం చోటుచేసుకుంది. తిరుత్తణి బస్టాండుకు సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఖాతాదారులు వేచివున్న సమయంలో బ్యాంకు ముందు భాగంలోని నీటి ట్యాంకు నుంచి దాదాపు మూడు అడుగుల పొడవున్న నాగుపాము బ్యాంకులోకి ప్రవేశించడాన్ని గుర్తించిన ఖాతాదారులు కేకలు వేస్తూ భయంతో పరుగులు తీసారు. బ్యాంకు సిబ్బంది సైతం ఆందోళన చెందారు. ఇంతలో అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారంతో బ్యాంకు వద్దకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది దాదాపు అర్ధగంట పాటు శ్రమించి పామును పట్టుకోవడంతో వినియోగదారులు, బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం దాన్ని అడవిలో విడిచిపెట్టారు. -
బేగంపేట ఫ్లైఓవర్‌పై నాగుపాము హల్చల్
-
బేగంపేట ఫ్లైఓవర్‌పై నాగుపాము హల్చల్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బేగంపేట ఫ్లైఓవర్‌పై ఓ నాగుపాము హల్చల్ చేసింది. బుసలు కొడుతూ ఫ్లైఓవర్ పైకి రావడంతో ఎక్కటి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. మొదటగా రోడ్డు పక్కన ఉన్న పూలకుండిలో పామును గమనించిన ప్రయాణీకులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు, యువకులు పామును పట్టుకునేందుకు ప్రయత్నించడంతో అది రోడ్డుపైకి వచ్చింది. పామును చూసిన వాహనదారులు భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. కాసేపటి తర్వాత ఓ యువకుడు పామును పట్టుకొని పొదల్లో విడిచిపెట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, పాము హల్చల్ కారణంగా ఫ్లైఓవర్‌కు ఇరువైపుల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. -
ఇంటి ముందు నాగరాజు ప్రత్యక్షం
కర్ణాటక ,గంగావతి: కారటగి తాలూకాలోని సిద్దాపుర గ్రామంలోని 7వ వార్డులో ఓ ఇంటి ముందు నాగుపాము ప్రత్యక్షమై సుమారు 3 గంటల పాటు అక్కడే పడగ విప్పి నిలవడం ఆశ్చర్యచకితులను చేసింది. భారీ స్థాయిలో ఉన్న నాగుపాము ఆ వార్డులో నివాసం ఉన్న బసేటప్ప నివాసం ముందు పడగ విప్పి అక్కడే నిలబడి ఉండటాన్ని ప్రజలు ఆశ్చర్యంగా తిలకించారు. ఈ పాముకు ముందు పాలను ఉంచి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నాగలచవితికి నాలుగు రోజుల ముందుగా నాగుపాము ఈ విధంగా దర్శనం ఇవ్వడం నాగదేవత అనుగ్రహం అని ప్రజలు భావించారు. -
టాయ్లెట్లో ఐదడుగుల తాచుపాము
-
టాయిలెట్లో అనుకోని అతిథి..భయంతో!
బెంగళూరు : టాయ్లెట్లోకి పాము చొరబడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బెంగుళూరులోని జేపీ నగర్‌కు చెందిన ప్రమోద్ కుమార్ ఇంట్లోని టాయ్లెట్లో ఐదడుగుల తాచుపాము కనిపించింది. భయబ్రాంతులకు గురైన ప్రమోద్ వెంటనే వన్యప్రాణి సంరక్షణ బృందానికి సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో బృందంలోని ఓ వ్యక్తి ఆయన నివాసానికి చేరుకొని పామును బయటికి తీశారు. ఈ తతంగాన్నంతా ప్రమోద్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో వ్యక్తి దైర్యంగా టాయ్‌లెట్ నుంచి పామును బయటికి తీయడం చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. దీనిని తీయడానికి మొదట చేతిని ఉపయోగించి, తరువాత ఒక వస్తువుతో తీసి సంచిలో వేసి తీసుకెళ్లాడు. -
స్కూటీలో దూరిన నాగుపాము
సాక్షి, బెంగళూరు : పాము కప్పను మింగి భయంతో స్కూటీలోకి దూరిపోయి ఐదు గంటల పాటు స్కూటీ యజమానిని భయపెట్టింది. ఈ ఘటన చిక్కమగళూరు కల్యాణనగరలోని పుష్పగిరిలేఔట్లో జరిగింది. ఎస్ఐ కుమారస్వామి భార్యకు స్కూటీ ఉంది. స్కూటీని ఇంటి వద్ద నిలిపి ఉండగా, ఎక్కడి నుంచో వచ్చిన ఓ నాగుపాము కప్పను స్వాహా చేసింది. పామును చూసిన వారు పెద్దగా కేకలు వేశారు. దీనితో పాము భయపడి పక్కలోని స్కూటీ హెడ్‌లైట్ లోపలికి చేరింది. మొదట మెకానిక్‌ను రప్పించి డూంను తీయించటానికీ ప్రయత్నించారు. అయితే మెకానిక్ భయంతో వెనుదిరిగి వెళ్లాడు. పాములు పట్టే స్నేక్ నరేశ్ సమాచారం అందించారు. ఆయన రాగానే స్కూటీని దూరంగా తీసుకెళ్లి దానిని ఆన్ చేయించారు. డూం లోపలికి పైప్‌తో వేగంగా నీటిని చిమ్మడంతో పాము బయటకు వచ్చింది. నరేశ్ దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలారు. -
మహా శివరాత్రి రోజున అద్భుతం!
సాక్షి, పెనుకొండ : అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో శివరాత్రి పర్వదినం రోజున మహా అద్భుతం చోటు చేసుకుంది. శివుని మెడలో నిత్యం నాగుపాము ఉండడం పరిపాటి. గోధుమ వర్ణం కలిగి ఉన్న అలాంటి నాగుపాము పాత జైన దేవాలయం వద్ద సోమవారం ఉదయం నుంచి నాలుగు గంటలపాటు పడగ విప్పి అటు ఇటు తిరగడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ దృశ్యాన్ని తిలకించిన పలువురు సెల్ఫోన్లలో ఫొటో తీసి వాట్సప్, ఫేస్‌బుక్‌లలో షేర్ చేశారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుని నాగుపామును దర్శించారు. పలువురు మహిళలు ప్లేటులో పాలు తీసుకొచ్చి పాము వద్ద ఉంచారు. మహాశివరాత్రి పర్వదినాన ఇటువంటి అద్భుతం చోటు చేసుకోవడం నిజంగా శివుని మహిమేనని ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. -
వామ్మో ! నల్లత్రాచు
కర్ణాటక, బొమ్మనహళ్లి : మడికెరి తాలూకా సంవాజీ సమీపంలోని కెరెమూల గ్రామంలో ఓ భారీ నల్లత్రాచు పట్టుబడింది. గురువారం ఉదయం గ్రామంలోని ప్రధాన రోడ్డుపై కనిపించిన నల్లత్రాచును గుర్తించిన స్థానికులు స్నేక్ నిపుణుడు శివానంద కుక్కుంబళకు తెలిపారు. ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకుని నల్లతాచును పట్టుకున్నాడు. 12 అడుగుల పొడవు, 8 కిలోల బరువున్న నల్లత్రాచును సురక్షితంగా సమీపంలోని అటవీ ప్రాంతంలోకి విడిచిపెట్టారు. -
పిల్లల కోసం తాచుతో పోరాటం..చివరికి!
-
పిల్లల కోసం తాచుతో పోరాటం, కానీ...
ఒడిశా : అప్పుడే పుట్టిన పప్పీలు(కుక్కపిల్లలు)... బుజ్జిబుజ్జిగా, ముద్దుముద్దుగా ఉన్న ఈ పప్పీలు... తల్లి చెంతన అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నిజంగా ఆ పప్పీలకు యమపాశంలానే వచ్చింది ఓ పెద్ద తాచుపాము. ఎంత పెద్దగా ఉందంటే.. పప్పీలు దాన్ని చూస్తుండగానే వణికిపోయాయి. తన పప్పీలను రక్షించుకునేందుకు తల్లి, తాచుపాముతో భీకర పోరే చేసింది. తాచుపామును బయటపెట్టడానికి పెద్ద పెద్దగా అరవడం, తన పిల్లల్ని దగ్గరకు లాక్కోవడం చేసింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కానీ అటవీ శాఖ అధికారులు రావడం ఆలస్యమైంది. దురదృష్టవశాత్తు అప్పటికే జరగరానిది జరిగిపోయింది. అప్పటి వరకు తలపడిన ఆ తల్లి, చివరికి తన పప్పీలను ఆ తాచుకు బలి ఇవ్వక తప్పలేదు. నాలుగు పప్పీలను ఆ తాచు పాము తన విషపు కొరలతో కాటేసింది. పాము కాట్లకు మూడు పప్పీలు, అక్కడికక్కడే ప్రాణాలను వదిలాయి. ఒక్క పప్పీ మాత్రమే తాచుపాము కాటును తట్టుకుని మరీ, తన ప్రాణాలను కాపాడుకుంది. ఈ సంఘటన అంతా ఒడిశాలోని భద్రక్ లో చోటు చేసుకుంది. తాచు పాము, శునకం భీకర పోరు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
వామ్మో పే...ద్ద పాము !
సాక్షి, భూపాపలల్లి రూరల్: భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని పుల్లూరి రామయ్యపల్లి శివారులోని గండ్రపల్లి ప్రాథమిక పాఠశాలలో పొడవైన నాగుపాము దూరింది. సోమవారం పాఠశాల తెరిచేసరికి బీరువా కింద పాము ఉందనే విషయాన్ని విద్యావలంటీర్ గమనించింది. గ్రామస్తులకు సమాచారమివ్వడంతో పాములు పట్టే వ్యక్తి అందుబాటులో లేడని పాఠశాలను మూసివేశారు. మంగళవారం గ్రామానికి చెందిన పాములు పట్టే ఉప్పలయ్యకు సమాచారమివ్వడంతో ఆయన పామును పట్టి సురక్షిత ప్రదేశంలో వదిలాడు. -
ఉల్లిగడ్డలు మింగిన నాగుపాము.. వైరల్
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 11 ఉల్లిపాయలను మింగిందో నాగుపాము. అయితే రంగంలోకి దిగిన స్నేక్ హెల్ప్‌లైన్ సిబ్బంది.. వాటిని కక్కించి పామును రక్షించాడు. ఒడిశాలో ఈ ఘటన చోటుచేసుకోగా.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. అంగుల్ జిల్లా చెండిపాడ గ్రామంలో నివసించే సుసంత బెహెరా ఇంట్లోకి నాగుపాము చొరబడింది. దీంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వారు స్థానికంగా ఉండే స్నేక్ హెల్ప్ లైన్ వాలంటీర్ హిమాన్షు శేఖర్ దెహూరీకి కబురు పెట్టారు. ‘పామును పట్టుకోవాలని యత్నించినప్పుడు దాని పొట్టంతా ఉబ్బిపోయి ఉంది. అది ఒక్కో ఉల్లిపాయను కక్కుతూ వచ్చింది. అయితే అది అరుదైన దృశ్యం కాబట్టి ఫోన్‌తో రికార్డు చేయించాం. చివర్లో రెండు ఉల్లిపాయలు దాని నోటి నుంచి రావటం మీరూ ఆ వీడియోలో గమనించొచ్చు’ అని దెహూరీ చెబుతున్నాడు. అరుదైనదే... సాధారణంగా పాములు కప్పులు, పురుగుపుట్రతోపాటు కొన్నిసార్లు పండ్లు, కూరగాయాలను కూడా మింగుతాయి. కానీ, అది పొరపాటున ఉల్లిపాయలు మింగి ఉంటుంది. జీర్ణించుకోలేదు కాబట్టి పాపం అవస్థలు పడి బయటకు కక్కింది. అయితే ఏకంగా 11 ఉల్లిగడ్డలు మింగటం బహుశా ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేరళలో ఓ పాము మాత్రం ఏడు గుడ్లను మింగి.. కక్కటం చూశాం’ అని స్నేక్ హెల్ప్‌లైన్ సెక్రెటరీ సుబేందు మాలిక్ చెబుతున్నారు. -
పోలీస్ స్టేషన్లో నాగుపాము
కడప , ఓబులవారిపల్లె : స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం రాత్రి నాగుపాము కనిపించింది. స్టేషన్ బయట ఉన్న మరుగుదొడ్డి పక్కనే శబ్దం రావడంతో అటువైపు వెళుతున్న కానిస్టేబుల్ అమర్ చూశాడు. ఆయన గమనించి తోటి సిబ్బందికి తెలిపాడు. పాము పడగవిప్పి బుసలు కొడుతుండటం, రాత్రి కావడంతో దగ్గరకు వెళ్లే సాహసం ఎవరూ చేయలేదు. రెండు గంటల సేపు అలాగే ఉన్న పాము పక్కనే ఉన్న వాహనాల్లోకి వెళ్లింది. పట్టుబడ్డ వాహనాలను రైల్వేకోడూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందిన వారు పోలీసు క్వార్టర్స్‌లో ఉంచారు. అవి తుప్పుపట్టి శిథిలావస్థకు చేరాయి. పరిసరాలు పిచ్చిమొక్కలతో అధ్వానంగా ఉన్నాయి. విషసర్పాలకు అడ్డాగా మారాయి. తరచూ క్వార్టర్స్‌లోకి వస్తుండటంతో పోలీసు కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాహనాలను మరో చోటుకు తరలించాలని పోలీసులు కోరుతున్నారు. -
పోలీస్‌స్టేషన్‌లో నాగుపాము పట్టివేత
రామనగర(దొడ్డబళ్లాపురం): కనకపుర పట్టణ పోలీసులకు చెమటలు పట్టించిన నాగుపాము ఎట్టకేలకు పట్టుబడింది. రెండు రోజుల క్రితం పెద్ద నాగుపాము ఒకటి పట్టణ పోలీస్ స్టేషన్ కాంపౌండ్‌లో, స్టేషన్‌లోపల తిరుగుతూ సిబ్బందికి చెమటలుపట్టించింది. చివరకు కాంపౌండ్‌లోని చిన్న కలుగులో దూరింది. అప్పుడప్పపుడూ వచ్చి కనిపించి వెళ్తోంది. దీంతో పోలీసులు శుక్రవారం పాములు పట్టే పునీత్ అనే వ్యక్తిని రప్పించారు. అతను చాకచక్యంగా పామును బంధించాడు. పామును శివనహళ్లి సమీపంలోని అడవిలో వదిలేస్తామని పునీత్ తెలిపాడు. -
34సార్లు కాటేసిన నాగుపాములు.. ఎందుకు?
బి.కొత్తకోట(చిత్తూరు జిల్లా): నాగుపాములు పగపట్టి కాటేస్తాయని సినిమాల్లో చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో నాగుపాములు ఓవ్యక్తిని ఏకంగా 34 సార్లు వేటాడి మరీ కాటేశాయి. ప్రతిసారి ప్రాణాపాయం తప్పడం అదృష్టమే అయినా వైద్యం కోసం లక్షలు ఖర్చుచేసి ఆర్థికంగా చితికిపోయాడు ఆరైతు. వివరాల్లోకి వెళ్తే తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ ఉప్పలూరివాండ్లపల్లెకు చెందిన కె.సురేంద్రనాథ్ రెడ్డిపై పాములు పగపట్టాయి. ఎప్పుడు ఏ పామొచ్చి కాటేస్తుందో తెలియదు. ఒంటరిగా క్షణమున్న భయం. రోడ్డుమీదకొస్తే జనం మధ్యే ఉండాలి. లేదంటే ఎటువచ్చి పాము కాటేస్తుందో అన్న ఆందోళన. ఇలాంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్న సురేంద్రనాథ్‌రెడ్డికి వేటాడుతున్న పాములు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇలా ఒకేవ్యక్తిని నాగుపాములు పదేపదే కాటేయం పెద్ద చర్చగా మారింది. పొలం దున్నుతుండగా తొలిసారి... 2002 జూన్‌లో సురేంద్రనాద్‌రెడ్డి ఊరికి సమీపంలో పొలం దున్నతున్నండగా భూమిని చీల్చుకొంటూ వెళ్తున్న మడకలోంచి బయటకొచ్చిన నాగుపాము సురేంద్ర కాలికి కాటేసింది. దీనికి వైద్యం తీసుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. అప్పటినుంచి మొదలైన నాగుపాముల వేట నిరంతరం కొనసాగింది. ఇంటిలో ఉంటే తప్ప ఎక్కడ కనిపించినా పాము కాటేసేది. 2017 మే 29 వరకు మొత్తం 34 సార్లు నాగుపాములు కాటేశాయి. కాళ్లు చేతులపై వేసిన కాట్లతో చెరిగిపోని గుర్తులుగా మిగిలాయి. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా, జనం మధ్యలో ఉన్నా కాటేసి వెళ్లేవి. స్థానికులు, కుటుంబీకులు ఆస్పత్రికి తరలించి ప్రాణం నిలపెట్టేవాళ్లు. ఇలా నాగుపాములు కాటేస్తున్న విషయంపై వైద్యులకు అనుమానం వస్తే ఓసారి ఎడమచేతికి కాటేసిన నాగుపామును అలాగే తీసుకుని ఆస్పత్రికి వచ్చాడు సురేంద్ర. దీనితో నిజమేనని నమ్మిన వైద్యులు చికిత్సలు చేస్తూ బతికిస్తూ వస్తున్నారు. కాటేసిన ప్రతిసారి ప్రాణం పోయిందన్న ఆవేదనతో సురేంద్రనాధ్‌రెడ్డి కుమిలిపోయేవాడు. కాటేసిన పాముల్లో ఆరింటిని చంపేశాడు. కొన్ని సార్లు చావు అంచులదాక వెళ్లొచ్చాడు. ఈ సందర్భాల్లో నోరు, ముక్కుల్లోంచి రక్తం, నురగ రావడంతో తిరుపతి, బెంగళూరు ఆస్పత్రుల్లో వైద్యం పొందాడు. ఇల్లు గుల్ల పాముకాటుకు గురైనప్పుడు ప్రాణాలతో బయటపడేందుకు వైద్యం కోసం సురేంద్రనాథ్‌రెడ్డి సుమారు రూ.10లక్షల వరకు ఖర్చు చేశాడు. దీనికి సంబంధించి రూ.6.50లక్షల వైద్యం బిల్లులు ఉన్నాయి. కుటుంబం గడవడమే భారంగా మారిన సురేంద్రనాథరెడ్డికి భార్య రెడ్డెమ్మ, చదువుకొనే ఇద్దరు కుమార్తెలు చదువుతున్నారు. సురేంద్రకు ఏలాంటి ఆదాయమార్గాలు లేవు. వ్యవసాయం ఆగిపోయింది. భార్య రెడ్డెమ్మ స్వచ్చంద సంస్థలో పనిచేస్తుండగా వచ్చే కొద్దిపాటి వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇప్పుడు సురేంద్ర పరిస్థితి దయనీయంగా మారింది. వైద్యం, పాముకాట్ల కారణంగా శరీరం నిస్సత్తువుగా మారింది. ఎక్కువ దూరం నడవలేడు. మునుపటిలా కష్టపడి సేద్యం చేయలేడు. వర్షంలో తడిస్తే వాపులు, గుల్లలు వస్తాయి. దీనికి విరుగుడుగా వేడి పదార్థాలను తీసుకుంటే తగ్గిపోతాయి. దీనిపై సురేంద్ర, ఆయన భార్య రెడ్డమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత మందిలో ఉన్నా తననే పాములు ఎందుకు కాటేస్తున్నాయో అర్థం కావడం లేదని సురేంద్ర వాపోయాడు. -
కార్తికేయుని సన్నిధిలో నాగుపాము
పావగడ : పావగడలోని నాగలమడక అంత్య సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయంలోని గర్భగుడి ఎదురుగా ఉన్న నవ గ్రహ విగ్రహాల వద్దకు ఓ నాగుపాము చేరుకుంది. వారం రోజులుగా అక్కడే ఉండిపోయింది. అత్యంత ప్రీతిపాత్రమైన నాగుపాము స్వామి వారి సన్నిధిలో ఉండడంతో ఆశ్చర్యానికి గురైన భక్తులు ఎంతో భక్తితో పూజలు చేస్తున్నారు. పాముకు ఆహారంగా పాలు పోసి కొలుస్తున్నారు. ఈ వింత సంఘటనను చూడటానికి చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు తరలి వస్తున్నారు. భక్తులు పామును వెళ్లగొట్టడానికి ఎంత ప్రయత్నించినా పాము కదలక పోవడం విశేషం. -
పుష్కర ఘాట్‌లో పాము హల్చల్