
సాక్షి, విజయనగరం: విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల వెబ్‌సైట్, పోస్టర్, కరపత్రాలను గురువారం జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆవిష్కరించారు. ఉత్సవ నిర్వహణ, కార్యక్రమాల వివరాలు, ఫోటో గ్యాలరీను వెబ్‌సైట్‌లో పొందిపర్చారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల అధికారులకు కూడా పోస్టర్లు పంపించి ఉత్సవ విశిష్టత గురించి ప్రజలకు తెలిసేలా చర్యలు చేపడుతున్నారు. ఉత్సవాల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. తోలేళ్లు ఉత్సవం రోజున రూ.100, సిరిమానోత్సవం రోజున రూ.300గా టిక్కెట్ ధరలు నిర్ణయించారు. విజయనగర ఉత్సవాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరుకూ మూడు రోజల పాటు ఉత్సవాలు జరగనున్నాయి.