సాక్షి, హైదరాబాద్ : గుడ్‌ఫ్రైడే... ! ఏసు క్రీస్తు శిలువ వేయబడిన రోజు. ప్రభువు ప్రాణత్యాగానికి గుర్తు. ప్రతి ఏడాది ఏప్రిల్ మాసంలో వచ్చే ఈ పండుగను క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. పండుగకు 42 రోజుల ముందు నుంచే క్రైస్తవులు అంతా ఉపవాసాలు చేయడం, రోజులో నాలుగు నుంచి అయిదు సార్లు ప్రార్థనలు చేస్తారు. భారతీయ క్రైస్తవులు ఈ రోజును శుభ శుక్రవారంగా పిలుచుకుంటారు. పండుగ రోజున చర్చీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ ప్రార్థనలో క్రైస్తవులంతా ఉపవాసంతో పాల్గొంటారు.
ప్రభువు శిలువ వేయబడిన రోజు శుభ దినం ఎలా అవుతుంది? అసలు దీనికి శుభ శుక్రవారం అని క్రైస్తవులు ఎందుకు పిలుచుకుంటారని చాలా మందికి ఉండే సందేహాలే. అంతే కాకుండా శుభ శుక్రవారం రోజున క్రైస్తవులు ఏం చేస్తారు? అసలు క్రీస్తును శిలువ ఎందుకు వేశారు వంటి అనేక సందేహాలకు సమాధానంగా సిస్టర్ వైఎస్ విమలారెడ్డి వివరణాత్మక సందేశం ఇచ్చారు. పండుగ ప్రత్యేకతను, ఏసు శిలువ వేయబడిన తర్వాత శిలువపై ఆయన పలికిన ఏడు అంశాల గురించి ఆమె సమగ్రంగా వివరించారు. శుభ శుక్రవారంపై పూర్తి వివరణాత్మక సందేశం కోసం ఈ కింది వీడియోను వీక్షించండి.
Comments
Please login to add a commentAdd a comment