
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో వారి వాహనాలను కూడా ఎవరు బయటికి తీయడం లేదు. రోడ్డు మీద జనాలు కనిపించకపోవడంతో అడవుల్లో ఉండాల్సిన జంతువులు రోడ్డు మీద సంచరిస్తున్న వీడియోలు ఎన్నో చూశాం. అయితే ఇక్కడ మాత్రం ఒక పాము ఎక్కడా చోటు లేనట్టు యాక్టివా బైక్ హెడ్ లైట్స్‌లోకి దూరి ప్రశాంతంగా నిద్రపోయింది. అయితే బండి తీద్దామని దగ్గరకు వచ్చిన యజమానికి శబ్దం వినిపించడంతో అప్రమత్తమయ్యాడు. బైక్‌లో నుంచి పాము చేసే శబ్ధం స్పష్టంగా వినిపిస్తుడడంతో వెంటనే పాములను పట్టే నిపుణులకి సమాచారం అందించాడు. కాగా నిపుణుడు వచ్చి బైక్‌ను పరీక్షించగా బండి హెడ్‌లైట్‌లో ఉన్నట్లు తెలిసింది. బండికున్న డోమ్ తీసి పామును బయటికి తీయాలని చూడగా అది ఒక్కసారిగా బుసలు కొడుతూ ఉవ్వెత్తున పైకి లేచింది. దీంతో పామును తెలివిగా ఏమారుస్తూ తన వెంట తెచ్చుకున్న వాటర్‌క్యాన్‌లోకి పంపించి మూత పెట్టేశాడు. ఆ తర్వాత దానిని వదిలేందుకని మూత తీయగా పాము మెడకు క్యాప్ చుట్టుకుపోయింది. దాంతో పాము విలవిలలాడుతూ బుసలు కొట్టే ప్రయత్నం చేసింది. దీంతో కొద్దిసేపు మూతను బయటికి తీయడానికి ప్రయత్నించి చివరకు ఎలాగోలా దానిని బయటికి తీసి పామును వదిలిపెట్టారు. ప్రసుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment