సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్‌పై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్ ఆస్పత్రిలో డెలివరీలు చేయకపోవడం సరికాదన్నారు. డెలివరీ నిలుపుదలపై విచారణ చేపడుతున్నామని తెలిపారు. అనస్థీషియా డాక్టర్ కొరత ఉన్న మాట నిజమని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అనస్థీసియా డాక్టర్లు లేరని సర్క్యూలర్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు.
చదవండి: ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపు కాల్.. మీటింగ్‌కు వెళ్లొద్దంటూ..
రిమ్స్ అస్పత్రిని సందర్శించి.. గర్బిణి మహిళలతో మాట్లాడి డెలివరీల నిలుపుదలపై వివరాలు సేకరించారు. ప్రసవం కోసం వచ్చిన మహిళలకు అనస్థీషియా డాక్టర్లు లేరని సర్జరీలు చేయకపోవడాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోని డెలివరీలు చేయాలని ఆదేశించారు. డెలివరీల చేయకుండా కరీంనగర్, హైదరాబాద్‌కు రెఫర్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment