జెమ్మా ప్రొక్టర్.. బార్కెరెండ్‌లోని తన నివాసం
లండన్ : తాగిన మైకంలో 18 నెలల కొడుకును దేవుడికి బలి ఇచ్చిందో తల్లి. ఈ సంఘటన ఇంగ్లండ్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెస్ట్ యార్క్‌షైర్‌కు చెందిన జెమ్మా ప్రొక్టర్ తల్లి డెబోరాతో పాటు ముగ్గురు బిడ్డలతో బార్కెరెండ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది. గత కొన్నేళ్లుగా ఆమె ‘‘పారానోయిడ్ స్కిజోఫ్రెనియా’’ అనే మానసిక వ్యాధితో బాధపడుతోంది. జెమ్మా తన 16వ ఏట నుంచే మద్యానికి బానిసవ్వటమే కాకుండా గంజాయి సైతం విపరీతంగా తీసుకునేది. గత కొద్ది రోజుల నుంచి దేవుడు తనతో మాట్లాడుతున్నాడని అందరితోనూ చెప్పేది.
కొద్ది నెలలుగా విచిత్రంగా నడుచుకోవటమే కాకుండా క్రూరంగా ప్రవర్తించేది. అప్పటి వరకూ ఎప్పుడూ లేని విధంగా మత సంబంధ ప్రదేశాలకు ఎక్కువగా వెళ్లేది. ఓ రోజు ఎర్రటి దుస్తులు ధరించి నృత్యం చేస్తూ ఇంటి చుట్టూ తిరిగింది. ఆ తర్వాత తల్లి ఫోన్‌లో మాట్లాడుతూ బిజీగా ఉన్న సమయంలో 18నెలల కొడుకును ఆరవ అంతస్తులోని తన ఇంటి కిటికీలో నుంచి కిందకు విసిరేసింది. సమాచారం అందుకున్న పోలీసులు జెమ్మాను అదుపులోకి తీసుకుని విచారించగా కొన్ని విస్తుగొలిపే విషయాలను వెల్లడించింది. జెమ్మా మాట్లాడుతూ.. తనతో దేవుడు రోజూ మాట్లాడేవాడని, పిల్లాడిని బలి ఇవ్వాలని అడిగే వాడని తెలిపింది. పిల్లాడు చాలా సంతోషంగా ఉన్నాడని.. ఎందుకంటే అతడు దేవుడి దగ్గరికి వెళ్లిపోయాడని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment