
సాక్షి, ఆదిలాబాద్ : రిమ్స్‌లో నాగుపాము కలకలం రేపింది. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు కానీ మెటర్నటీ వార్డులోకి చొరబడిన నాగుపాము కాసేపు వార్డులో సంచరించింది. వార్డులో ఉన్న వారు బిగ్గరగా కేకలు వేయడంతో వారి శబ్ధానికి అక్కడి నుంచి మూత్రశాలలోకి వెళ్లింది. మూత్రశాలలో చెత్తాచెదారం ఉండడంతో ఎంత వెతికినా పాము దొరకలేదు. చివరకు వార్డు నుంచి రోగులను వేరే గదికి మార్చారు. కాగా రిమ్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే, తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. జిల్లా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
చదవండి: ఒక తల్లి పాము..70 పిల్ల పాములు..
Comments
Please login to add a commentAdd a comment