క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే పవిత్ర దినం. బైబిలు ప్రకారం గుడ్ ఫ్రైడ్ అంటే మానవాళి పాపాలకు జీసస్ శిలువపై ప్రాణాలను పణంగా పెట్టిన రోజు. అందుకే ఏసుక్రీస్తు జ్ఞాపకార్థం ఈ రోజును పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. శిలువ వేయబడిన మూడు రోజుల తరువాత యేసు పునరుత్థానాన్ని ఆదివారం రోజు ఈస్టర్ గా పాటిస్తారు.
గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలచుకుంటారు. జీసస్ ప్రార్థనలో గడుపుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ప్రవచనాలు, ప్రార్థనలు, ధ్యానం వంటివి జరుగుతూనే ఉంటాయి. కొంతమంది నల్లటి వస్త్రాలు ధరించి తమ బాధను వ్యక్తపరుస్తారు.
గుడ్ ఫ్రైడే విషెస్
యేసు మరణానికి త్యాగానికి గుర్తుగా సంతాపాన్ని తెలియజేయడానికి దీన్ని నిర్వహించు కుంటారు. అందుకే గుడ్ ఫ్రైడే వస్తే మాత్రం ఏ ఒక్కరూ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని ఒకర్ని ఒకరు విష్ చేసుకోరు. మిగిలిన వారు కూడా ఎవరూ అలాంటి మెసేజ్‌లు పంపుకోరు. చర్చిలలో ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు జరగవు. ఏసు ప్రభు ప్రజల పాపాలకోసం త్యాగ చేసి మానవాళికి మంచి చేశాడని, అందుకే ఫ్రైడేకి ముందు గుడ్ అనే పదం చేరిందని నమ్ముతారు.
గుడ్ ఫ్రైడేను... హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుచుకుంటారు. శిలువ వేయడం అనేది యేసు జీవితంలో చిట్టచివరి ఘట్టమనీ, క్రైస్తవ సోదరుల విశ్వాసం. అందుకే గుడ్ ఫ్రైడే రోజు ఎన్నో చర్చిలలో ఈ నాటికను ప్రదర్శిస్తారు. అలాగే గుడ్ ఫ్రైడేకి ముందు లెంట్ డేస్ మొదలవుతాయి. దాదాపు 46 రోజులు పాటు కొనసాగుతాయి. ఆ రోజుల్లో ఉపవాసాలను పాటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment