
జబర్ధస్త్ టీంతో ఫోటో దిగుతున్న స్థానికులు
లావేరు: మండలంలోని లావేరు గ్రామంలో జరిగిన చిన్న అసిరితల్లి సిరిమాను ఉత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి జబర్దస్త్ టీమ్, విశాఖకు చెందిన రోషన్ లాల్ ఆర్కెస్ట్రా సభ్యులు ఆటపాటలతో అలరించారు. జబర్దస్ కళాకారులు రాకెట్ రాఘవ, దొరబాబు, అప్పారావు, శాంతి స్వరూప్, రాజమౌళి, నాగిలు చేసిన స్కిట్‌లు ఆకట్టుకున్నాయి. స్థానికులు వీరితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. కార్యక్రమాలు చూడటానికి వేలాది మంది ప్రజలు వచ్చారు. వారిని కంట్రోల్ చేయడానికి లావేరు ఎస్‌ఐ సీహెచ్ రామారావుతో పాటు పోలీసులు చాలా ఇబ్బందులు పడ్డారు.