జాడలేని రిమ్స్ అభివృద్ధి కమిటీ | Rimes traces the development committee | Sakshi
Sakshi News home page

జాడలేని రిమ్స్ అభివృద్ధి కమిటీ

Published Sat, Sep 7 2013 6:20 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM

Rimes traces the development committee

ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా కేంద్రంలో రిమ్స్‌ను ఏర్పాటు చేశారు. కానీ, వైఎస్సార్ మరణానంతరం పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో వైద్యం అందని ద్రాక్షగానే మారింది. ఆస్పత్రిలో రోగుల సమస్యలు, పరికరాల కొనుగోలు, అభివృద్ధి అంశాలను చర్చించేందుకు రిమ్స్ అభివృద్ధి కమిటీ పనిచేస్తుంది. మూడు నెలలకోసారి రిమ్స్ డెరైక్టర్ ఆధ్వర్యంలో రిమ్స్ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ సమావేశంలో చర్చించి, తీసుకున్న నిర్ణయాలు యుద్ధప్రాతిపాదికన అమలు చేయాలి. కానీ అభివృద్ధి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలుకాకపోవడంతో అభివృద్ధి పడకేసింది. దీంతో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందడం లేదన్న విమర్శలున్నాయి.
 
 అభివృద్ధికి ఆటంకం
 ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం చివరిసా రి 2012 మే 22న జరిగింది. అప్పటి నుంచి ఏడాదిన్నర కాలంగా సమావేశం నిర్వహించకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుంది. దీంతో ఆస్పత్రి అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. ఆస్పత్రిలో రోగులు ఎదుర్కొం టున్న సమస్యలు, అవసరమైన పరికరాలు, మందులు కొనుగోళ్లు, అభివృద్ధి నిధుల ఖర్చు ల వివరాలపై చర్చించి పలు తీర్మానించడానికి ఏర్పాటు చేయాల్సిన సమావేశం ఊసేలేకపోవడంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఆయా విభాగాల అధికారులకు కమిటీ సభ్యులు తెలియజేస్తారు. సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా తీర్మానాలు చేసి వదిలేస్తున్నారే తప్పా వాటిపై దృష్టిసారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
 
 కమిటీలో ఎవరెవరు..
 రిమ్స్ ఆస్పత్రి డెవలప్‌మెంట్ కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, లోక్‌సభ, శాసనసభ సభ్యులు, రిమ్స్ డెరైక్టర్, డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్, పురపాలక సంఘం కమిషనర్, ఇద్దరు సీని యర్ వైద్య  నిపుణులు, ఐఎంఏ అధ్యక్షుడు, ఒక ఎన్‌జీవో, ఒక డ్వాక్రా మహిళ సభ్యులుగా రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి సంఘంలో ఉంటారు. ఈ సంఘానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇంత మంది జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్న సంఘం లో వారు తీసుకున్న నిర్ణయాలు అమలుకాకపోవడం శోచనీయం. సమావేశానికి మాత్రమే జిల్లా ప్రజాప్రతినిధులు రిమ్స్‌లో కనిపిస్తారు. అంతేగాని రిమ్స్‌లో రోగులకు వైద్య సేవలు అందుతున్నాయ? వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారా? సరైన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయా? ఆస్ప త్రి అభివృద్ధి నిధులు దేనికి ఖర్చు చేస్తున్నార న్న విషయాలపై ప్రజాప్రతినిధులు ఆరా తీసి న దాఖలాలు లేవు. ప్రస్తుత కలెక్టర్ రిమ్స్‌పై దృష్టి సారించడంతో ఆస్పత్రి అభివృద్ధి జరుగుతుందని అందరు ఆశగా చూ  స్తున్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీపై కూడా కలెక్టర్ పర్యవేక్షించాలని పలువురు కోరుతున్నారు.
 అమలుకు నోచుకోని తీర్మానాలు..
 గతంలో నిర్వహించిన సమావేశాల్లో ఆస్పత్రిలో చేరే రోగులకు సకాలంలో చికిత్సలు అందించడానికి వీలుగా 20మంది క్యాజువా లిటీ మెడికల్ ఆఫీసర్స్(సీఎంవో) నియమించాలని నిర్ణయించారు. వీరిని ఒప్పంద ప్రాతిపాదికన నియమిస్తామని అప్పటి డెరైక్టర్ పేర్కొన్నారు. అది అమలు కాలేదు. దీంతో క్యాజువాలిటీలో తగినంత మంది వైద్యులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
 
 రిమ్స్‌కు వచ్చే రోగులకు సరిపడా పడకల ను ఉంచాలంటూ ఆస్పత్రి అభివృద్ధి సం ఘం తీర్మానించినా పరిస్థితిలో మార్పు రా లేదు. ఆస్పత్రిలో మరో 200 పడకలు అవసరమున్నాయి. సరిపడ పడకలు లేకపోవడంతో రోగులు బల్లపైనే పడుకొని చికిత్స పొందే పరిస్థితి ఏర్పడింది. వార్డుల్లో ఒక్కో పడకపై ఇద్దేరేసి రోగులను చూడవచ్చు.
 
 2012 జనవరి 27న నిర్వహించిన సమావేశంలో ఆస్పత్రిలో సెంట్రల్ ఆక్సిజన్ ఏర్పా టు చేయాలని కమిటీ తీర్మానించినా అమలుకాలేదు. సెంట్రల్ ఆక్సిజన్ లేకపోవడంతో రోగులకు అత్యవసర సమయంలో ఆక్సిజన్ అందించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
 2012 మే 22న నిర్వహించిన సమావేశంలో రిమ్స్‌లో మూడు బోరుబావులు, ఒక చేతి పంపు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అదేకాకుండా రిమ్స్‌కు మున్సిపాలిటీ పైప్ లైన్ ద్వారా రూ.9.50 లక్షలతో మున్సిపాలిటీ వాటర్ సరఫరా కనెక్షన్ పెట్టించాలని కమిషనర్‌కు అప్పటి కలెక్టర్ తెలిపారు. దీనికి అవసరమైన ఆ నిధులను రిమ్స్ డెరైక్టర్ సమకూర్చాలని తీర్మానించారు. ఈ నిర్ణయాలు అమలుకు నోచుకోలేదు.
 
 రిమ్స్‌లో క్యాంటీన్, బేకరీలు టెండర్ ద్వారా నిర్వహించి రోగులకు నాణ్యమైన ఆహార పదర్థాలు అందించాలని నిర్ణయించారు. అది కూడా జరగడం లేదంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement