3 నెలల క్రితం అత్యాచారం.. నేడు పెట్రోల్‌ పోసి! | Girl Deceased With Molestation In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

3 నెలల క్రితం అత్యాచారం.. నేడు పెట్రోల్‌ పోసి!

Published Wed, Nov 18 2020 12:02 PM | Last Updated on Wed, Nov 18 2020 12:47 PM

Girl Deceased With Molestation In Uttar Pradesh - Sakshi

లక్నో: వరుస అత్యాచార ఘటనలకు ఉత్తరప్రదేశ్‌ కేంద్ర బిందువుగా మారింది. మూడు నెలల క్రితం జరిగిన అత్యాచార బాదితురాలిపై నిప్పంటించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. వివరాలు.. బులంద్‌షహర్‌లో 15 ఏళ్ల మైనర్‌పై ఆగష్టు 15న ముగ్గురు దుండగులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరు జైలుల్లో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే కేసును ఉపసంహరించుకోవాలని నిందితుల మామ, స్నేహితులు బాధితురాలిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో కాలిన గాయాలతో బాలిక బులంద్‌షహర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. చదవండి: పదేళ్లుగా 50 మంది బాలికలపై అత్యాచారం..

అత్యాచారానికి పాల్పడిన నిందితుల కుటుంబం నుంచి బెదిరింపులు తలెత్తడంతో తనకు తానుగా నిప్పంటించుకున్నానని వీడియో రూపంలో తెలియజేసింది. కాగా తన కూతురిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు అత్యాచార ఘటనలో అలసత్వం ప్రదర్శించినందుకు ఇద్దరు పోలీసులను ఎస్పీ సంతోష్‌ కుమార్‌ విధుల నుంచి తొలగించారు. వారి స్థానంలో సీనియర్‌ పోలీస్‌ అధికారులను నియమించారు. చదవండి: విచక్షణ కోల్పోయి: భార్య, కుమారుడిపై...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement