సాక్షి, వైఎస్సార్ జిల్లా : నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఉన్న సిబ్బంది కొరతను త్వరలోనే అదిగమిస్తామని చెప్పారు. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. సోమవారం కడప రిమ్స్ ఆస్పత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 352.62 కోట్ల రూపాయలతో 7 రకాల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కొరకు ఏర్పాటు చేసిన శిలాఫలకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
(చదవండి : రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం: సీఎం జగన్)
మానసిక వికలాంగుల ఆస్పత్రి కోసం రూ.40.82 కోట్లు, వైఎస్సార్ క్యాన్సర్ ఆస్పత్రి కొరకు రూ.107కోట్లు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రూ.125 కోట్లు, పోలీసుల భవన నిర్మాణానికి రూ.20.95 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రిమ్స్ ఆస్పత్రితో పాటు రాష్ట్రంలోని వైద్యశాలలన్నింటిలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులలో సిబ్బంది కొరత ఉందని, త్వరలోనే దానిని అధిగమిస్తామని సీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment