Good Friday
-
Cover Story: ఆ ఖాళీ సమాధి యేసు పునరుత్థానానికి నిలువెత్తు సాక్ష్యం!
‘‘యేసు సమాధిలో పరుండియుండి వాసిగ మూడవనాడు లేచెన్.. లేచెన్ సమాధి నుండి మృత్యువుపై విజయమొంది.. మృత్యుబంధంబులన్ నిత్యుండు త్రెంచెన్ స్తుత్యుండు జయించెన్.. జయం జయం’’ అంటూ రాబర్ట్ లౌరీ వ్రాసిన పాటను గొంతెత్తి పాడే సమయం ఈస్టర్ పండుగ. ప్రపంచవ్యాప్తంగా విస్తరించియున్న క్రైస్తవులు ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మానవుని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. ప్రస్తుతం ఝెరూషలేములోని యేసు ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్థానానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మహిమాన్వితమైన ఆ చారిత్రక సంఘటన మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది. ‘‘ఆ కాలంలో యేసు అనే ఒక మనుష్యుడుండేవాడు. అతడిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. ఎందుకంటే అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి మంచి బోధకునిగా ఉన్నాడు. తనవైపు అనేకమంది యూదులను అనేకమంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి సిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించినవారు మొదట ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడినాడు. ఆయన నుండి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు’’ ఈ మాటలను చరిత్రకారుడు ఫ్లావియస్ జోసఫస్ తన పుస్తకంలో వ్రాశాడు. ఆయన రాసిన సంగతులు నేటికీ చరిత్రకు ఆధారంగా ఉన్నవి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు జన్మను, మరణాన్ని, పునురుత్థాన్ని కూడా ధ్రువీకరించాడు. ‘‘యేసుక్రీస్తు నిజంగా జీవించి, మరణించి, మృతులలో నుండి లేచాడన్న తమ దృఢ విశ్వాసము కొరకు వారు శ్రమపడి మరణించారు’’ అని సుటోనియస్ అనే చరిత్రకారుడు వ్రాశాడు. ఇతడు రోమా చరిత్రకారుడు. హేడ్రియన్ అనే రాజు వద్ద అధికారిగా పనిచేసేవాడు. చరిత్రకు సంబంధించిన విషయాలను స్పష్టంగా తన వ్రాతలలో పొందుపరచాడు. రోమన్ చక్రవర్తులైన జూలియస్ సీజర్ నుండి డొమీషియన్ వరకు గల 12 మంది చక్రవర్తుల జీవిత చరిత్రలను వ్రాశాడు. రోమా సామ్రాజ్యంలోని రాజకీయాల గూర్చి, కవులను గూర్చి, సామాన్య ప్రజలను గూర్చి చాలా విషయాలు వ్రాసి భద్రపరచాడు. మొదటి శతాబ్దంలో రగిలిన ఉజ్జీవాన్ని, సంఘం పొందిన శ్రమలను, ధైర్య విశ్వాసాలతో పరిస్థితులను ఎదుర్కొన్న దేవుని ప్రజల పరిస్థితిని సుటోనియస్ వివరించుట ద్వారా యేసుక్రీస్తు ఒక కల్పిత పాత్ర కాదని, ఆయన మనుష్యులందరి కొరకు ప్రాణం పెట్టి మూడవ రోజున తిరిగిలేచిన సజీవుడని ప్రతి ఒక్కరూ గుర్తించడానికి దోహదమయ్యింది. యేసుక్రీస్తు జీవితం ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకు వచ్చింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా, పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా పరమాత్ముని బాటలో నడవాలని క్రీస్తు బోధించాడు. సి.ఎస్.లూయీ అనే సుప్రసిద్థ సువార్తికుడు, వేదాంతవేత్త ఇలా అంటాడు. ‘‘యేసు ఈ లోకానికి వచ్చి తానెవరో లోకానికి తెలియచేశాడు. నేను లోకానికి వెలుగును, జీవాహారము నేనే, మార్గము సత్యమును జీవమును నేనే అని చెప్పడంలో మనిషి మనసులో ఉన్న ప్రశ్నలకు జవాబులనిచ్చాడు. క్రీస్తు ఆవిధంగా పలికాడంటే ఆయన అబద్ధీకుడైనా లేదా మతిస్థిమితం లేనివాడైనా లేదా రక్షకుడైనా అయ్యుండాలి. యేసుక్రీస్తు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. ఆయన మతి స్థిమితం లేనివాడు కాదు. అదే వాస్తవమైతే ఆయన ఇన్ని విశిష్ట బోధలు చేసియుండేవారు కాదు. అనేకులను స్వస్థపరచేవాడు కాదు. ఆయన రక్షకుడు గనుకనే సిలువలో మనిషి పాపముల నిమిత్తం మరణించి మూడవ రోజున తిరిగి లేచారు.’’ తన జీవితకాలమంతా భౌతికంగా అంధురాలైనప్పటికీ క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని, అయన ప్రేమతత్త్వాన్ని తాను రచించిన ఎనిమిది వేల పాటలతో తెలియచేసి క్రైస్తవ ప్రపంచంలో ఖ్యాతిని ఆర్జించిన ఫ్యానీ క్రాస్బీ క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ఇలా వ్రాసింది. ‘‘క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన విశిష్ట బలము ద్వారా మరణాన్ని జయించాడు. రాయి పొర్లింపబడింది. సమాధి ఆయనను శాశ్వతంగా బంధించలేకపోయింది. జగమంతా ఆనందంతో నిండిపోయింది. క్రీస్తు స్నేహితులారా! మీరు కన్నీళ్ళు విడచుట మానండి ఎందుకంటే ఆయన మహిమగల రాజు.’’ ఈ మాటలను తన హృదయాంతరాళాల్లోంచి వ్రాయడం ద్వారా తాను భౌతికంగానే అంధురాలు గాని ఆధ్యాత్మికంగా కాదు అని ఋజువు చేసింది క్రాస్బీ. క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థాన పండుగను చాలా భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటారు. యేసు లేఖనాలు ప్రకారం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచెను. నా విమోచకుడు సజీవుడు అని యోబు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా పలికాడు. దావీదు కీర్తనలలో కూడా క్రీస్తు పునరుత్థానమును గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ‘‘నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యవు’’– (కీర్తన 16:10) అనే ప్రవచనం క్రీస్తుకు ముందు వెయ్యిసంవత్సరాల క్రితమే చెప్పబడింది. ఝెషయా అనే ప్రవక్త క్రీస్తును గూర్చి ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. అవన్నీ క్రీస్తుకు ముందు ఏడువందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయి. వాటిలో క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన ప్రవచనం ఝెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చూడగలము. అతడు తన్నుతానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో అనేకసార్లు తన శిష్యులకు ఇలా చెప్పాడు. ‘‘మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగించబడును. వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయన మీద ఉమ్మివేసి, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను’’– (లూకా 18:3133). క్రీస్తు తనకు సంభవింపబోవు వాటిని ముందుగానే తన శిష్యులకు తెలియచేశాడు. వాస్తవానికి యేసుక్రీస్తుకు పొంతి పిలాతు అనే రోమన్ గవర్నర్ ద్వారా అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తిని తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఆ తదుపరి ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. ఈ నాటికి ఝెరూషలేమునకు వెళ్ళితే అక్కడ వయా డొలొరిసా అనే మార్గాన్ని చూస్తాము. ఆ మార్గములో పద్నాలుగు స్టేషన్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో క్రీస్తు ఏ విధంగా శ్రమపడ్డారో చరిత్రను తెలుసుకోవచ్చు. సిలువ మరణ శిక్ష మొదటిగా ఫనిషియన్లు అమలు పరచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు మరియు రోమన్లు ఈ శిక్షను అమలు పరచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. సిలువ శిక్ష అనేది అవమానకరమైన కార్యంగా భావించేవారు. రోమన్ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ శిక్ష విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు, పరాయి దేశస్థులకు ఈ శిక్ష విధించే వారు. యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్ళు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి భుజాలపై సిలువను మోపి కల్వరి కొండపైకి నడిపించారు. సిలువ యొక్క బరువు సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. భారభరితమైన ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. కల్వరి అనగా కపాలమనబడిన స్థలము. మనిషి పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. యేసు సిలువను మోసుకొంటూ గొల్గొతా అనే ప్రాంతాన్ని చేరుకోగానే ఆయనను సిలువపై ఉంచి చేతులలోను కాళ్ళలోను మేకులు కొట్టి వేలాడదీశారు. శుభ శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు యేసును సిలువవేశారు. సుమారు ఆరు గంటలు యేసు సిలువపై వ్రేలాడి ఏడు మాటలు పలికారు. నేటికి అనేకమంది సిలువలో క్రీస్తు పలికిన యేడు మాటలను ధ్యానం చేస్తుంటారు. పలుకబడిన ఒక్కోమాటలో ప్రపంచానికి కావల్సిన అద్భుతమైన సందేశం ఉందని క్రైస్తవులు విశ్వసిస్తారు. అరిమతయియ యోసేపు, నికోదేము అనువారు క్రీస్తు దేహాన్ని సిలువనుండి దింపి ఒక తోటలో తొలచబడిన సమాధిలో ఉంచారు. అరిమతయియ యోసేపు బహు ధనవంతుడు, యూదుల న్యాయసభలోని సభ్యుడు. తాను అంతకు ముందు క్రీస్తుకు రహస్య శిష్యుడు. అంతవరకు తనలో గూడుకట్టుకున్న భయాన్ని వదిలి పిలాతు దగ్గరకు వెళ్ళి తన ప్రభువును పాతిపెట్టడానికి అనుమతి కోరాడు. సిలువ వేయబడిన ఒక వ్యక్తికోసం మహాసభ సభ్యుడైన అతడు బహిరంగంగా తీసుకొన్న తన నిర్ణయం వలన పిలాతుకు కలిగిన ఆశ్చర్యం, యూదులకు కలిగిన అసహనం ఊహించవచ్చు. యోసేపు తనకోసం తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తుకు ఇచ్చేశాడు. నీ పరిస్థితేంటి అని ఎవరో అడిగారట. అందుకు యోసేపు ‘‘నేను యేసుకు ఈ సమాధిని మూడు రోజులకే ఇస్తున్నాను’’ అని సమాధానమిచ్చాడు. నిజమే! యేసు సమాధిలో మూడు రోజులే ఉన్నాడు. తాను మరణించక ముందు తన పునరుత్థానమును గురించి పదే పదే మాట్లాడాడు. తాను చెప్పినట్టే క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? అని శాసిస్తూ, మరణపు ముల్లును విరిచి క్రీస్తు మృత్యుంజయుడైనాడు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఆశించేది గెలుపు. ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని ఇచ్చేది. భూమ్మీద బతికే అందరికి ముఖ్యమైనది కూడా. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మనిషి తాను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని ఆకాంక్షిస్తాడు. ఆ విజయం వల్ల దక్కిన సంతృప్తితో కాలం గడపాలని కోరకుంటాడు. ఓటమి అంగీకరించడం చేదైన విషయమే! మింగుడు పడని వ్యవహారమే! ప్రపంచంలో చాలా రకాలైన గెలుపులున్నాయి. పరీక్షల్లో, పందెపురంగంలో, ఉద్యోగ బాధ్యతల్లో, అనుకున్నది సాధించడంలో.. ఇంకా మరెన్నో! ఏదో ఒక పనిలో విజయాన్ని సాధిస్తేనే ఇంత సంతోషంగా మానవుడుంటే, ప్రతి మనిషికి ముల్లులా తయారైన మరణాన్నే జయిస్తే?! మృత్యువునే గెలిస్తే?! ఇంకెంత ఆనందం, ఇంకెంత ఉత్సాహం! సరిగ్గా రెండు వేల సంవత్సరాల క్రితం అదే జరిగింది. మనిషి మెడలు వంచిన మరణం మెడలు వంచబడ్డాయి. అంతవరకు ప్రతి ఒక్కరినీ తన గుప్పిట్లో బంధించిన మరణం మరణించింది. అసలు ఈ పుట్టుకకు, మరణానికి, దానిని గెలవడానికి ఉన్న సంబంధం ఏమిటి? మనుషులంతా పుడుతున్నారు. ఏదో ఒక రోజు ఏదో ఒకవిధంగా మరణిస్తున్నారు. శరీరం మట్టిలో కలిసిపోతుంది. చనిపోయిన తరువాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇలాంటి మదిని తొలిచే ప్రశ్నలన్నింటికి అద్భుతమైన సమాధానాలు క్రీస్తు మరణ పునరుత్థానాల వలన ప్రపంచానికి లభించాయి. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘనులెందరో సమాధులకే పరిమితమయ్యారు. ఈజిప్టులో నేటికి ఫారోల సమాధులు (పిరమిడ్లు), వారి దేహాలు ఉన్నాయి. గొప్పవ్యక్తులమని చాటించుకున్న ఫారోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బాబిలోను రాజైన నెబూకద్నెజర్ మరణాన్ని ఓడించలేకపోయాడు. అలెగ్జాండ్రియాలో ఇప్పటికి అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి ఉంది. రోమ్‌లో జూలియస్ సీజర్ సమాధి మూయబడియుంది. చరిత్రలో ఎందరో మరణాన్ని జయించలేకపోయారు. యేసు మరణాన్ని జయించుట ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏదీ ఉండదని ఋజువు చేయబడింది. క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఏండ్లతరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యల మీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కల్గింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కనివిని ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది. యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవలేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలు సందర్శించి, అనేక వివరాలు సేకరించిన తర్వాత ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలను బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి, ఒక అద్భుతమైన పుస్తకాన్ని వ్రాశాడు. దాని పేరు ‘‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’’ ఆ పుస్తకంలో యేసుక్రీస్తు పునురుత్థానానికి సంబంధించి అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. యేసు మరణాన్ని జయించి తిరిగిలేవలేదు అని చెప్పడానికి ఏవేవో సిద్ధాంతాలను చలామణీలోనికి తీసుకొచ్చారు గాని, వాటిలో ఏవీ వాస్తవం ముందు నిలబడలేదు. శిష్యులు తప్పు సమాధినొద్దకు వెళ్ళారని, యేసు దేహం ఎత్తుకుపోయారని, అసలు యేసు సిలువలో చనిపోలేదు.. స్పృహతప్పి పడిపోయారని, శక్తిమంతమైన సుగంధద్రవ్యాలను ఆయనకు పూసి బతికించేశారని, శిష్యులు భ్రమపడి యేసు కనబడ్డాడని చెప్పి ఉండవచ్చని ఎన్నో తప్పుడు సిద్ధాంతాలను తెరపైకి తీసుకొచ్చారు. సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. ఖాళీ సమాధి నేర్పించిన పాఠం ఇదే కదా! సత్యాన్ని అందరూ మోసుకెళ్ళి సమాధిలో పెట్టవచ్చును గాని దానిని ఎక్కువ కాలం అక్కడ ఉంచలేరు. యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్ శతాధిపతి పేరు బైబిల్లో లేదు గాని, చరిత్రలో అతని పేరు చూడగలము. ఆ వ్యక్తి పేరు లాజినస్. పిలాతు ఆజ్ఞను శిరసావహించడంలో ప్రథముడు. అతని సమక్షంలోనే యేసుకు మేకులు కొట్టబడ్డాయి. ముళ్ళకిరీటం ధరించబడింది. సిలువ ప్రక్రియ అంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ‘ఆ నీతిమంతుని జోలికి పోవద్దు’ అని తన భర్తకు వర్తమానం పంపిన పిలాతు భార్య క్లౌదియ ప్రొక్యులా లాజినస్‌ను కలుసుకుని, ఇలా అడిగింది ‘‘సిలువలో మరణించిన క్రీస్తుపై నీ అభిప్రాయం ఏమిటి? ఆ మహనీయుని గురించి ఏమనుకుంటున్నావు?’’ ఆ ప్రశ్నలకు లాజినస్ ఇచ్చిన సమాధానమిది‘‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. మిట్టమధ్యాహ్నం సూర్యుడు తన ముఖాన్ని దాచుకున్నప్పుడు వచ్చిన చీకటి, సమాధులలో నుండి మనుష్యులు లేవడం, దేవాలయపు తెర పై నుండి కిందకు చినగడం చూస్తుంటే తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణపు మెడలు వంచి సజీవుడై బయటకు వస్తాడు. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి బయలుదేరతాడు. ఈసారి ఆయనను ఏ రోమన్ చక్రవర్తి, శతాధిపతి గాని, సైనికుడు గాని, యూదా మత పెద్దలైన శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’’ అని బదులిచ్చాడు. యేసుక్రీస్తు పునరుత్థానం వలన మనిషికి సమాధానం, ధైర్యం, నిరీక్షణ అనుగ్రహించబడ్డాయి. సమాధానం.. యేసుక్రీస్తు చనిపోయారని భయంతో నింపబడి శిష్యులకు ఆదివారం సాయంత్రం పునరుత్థానుడైన యేసు ప్రత్యక్షమయ్యాడని అపొస్తలుడైన యోహాను తన సువార్తలో వ్రాశాడు. శిష్యులంతా ఇంటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి ‘మీకు సమాధానం కలుగునుగాక’ అని వారితో చెప్పెను. మూడున్నర సంవత్సరాలు తనతో ఉండి గెత్సేమనే తోటలో తనను పట్టుకుంటున్నప్పుడు విడిచి పారిపోయిన వారిని బహుశా ఎవరైనా చీవాట్లు పెడతారేమో గాని ప్రేమపూర్ణుడైన ప్రభువు వారి స్థితిని సంపూర్ణంగా తెలుసుకున్నవాడై వారికి శాంతి సమాధానాలను ప్రసాదించాడు. సమాధానకర్తయైన ప్రభువును హృదయాల్లోనికి ఆహ్వానించడమే ఆశీర్వాదకరం. ఈనాడు అనేకులు తమ పరిస్థితులను బట్టి హృదయంలో, కుటుంబంలో సమాధానం లేనివారుగా ఉంటున్నారు. సమాధానం లేకనే ఆత్యహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. శాంతిగా బతకడానికి మానవుడు చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ లేదు. నవ్వుతూ బతకాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా లాఫ్టర్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. రోజులో కొంత సమయం అక్కడికి వెళ్ళి పగులబడి నవ్వుకుంటున్నా శాంతి సమాధానాలు దొరకని కారణాన ఈ మధ్యన క్రైయింగ్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఏడ్వడం ద్వారా భయటకు పంపిస్తే సంతోషంగా ఉండొచ్చన్నది వారి అభిప్రాయం. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే మార్గాలు మాత్రమే! నిజమైన ఆనందం, శాంతి దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా లభిస్తుంది. యేసుక్రీస్తు అలిసిపోయిన ప్రజలను చూసి ఇలా అన్నాడు. ‘‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును’’ ఆయన చెంతకు వచ్చిన ఎన్నో జీవితాలు పావనమయ్యాయి. పునరుత్థానుడైన క్రీస్తును చూచి శిష్యులు పులకించిపోయారు. దేవుడు తమను విడిచిపెట్టలేదన్న సత్యం వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో తమ లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయారు. గెలుపుబాటలో దూసుకుపోయారు. భయపడకుడి.. ఆదివారం ఉదయం తెల్లవారకముందే కొంతమంది స్త్రీలు క్రీస్తు సమాధిని చూడడానికి వచ్చారు. వారక్కడికి వచ్చినప్పటికే ఒక గొప్ప భూకంపం వచ్చింది. ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి సమాధిరాయి పొర్లించి దానిమీద కూర్చుండెను. అక్కడ ఉన్న రోమా కావలివారు వణికి చచ్చినవారివలె ఉన్నారు. వారు భయపడాల్సింది ఏదీలేదనే వాగ్దానాన్ని వారు పొందుకున్నారు. లోకమంతా ఎన్నో భయాలతో నిండింది. వ్యాధులు, యుద్ధాలు, వైఫల్యాలు, ఇంకా ఎన్నో సమస్యలు మనిషి భయానికి కారణాలుగా ఉన్నాయి. భయం మనిషిని ముందుకు వెళ్ళనివ్వదు. గమ్యంవైపు సాగనివ్వదు. భయం గుప్పిట్లో జీవిస్తున్న మనిషికి నిజమైన ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడన్నది లేఖన సత్యం. నిరీక్షణ.. యేసుక్రీస్తు మొదటగా లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. మానవులందరి రక్షణ కొరకు సిలువ శ్రమను, మరణమును అనుభవించారు. మూడవ దినమున తిరిగిలేచారు. రెండవసారి ఆయన తన ప్రజలను అనగా ఆయన రక్తములో కడుగబడి, పాపక్షమాపణ పొంది పవిత్రజీవితాన్ని, ఆయన పట్ల విశ్వాసాన్ని కొనసాగించువారికి నిత్యజీవాన్ని అనుగ్రహించుటకు రాబోతున్నారు. ఆయన పునరుత్థానుడై ఉండకని యెడల ఆ నిరీక్షణకు అవకాశమే లేదు. లోకములో ఎన్నో విషయాల కొరకు ఎదురుచూసి నిరాశ పడతారు కానీ ప్రభువు కొరకు ఎదురు చూసేవారు ఎన్నడూ సిగ్గుపడరు. ప్రభువునందు మనకున్న నిరీక్షణ ఎన్నడూ అవమానకరము కాదు. ‘‘విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువును గెలిచి నేడు వేంచెసె యజమానుడెల్ల ప్రయాసములు ఎడబాప స్వజనులను రక్షింప సమసె సిలువమీద... విజయంబు మానవుల పాపము నివృత్తిని విభుడొనరింపన్ కుజనులచే అతడు క్రూర మరణము నొంది విజిత మృత్యువునుండి విజయుండై వేంచేసె’’ అంటూ కీర్తనలు పాడుచూ క్రీస్తు పునరుత్థానమును ఆధ్యాత్మిక ఆనందంతో, నిండు హృదయంతో దేవుని ప్రజలంతా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. (సాక్షి పాఠకులకు ఈస్టర్ శుభాకాంక్షలు). — డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి ఇవి చదవండి: Funday Story: 'ఋతధ్వజుడు మదాలసల గాథ' -
Good Friday 2024 : భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే (ఫొటోలు)
-
రాష్ట్రవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే ప్రార్థనలు
-
గుడ్‌ఫ్రైడే.. సీఎం వైఎస్ జగన్ ట్వీట్ సందేశం
సాక్షి, కర్నూలు: గుడ్ ఫ్రైడే సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. మానవాళి కోసం జీసస్ చేసిన త్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే. ఇతరులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, సహనం, త్యాగం… ఇవన్నీ తన జీవితం ద్వారా ఆయన మానవాళికి ఇచ్చిన సందేశాలు అని పేర్కొన్నారాయన. అంతకు ముందు ఒక ప్రకటనలో.. ‘మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే.. జీసస్ జీవితమే మానవాళికి గొప్ప సందేశం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘‘ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు. ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు’’ అని సీఎం పేర్కొన్నారు. మానవాళి కోసం జీసస్ చేసిన త్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే. ఇతరులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, సహనం, త్యాగం… ఇవన్నీ తన జీవితం ద్వారా ఆయన మానవాళికి ఇచ్చిన సందేశాలు. #GoodFriday — YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2024 మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనలు ద్వారా జీసస్ లోకానికి ఇచ్చిన సందేశాలు’’ అని సీఎం జగన్ అన్నారు. -
క్రీస్తు బలియాగం వెనుకున్న పరమార్థం ఇదే..!
క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాల వెనుక దేవుని దివ్య సంకల్పం ఉంది. దీన్నే సువార్త అంటారు. సువార్త దేవుని సంకల్పంతో ఎప్పుడూ ముడిపడే ఉంటుంది. పూర్వపు దేవుని సంకల్పం చెప్పక దాన్ని దాటవేసే సువార్త అసలు లెస్సయైన లేఖనానుసార సువార్తగా ఎప్పటికీ కానేరదు. సువార్త పుట్టుకకు ఆయువుపట్టు వంటి దేవుని ప్రణాళికను చాలా పకడ్బందీగా, పటిష్టంగా వివరించకున్ననూ అది సువార్త కాదు. సత్యవాక్యం అనే రక్షణ భాగ్యపు సువార్త ప్రకటన అపొస్తలుల బోధకు లోబడే ఉండి తీరాలి. వారపు ప్రప్రథమ దినం అనే ప్రతి ఆదివారం నాడు యెడతెగక దేవుని ఆరాధనలో భాగంగా జరిగే రొట్టె విరుచుట అనేది క్రీస్తు బలియాగానికి గుర్తు. క్రీస్తు పస్కా బలి పశువుగా, వధకు సిద్ధమైన గొఱె -
మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రైడే: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ‘మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే.. జీసస్ జీవితమే మానవాళికి గొప్ప సందేశం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘‘ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు. ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు’’ అని సీఎం పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనలు ద్వారా జీసస్ లోకానికి ఇచ్చిన సందేశాలు’’ అని సీఎం జగన్ అన్నారు. -
గుడ్ ఫ్రైడే' 2024: ప్రాముఖ్యత ఏంటి.. ‘హ్యాపీ గుడ్ ఫ్రైడే' విషెస్ చెప్పకండి!
క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే పవిత్ర దినం. బైబిలు ప్రకారం గుడ్ ఫ్రైడ్ అంటే మానవాళి పాపాలకు జీసస్ శిలువపై ప్రాణాలను పణంగా పెట్టిన రోజు. అందుకే ఏసుక్రీస్తు జ్ఞాపకార్థం ఈ రోజును పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. శిలువ వేయబడిన మూడు రోజుల తరువాత యేసు పునరుత్థానాన్ని ఆదివారం రోజు ఈస్టర్ గా పాటిస్తారు. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలచుకుంటారు. జీసస్ ప్రార్థనలో గడుపుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ప్రవచనాలు, ప్రార్థనలు, ధ్యానం వంటివి జరుగుతూనే ఉంటాయి. కొంతమంది నల్లటి వస్త్రాలు ధరించి తమ బాధను వ్యక్తపరుస్తారు. గుడ్ ఫ్రైడే విషెస్ యేసు మరణానికి త్యాగానికి గుర్తుగా సంతాపాన్ని తెలియజేయడానికి దీన్ని నిర్వహించు కుంటారు. అందుకే గుడ్ ఫ్రైడే వస్తే మాత్రం ఏ ఒక్కరూ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని ఒకర్ని ఒకరు విష్ చేసుకోరు. మిగిలిన వారు కూడా ఎవరూ అలాంటి మెసేజ్‌లు పంపుకోరు. చర్చిలలో ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు జరగవు. ఏసు ప్రభు ప్రజల పాపాలకోసం త్యాగ చేసి మానవాళికి మంచి చేశాడని, అందుకే ఫ్రైడేకి ముందు గుడ్ అనే పదం చేరిందని నమ్ముతారు. గుడ్ ఫ్రైడేను... హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుచుకుంటారు. శిలువ వేయడం అనేది యేసు జీవితంలో చిట్టచివరి ఘట్టమనీ, క్రైస్తవ సోదరుల విశ్వాసం. అందుకే గుడ్ ఫ్రైడే రోజు ఎన్నో చర్చిలలో ఈ నాటికను ప్రదర్శిస్తారు. అలాగే గుడ్ ఫ్రైడేకి ముందు లెంట్ డేస్ మొదలవుతాయి. దాదాపు 46 రోజులు పాటు కొనసాగుతాయి. ఆ రోజుల్లో ఉపవాసాలను పాటిస్తారు. -
పునరుత్థానమే సమాధానం
‘మరణమున్ జయించి లేచెన్ మన ప్రభువు నేడు. మహిమ దేహమొనర దాల్చెను. ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొరతలన్ని తీర్చి జీవ వరములియ్య వసుధపైని’ ప్రపంచవ్యాప్తంగా నేడు క్రైస్తవులంతా మహదానందంతో, భక్తిపారవశ్యంతో ఈస్టర్ పండుగను జరుపుకొంటున్నారు. యేసు మరణించి మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగిలేచాడు. క్రైస్తవులంతా పాడుకొనే ఓ అద్భుతమైన పాట ఈ సందర్భానికి చక్కగా సరిపోతుంది. ‘మరణమున్ జయించి లేచెన్ మన ప్రభువు నేడు. మహిమ దేహమొనర దాల్చెను. ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొరతలన్ని తీర్చి జీవ వరములియ్య వసుధపైని’. శుభ శుక్రవారం రోజున ఝెరూషలేము లోని కల్వరి కొండపై యేసు తన ప్రాణాన్ని సకలలోక పాప పరిహారార్థమై అర్పించారు. అమూల్యమైన యేడు మాటలు సిలువలో పలికి తన ఆత్మను అప్పగించారు. క్రీస్తు మరణము శాస్త్రీయంగా ధ్రువీకరించబడింది. వందలాది మంది రోమన్ సైనికులు క్రీస్తును సిలువ వేసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. యేసును విచారించి అన్యాయపు తీర్పు తీర్చిన పిలాతు గురించిన చారిత్రక విషయాలు ఈ మధ్య కాలంలో కైసరయలో బయటపడ్డాయి. ఆ కాలంలో ప్రధాన యాజకుడైన కయపకు సంబంధించిన విషయాలను కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. యేసు ప్రభువును బల్లెపుపోటు పొడిచినప్పుడు ఆయన దేహంలో నుంచి రక్తము, నీళ్లు బయటకు వచ్చిన అంశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఒక వ్యక్తి పూర్తిగా చనిపోయినప్పుడే ఆ వ్యక్తి దేహం నుంచి నీరులాంటి ద్రవం బయటకు వస్తుందని వారు ధ్రువీకరించారు. క్రీస్తు సిలువపై మరణించి నప్పుడు అనేక అద్భుతాలు చోటుచేసుకున్నాయి. వాటన్నింటిలో ప్రాముఖ్యమైనది దేవాలయపు తెర చిరిగిపోవుట. పాతనిబంధన కాలంలో నిర్మించబడిన దేవాలయంలో పరిశుద్ధ స్థలాన్ని, అతిపరిశుద్ధ స్థలాన్ని వేరుచేయడానికి మూడు వందలమంది యాజకులచే తయారు చేయబడిన తెర ఉండేది. దాని మందం నాలుగు అంగుళాలు. మనుషులెవ్వరూ చింపలేనంత బలంగా ఉండేది. క్రీస్తు ప్రభువు మరణించగానే ఆ తెర పైనుంచి కిందకు చిరిగిపోయిందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. దాని అర్థం ‘దేవుడు రక్షణను మనిషికి అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధ స్థలాన్ని ప్రతి ఒక్కరి కోసం తెరిచాడు’. యేసుప్రభువు చనిపోయిన తర్వాత ఆ రోజు సాయంకాలం అరిమితయి యోసేపు అనే వ్యక్తి పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడుగుతాడు. యోసేపు యూదుల న్యాయసభలోని సభ్యుడు. సుమారు 70 మంది పెద్దలు ఆ సభలో ఉంటారు. యోసేపు తన కోసం ఒక చక్కని రాతితో తొలిపించుకున్న సమాధిని సిద్ధపరచుకున్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడయిన నికోదేముతో కలిసి యేసుప్రభువు దేహాన్ని సిద్ధపరచి సమాధిలో ఆ దేహాన్ని ఉంచుతారు. ఒక రాయి పొర్లించి వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రోమన్ సైనికులు ఆ సమాధికి కావలిగా ఉన్నారు. దానికి కారణం యూదా పెద్దలలో కొందరు యేసు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచెదనని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని పటిష్ఠమెన కావలిని ఉంచారు. వారంతా యేసు పునరుత్థానమును అడ్డుకోవాలని విశ్వప్రయత్నం చేశారు. కానీ అది నెరవేరలేదు. ఆయన చెప్పినట్లే మరణమును జయించి మూడవ దినమున పునరుత్థానుడైనాడు. ప్రపంచంలో చాలామంది ఈరోజుకి చనిపోయి సమాధిలో పరిమితమయ్యారు గాని ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచారు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే క్రీస్తు పునరుత్థానం చెందినరోజు సమాధి ముందున్న రాయి పక్కకు తొలగించబడింది. రాయి తొలగించబడకుండా క్రీస్తు బయటకు రాలేడా? అనే ప్రశ్న కొందరికి ఉండవచ్చు. రాయి ఉన్నా యేసు బయటకు రాగలడు ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు గనుక. పీటర్ మారల్ అనే దైవజనుడు ఈ విషయాన్ని గూర్చి ఓ చక్కని వ్యాఖ్యానం చేశాడు. ‘ఆయన బయటకు రావడానికి అక్కడ ఉన్న రాయి దొర్లించబడలేదు గాని, మనము ఆయన సమాధిలోనికి వెళ్లి చూడ్డానికి ఆ రాయి పక్కకు తొలిగించబడింది’. నేటికి ఝెరూషలేములోని క్రీస్తు సమాధి తెరువబడి ఉంటుంది. ఎవరైనా అక్కడికి వెళ్ళవచ్చు. సమాధి లోపల ఓ దివ్యమైన సందేశం ఉంటుంది. ‘ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే లేచియున్నాడు’ (మత్తయి 28:6). యేసుప్రభువు ఖాళీ సమాధి క్రైస్తవుల విశ్వాసానికి ఒక బలమైన పునాది. సమాధిని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఈనాడు అనేకులు క్రీస్తును ప్రభువుగా విశ్వసిస్తున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఆయనలోని దైవత్వము మానవాళికి ప్రత్యక్షపరచబడింది. ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యాధినేతలు, చక్రవర్తులు, మా మాటకు తిరుగులేదు, మా శాసనాలకు ఎదురులేదు అనుకున్న చాలామంది నేటికీ సమాధిలోనే ఉన్నారు. ఎందరో కవులు, ధనికులు మృత్యువు ముందు తలవంచారు. విలియం లేన్ క్రేగ్ ఇలా అంటాడు. ‘పునరుత్థానమునందు నమ్మకము లేకుంటే క్రైస్తవ విశ్వాసము ఉనికిలోకి వచ్చియుండెడిది కాదు. శిష్యులు యేసును వారి ప్రియతమ నాయకునిగా జ్ఞాపకముంచుకోదలచినను, సిలువ మరణము ఆయనను మెస్సీయగా ఉంచుకోవడము విషయములో వారి ఆశలను నిర్వీర్యం చేసియుండేది. సిలువ ఆయన జీవిత ప్రధాన గమనమును దుఃఖ సహితముగను, అవమానకరముగను ముగించి యుండేది. గనుక క్రైస్తవ పుట్టుక యేసుక్రీస్తు మృత్యువు నుంచి లేచియున్నాడనే విశ్వాసం మీద ఆధారపడియున్నది’. యేసుప్రభువు సిలువపై చనిపోయారా? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారా? అని ప్రశ్నించే చాలామందికి ఇటలీ దేశములోని ట్యురిన్ నగరంలో ఉన్న ట్యురిన్ వస్త్రము నిలువెత్తు జవాబుగా ఉంది. యేసు చనిపోయిన తర్వాత ఆయన మీద ఒక విలువైన వస్త్రాన్ని కప్పారు. యూదుల ఆచారం ప్రకారం చనిపోయిన వ్యక్తికి సుగంధ ద్రవ్యములు పూసిన నారబట్ట చుడతారు. ఒక మనిషి ఆకారం దానిలో కనబడుతుంది. శాస్త్రవేత్తలు ఈ వస్త్రాన్ని చాలా సంవత్సరాల తర్వాత కనుగొని దానిమీద విస్తృత పరిశోధనలు చేశారు. ఈనాటికీ ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఈ వస్త్రం క్రీస్తు మరణ పునరుత్థానాలకు సాక్ష్యంగా ఉంది. ఈ ట్యురిన్ వస్త్రాన్ని కొందరు ‘ద ఫిఫ్త్ గాస్పెల్’ అని కూడా పిలుస్తారు. క్రీస్తు పునరుత్థానము గూర్చి పాతనిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు ఉన్నాయి. లేవీయ కాండము పదునాలుగవ అధ్యాయంలో రెండు పక్షులు కనబడతాయి. యేసులోని రెండు లక్షణాలు ఆ పక్షులలో మనకు కనబడతాయి. ఒక వ్యక్తికి కుష్ఠు వ్యాధి గనుక వస్తే ఆ వ్యాధి తగ్గేంత వరకు పాళెమునకు వెలుపల జీవించాలి. తన్నుతాను ప్రత్యేకించుకుని ప్రజలకు దూరంగా నివసించాలి. కనీసం తమ ఇంటివారితో కూడా కలవకూడదనే ఆరోగ్య నిబంధన ఉండేది. కొంతకాలానికి ఆ వ్యక్తికి కుçష్ఠు తగ్గినట్లు అతడు భావిస్తే, దానిని నిర్ధారించడానికి ఆ కాలంలో ఉండే ప్రధాన యాజకునికి తన్నుతాను కనపరచుకోవాలి. ఒకవేళ రోగి దేహమును పరిశీలించి, అతని దేహము బాగుపడిందని ప్రధాన యాజకుడు నిర్ధారిస్తే ఆ వ్యక్తి పవిత్రుడుగా కొనసాగేవాడు. తిరిగి సమాజంలో కలిసేందుకు ముందు ఆ వ్యక్తి రోగము నుంచి విడుదల పొందాక ప్రధాన యాజకుడు నియమించిన ధర్మశాస్త్ర కట్టడి ప్రకారం అతడు రెండు సజీవమైన పక్షులను తీసుకు రావాలి. సదరు వ్యక్తి వాటిని యాజకుని యొద్దకు తీసుకువచ్చిన తర్వాత ఒక పక్షిని మట్టి పాత్రలో పెట్టి చంపాలి. చంపిన తర్వాత ఆ పాత్రలోని రక్తాన్ని ఎవరైతే పవిత్రత పొందాలనుకుంటున్నారో అతని మీద ఏడుసార్లు ప్రోక్షించాలి. అలా చేసిన తర్వాత ఆ మిగిలిన రెండో పక్షిని ఆ రక్తంలో ముంచి ఆ రక్తపు ముద్రలు దానిమీద ఉండగానే దానిని విడిచి పెట్టాలి. ప్రస్తావించబడిన ఆ రెండు పక్షులు యేసుప్రభువు జీవితంలోని రెండు ప్రధానమైన అనుభవాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒక పక్షి మట్టి పాత్రలో చంప బడింది. మట్టి పాత్ర యేసయ్య మంటి దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీదకు వచ్చాడు అని సూచిస్తుంది. మట్టి పాత్రలో చంపబడిన ఆ పక్షి యేసుక్రీస్తు ప్రభువు మరణానికి సూచనగా కనబడుతుంది. ఆయన మరణించడం ద్వారా పాపంలో పుట్టి పాపంలో జీవిస్తున్న ఒక మనిషికి ఆయన రక్తాన్ని ఆ మనిషి మీద ప్రోక్షించడం ద్వారా ఆయన మరణం ద్వారా విడుదల కలిగిందని విడిచిపెట్టబడిన రెండవ పక్షి క్రీస్తు పునరుత్థానమును సూచిస్తుంది. అపొస్తలుడైన యోహాను పత్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు. దేవుని దివ్య దర్శనం అతనికి కలిగింది. మొదటి శతాబ్దంలో అతడు చూసిన, విన్న విషయాలను గ్రంథçస్థం చేశాడు. అదే బైబిల్లోని చిట్టచివరి గ్రంథం ‘ప్రకటన గ్రంథం’. ఆ పెద్దలలో ఒకడు ‘ఏడవకుము. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను’ (ప్రకటన 5:5). ‘వధించబడిన గొఱె -
హైదరాబాద్‌లో ఏప్రిల్ 8న రన్ ఫర్ జీసస్
గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా కథోలిక, ప్రొటెస్టెంట్ సంఘాలను సమీకరించి, సమైక్యపరచి యేసు క్రీస్తు వారి సిలువ మరణ పునరుత్థానాల సందేశాన్ని ప్రకటించే ఒక గొప్ప సంఘ ఐక్య, ఎక్యుమెనికల్, మహోద్యమం రన్ ఫర్ జీసెస్. అన్ని సంఘాల నుండి వేలాది మంది క్రైస్తవులు రోడ్డు మీద నడుస్తూ, పరుగెత్తుతూ, మోటర్ సైకిళ్లు, కార్లు, మొదలగు వాహనాలపై వెళ్తూ, జండాలను ఊపుతూ, "క్రీస్తు లేచెను, నిజముగా క్రీస్తు పురనరుత్థానుడయ్యెను" అని సంతోషంతో ఎలుగెత్తి చాటుతారు. రన్ ఫర్ జీసస్ అనే ఈ మహాద్భుతమైన స్వార్తీక, ఎక్యుమెనికల్ ర్యాలిని ఆరాధన టీవి బృందం వారు 2011 సంవత్సరంలో రూపక ల్పన చేసి, క్రైస్తవ లోకానికి పరిచయం చేసారు. ప్రారంభంలో కేవలం 30 ప్రాంతాల్లో మాత్రమే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించినప్పటికీ నేడు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అలాగే విదేశా ల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించబడుతోంది. క్రైస్తవ యువత, లే లీడర్స్, పాస్టర్స్, ప్రిస్టులు, బిషప్పులు, అధ్యక్షులు అందరూ తమ తమ ప్రాంతాల్లో నిర్వహించబడే రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొంటారు. కాలక్రమేణ, ఇటు క్రైస్తవ సమాజం అటు క్రైస్తవ నాయకులు రన్ ఫర్ జీసస్‌ను తమ స్వంత కార్యక్రమంగా భావించి, వారి స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఈస్టర్కు మధ్యలో ఉండే శనివారం నాడు రన్ ఫర్ జీవన్ కార్యక్రమాన్ని నిర్వహించడమనేది గమనార్హం. ప్రస్తుతం ఒకే రోజున, ఒకే సమయానికి 500 ప్రాంతాల్లో రన్ ఫర్ జేసెస్ నిర్వహించనున్నారు. ఇప్పుడిది ఎవరో ఒక వ్యక్తికి లేదా సంస్థకు లేదా సంఘానికి సంబంధించినదిగా కాక, యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించిన కార్యక్రమంగా పరిపూర్ణంగా పరిణామం చెందింది. ఏదేమైనా, వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున నిర్వహించబడుతోన్న ఈ కార్యక్రమాన్ని స్థానిక రన్ ఫర్ జీసస్ నాయకులతో కలిపి ఆరాధన టీవీ ముందుకు తీసుకెళ్తుంది. ఈ సంవత్సరం, గ్రేటర్ హైదరాబాద్‌లో, 2023 ఏప్రిల్ 8, శనివారం వాడు ఉదయం 6 గంటల నుండి నగరంలోని వివిధ ప్రాంతాల్లో రన్ ఫర్ జీసస్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ మహాఘన పీఠాధిపతులు, కార్డినల్.. పూల ఆంథోని, మెదక్ అధ్యక్ష మండలం అధ్యక్షులు రైట్ రెవ. డా. పద్మారావ్, హైదరాబాద్ రీజినల్ కావ్వరెవ్ రెసిడెంట్ బిషప్ యం. ఎ. డానియేల్, ఆరాధన టీవీ చైర్మెన్ బ్రదర్ పాల్ దేవప్రియం పాల్గొంటారు. తెలంగాణ ప్రభుత్వ హోంమంత్రి ముహమ్మద్ ఆలీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అలాగే నగరంలో వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో సంఘ నాయకులు, రాజకీయ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు పాల్గొంటారు. రన్లో పాల్గొనే ప్రజలంతా మహాసంతోషంతో ముగింపు సభాప్రాంగాణాలకు చేరుకుంటారు. స్థానిక సువార్త గాయకులు స్తుతి ఆరాధనను జరిపిస్తారు. ఒక సీనియర్ పాస్టర్ ఈస్టర్ సందేశాన్ని అందిస్తారు. క్రైస్తవ సోదరసోదరీమణులు అందరూ ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని.. తద్వారా దేవాధిదేవునికి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. -
ప్రేమే సందేశం
-
యేసుక్రీస్తు సిలువ ఘట్టం ప్రదర్శన..!
-
సిలువ మోసిన అనిల్ కుమార్ యాదవ్..!
-
గుడ్ ఫ్రైడే ఆఫర్: రూ.1500కే నథింగ్ ఫోన్ (1)
సాక్షి,ముంబై: గుడ్ ఫ్రైడే రోజున ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (1) పై భారీ ఆఫర్ లభిస్తోంది. యూకే ఆధారిత కార్ల్ పీ నేతృత్వంలోని వినియోగదారు టెక్ కంపెనీ త్వరలో ఫోన్ (2)ని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నందున నథింగ్ ఫోన్ డిస్కౌంట్ ధరలో లభించనుంది. సేల్స్‌లో దూసుకుపోతున్న నథింగ్ ఫోన్ (1) గుడ్ ఫ్రైడే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 1,500కే అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో గుడ్ ఫ్రైడే రోజున రూ. 8,000 తగ్గింపు తర్వాత రూ. 29,999కి లిస్ట్ చేయబడింది. దీనికి అదనంగా, కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దీంతో స్మార్ట్‌ఫోన్ ధర రూ.28,500కి తగ్గింది. దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ఫ్లిప్‌కార్ట్ రూ. 27,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అలా నథింగ్ ఫోన్ (1) ధరను రూ. 1,500కి దిగొచ్చింది. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) నథింగ్ ఫోన్ (1) లాంచింగ్ ప్రైస్. రూ. 32,999 నథింగ్ ఫోన్ (1)ఫీచర్లు 6.55-అంగుళాల OLED డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ 120Hz రిఫ్రెష్ రేట్ Qualcomm Snapdragon 778G+ చిప్సెట్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 50ఎంపీ రియర్ డ్యూయల్ కెమెరా సెటప్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ -
మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కరుణామయుడైన ఏసు ప్రభువు జీవితమే త్యాగానికి చిహ్నం. ఆ ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనలు ద్వారా జీసస్ లోకానికి ఇచ్చిన సందేశాలు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చదవండి: ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు: సజ్జల రామకృష్ణారెడ్డి -
Good Friday Special: వెలుగు పూలు పూయించిన కలువరి సిలువ
మానవాళి రక్షణ కోసం మహోన్నతుని సిలువ యాగం మరణ భయాన్ని పటాపంచలు చేసింది. సాతాను కోరలు చీల్చి వేసింది. అంధకార బంధురమైన జీవితాల్లో వెలుగు పూలు పూయించింది. నిరీక్షణ లేని జీవితాల్లో వెలుతురు కిరణాలు ఉదయింపజేసింది. కరుణామయుని శిలువ యాగం గెత్సెమనే తోట నుంచే ప్రారంభమయింది. శుక్రవారం సిలువకు అప్పగించకముందే గెత్సెమనే తోటలో తన రక్తం స్వేదబిందువులుగా మారే వరకూ ప్రార్థనలో గడిపాడు. లోక పాపాన్నంతా తన వీపుపైన మోసేందుకు సిద్ధమయ్యాడు. ఓ తరుణంలో తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నానుండి తొలగించమని ప్రార్థించినా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేందుకే సిద్ధమయ్యాడు. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందుటకే ఏర్పాటు చేసిన మార్గం సిలువ మార్గం. ఒకవైపు గెత్సెమనే తోటలో రాత్రంతా ప్రార్థిస్తూ మానవ సాయం కోసం తన శిష్యుల వైపు చూశాడు. శోధనలో పడకుండా మెళకువగా వుండి ప్రార్థించండి అని చెప్పినా వారు నిద్రమత్తులై ఉన్నారు. అప్పుడే తాను ప్రేమించిన శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా క్రీస్తు సిలువలో ప్రధాన పాత్రధారిగా మారి 30 వెండి నాణెములకు క్రీస్తును అప్పగించేందుకు మత పెద్దలతో ఒప్పందం కుదుర్చుకొని గెత్సెమనేలో ముద్దుపెట్టుకొని మరీ యేసును అప్పగించాడు. యేసును ఒక బందిపోటు దొంగమీదికి వచ్చినట్లు కత్తులతో వచ్చిన వారిని చూసి కనికరపడ్డాడు తప్ప ఒక్క మాటయినను పలుకలేదు. తన శిష్యులు తనను వదిలి పారిపోగా ఒంటరియైన యేసు ప్రధాన యాజకుడైన కయప వద్దకు తీసుకువచ్చి వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, ఇష్టము వచ్చినట్టు గుద్దారు. మరికొంతమంది అర చేతులతో కొట్టి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని హేళన చేశారు. ‘తన ప్రియ కుమారుని నలుగగొట్టడానికి ఆ దేవాది దేవునికి ఇష్టమాయెను’ అన్న లేఖనాలు ఈ విధంగా నెరవేరాయి. ఉదయం యేసును బంధించి అధిపతియైన పొంతి పిలాతుకు క్రీస్తును అప్పచెప్పారు. చివరకు అన్యాయపు తీర్పే గెలిచింది. యూదా మత పెద్దలకు భయపడి పొంతి పిలాతు యేసును సిలువకు అప్పగించాడు. వారు యేసును గొల్గొతా కొండకు తీసుకు వచ్చి చేతులు, కాళ్ళలో శీలలు కొట్టి సిలువకు వేలాడదీశారు. ఇరు పక్కల ఇద్దరు బందిపోటు దొంగలను సిలువ వేశారు. ‘‘దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కడతానన్నావుగా చేతనైతే నిన్ను నీవు రక్షించుకో, నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా’’ అంటూ దూషిస్తూ ‘‘వీడు ఇతరులను రక్షించెను గానీ తన్ను తాను రక్షించుకోలేడంటూ’’ అపహాస్యం ఒకపక్క, రోమా సైనికుల కాఠిన్యం మరోపక్క యేసును బాధపెట్టినా తన తండ్రి మానవుల రక్షణ కొరకు తలపెట్టిన బలియాగంలో తాను సమి«ధగా మిగిలి పోవడానికే సిద్ధపడ్డాడు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సిలువ మధ్యాహ్నం 3 గంటల వరకూ సాగింది. మిట్ట మధ్యాహ్నం ఆ ఎండ వేడికి తాళలేక యేసు మూర్ఛబోయాడు. దాహం అని అడుగగా చేదు చిరకను అందించారు. కొరడాలతో, మేకులతో ఒళ్ళంతా రక్తం ధారలుగా కారుతుండగా చనిపోయాడో లేదోనని పక్కలో బల్లెంతో పొడిచారు. ఆ సమయంలో యేసు మాటలాడిన ఏడు మాటలు ఎంతో శ్రేష్టమైనవి. తనను హింసిస్తున్న వారిని చూసి యేసు ప్రభువు ‘తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు’మంటూ చేసిన ప్రార్థన నభూతో న భవిష్యతిగా చెప్పుకుంటారు. మనలను హింసించే వారి కోసం ప్రార్థించాలి అన్న యేసు సిలువలో తనను చంపుతున్న వారి కోసం చేసిన ప్రార్థన అది సాధ్యమే అని నిరూపించాడు. తనతోపాటు సిలువ వేయబడిన కుడివైపు దొంగ, ‘ప్రభువా నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకోవాలి’ అంటే ఆ క్షణంలో రక్షణను అనుగ్రహించి నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉందువు అని అభయమొసంగిన జాలిగల ప్రభువు. విశ్వాసంతో ప్రార్థిస్తే ఎటువంటి వారికైనా రక్షణ భాగ్యం దొరుకుతుందన్న ఆశావాదాన్ని కలిగించాడు. క్రీస్తు సిలువ మార్గం, ముక్తి మార్గం పాపంలో నశించిపోతున్న మానవాళి ముక్తి కొరకు ఒక మంచి గొర్రెల కాపరిగా తాను ప్రేమించి గొర్రెల కోసం తన ప్రాణాన్ని కలువరిపై ధారపోసి మరణ భయంతో ఉన్నవారికి నిత్యజీవం అనే వెలుగును ప్రసాదించాడు క్రీస్తు.. రెండు వేల సంవత్సరాలైనా ఆ వెలుగు పూలు అందరి మదిలో వెలుగుతూనే ఉన్నాయి. – బ్రదర్ బందెల స్టెర్జిరాజన్ -
జీసస్ మహాత్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలని చెప్పిన దయామయుడు ఏసుక్రీస్తు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జీసస్ మహాత్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే అని, సాటివారి పట్ల ప్రేమ, అవధులు లేని త్యాగం.. ఇదే జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం అని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. చదవండి: (ఒంటిమిట్ట రామయ్య కోసం.. టెంకాయ చిప్పతో ఊరూరా..భిక్షమెత్తి) -
శాంతి సందేశం
-
విశ్వాసానికి శుభ శుక్రవారం
సమయం మధ్యాహ్నం 3 గంటలు. అప్పుడే ఓ భయంకరమైన దుర్ఘటన జరిగింది. మానవాళి సిగ్గుతో తల దించుకోవలసిన సంఘటన అది. ఈ దృశ్యం చూడలేక భూన బోంతరాలు దద్దరిల్లినవి. కొండలు పగిలాయి. దేవాలయంలో తెర రెండుగా చిరిగిన రోజది. దేవాది దేవుడు తన ఏకైక కుమారుడైన ఏసుక్రీస్తును లోకానికి నరావతారిగా పంపాడు. అయితే అవినీతి పరులైన మతాధికారులు, దుష్టప్రజలు యేసు చెప్పిన పవిత్రమైన నీతిబోధలకు తాళలేక ఆయనను శిలువ వేసిన రోజది. క్రీ.పూ 700 సంవత్సరాలు. యెహోవా అనే భక్తుడు ఈ దుస్సంఘటన గురించి ఇలా ప్రవచించాడు. మన అతిక్రమ క్రియలే అతడిని (క్రీస్తు) గాయపరిచాయి. మన సమాధానార్థమైన శిక్ష అతనిపై పడింది. అతని దెబ్బలతో మనకు స్వస్థత కలుగుతోంది. (యెష 53:5). ఆకాశం, భూమి, సముద్రాలలోనున్న సమస్తాన్ని సృష్టించిన దేవుడు పాపాలతో నశించే మానవులను కాపాడేందుకు యేసును భూమిపై అవతరింప జేసాడు. పవిత్ర రక్తం చిందిస్తేనే తప్ప వేరే మార్గంలో పాప విముక్తి కలుగదని వేదాలు ఘోషిస్తున్నాయి. ఏసంటే రక్షకుడని క్రీస్తు అనగా అభిషిక్తుడని భావం. పాప పంకిలం నుండి నరుడు విముక్తి పొంది, పవిత్ర జీవితం గడిపి స్వర్గానికి బాట నిర్దేశించే నీతి నియమాలతో కూడిన ప్రణాళికను ప్రభువైన ఏసు విశదం చేశాడు. సాతాను ఏర్పరిచిన ధనం, కీర్తి, సౌఖ్యం, వినోదం, అశ్లీలతతో కూడిన లైంగికానందాలనే పంచరంగుల వలలో మానవుడు చిక్కుకున్నాడు. ఆ వల నుండి నరుని విముక్తి చేయడమే ఏసుక్రీస్తు ధ్యేయం. ఆశతో ఎగబాకే ఆయా రంగాల్లో ఎంత ఉచ్చస్థితి సాధించినా హృదయానికి తృప్తి, మానసికానందం లభించడం లేదు. అవన్నీ దూరపు కొండలే కదా!ఏసు తానే దైవకుమారుణ్ణని చెప్పినా యూదులంగీకరించలేదు. అక్రమ సంపాదపరులైన మతాధిపతులు తమ అన్యాయార్జితం క్రీస్తు సద్బోధలతో ఎక్కడ దూరమవుతుందోనని భయాందోళనలకు గురై ఎలాగైనా క్రీస్తును చంపేందుకే కుట్ర పన్నారు. తత్ఫలితంగా న్యాయాధికారి పిలాతు కు తప్పుడు సాక్ష్య నివేదిక సమర్పించారు. ఆనాటి ఇశ్రాయేలీయుల రాజైన హేరోదుపై కూడా క్రీస్తును అంతం చేయాలని ఒత్తిడి తెచ్చారు. దాంతో చెయ్యని నేరాన్ని పవిత్రుడైన ఏసుపై ఆపాదించి శిక్షకు పరాకాష్ట అయిన శిలువ మరణమనే శిక్ష వేశారు. ఆ విధంగా శిలువ మరణం పొంది, తాను చెప్పిన ప్రకారం సమాధి చేధించుకుని మూడోనాడు ఏసు మృత్యుంజయుడై లేచి వచ్చాడు. ఆ రోజే గుడ్‌ఫ్రైడే. శుభ శుక్రవారం. సమాధి లోనుండి ప్రభువు తిరిగి లేచిన మూడవ రోజు ఆదివారం. దానినే ఈస్టర్ పండుగ అని పిలుస్తారు. ఇది క్రైస్తవులకు గొప్ప పండుగ. ప్రపంచమంతా వారంలో ఒక్కరోజు (ఆదివారం) అన్ని వ్యాపారాలు, పనులు మాని జనులు గుంపులుగా, సమూహాలుగా కూడి ఆయనను ఆరాధించేందుకు వెడతారు. ‘‘చివరిగా చెప్పాలంటే, ఏసుక్రీస్తు మానవ జాతికి దేవుడిచ్చిన గొప్ప బహుమానం. దీన్ని పొందేందుకు మనం ప్రయాసపడాల్సిందేమీ లేదు. ఆయన్ను విశ్వసించడం తప్ప. ఓ భక్తుడు ఏసు గురించి చెబుతూ ‘‘2020 సంవత్సరాల క్రితం అరుదైన రీతిలో ఒక మనుష్యుడు జన్మించాడు. అతడు పేదరికంలో పుట్టి పేదరికంలోనే పెరిగాడు. అతడు ఎక్కువ దూరం ప్రయాణం చేయలేదు. ఓ సారి తన దేశ సరిహద్దులు దాటి వెళ్లి కొద్దికాలం అక్కడ జీవించాడు. పేరు ప్రఖ్యాతులు, ఆస్తి అంతస్థులు అతనికి లేవు. ఆయన బంధువర్గమంతా సామాన్యులే. విద్యావంతులు కారు, ఆయన ఏ విధమైన మందులు వాడకుండానే ఆ మహానుభావుడు రోగులను బాగు చేశాడు. అయితే దాని కోసం వారి దగ్గర ఏ ప్రతిఫలం ఆశించలేదు. ఒక పుస్తకం కూడా ఆయన రాయలేదు. కానీ దేశంలో ఉన్న గ్రంథాలయాలన్నీ ఆయన గురించి రాసిన పుస్తకాలకు సరిపోవు. ఒక పాట కూడా ఆయన రాయలేదు. కాని పాటల రచయితలందరికి ఆయన కేంద్ర బిందువయ్యాడు. ఒక కళాశాలను కూడా ఆయన స్థాపించలేదు. కాని ప్రపంచంలోని విద్యార్థులందరిని కలిపినా ఆయనకున్నంత మంది విద్యార్థులుండరు. ఎప్పుడూ ఆయన ఒక సైన్యాన్ని తయారు చేయలేదు. ఒక తుపాకీ గుండూ ఆయన పేల్చలేదు. అయినా అందరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారు. ఆయన ఎప్పుడూ మానసిక వ్యాధులకు మందులివ్వలేదు. అయితేనేం, మానసిక రోగుల నిమిత్తం పని చేసే మానసిక వైద్యులందరూ కలిసి బాగుచేయలేనంత మంది పగిలిన హృదయాలను ఆయన బాగు చేశాడు. -
జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్‌ఫ్రైడే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం ఇది జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. చదవండి: వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మన బాధ్యత మరింత పెరిగింది: సీఎం జగన్ -
గుడ్ ఫ్రైడే మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లుకు సెలవు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు (శుక్రవారం 10) మార్కెట్లకు సెలవు. అలాగే బులియన్, కమోడిటీ మార్కెట్లు, ఫారెక్స్ మార్కెట్లు సైతం పనిచేయవు. సోమవారం(13న) ఉదయం 9.15కు యథావిధిగా ప్రారంభమవుతుంది. సెన్సెక్స్ 1266 పాయింట్లు ఎగిసి 31,160 వద్ద , నిఫ్టీ సైతం 363 పాయింట్లు జంప్‌చేసి 9112 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా 31,000 పాయింట్ల మైలురాయినిఎగువన ముగిసింది. నిఫ్టీ కూడా 9100 ఎగువన పటిష్టంగా ముగిసింది. డాలరుతో మారకంలో రూపాయి గురువారం 76.28 వద్ద ముగిసింది. వారాంతంలో బుల్ పరుగు, అన్నీ లాభాలే -
అసత్యాల్నిచీల్చి చెండాడిన సత్యం!
యూదులు రెండువేల ఏళ్ళ క్రితం పస్కా పండుగనాడు యేసుక్రీస్తును శుక్రవారం రాత్రి సిలువ వేసి చంపి, అరిమతై యోసేపు అనే ఒక రహస్య క్రైస్తవునికి చెందిన రాతిసమాధిలో ఆయన్ను ఖననం చేశారు. అయితే యేసుక్రీస్తు తాను మునుపే ప్రకటించినట్టుగా, ఆదివారంనాటి తెల్లవారు జామునే పునురుత్థానుడు కాగా, తిరిగి సజీవుడైన యేసుక్రీస్తును విశ్వాసులైన స్త్రీలు మొదట చూశారు. వారిద్వారా ప్రభువు శిష్యులు తెలుసుకొని వెళ్లి ఖాళీ సమాధిని చూశారు. అయితే ప్రభువే వారికి ప్రత్యక్షమై తనను తాను కనపర్చుకున్నాడు. ఆ విధంగా యేసు పునరుత్థానమే పునాదిగా క్రైస్తవం ఆరంభమైంది. అలా చాలా కొద్దిమందితో, యేసును సిలువ వేసిన యెరూషలేమే కేంద్రంగా, ఆయన్ను సిలువ వేసిన యూదుల మధ్యే ఆరంభమైన క్రైస్తవంలోకి యూదులతో సహా ఎంతో మంది చేరుతూండగా అది ఎల్లలు దాటి ప్రపంచమంతా విస్తరించి, ఈనాడు 210 కోట్ల మంది విశ్వాసులున్న అతి పెద్దమతంగా ప్రపంచంలో సుస్థిరమైంది. ప్రపంచ చరిత్రలో అలా జరిగిన ఒక కుట్ర పటాపంచలై యేసుక్రీస్తు సారథ్యంలో ప్రేమ, క్షమాపణలే ముఖ్యాంశాలుగా ఆయన స్థాపించిన ప్రేమ సామ్రాజ్యంగా క్రైస్తవం తన ఉనికిని చాటుకుంది. పామరులు, పిరికివాళ్ళు, సమాజంలో ప్రాబల్యం లేనివాళ్లయిన విశ్వాసులతో కూడిన క్రైస్తవం ఇంతటి స్థాయికి ఈనాడు ఎలా ఎదిగింది? ఆ పిరికివాళ్ళనే దేవుడు తన శక్తితో నింపాడు. ‘మీరు జీవాధిపతిని చంపారు, కాని దేవుడు ఆయన్ను మృతులలో నుండి లేపాడు. అందుకు మేము సాక్షులము...’ అంటూ వేలాదిమంది యూదుప్రముఖుల సమక్షంలో యేసుక్రీస్తు సిలువ మరణాన్ని, ఆయన పునరుత్థాన మహా ఘటనను శిష్యులైన పేతురు,యోహాను కలిసి అవి జరిగిన కొద్దిరోజులకే యెరూషలేము మహాదేవాలయ ప్రాంగణంలో ప్రకటించారు. విశేషమేమిటంటే, నాడు పస్కాపండుగ రాత్రి గెత్సేమేనే తోటలో ప్రార్థనలో ఉన్న యేసుక్రీస్తును యూదా ఇస్కరియోతు అనే మరో శిష్యుని విద్రోహం కారణంగా రోమా సైనికులొచ్చి నిర్బంధించినపుడు, యేసు ఎవరో నాకసలు తెలియదంటూ మూడుసార్లు నిర్లజ్జగా బొంకి పేతురు పారిపోయిన ఉదంతాన్ని కూడా తన సువార్తలో ఎంతో విపులంగా ప్రస్తావించిన లూకా సువార్తికుడే, యేసును కుట్రచేసి చంపిన యూదు మతపెద్దలు, శాస్త్రులున్న గుంపును ఉద్దేశించి, పునరుత్థానుడైన యేసు ప్రభువును కళ్లారా చూసిన నూతనోత్తేజంతో ఇది జరిగిన దాదాపు 55 రోజులకే పేతురు ఆత్మవశుడై ఎంతో ధైర్యంగా చేసిన ఈ ప్రకటనను కూడా తన అపొస్తలుల కార్యాల గ్రంథంలో ప్రస్తావించాడు (లూకా 22:39–62), (అపో.కా 3:15). సిలువ వెయ్యడానికి సైనికులు యేసుక్రీస్తును నిర్బంధించి తీసుకెళ్తుంటే ప్రాణభయంతో ఆయన్ను వదిలేసి పారిపోయిన పిరికి పేతురుకు, అది జరిగి రెండు నెలలైనా కాకముందే ‘మీరంతా యేసు హంతకులు, యేసు హత్యకు, ఆయన పునరుత్థానానికి కూడా మేము సాక్షులం’ అంటూ నిలదీసే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? అది క్రైస్తవానికి యేసుక్రీస్తువారి పునరుత్థాన శక్తి ద్వారా వచ్చింది. వాస్తవమేమిటంటే, క్రీస్తును తెలుసుకొని ఆయన అనుచరులముగా క్రైస్తవులమైతే అయ్యాము కానీ, ఆయన పునరుత్థానశక్తిని మాత్రం పూర్తిగా అవగాహన చేసుకోలేక దాన్ని పొందలేక పోతున్నాము. పునరుత్థానశక్తికి లోకపరమైన శక్తితో ఏమాత్రం పోలికలేదు. ఒక రాయిని కొండమీది నుండి భూమ్మీదికి తోసేందుకు తోడయ్యేది మామూలుగా లోకంలో అందరిలోనూ ఉండే శక్తి అయితే అదే బండరాయిని భూమ్మీదినుండి కొండ మీదికి దొరలించేందుకు ఉపకరించేది యేసుప్రభువు వారి పునరుత్థాన శక్తి!! యేసుప్రభువు వారి ప్రేమ, క్షమాపణ అనేవి అర్థమైతేనే ఈ శక్తి అర్థమవుతుంది, లభ్యమవుతుంది. రెండువేల ఏళ్ళ క్రితం నాటి ్రౖకైస్తవంలో ఎక్కువగా పామరులు, సామాన్యులే ఉన్నారు కాని వాళ్ళు క్రైస్తవాన్ని భూదిగంతాలకు విజయవంతంగా తీసుకువెళ్లడం వెనుక ఈ శక్తి ఉంది. అందుకే ఆ శక్తిని తాను తెలుసుకోవడానికే ప్రయాసపడుతున్నానని మహా అపొస్తలుడు పౌలు అన్నాడు (ఫిలిప్పి 3:11). – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
సిస్టర్ విమలా రెడ్డి గుడ్‌ఫ్రైడే సందేశం
సాక్షి, హైదరాబాద్ : గుడ్‌ఫ్రైడే... ! ఏసు క్రీస్తు శిలువ వేయబడిన రోజు. ప్రభువు ప్రాణత్యాగానికి గుర్తు. ప్రతి ఏడాది ఏప్రిల్ మాసంలో వచ్చే ఈ పండుగను క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. పండుగకు 42 రోజుల ముందు నుంచే క్రైస్తవులు అంతా ఉపవాసాలు చేయడం, రోజులో నాలుగు నుంచి అయిదు సార్లు ప్రార్థనలు చేస్తారు. భారతీయ క్రైస్తవులు ఈ రోజును శుభ శుక్రవారంగా పిలుచుకుంటారు. పండుగ రోజున చర్చీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ ప్రార్థనలో క్రైస్తవులంతా ఉపవాసంతో పాల్గొంటారు. ప్రభువు శిలువ వేయబడిన రోజు శుభ దినం ఎలా అవుతుంది? అసలు దీనికి శుభ శుక్రవారం అని క్రైస్తవులు ఎందుకు పిలుచుకుంటారని చాలా మందికి ఉండే సందేహాలే. అంతే కాకుండా శుభ శుక్రవారం రోజున క్రైస్తవులు ఏం చేస్తారు? అసలు క్రీస్తును శిలువ ఎందుకు వేశారు వంటి అనేక సందేహాలకు సమాధానంగా సిస్టర్ వైఎస్ విమలారెడ్డి వివరణాత్మక సందేశం ఇచ్చారు. పండుగ ప్రత్యేకతను, ఏసు శిలువ వేయబడిన తర్వాత శిలువపై ఆయన పలికిన ఏడు అంశాల గురించి ఆమె సమగ్రంగా వివరించారు. శుభ శుక్రవారంపై పూర్తి వివరణాత్మక సందేశం కోసం ఈ కింది వీడియోను వీక్షించండి. -
క్రైస్తవులు రేపు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలి
సాక్షి, అమరావతి: గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం క్రైస్తవులు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏసురత్నం బుధవారం ఒక ప్రకనటలో తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఈనెల 14 వరకు లాక్డౌన్ అమలులో ఉన్నందున సామూహిక ప్రార్థనలు నిషేధించినట్లు తెలిపారు. పాస్టర్లు కూడా ఈ విషయాన్ని గుర్తించి భక్తులకు తెలిపి వారి ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకునే విధంగా చూడాలని కోరారు. -
ప్రజలు లేకుండానే పోప్ ప్రార్థనలు
వాటికన్ సిటీ: కరోనా కారణంగా వాటికన్ సిటీ వెలవెలబోయింది. ఏటా గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారం జరుపుకునే మ్రానికొమ్మల (పామ్) ఆదివారం ప్రార్థనలకు దేశ, విదేశాల నుంచి వేలాది సంఖ్యలో హాజరయ్యే వారు. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో ఈ ఏడాది వాటికన్ సిటీని మూసివేయడంతో, భక్తులు లేకుండానే పోప్ ఫ్రాన్సిస్ ప్రత్యేక దివ్యబలి పూజను సెయింట్ పీటర్స్ బసిలికా లోపలే నిర్వహించారు. ఆ కార్యక్రమంలోనూ అతి తక్కువ మంది హాజరు కాగా, వారు కూడా భౌతిక దూరాన్ని పాటించారు. ఈ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి మానవాళి ఆశలపై గండి కొట్టిందని, హృదయాలపై మోయరాని భారాన్ని పెట్టిందని అన్నారు. -
జీసస్ మహా త్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే
సాక్షి, హైదరాబాద్: జీసస్ మహా త్యాగానికి గుర్తు గుడ్ ప్రైడే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘కరుణామయుడైన ఏసు ప్రభువును సిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తర్వాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజూ.. మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలన్నారు. ‘ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం’ అని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. -
జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే : వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే అని తెలిపారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవి జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం అని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. -
క్షమాపణా ద్వారానికి గుడ్ ఫ్రైడే
యేసుప్రభువు మరణించిన ‘గుడ్ ఫ్రైడే’ని లోకం చివరి అధ్యాయం అనుకుంది. కాని రెండు రోజులకేఆదివారం నాటి ‘ఈస్టర్ పునరుత్థానం’తో మానవ చరిత్రలో ఒక నవ కృపాశకంఆరంభమయింది. అత్యంత ఆహ్లాదకరమైన, శాంతిభరితమైన వాతావరణానికి ‘క్షమాపణ’ మన జీవితంలో ద్వారం తెరుస్తుంది. యేసుప్రభువు ప్రబోధాల నిండా ఆయన ప్రేమ, క్షమాపణే నిండి ఉన్నా, సిలువ వేయబడేందుకు ముందు రాత్రి జరిగిన పస్కా విందులోనే ప్రభువు క్షమాపణా ఉద్యమం ఆచరణలో ఆరంభమైంది. ఆయన తన ద్రాక్షారసం గిన్నెలో రొట్టె ముక్కలు ముంచి తనకు ద్రోహం చేసిన ఇస్కరియోతు యూదాతో సహా శిష్యులందరికీ ఇచ్చాడు. ఇది యూదుల సామాజిక ఆచారం. ఒక వ్యక్తిని క్షమించినపుడు ఆ వ్యక్తి, అవతలి వ్యక్తిని తాను క్షమించానని తెలియ జేస్తూ ద్రాక్షారసంలో ముంచిన రొట్టెముక్కను అందరి సమక్షంలో అతనికిస్తాడు. ఆ క్షణం నుండి వారి మధ్య వైరానికి తెర పడుతుంది. మేడగదిలో జరిగిన పస్కా విందులో అదే జరిగింది అదే. లోకానికంతటికీ క్షమాపణను ప్రసాదించిన సిలువ యాగానికి ముందు యేసుప్రభువు ఆ ఉద్యమాన్ని తన శిష్యులతో ఆరంభించాడు. ఎందుకంటే కొద్దిగంటల్లోనే వాళ్లంతా తనను వదిలేసి పిరికిపందల్లాగా పారిపోనున్నారు. ఇక ఇస్కరియోతు యూదా అనే శిష్యుడైతే ముప్పై వెండినాణేలకు అమ్మేసి ప్రభువుకు ద్రోహం చేసేందుకు అప్పటికే యూదు మతాధికారులతో ఒప్పందం చేసుకున్నాడు. ఎంతైనా ఇస్కరియోతు యూదా యెరికోలోని ఒక వ్యాపారస్థుని కొడుకు కదా, తన వ్యాపార లక్షణం పోనిచ్చుకోలేదు. వస్తువులమ్ముకొని లాభం గడించినట్టే యేసుప్రభువును కూడా అమ్మేస్తే తప్పేమిటి? అన్నది అతని ‘లాజిక్’!! యూదా కుట్రమేరకు అర్ధరాత్రిపూట గెత్సేమేనే తోటలో యేసుప్రభువును నిర్బంధించిన రోమా సైనికులు ఆయన్ను మొదట ప్రధాన యాజకుడైన కయప ఇంటికి, ఆ తర్వాత తెల్లవారిన తర్వాత తీర్పు కోసం పిలాతు మందిరానికి తీసుకెళ్తున్నప్పుడు ఒకరిద్దరు మినహా శిష్యులంతా పారిపోయారు. అయితే యేసుప్రభువు మాత్రం ఒంటరివాడు కాలేదు. అంతటి శ్రమల్లోనూ ఆయన తన పరలోకపు తండ్రితో నిరంతర సహవాసంలోనే ఉన్నాడు. అందుకే తనను హింసిస్తున్న వారినందరినీ క్షమించమంటూ సిలువలో వేలాడుతూ కూడా పరలోకపు తండ్రికి ప్రార్థన చేశాడు. తనతోపాటు సిలువ వేసిన గజదొంగల్లో ఒకతను తనను క్షమించమని కోరగా అతనికి పరలోక భాగ్యాన్ని కూడా ప్రభువు ప్రసాదించాడు. యేసుప్రభువును అమ్ముకొని కూడా డబ్బు సంపాదించాలనుకున్న యూదా ఇస్కరియోతు మాత్రం ఆ రోజే ఉరివేసుకొని చనిపోయి నరకానికెళ్లాడు అందువల్ల ఆనాటి గుడ్ ఫ్రైడే ఇస్కరియోతుకు ఒక ‘బ్యాడ్ ఫ్రైడే’.. కాని చివరి నిముషంలో మారుమనస్సు పొంది ప్రభువును ఆశ్రయించి ఆయన కృపతో పరలోకానికెళ్లిన ఆ గజదొంగకు మాత్రం అది నిజంగా గుడ్ ఫ్రైడే, ప్రభువు శిష్యుడు, గొప్ప మేధావి అయి ఉండి కూడా యూదా నరకానికెళ్లడమే నాటి గుడ్ ఫ్రైడే లో నిజమైన ట్రాజెడీ,ఆనాటి యూదు మతాధికారులు, రోమా పాలకులు కసికొద్దీ యేసుప్రభువును శారీరకంగా, మానసికంగా హింసించినా, అంతటి శ్రమలో కూడా శరీరం, మనసు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన్ను చంపానని లోకం విర్రవీగింది. కానీ వాస్తవానికి ఆయనే తన ఆత్మను తండ్రికి అప్పగించడం ద్వారా స్వచ్ఛందంగా ప్రాణత్యాగం చేశాడు, యేసుప్రభువు జీవితానికి లోకం ‘గుడ్ ఫ్రైడే’ చివరి అధ్యాయం అనుకుంది.. కాని రెండు రోజులకే ఆదివారం నాటి ‘ఈస్టర్ పునరుత్థానం’ తో ఒక మానవ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం, నవ కృపాశకం ఆరంభమయింది. ఒక చెంపను కొట్టిన వ్యక్తి దవడ పళ్ళన్నీ రాలగొట్టాలనే ఈ లోకపు ప్రతీకార సిద్ధాంతం ఎంత బలహీనమైనదో సాత్వికత్వం, సరళత్వం, శాంతిపథం ఎంతటి శక్తివంతమైన ఆయుధాలో యేసుప్రభువు తన బోధలు, జీవితం, సిలువత్యాగం, పునరుత్థానం ద్వారా రుజువు చేశాడు. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన తర్వాత తన సిబ్బందితో కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్ళాడు. అక్కడ ఒక మూలన కూర్చున్న ఒక అనామక వ్యక్తిని తీసుకొచ్చి తనతోపాటు కూర్చోబెట్టమని సిబ్బందికి చెప్పాడాయన. ఆ వ్యక్తి ఎంతో భయం తో వచ్చి నెల్సన్ మండేలా కూర్చున్న టేబుల్ వద్దే కూర్చున్నాడు. తెప్పించిన ఆహారపదార్థాలన్నీ భయంతో వణికిపోతూనే మౌనంగా తిన్నాడు. ఆ తర్వాత అలా భయపడుతూనే వెళ్ళిపోయాడు. దేశాధ్యక్షుడితో కలిసి కూర్చుంటే భయపడక తప్పదు కదా అనుకున్నారంతా. కాని తాను సుదీర్ఘకాలం పాటు జైలులో ఉన్నపుడు తనను అత్యంత క్రూరంగా హింసించిన జైలు గార్డు అతనని, తనను యథేచ్ఛగా హింసించిన తర్వాత కూడా కసి తీరక కొన్నిసార్లు అతను తన మొహం మీద మూత్రం కూడా పోసేవాడని మండేలా తన సిబ్బందికి తెలియజేశాడు. తాను తనను గుర్తించానని అతనికి తెలిసింది కాబట్టి ప్రతీకారం తీర్చుకుంటానని అతను భయపడుతున్నాడని, అయితే అతనెక్కడుంటాడో, అతని కష్టాలేంటో తెలుసుకొని అతనికి తగిన సాయం చెయ్యమని, అదే తన ప్రతీకార విధానమని మండేలా ఆదేశించాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
అసలే 13...ఆపైన శుక్రవారం
జనాలకు కొన్ని వింత నమ్మకాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లి ఎదురొచ్చినా, ఎవరైనా తుమ్మినా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం వంటివి. ఇలానే ప్రజల్లో ఇంకా చాలా మూఢ నమ్మకాలే ఉన్నాయి. ఒక్కోసారి ఏమైనా సంఘటనలు యాధృచ్చికంగా ఏర్పడినా.. అవి ఈ మూఢ నమ్మకాల వల్లే ఏర్పడ్డాయని కొందరు భావిస్తుంటారు. ఇలాంటి నమ్మకాల వల్ల కొన్ని సార్లు మంచి జరుగుతుంది, కొన్ని సార్లు చెడు జరుగుతుంది. అలాంటి ఒక వింత నమ్మకమే 13ను దురదృష్టంగా భావించడం. అవును ప్రపంచంలో చాలా దేశాల్లో 13ను దురదృష్ట సంఖ్యగా నమ్ముతారట. అలాంటి 13 వ తారీఖు కనుక శుక్రవారం వస్తే దానంత దరిద్రమైన రోజు మరొకటి ఉండదని అనుకుంటారట. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఈ రోజు శుక్రవారం 13వ తేదీ. 13వ తేదీని ఎందుకు దురదృష్ట సంఖ్యగా చెబుతారో సరైన కారణాలు తెలియదు కానీ, ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే.. ఏసు క్రీస్తును సిలువ వేయడానికి ముందు రోజు జరిగిన ముఖ్య ఘట్టం లాస్ట్ సప్పర్. దీనిలో పాల్గొన్నవారు 13 మంది. ఆ మరుసటి రోజు అనగా శుక్రవారం క్రీస్తును సిలువ వేశారు. ఆ రోజున ప్రపంచమంతటా ఉన్న క్రైస్తవులు గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు. ఇటువంటి బాధకరమైన సంఘటనలు జరిగాయి కాబట్టే ఏ నెలలోనైనా ఈ రెండు కలిసి వస్తే అంటే 13వ తేదీ శుక్రవారం వస్తే ఆ రోజు తప్పకుండా ఏదైనా చెడు జరుగుతుందని బఫ్ఫేలోని ఓ విశ్వవిద్యాలయంలో ఆంత్రాపాలజీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఫిల్ స్టివెన్స్ తెలిపారు. ఏజేసీ.కామ్‌లోని యూదుల ఇస్కారియట్ ప్రకారం క్రీస్తును మోసం చేసి సైనికులకు అప్పగించిన శిష్యుడు భోజన బల్ల వద్ద 13వ స్థానంలో కూర్చున్నాడని.. అందుకే 13 అనే అంకెను చెడు సంఖ్యగా భావిస్తారని తెలిసింది. కారణాలు ఏవైనా చాలా మంది మాత్రం 13 సంఖ్యను దురదృష్టంగా భావిస్తారు. ఆ తేదీన ఎవ్వరూ గృహప్రవేశం చేయరు. పెద్ద పెద్ద భవనాలలో కూడా 13వ నంబరు అంతస్తు ఉండదు. ఒకవేళ 13వ అంతస్తు ఉన్నా.. ఆ మొత్తం అంతస్తును ఖాళీగా ఉంచుతారు. ఆ రోజున ఎవరూ వివాహం కూడా చేసుకోరు. గతంలో కూడా 13వ తేదీ శుక్రవారం వచ్చిన సందర్భాల్లో అనేక అనూహ్యమైన చెడు సంఘటనలు సంభవించాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే కొంతమంది 13వ తేదీ, శుక్రవారం రెండు కలసిరావడం చాలా అదృష్టంగా భావిస్తారట. ఏదైనా మనం చూసేదాన్ని బట్టే ఉంటుందని, కాబట్టి ఈ రోజంతా మంచి జరగాలని ఆశించి, రోజు చివరలో ఏం జరిగిందో విశ్లేషించుకోండని అంటున్నారు న్యూమరాలజిస్ట్‌లు. మరో విషయం ఏంటంటే నేడు శుక్రవారం 13వ తేదీ అనంతరం ఈ ఏడాదిలో జూలై నెలలో కూడా 13వ తేదీ శుక్రవారంతో కలిసి రాబోతోంది. మరి ఈ రెండు రోజుల్లో ఏమైనా వింత విశేషాలు జరుగుతాయేమో చూడాలి. -
జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే
-
జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే
సాక్షి, అమరావతి: కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే అన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవి జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం అని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. -
సీఎం గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: గుడ్ ఫ్రైడే పర్వదినం సందర్భంగా క్రిస్టియన్లకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గుడ్ ఫ్రైడే ఆనందంగా జరుపుకోవాలని, ఏసు క్రీస్తు ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నింపాలని కోరుకుంటున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
మన కోసమే సిలువ మరణం
ఇవాళ గుడ్ ఫ్రైడే, అంటే శుభ శుక్రవారం, యేసు క్రీస్తును కల్వరి సిలువ వేసినరోజే శుభ శుక్రవారం అని పిలువబడుతోంది, అదేంటి యేసు క్రీస్తు సిలువలో మరణించిన రోజు శుభ శుక్రవారం ఎలా అవుతుంది అని అనుకుంటున్నారా? ఇలా లోకంలో నిజంగా యేసు క్రీస్తును ఎరుగని వారందరూ ప్రశ్నిస్తూ ఉంటారు కదూ? అయినా మరణించిన దినం చెడు అవుతుంది కానీ, మంచి దినం కాదు కదా అనే వారు కూడా ఉన్నారు. అయితే, యేసు క్రీస్తు మరణం మానవ జాతికి జీవము కలుగజేసేదిగా ఉన్నందువలన సకల మానవుల పాప పరిహారార్థ » లిగా ప్రాణమిచ్చిన ప్రభువు మరణం సర్వలోకానికి ఆనందకరంగా మారింది. దానికి కారణం అపవాదిని మరణము ద్వారా జయించిన ప్రభువు జీవిత కాలమంతా మరణ భయంతో పీడింపబడుతున్న మనలను విడిపించినదిగా ఉన్నది గనుక యేసు క్రీస్తు మరణము శుభ దినముగా పిలువబడుతుంది. అవును, ఎవరైతే యేసు క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఆయనను తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి ఆయన మరణములో ఉన్న జయము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది, కాబట్టి, యేసు క్రీస్తు మరణించిన రోజు గుడ్ ఫ్రైడే అయింది. లోకమంతటా ఈ శుభ శుక్రవారమును పూర్వం ఆచారంగా ఆచరిస్తుంటారేమో గాని, యేసు క్రీస్తును ఎరిగిన వారు ఈ శుభ శుక్రవారమును ఎంతో ఆనందంగాను స్వీకరిస్తారు, మరొకసారి తమ పాప క్షమాపణల కొరకు ఆ కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన యేసుప్రభువు మరణాన్ని జ్ఞాపకము చేసుకుని తమ్ము తాము సమర్పించుకుంటారు. ప్రతీ మనిషికీ మరణం తప్పదు. ఎంతోమంది దేశం కోసం, రాష్ట్రం కోసం మరణిస్తున్నారు. త్యాగంతో మరణిస్తున్నారు. ఇలా పలువిధాలైన మరణాలను మనము ఈ భూలోకంలో చూస్తున్నాము. కానీ, యేసు క్రీస్తు మాత్రం సర్వజనులను ప్రేమించి వారి పాప ప్రాయశ్చిత్త నిమిత్తము సిలువ వేయబడ్డాడు. అయితే, యేసు క్రీస్తు మరణం ఒక్కటే ప్రత్యేకమైనదిగా ఉంది. ఆయన మరణించినప్పటికీ మరణాన్ని జయించి మూడవ దినాన మృత్యుంజయుడై లేచాడు.మీకు తెలుసా? ఆనాడు యెరూషలేము పట్టణములో సమాధులు భూమిలో తవ్వేవారు కాదు. కొండలలో తొలుచునవిగా ఉండేవి, అలాగే రాతి సమాధి లో యేసు క్రీస్తు శరీరాన్ని ఉంచి ఒక పెద్ద బండను ద్వారముగా అడ్డముగా నిలిపారు. అయితే మూడవ దినాన రాతి సమాధి తెరవబడింది, యేసు క్రీస్తు మృత్యుంజయుడై తిరిగి లేచి యున్నాడని దేవుని వాక్యం చెబుతుంది. ఇది సత్యం. ఇది యథార్థం. ఈనాటికీ యేసు క్రీస్తు ఖాళీ సమాధి యెరూషలేము పట్టణములో మనం చూడగలం. యేసు క్రీస్తు మరణించడమే కాదు తిరిగి లేచాడు కనుక శుక్రవారం నాడు శుభ శుక్రవారంగా జ్ఞాపకం చేసుకుంటున్న వారందరు ఆదివారమును ఈస్టర్‌గా అంటే యేసు క్రీస్తు పునరుత్థానుడైన ఆదివారముగా జ్ఞాపకం చేసుకుంటారు. యేసు క్రీస్తు మరణం మానవ జాతికి జీవము కలుగజేసేదిగా ఉన్నందువలన సకల మానవుల పాప పరిహారార్థలిగా ప్రాణమిచ్చిన ప్రభువు మరణం సర్వలోకానికి ఆనందకరంగా మారింది. – బ్రదర్ కర్నే జాన్ -
నిమ్స్‌లో రేపు ఓపీ బంద్
హైదరాబాద్: గుడ్‌ఫ్రైడే సందర్భంగా నిమ్స్ ఆసుపత్రిలో శుక్రవారం ఔట్ పేషెంట్ విభాగం (ఓపీ) సేవలు అందుబాటులో ఉండవని, తిరిగి శనివారం తెరుస్తామని యాజమాన్యం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
గుడ్ ఫ్రైడే..దేవుని ప్రేమకు ప్రతీక
-
స్టాక్ మార్కెట్లకు సెలవు
ముంబై : స్టాక్ మార్కెట్లు నేడు సెలవును పాటిస్తున్నాయి. గుడ్ ప్రైడే, అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్లు ట్రేడింగ్ ను జరుపడం లేదు. కాగ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గురువారం ప్రకటించిన క్యూ4 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో నిన్న మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పతనమైంది. మొత్తం మీద సెన్సెక్స్ 182 పాయింట్లు నష్టపోయి 29,461 పాయింట్ల వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 9,151 పాయింట్ల వద్ద సెటిలయ్యాయి. శుక్రవారం సెలవుతో పాటు, శని, ఆదివారాలు కూడా మార్కెట్లు ట్రేడింగ్ ఉండకపోవడంతో దేశీయ ఈక్విటీ సూచీలకు మూడు రోజులు సెలవులు కలిసి వచ్చాయి. మరోవైపు దేశీయ మార్కెట్లతో పాటు అమెరికా ఫైనాన్సియల్ మార్కెట్లు గుడ్ ప్రైడే సందర్భంగా నేడు సెలవును పాటించనున్నాయి. మేజర్ ఆసియన్ మార్కెట్లు కూడా గుడ్ ప్రైడే, ఈస్టర్ మండే కారణంగా ఈ రోజుల్లో ట్రేడ్ హాలిడేను ప్రకటించాయి. అమెరికా కమోడిటీస్ మార్కెట్లు అంటే గోల్డ్, క్రూడ్-ఆయిల్ ఫ్యూచర్స్ నేడు ట్రేడింగ్ జరుపవు. -
జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే
హైదరాబాద్: జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే అని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు.. ఆ తర్వాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన మహా ఘట్టాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం ఇది జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశమని ఆయన అన్నారు. -
కరుణామయుడు శిలువనెక్కిన రోజు
మానవుల పాప పరిహారం కోసం కరుణామయుడైన ఏసుక్రీస్తు శిలువనెక్కిన రోజును మంచి శుక్రవారం (గుడ్ ఫ్రైడే) అంటారు. ఏసుక్రీస్తు మరణం ఎంతో వ్యధాభరిత సంఘటన. సాధారణ మనుషులు ఎవరైనా మరణిస్తే దానిని ‘మంచి’ అనుకోము కదా! అలాంటిది ఏసుక్రీస్తు మరణించిన దినాన్ని మంచిదిగా ఎందుకు పరిగణిస్తున్నారంటే... అందుకు ఏసుక్రీస్తు జీవితాన్ని, మానవుల పాప పరిహారం కోసం ఆయన చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పాపుల కోసం ప్రాయశ్చిత్తంగా... దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు ఒక సంపూర్ణ మానవుడిగా జీవించాడు. మానవుడు ఈ లోకంలో ఎలా జీవించాలో అలా జీవించాడు. అలాంటి సంపూర్ణ జీవితమే మానవుల పాప పరిహారానికి తగిన బలి. మానవులు పాపం చేసి దేవుని తీర్పునకు తగినవారుగా ఉన్నారు. మానవుల పాపానికి పరిహారం ఏమిటి? మానవుల కోసం ఒకరు చనిపోవాలి. కానీ, ఏ ఒక్కరూ మానవుల పాపానికి చనిపోదగ్గవారు కాదు. ఎందుకంటే, దేవుని దృష్టిలో అందరూ పాపులే. పాపుల పాప పరిహారం కోసం పాపులు మరణించలేరు. మానవుల పాపానికి దేవుడే పరిహారం చేయగలడు. అందుకే దేవుడు తన కుమారుడైన ఏసుక్రీస్తును శిలువ మీద చనిపోయి, మానవుల పాపానికి ప్రాయశ్చిత్తం చేసినట్లు చేశాడు. యెషయా ప్రవక్త క్రీస్తుపూర్వం ఏడువందల సంవత్సరాల నాడే ఈ విధంగా ప్రవచించాడు... ‘మనమందరం గొర్రెలవలె తోవ తప్పితిమి. మనలో ప్రతివాడును తనకు ఇష్టమైన తోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను’ (యెషయా 53:6) ఏసుక్రీస్తు మరణం ద్వారా మానవులు పాప క్షమాపణను, దేవునితో సహవాసమును పొందగలరు. ఇందువల్లనే ఏసుక్రీస్తు మరణాన్ని మంచిదిగా పరిగణిస్తున్నారు. మరణించిన మూడు రోజుల తర్వాత క్రీస్తు పునరుత్థానం చెందాడని, పునరుత్థానం తర్వాత నలభై రోజులలో పది వేర్వేరు సందర్భాలలో ఐదువందల కంటే ఎక్కువ మంది శిష్యులకు క్రీస్తు కనిపించినట్లు ఆయన శిష్యులు లోకానికి వెల్లడించారు. క్రీస్తు ప్రాయశ్చిత్త మరణంలో, పునరుత్థానంలో మానవాళికి మేలు, క్షేమం, సమాధానం లభించాయి. గుడ్‌ఫ్రైడే అంటే యేసయ్య చనిపోయిన రోజు. మన పాపాల్ని క్షమించడానికి బ్లడ్ అంతా కార్చారు. మనల్ని హెవెన్కు తీసుకు వెళ్లడానికి జీసస్ క్రాస్‌పై మరణించారు. జాన్ లివింగ్స్టన్ మనకు సాల్వేషన్ ఇవ్వడం కోసం జీసస్ చనిపోయారు. అందుకే మనం ‘గుడ్’ ఫ్రైడే అంటాం. మనం చేసిన మిస్టేక్స్‌కు జీసస్‌ను పనిష్ చేశారు. జీసస్కు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. జాన్ మార్క్ విలియమ్ మనందరి కోసం జీసస్ చనిపోయారు. మన కోసం దెబ్బలు తిన్నారు. జీసస్కు నేనంటే చాలా ఇష్టం. అందరూ అన్నా కూడా ఇష్టమే! ఆయన అందరికీ దేవుడు. అక్సా ట్రైఫీనా గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. ఎందుకంటే జీసస్ చనిపోయారు మూడో రోజున బతికారు. జీసస్ క్రాస్‌పై మనకోసమే చనిపోయారు. ఆయన చేతులకు, కాళ్లకు మేకులు కొట్టారు. ముళ్ల కిరీటం పెట్టారు. కొరడాలతో కొట్టారు. క్రిసలైట్ ఆలివ్, అమూల్యా గ్రేస్ -
సారూ.. విషెస్ అలా చెప్పకూడదు!
పర్వదినాల సందర్భంగా శుభాకాంక్షలు, శుభవచనాలు తెలిపే విషయంలోనూ బీజేపీ నేతలకు ఆన్లైన్లో మొట్టికాయలు పడ్డాయి. ఇద్దరు బీజేపీ సీనియర్ నేతలు 'గుడ్ ఫ్రైడే' సందర్భంగా ట్విట్టర్లో చెప్పిన శుభాకాంక్షలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. ఏ పర్వదినానికి ఎలా విషెస్ చెప్పాలో కాస్తా తెలుసుకొని సున్నితంగా మసులుకోండి అంటూ నెటిజన్లు ఆ నేతలకు పాఠాలు చెప్పారు. సాక్షాత్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ శుక్రవారం ఉదయం అసంబద్ధమైన విషెస్ చెప్పారు. 'మీకు శుభసౌఖ్యాలు కలుగాలని కోరుకుంటున్నా. హ్యాపీ గుడ్‌ఫ్రైడే' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇది ఆన్లైన్ ట్రోల్ కావడంతో ఆయన వెంటనే తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ 'వార్మ్ గ్రీటింగ్స్ ఆన్ గుడ్ ఫ్రైడే టు ఆల్ ఆఫ్ యూ' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై విమర్శలు వచ్చినా ఆయన తొలగించలేదు. యేసు క్రీస్తుకు శిలువ వేసిన సందర్భాన్ని స్మరించుకుంటూ ఉపవాస దీక్షలతో, ప్రార్థనలతో, ప్రాయోశ్చిత్త భావనతో గుడ్ ఫ్రైడేను ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. ఈ రోజును సంస్మరణ దినంగా భావిస్తారు. బీజేపీ నేతల ట్వీట్ గ్రీటింగ్లపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. గుడ్ ఫ్రైడే ఉద్దేశమేమిటో, ఆ రోజున జీసెస్ క్రైస్ట్ ఏం బోధించాడో దయచేసి వారికి చెప్పండి.. మొహర్రం రోజున హ్యాపీ మొహర్రం అని విషెస్ చెప్పినట్టు ఉంది వీరి తీరు అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గుడ్ ఫ్రైడే ప్రార్థనలు
-
అతడిని శిలువ వేశారేమో..!
- ఇండియన్ ప్రీస్ట్ ను కిడ్నాప్ చేసిన ఐఎస్ఐఎస్ - గుడ్ ఫ్రైడే నాడు శిలువ వేసి ఉంటారని అనుమానం ఐఎస్ఐఎస్ కిడ్నాప్ చేసిన ఇండియన్ ప్రీస్ట్ ను గుడ్ ఫ్రైడే నాడు.. శిలువ వేసి ఉంటారనే ఆనుమానాలు బలపడుతున్నాయి. యెమెన్ లో మార్చి 4న ఒక రిటైర్డ్ మెంట్ హౌస్ పై ఇస్లామిక్ తీవ్రవాదులు దాడి చేసిన సమయంలో ఫాదర్ టామ్ ఉజునలిల్ ను ఎత్తుకెళ్లారని భావిస్తున్నారు. అతి కిరాతకంగా.. దాడిచేసిన తీవ్రవాదులు.. ఓ మిషనరీ ఆధ్వర్యంలో నడుస్తున్న హోమ్ పై దాడి చేసి.. నలుగురు క్రైస్తవ సన్యాసినులతో సహా.. 16 మందిని చంపేశారు. దాడి తర్వాత అదే హొం లో బస చేస్తున్న ఫాదర్ టామ్ జాడతెలియడం లేదు. గత ఆదివారం ఓ క్రైస్తవ సన్యాసిని ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ఫాదర్ టామ్ పై జరగనున్న హింసకు సంబంధించి ఒక మెసేజీ పోస్టు చేశారు. ఈ పోస్టు ప్రకారం గుడ్ ఫ్రైడే నాడు ఫాదర్ ను శిలువ వేసే అవకాశం ఉనట్లు అనుమానిస్తున్నారు. మరో వైపు దాడికి ముందు ముగ్గురు ఇథియోపియన్ క్రిస్టియన్ యువకులు హోమ్ లోకి హడావుడిగా వచ్చి.. ఐఎస్ఐఎస్ దాడికి సంబంధించిన సమాచారం ఇచ్చారని. తర్వాత కొద్ది సేపటికే.. మారణ హోమం జరిగిందని. అప్పుడే ఫాదర్ ని కిడ్నాప్ చేశారని ఓ సన్యాసిని చేతిరాతతో ఉన్న నోట్ హోమ్ లో లభించిందని పేర్కొంటూ అలెటియన్ అనే క్రిస్టియన్ వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించింది. భారత్ లోని బెంగళూరు నగరంలోని డాన్ బాస్కోకి చెందిన సలేషియన్ సిస్టర్స్ సభ్యులు మాట్లాడుతూ.. ఫాదర్ ఆచూకీపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. హోమ్ పై దాడులకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. అయితే యెమెన్ అధికారులు మాత్రం ఇది ఐఎస్ఐఎస్ దుశ్చర్యే అని ప్రకటించాయి. ఈ ప్రాంతంలో అల్ ఖైదా కు కూడా పట్టు ఉండంతో.. వారు చేసి ఉంటారని కొంత మంది విస్తున్నారు. -
గుడ్‌ఫ్రైడే రోజు మూడు కేసులు నమోదు
పబ్లిక్ హాలిడే రోజు కూడా కార్మికులతో పని చేయించుకుంటున్న మూడు దుకాణాలపై లేబర్ ఇన్స్పెక్టర్ దాడులు నిర్వహించారు. గుంటూరు జిల్లా గురజాలలో శుక్రవారం గుడ్‌ఫ్రైడే రోజున కూడా సెలవు పాటించకుండా.. తెరిచి ఉంచిన మూడు వస్త్ర దుకాణాలపై దాడులు నిర్వహించిన లెబర్ ఇన్స్పెక్టర్ అందులో కార్మికులు పని చేయడాన్ని గుర్తించి మూడు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. -
క్రీస్తును ఎలా శిలువ వేశారు?
లండన్: నేడు పవిత్ర శుక్రవారం. అంటే ఏసు క్రీస్తును శిలువ వేసిన రోజు. శిలువ వేయడం అంటే శిలువకు క్రీస్తును ఆనించి చేతులకు, కాళ్లకు మేకులు దిగేయడంగా మనకు తెలుసు. ఇప్పుడు మనకు ఏ క్రీస్తు శిలువ విగ్రహాన్ని చూసిన ఇదే అర్థం అవుతుంది. మరి నిజంగా క్రీస్తును శిలువ వేసినప్పుటు ఆయన చేతులకు, కాళ్లకు మేకులు దిగేశారా? అన్నది ఇప్పుడు చర్చ. చిన్న చిన్న నేరాలు చేసిన వారిని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారిని, ప్రజల్లో తిరుగుబాటు లేవదీసిన వారిని శిలువ వేయడం నాటి రోమన్ సంస్కృతి. శిలువ వేయడం అంటే మరణ శిక్ష వేయడమని కూడా కాదు. కొన్ని రోజుల పాటు అన్న పానీయాలు లేకుండా అలా శిలువపై మాడుస్తారు. హింసిస్తారు. కొందరు ఆ శిక్ష ను తట్టుకోలేక చనిపోతారు. బతికున్న వారిని వదిలేస్తారు. మరి ఏసు క్రీస్తును ఎలా శిలువ వేశారు? రోమన్లు శిలువ వేసినప్పుడు చేతులు, కాళ్లకు మేకులు కొట్టేవారనడానికి ఎక్కడా శాస్త్రీయ లేదా చారిత్రక ఆధారాలు లేవు. పురావస్తు తవ్వకాళ్లో శిలువ శిక్ష అనుభవించిన వారి శకలాలు దొరికాయి. వారి చేతులకు, కాళ్లకు మేకులు కొట్టిన ఆనవాళ్లు దొరకలేదు. ఒకే ఒక్క మానవ శకలం అలా దొరికింది. దానికి కూడా కాళ్లకు మాత్రమే మేకులు దిగేసినట్లు ఉంది. చేతులకు లేవు. బ్రిటీష్ మ్యూజియంలో ఇప్పటికీ భద్రంగా ఉన్న నాలుగవ శతాబ్దం నాటి క్రీస్తు శిలువ విగ్రహాల్లో క్రీస్తు చేతులు, కాళ్లకు మేకులు కొట్టిన ఆనవాళ్లు లేవు. భుజం మీద అడ్డంగా ఉన్న కర్రకు మణికట్టు వద్ద చేతులు కట్టేసినట్లు మాత్రమే అవి ఉన్నాయి. రత్నపు రాళ్లపై చెక్కిన ఆ విగ్రహాలను జాగ్రత్తగా చూసినట్లయితే ఈ విషయం మనకు అర్థం అవుతుంది. నాటి కాలం గాస్పెల్స్ (క్రీస్తు జీవితం, ప్రవచనాల ప్రచారకులు) కూడా ఏనాటు క్రీస్తును ఈ విధంగా శిలువ వేశారని చెప్పలేదు. కొత్త టెస్టామెంట్ ప్రకారం మాత్యూ, మార్క్, లూక్, జాన్ అనే గాస్పెల్స్ కొంచెం అటూ ఇటుగా క్రీస్తుకు మేకులు దిగేశారని చెప్పారు. నాటి రోమన్ కాలంలో మనుషులను శిలువ వేసినప్పుడు మేకులు కొట్టేవారు కాదని, చేతులను, కాళ్లను కట్టేసేవారని మనకు ‘మోంటీ పైథాన్స్ లైప్ ఆఫ్ బ్రెయిన్’ హాలివుడ్ పురాతన సినిమా కూడా తెలియజేస్తోంది. -
గుడ్ ఫ్రైడే.. గ్రేట్ ఫ్రైడే
నేడు గుడ్‌ఫ్రైడే శుభదినం చీకటిలో అల్లాడి విశ్వాన్ని చూడలేక వెలుగును సృష్టించిన దేవుడాయన. లోకానికి రక్షణ వెలుగుగా వేంచేసిన రక్షకుడాయన. అయితే ముష్కరులంతా ఒక ముఠాగా ఏర్పడి సాత్వికత్వానికి, ప్రేమకు, క్షమాపణకు ప్రతిబింబమైన ఏసుక్రీస్తును సిలువకు మేకులతో గుచ్చి ఆఖరిబొట్టుదాకా ఆయన రక్తాన్ని స్రవింపజేశారు. చరిత్రలో నాటివరకు మరణమే లోకంలో రాజ్యమే లింది. మరణాన్ని చూపించి భయపెట్టి రాజ్యాధికా రాలు కైవసం చేసుకున్నారు. కాని అంతటి బలమైన ఆ మరణమే దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు ముందు చిత్తుగా ఓడిపోయింది. అత్యంత విషాదకరమైన సిలువ ప్రస్థానం అలా మొదలైంది. ప్రజలను రక్షించడానికి ఉద్దేశించిన చట్టాలు, వ్యవస్థలు, శాసనాలు పాలకుల్లోని కుట్ర దారులు, పిరికిపందల చేతుల్లో ఆయుధాలుగా మారితే జరిగే అనర్థమేమిటో ఆనాడే క్రీస్తు సిలువతో రుజువయింది. కానీ ఏసుక్రీస్తుకు సిలువ విధించిన రోమా ప్రభుత్వం చరిత్రలో నామరూపాలు లేకుండా పోయింది. ఆ క్రీస్తు తాలూకు ఆత్మీయ ప్రేమ సామ్రాజ్యం మాత్రం రెండు వేల ఏళ్లుగా ఎల్లలు లేకుండా విస్తరిస్తోంది. సిలువలో క్రూరంగా హింసించినా ప్రతీకారాగ్ని చల్లారని చీకటి శక్తులు క్రీస్తును గజదొంగ స్థాయికి దిగ జార్చడం కోసం ఆయనకు ఇరువైపులా ఇద్దరు గజదొంగలను కూడా వేలాడదీశాయి. వారిలో ఒకడు క్రీస్తును తూలనాడితే సిలువలో మరణిస్తున్న మరొక గజదొంగ ‘ప్రభూ నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో’ అని అర్థించాడు. సిలువలో మరణానంతరం ఏసు క్రీస్తుకు అంగరక్షకుడుగా మహాభక్తుడెవరైనా పరదైసు లోకి ప్రవేశిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆ దేవదేవుడు ఒక దొంగకు ఆ ఆధిక్యతనిచ్చాడు. ఎందుకు? ఆ దొంగ చేసిన మొదటి, చివరి ప్రార్థన కూడా ఏసుక్రీస్తు ఈ లోకంలోకి రావడంలోని మూల ఉద్దేశాన్ని తాకింది. ఆయన పాపులను కూడా నీతిమంతులుగా మార్చి పరలోకానికి తీసుకెళ్లేందుకే ఈ లోకానికి వచ్చాడు. ఆ దొంగ తన మరణ సమయంలో పరలోకాన్నే కోరుకున్నాడు. ప్రభువు తక్షణం అనుగ్రహించాడు. రెండువేల ఏళ్ల క్రితం ఇదే శుక్రవారం కల్వరి గిరిపై క్రీస్తును శిలువపైకి ఎక్కించారు. చేతుల్లోకి, పాదాల్లోకి మేకులు దిగ్గొట్టారు. రక్తం చివ్వున ఎగజిమ్మింది. ‘దేవా, నా దేవా.. నన్నెందుకు చేయి విడిచావు!’ క్రీస్తు బాధ నింగివరకు ప్రతిధ్వనించింది. మౌనమే సమాధానం. తండ్రి ఆజ్ఞపాలన కోసం తలవాలుస్తూ క్షమాప్రార్థన చేశారు ఏసుక్రీస్తు. ‘వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక తండ్రీ వీరిని క్షమించు’. ప్రార్థన పూర్తయింది. అకస్మాత్తుగా లోకాన్ని చీకటి కమ్ముకుంది. పునరుత్థానం కోసం మానవాళి పాపప్రక్షాళన కోసం ప్రాణాన్ని విడిచి మరణాన్ని ఓడించారు క్రీస్తు. అవమానికి ప్రతీకగా ఉండిన సిలువ ఏసుక్రీస్తు వల్ల ప్రేమకు, త్యాగానికి, పరలోకార్హత పొందడానికి, ఆయన ఆత్మీయ సామ్రాజ్యానికి ప్రతీకగా మారింది. అందుకే ఇది గుడ్ ఫ్రైడే.. గ్రేట్ ఫ్రైడే. - డేనియల్ -
యేసు క్రీస్తు ముద్రలు
సందర్భం నేడు గుడ్ ఫ్రైడే మనందరి కొరకు బలిపశువుగా తనను తాను అర్పించుకొనుటకు ఈ లోకమునకు వచ్చిన యేసుక్రీస్తు నామమున పాఠకులందరికీ వందనములు. ‘‘నేను క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను’’ (గలతీ 6:17) అని చెప్పిన పౌలు మాటలు ధ్యానించతగినవి. ‘‘వీరు నా స్వంతము’’ అంటూ యేసు ప్రభువు వేసిన ముద్రలని కొందరు వ్యాఖ్యానిస్తారు. అయితే పౌలు దమస్కు మార్గంలో యేసుప్రభువును సంధించినప్పటి నుండి, ఒకప్పుడు హింసకుడుగా ఉన్నవాడు, హింసింపబడిన వాడిగా మారినప్పటి నుండి తాను యేసయ్య కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడో తానే చెప్పాడు. 2 కొరింథీ 11:23-27లో ‘‘మరి విశేషముగా ప్రయాసపడితిని; అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని; అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని; యూదుల చేత అయిదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని; ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని; అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్య జనుల వలననైన ఆపదలలోను, పట్టణములో, అరణ్యములో, సముద్రములో, కపట సహోదరుల వలని ఆపదలలో ఉంటిని. ప్రయాసతోను, కష్టములతోను, జాగరణములతోను, ఆకలిదప్పులు, ఉపవాసములు, చలి, దిగంబరత్వముతోను ఉంటిని’’ అని చెప్తున్నాడు. ఈ దెబ్బల వలన వచ్చిన మచ్చలు పౌలు జీవించినంత కాలము అతని శరీరము మీద కనపడి ఉండవచ్చును. ఈ గాయాల మచ్చలను కేవలము మచ్చలుగా కాకుండ తాను ‘యేసయ్య సొత్తు’ అను సంగతిని గుర్తు చేసేందుకు వేయబడిన ముద్రలని పౌలు భావిస్తున్నాడు. ఈ ముద్రలు కేవలము చర్మము వరకే కాకుండా తన భావోద్రేకాలపైన, తన ఆత్మీయ జీవితంపైన పడ్డాయి. ఈనాడు ఇలాంటి ముద్రలు మనము నివసించు ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. దేవుని కృప వలన ప్రస్తుతము మనకు అలాంటి పరిస్థితులు లేవు, కాని మనమందరము ఆలోచించాల్సిన విషయమేమంటే ఈ ముద్రలు మన ఆత్మీయ, నైతిక, మానసిక వైఖరిపైనను, మన వ్యక్తిత్వము పైనను పడినాయా లేదా అని! మనము క్రీస్తును నమ్ముకొనిన తర్వాత పాపము విషయమై మరణించి క్రీస్తు కొరకు జీవించాలి. మన అవయవములు ఆయన అధీనంలో ఉంచి, వాటిపైన ఆయన ముద్ర వేసుకోవాలి. పౌలులాగా మన శరీరాలపైన బాహ్య గుర్తులు లేకపోయినను, హృదయంలో ముద్రించుకోవాలి. ఆయనకు మనము కట్టు బానిసలమై పోవాలి. నిర్గమ 21:1-6లో ధర్మశాస్త్రము ప్రకారము వెలపెట్టి కొనబడిన బానిసకు 7వ సంవత్సరములో విడుదల ఇవ్వాలి. ఆ గడువు పూర్తయ్యాక తనకు విడుదల అవసరము లేదనియు, తాను జీవితాంతము తన యజమాని యొద్దనే ఉంటానని నిర్ణయము తీసుకొన్న బానిస చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉంటాడు. చెవికున్న రంధ్రము ద్వారా వాడు కట్టు బానిస అని ప్రపంచానికి తెలుస్తుంది. పౌలు అలాంటి బానిసత్వము కోరుకున్నాడు. రోమా 1:1లో ‘యేసుక్రీస్తు దాసుడను’ అని పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన ముద్ర వేయించుకొని, ఆయనకు చెందిన వారమని చెప్పుకొనుటలో గొప్ప ఆధిక్యత ఉన్నది. ఈ సమాజంలో ఒకవేళ మనము ఒక గొప్ప కుటుంబానికి చెందిన వారమైతే అందును బట్టి అతిశయిస్తామేమో గాని, సర్వాధిపతియైన యేసయ్య సంబంధిగా గుర్తింపు తెచ్చుకోవడము చాలా గొప్ప ఘనత అని మనము అర్థం చేసుకోవాలి. మనము క్రీస్తు కొరకు శ్రమపడితే, మన జీవితాల నుండి క్రీస్తు ప్రత్యక్ష పరచబడుతాడు. మహిమ పరచబడుతాడు. పరిచర్యలో శ్రమలేనిదే ఏమీ సాధించలేము. ముద్రలు కలవారు మంచి నేలన పడిన విత్తనములాంటివారు. అట్టివారు నూరంతలు గాను, అరువదంతలు గాను, ముప్పదంతలుగాను ఫలిస్తారు (మత్తయి 13:8). పౌలు యేసయ్య మార్గంలోకి రాక ముందు తన శరీరంలోని సున్నతి గుర్తును బట్టి అతిశయించాడు గాని ఇప్పుడు క్రీస్తు కొరకు శ్రమపడుట వలన వచ్చిన గుర్తులను బట్టి అతిశయిస్తున్నాడు. ఫిలిప్పీ 3:5-6 ఉన్న వాక్య భాగములో ఈ విధంగా అంటున్నాడు - ‘‘ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై, ఆసక్తి విషయములో సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై యుంటిని. అయినను ఏవేవి నాకు లాభకరముగా యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని.’’ కేవలము క్రీస్తును గురించిన జ్ఞానము, క్రీస్తు సిలువ యందు మాత్రమే అతిశయించు వాడిగా మారిపోయాడు. ఇంకొక సందర్భములో ఈ లోకములోని ప్రాముఖ్యమైన వాటన్నింటిని పెంటతో సమానముగా చూస్తున్నానంటున్నాడు. ‘క్రీస్తు ముద్రలు మన శరీరములో కలిగియుండుట’ అనునది మనం అన్వయించుకోవాలంటే క్రీస్తు సారూప్యములోనికి మారుతూ, ఆయన లక్షణాలు, స్వభావాలు కలిగియుండుట. మనము కొన్ని దినాలుగా సిలువ ధ్యానాలు చేసి ఉన్నాము కాబట్టి యేసుప్రభువు సిలువలో పలికిన ఏడు మాటల నుండి ఏ లక్షణాలు అలవరచుకోవాలో చూద్దాము. ‘‘తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము’’ (మత్తయి 5:44)లో శత్రువులను ప్రేమించమని తాను చెప్పిన మాటలు చేసి చూపిస్తున్నారు. యేసయ్య ముద్ర మనలో ఉన్నట్లు ఇతరులకు కనపడాలంటే శత్రువులను ప్రేమించుట, క్షమించుట, వారి కొరకు ప్రార్థించుట మనలో కనపడాలి. ఆది 50:15-21లో యోసేపు తనను చంపచూసి, ఆ తర్వాత బానిసగా అమ్మేసిన తన అన్నల పట్ల క్రీస్తు లాంటి క్షమాపణ చూపాడు. అ.కా.7:54-60లో ఉన్న వాక్య భాగములో స్తెఫను తనను చంపేవారని క్షమించమని దేవుని వేడుకొనుటలో యేసయ్య ముద్రలు బాహ్యంగాను, అంతరంగంలోనూ చూపించాడు. ‘‘నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువు’’ అని ప్రభువు తనతో పాటు సిలువ వేయబడిన దొంగతో చెప్పిన మాటల నుండి మనము నేర్చుకోవలసినది మనము చేయాల్సినది ఏమంటే మన తోటివారు మనతోపాటు పరలోకంలో ఉండాలనే తపన కలిగి ఉండాలి. ఉదాహరణకు పాత నిబంధనలో మోషే, క్రొత్త నిబంధనలో పౌలు ఇలాంటి తమ కోరికను వ్యక్తపరచారు. ‘‘అమ్మా, ఇదిగో నీ కుమారుడు’’ అని తన తల్లిని తనకు అత్యంత ప్రియమైన శిష్యునికి అప్పజెప్పడంలో తాను ధర్మశాస్త్రము నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు రాలేదని రుజువు చేసుకున్నాడు. మనము కూడా మన పెద్దలను, తల్లిదండ్రులను ప్రేమించినప్పుడు మన జీవితము ద్వారా దేవుడు మహిమ పరచబడుతాడు. తిమోతి తన తల్లి యునీకే, అవ్వ లోయిలను గౌరవించి, ప్రేమించి, వారు బోధించిన విషయాల ప్రకారము జీవించుట ద్వారా తాను క్రీస్తు ముద్రలు కలిగియున్నాడని రుజువు పరుచుకొన్నాడు. ‘‘నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి’’ అను మాటలో పాపముగా చేయబడిన యేసయ్య చేయి తండ్రియైన దేవుడు విడిచినట్లుగా మనకు అర్థమవుతుంది. పాపము చేసినప్పుడు పవిత్రుడైన దేవుడు మన చేయి వదిలేస్తాడను విషయము తెలుసుకొని జాగ్రత్తగా ఉంటూ, ఎప్పుడైనా పాపములో పడితే, పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధికి వెళ్లినప్పుడు మనకు క్రీస్తు ముద్రలు ఉన్నాయని తెలుసుకోగలము. 51వ కీర్తనలో దావీదు పశ్చాత్తాప హృదయము తెలుసుకోగలము. అందుకే ఆయన దేవుని హృదయానుసారుడైనాడు. ‘‘నేను దప్పిగొనుచున్నాను’’ అనే మాటలో తండ్రిలో తండ్రితో తిరిగి ఏకము కావాలనే తృష్ణ, ఆత్మల భారము యేసయ్య కనపరుస్తున్నాడు. మనము కూడా అలాంటి కోరికలు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు ముద్రలు మనలో కనబడుతాయి. ‘‘సమాప్తమైనది’’ - తండ్రి తనకప్పగించిన పని పూర్తి చేశానని చెప్తున్నాడు. 2 తిమోతి 4:7లో ‘‘మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని’’ అని పౌలు చెప్పినట్లు మనము కూడా చెప్పగలిగితే క్రీస్తు ముద్రలు మనలో ఉన్నట్లే. ‘‘తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను’’ అను మాటలో యేసు ప్రభువు తిరిగి తండ్రితో ఏకమగుట చూస్తున్నాము. మనలను సృష్టించిన దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు. దానిని జాగ్రత్తగా ఆయనకు తిరిగి అప్పగించగలగాలి. రోమా 12:1లో సజీవ యాగముగా మనలను మనము దేవునికి అప్పగించుకోవాలని పౌలు అంటున్నాడు. పైన చెప్పబడిన విషయాలన్నీ జాగ్రత్తగా ధ్యానించి, మనము కూడా పౌలు లాగా క్రీస్తు ముద్రలు ధరించి యున్నామని చెప్పినపుడు దేవుడిని సంతోషపెట్టినవారమవుతాము. ఆ విధంగా ఉండుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక. ఆమెన్! ‘‘తండ్రీ వీరేమి చేయున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము’’ (మత్తయి 5:44)లో శత్రువులను ప్రేమించమని తాను చెప్పిన మాటలు చేసి చూపిస్తున్నారు. యేసయ్య ముద్ర మనలో ఉన్నట్లు ఇతరులకు కనపడాలంటే శత్రువులను ప్రేమించుట, క్షమించుట, వారి కొరకు ప్రార్థించుట మనలో కనపడాలి. బి. విమలా రెడ్డి -
దేవుని నిస్వార్థ ప్రేమకు సంకేతం
సిలువ మరణం మార్చి 25 గుడ్ ఫ్రైడే సందర్భంగా... ప్రతి సంవత్సరం ప్రపంచ క్రైస్తవులందరు, క్రీస్తు సిలువలో తన ప్రాణమర్పించిన దినాన్ని ‘గుడ్‌ఫ్రైడే’ (శుభ శుక్రవారం)గా అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్నారు. ఈ సదాచారం మానవాళి పాప శాప పరిహారం నిమిత్తం ఆ దైవం జరిగించిన సంపూర్ణ రక్షణ కార్యంగా పరిగణించడానికే. ఈ ప్రపంచ చరిత్రలో ఎందరో మహనీయులు ఎన్నో ఉత్తమ కారణాల నిమిత్తం తమ ప్రాణాలర్పిం చారు. వారు కొంత కాలానికి, ఒక ప్రాంతానికి, జాతికి, మతానికి మాత్రమే పరిమితమయ్యారు. క్రీస్తు సిలువ మరణం రెండువేల సంవత్సరాలకు పూర్వం జరిగినప్పటికీ నేటికీ విశ్వవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యాన్ని కలిగివుంది. చరిత్రలో ఒక వ్యక్తి మరణం ఈ ప్రపం చాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రభావవంతం చేయగలగటం అనేది క్రీస్తు విషయంలోనే జరిగిందేమో. సిలువ మరణం అత్యంత అవమానకరమైన క్రూరమైన అమానవీయ మైన, కఠినమైన హింసాయుత శిక్ష. అయితే పరిశుద్ధుడు, దైవసుతుడైన యేసుక్రీస్తు ఆనాడు ఇంత క్రూర శిక్షను ఎందుకు భరించాల్సి వచ్చింది? క్రీస్తు సిలువ మరణం మానవ సమాజానికి సాధించిన పరిహారం ప్రాయశ్చిత్తం ఎలాంటివి? క్రీస్తు సిలువ మరణం ఈ ప్రపంచానికి వెల్లడి చేసిన సందేశం ఏమిటి? మానవాళికి చూపిన మార్గం ఏమిటి? సిలువ దేనికి సంకేతంగా, స్ఫూర్తిగా నిలిచింది? అన్న విషయాలు మనం అవగతం చేసుకోవాలి. సిలువలో క్రీస్తు మరణం మనకు ప్రత్యక్షపరచే ఆధ్యాత్మిక, సాంఘిక సత్యాలు, అంశాలు ఏమిటి అని చూస్తే... ప్రేమ, న్యాయం మూర్తీభవించిన ఘట్టం మానవాళి పట్ల దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడిపరిచారు? దేవుడు తన న్యాయాన్ని ఎలా అమలుపరచారు? అనే విషయాలపై పౌలు అను భక్తుడు ఏం అన్నాడంటే... ‘‘మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మన కొరకు చనిపో యెను’’ (రోమా 5:8). ‘‘మనము దేవుని ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చి త్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ యున్నది’’ (1యోహా 4:10). క్రీస్తు సిలువ మరణం గొఱ్ఱెలవలె దారి తప్పిన మానవాళి యెడల దేవునికున్న ప్రేమ వెల్లడి చేస్తుంది. అదే సమయంలో సిలువ దైవ న్యాయమును సూచిస్తుంది. మరణ శాసన మెక్కడ ఉంటుందో అక్కడ మరణ శాసనం రాసినవాని మరణం అవశ్యం. ఆలాగే క్రీస్తు కూడా అనేకుల పాపాన్ని భరించడానికి తనను తాను అర్పించు కున్నాడు. మన పాపాలకు శిక్షగా మనకు బదులుగా ఆయన సిలువలో శిక్ష అనుభ వించాడు. క్రీస్తు సిలువ మరణం పాపం యొక్క భయంకరత్వాన్ని సూచిస్తుంది. సిలువ అంటే శ్రమకు సూచన. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని ప్రభువు చెప్పారు. సద్భక్తితో బ్రతకనుద్దేశించే ప్రతి ఒక్కరూ శ్రమను ఎదుర్కొనక తప్పదు. క్రైస్తవ విశ్వాస దృక్పథంలో శ్రమ ఒక భవిష్య మహిమను కలిగినది. శ్రమలకు సహనం ఓ ఆయుధం. కీడు చేసి శ్రమపడటం కంటే మేలు చేసి శ్రమ పడటమే మంచిది. క్రైస్తవ విశ్వాస సమాజం సిలువ శ్రమల్లో నుండి అంకురించింది. శ్రమల యందే క్రైస్తవ సంఘం వర్ధిల్లింది, విస్తరించింది. జీవితంలో సిలువను మోస్తే కిరీటం ధరిస్తాం. శ్రమలు మనల్ని అంతమొం దించటానికి కాదు. అవి నిత్య మహిమకు సోపానాలు. సిలువ మరణం క్రీస్తు అంతం కాదు. అక్కడనుండే ఆయన మహిమ ఈ లోకానికి ప్రత్యక్షమైనది. క్రీస్తు సిలువలో కార్చిన ప్రతి రక్తపు బొట్టూ ఈ లోకంలో ప్రతి పాపినీ కడిగి శుద్ధి చేసింది. సిలువ మానవ సంబంధాల సంధి పాపం మానవుణ్ని దేవునికి దూరం చేసింది. అలాగే తోటి మానవుల మధ్య సంబంధాల విఘాతాన్ని, అగాథాన్ని సృష్టించింది. అలా విచ్ఛిన్నమైన దైవ మానవ సంబంధాలు క్రీస్తు సిలువ మరణం ద్వారా బలపడ్డాయి. మనం దేవుణ్ని తండ్రి అని పిలువగలుగు తున్నాం. ధైర్యంగా ఆయన కృపాసనం దగ్గరికి చేరగలుగుతున్నాం. ఇక ఏ మధ్య వర్తిత్వం అవసరం లేదు. ఏ సిఫారసూ అక్కర్లేదు. సిలువ దేవునికి మానవునికి అడ్డుగా ఉన్న పాపమనే శాపాన్ని తొలగించి, దేవునితో మానవునికి సత్సంబంధాన్ని ఏర్పరచింది. మనుషుల్లో అనేక వ్యత్యాసాలు, అసమానతలు వివక్షతలు, అంతరాలు, అసూయ ద్వేషాలూ ఉన్నాయి. సిలువ మానవుల మధ్య ఉన్న అడ్డు గోడల్ని పడగొట్టి ఏకం చేసిన శక్తి. సిలువ సృష్టించిన సమాజమే సమ సమాజం. ప్రపంచ చరిత్రలో ఏ సంస్కరణలూ తేలేని సమాజాన్ని సిలువ తీసుకువచ్చింది. అంతరాలు లేని అసమానతలు లేని అస్పష్టత లేని సమాజం... క్రీస్తు సిలువ సమాజం. నిస్వార్థ సేవకు స్ఫూర్తి ప్రతి సేవ ప్రతిఫలాన్నీ పారితోషికాన్నీ అపేక్షించి చేసేదే. కాని క్రీస్తు తన జీవిత సూత్రాన్ని ఆరంభంలోనే స్పష్టపరిచారు. ‘‘మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెననెను’’ (మార్కు 10:45). సిలువ ఒక ఉగ్ర సమాజానికి స్ఫూర్తి కాదు. సిలువ ఎప్పటికీ ఓ నిస్వార్థ, ప్రేమపూరిత, కరుణాసహిత, త్యాగ పూరిత సేవకు బలమైన స్ఫూర్తిగా నిలిచింది. మదర్ థెరిస్సా వంటి సమాజ సేవకులకు స్ఫూర్తిగా నిలిచింది. స్వార్థం ద్వేషం దోపిడీ గల ప్రపంచంలో సిలువ మనిషికి శాంతిని కలిగించింది. అన్ని కాలాల్లోనూ మనుషులకు ఓ బాటను చూపించింది. క్రీస్తు సిలువ భావం, ప్రభావం మన జీవిత ఆచరణలో భాగమై సాగాలి. ఆయన త్యాగంలో వివాదం లేదు. మానవాళి రక్షణయే ఆయన ధ్యేయం. ఎందరు నిందలు మోపినా, ఎన్ని అవమానాలు పెట్టినా, కొరడాలతో కొట్టినా, సిలువకు మేకులతో కొట్టి ఆయన దేహాన్ని వేలాడదీసి అతి కిరాతకంగా చంపినా ఆయన స్వరం ఒక్కటే. ‘‘తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము’’. అంటే ఆయన సందేశం ఒక్కటే... క్షమాపణ. ఇది ఎక్కడా కనిపించని వినిపించని దైవ త్యాగం, స్వరం, సందేశం. అందుకే సిలువ మరణం క్రీస్తు పరాజయం కాదు, మానవ పాప పరిహారార్థమై ప్రభువు సాధించిన ఘన విజయం. మనుషుల్లో అనేక వ్యత్యాసాలు, అసమానతలు వివక్షతలు, అంతరాలు, అసూయ ద్వేషాలూ ఉన్నాయి. సిలువ మానవుల మధ్య ఉన్న అడ్డు గోడల్ని పడగొట్టి అందరినీ ఏకం చేసిన శక్తి. సిలువ సృష్టించిన సమాజమే సమ సమాజం. ప్రపంచ చరిత్రలో ఏ సంస్కరణలూ తేలేని సమాజాన్ని సిలువ తీసుకువచ్చింది. - రెవ॥పెయ్యాల ఐజక్ వరప్రసాద్ -
గుడ్ ఫ్రైడేకి... బాహుబలి-2
‘ఇంతకూ అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ ‘బాహుబలి’ చూసిన ప్రతి ఒక్కరికీ ఈ మిస్టరీ తెలుసుకోవాలని ఉంటుంది. కట్టప్ప లాంటి నమ్మిన బంటు తన నాయకుణ్ణి చంపాడంటే దానికి బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏమిటో తెలుసుకోవాలంటే ‘బాహుబలి-2’ చూడాల్సిందేనని చిత్ర బృందం పలు సందర్భాల్లో పేర్కొంది. తొలి భాగం కన్నా మరింత భారీ ఎత్తున రూపొందుతున్న మలి భాగంపై మరిన్ని అంచనాలు నెల కొన్నాయి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్... ఇలా భారీ తారాగణంతో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ రెండో భాగం షూటింగ్ కొన్ని రోజులుగా జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలవుతుందని ముందు వార్త వచ్చిన విషయం తెలిసిందే. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న మలి భాగాన్ని విడుదల చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఆ రోజు గుడ్ ఫ్రైడే. తమిళ సంవత్సరాది కూడా! -
క్రీస్తు విశేషాలతో...
ఏసుక్రీస్తు జీవిత విశేషాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘తొలి కి రణం’. పీడీ రాజు ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి కె.జాన్‌బాబు దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. దర్శకుడు మట్లాడుతూ -‘‘గోవా, ఈజిప్ట్, పాలస్తీనా, ఇజ్రాయిల్‌లో జరిపే చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. మార్చి 25న గుడ్‌ఫ్రైడే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కథ-మాటలు: టి.ప్రభుకిరణ్, కథా సహకారం: వి.ఎమ్.ఎమ్.ప్రవీణ్, ఛాయాగ్రహణం: మురళీకృష్ణ. -
మా పల్లెలో క్రిస్మస్
‘చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున చెంత చేరగ రండి వేగమె దీనులై, సర్వమాన్యులై...’ పాదిరిగారితో భక్తజనులు ఈ పాటనీ, ఇటువంటి పాటల్నీ పాడుతూ చలిలో తెల్లవారుజామున పల్లెంతా తిరుగుతుంటే ఇళ్లన్నీ మేల్కొనేవి. ఆరోజు క్రిస్మస్ పండగ. క్రైస్తవులకు పర్వదినం. క్రీస్తు జన్మించిన రోజు. క్రీస్తు పుట్టుకే నూతన ప్రేమ యుగోదయం అంటారు భక్తులు. గుడ్ ఫ్రైడే అంటే క్రీస్తును సిలువ వేసిన రోజు. ఆ శుక్రవారం మంచి శుక్రవారం ఎందుకయిందంటే జనం కోసం దేవుడి పుత్రుడు సిలువ మరణం పొందటం వల్ల. ఇంకా కొన్ని పండగలున్నాయంటారు. ఉన్నవాళ్లకు అన్ని రోజులూ పండగ రోజులే! పేద పల్లెవాసులకు కాదు! క్రిస్మస్ ఉదయం నిద్రలేచిన తల్లిదండ్రులు పిల్లల ముఖం కడిగి, తుడిచి, గవదకట్టు కట్టి గుడికి పంపేవాళ్లు. గవదల దాకా దుప్పటి లాగి కట్టి వదిలితే అది పాదాల దాకా జీరాడుతుంది. పిల్లలు చిన్న పాదిరిల్లాగా ఉండేవాళ్లు. నడుస్తున్న పెంగ్విన్ పక్షుల్లాగా ఉండేవాళ్లు. గుడిలో తెల్లవారిందాకా పాటల పుస్తకంలోని భక్తి గీతాలు పాడుతూ దశమ భాగములెల్ల దేవునివీ అనీ, ప్రథమ ఫలములెల్ల దేవునివీ అని పాడుతూ ఉండేవాళ్లు. నూత్న దంపతుల తమ ప్రథమ ఫలాన్ని గుడికి సమర్పించి, మళ్లీ ఖరీదు కట్టి కొని తెచ్చుకొనేవాళ్లు. అది ఆరు రోజుల బడి. ఆదివారాలు, క్రిస్మస్, ఈస్టర్రోజుల్లో గుడి. ఆరు రోజులు బడిలో పిల్లలకు పాఠాలు చెప్పిన మాస్టరుగారే ఆదివారం పాదిరి. అది అప్పుడు లేకపోతే చాలామంది పల్లెల పిల్లలు, ఊళ్లో పిల్లల్లాగా చదువుకో గలిగేవాళ్లు కారు. ఊరి బడిలోకి పల్లె పిల్లల్ని రానిచ్చేవాళ్లు కారు గదా! క్రిస్మస్ ముందు రోజు మాస్టరుగారు రంగు రంగుల కాగితాలు దస్తాలు దస్తాలు తెచ్చి అందమైన ఆకారాలుగా కత్తిరించి నిట్రాళ్లకు, బొంగులకు, కిటికీలకు, పంచలకు, వాకిళ్లకు అంటింపజేసేవాడు. ఎన్ని రంగులో! ఎన్ని బొమ్మలో! ఎంత అందమో! పరమానందంగా ఉండేది. క్రిస్మస్ తెల్లవారుజామున కిరసనాయిలు లాంతర్ల వెలుగులో కనిపించీ, కనిపించని రంగులు చూస్తుంటే ఎంత బాగుండేదో! సూర్యుడి రాక కోసం రాత్రంతా నిరీక్షించిన లాంతర్లు సూర్యోదయంతో వెలవెలపోయేవి. వొత్తి తగ్గిస్తే వెలుతురంతా కొండెక్కేది. సూర్యుడికి ఆహ్వానం పలకటానికి చేతులెత్తేది... యేసుక్రీస్తు జననం కోసం నలభై మంది ప్రవక్తలు నిరీక్షించి, ఆహ్వానించినట్లు. చిత్రమేమిటంటే గుడికి వచ్చిన పిల్లలు తెల్లవారుజామున నిద్రపోయేవాళ్లు కారు. అల్లరి చేసేవాళ్లు కారు. శ్రద్ధగా పాటలు పాడేవాళ్లు. పాదిరిగారి ప్రసంగం వినేవాళ్లు. క్రీస్తు పుట్టినప్పుడు గొర్రెల కాపరులు, జ్ఞానులతో పాటు దేవదూతలు కూడా వచ్చారని, నక్షత్ర కాంతి ప్రకాశించిందని చెప్పి, చిన్న పిల్లల చిట్టి చిట్టి చేతులతో బుల్లి బుల్లి కొవ్వొత్తులు వెలిగింపజేసేవాడు పాదిరిగారు. వేపకొమ్మను తెచ్చి పాతి క్రిస్మస్ ట్రీ అన్నారు. దాని కింద వెలిగించిన కొవ్వొత్తులు పెట్టారు. సూర్యకాంతితో పైన, కొవ్వొత్తుల కాంతితో కింద వెలుతురు. ఏ చెట్టుకైనా నీడ ఉంటుంది, క్రిస్మస్ ట్రీకి లేదు. వేజండ్ల పల్లె ఇళ్లన్నీ పూరిళ్లే! కొందరు ఇళ్లు కప్పించారు. గోడలు అలికించారు. సున్నం కొట్టించారు. ఇళ్లముందు కల్లాపి జల్లి ముగ్గులు వేశారు. ముగ్గులేని, అలికించని ఇల్లు లేదు. ముసలోళ్లు చలికాగుతుంటే పిల్లోళ్లు వాళ్ల వొళ్లల్లో చేరి చలి కాగేవారు. ఈ రోజుల్లో అంత చలీ లేదు. చలి మంటలూ లేవు. తాతల దగ్గర చేరే మనవళ్లూ లేరు. తాతలకు దగ్గులు నేర్పేవాళ్లూ లేరు. ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో జనాభా నియంత్రణ లేదు. అప్పుడు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఈ పిల్లవాడు బంతినారు తెచ్చి, నాటి, నీరు పోసి, పెంచి, పూలు పూయించాడు. అవి పసుపు కుంకాల రంగుల్లో ఉన్నాయి. అంతదాకా ఒక్కటీ ఎవరినీ కోయనివ్వనివాడు అన్నీ కోసి, పదింట ఒక్కటి తీసి, మాల కట్టి తీసుకుపోయి గుడికి కట్టి, తిరిగి వచ్చి, పూలన్నీ అమ్మకు, అక్కకు, అమ్మలక్కలకు పంచిపెట్టి ముద్దులు పెట్టించుకొన్నాడు. పల్లె అమ్మలక్కల తలలో తన పూలుంటే చూచి పొంగిపోయాడు. పరిమళ ప్రవాహంలో పల్లెంతా పడవై తేలిపోతుంటే ఊగిపోయాడు. పంట చేతికి రాగానే పదోవంతు తీసి పక్కన పెట్టిన రైతుకూలీలు క్రిస్మస్ నాడు గుడికి సమర్పించేవారు. వడ్లు, బుడమొడ్లు, కందులు, మినుములు, పెసలు, వేరుశనగకాయలు ఎన్నో! కూరగాయలు ఆక్కూరలు - చాలా. కొత్త బియ్యం, కొత్త కందిపప్పు, కొత్త నేయి - క్రిస్మస్ రోజు ఎంత రుచో! అందరి ఇళ్లలో అరిసెలు వండుతున్న వాసన పల్లెంతా ప్రయాణం చేసేది. ఏడాది పొడుగునా ఆకలికి అల్లాడిన పొట్టలు క్రిస్మస్ రోజున పిక్కటి బీర్లుగా నిండిపోయేవి. నీళ్లు పోసుకొని, బువ్వదిని పది గంటలకు గుడికి పోతే ఎంత ఆనందం! ఎంత లేనివాళ్లయినా కొత్త బట్టలు కట్టుకొని వచ్చేవాళ్లు. కొత్త బట్టలతో, కొత్త రంగులతో పల్లెంతా తళతళలాడుతూ సూర్యుడికి మెరవటం ఎట్లాగో నేర్పేది! రోజంతా ప్రసంగాలు, పాటలు, బైబిలు చదవటాలు, వివరించటాలు విసుగు విరామం లేకుండా ఉండేది. డబ్బు రూపంలో వచ్చిన కానుకలు కాక వస్తు రూపంలో తెచ్చిన కానుకలు చూస్తే సంబరంగా ఉండేది. కోడిపుంజుల్ని, మేక పిల్లల్ని గుడికి సమర్పించినవారే తిరిగి వేలంపాటలో కొనుక్కొనేవాళ్లు. అరటి పళ్లు, నారింజకాయలు, జామకాయలు, కొబ్బరి ముక్కలు, మరమరాలు పిల్లలందరికీ పంచిపెట్టేవాళ్లు. అప్పుడు 77 ఏళ్ల పూర్వం వేజండ్ల పల్లెలో 300 గడప ఉండేది. ఇప్పుడు 1200 గడప ఉంది. అప్పుడన్నీ పూరిళ్లు. ఇప్పుడు ముప్పాతిక స్లాబు ఇళ్లు. అప్పుడు సైకిళ్లు ఒకటో రెండో. ఇప్పుడు మోటారు సైకిళ్లు, ఆటో రిక్షాలు, వేన్లు చాలా ఇళ్లముందున్నాయి. అప్పుడందరూ రైతు కూలీలు. ఇప్పుడు చాలామంది సొంత వృత్తులవాళ్లు. చేలుదార్లు ఎక్కువ. పొగాకు కంపెనీ పనులు, చాలా పనులకు గుంటూరు ఆధారం. వీళ్లిప్పుడు చాలా పెద్ద చదువులు చదివారు. చదు వులకు తగ్గ ఉద్యోగాలు వెదుకుతూ ఉన్నారు. అప్పుడు క్రిస్మస్ రాత్రి క్రీస్తు పుట్టుక నాటకం వేసేవాళ్లు. బల్లలు పరిచి స్టేజీ అనేవాళ్లు. పెట్రోమాక్సు లైటు అమర్చే వాళ్లు. అప్పుడు కరెంటు లేదు. ఇప్పు డుంది. అప్పుడు మైకులు లేవు. ఇప్పు డున్నాయి. అప్పుడు నక్షత్రాలు లేవు. ఇప్పుడున్నాయి. ఎంత పెద్ద నక్షత్రం. ఎంత పెద్ద ఎత్తు! ఎంత వెలుతురు! పల్లె రాత్రంతా వెలుతురులో స్నానం చేస్తూ ఉంటుంది. క్రీస్తు పుట్టినప్పుడు పుట్టిన నక్షత్రం ఒకటి ఆకాశంలో పుడితే ఇప్పుడు భూమిమీద ప్రతి పల్లెలో నక్షత్రాలు ప్రభవిస్తున్నాయి. రాత్రంతా పల్లె నిండా వెలుతురు. చర్చీల నిండా మందిరాల నిండా మైకులు, పాటలు. సంగీతంలో, కాంతితో వేజండ్ల పల్లె నిర్విరామ భక్తిగా పరిఢవిల్లుతూ ఉంటుంది. అప్పటి క్రిస్మస్కి ఇప్పటి క్రిస్మస్కి ఎంత తేడా! అది అణగారిన పేదల క్రిస్మస్. ఇది వికాస మానవ క్రిస్మస్. ఈ డెబ్భై ఏడేళ్లలో - ఒక జీవిత కాలంలో - వేజండ్ల పల్లెలో క్రిస్మస్ తెచ్చిన మార్పు చూస్తుంటే ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంటుంది. ‘చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున చెంత చేరగ రండి వేగమె దీనులై, సర్వమాన్యులై...’ ఎంత సంతోషం! ఎంత సంబరం! - ఆచార్య కొలకలూరి ఇనాక్ -
ఏ విచారణ అయినా ఐదేళ్లు దాటకూడదు
సీజేఐ జస్టిస్ హెచ్ఎల్ దత్తు వ్యాఖ్య న్యూఢిల్లీ: ఏ కేసు విచారణ అయినా ఐదేళ్ల సమయం మించరాదని గడువును నిర్దేశించినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ హెచ్ఎల్ దత్తు తెలిపారు. కేసుల పెండింగ్‌కు సంబంధించి న్యాయవ్యవస్థలో ఖాళీలు పెద్ద అవరోధంగా మారాయని హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లు, సీఎంల సదస్సులో అన్నారు. ప్రజాస్వామ్యం అనే తల్లికి న్యాయ, శాసన వ్యవ స్థలు తోబుట్టువులాంటివారని ఈ రెండు కీలక వ్యవస్థలు రాజ్యాంగం ఏర్పరిచిన బాటలో సమన్వయంతో ముందుకు సాగాలని అభిలషించారు. కేటాయించిన నిధుల వినియోగంలో న్యాయవ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, ప్రతిభ గల న్యాయ నిపుణులను మంచి ప్యాకేజీలతో ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు. అది మా కుటుంబ వ్యవహారం.. సీజేఐ: గుడ్‌ఫ్రైడే రోజున జడ్జిల సదస్సు నిర్వహణపై వివాదం దురదృష్టకరమని సీజేఐ దత్తు అన్నారు. ఇది తమ కుటుంబ వ్యవహారమని, కుటుంబ పెద్దగా ఈ అంశాన్ని పరిష్కరిస్తానని చెప్పారు. ‘ఆ సదస్సు న్యాయవ్యవస్థ సమస్యలపై చర్చించేందుకు జడ్జీల మధ్య ఏర్పాటు చేసిన ఓ మీటింగ్ మాత్రమే. మాది ఒక కుటుంబం. మాలో నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే.. అది మేం మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం’ అని విలేకరులతో అన్నారు. గుడ్‌ఫ్రైడే రోజున జడ్జిల సదస్సు నిర్వహించడంపై సుప్రీం న్యాయమూర్తి కురియన్ జోసెఫ్.. సీజేఐకి అసంతృప్తి తెలియజేసిన విషయం తెలిసిందే. -
భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే వేడుకలు
విజయనగరం : విజయనగరం జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ లో ఉన్న పలు చర్చిల ఆధ్వర్యంలో ప్రజలు గుడ్‌ఫ్రైడే కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రీస్తు ఆరాధకులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పురవీధుల్లో క్రీస్తు సందేశాన్ని వినిపిస్తూ గీతాలాపన చేశారు. ఆర్సీఎం చర్చి పాస్టర్ మాట్లాడుతూ..క్రీస్తు ఈ లోకాన్ని రక్షించేందుకు భూమిపై అవతరించాడని తెలిపారు. దాంతో పాటు గుడ్‌ఫ్రైడే విశేషాలను వివరించారు. -
అబిడ్స్ పెయి౦టాన్స్గ్రౌ౦డ్లోగుడ్ఫ్రైడే కార్యక్రమ౦
-
నేడు గుడ్ ఫ్రైడే!
-
గుడ్‌ఫ్రైడేకి చర్చిల వద్ద భద్రత పెంపు
సాక్షి, న్యూఢిల్లీ : కొంత కాలంగా నగరంలోని చర్చిలపై జరుగుతోన్న దాడులను దృష్టిలో ఉంచుకుని గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వేడుకలకు చర్చిల వద్ద ఢిల్లీ పోలీసులు విస్త్రతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం రోజున చర్చిల వద్ద 10 వేల మందికి పైగా సిబ్బందితో నిరంతర గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి చర్చి బయట సాయుధ గార్డులను మొహరించనున్నట్లు చెప్పారు. సవివరంగా మ్యాపింగ్ జరిపి సిబ్బందిని కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా తమ పరిధిలో ఉన్న చర్చిల జాబితాతో పాటు వాటికి సంబంధించిన వివరాలను అందించాలని స్టేషన్ హౌజ్ ఆఫీసర్స్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. చర్చిల బయట మొహరించిన సిబ్బందిని జాగ్రత్తగా బాధ్యతలు నిర్వహించవలసిందిగా అధికారులు ఆదేశించారు. ఆకతాయిచేష్టలకు పాల్పడే వారిని వెంటనే అదుపులోకి తీసుకోవలని చెప్పారు. గుడ్‌ఫ్రైడే రోజున పెట్రోలింగ్ వీలైనంత ఎక్కువగా నిర్వహించాలని ఎస్హెచ్ఓలను ఆదేశించారు. గుడ్‌ఫ్రైడే రోజున ట్రాఫిక్ సజావుగా సాగడం కోసం అన్ని ముఖ్యమైన కూడళ్ల వద్ద తగాన ఏర్పాట్లు చేయవలసిందిగా ట్రాఫిక్ పోలీసులను కోరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సీసీటీవీలు లేని చర్చిలకు అదనపు భద్రత కల్పిస్తారు. అన్ని చర్చిలకు ఒక కి.మీ దూరంలో చుట్టూరా బారికేడ్లను అమరుస్తారు. వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేయడం కోసం ఈ బారికేడ్ల వద్ద ఇద్దరు సబ్ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుల్స్‌ని మొహరిస్తారు. -
సౌధ కిటకిట
ముగిసిన ఎన్నికల ప్రక్రియ కార్యాలయాలకు హాజరైన మంత్రులు సాక్షి, బెంగళూరు : రాష్ట్ర పరిపాలన కేంద్ర బిందువైన విధానసౌధ తిరిగి పూర్వ రూపును సంతరించుకుంటోంది. మంత్రులు, అధికారులు ఒక్కొక్కరుగా సౌధకు వస్తున్నారు. దీంతో వారితో కలిసి తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చే ప్రజలతో విధానసౌధ సోమవారం కిటకిటలాడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దాదాపు ఒకటిన్నర నెలలుగా విధానసౌధలోని తమ కార్యాలయాల వైపు ఒక్క మంత్రి కూడా కన్నెత్తి చూడలేదు. అదేవిధంగా విధానసౌధలోని కార్యాలయాల్లో ఉన్న ఉన్నత ప్రభుత్వ అధికారుల్లో అధిక శాతం మంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. దీంతో విధానసౌధలోని మంత్రులను, ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలను చెప్పుకోవ డానికి వచ్చే ప్రజల సంఖ్య కూడా తక్కువగా ఉండేది. దీంతో విధానసౌధ నెలన్నర రోజులుగా బోసిపోయి కనిపించింది. అయితే ఈనెల 17న రాష్ట్రంలో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అటుపై గుడ్‌ఫ్రైడే, శని, ఆది వారాలు వరుస సెలవులు రావడంతో వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు ఎవరూ విధానసౌధ వైపు కన్నెత్తి చూడలేదు. అయితే ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండేతో పాటు మరో ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా విధానసౌధలోని తమ కార్యాలయాలకు సోమవారం విచ్చేశారు. తమ శాఖల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులు తదితర విషయాల అధికారులతో సమాలోచనలు జరిపారు. చాలా రోజుల తర్వాత మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో తమ సమస్యలను చెప్పుకోవడానికి విధానసౌధకు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. దీంతో సౌధ చాలా రోజుల తర్వాత మొదటిసారిగా సోమవారం కిటకిటలాడింది. -
కరుణామయ
-
గుడ్‌ఫ్రైడే సందర్భంగా ప్రార్థనలు
న్యూఢిల్లీ: గుడ్‌ఫ్రైడేను పురస్కరించుకొని నగరంలోని అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలువురు క్రైస్తవులు ఉపవాసాలు ఆచరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. మరికొం దరు గత 40 రోజులుగా ఉపవాసాలు పాటిం చారు. ‘మానవజాతి విముక్తి కోసం క్రీస్తు నేడు శిలువ వేయించుకున్నాడు. దేవుడే అయినా, మానవత్వానికి ఆయన మచ్చుతునక’ అని ఢిల్లీ క్యాథలిక్ చర్చ్ అధికార ప్రతినిధి ఫాదర్ డోమినక్ ఎమ్మాన్యుయేల్ అన్నారు. చర్చిలకు హాజరైన వాళ్లంతా సాయంత్రం ప్రార్థనలు ముగిసిన తరువాతే భోజనాలు చేశారని మార్కెటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేసే వెండీ రొజారియో అన్నారు. క్రీస్తు పునరుత్థానాన్ని సూచించే ఈస్టర్ పర్వదినాన్ని ఆదివారం జరుపుకుంటారు. -
తొలిఘట్టానికి రేపటితో తెర
సాక్షి, కాకినాడ :గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం సెలవు కావడంతో.. ఇక సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు శనివారం ఒక్కరోజే మిగిలింది. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు జాతర్లను తలపించే రీతిలో నామినేషన్లు దాఖలు చేస్తుంటే.. టికెట్లు ఖరారవుతాయో లేదో తెలియక తెలుగుదేశం పార్టీ ఆశావహులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు పొత్తుల తలనొప్పులు, మరోవైపు టిక్కెట్ల ఖరారులో అధినేత చంద్రబాబు విపరీత వైఖరి వారిని నిస్పృహలో ముంచెత్తుతున్నాయి. ఎవరికి టికెట్ దక్కుతుందో తెలియక తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు. వైఎస్సార్ సీపీ దాదాపు అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్, లోక్‌సత్తాలతో పాటు కొత్తగా పుట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ కూడా తమకు బలమున్న చోట్ల అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తున్నాయి. కాగా పొత్తులో భాగంగా తొలుత రాజమండ్రి సిటీ, రాజోలు నియోజకవర్గాలను బీజేపీకి కేటాయిస్తున్నట్టు ప్రకటించిన తెలుగుదేశం ఆ తర్వాత రాజమండ్రి సిటీతో సరిపెట్టింది. తొలుత అమలాపురం ఎంపీ టికెట్ ఖరారు చేసిన గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు స్థానాన్ని కేటాయించగా, పిఠాపురం, పెద్దాపురం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల విషయంలో ఇంకా అభ్యర్థిత్వాలను ఖరారు చేయలేదు. దీంతో ఆయా నియోజకవర్గాల ఆశావహుల్లో ఉత్కంఠ క్షణక్షణానికీ రెట్టింపవుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేయడమే కాక ప్రచారంలో కూడా ముందున్నారు. ప్రత్తిపాడులో వరుపుల నామినేషన్ ప్రత్తిపాడు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు నామినేషన్ వేశారు. స్వగ్రామం లింగంపర్తి నుంచి పార్టీ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఏలేశ్వరం, ఎర్రవరం మీదుగా ప్రత్తిపాడు చేరుకున్న వరుపుల నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు. అక్కడ నుంచి శంఖవరం మీదుగా రౌతులపూడి వరకు మళ్లీ ర్యాలీగా వెళ్లారు. ఆయన వెంట కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎండీ అధికారితో పాటు ఓ డమ్మీ అభ్యర్థి, మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు వేశారు. జనసంద్రమైన మండపేట మండపేట చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు గురువారం నామినేషన్ వేశారు. మాజీ ఎమ్మెల్యే వీవీఎస్ఎస్ చౌదరి కార్యాలయం నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి ఊరేగింపుగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేశారు. గిరజాల వెంట వీవీఎస్ఎస్ చౌదరి, బిక్కిన కృష్ణార్జున చౌదరి, సీఈసీ సభ్యుడు రెడ్డిప్రసాద్, అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్లు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ఊరేగింపులో పాల్గొనగా, నామినేషన్ కార్యక్రమంలో సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు చిట్టబ్బాయి, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పాల్గొన్నారు. నామినేషన్ వేసిన పళ్లంరాజు కాకినాడ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు నామినేషన్ వేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి, కాకినాడ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ తదితరులతో ర్యాలీగా వచ్చి జిల్లా ఆర్వో, కలెక్టర్ నీతూ ప్రసాద్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ నియోజకవర్గం నుం చి ఆమ్ఆద్మీ అభ్యర్థిగా దంగేటి శ్రీనివాస్, మరో ఇద్దరు నామినేషన్లు వేశారు. రాజమండ్రి ఎంపీ స్థానానికి రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ అభ్యర్థిగా బర్రే కొండబాబు, మరో ఇండిపెండెంట్ నామినేషన్లు వేశారు. అమలాపురం ఎంపీ స్థానానికి ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ నుంచి వడ్డి విల్సన్ సర్టిల్, మరో ముగ్గురు స్వతంత్రులు నామినేషన్లు వేశారు. జోరుగా నామినేషన్లుతెలుగుదేశం అభ్యర్థులుగా అమలాపురం నుంచి అయితాబత్తుల ఆనందరావు, జగ్గంపేట నుంచి జ్యోతుల చంటిబాబు, రంపచోడవరం నుంచి శీతంశెట్టి వెంకటేశ్వరరావులతో పాటు టికెట్ ఖరారు కానప్పటికీ గోరంట్ల బుచ్చయ్యచౌదరిలు రాజమండ్రిసిటీ, రూరల్ నియోజకవర్గాలకు నామినేషన్లు వేశారు. జై సమైక్యాంధ్ర పార్టీ తరపున అమలాపురం నుంచి నెల్లి కిరణ్‌కుమార్, పి.గన్నవరం నుంచి జీవీ శ్రీరాజ్, కాంగ్రెస్ తరఫున రాజమండ్రి సిటీకి వాసంశెట్టి గంగాధర్, కాకినాడ రూరల్‌కు వీవై దాసు, రాజమండ్రి రూరల్‌కు రాయుడు రాజవెల్లి, లోక్‌సత్తా తరఫున రాజమండ్రి రూరల్‌కు అత్తిలి రాజు, కాకినాడ సిటీకి సీపీఐ తరఫున తాటిపాక మధు నామినేషన్లు దాఖలు చేశారు. బీఎస్పీ తరపున పిఠాపురం నుంచి సన్నపు కిషోర్‌కుమార్, తుని నుంచి గొల్లపూడి బుచ్చిరాజు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అమలాపురం నుంచి మురిపిరి శ్రీనివాస్, తుని నుంచి ఏఎన్ఎస్ ప్రసాద్, కాకినాడ రూరల్ నుంచి గుత్తి రాధాకృష్ణ, రామచంద్రపురం నుంచి వానపల్లి వెంకటలక్ష్మి నామినేషన్లు వేశారు. రాజమండ్రి సిటీ నుంచి రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ తరపున బర్రే కొండబాబు, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మహ్మద్ నసీరుద్దీన్ నామినేషన్లు వేశారు. అనపర్తి నుంచి బీజేపీ తరఫున మేడపాటి హరినారాయణరెడ్డి, రాజ్యాధికార పార్టీ తరపున నామాల శ్రీవెంకటపద్మావతి నామినేషన్లు వేయగా, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తరఫున పిఠాపురం నుంచి పిల్లా చంద్రం, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తరఫున రాజానగరం నుంచి జనుపెల్ల సత్తిబాబు, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజమండ్రి రూరల్ నుంచి వడ్డి మల్లికార్జునప్రసాద్, కాకినాడ సిటీ నుంచి ఆర్జేడీ పార్టీ తరఫున కె.కళ్యాణచక్రవర్తిలతో పాటు వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా గురువారం జిల్లాలోని మూడు ఎంపీ స్థానాలకు 12, అసెంబ్లీ స్థానాలకు 45 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటితో కలిపి ఇంతవరకూ మొత్తం ఎంపీ సీట్లకు 26, ఎమ్మెల్యే సీట్లకు 123 నామినేషన్లు పడ్డాయి. అట్టహాసంగా సాయి నామినేషన్ ముమ్మిడివరం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గుత్తుల సాయి నామినేషన్ వేశారు. భట్నవిల్లి ఆలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం ఎంపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్లతో కలిపి పూజలు చేసిన అనంతరం ఓపెన్‌టాప్ జీపుపై ఊరేగింపుగా ముమ్మిడివరం తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొన్న సాయి ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. పార్టీ నాయకులు భూపతిరాజు సుదర్శనబాబు, యేడిద చక్రం, పెన్మత్స చిట్టిరాజు, పెయ్యిల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి జై సమైక్యాంధ్ర, లోక్‌సత్తా అభ్యర్థులుగా తిరుమాని స్వామినాయకర్, పెండ్యాల ప్రభాకర సుబ్రహ్మణ్యం, మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు వేశారు. -
సిలువే కొలమానం
- జస్టిన్ హాల్కాంబ్, ఆధ్యాత్మిక ప్రవచకులు నేడు గుడ్ ఫ్రైడే దేవుడు చనిపోయిన రోజు ‘మంచి రోజు’ ఎలా అవుతుంది? మనిషి చనిపోతేనే అది విషాదం కదా, అటువంటిది దేవుని కుమారుడు చనిపోతే ఇంకెంత విషాదం! అలా మనం విషాదంలో మునిగిపోయిన రోజును గుడ్‌ఫ్రైడే అంటారేం? పైగా అది ఎలాంటి మరణం! యేసుక్రీస్తు కాళ్లలో చేతుల్లో మేకులు దిగ్గొట్టి, గాలిలో సిలువపై నిలబెట్టి, డొక్కల్లో బరిసెతో పొడిచి... భగవంతుడా, ఇలాంటి మరణం ఏ నరకంలోనైనా ఉంటుందా? ఎంత రక్తం! ఎంత యాతన! మనసు విలవిలలాడిపోతుంది. క్రీస్తు మనకోసం మరణించాడని, మానవాళి దోషాలను, పాపాలను సిలువపై ఎగసి చిమ్మిన తన రక్తంతో ప్రక్షాళన చేశాడని, అందుకోసం ఆయన తన ప్రాణాలనే త్యాగం చేశాడని.. తెలిసి, హృదయం మరింత విలపిస్తుంది. ‘‘తిరిగి జీవించడానికే ఆయన మరణించాడు కాబట్టి మానవాళికది గుడ్‌ఫ్రైడే’’ అనే మాటతో మనసు ఊరట చెందదు. ఎందుకంటే - మూడవరోజు పునరుత్థానం పొందినంత తేలిగ్గా ఆయన మరణం సంభవించలేదు. మరణానికి ముందు సిలువపై క్రీస్తు పడిన ‘కారుణ్య యాతన’ను, ఆ త్యాగాన్ని ‘సిలువ’తో తప్ప దేనితోనూ కొలవలేము. క్రీస్తు మరణించి, తిరిగి లేచిన నాటి నుంచి క్రైైస్తవులు సిలువను ధరించడాన్ని తమ ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్య భాగంగా స్వీకరించారు. ఇక ఆయన పునరుత్థానం యావత్ సృష్టిలోనే ఒక నిర్ణయాత్మకమైన మలుపు. అందుకే గుడ్‌ఫ్రైడే, ఈస్టర్... రెండూ క్రైస్తవులకు వేడుకలయ్యాయి. మానవాళి పాపాలకు పరిహారంగా క్రీస్తు తన ప్రాణాలను త్యాగం చేయడాన్ని, వారికోసం స్వచ్ఛందంగా ఆయన సిలువనెక్కి మరణించడాన్ని గుడ్‌ఫ్రైడే మనకు గుర్తు చేస్తుంది. గుడ్ ఫ్రైడే తర్వాతి ఆదివారం... ‘ఈస్టర్’ మహోజ్వలమైన ఉత్సవం. ఆ రోజున క్రీస్తు మరణాన్ని జయించాడు. ఆయనలో విశ్వాసం ఉంచిన వారందరికీ పాపవిముక్తి, పునరుత్థానం ఉంటాయనేందుకు ఈస్టర్...ఒక సంకేతం. అయితే క్రీస్తు మరణించిన రోజును ‘బ్యాడ్ ఫ్రైడే’ అని కాకుండా ‘గుడ్ ఫ్రైడే’ అని ఎందుకు అనవలసి వచ్చింది? కొన్ని క్రిస్టియన్ సంప్రదాయాలలో అలా కూడా ఉంటుంది. ఉదాహరణకు జర్మనీలో గుడ్‌ఫ్రైడేని ‘కార్ఫైటాగ్’ (Karfreitag) అంటారు. దీనర్థం ‘బాధాకరమైన శుక్రవారం’ అని. మరి ఇంగ్లిష్‌లో ఇలా ఉంటుందేమిటి Good అని. దీనిపై భిన్నవాదన కూడా ఉంది. అది Good కాదనీ, God అనీ కొందరు అంటారు. అంటే God's Friday అని. ఈ God కాలక్రమంలో Good అయి ఉంటుందని ఒక భావన. సూక్ష్మంగా గమనిస్తే Good అనేదే సరైనదేమో అనిపిస్తుంది. మానవాళి పాపాలను ప్రక్షాళన చేయడం కోసం క్రీస్తు మరణించడం ద్వారా మానవులకు ఒక శుభ శుక్రవారం సంప్రాప్తించినట్లు అర్థం చేసుకోవాలి. అయితే ఇది అర్థం కావాలంటే మొదట మానవ జీవితంలోని పాపభూయిష్టతను అర్థం చేసుకోవాలి. అప్పుడు గుడ్ ఫ్రైడే అనడంలోని అంతరార్థం బోధపడుతుంది. క్రీస్తు రక్తంతో పాపప్రక్షాళన జరిగిన రోజు గుడ్ ఫ్రైడే. క్రీస్తు పునరుత్థానంతో సంబరం అంబరాన్ని అంటిన రోజు ఈస్టర్. నైతికవర్తన, శాంతి ఒకదానినొకటి ముద్దాడిన సందర్భాలు కూడా గుడ్ ఫ్రైడే, ఈస్టర్లే. ఇక ఈ బాధ, సంతోషం; దేవుడి క్షమ కలగలిసిన దానికి సంకేతమే సిలువ. అటువంటి సిలువపై గుడ్ ఫ్రైడే రోజునే క్రీస్తు మన కోసం మరణించి, తిరిగి మనకోసమే లేచారు. పాపుల పట్ల దేవుని ఆగ్రహం, దైవకుమారుని కరుణ కలగలసిందే సిలువ. అందుకే గుడ్ ఫ్రైడే చీకటి వంటి విషాదాన్ని, వెలుగునివ్వబోయే సంతోషాన్ని కలిగి ఉంటుంది. సిలువపై క్రీస్తు మరణం... దేవుని ప్రేమకు ప్రత్యక్ష నిదర్శనం. రక్తం ఓడుతున్న శరీరంతో క్రీస్తు తలవాల్చడమన్నది... ‘నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను’ అనే దైవ సంకేతంతప్ప మరొకటి కాదు. - బిల్లీ గ్రాహం, ఎవాంజలిస్ట్ జీవితం ప్రధానంగా ఆధ్యాత్మికమైనది, అజరామరమైనదీ అని క్రీస్తు పునరుత్థానం ద్వారా దేవుడు సూచించాడు. - రెవ. డా. చార్లెస్ క్రోవ్, ఏసుక్రీస్తు చివరి ఏడు మాటలు తన తండ్రి యెహోవాతో 1.తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. (లూకా 23:34) సిలువపై తన పక్కన ఉన్న నేరస్థులతో 2.నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండుదువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. (లూకా 23:43) తల్లి మరియతో, శిష్యుడు యోహానుతో 3.అమ్మా, ఇదిగో నీ కుమారుడు (యోహానును చూపిస్తూ) ఇదిగో, నీ తల్లి (మరియను చూపిస్తూ) (యోహాను 19:26-27) తండ్రి యెహోవాతో 4.ఎలోయీ ఎలోయీ సబక్తానీ (నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి) మత్తయి (27:46) మార్కు (15:34) చివరి ఘడియలు సమీపిస్తున్నప్పుడు 5.నేను దప్పిగొనుచున్నాను. (యోహాను 19:28) 6.ఇక సమాప్తమయినది (యోహాను 19:30) చిట్ట చివరిగా 7. తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను (లూకా 23:46) -
విశ్వాసమే పునరుత్థానం
- డా॥చార్లెస్ స్టాన్లీ, క్రైస్తవ మత బోధకులు ఏప్రిల్ 20న ఈస్టర్ మానవాళి పాపాలకు పరిహారంగా యేసు క్రీస్తు సిలువపై ప్రాణత్యాగం చేసినరోజు గుడ్‌ఫ్రైడే. ఆయనలో విశ్వాసం ఉంచిన వారందరికీ పాపవిముక్తి, పునరుత్థానం ఉంటాయని సూచించే రోజు ఈస్టర్. గుడ్‌ఫ్రైడే తర్వాత ఆదివారం రోజు వచ్చే ‘ఈస్టర్’ మహోజ్వలమైన ఉత్సవం. విజయ సంకేతం. దేవునిపై విశ్వాసాన్ని నిలుపుకోవడం మీకెప్పుడైనా కష్టమనిపించిందా? మీ జీవితంలోని అత్యంత దుర్భర మైన పరిస్థితుల్లో, మిమ్మల్ని ఎలాగైనా దేవుడు గట్టెక్కిస్తాడనీ, ఆ పరిస్థితులు మెరుగవడమో, లేదా వాటిలోంచే దేవుడు మీకు ఇంకేదైనా మంచి మార్గం చూపిస్తాడనో మీరెప్పుడైనా విశ్వసించలేకపోయారా? విశ్వసించలేకపోయానని చెప్పడానికి మీరేమీ ఇబ్బంది పడనక్కరలేదు. ఎందుకంటే స్వయంగా యేసుక్రీస్తుతో కలిసి తిరిగిన ఆయన శిష్యులే క్రీస్తు శిలువ మరణం తర్వాత తమ విశ్వాసంపై గట్టిగా నిలబడలేకపోయారు. రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పదే పదే - దేవుని కుమారుడు బాధలు పడతాడని; పెద్దలు, ప్రధాన బోధకులు, లేఖకులు ఆయనను తృణీకరిస్తారని, తర్వాత ఆయన సిలువపై మరణిస్తాడని, తిరిగి మూడవ రోజున లేస్తాడని - చెప్పినప్పటికీ వారు సందేహించారు. మానవ పరిధులను దాటి క్రీస్తును, ఆయన చేసిన ప్రమాణాలను వారు విశ్వసించలేకపోయారు. మీరూ, నేను ఇలా... ఈ శిష్యుల మాదిరిగా జీవితంలో ఎన్నిసార్లు దేవునిపై విశ్వాసాన్ని కోల్పోయి ఉంటాం! సమస్యలు మనల్ని చుట్టుముట్టి ఉన్నప్పుడు మన ఆలోచనలు ఆ సమస్యల చుట్టూ తిరుగుతుంటాయి తప్ప, అద్భుతమైన దేవుని ఉద్దేశాలను గ్రహించే శక్తి మనకు ఉండదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మనం మన అవగాహనా రాహిత్యం నుండి బయటపడి క్రీస్తు మాటల్లోని అంతరార్థాలను తెలుసుకోగలిగితే మన హృదయం సంతోషంతో నిండుతుంది. మన జీవితాలు అత్యంత వేగవంతంగా పరివర్తన చెందుతాయి. ఎలాగంటే, క్రీస్తు పునరుత్థానం తర్వాత ఆయన శిష్యులు మారిన విధంగా. సమాధి నుంచి క్రీస్తు తిరిగి లేచాక, ఆయన శిష్యులు గ్రహించిన జీవిత సత్యాలను (జీవితాన్ని మార్చిన సత్యాలు) మనం ఒక సారి గుర్తుకు తెచ్చుకోవాలి. పాపంపై, మరణంపై క్రీస్తు సాధించిన విజయం కారణంగా ఆయన శిష్యులు గ్రహించిన వాస్తవాలను మన జీవితాలకు అన్వయించుకుంటే ఏ సమస్యా మనల్నీ ఏమీ చేయలేదు. ఇంతకీ వారు ఏం గ్రహించారు? మొదటిది: దేవుడు తన ఆలోచనలను ఎల్లప్పుడూ విజయవంతంగానే అమలు చేస్తాడు. ఆ ప్రకారమే దేవుని కుమారుడైన క్రీస్తు, మన అతిక్రమణలకు శిక్ష అయిన మరణం నుంచి మనల్ని తప్పిస్తానని ప్రమాణం చేశారు. అలాగే తప్పించారు కూడా. దేవుడు తన లక్ష్యాన్ని సాధించకుండా అడ్డుపడే శక్తి ఈ భూమండ లంపై లేదు కాబట్టే ఆయన తలపోసినట్లు జరిగింది. మీ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. మీరు ఎలాంటి విషమస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. కనుక ఆయన అభీష్టం మేరకు మీరు మీ జీవితాన్ని కొనసాగించండి. రెండవది: క్రీస్తు మన రక్షకుడని ఒకసారి మనం విశ్వసించాక ఇక ఏదీ కూడా, చివరికి మరణం కూడా దేవుడి నుంచి మనల్ని వేరు చేయలేదని శిష్యులు గ్ర హించారు. సిలువపై క్రీస్తు మరణంతో ఆయన్ని కోల్పోయామని భావించినప్పటికీ ఆయన పునరుత్థానం తర్వాత ఇక దేవుని సన్నిధి నుండి తామెన్నటికీ విడిపోమని గ్రహించారు. అదే విధంగా మనం కూడా దైవ మహిమతో సఖ్యత చెందాలి. దీనర్థం మనకు మార్గం చూపిస్తూ, మంచిని బోధిస్తూ, అవసరాలను తీర్చేవిధంగా దేవుడిని మన హృదయంలో ప్రతిష్టించుకోవాలి. సర్వశక్తి సంపన్నుడైన దేవుడు మన రక్షకుడు. ఆయన మనల్ని ఓడిపోనివ్వడు. విడిచిపెట్టడు. మూడవది: క్రీస్తు తన త్యాగంతో మనకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించాడు కనుక మనం అనుభవించే బాధ ఏదైనా అది తాత్కాలికమేనని శిష్యులు గ్రహించారు. దేవుని ప్రవచనాలను బోధిస్తే తమపై వ్యతిరేకత వస్తుందని, తమను హింసిస్తారని తెలిసినప్పటికీ, భూమిపై దేవుడు తమకు రక్షకునిగా ఉంటాడు కనుక, స్వర్గానికి వెళ్లేటప్పుడు తనతో పాటు తమనూ తీసుకెళతాడు కనుక భయపడేదేమి లేదని వారు విశ్వసించారు. తమ భవిష్యత్తు శక్తిమంతమైన దైవ హస్తాల నడుమ భద్రంగా ఉందని నమ్మారు. మీరూ అలాంటి హామీనే, అలాంటి రక్షణనే కలిగి ఉన్నారు. ప్రస్తుతం మీరున్న కష్టాలనుంచి మీరెప్పటికీ గట్టెక్కలేరని మీరు భావిస్తుండవచ్చు. ఆ కష్టాలు అనంతమైనవని అనుకుని మీరు అధైర్యపడి ఉండవచ్చు. అలసిపోయి ఉండవచ్చు. కానీ ఆశను వదులుకోకండి. తన కోసం వేచి ఉన్నవారిని నిరాశ పరచను అని దేవుడు ఇచ్చిన మాటను విశ్వసించండి. ఆయన మిమ్మల్ని దరిచేరుస్తాడు. పై మూడు సూత్రాలను కనుక మీరు మీ జీవితాన్ని అన్వయించుకుని చూస్తే మీ సమస్యలు తేలిపోయి, వాటిపై మీరు విజయం సాధిస్తారు. దేవుడు మనకు ఇచ్చిన మాట ప్రకారం మనల్ని సంరక్షిస్తాడని మీరు పూర్తిగా విశ్వసిస్తారు. మరణం కూడా దేవుడి నుంచి మిమ్మల్ని విడదీయలేదని మీరు నమ్ముతారు. మీరు ఒంటరి వారు కాదని, మీకు దేవుడి అండ ఉందనీ గ్రహిస్తారు. సమస్యలు తాత్కాలికమనీ, జీవితం శాశ్వతమనీ తెలుసుకుంటారు. పునరుత్థానం నుంచి క్రీస్తు శిష్యులు తెలుసుకున్న ఈ వాస్తవాలన్నిటినీ మదిలో పెట్టుకుని, వాటిని అనుదినం మననం చేసుకోడానికి మీరూ ప్రయత్నించండి. మరణం నుంచి తిరిగి లేచిన మన రక్షకుడు మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటాడు. ఈ ఈస్టరు మీకు సంతోషకరమైనదిగా ఉండేలా ఆయన దీవిస్తాడు. -
నేడే సార్వత్రిక శంఖారావం
ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్న కలెక్టర్ 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ 19 వరకు స్వీకరణ జ21న పరిశీలన, 23న ఉపసంహరణ మే 7న పోలింగ్, 16న కౌంటింగ్ విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికల సమర శంఖారావం మోగనుంది. శనివారం నోటిఫికేషన్ వెలువడనుంది. జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ నెల 19 వరకు స్వీకరిస్తారు. 21న పరిశీలన, 23న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మే 7వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే నెల 16న నగరంలో ఏర్పాటు చేస్తున్న మూడు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 5 రోజులే నామినేషన్ల స్వీకరణ నామినేషన్ల సమర్పించేందుకు షెడ్యూ ల్ ప్రకారం 8 రోజులు సమయముంది. సెలవు రోజుల్లో నామినేషన్లను స్వీకరించరు. ఈ నెల 13 ఆదివారం, 14న అంబేద్కర్ జయంతి, 18న గుడ్‌ఫ్రైడే కారణంగా కేవలం అయిదు రోజులు మాత్రమే స్వీకరించనున్నారు. ఇప్పటికే పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రాలను తీసుకువెళ్లారు. బుధవారం నుంచి నామినేషన్ల జోరు ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయాలకు వంద మీటర్లు పరిధిలో బారికేడ్లను పెడుతున్నారు. ప్రధానంగా జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ చాంబర్లో విశాఖ పార్లమెంట్, అనకాపల్లి పార్లమెంట్‌కు జాయింట్ కలెక్టర్ చాంబర్లో నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులు, వారి అనుచరులను కలెక్టరేట్ గేటు బయటే నిలిపివేస్తారు. అభ్యర్థితో పాటు మరో నలుగురు ప్రపోజర్లను మాత్రమే అనుమతిస్తారు. కలెక్టరేట్లోనే అదనపు జాయింట్ కలెక్టర్ చాంబర్లో విశాఖ-తూర్పు నియోజవర్గం పోటీదారుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. వారు కలెక్టరేట్లో ఎస్బీఐ బ్యాంకు రోడ్డులో సివిల్‌సప్లయిస్ కార్యాలయం వైపున ఉండే మెట్ల నుంచి ఏజేసీ చాంబర్‌కు అనుతిస్తారు. నామినేషన్లు సమర్పించిన తరువాత తిరిగి అదే దారి నుంచి వెనక్కు వెళ్లాల్సి ఉంటుంది. కలెక్టరేట్లో మీడియా పాయింట్ నామినేషన్లు సమర్పించిన తరువాత పార్టీల అభ్యర్థులు మీడియాతో మాట్లేందుకు కలెక్టరేట్లోనే మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కలె క్టరేట్ ప్రాంగణంలో టీ క్యాంటిన్ పక్కన్న ఉన్న ఖాళీ స్థలాన్ని ఇందుకు కేటాయించారు. అభ్యర్థులు మీడియాతో మాట్లాడాలంటే అక్కడ మాత్రమే అనుమతిస్తారు.