
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మానవాళి కోసం జీసస్ చేసిన మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు.. ఆ తర్వాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలని వివరించారు.
మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇది జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలోనూ ఆయన తాజాగా ఓ సందేశం ఉంచారు.
On this Good Friday, we remember the ultimate sacrifice of Jesus Christ for humanity and reflect on the power of love, forgiveness, patience, and hope.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 18, 2025
