లారీ-ఇన్నోవా ఢీ; ఇద్దరు మృతి | 3 died in road accident at Srikakulam district | Sakshi
Sakshi News home page

లారీ-ఇన్నోవా ఢీ; ఇద్దరు మృతి

Published Tue, Jan 20 2015 6:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

3 died in road accident at Srikakulam district

శ్రీకాకుళం: జిల్లాలోని లావేరు మండలం సుభద్రాపురం వద్ద రాత్రి 3 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా,  మరో ఇద్దరు తీవ్రగాయాలయ్యాయి. ఆగివున్న లారీని ఇన్నోవా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతులు సారవకోట మండలం కుమ్మరిగుంటకు చెందిన భార్యభర్తలు జంగం కృష్ణమూర్తి, సావిత్రిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement