లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ దారుణంలో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు తెలిశాయి. బాధితురాలు, ప్రధాన నిందితుడు ఏడాది నుంచి ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన 20 ఏళ్ల యువతి దారుణ హత్య కేసులో అదే గ్రామానికి చెందిన సందీప్ సింగ్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు బాధితురాలి కుటుంబం, ప్రధాన నిందితుడి కాల్ రికార్డింగులను పరిశీలించారు. ఈ క్రమంలో బాధితురాలు ప్రధాన నిందితుడితో నిరంతరం ఫోన్ టచ్‌లో ఉన్నట్లు వారు గుర్తించారు. బాధితురాలి సోదరుడు సత్యేంద్ర పేరిట ఉన్న నంబర్ నుంచి సందీప్‌కు క్రమం తప్పకుండా కాల్స్ వచ్చినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
సత్యేంద్ర నంబర్ 989xxxxx, సందీప్ నంబర్ 76186xxxxx మధ్య ఫోన్ కాంటాక్ట్ 2019 అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి గ్రామమైన బూల్‌గారి నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోని చందపా ప్రాంతంలో ఉన్న సెల్ టవర్ నుంచి ఎక్కువ కాల్స్ వచ్చినట్లు తెలిపారు. రెండు ఫోన్ నంబర్ల మధ్య 62 అవుట్ గోయింగ్ కాల్స్, 42 ఇన్‌కమింగ్ కాల్స్ మొత్తం104 కాల్స్ ఉన్నాయని రికార్డులు చూపిస్తున్నాయని తెలిపారు. బాధితురాలు, ప్రధాన నిందితులు సన్నిహితంగా ఉన్నట్లు కాల్ రికార్డులు చూపిస్తున్నాయన్నారు పోలీసులు. (యూఎన్‌ఓవి అనవసర వ్యాఖ్యలు: భారత్)
సెప్టెంబర్ 14న బాధితురాలు పొలంలో పని చేసుకుంటూ ఉండగా.. నిందితుడు ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేసి.. నాలుక కోసి తీవ్రగా హింసించినుట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెడ, వెన్నెముకకు తీవ్ర గాయాలయిన బాధితురాలిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమె రెండు వారాలపాటు ప్రాణాలతో పోరాడి చివరకు సెప్టెంబర్ 29న కన్ను మూసింది. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ప్రతిపక్షాలు యూపీ సర్కార్ మీద దుమ్మెత్తి పోశాయి. ప్రస్తుతం కేసును సీబీఐకి అప్పగించారు. (ఎన్నాళ్లిలా: చచ్చినా గౌరవం లేదు)
Comments
Please login to add a commentAdd a comment