యూపీలో ఘోరం.. స్కూల్​ బాగుండాలని 2వ తరగతి విద్యార్థి బలి | UP Class 2 Boy Sacrificed For School Success Director, Staff Arrested | Sakshi
Sakshi News home page

యూపీలో ఘోరం.. స్కూల్​ బాగుండాలని 2వ తరగతి విద్యార్థి బలి

Published Fri, Sep 27 2024 2:51 PM | Last Updated on Fri, Sep 27 2024 3:43 PM

UP Class 2 Boy Sacrificed For School Success Director, Staff Arrested

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. క్షుద్ర పూజల పేరిట హథ్రాస్‌లో 2వ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని బలి ఇచ్చారు. విద్యార్ధి చదువుతున్న పాఠశాల అభివృద్ధి చెందాలని స్కూల్‌ హాస్ట్‌లోనే బాలుడిని హత్య చేశారు. వారం కిందట జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది.

బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాఠశాల యజమాని జసోదన్‌ సింగ్‌తో, అతని కుమారుడు దినేష్‌ భఘేల్‌ పాటు మరో ముగ్గురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.విచారణలో భాగంగా వెలువడిన పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు.

.. 11 ఏళ్ల కృతార్థ్‌ హథ్రాస్‌ జిల్లాలోని రస్‌గవాన్‌లోని డీఎల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గతవారం తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని సోమవారం ఆయనకు కాల్‌ వచ్చింది. దీంతో తండ్రి స్కూల్‌ వద్దకు వెళ్లగా.. బాలుడిని పాఠశాల డైరెక్టర్‌ తండ్రి తనక ఆరులో ఆసుపత్రికి తీసుకెళ్లాడని వార్డెన్‌ చెప్పాడు. దీంతో హాస్టల్ దగ్గరే వేచి ఉన్న కృష్ణన్‌కు  మీ కొడుకు చనిపోయాడని దినేశ్ బాఘెల్ చెప్పాడు. తన కారులో ఉన్న మృతదేహాన్ని అప్పగించాడు. అయితే కొడుకు మరణంపై అనుమానంతో కృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

స్కూల్​ డైరక్టర్​ తండ్రి దినేశ్​ బఘేల్‌కు క్షుద్రపూజల మీద నమ్మకం ఉందని పోలీసులు తెలిపారు. బాలుడిని తొలుత స్కూల్​ బయట ఉన్న గొట్టపు బావి ​​ దగ్గర చంపాలని భావించారు. కానీ హాస్టల్​ నుంచి బయటకు తీసుకువెళుతుండగా బాలుడు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఫలితంగా అక్కడే, అతడి గొంతు నులిమి చంపేశారు.

స్కూల్‌కు సమీపంలో క్షుద్రపూజలకు సంబంధించిన కొన్ని వస్తువులు పోలీసుల దర్యాప్తులో బయటపడ్డాయి. అయితే స్కూల్​ సక్సెస్​ కోసం క్షుద్రపూజలు చేయాలని నిందితులు గతంలో కూడా ప్లాన్​ వేశారు. సెప్టెంబర్​ 6వ 9వ తరగతి స్టూడెంట్​ని బలి ఇవ్వాలని చూశారు. కానీ విఫలం అయ్యారని తేలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement