hathras
-
యూపీలో ఘోరం.. స్కూల్ బాగుండాలని 2వ తరగతి విద్యార్థి బలి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. క్షుద్ర పూజల పేరిట హథ్రాస్‌లో 2వ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని బలి ఇచ్చారు. విద్యార్ధి చదువుతున్న పాఠశాల అభివృద్ధి చెందాలని స్కూల్ హాస్ట్‌లోనే బాలుడిని హత్య చేశారు. వారం కిందట జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది.బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాఠశాల యజమాని జసోదన్ సింగ్‌తో, అతని కుమారుడు దినేష్ భఘేల్ పాటు మరో ముగ్గురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.విచారణలో భాగంగా వెలువడిన పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు... 11 ఏళ్ల కృతార్థ్ హథ్రాస్ జిల్లాలోని రస్‌గవాన్‌లోని డీఎల్ పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గతవారం తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని సోమవారం ఆయనకు కాల్ వచ్చింది. దీంతో తండ్రి స్కూల్ వద్దకు వెళ్లగా.. బాలుడిని పాఠశాల డైరెక్టర్ తండ్రి తనక ఆరులో ఆసుపత్రికి తీసుకెళ్లాడని వార్డెన్ చెప్పాడు. దీంతో హాస్టల్ దగ్గరే వేచి ఉన్న కృష్ణన్‌కు మీ కొడుకు చనిపోయాడని దినేశ్ బాఘెల్ చెప్పాడు. తన కారులో ఉన్న మృతదేహాన్ని అప్పగించాడు. అయితే కొడుకు మరణంపై అనుమానంతో కృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.స్కూల్ డైరక్టర్ తండ్రి దినేశ్ బఘేల్‌కు క్షుద్రపూజల మీద నమ్మకం ఉందని పోలీసులు తెలిపారు. బాలుడిని తొలుత స్కూల్ బయట ఉన్న గొట్టపు బావి దగ్గర చంపాలని భావించారు. కానీ హాస్టల్ నుంచి బయటకు తీసుకువెళుతుండగా బాలుడు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఫలితంగా అక్కడే, అతడి గొంతు నులిమి చంపేశారు.స్కూల్‌కు సమీపంలో క్షుద్రపూజలకు సంబంధించిన కొన్ని వస్తువులు పోలీసుల దర్యాప్తులో బయటపడ్డాయి. అయితే స్కూల్ సక్సెస్ కోసం క్షుద్రపూజలు చేయాలని నిందితులు గతంలో కూడా ప్లాన్ వేశారు. సెప్టెంబర్ 6వ 9వ తరగతి స్టూడెంట్‌ని బలి ఇవ్వాలని చూశారు. కానీ విఫలం అయ్యారని తేలింది. -
‘ఉన్నావ్, హత్రాస్ ఘటనల్లో ఏం న్యాయం చేశారు?’
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై బెంగాల్లో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం మంగళవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి.. అత్యాచార నిరోధక బిల్లును ఆమోదించింది. ఈ సందర్భంగా మహిళలపై హత్యాచార నేరాలు జరగకుండా ఉండేందుకు సామాజిక సంస్కరణలు అవసరమని సీఎం మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఆర్జీకర్ హత్యాచార ఘటనపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను అసెంబ్లీ సాక్షిగా మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. మహిళలపై ఇటువంటి దారుణ ఘటనలు ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగాయని, బీజేపీ పాలిత గుజరాత్, యూపీలో బాధితులకు న్యాయం ఏళ్లతరబడి కూడా అందడం లేదని ప్రస్తావించారామె. ఘటనలు జరిగి ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికీ బాధితుల కుటుంబాలకు న్యాయం జరగలేదు. 2020లో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 20 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం, 2013లో బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థినిపై హత్యాచారం, గత వారం బీజేపీ పాలిత రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రభుత్వ హాస్పిటల్ ఓ చిన్నారిపై జరిగిన అత్యాచారం జరిగాయి. ఆయా ఘటనల్లో ఏం న్యాయం చేశారో బీజేపీ వాళ్లు చెప్పగలరా? అని ప్రశ్నించారామె. అదేవిధంగా బెంగాల్‌లోని నార్త్ పరగణాలలో జరిగిన హత్యాచారం కేసులో శిక్ష విధించాలని తాము డిమాండ్ చేస్తున్నామని, కానీ ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని గుర్తు చేశారు. ఇదే కేసులో కలకత్తా హైకోర్టు ఒక నిందితుడిని నిర్దోషిగా ప్రకటించి, మరో ఇద్దరి మరణశిక్షను తగ్గించిన తర్వాత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారామె. ఉన్నావ్, హత్రాస్ దారుణ ఘటనల్లో బాధితురాలికి న్యాయం జరగలేదని మాత్రం ఎవరూ మాట్లాడరని బీజేపీ నేతలపై ఆమె మండిపడ్డారు.వాస్తవానికి.. మహిళలపై దారుణమైన నేరాలు, లైంగిక దాడులు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, గుజరాత్లో ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. ఆ రాష్ట్రాలో జరిగిన ఘటనలకు న్యాయం జరగటం లేదని, పశ్చిమ బెంగాల్లో కోర్టు న్యాయం లభిస్తోందని తెలిపారు. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలను తీసుకురాని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు.. మహిళలపై దారుణాలు జరుగుతున్న బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారామె. మీరు(బీజేపీ) తమకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లే తాను కూడా ప్రధానమంత్రికి, హోంమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీదీ సర్కార్ తెచ్చిన కొత్త చట్టానికి ‘అపరాజిత’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.Kolkata: At the West Bengal Assembly, CM Mamata Banerjee says, "...I express my condolences to the girl who was raped, murdered and to her family. When the RG Kar incident took place on the night of 9th August, I was in Jhargram. On 10th August, the body was found, and on 12th… pic.twitter.com/TjTZS1gJnc— ANI (@ANI) September 3, 2024#WATCH | Kolkata: At the West Bengal Assembly, CM Mamata Banerjee says, "...I had written two letters to the Prime Minister, but I did not get any reply from him, rather I got a reply from the Minister of Women and Child Development, but I also replied to his reply and informed… pic.twitter.com/XKmSOWDj3B— ANI (@ANI) September 3, 2024 -
పుట్టినవాడు గిట్టక తప్పదు
లక్నో: హత్రాస్ తొక్కిసలాట తనను తీవ్రంగా కలచివేసిందని, అయితే విధిరాతను ఎవరూ తప్పించలేరని భోలే బాబా అన్నారు. అందరూ ఏదో ఒకరోజు మరణించక తప్పదని వేదాంతం వల్లెవేశారు. భోలే బాబా సత్సంగ్‌లో తొక్కిసలాటలో ఇటీవల 121 మంది మరణించడం తెలిసిందే. బుధవారం ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘పుట్టినవాడు ఏదో ఒకరోజు గిట్టక తప్పదు. కాస్తా ముందూ వెనకా అంతే’ అన్నారు. తొక్కిసలాట వెనుక కుట్ర ఉందని పునరుద్ఘాటించారు. ‘జూలై 2 దుర్ఘటన తర్వాత నేను తీవ్ర నిరాశకు లోనయ్యా, కలత చెందా. కానీ జరిగేదాన్ని ఎవరూ తప్పించలేరు. విషపూరిత రసాయనాలను స్ప్రే చేశారని నా న్యాయవాది, ప్రత్యక్షసాక్షులు చెప్పింది ముమ్మాటికీ నిజం. దీనివెనుక కచి్చతంగా కుట్ర ఉంది’ అని బాబా పేర్కొన్నారు. -
హత్రాస్ ఘటన: మృతదేహాల నుంచి నగలు మాయం
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటకు సంబంధించి మరికొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సత్సంగానికి హాజరైన పలువురు మహిళలు మంగళసూత్రాలు, నగలు వేసుకుని వచ్చారు. అయితే తొక్కిసలాటలో మృతిచెందిన మహిళల మెడలో ఉండాల్సిన నగలు మాయమయ్యాయి. దీంతో ఇక్కడ మనుషులే కాదు మానవత్వం కూడా చచ్పిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఘటనా స్థలంలో ఇప్పటికీ భయానక దృశ్యానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చెప్పులు, దుస్తులు, వంట పాత్రలు, బ్యాగులు.. ఇప్పటికీ అక్కడ కనిపిస్తున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు ఇక్కడకు చేరుకుని తమవారి వస్తువుల కోసం వెతికారు. వారికి అక్కడ తమ వారి విలువైన వస్తువులేవీ లభించలేదు. తమ ఇంటి మహిళలు మంగళసూత్రాలు, చెవిపోగులు, బంగారు గాజులు ధరించి ఇంటి నుంచి వచ్చారని అయితే వారి మృతదేహాలపై ఉండాల్సిన నగలు మాయమయ్యాయని బాధిత కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.ఆస్పత్రిలో తన తల్లి ఆశాదేవి మృతదేహం ఉందని, అయితే ఆమె సత్సంగానికి వెళ్లిన సమయంలో వేసుకున్న నగలు మాయమయ్యాయని ఆమె కుమారుడు తెలిపాడు. కస్గంజ్లోని పాటియాలీ నివాసి బ్రజేష్ తల్లి కూడా ఈ తొక్కిసలాటలో కన్నుమూసింది. ఆమె మెడలో ఉండాల్సిన నగలు కూడా మాయమయ్యాయి. ఇదేవిధంగా పాటియాలీకి చెందిన జైవీర్ తల్లికి చెందిన బంగారు గొలుసు, ముక్కుపుడక, చెవిపోగులు మాయమయ్యాయి. ఘటన అనంతరం మృతదేహాలను, క్షతగాత్రులను ఒకే అంబులెన్స్‌లో ఎక్కించారని బాధితులు తెలిపారు. సంఘటనా స్థలంలో తగినన్ని అంబులెన్స్‌లు, ఇతర వైద్య సౌకర్యాలు ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవి కావని బాధితులు పేర్కొన్నారు. -
హత్రాస్ ఘటన: పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
ఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ విచారణ కోసం లిస్ట్ చేయాలని సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. దీంతో సుప్రీం కోర్టు రిజిస్ట్రీ జూలై 12న (శుక్రవారం) పిటిషన్ విచారణను షెడ్యూల్ చేసింది. ఈ నెల 2న హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటల ఘటనలో 121 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు లాయర్ విశాల్ తివారీ.. అత్యున్నంత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా ఈ ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై నివేదిక తయారు చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు.మరోవైపు.. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇవాళ తన నివేదికను వెల్లడించింది. తొక్కిసలాట ప్రమాదానికి ఆర్గనైజర్ల నిర్వహణ వైఫల్యమే కారణమని సిట్ ప్రాథమికంగా వెల్లడించింది. వాస్తవాలను దాచిపెట్టి నిర్వాహకులు సత్సంగ్ కార్యక్రమానికి అనుమతులు తీసుకున్నారని పేర్కొంది. షరతులు పాటించకుండ ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలను ఆహ్వానించారని తెలిపింది. ..పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు కనీస ఏర్పాట్లు చేయలేదని తెలిపింది. పోలీసు వెరిఫికేషన్ లేకుండానే వాలంటీర్లను నియమించుకున్నారని, భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా లేవని పేర్కొంది. భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వారు బయటకు వెళ్లేందుకు బారికేడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రమాదం జరిగిన తర్వాత సత్సంగ్ నిర్వాహకుల కమిటీలోని సభ్యులు అక్కడినుంచి పారిపోయారని సిట్ తన నివేదికలో వెల్లడించింది. -
హత్రాస్ ఘటనపై 850 పేజీల సిట్ రిపోర్టు
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ తొక్కిసలాట కేసులో సిట్ నివేదిక వెలువడింది. యూపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు సిట్ ఈ కేసుపై విచారణ జరిపింది. తాజాగా సిట్ ఈ నివేదికను హోం శాఖకు అందజేసింది. బాధ్యులందరి పేర్లు ఈ నివేదికలో ఉన్నాయి.ఈ కేసులో 128 మందితో జరిపిన సంభాషణల ఆధారంగా సిట్ అధికారులు ఈ నివేదికను రూపొందించారు. ఇందులో సత్సంగంలో ప్రమాదం ఎలా జరిగింది? ఈ ప్రమాదానికి ఎవరు కారకులనేది వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ నివేదిక గోప్యంగా ఉంచారు. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు సీఎం ఆదేశించనున్నారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నివేదికపై సీనియర్ అధికారులతో చర్చించనున్నారు. ఏడీజీ ఏడీజీ అనుపమ కులశ్రేష్ఠ, అలీగఢ్ డివిజనల్ కమిషనర్ చైత్ర వి ఈ నివేదికను రూపొందించారు. సిట్ రూపొందించిన ఈ నివేదిక 850 పేజీలు ఉన్నట్లు సమాచారం.ఇటీవల హత్రాస్‌లో బాబా సాకార్ హరి అలియాస్ భోలే బాబా సత్సంగం సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. భోలే బాబా పాదాలను పూజించేందుకు భక్తులు ఒక చోట గుమిగూడిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతిచెందిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు.మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ కేసులో ఆర్గనైజింగ్ కమిటీతో సంబంధం కలిగినవారిని అరెస్టు చేశారు. అయితే ఎఫ్ఐఆర్లో బాబా పేరు లేదు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఘటనాస్థలికి వెళ్లారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. -
హత్రాస్ తొక్కిసలాట: ‘బోలేబాబా’ లాయర్ సంచలన కామెంట్స్
న్యూఢిల్లీ: హత్రాస్ తొక్కిసలాటకు సంబంధించి బోలేబాబా న్యాయవాది సింగ్ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. జులై 2న హత్రాస్ సత్సంగ్‌లో కొందరు వ్యక్తులు విషపూరిత డబ్బాలను తెరిచారని, దీనివల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. ఈ విషయాన్ని కొందరు ప్రత్యక్ష సాక్షులు తనతో చెప్పినట్లు సింగ్ తెలిపారు. ఆదివారం(జులై 7) ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగ్ మాట్లాడారు. పెరిగిపోతున్న బోలేబాబా పాపులారిటీని ఓర్వలేకే ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ‘తొక్కిసలాటకు ముందు 15 మంది దాకా దుండగులు అక్కడ విషపూరిత డబ్బాలను తెరిచారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు నన్ను కలిసి చెప్పారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి పోస్టుమార్టం రిపోర్టులను పరిశీలిస్తే వారు ఊపిరాడకపోవడం వల్లే చనిపోయారని స్పష్టంగా తెలుస్తుంది. అంతేగాక సత్సంగ్ సమీపంలోనే దుండగులు పారిపోయేందుకు వాహనాలు కూడా సిద్ధం చేసి ఉంచుకున్నారు. ఇందుకు మా వద్ద ఆధారాలున్నాయి. సాక్షులకు సెక్యూరిటీ ఇవ్వాలి’అని సింగ్ కోరారు.జులై 2న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో బోలేబాబా సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఘటనపై విచారణకుగాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను కూడా నియమించింది. -
హత్రాస్ ఘటన: వెలుగులోకి ‘భోలే బాబా’ భవనం, ఖరీదైన కార్లు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్( భోలే బాబా)పై శనివారం తొలి కేసు నమోదైంది. అయితే భోలే బాబాకు సంబంధించి పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019కి ముందు భోలేబాబా కొన్ని రోజులు లఖింపూర్‌ఖేరిలో అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అజ్ఞాతంలో ఉన్నప్పడు నివసించిన విలాసవంతమైన భవనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ భవనంలో ఒక లగ్జరీ కార్లు, గుహ వంటి నిర్మాణంలో ఉన్న గది ఉన్నాయి. అందులో భోలే బాబా ఫొటోలు, మంత్రాల చిత్రాలు కనిపించాయి. ఈ బిల్డింగ్‌లోనే భోలే బాబా మూడునాలుగు సార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన చివరిసారి ఇక్కడ 2019లో 15 రోజులపాటు ఉన్నట్లు ఈ భవనం యజమాని గోవింద్ పుర్వార్ తలిపారు. ఇక.. ఈ బిల్డిండ్ పూర్తిగా వ్యవసాయ భూములు, పెద్ద తోటల మధ్యలో ఉండటం గమనార్హం. ఈ భవనంలో విశాలమైన పార్కింగ్ స్థలం ఉంది. భోలే బాబాకు చెందిన రెండు లగ్జరీ కార్లు ఇక్కడ పార్క్ చేయబడి ఉన్నాయి. వంట చేసుకోవటం కోసం కిచన్, స్టవ్, సామాగ్రి కూడా ఉన్నాయి. వంటగది పక్కనే గుహవంటి రూం ఉంది. ఇందులో 2019 నాటి భోలే బాబా సత్సంగ్ పోటోలు ఉన్నాయి. మరో గదిలో గోధుమ కంటేయినర్లు, భోలే బాబా ఫోటోలు, హనుహాన్ చాలిసా మాదిరిగా చేతితో రాసిన హారతి చాలిసా ఉన్నాయి. అయితే భోలే బాబా ఈ భవనంలో విశ్రాంతి తీసుకునేవారని స్థానికంగా ఉండే ఆయన భక్తులు మీడియాతో తెలిపారు.ఇక తొక్కిసలాట ఘటన తర్వాత భోలేబాబా శనివారం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. జులై 2న జరిగిన ఘటనతో చాలా వేదనకు గురైనట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధను భరించే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులకు సూచించారు. ఘటనకు కారకులను విడిచిపెట్టరనే విశ్వాసం తనకు ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి అండగా ఉండాలని కమిటీ సభ్యులను అభ్యర్థించినట్లు పేర్కొన్నారు.మరోవైపు హత్రాస్ ఘటనపై విచారణ జరిపేందుకు యూపీ ప్రభుత్వం జూలై 3న హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. -
హత్రాస్ తొక్కిసలాట.. భోలే బాబాపై తొలి కేసు నమోదు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్ అలియాస్ భోలే బాబాపై తొలి కేసు నమోదైంది. పాట్నా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆయనపై కేసు నమోదైంది.కాగా, జూలై 2న 121 మంది ప్రాణాలను బలిగొన్న హత్రాస్ తొక్కిసలాటలో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. మధుకర్‌ను శనివారం స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. తొక్కిసలాట జరిగిన సత్సంగానికి చెందిన 'ముఖ్య సేవాదార్' మధుకర్ ప్రథమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఏకైక నిందితుడు. కాగా ఉత్తరప్రదేశ్ పోలీసులు మధుకర్‌ను పట్టుకునే వారికి రూ.లక్ష రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందేఇక తొక్కిసలాట ఘటన తర్వాత భోలో బాబా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. జులై 2న జరిగిన ఘటనతో చాలా వేదనకు గురైనట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధను భరించే శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులకు సూచించారు. ఘటనకు కారకులను విడిచిపెట్టరనే విశ్వాసం తనకు ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి అండగా ఉండాలని కమిటీ సభ్యులను అభ్యర్థించినట్లు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.మరోవైపు హత్రాస్ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు, తొక్కిసలాట వెనుక కుట్ర ఉందనే విషయాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. -
హత్రాస్ ఘటన: మీడియా ముందుకొచ్చిన భోలే బాబా
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన ‘భోలే బాబా’ సత్సంగ్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదానికి గురిచేసింది. ఈ ఘటనలో121 మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత ‘భోలే బాబా’ నారాయణ్ శంకర్ హరీ పరారైనట్లు పోలీసులు ప్రకటించారు. అయితే తాజాగా ఆ బాబా మీడియా ద్వారా మాట్లాడారు.‘జులై 2న జరిగిన ఘటన బాధాకారం. ఈ బాధను భరించే శక్తిని దేవుడు మాకివ్వాలి. తొక్కిసలాటకు కారకులైన వాళ్లెవరైనా ఉపేక్షించకూడదు. ప్రభుత్వం, అధికారం యంత్రాంగంపై నమ్మకం ఉంది. బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలని కమిటీ సభ్యుల్ని కోరుతున్నా. అలాగే క్షతగాత్రులకు అవసరమైన సాయం అందించాలని కోరుతున్నా అని తన లాయర్ ఏపీ సింగ్ ద్వారా బోలే బాబా సందేశం పంపించారు’’.#WATCH | Hathras Stampede Accident | Mainpuri, UP: In a video statement, Surajpal also known as 'Bhole Baba' says, "... I am deeply saddened after the incident of July 2. May God give us the strength to bear this pain. Please keep faith in the government and the administration. I… pic.twitter.com/7HSrK2WNEM— ANI (@ANI) July 6, 2024భోలే బాబా నేర చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని అలీగఢ్ ఐజీ శలభ్ శుక్రవారం తెలిపారు. అయితే, సత్సంగ్‌కు ఆయన పేరుతో కార్యక్రమానికి అనుమతి తీసుకోలేదని తెలిపారు. అవసరమైతే బాబాను ప్రశ్నిస్తామన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ‘భోలే బాబా’పేరులో లేకపోవటం గమనార్హం. ఈ ఘటనలో సత్సంగ్ ఆర్గనైజింగ్ నిర్వాహకులతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని, వీరు సత్సంగ్ కార్యక్రమ నిర్వాహకులు, సేవాదార్లుగా పనిచేస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు ‘ముఖ్య సేవాదర్’దేవప్రకాశ్ మధూకర్‌ను ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు హత్రాస్ పోలీసులు శుక్రవారం తెలిపారు.అయితే.. పోలీసులు మధూకర్‌ను అరెస్టు చేయలేదని, ఆయనే లొంగిపోయరని ఆయన తరఫు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. ‘‘ ఈ రోజు (శుక్రవారం) దేవ్‌ప్రకాశ్ మధూకర్ పోలీసులకు లొంగిపోయారు. సత్సంగ్ ప్రధాన నిర్వాహకుడైన దేవ్ ప్రకాశ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. మేము చేసి తప్పు ఏంటీ? మా తప్పులేనప్పడు ముందస్తు బెయిల్ దాఖలు చేయటం లేదు. అదే విధంగా మధూకర్ హార్ట్ పేషెంట్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. దర్యాప్తుకు సహకరించటం కోసం ఆయన పోలీసులకు లొంగిపోయారు’’ అని న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడిన వీడియో విడుదల చేశారు. ఈ ఘటనపై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 90 మంది వద్ద స్టేట్మెంట్ రికార్డు చేసుకుంది. ఈ ఘటపై విచారణ కోసం యూపీ ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది.చదవండి: లగ్జరీ కార్లు, ఆశ్రమాలు.. భోలే బాబా ఆస్తులు రూ. 100 కోట్లకు పైనే! -
హత్రాస్ ఘటన: లొంగిపోయిన ప్రధాన నిందితుడు
యూపీలోని హత్రాస్‌లో సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మృతి చెందారు. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్ ఢిల్లీలో లొంగిపోయాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు మధుకర్‌ను యూపీ పోలీసులకు అప్పగించినట్లు సుప్రీంకోర్టు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.రాజస్థాన్, హర్యానాతో పాటు యూపీలో మధుకర్ కోసం హత్రాస్ పోలీసులు వెదుకులాట సాగించారు. మధుకర్ లొంగిపోయిన తర్వాత అరెస్టు చేశారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్లో చీఫ్ సేవాధర్ మధుకర్ మాత్రమే నిందితునిగా ఉన్నాడు. అతనిపై రూ.లక్ష రివార్డు ప్రకటించారు. మధుకర్ ఢిల్లీలో వైద్య చికిత్స పొందుతున్నాడని న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. మధుకర్‌పై నేరపూరిత నరహత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు ఇండియన్ జస్టిస్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఆగ్రా జోన్ ఏడీజీ అనుపమ్ కులశ్రేష్ట్ మాట్లాడుతూ త్వరలోనే ఈ కేసుపై సిట్ తుది నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో 132 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. మరోవైపు నారాయణ్ సాకార్ విశ్వ హరి అలియాస్ భోలే బాబా ప్రమేయంపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఎఫ్ఐఆర్లో భోలే బాబా పేరు లేదు. కాగా దర్యాప్తునకు ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్ హత్రాస్‌కు చేరుకుంది. -
లగ్జరీ కార్లు, ఆశ్రమాలు.. భోలే బాబా ఆస్తులు రూ. 100 కోట్లకు పైనే!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కారణమైన సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్ అలియాస్ భోలే బాబాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హథ్రాస్ తొక్కిసలాటలో 121 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆచూకి తెలియరాలేదు.అయితే ఈ విషాదంపై దర్యాప్తులో భాగంగా ఆయన ఆదాయం, సంపద వెలుగు చూసింది. గత ఇరవై ఏళ్ల కాలంలో భేలే బాబా దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారు. నిత్యం తెల్లటి సూటు, బూట్లు, టై, నల్ల కండ్లద్దాలతో కనిపించే భోలే బాబా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కాస్గంజ్, ఆగ్రా, కాన్పూర్, గ్వాలియర్ సహా దేశవ్యాప్తంగా మొత్తం 24 విలాసవంతమైన ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా యూపీలోనే ఉన్నాయి. శ్రీ నారాయణ్ హరి సాకార్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట వీటిని నిర్వహిస్తుంటారు. అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్లే వీటి నిర్వహణ బాధ్యతలను చూస్తుంటారు.ఇక భోలే బాబా సూరజ్‌పాల్ మెయిన్‌పురిలోని విలాసవంతమైన హరి నగర్ ఆశ్రమంలో నివాసముంటారు. ఈ ఆశ్రమం మొత్తం 13 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. రాజభవనాన్ని పోలి ఉన్న ఈ ఆశ్రమాన్ని రూ. 4 కోట్లతో నిర్మించారు.ఆయన భక్తులలో ఒకరు ఈ స్థలాన్ని బాబాకు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.ఇందులో భోలే బాబా, ఆయన భార్య కోసం అందులో దాదాపు ఆరు విలాసవంతమైన గదులు ఉంటాయని సమాచారం. ఆశ్రమంలోకి ప్రవేశిస్తుండగానే దానికి విరాళాలిచ్చిన 200 మంది పేర్లు కనిపిస్తాయని తెలుస్తోంది. వాటిపై రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఇచ్చిన దాతల వివరాలు ఉంటాయని సమాచారం. ఇటావాలో మరో కొత్త ఆశ్రమం నిర్మాణంలో ఉంది.ఆయనకు దాదాపు 16 మంది వ్యక్తిగత కమాండోలు ఉంటారు. అనుచరులకు దర్శనమిచ్చే సమయంలో భోలే బాబా తెల్లటి టయోటా ఫార్చునర్ కారులో వస్తాడు. అందులో బాబా ప్రయాణిస్తుండగా.. ముందు ఆయన కమాండోలు బైక్‌లపై దారిని క్లియర్ చేస్తారు. అదే విధంగా వెనుక దాదాపు 30 లగ్జరీ కార్లతో ఆయన కాన్వాయ్ ఉంటుంది. ఇక భోలే బాబా ఉపయోగించే కారు ఇంటీరియర్ మొత్తం తెలుపు రంగులోనే ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంది.యూపీలోని ఎటా జిల్లా బహదూర్ గ్రామానికి చెందిన సూరజ్ పాల్ మొదట తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. తర్వాత పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరి 18 ఏళ్ల పాటు పని చేశాడు. ఈ సమయంలోనే తాను ఇంటలిజెన్స్ బ్యూరోలో పని చేస్తున్నట్టు చెప్పుకొని జనాన్ని బురిడీ కొట్టించేవాడు. తనకు తాను భగవంతుడి ప్రతిరూపంగా ప్రచారం చేసుకుంటున్న భోలే బాబా 1999లో కానిస్టేబుల్ ఉద్యోగం వదిలి బోధించడం ప్రారంభించాడు. ఖరీదైన వస్తువులు, కార్లపై ప్రీతి కలిగిన ఆయనకు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వీటిని తన భక్తుల పేర్లతో కొనుగోలు చేసేవాడు.హథ్రాస్‌లోని భోలే బాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కు చేరుకుంది. వందలాది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. సత్సంగ్‌ను వీరే నిర్వహించారని, కార్యక్రమానికి వీరే అనుమతి పొందారని పోలీసులు చెప్పారు.ఈ కార్యక్రమానికి నిర్వాహకులు కేవలం 80,000 మందికి మాత్రమే అనుమతినివ్వగా.. దాదాపు 2.5 లక్షల మంది అనుచరులు తరలివచ్చారని పోలీసులు తెలిపారు. భోలే బాబా వేదిక నుంచి వెళుతున్న సమయంలో అతని కాన్వాయ్ ద్వారా తన్నిన ధూళిని సేకరించడానికి భక్తుల గుంపు పరుగెత్తుకొచ్చింది, ఇది ఒక ఆశీర్వాదంగా భావిస్తారు. అయితే గుంపును నియంత్రించే ప్రయత్నంలో వాలంటీర్లు, అతని భద్రత సిబ్బంది ప్రజలను వెనక్కి నెట్టడం ప్రారంభించారు. దీంతో అనేక మంది భక్తులు గుంపుగా పడి నలిగిపోయారు. అక్కడి నుంచి పరుగెత్తడంతో తొక్కిసలాట జరిగింది.అయితే ఇప్పటి వరకు సూరజ్ పాల్ అలియాస్ భోలే బాబా ఆచూకీ మాత్రం తెలియ రాలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు భోలే బాబా ఆశ్రమానికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. ఎఫ్ఐఆర్లో భోలే బాబా పేరు లేనందున ఆయనను అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిని విచారించిన తర్వాత అవసరమైతే భోలే బాబాను విచారిస్తామని తెలిపారు. -
హత్రాస్ ప్రమాదాన్ని రాజకీయం చేయాలని లేదు: రాహుల్ గాంధీ
లక్నో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హత్రాస్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా హత్రాస్ దుర్ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలను రాహుల్ పరామర్శించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.కాగా, రాహుల్ హత్రాస్ పర్యటన సందర్భంగా అలీఘర్‌లోని పిల్ఖానాలో ఛోటే లాల్ భార్య మంజు, ఛోటే లాల్ కుమారుడు పంకజ్, ప్రేమవతి, ప్రమాదంలో మరణించిన విజయ్ సింగ్ భార్య శాంతి దేవి కుటుంబాలను కలుసుకున్నారు. వారిని పరామర్శించారు. అనంతరం, హత్రాస్‌లోని నవీపూర్ ఖుర్ద్, విభవ్ నగర్లో ఉన్న గ్రీన్ పార్కుకు చేరుకుంటారు. ఇక్కడ రాహుల్ గాంధీ జుగ్ను, సుభాష్ చంద్, కిషన్ లాల్ కుటుంబ సభ్యులను కలిశారు. VIDEO | Congress MP Rahul Gandhi (@RahulGandhi) meets the families of the Hathras stampede victims in Aligarh.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/LQ6wTonyDe— Press Trust of India (@PTI_News) July 5, 2024 అనంతరం, రాహుల్ మీడియాతో మాట్లాడుతూ..‘రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ..‘హత్రాస్ ఘటనను రాజకీయం చేయాలనుకోవడం లేదు. హత్రాస్ ఘటన విషయంతో యూపీ సీఎం యోగి పెద్ద మనసు చేసుకోవాలి. బాధితులకు ఆరేళ్ల తర్వాత పరిహరం చేయడం కాకుండా.. వెంటనే న్యాయం చేయాలి. హత్రాస్‌లో భద్రతా వైఫ్యలం కారణంగా ప్రమాదం జరిగినట్టు బాధిత కుటుంబాల సభ్యులు చెబుతున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | Hathras, UP: After meeting the victims of the stampede, Congress MP and LoP in Lok Sabha, Rahul Gandhi says "It is a sad incident. Several people have died. I don't want to say this from a political prism but there have been deficiencies on the part of the administration… pic.twitter.com/n2CXvZztJx— ANI (@ANI) July 5, 2024 ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం హత్రాస్‌లో సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట కారణంగా 121 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక, ఈ ఘటనపై యూపీలోకి యోగీ సర్కార్ న్యాయ విచారణకు ఆదేశించింది. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారు సాక్ష్యాలను దాచిపెట్టారని, నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఇక, ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ బుధవారం హత్రాస్‌ను సందర్శించి ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించారు. ఈ ప్రమాదానికి కారణమైన భోలే బాబా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. #WATCH | Uttar Pradesh: Congress MP Rahul Gandhi leaves from the residence of a victim of the Hathras stampede accident, in Aligarh. pic.twitter.com/OUecgpgAXL— ANI (@ANI) July 5, 2024 -
హత్రాస్ తొక్కిసలాట: ఆరుగురి అరెస్ట్, అవసరమైతే బాబాను విచారణ
హత్రాస్ తొక్కిసలాట కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో సత్సంగ్ ఆర్గనైజింగ్ నిర్వాహకులతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని, వీరు సత్సంగ్ కార్యక్రమ నిర్వాహకులు, సేవాదార్లుగా పనిచేస్తున్నారని అలీగఢ్ ఐజీ శలభ్ పేర్కొన్నారు.ప్రధాన నిర్వాహకుడిని పట్టుకునేందుకు రూ.లక్ష రివార్డును ప్రకటించినట్లు తెలిపారు. త్వరలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబోతున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. జనాలు ఒకేసారి గుంపుగా రాగా.. నిర్వాహకులు అడ్డుకున్నారని.. ఆ తర్వాత ఒకేసారి బయటకు రావడంతో ప్రమాదం జరిగిందన్నారు. మహిళలు, పిల్లలు ఒకరిపై పడిపోయారన్నారు. భోలే బాబా నేర చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని ఐజీ వెల్లడించారు. అయితే, సత్సంగ్‌కు ఆయన పేరుతో కార్యక్రమానికి అనుమతి తీసుకోలేదని తెలిపారు. అవసరమైతే బాబాను ప్రశ్నిస్తామన్నారు. అప్పటి వరకు 121 మంది మృతి చెందారని.. మృతుల ఆచూకీ గుర్తించినట్లు తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ సైతం పూర్తయ్యిందన్నారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
Hathras Incident: ఊపిరాడక కొందరు.. ఎముకలు విరిగి మరికొందరు..
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 121 మంది మృతిచెందారు. వీరికి సంబంధించిన పోస్ట్‌మార్టం నివేదికలలో వీరంతా ఎలా మృతి చెందినదీ తెలియవచ్చింది. ఈ వివరాలు ఎవరినైనా కంటతడి పెట్టించేలా ఉన్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం అలీఘర్‌లో 37 మందికి పోస్టుమార్టం నిర్వహించగా, వారిలో 10 మంది ఊపిరాడక మృతి చెందారని వైద్యులు తెలిపారు. తలకు బలమైన గాయాలు కావడం, ఎముకలు విరిగిపోవడం, బ్రెయిన్ హెమరేజ్ మొదలైనవి పలువురి మృతికి కారణంగా నిలిచాయి. 12 నుంచి 15 మంది కాలేయం, ఊపిరితిత్తులు పగిలిపోవడంతో మృతి చెందారు. తల, భుజం, మెడ, వెన్నెముకపై తీవ్రమైన గాయాల కారణంగా మరికొందరు మృతి చెందారు.జిల్లా ఆస్పత్రిలోని పోస్ట్‌మార్టం హౌస్‌కు మృతదేహాలు చేరుకోగానే.. అప్పటికే అక్కడికి వచ్చిన మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు తమ వారిని చూసుకుని బిగ్గరగా రోదించారు. ఈ దృశ్యాన్ని చూసినవారంతా కంటతడి పెట్టుకున్నారు. పోస్టుమార్టం హౌస్ వద్దకు అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల్లో మృతదేహాలను వరుసగా తీసుకువస్తుండటంతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యారు. మృతదేహాలను ఉంచేందుకు జిల్లా ఆసుపత్రిలోని మార్చురీ, పోస్ట్‌మార్టం హౌస్ సరిపోలేదు. దీంతో వాటిని తెల్లటి వస్త్రాలలో చుట్టి, ఆస్పత్రి ఆవరణలోనే ఉంచారు. -
Hathras Satsang Stampede: అనుమతి 80 వేల మందికి.. వచ్చింది 2.5 లక్షలు
హత్రాస్/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా ఫూల్రాయ్ గ్రామంలో తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య బుధవారం 121కి చేరుకుంది. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్య సేవాదార్ దేవప్రకాశ్ మధుకర్‌తోపాటు ఇతరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. భోలే బాబా పేరును ఇంకా చేర్చలేదు. 80 వేల మందికే అనుమతి ఉంటే 2.5 లక్షల మంది వచ్చారని ఎఫ్ఐఆర్లో పోలీసులు స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలు దాచిపెట్టేందుకు నిర్వాహకులు ప్రయతి్నంచారని ఆరోపించారు. అనుమతి తీసుకొనే సమయంలో తమకు సరైన సమాచారం ఇవ్వలేదని చెప్పారు. తొక్కిసలాటలో పోలీసుల తప్పిదమీమీ లేదని స్పష్టం చేశారు. ఫూల్రాయ్లో తొక్కిసలాటకు కారణమైన బాబా నారాయణ్ హరి అలియాస్ సకర్ విశ్వ హరి భోలే బాబా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 121 మంది మృతుల్లో 117 మందిని గుర్తించారు. గాయపడ్డ 28 మందికి చికిత్స కొనసాగుతోంది. సత్సంగ్ టెంట్ వద్ద గుట్టలుగా పేరుకుపోయిన చెప్పులు దుర్ఘటనకు మౌనసాక్షిగా నిలిచాయి. జ్యుడీషియల్ విచారణ: యోగితొక్కిసలాటపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వలో జ్యుడీషియల్ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. దుర్ఘటన వెనుక కుట్రకోణాన్ని కొట్టిపారేయలేమని చెప్పారు. చికిత్స పొందుతున్న వారిని ఆయన బుధవారం పరామర్శించారు. ఘటనా స్థలాన్నీ్న పరిశీలించారు.బాబా మంచోడు: గ్రామస్తులుభోలే బాబా మంచోడని యూపీలో కాస్గంజ్ జిల్లాలోని ఆయన స్వగ్రామం బహదూర్‌నగర్ వాసులు చెబుతున్నారు. బాబా తమను ఏనాడూ చందాలు గానీ, కానుకలు గానీ అడగలేదని గ్రామస్థులు చెప్పారు. బహదూర్‌నగర్ సమీపంలో భోలేబాబాకు ఒక ఆశ్రమం ఉంది. బాబా దంపతులకు సంతానం కలగలేదు. ఒక బాలికను దత్తత తీసుకున్నారు. 16 ఏళ్ల క్రితం ఆ బాలిక చనిపోయింది. ఆమె ప్రాణాలతో లేచివస్తుందన్న నమ్మకంతో మృతదేహాన్ని రెండు రోజులపాటు తన ఇంట్లోనే ఉంచారు. పోలీసులు, అధికారులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు అంత్య క్రియలు నిర్వహించారు. బాబా అనుచరుల వల్లే తొక్కిసలాట! తొక్కిసలాటపై హత్రాస్ సబ్‌డివిజనల్ మేజి్రస్టేట్(ఎస్డీఎం) బుధవారం జిల్లా మేజి్రస్టేట్‌కు ప్రాథమిక నివేదిక సమర్పించారు. సత్సంగ్ ముగిసిన తర్వాత తన వాహనం వద్దకు తిరిగి వెళ్తున్న భోలే బాబాను దగ్గరగా చూసేందుకు, చేత్తో తాకేందుకు భక్తులు అరాటపడ్డారని, వారిని బాబా అనుచరులు దూరంగా తోసివేయడానికి ప్రయతి్నంచడంతో తొక్కిసలాట జరిగిందని నివేదికలో వెల్లడించారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో నేలంతా బురదగా ఉండడంతో జనం జారిపడ్డారని, ఒకరిపై ఒకరు పడిపోయారని పేర్కొన్నారు. కింద చిక్కుకున్నవారు ఉపిరాడక మృతిచెందారని నివేదికలో ప్రస్తావించారు. సత్సంగ్‌కు 2 లక్షల మందికిపైగా జనం హాజరయ్యారని వివరించారు. విద్రోహ శక్తులే కారణం భోలే బాబా లక్నో: సత్సంగ్ వేదిక నుంచి తాను వెళ్లిపోయిన చాలాసేపటికి తొక్కిసలాట జరిగిందంటూ భోలే బాబా బుధవారం ప్రకటన విడుదల చేశారు. తొక్కిసలాటకు సంఘ విద్రోహ శక్తులే కారణమని ఆరోపించారు. ఆ సమయంలో తానక్కడ లేనన్నారు. భక్తుల మృతిపట్ల సంతాపం ప్రకటించారు. -
ఘోరం... నేరం...
మానవ బలహీనతను సొమ్ము చేసుకోవడానికి నమ్మకాన్ని వాటంగా మార్చుకోవడం చరిత్రలో తరచూ కనిపించేదే. ఎవరికీ ఏ ఇబ్బందీ కలగనంత వరకేమో కానీ... ప్రజల అమాయకత్వాన్ని స్వార్థానికి వాడుకుంటున్నప్పుడు, ఆ ప్రక్రియ ఆఖరికి ప్రాణాంతకంగానూ మారినప్పుడు చూస్తూ సహించలేం. సమకాలీన సమాజంలో అలాంటి అనుభవాల్ని భరించలేం. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లా ఫూల్రాయ్ వద్ద మంగళవారం జరిగిన ధార్మిక సభ, అక్కడ తొక్కిసలాటను చూసినప్పుడు అదే అనిపిస్తుంది. 121 మంది అమాయక భక్తులు మరణించిన హాథ్రస్ ఘటన ఘోర విషాదం. పాదధూళితో, పంపులో నీళ్ళతో సమస్త సమస్యలూ పరిష్కారమవుతాయని అమాయక ప్రజల్ని నమ్మిస్తున్న ఓ పెద్ద మనిషి తప్పిదానికి అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిశాయి. పాలకులు ఎప్పటి లానే సంతాపాలు తెలిపారు. నష్టపరిహారాలు ప్రకటించారు. సిట్ దర్యాప్తుకూ ఆదేశించారు. కానీ, తరచూ జరుగుతున్న ఇలాంటి దుర్ఘటనల్ని నివారించాల్సిన బాధ్యత లేదా? ప్రమాదవేళ తూతూ మంత్రంగా స్పందించి, ఆనక నివారణ చర్యలపై నిమ్మకు నీరెత్తినట్టుంటే సరిపోతుందా? తాజా హాథ్రస్ ఘటనకు కేంద్రబిందువైన స్వయం ప్రకటిత దైవదూత నారాయణ్ సాకార్ హరి అలియాస్ భోలే బాబా కథ సుదీర్ఘమైనదే. ఆయన అసలు పేరు సూరజ్ పాల్. ఆధ్యాత్మిక గురువుగా మారక ముందు యూపీ పోలీసుల స్థానిక ఇంటెలిజెన్స్ విభాగంలో సాధారణ హెడ్ కానిస్టేబుల్. ఉద్యోగంలో ఉండగానే తాను ఆధ్యాత్మికత వైపు మొగ్గాననీ, అందుకే 1990లలో చేస్తున్న ఉద్యోగం మానేసి దైవమార్గం పట్టాననీ ఆయన కథనం. ఉత్తరప్రదేశ్‌లో ఓ చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ఆయన చలువ కళ్ళద్దాలు, శ్వేత వస్త్రధారణతో పేరు, పలుకుబడి గల బాబాగా అవతరించడం ఆశ్చర్యమే. ఇవాళ యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా తదితర ప్రధాన హిందీ రాష్ట్రాల్లో ఆయనకు లక్షలాది భక్తులు పోగుబడడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. చనిపోయిన బిడ్డను బ్రతికిస్తానంటూ 23 ఏళ్ళ క్రితం శ్మశానంలో గందరగోళం చేయడం మొదలు లైంగిక అత్యాచార ఆరోపణల దాకా ఈ బాబాపై అనేక కేసులున్నాయి. నాలుగేళ్ళ క్రితం 2020 జనవరిలో షాజహాన్‌పుర్‌లో ఈయన సత్సంగంలోనే ప్రసాద వితరణ వేళ మంటలు చెలరేగి, తొక్కిసలాట జరిగింది. సమయానికి అగ్నిమాపక దళం రావడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ, దోవ కూడా సరిగ్గా లేని తాజా హాథ్రస్ ఘటనాస్థలిలో కనీసం అంబులెన్స్ లాంటివైనా లేకపోవడం ఘోరం, నేరం.హాథ్రస్ ఘటనపై కఠిన చర్యలు చేపడతామని యూపీ సీఎం గర్జించారు కానీ, ఈ దుర్ఘటనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో అసలు భోలే బాబా పేరే పెట్టలేదు. ఇక, ఇంత భారీ దుర్ఘటన జరిగాక సదరు బాబా ఎవరికీ కనిపించకుండా పరారీలో ఉన్నారు. హాథ్రస్ ఘటన అత్యాశకూ, అపరిమిత నిర్లక్ష్యానికీ ప్రతీక. ఈ ఘటనలో తిలా పాపం తలా పిడికెడు. సత్సంగమంటూ 80 వేల మందికే అనుమతి తీసుకొన్నా, రెండున్నర లక్షల మందికి పైగా జనాన్ని అనుమతించడం ఎవరి తప్పు? తగినన్ని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలైనా లేకుండా అంత భారీ ఆధ్యాత్మిక సభ జరిపిన నిర్వాహకులను ఏమనాలి? ‘నా పాదధూళి ఇంటికి తీసుకెళ్ళి సమస్యల్లో ఉన్నవారికి రాస్తే అన్నీ చక్కబడతాయి’ అని అమాయకుల బలహీనతతో ఆడుకొని, ఇంత ఘోరానికి కారకుడైన మహానుభావుణ్ణి ఏం చేయాలి? ఇంత జరిగాక కూడా ఆయన తన వకీలు ద్వారా ఈ దుర్ఘటన వెనుక అసాంఘిక శక్తుల కుట్ర ఉందంటూ నెపం నెట్టేసే పని చేస్తుంటే పాలకులు ఏం చేస్తున్నట్టు? హాథ్రస్ ఘటన లాంటివి మనకు కొత్త కాదు. గతంలోనూ ఇలాంటివి అనేకం జరిగాయి. 2005లో మహారాష్ట్రలోని వాయిలో మంధరాదేవి గుడి వద్ద తొక్కిసలాటలో 340 మందికి పైగా చనిపోయారు. 2008లో రాజస్థాన్‌లో చాముండా దేవి ఆలయం వద్ద కనీసం 250 మంది, హిమాచల్ ప్రదేశ్‌లోని నైనాదేవి గుడి వద్ద 162 మంది తొక్కిసలాటల్లోనే దుర్మణం పాలయ్యారు. చరిత్ర పుటల్లో వెనక్కి వెళితే, 70 ఏళ్ళ క్రితం 1954లో స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి కుంభమేళాలో అలహా బాద్‌లో జరిగిన తొక్కిసలాటలో 800 మంది ప్రాణాలు కోల్పోవడం గుండెల్ని మెలిపెట్టే విషాదం. రద్దీని నియంత్రించే వ్యవస్థలు లేకపోవడం, భారీగా జనం తరలివచ్చే సందర్భాలకు తగ్గట్టు ముందస్తు ప్రణాళికా రచన చేయకపోవడం, సామాన్యుల నియంత్రణే కష్టంగా ఉండే సమయంలో వీఐపీల తాకిడి ఎక్కువై యంత్రాంగమంతా వారి సేవల్లో తరించడం లాంటి లోపాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అది మరింత విషాదం. భారతదేశంలో నూటికి 79 తొక్కిసలాటలు ధార్మిక సమ్మేళనాలు, తీర్థయాత్రల్లో జరుగుతున్నవేనని 2013లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్లో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చింది. పైపెచ్చు, మన దేశంలో అనేక ఆలయాలు కొండల పైన, నదీ తీరాల్లో, ప్రయాణానికి సంక్లిష్టమైన ఇతర ప్రాంతాల్లో నెలకొన్నందున తొక్కిసలాటల ముప్పు ఎక్కువ. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక సమ్మేళనాలు నిర్వహిస్తుంటే వేలు, లక్షల్లో జనం రాకతో ఆ ప్రాంతాలు క్రిక్కిరిసి పోతున్నాయి. అలాంటి చోట్ల ప్రాథమిక వసతులే కాదు... కనీసం సరైన ప్రవేశ మార్గాలు, అత్యవసర పరిస్థితుల్లో నిష్క్రమణ మార్గాలు సైతం ఉండట్లేదు. ఇవన్నీ ప్రమాదాలకు కారణాలే. వీటిని నివారించాలంటే జనసమ్మర్దాన్ని నియంత్రించే యంత్రాంగం కీలక పాత్ర పోషించాలి. 2014లోనే జాతీయ విపత్తుల ప్రాధికార సంస్థ జనసమ్మర్ద నియంత్రణపై మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ, అవి ఎక్కడా అమలైనట్టు లేవు. తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజా ఘటనతోనైనా పాలకులు నిద్ర లేస్తారా? ఓట్ల రాజకీయాల్ని వదిలేసి, మూఢనమ్మకాలు ప్రోత్సహించేవారికి ముకుతాడు వేస్తారా? -
భోలే బాబాకు రక్షణగా 'బ్లాక్ కమాండోస్', మహిళా సైన్యం..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్ తొక్కిసలాటలో 121 మంది మరణానికి కారణమైన భోలే బాబా గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.తనని తాను స్వయంగా దేవుడిగా ప్రకటించుకున్న భోలే బాబాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. యూపీలోని మెయిన్‌పురిలో భారీ మొత్తంలో పొందిన విరాళాలతో నిర్మించిన విశాలమైన ఆశ్రమం ఆయన భక్తులలో ఆయనకున్న పట్టు, ఆదరణకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అయితే వివాదాలు ఆయన్ని వెంటాతుండడంతో తన ప్రాణాలు ముప్పు వాటిల్లుతుందనే అనుమానం ఎక్కువగా ఉండేదని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలోని బహదూర్ నగరి గ్రామంలోని తన ఇంటికి దాదాపు ఎనిమిదేళ్లుగా భోలే బాబా వెళ్లలేదు. అతని చుట్టూ బ్లాక్ కమాండో తరహాలో మహిళలు 24 గంటలు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు తేలింది. ఆశ్రమంలో భోలే బాబాకు ఓ గది ఉంది. అందులో భోలే బాబా ఎంపిక చేసిన ఏడుగురు వ్యక్తులకు మాత్రమే అందులోకి అనుమతించే వారు. ఏడుగురిలో మహిళలు,సేవకులున్నారు.సెక్యూరిటీ ప్రోటోకాల్‌కు అనుగుణంగా రాత్రి 8 గంటల తర్వాత ఎవరినీ కలవడని పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. భోలో బాబాకు రక్షణా ఉండే సిబ్బందికి ఒక కోడ్ వర్డ్, ప్రతి సెక్యూరిటీ స్క్వాడ్‌కి ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంది.నారాయణి సేన, గరుడ్ యోధ, హరి వాహక్ అనే మూడు బృందాలు బాబాను రక్షించడానికి 24 గంటలూ పని చేస్తాయి.నారాయణి సేనలోని సిబ్బంది గులాబీ రంగు దుస్తులు, గరుడ్ యోధ నల్లని దుస్తులను (స్థానికులు వారిని బ్లాక్ కమాండోలు అని పిలుస్తారు.హరి వాహక్ సభ్యులు విలక్షణమైన టోపీలు, గోధుమ రంగు దుస్తులు ధరిస్తారు.బ్లాక్ కమాండోలు బాబా కాన్వాయ్ వెంట ఉంటారు. ఎల్లప్పుడూ 20 మంది పనిచేస్తుంటారు. ప్రతి నారాయణి సేనలో 50 మంది సభ్యులు, హరి వాహక్ సభ్యులు ఒక్కొక్కరు 25 మందితో కూడిన బృందాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
హత్రాస్ తొక్కిసలాట.. తొలిసారి స్పందించిన భోలే బాబా
లక్నో : ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు .. సత్సంగ్ ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. కానీ ఆ ఘటన తర్వాత భోలే బాబా పరారయ్యాడు. పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.ఈ తరుణంలో ఉత్తర ప్రదేశ్ హత్రాస్‌లో 121 మందికి మరణానికి కారణమైన భోలేబాబా ఓ ప్రకటన చేశారు. వ్యతిరేక శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ఇది భయంకరమైన గందరగోళాన్ని సృష్టించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాడు.First responce from Bhole Baba Ashram after stampede incident. Appointed Advocate AP Singh for legal action pic.twitter.com/jXdq1AxW4H— Abhishek Thakur (@Abhisheklive4u) July 3, 2024తన న్యాయవాది ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను వెళ్లిన చాలా సేపటి తర్వాత తొక్కిస లాట జరిగిందని తెలిపారు.సంత్సంగ్ ముగిసిన తర్వాత కొంతమంది సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాం. దీనిపై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తామంటూ ఓ నోట్‌ను విడుదల చేశారు.కాగా, సామాన్యుల మరణానికి కారణమైన భోలే బాబాను అరెస్టు చేస్తారా అని అడిగిన ప్రశ్నకు రాష్ట్ర పోలీసు చీఫ్ ప్రశాంత్ కుమార్ స్పందించారు. వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము అని ఆ నోట్లో పేర్కొన్నారు. -
హత్రాస్ తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ: సీఎం యోగి ప్రకటన
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో హత్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 121 చేరింది. బాబా పాద ధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనకు కారణమైన సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బోలే బాబా కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. పోలీసుల వెతుకుతున్న నేపథ్యంలో బాబా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.హత్రాస్ జిల్లాలో తొక్కిసలాటలో 121 మంది మరణించిన ఘటనపై న్యాయ విచారణ జరిపించనున్నట్లు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ప్రకటించారు. ఈ జ్యుడీషియల్ విచారణ కమిటీలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, పోలీసు అధికారులు ఉంటారని తెలిపారు.ఈ విషాదానికి బాధ్యులెవరో గుర్తించడంతో పాటు, ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తారని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకొనేలా నిబంధనలు రూపొందిస్తామని సీఎం తెలిపారు. కాగా ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని వదిలేదిలేదని సీఎం ఇప్పటికే ప్రకటించారుసుప్రీంకోర్టులో పిటిషన్మరోవైపు, హాథ్రస్ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, దీనిపై కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. అటు ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది. -
విస్తుపోయే వాస్తవాలు.. జైలు జీవితం.. ఆపై ‘భోలే బాబా’గా అవతారం ఎత్తి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో నారాయాణ్ సాకార్ హరి.. అలియాస్ సాకార్ విశ్వ హరి(సూరజ్ పాల్)..‘భోలే బాబా’ లైంగిక వేధింపులకు పాల్పడిన చరిత్ర ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. మంగళవారం సత్సంగ్ పేరుతో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిస లాట జరిగి 121 మంది మరణించగా.. 108 మందికిపైగా తీవ్రగాయాల పాలయ్యారు. హత్రాస్‌లో జరిగిన ఈ సంఘటన, భోలేబాబా పాద దూళి కోసం ఎగబడటం, ఆయన ఆశిస్సులు తీసుకునేందుకు పోటి పడడం విషాదానికి కారణమైంది. ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణలో భోలే బాబాపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పోలీస్ విభాగంలో పనిచేసే సమయంలో లైంగిక వేధింపులు పాల్పడి జైలు పాలయ్యాడు. ఆయనపై ఆగ్రా, ఎటావా, కస్గంజ్, ఫరూఖాబాద్, రాజస్థాన్‌తో సహా వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.లైంగిక వేధింపులతో జైలు పాలై,విడుదలైన తర్వాత తన పూర్వీకుల గ్రామంలోని ఆశ్రమం ఏర్పాటు చేసి 'సాకర్ విశ్వ హరి బాబా'గా తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకున్నట్లు తెలుస్తోంది.#WATCH | On the Hathras stampede incident, Uttar Pradesh CM Yogi Adityanath says "Some people have the tendency to politicise such sad and painful incidents. These people have the nature of 'chori bhi aur seenazori bhi'. Everyone knows with whom the gentleman's (preacher) photos… pic.twitter.com/gNCHNJdpNz— ANI (@ANI) July 3, 2024 -
Hathras Stampede: కరోనా కాలంలోనూ..
యూపీలోని హత్రాస్‌లో జరిగిన భారీ తొక్కిసలాట దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 121 మంది మృతి చెందారు. నారాయణ్ సాకార్ అలియాస్ భోలే బాబా సత్సంగంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఈ సత్సంగానికి స్థానికులతో పాటు ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల నుంచి కూడా భోలే బాబా అనుచరులు తరలివచ్చారు. భారీ స్థాయిలో జనం వచ్చినప్పటికీ సత్సంగ్ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయలేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో గతంలో భోలే బాబా నిర్వాకానికి సంబంధించిన అంశం మరోమారు చర్చల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న 2021లో భోలే బాబా ఒక సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో 50 వేల మందికి పైగా జనం పాల్గొన్నారు. నాడు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సత్సంగంలో 50 మంది మాత్రమే పాల్గొనడానికి అనుమతివుంది. అయితే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తూ 50 వేల మందికి పైగా జనం సత్సంగానికి హాజరయ్యారు.ఇందుకు భోలే బాబా సహకరించారనే ఆరోపణలున్నాయి. నాడు ఫరూఖాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి జనం పోటెత్తడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఆప్పట్లో జిల్లా యంత్రాంగం సత్సంగ్ నిర్వాహకులకు నోటీసు కూడా ఇచ్చింది. 2021లో బాబా నిర్వహించిన సత్సంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ये वीडियो 2021 का है जब फ़र्रुख़ाबाद में बाबा नारायण हरि साकार ने सत्संग किया था. साल 2021 में कोविड की वजह से प्रशासन ने सिर्फ़ 50 लोगों की अनुमति दी थी लेकिन बाबा ने 50 हज़ार से ज़्यादा की भीड़ इकट्ठी कर दी थी.#HathrasAccident #HathrasTragedy #bholebaba pic.twitter.com/0GLHXUdxV0— NDTV India (@ndtvindia) July 3, 2024 -
హత్రాస్ తొక్కిసలాట: భయంతో మరో బాబా వినతి
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల సంఖ్య 121 దాటింది. ఈ ప్రమాదం నేపధ్యంలో అప్రమత్తమైన మధ్యప్రదేశ్‌కు చెందిన మరో బాబా తన అనుచరులను ఉద్దేశిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి భక్తులు, అనుచరులు అధిక సంఖ్యలో ఉన్నారు. జూలై నాలుగున జరిగే అతని పుట్టిన రోజుల వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే హత్రాస్ ఘటన నేపధ్యంలో మరోమారు అలాంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశ్యంతో పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో షేర్ చేశారు.ఆ వీడియోలో పండిట్ ధీరేంద్ర శాస్త్రి ‘జూలై 4న నా పుట్టిన రోజు. ఆ రోజు నా జీవితంలో ఒక సంవత్సరం తగ్గుతుంది. అయితే ఆరోజు వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వీడియో ద్వారా ఒక అభ్యర్థన చేస్తున్నాను. జూలై నాలుగున జరిగే వేడుకలకు దూరప్రాంతాల నుంచి రావాలనుకుంటున్నవారు తమ ఇళ్లలోనే పూజలు చేసుకోవాలి. ఇప్పటికే ఇక్కడ భక్తుల రద్దీ పెరిగింది. భద్రత దృష్ట్యా ఎక్కడివారు అక్కడే వేడుకలు చేసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. अतिआवश्यक सूचना…पूज्य सरकार द्वारा सभी भक्तों को आवश्यक संदेश….इसे जन जन तक पहुँचाए… pic.twitter.com/GgLledRw4H— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) July 2, 2024 -
బాబా ఆశీస్సుల కోసం వెళ్లి 116 మంది దుర్మరణం..
-
Hathras Stampede: అఖిలేష్ కూడా బాబా భక్తుడే.. ఫొటో వైరల్
యూపీలోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట అందరినీ కలచివేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 121 దాటింది. నారాయణ్ సాకార్ అలియాస్ భోలే బాబా సత్సంగంలో ఈ ఘటన చోటుచేసుకుంది.యూపీలో ఈ బాబాకు లెక్కకు మించిన భక్తులు, అనుచరులు ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ గతంలో భోలే బాబా సత్సంగానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.నాడు భోలే బాబా సత్సంగానికి హాజరైన అఖిలేష్ యాదవ్ తన ప్రసంగంలో బాబాను పొగడ్తలతో ముంచెత్తారు. దీనికి సంబంధించిన ఫోటోలను అఖిలేష్ అప్పట్లో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటోలో అఖిలేష్ వీఐపీ సీట్లలో కూర్చుని కనిపిస్తున్నారు. మరో ఫోటోలో అఖిలేష్ యాదవ్ బాబా భక్తులను ఉద్దేశించి ప్రసంగించడాన్ని చూడవచ్చు. नारायण साकार हरि की सम्पूर्ण ब्रह्मांड में सदा - सदा के लिए जय जयकार हो pic.twitter.com/lp4wTmaHal— Akhilesh Yadav (@yadavakhilesh) January 3, 2023