rims hospital
-
ఆస్పత్రికి వెళ్తూ.. కానరాని లోకాలకు
గుడిహత్నూర్: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా, దివ్యాంగుడైన భర్తకు స్వల్పగాయాలయ్యాయి. ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ కథనం ప్రకారం.. ఇచ్చోడ మండలం కోకస్‌మన్నూర్‌కు చెందిన జాదవ్ మధుకర్–రమ్యక్రిష్ణ (30)భార్యాభర్తలు. భర్త మధుకర్ దివ్యాంగుడు, కోకస్‌మన్నూర్‌లో కిరాణషాపు నడిపిస్తున్నాడు. రమ్యక్రిష్ణ.. లేడిస్ ఎంపోరియం నడిపిస్తోంది. వీరికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. గ్రామంలో ఇటీవల మీ సేవ కేంద్రం మంజూరైంది. రమ్యక్రిష్ణ శిక్షణ సైతం తీసుకుంది. గత కొంతకాలంగా ఈమె చర్మవ్యాధితో బాధపడుతోంది. రెండు రోజులుగా చర్మంపై దద్దుర్లు వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం భర్తతో కలిసి బైక్‌పై రిమ్స్‌కు వెళ్లేందుకు బయల్దేరింది. గుడిహత్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో వీరి బైక్‌ను వెనుక నుంచి వస్తున్న వాహనం ఢీకొట్టింది. జాతీయ రహదారి 44పై పక్కన రెయిలింగ్‌పై రమ్యక్రిష్ణ ఎగిరిపడింది. ఆమె రెండు చేతులు విరిగిపోయి, తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. హెల్మెట్ ధరించి ఉండడంతో భర్తకు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే వారిని అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు. వైద్యులు భర్తకు చికిత్స అందిస్తున్నారు. మధుకర్ తండ్రి తుకారాం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలికి 6, 7 ఏళ్లలోపు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
"మా జీతాలు ఎక్కడ ?" రిమ్స్ ఉద్యోగుల నిరసన
-
రిమ్స్ లో రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు..పేషెంట్లను చంపేస్తామంటూ బెదిరింపు
-
రిమ్స్ మళ్లీ తెరపైకి.. స్టాఫ్‌నర్సుల నుంచి డబ్బులు వసూలు!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ తరచూ వివాదంలోకి ఎక్కుతోంది. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కొంతమంది ఉద్యోగుల తీరు మాత్రం మారడం లేదు. లంచం తీసుకుంటూ బయటపడుతున్నప్పటికీ నవ్వి పోదురుగా.. మాకేమిటి అన్న చందంగా మారింది వీరి పరిస్థితి. ప్రభుత్వం నుంచి రూ.వేలల్లో వేతనం తీసుకుంటున్నా అది చాలదనట్టుగా తోటి ఉద్యోగులను వేధించడం, డబ్బులు ఇస్తే గాని ఫైల్ కదలనివ్వడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా రిమ్స్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో కొంతమంది ఉద్యోగులు ముడుపులు ఇస్తే కానీ ఏ ఫైల్‌ను ముట్టడం లేదని కొంతమంది కాంట్రాక్ట్, అవుట్‌సో ర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. గతంలో ఓ ఇద్దరు ఉద్యోగులు స్టాఫ్ నర్సుల నుంచి డబ్బులు తీసుకొని సస్పెన్షన్‌కు గురైన విషయాన్ని మరవక ముందే మరో ఉద్యోగి వసూళ్ల దందాలో తెరపైకి రావడం రిమ్స్‌లో చర్చనీయాంశంగా మారింది. స్టాఫ్‌నర్సుల నుంచి వసూళ్లు.. రిమ్స్‌లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల నుంచి ఓ ఉద్యోగి రూ.1లక్ష 40వేలు వసూలు చేసినట్లు అక్క డ పనిచేస్తున్న కొంతమంది బాధితులు చెబుతున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన వీరికి ఫిబ్రవరిలో 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది. అయితే వీరికి ఇంక్రిమెంట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని సదరు ఉద్యోగి వీరి దృష్టికి తీసుకొచ్చారు. మొదట రూ.2వేలు ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత వెయ్యి పెంచి రూ.3వేలు అడగగా, చివరగా మరో వెయ్యి పెంచి రూ.4వేలకు ఒప్పందం కుదిరింది. డబ్బులు వసూలుకు సామాజిక మాధ్యమం (వాట్సాప్)లో ఏకంగా ఓ గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో మెస్సేజ్ రూపంలో డబ్బులు ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు. స్టాఫ్‌నర్సుగా పనిచేసే ఓ ఉద్యోగి నగదు రూపంలో వీటిని వసూలు చేసి సదరు ఉద్యోగికి ముట్టజెప్పినట్లు సమాచారం. మొత్తం 36 మందికి గాను 35 మంది డబ్బులు ఇచ్చినట్లు పేపర్‌పై రాసుకొని గ్రూప్‌లో వేశారు. ఇంక్రిమెంట్ కాకపోతే పీఆర్సీ, ఐఆర్‌లో తమ వేతనం పెరగదని భయంతో వారికి డబ్బులు ముట్టజెప్పాల్సి వచ్చిందని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ గ్రూప్‌ను డిలీట్ చేశారు. అయితే డబ్బులు వసూలు చేసిన తర్వాత ఉద్యోగి టేబుల్‌పై పెట్టిన ఫొటోలు, గ్రూప్ చాటింగ్ మెస్సేజ్‌లు బయటకు రావడంతో సదరు ఉద్యోగి అయోమయానికి గురవుతున్నారు. మంగళవారం ఆ ఉద్యోగి స్టాఫ్ నర్సులందరినీ పిలిపించి ఈ విషయం మన మధ్యలోనే ఉండాలని, తనకు డబ్బులిచ్చింది ఎవరికి చెప్పవద్దని వారికి సూచించారు. లేకపోతే మీ పని కాదని, తర్వాత మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారిని హెచ్చరించడం గమనార్హం. అయితే విషయం బయటకు పొక్కడంతో ఎవరు బయటకు లీక్ చేశారంటూ ఆరా తీసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. సర్వీసు బుక్‌లో వివరాలు నమోదుకు గాను 2021లో కొత్తగా రిక్రూట్మెంట్ అయిన స్టాఫ్ నర్సుల నుంచి రిమ్స్‌లో కొంతమంది ఉద్యోగులు డబ్బులు వసూలు చేసిన విషయం తెలిసిందే. ‘సాక్షి’ కథనానికి స్పందించిన అప్పటి కలెక్టర్ ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. రిమ్స్‌లో స్టాఫ్ నర్సుల నుంచి ఓ అధికారి డబ్బులు వసూలు చేశారు. తన బర్త్‌డే సందర్భంగా కానుకలు తీసుకున్న విషయం విదితమే. తర్వాత అధికారులు సదరు అధికారిపై విచారణ చేపట్టినప్పటికీ ఎలాంటి చర్యలకు పూనుకోలేదు. తన కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇప్పిస్తానని రిమ్స్‌లో పనిచేసే ఓ ల్యాబ్ అసిస్టెంట్ నుంచి మరో ల్యాబ్ అసిస్టెంట్ రూ.లక్ష 50వేలు వసూలు చేశారు. ఈ విషయంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అందులో నుంచి కొంత డబ్బులు బాధితుడికి తిరిగివ్వడం జరిగింది. అయితే సదరు ఉద్యోగి నెలలు గడుస్తున్నా ఇంకా విధులకు హాజరుకాకపోవవడం గమనార్హం. నా దృష్టికి రాలేదు.. రిమ్స్‌లో స్టాఫ్‌నర్సుల ఇంక్రిమెంట్ల కోసం ఓ ఉద్యోగి డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి రాలేదు. స్టాఫ్ నర్సులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకుంటాను. డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులు ఎవరూ డబ్బులు ఇవ్వొద్దు. ఎవరైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకురావాలి. – జైసింగ్ రాథోడ్, రిమ్స్‌డైరెక్టర్ -
పురిటి కష్టాలు.. ఏడుగురు వైద్యులున్నా.. సేవలు అంతంతే..
ఆదిలాబాద్: గర్భిణులకు రిమ్స్‌లో పురిటి కష్టాలు తప్పడం లేదు. నవమాసాలు మోసి ప్రసవం కోసం ఇక్కడికి వస్తున్న వారిలో ఇటీవల పలువురు మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది వెద్యుల నిర్లక్ష్యం కారణంగా బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకుంటున్నాయి. రూ.కోట్లాది నిధులతో సర్కారు ఆసుపత్రి నిర్మించినా పేదల కష్టాలు మాత్రం దూరం కావడం లేదు. మెటర్నిటీ వార్డులో పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాన్పుకు రూ.వేలాది చెల్లించుకోలేని పేదలు రిమ్స్‌లో చేరితే వైద్యం అందక అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవలే ఇద్దరు బాలింతలు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తుంది. గైనిక్ వార్డులో పర్యవేక్షణ కరువవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వార్డును పర్యవేక్షించాల్సిన అధికారి చుట్టపు చూపుగా రావడం, వచ్చినా పట్టించుకోకపోవడం, బాలింతలకు సరైన వైద్య సేవలు అందించకపోవడమే కష్టాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ అధికారి లేకపోతే రిమ్స్‌కు పీజీ సీట్లు రావనే ఆలోచనతో ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రూ.లక్షల వేతనం తీసుకుంటున్న ఆ ఉద్యోగి నిర్లక్ష్యం కారణంగా గైనిక్‌వార్డు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే విమర్శలు లేకపోలేదు. ఏడుగురు వైద్యులున్నా.. సేవలు అంతంతే.. జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలతో పాటు ఉమ్మడి జిల్లా, మహారాష్ట్ర, ఇతర జిల్లాల నుంచి జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి వైద్యం కోసం వస్తుంటారు. రిమ్స్‌లో పలు వార్డులు ఉండగా, అందులో మెటర్నిటీ, ఎమర్జెన్సీ వార్డులే కీలకం. ప్రసవం కోసం ఇన్పెషేంట్స్ దాదాపు 200కు పైగా ఉంటారు. అయితే ఈ కీలక వార్డుల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. గైనిక్ వార్డులో హెచ్‌వోడీతో పాటు మరో ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వీరితో పాటు రిమ్స్‌లో నలుగురు పీజీ చేస్తున్న గైనిక్ వైద్యులున్నారు. అలాగే షిఫ్టుల వారీగా ముగ్గురు చొప్పున హౌస్ సర్జన్లు ఈ వార్డులో ఉంటారు. ఓపీలో ఇద్దరు, ఆపరేషన్ థియేటర్లో మరో ఇద్దరు ఉన్నప్పటికీ మిగతా వైద్యులు గైనిక్ వార్డులో ఉండాలి. కానీ వారు చుట్టపుచూపులా కనిపిస్తుండడంతో గర్భిణులకు కష్టాలు తప్పడం లేదు. ప్రసవం అయిన తర్వాత రక్తస్రావం, బీపీ, తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే అవేమి పట్టించుకోకుండా మధ్యాహ్నానికే ఇంటి ముఖం పడతారు. అందుబాటులో ఉన్న సిబ్బందిని పిలిచినా వారు విసుక్కోవడం, వస్తాం.. వెళ్లండనే సమాధానాలు తప్పా వచ్చి చూసిన దాఖలాలు ఉండవని బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రిమ్స్‌లో స్టాఫ్‌నర్సులు, హౌస్సర్జన్లు, పీజీ డక్టర్లతోనే నెట్టుకొస్తున్నారు. 24 గంటల పాటు మెటర్నిటీ వార్డులో ఉండాల్సిన వైద్యులు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే తప్ప రాత్రి వేళల్లో రావడం లేదు. దీంతో గతంలో ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన ఓ గర్భిణి సకాలంలో వైద్యం అందక పురిటి నొప్పుల్లోనే మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మారని రిమ్స్ తీరు.. ఎన్ని విమర్శలొస్తున్నా ఇక్కడి వైద్యుల తీరు మాత్రం మారడం లేదు. ఇక్కడ పనిచేసే చాలా మంది వైద్యులకు ప్రైవేట్ క్లినిక్‌లు ఉండడంతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో రిమ్స్‌లో ఉన్న వారికి నాణ్యమైన వైద్యసేవలు అందకుండా పోతున్నాయి. కాసులిస్తేనే.. సేవలు గైనిక్ వార్డులో కొంతమంది సిబ్బంది తీరుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సిజేరియన్, సాధారణ ప్రసవమైన తర్వాత సిబ్బందికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. లేకుంటే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మగ బిడ్డ పుడితే రూ.వెయ్యి, ఆడబిడ్డ పుడితే రూ.500.. ఇలా రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇంద్రవెల్లి మండలంలోని మర్కగూడకు చెందిన సొనాలి కాంబ్లే(22) రిమ్స్‌లో జూలై 25న మగబిడ్డకు జన్మనిచ్చిన ఐదారు గంటల్లోనే మృతి చెందింది. డెలివరీ కోసం రెండు రోజుల ముందుగానే ఆస్పత్రిలో చేరిన ఆమె సాధారణ ప్రసవం అయ్యింది. ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనివ్వగా, 10 గంటల సమయంలో చనిపోయింది. అయితే వైద్యులు మాత్రం ఉమ్మ నీరు ఊపిరితిత్తులో చేరి శ్వాస ఆడక చనిపోయిందని చెప్పడం గమనార్హం. గత నెలలో సిరికొండ మండలానికి చెందిన ఓ గర్భిణి రిమ్స్‌లో ప్రసవం కోసం చేరింది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అనారోగ్యం (కాలేయ సమస్య) కారణంగా మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రసవం కోసం వచ్చిన సమయంలో వైద్య పరీక్షలు చేయాల్సి ఉండగా, తీరా చనిపోయిన తర్వాత అనారోగ్య సమస్య అని చెప్పడం వారి పనితీరుకు నిదర్శనం. ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం. వైద్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటున్నారు. గైనిక్ వార్డులో నాణ్యమైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపడతాం. ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ -
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రెండు బైకులు గాల్లోకి లేచి..
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అతివేగం కారణంగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సమయంలో ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రి వద్ద వేగంగా వస్తున్న ఓ బైక్.. మరో బైక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో హై స్పీడ్‌లో బైక్ మీద వస్తున్న వ్యక్తితో సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంలో ఉన్న బైక్.. రెండు బైకులును ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా గాల్లోకి లేచి రోడ్డుపై పడిపోయారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యింది. ఇక, ఒళ్లుగగుర్పొడిచే వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. -
లాలూను రాంచిలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు
-
ఆదిలాబాద్ రిమ్స్ కోవిడ్ సెంటర్ లో చోరీ
-
వైద్యం వద్దు.. దేవుడే రక్షిస్తాడు.. చికిత్సకు నిరాకరించిన గర్భిణి
సాక్షి, నార్నూర్(ఆదిలాబాద్): ‘ఆస్పత్రికి రాను.. దేవుడికి మొక్కుకున్న.. అతడే రక్షిస్తాడు’ అంటూ వైద్యం చేయించుకునేందుకు గర్భిణీ నిరాకరించిన సంఘటన శనివారం మండలంలోని మహగావ్ శేకుగూడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శేకుగూడ గ్రామానికి చెందిన మేస్రం రేణుకబాయి 8 నెలల గర్భవతి. ఇది ఆమెకు మూడో కాన్పు. మొదటి రెండు కాన్పుల్లో హైబీపీ (అధిక రక్తపోటు) కారణంగా అబార్షన్ జరిగింది. ఈనెల 26న ఉట్నూర్ సామాజిక ఆస్పత్రిలో నెలవారి వైద్య పరీక్షలో భాగంగా ఆశ కార్యకర్త సదరు గర్భిణీని తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన గైనకాలజిస్ట్ మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు రెఫర్ చేశారు. అయితే ఆస్పత్రికి వెళ్లేందుకు రేణుకబాయి నిరాకరించింది. సూపర్వైజర్లు రాజమ్మ, చరణ్‌దాస్‌లు కౌన్సెలింగ్ చేసినా వైద్యానికి ఒప్పుకోలేదు. దీంతో శనివారం తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్‌కు సమాచారం అందించారు. ఆయన గ్రామానికి చేరుకుని గోండ్ భాషలో నచ్చజెప్పారు. అయిన వినకుండా దేవుడికి మొక్కుకున్నానని, దేవుడే కాపాడుతాడని మొండికేసింది. హైబీపీ ప్రభావం తల్లితో పాటు పుట్టబోయే బిడ్డపై పడుతుందని, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూనే వైద్యం చేయించుకోవాలని ఆయన కోరారు. ఆస్పత్రికి వెళ్లేదే లేదంటూ అందరూ ఉండగానే రేణుకబాయి గ్రామంలోని వేరే వాళ్ల ఇంటికి వెళ్లిపోయింది. ఆస్పత్రికి వెళ్లకుంటే వచ్చే అనార్థల గురించి అధికారులు, వైద్య సిబ్బంది రేణుకబాయి కుటుంబ సభ్యులకు వివరించారు. అయినా పూర్తిస్థాయి వైద్యానికి గర్భిణీ నిరాకరించింది. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలకు మాత్రమే ఆమె అంగీకరించింది. డిప్యూటీ తహసీల్దార్ అమృత్లాల్, ఆర్ఐ శకుంతల, సీడాం మల్కు పటేల్, మేస్రం జంగు, తొడసం బండు తదితరులు ఉన్నారు. చదవండి: Karimnagar: కీచకుడిగా మారిన ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగి -
TS: రిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్‌పై కలెక్టర్ సీరియస్
సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్‌పై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్ ఆస్పత్రిలో డెలివరీలు చేయకపోవడం సరికాదన్నారు. డెలివరీ నిలుపుదలపై విచారణ చేపడుతున్నామని తెలిపారు. అనస్థీషియా డాక్టర్ కొరత ఉన్న మాట నిజమని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అనస్థీసియా డాక్టర్లు లేరని సర్క్యూలర్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. చదవండి: ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపు కాల్.. మీటింగ్‌కు వెళ్లొద్దంటూ.. రిమ్స్ అస్పత్రిని సందర్శించి.. గర్బిణి మహిళలతో మాట్లాడి డెలివరీల నిలుపుదలపై వివరాలు సేకరించారు. ప్రసవం కోసం వచ్చిన మహిళలకు అనస్థీషియా డాక్టర్లు లేరని సర్జరీలు చేయకపోవడాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోని డెలివరీలు చేయాలని ఆదేశించారు. డెలివరీల చేయకుండా కరీంనగర్, హైదరాబాద్‌కు రెఫర్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: KTR Office: మేము చూసుకుంటాం.. సాయం చేస్తాం -
కాలం చెల్లిన ఇంజక్షన్లతో చికిత్స..
-
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
-
సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను ప్రారంభించారు. నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రుల్లో సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రులను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో 16 టీచింగ్ ఆస్పత్రులను ఆందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. వీటన్నింటినీ ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..: బోధన ఆస్పత్రులు–డయాగ్నస్టిక్ సేవలు ‘ఈరోజు రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రులలో కేవలం ఏడింటిలో మాత్రమే సీటీ స్కాన్, ఎంఆర్ఐ పరికరాలు ఉన్నాయి. అవి కూడా పీపీపీ పద్ధతిలో ఉన్నాయి. వాటిలో టెక్నాలజీ, క్వాలిటీ అప్‌గ్రెడేషన్ కూడా లేదు. ఈ పరిస్థితి మారాలని పలు చర్యలు తీసుకుంటున్నాము. కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే ఉన్న 11 టీచింగ్ ఆస్పత్రులను నాడు–నేడు కింద అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, కొత్తగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కొత్తగా టీచింగ్ ఆస్పత్రితో పాటు, నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. వాటిలో టాప్ ఆఫ్ ది లైన్ డయాగ్నస్టిక్ సర్వీసులు అందించే దృక్పథంతో అడుగులు వేస్తున్నాము’. ఆరోగ్యశ్రీ కింద సేవలు ‘టీచింగ్ ఆస్పత్రులలో ఆ సదుపాయాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి, పథకం లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తాము. ఆ విధంగా డయాగ్నస్టిక్ సేవలు అందిస్తాము. మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్టు వాటి నిర్వహణ వ్యయం భరిస్తుంది. ఆ విధంగా రాబోయే రోజుల్లో అప్‌గ్రేడ్‌తో ఆ పరికరాలు, నిరంతరం బాగా పని చేసేలా చర్యలు చేపడుతున్నాము’. జాతీయస్థాయి ప్రమాణాలతో.. ‘నాడు–నేడులో ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాము. ఆస్పత్రులను జాతీయస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాము. ఇప్పుడు రూ.67 కోట్ల వ్యయంతో శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలో సీటీ స్కాన్లు, కడప మినహా మూడు చోట్ల ఎంఆర్ఐ పరికరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి మూడేళ్ల వారంటీ ఉంది. మరో ఏడేళ్లు సర్వీసు బాధ్యతను ఆ కంపెనీలు నిర్వహిస్తాయి. ఏ పేదవాడికైనా ఉచితంగా సేవలందించేలా, ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రులలో అన్ని సదుపాయాల ఏర్పాటు చేస్తాం’. మిగిలిన ఏడింటిలో కూడా ‘రాష్ట్రంలోని 11 టీచింగ్ ఆస్పత్రులలో నాలుగు చోట్ల సీటీ స్కాన్, ఎంఆర్ఐ పరికరాలు లేవు కాబట్టి ఇప్పుడు శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలో ఏర్పాటు చేస్తున్నాము. మిగిలిన ఏడు చోట్ల ఆ సదుపాయాలు పిపిపి విధానంలో ఉన్నాయి. కాబట్టివాటిని ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేస్తుంది. ఇంకా కొత్తగా ఏర్పాటు చేసే 16 టీచింగ్ ఆస్పత్రులలో కూడా ఈ సదుపాయాలన్నీ కల్పిస్తాము’. వారి సేవలకు వందనం ‘ఈ కోవిడ్ సంక్షోభంలో ప్రతి ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బందితో పాటు, గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు. వలంటీర్లు పగలు రాత్రి కష్టపడుతున్నారు. ప్రజలకు సేవలందిస్తున్నారు. వీరి సేవల గురించి ఎంత పొగిడినా తక్కువే. కోవిడ్ సమయంలో ఎంతో మంచి సేవలందిస్తున్న మీ అందరికీ మా అభినందనలు’. ఆగ్రహం వద్దు ‘ఈ సందర్భంగా కలెక్టర్లు, జేసీలు, డీహెచ్‌ఎంఓలకు కొన్ని సూచనలు. ఫీవర్ సర్వే కొన్ని చోట్ల అనుకున్న విధంగా జరగలేదని కొందరు అధికారులు దిగువ స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారని నా దృష్టికి వచ్చింది. కరోనా మహమ్మారితో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడిలో ఉన్నారని అందరూ గుర్తుంచుకోవాలి. అందుకే అధికారులంతా మంచితనంతో తమ సిబ్బందితో పని చేయించుకోవాలని కోరుతున్నాను’. నా విజ్ఞప్తి ‘మీ అందరికీ నా తరపున ఒక విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిళ్లలో పని చేస్తున్నారు. కాబట్టి కింది వారికి నచ్చ చెప్పి పని చేయించుకోండి. ఆగ్రహిస్తే వచ్చేదేమీ లేదు. ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, వార్డుబాయ్స్, చివరకు శానిటేషన్ సిబ్బంది.. ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడి మధ్య పని చేస్తున్నారు. నా దగ్గర నుంచి పారిశుద్ధ్య కార్మికుడి వరకు కోవిడ్ వల్ల ఎదురయ్యే అనూహ్య పరిస్థితులను ఎదుర్కునే ఒత్తిడిలో ఉన్నారు’. అందుకే సాధ్యమైంది ‘ప్రతి రోజూ 20 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. నిజానికి అందరూ చాలా బాగా పని చేస్తున్నారు. అందుకే మన దగ్గర టయర్–1 సిటీ, ఆ స్థాయిలో ఆస్పత్రులు లేకపోయినా, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. మీరంతా ఆస్పత్రుల్లో బా«ధ్యతను తీసుకోవడమే కాకుండా, ఎంత ఒత్తిడి ఉన్నా చిరునవ్వుతో పని చేస్తున్నారు కాబట్టే ఇది సా«ధ్యమైంది. అదే విధంగా కోవిడ్‌ను కూడా ఎదుర్కోగలుగుతున్నాము. కాబట్టి ఎవ్వరూ సహనం కోల్పోవద్దు. అధికారులు మంచితనంతో పని చేయించుకోవాలని కోరుతున్నాను’డ అని విజ్ఞప్తి చేసిన సీఎం జగన్ ఈ మంచి కార్యక్రమంతో ప్రజలకు ఇంకా మేలు జరగాలని మనసారా కోరుకుంటున్నానంటూ ప్రసంగం ముగించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: 100కు పైగా ఆక్వా హబ్‌లు -
పేషెంట్ బెడ్ కింద పాము.. రోగుల పరుగులు
సాక్షి, ఆదిలాబాద్ : రిమ్స్‌లో నాగుపాము కలకలం రేపింది. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు కానీ మెటర్నటీ వార్డులోకి చొరబడిన నాగుపాము కాసేపు వార్డులో సంచరించింది. వార్డులో ఉన్న వారు బిగ్గరగా కేకలు వేయడంతో వారి శబ్ధానికి అక్కడి నుంచి మూత్రశాలలోకి వెళ్లింది. మూత్రశాలలో చెత్తాచెదారం ఉండడంతో ఎంత వెతికినా పాము దొరకలేదు. చివరకు వార్డు నుంచి రోగులను వేరే గదికి మార్చారు. కాగా రిమ్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే, తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. జిల్లా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. చదవండి: ఒక తల్లి పాము..70 పిల్ల పాములు.. -
వాహనం బోల్తా..16 మందికి తీవ్రగాయాలు
సాక్షి, వైఎస్సార్, కడప : రాజంపేట మండలం రోళ్ళమడుగు సమీపంలో మాడికాయల లోడుతో వెళుతున్న ఇశ్చర్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మందికి తీవ్ర గాయాలు కాగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటీ అమరనాథ్ రెడ్డి వాహనాలలో ఆసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్న నలుగురిని కడప రిమ్స్‌కు తరలించారు. -
రిమ్స్‌లో గొంతు కోసుకున్న కరోనా పేషెంట్
కడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ (38) సోమవారం తెల్లవారుజామున కత్తితో గొంతు కోసుకున్నాడు. కడప సాయిపేటకు చెందిన ఇతను మూడు రోజుల నుంచి రిమ్స్‌లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. కత్తితో గొంతు కోసుకోవడంతో గమనించిన వైద్యులు సర్జికల్ ఐసీయూలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్బంగా రిమ్స్ వైద్యులు మాట్లాడుతూ ఇతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలి పారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రిమ్స్ పోలీసులు చెప్పారు. -
లాలూను వేధిస్తున్న కరోనా టెన్షన్
పట్నా : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బిహర్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు కరోనా భయం పట్టుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి చికిత్స అందించిన వైద్యుడే లాలూ ప్రసాద్‌కు కూడా చికిత్స చేయడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఇదే హాస్పిటల్లో లాలూ కూడా చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా గత మూడు వారాలుగా లాలూకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ఉమేష్‌ప్రసాద్ కరోనా బాధితుడికి కూడా వైద్యం చేశారు. దీంతో కోవిడ్ రోగికి వైద్యం అందించిన ఉమేష్‌ప్రసాద్‌తో పాటు, అతని బృందంలోని అందరినీ క్వారంటైన్‌కు పంపుతున్నట్లు రిమ్స్ ప్రకటించింది. అంతేకాకుండా వీరిలో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే, లాలూ ప్రసాద్‌కి కూడా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే లాలూను పెరోల్ పై విడుదల చేసే ప్రతిపాదనను జార్ఖండ్ అడ్వకేట్ జనరల్‌కు సీఎం హేమంత్ సోరెన్ పంపించారు. కాగా 7 సంవత్సరాల కన్నా తక్కువ జైలు శిక్ష ఉన్న ఖైదీలను మాత్రమే పెరోల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన విషయం తెలిసిందే. (లాలూ ప్రసాద్‌కు అనారోగ్యం) -
శవాలు కదులుతుంటే తెలియని భయం..
శవాన్ని చూడగానే కొందరు భయపడతారు.. కొందరు పక్కకి జరిగిపోతారు. ఒకవేళ తెలిసిన వారు మృతిచెందినా ఆ దేహాన్ని తాకకుండానే నివాళులర్పించివెనుతిరుగుతారు.. సాధ్యమైనంత తొందరగా అంత్యక్రియలూ నిర్వహిస్తారు. ఇవీ సహజంగాఎక్కువ సందర్భాల్లో తారసపడే దృశ్యాలు.. కానీ వీరు మాత్రం శవాన్ని ముట్టుకోడానికి ఏమాత్రం సంకోచించరు.. ఆ శవంతో తమకు ఎలాంటి బంధం లేకున్నా దాని దగ్గరే నిలబడతారు. వైద్యుని సూచనల మేరకు శవం శరీర భాగాలను కోస్తారు.. వైద్యులు కాకున్నా కుట్లు వేయడానికీ వెనుకాడరు.. శవాల మధ్యే ఉంటున్నా భయమనేది ఏ కోశానా వారిలో కనిపించదు.. వారెవరో కాదు.. మార్చురీ వద్ద తోటీలుగా వృత్తి నిర్వహించే వారు.. మద్యం మత్తులో విధులు నిర్వర్తిస్తారని.. మనసు లేకుండా యాంత్రికంగా చేసుకుపోతారని అనుకుంటే పొరపాటే. సాక్షి పలకరించినప్పుడు కడప మార్చురీ వద్ద తోటీలు మనసును కదిలించే ఆసక్తికర అంశాలు వెల్లడించారు.. వీరి జీవన శైలిపై ప్రత్యేక కథనం.. సాక్షి కడప: శవాల గది (పోస్టుమార్టం రూం).. ఇక్కడ శవాలు తప్ప ఏమీ ఉండవు.. వివిధ కారణాలతో చనిపోయిన వారి మృతదేహాలు ఇక్కడ చేరుస్తారు. అయినవారు ఎవరూ లేని డెడ్‌బాడీలను ప్రీజర్ బాక్సులో ఉంచుతారు. ఈ పోస్టుమార్టం రూం పేరు వింటేనే ఒకరకమైన బాధ.. ఆందోళన కలుగకమానవు. ఇక అక్కడ అడుగు పెట్టాలంటే భయంగా ఉంటుంది. అలాంటిది ఆ శవాల గది వద్ద ప్రతినిత్యం ఉంటూ.. అక్కడే తిరుగుతూ ఆ గదిలోనే పనులు చేసుకుంటూ.. విధులు నిర్వహించే తోటీల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. చెప్పలేని ఆవేదన అనుభవిస్తున్నా... వంశపారంపర్యంగా వచ్చిన వృత్తిని దైవంగా భావిస్తూ జీవనం సాగిస్తున్నారు. డాక్టర్ సమక్షంలో శవాన్నికోసేటప్పుడు... శరీరంలోని గుండె, కాలేయం, కిడ్నీ, లివర్, పొట్ట.. ఇలా అవయవాలను బయటికి తీస్తున్నప్పుడు.. ఎంతో వేదన అనుభవిస్తుంటామని.. కన్నీటి పర్యంతం అవుతుంటామని... అయినా విధి నిర్వహణలో ఇవన్నీ తప్పవని కడప రిమ్స్ పోస్టుమార్టం గదిలో పనిచేస్తున్న తోటీలు వెంకటయ్య, టి.నర్సారావు అంటున్నారు. విధి నిర్వహణలో వారు అనుభవిస్తున్న బాధ.. కష్టం.. ఎదుర్కొన్న సంఘటనలు సాక్షికి వివరించారు. ఆ ఇద్దరూ అక్కడే.. కడప మాసాపేటకు చెందిన వెంకటయ్య, నర్సారావులు నెల్లూరు జిల్లాకు చెందినవారైనా.. వాళ్ల పెద్దల కాలంలోనే కడపలో స్థిరపడ్డారు. ఇరువురికి వారి తండ్రులు చనిపోవడంతో తోటి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం నర్సారావు 12ఏళ్ల నుంచి పోస్టుమార్గం గదిలో పనిచేస్తుండగా.. వెంకటయ్య 30 ఏళ్లుగా శవాల మధ్యన తోటిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకరు నాలుగు వేలకు పైగా...మరొకరు 10 వేలకు పైగా... కడప రిమ్స్ మార్చురీలో తోటిగా పనిచేసే గోవింద్ 1991లో చనిపోయారు. దీంతో ఆయన కుమారుడైన వెంకటయ్యకు ఆ ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 10 వేలకు పైగా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. వెంకటయ్యకు మేనల్లుడైన మహాదేవ్ కూడా ఈ పనిలో సహకరిస్తుంటాడు. 12 ఏళ్ల క్రితం నాన్న చనిపోవడంతో కుమారుడు నర్సారావుకు తోటి ఉద్యోగాన్ని ఇచ్చారు. ఇతను కూడా పోస్టుమార్టంలో భాగంగా వైద్యుల సమక్షంలో మృతదేహం కోతకు సంబంధించిన పనులు చేస్తున్నారు. దాదాపు నాలుగు వేలకు పైగా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహణలో పాలుపంచుకున్నారు. అయితే ఇటీవల నర్సారావు కుమారుడైన రాజా కూడా అక్కడే స్వీపర్‌గా పనిచేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. మార్చురీ రికార్డు గదిలో భోజనం చేస్తున్న తోటీలు మొదట్లో తినేవాళ్లం కాదు... కడపలోని క్రిస్టియన్‌లేన్ సమీపంలో ఉన్న పాత రిమ్స్‌లో ఆస్పత్రి ఉన్నప్పుడు తోటిగా జాయిన్ అయిన మొదట్లో వృత్తి రీత్యా జీతం వస్తుందని సంతోషమనిపించినా... ఆరు నెలలపాటు చాలా అవస్థలు పడ్డాం. అది ఎంత అంటే ఒక పక్క భయం, జంకు.. మరోపక్క ఇంటికి వెళితే తిండి కూడా తినలేని పరిస్థితి. పోస్టుమార్టం గదిలో శవాలపై చేసిన సంఘటనలన్నీ గుర్తుకు వస్తుండడంతో ఏమీ చేయలేని పరిస్థితి. ఇంటిలో అన్నం తిందామని కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొన్నా ఏదో తెలియని బాధ. అన్నం గిన్నెలో చేయి పెడితే చాలు.. పోస్టుమార్టం గదిలో చేసిన పనులన్నీ గుర్తుకు వచ్చి ఆరు నెలల వరకు తినడమే తగ్గించాం. భోజనం ప్లేటులో చేయి పెడితే ఏదో పేగులు, గుండె, రక్తం మీద పెట్టినట్లుగా గుర్తుకు వచ్చి తినలేకపోయేవాళ్లం. తర్వాత తట్టుకోలేక అంతో ఇంతో మద్యం సేవించి తింటూ వచ్చాం. అలా ఏడాది గడిచేంత వరకు ఇబ్బందులు పడుతూ వచ్చాం. శవాలు మీదపడేవి.. ప్రస్తుతం నూతనంగా నిర్మించిన రిమ్స్ ఆవరణలో విశాలమైన పోస్టుమార్టం గదితోపాటు శవాలను నిల్వ చేయడానికి ఫ్రీజర్లు ఉన్నాయి. అదే 15 ఏళ్లు వెనక్కి వెళితే.. పాత రిమ్స్‌లో ఇరుకైన గది.. పోస్టుమార్టానికి ఒక టేబుల్ మాత్రమే ఉండేది. దీంతో చాలా సందర్భాలలో అనేక అగచాట్లు పడేవాళ్లం. రాయచోటి ప్రాంతంలో ఎన్కౌంటర్లు జరిగి 10 మంది వరకు చనిపోయినప్పుడు శవాలను తీసుకొచ్చి పోస్టుమార్టం గదిలో పెట్టారు. అప్పట్లో స్థలంలేక ఒక బాడీ మీద ఒకటి వరుసగా పెట్టడం.. ఇతర ఏదైనా శవాలు వచ్చినా అన్ని వరుసగా పెట్టడంతో తిప్పలు చాలా ఎదుర్కొన్నాం. అంతేకాదు.. అనాథ శవాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కూడా అప్పుడు బాడీ ఫ్రీజర్లు లేవు. ఒకదాని మీద ఒకటి శవాలను వరుసగా పేర్చి పెట్టేవాళ్లం. ఏదైనా చేయడానికి వెళ్లినపుడు ఒక్కసారిగా అవి వచ్చి మీద పడేవి. చిన్నగా మీద పడిన శవాలను ఒక్కొక్కటిగా పైకి చేర్చి మళ్లీ పనిచేసుకుంటూ ముందుకు పోయాం. అప్పుడు చాలా భయం అనిపించేది. కొన్ని సందర్భాల్లో శవం తెచ్చి మాకు అప్పగించడంతోపాటు ఐస్‌గడ్డ ఇచ్చేవారు. ఐస్‌గడ్డలపై పెట్టి దానిపై బాడీని పడుకోబెడుతుండగా ఐస్‌గడ్డ కరిగి బాడీ కిందికి జరిగే సందర్భం చూసినపుడు వణికిపోయేవాళ్లం. ఎందుకంటే మృతదేహాలు కదులుతుంటే తెలియని భయం. ఇలా ఒకటేమిటి? చాలా అనుభవించాం. శవాలు పట్టుకుంటే చేతిలోకి కండలు.. నాకు బాగా గుర్తు. 2001 సంవత్సరంలో బుగ్గవంక వరద నీరు కడప నగరంలోని కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది. ఆ సమయంలో అనేకమంది ఈ నీటిలో కొట్టుకుపోయి చనిపోయారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో వంక నీటిలో చనిపోయారు. ఆ శవాల తాలూకు ఒకటి చెట్టుకు కరుచుకుంటే.. ఒకటి బ్రిడ్జి సందున, ఇంకోటి బురదలో ఇరుక్కుపోయి బాడీలు కనిపించాయి. బుగ్గ వంక ఉధృతి తగ్గి శవాల పోస్టుమార్టం వద్దకు వెళ్లేటప్పటికి కాళ్లు, చేతులు నీలక్కపోయి, చవికిపోయి ఉన్నాయి. కనీసం బురద నుంచో.. చెట్టు నుంచో పట్టుకొని పక్కకు లాగుదామన్నా చవికిపోయిన శరీరానికి సంబంధించిన కండలు, ఎముకలు చేతిలోకి వచ్చాయి. దీంతో ఏమీ చేయలేక ఉబ్బిపోయిన శవాలను చిన్నగా పట్టుకుని బయటకు తీస్తుంటే.. వారి అవయవాలు, ఎముకలు చేతిలోకి ఊడి రావడం చూసి మాలో మాకే ఏడుపొచ్చింది. కానీ తప్పని పరిస్థితుల్లో అలాగే చేశాం. అరిష్టమని.. ఊరిలోకి రానివ్వరు.. 1800 నుంచి 2 వేల మంది గర్భవతులు చనిపోయిన ఘటనలలో నేను వారికి పోస్టుమార్టం చేసిన సందర్భాలలో చాలా బాధ అనుభవించానని తోటి వెంకటయ్య అంటున్నాడు. ‘వారి బంధువులు, కుటుంబ సభ్యుల కోరిక మేరకు గర్భవతిని అలాగే పూడ్చి పెట్టరు. సాంప్రదాయం ప్రకారం చేయాలని....కర్మకాండలు చేసే ప్రాంతానికి తమను తీసుకెళ్లి అక్కడ బిడ్డను బయటకు తీయమని కోరేవారు. వారి కోరిక మేరకు బిడ్డను వారి చేతిలో పెట్టేవాళ్లం. అప్పుడు ఆ శిశువును వాళ్లు పూడ్చిపెట్టేవాళ్లు. అయితే ముందు ఏవేవో మాటలు చెప్పి తీసుకెళ్లిన కుటుంబీకులు, బంధువులు శవం పూడ్చిన తర్వాత మమ్ములను వెళ్లమని చెప్పేవారు. అప్పుడు వచ్చిన దారిన వెళదామంటే ఊరిలో వారు ఒప్పుకోరు. కారణం ఏమిటంటే గ్రామంలోకి వస్తే అరిష్టమని అలాగే వెళ్లండంటూ అడ్డుగా నిలబడడంతోపాటు కట్టెలు పట్టుకుని ఉంటారు. ఊరి పొలిమేరల్లోకి కూడా రానివ్వరు. ఆ ఊరిలో దారులు ఎటుంటాయో కొత్తగా వచ్చిన మాకు తెలియదు. ఇతర ప్రాంతాల మీదుగా దారి చెబితే కిలోమీటర్ల మేర నడిచి వెళ్లినా వాహనాల్లో కూడా ఎవరూ ఎక్కించుకోరు. ఇలా ఒకసారి కాదు.. పదుల సార్లు కష్టాలు పడ్డాం’ అని ఆయన వివరించాడు. డాక్టర్‌కు వారధి తోటి.. దేవుడికి పూజారి ఎలా వారధిలా ఉంటాడో పోస్టుమార్టం గదిలో డాక్టర్‌కు తోటి వారధిగానే ఉంటాడు. నేను ఎప్పుడైనా ఇంటిలోని కుటుంబ సభ్యులపైన కొప్పడ్డా.. కానీ తోటీలను చిన్నమాట కూడా ఎప్పుడూ అనలేదు. ఎందుకంటే ఎవరూ చేయలేనటువంటి పనులను సమాజంలో వారు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ డాక్టర్ ఏం చేయాలన్న తోటి ద్వారానే చేయిస్తారు. కొన్ని శవాలు కాలిపోయి వస్తాయి. మరికొన్ని కుళ్లిపోయి ఉంటాయి. అలాంటి శవాన్ని కూడా పోస్టుమార్టానికి ముందు, తర్వాత నీటితో కడిగి శుభ్రం చేసిది తోటీలే. – డాక్టర్ ఆనంద్‌కుమార్, ఫోరెన్సిక్ వైద్య నిపుణులు, రిమ్స్, కడప ఇప్పుడు భయం లేదు.. ఒకప్పుడు శవమంటేనే భయçపడే పరిస్థితి. కానీ ఇప్పుడు వేల సంఖ్యలో వాటి మధ్యనే తిరుగుతూ.. ఎవరూ లేని అనాథ శవాలను రోజూ భద్రపర్చడం మొదలుకొని ఇతర పనులన్నీ అక్కడే చేస్తుంటాం. పోస్టుమార్టం గదిలో శవాల మధ్య తిరుగుతూ వైద్యుల సమక్షంలో కత్తిరింపుల కార్యక్రమంలో వేల శవాలను చూశా. ఇప్పుడు భయం అనే పరిస్థితి లేదు. ఫీలింగ్ కూడా ఉండదు. – వెంకటయ్య, మార్చురీ తోటి, కడప నాన్న హయాం నుంచి.. మా నాన్న హయాం నుంచి మార్చురీలో తోటి పని చేస్తున్నా. నాన్న మరణం తర్వాత నాకీ బాధ్యత వచ్చింది. నాన్న ఎప్పుడైనా ఒకసారి మార్చురీలోకి తీసుకెళ్లేవారు. తర్వాత అనారోగ్యం బారిన పడడంతో నేనే వెళ్లేవాడిని. అయితే మొదట్లో భయం, జంకుతో ఇబ్బంది పడినా తర్వాత అలవాటుగా మారింది. ఇప్పుడు ఎలాంటి జంకు లేకుండానే అక్కడే తిరుగుతుంటాం. మా కుమారుడు రాజా కూడా నాకు మార్చురీలో సహకరిస్తున్నాడు. శవం మార్చురీలోకి తీసుకు రావడం దగ్గరి నుంచి పోస్టుమార్టం అనంతరం అప్పగించే వరకు అన్ని పనులు చేసి పంపిస్తాం. శవాల మధ్యనే తిరుగుతుంటాం. శవాలే మాకు ఆత్మ బంధువులు. – నర్సారావు, మార్చురీ తోటి, కడప -
ఎన్ఆర్సీకి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకం
కడప అర్బన్: జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) తమ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని ముస్లిం మైనార్టీలకు భరోసా ఇచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన కడప రిమ్స్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇదే సందర్భంలో కొందరు ముస్లిం మైనార్టీలు ఎన్ఆర్సీ విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఎం వైఎస్ జగన్.. కడప నగర మైనార్టీ నాయకుడు వలీవుల్లా హుస్సేన్‌ను వేదికపైకి రావాలని పిలిచారు. ఆయన వేదిక వద్దకు రాగానే.. సీఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘మన డిప్యూటీ సీఎం, స్నేహితుడు, ముస్లిం మైనార్టీల విషయంలో అన్నీ తెలిసిన అంజాద్ బాషా నాతో ముందుగా మాట్లాడి ఎన్ఆర్సీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితు ల్లోనూ బలపరచదని ప్రకటించారు. ఆ ప్రకారం డిప్యూటీ సీఎం ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీంట్లో అనుమానాలకు తావు లేదని ముస్లిం మైనార్టీలకు భరోసా ఇస్తున్నా’ అన్నారు. -
‘ప్రభుత్వాస్పత్రుల రూపు రేఖలు మారుస్తాం’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఉన్న సిబ్బంది కొరతను త్వరలోనే అదిగమిస్తామని చెప్పారు. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. సోమవారం కడప రిమ్స్ ఆస్పత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 352.62 కోట్ల రూపాయలతో 7 రకాల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కొరకు ఏర్పాటు చేసిన శిలాఫలకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. (చదవండి : రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం: సీఎం జగన్) మానసిక వికలాంగుల ఆస్పత్రి కోసం రూ.40.82 కోట్లు, వైఎస్సార్ క్యాన్సర్ ఆస్పత్రి కొరకు రూ.107కోట్లు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రూ.125 కోట్లు, పోలీసుల భవన నిర్మాణానికి రూ.20.95 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రిమ్స్ ఆస్పత్రితో పాటు రాష్ట్రంలోని వైద్యశాలలన్నింటిలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులలో సిబ్బంది కొరత ఉందని, త్వరలోనే దానిని అధిగమిస్తామని సీఎం తెలిపారు. -
వైద్యులపై కొరడా.. ఒకరు సస్పెన్షన్..
సాక్షి, ఆదిలాబాద్ : వైద్యో నారాయణో హరి.. కళ్ల ముందు కనిపించని దేవుని కంటే రోగి ప్రాణాలు కాపాడే వైద్యుడినే దేవునిగా భావిస్తారు.. అంతటి మహోన్నతమైన వృత్తికి కొంతమంది కలాంకం తీసుకొస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వేలాది రూపాయల వేతనాలు తీసుకుంటున్నా వృత్తికి న్యాయం చేయలేకపోతున్నారు. విధులు సక్రమంగా నిర్వహించక పోవడంతో రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా వారికి నచ్చినట్టే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో విధులు సక్రమంగా నిర్వహించని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్‌పై వేటుపడింది. ఎట్టకేలకు కలెక్టర్ దివ్యదేవరాజన్ కొరడా ఝులిపించారు. ఈ చర్యలతో మిగితా డుమ్మా వైద్యుల్లో భయాందోళన మొదలైంది. ఇకనైనా రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని స్థానికులు కోరుతున్నారు. ఇకనైనా తీరు మారేనా.. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా రిమ్స్‌లో పనిచేస్తున్న కొంతమంది వైద్యుల తీరు మారడం లేదు. గిరిజన మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008లో రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)ను ఏర్పాటు చేశారు. వందపడకల ఆస్పత్రిని నిర్మించారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో కార్పొరేట్ వైద్యం అందుతుందని భావించిన జిల్లా ప్రజలకు చిన్నపాటి రోగాలకు తప్పా నాణ్యమైన వైద్యం అందని పరిస్థితి. గుండె నొప్పి, క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హైదరాబాద్, నాగ్‌పూర్, యావత్మాల్ తదితర ప్రాంతాలకు రెఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి. వైద్యుల తీరు... రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కొంతమంది వైద్యులు ఉదయం 10గంటల వరకు వచ్చి మధ్యాహ్నం ఒంటిగంటకే ఇంటి ముఖం పడుతున్నారు. అత్యవసర సమయంలో రిమ్స్‌కు వచ్చిన రోగులు వైద్యులు అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం. కాల్ డ్యూటీ చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. మధ్యాహ్నం నుంచి జిల్లా కేంద్రంలో క్లినిక్‌లు నిర్వహిస్తూ ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటుగా క్లీనిక్‌లు... రిమ్స్‌లో పనిచేసే కొంత మంది వైద్యులు ప్రైవేట్ క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలు నిర్వహిస్తూ రెగ్యులర్ డ్యూటీని నిర్లక్ష్యం చేస్తున్నారు. రిమ్స్‌ను పర్యవేక్షించాలి్సన ఓ అధికారి సైతం క్లినిక్ నిర్వహించడం గమనార్హం. వీరితో పాటు గైనకాలజిస్ట్లు, సివిల్సర్జన్లు, అనస్తీషియా వైద్యులు, ఈఎన్టీ, కంటి వైద్యులు, ఆర్థోపెడిక్‌లు క్లినిక్‌లు నిర్వహిస్తూ విధులకు ఎగనామం పెడుతున్నారు. ఈ విషయం బహిరంగంగా అందరికీ తెలిసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా సాగుతోంది. బయోమెట్రిక్ ఉన్నా.. వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా సమయపాలన పాటించాలనే ఉద్దేశంతో కలెక్టర్ దివ్యదేవరాజన్ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా డుమ్మా వైద్యులు మాత్రం తమ పని తాము కానిచ్చేస్తున్నారు. ఉదయం పూట బయోమెట్రిక్ వేలి ముద్రలు వేసి సాయంత్రం తమ క్లినిక్‌లు ముగించుకున్న తర్వాత వచ్చి థంబ్ పెడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇలాంటి వైద్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దివ్యదేవరాజన్ బుధవారం రిమ్స్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో వెల్లడించిన మరుసటి రోజే చర్యలను పూనుకున్నారు. ఒకరు సస్పెన్షన్.. మరొకరు సరెండర్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సక్రమంగా హాజరు కాకపోవడం, బయోమెట్రిక్ హాజరులో థంబ్ పెట్టి ప్రైవేట్ క్లినిక్‌లో విధులు వ్యవహరించినందుకు అనస్తిషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్‌ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు రిమ్స్ అధికారులు తెలిపారు. అదేవిధంగా బయోకెమిస్ట్రి అసోసియేట్ ప్రొఫెసర్ రమా శౌరి సక్రమంగా విధులకు హాజరుకాకపోవడం, గత కొన్ని రోజులుగా గైర్హాజరవుతున్న దృష్ట్యా ఆమెను డీఎంఈకి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. -
శిశువు ఐసీయూలో..తల్లి వరండాలో!
సాక్షి, ఒంగోలు: రిమ్స్‌లో బాలింతల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే పుట్టిన శిశువు కోసం తల్లి ఎంత కష్టమైనా భరిస్తుంది. సిజేరియన్ చేయించుకున్నా తనకు ఏమైనా ఫర్వాలేదంటూ సమస్యలున్నా బిడ్డ పుట్టిన ఆనందంలో వాటిని మరిచిపోతోంది. ఇదీ.. రిమ్స్ నవజాత శిశు సంరక్షణ కేంద్రం బయట బాలింతల దుస్థితి. రిమ్స్‌లో అప్పుడే పుట్టిన పురిటి పిల్లల చికిత్స కేంద్రానికి అనుబంధంగా నవజాత శిశు సంరక్షణ కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో జిల్లాలో ఇతర ప్రాంతాల్లో పుట్టిన చిన్నారులతో పాటు రిమ్స్‌లో పుట్టిన పిల్లలు ఉంటారు. కామెర్లు, బరువు తక్కువతో పుట్టడం, గాలి పీల్చుకోలేని వారికి, ఫిట్స్‌తో ఉన్న వారికి, పుట్టగానే ఏడవని పిల్లలకు ఇక్కడ చికిత్స అందిస్తారు. దాదాపు వారం రోజుల నుంచి నెల రోజుల వరకు చిన్నారులకు చికిత్స అందిస్తారు. బాలింత బెడ్ వరండానే శిశువు ఐసీయూలో ఉంటే బాలింత ఎస్ఎన్సీయూ ఎదుట కారిడార్‌లో ఉండాల్సిందే. అక్కడ 10 బెడ్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఐసీయూలో ఎప్పుడూ దాదాపు 30 మంది చిన్నారులు చికిత్స పొందుతూ ఉంటారు. దీంతో చిన్నారుల తల్లులు కూడా బయట ఉండాల్సిందే. దీంతో బాలింతలు తీవ్ర ఇబ్బందులు, అనారోగ్యం బారిన పడుతున్నారు. వీరిలో సిజేరియన్ శస్త్రచికిత్సలు చేసిన వారు కూడా ఉంటారు. వీరి బాధలు వర్ణనాతీతం. అప్పుడే వేసిన కుట్లతో నేలపై పడుకుని..తిరిగి లేచే సయమంలో పిగిలిపొయే ప్రమాదం ఉంది. అయినా తమ శిశువు కోసం బాలింతలు ఆ బాధలు భరిస్తున్నారు. తమకు పూర్తి స్థాయిలో మంచాలు కేటాయించాలని, నేలపై పడుకోలేక పోతున్నామని బాలింతలు వాపోతున్నారు. యూరినల్స్‌కు వెళ్లాలంటే నరకమే బాలింతలు యూరినల్స్‌కు, బాత్రూమ్కు వెళ్లాలంటే నరక యాతన అనుభవించాల్సి వస్తోంది. సిజేరియన్ చేసిన బాలింతలు 500 మీటర్లకుపైగా దూరంలో రిమ్స్ గేటు బయట వరకూ నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న సులభ్ కాంప్లెక్స్‌కు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి చికిత్స కోసం రిమ్స్‌కు వస్తే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సులభ్ కాంప్లెక్స్‌లో యూరినల్స్‌కు వెళ్లాలంటే రూ.6లు చెల్లించాల్సి వస్తోంది. స్నానం చేసేందుకు రూ.20లు ఇవ్వాల్సిందే. ఎన్నిసార్లు యూరినల్స్‌కు వెళ్తే అన్ని సార్లు రూ.6లు చొప్పున చెల్లించాల్సి వస్తోంది. సిజేరియన్ చేయించుకున్న తాము అంత దూరం వెళ్లలేకపోతున్నామని బాలింతలు వాపోతున్నారు. సమీపంలోనే తమకు ఒక బాత్రూమ్ కేటాయించాలని కోరుతున్నారు. -
అటానమస్‌గా రిమ్స్
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ ప్రస్తుతం సెమీ అటానమస్ పద్ధతిలో కొనసాగుతోందని..భవిష్యత్‌లో అటానమస్‌గా గుర్తించేందుకు చర్యలు చేపడుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సర్కారు ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం రిమ్స్ ఆస్పత్రిని పరిశీలించారు. అనంతరం రిమ్స్ వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో రిమ్స్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తామన్నారు. ఒకే చోట ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన వైద్యులకు బదిలీల్లో తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. రిమ్స్ ప్రస్తుతం సెమీ అటానమస్ పద్ధతిలో కొనసాగుతుందని, భవిష్యత్‌లో అటానమస్‌గా గుర్తించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రొఫెసర్లు, వైద్యులు పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని, అటానమస్ అయితే మరిన్ని నాణ్యమైన వైద్యసేవలు అందుతాయన్నారు. త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో గిరిజనులతోపాటు అన్నివర్గాల వారికి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. చాలా మంది వైద్యులు వృత్తి నిబద్ధతతో పనిచేసేవారు ఉన్నారని, వైద్యులపై దాడులు జరగకుండా రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. అయితే ప్రతీ వైద్యునిలో నిబద్ధతతో పనిచేస్తామనే తపన ఉండాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పీహెచ్‌సీల్లో కనీస మౌలిక వసతులు ఉండేవి కావని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మౌలిక వసతులను కల్పించామన్నారు. మోడల్ పీహెచ్సీగా తీర్చిదిద్దామని, నాన్ టీచింగ్, టీచింగ్ సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ రమేశ్‌రెడ్డి, జెడ్పీవైస్ చైర్మన్ రాజన్న, రిమ్స్ డైరెక్టర్ కరుణాకర్, ఆర్ఎంఓ రాము, సూపరింటెండెంట్ సత్యనారాయణ, డీఎంహెచ్ఓ రాజీవ్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల హల్చల్.. రిమ్స్ ఆస్పత్రిని పరిశీలించేందుకు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసేందుకు కార్యకర్తలు హల్చల్ చేశారు. ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందుతున్న విషయాలను తెలుసుకునేందుకు వెళ్లిన మంత్రి వెంట టీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్లడంతో ఆస్పత్రిలో రద్దీగా మారింది. కేవలం ఎంఐసీయూలో ఒక రోగితో మాత్రమే మాట్లాడారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో హాలు అంతా టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో నిండిపోయింది. వైద్యులకు కూడా కనీసం కూర్చోవడానికి కుర్చీలు ఇవ్వకుండా కార్యకర్తలే కూర్చోవడంతో కొంతమంది వైద్యులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారిని బయటకు పంపారు. -
మంత్రివర్యా.. మాకేయి సూడయ్యా
సాక్షి, ఆదిలాబాద్: వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు, గిరిజనులు ఉన్న ఈ ప్రాంతంలో వైద్యసేవలు మృగ్యమయ్యాయి. పేరుకు పెద్దపెద్ద సర్కారు దవాఖానాలు ఉన్నా రోగులకు సరైన వైద్యం అందడం లేదు. చిన్నచిన్న రోగాలకు కూడా రిమ్స్ వైద్యులు హైదరాబాద్, నాగ్‌పూర్, యావత్మాల్ తదితర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పుసప్పు చేసి ప్రైవేటు వైద్యం చేయించుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్ ఆస్పత్రి ఉన్నా చిన్న చిన్న రోగాలు, జ్వరాలకు తప్ప మరే వైద్యం అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల ఖాళీలు, మౌలిక వసతుల కొరత, పరికరాలు లేక నాణ్యమైన వైద్యం అందడం లేదు. ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ గాడి తప్పింది. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లాలో పర్యటించనున్నారు. రోగులు, వారి బంధువులు జిల్లాలోని ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, పీహెచ్పీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అమాత్యునికి విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు. పీహెచ్‌సీల్లో అందని వైద్యం.. 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 129 ఉప ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఒక ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. అదే విధంగా ఆదిలాబాద్ పట్టణంలో ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 24 గంటలు పని చేసే పీహెచ్‌సీలు ఉన్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలందించాలి. పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉదయం 8నుంచి రాత్రి 8 గంటల వరకు వైద్యసేవలు అందించాల్సి ఉండగా ఎక్కడా పూర్తి స్థాయిలో రోగులకు వైద్యసేవలు అందడం లేదు. పీహెచ్సీలో చాలా మంది వైద్యులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకే విధుల్లో ఉంటున్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో ప్రైవేటు క్లీనిక్‌లు నడుపుతున్నారు. బయోమెట్రిక్‌లు ఏర్పాటు చేసినా మూలనపడ్డాయి. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో మెడికల్ ఆఫీసర్లు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఖాళీల జాతర.. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీహెచ్‌సీల్లో, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల పోస్టులు తీవ్రంగా వేధిస్తున్నాయి. నాలుగు సివిల్ సర్జన్ పోస్టులకు గాను ఒక్కరే ఉన్నారు. అదే విధంగా జిల్లా మలేరియా అధికారి పోస్టు ఖాళీగా ఉంది. మెడికల్ ఆఫీసర్ పోస్టులు 52 గాను 13 మంది కాంట్రాక్ట్, 33 మంది రెగ్యులర్ ఉన్నారు. ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాలుగు డిప్యూటీ పారామెడికల్ పోస్టులకు గాను ఇద్దరు ఉన్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాస్ మీడియా అధికారి పోస్టు, గణాంక అధికారి పోస్టు ఖాళీగా ఉంది. 34 స్టాఫ్ నర్సులకు గాను 6 గురు కాంట్రాక్ట్, 21 మంది రెగ్యులర్, 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫార్మాసిస్ట్ గ్రేడ్–2 పోస్టులు 29 ఉండగా 17 రెగ్యులర్, 5 కాంట్రాక్ట్, 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 29 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 19 మంది రెగ్యులర్, 5 కాంట్రాక్ట్, 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెకండ్ ఏఎన్ఎం పోస్టులు 129 ఉండగా వీటిలో 117 కాంట్రాక్ట్, 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర సిబ్బంది పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. రిమ్స్.. పేరుకే పెద్దాసుపత్రి జిల్లా కేంద్రంలో రిమ్స్ మెడికల్ కళాశాల ఉన్నా రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారు. ఏడాది క్రితం కన్జర్వేటర్ ఫారెస్ట్ గుండె నొప్పిరావడంతో వైద్యం కోసం రిమ్స్‌లో చేరారు. సరైన వైద్యం అందక ఆయన మృత్యువాత పడ్డ సంఘటన తెలిసిందే. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. చిన్నచిన్న రోగాలు జ్వరాలు, మెటర్నటీ సేవలు అందుతున్నాయి. నిపుణులైన వైద్యులు లేకపోవడంతో క్యాన్సర్, గుండెనొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధులు, ఇతరాత్ర చికిత్సల కోసం హైదరాబాద్, మహారాష్ట్రకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా రిమ్స్ కళాశాలకు రెగ్యులర్ డైరెక్టర్ లేరు. అదే విధంగా రిమ్స్ కళాశాలకు ప్రిన్సిపాల్ కూడా ఇన్చార్జే. ఆస్పత్రిని పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్, ఆర్ఎంవో పోస్టుల్లో సైతం ఇన్‌చార్జులతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో పర్యవేక్షణ గాడి తప్పింది. రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదు. చాలా మంది డాక్టర్లు ఉదయం 8 గంటల వరకు వచ్చి మధ్యాహ్నం 12 గంటల వరకే రిమ్స్‌లో వైద్యసేవలు అందిస్తున్నారు. రాత్రి వేళల్లో కాల్ డ్యూటీ విధులు నిర్వహిస్తున్నారు. వారు వచ్చే వరకు రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లతోనే వైద్యసేవలు అందుతున్నాయి. ప్రొఫెసర్ పోస్టులు 21కి గాను 9 మంది పని చేస్తున్నారు. 12 ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 30కి గాను 15 మంది పని చేస్తున్నారు. 15 ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 41కి గాను 34 మంది పని చేస్తుండగా 7 ఖాళీగా ఉన్నాయి. ట్యూటర్ పోస్టులు 59కి గాను 37 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిమ్స్ అనేక సమస్యలతో కొట్టమిట్టాడుతోంది. జూనియర్ డాక్టర్లకు నాలుగు నెలల నుంచి స్టైఫండ్ ఇవ్వడం లేదని ఆందోళన బాటపట్టారు. అదే విధంగా పారిశుధ్య కార్మికులకు కూడా నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో ఆధునిక పరికరాలు ఉన్నా వైద్యులు లేకపోవడంతో నిరుపయోగం మారుతున్నాయి. జిల్లాలో ఆస్పత్రుల సమస్యలను పరిష్కరించాలని రోగులు ఆమాత్యున్ని వేడుకుంటున్నారు. నేడు రిమ్స్‌ను సందర్శించనున్న మంత్రి ఎదులాపురం(ఆదిలాబాద్): రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం జిల్లా కేంద్రానికి రానున్నారు. అందులో భాగంగా రిమ్స్ ఆస్పత్రిని సాయంత్రం 5 గంటలకు సందర్శించనున్నారు. అనంతరం ఆస్పత్రిలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ఇక్కడి నుంచి బయల్దేరనున్నారు. -
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించిన బాలినేని
-
రిమ్స్‌కు నిర్లక్ష్యం జబ్బు..
కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి రిమ్స్‌ను సందర్శించిన నివాస్ అక్కడి పరిస్థితులపై తీవ్రంగా స్పందించారు. అన్ని విభాగాల్లో కలియతిరిగిన ఆయన అవకతవకలను గుర్తించి క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. అడుగు పెట్టిన వెంటనే ఆరోగ్యమిత్ర అందుబాటులో లేని విషయాన్ని గమనించి.. ఓపీ విభాగం వద్ద ఉండాలని స్పష్టం చేశారు. బ్లడ్‌బ్యాంకులో కేవలం మూడు యూనిట్ల రక్తం నిల్వ ఉందన్న విషయం తెలుసుకున్న ఆయన రక్తసేకరణపై దృష్టి పెట్టమని ఆదేశించారు. అక్కడ విధులకు గైర్హాజరైన ఇద్దరు నర్సులను సస్పెండ్ చేశారు. గైనిక్ వార్డులో ఉన్న గర్భిణులకు హెచ్‌బీ తక్కువ ఉందన్న విషయం దగ్గర నుంచి ఎన్నో అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆస్పత్రి ఉన్నతాధికారులను హెచ్చరించారు. రోగులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ సర్వజనీన ఆస్పత్రిని (రిమ్స్) జిల్లా కలెక్టర్ జె.నివాస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రిమ్స్‌ను పరిశీలించారు. ఆస్పత్రిలో ఉన్న పరిస్థితులపై తీవ్రంగా స్పందించా రు. ఓపిలో ఉన్న ఆరోగ్య మిత్రతో ప్రారంభించి, అత్యవసర విభాగంలోని వార్డులు, బ్లడ్ బ్యాం కు, ఐసీయూ, ప్రసూతి వార్డు, గైనిక్ వార్డుల్లో తనిఖీ చేపట్టారు. ప్రతి చోటా ఏదో ఒక లోపం కనిపించడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రక్త నిధిలో ఉన్న ఇద్దరు స్టాఫ్ నర్సులను సస్పెం డ్ చేయాలని అధికారులకు సూచించారు. గైనిక్ వార్డులో తరచూ డే ఆఫ్‌లు తీసుకుంటున్న ఇద్ద రు డాక్టర్లపై చర్యలు తీసుకోవాని రిమ్స్ ప్రిన్సిపా ల్కి ఆదేశించారు. రోగులతో మాట్లాడి వైద్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మెడికల్ మేల్, ఫిమేల్ వార్డుల్లోని రోగులతో మాట్లాడారు. మందుల సరఫరా, భోజనం తదితర సదుపాయాలపై ఆరా తీశారు. సిబ్బందిపై ఆగ్రహం.. ఆస్పత్రిలోకి అడుగుపెట్టగానే ముందుగా ఆరోగ్య మిత్ర ఎక్కడ ఉన్నారని కలెక్టర్ అడిగారు. అక్కడ ఆరోగ్య మిత్ర లేకపోడంతో ఆ విభాగం కో ఆర్టినేటర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగికి వెంటనే కావాల్సిన సహాయాన్ని అందించాల్సిన ఆరోగ్య మిత్ర ఎక్కడో ఉంటే కుదరదన్నారు. అనంతరం ఓపీ విభాగాన్ని పరిశీలించారు. అక్కడ కంప్యూటర్, ప్రింటర్ లేనందున తీవ్రంగా స్పందించారు. వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఐపీ రికార్డులను పరిశీలించారు. అక్కడ నుంచి అంటినల్ ఓపీ విభాగానికి వచ్చారు. అక్కడ 8 మంది వైద్యులు ఉండాల్సిన చోట ముగ్గురే ఉన్నారని, మిగిలిన వారు ఎందుకు అందుబాటులో లేరని ప్రశ్నించారు. వరుసగా డే ఆఫ్‌లు హాజరు పట్టికలో ఉన్నాయని, దీనిపై సమాధానం కావాలని సంబంధిత అధికారులను అడిగారు. స్పష్టమైన సమాధానం లేకపోవడంతో అటువంటి వారిపై చర్యలు తీసుకోవా లని ప్రిన్సిపాల్‌కు ఆదేశించారు. అక్కడే ఉన్న గర్భిణుల రికార్డును పరిశీలించారు. పలువురికి హెచ్‌బీ తక్కువగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. మెరుగైన సేవలు అందించాలి ఆస్పత్రి తనిఖీ అనంతరం మీడియాతో మాట్లాడారు. రోగులకు సకాలంలో సేవలు అందాల ని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. కళాశాలకు ఈ ఏడాది ఎంబీబీఎస్‌లో మరో 50 సీట్లు అదనంగా రానున్నాయన్నారు. గైనిక్ వార్డులో లిఫ్ట్ అవసరం ఉందన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున జ్వరాలు ప్రబలుతున్నాయని, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. మం దుల సరఫరాలో సమస్యలు ఉంటే కొనుగోలు చేస్తామన్నారు. అన్ని ఆస్పత్రుల్లోనూ వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. వారం రోజుల్లో మళ్లీ విజిట్ ఉంటుందని, అప్పటికీ తీరు మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బ్లడ్ బ్యాంకులో ఇద్దరి సస్పెన్షన్ రక్తనిధిని పరిశీలించి నిల్వలు ఎంత ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. తక్కువగా రక్త నిల్వలు ఉన్నా.. ఎందుకు రక్త సేకరణ చేయలేదని సిబ్బందిని ప్రశ్నించారు. వేసవి సమస్యని చెప్పే ప్రయత్నం చేయగా.. ఇంతమంది విద్యార్థులున్నారని ప్రణాళిక ప్రకారం రక్త సేకరణ చేస్తే సమస్య ఉండదన్నారు. కేవలం మూడు యూనిట్ల రక్తం ఎలా సరిపోతుందన్నారు. స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించి అవసరమైన మేరకు రక్తాన్ని సేకరించాలన్నారు. సిబ్బంది హాజరును పరిశీలించారు. హాజరు పట్టికలో సంతకాలు చేసి తనిఖీ సమయంలో లేని ఇద్దరు సిబ్బంది భాను, శ్రావణిలను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. హాజరుపట్టికలో బ్లడ్ బ్యాంకు ఇన్చార్జి డాక్టర్ శ్రీకాంత్ సంతకం లేకపోవడాన్ని ఆక్షేపించారు. విధులకు హాజరైతే ఎందుకు సంతకం చేయలేదన్నారు. -
శాడిస్టు భర్త
ఒంగోలు: భర్త చేతిలో తీవ్రంగా గాయపడి వైద్యం అందక ఓ మహిళ 30 రోజులుగా రిమ్స్‌లో నరకయాతన అనుభవిస్తోంది. ఆమెకు వైద్యం చేస్తే ఇబ్బందులు వస్తాయేమోనన్న అనుమానంతో చికిత్స చేసేందుకు వైద్యులు ముందుకు రావడం లేదు.పైగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధిత మహిళ, ఆమె తల్లి గురువారం ‘సాక్షి’ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. చికిత్స అందించమని వైద్యులను కోరుతుఆన్న పట్టించుకోవడం లేదని, మరో వైపు వెలిగండ్ల పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేసు నమోదు చేయడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. ఇదీ..జరిగింది వెలిగండ్ల మండలం నరసాంబపురం గ్రామానికి చెందిన దుగ్గినపల్లి పరిశుద్ధమ్మకు ఆమె భర్త రూ.2 వేలు ఇచ్చి సంక్రాంతి సందర్భంగా కొత్త దుస్తులు కొనమని సూచించాడు. భర్తే అందులో వెయ్యి రూపాయలు తీసుకొని పూటుగా మద్యం తాగి ఇంటికి చేరాడు. ఈ విషయంలో దంపతుల మధ్య వివాదం చెలరేగింది. దుడ్డు కర్రతో ఇష్టం వచ్చినట్లు భార్యను బాదాడు. తల్లికి అడ్డు వచ్చి పదేళ్ల కుమార్తె సైతం తండ్రిని నిలదీసింది. ఇష్టం వచ్చినట్లు తాగుతుంటే బయట తలెత్తుకు తిరిగలేకపోతున్నామని ప్రశ్నించడంతో అదే కర్రతో కుమార్తెపైనా దాడికి తెగబడ్డాడు. పాప దీపిక ఎడమ చేయి విరిగింది. మరో వైపు పరిశుద్ధమ్మ కాలు విరిగింది. ఆ రోజు ఎవరూ పట్టించుకోలేదు. ఇద్దరు తీవ్ర నొప్పులతో రోదిస్తుండడంతో మరునాడు అంటే పండగ రోజు కనిగిరి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. కనిగిరి పోలీసులు విచారిస్తే తల్లితో పాటు పాప కూడా తమను కొట్టిన విషయాన్ని బహిర్గత పరిచారు. తల్లి గర్భవతి కావడంతో మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు రిఫర్ చేశారు. ఆమె డిసెంబర్ 25వ తేదీ అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో రిమ్స్‌లో చేరింది. ఆమెను ఇన్‌పేషెంటుగా వార్డు నంబర్ 115లో చేర్చారుగానీ వైద్యం విషయంలో వైద్యులు వెనుకంజ వేస్తున్నారు. డాక్టర్లు కరుణించాలి నా బిడ్డలు ముగ్గురూ పదేళ్ల లోపు వారే. భర్త మద్యానికి బానిసయ్యాడు. ప్రస్తుత పరిస్థితిలో ఆయనే మా కుటుంబానికి ఆధారం. ఆస్పత్రిలో చేరి నెలకావొస్తున్నా కనీసం వచ్చి చూసింది లేదు. వెలిగండ్ల పోలీసులు కూడా నేనే మా ఆయన్ను కొట్టానని అంటున్నారట. ఇంతవరకు కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. ఇక నా ఆపరేషన్ విషయంలో అబార్షన్ జరిగితే మా బాధ్యతని, నేను, మా అమ్మ ఇద్దరం అంగీకరించాం. మా అత్తతో కూడా సంతకం తీసుకున్నారు. నా భర్త ఆచూకీ గురించి అడిగితే అత్త కూడా చెప్పడం లేదు. -దుగ్గినపల్లిపరిశుద్ధమ్మ -
రెండు గంటల్లో తల్లి ఒడికి..
ఆదిలాబాద్: మగశిశువు జన్మించడం ఆ దంపతుల్లో ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఆరు రోజులు గడిచాయి.. మంగళవారం డిశ్చార్జి కావాల్సి ఉంది. వేకువజామున తల్లి ఒడిలో వెచ్చగా నిద్రిస్తున్న శిశువు ఒక్కసారిగా మాయమైంది. స్పృహలోకి వచ్చి చూసిన తల్లిదండ్రుల గుండెల్లో పిడుగు పడినట్లయింది. తమ కుమారుడు కిడ్నాప్‌కు గురి కావడం వారిని ఆందోళ నకు గురి చేసింది. ఈ విషయమై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు క్షణాల్లో స్పందించారు. రెండు గంటల వ్యవధిలో కిడ్నాప్‌కు గురైన శిశువును తల్లి ఒడికి చేర్చారు. నిందితులను కటకటాల వెనక్కి పంపారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఉమ్మడి జిల్లాలో కలకలం సృష్టించింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం చోరపల్లి గ్రామానికి చెందిన దిరబసి గణేష్ భార్య మమత ఆరు రోజుల క్రితం రిమ్స్ ఆస్పత్రిలోని కేసీఆర్ కిట్ వార్డులో మగశిశువుకు జన్మనిచ్చింది. మంగళవారం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావాల్సి ఉండగా.. వేకువజామున శిశువు కిడ్నాప్‌కు గురైంది. తల్లి స్పృహలోకి రాగా రిమ్స్ అధికారులకు సమాచారం అందించింది. వారి సమాచారం మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. చిన్నగుడ్డతో నిందితురాలిని గుర్తించిన పోలీసులు.. ∙ మంగళవారం వేకువజామున 3గంటల సమయంలో శిశువు కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ∙ 3.15 గంటలకు రిమ్స్ సిబ్బంది ఔట్‌పోస్టు పోలీసులకు సమాచారం అందించారు. వారు 3.20 గంటలకు పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్‌చేసి విషయం తెలియజేశారు. ∙ 3.45 గంటలకు ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి, టూటౌన్ సీఐ స్వామి రిమ్స్‌కు చేరుకున్నారు. సంఘటన వివరాలను 3.55 గంటలకు ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌కు తెలియజేశారు. ∙ ఎస్పీ వెంటనే కంట్రోల్‌రూం అధికారులతో మాట్లాడి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆయా మండలాల ఎస్సైలను అలర్ట్ చేయాలని, వాహనాల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ∙ 4.10 గంటలకు నేరడిగొండ, బోథ్, ఉట్నూర్, బోరజ్, తలమడుగు మండలాల పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ∙ 5 గంటల సమయంలో నేరడిగొండ టోల్‌ప్లాజా వద్ద ఎస్సై జి.హరిశేఖర్ తనిఖీలు చేస్తుండగా బొలేరో వాహనంలో శిశువును ఎత్తుకుని ఉన్న పుష్పలతను గమనించి వివరాలు అడిగారు. ఆమె తడబడడం, రిమ్స్ నుంచి తెచ్చానంటూ చెప్పడంతో ఎస్సై ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డికి సమాచారం అందించారు. ఆమె వద్ద ఉన్న శిశువు ఫొటోలు తీసి వాట్సప్ ద్వారా పంపించారు. ∙ 5.10 గంటలకు ఆ ఫొటోలను డీఎస్పీ బాధిత తల్లిదండ్రులకు చూపించగా శిశువుపై ఉన్న గుడ్డ ఆధారంగాతమ కొడుకుగా గుర్తించారు. వెంటనే శిశువుతో పాటు సదరు మహిళను ఎస్సై రిమ్స్‌కు తరలించారు. పుష్పలత వాహనం వెనుకాల మరో వాహనంలో వస్తున్న ఆమె భర్త నగేష్ సైతం నేరడిగొండలో పుష్పలత వద్దకు రావడంతో ఇద్దరినీ అరెస్టు చేశారు. ∙ 5.30 గంటలకు శిశువును రిమ్స్‌కు తీసుకొచ్చారు. 6.30 గంటలకు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ శిశువును తల్లిదండ్రులకు అందజేశారు. ∙ నిందితులను ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడకు చెందిన పుష్పలత, సోయం నగేష్లుగా గుర్తించినట్లు ఆదిలాబాద్ ఏఎస్పీ సాదు మోహన్‌రెడ్డి, డీఎస్పీ నర్సింహారెడ్డి వెల్లడించారు. ∙ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి శిశువు కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అభినందించారు. రిమ్స్‌లో అంతా తెలియడంతోనే కిడ్నాప్ ఈజీ.. పసికందును కిడ్నాప్ చేసిన దంపతులు అంతకుముందు రిమ్స్ ఆస్పత్రిలో పనిచేశారు. గతంలో పుష్పలత రిమ్స్‌లో ఏఎన్ఎం శిక్షణ పొందగా.. ఆమె భర్త నగేష్ ఫుడ్‌స్టోర్‌లో వర్కర్‌గా పనిచేశాడు. దీంతో రిమ్స్‌లో ఏ మూలన ఏం ఉంటుందనేది వీరికి స్పష్టంగా తెలియడంతో పసికందును కిడ్నాప్ చాకచక్యంగా చేశారు. రిమ్స్‌లోని రెండు ప్రధాన ద్వారాల వద్ద సీసీ కెమెరాలు ఉండడంతో అటుగా వెళ్లకుండా దొడ్డిదారిన తీసుకెళ్లారు. డెలివరీ వార్డులో ఎవరికి అనుమానం రాకుండా పసికందును బయటకు తీసుకొచ్చి సీసీ కెమెరాలు లేని వార్డు నుంచి రేడియాలజీ విభాగం లోపలికి వెళ్లారు. అక్కడ ఉన్న చిన్న గేట్ తెరిచి ఉండడంతో ఆ గేట్ వెనుకాల నుంచి ఆస్పత్రి బయటకు వచ్చారు. నేరుగా పాత ఆస్పత్రి ముందు నుంచి బస్టాండ్‌కు వెళ్లి అక్కడి నుంచి బొలెరో వాహనంలో బయల్దేరారు. నేరడిగొండ ప్రాంతంలో అప్పటికే పోలీసులు తనిఖీలు చేపట్టడంతో వారికి చిక్కారు. వీరిది ఆదిలాబాద్ కాగా.. నిర్మల్ వైపు తీసుకెళ్లడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళ తనకు పిల్లలు లేరని అందుకే తీసుకెళ్లానని చెబుతున్నా.. నమ్మశక్యంగా లేదు. శిశును ఇతర ప్రాంతానికి తీసుకెళ్లి విక్రయించే అవకాశాలు లేకపోలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు పని చేయకపోవడంతోనే.. కిడ్నాప్ వివరాలు తెలుసుకునేందుకు ఎస్పీ రిమ్స్‌లోని వార్డుల్లో తిరిగారు. ముందుగా సీసీ కెమెరాల పనితీరును తెలుసుకునేందుకు సీసీటీవీ గదిలో కెమెరాల రికార్డులు పరిశీలించారు. ఏయే వార్డులో సీసీ కెమెరాలు ఉన్నాయో.. వాటి పనితీరు ఎలా ఉందని రిమ్స్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శిశువు కిడ్నాప్‌కు గురైన వార్డును సందర్శించారు. బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. శిశువును ఎత్తుకెళ్లిన రూట్లను పరిశీలించారు. రేడియాలజీ విభాగం నుంచి బయట గేటు వరకు వెళ్లారు. కిడ్నాపైన వార్డు నుంచి బయట గేటు వరకు ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడంతో కిడ్నాపర్లకు పని సులువైందని గుర్తించారు. భద్రతా సిబ్బందిపై చర్యలు శిశువు కిడ్నాప్ సమయంలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. సెక్యూరిటీ గార్డు అలర్ట్‌గా లేకపోవడంతోనే ఇలా జరిగిందని రిమ్స్ డైరెక్టర్ అశోక్‌కు తెలిపారు. త్వరలో సెక్యూరిటీ గార్డులతోపాటు మిగతా సిబ్బందితో డీఎస్పీ, డైరెక్టర్లు సమావేశమై భద్రతాపరమైన విషయాలపై చర్చించాలని ఎస్పీ పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇందు కోసం పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. -
చాయ్‌కి డబ్బులివ్వండి..
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం కొత్తేమి కాదు. రోగిని స్ట్రెచర్‌పై వార్డుకు తీసుకురావడానికి రూ.20 నుంచి రూ.50 వసూలు చేస్తుంటారు. ఇదే ఒక ఎత్తేతే కాసుల వర్షం కురిపించే ప్రసూతి వార్డులో రూ.500కు పైనే వసూలు చేస్తారు. ఆడబిడ్డ, మగబిడ్డకు ఓ లెక్క చెప్పి మరీ మామూళ్లు తీసుకుంటుంటారు. ఎమర్జెన్సీ వార్డు కింద అంతస్తు నుంచి పైఅంతస్తులోకి రోగిని తీసుకెళ్తే, ఆపరేషన్ అయిన తర్వాత వార్డుకు తరలిస్తే, ప్రసూతి అయిన తర్వాత.. సదరు సిబ్బంది డబ్బులు అడుగుతుంటారు. డెలివరీ కోసం తీసుకొచ్చింది మొదలు బిడ్డ పుట్టి.. వార్డుకు తరలించి.. బట్టలు మార్చే వరకు ఆయా విభాగాల సిబ్బందికి తప్పకుండా చేయి తడపాల్సిందే. ప్రసూతి అయినప్పుడు మహిళ సిబ్బంది అక్కడి నుంచి వార్డుకు తీసుకొచ్చిన తర్వాత స్ట్రెచర్ సిబ్బంది, మళ్లీ బట్టలు మార్చాలంటే మహిళ సిబ్బంది.. ఇలా ఆ వార్డులో కాసుల కక్కుర్తితో రిమ్స్‌కు వచ్చే పేద మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ డబ్బులు లేవంటే వారిపై కస్సుబుస్సు మనడం పరిపాటిగా మారింది. దూరప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి నిరుపేదలు ఆస్పత్రికి వస్తుంటే వారి నుంచి డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటని పలువురు పేర్కొంటున్నారు. మారని సిబ్బంది తీరు.. గతంలో పలుమార్లు వీరిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పురావడం లేదు. రిమ్స్‌లోని పలు వార్డుల్లో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఎవరైన డబ్బులు అడిగితే తమ కు సమాచారం ఇవ్వండని అధికారులు సైతం బోర్డులు పెడుతున్నారు. అయినా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. గతంలో రాష్ట్ర మంత్రి జోగు రామన్న రిమ్స్‌లో ఆకస్మిక తనిఖీ చేసే సమయంలో కొంత మంది మహిళలు ప్ర సూతి వార్డులో డబ్బులు తీసుకుంటున్నారని మం త్రి దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అయితే డ బ్బులు తీసుకున్న వారి గురించి చెబితే మళ్లీ వార్డుకు వచ్చి తమను బెదిరిస్తారనే భయంతో సదరు రోగులు చెప్పడానికి వెనుకడుగు వేస్తున్నారు. గుర్తించిన తర్వాత చర్యలు సిబ్బంది డబ్బులు వసూలు చేసిన సమాచారం అందింది. అయితే డబ్బులు తీసుకున్నది ఎవరనేది గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి డబ్బులు ఇచ్చే అవసరం లేదు. వార్డుల్లో సిబ్బంది డబ్బులు ఇవ్వమని అడిగితే తమకు సమాచారం అందించాలి. – అశోక్‌కుమార్, రిమ్స్ డైరెక్టర్ -
సమస్యల వలయంలో రిమ్స్
ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) సమస్యల వలయంలో చిక్కుకుంది. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ వైద్యం, సదుపాయాలు సమకూర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు. రిమ్స్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్న వైద్యులు సమయ పాలన పాటించడంలేదు. ప్రసూతి వార్డుల్లో రోగుల నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఏర్పాటు చేయాల్సిన అభివృద్ధి కమిటీ సమావేశం ఆగస్టు నుంచి ఆఊసేలేదు. కలెక్టర్ దివ్య దేవరాజన్ ఆదేశాల మేరకు శనివారం రిమ్స్ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర అటవీ, బీసీ శాఖ మంత్రి జోగురామన్న, రాష్ట్ర దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గొడం నగేష్, జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, జెడ్పీ చైర్పర్సన్ శోభరాణి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రిమ్స్‌లో నెలకొన్న సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కనీస సౌకర్యాలు కరువు.. రిమ్స్ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. 500 పడకల ఆస్పత్రి, నిత్యం 1500 మంది రోగులు వచ్చే రిమ్స్‌లో తాగునీటి కష్టాలు ఉండడం గమనార్హం. మరుగుదొడ్లకు నీటి సరఫరా లేక అపరిశుభ్రంగా మారడం, లేదంటే తాళాలు వేస్తున్నారు. ఆస్పత్రికి 4 లక్షల లీటర్ల నీరు అవసరం ఉండగా ప్రస్తుతం 2 లక్షల లీటర్లు మాత్రమే అందుతున్నాయి. మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్ తెప్పించుకుంటున్నా అవి సరిపోవడం లేదు. కనీసం ఏ ఒక్క వార్డులో కూడా తాగునీటి కులాయిలు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మూడంతస్తుల్లో ఉన్న రోగులు నిత్యం నీటి కోసం కిందకు రావాల్సిందే. అది కూడా రిమ్స్‌లో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన తాగునీరే దిక్కవుతోంది. నీటి సరఫరాల లేక కొన్ని సందర్భాల్లో ఆపరేషన్లు నిలిచిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. రిమ్స్‌తో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నీటి కొరత ఏర్పడుతుంది. ఈ రెండింటికి కలిపి సుమారు 10 లక్షల నీటి అవసరం ఉంటుంది. గతంలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో తలమడుగు మండలంలోని మత్తడివాగు నుంచి పైప్‌లైన్ ద్వారా రిమ్స్‌కు నీటి సరఫరాచేయాలనే ప్రతిపాదనలు పెట్టారు. కానీ దానిపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సమావేశంలోనైనా తాగునీటి సమస్య పరిష్కారంపై ఒక స్పష్టత వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. పెరిగిపోతున్న రెఫర్లు... రిమ్స్‌కు వచ్చే అత్యవసర కేసులు దాదాపు 80శాతం ఇతర ప్రాంతాలకే రెఫర్ చేస్తున్నారు. చిన్నచిన్న కేసులు సైతం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నారు. ఈ ఆస్పత్రి పూర్తి చేస్తే రెఫర్ కేసులు తగ్గడంతో పాటు మరణాలు తగ్గిపోయి, అత్యవసర సమయంలో రోగులకు వైద్యం అందుతుంది. అయితే సూపర్ స్పెషాలిటీ పూర్తి కావడానికి కనీసం మరో మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు రిమ్స్‌లో రెఫర్ కేసులు, మరణాల పరిస్థితి ఇలాగే కొనసాగడం తప్పదనే చెప్పవచ్చు. దీనిపై మంత్రులు, అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
ఓపికుంటేనే వైద్యం
పాలకుల తీరుతో రిమ్స్‌లో వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఓపికుంటేనే ఓపీ అన్నట్లు పరిస్థితి తయారైంది. రోజు ఉదయాన్నే 12వందల నుంచి 15వందల మంది క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి. రోగులకు వైద్యం పరీక్షలానే ఉంది. సీటీస్కాన్ టైం పూర్తయింది. ఎంఆర్ఐ ఇంతవరకు రాలేదు. వైద్యులు ఉన్నా చూసేదంతా ఎక్కువగా హౌస్ సర్జన్లు, మెడికోలే.. వైద్యుల ధ్యాసంతా బయటి క్లినిక్‌లపైనే ఉంటుందనే ఆరోపణలున్నాయి. మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయి. సూపర్‌స్పెషాలిటీ అర్హత ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ హోదా దక్కడం లేదు. దీంతో అత్యవసర కేసులు తిరుపతికి పంపాల్సి వస్తోంది. కడప అర్బన్ : కడప నగర శివార్లలో పన్నెండేళ్ల కిందట వైద్యవరాన్ని రిమ్స్ రూపంలో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లా ప్రజలకు అందించారు. ఆయన అప్పట్లో ఆస్పత్రి అభివృద్ధికోసం నిధులను వరదలా తీసుకొచ్చారు. అప్పట్లో ప్రతిపక్షాలు గోల చేస్తున్నప్పటికీ రిమ్స్ అభివృద్ధికి తమ వంతు శక్తివంచన లేకుండా అహర్నిశలు శ్రమించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం రిమ్స్‌ను పూర్తిస్థాయిలో పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రత్యేకంగా రిమ్స్‌లో ‘సాక్షి’ చేపట్టిన పరిశీలనలో పేషెంట్లు ఎదుర్కొంటున్న సమస్యల ‘గ్రౌండ్ రిపోర్ట్’. ♦ కడప రిమ్స్‌లో ప్రతిరోజు దాదాపు 9 విభాగాల్లో ఓపీ, ఐపీ సేవలను అందిస్తున్నారు. ఓపీకి 1,200 నుంచి 1,400 మంది వైద్య పరీక్షల కోసం వస్తున్నారు. ఐపీలో 700 మంది నుంచి 730 వరకు ఇక్కడే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ♦ రోగులు ఇబ్బందిపడకుండా ఓపీ, ఐపీల్లో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లు పనిచేయకపోవడం.. మరమ్మతులు చేయించడం, మరలా కొన్నిరోజులకు పనిచేయకపోవడం షరా మామూలైపోయింది. దాతలు ఇచ్చిన కుర్చీలను కూడా సక్రమంగా వాడడం లేకదు. సిబ్బంది సరిగా లేకపోవడంతో పేషెంట్ల బంధువులే వీల్చైర్లను తోసుకుపోవాల్సి వస్తోంది. ♦ కడప రిమ్స్‌లో ఓపీ, ఐపీ విభాగాల్లో దాదాపు 300కుపైగా బాత్రూంలు, లెట్రిన్ గదులు ఉన్నాయి. వీటికి డోర్లు, గడియలు, బేసిన్లు, ట్యాప్‌లు దిష్టిబొమ్మల్లా వెక్కిరిస్తున్నాయి. అధ్వానంగా వున్న వీటి పరిస్థితి ప్రత్యేకంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న క్యాజువాలిటీ, ఓపీ విభాగాల్లోనే ఉండటం దారుణం. వీటిల్లో దాదాపు 257లకు మరమ్మతులను చేయాల్సి వుంది. ♦ రిమ్స్ ప్రారంభంలో రూ.2కోట్ల విలు వ చేసే సిటీ స్కానింగ్ యంత్రాన్ని రేడియాలజీ విభాగంలో ఏర్పాటు చేశా రు. సాధారణంగా ఒక సిటీ స్కానింగ్ యం త్రం 20వేల స్కానింగ్‌లను మాత్రమే తీయగలదు. కానీ ఈ యంత్రం తో 50వేలకు పైగా స్కానింగ్‌లను తీశారు. త్వరలో కొత్త యంత్రం వస్తుందని అధికారులు గతేడాది నుంచి చెప్పుకొస్తున్నారు. అంతేగాక ఈ విభాగంలో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లతోనే కాలం వెల్లదీస్తున్నారు. పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాల్సి ఉంది. ♦ సిటీ స్కానింగ్ యంత్రం మాట అటుంచితే... ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం అందనంత దూరంలో ఉందని రిమ్స్ వైద్యులే చెప్పుకుంటున్నారు. గతేడాది ప్రభుత్వం ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రాన్ని అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలకు మంజూరు చేశారు. కానీ కడప రిమ్స్ పీజీ స్థాయికి చేరుకుని, పీజీ గుర్తింపును కూడా తెచ్చుకున్నప్పటికీ ఎంఆర్ఐని ప్రభుత్వం మంజూ రు చేసేందుకు మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. మంత్రి కామినేని శ్రీనివాస్ వచ్చిన ప్రతిసారీ ఈ అంశం గురించి రిమ్స్ అధికారులు ప్రస్తావిస్తూనే వచ్చారు. ♦ రిమ్స్‌లో వైద్యుల కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. 299మంది వైద్యులకు గాను కేవలం 145మంది మాత్రమే ఉన్నారు. కనీసం 105 మందినైనా ప్రభుత్వం నియమిస్తే పేషెంట్లకు సరైన సమయంలో వైద్య సేవలను అందించే అవకాశం ఉంది. అలాగే 182 మంది స్టాఫ్ నర్సులు ఉన్నారు. వీరిలో కొంతమంది డిప్యుటేషన్, బదిలీలపై వెళ్లారు. ఆరు నెలలుగా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అలాగే ఇతర సిబ్బంది 750కాగా, 155 మంది కొరత ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఔట్ సోర్సింగ్ విభాగంలో 40మంది నియామకాలను చేపట్టేందుకు ఏడాది కాలంగా జిల్లా అధికారులు నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారు. తద్వారా కొన్ని విభాగాల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ♦ రోగులకు, వారి బంధువులకు రిమ్స్ ఆవరణంలో ప్రత్యేకంగా ఎలాంటి పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులను పడాల్సి వస్తోంది. ఓపీ, ఐపీలకు ఎదురుగా ఉన్న డివైడర్లు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్ చేస్తున్నారు. వైద్యులు, సిబ్బంది మాత్రం ఐపీ–ఓపీ మధ్య భాగంలో, కారిడార్‌లో పార్కింగ్ చేసుకుంటున్నారు. ♦ రోగుల సహాయకులు ఉండేందుకు ఇటీవల దాతల సహాయంతో ఒక షెల్టర్ కట్టారు. దగ్గరగా లేదనే ఉద్దేశంతో దానిని వారు ఉపయోగించడం లేదు. తమ వారికి దగ్గరగా ఉండాలని కారిడార్లలోనే ఉంటున్నారు. ♦ రిమ్స్ ప్రారంభంలో దాతల సాయంతో పేషెంట్ల కోసం కడప పాత రిమ్స్ నుంచి కొత్త రిమ్స్‌కు నాలుగు బస్సులను ఉచితంగా నడిపించారు. కాలక్రమేణ నిర్వహణ చేయలేమనీ బస్సులను పూర్తిగా మూలన పెట్టారు. ♦ రిమ్స్‌కు సూపర్‌స్పెషాలిటీ హోదా ఊరిస్తూనే ఉంది. అన్ని రకాలైన అర్హత ఉన్నా ఎందులో ప్రభుత్వం రిమ్స్‌ను పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా జిల్లావాసులు సూపర్‌స్పెషాలిటీ సేవలను కోల్పోతున్నారు. అత్యవసర సమయాల్లో తిరుపతి, కర్నూల్‌కు పంపాల్సి వస్తోంది. సమస్యలను పరిష్కరిస్తున్నాం.. రిమ్స్‌లో పూర్తి స్థాయిలో టాయ్‌లెట్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఏపిఎంఎస్‌ఐడీసీ ద్వారా మంజూరైన నిధులతో ఇప్పటికే పనులను ప్రారంభించామనీ సూపరింటెండెంట్ డాక్టర్ టి.గిరిధర్ వివరణ ఇచ్చారు. సిటీ స్కానింగ్ యంత్రం మంజూరైందనీ, త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులపై ఎప్పటికపుడు నివేదికను పంపిస్తున్నామన్నారు. -
చనిపోయిన వారు తమిళ కూలీలేనా...
సాక్షి కడప/రాజంపేట/ఒంటిమిట్ట : కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని ఒంటిమిట్ట చెరువులో ఏం జరిగింది.. ఐదుగురు ఒకేసారి చనిపోవడం వెనుక కారణాలు ఏమిటి.. చనిపోయిన వారంతా తమిళ కూలీలేనా.. ఎవరిని కదిపినా ఇదే చర్చ సాగుతోంది.. చూసిన వారందరూ తమిళ కూలీలేనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శేషాచలం అడవులు సమీప ప్రాంతాల్లోనే ఉండడంతో.. రైళ్లలో వచ్చి నేరుగా అడవుల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే కూలీల సమాచారం పసిగట్టి వెంబడించడంతోనే కొందరు నీళ్లలోకి దూకి ఉంటారని ప్రజా సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఘటనను బట్టి చూస్తే రెండు, మూడు రోజుల కిందటే చెరువులో పడినట్లు తెలుస్తోంది. చెరువులో ఎలా పడ్డారు....వారిని ఎవరైనా వెంబడించారా...లేకపోతే హత్య చేసి పడేశారా అన్నది తెలియలేదు. పోలీసులు కూడా అనుమానాస్పదం కిందనే కేసు నమోదు చేశారు. ఒంటిమిట్ట చెరువులో ఒకేసారి ఐదు మృతదేహాలు కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. శుక్రవారం రాత్రి ఒంటిమిట్ట ఫార్టెసు పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేపట్టేందుకు తమిళ తంబీలు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అదే రాత్రి చెర్లోపల్లె గ్రామంలో పలువురు గ్రామస్తులను విచారించారు. గ్రామసమీపంలోని పొలాలకు దగ్గరలో ఉన్న చెరువు పెద్దకుంటలో మృతదేహాలు లభ్యంకావడంతో పోలీసుల గాలింపునకు ఆధారంగా నిలుస్తోంది. ఎర్రచందనం లారీ డ్రైవర్ పరారీ అయినట్లు, అందులోని 30 మంది తమిళతంబీలు పోలీసులను చూసి పారిపోయే తరుణంలో ఐదుగురు చెరువు పెద్దకుంటలో పడి మృతిచెందినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు మాత్రం నిర్ధారించడంలేదు. ప్రమాదవశాత్తా.. ఆత్మ‘హత్య’ చెరువు పెద్దకుంటలో లభ్యమైన ఐదు మంది తమిళ తంబీలు ప్రమాదవశాత్తు పడ్డారా? లేక ఎన్కౌంటర్ చేసి పడేశారా..పోలీసులకు చిక్కుతామనే ఆత్మహత్య చేసుకున్నారా.. ఇవి స్థానికుల్లో నెలకొన్ని అనుమానాలు. పోలీసులకు తమిళతంబీలు ఎదురు తిరిగిన పరిస్ధితిలో ఈ సంఘటన జరిగిందా? అని కూడా పలువురు అనుమానిస్తున్నారు. ఓ పోలీసు అధికారికి గాయాలు అయినట్లు ఒంటిమిట్టలో చెప్పుకోవడం జరుగుతోంది. సంఘటన స్ధలానికి చేరుకున్న ఓఎస్డీ నయూం అస్మీ మృతదేహాలను పరిశీలింంచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మృతదేహాలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతూనే ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కూంబింగ్ జరుగుతూనే ఉంటుందన్నారు. మృతిచెందిన వారు తమిళతంబీలని ఇప్పుడు చెప్పలేమని, విచారణలో తేలాల్సి ఉందన్నారు. డీఎస్పీ లక్ష్మీనారాణ, ఆర్డీఓ వీరబ్రహ్మం, తహసీల్దారు శిరీష, సీఐ రవికుమార్, సబ్‌డివిజన్‌లోని పలువురు ఎస్ఐలు ఉన్నారు.ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కూడా మృతదేహాలను పరిశీలించారు. రిమ్స్‌కు చేరిన మృతదేహాలు ఒంటిమిట్ట చెరువులో కనిపించిన గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలను ఆదివారం సాయంత్రం రిమ్స్ మార్చురీకి తరలించారు. సోమవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇప్పటికే టీవీల ద్వారా ప్రచారం జరగడం, పోలీసులు కూడా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు సమాచారాన్ని అందించిన నేపథ్యంలో మిస్సింగ్ అయిన వారి బంధువులు కడపకు చేరుకునే అవకాశం ఉంది. ఒంటిమిట్ట చెరువులో చనిపోయిన వారికి సంబంధించి 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) అద్నాన్ నయీం అస్మి తెలిపారు. -
ఆదిలోనే ఆటంకం
ఆదిలాబాద్: ఆసరా లేని వారికి ఆశ్రయం కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో నిర్మిస్తున్న ‘ఆసరా భవనం’ ఆదిలోనే ఆగిపోయింది. కాం ట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆరు నెలల క్రితం ప్రారంభించిన భవన నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. ఫలితంగా జిల్లాలో నిరాశ్రయులకు నీడ కల్పన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షల నిధులతో రెండేళ్ల క్రితం రాత్రిబస కేంద్రాన్ని జిల్లా కేంద్రానికి మంజూరు చేసింది. 2017లో ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆగస్టులో పనులు ప్రారంభించగా కాంట్రాక్టర్ పునాదులు, పిల్లర్ల దశలోనే నాసిరకం పనులు చేపట్టడంతో భవనం కుంగిపోయింది. అధికారులు పర్యవేక్షించకపోవడంతో పిల్లర్ల వరకే పనులు చేసిన కాంట్రాక్టర్ మధ్యలోనే నిలిపివేశారు. అనాథలకు ఆసరాగా.. అనాథలుగా రోడ్లపై, బస్టాండ్, రైల్వేస్టేషన్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఆశ్రయం లేక జీవనం సాగించే వారికి ఆశ్రయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ భవనాన్ని మంజూరు చేసింది. ఇందులో అన్ని సౌకర్యాలు కల్పించి రాత్రి భోజనంతో పాటు స్నానపు గదులు, నిద్రించేందుకు సదుపాయాలు సైతం ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. గతంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిరాశ్రయుల కోసం ఓ కేంద్రాన్ని నిర్వహించింది. ప్రస్తుతం దాన్ని మూసివేయడంతో అభ్యాగులకు నిలువనీడలేకుండా పోయింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆశ్రయం లేనివారిని గుర్తించి ఇందులో వారికి నీడ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రభుత్వం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఏటా నిర్వహణ కోసం కూడా ప్రత్యేకంగా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో భవన నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వేస్టేషన్, ఠాకూర్‌హోటల్, బస్టాండ్, ఓల్డ్‌బస్టాండ్, తాంసి బస్టాండ్, వినాయక్‌చౌక్, అంబేద్కర్‌చౌక్, శివాజీచౌక్, తదితర ప్రాంతాల్లో ఎంతో మంది నిరాశ్రయులు నిత్యం కనిపిస్తుంటారు. చలికాలం, వర్షకాలంలో వీరి అవస్థలు వర్ణనాతీతం. భద్రత కారణాల దృష్ట్యా పోలీసులు రోడ్ల పక్కన పడుకునే వారిని అక్కడి నుంచి పంపివేస్తుంటారు. ఇలా అన్ని రకాలుగా నిరాశ్రయులకు ఆధారం లేకుండా పోతోంది. చేతులెత్తేసిన కాంట్రాక్టర్.. కాంట్రాక్టర్‌కు అప్పగించిన ఈ భవన నిర్మాణ పనులు ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. పనులు ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా.. ఇంకా పిల్లర్ల దశ దాటలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి పనులు నిలిపివేసి ఆరు నెలలు గడుస్తున్నా అతడిపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం నోటీసులు అందించామని చెబుతున్న అధికారులు, సదరు కాంట్రాక్టర్ పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిసినా ఇంకా అతని కోసం ఎదురుచూడడం గమనార్హం. సకాలంలో భవనం పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్‌ను తొలగించి కొత్త టెండర్లు నిర్వహించి వేరేవారికి అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడా అది జరగడం లేదు. ఆసరా భవనం పూర్తయితే అందులో ఉండేందుకు నిరాశ్రయుల వివరాల సేకరణ సైతం చేశారు. నోటీసులు అందించాం.. భవన నిర్మాణాలు చేపట్టాలని ఇది వరకే కాంట్రాక్టర్‌కు నోటీసులు అందించాం. త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఆరు నెలల అగ్రిమెంట్‌తో పనులు అప్పగించడం జరిగింది. ఆర్థిక సమస్యలు ఉన్నాయని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. నెల రోజుల్లో పూర్తి చేయకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొండల్రావు, మున్సిపల్ డీఈ -
డెలి‘వర్రీ’
‘మాది ఆదిలాబాద్ మండలం భీంసరీ గ్రామం. నా కోడలును డెలివరీ కోసం రిమ్స్‌కు తీసుకొచ్చినం. సోమవారం ఆడపిల్ల పుట్టింది. డెలివరీ అయినసుంది ఈడ పని చేసేటోళ్లు పైసలకు పీక్కతిట్టండ్లు. ప్రసవం అయినంక వెంటనే రూ.200 అడిగి తీసుకున్నరు. ఆడి నుంచి వార్డుకు తీసుకొచ్చినందుకు మళ్లా రూ.200, బట్టలు మార్చేవారికి మరో రూ.100 ఇచ్చినం. డబ్బులు లేకనే ఈడికొస్తే.. ఇక్కడ పైసలు..పైసలంటూ మమ్మల్ని తిప్పల పెడుతున్నరు. మా బాధ ఎవలకు చెప్పుకోవాలే. అధికారులు జెర పట్టించుకొని గరీబోళ్లకు న్యాయం చేయాలె.’ ఇది ఒక్క ఊశమ్మ కుటుంబానికే కాదు. రిమ్స్‌కు ప్రసూతికోసం వస్తున్న ప్రతీ ఒక్కరికి ఎదురవుతున్న ఇబ్బంది. సంబంధిత అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో ప్రసూతి వార్డు లంచాల వార్డుగామారిపోయినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ప్రసూతి వార్డులో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ కిట్ పథకం ప్రారంభించడంతో ప్రసవాల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేసుకోవాలని ఓ పక్క ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే.. తీరా ఆస్పత్రికి వచ్చిన వారిని లంచాల పేరిట సిబ్బంది ఇబ్బందులకు గురిచేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిమ్స్‌లో బాబు పుడితే రూ.500, పాప పుడితే రూ.300 డిమాండ్ చేసి మరీ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డెలివరీ కోసం తీసుకొచ్చింది మొదలు బిడ్డ పుట్టినప్పటి నుంచి వార్డుకు తరలించి బట్టలు మార్చే వరకు ఆయా విభాగాల సిబ్బందికి తప్పనిసరిగా చేయి తడపాల్సిన పరిస్థితి. ప్రసూతి అయినప్పుడు మహిళ సిబ్బంది.. అక్కడి నుంచి వార్డుకు తీసుకొచ్చిన తర్వాత స్ట్రెచర్ సిబ్బంది.. మళ్లీ బట్టలు మార్చాలంటే మహిళ సిబ్బంది.. ఇలా వార్డులో సిబ్బంది చేతివాటంతో పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. డబ్బులు లేవంటే వారిపై కస్సుబుస్సు మనడం పరిపాటిగా మారిందనే విమర్శలున్నాయి. ఎంతో కొంత ఇద్దామనుకుంటే దానికి వారు ససేమీరా అంటున్నారని, మాకు ఇంత ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారని అక్కడి బాలింతల బంధువులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా రిమ్స్ ఉన్నతాధికారులు ఇటువైపు చూడకపోవడం గమనార్హం. డబ్బులు అడిగిన వారి పేర్లు చెప్పాలని అంటున్న అధికారులు రోగులకు సిబ్బంది పేర్లు ఎలా తెలుస్తాయని బంధువులు పేర్కొంటున్నారు. అధికారులే సిబ్బందిని కఠినంగా హెచ్చరించాలని కోరుతున్నారు. బయట చెబితే బెదిరింపులు.. ప్రసూతి వార్డులో జరిగే కాసుల తంతు బయటకు చెప్పలేని పరిస్థితుల్లో బాలింతల బంధువులు ఉన్నారు. ప్రసవం తర్వాత నార్మల్ డెలివరీ అయితే మూడు రోజులు, సర్జరీ చేసే వారం రోజులు ఉండాల్సి వస్తుంది. అలాంటిది ప్రసూతి వార్డులో సిబ్బంది డబ్బులు తీసుకున్నారని మీడియాకు చెప్పినా.. ఇంకా ఎవరితోనైనా అడిగించినా.. మరుసటి రోజు బాధితులకు సిబ్బంది నుంచి బెదిరిస్తారనే భయంతో నిజం చెప్పడం లేదు. ఒకవేళ ధైర్యం చేసి ఎవరైనా చెబితే మరుసటి రోజు సిబ్బంది ప్రసూతి వార్డుకు వెళ్లి మరీ డబ్బులు తీసుకుంటున్నామని ఎవరు చెప్పారంటూ ఆరా తీస్తారు. కొన్ని సందర్భాల్లో గొడవలు పడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే చాలా మంది వారితో మాకేందుకులే గొడవలని రిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత వారికి జరిగిన అన్యాయం గురించి చెబుతున్నారు. నెలల తరబడి ప్రసూతి వార్డులోనే కొంత మంది విధులు నిర్వహిస్తుండడంతో వారు చేతివాటానికి అలవాటు పడిపోయినట్లు తెలుస్తోంది. మంత్రి చెప్పినా మారని పరిస్థితి.. రెండు నెలల క్రితం రాష్ట్ర అటవీ, బీసీ శాఖ మంత్రి జోగురామన్న రిమ్స్ ఆస్పత్రిలో తనిఖీ చేశారు. ఆ సమయంలో కొందరు ప్రసూతి వార్డులో డబ్బులు తీసుకుంటున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇబ్బందులు పెడుతున్నారంటు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అయినా సిబ్బంది తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. ప్రసూతి వార్డులో సిబ్బంది చేతివాటంపై గతంలో కలెక్టర్‌గా పనిచేసిన అహ్మద్‌బాబుకు కూడా పలుమార్లు ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి. అప్పటి నుంచి కలెక్టర్లు, అధికారులు మారినా ప్రసూతి వార్డులో మాత్రం పరిస్థితి మారకపోవడం విశేషం. కఠిన చర్యలు తీసుకోవాలి.. డెలివరీ కోసం నా భార్యను రిమ్స్‌కు తీసుకొచ్చాను. కూతురు పుట్టింది. అయితే నేను లేని సమయంలో మావల్ల నుంచి ఇక్కడి సిబ్బంది రూ.500 తీసుకున్నారు. బెడ్‌పైకి వచ్చిన తర్వాత కూడా బట్టలు మార్చేందుకు డబ్బులు అడగడం సిగ్గుచేటు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గంగాధర్, ఆదిలాబాద్ గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం గతంలో ప్రసూతి వార్డులో డబ్బులు వసూలు చేస్తున్నారని కలెక్టర్‌కు, రిమ్స్ అధికారులకు ఫిర్యాదు చేశాం. అప్పట్లో కలెక్టర్ దీనిపై స్పందించి సిబ్బందిని తొలగించాలని ఆదేశించారు. అయినప్పటికి సిబ్బందిలో మార్పు రాలేదు. నిత్యం ఎంతో మంది పేదలు వస్తుంటారు. వారి నుంచి డబ్బులు వసూలు చేయడం సరి కాదు. కనక నర్సింగ్, మానవ సేవే మాధవ సేవా సభ్యుడు, ఆదిలాబాద్ విచారణ జరిపిస్తాం.. ప్రసూతి వార్డులో సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా డబ్బులు తీసుకున్న సిబ్బంది పేర్లు చెబితే వారిపై చర్యలు తీసుకుంటాం. వార్డులో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశాం. డబ్బులు తీసుకున్న సిబ్బందిని గుర్తించేందుకు విచారణ జరిపిస్తాం. డాక్టర్ కె. అశోక్, రిమ్స్ డైరెక్టర్ -
రిమ్స్‌లో బాలుడు మృతి
కడప అర్బన్/చెన్నూరు : కడప నగర శివార్లలోని రిమ్స్‌లో వైద్యం కోసం వచ్చిన ఓ బాలుని నిండు ప్రాణాలు వైద్యుల నిర్లక్ష్యం వల్ల గాలిలో కలిసిపోయాయి. బాలుని మృతదేహంతో కొన్ని గంటలపాటు తల్లిదండ్రులు, బంధువులు రిమ్స్ పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం నుంచి రాత్రి దాకా కొనసాగింది. బాలుని తల్లిదండ్రుల కథనం ప్రకారం.. చెన్నూరు మండలం కొక్కరాయపల్లెకు చెందిన శ్రీనివాసులు, స్వర్ణలతల కుమారుడు చెన్నూరు ధనుష్ (8). వీరికి మొదటి సంతానంగా అమృత (11) ఉన్నారు. వీరిరువురు తమ గ్రామంలోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో 2, 5 తరగతులు చదువుతున్నారు. ఈక్రమంలో సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులు రమణయ్య, వీరనారాయణలు విధుల కోసం వచ్చారు. పాఠశాల ఆవరణంలోని చెత్తాచెదారాన్ని బయటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చెత్తాచెదారాన్ని తీసుకెళ్లి పారవేసే క్రమంలో ధనుష్‌ను ఏదో కుట్టింది. వెంటనే స్థానికులు ధనుష్‌ను చెన్నూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయించారు. అక్కడ పనిచేస్తున్న వైద్య ఉద్యోగి కృష్ణారెడ్డి 108కు ఫోన్ చేశారు. అయినప్పటికీ వారు స్పందించకపోవడంతో బైక్‌పైనే బాలుడిని బంధువులు రిమ్స్‌కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 1.30 సమయంలో రిమ్స్‌కు తీసుకురాగానే క్యాజువాలిటీలో వైద్యసేవల అనంతరం చిన్నపిల్లల వార్డుకు తీసుకెళ్లాలని సిఫార్సు చేశారు. సాయంత్రం 4.30 సమయంలో «ధనుష్ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి బంధువుల ఆందోళన రిమ్స్‌లో వైద్యం కోసం వచ్చిన ధనుష్ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందువల్లే మృతిచెందాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. చిన్నపిల్లల వార్డు వద్దనే రెండు గంటలపాటు ఆందోళన చేసిన తర్వాత రిమ్స్ సీఐ పురుషోత్తంరాజు తన సిబ్బందితో కలిసి మార్చురీలో ధనుష్ మృతదేహాన్ని పెట్టిస్తామని, మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీ వద్దకు తీసుకొచ్చినప్పటికీ లోపల పెట్టించేందుకు ఒప్పుకోలేదు. తమ పిల్లాడు ఏ కారణం చేత మృతిచెందాడన్న విషయాన్ని రిమ్స్ అధికారులు, డాక్టర్లు వెల్లడించాలని, ఆ విషయం తేలిన తర్వాతనే ఫిర్యాదు చేస్తామని పట్టుబట్టారు. కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా, సీఐలు పురుషోత్తంరాజు, హేమసుందర్రావు, రామకృష్ణ, దారెడ్డి భాస్కర్‌రెడ్డిలు, ఎస్ఐలు, సిబ్బంది బందోబస్తు ఏర్పాటుచేశా రు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే మృతుని బంధువులు ఫిర్యాదుచేయాలని, తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని, కచ్చితంగా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలిపారు. కాగా రాత్రి 11గంటలకు కేసు నమోదు చేశారు. రిమ్స్ అధికారుల వివరణ ఈ సంఘటనపై రిమ్స్ అధికారులు మాట్లాడుతూ బాలుడిని మధ్యాహ్నం 1.38కు క్యాజువాలిటీకి తీసుకొచ్చారని, అప్పటికే పరిస్థితి విషమించిదన్నారు. అయినప్పటికీ చిన్నపిల్లల విభాగం వైద్య నిపుణులు తమవంతుగా కృషిచేసి వైద్యాన్ని అందించినప్పటికీ బాలుడు మృతి చెందాడన్నారు. తేనెటీగలే కరిచాయి: ఎంఈఓ పాఠశాల ప్రారంభం కాకముందే బడిబయట ఉన్న విద్యార్థి ధనుష్(7)ను తేనెటీగలు కరిచాయి. నొప్పి అని బాధపడుతుంటే అంతలో పాఠశాలకు వచ్చిన హెచ్ఎం రమణయ్య, ఉపాధ్యాయుడు వీరనారాయణలు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి చెన్నూరు వైద్యశాలకు పంపారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం రిమ్స్‌కు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. వ్యర్థాలు తొలగిస్తూ విషపురుగు కరిచిందనడంలో వాస్తవం లేదు. -
రిమ్స్‌పై ప్రత్యేక దృష్టి
ఆదిలాబాద్: రిమ్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని, రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సిబ్బంది సమస్యలపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. ‘కలెక్టరమ్మ.. రిమ్స్‌ను చూడమ్మ’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించారు. ఆస్పత్రిలో సమస్యలు, కేసుల రెఫర్, వైద్యుల పోస్టుల ఖాళీ, ప్రైవేటు వైద్యంపై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పెద్దాస్పత్రి రిమ్స్‌ను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. మూడు గంటలపాటు ఆస్పత్రిలో పర్యటించి రోగుల బాగోగులు, వైద్య సేవలపై ఆరా తీశారు. పరిశీలన సాగిందిలా.. కలెక్టర్ దివ్యదేవరాజన్ ముందుగా రిమ్స్ వైద్య కళాశాలలో అధికారులతో సమావేశమై గంటపాటు గంటపాటు ఆస్పత్రి పరిస్థితులపై చర్చించారు. పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు, కాంట్రాక్టు టెండర్ల నిర్వహణపై చర్చ సాగింది. అనంతరం రిమ్స్ అత్యవసర విభాగం, రక్త పరీక్షల కేంద్రాలను పరిశీలించారు. రక్త పరీక్షలు యంత్రాల ద్వారా చేస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బ్లడ్‌బ్యాంకుకు వెళ్లి బ్లడ్స్టోరేజీని పరిశీలించారు. ఐసీయూలో రోగులతో మాట్లాడారు. సరైన వైద్యం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ట్రామాకేర్ యూనిట్‌ని సందర్శించి అక్కడ ఏయే రోగులకు చికిత్స అందిస్తున్నారో తెలుసుకున్నారు. రేడియాలజీ విభాగాన్ని పరిశీలించి డాక్టర్ కళ్యాణ్‌రెడ్డిని స్కానింగ్ పరీక్షల వివరాలు అడిగారు. ఏయే సమయంలో ఎక్స్‌రే, స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారో తెలుసుకున్నారు. మెటర్నిటీ వార్డులో(ప్రసూతివార్డు) బాలింతలతో మాట్లాడారు. అప్పుడే పుట్టిన పసికందులను చూసి వారి తల్లిబిడ్డ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ వార్డు, మేల్మెడికల్ వార్డు, కంటి విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గిరిజనుల రక్తహీనతపై చలించిన కలెక్టర్.. మహిళల వార్డులో పర్యటించిన కలెక్టర్ అక్కడ చికిత్స పొందుతున్న గిరిజన మహిళల రక్తహీనతపై చలించిపోయారు. ఓ మహిళకు 2.5 గ్రామాలు రక్తం ఉందని సిబ్బంది చెప్పడంతో కలెక్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సాధారణంగా 7 గ్రాముల రక్తం ఉంటేనే ఆరోగ్యం దెబ్బతింటుంది.. అలాంటిది ఇంత తక్కువ రక్తం ఉండడమేంటని అడిగారు. ఆమెతోపాటు ఆ వార్డులో చికిత్స పొందుతున్న పాఠశాల విద్యార్థిని సైతం రక్తహీనతతో బాధపడుతుండగా ఆమెను కలెక్టర్ పలుకరించారు. గిరిజన ప్రాంతాల నుంచి ఎక్కువ మంది రక్తహీనతతో వస్తుంటారని రిమ్స్ వైద్యులు కలెక్టర్ తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు రక్తం అందుబాటులో ఉంచాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ రిమ్స్‌లో తనిఖీలు చేస్తుండగా రాంనగర్‌కు చెందిన చంద్రారెడ్డి అనే వృద్ధుడు తనకు పింఛన్ కోసం వైద్యుడి సంతకం కోసం నాలుగు రోజులుగా రిమ్స్‌లో తిరుగుతున్నానంటూ కలెక్టర్‌కు విన్నవించగా, వెంటనే స్పందించిన కలెక్టర్ పింఛన్ కోసం ఎంపీడీవోను కలువాలని తెలిపి, వృద్ధుడి పూర్తి వివరాలు నమోదు చేసుకొని సంబంధిత అధికారులకు తెలుపాలని అక్కడ ఉన్న అధికారులకు సూచించారు. ప్రైవేటు వైద్యంపై విచారణ రిమ్స్ వార్డులో పరిశీలన అనంతరం కలెక్టర్ దివ్యదేవరాజన్ మీడియాతో మాట్లాడారు. రిమ్స్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశ వివరాలు తెలియజేశారు. రిమ్స్‌లో పనిచేస్తున్న అన్ని విభాగాల సిబ్బందితో వేర్వేరు సమావేశాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. రిమ్స్‌కు మన జిల్లానే కాకుండా మహారాష్ట్ర నుంచి రోగులు వస్తున్నారని వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామని తెలిపారు. రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులు ప్రైవేట్ క్లినిక్‌లు నడుపుతుండడంపై విచారణ చేయిస్తామని పేర్కొన్నారు. త్వరలో పారిశుధ్య, సెక్యూరిటీ గార్డులకు సంబంధించి కాంట్రాక్టు కోసం టెండర్లు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమీక్ష సమావేశంలో పారిశుధ్యం, వైద్య పరికరాలు, వైద్యుల పోస్టుల భర్తీ, కార్మికుల సమస్యలపై చర్చించినట్లు వెల్లడించారు. ఔట్‌సోరి్సంగ్ టెండర్ కోసం ఎంపిక కమిటీతో మరోసారి చర్చించి టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజీవ్‌రాజ్, రిమ్స్ ఇచార్జి డైరెక్టర్ అశోక్, వైద్యులు ఉన్నారు. -
కలెక్టరమ్మ.. రిమ్స్‌ను చూడమ్మ
ఆదిలాబాద్: జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వాలు.. ఉన్నతాధికారులు మారినా రిమ్స్‌లో పరిస్థితి మారని దుస్థితి నెలకొంది. వైద్యుల కొరతతో సకాలంలో వైద్యమందక.. కనీస సౌకర్యాలు కరువై రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. తాగునీరు కరువై గొంతెండుతోంది. రిమ్స్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం.. రిమ్స్‌లో అవినీతి జరుగుతోందంటూ రాజకీయ పార్టీలు ఆందోళనలు చేయడం.. దానికి అధికారులు మళ్లీ మళ్లీ కౌంటర్లు ఇస్తూ రాజకీయం చేయడం పరిపాటిగా మారింది. జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ దివ్యదేవరాజన్ రిమ్స్‌పై దృష్టి సారిస్తే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆమె వికారాబాద్ జిల్లాలో పనిచేసిన సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడంలో తనదైన ముద్రవేసినట్లు తెలిసింది. భర్తీకి నోచుకోని పోస్టులు రిమ్స్‌ను వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పూర్తిస్థాయిలో వైద్యం అందించేందుకు వైద్యులు, బోధన సిబ్బంది లేకపోవడంతో రోగులు, మెడికోలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2008 ఫిబ్రవరి 1న దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రిమ్స్‌ను ప్రారంభించారు. 500 పడకల సామర్థ్యం, అత్యాధునిక వైద్య పరికరాలతో రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేకు కృషి చేశారు. ఆస్పత్రి ప్రారంభమై తొమ్మిదేళ్లు గడుస్తున్నా అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదు. రిమ్స్‌లో 151 పోస్టులకు గాను 91 మంది వైద్యులు ఉన్నారు. 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రొఫెసర్లు 21కి గాను ఐదుగురే పనిచేస్తున్నారు. 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్లు 30కి గాను 20 మంది ఉండగా 10 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 41 మందికి గాను 26 మంది ఉన్నారు. 15 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ట్యూటర్ పోస్టులు 59కి గాను 40 మంది ఉండగా, 19 ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం వైద్యశాఖలో పోస్టులు భర్తీ చేస్తున్నా రిమ్స్‌లో భర్తీ చేయడం లేదు. ఫలితంగా వైద్యుల కొరతతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. మరోవైపు ఉన్న వైద్యులు కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ రిమ్స్‌కు వచ్చే రోగులను పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. తాగునీటికీ ఇబ్బందే.. రిమ్స్ ఆస్పత్రిలో సౌకర్యాలు కరువయ్యాయి. 500 పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రికి నిత్యం 1500 మంది వరకు రోగులు వస్తుంటారు. ప్రతీ రోజు నాలుగు లక్షల లీటర్ల నీరు అవసరం కాగా.. ప్రస్తుతం మూడు బోర్ల ద్వారా ట్యాంకులోకి నీరెక్కిస్తున్నారు. రెండు లక్షల లీటర్లు మాత్రమే అందుతున్నాయి. మున్సిపాల్టీ నుంచి ట్యాంకర్ తెప్పిస్తున్నా సరిపోవడం లేదు. మరుగుదొడ్లకు నీటి సరఫరా లేక అపరిశుభ్రంగా మారడం, లేదంటే తాళాలు వేయడం జరుగుతోంది. ఏ ఒక్క వార్డులో కూడా తాగునీటి కుళాయిలు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మూడంతస్తులో ఉన్న రోగులు నిత్యం నీటి కోసం మెట్లు దిగుతూ.. ఎక్కుతూ రావాల్సిందే. అది కూడా రిమ్స్‌లో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన తాగునీరే దిక్కవుతోంది. నీటి సరఫరా లేక కొన్ని సందర్భాల్లో ఆపరేషన్లు నిలిచిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సీజనల్ వ్యాధుల సమయంలో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఒక్కోపడకపై ఇద్దరేసి రోగులకు చికిత్స అందించాల్సి వస్తోంది. రిమ్స్‌తోపాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నీటి కొరత ఏర్పడుతోంది. ఈ రెండింటికి కలిపి సుమారు 10 లక్షల లీటర్ల నీటి అవసరం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మిషన్ భగీరథను రిమ్స్‌కు అనుసంధానం చేస్తే బాగుటుందని భావిస్తున్నారు. రెఫర్‌లకే ప్రాధాన్యత.. అత్యవసర సమయంలో వైద్యం అందడం లేదు. మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. గత నాలుగేళ్లలో 3500కు పైగా కేసులను రెఫర్ చేశారు. రిమ్స్‌కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని పేదలు, గిరిజనులే అధికంగా వస్తారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, స్నేక్‌బైట్, ఆత్మహత్యాయత్నం, తదితర తీవ్రమైన వ్యాధులతో వచ్చే వారికి వైద్యం అందక మత్యువాత పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొందరికి చికిత్స చేయలేమంటూ చేతులెత్తేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. రిమ్స్ అధికారుల పర్యవేక్షణలోపం.. అవసరమైన వైద్య సేవలు అందబాటులో ఉంచడంలో నిర్లక్ష్యం చేయడంతో రిమ్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. చిన్నచిన్న కేసులు సైతం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అత్యవర సమయంలో చికిత్స అందించే ట్రామా కేర్ సెంటర్లో ప్రత్యేక వైద్య నిపుణులు, టెక్నీషియన్లు లేకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్రంగా గాయపడిన వారిని రెఫర్ చేస్తున్నారు. రాజకీయంగా మారుతున్న పరిణామాలు.. ఆస్పత్రిలో రోగులకు వైద్య అందకపోవడం, అవినీతి ఆరోపణలు రావడంతో ఇటీవల రాజకీయ పార్టీలు ఆందోళనలు చేశాయి. దీనికి రిమ్స్ అధికారులు కౌంటర్ ఇస్తుండడంతో రాజకీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారి పోస్టు అనర్హుడికి కట్టబెట్టారంటూ సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కొత్తగా వచ్చిన కలెక్టర్ రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి, వైద్యుల పోస్టుల భర్తీ, కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు దృష్టి సారిస్తే పేదలకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంటుంది. -
కిడ్నీ రోగులకు దిక్కెవరు?
‘కిడ్నీ రోగులకు మంచి రోజులు రానున్నాయి. అతి త్వరలోనే స్థానికంగానే అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం..’ ఇవీ మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇటీవల గుప్పించిన హామీలు. కొత్తగా వైద్యసేవలు మాట అటుంచితే ఉన్న వైద్యులు కూడా వేరే జిల్లాలకు వెళ్లిపోవడంతో కిడ్నీ రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలోనే ఏకైక నెఫ్రాలజిస్టు తాజాగా కర్నూలు జిల్లాలోని వైద్య కళాశాలకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వెళ్లిపోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని కిడ్నీ రోగుల కోసం రిమ్స్‌లో నెఫ్రాలజీ యూనిట్ ప్రారంభిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లు జిల్లాకు వచ్చినప్పుడల్లా హామీ ప్రకటించడం.. తర్వాత మర్చిపోవడం పరిపాటిగా మారింది. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా హామీ నెరవేకపోవడంతో రిమ్స్‌లో నెఫ్రాలజీ యూనిట్ ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. జిల్లాలో ఇప్పటి వరకు సూపర్ స్పెషాలిటీ స్థాయిలో శిక్షణ పొందిన నెఫ్రాలజిస్టు డాక్టర్ జ్యోత్స్న మాత్రమే ఉన్నారు. ఈమె కొన్నాళ్లుగా రిమ్స్‌లో మెడికల్ విభాగంలో పనిచేస్తున్నారు. నెఫ్రాలజీలో పీజీ డిగ్రీ ఉన్నా స్థానికంగా ఉండాలన్న ఉద్దేశంతో వైద్యులుగా చేరి కిడ్నీ రోగులకు సేవలు అందించేవారు. ఆమెకు తాజాగా కర్నూలు వైద్య కళాశాలలో నెఫ్రాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాయిన్ కావాలని ఉత్తర్వులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం ఆమె రిలీవ్ అయ్యారు. రిమ్స్‌లోనే నెఫ్రాలజీ విభాగం ఉంటే ఆమె ఇక్కడే ఉండే అవకాశముండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో ఉద్దానం ప్రాంతంతో పాటు పలు మండలాల్లో కిడ్నీ రోగులు ఎక్కువగా ఉన్నారు. అధికారులు పలు సర్వేలు, పరీక్షలు చేసిన తర్వాత 13,000 మంది కిడ్నీ రోగులు ఉన్నట్లు గుర్తించారు. ఈ రోగులకు క్లిష్ట పరిస్థితుల్లో సేవలు అందించే ప్రత్యేక వైద్యులు నెఫ్రాలజిస్టులు లేరు. దీంతో ఏ సమస్య వచ్చినా విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెఫ్రాలజిస్టు లేకపోతే ఈ సమస్యలు తప్పవు.. ♦ కిడ్నీ రోగులకు నిరంతర నెఫ్రాలజీ విభాగం సేవలు ఇక అందవు, ♦ రోగికి డయాలసిస్ చేసేటప్పుడు ఎ.వి.ఫిçస్ట్టల్‌ను మెడ, ఇతర భాగాల్లో వైద్యులు, టెక్నీషియన్లు అమర్చలేరు. ♦ కిడ్నీ వ్యాధి తొలి దశలో ఉన్నప్పుడు రోగికి డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు సెంట్రల్ లైన్ ఏర్పాటు చేయాలంటే నెఫ్రాలజిస్టుకు మాత్రమే సాధ్యమవుతుంది. ♦ డయాలసిస్ జరుగుతున్న సమయంలో ఇబ్బందులు తలెత్తితే వారికి తక్షణ వైద్యం అందించే నెఫ్రాలజిస్టులు స్థానికంగా ఉండాలి. రిమ్స్‌లో ఇకపై ఆ సదుపాయం ఉండదు. -
లైఫ్‌కి లేదు సెక్యూరిటీ!
ఒంగోలు సెంట్రల్: తిరుపతికి చెందిన జై బాలాజీ సెక్యూరిటీ సర్వీసెస్ నిర్వాకంతో స్థానిక రిమ్స్‌లో పని చేస్తున్న సిబ్బంది తిప్పలు పడుతున్నారు. గత 5 నెలలుగా సెక్యూరిటీ గార్డులకు జీతాలు అందలేదు. ప్రశ్నిస్తుంటేæ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడంలేదని ఒక సారి, ట్రెజరీలో బిల్లులు ఉన్నాయని మరో సారి, తక్కువ టెండర్లు వేసి ఇబ్బందులు పడుతున్నామని ఇంకోసారి ఇలా ఇష్టం వచ్చినట్లు సమాధానం చెబుతున్నట్లు తెలిసింది. ఈ విషయంపై రిమ్స్ డైరెక్టర్‌ను సంప్రదించినా పరిస్థితిలో మార్పు లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు భేష్.. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ప్రకారం సెక్యూరిటీ సిబ్బందికి నెలకు రూ. 8,444ల జీతం, ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలను కల్పించాలి. అదే విధంగా వేతనంతో కూడిన సెలవులు కూడా ప్రతి నెలా మంజూరు చేయాల్సి ఉంటుంది. అలాగే సెక్యూరిటీ సిబ్బందికి నియామక పత్రాలు, ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలి. ఒక నెల వేతనంతో పాటు పీఎఫ్‌ను సెక్యూరిటీ సిబ్బంది బ్యాంకు ఖాతాలకు చెల్లిస్తేనే ఆ పత్రాలు రిమ్స్ అధికారులు పరిశీలించిన తరువాత సెక్యూరిటీ కాంట్రాక్టర్‌కు అనుమతులు మంజూరు చేయాలి. అయితే ఇలాంటి నింధనలు ఏవీ రిమ్స్‌లో అమలు జరుగడంలేదు. వీటిని పట్టించుకోవాల్సిన రిమ్స్ అధికారులు గానీ, కార్మిక శాఖ అధికారులు గానీ పట్టించుకోక చోద్యం చూస్తున్నారు. నూతనంగా అమల్లోకి వచ్చిన ఔట్ సోర్సింగ్ చట్టం ప్రకారం అయితే సెక్యూరిటీ సిబ్బందికి రూ. 12000 వేలకు పైగా వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. అనుమతులు రావాలట.. కార్మికులకు అందుతున్న వేతనాలు, సేవలపై పరిశీలించాల్సిన కార్మిక శాఖ అధికారులు, పెద్ద కాంట్రాక్టర్ల జోలికి వెళ్లడంలేదు. తమకు పై అధికారుల నుంచి ఆదేశాలు అందితేనే పరిశీలిస్తామంటున్నారు. ఇదిలా ఉంటే కార్మిక సంఘాలు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్‌కు అనేక సార్లు ఫిర్యాదు చేశాయి. అయితే తమకు లేబర్ కమిషనర్ నుంచి ఉత్తర్వులు అందితేనే రిమ్స్‌ను సందర్శిస్తామని తేల్చి చెబుతున్నారు. దొంగతనాలు.. కాంట్రాక్టు ప్రకారం రిమ్స్ వైద్యశాల, కళాశాలలో 73 మంది కాంట్రాక్టు సెక్యూరిటీ సిబ్బంది ఉండాలి. వీరిలో 67 మంది రెగ్యులర్‌గా 6 గురు రిజర్వ్‌గా ఉండాలి. అయితే కేవలం 60 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కూడా ప్రతి రోజూ 6 గురు సెలవులో ఉంటున్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బంది లేకపోవడం వలన వైద్యశాలలో పేషెంట్లకు చెందిన అటెండర్ల సామగ్రిని దొంగలు తస్కరిస్తున్నారు. రిమ్స్ డైరెక్టర్‌దే బాధ్యత: సెక్యూరిటీ గార్డులకు గత 5 నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు. కాంట్రాక్టు పొందిన జై బాలాజీ సంస్థ వారు అయితే ఇక్కడ బినామీని పెట్టారు. కాంట్రాక్టులో ప్రతి నెలా జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై అనేక సార్లు రిమ్స్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. కాంట్రాక్టు సిబ్బంది చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత రిమ్స్ డైరెక్టర్‌పైనే ఉంది. – ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్డీ సర్దార్ జీతాలు ఇవ్వాలని ఆదేశించాం: బిల్లులు మంజూరు అయినా, కాకపోయినా ప్రతి నెలా సిబ్బందికి వేతనాలు అందించాల్సిన బాధ్యత సెక్యూరిటీ కాంట్రాక్టర్‌దే. జీతాలు ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. – రిమ్స్ డైరెక్టర్: వల్లీశ్వరి -
ఆశల బతుకులు..
మర్రిపాటి తులసీదాస్... కవిటి మండలంలోని పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన ఈయన మూడేళ్ల కిందటి వరకూ విశాఖ జిల్లా పరవాడలోని ఎన్టీపీసీ వద్ద ఓ హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ విధి మరోలా తలచింది. 2014లో అతనికి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఎనిమిది నెల ల నుంచి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇప్పుడు వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకోవడం తప్పనిసరి. ఇతనికి భార్య ఆదిలక్ష్మితో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అఖిల 7వ తరగతి, రేష్మ 4వ తరగతి, విన్ని రెండో తరగతి చదువుతున్నారు. కళియా లక్ష్మణరావు... కంచిలికి చెందిన ఈయనకు మూడు పదుల వయస్సులోనే కిడ్నీ పాడైపోయింది. అసలే పేద కుటుంబం. మందులు కొనుక్కోవడానికి కూడా ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. నెలకు రూ.10 వేలు ఖర్చు భరించలేక హోమియోపతి మందులను ఆశ్రయించారు. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: తులసీదాస్, లక్ష్మణరావు వంటి వారు ఉద్దానంలో వేలాది మంది ఉన్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశ పడుతున్న వారు, ఎలాగైనా జబ్బు తగ్గిపోవాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్న వారు దాదాపు ప్రతి వీధిలోనూ కనిపిస్తారు. కానీ వీరి ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదు. వీరి కన్నీరు సర్కారు పెద్దలకు కనిపించడం లేదు. కిడ్నీ రోగులకు రూ.2,500 పింఛను అందిస్తామని ముఖ్యమంత్రి, ఆరో గ్యశాఖ మంత్రి ఘనంగా ప్రకటించినా అదీ నామమాత్రమే అయ్యింది. ఎన్టీఆర్ ఆరోగ్యసేవ కింద ప్రతి నెల డయాలసిస్ చేయించుకుంటేనే ఆ డబ్బు అందుతుంది. అంటే డయాలసిస్ ఆపేస్తే పింఛను కూడా ఆగిపోతుం ది. ప్రభుత్వం స్పందించి తమకేదో శాశ్వత పరిష్కారం చూపిస్తుందని కోటి ఆశలతో ఉన్న ఉద్దానం వాసుల కడగండ్లు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కేవలం సమావేశాలు, హామీల ప్రకటనలకే పరిమితమవుతున్నారు. ఏదీ భరోసా? జిల్లాలో కిడ్నీ రోగులకు సరైన వైద్యం అందించి, అవసరమైతే కిడ్నీ మార్పిడి చేయించి దీర్ఘాయుష్షుకు భరోసా ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు ఉండట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రెండు మూడేళ్లకు మించి జీవితకాలాన్ని పెంచలేని డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంది. అభివృద్ధిలో వెనుకబడిన సిక్కోలు జిల్లా ప్రజల ఆరోగ్యానికి వరప్రదాయినిలా ఉండాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి స్థానిక నాయకుడు ధర్మాన ప్రసాదరావు చొరవతో శ్రీకాకుళంలో ఏర్పాటు చేయించిన రాజీవ్‌గాంధీ బోధనాసుపత్రి (రిమ్స్)ని సద్వినియోగం చేసుకొనే విషయాన్నే నేటి ప్రభుత్వం విస్మరిస్తుందనే భావన బాధితుల్లో కలుగుతోంది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణాలను అన్వేషించేలా పరిశోధన విభాగంతో పాటు అవయవదాతల నుంచి సేకరించిన కిడ్నీలను రోగులకు అమర్చేలా ఒక ప్రత్యేక శస్త్రచికిత్స విభాగాన్నీ రిమ్స్‌లోనే ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అవయవ దానానికి పలువురు ముందుకొస్తున్న దృష్ట్యా రిమ్స్‌లో జీవన్‌దాన్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదననూ ప్రభుత్వం పక్కనపెట్టేయడం గమనార్హం. కిడ్నీ మార్పిడి కనాకష్టం ఉద్దానంలోని కిడ్నీ బాధితుల్లో 90 శాతం మంది వారానికి రెండు రోజులు డయాలసిస్ కోసం విశాఖలోని కేజీహెచ్‌కు వెళ్తున్నారు. అక్కడ కిడ్నీ మార్పిడికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయి. కానీ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు 2015 సంవత్సరంలో ఐదు, గత ఏడాది రెండు మాత్రమే జరిగాయి. అదే విశాఖలోనే ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రం నెలకు పది నుంచి 20 వరకూ జరుగుతుండటం గమనార్హం. ఆయా ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకోవడానికే ఆర్థిక స్థోమత సరిపోని ఉద్దానం పేదలకు ఇక కిడ్నీ మార్పిడి అంటే తలకు మించిన భారమవుతోంది. ఈ శస్త్రచికిత్సకు ఆరోగ్య శ్రీ కింద రూ.1.90 లక్షల వరకే సహాయం అందుతోంది. తర్వాత ఆర్నెళ్లకు రూ.80 వేల చొప్పున ఏడాది కాలానికి మందులకు ఇస్తున్నారు. కానీ శస్త్రచికిత్స తర్వాత రూ.80 వేల నుంచి రూ.లక్ష ఖరీదు ఉండే ఇంజెక్షన్లు కనీసం రెండు తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత నెలకు రూ.2 వేలు మందులకు ఖర్చువుతోంది. అన్ని ఖర్చులు కలిపి రూ.5 లక్షల వరకూ చేతి నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి. నిబంధనలతో ఇబ్బందులు ఒకవేళ ఎవరైనా దాతలు కిడ్నీ దానానికి ముందుకొచ్చినా శస్త్రచికిత్స చేయించుకోలేని పరిస్థితి. ఇలా చేయించుకోవాలంటే ముందుగా బోధనాస్పత్రి సూపరింటెండెంట్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ అనుమతి పత్రం ఇవ్వాలి. ఇది కేజీహెచ్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీకాకుళంలో రిమ్స్ బోధనాసుపత్రి అయినప్పటికీ ఆ సౌకర్యం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా కేజీహెచ్ చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిందే. అంతేకాదు దాత, గ్రహీత ఇద్దరూ పోలీసు, రెవెన్యూ శాఖల నుంచి ధ్రువీకరణ పత్రాలను కూడా బోధనాస్పత్రి కమిటీకి సమర్పించాల్సి ఉంది. మళ్లీ ఆ పత్రాలను కమిటీ తిరిగి పోలీసు, రెవెన్యూ అధికారులకు పంపించి పునఃపరిశీలన చేయిస్తుంది. ఇందంతా జరిగేటప్పటికీ పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. ‘రిమ్స్’ను విస్మరిస్తున్నారే... జిల్లాలో కిడ్నీ వ్యాధుల తీవ్రత దృష్ట్యా కనీసం నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలను సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవి సాకారమైతే రిమ్స్‌లో నెఫ్రాలజీ, యూరాలజీ సర్జన్లు, క్లినికల్ ల్యాబ్, ప్రత్యేక వార్డు, ప్రత్యేక శస్త్రచికిత్స విభాగం అందుబాటులోకి వస్తాయి. వీటన్నింటి కల్పనకు రూ.2 కోట్లకు మించి వ్యయం కాదని వైద్యనిపుణులే చెబుతున్నారు. శ్రీకాకుళం రిమ్స్ బోధనాసుపత్రి అయినప్పటికీ ఇప్పటివరకూ నెఫ్రాలజీ విభాగానికి నోచుకోలేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని సూపర్ స్పెషాలిటీ స్థాయికి తీసుకొస్తే తప్ప ఉద్దానం కిడ్నీ రోగులకు జిల్లాలో తగిన వైద్యం అందే పరిస్థితి ఉండదు. రిమ్స్‌లో ఆరు సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు వెళ్లినా బుట్టదాఖలే అయ్యాయి. అంతేకాదు రాష్ట్రంలో శ్రీకాకుళం రిమ్స్ తప్ప మిగతా జిల్లాల్లోని ప్రభుత్వ బోధనాస్పత్రులన్నింటిలోనూ జీవన్‌దాన్ యూనిట్ ఉంది. దీనిద్వారా కిడ్నీలు, ఇతర అవయవాల మార్పిడి ప్రక్రియ సులభమవుతోంది. శరీరం, అవయవ దానాలకు ముందుకొచ్చే దాతల పేర్లను నమోదు చేసుకొని, వారి మరణానంతరం ఆయా అవయవాలను సేకరించి అవసరమైన వారికి సమకూర్చడంలో ఈ యూనిట్ సహకరిస్తోంది. మరోవైపు రోడ్డు ప్రమాదాల్లో మృతులు లేదా బ్రెయిన్ డెడ్ అయినవారి నుంచి కిడ్నీలు సేకరించి రోగులకు మార్పిడి చేసే ప్రక్రియ జిల్లాలో అందుబాటులోకి వస్తుంది. కానీ ఇవన్నీ విస్మరించి ప్రభుత్వం కేవలం కంటితుడుపు చర్యలకే పరిమితమవుతోంది. కిడ్నీ మార్పిడికి అవకాశం ఉంటే... ఎన్టీఆర్ వైద్య సేవ కింద కిడ్నీ మార్పిడికి అవకాశం లేకపోవడం వల్లే నేను భర్తను కోల్పోయాను. పేదరికం వల్ల అతనికి కిడ్నీ మార్పిడి చేయించలేకపోయాం. ఆ ఒక్క అవకాశం ఉంటే నా కిడ్నీ ఇచ్చి బతికించుకునేదాన్ని. – లొట్టి తేజావతి, రాజపురం, కవిటి మండలం -
బాలికను పరామర్శించిన మహిళా కమిషన్ సభ్యురాలు
-
బాలికను పరామర్శించిన మహిళా కమిషన్ సభ్యురాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురై రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రణస్థలం మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన బాలికను మంగళవారం ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు కె.శ్రీవాణి పరామర్శించారు. మేనత్తతో మాట్లాడి బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో చదివించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషన్ సభ్యురాలు తెలపగా, అందుకు వారు అంగీకరించలేదు. అనంతరం బాలిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. కమిషన్ సభ్యురాలితో పాటు ఆస్పత్రి ఆర్ఎంఓ బీసీహెచ్ అప్పలనాయుడు, గైనికాలజిస్టు శశికళ ఉన్నారు. -
రిమ్స్ నెఫ్రాలజీ వైద్యుల నిర్లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : రిమ్స్‌లో వైద్యాధికారుల నిరక్ష్యం రాజ్యమేలుతోంది. కిడ్నీ వ్యాధితో డయాలసిస్ కోసం వచ్చిన మహిళకు వైద్యం చేసేందుకు వీరు నిరాకరించారు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలని నిర్ద్రయగా చెప్పారు. ఆమెకు వైద్యం చేయాలని కలెక్టర్ ఆదేశించినా, రిమ్స్ డైరెక్టర్ ఫోన్ చేసినా చివరకు ఆమెకు వైద్యం అందలేదు. బాధితురాలు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి మండలం పొలవరం గ్రామానికి చెందిన కిడ్నీ రోగి సనపల కళావతి ఇటీవల విశాఖపట్నం కేజీహెచ్‌లో డయాలసిస్ చేయించుకున్నారు. అక్కడ వైద్యం చేయించుకునే స్తోమత లేక టెక్కలి ఏరియా ఆస్పత్రిలో చేరారు. అక్కడ డయాలసిస్‌కి నెఫ్రాలజీ ప్రత్యేకాధికారి లేనందున రిమ్స్‌కు తరలించారు. గురువారం అక్కడకు తీసుకెళ్లగా.. ఆమెకు నిరాశే ఎదురైంది. డయాలసిస్ చేయడం కుదరదని తెగేసి చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారని, అక్కడ ఖర్చు భరించలేమని చెప్పినా సిబ్బంది కనికరం చూపలేదని బంధువులు వాపోయారు. అప్పటి నుంచి ఆమె రిమ్స్‌లో ఉన్నారు. సోమవారం ఈ విషయంపై కలెక్టర్ కె.ధనుంజయరెడ్డికి గ్రీవెన్సు సెల్లో కళావతి బంధువు ఫిర్యాదు చేశారు. అయన వెంటనే స్పందించి రిమ్స్ డైరెక్టర్‌కి ఫోన్ చేసి వైద్యం అందించాలని ఆదేశించారు. వాటిని కూడా పట్టించుకోలేదు. వైద్యం అందించలేమని తేల్చిచెప్పారు. దీంతో కళావతిని బంధువులు సోమవారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకువెళ్లారు. కాగా, దీనిపై రిమ్స్ నెఫ్రాలజీ విభాగ వైద్యురాలు జ్యోస్న మాట్లాడుతూ.. రిమ్స్‌లో తగిన పరికరాలు లేవన్నారు. రిమ్స్ సూపరింటెండెంట్ సునీల్ నాయక్ మాట్లాడుతూ.. రోగి పరిస్థితి విషమంగా ఉండడంతో, విశాఖకు రిఫర్ చేయాల్సి వచ్చిందన్నారు. -
కానిస్టేబుల్ అభ్యర్థులకు వైద్యపరీక్షలు
ఆదిలాబాద్ : ఎంపికైన కానిస్టేబుళ్ల అభ్యర్థులకు రిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైద్య పరీక్షల ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ఆదిలాబాద్ ఏఎస్పీ పనసారెడ్డి అభ్యర్థుల వైద్యపరీక్షల ఏర్పాట్లను పరిశీలించారు. శిక్షణకేంద్రం డీఎస్పీ సీతారాములు, ఇద్దరు ఎస్సైల పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతీరోజు 60 మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు 418మంది అభ్యర్థులకు పరీక్షలు పూర్తయ్యాయన్నారు. మిగతా 125 మంది అభ్యర్థులకు మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. రిమ్స్ డైరెక్టర్ అశోక్ నేతృత్వంలో వైద్యులు సహకారం అందిస్తున్నారన్నారు. సమయానుసారంగా అభ్యర్థులు రిమ్స్‌లో హాజరుకావాలన్నారు. వైద్య పరీక్షలతో పాటు అభ్యర్థుల ఉద్యోగ పరిశీలన కొనసాగుతుందన్నారు. 12 ప్రత్యేక పోలీసు బృందాలు ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల పూర్వపరాలు, విద్యాభ్యాసం, వ్యక్తిత్వం, నిజపత్రాలను పరిశీలిస్తోందన్నారు. త్వరలో శిక్షణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో శిక్షణ డీఎస్పీ సీతారాములు, ఎస్సైలు గంగాధర్, విష్ణుప్రకాశ్, పోలీస్ డాక్టర్ గంగారాం, వైద్యులున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు బలి!
► రిమ్స్ ఆస్పత్రిలో నవజాత శిశువు మృతి ► సరైన వైద్యం అందక ప్రాణాలు విడిచిన మగ బిడ్డ ► భోరున విలపిస్తున్న తల్లిదండ్రులు శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని రిమ్స్ జనరల్ ఆస్పత్రిలో ప్రసూతి వార్డులో గురువారం నవజాత శిశువు మరణించింది. ప్రసవం జరిగిన కొన్ని గంటలకే శిశువు మృతి చెందడంపై ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు ప్రాణాలు విడిచిందని బాలింత బంధువులు ఆరోపిస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంపై ప్రజలకు ఇటీవల కాలంలో పూర్తిగా నమ్మకం పోయింది. చిన్న చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగినన్ని ప్రసవాలు కూడా ఇక్కడ జరగడంలేదు. దీనికి కారణం పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడం, ఉన్నవారు విధులకే సకాలంలో హాజరుకాకపోవడం, వారి సొంత క్లినిక్‌ల్లో వైద్య సేవలు అందిస్తూ రిమ్స్‌లో ఈ విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న అభియోగాలు ఉన్నాయి. తాజాగా గురువారం రిమ్స్‌లో ప్రసవం తర్వాత నవజాత శిశువు మృతి చెందడంతో ఈ అభియోగాలకు బలం చేకూర్చుతుంది. ఆస్పత్రి వైద్య సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి పరిస్థితి దాపురించిందని బాలింత బంధువులు ఆరోపిస్తున్నారు. సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం గ్రామానికి చెందిన పొన్నాడ రమేష్ తన భార్య రాజులమ్మకు పురిటి నొప్పులు రావడంతో గురువారం ఉదయం 11 గంటల సమయంలో రిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. రిమ్స్‌లో వైద్యులు రాజులమ్మను పరిశీలించి సాధారణ ప్రసవం వస్తుందని చెప్పారు. ఈ మేరకు సాయంత్రం 4 గంటల సమయంలో సాధారణ ప్రసవం జరిగింది. మగ శిశువు జన్మించగా, శిశువుని ఐసీయూలో పెట్టారు. అయితే ఈ విషయాన్ని బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి, ఆమె బంధువులకు ఆస్పత్రి వర్గాలు తెలియజేయలేదని వారు ఆరోపిస్తున్నారు. గంట తర్వాత శిశువు మరణించిందని ఆస్పత్రి సిబ్బంది చెప్పారని వారు ఆవేదన చెందారు. ప్రసవ సమయంలో వైద్యులు లేకపోవడం, కేవలం కింది స్థాయి సిబ్బంది ప్రసవయం చేయడం వల్లే తమ బిడ్డ మరణించిందని, తగిన జాగ్రత్తలు తీసుకోలేదని శిశువు తండ్రి ఆరోపిస్తున్నాడు. డ్యూటీలో ఉండాల్సిన వైద్యాధికారి లేరని, కేవలం హౌస్ సర్జన్, నర్సింగ్ సిబ్బంది పర్యవేక్షణలో ఈ ప్రసవం చేయడం వల్లే ఘోరం జరిగిపోయిందని లబోదిబోమంటున్నాడు. నిర్లక్ష్యం లేదు: కాగా నవజాత శిశువు మృతిపై ఆస్పత్రి ప్రసూతి విభాగం అధిపతి డాక్టర్ అరవింద్ వద్ద సాక్షి ప్రస్తావించగా శిశువు పుట్టినప్పటికే ఇబ్బందులు ఉన్నాయన్నారు. శిశువు మెడపై పేగులు వేసుకొని పుట్టినందున ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. ఈ సమయంలో డ్యూటీ డాక్టర్ రిమ్స్ ఆపరేషన్ థియేటర్లో ఇతర ప్రసూతి శస్త్ర చికిత్సలు చేస్తున్నారని చెప్పారు. ఈ శిశువు మృతి వెనుక వైద్యుల నిర్లక్ష్యం లేదని ఆయన వివరించారు. -
ఎంబీబీఎస్ పరీక్షల్లో ‘వైవా’ దందా
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో యథేచ్ఛగా ‘వైవా’ దందా నడుస్తోంది. అడిగినంత ఇవ్వకపోతే వైవా పరీక్షల్లో మార్కులు వెయ్యబోమని ప్రొఫెసర్లు బెదిరిస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో వారు అడిగినంత ముట్టజెప్పాల్సి వస్తోందని వాపోతున్నారు. శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో జరుగుతున్న తతంగం తాజాగా ‘సాక్షి’ దృష్టికి వచ్చింది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది. మంగళవారం పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ సబ్జెక్టులకు ప్రాక్టికల్స్ జరిగాయి. పీడియాట్రిక్స్‌లో 40 మార్కులకు థియరీ, 30 మార్కులకు ప్రాక్టికల్స్, 20 మార్కులకు ఇంటర్నల్ అసెస్మెంట్, 10 మార్కులకు వైవా జరుగుతుంది. జనరల్ సర్జరీలో 60 మార్కులకు థియరీ, 60 మార్కులకు ప్రాక్టికల్స్, మరో 60 మార్కులకు ఇంటర్నల్ అసెస్మెంట్, 20 మార్కులకు వైవా ఉంటుంది. వైవా మార్కులు మాత్రమే థియరీ మార్కులకు కలుపుతారు. దీంతో సాధారణంగా వైవాలో ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తుంటారు. వీరి అవసరాన్ని గమనించిన పలువురు ప్రొఫెసర్లు సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టారు. పీడియాట్రిక్స్‌లో 10కి 8 మార్కులేయాలంటే రూ. 3 వేలు, 9 మార్కులేయాలంటే రూ.4వేలు వసూలు చేశారు. జనరల్ సర్జరీలోనూ 20కి 16 మార్కుల నుంచి బేరాలు నడిచాయి. ఇందులోనూ రూ.4వేల నుంచి రూ.6 వేల వరకూ వసూలు చేశారు. ఈ పరిస్థితి ఒక్క రిమ్స్‌లోనే కాదు, అన్ని వైద్య కళాశాలల్లో ఉందని విద్యార్థులు వాపోయారు. కొందరికింకా ఆ జాడ్యం పోలేదు కాగా, దీనిపై వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ ఎన్. సుబ్బారావు స్పందిస్తూ.. కొందరు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఇంకా వసూళ్ల జాడ్యం పోలేదన్నారు. ఈ ఉదంతంపై విచారణ జరిపించి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఇక ప్రభుత్వ ఆస్పత్రులుగా రిమ్స్!
మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో సెమీ అటానమస్ సంస్థలుగా కొనసాగుతున్న రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సైస్ (రిమ్స్) మూడు ఆసుపత్రులను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం శ్రీకాకుళంలో రిమ్స్‌లో మంత్రి సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి కామినేని విలేకరులతో మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులు ఆసుపత్రికి వెళ్లేందుకు మండలానికి ఒక ప్రత్యేక వాహనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, సోంపేట సహా రాష్ట్రంలో ఆరు చోట్ల కొత్తగా డయాలసిస్ యూనిట్లు ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలోనూ విలేకరులతో మాట్లాడుతూ ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల స్థితిపై ప్రత్యేక వైద్య బృందంతో అధ్యయనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన అల్టిమేటం ఇచ్చాక తామేం చెబుతామన్నారు. -
‘నీట్’లో హౌస్సర్జన్లకు అవకాశం
కడప అర్బన్ : నేషనల్ ఎలిజిబులిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)లో అర్హత కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్లు చేపడుతున్న ఆందోళనలో భాగంగా కడప రిమ్స్‌లో గురువారం హౌస్ సర్జన్లు ఐపీ విభాగం ముందు ఆందోళన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మూడు డిమాండ్లతో కూడిన సమస్యలను పరిష్కరించాలంటూ హౌస్ సర్జన్లు ఆందోళనకు దిగారు. 2016–17 బ్యాచ్‌లో హౌస్ సర్జన్లుగా ఉన్న తమకు వచ్చే ఏడాది మార్చి 31వ తేది వరకు ఉంటేనే నీట్లో అర్హత కల్పిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పడం సమంజసంగా లేదన్నారు. తమకు ఎన్టీఆర్ యూనివర్శిటీ పరిధిలో 2017 ఏప్రిల్ 11వ తేది వరకు హౌస్ సర్జన్ల కోర్సు ముగుస్తుందని, 11 రోజులు తమకు అర్హతలో తక్కువగా ఉందని, ఆ విషయాన్ని ప్రభుత్వం గమనించి సవరించాలన్నారు. ఆర్టికల్ 371ను సవరించి ఒకే రాష్ట్రంలో కనీసం 15 సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీఓ నెం. 287 ప్రకారం హౌస్ సర్జన్ల స్టయిఫండ్‌ను తెలంగాణ రాష్ట్రంలో 15 శాతం పెంచారని, మన రాష్ట్రంలో ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోలేదన్నారు. వైద్యులకు వైద్యానికి ఉపయోగపడే పనులు చేయించకుండా నర్సులు, ఎంఎన్ఓలు చేసే పనులను చేయిస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి నీట్లో అర్హత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి తమకు న్యాయం చేసేవరకు పోరాడతాం. ఆందోళనలో ఉ«ధతంగా పాల్గొని దశల వారీ ఉద్యమాలకు శ్రీకారం చుడతాం! – డాక్టర్ మహేంద్ర, హౌస్ సర్జన్, రిమ్స్, కడప నీట్లో అర్హత కల్పించాలి దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షలో 11 రోజులు మాత్రమే తక్కువగా ఉందని తెలిపారు. ఈ ఆలస్యానికి కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీనే కారణం. ఆ విషయాన్ని గుర్తించి న్యాయం చేయాలి. – డాక్టర్ శ్రీధర్, హౌస్ సర్జన్, రిమ్స్, కడప ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితి తమతో వైద్యానికి ఉపయోగపడే ట్రీట్మెంట్ పనులు చేయిస్తే అందరికీ బాగుంటుంది. కానీ నర్సులు, ఎంఎన్ఓలు చేసే పనులను చేయిస్తున్నారు. దీనివల్ల తాము డ్యూటీలకు వచ్చినప్పటి నుంచి కే షీట్లు చూడడం వరకే తప్ప రోగులకు వైద్య సేవలు అందించలేని పరిస్థితి నెలకొంది. – డాక్టర్ నరేష్, హౌస్ సర్జన్ల అసోసియేషన్ అధ్యక్షులు, రిమ్స్, కడప స్టయిఫండ్‌ను పెంచేలా చర్యలు తీసుకోవాలి హౌస్ సర్జన్లకు ఇచ్చే స్టయిఫండ్‌ను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జీఓ నెం. 287 ప్రకారం రెన్యూవల్ చేసి 15 శాతం పెంచాలి. అలాంటి చర్యలు ్ర’పభుత్వం చేపడితేనే తమకు న్యాయం జరుగుతుంది. – డాక్టర్ బబిత, హౌస్ సర్జన్, రిమ్స్, కడప నీట్లో అర్హత సాధించేంత వరకు పోరాటం గుంటూరులో జూనియర్ డాక్టర్లు వారం రోజులుగా సమ్మె చేస్తున్నారని, వారి బాటలోనే తాము ఆందోళన చేపడతాం. ప్రభుత్వం తమకు నీట్లో అర్హత సాధించేలా లిఖిత పూర్వక హామి ఇచ్చేంతవరకు పోరాడుతాం! – డాక్టర్ సరయు, హౌస్ సర్జన్, రిమ్స్, కడప సౌకర్యాలు కల్పించాలి వైద్య సిబ్బందితోపాటు తాము విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఒక్కొ సమయంలో కనీసం తాగేందుకు మంచినీరు కూడా లేకపోవడం దారుణం. అలాగే హాస్టల్ నుంచి విధులకు రావాల్సిన సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం! – డాక్టర్ ప్రియాంక, హౌస్ సర్జన్, రిమ్స్, కడప -
రిమ్స్ లో పార్కింగ్ దోపిడీ
ఆస్పత్రికి చెల్లించేది రూ.4వేలు.. కాంట్రాక్టర్‌కు రూ.లక్షలు వాహనదారుల నుంచి రూ.10 చొప్పున వసూలు పాతటెండర్పైనే మరొకరికి టెండర్ అప్పగింత సినిమా టాకీస్‌లో వసూలు చేస్తలేరా.. : డెరైక్టర్ అశోక్ ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రమైన రిమ్స్ ఆస్పత్రిలో పార్కింగ్ ఫీజు పేరిట దోపిడీ దందా యథేచ్ఛగా సాగుతోంది. రోగులు, వారి బంధువుల జేబులకు చిల్లు పడుతోంది. తీరా చూస్తే రిమ్స్ ఆస్పత్రికి రూ.4 వేలు మాత్రమే ఆదాయం వస్తోంది. కాని కాంట్రాక్టర్‌కు రూ.లక్షల్లో కాసుల వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి నిత్యం వందలాది రోగులు, వారి బంధువులు వాహనాలపై వచ్చి వెళ్తుంటారు. ఇటీవల ఎమర్జెన్సీ వార్డు ఎదుట పార్కింగ్ స్టాండ్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో వాహనానికి రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. సమీపంలో వాహనాలు నిలుపకుండా కట్టుదిట్టం చేశారు. ప్రతి రోజు 300కు పైగా ద్విచక్ర వాహనాలు వచ్చి వెళ్తుంటారుు. ఈ లెక్కన సుమారు రోజుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పార్కింగ్ ఫీజు వసూలయ్యే అవకాశం ఉంది. ఇంత వసూలు చేస్తున్నా.. పార్కింగ్ కాంట్రాక్టర్ రిమ్స్‌కు చెల్లించేది ఎంతో తెలుసుకుంటే ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. నామామాత్రంగా నెలకు రూ.4 వేలు రిమ్స్‌కు చెల్లిస్తున్నారు. ‘‘నామినల్‌గా రూ.4 వేలు చెల్లిస్తున్నారు..’’అని రిమ్స్ డెరైక్టర్ అశోక్ నోటివెంటే రావడం గమనార్హం. టెండర్ అప్పగింతలోనూ అనుమానాలే.. నెలకు రూ.4 వేల చొప్పున రిమ్స్‌కు చెల్లించే విధంగా పార్కింగ్ స్టాండ్ కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిమ్స్ అధికారులు.. అటు కాంట్రాక్టర్ మధ్య లోపారుుకారి ఒప్పందం ఉందేమోననే అనుమానాలు లేకపోలేదు. గత సంవత్సరం పార్కింగ్ స్టాండ్ కోసం టెండర్ పిలిచినట్లు రిమ్స్ డెరైక్టర్ చెబుతున్నారు. అందులో ఒక వ్యక్తి టెండర్ రూ.5 వేలకు అప్పగించగా.. ఆయన మూడు నెలలపాటే నిర్వహించి మూసివేశాడని, నిర్వహణ సాధ్యం కాలేదని అంటున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు పార్కింగ్ స్టాండ్ ఎవరూ నడుపలేదని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు మళ్లీ పార్కింగ్ స్టాండ్‌ను ప్రారంభించాలనుకుంటే పేపర్ ప్రకటన ఇచ్చి ఆసక్తి గల కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలి. అలా కాకుండా అప్పట్లో రెండో స్థానంలో నిలిచిన కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని టెండర్‌ను కొనసాగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్కూటరుంటే పేదవారు కాదట..! ‘రిమ్స్‌కు ద్విచక్ర వాహనంపై వచ్చే పేషెంట్లు, సంబంధీకులు పార్కింగ్ ఫీజు కింద రూ.10 కూడా చెల్లించుకోలేరా.. సినిమా టాకీస్‌లో రూ.20 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు.. సైకిల్ ఉన్నవారు పేదవారనుకోవచ్చు.. స్కూటర్ ఉన్నవారు కూడా పేదవారంటే ఎలా..?’ ఇదీ రిమ్స్ ఆస్పత్రిలో పార్కింగ్ ఫీజు రూ.10 విషయమై రిమ్స్ డెరైక్టర్ అశోక్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. ఆయన ఇచ్చిన సమాధానం. బయట ఖరీదైన వైద్యం చేయించుకోలేక రిమ్స్‌కు వస్తున్నవారంతా సంపన్నులా అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
రిమ్స్ ఆస్పత్రికి రూ.100 కోట్లు కేటాయించాలి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్‌జాదవ్ ఇచ్చోడ : జిల్లాకు చెందిన మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే రిమ్స్ ఆస్పత్రికి రూ.100 కోట్లు కేటాయించాలని, జిల్లావాసులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్‌జాదవ్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో జిల్లా పర్యటనకు వచ్చిన కేసీఆర్.. గిరిజనులకు హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్యం అందిస్తామని మభ్యపెట్టారని అన్నారు. వైద్యం అందక గిరిజనులు మత్యువాత పడుతున్నారని, పూటకో మాట చెప్పే కేసీఆర్ ప్రభుత్వ పాలనను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏజెన్సీ మరణాలు అరికట్టడానికి పీఎంఎస్ఎస్వై కింద రూ.1.50 కోట్లు మాంజురు చేసిందని, ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో దొరలపాలన సాగుతోందని, ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెపూల నర్సయ్య. డీసీఎంఎస్ డైరెక్టర్ కుంర కోటేశ్వర్, మండల పార్టీ అధ్యక్షుడు మహిముద్ఖాన్, ప్రధాన కార్యదర్శి కల్లెం నారాయణరెడ్డి, నాయకులు మాధవ్పటేల్, పాండు పటేల్, ఆసీఫ్‌ఖాన్, భూమారెడ్డి, బాబా, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. -
తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన
ఆదిలాబాద్ రిమ్స్ : తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆడిటోరియంలో తల్లిపాల ప్రాముఖ్యతపై ఆస్పత్రిలోని బాలింతలు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. డబ్బా పాలు వద్దు.. తల్లిపాలే ముద్దు.. అనే అంశంపై రిమ్స్‌లో మూడో సంవత్సరం వైద్య విద్యార్థుల నాటక ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది. వైద్య విద్యార్థులు విక్రాంత్, ప్రణయ్, హరిత, మాధురి, మానస, రమ్య, నిహారిక, స్నేహ, లేఖ, లలిత, రోహిత్, గీతలు నాటికలోని తల్లిదండ్రులు, ఆశవర్కర్, వైద్యులు, సర్పంచ్ పాత్రాల్లో నటించారు. గర్భందాల్చిన నాటి నుంచి ప్రసూతి అయ్యే వరకు, తర్వాత పుట్టిన పిల్లలకు తల్లిపాలు తాగించడం వరకు ప్రస్తుత సమాజంలో ఎలా జరుగుతుందనే విధానంపై వివరించారు. పిల్లల వైద్య నిపుణుడు సూర్యకాంత్ తల్లిపాల ప్రాముఖ్యతపై మాట్లాడారు. పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు తాగించాలని, వీటినే ముర్రపాలు అంటారని, ఇవి తాగిన పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ఈ పాలు కామెర్లు, విరేచనాల నుంచి బిడ్డను కాపాడుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ అశోక్, ఆర్ఎంఓ డాక్టర్ వినయ్‌కుమార్, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రేమ వేధింపులు తాళలేక..
ఆదిలాబాద్ రూరల్: ప్రేమ పేరిట ఓ యువకుడి వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన ఆదిలాబాద్ మండలం చాందా-టి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చాందా-టి గ్రామానికి చెందిన విద్యార్థిని(17) ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గ్రామం నుంచి కళాశాలకు నిత్యం బస్సులో రాకపోకలు సాగిస్తోంది. ఈ క్రమంలో జైనథ్ మండలం లేఖర్వాడకు చెందిన ఎం.చంద్రశేఖర్(24) పనీపాట లేకుండా తిరుగుతుంటాడు. తనను ప్రేమించాలంటూ ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. వేధింపులతో మనస్తాపం చెందిన ఆమె గురువారం వేకువజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. శరీరం 80 శాతం కాలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆదిలాబాద్ రూరల్ ప్రొబేషనరీ ఎస్సై సుబ్బారావు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. -
పెళ్లి వ్యాన్ బోల్తా
► 35 మందికి గాయూలు ► రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తలమడుగు(తాంసి)/ఆదిలాబాద్ రిమ్స్ : తాంసి మండలం దన్నోర గ్రామీపంలోని వాగు మూలమలుపు వద్ద గురువారం పెళ్లి వ్యాన్(ఏపీ 01 ఎక్స్ 8216) బోల్తాపడింది. అందులో ప్రయూణిస్తున్న 35 మంది గాయపడ్డారు. వీరికి ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాంసి మండలంలోని పిప్పల్‌కోఠి గ్రామానికి చెందిన పిట్లా అశోక్ కూతురు సరిత వివాహం దన్నోర గ్రామానికి చెందిన వికాష్‌తో గురువారం జరిగింది. పిప్పల్‌కోఠి గ్రామంలోని వారి బంధువులు పెళ్లికి హాజరై వ్యాన్‌లో 35 మంది తిరుగు ప్రయూణమయ్యూరు. దన్నోర గ్రామ సమీపంలోని మూలమలుపు వాగు వద్ద వ్యాన్ అతివేగం కారణంగా అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో వ్యాన్‌లో ప్రయూణిస్తున్న వారంతా గాయపడ్డారు. డ్రైవర్ ప్రవీణ్‌తోపాటు పిప్పల్‌కోఠి గ్రామానికి చెందిన మసూద్, భోజమ్మ, భూమక్క, గంగమ్మ, ప్రేమల, మౌనిక, సాగర్ తదితరులు గాయపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రలోని రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న వారిని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి వేర్వేరుగా పరామర్శించారు. సంఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మోహన్ తెలిపారు. వధూవరులకు తప్పిన ప్రమాదం పెళ్లి కుమారుడు వికాష్, పెళ్లికూతురు సరిత ఇదే వ్యాన్‌లో రావాల్సి ఉండగా.. పెళ్లి కుమారుడి ఇంట్లో బోనాలు వేయడానికి వెళ్లారు. అక్కడ ఆలస్యం కావడంతో మరో వాహనంలో వచ్చారు. దీంతో వధూవరులకు ప్రమాదం తప్పింది. -
మానవత్వం మటుమాయం
శ్రీకాకుళం సిటీ : నాగావళి నదీ తీరం (రిమ్స్ ఆస్పత్రి) వెనుక ఓ మృతదేహాన్ని కుక్కలు, పందులు పీక్కుతినడాన్ని చూసిన అటువైపు వెళ్లే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బంధువులకు అప్పగించాల్సిన మృతదేహాన్ని నిర్లక్ష్యంగా పైపైన పూడ్చి పెట్టడంతో ఈ దుస్థితి దాపురించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆమదాలవలస రైల్వేస్టేషన్ రెండో నంబర్ ప్లాట్ ఫాంపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ఈ నెల 15 రాత్రి రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. 16న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. 17వ తేదీ సాయంత్రం రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని వద్ద లభ్యమైన రైల్వే టిక్కెట్ ఆధారంగా గుంటూరు నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు ట్రైన్లో ప్రయాణించినట్టు గుర్తించారు. శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో పత్రికాప్రకటన జారీ చేశారు. రైల్వే పోలీసుల సమక్షంలో పూడ్చివేత రిమ్స్‌లో 17వ తేదీ రాత్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ైరె ల్వే పోలీసుల సమక్షంలో రిమ్స్ వెనుక నాగావళి నదీ తీరాన నదిలో పూడ్చారు. తమ సమక్షంలోనే మృతదేహాన్ని నాగావళి తీరాన పూడ్చామని ఆమదాలవలస రైల్వే హెచ్‌సీ ప్రకాశరావు తెలిపారు. గుంటూరు జిల్లాలో 21న పత్రికల్లో ప్రకటన చూసిన మృతుని కుటుంబ సభ్యులు ఈ నెల 23న శ్రీకాకుళం వచ్చి అధికారులను కలిశారు. మృతుని ఫొటో, అతని దుస్తుల ఆధారంగా మృతదేహం రంగనాథ్‌గా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతుడు గుంటూరు జిల్లాకు చెందిన పట్నాల రంగనాథ్(35), అతని భార్య శ్రీకాకుళం పట్టణానికి చెందినదిగా పోలీసులు నమోదు చేసుకున్నారు. అప్పటికే నాగావళి తీరాన పూడ్చిన మృతదేహాన్ని మళ్లీ బయటకు తీయించారు. మృతదేహాం పూర్తి కుళ్లిపోవడంతో వారు అక్కడే వదిలేసి వెల్లినట్టు తెలిసింది. నిబంధనలేమీ లేవు గుర్తుతెలియని మృతదేహాలను రిమ్స్ మార్చురీలో ఎన్ని రోజులైనా ఉంచవచ్చును. ఇన్ని రోజులే ఉంచాలన్న నిబంధనలు ఏమీ లేవు. మృతుల కుటుంబ సభ్యులు వచ్చే వరకు మార్చురీలోనే ఉంచవచ్చు. ఎవరూ గుర్తించని పక్షంలో పత్రికలకు, రిమ్స్ అవుట్ పోస్టు పోలీసులకు, మున్సిపాలిటీకి రిమ్స్ నుంచి సమాచారాన్ని తెలియజేస్తాం. డా.సునీల్‌నాయక్, సూపరిండెంటెంట్, రిమ్స్ -
ఎజైల్ సంస్థపై వేటు!
శ్రీకాకుళం సిటీ : రిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాలల్లో పని చేస్తున్న ఎజైల్ ఏజెన్సీపై వేటుకు రంగం సిద్ధమైంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు రిమ్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రిల్లో సేవలందిస్తున్న ఎజైల్ కంపెనీలపై వేటుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తాజాగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఓ చారిటబుల్ ట్రస్ట్ పరిధిలోకి ఆస్పత్రిలో పారిశుధ్యం, సెక్యూరిటీ సేవలు తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త ఏజెన్సీని ప్రభుత్వం అవకాశం ఇవ్వనున్న నేపథ్యంలో రిమ్స్‌లో సేవలందిస్తున్న ఎజైల్ ఏజెన్సీకి ఇప్పటికే మెయిల్ చేసినట్లు రిమ్స్ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రిమ్స్‌లో సుదీర్ఘ కాలంగా, ఈ ఏజెన్సీ పరిధిలో సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. రిమ్స్‌లో ఎజైల్ పరిధిలో 130 మంది ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు, సెక్యూరిటీ సేవలు విస్తరించేందుకుగాను 2014 అక్టోబర్ నెల నుంచి మూడేళ్ల కాలపరిమితితో ఎజైల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి పైగా కాల పరిమితి ఉంటుండగా మార్చి 1వ తేదీ నుంచి తొలగించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఏజెన్సీ స్థానిక ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రి, కళాశాలల్లో మొత్తంగా సెక్యూరిటీ 42 మంది, 88 మంది పారిశుధ్య సిబ్బంది ఇప్పటివరకు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏజెన్సీకి ప్రభుత్వం ప్రతీ నెలా రూ.24 లక్షల వరకు చెల్లిస్తుంది. ఈ ఏజెన్సీ పరిధిలో పని చేస్తున్న వారికి పీఎఫ్, ఈఎస్ఐతో పాటు పలు సౌకర్యాలు కలిపి రూ.8,500 వేతనం చెల్లిస్తున్నారు. అసలు కథ ఇదీ... రాష్ట్ర స్థారుులో కీలక బాధ్యతలు నిర్వహించే వ్యక్తికి సంబంధించినదిగా చెప్పుకొనే ఓ చారిటబుట్ ట్రస్ట్‌కు ఆస్పత్రుల పారిశుధ్యం, సెక్యూరిటీ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రిమ్స్‌లో రెండురోజులుగా ప్రచారం జరుగుతోంది. ముందుగా డీఎంఈ పరిధిలో ఉండే వైద్య కళాశాలల్లో వీటిని అమలు చేసి క్రమంగా జిల్లాలో సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో అమలుకు నిర్ణయించారు. ఇప్పటికే రిమ్స్‌కు డీఎంఈ నుంచి దీనిపై స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఏజెన్సీ ప్రతినిధులకు రిమ్స్ యంత్రాంగం కూడా మార్చి నెల నుంచే ప్రత్నామ్నాయాలు చూసుకోవల్సిందిగా ఆదేశిస్తూనే ఆ సంస్థ (హైదరాబాదు) ప్రతినిధులకు ఓ మెయిల్ కూడా చేశారు. ఒక్క రిమ్స్‌లోనే కాకుండా జిల్లాలో ఏరియా ఆస్పత్రులైన టెక్కలిలో 60 మంది, పాలకొండలో 48 మంది, రాజాంలో 30 మంది వరకు ఎజైల్ పరిధిలో పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బంది పని చేస్తున్నారు. కాగా సెక్యూరిటీ సిబ్బందిని పూర్తిగా తొలగించి వారి స్థానంలో ఎక్స్సర్వీస్మెన్లకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వాసుపత్రుల్లో తీసుకొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తాజాగా తెలిసింది. నోటీసులు ఇచ్చాం... ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో డెరైక్టర్ ఎజైల్ కంపెనీ ప్రతినిధులకు ఈ సమాచారాన్ని తెలియజేశారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ ఏజెన్సీ బదులుగా ప్రభుత్వం సూచించిన కొత్త ఏజెన్సీకి అవకాశం ఇవ్వనున్నారు. డీఎంఈ నుంచి రిమ్స్‌కు ఆదేశాలు వచ్చాయి. -డా. సునీల్‌నాయక్, రిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కాంట్రాక్టు పూర్తి కాలేదు... ప్రభుత్వాస్పత్రుల్లో తమ సేవలకు సంబంధించి 2017వరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మార్చి నెల నుంచి కొత్త ఏజెన్సీకి అవకాశం ఇవ్వనున్నట్లు రిమ్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయమై తమ ఉన్నతాధికారులకు రిమ్స్ యంత్రాంగం మెయిల్స్ కూడా చేసింది. కొత్త ఏజెన్సీ పేరుతో తమకు వేటు వేస్తే ఎలా.. దువ్వ శేషు, రిమ్స్ ఎజైల్ సంస్థ పీఆర్వో, -
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
మదనపల్లె రూరల్: చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం రామిగానిపల్లె సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో రిమ్స్‌లో పని చేస్తున్న దంపతులు తీవ్ర గాయాలపాలయ్యారు. వైఎస్సార్ జిల్లా రిమ్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆవుల విజయచంద్రారెడ్డి(38), ఆయన భార్య ఆశారమణి(36) కారులో బెంగళూరుకు వెళ్తున్నారు. అర్థరాత్రి సమయంలో వారి వాహనం రామిగానిపల్లె వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన లోయలోకి దూసుకెళ్లింది. దీనిని గమనించిన సంబంధిత లారీ డ్రైవర్ అక్కడే తన వాహనాన్ని నిలిపి 108కు ఫోన్ చేయటంతో పాటు గ్రామస్తులను అప్రమత్తం చేశాడు. వారంతా అక్కడికి చేరుకుని జేసీబీ సాయంతో నాలుగు గంటల పాటు శ్రమించి దంపతులను బయటకు తీయగలిగారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ముందుగా మదనపల్లె ఆస్పత్రికి, అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. -
చికిత్స పొందుతూ తిరుమలరావు మృతి
-
విషజ్వరాలకు ప్రత్యేక వైద్యం
- వెయ్యి మలేరియా, 100 డెంగీ కిట్స్ సరఫరా - 80 కొత్తపడకల ఏర్పాటు, 50 పడకలకు ఆర్డర్ - అందుబాటులో 400 ఫాల్సిపేరస్ ఇంజక్షన్లు - డీఎంఈ నుంచి 250 రక్తంబాటిళ్లు సరఫరా - రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్ ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లాలో రోజు రోజుకు విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లాకే తలమానికమైన రిమ్స్ ఆస్పత్రికి వందల సంఖ్యలో రోగులు వరుస కడుతున్నారు. వీరిలో అధిక శాతం గిరిజన ప్రాంతాల వారే ఉంటున్నారు. రిమ్స్‌లో 650 మంది రోగులు ఉండగా.. 250 మంది జ్వర పీడితులే కావడం గమనార్హం. మలేరియా, డెంగీ, వైరల్ ఫీవర్‌తో ఆస్పత్రిలో చేరుతున్నారు. వీరందరికీ 24 గంటలు వైద్యసేవలు అందించేందుకు, అన్ని సదుపాయాలు కల్పించేందుకు ఆస్పత్రి వర్గాలు ముందుకు సాగుతున్నాయి. కలెక్టర్ జగన్మోహన్ రిమ్స్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. రోగులకు ఎలాంటి వైద్యసేవలు అందిస్తున్నారనే వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రిమ్స్‌లో రోగులకు అందుతున్న వైద్యసేవలు, వారికి కల్పిస్తున్న సదుపాయాలపై రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. విషజ్వర పీడితులకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రశ్న : జ్వరాలతో ఎంతమంది రోగులు చికిత్స పొదుతున్నారు. జవాబు : ఆస్పత్రిలో 250 మంది జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. ఇందులో 10 మలేరియా, ఐదు డెంగీ, 235 వైరల్ ఫీవర్ కేసులు ఉన్నాయి. జ్వరాల కు సంబంధించి నాలుగు వార్డులు ప్రత్యేకంగా ఏర్పా టు చేశాం. మరొకటి గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే వారికి అందుబాటులో ఉంచాం. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతవాసులే 60 మంది చికిత్స పొందుతున్నారు. ప్ర : రోగులకు సరిపడా పడకలు అందుబాటులో ఉన్నాయా.. జ : నూతన పడకల కోసం జిల్లా కలెక్టర్ జగన్మోహన్ రూ.4 లక్షల చెక్కు అందజేశారు. వంద పడకలు కొనుగోలు చేశాం. ఇప్పటికే 80 పడకలు ఏర్పాటు చేశాం. 20 పడకలు సిద్ధమవుతున్నాయి. ఇవేకాకుండా 30 పడకలు అద్దెకు తీసుకువచ్చాం. ప్ర : మందుల కొరత లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. జ : సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని ఎలాం టి మందుల కొరత లేకుండా చూస్తున్నాం. ట్యాబ్లెట్‌తోపాటు మలేరియాకు సంబంధించిన 400 ఫాల్సిపేరస్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాం. ఇతర జ్వరాలకు సంబంధించి 400 క్వినీన్ శ్యాంపుల్స్, 50 ఈమాల్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు సీడీసీ నుంచి మందులు తెచ్చుకోవడం జరుగుతుంది. ప్ర : మలేరియా కిట్స్ కొరత ఉందా.. జ : ప్రస్తుతం ఐటీడీపీఓ ద్వారా వెయ్యి మలేరియా కిట్స్ అందాయి. డెంగీకి సంబంధించి 500 ఎలిసా టెస్ట్ కిట్స్ అందుబాటులో ఉన్నాయి. రోగులు రిమ్స్‌కు వచ్చిన వెంటనే వారికి టెస్టు చేసి వ్యాధిని నిర్ధారిస్తున్నాం. వ్యాధి నిర్ధారణ అనంతరం వైద్య పరీక్షలు చేసి వార్డుకు పంపిస్తున్నాం. ప్ర : ఇతర ప్రాంతాలకు రోగులను రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జ : ఇప్పుడు రెఫరల్ కేసులు పూర్తిగా తగ్గించాం. ఎలాంటి వైద్యం అవసరమున్నా ఇక్కడే చేస్తున్నాం. రక్త పరీక్షల నుంచి వైద్య చికిత్స వరకు అన్ని అందుబాటులో ఉంచాం. ప్రతి రోజు రిమ్స్ నుంచి రెఫర్ కేసుల వివరాలు కలెక్టర్‌కు నివేదిస్తున్నాం. మలేరియా, డెంగీ వంటి జ్వరాల కేసులు కాకుండా రిమ్స్‌లో అందుబాటులో లేని వైద్య పరీక్షలకు మాత్రమే రెఫర్ చేస్తున్నాం. ప్ర : వైద్యుల పర్యవేక్షణ ఎలా ఉంది. జ : సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రిమ్స్‌లో నీలోఫర్, ఉస్మానియా వైద్య బృందం చికిత్స చేస్తున్నారు. 11 మంది సభ్యుల ఉస్మానియా బృందం రోగులకు చికిత్స అందిస్తోంది. మరో పది రోజులపాటు వీరు రిమ్స్‌లోనే ఉంటారు. 24 గంటలు రోగుల పర్యవేక్షలో వైద్యులను ఉంచుతున్నాం. ప్ర : రక్తహీనత రోగులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. జ : ప్రస్తుతం రక్తహీనతతో చాలామంది రోగులు వస్తున్నారు. వీరి కోసం ఉచితంగా రక్తాన్ని ఎక్కిస్తున్నాం. రిమ్స్‌లో వివిధ రక్తగ్రూప్లతో 145 రక్తం బాటిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవేకాకుండా డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నుంచి మరో 250 రక్తం బాటిళ్లు త్వరలో రిమ్స్‌కు రానున్నాయి. ఒకవేళ కావాల్సిన గ్రూప్ రక్తం అందుబాటులో లేకుంటే రెడ్‌క్రాస్‌ను సంప్రదిస్తాం. ప్ర : రోగుల బంధువులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. జ : రోగులతో ఉండే బంధువుల్లో ఒకరికి భోజన వసతి కల్పిస్తున్నాం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడుతున్నాం. రోగుల సహాయార్థం భోజన శాల కూడా ఏర్పాటు చేశాం. -
బిడ్డను మార్చి ఇచ్చారు
ఆదిలాబాద్ : బిడ్డ ఆరోగ్యం బాలేదని ఆస్పత్రికి తీస్కుని వెళ్తే.. బిడ్డను మార్చి ఇచ్చిన సంఘటన అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... నాందేడ్ మండలం కిన్వత్ గ్రామానికి చెందిన ఆదివాసి దంపతులు వైశాలి, గజానంద్‌లకు మూడు రోజుల కిందట మగబిడ్డ జన్మించాడు. కాగా బాబు అనారోగ్యంతో ఉండటంతో వైద్యం చేయించుకోవడానికి ఆదివారం రిమ్స్‌కు వెళ్లారు. అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు బాబును ఐసీయూలో ఉంచి.. సాయంత్రం మరో పిల్లాణ్ణి చేతికి ఇచ్చి పంపారు. ఈ బాబు మా బాబు కాదు అని తల్లిదండ్రులు నెత్తీ నోరు బాదుకున్నా వినకుండా.. వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారు సోమవారం ఉదయం రిమ్స్ చైర్మన్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఆదివాసులంతా కలిసి ఆందోళన చేపడుతున్నారు. -
ఎందుకంత తొందర?
శ్రీకాకుళం : శ్రీకాకుళం రిమ్స్ వైద్యశాలలో ఈ నెల 15న ఓ గర్భిణీకి చికిత్స అందించడంలో అలసత్వం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ప్రదర్శించిన అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిమ్స్‌లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం కొత్త కాదు. ఎప్పుడూ స్పందించని రిమ్స్ అధికారులు ఇప్పుడు ఆదుర్దాగా విచారణ జరిపించి ఓ వైద్యాధికారి, స్టాఫ్ నర్సు, ప్రసూతి సహాయకురాలు, ఆయాలను సస్పెండ్ చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. జరిగిన సంఘటనపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించిన తరువాత రిమ్స్ అధికారులు కూడా కంగారుగా విచారణ జరిపించడం చర్చనీయాంశమైంది. రిమ్స్ అధికారులు తమ వారిని రక్షించుకునేందుకే ఇలాం టి చర్యలు చేపట్టారని ఆక్షేపణలు విన్పిస్తున్నాయి. సస్పెండ్ అయిన వైద్యురా లు రెగ్యులర్ కూడా కాదు. ఆమె శిక్షణకోసం వచ్చారు. అటువంటి ఆమెకు రెగ్యులర్ డ్యూటీ ఎలా వేశారు? ఎవరు వేశారు? అనే దానిపై వారు ప్రస్తావించనేలేదు. రిమ్స్ అధికారులు సంఘటనకు సంబంధించి విచారణ అధికారిగా నియమించిన డాక్టర్ అరవింద్ ఆ రోజు ప్రసూతి వార్డులో ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు సమాచారం. డాక్టర్ అరవింద్‌ను రక్షించేందుకే విచారణాధికారిగా ఆయన్ను నియమించారన్న ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ నియమించిన విచారణాధికారులు డాక్టర్ అరవింద్ ప్రసూతి వార్డులో ఆ రోజు విధులు నిర్వర్తించాల్సి ఉన్నట్టు గుర్తించగా తాను విధులకు హాజరు కాలేక డాక్టర్ ఏపీ ప్రసాద్‌కు ఆ బాధ్యతలను అప్పగించామని అరవింద్ చెప్పినట్టు సమాచారం. అది లిఖితపూర్వకంగా లేకపోవడం, ఏపీ ప్రసాద్ అది వాస్తవం కాదని చెప్పడంతో అరవిందే బాధ్యుడని విచారణాధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. కలెక్టర్ నియమించిన అధికారుల కమిటీ నివేదిక ఇవ్వకముందే తామే చర్యలు తీసుకుంటే ఉన్నతాధికారులను దృష్టి మళ్లించవచ్చన్న ఉద్దేశ్యంతోనే రిమ్స్ అధికారు లు ముందస్తుగా కలెక్టర్‌కు నివేదికను సమర్పిస్తూ వైద్యురాలిని, సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు చెప్పినట్టు పలువురు అంటున్నారు. దీనిపై రిమ్స్ డైరక్టర్ డాక్టర్ జయరాజ్ వద్ద సాక్షి ప్రస్తావించగా ఎవరిని రక్షించడానికో విచారణ జరిపించలేదన్నారు. సంఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించాననీ, ఆ రోజు డాక్టర్ అరవింద్ డ్యూటీ డాక్టర్ అని తన దృష్టికి రాలేదని తెలిపారు. విచారణాధికారులనివేదిక ఆధారంగానే చర్యలు తీసుకున్నానని తెలిపారు. -
జీవితఖైదీ ఆత్మహత్యాయత్నం
వైఎస్సార్ జిల్లా: కడప కేంద్ర కారాగారంలో కృష్ణమూర్తి అనే జీవితఖైదీ ఆదివారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కృష్ణమూర్తిని హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈయన భార్యను చంపిన కేసులో జీవితఖైదు అనుభవిస్తున్నాడు. గత నెల మార్చి 14న జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పిచ్చారు. తీవ్ర మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు జైలు అధికారులు చెబుతున్నారు. -
అమ్మకు మేమున్నాం..
ఒంగోలు టౌన్: ‘అమ్మను వదిలించుకున్నాడు’ అంటూ ‘సాక్షి’ దినపత్రికలో గురువారం ప్రచురితమైన కథనానికి పలువురు మానవతావాదులు స్పందించారు. టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన గుమ్మళంపాడు ఆదెమ్మ(72) అనే వృద్ధురాలిని ఐదురోజుల క్రితం ఆమె కుమారుడు మోటార్ సైకిల్‌పై తీసుకువచ్చి రిమ్స్ ముందు వది లేసి వెళ్లాడు. ఐదు రోజుల నుంచి ఆ తల్లి అన్నపానియాలు లేకుండా సైకిల్ స్టాండు కింద ఒంటరిగా చలిలో వణుకు తూఉంది. ఆ తల్లి దీనగాథపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన ఒంగోలులోని పొనుగుపాటినగర్‌కు చెందిన కసుకుర్తి కోటమ్మ అనే మహిళ ఉదయాన్నే రిమ్స్ హాస్పిటల్ వద్దకు చేరుకొని ఆ తల్లిని ఆదరించారు. పొనుగుపాటినగర్‌లో ఉన్న ఉషోదయ వృద్ధాశ్రమంలో చేర్చేందుకు సిద్ధమైంది. ఆమెకు అప్పహారం అందిస్తున్న సమయంలో ఆదెమ్మ మనవరాలు హడావుడిగా ఆటోలో వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లిపోయారు. ఒంగోలు టౌన్: ‘అమ్మను వదిలించుకున్నాడు’ అంటూ ‘సాక్షి’ దినపత్రికలో గురువారం ప్రచురితమైన కథనానికి పలువురు మానవతావాదులు స్పందించారు. టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన గుమ్మళంపాడు ఆదెమ్మ(72) అనే వృద్ధురాలిని ఐదురోజుల క్రితం ఆమె కుమారుడు మోటార్ సైకిల్‌పై తీసుకువచ్చి రిమ్స్ ముందు వది లేసి వెళ్లాడు. ఐదు రోజుల నుంచి ఆ తల్లి అన్నపానియాలు లేకుండా సైకిల్ స్టాండు కింద ఒంటరిగా చలిలో వణుకుతూ ఉంది. ఆ తల్లి దీనగాథపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన ఒంగోలులోని పొనుగుపాటినగర్‌కు చెందిన కసుకుర్తి కోటమ్మ అనే మహిళ ఉదయాన్నే రిమ్స్ హాస్పిటల్ వద్దకు చేరుకొని ఆ తల్లిని ఆదరిం చారు. పొనుగుపాటినగర్‌లో ఉన్న ఉషోదయ వృద్ధాశ్రమంలో చేర్చేందుకు సిద్ధమైంది. ఆమెకు అప్పహారం అందిస్తున్న సమయంలో ఆదెమ్మ మనవరాలు హడావుడిగా ఆటోలో వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లిపోయారు. -
మళ్లీ అడుగంటిన రక్త నిల్వలు
జిల్లాకు పెద్ద దిక్కు రిమ్స్ ఆసుపత్రి. రోగం ముదిరినా ... రోడ్డు ప్రమాదం జరిగినా ప్రాణం కాపాడుకోవడానికి ఎంతో ఆశతో వస్తారు ... కానీ ఇక్కడే రిక్తహస్తం ఎదురైతే... అదే జరుగుతోంది... నిధులు లేక ఆధునిక వైద్య పరికరాలు లేకపోతే సర్లే అనుకోవచ్చు ... వైద్య నిపుణుల నియామకం లేకపోతే ఉన్నవాళ్లతో ఏదోలా వైద్యం చేయించుకోవచ్చు ... కానీ ఉండాల్సిన రక్త నిల్వలే కొరవడితే ఎవరిదీ పాపం? సరిగ్గా ఆరు నెలల కిందట ఇదే పరిస్థితి తలెత్తితే తొలుత సమస్య తీవ్రతను ‘సాక్షి’ గుర్తించింది. ఈ సమస్యను వార్తగా కాకుండా సామాజిక బాధ్యతగా తీసుకుంది. వరుస కథనాలతో ఇటు అధికార యంత్రాంగాన్ని, అటు స్వచ్ఛంద సంస్థలను, కళాశాల ప్రతినిధులను కదిలించింది. సమస్య తీవ్రతను తెలుసుకున్నవాళ్లంతా తలో చేయి వేశారు. రక్తదాన శిబిరాలతో తమ దాతృత్వాన్ని చూపించారు. జిల్లా కలెక్టర్ విజయకుమార్, అప్పటి డీఎంహెచ్ఓ, ఇతర అధికారులు నడుం బిగించి ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఆగిపోతున్న శ్వాసకు బాసటగా నిలిచారు. ఆ సంతోషం పట్టుమని ఆరునెలలు కూడా మిగలలేదు. సజావుగా సాగుతుందనుకున్న బ్లడ్ బ్యాంకులకు మళ్లీ రక్త హీనత ఏర్పడింది. మిణుకు, మిణుకుమంటూ కొట్టుమిట్టాడుతున్న పెద్దప్రాణానికి చేతులొడ్డాల్సిన తరుణం ఆసన్నమయింది. ఒంగోలు సెంట్రల్ : రిమ్స్ రక్త నిధిలో ప్రతి రోజూ 50 యూనిట్లకు తక్కువకాకుండా రక్తం నిల్వ ఉండాలి. కానీ 30 యూనిట్ల రక్తం ఉండడడం గనమవుతోంది. అధికారుల నిర్లక్ష్య ఫలితమే దీనికి కారణం. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌కు చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ ఉండటంతోపాటు జెడ్పీ సీఈఓ ఇన్చార్జిగా ఉన్నారు. స్టెప్ అధికారులు, ఇతర స్వచ్ఛంద సంస్థలు రెడ్ క్రాస్కే వచ్చిన రక్తం తరలిస్తుండడంతో అక్కడి బ్లడ్‌బ్యాంక్‌లో నిల్వలు మాత్రం ప్రజల అవసరాలకు సరిపోతున్నాయి. అంటే 35 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంటోంది. కానీ రిమ్స్ రక్తనిధి మాత్రం నిండుకుంది. ఇలా తగ్గుతున్న సమయంలోనే సంబంధిత రిమ్స్ అధికారులు గుర్తించి పరిస్థితి తీవ్రతను కనీసం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను చక్కదిద్దాలి. నిర్లక్ష్యం ఆవహించడంతో చేతులు కాలుతున్నా చర్యలు మాత్రం లేకపోవడంతో ఆ పరిస్థితి ఏర్పడుతోంది. గత నెలలో రెండు క్యాంపులు నిర్వహించినా కేవలం 44 యూనిట్ల రక్తం మాత్రమే సమకూరింది. అన్ని పరీక్షలు చేసి 40 యూనిట్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి రోజూ 50కిపైగా శస్త్రచికిత్సలు రిమ్స్‌లో ప్రతి రోజూ 50కిపైగా శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. ఇన్ పేషంట్లుగా ఉన్న కొన్ని రకాల వ్యాధులతో బాధ పడుతున్న వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. వీటికితోడు రెండు సిజేరియన్ కాన్పులు, మరో నాలుగు సహజ కాన్పులు జరుగుతుంటాయి. జిల్లాలో జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలు, ఇతరత్రా రోడ్డు ప్రమాదాలు, ఘర్షణలతో ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య ప్రతిఏటా పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో రక్తం అందుబాటులో లేకపోవడంతో నిలవాల్సిన ప్రాణం కూడా గాలిలో కలిసిపోతోంది. ‘ప్రయివేటు’వైపు వైపు పరుగులు ప్రభుత్వ ఆసుపత్రుల బలహీనతలను ఆసరా చేసుకొని ప్రయివేటు బ్లడ్ బ్యాంకులు దోపిడీకి తెరదీస్తున్నాయి. రోగి అవసరాన్ని బట్టి వారి బంధువుల వద్ద నగరంలోని ప్రయివేటు బ్లడ్ బ్యాంకులు నిర్ణీత ధరకంటే అధికంగా వసూలు చేస్తున్నారు. యూనిట్‌కు రూ.3 వేలు, అవసరమైన గ్రూపు రక్తం కావాలంటే ఇంకా అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఎవరైనా రక్తం ప్యాకెట్ కోసం వస్తే అదే పరిణామంలో రక్తం ఇస్తే డబ్బులు చెల్లించనవసరం లేదు. దీన్నే రిప్లేస్మెంట్ అంటారు. కానీ కొన్ని ప్రయివేటు బ్లడ్‌బ్యాంకులు మాత్రం రీ ప్లేస్‌మెంట్‌కు ససేమిరా అంటున్నాయి. డబ్బులు చేతిలో పడితేనే బ్యాగ్ ఇస్తామనడంతో పేదల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. ప్రజల్లో రక్తదానంపై అవగాహన కల్పించి చైతన్యం రగిలించాల్సిన రక్త నిధి కేంద్రాల్లో పని చేస్తున్న మోటివేటర్స్ ఆ బాధ్యతనే విస్మరిస్తున్నారు. కొరత వాస్తవమే, అందరూ స్పందించాలి. డాక్టర్ అదిలక్ష్మి ఎం.డి రిమ్స్, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి రక్తం తక్కువ ఉన్న మాట నిజమే. రీ ప్లేస్ మెంట్ విధానం ద్వారానే రక్తాన్ని సేకరిస్తున్నాం. ఉద్యోగులు, విధ్యార్దులు స్పందించి రక్తదానం చేస్తే ఆపదలో ఉన్నవారికి సహాయం చేసినవారవుతారు. రక్తదానంతో మరింత ఆరోగ్యం రక్తదానం చేస్తే బలహీనమైపోతామనే భయం చాలా మందిలో ఉంది. ఆరోగ్యంగా ఉన్న స్త్రీ పురుషులు 18-60 సంవత్సరాల వయస్సులోపుండీ 45 కేజీలకుపైగా బరవున్న వారరందరూ రక్తం ఇవ్వవచ్చు. సంవత్సరానికి మూడుసార్లు ఇస్తే ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు వైద్య నిపుణులు. -
లారీ-ఇన్నోవా ఢీ; ఇద్దరు మృతి
శ్రీకాకుళం: జిల్లాలోని లావేరు మండలం సుభద్రాపురం వద్ద రాత్రి 3 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రగాయాలయ్యాయి. ఆగివున్న లారీని ఇన్నోవా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతులు సారవకోట మండలం కుమ్మరిగుంటకు చెందిన భార్యభర్తలు జంగం కృష్ణమూర్తి, సావిత్రిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
రిమ్స్‌లో చిన్నారి మృతి
ఆదిలాబాద్ రిమ్స్ : సకాలంలో వైద్యం అందక ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన సోమవారం రిమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. రిమ్స్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే చిన్నారి చనిపోయిందుంటూ బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకెళ్తే.. బేల మండలం కొగ్ధూర్ గ్రామానికి చెందిన చంద్రకాంత్ తన కూతురు అక్షర (5)ను జ్వరంతో బాధపడుతుండగా ఆదివారం అర్ధరాత్రి రిమ్స్‌కు తీసుకొచ్చాడు. క్యాజువాలిటీ వైద్యుడు చూసి చిన్నపిల్లల వార్డులో అడ్మిట్ చేశారు. ఓ రెండు సెలైన్లు ఎక్కించి నర్సులు చేతులు దులుపుకున్నారని, పరిస్థితి విషమించినా సదరు వైద్యులకు సమాచారం అందించలేదని మృతురాలి తండ్రి ఆరోపించారు. రాత్రి నుంచి ఉదయం వరకు అదే పరిస్థితి ఉన్నా ఇక్కడి నర్సులే వైద్యం అందించారని, వైద్యులు మాత్రం రాలేదని అన్నాడు. సోమవారం ఉదయం 10 గంటలకు వచ్చిన సంబంధిత వైద్యుడు చిన్నారిని పరీక్షించిన అరగంటకే చనిపోయిందని చెప్పాడు. వైద్యులు సకాలంలో స్పందించకనే తమ కూతురు చనిపోయిందని ఆ తల్లిదండ్రులు రోదిస్తూ తెలిపారు. విషయం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు రిమ్స్‌లో పెద్ద ఎత్తున మొహరించారు. అయితే.. తనకు రాత్రి సమాచారం అందిస్తే వచ్చి ఉండేవాడినని సంబంధిత వైద్యుడు పేర్కొన్నాడు. -
చూపు కోసం వస్తే.. ఉన్న చూపు పాయె..
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి మరోసారి వివాదంలోకెక్కింది. కంటి చూపు కోసం వస్తే.. ఉన్న చూపును కోల్పోయింది ఓ వృద్ధురాలు. రిమ్స్‌లో మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన 55 ఏళ్ల వృద్ధురాలు కె. గంగమ్మ కంటిచూపు సరిగా కనబడడం లేదని ఈ నెల 9న రిమ్స్ ఆస్పత్రికి వచ్చింది. కంటిపై పొర వచ్చిందని వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆపరేషన్ అయినప్పటి నుంచి ఆమె అస్వస్థతకు గురవుతూ వచ్చింది. రెండు రోజుల పాటు వాంతులు, విరేచనాలు చేసుకుంది. వాటిని ఎలాగొలా నయం చేశారు. కాగా, మూడో రోజు ఆపరేషన్ అయిన ఎడమ కంటి నుంచి చీమురావడం మొదలైంది. ఆందోళనకు గురైన వృద్ధురాలి బంధువులు సదరు వైద్యుడి వద్దకు వెళ్లి ఆరా తీయగా అసలు విషయం బయటికొచ్చింది. కంటిచూపు పోయిందని, వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని వైద్యుడు బంధువులకు సూచించాడు. శనివారం ఆస్పత్రికి వచ్చిన వైద్యుడు వృద్ధురాలికి డిశ్చార్జి కార్డు రాసి పడకపై పెట్టి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న బంధువులు తమకు న్యాయం చేయాలని, వైద్యుడి నిర్లక్ష్యంతోనే కంటి చూపు పోయిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రిమ్స్ సమీక్ష సమావేశానికి వచ్చిన మంత్రి జోగురామన్న, డీఎంఈ శ్రీనివాస్‌ను కలిసి విన్నవించారు. స్పందించిన మంత్రి, డీఏంఈలు దీనిపై పూర్తి విచారణ చేపట్టి, చూపుపోయిన గల కారణాలు తెలుసుకున్న తర్వాతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోగికి హైదరాబాద్‌లో వైద్యం అందించేందుకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ క్లినిక్‌లో పరీక్షలు.. రిమ్స్‌లో ఆపరేషన్ ఆదిలాబాద్ పట్టణంలోని సదరు వైద్యుడి ప్రైవేట్ ఐ క్లినిక్‌కు గంగమ్మను డిసెంబర్ 4న కంటీ పరీక్షల కోసం తీసుకెళ్లామని ఆమె బంధువులు కళ, లక్ష్మి, జగన్నాథ్, సాయన్న పేర్కొన్నారు. అక్కడ పరీక్షలు చేసిన తర్వాత కంటి పొర వచ్చిందని రిమ్స్‌కు వస్తే ఆపరేషన్ చేస్తానని చెప్పడంతో రిమ్స్‌కు తీసుకొచ్చామని అన్నారు. రక్త పరీక్షలు చేసి అన్నీ సరిగా ఉన్నాయని తేలిన తర్వాతే మంగళవారం కంటి ఆపరేషన్ చేశారని తెలిపారు. ఆపరేషన్ అయినప్పటి నుంచి గంగమ్మ ఆరోగ్యం దెబ్బతిందన్నారు. మూడు రోజుల సెలాయిన్లు పెడుతూ అక్కడి నర్సులు మాత్రమే పరిస్థితిని చూశారని, ఆపరేషన్ చేసిన వైద్యుడు మాత్రం రాలేదన్నారు. కంటి నుంచి చీము కారుతుందని ఆపరేషన్ చేసిన డాక్టర్ వినయ్‌కుమార్ క్లినిక్‌కు తామే స్వయంగా వెళ్లి అడిగితేనే అసలు విషయం చెప్పాడని పేర్కొన్నారు. మరో ఏదో జబ్బు ఉందని, రిమ్స్‌లోనే ఉంచితే ఇంకో కంటికి కూడా చూపు పోయే ప్రమాదం ఉందని, వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని చెప్పారని వివరించారు. అయితే కంటి ఆపరేషన్‌కు ముందు చూపు సరిగా ఉందని, ఆపరేషన్ తర్వాతే చూపు పోవడంతో పాటు ఇతర సమస్యలు ఏర్పడ్డాయని వారు పేర్కొన్నారు. సదరు వైద్యుడి నిర్లక్ష్యంతోనే కంటి చూపు పోయిందని వారు ఆరోపించారు. దీనికి కారణమైన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆమె బంధువులు డిమాండ్ చేశారు. ఇక.. ఆ అవ్వకు దిక్కెవరు కంటి చూపు కోల్పోయిన వృద్ధురాలు గంగమ్మకు భర్త, పిల్లలు లేరు. ఆమె ఒక్కరే కూలీనాలీ చేస్తూ జీవనం గడుపుతోంది. ఆమెకు కంటి పరీక్షలు చేయించేందుకు కూడా భర్త బంధువులు, మనవాళ్లు ఆస్పత్రికి తీసుకొచ్చారు. వీటికి సంబంధించి డబ్బులు కూడా వారే భరించారు. ప్రస్తుతం ఆమెకు కంటి చూపు పోవడంతో ఆ కాస్త కూలీ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటి వరకు ఎలాగొలా జీవితం నెట్టొకొచ్చిన ఆమెకు ఈ సంఘటన జరగడంతో బంధువులపై ఆధారపడాల్సి వచ్చింది. కంటి చూపు కోసం నాణ్యమైన వైద్యం చేయించుకునేంత స్థోమత కూడా వృద్ధురాలికి లేదు. ప్రభుత్వం తనకు జరిగిన అన్యాయం చూసి వైద్యం అందించాలని ఆమె బంధువులు కోరుతున్నారు. -
రెండు బైక్‌లు ఢీ; ఇద్దరు మృతి
ప్రకాశం: జిల్లాలోని చీమకుర్తి మండలం రామతీర్థం వద్ద గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చీమకుర్తి మండలం, రామతీర్థం వద్ద ఎదురెదుగా వెళ్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
పేరుకే పే..ద్ద ఆస్పత్రి
* రిమ్స్‌లో సకాలంలో అందని వైద్యం * నేలపైనే గర్భిణి ప్రసవం * అరగంటకుపైగా నరకయాతన * వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపాటు ఆదిలాబాద్ రిమ్స్ : కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రిమ్స్ ఆస్పత్రికి అధునాతన వైద్యం అందుతుందనే ఆశతో రోగులు వస్తే నిరాశే ఎదురవుతోంది. అసలే సౌకర్యాలు లేని ఈ ఆస్పత్రికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం తోడవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రినే దేవాలయంలా భావించి ఇక్కడికి వచ్చే ప్రజల పట్ల మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో రిమ్స్ అభాసుపాలవుతోంది. శనివారం రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ నిండుచూలాలు నేలపైనే ప్రసవించాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉండగా.. ఆ పరిస్థితిలో ఆమె అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. తమ బాధ్యతను విస్మరించిన వైద్యులు, సిబ్బంది ఏం పట్టనట్లుగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడ్డారు. నిండు చూలాలి నరకయాతన.. తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన గోరిబి తన కూతురు రిజ్వానను ఆస్పత్రికి తీసుకొచ్చింది. నిండు చూలాలైన ఆమెను రిమ్స్‌కు తీసుకురాగానే ఓపీ విభాగంలో పేరు నమోదు చేయించింది. రశీదు తీసుకున్న అనంతరం సంబంధిత వైద్యుని వద్దకు వెళ్లారు. అక్కడ ఆ వైద్యుడు చూడకుండానే రశీదును చూసి తన కేసు కాదని.. మరో వైద్యుని వద్దకు వెళ్లాలని పంపించాడు. దీంతో సదరు వైద్యుడి గది తెలియక తన కూతురును పట్టుకుని తల్లి గోరిబి ఆస్పత్రి అంతా తిరిగింది. అప్పటికే నొప్పులు రావడంతో ఓపీ విభాగంలోని పై అంతస్థులో గల ఏఆర్టీ సెంటర్ వద్ద ఆ గర్భిణి పడిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఎన్నో అవస్థలు పడి నేలపైనే ప్రసవించింది. అరగంటకు పైగా నరకయాతన అనుభవించి ఓ పాపకు జన్మనిచ్చింది. ఇంతటి ఘోరం జరుగుతున్నా అక్కడి సిబ్బందికి, వైద్యులకు సమాచారం లేకపోవడం గమనార్హం. ఆస్పత్రికి వచ్చిన కొంత మంది స్థానికులు రిమ్స్ ఆర్ఎంవో వినాయక్కుమార్కు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి సిబ్బంది పంపించాడు. తల్లీబిడ్డలను మెటర్నిటీ వార్డుకు తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు. రిమ్స్‌కు వస్తే బిక్కుబిక్కే.. జిల్లా రిమ్స్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే వారిలో సగానికిపైగా గ్రామీణ పేద ప్రజలే. ఇక్కడికి వచ్చే వారిలో చాలా మందికి ఆస్పత్రిలో ఎక్కడికి పోతే వైద్యం అందుతుందో తెలియదు. ఆస్పత్రికి వచ్చిన తర్వాత వైద్య పరీక్షల కోసం గంటల తరబడి తిరగాల్సిందే. ఇక నిరాక్షరాస్యులు ఆస్పత్రికి వస్తే అంతే సంగతి. ఒక రోజులో వారికి వైద్యం అందడం గగనమే. ఇలాంటి వారి కోసం ఆస్పత్రిలో విచారణ కౌంటర్ ఏర్పాటు చేసి ఆస్పత్రి సమాచారం చెప్పేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయాలి. ఎలాంటి సమాచారం కావాలన్నా రోగులు ఇక్కడ అడిగి తెలుసుకునే వీలుంటుంది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో రిమ్స్‌లో సరైన సమాచారం అందించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం, ఉన్న వారు సైతం సహకరించకపోవడంతో నిత్యం ఆస్పత్రికి వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు. ఓపీ చిట్టి తీసుకుంది మొదలు వైద్యుడి వద్దకు వెళ్లాలంటే కచ్చితంగా ఆస్పత్రి అంతా తిరగాల్సిన పరిస్థితి రోగులకు నిత్యం ఎదురవుతోంది. ఒకవేళ సంబంధిత వైద్యుడికి చూపించిన తర్వాత అదే రోజు రక్త పరీక్షలు, ఎక్స్‌రేల పేరిట చికిత్స చేయరు. వాటి రిపోర్టులు రావాలంటే రెండు రోజులు పట్టాల్సిందే. అసలే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి మూడు రోజులపాటు ఆస్పత్రి చుట్టూ తిరిగడం వల్ల ఇటు ఆర్థిక భారంతోపాటు, అటు ఉపాధి కూలీ కూడా కోల్పోతున్నారు. దీనంతటికి కారణం ఆస్పత్రికి వచ్చే వారికి సరైన సమాచారం అందకపోవడమే. -
రిమ్స్‌లో మృత్యు ఘోష
రిమ్స్ క్యాంపస్: కొండంత ఆశతో జిల్లా నలుమూలల నుంచి రిమ్స్‌కు వస్తున్న పేద రోగులు అక్కడి దారుణ పరిస్థితులు చూసి భయపడి పారిపోతున్నారు. తెగించి ఆస్పత్రిలో చేరిన వారు మృత్యువాత పడుతున్నారు. ప్రసవాలు చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుందన్న ఉద్దేశంతో చివరకు వైద్యులు కూడా డెలివరీ కేసులు చేపట్టేందుకు ముందుకు రావటం లేదు. ఐదు రోజుల వ్యవధిలోనే మెడికల్ వార్డులో 15 మంది మృతి చెందడం వీరందరి ఆందోళనలో అర్థముందని ధ్రువీకరిస్తోంది. ఇంత దారుణ దుస్థితికి కారణమేంటి?.. ఇదీ నేపథ్యం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు పాత, కొత్త కాంట్రాక్టర్లిద్దరూ కలిపి ఐదు నెలల వేతనాలు బకాయి ఉన్నారు. వీటి కోసం పలుమార్లు ధర్నాలు చేసినా స్పందన లేకపోవటంతో ఈ నెల 9వ తేదీన కార్మికులు సమ్మెకు దిగారు. అప్పట్లో రిమ్స్ డెరైక్టర్, కొత్త కాంట్రాక్టర్ కలసి ఈ నెల 15వ తేదీన బకాయి పడ్డ వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వటంతో.. 10వ తేదీ మధ్యాహ్నం సమ్మె విరమించారు. అయితే ఆ తేదీన వేతనాలు చెల్లించకపోవటంతో కార్మికులు మళ్లీ సమ్మె చేపట్టారు. దీంతో పారిశుధ్ద్య నిర్వహణ పూర్తిగా స్తంభించింది. ఓపీ నుంచి ఆపరేషన్ థియేటర్ వరకు ప్రతి చోటా చెత్త పోగులు, వ్యర్థాలు పేరుకుపోయాయి. ఫలితంగా ఆస్పత్రి అంతా దుర్వాసనతో నిండిపోయి కనీసం ఐదు నిమిషాలైనా ఉండలేని పరిస్థితి నెలకొంది. అసలే రోగులకు నిలయం. పైగా దుర్వాసన, పారిశుద్ధ్యలోపంతో పరిస్థితి క్షీణించింది. పరిశుభ్ర వాతావరణం ఉంటేనే రోగాలు త్వరగా నయమవుతాయని తెలిసినా.. అపరిశుభ్ర వాతావరణంలోనే రోగులకు చికిత్సలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. వరుస మరణాలు పారిశుద్ధ్యం క్షీణించడంతో ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. అసలే వ్యాధులతో బాధపడుతున్న వారిని వాంతులు వంటి కొత్త రుగ్మతలు సోకి ప్రాణాలను కబళిస్తున్నాయి. మెడికల్ విభాగానికి చెందిన స్త్రీ, పురుషుల వార్డుల్లో ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల్లో 15 మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనడానికి ఇదే నిదర్శనం. సాధారణంగా మెడికల్ విభాగానికి వచ్చే కేసుల్లో మరీ సీరియస్‌గా ఉన్న ఒకరో ఇద్దరో మరణించడం సాధారణం. ఇంత ఎక్కువ సంఖ్యలో ఇంతకుముందెప్పుడూ మరణాలు సంభవించలేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు రిమ్స్‌లో నెలకొన్న దయనీయ పరిస్థితి చూసి రోగులు జడుసుకుంటున్నారు. ప్రసూతి వార్డు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దాంతో సోమవారం రాత్రి ఏకంగా నలుగురు గర్భిణులు రిమ్స్ నుంచి బయటపడి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రసవాలు చేయలేమని వైద్యులు కూడా చేతులెత్తేశారు. ప్రసవాలు చేస్తే తల్లీబిడ్డలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముందని రిమ్స్ డెరైక్టర్‌కు తెల్చి చెప్పేశారు. పరిస్ధితి ఇంత దారుణంగా ఉన్న జిల్లా అధికార యంత్రంగం రిమ్స్ సమస్యపై కనీసం కన్నేతైన చూడకపోవటం దారుణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కార్మికుల సమస్యలను పరిష్కరించి వారి సమ్మెను విరమించకపోతే రిమ్స్‌లో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
రిమ్స్‌కు గడ్డుకాలం
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఒకవైపు వైద్యుల కొరత వెంటాడుతుంటే.. మరోవైపు ఉన్న వైద్యులు వెళ్లిపోవడం.. ఇంకో పక్క వైద్యు ల పదవీకాలం ముగియడంతో రిమ్స్ భవిష్య త్తు అగమ్యగోచరంగా మారింది. వైఎస్సార్ సీఎంగా ఉన్నంత కాలం రిమ్స్‌లో మెరుగైన వైద్య సేవలు అందాయి. ఆయన మరణానంతరం సదుపాయాలు, వైద్యులు, పరికరాల కొరతతో రోగులకు వైద్యం అందడం లేదు. రిమ్స్‌లో 21 విభాగాలకు 148 పోస్టులు మంజూరయ్యాయి. ఏడేళ్లుగా పూర్తిస్థాయిలో వైద్యపోస్టులు భర్తీకాలేదు. ఇప్పటివరకు కేవలం 65 పోస్టులే భర్తీకాగా 83 ఖాళీగా ఉన్నాయి. కాగా ఉన్న 65 మంది వైద్యుల్లోంచి 18 మంది వైద్యుల పదవీ కాలం ముగియడంతో ఆ సంఖ్య 47కు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో రోగులకు వైద్య సేవలు అందించడం ప్రశ్నార్థకంగా మారింది. డీఎంఈకి ప్రతిపాదనలు రిమ్స్‌లో పదవీకాలం ముగిసిన 18 మంది వైద్యులను పొడగించాలంటూ రిమ్స్ అధికారులు డీఎంఈ(డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్)కు ప్రతిపాదనలు పంపారు. వీరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు ఉన్నారు. 18 మందిలో తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వారు ఉండగా, డీఎం ఈకి పంపిన ప్రతిపాదనల్లో వీరందరికి అనుమతిస్తుం దా? లేదా అనేది అనుమానంగా ఉంది. ఒకవేళ డీఎం ఈ నుంచి ఆదేశాలు వస్తే అందులో తెలంగాణ ప్రాంత వైద్యులు లేనట్లైతే.. స్థానికులకు ఇవ్వాలంటూ వారి నుంచి నిరసనలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. 18 మందిని పొడిగించడం వీలుకాదని డీఎంఈ తేల్చేసిన పక్షంలో ఇక రిమ్స్‌లో 47 మంది వైద్యులు మాత్రమే మిగులుతారు. వీరిలో కొంత మంది ఇంటిదారి పట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రోగులకు వైద్య సేవలు మృగ్యం కానున్నాయి. ఎంసీఐ పరిశీలనకు వస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిమ్స్‌కు ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) పరిశీలనకు వస్తే అంతే సంగతి. ఇప్పటికే రిమ్స్ నుంచి మొదటి ఎంబీబీఎస్ బ్యాచ్ పూర్తి చేసుకొని వెళ్లింది. ఈ నేపథ్యంలో పీజీ తరగతుల అనుమతి, మెడికల్ సీట్లు పెంచే యోచనలో రిమ్స్ పరిశీలనకు ఎంసీఐ సిద్ధమైన పక్షంలో ఇందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, సిబ్బంది సంఖ్య చూపించాలి. ప్రతి సారీ ఎంబీబీఎస్ తరగతుల అనుమతికి ఎంసీఐ వచ్చినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి కొంత వైద్యులను అద్దెకు తెచ్చి చూపించేవారు. ఆ సమయంలో రిమ్స్‌లో వైద్యుల సంఖ్య వంద వరకు ఉండేది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 47 మంది వైద్యులే ఉండడంతో అనుమతికి కావాల్సిన స్థాయిలో వైద్యులను చూపించడం అసాధారణం. ఒకవేళ ఎంసీఐకి వీటన్నింటిని పూర్తిస్థాయిలో నివేదించకపోతే ఇంతటితో మెడికల్ సీట్లను నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఐదు బ్యాచ్‌లు పూర్తి చేసేంత వరకు మాత్రమే కళాశాల కొనసాగించి ఆ తర్వాత ఎత్తివేసే అవకాశాలు లేకపోలేదని రిమ్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే గనుక జరిగితే ఎన్నో కోట్లు వృథా. లక్షల మంది పేద ప్రజల ఆశలు ఆవిరిపోతాయి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు రిమ్స్‌పై దృష్టిసారించి వైద్యులు, సదుపాయాల కల్పన కోసం కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. రెండేళ్లుగా భర్తీ లేవు రెండేళ్ల నుంచి రిమ్స్‌లో వైద్యుల పోస్టులు భర్తీ కావడం లేదు. 2012లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా రిమ్స్‌లో 52 పోస్టులు భర్తీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నలుగురు డెరైక్టర్లు మారారు. కానీ వైద్యుల భర్తీ మాత్రం జరగలేదు. దీంతో వైద్య విద్యార్థులకు బోధనతోపాటు, రోగులకు వైద్య సేవలు అందడం లేదు. లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ రిమ్స్‌లో వైద్యులు పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు. పలుమార్లు రిమ్స్‌లో వైద్యుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు నోటిపికేషన్ ఇచ్చినా కొన్ని కారణాల వల్ల నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 1000 వైద్య పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. రిమ్స్ భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనైన రిమ్స్‌కు న్యాయం జరుగాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపాం.. - డాక్టర్ సురేష్ చంద్ర, రిమ్స్ డెరైక్టర్ రిమ్స్‌లో 18 మంది వైద్యుల పదవీకాలం ముగియడంతో వారిని పొడిగించేందుకు డీఎంఈకి ప్రతిపాదనలు పంపాం. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డీఎంఈ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. 18 మంది వైద్యులకు అనుమతి వచ్చిన వెంటనే ఇతర పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతాం. -
మంత్రి, విప్..ఓ ఎమ్మెల్యే!
అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు జిల్లాకు మంజూరు కావడం సంతోషకరం. ఎక్కువ మందికి అనుకూలంగా ఉండేలా వీటిని ఏర్పాటు చేయడమో.. అమలు చేయడమో చేయాలి. ఈ దిశగా ప్రజాప్రతినిధులు సమష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇందులోనూ అంతర్గత రాజకీయాలు చొప్పిస్తున్నారు. ఆధిపత్య పోరుకు వీటినే అస్త్రాలుగా వినియోగించుకుంటున్నారు. నర్సింగ్ కళాశాల వివాదమే దీనికి నిదర్శనం. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై మంత్రి, విప్, శ్రీకాకుళం ఎమ్మెల్యేల మధ్య మూడు ముక్కలాట సాగుతోంది. చివరికి ‘ముందు మీరు తేల్చుకోండి.. ఆ తర్వాతే నిర్ణయిస్తామని’ సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేతులెత్తేసే స్థాయికి వ్యవహారం ముదిరింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా తెలుగుదేశం పార్టీలో ‘నర్సింగ్ కళాశాల’ చిచ్పు రగిలింది. రిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలోని ఈ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో ప్రజాప్రతినిధుల మధ్య అంతర్యుద్ధం సాగుతోంది. రిమ్స్ ఆస్పత్రికి మంజూరైన ఈ కళాశాలను స్థల సమ స్య కారణంగా ప్రస్తుతానికి రిమ్స్ ఆవరణలోనే నిర్వహిస్తున్నారు. కళాశాల భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం ఒకవైపు అధికారులు అన్వేషణ సాగిస్తుండగా.. మరోవైపు జిల్లా మంత్రి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఎవరికి వారు తమకు అనువైన స్థలాలు సూచిస్తూ అక్కడే ఏర్పాటు చేయాలని పట్టుపడుతున్నారు. ప్రధానంగా ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు, విప్ కూన రవికుమార్ మధ్య పోరు సాగుతుండగా.. మంత్రి తన వాదన నెగ్గించుకునేందుకు చాకచక్యంగా స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని తురుపు ముక్కలా వాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమదాలవలసకు తీసుకెళ్లాలని.. జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్‌కు మంజూరైన నర్సింగ్ కళాశాలను ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రానికి తీసుకెళ్లాలని అక్కడి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తాను ఎన్నికైనప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆమదాలవలసలోని రాజీవ్ విద్యా మిషన్ స్థలంలో కళాశాల ఏర్పాటవుతుందని స్థానికులకు హామీ కూడా ఇచ్చేశారు. ఇటీవల ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పర్యటనసందర్భంగానూ ప్రస్తావించారు. అయితే జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు దీనికి అడ్డుపడ్డారు. ఎచ్చెర్ల కొండపైన, అంపోలు ప్రాంతంలో అధికారులు స్థలాలు చూశారని ఆ రెండింట్లో ఎక్కడో ఓ చోట ఏర్పాటు చేయాలని.. ఆమదాలవలసలో ఏర్పాటుకు అంగీకరించబోమని ఆరోగ్యమంత్రి సమక్షంలోనే స్పష్టం చేశారు. దీంతో మంత్రి శ్రీనివాస్ చేతులెత్తేశారు. ఎక్కడ పెట్టాలో ముందు మీరంతా తేల్చుకోండి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తేల్చేశారు. కుదరని సమన్వయం విప్ కూన రవి, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య సమన్వయం కుదరడం లేదు. బయటకు తామంతా ఒకటే అని చెప్పుకొంటున్నా.. లోలోన కత్తులు దూసుకుంటున్నారు. నర్సింగ్ కళాశాల వివాదమూ అందులో భాగమే. తన నియోజకవర్గ కేంద్రంలో దీన్ని ఏర్పాటు చేయించాలన్న రవి ఆశలపై అచ్చెన్న నీళ్లు చల్లుతున్నారు. శ్రీకాకుళం తన నియోజకవర్గం కాకపోయినా.. నర్సింగ్ కళాశాల అంశంతో నేరుగా సంబంధం లేకపోయినా.. తాను అనుకున్నదే జరిగి తీరాలని ఆయన భావిస్తున్నారు. విప్‌ను దెబ్బ కొట్టేందుకు తెలివిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని రెచ్చగొడుతున్నట్టు తెలిసింది. రిమ్స్ ఆమె నియోజకవర్గ కేంద్రంలో ఉన్నందున ఆమెను వివాదాల ఉచ్చులోకి లాగి తన మాట నెగ్గించుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి ఆరోగ్యశాఖ మంత్రి జరిపిన సమీక్షలో పాల్గొన్న లక్ష్మీదేవి ఈ విషయం ప్రస్తావించనే లేదు. మరోవైపు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఆమె వేదికపై కూర్చోవడం, మిగతా ఎమ్మెల్యేలు వేదిక ఎదురుగా కిందనే కూర్చోవడంపై అప్పట్లో చర్చ జరిగింది. మీరేమైనా మాట్లాడతారా అని స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రే అడిగినా ఆమె మాట్లాడలేదు. పట్టణాభివృద్ధి విషయంలో ఆమె పాదయాత్రలు చేస్తున్నా మంత్రి సమక్షంలో జరిగిన సమీక్షలో సమస్యలు ప్రస్తావించకుండా మౌనం వహించడంపై టీడీపీ కార్యకర్తల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎవరి స్థలంలో ఏర్పాటు చేస్తారో? ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే లక్ష్మీదేవి ఉన్నట్టుండి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు స్థల నిర్ణయం జరిగిందనే రీతిలో మాట్లాడటం వెనుక ‘మరేదో’ జరుగుతోందని చెబుతున్నారు. వివాదాల్లో ఉన్న శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం ప్రాంతంలోని 360 సర్వే నెంబర్లోని స్థలంలో కళాశాల ఏర్పటవుతుందని చెప్పడాన్ని తెలుగు తమ్ముళ్లే జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే పేర్కొన్న స్థలం ప్రభుత్వ భూమే అయినప్పటికీ వివాదాల్లో ఉన్నట్లు తెలిసింది. దీనికి ఇప్పటికే రెండుమూడుసార్లు రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయని.. అటువంటి స్థలాన్ని నర్సింగ్ కళాశాలకు ఎంపిక చేయడమేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కూన రవికి దెబ్బ తీసేందుకే అప్పటికప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి సింగుపురం స్థలం ప్రతిపాదనను తెరపైకి తెప్పించారని పార్టీలోని కొంతమంది నాయకులు చెబుతున్నారు. అచ్చెన్నాయుడే తెర వెనుక నుంచి ఈ తతంగం నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని సమీక్షలకు ఇతర ఎమ్మెల్యేలు రాకపోవడం, అన్ని సమీక్షలతో సంబంధం లేకపోయినా లక్ష్మీదేవి వెళ్తుండడం, నర్సింగ్ కళాశాల ఏర్పాటుపై జరుగుతున్న ఆధిపత్య పోరు ను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. -
డిప్యుటేషన్ల దందా!
రిమ్స్‌క్యాంపస్:మీరు విశాఖపట్నం నుంచి వస్తున్న స్టాఫ్ నర్సులా...డిప్యుటేషన్ వేయించుకొని అక్కడే ఉండిపోవాలనుకుంటున్నారా..అయితే కాస్త్త ఖర్చు అవుతుంది.. దీనికి మీరు సిద్ధమైతే పూర్తి వివరాలను మీ సీనియర్లను అడిగి తెలుసుకోండి..ఇదీ జిల్లాకే తలమానికంగా ఉన్న రిమ్స్ ఆస్పత్రిలో డిప్యుటేషన్ల దందా. లంచాలివ్వటంలో పోటీ పడుతూ కొంతమంది ఉద్యోగులు కేజీహెచ్‌కు డిప్యుటేషన్లు వేయించుకుంటున్నారు. ఎవరు ఎక్కువ ఇస్తే వారికే డిప్యుటేషన్ వేస్తామని, ఇంకా ఎక్కువ ఇస్తే విశాఖపట్నంలోనే కదపకుండా ఉంచేస్తామంటూ సంబంధిత గుమస్తా ఆఫర్లమీద ఆఫర్లిస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సుల్లో ఎక్కువ మంది విశాఖకు చెందిన వారే. నిత్యం వీరంతా విశాఖ నుంచి శ్రీకాకుళం రాకపోకలు సాగిస్తున్నారు. కేజీహెచ్‌లోని సూపర్‌స్పెషాలిటీ విభాగానికి కొంత మంది స్టాఫ్ నర్సులు డిప్యుటేషన్‌పై కావాలంటూ మూడేళ్ల కిందట కేజీహెచ్ వారు ప్రతిపాదనలు పంపారు. తమ వద్ద సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారని, కొత్తవారిని వేసుకునే వరకు డిప్యుటేషన్లను కొనసాగించాలని కోరారు. దీంతో అప్పటి రిమ్స్ డెరైక్టర్ రామ్మూర్తి ప్రతి మూడు నెలలకోసారి 30 మంది స్టాఫ్‌నర్సులను ఒక బ్యాచ్‌గా కేజీహెచ్‌కు డిప్యుటేషన్‌పై పంపేవారు. మూడు నెలలు పూర్తయిన తరువాత వేరొక బ్యాచ్ వెళ్తుంది. ఇక్కడే సంబంధిత గుమస్తాకు కల్పవృక్షం దొరికింది. నిత్యం విశాఖ నుంచి రాకపోకలు సాగించే స్టాఫ్‌నర్సులు విశాఖ డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు ఎగబడుతున్నారు. విశాఖ నుంచి రాకపోకలు సాగించకుండా అక్కడే ఉంటూ కేజీహెచ్‌లో పనిచేసుకొవచ్చునన్న ఆలోచనే దీనికి కారణం. విశాఖ నుంచి రాకపోకలు సాగించటానికి రోజుకు కనీసం రూ. 250 వరకు ఖర్చు కావడంతోపాటు సమయం కూడా చాలా వరకు వృథా అవుతోంది. దీన్ని తగ్గించుకోవడానికి చాలామంది డిప్యుటేషన్ల కోసం పోటాపోటీగా ఎగబడుతున్నారు. భారీగా వసూళ్లు డిప్యుటేషన్ చేయాలంటే ముడుపులు చెల్లించాల్సిందే. ఎవరు ఎక్కువ ఇస్తే వారికే ప్రాధాన్యం ఉంటుందని తోటి స్టాఫ్‌నర్సులే చెప్పుకుంటున్నారు. ఒకొక్కరూ రూ. ఆరు వేలు నుంచి ఆపై పోటీని బట్టి సొమ్ములు చెల్లించి విశాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లిపోతున్నారు. ఒక్కో బ్యాచ్‌ను పంపించినప్పుడు రూ. 5.40 లక్షల నుంచి సుమారు తొమ్మిది లక్షల రూపాయల వరకు వసూళ్లు జరుగుతున్నట్టు తోటి స్టాఫ్‌నర్సులే చెప్పటం గమనార్హం. సంబంధిత గుమస్తా డిప్యుటేషన్ దందాను సాగిస్తున్నట్టు సిబ్బందే చెప్పుకొస్తున్నారు. సాధారణంగా ఒక స్టాఫ్‌నర్సుకు డిప్యూటేషన్ వేయాలంటే నెలకు రూ.ఆరువేలు చొప్పున మూడు నెలలకు రూ.18వేలు వసూ లు చేస్తున్నారని, పోటీ పెరిగిపో తే మరికొంత ఎక్కువ గా సమర్పించుకోవాల్సి వస్తుందని కొంతమంది స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేజీహెచ్‌లో పాతుకుపోయిన పది మంది స్టాఫ్‌నర్సులు రిమ్స్ నుంచి కేజీహెచ్‌కు డిప్యుటేషన్లు జరుగుతుం డగా పది మంది మాత్రం చాలారోజులుగా కేజీహెచ్‌లోనే పాతుకుపోయారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతి బ్యాచ్‌కు 30 మంది కొత్తవారు వెళ్లాల్సి ఉండగా.. ఆ పది మంది మాత్రం రాజకీయ పలుకుబడి, భారీగా ముడుపులు చెల్లింపులతో కేజీహెచ్‌లోనే ఉండిపోతున్నారు. దీంతో 20 మంది మాత్రమే ప్రతి బ్యాచ్‌కు మారుతూ వస్తున్నారు. పది మందిని కదపకుండా అలా ఉంచటంపై తోటి స్టాఫ్‌నర్సులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని సంబంధిత గుమస్తాను నిలదీస్తే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయం టూ దాటుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు. అధికారులకూ వాటా! డిప్యుటేషన్ జరిపిన ప్రతిసారి రూ.లక్షల్లో వసూలు చేస్తున్న సంబంధిత గుమస్తా కొంత మొత్తాన్ని రిమ్స్‌కు చెందిన కొంతమంది అధికారులకు కూడా అందజేస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే డిప్యుటేషన్లపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సదరు అధికారులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు రిమ్స్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసలు రిమ్స్ నుంచి కేజీహెచ్‌కు డిప్యుటేషన్లు అవసరమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొసమెరుపు ! రిమ్స్‌లో డిప్యుటేషన్లను తక్షణమే నిలిపివేయాలని ఇటీవల జరిగిన ఆస్పతి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఆయన ఆదేశాలను ఆస్పత్రి వర్గాలు పట్టించుకోలేదు. గురువారం కూడా ఒక బ్యాచ్‌ను విశాఖ కేజీహెచ్‌కు పంపించడం కొనమెరుపు. -
రిమ్స్ తీరుపై మంత్రి గుస్సా
పనులు చేయకపోవడంపై ఆరాతీశారు. కాంట్రాక్టర్ జవాబుపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ.. ‘నేనేం అమాయకుడ్ని అనుకున్నావా..? రాష్ట్రంలో ఎక్కడా నువ్వు కాంట్రాక్ట్ చేయకుండా చేయగలను..’ అంటూ హెచ్చరించారు. రిమ్స్ ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ అంజయ్యతో మాట్లాడుతూ సదరు కాంట్రాక్టర్‌ను వెంటనే మార్చుకోవాలని ఆదేశాలిచ్చారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటాలని... ఆహ్లాదకరమైన వాతావరణంలో వైద్యం అందించడం ముఖ్యమని సూచించారు. అంతకుముందు నగరంలోని మాతాశిశు ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి అక్కడి సిబ్బందితో మంత్రి మాట్లాడారు. మధ్యాహ్నం నుంచి ఆయన కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లావైద్య, ఆరోగ్యంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రమాదకరమైన అనారోగ్య పరిస్థితులు ఒకప్పుడు ఒంగోలులోనే ఎక్కువగా కనిపించేవని.. అలాంటి వాతావరణం మార్చేందుకు వైద్యులు సేవాభావంతో పనిచేయాలని సూచించారు. రిమ్స్ ట్రామాకేర్ సిబ్బందితో పాటు 108, 104 సిబ్బందికి సకాలంలో జీతాలు అందిస్తామని.. రిమ్స్ బ్లడ్‌బ్యాంకు విస్తరణతో పాటు జిల్లాలో మిగతాచోట్ల ప్రతీ ఏరియా ఆస్పత్రిలోనూ బ్లడ్‌బ్యాంకు ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా నోడల్ అధికారులను నియమించి వారితో నిరంతర వైద్యసమీక్షలు చేయించే ప్రతిపాదనలున్నట్లు తెలిపారు. ప్రధానంగా అన్ని ఆస్పత్రుల్లో గైనిక్, ఎనస్థీషియా వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వైద్యులు ఆస్పత్రికి అందుబాటులో నివాసాలుండాలని.. విధులకు సకాలంలో హాజరుకాని వైద్యులపై కఠిన చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు. సాయంత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన మంత్రి త్వరలో జిల్లాల వారీగా జరగనున్న వైద్యరంగ అభివృద్ధిపై వివరించారు. ఆయనకు పలుచోట్ల వైద్యులు, ఇతర సిబ్బంది, ఐఎంఏ సభ్యులు సన్మానం చేశారు. మంత్రి పర్యటనలో డీఎంఏ డాక్టర్ జి. శాంతారావు, కలెక్టర్ విజయ్‌కుమార్, జేసీ యాకూబ్‌నాయక్, మెడికల్ ఆర్డీ శాలినిదేవి, జిల్లావైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ చంద్రయ్య, వైద్యవిధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ దుర్గాప్రసాద్, రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ అంజయ్య తదితరులున్నారు. ఆస్పత్రికి వచ్చేవారిని వేధించొద్దు ఒంగోలు టౌన్: ‘పేషంట్ దేవుడి లాంటివాడు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చేవారిని వేధించొద్దు. వారిని ప్రేమగా పలకరించాలి. ఆప్యాయంగా చూసుకోవాలి. ఈ రెండు చేస్తే ఆ రోగి సగం జబ్బు తగ్గుతోంది. మిగిలిన జబ్బును మనం ఇచ్చే వైద్యం ద్వారా తగ్గుతోంది. పేషంట్ లేకపోతే మనం లేమన్న విషయాన్ని గుర్తెరిగి విధులు నిర్వర్తించాలని’ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రభుత్వ వైద్యులకు ఉద్బోధించారు. ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ వైద్యులతో బుధవారం సాయంత్రం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూర్వం వైద్యులను దేవుడిలాగా చూసేవాళ్లని, మనం దానిని నిలబెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నూటికి తొంభై శాతం పేదలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుంటారని, మన పద్ధతులను మార్చుకొని ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. సమాజం ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లేనని, ఆరోగ్యంగా లేకుంటే మనం ఆరోగ్యంగా లేనట్లేనని వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశంలో శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని నిరోధించేందుకు మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే లేని జబ్బులు వస్తాయని ప్రజల్లో భయం ఉందని, అందుకు కారణం అక్కడ ఉండే అపరిశుభ్రతేనన్నారు. పారిశుధ్యం మెరుగుపరిచే కాంట్రాక్టు పొందినవాళ్లు సక్రమంగా పనిచేయకుంటే ఒకసారి వార్నింగ్ ఇవ్వాలని, అప్పటికీ మారకుంటే మెమో ఇవ్వాలని, పరిస్థితిలో మార్పురాకుంటే వారుకట్టిన డిపాజిట్ తిరిగి ఇవ్వొద్దని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు పేరు ఒక్కటే మిగిలి ఉందని, మిగతాదంతా కొత్తేనన్నారు. వైద్యులంతా మరింత కష్టపడి ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చాలని మంత్రి కామినేని కోరారు. ‘సిక్’ అయితే ఎంత నష్టమో గుర్తించాలి - కొండపి ఎమ్మెల్యే ఒక వ్యక్తి సిక్ అయితే ఎంత నష్టం జరుగుతుందో వైద్యులు గుర్తించాలని కొండపి శాసనసభ్యుడు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కోరారు. ఇంటి యజమాని సిక్ అయితే ఆ కుటుంబమంతా ఆ రోజు ఆదాయం కోల్పోతుందని, విద్యార్థి సిక్ అయితే ఆ రోజు పాఠాలు కోల్పోతాడన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది తాము తీసుకుంటున్న జీతాలకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్యం సరిగా లేకపోతే దానికి అందరూ బాధ్యులేనన్నారు. జిల్లాలోని ప్రభుత్వ వైద్యులతో ప్రతినెలా క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయన్నారు. క్లస్టర్ల వ్యవస్థ వల్ల సమస్యలు ఏర్పడటం తప్పితే ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమిస్తే బాగుంటుందని సూచించారు. పీహెచ్‌సీని బ్రాందీ షాపుగా మార్చేశారు - కనిగిరి ఎమ్మెల్యే కనిగిరి నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బ్రాందీ షాపుగా మార్చేశారని ఎమ్మెల్యే కదిరి బాబూరావు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 15 పడకల ఆస్పత్రికి ఇన్చార్జి వైద్యుడు ఉన్నప్పటికీ నాలుగేళ్ల నుంచి బ్రాందీ షాపు నడుస్తూనే ఉందన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తరువాత ఎక్సైజ్ సీఐతో దానిని ఖాళీ చేయించినట్లు తెలిపారు. సీఎస్‌పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారని, ఆయన కూడా ఇన్చార్జేనని, గట్టిగా రమ్మంటే రిజైన్ చేస్తానంటున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉంటే అన్నిచోట్ల ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నారన్నారు. పేరుకు ఆస్పత్రులు ఉన్నా అవి సరిగా పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పామూరులోని 30 పడకల ఆస్పత్రి కబ్జాకు గురైనట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు, డీఎంఈ శాంతారావు, కలెక్టర్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్, వైద్య ఆరోగ్యశాఖ ఆర్డీ శాలినీదేవి తదితరులు పాల్గొన్నారు. -
వెంటాడి... వేటాడి...
జలుమూరు: వారంతా దగ్గరి బంధువులే. చిన్న పొలం విషయమై తలెత్తిన తగాదా నాలుగేళ్లుగా కక్షలు, కార్పణ్యాలకు కారణమైంది. చివరకు ప్రత్యర్థులు వెంటాడి వేటాడడంతో అన్నయ్య దారుణ హత్యకు గురవగా తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జలుమూరు మండలం పెద్దదూగాంలో సోమవారం ఉదయం జరిగిన సంఘటన వివరాలు ఇవీ... అన్నదమ్ములైన ధర్మాన లచ్చుమయ్య(40), భాస్కరరావు ఉదయం 6.20 గంటలకు పొలం పనులకు బయలుదేరారు. గ్రామ శివార్లకు వచ్చేసరికి సందుల్లోంచి నాగలితో ఎడ్లు వెళ్లలేవని లచ్చుమయ్య మరో తోవలో పొలం వైపు వెళ్లాడు. భాస్కరావు ఇంకో తోవలో వెళుతుండగా ప్రత్యర్థులు ధర్మాన ముఖలిం గం, కుమారుడు వెంకటరమణ, భార్య తవిటమ్మ మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో భాస్కరరావు చేయి విరిగిపోగా పక్కటెముకలు తీవ్రం గా గాయాలు తగిలాయి. ఆయన కాపాడాలంటూ కేకలు వేయగా చుట్టుపక్కల వారు రావడంతో ప్రత్యర్థులు పారిపోయారు. విషయం తెలిసిన లచ్చుమ య్య కుమారుడు భానుప్రసాద్ తన తండ్రికీ అపా యం ఉందని అడ్డతోవలో సైకిల్‌పై పొలం వైపు వెళ్లాడు. భాస్కరరావు తప్పించుకోవడంతో ప్రత్యర్థులు లచ్చుమయ్యను వెంటాడి వేటాడారు. కత్తి, బల్లెంతో తల, నడుము, వీపు, చేయిపై పలుసార్లు పొడిచారు. ఆ సమయంలో అక్కడకు చేరిన భానుప్రసాద్‌ను కూడా హతమార్చడానికి ప్రయత్నించగా ఆయన తప్పించుకుని గ్రామంలోకి వచ్చాడు. ఇం తలో చుట్టుపక్కల రైతులు, కూలీలు కేకలు వేయడం తో దుండగులు లచ్చుమయ్యను వదిలి వెళ్లిపోయారు. కొనూపిరితో ఉన్న లచ్చుమయ్యను ఇంటికి తీసుకువచ్చిన కొద్దిసేపటికే ప్రాణం విడిచాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్నపాటి వివాదమే... లచ్చుమయ్య, ముఖలింగంలు దగ్గర బంధువులే. అయితే పొలం గట్టు విషయంలో నాలుగేళ్లుగా గొడవపడుతుండేవారని గ్రామస్తులు తెలిపారు. తరచూ గట్టు కొట్టి పొలం కలుపుకోవడం, కళ్లాల వద్ద కొట్లాడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని చెప్పారు. ముఖలింగం ఆది నుంచి వివాదస్పదడని, రెండేళ్లు క్రితం ధర్మాన ఈశ్వరరావు అనే వ్యక్తిని కళ్లం తగాదాలో తలపగలు కొట్టాడని పేర్కొన్నారు. పోలీస్ పికెట్ గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. లచ్చుమయ్య కుటంబానికి రక్షణ ఏర్పాటు చేసినట్లు నరసన్నపేట సీఐ అర్.వి.వి.ఎస్.ఎన్.చంద్రశేఖర్ తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. క్లూస్, డాడ్ స్క్వాడ్ గుండాలు చెరువు వద్ద కొలతలు, మృతుడు లచ్చుమయ్య రక్తపు మరకలు ఆనవాళ్లు తీసుకున్నారు. అడిషనల్ ఎస్పీ శ్రీదేవిరావు, క్లూస్ టీమ్ సీఐ కోటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జలుమూరు ఎస్ఐ డి.విజయ్‌కుమార్ కేసు నమోదు చేయగా సీఐ దర్యాప్తు చేస్తున్నారు. -
రిమ్స్ Vs మున్సిపల్
ఆదిలాబాద్ కల్చరల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రిమ్స్ ఆస్పత్రి తాగునీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతోంది. ఇదివరకు ఎప్పుడూ లేని రీతిలో తాగునీటి సరఫరా లేక రోగులకు శస్త్రచికిత్సలు నిలిపివేసిన దుస్థితి దాపురించింది. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి ఆదిలాబాద్ మున్సిపాలిటీకి మధ్య విభేదాలే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. రిమ్స్ ఆస్పత్రిలో నీటి ఎద్దడికి కారణం తాము కాదని మున్సిపల్ అధికారులు బహిరంగంగా చెబుతున్నారు. రిమ్స్ అధికారులకు నోటీసులు పంపించినా నీటి పన్ను రూ.17 లక్షలు చెల్లించలేదని, అయినా నీటిని సరఫరా చేస్తున్నామని అంటున్నారు. రిమ్స్ అధికారులు మున్సిపల్ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని వారు అంటున్నారు. దీంతో రిమ్స్, మున్సిపల్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. రిమ్స్ అధికారులదే నిర్లక్ష్యం? రిమ్స్‌లో నీటి ఎద్దడి నెలకొనడానికి రిమ్స్ అధికారులదే నిర్లక్ష్యమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిమ్స్ ఆస్పత్రికి రోజుకు 4 లక్షల లీటర్ల నీరు అవసరం. కానీ మున్సిపల్ నుంచి రోజుకు 80 వేల నీరు సరఫరా అవుతోంది. బోర్లతో నీటి సరఫరా లక్షా 20 వేల లీటర్లు మాత్రమే జరుగుతోంది. ఇంకో 2 లక్షల లీటర్ల నీటి సరఫరా జరగడం లేదు. రిమ్స్‌లో 8 బోర్లు ఉన్నా వాటిలో విద్యుత్, బోర్ల సామర్థ్యం, వివిధ కారణాలతో సక్రమంగా పనిచేయడం లేదు. ఈ కారణంగా నీటి ఎద్దడి ఎదురవుతోంది. ఎప్పటికప్పుడు నీటి సామర్థ్యాన్ని, అవసరమున్న నీటిని పర్యవేక్షించాల్సిన సిబ్బంది సైతం కరువయ్యారు. సోమవారం ప్రధానంగా ముందస్తు పర్యవేక్షణ లోపంతోనే నీరు లేకపోవడంతో ఆపరేషన్ థియేటర్లో శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో రోగులు అనేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఎదురైంది. నీటి సరఫరాలో సమస్య రిమ్స్ ఆస్పత్రికి వచ్చే రోగులను దృష్టిలో ఉంచుకుని వారికి జరిగే చికిత్సల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా నీటి సరఫరా చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా తె లిపారు. ఆదిలాబాద్ మండలంలో ప్రధాననీటి వనరులైన లాండసాంగ్విలో ట్రాన్స్ఫార్మర్ పాడైపోవడంతో సోమవారం నీటి సరఫరాలో ఆలస్యం జరిగింది. ఈ కారణంగా పట్టణంలో రెండు రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేశారు. రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన సంఘటనకు మున్సిపల్ అధికారులు కారణం కాదని, మున్సిపాలిటీకి రిమ్స్ రూ.17 లక్షలు బకాయిలు ఉన్నా సరఫరాను నిలిపివేయకుండా నిరంతరం రోజుకు 80 వేల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ మనీషా ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఆదివారం రాత్రి విధులు నిర్వహించిన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన చోటుచేసుకుందని రిమ్స్ డెరైక్టర్ శశిధర్ తెలిపారు. శని, ఆదివారాల్లో తాను సెలవుపై ఉండడంతో నీటి సమస్య తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూస్తామని ఆయన తెలిపారు. మున్సిపల్‌కు చెల్లించాల్సిన రూ.17లక్షల నీటి పన్నును వంతుల వారీగా చెల్లించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా రిమ్స్‌కు మున్సిపాలిటీకి మధ్య విభేదాలు తొలగించి తమకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని రోగులు, ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. -
వారిదంతా అడ్డదారే!
రిమ్స్ క్యాంపస్:ప్రభుత్వ శాఖల్లో.. లేదా సంస్థల్లో ఒక ఉద్యోగం వేయాలంటే కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాలి.. అనుమతులు పొందాలి. కానీ శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి వీటికి అతీతం. ఎందుకంటే ఇక్కడ చాలా నియామకాలు అధికారుల ఇష్టారాజ్యంగా, అత్యంత గోప్యంగా జరిగిపోతున్నాయి. నియామకాలు జరిగిపోతున్నాయి సరే.. మరి జీతాల మాటేమిటంటే.. ‘నారు పోసినవాడు నీరు పోయడా’.. అన్నట్లు దానికీ రిమ్స్ అధికారులు అడ్డదారులు కనుగొన్నారు. ఆరోగ్యశ్రీ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ(హెచ్‌డీఎస్) నిధులను అక్రమ నియామకాలు పొందిన ఉద్యోగుల జీతాలకు మళ్లిస్తున్నారు. జిల్లా అంతటికీ పెద్ద దిక్కుయిన రిమ్స్‌లో వైద్యసేవలు, సౌకర్యాల మెరుగుపై పెద్దగా శ్రద్ధ చూపని కొందరు అధికారులు అక్రమార్జనపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా ఆస్పత్రి అభివృద్ధి కుంటుపడుతోంది. చాలావరకు అనధికారిక నిర్ణయాలే అమలవుతుండటంతో ఆస్పత్రి అభివృద్ధికి ఉపయోగపడాల్సిన నిధు లు పక్కదారి పడుతున్నాయి. ఇష్టారాజ్యంగా నియామకాలు ఔట్ సోర్సింగ్ ముసుగులో రిమ్స్‌లో ఇష్టారాజ్యంగా నియామకాలు జరుగుతున్నాయి. కొందరు అధికారుల ఏజెన్సీలతో సొంత కాంట్రాక్టులు కుదుర్చుకొని ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. ఒకవేళ ఏజెన్సీకి సంబంధం లేకపోతే ఆ ఉద్యోగుల వేతనాలను హెచ్‌డీఎస్, ఆరోగ్యశ్రీ నిధుల నుంచి మళ్లించి ఇస్తున్నారు. కొద్ది నెలల కిందట సూపరింటెండెంట్ కార్యాలయంలో ఇద్దరిని, ఆస్పత్రిలో మరో ఇద్దరిని ఇలాగే నియమించి,ఆరోగ్యశ్రీ నిధుల నుంచి వేతనాలు చెల్లిస్తున్నట్టు రిమ్స్ వర్గాలే పేర్కొంటున్నాయి. ఆరోగ్యశ్రీ నిధుల్లో మాయజాలం ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలకు మంజూరవుతున్న నిధులు దారిమళ్లుతున్నా యి. ఆరోగ్యశ్రీ కేసుల్లో పాల్గొన్న వారికి, వైద్య పరికరాల కొనుగోలుకే ఆ నిధుల నుంచి చెల్లింపులు జరపా లి. దానికి విరుద్ధంగా ఉద్యోగుల వేతనాలు, కూర్చీలు వంటి సామగ్రి కొనుగోళ్లకు ఈ నిధులు వెచ్చిస్తున్న ట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే అధికారుల మధ్య వివాదం రేగినట్లు తెలిసింది. నిధుల దుర్వినియోగంపై కొందరు వైద్యులు రిమ్స్ అధికారులను నిలదీయడం వివాదంగా మారింది. అదే దారిలో హెచ్‌డీఎస్ నిధులు రోగులకు వైసౌకర్యాలు పెంచే పనులకే వెచ్చించాల్సిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధులను అనవసర పనులకు కూడా వినియోగిస్తున్నారు. గత ఏడా ది ఆడిటోరియం మెట్ల పనులకు హెచ్‌డీఎస్ నిధుల నుంచి సుమారు రూ.3 లక్షలు కేటాయించారు. వాస్తవానికి ఈ నిర్మాణం రిమ్స్ ప్లాన్‌లో లేదు. అయినా లక్షల ఖర్చుతో చేపట్టిన ఈ పనుల్లో చాలా అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. కాగా సూపరింటెం డెంట్ కార్యాలయాన్ని ఆస్పత్రి నుంచి కళాశాలకు మార్చారు. ఇందుకు అవసరమైన మార్పులు చేర్పులకు, ఆస్పత్రిలో సింగల్ విండో వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన నిధులను హెచ్‌డీఎస్ నుంచే మళ్లించారు. తాజాగా డెరైక్టర్ ఛాంబర్ వద్ద ఏర్పా టు చేస్తున్న పార్టిషన్ల ఖర్చును కూడా హెచ్‌డీఎస్ నుంచే తీస్తున్నారు. రిమ్స్ భవనాల ప్లాన్‌ను రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులు అమోదించారు. దానికి విరుద్ధంగా మార్పులు చేర్పులు చేపట్టడం, వాటికి లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. మా ప్లాన్‌లో లేవు రిమ్స్ అడిటోరియం మెట్ల నిర్మాణం గురించి ఇక్కడి నిర్మాణాలను పర్యవేక్షిస్తున్న ఏపీహెచ్‌ఎంఐడీసీ ఈఈ రాంబాబు వద్ద ప్రస్తావించగా మెట్లతోపాటు ఇటీవల చేపట్టిన పలు నిర్మాణాలు తమ ప్లాన్‌లో లేవని స్పష్టం చేశారు. వాటికి సంబంధించి దగ్గరుండి ప్రణాళిక చెప్పమంటే చెబుతున్నామే తప్ప వాటికయ్యే ఖర్చులకు నిధులు ఎక్కడి నుంచి ఇస్తున్నారన్నదానితో తమకు సంబంధం లేదన్నారు. -
కాంగ్రెస్ కార్యక ర్తల ఘర్షణ
ఎదులాపురం, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో కలి సికట్టుగా పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తల్లో మరోసారి వర్గ విభేదాలు బయట పడ్డాయి. బుధవారం డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి నివాసానికి వచ్చిన ఎన్ఎస్యూఐ నాయకులు సీఆర్ఆర్ వర్గం నాయకులతో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల నాయకులు పరస్పరం దాడికి పాల్పడ్డా రు. ఈ ఘర్షణలో సీఆర్ఆర్ వర్గం నాయకుడు తిప్ప నారాయణ గాయాలపాలై రిమ్స్ ఆస్పత్రి లో చేరాడు. కౌన్సిలర్ టిక్కెట్టు తమకు రాకపోవడానికి నారాయణనే కారణమని ఆరోపిస్తూ ఎన్ఎస్యూఐ నాయకులు ఆయనపై దాడికి పాల్పడ్డారని సీఆర్ఆర్ వర్గం నాయకులు పేర్కొం టున్నారు. మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి విభేదాలు బయటకు రాకుండా ఉన్న సీఆర్ఆర్, భార్గవ్ దేశ్‌పాండే వర్గం నాయకు లు మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కు అనుకూలంగా వెలువడిన వెంటనే ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగడం చర్చనీ యాశంగా మారింది. వర్గవిభేదాలు బయటకు రాకుండా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించినా కాం గ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఘర్షణకు పాల్ప డం, కార్యకర్తకు గాయాలై రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే దాడిలో గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న నారయణను పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. -
రిమ్స్ ఆస్పత్రిలో అవినీతి రాజ్యం
అబ్బాయి పుడితే రూ.800.. అమ్మాయి పుడితే రూ.500..గ్రూపులుగా మారి వసూళ్ల దందా బాధితులను పీక్కుతింటున్న సిబ్బంది కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : రిమ్స్ ఆస్పత్రిలో అవినీతి రాజ్యమేలుతోంది. వైద్యం కోసం వచ్చే పేదల నుంచి సిబ్బంది డబ్బులు దండుకుంటున్నారు. ముఖ్యంగా ప్రసూతి విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. పుట్టిన బాబుకు, పాపకు ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రిని నిర్వహిస్తున్నా.. రూ.వేల జీతా లు తీసుకుంటున్న సిబ్బంది అక్రమమార్గంలో వసూళ్ల పర్వం మొదలుపెట్టారు. ఆస్పత్రికి రోజూ సుమారు 30 నుంచి 40 ప్ర సూతి కేసులు వస్తుంటాయి. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.1,000 నుంచి రూ.1,500 వరకు బంధువుల నుంచి సిబ్బంది వసూలు చేస్తున్నారు. కానీ రిమ్స్ ఉన్నతాధికారులు మాత్రం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రూపులుగా వసూళ్లు ప్రసూతి కోసం వచ్చిన మహిళా బంధువుల నుంచి ప్రసూతి విభాగం సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది గ్రూపులుగా మారి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముందుగా ఆస్పత్రికి వచ్చిన మహిళను ప్రసూతి విభాగంలో చేర్పిస్తారు. అక్కడి సిబ్బంది ఆపరేషన్‌కు సంబంధించిన దుస్తులు మహిళ ధరించిన తర్వాత రూ.200 తీసుకుంటారు. ఆ తర్వాత డెలివరీ అయిన వెంటనే ఆపరేషన్ థియేటర్లో ఉండే ఇద్దరు సిబ్బంది పుట్టిన పాపకు లెక్కకట్టి మరీ వసూలు చేస్తారు. బాబు పుడితే రూ.800, పాప పుడితే రూ.500 తీసుకుంటారు. సదరు బంధువులు డబ్బులు ఇచ్చేంత వరకు పుట్టిన బిడ్డను వారి చేతికివ్వకుండా ఇబ్బంది పెడతారు. దీంతో ఏం చేయలేని పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చి బిడ్డను తీసుకుంటారు. ఇవేకాకుండా అదనంగా అక్కడి నుంచి ప్రసూతి వార్డుకు తరలించేందుకు వార్డు బాయ్‌కి రూ.100, ప్రసూతి వార్డులో పడక చూపించిన సిబ్బందికి రూ.300, పుట్టిన బిడ్డకు ఆయిల్ రాసి శుభ్రం చేసే సిబ్బందికి రూ.200 ఇలా ఎక్కడి సిబ్బంది అక్కడే దోచుకుంటున్నారు. మొత్తంగా సుమారు రూ.1500 వరకు వసూలు చేయందే విడిచిపెట్టరు. ఎవరికి ఎంతెంత డబ్బులు ఇవ్వాలనేది కూడా సిబ్బంది ముందుగానే బాధితులకు చెబుతారు. తాము 10 నుంచి 15 మంది ఉంటామని, మీరిచ్చిన డబ్బులు అందరం పంచుకుంటామని స్వయంగా వారే చెప్పడం గమనార్హం. ప్రసూతి వార్డుకు తల్లిని, బిడ్డను తీసుకెళ్లిన తర్వాత ఒక మహిళ సిబ్బంది వచ్చి డబ్బులు వసూళు చేసుకొని వెళ్తొంది. ఆ తర్వాత మరో మహిళ సిబ్బంది వచ్చి అంతకుముందు ఇచ్చిన డబ్బులు తమకు కావని వారు ఆపరేషన్ థియేటర్ సిబ్బంది అంటూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి డబ్బుల కోసం మహిళ బంధువులు పీక్కుతింటున్నారు. ఒకవేళ సిబ్బంది అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే వారికి నరకం చూపేడుతున్నారు. ఇక గిరిజన మహిళల పరిస్థితి మరీ దారుణం. కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు రిమ్స్‌లోని ప్రసూతి వార్డులో జరుగుతున్న అవినీతి గురించి స్వయంగా కలెక్టర్ అహ్మద్ బాబుకు బాధితులు ఫిర్యాదు చేశారు. గతేడాది ఆగష్టులో రిమ్స్ తనిఖీలకు వచ్చిన కలెక్టర్‌ను కలిసిన కొంత మంది బాధితులు తమ నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని విన్నవించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసూతి వార్డులో ఉన్న సిబ్బందిని వేరే వార్డుల్లోకి మార్చాలని రిమ్స్ అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అయినప్పటికి కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ సిబ్బంది వసూళ్ల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రసూతి వార్డు ఇన్చార్జీ అధికారులు ఈ విషయాన్ని మామూలుగా తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని ఎవరికైన చెబితే ఎక్కడ మళ్లీ తమను హింసిస్తారనే భయంతో బాధితులు నోరు మెదపడం లేదు. ఏదేమైన ప్రసూతి వార్డులో అవినీతి కంపును తొలగించాలని పలువురు కోరుతున్నారు. దృష్టి సారిస్తాం.. రిమ్స్ ప్రసూతి వార్డులో డబ్బులు వసూలు చేసే సిబ్బంది చర్యలు తీసుకుంటాం. ఇకపై సిబ్బంది డబ్బులు తీసుకుంటున్నారనే దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ వార్డులో ఉన్న సిబ్బందిని వేరే వార్డుకు బదిలీ చేయడం జరిగింది. ఆస్పత్రికి వచ్చిన వారిని సిబ్బంది డబ్బులు అడిగితే తమకు ఫిర్యాదు చేయాలి. సదరు సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటాం. - డాక్టర్ శశిధర్, రిమ్స్ డెరైక్టర్ -
అడ్డదారిలో క్లినికల్ శిక్షణ!
రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్ : రిమ్స్ ఆస్పత్రి అధికారుల అడ్డగోలు వ్యవహారాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. ఎన్ని ఆరోపణ లు.. విమర్శలు వచ్చినా వారు చలించటం లేదు. తీరు మార్చుకోవటం లేదు. వైద్యవిద్య డెరైక్టర్(డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్-డీఎంఈ) అనుమతి లేకపోయినా ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు క్లినికల్ శిక్షణ ఇచ్చేస్తుండటమే ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది. జర గాల్సింది ఇదీ.. జీవో నంబర్ 245 ప్రకారం.. ప్రైవేట్ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు క్లినికల్ శిక్షణను ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో ఇవ్వాలంటే ముం దుగా డీఎంఈ అనుమతి పొందాలి. దీనికోసం నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. దీనిని వైద్యవిద్య డెరైక్టర్ పరిశీలించి.. నర్సింగ్ కళాశాల నిబంధనల ప్రకారం నడుస్తోందని నిర్ధారణ చేసుకున్నాకే అనుమతి ఇస్తారు. ఆ తర్వాతే విద్యార్థినులకు ఆస్పత్రిలో శిక్షణ ఇవ్వాలి. ఇదీ జరిగింది.. ఎచ్చెర్ల మండలం తోటపాలెంలోని విజయ నర్సింగ్ కళాశాల, శ్రీకాకుళంలో ఉన్న నారాయణ స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లు కొన్నేళ్లుగా తమ విద్యార్థులకు రిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ శిక్షణ ఇప్పిస్తున్నాయి. ఈ ఏడాది విజయ నర్సింగ్ కళాశాల యాజమాన్యం మాత్రమే డీఎంఈ నుంచి అనుమతి పొందింది. నారాయణ కళాశాల యాజమాన్యానికి అనుమతి రాలేదు. దీం తో ఆ కళాశాల యాజమాన్యం గతేడాది డీఎంఈ ఇచ్చిన అనుమతి పత్రాన్ని జతచేసి ఈ ఏడాది కూడా క్లినికల్ శిక్షణ ఇవ్వాలని కోరుతూ రిమ్స్ డెరైక్టర్‌కు దరఖాస్తు చేసుకుంది. 30 మందికి శిక్షణ కావాలంటూ ఒక్కొక్క విద్యార్థికి రూ.500 చొప్పున మొత్తం రూ.15,000 రూపాయల డీడీని రిమ్స్ కాలేజ్ డెవలప్మెంట్ సొసై టీ పేరిట తీసి జతపరిచింది. తెర వెనుక ఏం జరిగిందో కానీ నారాయణ కళాశాల యాజమాన్యానికి రిమ్స్అధికారులు దాసోహమయ్యారు. డీఎంఈ అనుమతి లేకున్నా ఈ నెల 1వ తేదీ నుంచి విద్యార్థినులకు శిక్షణ ఇచ్చేస్తున్నారు. 30 మందికి ఫీజు కడితే 75 మందికి శిక్షణ! మరో విశేషమేమిటంటే.. నారాయణ కళాశాల యాజమాన్యం కేవలం 30 మంది విద్యార్థులకే ఫీజు చెల్లించగా రిమ్స్ అధికారులు ఏకంగా 75 మందికి ఉదారంగా శిక్షణ ఇచ్చేస్తున్నారు. దీని వల్ల రూ.22,500 రూపాయల మేర ఆస్పత్రి ఆదాయానికి గండి పడింది. దీనివెనుక ఏదో మతలబు ఉందని ఆస్పత్రి వర్గాలే అంటున్నాయి. అనుమతి రాని మాట వాస్తవమే ఈ విషయమై రిమ్స్ నర్సింగ్ సూపరింటెం డెంట్ జ్యోతి సరళను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా నారాయణ నర్సింగ్ స్కూల్ వారికి ఈ ఏడాది డీఎంఈ నుంచి ఎలాంటి అనుమతి రాని మాట వాస్తవమేనని అంగీకరించారు. ప్రస్తుతం సుమారు 75 మంది విద్యార్థినులకు క్లినికల్ శిక్షణను మూడు షిప్టుల్లో ఇస్తున్నామని చెప్పారు. రిమ్స్ డెరైక్టర్ ఊళ్లో లేనందున శిక్షణను ఆపలేదని, ఆయన వచ్చాక ఎలా చెబితే అలా చేస్తామని పేర్కొన్నారు. -
రిమ్స్‌లో రోగుల అవస్థలు
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ఎప్పుడే ఏదో ఒక సమస్య రోగులను ఇబ్బంది పెడుతూనే ఉంటోంది. శుక్రవారం కూడా రోగులు సిబ్బంది లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆస్పత్రిలోని ఔట్సోర్సింగ్ సిబ్బంది హైదరాబాద్‌లో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి తరలివెళ్లారు. దీంతో ఆయా విభాగాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది లేక రోగులకు సేవలు అందలేదు. ప్రతి రోజులాగే ఓపీ విభాగంలో వైద్య పరీక్షలు చేసిన వైద్యులు రోగులకు రక్త పరీక్షలు రాసిచ్చారు. తీరా వైద్యుడు రాసిచ్చిన చిట్టీని తీసుకొని రక్త పరీక్ష కేంద్రానికి వెళ్లిన రోగులకు నిరాశే ఎదురైంది. సరిపడా టెక్నీషియన్లు లేరని, రక్త పరీక్షలు చేయడం వీలుకాదని సోమవారం రావాలని చెప్పడంతో రోగులు వెనుదిరిగారు. కాగా ఎంతో దూరం నుంచి వచ్చిన తమకు కేవలం వైద్య పరీక్షలు నిర్వహించి ఇంటికి వెళ్లిపోమ్మనడం సరైంది కాదన్నారు. కనీసం వైద్యుడు రాసిన రక్త పరీక్షలు చేసి రిపోర్టులు ఇవ్వడం ద్వారా రక్త పరీక్షల్లో వచ్చిన సమస్యకు అనుగుణంగా వైద్యులు మందులు రాసి ఇచ్చేవారు. కానీ ఆయా విభాగాల్లో చాలా మట్టుకు రక్త పరీక్షలు నిర్వహించకపోవడంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది ఎటువంటి మందులు తీసుకోకుండానే వెళ్లిపోయారు. వైద్యులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని రోగులు వాపోయారు. ఎప్పుడూ ఇంతే... ప్రతి రోజు కనీసం ప్రతి విభాగంలో ఐదుగురు టెక్నీషియన్లు ఉంటారు. ఇందులో ముగ్గురు ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులే. కాగా తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నాకు వెళ్లడంతో ఆయా విభాగాల్లో కేవలం ఒకే రెగ్యులర్ టెక్నీషియన్ అందుబాటులో ఉంచారు. సాధారణంగా ప్రతి రోజు 200 మంది నుంచి 300 వరకు రోగులు రక్త పరీక్షలు, ఎక్స్‌రే, ఇతర పరీక్షల కోసం వస్తుంటారు. ఇంత మందికి కనీసం ఐదుగురు ఉండాలి. కానీ ప్రతి విభాగానికి ఒకే ఒక్క టెక్నీషియన్ ఉండడంతో రోగులు నానా అవస్థలు పడ్డారు. కొంత మంది మందులు మాత్రమే తీసుకొని వెళ్లిపోయారు. ఓపీ విభాగంతో పాటు, ఎమ్మర్జెన్సీ వార్డు, ఎక్స్‌రే, ల్యాబ్స్, రిమ్స్ కళాశాల అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సిబ్బంది లేక వెలవెలబోయాయి. ప్రత్యమ్నయంగా కూడా ఎలాంటి టెక్నీషియన్లు పెట్టకపోవడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ విషయంపై రిమ్స్ డెరైక్టర్ శశిధర్‌ను ఁన్యూస్లైన్ వివరణ కోరగా ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ టెక్నీషియన్లు రక్త, ఇతర పరీక్షలు చేస్తున్నారని, పరీక్షలు చేయకుండా ఏ రోగిని బయటకు పంపించలేదని తెలిపారు.