Laveru mandal
-
లావేరు మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న అదపాక గెడ్డ
-
చెప్పుకోలేమని తెలుసు.. ఒప్పుకోరనీ తెలుసు
సమాజానికి చెప్పుకోలేమని తెలుసు.. ఎవరూ ఒప్పుకోరనీ తెలుసు.. అయినా వారు పరిధి దాటారు. అవమానాలు తప్ప ఆనందం ఉండని బంధం కోరుకున్నారు. రెండు కుటుంబాల గౌరవ మర్యాదల గురించి యోచన చేయలేకపోయారు. కన్నవారు, కడుపున పుట్టిన వారి గురించి ఆలోచించలేకపోయారు. కాలం గడిచే కొద్దీ కలిసి జీవించడం సాధ్యం కాదని వారికి అర్థమైంది. కావాలనుకున్న బంధం బలవన్మరణం వైపు దారి తీసింది. ఆ ప్రయత్నంలో వివాహిత కన్నుమూయగా.. యువకుడు చావుతో పోరాడుతున్నాడు. ఎచ్చెర్ల క్యాంపస్(శ్రీకాకుళం): లావేరు మండలం కేశవరాయనిపాలేంకు చెందిన బోనెల ప్రియాంక అలియాస్ అంకమ్మ (32), బోనెల సంతోష్ (30)లు సోమవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్యహత్మకు ప్రయత్నించారు. వీరిలో ప్రియాంక చనిపోగా.. సంతోష్ ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వివాహేతర సంబంధం వీరిని చావు వరకు తీసుకెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రియాంకకు పన్నెండేళ్ల కిందట సూర్యనారాయణ అనే వ్యక్తితో వివాహమైంది. సూర్యనారాయణ ఓ ప్రైవేటు కంపెనీలో వంట మనిషి పని చే స్తుండగా.. ప్రియాంక కూలి పనులకు వెళ్లేవారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురూ బడికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల కిందట బోనెల సంతోష్ అనే ఆటో డ్రైవర్‌తో ప్రియాంకకు పరిచయమైంది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ముగ్గురు పిల్లల తల్లి అని తెలిసినా, తన కంటే వయసులో పెద్దదని తెలిసి కూడా సంతోష్ ప్రియాంకతో సంబంధం పెట్టుకోవడానికి సంకోచించలేదు. ప్రియాంక కూడా ఆ విషయాలను ఆలోచించలేకపోయింది. కొన్నాళ్లకు వీరి విషయం సూర్యనారాయణకు తెలిసి భార్యను మందలించారు. ఊరి పెద్దల ముందు కూడా పంచాయతీ పెట్టగా.. వారు కూడా మందలించారు. కానీ వారి తీరు మారలేదు. ఫలితంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా ప్రియాంక, సంతోష్‌లు మారలేదు. ఈ క్రమంలో.. తమకు అంతా అడ్డు పడుతున్నారని భావించి కలిసి చనిపోవడానికి నిర్ణయించుకున్నారు. సోమవారం రాత్రి కేశవరాయనిపాలెం నుంచి చిలకపాలేం చేరుకున్నారు. సమీపంలోని తోటలోకి వెళ్లి ఇద్దరూ పురుగుమందు తాగేశారు. ఈ విషయాన్ని గ్రామంలోని స్నేహితులకు, బంధువులకు ఫోన్ ద్వారా చెప్పారు. దీంతో వారు హుటాహుటిన తోటల్లోకి వెళ్లి వెతికారు. అప్పటికే ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తీసుకెళ్లగా అదే రోజు రాత్రి ప్రియాంక చనిపోయింది. సంతోష్ చికిత్స పొందుతున్నా డు. ప్రియాంక మృతదేహానికి వైద్యులు పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ విషాదకర ఘటనతో ముగ్గురు పిల్లలు తల్లి లేని వారైపోయారు. ఔట్‌పోస్టు పోలీసుల సమాచారం మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్‌లో టెకీపై యువకుడి దారుణం పబ్జీ ఆట: రెండు గ్రామాల మధ్య చిచ్చు -
కొద్ది రోజుల్లో పెళ్లి..కానీ అంతలోనే
సాక్షి, లావేరు(శ్రీకాకుళం) : మరికొద్ది రోజుల్లో తన పెద్ద కుమార్తెకు పెళ్లి జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంతలోనే ఆ ఇంటి యజమాని వైఎస్సార్సీపీ నాయకుడు పడాల వెంకన్న(43) మృతి చెందడంతో ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటన లావేరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈయన పెద్ద కుమార్తెకు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కందివలస గ్రామానికి చెందిన తన బావమరిదితో ఈ నెల 25న వివాహం చేసేందుకు ముహూర్తం నిశ్చయించాడు. ఈ నేపథ్యంలో కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో వెంకన్న బాధపడుతున్నాడు. గురువారం రాత్రి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో తన ఇంటి వద్దే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెళ్లికార్డులు పంచడంతోపాటు పెళ్లి పనుల్లో నిమగ్నమైన సమయంలో ఇంటి యజమాని మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇక మాకు దిక్కెవరూ అంటూ మృతదేహంపై పడి రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శ వైఎస్సార్సీపీ నాయకుడు పడాల వెంకన్న మృతి చెందడంతో పార్టీ సీనియర్ నాయకులు మహదాసు రాంబాబు, లంకలపల్లి గోపి, లంకలపల్లి నారాయణరావు, వట్టి సత్యనారాయణ, పడాల పాపారావు, లంకలపల్లి చిన్నారావు, సగరపు విశ్వనాథం, లంకలపల్లి భాస్కరరావు, తలారి నాగయ్య, ఇనుకోటి చిన్న, పైడి దాము, ఇనపకురి చలపతి, కొండక ప్రసాద్, తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు. -
నవ్వుల పండగ
లావేరు: మండలంలోని లావేరు గ్రామంలో జరిగిన చిన్న అసిరితల్లి సిరిమాను ఉత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి జబర్దస్త్ టీమ్, విశాఖకు చెందిన రోషన్ లాల్ ఆర్కెస్ట్రా సభ్యులు ఆటపాటలతో అలరించారు. జబర్దస్ కళాకారులు రాకెట్ రాఘవ, దొరబాబు, అప్పారావు, శాంతి స్వరూప్, రాజమౌళి, నాగిలు చేసిన స్కిట్లు ఆకట్టుకున్నాయి. స్థానికులు వీరితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. కార్యక్రమాలు చూడటానికి వేలాది మంది ప్రజలు వచ్చారు. వారిని కంట్రోల్ చేయడానికి లావేరు ఎస్ఐ సీహెచ్ రామారావుతో పాటు పోలీసులు చాలా ఇబ్బందులు పడ్డారు. -
లారీ-ఇన్నోవా ఢీ; ఇద్దరు మృతి
శ్రీకాకుళం: జిల్లాలోని లావేరు మండలం సుభద్రాపురం వద్ద రాత్రి 3 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రగాయాలయ్యాయి. ఆగివున్న లారీని ఇన్నోవా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతులు సారవకోట మండలం కుమ్మరిగుంటకు చెందిన భార్యభర్తలు జంగం కృష్ణమూర్తి, సావిత్రిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.