Sacrifice
-
యూపీలో ఘోరం.. స్కూల్ బాగుండాలని 2వ తరగతి విద్యార్థి బలి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. క్షుద్ర పూజల పేరిట హథ్రాస్‌లో 2వ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని బలి ఇచ్చారు. విద్యార్ధి చదువుతున్న పాఠశాల అభివృద్ధి చెందాలని స్కూల్ హాస్ట్‌లోనే బాలుడిని హత్య చేశారు. వారం కిందట జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది.బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాఠశాల యజమాని జసోదన్ సింగ్‌తో, అతని కుమారుడు దినేష్ భఘేల్ పాటు మరో ముగ్గురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.విచారణలో భాగంగా వెలువడిన పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు... 11 ఏళ్ల కృతార్థ్ హథ్రాస్ జిల్లాలోని రస్‌గవాన్‌లోని డీఎల్ పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గతవారం తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని సోమవారం ఆయనకు కాల్ వచ్చింది. దీంతో తండ్రి స్కూల్ వద్దకు వెళ్లగా.. బాలుడిని పాఠశాల డైరెక్టర్ తండ్రి తనక ఆరులో ఆసుపత్రికి తీసుకెళ్లాడని వార్డెన్ చెప్పాడు. దీంతో హాస్టల్ దగ్గరే వేచి ఉన్న కృష్ణన్‌కు మీ కొడుకు చనిపోయాడని దినేశ్ బాఘెల్ చెప్పాడు. తన కారులో ఉన్న మృతదేహాన్ని అప్పగించాడు. అయితే కొడుకు మరణంపై అనుమానంతో కృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.స్కూల్ డైరక్టర్ తండ్రి దినేశ్ బఘేల్‌కు క్షుద్రపూజల మీద నమ్మకం ఉందని పోలీసులు తెలిపారు. బాలుడిని తొలుత స్కూల్ బయట ఉన్న గొట్టపు బావి దగ్గర చంపాలని భావించారు. కానీ హాస్టల్ నుంచి బయటకు తీసుకువెళుతుండగా బాలుడు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఫలితంగా అక్కడే, అతడి గొంతు నులిమి చంపేశారు.స్కూల్‌కు సమీపంలో క్షుద్రపూజలకు సంబంధించిన కొన్ని వస్తువులు పోలీసుల దర్యాప్తులో బయటపడ్డాయి. అయితే స్కూల్ సక్సెస్ కోసం క్షుద్రపూజలు చేయాలని నిందితులు గతంలో కూడా ప్లాన్ వేశారు. సెప్టెంబర్ 6వ 9వ తరగతి స్టూడెంట్‌ని బలి ఇవ్వాలని చూశారు. కానీ విఫలం అయ్యారని తేలింది. -
సొంత పార్టీ కుట్రకే బైడెన్ బలి
వాషింగ్టన్: సొంత డెమొక్రాటిక్ పార్టీ నేతల కుట్రలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బలయ్యారని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆయన్ను తొలుత బ్రతిమాలి, చివరకు భయపెట్టి అధ్యక్ష బరి నుంచి తప్పించారన్నారు. శనివారం మిన్నెసోటాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. ‘‘బైడెన్‌కు 1.4 కోట్ల మంది ఓటర్ల అండ ఉంది. పోటీలో కొనసాగాలని కృతనిశ్చయంతో కన్పించారు. అలాంటి బలమైన నేతను బెదిరించి తప్పించారు. ‘మర్యాదగా తప్పుకుంటే మంచిది. లేదంటే అవమానభారంతో పంపిస్తాం. అధ్యక్షుడు మరణించినా, బాధ్యతలు నిర్వర్తించలేని స్థితిలో ఉన్నా 25వ రాజ్యాంగ సవరణ ద్వారా తప్పించగలమని బెదిరించారు. అలా ఇంటిదారి పట్టించారు. చేసేదేమీ లేక బైడెన్ తప్పుకున్నారన్నది వాస్తవం. కానీ మీడియాలో మాత్రం తప్పుడు కథనాలొచ్చాయి. ఆయన ధైర్యంగా ని్రష్కమించారంటూ అంతా ఆయనను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేశారు. వాస్తవానికి ఆయనను బలవంతంగా పక్కకు నెట్టేశారు’’ అన్నారు. కమలపై తిట్ల దండకం డెమొక్రటిక్ పార్టీ నుంచి తన ప్రత్యరి్థగా దాదాపుగా ఖాయమైన కమలా హారిస్‌పై ట్రంప్ తిట్ల దండకానికి దిగారు. ‘‘ఆమె మితిమీరిన ఉదారవాది. స్థిరచిత్తం లేని నాయకురాలు. మతిలేని వామపక్షవాది. అమెరికా చరిత్రలోనే అత్యంత అసమర్థ ఉపాధ్యక్షురాలు. గతంలో మార్కిస్ట్ జిల్లా అటార్నీగా శాన్ఫ్రాన్సిస్కోను నాశనం చేశారు. ఇలాంటి నేత అమెరికా చరిత్రలో ఎన్నడూ అధ్యక్ష పోటీలో నిలబడలేదు. హారిస్ పొరపాటున దేశాధ్యక్షురాలైతే దేశంలో హింస, కల్లోలం నిత్యకృత్యాలవుతాయి. ఆమె పరిపాలనలో అమెరికా అంతటా అతివాదం, వైఫల్యాలు, ఉద్రిక్త పరిస్థితులు.. చివరకు మూడో ప్రపంచ యుద్ధమే రావొచ్చు. అందుకే ఈ ఎన్నికల్లో ఆమెను మనం గెలవకుండా అడ్డుకుందాం. ఆమె అమెరికాకు కాకుండా నేరగాళ్లకు అధ్యక్షురాలిగా మసులుకుంటారు. ఆమె గెలిస్తే గాజా నుంచి కూడా శరణార్థులు అమెరికాకు వచ్చి తిష్టవేస్తారు’ అని ట్రంప్ ఆరోపించారు. ‘నేను గెలిచి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే తొలి రోజే బైడెన్–హారిస్ హయాంలో తీసుకున్న సరిహద్దు విధానాలన్నింటినీ చెత్తబుట్టలో పడేస్తా. సరిహద్దును మూసేసి అక్రమ వలసలను అడ్డుకుంటా’ అని అన్నారు. అధికారంలోకి వస్తే క్రిప్టోకరెన్సీని సూపర్‌పవర్‌గా మలుస్తానని చెప్పారు. -
నాన్న వంటబట్టించిన కళ
తన తండ్రి చిన్నప్పటి నుంచీ బజ్జీలు వగైరా తయారు చేసి బండి మీద విక్రయించేవాడని ఆయన ఆధ్వర్యంలో ఎప్పటికైనా ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ప్రారంభించడమే తన లక్ష్యమని మాస్టర్ చెఫ్ భాషా అంటున్నారు. ఇటీవల సోనీలివ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి తెలుగు మాస్టర్ చెఫ్ పోటీలలో ఈ అనంతపురం నివాసి విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ... తన అభిప్రాయాలను పంచుకున్నారు..నాన్న ‘వంటబట్టించిన’కళ... మాది అనంతపురంలోని పుటపర్తి దగ్గర గోరంట్ల మా నాన్నకు ముగ్గురు పిల్లలం. చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గరే స్వీట్లు, కారపు సరుకులు వగైరా తినుబండారాలను తయారు చేసి వాటిని బండి మీద తీసుకెళ్లి విక్రయించేవాడు.. ఆ బండి నడుపుతూనే ఆయన మా సంసారమనే బండిని కూడా విజయవంతంగా నడిపారు. పిల్లలు అందర్నీ బాగా చదివించారు. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాను. ఆ తర్వాత బెంగుళూర్లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. కానీ...నాకు నేనుగా ఏదైనా సృజనాత్మక రంగంలో రాణించాలనే తపన, చిన్నప్పటి నుంచీ ఇంట్లో వంటల తయారీ వల్ల వంటబట్టిన పాకశాస్త్ర కళ నన్ను నాలుగైదు నెలలకు మించి ఉద్యోగంలో ఉంచలేదు. దాంతో ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకున్నా ఉద్యోగాన్ని వదిలేసి గరిట చేతబట్టాను.కంప్యూటర్ సైన్స్ టూ కిచెన్ సెన్స్...అలా కంప్యూటర్ సైన్స్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి కిచెన్ లో వంటలకు వెల్కమ్ చెప్పాను. చెన్నైలో నివసించే ప్రముఖ మహిళా చెఫ్ దగ్గర బేకరీ ఐటమ్స్‌లో శిక్షణ పొందాను. ఆమె సారధ్యంలో వైవిధ్యభరితమైన బేకరీ ఉత్పత్తుల తయారీని తెలుసుకున్నాను. ప్రస్తుతం రెస్టారెంట్స్‌కి మెనూ రూపొందించే సేవలు అందిస్తున్నాను. మరిన్ని వెరైటీ వంటల్లో రాణించాలని సాధన చేస్తున్నాను. అదే క్రమంలో తొలిసారి తెలుగులో సోనీ లివ్ వారు నిర్వహించిన మాస్టర్ చెఫ్ పోటీలకు దరఖాస్తు చేయడం అందులో పాల్గొని టైటిల్ గెలుపొందడం జరిగింది. టైటిల్ పోటీలో నేను రూపొందించిన గ్రేట్ ఫుల్ పిస్తాషో పేస్ట్రీలో ఒక్కో లేయర్‌ను నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులకు అంకితమిస్తూ చేయడం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. ఈ టైటిల్ స్ఫూర్తితో పేరొందిన చెఫ్‌గా రాణించడం, నాన్న ప్రస్తుతం గోరంట్ల బస్‌స్టాండ్ దగ్గర నడుపుతున్న చికెన్ కబాబ్స్ బండిని పూర్తి స్థాయి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్‌గా మార్చడం... ఇవే నా భవిష్యత్తు లక్ష్యాలు.ఫాదర్స్ డే స్పెషల్ కథనం -
గుడ్ ఫ్రైడే' 2024: ప్రాముఖ్యత ఏంటి.. ‘హ్యాపీ గుడ్ ఫ్రైడే' విషెస్ చెప్పకండి!
క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే పవిత్ర దినం. బైబిలు ప్రకారం గుడ్ ఫ్రైడ్ అంటే మానవాళి పాపాలకు జీసస్ శిలువపై ప్రాణాలను పణంగా పెట్టిన రోజు. అందుకే ఏసుక్రీస్తు జ్ఞాపకార్థం ఈ రోజును పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. శిలువ వేయబడిన మూడు రోజుల తరువాత యేసు పునరుత్థానాన్ని ఆదివారం రోజు ఈస్టర్ గా పాటిస్తారు. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలచుకుంటారు. జీసస్ ప్రార్థనలో గడుపుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ప్రవచనాలు, ప్రార్థనలు, ధ్యానం వంటివి జరుగుతూనే ఉంటాయి. కొంతమంది నల్లటి వస్త్రాలు ధరించి తమ బాధను వ్యక్తపరుస్తారు. గుడ్ ఫ్రైడే విషెస్ యేసు మరణానికి త్యాగానికి గుర్తుగా సంతాపాన్ని తెలియజేయడానికి దీన్ని నిర్వహించు కుంటారు. అందుకే గుడ్ ఫ్రైడే వస్తే మాత్రం ఏ ఒక్కరూ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని ఒకర్ని ఒకరు విష్ చేసుకోరు. మిగిలిన వారు కూడా ఎవరూ అలాంటి మెసేజ్‌లు పంపుకోరు. చర్చిలలో ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు జరగవు. ఏసు ప్రభు ప్రజల పాపాలకోసం త్యాగ చేసి మానవాళికి మంచి చేశాడని, అందుకే ఫ్రైడేకి ముందు గుడ్ అనే పదం చేరిందని నమ్ముతారు. గుడ్ ఫ్రైడేను... హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుచుకుంటారు. శిలువ వేయడం అనేది యేసు జీవితంలో చిట్టచివరి ఘట్టమనీ, క్రైస్తవ సోదరుల విశ్వాసం. అందుకే గుడ్ ఫ్రైడే రోజు ఎన్నో చర్చిలలో ఈ నాటికను ప్రదర్శిస్తారు. అలాగే గుడ్ ఫ్రైడేకి ముందు లెంట్ డేస్ మొదలవుతాయి. దాదాపు 46 రోజులు పాటు కొనసాగుతాయి. ఆ రోజుల్లో ఉపవాసాలను పాటిస్తారు. -
కోడలి ప్రాణం కోసం అత్త త్యాగం.. ఇది కదా కావాల్సింది!
జీవితం సంతోషంగా సాగుతున్న టైంలోనే కదా మనిషికి కష్టాలు వచ్చేవి. అలా ఆమెకూ అనుకోని కష్టం వచ్చి పడింది. హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారినపడ్డ అమిషాకు.. కిడ్నీ జబ్బు ఉన్నట్లు డాక్టర్లు చెప్పడంతో ఆమె, ఆమె భర్త జితేష్ కుదేలయ్యారు. పైగా రెండు కిడ్నీలు దెబ్బతిని.. వ్యాధి ప్రాణాంతక దశకు చేరుకుందని.. వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తేనే ఆమె బతికేదని తేల్చి చెప్పడంతో.. కుంగిపోసాగారు ఆ భార్యాభర్తలు. ముంబైకి చెందిన అమిషా జితేష్ మోటా(43)కు రెండు కిడ్నీలు దెబ్బతిని.. జబ్బు అడ్వాన్స్డ్ స్టేజీకి చేరిందని డాక్టర్లు చెప్పారు. కిడ్నీ మారిస్తేనే ఆమె బతుకుతుందన్నారు. అమిషా భర్త జితేష్‌కు అంతకు కొన్నిరోజుల ముందే షుగర్ వచ్చింది. దీంతో ఆయన కిడ్నీ డొనేట్ చేయడం కుదరదని వైద్యులు తేల్చారు. అమిషా తల్లిదండ్రులతో పాటు రక్తసంబంధీకులను ముందుకురాగా.. వైద్య ప్రమాణాల దృష్ట్యా అది వీలుకాలేదని వైద్యులు తెగేసి చెప్పారు. అంతా చీకట్లు అలుముకున్న తరుణంలో.. అనుకోని వ్యక్తి రూపంలో ఓ వెలుగురేఖ కిడ్నీ దానానికి ముందుకొచ్చింది. ఆమె పేరు ప్రభ కంటిలాల్ మోటా. జితేష్ తల్లి.. అమిషా అత్త. కానీ.. ప్రభ వయసు 70 ఏళ్లు. వయసురిత్యా ఆమె కిడ్నీ ఇచ్చేందుకు సరిపోతారా? అనే విషయంలో వైద్యులు తర్జన భర్జనలు చేశారు. ఆశ్చర్యంగా అన్ని టెస్టుల్లోనూ ఆమె ఫిట్‌గా తేలారు. అయినప్పటికీ వైద్యుల నుంచి ఆమెకు చెప్పాల్సింది చెప్పారు. భర్త, ఇద్దరు కొడుకులు వద్దని వారించినా ఆమె వినలేదు. చివరకు.. అమిషా కూడా వద్దని బతిమాలుకుంది. మొండిగా తన కోడలి ప్రాణం కాపాడుకునేందుకే ముందుకు వచ్చారు ప్రభ. ఆ అత్త సంకల్పానికి తగ్గట్లే.. కిడ్నీ కూడా అమిషాకు మ్యాచ్ అవుతుందని వైద్యులు ప్రకటించారు. ఆరోగ్యం క్షీణిస్తూ అమిషా పడుతున్న బాధను మా అమ్మ చూడలేకపోయింది. అందుకే ఆమెను కాపాడాలనుకుంది. వద్దని నేను, నా సోదరుడు ఆమెను ఎంతో బతిమాలాం. మా నాన్న కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా కోడలి కోసం మా అమ్మ సాహసం చేసింది. ‘‘అమిషా నా బిడ్డ లాంటిది.. బిడ్డను కాపాడుకునేందుకు ఒక తల్లి ఎంతదాకా అయినా వెళ్తుంది కదా’’ అని ప్రభ తేల్చేశారు. కిందటి నెలలో నానావతి ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. డాక్టర్ జతిన్ కొఠారి నేతృత్వంలో విజయవంతమైంది. అంతా హ్యాపీస్.. ఆ అత్తాకోడళ్లు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. సర్జరీ నుంచి కోలుకున్న ప్రభ.. ఆగష్టు 4వ తేదీన తిరిగి ఇంటికి చేరుకున్నారు. కుటుంబం.. చుట్టుపక్కల వాళ్లు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అమిషా తల్లి ఆమెను హత్తుకుని కంటతడి పెట్టుకుంది. తల్లిగా తాను జన్మ ఇచ్చినప్పటికీ, అత్తమ్మగా.. అదీ కిడ్నీ దానంతో పునర్జన్మ ఇచ్చిందంటూ భావోద్వేగానికి లోనైంది. సమాజంలో అత్తాకోడళ్లంటే.. ఎప్పుడూ కస్సుబుస్సు లాడుతూనే ఉండాలా? కలిసి ‘సెల్ఫీ’లు తీసుకుని ప్రేమలు ప్రదర్శిస్తే సరిపోతుందా?.. ప్రభ-అమిషా ప్రేమానురాగాల గురించి తెలిశాక ఇది కదా మనకు కావాల్సింది అనిపించకమానదు. -
తండ్రిని బతికించుకునేందుకు... చిన్నారిని బలివ్వబోయింది!
న్యూఢిల్లీ: మూఢ నమ్మకాల మాయలో ఓ పాతికేళ్ల మహిళ ఒక పసికందునే బలివ్వబోయిన దారుణం ఢిల్లీలో వెలుగుచూసింది. ఇటీవల కన్నుమూసిన తండ్రి నవజాత మగ శిశువును బలిస్తే బతికొస్తాడని ఎవరో చెప్పడంతో ఇంతటి ఘోరానికి పాల్పడబోయింది. మామ్‌రాజ్ మొహల్లా దగ్గర నివసించే దంపతులకు రెండు నెలల బాబున్నాడు. శ్వేత అనే పాతికేళ్ల మహిళ వారితో పరిచయం పెంచుకుంది. ఎన్జీవోలో పనిచేస్తానని, పిల్లాడికి ఉచితంగా మందులిస్తానని నమ్మబలికి ఇంటికి రోజూ వచ్చిపోతూ దగ్గరైంది. బుధవారం పిల్లాడిని సరదాగా తిప్పుతానంటూ బయటకు తీసుకెళ్లింది. వెంట వచ్చిన పసికందు బంధువుకు క్రూల్డ్రింక్లో మత్తుమందు కలిపిచ్చి వదిలించుకుని బాబుతో పరారైంది. బంధువు బాబు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా శ్వేత జాడ కనిపెట్టారు. ఆమెను అరెస్ట్‌చేసి పసికందును తల్లిదండ్రులకు అప్పజెప్పారు. బాలున్ని కాపాడుతూ కేసును 24 గంటల్లోపే చేధించిన పోలీసులకు ప్రశంసలు దక్కాయి. -
బంధువులతో కలిసి తల్లిదండ్రులను బలిచ్చిన మైనర్
రాయ్‌పుర్: మంత్రాలు, తాంత్రిక పూజల నెపంతో దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రాణం తీసేందుకు సైతం వెనకాడటం లేదు. అలాంటి సంఘటనే ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పుర్‌లో వెలుగు చూసింది. మానసికంగా బాధపడుతున్న సోదరుడికి నయమవుతుందని ఓ తాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి తల్లిదండ్రులనే అతి కిరాతకంగా చంపేశాడు ఓ 17 ఏళ్ల బాలుడు. అందుకు వారి బంధువులు కొందరు బాలుడికి సహకరించటం గమనార్హం. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒకరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. నందిగావూన్ గ్రామంలో మృతదేహాలను ఆగస్టు 1న స్వాధీనం చేసుకున్నట్లు రాయ్‌గఢ్ ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. ‘ఆగస్టు 1వ తేదీన ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. మృతులు మహేశ్‌పుర్‌కు చెందిన సుక్రు యాదవ్(40), మన్మతి యాదవ్(45)లుగా గుర్తించాం.’ అని వెల్లడించారు ఎస్పీ మీనా. దర్యాప్తులో భాగంగా ఈ హత్యల్లో కుటుంబ సభ్యుల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులను మరో ఏడుగురితో కలిసి తానే హత్య చేసినట్లు బాలుడు అంగీకరించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితం నిందితుడి సోదరుడు మానసిక రోగిగా మారాడు. ఆ తర్వాత సద్గురు ఆశ్రమానికి చెందిన తాంత్రికుడు మోహన్ యాదవ్ దగ్గరకు తీసుకెళ్లారు. తల్లిదండ్రులు మంత్రాలు చేయటం ద్వారానే అతడు మానసిక రోగిగా మారినట్లు తాంత్రికుడు తెలిపాడు. వారిని హత్య చేస్తే మామూలు మనిషిలా మారతాడని సెలవిచ్చాడు. అలాగే ఆర్థిక పరిస్థితి సైతం మెరుగుపడుతుందని నమ్మించాడు. దీంతో బావ నర్సింగ్ యాదవ్, సోదరుడు రాజు రామ్ యాదవ్, భోలే శంకర్ యాదవ్, శంకర్ యాదవ్, ఖగేశ్వర్ యాదవ్, ఐశ్వర్య యాదవ్, దశరథ్ యాదవ్‌లతో కలిసి పథకం రచించాడు నిందితుడు. హత్య చేశాక మృతదేహాలను మహానది నదిలో పడేయాలని ప్రణాళిక వేశారు. నిందితుడి బావ జులై 30న ఓ వాహనం తీసుకుని భగ్వాన్‌పుర్‌కు వెళ్లాడు. అక్కడ ఓ తాడు, టవల్, ప్లాస్టిక్ సింక్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత మీ కొడుకు అనారోగ్యానికి గురయ్యాడని చెప్పి బాధితులను వాహనంలో ఎక్కించుకున్నారు. సురాజ్‌గఢ్‌లోని మహానది వంతన వద్దకు తీసుకెళ్లి వారిని గొంతు కోసం హత్య చేశారు. ఇదీ చదవండి: HIV: హెచ్ఐవీ పేషెంట్‌తో ప్రేమ.. ప్రాణం మీదకు తెచ్చుకుంది! -
త్యాగనిరతికి ప్రతీక మొహర్రం: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: మానవీయ విలువలన్నింటిలో త్యాగనిరతి గొప్పదని మొహర్రం చాటిచెబుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. నిజవిశ్వాసం కోసం ప్రాణత్యాగం చేసిన ముహమ్మద్ ప్రవక్త మునిమనవడు హజ్రత్ ఇమామ్ హుసేన్‌ను స్మరిస్తూ మొహర్రం జరుపుకుంటారని తెలిపారు. ఇస్లాంకు మూలసిద్ధాంతమైన మూర్తీభవించిన మానవతావాదాన్ని అనుసరించాలనే సందేశాన్ని మొహర్రం ఇస్తుందన్నారు. దయ, కరుణ, శాంతి, న్యాయాన్ని పాటించాలన్న స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు. (చదవండి: టీఆర్ఎస్లో త్వరలో అసమ్మతి బాంబ్ బ్లాస్ట్: మురళీధర్‌రావు ) ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలి బహదూర్‌పురా/చార్మినార్ (హైదరాబాద్): ఇంటింటా మువ్వన్నెల జెండాను ఎగురవేస్తూ జాతీయతను చాటి చెప్పాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సోమవారం సాలార్జంగ్ మ్యూజియంలో తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల ఛాయాచిత్రాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవాలను ప్రారంభించిందన్నారు. ఎందరో త్యాగాల ఫలాన్ని మనం అనుభవిస్తున్నామన్నారు. జాతీయ భావాన్ని బలోపేతం చేస్తూ ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలని చెప్పారు. ఆనాడు దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి పోరాడిన మహానుభావుల జీవిత చరిత్రను తెలియజేసే ఛాయాచిత్రాల ప్రదర్శనను మ్యూజియంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జిబిషన్‌ను ఒక్కసారైనా తిలకించాలని అన్నారు. సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ ఎ.నాగేందర్ రెడ్డి, పీఐబీ అండ్ సీబీసీ డైరెక్టర్ శ్రుతి పాటిల్, పీఐబీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. మ్యూజియం వద్ద గవర్నర్ సెల్ఫీ.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సాలార్జంగ్ మ్యూజియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘లవ్ సాలార్జంగ్ మ్యూజియం’అనే బోర్డు వద్ద నిల్చుని సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం సాలార్జంగ్ భవన ప్రాంగణం వచ్చేలా కూడా తన సెల్ ఫోన్లో సెల్ఫీ తీసుకున్నారు. -
గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. త్యాగాలకు ప్రతీకగా సాగే ‘పీర్ల’ఊరేగింపును తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలతో పాటు హిందువులూ కలిసి జరుపుకుంటారని తెలిపారు. మతాలకతీతంగా హిందూముస్లింల సఖ్యతను, ఐక్యతను గంగా జమునా తెహజీబ్‌ను మొహర్రం చాటి చెప్తుందని సీఎం తెలిపారు. (చదవండి: కేసీఆర్ పాలనలో పైలం బిడ్డో అంటూ బడికి.. ) త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక! రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు, హిందువులూ కలిసి నిర్వహించే 'పీర్ల' ఊరేగింపు తెలంగాణ ప్రజలమధ్య సఖ్యతను, ఐక్యతను, గంగా-జమునా తెహజీబ్ ను చూపే సందర్భం!#Muharram pic.twitter.com/bRVcaQrbN7 — Telangana CMO (@TelanganaCMO) August 9, 2022 -
గురువాణి – 3: ఆ.. నలుగురి కోసం కూడా...
వ్యక్తి ఒక్కడుగా చేయవలసిన త్యాగం ఉంటుంది. ఒక్కడుగా పదిమందికి చేయవలసిన ఉపకారం ఉంటుంది. పదిమందీ కలిసి వ్యవస్థకు చేయవలసిన ఉపకారం ఉంటుంది. తను ఉంటున్న ఇంటిలోని బావిలో మంచినీటి ఊట ఉంది. చుట్టుపక్కల ఎవరి బావిలోనూ లేదు. తాను పట్టుకోవడంతోపాటూ ఇరుగుపొరుగుకూ మంచినీటిని పట్టుకోవడానికి అనుమతించగలగాలి. ఒక ధనవంతుడున్నాడు. ఊరిలో మంచి నీటి ఎద్దడి ఉంది. పదిమందికి పనికొచ్చేలో అందరికీ అందుబాటులో ఒక బావి, ఒక చెరువు తన తాహతుకు తగ్గట్టు తవ్వించగలగాలి. ఒక గుడి కట్టించగలగాలి. గుడి తానొక్కడే కట్టించినది కావచ్చు. కానీ దేవుడి బట్టలు ఉతకడానికి ఒక వ్యక్తి కావాలి. పల్లకి పట్టుకోవడానికి పదిమంది కావాలి. మంగళవాయిద్యాలు మోగించడానికి ఓ నలుగురు కావాలి. వేదం వచ్చినాయన వేదం చదువుతాడు. నాట్యం వచ్చినామె నాట్యం చేస్తుంది. పాటపాడగలిగినవాడు మంచి కీర్తనలు పాడతాడు. గుడిని శుభ్రపరిచేవాళ్ళు శుభ్రపరచాలి. కాగడా పట్టుకోగలిగిన వాడు అది పట్టుకుంటాడు. ఎవరికి ఏది చేయగలిగిన శక్తి ఉంటే గుడి ద్వారా సమాజానికి చేస్తారు. పదిమంది కలిసి ద్రవ్యం కానుకగా ఇస్తారు. భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని అరమరికలు లేకుండా అందరికీ పెట్టి పంపిస్తారు. అందరూ కలిసి అందరికీ ఉపయోగపడడం అంటే ఇదే. ఇది నేర్పడానికే మనకు దేవాలయ వ్యవస్థ వచ్చింది. అందరూ కలిసి విడివిడిగా ఒక వ్యవస్థ ద్వారా అందరికీ సేవ చేస్తున్నారు. నువ్వు పట్టుకుపోయేదేమీ లేదు. ఇక్కడ నువ్వు ఏది చేసావో అది పుణ్యంగా మారుతోంది. నిజానికి నువ్వే అభ్యున్నతిని పొందుతున్నట్టు. నాకు సంగీతం వచ్చు. నేనెంతో కష్టపడి నేర్చుకున్నా. ప్రతిఫలం లేకుండా నేనిది అందరికీ ఎందుకు నేర్పాలి... అని నేను ఆలోచించాననుకోండి. విద్య ఏమయిపోతుంది ? చిన్నగుంటలో నిలిచిన నీళ్ళు కొద్దిరోజులకు ఆవిరయిపోయి ఎండిపోయినట్లు అది ఎవరికీ పనికి రాదు. కానీ నిస్వార్థంగా సంతోషంగా నలుగురికీ పంచిపెట్టేదేదో అది పుణ్యంగా మారిపోతుంది. పదిమందికి అన్నం పెట్టవచ్చు. పేదవారికోసం ఓ కళ్యాణ మంటపం కట్టి ఉచితంగానో తక్కువ డబ్బుకో దానిని ఇవ్వవచ్చు. ఇక్కడ ఉండి శరీరం వదిలిన తరువాత నీ శరీరం ఇక్కడే ఉండిపోతుంది. కానీ ఒకరికి పెట్టిందేదో అది పుణ్యంగా మారి నీతో వస్తుంది. నువ్వు అనుభవించక, ఒకరికి పెట్టక, నువ్వు సాధించేముంది? ‘‘లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారంబు మింగబోడు...’’ ఎంత డబ్బుంటే మాత్రం ఆకలేసినప్పుడు బంగారంతో పొట్టనింపుకోలేవు గదా... అందరిలాగే ఉప్పు, పప్పుతోనే నింపుకోవాలి. అందుకే స్వార్థం మానుకొని నలుగురిని గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. మీరు సంపాదించిన దానిలో శాస్త్రం అంగీకరించిన మేర అంత దాచుకోండి. ఎంత అనుభవించాలో అంత అనుభవించండి. ఉండీ దరిద్రంగా బతకమని ఏ శాస్త్రమూ చెప్పలేదు. జీవుడికి పునర్జన్మ ఉందని జ్ఞాపకం పెట్టుకొని పదిమందిని ఆదుకోండి. లేకపోతే జన్మకు అర్థం లేదు. వేమనగారు చెబుతున్నది కూడా అదే... ‘‘ధనము కూడబెట్టి దానంబు చేయక/తాను దినక లెస్స దాచుకొనగ/ తేనెటీగ గూర్చి తెరువరికియ్యదా/ విశ్వదాభిరామ వినుర వేమ.... ’’ దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర రావు పంతులుగారు అమృతాంజన్ వ్యాపారం పెట్టి... చాలా సంపాదించారు. అంతా తానే ఉంచేసుకోలేదు. కుటుంబం కోసమే దాచిపోలేదు. ఎన్నెన్ని దానధర్మాలు చేసారో, స్వాతంత్య్ర సంగ్రామం కోసం ఎంతెంత ఖర్చు చేసారో, ఎంతెంత మంది పేదవారికి ఉపాధి కల్పించారో తెలిస్తే ఆశ్చర్యపోతాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
రియల్ హీరో: ప్రాణత్యాగంతో 144 మందిని కాపాడాడు!
తన ప్రాణం పోతుందని తెలిస్తే.. ఎవరైనా భయపడతారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, తన ప్రాణం పోయినా.. ఇతరులను కాపాడాలని చూసేవాళ్లను ఏం అనాలి?. రియల్ హీరో అనడం ఎంతమాత్రం తక్కువ కాదు. క్షణాల్లో ఘోర ప్రమాదం జరుగుతుందని తెలిసి.. తన ప్రాణం పోయిన పర్వాలేదనుకుని వంద మందికి పైగా ప్రాణాలు నిలబెట్టాడు యాంగ్ యోంగ్. దక్షిణ చైనాలో హైస్పీడ్ బుల్లెట్ రైలు డీ2809 శనివారం ప్రమాదానికి గురైంది. గుయిజౌ ప్రావిన్స్‌లో బుల్లెట్ రైలు ప్రమాదానికి గురికాగా.. డ్రైవర్ కోచ్ నుజ్జునుజ్జు అయ్యి అందులోని డ్రైవర్ యాంగ్ యోంగ్ ప్రాణం విడిచాడు. ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడగా.. 136 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదం గురించి దర్యాప్తు చేపట్టిన అధికారులకు.. ట్రైన్ డేటా ఆధారంగా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. డీ2809 రైలు.. గుయియాంగ్ నుంచి రోంగ్జియాంగ్ స్టేషన్ల మధ్య ఒక టన్నెల్ వద్దకు చేరుకోగానే.. డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతోనే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు అధికారులు. అయితే.. టన్నెల్‌కు చేరుకునే ముందు ట్రాకుల మీద అసాధారణ పరిస్థితులను యాంగ్ గుర్తించాడు. వెంటనే.. ఎమర్జెన్సీ బ్రేకులు అప్లై చేశాడు. దీంతో ముందున్న బురద, మట్టి కుప్పలను బలంగా ఢీకొట్టి రైలు సుమారు 900 మీటర్ల దూరం జారుకుంటూ ముందుకు వెళ్లింది. ఆపై స్టేషన్ వద్ద బోల్తా పడడంతో డ్రైవర్ కోచ్ బాగా డ్యామేజ్ అయ్యింది. Train driver on D2809 "5 second braking" : Emergency braking becomes muscle memory, Yang Yong did everything he could pic.twitter.com/IkiMUvcknt — tigers tiger (@tigerstiger1) June 5, 2022 యోంగ్ బ్రేకులు గనుక వేయకుండా ఉంటే.. పూర్తిగా బల్లెట్రైలే ఘోర ప్రమాదానికి గురై భారీగా మృతుల సంఖ్య ఉండేది!. కానీ, యోంగ్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. తన ప్రాణం కన్నా ప్రయాణికులే ముఖ్యం అనుకున్నాడు. యోంగ్ నేపథ్యం.. ఆయన ఇంతకు ముందు సైన్యంలో పని చేశారు. రిటైర్ అయిన తర్వాత.. కో-డ్రైవర్‌గా, అసిస్టెంట్ డ్రైవర్‌గా, ఫోర్‌మ్యాన్‌గా, డ్రైవర్ ఇన్‌స్ట్రక్టర్‌గా, గ్రౌండ్ డ్రైవర్‌గా.. చివరికి ట్రైన్ డ్రైవర్‌గా బాధ్యతలు చేపట్టాడు. దేశం కోసం సేవలు అందించిన వీరుడు.. చివరకు జనాల ప్రాణాలను కాపాడడం కోసమే ప్రాణాలు వదిలాడు. యోంగ్ చేసిన త్యాగం.. ఆ దేశాన్ని కంటతడి పెట్టించింది. రియల్ హీరోగా ఆయన్ని అభివర్ణిస్తోంది. తనను తప్ప.. మిగతా అందరినీ కాపాడుకున్న ఆ హీరోను ఆరాధిస్తోంది ఇప్పుడు అక్కడ. యోంగ్ పార్థివదేహానికి అతని స్వస్థలం గుయిజౌలోని జున్యీ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో ప్రజల కన్నీళ్ల మధ్య ఘనంగా జరిగింది. The heroic driver of #D2809 Yang Yong returned to his hometown of #Zunyi , #Guizhou , under the escort of the convoy. Locals spontaneously lined the way to bid farewell Welcome home heroes. 6月5日,D2809司机杨勇在车队护送下回到家乡贵州遵义。当地人自发夹道送别:“欢迎英雄回家!” pic.twitter.com/c8OokOdx24 — Michael Franklin ( 100% follow back) (@Michael04222710) June 6, 2022 -
కారు డ్రైవింగ్ చేస్తూ.. స్పృహ తప్పి పడిపోయింది! అతని సాహసానికి హ్యాట్సాఫ్
Netherland Man Sacrifices His Car: మనం సాధారణంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడూ ఏవరైనా కారు ర్యాష్‌గా డ్రైవ్ చేస్తే మనకు చాలా కోపం వస్తుంది. ఇన్ని భయంకరమైన ప్రమాదాలు జరిగిన అసలు వీళ్లకు బుద్ధి రాదు అని కూడా అనుకుంటాం. కానీ ఇక్కడొక వ్యక్తి కారుని ఇష్టారీతిన నడిపి ప్రమాదానికి గురవుతాడు. అయితే అతడి నిర్లక్షాన్ని క్షమించి ఆ కారుని కాపాడే ప్రయత్నం చేసి సహృదయం చాటుకున్నాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు.. (చదవండి: దెయ్యంతో ఆటలాడిన భౌ.. భౌ..!! వైరల్...) అసలు విషయంలోకెళ్లితే....ఇక్కడ రోడ్డు పై మూడు కార్లు వెళ్తుంటాయి. అందులో ఒక కారు ఉన్నటుండి నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా అటు ఇటూ రకరకాలగా వెళ్తుంటుంది. ఈ విషయాన్ని మిగత కారుల్లో ప్రయాణిస్తున్న వాళ్లు గమనిస్తారు. మొదట ఏంటి ఇలా నడుపుతున్నాడు అని వాళ్లంతా అనుకుంటారు. అయితే కాసేపటికి వాళ్లకు అసలు విషయం అర్థమవుతోంది. ఆ కారుని నడుపుపతున్న మహిళ స్పృహ తప్పి పడిపోయిందని అందువల్లే కారు ఇష్టమొచ్చినట్లుగా వెళ్తోంది అని. అయితే ఆమెను ఎలాగైన కాపాడాలని అదే సమయంలో అక్కడ ప్రయాణిస్తున్న మిగతా కార్లలోని వాళ్లు అనుకుంటారు. అంతేకాదు అనుకున్నదే తడువుగా ఆమె కారు వెళ్లేందకు దారి ఇచ్చేసి తర్వాత ఆమె కారుకి ముందు ఒక కారుని అడ్డంగా పెట్టి ఢీ కొట్టేలా చేసి ఆపుతారు. అంతేకాదు ఆమె కారు వెనుక భాగంలో కూడా మరో కారు వచ్చి ఢీకొట్టి ఆ కారుని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఆ కారు నడుపుతున్న మహిళను కాపాడతారు. అంతేకాదు రోడ్డుపై ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడటమే కాక తన కారుని అడ్డంగా పెట్టి రిస్క్ చేయడం చాలా ప్రశసించదగ్గ విషయం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: టీ పొడి వ్యాపారం చేద్దామనుకోవడమే వారిపాలిట శాపమైంది.. అదిరిపోయే ట్విస్ట్!!..) Man sacrifices his car to save another driver who was unconscious.. Via @RTVNunspeet pic.twitter.com/drgac0UDez — Buitengebieden (@buitengebieden_) November 21, 2021 -
‘దేవుడి అనుగ్రహం కలగాలంటే బిడ్డను బలివ్వాల్సిందే’
న్యూఢిల్లీ: డాక్టర్లు, సైంటిస్టులు కన్నా బాబాలు, సాధువులపైనే మన జనాలకు నమ్మకం ఎక్కువ. వారు చెప్తే ఎలాంటి కష్టమైన పని అయినా సరే చేస్తారు. ఇందుకు ఉదాహరణగా నిలిచే ఘటనలు కోకొల్లలు. తాజాగా ఇదే కోవకు చెందిన సంఘటన ఒకటి దేశ రాజధానిలో చోటు చేసుకుంది. తనకు బిడ్డలు పుట్టడం లేదనే బాధతో ఓ మహిళ సాధువును సందర్శించింది. అతడి మాటలు నమ్మి.. తన పక్కింట్లో ఉన్న మూడేళ్ల చిన్నారిని బలి ఇచ్చింది. ఆ తర్వాత మృత దేహాన్ని బ్యాగులో కుక్కి పక్కింటి మేడ మీద పడేసింది. చిన్నారి తల్లిదండ్రులు తమ పిల్లాడు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఢిల్లీకి చెందిన నీలం గుప్తకు 2013లో వివాహం అయ్యింది. కానీ ఇప్పటి వరకు సంతానం కలగలేదు. ఈ క్రమంలో అత్తింటివారు.. బంధువులు నీలం గుప్తను సూటి పోటీ మాటలతో హింసిచేవారు. ఈ బాధ తట్టుకోలేక నీలం గుప్త ఓ సాధువును ఆశ్రయించింది. అతడు ‘‘దేవుడు నీ మీద ఆగ్రహంగా ఉన్నాడు.. అందుకే నీకు ఇంకా బిడ్డలు కలగలేదు. దేవుడికి కోపం తగ్గి.. నీకు బిడ్డలు కలగాలంటే ఓ పిల్లాడిని బలి ఇవ్వాలి’’ అని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన నీలం గుప్త తన ఇంటి పక్కన ఉంటున్న మూడేళ్ల చిన్నారిని బలి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తన ఇంటి మేడ మీద ఆడుకుంటున్న చిన్నారికి మాయ మాటలు చెప్పి.. తన ఇంట్లోకి తీసుకెళ్లి చంపేసింది. ఆ తర్వాత బాలుడి శవాన్ని బ్యాగులో కుక్కి ఎదురింటి మేడ మీద పడేసింది. తమ బిడ్డ కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ క్రమంలో వారికి నీలం ఎదురింటి మీద బ్యాగ్ కనిపించింది. తెరిచి చూడగా.. దానిలో చిన్నారి మృతదేహం ఉంది. ఈ క్రమంలో బాలుడి కుటుంబ సభ్యులను, చుట్టు పక్కల వారిని ప్రశ్నించగా.. నీలం పేరు వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెను విచారించగా.. ‘‘బిడ్డను బలి ఇస్తే నాకు సంతానం కలుగుతుందని సాధువు తెలిపాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి చిన్నారి మా ఇంటి మేడ మీద ఆడుకోవడం చూశాను. తనను తీసుకెళ్లి దేవుడికి బలి ఇచ్చాను. పిల్లలు లేరనే బాధతోనే ఇలా చేశాను’’ అని చెప్పుకొచ్చింది. పోలీసులు నీలంను అరెస్ట్ చేశారు. చదవండి: ఆస్పత్రి నుంచి పారిపోయి.. శవమై తేలాడు -
షాకింగ్ : అల్లాకోసం కన్న కొడుకు ‘బలి’
తిరువనంతపురం : మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలిచిన చిత్తూరు జిల్లా మదనపల్లె అమానుష ఘటనను పోలిన తాజా ఉదంతమొకటి కలకలం రేపుతోంది. అల్లా దయ కోసం కన్నబిడ్డనే బలి ఇచ్చిన ఘటన కేరళ పాలక్కాడ్ జిల్లాలోని పులక్కాడ్‌లో వెలుగు చూసింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 30 ఏళ్ల షాహిదా, తన ఆరేళ్ల కుమారుడు అమీల్ ను అల్లా కోసం గోంతు కోసి మరీ హత్య చేసింది. శనివారం రాత్రి సులేమాన్ పెద్ద పిల్లలు ఇద్దరితో ఒక గదిలో పడుకోగా, చిన్నవాడైన ఆదిల్‌తో మరో గదిలో పడుకుంది షాహినా. ఇంతలో ఏమైందో ఏమోగానీ, తెల్లవారుజామున పిల్లవాడిని బాత్ రూం లోకి తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టేసి పదునైన కత్తితో గొంతుకోసి హతమార్చింది. ఆ తరువాత అల్లా కోసమే తన కుమారుడిని చంపానంటూ స్వయంగా పోలీసులకు సమాచారం అందించింది. తాము వచ్చేదాకా ఆమె గేటు దగ్గర నిలబడి ఎదురు చూస్తోందని పోలీసులు తెలిపారు. దీనికి తోడు పోలీస్ స్టేషన్ నంబర్‌ను సంఘటనకు ముందురోజే పొరుగువారి నుంచి షాహిదా సేకరించినట్టు కూడా విచారణలో వెల్లడైందన్నారు. షాహిదా చేతికి గాయం కావడంతో పాటు ఈ హత్య విషయం పక్క గదిలోనే ఉన్న సులేమాన్‌కు తెలియకపోవడం అనుమానానికి దారితీస్తోందన్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాత మాత్రమే నిజానిజాలను నిర్ధారించగలమని పాలక్కాడ్ పోలీసు సూపరింటెండెంట్, విశ్వనాధ్ చెప్పారు. ఆమెను అదుపులోకి తీసుకుని, హత్య కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసును మానసిక కోణంలో కూడా విచారిస్తున్నామన్నారు. కాగా పాలక్కాడ్‌కు చెందిన సులేమాన్, షాహీద్ భార్యా భర్తలు. గతంలో గల్ఫ్‌లో పనిచేసిన ప్రస్తుతం సులేమాన్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. షాహిదా దగ్గర్లోని మదర్సాలో టీచర్‌గా పనిచేస్తోంది. వీరికి ముగ్గురు సంతానం. అమీల్ మూడవ వాడు. ప్రస్తుతం షాహిదా మూడు నెలల గర్భవతి. -
కరోనా విలయం : ఈమె త్యాగం మహోన్నతం
కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రపంచమంతా వణికిపోతోంది. ఈ మహమ్మారి కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో వేలమంది ప్రాణాలు కోల్పోగా, లక్షలమంది ఈ వైరస్ బారిన పడ్డాయి. అయితే ఇంతటి మహా విలయంలో ఒక పెద్దావిడ అపూర్వమైన త్యాగం చేశారు. వైరసె సోకి ఆరోగ్యం విషమించిన పరిస్థితుల్లో కూడా తనకు వెంటిలేటర్ వద్దని నిరాకరించారు. తనకు బదులుగా తనకంటే వయసులో చిన్న వారికి దాన్ని ఉపయోగించమని చెప్పారు. చివరకు కరోనా కాటుకు బలైపోయారు. బెల్జియంకు చెందిన సుజాన్ హోయలార్ట్స్(90) ఈ మహమ్మారి బారిన పడ్డారు. వ్యాధి ముదరడంతో ఆకలి మందగించడంతోపాటు, శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆమెకు వెంటిలేటర్ అమర్చేందుకు వైద్యులు సిద్ధపడ్డారు. ఇక్కడే ఆమె పెద్దమనసును చాటుకున్నారు. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఆమె తనకు కృత్రిమ శ్వాసక్రియను ఉపయోగించడం ఇష్టం లేదనీ, ఇప్పటికే చాలా మంచి జీవితాన్ని గడిపాను కనుక తనకు ఉపయోగించే ఆ పరికరాన్ని వేరే ఎవరైనా చిన్న వయసున్న రోగులకు ఉపయోగించండి అని వైద్యులతో చెప్పారు. దురదృష్టవశాత్తు ఆ తరువాత కొన్ని రోజులకే ఆమె కన్నుమూశారు. దీంతో ఆమె త్యాగం మరువలేనిదంటూ ఆమెకు చికిత్స అందించిన వైద్యులు సహా పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా పంచవ్యాప్తంగా ప్రస్తుతం 8,56,579పాజిటివ్ కేసులు నమోదు కాగా, 42,089 మంది మృతి చెందారు. ఈ మహమ్మారికి కచ్చితమైన మందు, వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో రాకపోవడం మరింత ఆందోళన పుట్టిస్తోది. దీనికితోడు వేగంగా పెరుగుతున్న రోగుల సంఖ్య కారణంగా చాలా ప్రాంతాల్లో వెంటిలేటర్ల కొరత వేధిస్తోంది. చదవండి : అమెరికాను వణికించిన భూకంపం -
అతీంద్రీయ శక్తులు చెప్పాయని.. అత్యంత కిరాతకంగా
ముంబై: ‘నీకు ఎవరో చేతబడి చేశారు. అందుకే నీ జీవితంలో ఇన్ని కష్టాలు. ఈ కడగళ్లు తీరాలంటే.. కవలల్ని బలి ఇవ్వు. అప్పుడు జీవితం నువ్వు కోరినట్లు మారుతుంది’ ఈ వ్యాఖ్యలు పదే పదే చుగాని చెవుల్లో మారుమోగుతున్నాయి. అవును అతీంద్రీయ శక్తులు చెప్పింది నిజమే. నాకు చేతబడి చేశారు. అందుకే ఈ కష్టాలు. ఇవి తీరాలంటే కవలల్ని బలి ఇవ్వాలి. నా చుట్టుపక్కల, తెలిసిన వారిలో ఎవరికి కవల పిల్లలు ఉన్నారు. ఆ గుర్తుచ్చొంది. నా స్నేహితుడి ప్రేమ్‌కు ఇద్దరు కవల పిల్లలే కదా. వారిని చంపేస్తే.. నా సమస్యలు తీరిపోతాయి.. ఇలా రాసుకొచ్చాడు అనిల్ చుగాని అనే వ్యక్తి తన డైరీలో. నాలుగు రోజుల క్రితం ముంబై కొలబా ప్రాంతంలో మూడేళ్ల చిన్నారిని ఏడో అంతస్తు నుంచి కిందకు విసిరేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడిన అనిల్ చుగాని స్వయంగా తానే పోలీసులకు లొంగిపోయాడు. విచారణలో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెల్లడించాడు. ఆ వివరాలు.. ముంబైకి చెందిన చుగాని మొరాకోలో ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. ప్రతి ఏడాది రెండు నెలల పాటు ఇండియాకు వచ్చే వాడు. కానీ ఈ సారి వచ్చి.. ఇక్కడే ఉండి పోయాడు. అయితే భారత్‌కు వచ్చే ముందు చుగానితో పాటు పని చేసే ఓ స్నేహితురాలు ఒకామె అతడికి చేతబడి చేశారని.. అందుకే అతన్ని సమస్యలు చుట్టుముట్టాయని తెలిపింది. కవలల్ని బలి ఇస్తే ఈ సమస్యలు తీరతాయని కూడా చెప్పింది. ఆమె మాటలు చుగాని మీద తీవ్ర ప్రభావం చూపాయి. ఇండియా వచ్చిన తర్వాత కూడా దీని గురించే ఆలోచించడం ప్రారంభించాడు చుగాని. ఈ క్రమంలో అతీంద్రీయ శక్తులు కూడా తనతో ఇదే విషయాన్ని చెప్పాయని డైరీలో రాసుకున్నాడు చుగాని. ఇక అప్పటి నుంచి కవలల కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతడికి తన స్నేహితుడు ప్రేమ్ కవల పిల్లలు శ్రేయ, సన్యలు కనిపించారు. దాంతో వీరిద్దరిని చంపాలని భావించాడు చుగాని. ఈ ఏడాది మే నెల నుంచి వారిని చంపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో గత శనివారం రాత్రి చుగాని, ప్రేమ్ కుటుంబాన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. కాసేపు అతని పిల్లలతో ఆడుకుంటానని కోరాడు. దాంతో ప్రేమ్ తల్లి పిల్లలను తీసుకుని చుగాని ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన చుగాని తన ఇంటికి వచ్చిన పిల్లలకు భోజనం పెట్టి చేతులు శుభ్రం చేసే నెపంతో ఓ చిన్నారిని తీసుకెళ్లి తన ఇంటి నుంచి అనగా ఏడో అంతస్తు కిటికి నుంచి కిందకు పడేశాడు. మరో చిన్నారిని కూడా చంపడానికి ప్రయత్నించాడు. కానీ చిన్నారుల నానమ్మ ఆ పాపతో పాటే ఉండటంతో కుదరలేదు. చిన్నారి పై నుంచి కిందపడటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చుగానిని అరెస్ట్ చేశారు. పోలీసులను చూసిన చుగాని ఏ మాత్రం కంగారు పడకుండా చిన్నారిని తానే చంపానని ఒప్పుకోవడమే కాక ఇలా చేసినందుకు తనను అరెస్ట్ చేస్తారని తెలుసని పేర్కొన్నాడు. జైలుకు వెళ్లినప్పటికి తన సమస్యలు పరిష్కారం అవుతాయని చుగాని పోలీసులకు తెలిపాడు. -
జీసస్ మహా త్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే
సాక్షి, హైదరాబాద్: జీసస్ మహా త్యాగానికి గుర్తు గుడ్ ప్రైడే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘కరుణామయుడైన ఏసు ప్రభువును సిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తర్వాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజూ.. మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలన్నారు. ‘ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం’ అని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. -
నా స్థానాన్ని త్యాగం చేస్తా: రేణుకాచౌదరి
సాక్షి, న్యూఢిల్లీ: కష్టకాలంలో కాంగ్రెస్‌కు అండ గా ఉండి ఎంతో శ్రమిం చిన వారికి న్యాయం చేసేందుకు అవసరమైతే తన స్థానాన్ని త్యాగం చేస్తానని మాజీ ఎంపీ రేణుకాచౌదరి అన్నారు. గురువారం ఆమె ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీని భుజాల మీద మోసిన వారికి న్యాయం జరగడం ముఖ్యమని, దానికి సీనియర్లు త్యాగం చేయాల్సిన అవసరం ఉందని కమిటీకి నివేదించినట్లు తెలిపారు. తాను త్యాగాలకు సిద్ధంగా ఉన్నానని, పార్టీ గెలుపు కోసం శ్రమిస్తానని చెప్పారు. -
క్షుద్ర పూజలు అబద్ధం
నూజివీడు : మండలంలోని సుంకొల్లు పరిధిలోని తోటలలో క్షుద్ర పూజలు నిర్వహించడంతో పాటు నరబలి ఇవ్వడానికి ప్రయత్నించారంటూ ముసునూరుకు చెందిన చిన్నం ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణల నేపథ్యంలో శనివారం పోలీసు, రెవెన్యూ అధికారులు విచారణ నిర్వహించారు. సీఐ మేదర రామ్‌కుమార్, పట్టణ, రూరల్ ఎస్ఐ చెదరబోయిన రంజిత్‌కుమార్, మేడిబోయిన చిరంజీవిలతో పాటు తహసీల్దారు గుడిశే విక్టర్‌బాబు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దీనిలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జోరిగే రాంప్రసాద్‌ను అతని తోటలోకి తీసుకెళ్లి అక్కడి ప్రాంతాలను పరిశీలించడంతో పాటు తోటలో కాపలా ఉంటున్న వృద్ధ దంపతులను జరిగిన విషయమై విచారించారు. ఆరోపణల్లో నిజం లేదు.. అనంతరం పట్టణంలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ రామ్‌కుమార్, తహసీల్దారు విక్టర్‌బాబు మాట్లాడారు. క్షుద్ర పూజలు, నరబలి ఇవ్వడానికి ప్రయత్నించారని వస్తున్న వదంతులు, ఆరోపణలు అవాస్తమన్నారు. అమ్మవారి గుడి నిర్మించడానికి గాను గురు పౌర్ణమి రోజున జొరిగే రాంప్రసాద్ ఏడుగురు వ్యక్తులను, చిన్నం ప్రవీణ్‌ను తీసుకెళ్లడం జరిగిందన్నారు. వెళ్తూ దారిలోనే ఉన్న గంగానమ్మ గుడి వద్ద పూజలు చేశారని చెప్పారు. గ్రామస్తులు ఎవరైనా పొలాల్లోకి వెళ్లేటప్పుడు అక్కడ పూజలు చేయడం, మొక్కుకోవడం, ముడుపులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. అనంతరం తోటలోకి వెళ్లిన తర్వాత ప్రవీణ్ వృద్ధుల పాక వద్దకు వెళ్లి డబ్బా తీసుకుని బహిర్భూమికని వెళ్లి తిరిగి రాలేదన్నారు. అతను బహిర్భూమికి వెళ్లేటప్పుడు అతని వెంట ఎవరూ పడలేదని, మిగిలిన వ్యక్తుల వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవని దర్యాప్తులో తేలిందన్నారు. ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని, ఎక్కడైనా జరుగుతున్నట్లుగా చూసినట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలెవరూ భయపడాల్సిన పనే లేదన్నారు. అయితే ప్రవీణ్‌కుమార్ నరబలి ఇవ్వడం కోసం క్షుద్ర పూజలు నిర్వహించారంటూ ఎందుకు చెప్తున్నాడో, దీని వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా తదితర విషయాలపై దర్యాప్తు నిర్వహిస్తామని చెప్పారు. వారితో నాకు ప్రాణభయం ఉంది క్షుద్ర పూజల ఆరోపణలతో తప్పించుకున్న యువకుడి మొర ముసునూరు (నూజివీడు) : చంద్రగ్రహణం రోజు నరబలి ఇస్తే శుభాలు కలుగుతాయనే మూఢ నమ్మకంతో అమాయకుడైన యువకుడిని బలి చేయడానికి యత్నించారనే విషయంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నూజివీడు మండలం యనమదల పరిసర అడవుల్లోకి జొరిగే రాంప్రసాద్, పామర్తి సాయి అనేవారు శుక్రవారం తనను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని వెళ్ళి అక్కడ క్షుద్ర పూజలు చేసి, కత్తులతో తనపై దాడికి యత్నించారని ముసునూరుకు చెందిన చిన్నం ప్రవీణ్ విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు శనివారం సాయంత్రం స్థానిక దళితవాడకు చెందిన పెద్దలు, యువకులతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. తన యజమాని రాంప్రసాద్ పిలవడంతో వెళ్లానని, కానీ యనమదల అడవుల్లోకి వెళ్లాక అక్కడ మరికొందరు క్షుద్ర పూజారులు ఉండడంతో భయంతో వారి బారి నుంచి తప్పించుకుని నూజివీడు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వాపోయాడు. ఈ విషయాన్ని పోలీసులు తేలికగా కొట్టిపారవేస్తూ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడంతో ఆ వ్యవస్థపై తనకు నమ్మకం పోయిందని, మీరే న్యాయం జరిగేలా చూడాలంటూ విలేకర్లను బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు. తమకు సరైన న్యాయం జరగక పోతే విషయాన్ని జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాలు, నిరాహార దీక్షలు చేపడతామని కుటుంబ సభ్యులు తెలిపారు. -
యేసు బోధలు ఆచరణలోనే అర్థమవుతాయి
పలాయనవాదం యేసుక్రీస్తు విధానం కానే కాదు. లేకపోతే ప్రమాదం పొంచి ఉన్న చోటికి ఎవరైనా వెళ్లాలనుకుంటారా? చూస్తూ, చూస్తూ పులి బోనులో ఎవరైనా కాలు పెడతారా? యేసు ప్రభువయితే అదే చేశాడు. తన సొంతప్రాంతమైన గలిలయను వదిలేసి 200 కిలోమీటర్ల దూరంలోని యెరూషలేముకు వెళ్లాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నాడు (లూకా 9:52). చాందస యూదుల నాయకత్వంలో యెరూషలేము యేసుప్రభువు పట్ల పగ, ద్వేషం, కోపంతో రగిలిపోతోంది. ఆయన్ను సిలువవేసి పగతీర్చుకోవడానికి రంగమంతా సిద్ధమైంది. గలిలయ ప్రాంతంలో ఆయన్ను సవాలు చేసేవారే లేరు. అందువల్ల యెరూషలేముకెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే, గలిలయలోనే కడుపులో చల్ల కదలకుండా ఉండి బోలెడు పరిచర్య చేస్తానని యేసుక్రీస్తు అనుకోవచ్చు. ‘రిస్క్’ తీసుకోవడమనేది లోకం దృష్టిలో చాలా తెలివి తక్కువ పని. వీలైతే మనకోసం ఇతరులను ‘రిస్క్’లో పడేయడం అనేది ఎంతో తెలివైన పని కూడా. దీనికి కొద్దిరోజుల క్రితమే, తనను వెంబడించాలనుకునే వారు తమ సిలువనెత్తుకొని తనను వెంబడించాలని, తమ ప్రాణాన్ని రక్షించుకోవాలనుకొనేవారు దాన్ని పోగొట్టుకుంటారని, ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డవారు దాన్ని కాపాడుకోగలుగుతారని ప్రభువు బోధించాడు (లూకా 9:23,24). అవతలివాళ్ళ ప్రాణాలు తియ్యడం, వారిని బాధించడం హింస అని, అలా ఇతరుల జోలికి పోకపోవడం అహింస అని లోకం నిర్వచించింది. ఆ నిర్వచనాన్నే యేసు మరో మెట్టుపైకి తీసుకెళ్లి, ఇతరులను బాధించకపోవడం, వారి జోలికి పోకపోవడం కాదు, ఇతరుల కోసం ప్రాణత్యాగం చెయ్యడమే నిజమైన ‘అహింస’ అని బోధించడమే కాదు, ఆచరణలో ఆ ‘అహింస’ ను తన జీవితంలో నిరూపించాడు. ‘మరణం’ పట్ల లోకానికున్న తప్పుడు అభిప్రాయాలన్నింటినీ యేసుప్రభువు తన బోధల్లో కొట్టిపారేస్తూ మరణానికి కూడా ఆయన సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు.‘గోధుమగింజ భూమిలో పడి చనిపోకపోతే అది ఒంటరిదే. కానీ అది భూమిలో చనిపోతే విస్తారంగా ఫలిస్తుంది’ అని మరణాన్ని పునర్నిర్వచించి సిలువలో ఆయనే మరణించడం ద్వారా క్రైస్తవం రూపంలో ఆయన విస్తారంగా ఫలించాడు. యేసు అనుచరులు ఆయన జీవించినట్టుగా జీవిస్తేనే యేసుక్రీస్తు చేసిన ఈ బోధలు లోకానికి చేరుతాయి, అర్థమవుతాయి. యేసుక్రీస్తు బోధల లోతు, ప్రత్యేకత, కొత్తదనం నోటిమాటలతో కాదు, జీవితంలో ఆచరణరూపంలో మాత్రమే లోకానికి అర్ధమవుతుంది. అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల నుండి అక్కడి సౌఖ్యాలు, అత్యున్నత ప్రమాణాలతో కూడిన జీవన శైలిని త్యాగం చేసి ఇండియాకొచ్చి ఇక్కడి నిరుపేదలతో కలిసి బతికి అంటువ్యాధులు, అపరిశుభ్రత, పేదరికంలో భాగం జీవించిన క్రైస్తవ మిషనరీల జీవనవిధానంలో అందుకే యేసుక్రీస్తు బోధల్లోని అహింస, ప్రేమ పరిమళించింది. వాళ్ళ జీవితం, మరణం కూడా విస్తారంగా ఫలించడానికి కారణమైంది. ప్రేమతో, త్యాగంతో, సాహసంతో యేసులాగా జీవించలేకపోతే, యేసు లాగా మరణించలేరు. యేసుప్రభువులాగా మరణించకపోతే ఆయనలాగా ఫలించలేరు. ఆధునిక చర్చి, క్రైస్తవం ఈ రహస్యాన్ని అర్ధం చేసుకోవడంలో వెనకబడింది. ఫలితంగా పవిత్రత, త్యాగం, నిరుపేదల పట్ల ప్రేమ, పారదర్శకత లోపించి విలాసాలు, తీరని ధనకాంక్ష, డిజైనర్ వస్త్రాలు, ఖరీదైన కార్లు, ఆడంబరాలు అనే ‘చెరసాల’లో బందీ అయింది ఈనాటి క్రైస్తవం!! చరిత్రలో మతమే దేవునికి బద్ధ శత్రువుగా మారిన చీకటి రోజుల్లో ప్రతిసారీ ఇదే జరిగింది. దేవుని కన్నా పూజారి లేదా పాస్టర్, దేవుని పవిత్ర బోధలకన్నా, మధ్యవర్తులు కల్పించిన ఆచారవ్యవహారాలే మిన్నగా మారిన మతమే ప్రజలకు ప్రాముఖ్యమైనపుడు సమాజంలోని నిరుపేదలు, అభాగ్యులు తీవ్రంగా నష్టపోయారు. దేవుణ్ణి వెనక్కి నెట్టి మతం ముందుకు దూసుకెళ్తున్న అత్యంత విషాదకరమైన ఇలాంటి నేపథ్యంలోనే, యేసు తన జీవితం ద్వారా, దేవుని నిష్కళంకమైన ప్రేమను బయలుపర్చి బలహీనులు, నిరుపేదలు, సామాన్యులకు చేరువయ్యాడు, మతపెద్దలకు బద్ధశత్రువయ్యాడు. ఇదంతా తెలిసి కూడా ఆయన యెరూషలేముకు వెళ్ళాడు. నేడు క్రైస్తవం ముందున్న కర్తవ్యం కూడా ముందుకు వెళ్లడమే, తనను సంస్కరించుకొని దేవునికోసం విస్తారంగా ఫలించడమే. – రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ -
‘బక్రీద్ బలులు’ వద్దంటే ఎలా ?
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ముస్లింల బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని జంతు బలికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని సాగించాలని భారతీయ జంతు సంక్షేమ బోర్డు (ఏడబ్లూబీఐ) నిర్ణయించింది. జంతు బలిని నియత్రించేందుకు జంతువుల క్రూరత్వ నిరోధక చట్టాన్ని అమలు చేయాలని, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లాలని నిర్ణయించింది. జంతువులను బలివ్వడం మతపరమైన చర్య కాదని, ఏ మతం పేరిట కూడా జంతువులను బలివ్వడానికి వీల్లేదని బోర్డు చైర్మన్ ఎస్పీ గుప్తా వ్యాఖ్యానించారు. ఆయన్ని చట్టం గురించి తెలియని అజ్ఞాని అనుకోవాలా, ఓ మతాన్ని లక్ష్యం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్న మూర్ఖుడు అనుకోవాలా? అర్థం కావడం లేదు. బక్రీద్ సందర్భంగా ముస్లింలు గొర్రెలను, మేకలను బలిస్తారనే విషయం తెల్సిందే. ఈ ఆచారం ఓ ముస్లింల మతానికే పరిమితం కాలేదు. హిందూ మతం పేరిట కూడా ఈ ఆచారం అమల్లో ఉంది. మైసమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ లాంటి గ్రామ దేవతల పేరుతోనే కాకుండా దేశంలోని పలు హిందూ దేవాలయాల్లో రోజుకు వేలాది జంతువులను బలిస్తుంటారు. అందుకనే జంతువుల క్రూరత్వ నిరోధక బిల్లులోని 28 సెక్షన్ ఇలాంటి జంతు బలులకు మినహాయింపు ఇచ్చింది. ‘ఓ సామాజిక వర్గం వారి మతాచారం ప్రకారం అవసరమైన జంతు బలి ఇవ్వడాన్ని నేరంగా పరిగణించాలని ఈ చట్టంలోని ఏ అంశం కూడా సూచించడం లేదు’ అని చట్టంలోని 28వ సెక్షన్ చెబుతోంది. అంతేకాకుండా ఏ మతానికైనా ఆచారాలు ముఖ్యమని, రాజ్యాంగంలోని 25వ అధికరణ కింద మత విశ్వాశాలకు స్వేచ్ఛ ఉన్నందున మతాచారాల్లో జోక్యం చేసుకునే అధికారం ఏ కోర్టుకు లేదంటూ సుప్రీం కోర్టు పలుసార్లు తీర్పు చెప్పింది. ఈ లెక్కన మతాచార జంతు బలులకు సంబంధించి కోర్టులకెళ్లే అధికారం లేదా హక్కు జంతు సంక్షేమం బోర్డుకు లేదు. అయితే జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం, ఆహార భద్రతా ప్రమాణాల చట్టం కింద దేశంలో జంతు బలులను క్రమబద్ధీకరించవచ్చు. లైసెన్స్‌లున్న కబేళాలలో మాత్రమే జంతువులను వధించాలనడంతోపాటు వధించేటప్పుడు జంతువులకు నొప్పి తెలియకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చట్టాల్లో మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో, వీధుల్లో జంతువులను బలివ్వరాదు. దీనర్థం కబేళాల్లోనే జంతువులను బలివ్వాలి. అలాగే దేవాలయాల వద్ద కూడా బలివ్వ వచ్చు. దేశవ్యాప్తంగా 1700 కోట్ల కబేళాలు మాత్రమే ఉన్నాయని గతేడాది ప్రభుత్వమే లోక్‌సభకు తెలియజేసింది. 130 కోట్ల జనాభా కలిగిన దేశానికి ఇవేమాత్రం సరిపోవు. అందుకే బహిరంగ ప్రదేశాల్లో జంతువులను బలిస్తుంటారు. జంతు బలులను క్రమబద్దీకరించాలనుకుంటే జంతు సంక్షేమ బోర్డు ముందుగా కబేళాల పెంపునకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. దానికి బదులుగా జంతు బలులను నియంత్రిస్తామంటే ఓ మతాన్ని లక్ష్యంగా పెట్టుకొని మాట్లాడడమే అవుతోంది. మరో రెండు నెలల్లో అంటే, ఆగస్టు 21న బక్రీద్ వస్తుందనగా నిర్ణయం తీసుకోవడమంటే మరెట్లా అర్థం చేసుకోవాలి! బక్రీద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలిగేలా, రోడ్లపైన, ఇతర బహిరంగ ప్రదేశాల్లో జంతు బలులు ఇవ్వరాదని ముస్లిం మత పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది. -
దేవుడు అడిగాడు.. కొడుకును బలిచ్చాను!
లండన్ : తాగిన మైకంలో 18 నెలల కొడుకును దేవుడికి బలి ఇచ్చిందో తల్లి. ఈ సంఘటన ఇంగ్లండ్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెస్ట్ యార్క్‌షైర్‌కు చెందిన జెమ్మా ప్రొక్టర్ తల్లి డెబోరాతో పాటు ముగ్గురు బిడ్డలతో బార్కెరెండ్‌లో ఓ అపార్ట్మెంట్లో నివాసముంటోంది. గత కొన్నేళ్లుగా ఆమె ‘‘పారానోయిడ్ స్కిజోఫ్రెనియా’’ అనే మానసిక వ్యాధితో బాధపడుతోంది. జెమ్మా తన 16వ ఏట నుంచే మద్యానికి బానిసవ్వటమే కాకుండా గంజాయి సైతం విపరీతంగా తీసుకునేది. గత కొద్ది రోజుల నుంచి దేవుడు తనతో మాట్లాడుతున్నాడని అందరితోనూ చెప్పేది. కొద్ది నెలలుగా విచిత్రంగా నడుచుకోవటమే కాకుండా క్రూరంగా ప్రవర్తించేది. అప్పటి వరకూ ఎప్పుడూ లేని విధంగా మత సంబంధ ప్రదేశాలకు ఎక్కువగా వెళ్లేది. ఓ రోజు ఎర్రటి దుస్తులు ధరించి నృత్యం చేస్తూ ఇంటి చుట్టూ తిరిగింది. ఆ తర్వాత తల్లి ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉన్న సమయంలో 18నెలల కొడుకును ఆరవ అంతస్తులోని తన ఇంటి కిటికీలో నుంచి కిందకు విసిరేసింది. సమాచారం అందుకున్న పోలీసులు జెమ్మాను అదుపులోకి తీసుకుని విచారించగా కొన్ని విస్తుగొలిపే విషయాలను వెల్లడించింది. జెమ్మా మాట్లాడుతూ.. తనతో దేవుడు రోజూ మాట్లాడేవాడని, పిల్లాడిని బలి ఇవ్వాలని అడిగే వాడని తెలిపింది. పిల్లాడు చాలా సంతోషంగా ఉన్నాడని.. ఎందుకంటే అతడు దేవుడి దగ్గరికి వెళ్లిపోయాడని పేర్కొంది. -
ఆ ముందురోజు అలా ఎందుకు మాట్లాడాడో
సిటీలో మన జీవితాలు సౌకర్యంగా ఉండటానికి ఎంతోమందిపగలూ రాత్రి పని చేస్తుంటారు... ఎండలో వానలో చలిలో పని చేస్తుంటారు.మనకి వాళ్లందరు అనామకులుకానీ వాళ్లకీ ఒక ఇల్లూ కుటుంబం మమతలూ మమకారాలూ ఉంటాయి.త్యాగంలో పెద్దాచిన్నా ఉండదేమో. ఒక జవాను ప్రాణానికి ఎంత విలువ ఉంటుందో ఈ ప్రాణానికీ అంత విలువ ఉంటుంది. కార్వాన్ సత్యనారాయణపురంలోని ఆ ఇరుకు గల్లీలో ఆ రెండు గదుల రేకుల ఇంట్లో కరెంటు లేదు. లైటు వెలుగుతూ ఉంది. ఫ్యాన్ తిరుగుతూ ఉంది. కాని కరెంటు లేదు. అవును... ఆ ఇంటికి విద్యుత్తు వంటి, ప్రాణ ప్రవాహం లాంటి మగదిక్కు పది రోజుల క్రితం తన వృత్తికి తన ప్రాణం అర్పించాడు. నిన్న వరకూ ఉన్న మనిషి ఇవాళ లేడంటే ఆ ఇల్లాలి పరిస్థితి ఏమిటి? పిల్లల పరిస్థితి ఏమిటి? ఆ వెలితి పూడే మాట ఏమిటి?‘నమస్తే’ అంది ఒక రకమైన బిడియంతో సంగీత. ఆమె పూర్తి పేరు పోగుల సంగీత. భర్త పేరు పోగుల భూమయ్య. నలభై లోపు వయసు. ఇప్పుడు లేడు. చనిపోయాడు.‘సైనికులు చనిపోతే గొప్ప పేరొస్తుంది. పోలీసులు చనిపోతే కూడా గొప్ప పేరొస్తుంది. మా ఆయన కరెంట్ మనిషి. కరెంటు మనిషి చనిపోతే ఎక్కడైనా పేరొస్తుందా?’ అందామె భర్తను తలుచుకుంటూ.ఏప్రిల్ 3, 2018న భూమయ్య చనిపోయాడు. కరెంట్ పోల్ మీద అక్కడికక్కడే చనిపోయాడు. అతడు గన్‌ఫౌండ్రీ సెక్షన్‌లోని హైదరగూడ సబ్‌డివిజన్‌లో విద్యుత్ పంపిణీ సంస్థ కాంట్రాక్ట్ వర్కర్. అతడు చనిపోయిన సంగతి పత్రికలలో చిన్న వార్తగా వచ్చింది. దానిని ఎంతమంది చదివారో తెలియదు. ‘చూశారా మా ఇల్లు. ఆయన లేడు. పిల్లలు లేరు. ఒక ఆడదాని బతుక్కు ఇంతకు మించిన శాపం ఏముంది?’ అంది. ఆ క్షణంలో ఆమె గొంతు దు:ఖంతో వణికింది. సంగీతకు ఇద్దరు పిల్లలు. కొడుకు ఆకాశ్ 6వ తరగతి చదువుతున్నాడు. కుమార్తె వెన్నెల 4వ తరగతి చదువుతోంది. తండ్రి లేని ఇంట్లో వాళ్లు ఉండలేకపోతున్నారు. గాలి మార్పు కోసం వాళ్లను ఊరికి పంపింది సంగీత. ‘పెళ్లయ్యాక ఆయన వెంట నడిచా. ఇక్కడే ఉంటున్నాం. చనిపోయాక నష్టపరిహారం చెక్ ఇప్పించారు కార్మిక నాయకులు. అది చెల్లుబాటు కావాలంటే ఆధార్‌లో పేర్లు సరిగా ఉండాలట. నా పేరులో తప్పు ఉంది. దానిని మార్పించుకోవడానికి తిరుగుతున్నాను. అదెప్పుడవుతుందో’ అందామె.సిక్స్›్తసెన్స్ అంటుంటారు. మనిషి చనిపోయేముందు ఆ సంగతి తెలుస్తుందా? భూమయ్య రెండు నెలల క్రితమే ఆ రెండు గదుల ఇంట్లో భార్య చేత చిన్న కిరాణా షాపు పెట్టించాడు. అంటే కొంచెం ఉప్పు, చింతపండు, బిస్కెట్ ప్యాకెట్లు... ‘నాకొచ్చే పద్నాలుగు వేలు ఏం సరిపోతాయి. ఇలాంటి షాపుంటే నువ్వు బతకొచ్చు... నేను ఉన్నా లేకున్నా’ అన్నాడు. అప్పట్లో ఆ సంగతి సంగీత పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ చిన్న కిరాణా షాపును చూస్తుంటే ఆమెకు భర్తే గుర్తుకు వస్తున్నాడు. ముందురోజు రాత్రి.. ఒక మనిషితో ఎంత కాలం జీవించినా చనిపోయే ముందురోజు మాత్రం బాగా గుర్తుండిపోతుంది. ఆ రోజు పదే పదే గుర్తుకు వస్తుంటుంది. భర్త చివరిరోజు సంగీతకు బాగా గుర్తుంది.‘మా అమ్మాయి వెన్నెల అంటే ఆయనకు చాలా ఇష్టం. ఏం అడిగినా కాదనకుండా తెచ్చి ఇచ్చేవాడు. 2వ తారీఖు రాత్రి 9 గంటల ప్రాంతంలో వెన్నెలను ఒడిలోకి తీసుకుని కిందకు దించలేదు. సరదాగా గడుపుతూ ముద్దులాడాడు. డాడీ ఉన్నంత వరకు నీకు ఏమీ కాదురా.. నువ్వు పెద్ద చదువులు చదువుకుని పెద్ద ఉద్యోగం చెయ్యాలి అన్నాడు. నేను లేనప్పుడు అమ్మని విసిగించవద్దు, అమ్మ చెప్పినట్లు వినాలి సరేనా.. అంటూ ముద్దాడుతూ ఒట్టు ఏపించుకున్నాడు. డాడీ ఎక్కడ ఉన్నా మీతోనే ఉంటాడు.. మీరు మాత్రం అమ్మని ఏడిపించొద్దు అని పదే పదే అన్నాడు. ఎప్పుడూ లేనిది ఇయ్యాల ఆయనేంటీ కొత్తగా మాట్లాడుతున్నాడనుకున్నాను.మరుసటి రోజే దుర్వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా ఉహించలేకపోయాను’ బోరున విలపించింది సంగీత. ‘అమ్మా.. నాన్న ఏడమ్మా? నాన్న మళ్లీ రాడా..?? మొన్న మాతో కలసి అన్నం తిన్నాడు కదా..! మళ్లీ మనందరం అలా అన్నం ఎప్పుడు తింటామమ్మా అని పిల్లలు అంటుంటే వాళ్లకు ఎలా నచ్చజెప్పాలో అర్థం కాలేదు. వాళ్లకు తెలుసు వాళ్ల నాన్న చనిపోయాడు అని. కానీవాళ్లు అలా అడుగుతుంటే నా గుండె బరువెక్కిపోతోంది’ అంటున్న ఆమె కన్నీటి పాట ఎవరికీ వినిపించనిది. ఈ రణగొణ ధ్వనులలో ఎవరూ వినలేనిది. పని పిచ్చోడు ‘ఆయనకు పనంటే పిచ్చి. ఒక ఎండ లేదు, వాన లేదు, చలి లేదు. పండుగలప్పుడు కూడా ఇంట్లో ఉండేవాడు కాదు. కరెంట్ లేకపోతే మనం ఒక్క నిమిషం ఇంట్లో ఉండలేం కదా. వేరే వాళ్లు ఎలా ఉంటారు? నేను వెళ్లి వాళ్లకు కరెంట్ తెప్పిస్తే మన పేరు చెప్పుకుంటారు అని అంటుండేవాడు. వర్షాకాలంలో అయితే నాకు మెతుకు గొంతు దిగేది కాదు. రోజుకు మూడు డ్యూటీలు చేస్తున్నట్టుగా తిరిగేవాడు. వైర్లు తెగినాయంట అంటూ వెళ్లి పోయేవాడు. ఆయన క్షేమంగా ఇంటికి తిరిగొచ్చే వరకు నా గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉండేవి. ఎంత టైం అయినా సరే ఆయన ఇంటికి క్షేమంగా తిరిగొచ్చాకనే తిండి తినేదాన్ని. కరెంటు వాళ్లది కనపడని కష్టం’ అంది సంగీత. ఆ రోజు ఏం జరిగిందంటే... భూమయ్య తన తోటి ఉద్యోగి రంగారెడ్డితో డ్యూటీలో ఉన్నాడు. కింగ్‌కోఠి సమీపంలోని పర్దాగేట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీటర్ బిగించాల్సి ఉంది వెళ్దాం పదా అంటూ భూమయ్య బయలుదేరి వెళ్లాడు. స్తంబం పైకి ఎక్కి సర్వీస్ వైర్ కలుపుతున్నాడు. ఆ సమయంలో లెఫ్ట్‌సైడ్ సర్క్యూట్లో నుంచి కరెంట్ పాస్ అయ్యింది. క్షణాల్లో షాక్ తగిలింది. పోల్ మీద భూమయ్య శరీరం కంపించింది. సాయం అందించే సమయం లేదు. చూస్తుండగానే పోల్ మీదే మాడిపోయాడు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.‘ఆ రోజు ఆయన పనికి వెళ్లినప్పటి నుంచి మనసెందుకో కీడు శంకిస్తోంది. అయినా పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నా. పోలీసులు ఫోన్ చేసి ఆసుపత్రికి రమ్మనగానే గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏమైంది సారూ అని అడిగినా. ఏమీ కాలేదమ్మా.. నువ్వు ముందు ఆసుపత్రికి రా అన్నారు. భయం భయంతోనే ఆసుపత్రికి వెళ్లాను. వాళ్లు నన్ను వెంట పెట్టుకుని శవాలు ఉండే చోటుకు తీసికెళ్లారు. అక్కడ నా భర్త ప్రాణం లేకుండా పడి ఉన్నాడు’ అంది సంగీత. – చైతన్య వంపుగాని, సాక్షి ప్రతినిధి, హైదరాబాద్ -
డాబాపై చిన్నారి తల.. ఇద్దరి అరెస్టు
-
డాబాపై చిన్నారి తల.. ఇద్దరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ చిలుకానగర్‌లో రాజశేఖర్ అనే వ్యక్తి ఇంటిపై చిన్నారి తల దొరికిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. రాజశేఖర్ ఇంటి సమీపంలో క్షుద్రపూజలు జరిగినట్టు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో స్థానికంగా ఉంటున్న మెకానిక్ నరహరి ఇంటిలో క్షద్ర పూజలు జరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో నరహరి, అతని కొడుకు రంజిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రహణ సమయంలో పూజలు చేసి చిన్నారిని బలిచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. చిన్నారి మృతదేహం ఇంకా లభించలేదు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. ఉప్పల్ సర్కిల్ చిలుకానగర్ డివిజన్ పరిధిలోని మైసమ్మ దేవాలయం సమీపంలో నివసించే రాజశేఖర్ (35) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం కుటుంబమంతా మేడారం జాతరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయన అత్త బాలలక్ష్మి ఉతికిన బట్టలు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లారు. అక్కడ ఎవరో చిన్నారి తల కనబడటంతో వచ్చి కుటుంబీకులకు చెప్పారు. డాబాపైకి వెళ్లి చూసిన రాజశేఖర్.. వెంటనే ఉప్పల్ పోలీసులకు సమాచారమిచ్చారు. చిన్నారి తల దొరికిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. -
నగరంలో నరబలి?
-
డాబాపై చిన్నారి తల.. మొండెం ఆచూకీ లేదు..!
సాక్షి, హైదరాబాద్: ఓ డాబాపై మూడు నెలల చిన్నారి తల.. ఎవరో ముష్కరులు చిన్నారి తలను తెగ్గోసి అక్కడ పడేశారు.. మొండెం ఆచూకీ లేకుండా చేశారు.. ఇది జరిగింది బుధవారం.. పౌర్ణమి, సంపూర్ణ చంద్ర గ్రహణం కావడంతో నరబలిగా కలకలం. సమీపంలోని జనంలో భయాందోళన.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని చిలుకానగర్‌లో జరిగిన ఘటన ఇది. రాజశేఖర్ అనే ఓ క్యాబ్ డ్రైవర్ ఇంటి డాబాపై గురువారం ఉదయం చిన్నారి తలను గుర్తించారు. మొండెం ఆచూకీ లేకపోవడం, ఘటనా స్థలిలో పరిస్థితులను బట్టి ఇది నరబలి అయి ఉంటుందని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. మరోవైపు వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. డాబాపై తల కనిపించడంతో.. ఉప్పల్ సర్కిల్ చిలుకానగర్ డివిజన్ పరిధిలోని మైసమ్మ దేవాలయం సమీపంలో నివసించే రాజశేఖర్ (35) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం కుటుంబమంతా మేడారం జాతరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయన అత్త బాల లక్ష్మి ఉతికిన బట్టలు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లారు. అక్కడ ఎవరో చిన్నారి తల కనబడటంతో వచ్చి కుటుంబీకులకు చెప్పారు. డాబాపైకి వెళ్లి చూసిన రాజశేఖర్.. వెంటనే ఉప్పల్ పోలీసులకు సమాచారమిచ్చారు. చిన్నారి తల దొరికిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తతలు తలెత్తకుండా రాచకొండ జాయింట్ కమిషనర్ తరుణ్ జోషి సహా పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గ్రహణ సమయంలో బలి ఇచ్చారా? డాబాపై కనిపించిన తల మూడు నెలల చిన్నారిదిగా పోలీసులు భావిస్తున్నారు. అయితే మొండెం లభించకపోవడంతో ఆడపిల్లా, మగపిల్లాడా అన్నది తెలియలేదు. ప్రాథమికంగా లభించిన ఆధారాలు, రక్తం మరకలను బట్టి బుధవారమే హత్య జరిగి ఉంటుందని.. ఆ రోజున పౌర్ణమి, చంద్రగ్రహణం కూడా కావడంతో క్షుద్రపూజలు, నరబలి అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. డాబాపై తల ఉన్న పరిస్థితిని బట్టి ఎవరో తెచ్చి అక్కడ పెట్టి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. తలపై కుడిచెవి పూర్తిగా తెగిపోయి ఉందని, దవడపై కత్తి గాట్లు ఉన్నాయని గుర్తించారు. ఇవన్నీ నరబలి అనుమానాలకు బలాన్నిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక చిన్నారి మొండెం కోసం చుట్టుపక్కల ప్రాంతాలు, డ్రైనేజీలు, శ్మశాన వాటికల్లో గాలిస్తున్నారు. ] అక్కడికక్కడే తిరిగిన జాగిలాలు చిన్నారి మిస్సింగ్‌కు సంబంధించి ఉప్పల్ సహా చుట్టుపక్కల పోలీసుస్టేషన్లలో ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీంతో ఎవరైనా సంబంధీకులే ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇక పోలీసు జాగిలాలు కూడా చిన్నారి తల లభించిన డాబా పైనుంచి ఆ ఇంటి ముందుకు, ఎదురుగా ఉన్న నరహరి అనే వ్యక్తి ఇంటి వద్దకు తిరిగి రోడ్డు మీదకు వచ్చి ఆగాయి. అయితే ఈ రెండు ఇళ్లలోని ఓ ఇంట్లోని దేవుడి గది వరకూ జాగిలాలు వెళ్లినట్లు తెలిసింది. దీంతో క్షుద్రపూజల కోణంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ రెండు ఇళ్లతో పాటు సమీపంలోని మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ముమ్మర దర్యాప్తు చేస్తున్నాం ‘‘చిలుకానగర్‌లోని ఓ ఇంటిపై చిన్నారి తల లభించింది. దీనిపై హత్య కేసు నమోదు చేసి, ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం. నిందితులను గుర్తించి, పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి..’’ – ఉమా మహేశ్వరశర్మ, మల్కాజ్గిరి డీసీపీ ఉన్నత స్థాయి విచారణ జరగాలి ‘‘మూఢ నమ్మకాలతో పసిపిల్లల ఉసురు తీస్తున్నారు. చిలుకానగర్ ఘటన ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు కనబడుతోంది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి..’’ – అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు -
స్నేహానికి మీరిచ్చే స్థానం...?
సెల్ఫ్‌చెక్ స్నేహబంధం ఎంత మధురం... దేవుడే దిగివచ్చి ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు ఒకే నేస్తం చాలంటా!... ఆపదల్లో ఉన్నప్పుడు అయినవాళ్ల దగ్గరకు వెళ్లేకంటే స్నేహితుడి ఇంటికెళ్లటం మంచిదంటారు. ఇలా స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరికీ అన్ని బంధాలూ లేకపోయినా స్నేహబంధం మాత్రం కచ్చితంగా ఉంటుంది. స్నేహం కోసం దేన్నైనా త్యాగం చేసేవారు కొందరైతే, స్నేహం పేరిట వంచించేది కొందరు. నిజమైన స్నేహితుల మధ్య ఎలాంటి ఘర్షణలు వచ్చినా చివరికి ఒకటౌతారు. అదే స్నేహం గొప్పదనం. స్నేహానికి మీరెలాంటి స్థానం ఇస్తున్నారు? స్నేహాన్ని స్నేహంగా చూస్తున్నారా? మిత్రులతో మనస్ఫూర్తిగా మెలుగుతున్నారా? మీతో స్నేహం చేయటానికి అందరూ ఇష్టడుతున్నారా? 1. మీ స్నేహితుల పార్టీ (బర్త్‌డే, అభినందన సభ మొదలైనవి) జరుగుతుంటే ఆ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. ఎ. అవును బి. కాదు 2. మీ స్నేహితుల మధ్య ఏదైనా సమస్య వస్తే పెద్ద సీన్ చేస్తారు. ఎ. కాదు బి. అవును 3. మీ స్నేహితులు మిమ్మల్ని తరచుగా అభినందిస్తుంటారు. సర్ప్రైజ్ గిఫ్ట్‌లు మీకందుతుంటాయి. ఎ. అవును బి. కాదు 4. మీ వస్తువులను మీ ఫ్రెండ్స్ తీసుకుని వాటిని పోగొట్టినప్పుడు మీరు పెద్దగా ఫీలవ్వరు. వేరేవాటిని కొనటానికి సిద్ధపడతారు. ఎ.అవును బి. కాదు 5. మీరనుకున్న పని మీ స్నేహితులు చేయనప్పుడు, మీరనుకున్న ప్రణాళికను మార్చినప్పుడు వారిపై కోపగించుకుంటారు. మీరు చెప్పిందే జరగాలని పట్టుపడతారు. ఎ. కాదు బి. అవును 6. మీ స్నేహితులందరూ ఒకేమాట మీద ఉన్నప్పుడు, ఏదైనా కార్యక్రమాన్ని ప్లాన్ చేసినప్పుడు వారితో మీరూ ఏకీభవిస్తారు. ఎ. అవును బి. కాదు 7. మీ స్నేహితులందరికంటే మీరే గొప్పని వారితో వాదిస్తుంటారు. వారికేమీ తెలియదని అవహేళన చేస్తారు. ఎ. కాదు బి. అవును 8. మీ స్నేహితులు ప్రమాదాలు లేదా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి వెంట తప్పకుండా ఉంటారు. ఎ. అవును బి. కాదు 9. మీ అవసరాలప్పుడు స్నేహితులతో బాగా మాట్లాడుతూ అవసరం తీరాక ఇంకోలా ప్రవర్తిస్తారు. మీ అవసరాలు తీర్చడానికే మీ స్నేహితులున్నారనుకుంటారు. ఎ. కాదు బి. అవును 10. స్నేహితులంతా ఒకచోట చేరినప్పుడు మిమ్మల్ని సరదాగా కామెంట్ చేస్తే నొచ్చుకుంటారు. వారితో చాలారోజుల వరకు మాట్లాడరు. ఎ. కాదు బి. అవును ‘ఎ’ లు నాలుగు వస్తే మీరు స్నేహం చేయగలరు గాని మీ స్నేహానికి హద్దు ఉంటుంది. దాన్నుంచి బయటకు రాలేరు. ‘ఎ’ లు ఏడు దాటితే మీరు స్నేహాం కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు. నిజమైన స్నేహం ఎలా ఉంటుందో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలన్నంత విలువను స్నేహానికి ఇస్తారు. మీ ఫ్రెండ్స్ వల్ల కొంచెం ఇబ్బంది కలిగినా దాన్ని సీరియస్‌గా తీసుకోరు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే స్నేహానికి మీరిచ్చే స్థానం చాలా చిన్నదిగా ఉంటుంది. అవసరాలప్పుడే మీకు స్నేహితులు గుర్తొస్తారు. -
బుద్ధుని సత్యాన్వేషణ
సందేశం ‘‘తర్జనీ దర్శయత్యన్యం సద్యస్త్వామంగుళీత్రయమ్’’ నీచూపుడు వేలుతో ఇతరులను చూపిస్తావు కాని, అదే సమయంలో మూడు వేళ్ళు నిన్ను చూపిస్తాయి... గ్రహించు!’’ అందుకే సత్యాన్నే పలకాలి. దాన్ని ప్రియంగా చెప్పాలి. నేను చెప్పేది సత్యాన్నే కదా అని ఎన్నడూ కఠినంగా, పౌరుషంగా చెప్పరాదు. బుద్ధ భగవానుని చరిత్ర మనకు తెలిసిందే. ఆయన జీవితం మానవ జాతికి చాలా ఆదర్శమైనది. బుద్ధుడు మహారాజవంశంలో పుట్టినా, అనేక భోగభాగ్యాలున్నా కూడా వాటిని త్యాగం చేసి సర్వసంగపరిత్యాగి అయ్యాడు. సత్యాన్వేషణకై తపస్సు చేసి జ్ఞాని అయ్యాడు. అలాంటి బుద్ధ భగవానుని ఒక వ్యక్తి ప్రతిరోజూ దూషించేవాడు. ముఖం ఎదుటే దుర్భాషలాడేవాడు. కాని అందుకు బుద్ధునిలో ఎలాంటి స్పందన ఉండేది కాదు. మౌనంగానే వుండిపోయేవాడు. కొంత కాలం గడిచిన తర్వాత బుద్ధ భగవానుడు నోరు మెదిపాడు.‘‘అయ్యా! ఏదైనా మనం ఇతరులకిచ్చినప్పుడు మనం ఇచ్చింది వారు తీసుకోకపోతే అది తిరిగి ఇచ్చిన వారికే చెందుతుంది కదా! అలాగే మీ దూషణలను కూడా నేను స్వీకరించలేదు’’ అని చాలా ప్రశాంతంగా బదులు పలికాడు. ఆ వ్యక్తిలో చలనం కలిగింది. ఆలోచించే కొద్దీ భయం కలిగింది. ‘అనవసరంగా ఒక దయామూర్తిని నిందించానే’ అని పశ్చాత్తాపంతో ఏడుస్తూ బుద్ధుని పాదాలపై పడి క్షమాపణ కోరాడు. బుద్ధుడు అంతే ప్రశాంత వదనంతో ‘‘నేనెప్పుడో క్షమించి వేశాను. మీ తిట్ల వల్ల నాలో ఎలాంటి భావమూ లేదు. మీరు బాధపడవలదు’’ అని ఓదార్చి పంపించాడు. ఇలాంటి సంఘటనలు లోకంలో అనేకం జరుగుతుంటాయి.వాటన్నింటినీ పట్టించుకుంటే గమ్యం చేరలేము. సాధకులైన వారు ఏకాగ్రత వీడకుండా వుండాలి. ఇతర విషయాలేవీ పట్టించుకోరాదు.సాధకుడికి సాధన కాలంలో అనేక అంతరాయాలేర్పడతాయి. వాటిని లెక్క చేయకుండా గమ్యం వైపు దృష్టి సారించి కృషి చేయడమే ముఖ్యం. దేనిని సాధించాలన్నా నిర్దిష్ట మార్గంలో పట్టుదల కలిగి ఉండాలి. ఉత్తమ సాధకులెవ్వరూ తమ గమ్యం చేరే వరకూ వదిలిపెట్టరు. వాళ్ళు ప్రజ్ఞానిధులు కనుక ప్రారబ్ధార్ధాన్ని వదిలిపెట్టరు. విఘ్నాలు ఎన్ని వచ్చినా వారి ప్రయత్నానికి ఆటంకం కలిగించలేవు. సత్యదర్శనం కలిగే వరకు నిరంతర సాధన జరగడమే సరైన నిర్ణయం.బుద్ధ భగవానుని సత్యాన్వేషణలో చెదరని పట్టుదల ఉంది. అందుకు తగిన నిరంతర సాధన వుంది కనుకనే జీవిత సత్యాన్ని కనుగొన్నాడు. ఆయన మాట, ఆయన బాట ఎన్ని యుగాలకైనా ఆదర్శవంతమైంది... ఆచరణీయమైంది. -
నిద్రపోతూ కూడా పనిచేస్తారు జపాన్ వాళ్లు!
పని మత్తు జపాన్ వాళ్లకు పని రాక్షసులని పేరు. వాళ్లు పని కోసం నిద్రను కూడా త్యాగం చేస్తారంటారు. మరి నిజంగానే నిద్ర పోకపోతే ఆరోగ్యం ఏం కావాలి? నిజానికి... జపాన్ వాళ్లు నిద్రే పోరనేది అబద్ధం. అయితే రాత్రవుతూనే మంచం మీద చేరి, సూర్యోదయమవుతూనే మెలకువలోకి రావడం అనే భావనను మాత్రమే వాళ్లు నిద్రగా భావించరు. బస్సులో నిలబడి ప్రయాణిస్తూ, రైలు కోసం ఎదురుచూస్తూ, లిఫ్టులో పదమూడో అంతస్తుకు ఎక్కుతూ కూడా వాళ్లు ఒక కునుకు తీస్తారు. పోతూ పోతూ ఏదైనా గోడ కనబడితే దానికి చేతిని ఆనించి కూడా ఒక కునుకు తీసి వెళ్తారు. దీన్నే జపాన్‌లో ‘ఇనెమురి’ అంటారు. నిద్రపోతూనే మెలకువగా ఉండటం అని దీనికి అర్థం చెప్పొచ్చు. క్లాసులో పాఠం వింటూ, మీటింగులో భాగస్వామి అవుతూ కూడా వాళ్లు ఇనెమురి చేస్తారు. మనదగ్గర కూడా అట్లా చాలామంది పడుకుంటారుగదా అనొచ్చు. అట్లా పడుకునేవాళ్లకు ఆపాదించే గౌరవం ఎంత? కానీ అదే జపనీయులు దాన్ని తక్కువగా చూడరు. సామాజికంగా దానికి ఆమోదం ఉంది. యుద్ధం తర్వాత, ఎక్కువ పనిచేయడం గొప్ప గుణం అనే భావనలోంచి ఈ విధానం పుట్టింది. అందుకే, ఎవరైనా అలా నిద్ర పోతున్నారంటే, ‘పాపం, రాత్రంతా బాగా పనిచేసివుంటాడు’ అని అనుకుంటారు. ‘‘ఈ ఇనెమురి మనం అనుకునే నిద్రలాంటిది కాదు; అలాగని మధ్యాహ్నపు కునుకు కాదు; అది జపాన్‌కే ప్రత్యేకమైన నిద్రా విధానం. నిద్ర కాని నిద్ర’’ అంటారు జపనీయుల నిద్ర అలవాట్ల మీద అధ్యయనం చేసిన డాక్టర్ బ్రిగిట్ స్టెగార్. ‘‘దైనందిన బాధ్యతల్లో నిష్క్రియత్వంతో పాల్గొంటూనే, తమ వంతు వచ్చినప్పుడు ఠక్కున యాక్టివ్ కావడం ఇందులో ఉన్న కిటుకు,’’ అంటారు స్టెగార్. ఇంకొక అంశం ఏమిటంటే, చాలామంది సరిగ్గా నిద్ర పోవాలంటే తమకు ఏకాంతం కావాలంటారు. కానీ జపనీయులు పక్కన ఎవరు ఉన్నా కూడా నిద్రను ఆనందిస్తారు. భూకంపం, సునామీ లాంటివి జపాన్‌లో సంభవించినప్పుడు కూడా ఇట్లా బహిరంగ సమూహాలుగా నిద్రపోగలగడం వారిని ఉపశమించేలా చేయగలిగింది. -
హజరత్ హుసేన్ త్యాగాలు చిరస్మరణీయం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): మహమ్మద్ ప్రవక్త మనుమడు హజరత్ హుసేన్, ఆయన కుటుంబ సభ్యులు ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రాణ త్యాగాలు చేశారని హజరత్ అజీముద్దీన్ దర్గా బ్రాదరే సజ్జాదే నషీన్ సయ్యద్ తాహెర్ పాషా ఖాద్రి పేర్కొన్నారు. మొహర్రం పండుగను పురస్కరించుకుని ముహిబ్బానే అహ్లెబైత్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఇస్లామియా అరబ్బిక్ కళాశాల మైదానంలో 'యాదే హుసైన్' పేరుతో గొప్ప బహిరంగ సభ నిర్వహించారు. లావుబాలీ దర్గా పీఠాధిపతి సయ్యద్ అబ్దుల్లా హుసేని బాద్షా ఖాద్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మన్షాద్ పాషా ఖాద్రి, సయ్యద్ రిజ్వాన్ పాషా ఖాద్రి, సయ్యద్ షఫి పాషా ఖాద్రి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్‌ను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పొట్టేళ్లను కోసి పేదలకు దేవుడి పేరుతో ఖుర్బానీ ఇచ్చారు. ఈద్గాల వద్ద ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నమాజ్ ముగిసిన తర్వాత మేక, గొర్రెపోతుల మాంసాన్ని పేదలకు పంచిపెట్టారు. -
పాముకాటుకు చిన్నారి బలి
ఝాన్సీనగర్, లక్నెపల్లిలో విషాద ఛాయలు మామునూరు : బతుకుదెరువు కోసం వచ్చిన ఆ దంపతులకు పాము కాటు కడుపుకోతను మిగిల్చింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న వారి కూతురు పాము కాటుతో అనంతలోకాలకు చేరింది. ఈ సంఘటన హన్మకొండ మం డలం తిమ్మాపురం గ్రామంలోని ఝాన్సీనగర్‌లో గురువారంరాత్రి జరిగింది.మామునూరు పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలానికి చెందిన లక్నెపల్లి గ్రామానికి చెందిన భాషబోయిన రాజు, కళ్యాణి దంపతులు కూలి చేస్తు జీవనం సాగిస్తున్నారు. వారికి ఒక్కగానొక్క కూతురు హర్షిత(5) ఉంది. బతుకుదెరువు కోసం వారు నాలుగేళ్ల క్రితం హన్మకొండ మండలం తిమ్మాపురంలోని ఝాన్సీనగర్ కాలనీకి వలస వచ్చారు. ఇక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. రాజు ప్లంబర్ పని చేస్తుండగా, కళ్యాణి వ్యవసాయ కూలి పనులకు వెళుతోంది. గత ఏడాది నుంచి పింఛన్పురంలోని ప్రజ్ఞ ప్లే వేlస్కూల్లో హర్షిత ఎల్కేజీ చదువుతోంది. గురువారం రాత్రి నిద్రిస్తున్న హర్షిత చేతి వేళ్లపై అర్ధరాత్రి 12 గంటల తర్వాత కట్ల పాము కాటేసింది. అరగంట తర్వాత పాప మెలికలు తిరుగుతూ నోటి నుంచి నురుగలు కక్కడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే లైట్ వేసి కాళ్లు, చేతులు పరీక్షించారు. చేతి వేళ్లకు రెండు కాట్లు పడి రక్తస్రావం కావడం కనిపించింది. వెంటనే ఇంట్లో Ðð తకగా పప్పు డబ్బాల పక్కన కట్లపాము కని పించింది. పక్కింటి వారి సాయంతో పామును చంపి, చిన్నారిని వెంటనే ఎంజీఎం అస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉద యం మృతిచెందింది. హర్షితపైపడి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగేందర్ తెలిపా రు. బాలిక చదువుతున్న ప్రజ్ఞ ప్లే వే స్కూల్ పాఠశాలను బంద్ చేయించారు. కర స్పాండెం ట్ ఎల్లయ్య, ఉపాధ్యాయులు విద్యా ర్థినికి నివాళులర్పిస్తూ సంతాపం తెలిపారు. స్థానిక కార్పొరేటర్ చింతల యాదగిరి, నాయకులు పోశాల సదానందం, మేకల సూరయ్య, బుస్స వెంకటేశ్వర్లు, ముప్ప నర్సయ్య, జోగిరెడ్డి, షకీల్, బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. వనపర్తిలో మరొకరు.. వనపర్తి(లింగాలఘణపురం) : మండలంలోని వనపర్తికి చెందిన మేకల వెంకటలక్ష్మి(55) శుక్రవారం పాముకాటుతో మృతచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వెంకటలక్ష్మి ఇంట్లో నిద్రిస్తుండగా ఆమెను పాము కాటు వేసింది. శుక్రవారం తెల్లవారుజామున గమనించి జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో హైదరాబాద్ తీసుకెళుతుండగా మార్గమధ్యలో ఆలేరు వద్ద మృతి చెందింది. మృతురాలికి భర్త, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. -
మహానుభావుల త్యాగఫలం.. స్వాంతంత్య్రం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ గుంటూరు (నెహ్రూనగర్): ఎందరో మహానుభావుల త్యాగఫలం వలన మనకు స్వాతంత్య్రం వచ్చిందని, వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలను నేరవేర్చాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మర్రి రాజశేఖర్ జెండా ఎగుర వేశారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయినా ఇప్పటికీ స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందడం లేదన్నారు. గోవధ పేరుతో, కులాల పేరుతో దళితుల మీద దాడులు జరుగుతున్నాయని, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటున్నారా అని అనడం సిగ్గుచేటన్నారు. నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో స్వాతంత్య్రం లేకుండా పొయిందన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈనాడు కులాల, మతాల, రాజకీయాల పేరుతో దాడులు పెరిగిపోతున్నాయన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనతోనే నిజమైన స్వాతంత్య్రం వస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కత్తెర క్రిస్టినా, కావటి మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పులితో కుక్క ఫైట్...
షాజహాన్ పూర్: యజమానికి విధేయతను ఎల్లప్పుడూ చాటుకుంటూ ఉండే జీవి కుక్క. నిద్రపోతున్న యజమానిని కాపాడటానికి ఏకంగా పులితో పోరాడి ఓ కుక్క ప్రాణాలు వదిలింది. ఉత్తరప్రదేశ్ లోని దుద్వా జాతీయ పార్కు సమీపంలోని బార్బాత్ పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యజమాని గురుదేవ్ సింగ్ తన కుక్కతో పాటు ఇంటి బయట పడుకున్నాడు. అర్ధరాత్రి అలికిడి విని దక్షిణ ఖేరి అడవి నుంచి వస్తున్న పులిని చూసిన జాకీ(కుక్క) యజమానిని అప్రమత్తం చేయడానికి ప్రయత్నించింది. గాఢమైన నిద్రలో ఉన్న సింగ్ ఏం జరుగుతుందో గమనించే లోపే పులి అతని మీద దాడికి దిగింది. దీంతో జాకీ ఒక్క ఉదుటున పులి మీదకు దూకి యజమానికి కాపాడటానికి ప్రయత్నించింది. పులి తిరిగి దాడి చేసి జాకీను అడవిలోకి లాక్కుని వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న సింగ్ కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని జాకీ కోసం ఆ ప్రాంతాన్నంతా తీవ్రంగా గాలించారు. సాయంకాల సమయంలో అటవీశాఖ అధికారులు అందించిన సమాచారంతో దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన జాకీకి అంత్యక్రియలు నిర్వహించారు. జాకీ తల్లి ఒక వీధి కుక్క అని, తన పిల్లలు సుప్రీత్, గుల్షన్ ప్రీత్ లు చిన్నప్పుడే దాన్ని తీసుకువచ్చారని సింగ్ తెలిపారు. పిల్లలతో పాటు వారి వెనుకే స్కూల్ కి వెళ్లేదనీ, గుల్షన్ జాకీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు. అరణ్యంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉందనీ, అప్పుడప్పుడు ఆహారం కోసం జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్ఎన్ యాదవ్ తెలిపారు. -
రాష్ట్ట్రమ్రంతా.. ఉరిసాగు
రైతు ప్రాణాపాయంలో ఉంటే మీ రక్షణకు 5.5 కోట్ల బస్సా?... రైతుకు సెక్యూరిటీ అక్కర్లేదు. అతడు నిర్భయంగా పొలానికి వెళతాడు. కారు చీకటిలో కూడా నిర్భితీగా పొలానికి కాపాలా కాస్తాడు. పంటకు పట్టే చీడపీడలను ఎంతో సాహసంగా ధైర్యంగా ఎదుర్కొంటాడు. కాని పాలకులు అలా కాదు. ప్రతి క్షణం భయపడతారు. ప్రతి క్షణం తమ రక్షణ కోరుకుంటారు. ప్రతి క్షణం తమ ప్రాణాల భద్రత చూసుకుంటారు. ఈ విషయాన్నే తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంకు చెందిన రైతు సింహాద్రి వెంకటేశ్వరరావు (59) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎత్తి చూపాడు. ‘నేడు రాష్ట్రంలో బ్యారెన్ లెసైన్సులు కలిగిన 14,000 మంది పొగాకు రైతులు అప్పుల ఊబిలో కూరుకుని ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నారు. మీరు మాత్రం ఐదున్నర కోట్లు పెట్టి మీ భద్రత కోసం బస్సు తయారు చేసుకున్నారు. అంటే మీ ప్రాణానికి తప్ప రైతు ప్రాణానికి విలువ లేదా. పొగాకు రైతుల్లో ఒక్కరు కూడా ప్రాణత్యాగం చేయడానికి నిరోధించడానికి నేను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని సెప్టెంబర్ 2015లో ఆయన ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. సొంతవూళ్లో చాలా కాలం సొంత భూమిలో పొగాకు పండించిన వెంకటేశ్వరరావు నష్టాల వల్ల భూమిని అమ్మేసి ఊరిలోని దేవాలయ భూమిని 22 ఎకరాలు కౌలుకు తీసుకొని పొగాకు వేశాడు. కాని నష్టాలు వచ్చాయి. అప్పు పెరిగిపోయింది. చంద్రబాబుకు లేఖ రాసినా ఫలితం లేకపోవడంతో పురుగుల మందు తాగి వెంకటేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. సేద్యానికి, ప్రకృతి వైపరిత్యాలకి భయపడని ఒక రైతు కేవలం అప్పు అనే రెండక్షరాల పదానికి భయపడి నిండు జీవితాన్ని అర్ధంతరంగా ముగించాడు. అన్నం పెట్టే రైతుకు చెత్త పెట్టిన ప్రభుత్వం రైతు అన్నం పెడతాడు. ఆకలి తీరుస్తాడు. తను మట్టి పిసికి మనకు మాత్రం ఆయుష్షును పోస్తాడు. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు బదులుగా అతడికి చెత్తతో సన్మానం చేసింది. అవమానించి ప్రాణం తీసింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో 45 ఏళ్ల ఆదినారాయణ అనే రైతు పౌల్ట్రీ ఫామ్ నడుపుతున్నాడు. అయితే చాలా కాలంగా అతడు ఆస్తి పన్ను కట్టలేకపోతున్నాడు. మునిసిపల్ అధికారులు నోటీసులిస్తే వారి నుంచి వాయిదాలు అడుగుతూ పన్ను కట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. కాని మునిసిపల్ అధికారులు ఓపిక పట్టలేకపోయారు. రైతు అని కూడా చూడకుండా అతడు ‘ఎగవేతదారుడు’ అని లోకానికి తెలియచేయడానికి నిశ్చయించుకున్నారు. మార్చి 29, 2015నాడు ఇంటి ముందుకు చెత్త ట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టి వెళ్లిపోయారు. చెప్పుకు అంటిన పేడ ఇంటి వాకిలికి అంటితేనే ఎవరైనా ఎంతో బాధ పడతారు. అలాంటిది ట్రాక్టరు చెత్త తెచ్చి ఇంటి ముందు పెడితే? పన్ను ఎగవేసే బాడాబాబుల పట్ల ఇలా ఎవరూ వ్యవహరించరు. కాని రైతు అనే సరికి ప్రతి ఒక్కరికీ అలుసు. రైతు ఆదినారాయణ ఈ అవమానాన్ని భరించలేకపోయాడు. తన ఇంటి ముందున్న చెత్త ట్రాక్టరును చూసి ఇంట్లోకెల్లి ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, కొడుకు దిక్కులేని వారై మిగిలారు. ఈ పాపం ఎవరిది? రుణమాఫీ ఆశ తీసింది శ్వాస... అందలం ఎక్కడానికి అబద్ధాన్ని ఒక నిచ్చెనగా వాడుకుంటే వచ్చే ఫలితాలు విషమంగానే ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ‘రుణమాఫీ’ నినాదాన్ని హోరెత్తించి అధికారంలోకి వచ్చింది. కాని ముందొకమాట తర్వాత ఒకమాట వైఖరితో అది రైతుల ఆశల మీద నీళ్లు పోసింది. ఫలితం ఒక రైతు ప్రాణం బలైంది. వై.ఎస్.ఆర్ కడప జిల్లా మల్లెంవారిపల్లెకు కొలవలి సుబ్రహ్మణ్యం రెడ్డి (45) తన రెండున్నర ఎకరాల వ్యవసాయం కోసం బ్యాంకులో ఐదు లక్షల అప్పు చేశాడు. కాని వర్షాభావ పరిస్థితులు, బోర్లలో నీరు ఎండిపోవడం ఇవి పంటను రైతునూ నష్టపరిచాయి. ఆ సమయంలోనే చంద్రబాబు హామీ ప్రాణం పోసింది. రుణమాఫీ చేస్తే తాను అప్పుల ఊబి నుంచి బయటపడతానని ఆశపడ్డాడు. అయితే ఎన్నాళ్లు ఎదురు చూసినా రుణమాఫీ జరగకపోవడంతో పురుగుమందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నా ఆత్మహత్యకు చంద్రబాబే కారణం’ అని అతడు రాసిన సూసైడ్ నోట్లో ఉంది. ఒక రైతు తన ముఖ్యమంత్రి పేరు రాసి ప్రాణాలు వదలడానికి మించి ఒక ప్రభుత్వానికి మచ్చ ఉంటుందా? ఈ చావుకు ఎవరు జవాబు చెప్తారు? లెక్క వేరు... నిజం వేరు! 1995 నుంచి చూస్తే 2014 కల్లా దేశంలో రైతుల ఆత్మహత్యలు ఏకంగా 3 లక్షలు దాటాయి.2014 నుంచి ‘జాతీయ నేర రికార్డుల బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి) తాను ఏవేవి ఏ నేర విభాగం కిందకు వస్తాయో లెక్కించే పద్ధతిని (మెథడాలజీని) మార్చుకుంది. ఈ కొత్త పద్ధతిలో పెట్టుకున్న కొత్త పరామితుల వల్ల 2014 నుంచి రైతు ఆత్మహత్యల మరణాల్ని కూడా కొత్త, ఇతర విభాగాల్లోకి చేర్చేస్తున్నారు. దాంతో, రైతు ఆత్మహత్యల సంఖ్య అంతకు ముందు ఏడాది కన్నా తగ్గినట్లు పైకి లెక్కల్లో కనిపిస్తోంది. మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ సహా), కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ - ఈ 5 రాష్ట్రాల్లో దేశంలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దశాబ్ద కాలంగా - దేశం మొత్తంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో మూడింట రెండు వంతులు ఈ 5 రాష్ట్రాల్లోనే సంభవిస్తున్నాయి. అయితే, 2014 నుంచి ఎన్.సి.ఆర్.బి. కొత్త మెథడాలజీ ప్రకారం ఈ రాష్ట్రాల్లో ఆత్మహత్యలు పైకి మాత్రం తగ్గిపోయినట్లు కనిపించడం విచిత్రం. వేలాది కౌలు రైతుల ఆత్మహత్యల్ని కూడా ‘రైతు కూలీల’ఆత్మహత్యల కింద వర్గీకరించారు. దాంతో, రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయాయనే భ్రమ కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ని చూస్తే, రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో మూడింట ఒక వంతు మంది (దాదాపు 32 లక్షల పైచిలుకు మంది అని ఒక లెక్క) కౌలు రైతులే. కానీ, ఈ కొత్త మెథడాలజీ వల్ల రాష్ట్రంలో 2014లో రైతు ఆత్మహత్యలు అతి తక్కువగా 160 జరిగినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ‘ఇతర’ విభాగంలో మరణాలు గణనీయంగా పెరగడాన్ని బట్టి అసలు కథేమిటో అర్థమవుతోంది. రైతుల ఆత్మహత్యలు అధికంగా జరిగే 5 రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో ఈ పైకి చెబుతున్న ‘ఇతర కారణాలు’ కింద చనిపోయిన రైతుల సంఖ్య ఏకంగా 138 శాతం పెరిగింది. దీన్నిబట్టి లెక్క ఎక్కడ తప్పిందో తెలుస్తూనే ఉంది. కాబట్టి, అంతకు ముందు 19 ఏళ్ళుగా ఉన్న రైతు ఆత్మహత్యల డేటాని, 2014 నాటి నుంచి డేటాతో పోల్చిచూడలేం. లెక్కపెట్టే విధానం మార్చేసరికి, లెక్కే మారిపోతోంది. నిజం మరుగునపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికం! అక్షర క్రమంలోనే కాదు... రైతుల ఆత్మహత్యల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ముందంజలో ఉంది. కానివాళ్ళు కాదు... అధ్యయనాలు చెబుతున్న మాట ఇది. దేశంలో అధిక సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. వ్యవస్థలోని లోపాల ఫలితంగా ప్రభుత్వం అందించే వ్యవసాయ ఋణాలు చిన్న, సన్నకారు రైతులకు చేరకపోవడంతో తెలుగు రాష్ట్రాలు ఆత్మహత్యల్లో ఈ అప్రతిష్ఠను మూటగట్టుకుంటున్నాయి. ‘వ్యవసాయ రంగంలో సంస్కరణలు’ అనే అంశంపై ‘అసోచామ్’ గత ఏడాది నిర్వహించిన అధ్యయనం ఈ సంగతి వెల్లడించింది. దేశంలోని రైతు కుటుంబాల్లో మూడింట రెండు వంతుల కుటుంబాలకు ఒక హెక్టారు, అంత కన్నా తక్కువ భూములే ఉన్నాయి. దాంతో, ప్రభుత్వ ఋణాలు వారికి చేరడం లేదు. వారంతా అప్పుల కోసం వడ్డీవ్యాపారుల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఇలా తీసుకొనే అప్పులకు వడ్డీ రేట్లూ ఎక్కువే. 25 శాతం, అంతకన్నా ఎక్కువే వడ్డీ రేటు ఉంటుంది. ఇది వారి భూమి విలువ భరించే భారం కన్నా ఎక్కువ. అలా వారికి అధిక మొత్తంలో అప్పు పెరుగుతోంది. మరోపక్క నాణ్యమైన సాగు పద్ధతుల్ని కూడా అనుసరించలేకపోతున్నారు. గడచిన కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ (ఇప్పటి తెలంగాణతో కలిపి)లోనే అధిక రైతు ఆత్మహత్యల రేటు నెలకొంది. పంట లేక... పంచన చేరలేక.. రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన దాంట్లో నలుగురికి పెట్టడమే తప్ప ఏనాడూ ఎవరి వద్దా చేయిసాచ ని ఆత్మాభిమానం ఆ రైతు దంపతులది. అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం అంతరగంగ గ్రామానికి చెందిన నేసే వన్నూరప్ప, నారాయణమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు. సంబరంగా పెళ్ళిళ్లు జరిపించి గౌరవంగా అత్తింటికి సాగనంపారు. వ్యవసాయ అప్పులు, పిల్లల పెళ్లిళ్ళ ఖర్చులను పంటమీద తీరుద్దామని ముదిమికి చేరువవుతున్నా కష్టాన్నే నమ్ముకున్నారు. కానీ, కాలం పగబట్టింది. సాగు నీళ్లు లేవు. వర్షాలు కానరావు. పంట చేతికొచ్చే దారిలేదు. గుండెరాయి చేసుకొని ఐదెకరాల్లో మూడెకరాలు అమ్మితే కొన్ని అప్పులే తీరాయి. నీళ్లు లేని భూమిలో పంట సాగు చేసే పరిస్థితి లేదు. అప్పులు తీరే మార్గం లేదు. ఉన్న రెండెకరాలు అమ్మితే తమ జీవనం గడిచేదెట్లా?! ఒక అయ్య చేతిలో పెట్టి బాధ్యత తీర్చుకున్నాం. అలాంటి ఆడపిల్లల పంచన చేరి బతికేదెట్లా! పగలూ రాత్రీ నిద్రకు కరువై రోజుల తరబడి కుమిలిపోయారు వన్నూరప్ప, నారాయణమ్మలు. చావే శరణ్యం అనుకున్నారు. 2014 జూన్ 29 రాత్రికి గ్రామ సమీపంలోని ఎల్లమ్మ దేవాలయం వద్దకు చేరుకున్నారు. పైరు ప్రాణం మేసింది... అనంతపురం జిల్లా రొద్దం మండలం గోనమేకలపల్లికి చెందిన ఉప్పర జల్లప్పకు తొమ్మిదెకరాల భూమి ఉంది. భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. జల్లప్ప షుగర్ పేషెంట్. దీంతో ఇరవై ఒక్కేళ్ల కొడుకు గోపీనాథ్ చదువుకు స్వస్తి చెప్పి కాడి భుజానేసుకున్నాడు. తొమ్మిదెకరాల సొంత పొలానికి తోడు మూడెకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఏడెకరాల్లో కందిపంట వేశాడు. పూత పిందె దశలో అడవిజింకల మంద కందిచేను మేసిపోయింది. కౌలు భూమిలో సాగుచేసిన పత్తి పురుగుబారిన పడింది. పులిమీద పుట్రలా 2014 అక్టోబరు 16న బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. తండ్రిపేరుతో రూ.80 వేలు, తల్లి పేరుతో ఉన్న డ్వాక్రా రుణం రూ.1.70లక్షలు వడ్డీతో సహా చెల్లించాలంటూ వచ్చిన నోటీసులు చూసి గోపీనాథ్ రాత్రంతా కలత చెందాడు. 17వ తేదీ ఉదయం ఇంట్లో పురుగులమందు తాగి కుప్పకూలిపోయాడు. తమకు తలకొరివి పెట్టాల్సిన చెట్టంత కొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. చనిపోయిన గోపీనాథ్ పేరుపై కాకుండా తండ్రి జల్లప్ప పేరుపైనే భూమి ఉంది కాబట్టి గోపీనాథ్ రైతు కాదని, జీవో 421 ఈ మృతికి వర్తించదంటూ రెవిన్యూ అధికారులు భాష్యం చెపుతున్నారు. దీనికి ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడంపై అధికారులపై జల్లప్ప హైకోర్టును ఆశ్రయించారు. ఆడవాళ్ళు రైతులు కారా? ఎన్.సి.ఆర్.బి. లెక్కల్లో ప్రధానమైన లోపాలేమి టంటే - కేవలం ‘పట్టా’ ఉన్నవాళ్ళనే రైతులుగా పరిగణిస్తున్నారు. వ్యవసాయం చేస్తున్న మహిళల్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. నిజానికి, వ్యవసాయ పనుల్లో 60 నుంచి 67 శాతం మహిళలే చేస్తారు. అయితే, మన దేశంలోని అధిక శాతం రాష్ట్రాల్లో భూములు మగవాళ్ళ పేరు మీదే ఉంటాయి. వ్యవసాయ మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటే, భూములు వాళ్ళ పేరు మీద లేవనే ఏకైక కారణంతో - ఆ సంఖ్యను రైతు ఆత్మహత్యల జాబితాలో కాకుండా, ‘ఇతరుల’ జాబితాలో చూపిస్తున్నారు. పంజాబ్, హర్యానాల్లో ఇలాగే మహిళా రైతుల ఆత్మహత్యల్ని కూడా మామూలు స్త్రీల ఆత్మహత్యలుగా చూపుతున్నారు. రైతు కుటుంబాలు అప్పుల పెనుభారంలో కూరుకుపోవడంతో, కౌమార వయసు ఆడపిల్లలు పలువురు స్కూలు, కాలేజీ చదువుల్ని అర్ధంతరంగా ఆపేయాల్సొస్తోంది. చివరకి ఈ రైతు కుటుంబాల్లోని ఆడపిల్లలు చేసుకుంటున్న ఆత్మహత్యల్ని విద్యార్థుల ఆత్మహత్యలుగా చూపిస్తున్నారు. ఎవరైనా పల్లెటూళ్లకు వెళితే పట్టెడన్నం పెట్టే అన్నదాత కుటుంబానికి నేడు కష్టం వచ్చింది. వర్షాలు కురవక, చేసిన అప్పులు తీర్చే దారిలేక రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇంటికి అండగా ఉండాల్సిన రైతులు బలన్మవరణం పొందడంతో ఆ కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆసరా కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. ప్రభుత్వం అందించే అరకొర సాయానికి కూడా అధికారులు అనేకరకాలైన ఆంక్షలు విధిస్తున్నారు. దాంతో వ్యవసాయాన్ని పక్కనబెట్టి పిల్లల చదువులు మాన్పించి కూలీనాలీ చేసుకుని పొట్టపోసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలు ఆగడం లేదు. ఆ మధ్య పక్షం రోజుల వ్యవధిలోనే గుంటూరు జిల్లాలో ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లావ్యాప్తంగా వర్షాలు సక్రమంగా పడకపోవడం, పంటలసాగుకు పెట్టుబడులు తడిసి మోపెడు కావడం... అప్పులు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువ కావడంతో దిక్కుతోచని స్ధితిలో ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడారు. రైతుల ఆకాల మరణంతో వారిపై ఆధారపడ్డ కుటుంబాలు వీధిన పడ్డాయి. ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఆ కుటుంబాలు నేడు ఆర్థికంగా చితికిపోయి దిక్కుతోచనిస్ధితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. నీరు లేక... కరెంటు లేక... అప్పులు తీర్చలేక... పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామానికి చెందిన పారేపల్లి మంగరాజు (27)అనే కౌలు రైతు గత ఏడాది 2015 అక్టోబర్ 4 వతేదీన పురుగు మందు సేవించి మృతి చెందాడు. లక్కవరంలోని కొందరు రైతుల వద్ద సుమారు 7 ఎకరాలు మంగరాజు కౌలుకి తీసుకున్నాడు. ఐదెకరాల్లో మొక్కజొన్న పంట, మరో రెండెకరాల్లో వరి పంట సాగు చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. విద్యుత్ కోతలు, మరోపక్క ఎర్రకాలువ కుడి కాలువ సబ్‌ఛానల్ నుంచి నీరు పంటలకు అందక సాగుచేసిన మొక్కజొన్న పంట ఎండిపోయే స్థితికి చేరి పొత్తులు కూడా రాకపోవడంతో పశువుల మేతకు వదిలేశాడు. ట్రాన్స్ఫార్మర్ కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులకు గురై విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో ఉన్న మోటారు నుంచి నీరు సక్రమంగా పొలాలకు అందక తీవ్ర నష్టం వచ్చిందని మృతుడు మంగరాజు బంధువులు తెలిపారు. మంగరాజుకు ఉన్న 25 సెంట్ల భూమిని 2 లక్షల రూపాయలకు విక్రయించి పలువురు వద్ద తీసుకున్న అప్పులు తీర్చాడని, అలాగే 5 లక్షలకు ట్రాక్టర్‌ను అమ్మి ట్రాక్టర్ ఫైనాన్స్ కూడా తీర్చారని మంగరాజు సోదరుడు పారేపల్లి నాగరాజు తెలిపారు. అవికాక, బయట వ్యక్తుల నుంచి మంగరాజు తీసుకున్న సుమారు 6 లక్షల రూపాయల వరకు అప్పులు తీర్చాల్సి ఉందని బంధువులు తెలిపారు. అప్పుల బాధతో పాటు, పంటల నష్టంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తడంతో మనస్తాపానికి గురైన మంగరాజు మృతి చెందాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మార్లు కౌలు తీసుకున్న పొలంపై రుణాలు ఇవ్వాలంటూ మంగరాజు బ్యాంకర్ల చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడని, కానీ బ్యాంకులు మాత్రం ముందుకు రాలేదని పలువురు రైతులు తెలిపారు. కౌలు వ్యవసాయానికి ప్రయివేట్ వ్యక్తుల నుంచి రుణాన్ని తెచ్చి మరీ పెట్టుబడి పెట్టి సాగు చేసేవాడని, అయినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. అంకెల్లో అన్నదాత ఆక్రందన ప్రతి 32 నిమిషాలకూ ఒక భారతీయ రైతు ఆత్మహత్య. 1997 నుంచి 2005 మధ్య కాలానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించిన విషయం. 5 రాష్ట్రాలు - మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ సహా), కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో రైతుల ఆత్మహత్యలు దేశంలోకెల్లా ఎక్కువ. 2014 లెక్క ప్రకారం నూటికి 90 ఆత్మహత్యలు ఈ రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. 80 శాతం ఇది ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతుల్లో వాణిజ్య పంటలు సాగు చేస్తున్నవారి శాతం! 91.6 శాతం ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో మగవారి శాతం ఇది. ఇక వ్యవసాయం గిట్టుబాటు కాక ప్రాణాలు తీసుకుంటున్న మహిళా రైతులు 8.4 శాతం మంది. 21.4 శాతం మహిళా రైతుల ఆత్మహత్యలకు కారణం వ్యవసాయ సమస్యలే! 20.6 శాతం మంది ఆత్మత్యాగాలకు కుటుంబ సమస్యలు, 10.8 శాతం మంది బలిదానాలకు దివాళా తీయడం కారణాలు. రచయితలు ఏమంటున్నారు? రైతును మనిషిగా గుర్తించాలి రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రం లేదిప్పుడు. ఇందుకు ప్రదాన కారణం వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వాల ఆర్థిక విధానాలే. బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు చూస్తే చాలు రైతుల పట్ల పాలక వర్గాలకు గల ఆదరణ ఏమిటో అర్థమవుతుంది. పండిన పంటకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం, ఉపాధి హామీ పథకం కారణంగా కూలీల రేట్లను భరించలేక పోవడం, ఏటేటా ఋణభారం పెరిగిపోవడం... ఈ కారణంగా రైతులు ఋణాలు తీర్చలేని నిస్సహాయస్థితిలో అనివార్యంగా ఆత్మహత్యలకు గురవుతున్నారు. అనంతపురంలాంటి వెనుకబడిన ప్రాంతాలలో ప్రతిరోజూ రైతుల ఆత్మహత్యల వార్తలను పత్రికల్లో చూస్తూనే ఉన్నారు. దీనికి విరుగుడు ఏమిటంటే వెనుకబడిన ప్రాంతాలలో సాగునీటి సౌకర్యాలు పెంచడమే. రైతు పెట్టే పెట్టుబడులలో సగం ఖర్చును ప్రభుత్వం రాయితీ కింద అందించగలగాలి. విద్యను, వైద్యాన్ని రైతుకు ఉచితంగా అందించేలా చేయగలగాలి. ప్రభుత్వాలు రైతును ఒక మనిషిగా గుర్తించగలిగినప్పుడు మాత్రమే రైతులు బతికి బట్టకట్టగలరు. - సింగమనేని నారాయణ, రచయిత భూమి ఒక వస్తువైపోయింది రైతు తన పంటకు కావలసిన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను కార్పొరేట్ కంపెనీల నిర్థారించిన ధరలకు కొనుగోలు చేయాలి. కాని ఆ రైతు తన పంటకు తాను గిట్టుబాటు ధర నిర్ణయించలేకపోతాడు. వ్యవసాయ విధ్వంసానికి ఇదొక కారణంగా కనపడుతుంది. వ్యవసాయం అనేది కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోగలిగినప్పుడే వ్యవసాయం సంక్షోభం నుంచి బయటపడుతుంది. ఇప్పుడు వ్యవసాయం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది. దాంతో రైతులు వ్యవసాయం వదిలి, కూలికోసం వలసలు వెళ్లిపోతున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రోజు భూమి అంటే ఒక వస్తువుగా మారిపోయింది. వ్యాపారం అయిపోయింది. అది కూడా వ్యవసాయ విధ్వంసానికి ఒక కారణం. ఎప్పుడైతే వృత్తి విధ్వంసం జరుగుతుందో దాన్ని నమ్ముకున్న వారు వలసల వైపో, ఉద్యమాల వైపో, ఆత్మహత్యల వైపో వెళ్లిపోతారు. అదే వారికి ప్రత్యామ్నాయంగా కనపడుతుంది. - కాట్రగడ్డ దయానంద్, రచయిత వ్యవసాయాన్ని ఆధునికీకరించాలి వ్యవసాయంపై 55 శాతంపైగా ప్రజలు ఆధారపడి ఉన్న భారతదేశంలో పాలకుల దృష్టి మొత్తం పారిశ్రామికీకరణ మీద లగ్నమవడం మనం ప్రస్తుతం చూస్తున్న అతి పెద్ద వైరుధ్యం. ఈ కారణం చేత వ్యవసాయం చిన్న చూపుకు గురవుతుంది. ఇప్పుడు వున్న ఆర్థిక విధానాలు, అభివృద్ధి నమూనాలు రైతుల పట్ల ప్రభుత్వాలకున్న హీనపక్షాన్ని తెలియచేస్తున్నాయి. రాజ్యానికి రైతు పట్ల ఉండవలసిన ప్రత్యేక దృష్టి ఆవశ్యకతను ఈ ఆత్మహత్యలు తెలియపరుస్తున్నాయి. అత్యవసరంగా పాలకుల దృష్టి కోణాన్ని మార్చుకుని వ్యవసాయాన్ని ఆధునికీకరించాలి. వ్యవసాయదారులను ఎడ్యుకేట్ చేయాలి. మిశ్రమ వ్యవసాయం, చిన్న వ్యవసాయ క్షేత్రాలను గుదిగుచ్చుకోవడం, నీటి వనరుల నిర్వహణ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అన్నిటికంటె ముఖ్యంగా రైతులకు అక్కరకొచ్చే, ఆదుకునే ఇన్సూరెన్స్ విధానాలను రూపొందించాలి. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ‘మేం మీ పక్షమే’ అని ఎప్పుడు రైతులలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయో అప్పుడు ఈ ఆత్మహత్యలు వాటంతట అవే ఆగిపోతాయి. - సామాన్య, రచయిత్రి -
పింఛన్‌కు అర్హత 65 ఏళ్లా?
ఎంతో మంది ప్రాణ త్యాగం, ఉద్యమ త్యాగాలతో తెలంగా ణ సాధించుకున్న తర్వాత రైతులు, వృద్ధులు, కులవృత్తిదారు లు, నిరుద్యోగ విద్యావంతులు, విద్యార్థులు ఎన్నో భవిష్యత్ కలలతో టీఆర్ఎస్ను గెలిపించారు. కానీ రుణ మాఫీ, పెన్షన్, ఉద్యోగాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పాత ప్రభుత్వాల మాదిరిగానే వ్యవహరిస్తోంది. విక లాంగ, వృద్ధాప్య, వితంతు పెన్షన్లను పెంచామ ని చెబుతూనే వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సు 65 ఏళ్లుగా నిర్ణయించడం విచారకరం. 65 ఏళ్ల వరకు బతికుండి పెన్షన్లు తీసుకోవడం అంటే మూడు కుర్చీల ఆట పెట్టినట్లు కనిపిస్తుంది. ఎన్నికలలో ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేర్చాలి కాని, గత ప్రభుత్వా లు ఇచ్చిన సంక్షేమ పథకాలకన్నా మేం ఎక్కువ ఇస్తున్నాం అని మాయ మాటలు, గారడీ లెక్కలు ప్రజలకు అవసరం ఉండదు. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలనే కొనసాగిస్తే కాలగర్భంలో కలిసిపోక తప్పదన్న సత్యాన్ని గ్రహించి సమగ్ర సర్వే నివేదిక ఆధారంగా సంక్షేమ పథకాలను ఆలస్యం చేయకుండా అమలు చేయడానికి తగిన చర్యలు చేపట్టాలి. - డీబీ పతి, ఘట్కేసర్ రంగారెడ్డి జిల్లా -
అమరుల స్ఫూర్తితో ముందుకు సాగాలి
మహబూబ్‌నగర్ క్రైం: సమాజం కొరకు దేశం కోసం త్యాగాలు చేసిన వారి కీర్తి అజరామరమని, అలాంటి త్యాగధనుల కు చరిత్రలో స్థానం లభిస్తుందని జిల్లా ఎస్పీ పి. విశ్వప్రసాద్ అన్నారు. శుక్రవారం ఐపీఎస్ ఆధికారి స్వర్గీయ జి. పరదేశినాయుడు 22వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ కార్యాలయం, వన్ఔన్ పోలీసు స్టేషన్ సమీపంలోని అయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించా రు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు పోలీసు శాఖ, సమాజం గర్వించదగ్గ వ్యక్తి పరదేశీనాయుడని కొనియూడారు. 1993 నవంబర్ 14వ తేదీన కొల్లాపూర్ మండలం సోమశిల సమీపంలో మావోయిస్టులు దొంగచాటుగా మందు పాతర పేల్చడంతో తన రెండు కాళ్లు తెగిపోరుు నా భయపడకుండా కాల్పులకు ఎదురొడ్డి తన సిబ్బందిని ప్రాణాలు, ఆయుధాలను కాపాడిన ఆభినవ అభిమన్యుడన్నారు. ఆ ఘటనలో ఎస్పీతో పాటు 9 మంది పోలీసు ఆధికారులు మృతి చెం దారని, వారి స్పూర్తితో జిల్లా పోలీసులు పని చేయూలని కోరారు. పోలీసు శాఖపై ప్రజలకు అభిమాన ం, సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, ప్రజల రక్షణకు అధికారులు పాటుపడాలని సూచించారు. ఇదే సందర్బంలో దివంగత ఎస్పీ పరదేశినాయుడు, ఇతర పోలీ సు ఆధికారులు, సిబ్బంది ప్రాణా త్యాగాలు సమాజం గుర్తించుకోవడం కనీ స బాధ్యతన్నారు. అనంతరం అమర వీరులకు పుష్పంజలి ఘటించి సాయుధ గౌర వందనం సమర్పించారు. మృతికి సంతాపంగా రెండు నిమిషలు మౌనం పాటించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మల్లారెడ్డి, డీఎస్పీలు కృష్ణమూర్తి, రమేశ్వర్, సీఐలు శ్రీధర్, సీతయ్య, జ్యో తి, ఉదయకృష్ణ, పోలీసు ఆధికారుల సం ఘం అధ్యక్షుడు కె. శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి తిరుపాజీ, జిల్లా క్యార్యదర్శి గుణవర్దన్, పీఆర్ఓ రంగినేని మన్మోహన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
కాలం కత్తుల వంతెనపై త్యాగాల నడక
పద్యానవనం త్యాగము నిశ్చయముగ నొక యాగంబీ జగతియం దనాదిగ గానన్ త్యాగము కల్గిన జనులకు కాగలవు శుభంబులెల్ల కర్మల నార్యా! ‘కుచ్ పానేకే లియె కుచ్ కోనా జరూరీ!’ అనే మాట హిందీలో ఉంది. ఏదైనా పొందాలంటే, ఇంకేదైనా కోల్పోవాల్సిందే అని. వస్తువుకు మరొక వస్తువే అన్నట్టుగా ఇది వస్తుమార్పిడి విధానం కాకపోవచ్చు! ఇంకో రకంగా చెప్పాలంటే, ఒక రూపంలో మనం లబ్ది పొందడానికి మరో రూపంలో ఏదైనా త్యజించడమో, త్యాగం చేయాల్సిన పరిస్థితో అన్న మాట! ‘ఎంతో కొంత త్యాగానికి సిద్ధపడకుండా నాయకులు కాలేరు’ అంటారు. కొందరు ఐహిక సుఖాలను త్యజించమంటారు. ఇంకొందరు, కేవలం మిథ్య కనుక ఆముష్మిక సుఖాలపై ఆశను వదిలేయమంటారు. గౌతమ బుద్ధుడు కోర్కెలని త్యజిస్తే జీవితం అనందమయమన్నాడు. నిజమే, ఏదో త్యజించడం త్యాగం. త్యాగం అనేది లోకంలో ఒక యాగమే, అంటే యజ్ఞమే అంటాడు ఈ పద్యం రాసిన డాక్టర్ కపిలవాయి లింగమూర్తి. నూరుకు పైగా పుస్తకాలు రాసిన లింగమూర్తి నిరంతర పరిశోధకుడు. తెలుగువిశ్వవిద్యాలయం డాక్టరేట్‌తో సత్కరించిన ఆయనకు ఇటీవలే వట్టికోట ఆళ్వార్‌స్వామి పురస్కారం లభించింది. తేలికైన మాటలతో జీవన సత్యాల్ని వివరిస్తూ ఆర్యశతకం రాశారు. యజ్ఞంలో త్యాగం అంటే వితరణమే ప్రధానం. ఏదైనా ఇచ్చుకోవడం. వితరణలేని యజ్ఞం ఎంత గొప్పగా చేసినా అది ఫలాన్నివ్వదంటారు. త్యాగం అనే పదం పలికేప్పుడు కాస్త గంభీరంగా కనిపించినా, సౌమ్యంగా ఆలోచించి సరళంగా చూస్తే క్షమాగుణంలో ఉంటుంది. ‘ఇచ్చి పుచ్చుకోవడం’ అన్న సులభ సమీకరణంలోనూ ఉంటుంది అంతర్లీనంగా. ప్రపంచంలో ఎంతటి జఠిలమైన సమస్య అయినా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చునంటారు ప్రజాస్వామ్యవాదులు. ఎలా సాధ్యమౌతుంది? అంటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి వల్లే. పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నపుడు ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకరు ఒకడుగు వెనక్కి తగ్గి అంగీకారానికి రావడం, అది చూసి అవతలి వాళ్లు కూడా అంతకన్నా ఎక్కువో, అంతేనో, అంతకు తక్కువో... తామూ వెనక్కి తగ్గడం, ఇలా సయోధ్యకు దారి ఏర్పడుతుంది. సమస్యకు పరిష్కారమూ లభిస్తుంది. ఇందులో త్యాగం ఇరువైపుల నుంచీ ఉన్నట్టే! త్యాగాలకు సిద్ధపడ్డవారి కర్మలకు సాఫల్యం ఉంటుంది. ఒకరి త్యాగాల వల్ల ఎదుటి వారికి తక్షణ ప్రయోజనం కనిపించినా, దీర్ఘకాలంలో అది త్యాగం చేసిన వారికిగానీ, విశాల సమాజ హితంలో గానీ కచ్చితమైన ప్రయోజనం కలిగిస్తుందని చరిత్ర నిరూపించింది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు... ఇలా మన ప్రాచీన సాహిత్యమంతా త్యాగనిరతి ఔన్నత్యాన్ని కీర్తించడమే కాకుండా సదరు సత్ఫలితాలను సాపేక్షంగా, సోదాహరణంగా వివరించాయి. శిబి, బలి, దదీచుడు, కర్ణుడు, సోక్రటీస్, జీసస్, గాంధీ వంటి మహనీయుల త్యాగాలు మానవేతిహాస గమనాన్ని ఉద్విగ్నభరితం చేశాయి. మత్స్యగంధితో పెళ్లి జరిపి తండ్రి శంతనుడి ఇచ్ఛ తీర్చడానికి గాంగేయుడు (భీష్ముడు) పలు త్యాగాలకు సిద్ధం కావాల్సి వచ్చింది. ఈ పరిణామమే, అంటే త్యాగాలతో కూడిన భీష్మ ప్రతిజ్ఞ, దరిమిలా ఉత్పన్నమైన పరిస్థితులే మహాభారత కథా గమనాన్ని మలుపులు తిప్పాయి. కైకేయి కోర్కెల ఫలితంగా తలెత్తిన పరిస్థితుల్లో దశరథుడు, కౌసల్య, రామ-సీత-లక్ష్మణుల త్యాగాలు రామాయణాన్నే రసవత్తరంగా నడిపాయి. కడకవి దుష్ట శిక్ష-శిష్ఠ రక్షణకు కారణమయ్యాయి. సమసమాజం కోసం, అస్తిత్వం కోసం, జాతుల మనుగడ కోసం... విశాల జనహితం కోరి జరిపే సాయుధపోరాటాల్లో ప్రాణాలర్పించే యోధుల త్యాగాలూ చరిత్ర పుటలే! కాలం కత్తుల వంతెనపై త్యాగాల నెత్తుటి నడకలెన్నో! సామ్రాజ్యవాదుల ఉక్కు సంకెలల నుంచి దేశాలకు విముక్తి లభించినా, వర్ణ-జాత్యాహంకారుల నుంచి విభిన్న జాతులకు స్వేచ్ఛావాయువులు దొరికినా... అది, ప్రాణాల్ని పణంగా పెట్టిన ఎందరెందరి త్యాగాల ఫలమో! పోరాటాలే కాదు క్షమలోనూ ఉంది ఔన్నత్యం. మనిషి లక్షణాల్లో అత్యంత ఉత్కృష్ఠమైనది క్షమాగుణం అంటారు. క్షమాగుణానికి త్యాగమే కన్నతల్లి. ప్రతి త్యాగాన్ని మనసారా ప్రశంసిద్దాం. మరిన్ని త్యాగాలకు మనమూ సిద్ధమౌదాం! - దిలీప్‌రెడ్డి -
అమరుల త్యాగ స్మరణయే మొహర్రం
దోమ: ఇస్లాం పరిరక్షణకు ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకునే మాసమే మొహర్రం. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం మొదటి మాసంగా పేర్కొంటారు. ఇరాక్‌లోని కర్బలాలో జరిగిన యుద్ధంలో శత్రువులతో పోరాడి వీరమరణం పొందిన ఇమామ్ హుస్సేన్, హస్సన్, వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని స్మరించుకునేందుకు ఏటా ఈ మాసంలో సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంగళవారం మొహర్రం నేపథ్యంలో పది రోజుల క్రితమే గ్రామాల్లో చావిడీలను ప్రత్యేకంగా అలంకరించి వాటిలో పీర్లను ప్రతిష్టించారు. అప్పటి నుండి సోమవారం వరకు సంతాప దినాలుగా పాటించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. మొహర్రం అనే పేరు హరం అనే ఉర్దూ పదం నుండి వచ్చిందని చెబుతుంటారు. హరం అంటే త్యాగం, క్షమాపణ అని అర్థం. మొహర్రం సందర్భంగా పలు చోట్ల ముస్లింలు ఛాతీ బాదుకుంటూ, రక్తం చిందిస్తూ మాతం యాత్ర నిర్వహించి యుద్ధంలో అమరులైన వారికి సంతాపం తెలుపుతారు.మొహర్రం గ్రామాల్లో మతసామరస్యానికి వేదికగా నిలుస్తోంది. చాలా గ్రామాల్లో పీర్లను ముస్లింలతో సమానంగా హిందువులు దర్శించుకొని పూజలు చేస్తారు. హిందువులు మాతం యాత్రలోనూ పాల్గొని ముస్లింలకు సంఘీభావం తెలపడం ఓ సాంప్రదాయంగా కొనసాగుతోంది. ముస్లింల సంఖ్య తక్కువగా ఉండే గ్రామాల్లో హిందువులే ముందుండి మొహర్రం కార్యక్రమాలను నిర్వహిస్తుండడం ఓ విశేషంగా చెప్పుకోవచ్చు.దోమ మండల పరిధిలోని పాలేపల్లి, దోమ, మోత్కూర్, దిర్సంపల్లి, కిష్టాపూర్ తదితర గ్రామాల్లో మొహర్రం నాడు ఏటా ఘనంగా పీర్ల ఊరేగింపు నిర్వహిస్తారు. పది రోజుల పాటు చావిడీల్లో దర్శనార్థం ఉంచిన పీర్లను మంగళవారం నెలవంక దర్శనం కాగానే మాతం యాత్ర చేపట్టనున్నారు. -
బక్రీద్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు
హైదరాబాద్ : త్యాగనిరతిని చాటి చెప్పే బక్రీద్(ఈద్-ఉల్-జుహా) పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకొంటున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు ఈద్గాహ్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలనాడు ఇబ్రహీం అలైసలాం తన కుమారున్ని దైవమార్గంలో బలి ఇచ్చేందుకు ఉపక్రమించటం ఆయన త్యాగానికి పరాకాష్ట. ఆ త్యాగాన్ని మననం చేసుకోవడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశం. నగరంలోని ఈద్గా మీరాలం, మాదన్న పేట, గోల్కొండ, మక్కా మసీదు, నాంపల్లిలోని షాహీ మస్జీద్, బాగేమా, హజ్ హౌస్ మస్జీద్లతో పాటు సుమారు 120 మసీదులు బక్రీదు కోసం ముస్తాబు అయ్యాయి. ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకూ ఈద్-ఉల్-అజ్హా ప్రార్థనలు జరిగాయి. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మరోవైపు బక్రీదు సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
చండ్రుగొండ/ ఖమ్మం మామిళ్లగూడెం: త్యాగ నిరతికి ప్రతీక బక్రీద్ వేడుక. అలనాడు ఇబ్రహీం అలైసలాం తన కుమారున్ని దైవమార్గంలో బలి ఇచ్చేందుకు ఉపక్రమించటం ఆయన త్యాగానికి పరాకాష్ట. ఆ త్యాగాన్ని మననం చేసుకోవడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశం. దైవం ఒకరిని నాయకుడిని చేయడానికి అతని వంశం, పలుకుబడి, బాహ్యా ఆకారం ఇలాంటివేవి చూడడు. అతని గుణగణాలు, సచ్చీలత, మంచితనం ఎలాంటివో అన్న విషయాలే ఆయనకు ముఖ్యం. ఎవరు దైవానికి భయపడతారో వారే దైవం దృష్టిలో ఉత్తములు. అతడినే దైవం నాయకుడిగా ఎన్నుకుంటాడు. నేటికి ప్రపంచంలోని నాయకులకు కనువిప్పులాంటిది ఇబ్రహీం అలైసలాం నాయకత్వ చరిత్ర. ఆయన జీవితం ఆద్యంతం త్యాగాలమయం. అందుకే ఆయనను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనూ విశ్వాసులకు తండ్రి అని కొనియాడారు. ఇబ్రహీం ఒక ఆదర్శమూర్తి అని దివ్యఖురాన్ పేర్కొంది. ఇబ్రహీం అలైసలాం 99 సంవత్సరాల వయస్సులో ఉండగా చేతికొచ్చిన అతని ఏకైక కుమారుడు (ఇస్మాయిల్ అలైసలాం) దైవం తనమార్గంలో (బలి) అర్పించమని కోరింది. దైవం ఆజ్ఞను శిరసావహించిన ఇబ్రహీం తన కుమారుడి సమ్మతం పొందారు. తన ఏకైక కుమారున్ని బలి ఇచ్చేందుకు ఉపక్రమించారు. మరోమారు దైవాజ్ఞానుసారం ఇస్మాయిల్ స్థానంలో ఒక పొట్టేలును బలి ఇవ్వడం జరుగుతుంది. ఇది క్లుప్తంగా నాడు జరిగిన చారిత్రకఘట్టం. ఆ బృహత్తర త్యాగాన్ని మననం చేసుకునేదే బక్రీద్. ఇది అనాగరిక చర్య..కానేకాదు.. బలిదానం.. ఇదొక అనారిక చర్యనా..? కానేకాదు. వాస్తవంగా మనుషులను దైవం బలితీసుకోవడం అవసరమా..? ఇబ్రహీంకు జరిగిన సంఘటనతో ఈ సందేహం తలెత్తుతుంది. దైవం తన పట్ల ఇబ్రహీంకు ఉన్న అపారమైన ప్రేమను లోకానికి తెలిపేందుకు ఈ పరీక్ష పెట్టినట్లు గ్రంథాలు చెబుతున్నాయి. ప్రాణంకంటే మిన్నగా భావించిన తన కుమారున్ని దైవమార్గంలో బలిదానం చేసేందుకు ఇబ్రహీం ముందుకు రావటం ప్రతి ఒక దైవ విశ్వాసికి ఆదర్శం. ఆ స్థాయిలో మనం త్యాగాలు చేయకున్నా దైవ ప్రేమను పొందేందుకు కనీసం చెడుమార్గాలకు దూరంగా ఉంటే చాలు. ప్రతి చెడుపనికి దూరంగా ఉంటూ సన్మార్గం వైపు అడుగులు వేయించడమే మన కర్తవ్యం. అలా కాకుండా బక్రీద్ వేడుకను మొక్కుబడిగా చేసుకుంటూ పోతే ఎన్ని గొర్రెపోతులను బలిచ్చి నా వృథాయేనని మత పెద్దలు అంటున్నారు. ఖమ్మంలో ముస్తాబైన ఈద్గాలు.. బక్రీద్ సందర్భంగా నమాజ్ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈద్గాలు ముస్తాబయ్యాయి. ఖమ్మం రైల్వేస్టేషన్ సమీపంలోని ఈద్గా, అర్బన్ మండలం గొల్లగూడెంలోని ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరంలోని మోమినాన్ ప్రాంతం లో ఉదయం 8 గంటలకు ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తామని మజీద్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్హకీం, ఉపాధ్యక్షులు రషీద్, కార్యదర్శి షరీఫ్ పేర్కొన్నారు. -
త్యాగనిరతిని చాటిచెప్పే బక్రీద్
బాన్సువాడ/బిచ్కుంద/నిజామాబాద్ కల్చరల్ : త్యాగనిరతిని చాటి చెప్పే బక్రీద్(ఈద్-ఉల్-జుహా) పండుగను జిల్లావ్యాప్తంగా సోమవారం ముస్లింలు ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాలతో పాటు జిల్లావ్యాప్తంగా ఈద్గా్హ లలో ప్రార్థనలు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పండుగ నేపథ్యం ప్రవక్త హజ్రత్ ఇబ్రాహిం అలై సలాంకు మూడురోజుల పాటు అల్లాహ్ కలలో ప్రత్యక్షమై ‘నా కోసం నీకు ఇష్టమైన వస్తువును త్యాగం (ఖుర్బాన్)’ చేయాలని ఆజ్ఞాపిస్తారు. తనకు ఇష్టమైనది తన కుమారుడైన ఇస్మాయిలేనని, అల్లాహ్ కోసం దేనికైనా సిద్ధమని ఇబ్రాహిం(స) చెబుతారు. ఇస్మాయిల్‌ను తీసుకుని మక్కా షరీఫ్ నుంచి మదీనాకు ఒంటెపై తీసుకెళ్తుంటారు. అప్పుడు మార్గమధ్యలో వారి మనసును మార్చేందుకు మూడు సార్లు షైతాన్ అడ్డుపడుతుంది. హజ్రత్ ఇబ్రాహిం(స) తన మనసును మార్చకుండా షైతాన్ను రాళ్లతో కొట్టి తరిమివేస్తారు. అనంతరం మదీనాలోని మీనా వద్ద దైవనామ స్మరణ చేస్తూ ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహ్ (కోయడం) చేయడానికి సిద్ధమవుతారు. అప్పుడే అల్లాహ్ దూత అయిన హజ్రత్ జిబ్రాయిల్ అలైసలాం, స్వర్గం నుంచి తెచ్చిన పొట్టెలును ఇస్మాయిల్ స్థానంలో ఉంచుతారు. ప్రవక్త చేయదల్చిన త్యాగంతో అల్లాహ్ ప్రసన్నడవుతారు. ‘కేవలం కలలో చూసిన దాన్ని నిజం చేసి చూపించావు. ఈ పరీక్షలో నువ్వు గెలిచావు. ఇక భౌతిక చర్యగా మిగిలిపోయిన బలితో నాకు నిమిత్తమేమి లేదు. ఈ శుభసమయంలో మీ త్యాగనిరతికి గుర్తింపుగా ఈ పొట్టెలును పంపించాను’ అని ప్రసన్నులవుతారు. అప్పటి నుంచి ముస్లింలు ప్రతీ ఏడాది అదే బక్రీద్ రోజు పొట్టేలు, మేకలను అల్లాహ్ కోసం ఖుర్బాన్ (త్యాగం) చేస్తారు. ఈద్గాహ్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు సోమవారం ఈద్గాహ్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. జిల్లాకేంద్రంలోని ఖిల్లా, గాంధీచౌక్, ధర్మపురిహీల్స్ వద్ద గల ఈద్గాహ్ల్లో ఇప్పటికే ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. వీటిని ఆదివారం నగర మేయర్ ఆకుల సుజాత, డిప్యూటీ మేయర్ ఫయిమ్, కార్పొరేటర్ అజీజ్, మున్సిపల్ అధికారులు స్థానిక ఖిల్లా ఈద్గాహ్ను సందర్శించారు. -
నేడు తెలంగాణ విమోచన దినోత్సవం
బయ్యారం : నైజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర బయ్యారం యోధలది. తమకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్న బయ్యారానికి చెందిన 30 మందిని నైజాం ప్రభువులు బలదీసుకున్నారు. అయినా వెనుకడుగు వేయక తెలంగాణ బానిస సంకెళ్లను తెంచేంతవరకు అలుపెరుగని పోరాటం చేసిన ఘనత ఈ ప్రాంత వాసులది. కంచర బుచ్చిమల్లు, దామినేని కోటేశ్వరరావులు ప్రాణాలను పణంగా పెట్టి కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించారు. 1948లో బండ్లకుంట సమీపంలో నైజాం పాలకులు తమ సైనికులతో వీరిద్దర్నీ కాల్చి చంపించారు. వీరి శవాలను బయ్యారం, గార్ల మండలాల్లో ఊరేగించి తమను వ్యతిరేకించిన వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు. కమ్యూనిస్టు నాయకులను కాల్చి చంపిన రెండు రోజల తరువాత అదే ప్రాంతంలో నిజాం సైనికులు మండలంలోని బండ్లకుంట, జాప్రాబాద్, జగ్నాతండా, బయ్యారం, చోక్లాతండా గ్రామాలకు చెందిన బీరవెల్లి లక్ష్మీనర్సయ్య, కంబాల చంద్రయ్య, అయిలబోయిన యర్రయ్య, సింగనబోయిన గంగయ్య, లింగయ్య, కారం మల్లయ్య, పాశం లచ్చయ్య, మాడె పాపయ్య, మాడె బుచ్చయ్య, తాటి బాలయ్య, భూక్య సక్రాం, వేములపల్లి శ్రీ కృష్ణ, తాటి మల్లయ్య, తాటి లక్ష్మయ్య, పెడుగు లక్ష్మీనర్సయ్య, కుంజ ముత్తిలింగయ్య, కారం గాదెయ్య, మోరె బాలయ్య, కుంజా జోగయ్య, మోకాళ్ళ యద్రయ్యలతో పాటు మరో పదిమందిని కాల్చి చంపి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. తమ కళ్ల ముందే అనేక మంది ఉద్యమకారులను కాల్చిచంపినప్పటికీ మనోధైర్యం కోల్పోకుండా పోరాటంలో ముందుకు సాగారు మండలవాసులు. తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలర్పించిన యోధుల అమరత్వానికి సాక్షిగా 1969లో బయ్యారం మండలకేంద్రంలో అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు. నాటి పోరాటస్ఫూర్తి గురించి అమరుడు బీరవెల్లి లక్ష్మీనర్సయ్య భార్య బీరవెల్లి వెంకటమ్మ ఏమంటున్నారో... పిల్లలు తండ్రిని చూడలేదు: బీరవెల్లి వెంకటమ్మ, స్వాతంత్ర సమరయోధురాలు, బయ్యారం తెలంగాణ పోరాటం ప్రారంభమైనప్పుడు నాకు 26 ఏళ్లు. అప్పటికే నాకు నలుగురు సంతానం. రజాకార్లకు వ్యతిరేకంగా ఉన్నాడని మా పెద్దాయన్ను యూనియన్ పోలీసులు కాల్చి చంపిండ్రు. శవాన్ని కడసారి చూసుకోనివ్వలేదు. పది శవాలకు ఒకే చోట నిప్పుబెట్టిండ్రు. మరో వైపు అదే రోజు బయ్యారం ఊరికి రజాకార్లు నిప్పుబెట్టడంతో ఇళ్లు కాలి నిల్వనీడ లేకుండా పోయింది. అప్పుడు మాపెద్దోడు వెంకటరెడ్డికి ఎనిమిదేళ్లు. చిన్నోడు రంగారెడ్డికి ఐదేళ్లు. పెద్దబిడ్డ భాగ్యమ్మకు మూడేళ్లు. చిన్నబిడ్డ అరుణ పుట్టి ఏడాది. తండ్రి ఎలా ఉంటాడో పిల్లలకు తెలియని వయసులో ఆయన్ను కాల్చిచంపిండ్రు. అప్పటినుంచి మాకు కష్టాలు మొద లయినై. ఆ తర్వాత పిల్లలతో కలిసి వరంగల్ జిల్లా కాంపెల్లిని మా తల్లిగారింటికి పోయిన. అక్కడే పిల్లలు పెద్దోళ్లయ్యేదాక ఉంచి విముక్తి పోరాటంలో పాల్గొన్న. -
సంక్షేమఫలాలు అందించేందుకే ర్యాలీ
ఆదిలాబాద్ రూరల్ : దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన సైనికులు.. వారి కుటుంబాలకు ఉపాధి, సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతోనే ర్యాలీ, సదస్సు నిర్వహించామని ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఏరియా గ్రూప్ ఆఫీసర్స్ కమాం డెంట్, చీఫ్ సెనామెడల్ అవార్డు గ్రహీత లెఫ్టినెంట్ జనరల్ జగ్బీర్‌సింగ్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ సమీపంలోని మావల గ్రామంలోని చిల్కూరి లక్ష్మీ గార్డెన్లో మాజీ సైని కుల ర్యాలీని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశం కోసం జీవితం త్యాగం చేసిన వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలోని వారి కోసం ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. మా జీ సైనికులకు ఉద్యోగ, ఉపాధి ప్రభుత్వ సంక్షేమ పథకాలందిస్తామన్నారు. సైన్యంలో పనిచేసిన కాలంలో ఉన్న క్రమశిక్ష ణ సర్వీసు అనంతరం కూడా కొనసాగించాలన్నారు. యువకులకు ఆర్మీపై అవగాహన కల్పించాలన్నారు. ఆంధ్రా ఏరి యా మేజర్ జనరల్ సీఏ పిట్టావాలా మాట్లాడుతూ.. సైనిక సంక్షేమ కేంద్రాన్ని సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేశామని.. అక్కడ సమస్యలను చెప్పుకోవచ్చని సూచించారు. అంతకుముందు స్టాళ్లను సందర్శించారు. యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేశా రు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జగన్మోహన్, ఆర్టినరీ కమాం డెంట్ ఏకే సాస్మాన్, డెప్యూటీ కమాండెంట్ కల్నల్ శ్రీని వాస్, ఆయా జిల్లాల సైనిక సంక్షేమాధికారులు, వీరనారులు, రిటైర్డ్ ఆర్మీలు పాల్గొన్నారు. -
అమరజీవి త్యాగం మరువలేనిది
వెఎస్ఆర్ సీపీ నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగం మరువలేనిదని వైఎస్ఆర్ సీపీ నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అన్నారు. అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతిని పురస్కరించుకుని వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుప్పం ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత స్థానిక తాతా బిల్డింగ్స్ సమీపంలోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్లబ్ కార్యదర్శి పవన్‌కుమార్‌తో కలిసి మాతా శిశు వైద్యశాలలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి దేసు వెంకటసుబ్బారావు, వేములు శ్రీమనారాయణ తదితరులు పాల్గొన్నారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో.. పొట్టిశ్రీరాములు జయంతిని పురస్కరించుకుని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాంప్లెక్స్‌లోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు తాతా వెంకట చెంచయ్య గుప్తా, కార్యదర్శి ఇస్కాల వేణుగోపాల్, మాజీ కార్యదర్శి కూరపాటి సత్యనారాయణ, క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తూను గుంట రామమోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో.. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములుజయంతి వేడుకలను స్థానిక వైశ్యాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పెరుమాళ్ల కాశీరావు మాట్లాడుతూ అమరజీవి త్యాగాన్ని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం మాజీ అధ్యక్షుడు తాతా సుబ్బారావు, కోశాధికారి గ్రంధె వెంకటరామభద్రారావు, ఉపాధ్యక్షుడు బాబు, పెరుమాళ్ల గిరి, కార్యదర్శి నరసింహారావు, మండల అధ్యక్షుడు మోదుకూరి శ్రీనివాసరావు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆకతాయిల వేధింపులకు అనూష బలి
విద్యానగర్ (గుంటూరు), న్యూస్‌లైన్ :ఆకతాయిల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. వీరి వేధింపులకు ఎక్కడో ఒకచోట యువతులు బలవుతూనే ఉన్నారు. ఆకతాయిల వికృత చేష్టలకు కలతచెంది దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు యత్నించిన యర్రబోయిన అనూష (17) గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో వారం రోజులగా చికిత్సపొందుతూ మృత్యువుతో పోరాడి శనివారం ఉదయం కన్నుమూసింది. గుంటూరు నగరంలోని వల్లూరివారితోట 8వ లైనుకు చెందిన అనూష స్థానిక సెయింట్ ఆన్స్ కళాశాలలో ఇంటర్ మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే లైనులో నివాసం ఉంటున్న మానుకొండ సాయి, మస్తాన్‌వలి అనే ఇద్దరు ఆకతాయిలు నెలరోజుల నుంచి వికృత చేష్టలతో ఆ విద్యార్థినిని వేధిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఇదే విషయాన్ని తండ్రి సుబ్బారావుకు తెలియపరిచింది. ఆకతాయిలకు హితవు చెప్పేందుకు వెళ్లిన విద్యార్థిని తండ్రిపై వారు దాడికి దిగడంతో అనూష మానసికంగా కుంగిపోయింది. దిక్కుతోచని స్థితిలో బాధితురాలు సెప్టెంబర్ 29వ తేదీ ఇంటిలోని బాత్రూంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు, బంధువులు ఆమెను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకు రాగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారంరోజులుగా మృత్యువుతో పారాడి చివరకు శనివారం ఉదయం అనూష తుదిశ్వాస విడిచింది. కేసు నమోదు చేసిన అరండల్‌పేట పోలీసులు నిందితులు మానుకొండ సాయి, మస్తాన్‌వలిలను గత సోమవారమే ఆరెస్టు చేసి నిర్భయ చట్ట ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనూష మృతదేహాన్ని పలువురు నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు. వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. -
జీతాలు, ఉద్యోగాలు, ప్రాణత్యాగం దేనికైనా రెఢీ
సాక్షి, విజయవాడ : ప్రభుత్వోద్యోగులు విధులకు హాజరుకాకపోతే ‘జీతంలో కోతపెడతామని.. పనిచేస్తేనే జీతం’ అని ప్రభుత్వం బెదిరిస్తోంది. ఉద్యోగులు సమ్మెచేసినప్పుడల్లా ‘పనిచేస్తేనే జీతం’ అంటూ ఎస్మా (అత్యవసర విధుల నిర్వహణ చట్టం) ప్రయోగించడం ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. గతంలో తెలంగాణ ఉద్యోగులు జీతాలకోసం ఉద్యమా న్ని పక్కన పెట్టలేదు. వారికి దీటుగానే ప్రస్తుతం సీమాంధ్ర ఉద్యోగులు జీతం కోత హెచ్చరికతో ఉద్యమాన్ని నీరుగార్చేందుకు సిద్ధంగా లేరు. జీతమే కాదు, ఉద్యోగం పోయినా.. చివరికి ప్రాణాలు పోయినా ఉద్యమం ఆపబోమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జీతం బూచి చూపి ఉద్యోగుల్ని బెదిరించాలనే కిరణ్ సర్కార్ ఆలోచనలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఎస్మాను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఇటువంటి జీవోలు తమ ఐక్యతను దెబ్బతీయలేవని చెబుతున్నారు. ప్రభుత్వం విధించిన ‘జీతం కోత’పై వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఏమంటున్నారో వారి మాటల్లోనే... ఎన్నిరోజులైనా పోరాడతాం.. ఈ రాష్ట్రం ఐక్యంగా ఉండాలని ప్రతి మహిళా కోరుకుంటోంది. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మహిళా ఉద్యోగులంతా రోడ్డు ఎక్కడానికి కూడా వెనుకాడడం లేదు. 13 జిల్లాల్లో పదిహేను రోజులుగా జరుగుతున్న ఉద్యమాలను చూసైనా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి. సమైక్యాంధ్ర కోసం ఎన్ని రోజులైనా పోరాటం చేయడానికి వెనుకాడబోం. - మనోరంజని, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జీవోలు ఉపసంహరించాలి రాష్ట్ర ఐక్యతను కాపాడాల్సిన రాజకీయ నాయకులు ఆ బాధ్యత నుంచి తప్పుకొంటే.. ఉద్యోగస్తులుగా మేము ఆ బాధ్యత తీసుకున్నాం. నాలుగు లక్షల మంది ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టే జీవోలను జారీ చేసేటప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి. లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు. - ఎం.దుర్గాప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ కేంద్రం నిర్ణయం మార్చుకోవాలి రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాల్ని గౌరవించాలి. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలు, ఉద్యోగులు ఎక్కువ నష్టపోతారని భావించినప్పుడు ఆ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోవడంలో తప్పులేదు. - కాటంరాజు, రెవెన్యూ శాఖ సమైక్యాంధ్రే ముఖ్యం రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నిర్ణయానికి వచ్చేముందే ఇటువంటి బెదిరింపులకు భయపడకూడదని నిర్ణయించుకున్నాం. నాలుగు లక్షల మంది ఎన్జీవోలు ఒక్కతాటిపైకి వ చ్చి ఉద్యమిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్టు ప్రకటించడం మినహా ప్రత్యామ్నాయం లేదు. - విద్యాసాగర్, ఏపీఎన్జీవో సంఘం చైర్మన్ జీవోలకు భయపడం ఎన్జీవోలు, మున్సిపల్ ఉద్యోగులు చేసే ఉద్యమాలను అణగదొక్కేందుకు ప్రభుత్వం జారీ చేసే నల్లజీవోలను ఏమాత్రం ఖాతరు చేయం. ఎస్మా వంటి చట్టాన్ని ప్రయోగించి ఉద్యోగులను దారిలోకి తెచ్చుకోవాలనుకోవడం ప్రభుత్వ అవివేకం. ప్రభుత్వం దిగి వచ్చి రాష్ట్ర విభజనను నిలిపివేయాలి. - ఈశ్వర్, విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యమాన్ని ముందుకుతీసుకెళతాం.. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం మొన్న జీవో 177ను, నిన్న 238ను జారీ చేసింది. అయినప్పటికీ 13 జిల్లాల ఉద్యోగులు ఏమాత్రం బెదిరిపోకుండా ఒకేమాటపై ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నాం. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. - వెంకటేశ్వరరావు, రవాణాశాఖ ఐక్యత కోసం ఏమైనా చేస్తాం.. జీతాల్లో కోత కాదు.. ఉద్యోగాలు... ప్రాణాలు పోయినా కూడా వెనక్కి తగ్గం. రాష్ట్ర ఐక్యతను కాపాడేందుకు ప్రాణాలను ఫణంగా పెట్టడానికి కూడా వెనుకాడకూడదని నిర్ణయించుకున్నాం. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయం చేసే ఢి ల్లీ పెద్దలు ఈ విషయాన్ని గమనించి రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలి. - కె.మధుసూదనరాజు, గ్రంథాలయ శాఖ హైదరాబాద్ ఎవడి సొత్తూ కాదు హైదరాబాద్‌లో సీమాంధ్రవాసులకు భద్రత కల్పిస్తామంటున్నారు. మాకు అక్కడ భద్రత లేదని ఎవరన్నారు. 30 ఏళ్లు కష్టబడి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌ను వారికి ధారాదత్తం చేయడానికి సిద్ధంగా లేము. సీమాంధ్ర ఉద్యోగుల సత్తా ఏంటో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చూపిస్తాం. - వాసు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం -
సమైక్యాంధ్ర ఉద్యమంలో టిడిపి నేతలు