
సాక్షి, అమరావతి: గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం క్రైస్తవులు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏసురత్నం బుధవారం ఒక ప్రకనటలో తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఈనెల 14 వరకు లాక్‌డౌన్ అమలులో ఉన్నందున సామూహిక ప్రార్థనలు నిషేధించినట్లు తెలిపారు. పాస్టర్లు కూడా ఈ విషయాన్ని గుర్తించి భక్తులకు తెలిపి వారి ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకునే విధంగా చూడాలని కోరారు.