రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
బైక్‌ను వెనుక నుంచి ఢీకొన్న వాహనం
దివ్యాంగుడైన భర్తకు స్వల్పగాయాలు
గుడిహత్నూర్ జూనియర్ కళాశాల సమీపంలో ఘటన
గుడిహత్నూర్: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా, దివ్యాంగుడైన భర్తకు స్వల్పగాయాలయ్యాయి. ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ కథనం ప్రకారం.. ఇచ్చోడ మండలం కోకస్‌మన్నూర్‌కు చెందిన జాదవ్ మధుకర్–రమ్యక్రిష్ణ (30)భార్యాభర్తలు. భర్త మధుకర్ దివ్యాంగుడు, కోకస్‌మన్నూర్‌లో కిరాణషాపు నడిపిస్తున్నాడు. రమ్యక్రిష్ణ.. లేడిస్ ఎంపోరియం నడిపిస్తోంది. వీరికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది.
గ్రామంలో ఇటీవల మీ సేవ కేంద్రం మంజూరైంది. రమ్యక్రిష్ణ శిక్షణ సైతం తీసుకుంది. గత కొంతకాలంగా ఈమె చర్మవ్యాధితో బాధపడుతోంది. రెండు రోజులుగా చర్మంపై దద్దుర్లు వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం భర్తతో కలిసి బైక్‌పై రిమ్స్‌కు వెళ్లేందుకు బయల్దేరింది. గుడిహత్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో వీరి బైక్‌ను వెనుక నుంచి వస్తున్న వాహనం ఢీకొట్టింది.
జాతీయ రహదారి 44పై పక్కన రెయిలింగ్‌పై రమ్యక్రిష్ణ ఎగిరిపడింది. ఆమె రెండు చేతులు విరిగిపోయి, తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. హెల్మెట్ ధరించి ఉండడంతో భర్తకు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే వారిని అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు. వైద్యులు భర్తకు చికిత్స అందిస్తున్నారు. మధుకర్ తండ్రి తుకారాం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలికి 6, 7 ఏళ్లలోపు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment