sirimanu mahotsavam
-
అంబరాన్నంటే సిరిమాను సంబరం... 260 ఏళ్ల చరిత్ర
Sirimanotsavam 2024: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి సిరిమాను సంబరానికి విజయనగరం సిద్ధమవుతోంది. ఊర్లకు ఊర్లే కదిలి వచ్చే ఈ జనజాతరతో విజయనగరం వీధులు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోతాయి. దారులన్నీ జన సెలయేరులై విద్యలనగరివైపు సాగిపోతుంటాయి. కొలిచినవారికి కొంగు బంగారమై.. కోరిన కోర్కెలెల్లా నెరవేర్చే పైడిమాంబ అంటే ఉత్తరాంధ్రులకు అంత నమ్మకం మరి.. 260 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఉత్తరాంధ్రకే పరిమితం కాకుండా రాష్ట్ర పండుగగా వాసికెక్కింది. ఏటా విజయనగరం వీధుల్లో కనులపండువగా జరిగే ఈ జనజాతరకు లక్షలాది మంది తరలివస్తారు. 260 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఉత్సవం నెల రోజుల పాటు జరుగుతుంది. మహిళలు ప్రతి రోజూ ఘటాలు నెత్తిన పెట్టుకుని అమ్మకు నివేదన చేస్తారు. ఆశ్వయుజ మాసంలో విజయదశమి మరుసటి సోమవారం తొలేళ్ల ఉత్సవం, మంగళవారం సిరిమానోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ప్రకారం ఈనెల 14వ తేదీన తొలేళ్ల ఉత్సవం, 15వ తేదీన సిరిమానోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.బొబ్బిలి యుద్ధం నేపథ్యంలో... విజయనగరం రాజు పూసపాటి విజయరామగజపతిరాజు సోదరే పైడితల్లి. బొబ్బిలి సంస్థానంతో యుద్ధానికి వెళ్లవద్దని, తన మనసు కీడు శంకిస్తోందని సోదరుడిని వారించిందట. అయినా యుద్ధం ఆగలేదు. 1757 జనవరి 23న జరిగిన బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడు చేతిలో తన అన్న వీరమరణం పొందాడని తెలుసుకున్న పైడితల్లి విజయనగరం పెద్దచెరువులో ఆత్మార్పణ చేసుకుంది. సేవకుడైన పతివాడ అప్పలనాయుడికి కలలో కనిపించి ఆమె చెప్పిన ప్రకారం ఆ చెరువులో జాలర్లతో వెతికిస్తే విగ్రహం దొరికింది. అక్కడే గుడి కట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. విజయనగరం రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న వనంగుడి అదే.రసవత్తరంగా సిరిమానోత్సవం... సిరిమానోత్సవం తిలకించడానికి ఈసారి ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సిరిమాను 55 నుంచి 60 అడుగుల పొడవుంటుంది. దాని చివరిభాగంలో ఇరుసు బిగించి పీట ఏర్పాటు చేస్తారు. ఆ పీటపై ఆలయ ప్రధాన పూజారి కూర్చుంటారు. సిరిమాను వేరొక చివర రథంపై అమర్చుతారు. సిరిమాను ఊరేగింపు మూడులాంతర్లు వద్ద గల పైడితల్లి అమ్మవారి గుడి నుంచి రాజాబజారు మీదుగా కోట వరకూ మూడుసార్లు సాగుతుంది. ఈ సిరిమాను ముందుండే బెస్తవారివల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ ఉత్సవానికి భక్తుల రద్దీ దృష్ట్యా 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.చదవండి: బాబు గారి ‘కొవ్వు’ బాగోతం బట్టబయలు నెల రోజుల పండగ సెపె్టంబర్ 20వ తేదీన పందిరి రాటతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అత్యంత అట్టహాసంగా జరిగే తొలేళ్ల ఉత్సవం, సిరిమానోత్సవం ఇందులో భాగమే. అలాగే ఈ నెల 22వ తేదీన తెప్పోత్సవం, 27న కలశ జ్యోతుల ఊరేగింపు, 29న ఉయ్యాలకంబాల ఉత్సవం, 30న చండీయాగం, పూర్ణాహుతితో పైడితల్లి అమ్మవారి జాతర ముగుస్తుంది. విజయనగరం రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అమ్మవారి వనంగుడి, మూడులాంతర్లు జంక్షన్ వద్ద ఉన్న చదురుగుడిలో విశిష్ట కుంకుమార్చనలు, అభిషేకాలు నెల రోజులు కొనసాగుతాయి. నగరపాలక సంస్థ పరిధిలో 50 వార్డుల్లోని మహిళలు రోజుకొక వార్డు చొప్పున ఘటాలను సమర్పిస్తుంటారు. అమ్మవారికి చీర, రవికె, సారె ఇచ్చి చల్లదనం చేస్తారు. పప్పు బియ్యం, చలివిడి నైవేద్యంగా సమర్పిస్తారు. -
కనుల పండువగా పైడితల్లి సిరిమానోత్సవం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం కనుల పండువగా సాగింది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ ఉత్సవం జరిగింది. ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో భక్తులు పోటెత్తారు. విజయనగరం వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. రికార్డు స్థాయిలో దాదాపు 4.5 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి , దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు దంపతులు అమ్మవారికి వస్త్రాలను తీసుకొచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5.22 గంటలకు సిరిమాను కదిలింది. పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానుపై ఆశీనులై భక్తులకు దర్శనం ఇచ్చారు. చదురుగుడి నుంచి కోట వరకు మూడు పర్యాయాలు సిరిమానును తిప్పారు. సాయంత్రం 6.42 గంటలకు సిరిమాను జాతర పూర్తయింది. డీసీసీబీ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సిరిమాను ఉత్సవాన్ని వీక్షించారు. కోటపై నుంచి ఆలయ అనువంశిక ధర్మకర్తలు పూసపాటి అశోక్ గజపతిరాజు, సునీలా గజపతిరాజు, సుధా గజపతిరాజు, ఊర్మిళా గజపతిరాజు తదితరులు ఉత్సవాన్ని తిలకించారు. -
Vizianagaram: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం (ఫొటోలు)
-
ఘనంగా పందిరి రాట ఉత్సవం
-
విజయనగరం ఉత్సవాలకు సన్నద్ధం
సాక్షి, విజయనగరం: విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల వెబ్సైట్, పోస్టర్, కరపత్రాలను గురువారం జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆవిష్కరించారు. ఉత్సవ నిర్వహణ, కార్యక్రమాల వివరాలు, ఫోటో గ్యాలరీను వెబ్సైట్లో పొందిపర్చారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల అధికారులకు కూడా పోస్టర్లు పంపించి ఉత్సవ విశిష్టత గురించి ప్రజలకు తెలిసేలా చర్యలు చేపడుతున్నారు. ఉత్సవాల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. తోలేళ్లు ఉత్సవం రోజున రూ.100, సిరిమానోత్సవం రోజున రూ.300గా టిక్కెట్ ధరలు నిర్ణయించారు. విజయనగర ఉత్సవాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరుకూ మూడు రోజల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. -
అంబరమంటిన సిరి సంబరం
సిరుల తల్లి.. పైడితల్లి. ఎన్నిసార్లు అమ్మరూపం చూసినా మళ్లీమళ్లీ చూడాలన్నదే భక్తుల కోరిక. తల్లిని దర్శించుకుంటే సకల సంపదలు కలుగుతాయని, సుఖ సంతోషాలు ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా నిర్వహించే సంబరమే అయినా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా అమ్మ ఆశీస్సుల కోసం భక్తులు పోటెత్తారు. పైడితల్లి ప్రతిరూపం సిరిమాను సంబరం అంబరాన్ని తాగింది. ఉత్సవాన్ని లక్షలాదిమంది భక్తులు తనివితీరా తిలకించి పులకించిపోయారు. విజయనగరం గంటస్తంభం: భక్తుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం కన్నుల పండువగా సాగింది. లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఉదయం 11.30గంటలకు హుకుంపేటలో పుజారి ఇంటివద్ద బయలుదేరిన సిరిమాను మధ్యాహ్నం 12 గంటలకు పైడితల్లి అమ్మవారి గుడి వద్దకు చేరుకుంది. అక్కడ సిరిమాను రథం కట్టే పని 2.55 గంటలకు ముగిసింది. అనంతరం పుజారి బం టుపల్లి వెంకటరావును సిరిమానుపై అధిష్టించే కార్యక్రమం మొదలైంది. సరిగ్గా 3.50 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభమైంది. అమ్మ గుడి నుంచి కోట బురుజు వద్ద శక్తికి మూడుసార్లు మొక్కి తిరిగి చదురుగుడి వద్దకు 5.12కు చేరింది. 5.20 గంటలకు పూజారిని దింపడంతో సిరిమా ను సంబరం ముగిసింది. సిరిమానుకు ముందు పాలధార సిరిమానుకు ముం దు దుష్టశక్తుల నీడ పడకుండా అడ్డకట్ట వేసేం దుకు పాలధారతో కట్టు కట్టారు. తర్వాత వేదపండితలు మంత్రాలు, ఆశీస్సులతో ముందుకు కదలగా వెంట తెల్ల ఏనుగు, అంజలిరథం. బెస్తవారి వల నడిచింది. పోటెత్తిన భక్తజనం సిరిమానోత్సవానికి ఈ ఏడాది కూడా భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభమవుతుందని ప్రకటించడంతో అధిక సంఖ్యలో భక్తులు కొన్నిగంటల ముందే చేరుకున్నారు. అక్కడే అన్నప్రసాదాలు తీసుకుని, పానీయాలు సేవించి ఉత్సవం ఆద్యంతం చూశా రు. పైడితల్లి చదురుగుడి వైపు ఉన్న ఎంజీ రోడ్డు, అంబటిసత్రం రోడ్డు, కోట వద్ద పాలకొండ రో డ్డు, రాజారావు మేడవైపు రోడ్డు, గురజాడ రోడ్డు జనంతో కిక్కిరిశాయి. సిరిమాను తిరిగే అమ్మవా రి గుడి నుంచి కోట వరకు ఇరువైపులా భారికేడ్లు ఏర్పాటు చేశారు. సుమారు 2లక్షలా 50వేల మంది భక్తులు సిరిమానోత్సవం తిలకించారని అధికారయంత్రాంగం అంచనా వేసింది. వెలుతురు ఉండగానే ముగిసిన సంబరం సిరిమానోత్సవాన్ని వెలుతురు ఉండగానే ముగిం చాలని కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎస్పీ పాలరాజు తదితర ఉన్నతాధికారులు నిర్ణయించడంతో అధికారులు ఆ విధంగానే తగు చర్యలు తీసుకున్నారు. సిరిమాను పుజారి ఇంటి వద్ద నుంచి మధ్యాహ్నానికి చదురుగుడి వద్దకు తీసుకురావాలని నిర్ణయించగా ఆర్డీఓ జేవీ మురళి నిర్దేశిత సమయానికి ఈపక్రియ పూర్తి చేయగలిగారు. వెలుతురుండగానే ఉత్సవం ముగిసింది. ప్రశాంతంగా సాగిన ఉత్సవం శాంతిభద్రతలు విషయంలో పోలీసులు కూడా తగు చర్యలు తీసుకోవడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఉత్సవమంతా ఆధ్యంతం ప్రశాంతంగా సాగింది. పారి శుద్ధ్యం విషయంలో మున్సిపాల్టీ, భారికేడ్లు విషయంలో ఆర్అండ్బీ అధికారులు, ఇతర అధికా రులు సమన్వయంతో పని చేయడంతో ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. పోలీసుల ఓవరేక్షన్ వల్ల కొంతమంది భక్తులు సిరిమానోత్సవాన్ని కనులారా వీక్షించలేకపోయారు. మరికొందరు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు మధ్యాహ్నం 12గంటల నుంచి భక్తులను ఎక్కడికక్కడ ఆవేయడం, 2గంటలకు లోపటకు వెళ్లకుండా భారికేడ్లు మూసేయడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఎప్పుడూ లేనివిధంగా ఒక్కో మార్గంలో మూడెంచెలుగా భారికేడ్లు పెట్టడంతో జనం వెళ్లేందుకు ఆస్కారం లేకపోయింది. లోపల అంతా ఖాళీగానే కనిపించింది. దీనికితోడు ఇటీవల సంభవించిన తిత్లీ తుఫాన్ కారణంగా ఒడిశారాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా నుంచి భక్తులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో రద్దీ కాస్త తగ్గింది. ఒకే వేదికపై నుంచి తిలకించిన రాజులు విజయనగరం, బొబ్బిలి రాజులు ఒకేవేదికపై నుంచి సిరిమానోత్సవం తిలకించారు. పైడితల్లి అమ్మవారి పండగ పూర్తిగా విజయనగరం రాజులకు చెందినదే. పూసపాటి వంశీయులు ఆడపడుచు కావడంతో పండగలో వారే ప్రత్యేకంగా నిలుస్తారు. పైడితల్లి అమ్మవారు సృష్టికి విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య యుద్ధమే కారణమనేది చరిత్ర. అందుకే బొబ్బిలి రాజులు ఎప్పుడూ ఉత్సవం వైపు కన్నెత్తి చూడరు. కానీ బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్కష్ణ రంగారావు వైఎస్సాఆర్ సీపీ నుంచి టీడీపీలో చేరడం, మంత్రి కావడంతో అశోక్‌గజపతిరాజు తదితరులతో కలసి విజయనగరం కోట బురుజుపై నుంచి సిరిమానోత్సవాన్ని తిలకించారు. డీసీసీబీ వద్ద ఆగకూడదనుకున్నా... సిరిమానోత్సవంలో మరోసారి మాజీ మంత్రి, వైఎస్సాఆర్ సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబం చర్చనీయాంశంగా మారాయి. వారు కొన్నేళ్లుగా డీసీసీబీ వద్ద కూర్చొని సిరిమానోత్సవాన్ని తిలకించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా బొత్స సత్యనారాయణ కుటుంబంతో పాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అక్కడే కూర్చొని ఉత్స వం తిలకించారు. అయితే బొత్స కుటుంబం కూర్చున్న డీసీసీబీ వద్ద గత ఏడాది సిరిమాను పలుమార్లు ఆగడంతో వారికి అమ్మవారి ఆశీస్సులు లభించాయి. కావాలని కాకున్నా అమ్మవారి కృప వల్ల అక్కడ సిరిమాను ఆగడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ ఏడాది అక్కడ సిరిమా ను ఆగకుండా చూడాలని పండగ ఏర్పాట్ల సమావేశంలో టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే మంగళవారం సిరిమాను మొదటిసారి వచ్చినపుడు, తిరిగి వెళ్లినపుడే సిరిమాను అక్కడే ఆగింది. ఇది టీడీపీ నాయకులకు ఆగ్రహం తెప్పించింది. వెంటనే సిరిమాను లాగే వారికి అక్కడ ఆగకుండా చూడాలని సంకేతాలు వచ్చాయి. కొందరు టీడీపీ నాయకులు అక్కడ ఆగకుండా సిరిమాను ముందు నడిచి వారిపై ఒత్తిడి పెంచారు. అయినా ఆఖరిసారి తిరిగి వెళుతుండగా అక్కడే సిరిమాను ఆగి వెళ్లడంతో జనం చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అమ్మవారి కృప ఉంటే ఎవరెన్ని కుట్రలు చేసినా ఏమీ కాదని పలువురు వ్యాఖ్యానించారు. అధికారుల సమన్వయం.. పైడితల్లి అమ్మవారి పండగ ప్రశాంతంగా, విజయవంతంగా చేపట్టాలన్న ప్రయత్నం ఫలించింది. అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా పని చేయడంతో సిరిమానోత్సవం విజయవంతమైంది. కలెక్టర్ హరిజవహర్‌లాల్ అన్ని శాఖలనూ సమన్వయం చేయడంలో కృతకృత్యులయ్యారు. మొత్తం సమన్వయం చేసే బాధ్యత జేసీ కె వెంకటరమణారెడ్డి, జేసీ 2 సీతారామారావు, డీఆర్వో జె వెంకటరావు, ఆర్డీఓ జేవీ మురళికి అప్పగించారు. శాంతిభద్రతల విషయంలో ఎస్పీ పాలరాజు తగు చర్యలు తీసుకున్నారు. దర్శన ఏర్పాట్లుతోపాటు సిరిమానోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు దేవాదాయాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఆశాఖ కమిషనర్ రామచంద్రమూర్తి, డిప్యూటీ కమిషనర్ ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఆలయ ఈఓ భానురాజా పర్యవేక్షించారు. సిరిమాను తయారీలో డీఎఫ్ఓ జి లక్ష్మణ్ సహకరించారు. 2వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోలేదు. విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్, జిల్లా ఎస్పీ పాలరాజ్, ఓఎస్డీ విక్రాంత్‌పాటిల్, ఏఎస్పీ ఎం.నరిసింహారావు ఎప్పటిప్పుడు సమీక్షించడంతో ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది. పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు విజయనగరం ఫోర్టు: పైడితల్లి అమ్మవారిని పలు వురు మంత్రులు, ఇతర ప్రముఖులు దర్శించుకున్నారుర. ఆలయ అనువంశిక ధర్మకర్త, విజయనగరం ఎంపీ పూసపాటి ఆశోక్‌గజపతిరాజు దంపతులు, దివంగత ఆనందగజపతి సతీమణి సుధాగజపతిరాజు దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళావెంకటరావు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, బొబ్బిలి చిరంజీవులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే వైఎస్సా ర్ సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, ఎమ్మెల్సీ, వైఎస్సాఆర్ సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే సిరిమానోత్సవాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, వెఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరెడ్డి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి వైఎస్సాఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, నాయకులు అవనాపు విక్రమ్ తదితరులు డీసీసీబీ కార్యాలయం నుంచి తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. కోటపై నుంచి రాష్ట్ర గనులశాఖమంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, కలెక్టర్ హరి జవహర్లాల్, ఎంపీ ఆశోక్‌గజపతిరాజు, జెడ్పీ ఛైర్పర్శన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు మీసాల గీత, బొబ్బిలి చిరంజీవులు, పతివాడ నారాయణస్వామినాయుడు, కె.ఎ.నాయుడు, జేసీ కె.వెంకటరమణారెడ్డి తదితరులు వీక్షింంచారు. -
సిరిమానోత్సవానికి సర్వం సన్నద్దం
-
నవ్వుల పండగ
లావేరు: మండలంలోని లావేరు గ్రామంలో జరిగిన చిన్న అసిరితల్లి సిరిమాను ఉత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి జబర్దస్త్ టీమ్, విశాఖకు చెందిన రోషన్ లాల్ ఆర్కెస్ట్రా సభ్యులు ఆటపాటలతో అలరించారు. జబర్దస్ కళాకారులు రాకెట్ రాఘవ, దొరబాబు, అప్పారావు, శాంతి స్వరూప్, రాజమౌళి, నాగిలు చేసిన స్కిట్లు ఆకట్టుకున్నాయి. స్థానికులు వీరితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. కార్యక్రమాలు చూడటానికి వేలాది మంది ప్రజలు వచ్చారు. వారిని కంట్రోల్ చేయడానికి లావేరు ఎస్ఐ సీహెచ్ రామారావుతో పాటు పోలీసులు చాలా ఇబ్బందులు పడ్డారు. -
వేడుకగా పైడితల్లి పందిరిరాట మహోత్సవం
-ధర్మపురిలో సిరిమాను సాక్షాత్కారం -పైడితల్లి ఆలయ పూజారి భాస్కరరావు వెల్లడి విజయనగరం : ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి చదురుగుడి వద్ద పందిరిరాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈఓ భానురాజా, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ మూర్తి తదితరులు అమ్మవారి పందిరి రాట మహోత్సవంలో పాల్గొన్నారు. చదురుగుడి అనంతరం రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అమ్మవారి వనంగుడి ఆవరణలోనూ రాట మహోత్సవం నిర్వహించారు. అనంతరం ఉత్సవాల్లో కీలకఘట్టమైన సిరిమా నోత్సవానికి సంబంధించి స్దానిక ధర్మపురిలో అమ్మవారి సిరిమాను సాక్ష్యాత్కారమైంది. ధర్మపురి గ్రామంలోని బీసీ కాలనీలో వల్లిపల్లి వెంకటరమణ, ఆదినారాయణల కళ్లాల్లో సిరిగల చింతమాను అక్కడ సాక్షాత్కరించిందని చెప్పారు. సుమారు 65 నుంచి 70 అడుగుల సిరిమాను అక్కడ ఉందన్నారు. నేటినుంచి సిరిమాను తరలించే వరకూ అక్కడ పూజాదికాలు జరుగుతాయన్నారు. అనంతరం మేళతాళాలతో త్వరలోనే హుకుంపేట పూజారి ఇంటికి తరలిస్తామని చెప్పారు. సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పీవీఏవీఎస్.భానురాజా తదితరులు పాల్గొన్నారు.