utter pradesh
-
సస్పెన్స్‌లో తల్లీకొడుకుల సీట్లు.. విడిగా వరుణ్ గాంధీ పోటీ?
లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ చాలా కీలకమైన రాష్ట్రం. ఇక్కడ మొత్తం 80 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ క్రమంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు ఈ రాష్ట్రానికి చెందిన 51 స్థానాలకు బీజేపీ మొదటి విడతలో అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ప్రకటించిన మొదటి విడత అభ్యర్థుల జాబితాలో పిలిభిత్, సుల్తాన్పూర్, కైసర్‌గంజ్, రాయ్‌బరేలి, మైన్‌పురి, మరికొన్ని ముఖ్యమైన స్థానాలు లేవు. వీటిలో పిలిభిట్ లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుతం వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన తల్లి, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక్కడి రాష్ట్ర బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. రైతులకు సంబంధించిన సమస్యలపై పార్టీ నాయకత్వంతోపాటు స్థానిక బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక గళం వినిపించిన వరుణ్ గాంధీకి ఈసారి టిక్కెట్ ఉండకపోవచ్చు అంటున్నారు. ఒకప్పుడు తన తండ్రి సంజయ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ప్రతిపక్ష భారత కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్ గాంధీ పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. -
సురేష్ రైనా విధ్వంసం.. కేవలం 33 బంతుల్లోనే! వీడియో వైరల్
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్‌లో భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐవీపీఎల్-2024లో వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్‌కు సారథ్యం వహిస్తున్న రైనా.. తన మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు అద్భుత విజయాలను అందిస్తున్నాడు. ఈ లీగ్‌లో ఉత్తర్‌ప్రదేశ్ ఫైనల్‌కు చేరడంలో రైనా కీలక పాత్ర పోషించాడు. ఈ లీగ్‌లో భాగంగా శనివారం ఛత్తీస్‌గఢ్ వారియర్స్‌తో జరిగిన సెకెండ్ సెమీఫైనల్లో కూడా రైనా సత్తాచాటాడు. సెమీఫైనల్లో 19 పరుగుల తేడాతో ఛత్తీస్‌గడ్‌ను చిత్తు చేసిన ఉత్తర్‌ప్రదేశ్ తుది పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యూపీ బ్యాటర్లలో పవన్ నేగి మరో సారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 50 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 94 పరుగులు చేశాడు. అదేవిధంగా కెప్టెన్ రైనా కూడా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 'మిస్టర్ ఐపీఎల్' 58 పరుగులు చేశాడు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో షాదాబ్ జాక్తీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మునాఫ్ పటేల్, అమిత్ మిశ్రా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఛత్తీస్‌గఢ్.. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. ఛత్తీస్‌గఢ్ ఓపెనర్లు జటిన్ సక్సేనా(76), నమాన్ ఓజా(43) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. చదవండి: AUS vs NZ: తిరుగులేని ఆసీస్.. ఏకంగా 172 పరుగుల తేడాతో ఘన విజయం Suresh Raina is still providing clutch performances in knockouts for his team 🐐🔥pic.twitter.com/Gu0O5ty0BB — MN 👾 (@CaptainnRogerrs) March 2, 2024 -
ఐదేళ్ల చిన్నారి హత్య.. తల్లి మీద పగతో పొరుగింటి మహిళ ఘాతుకం
ముజఫర్‌నగర్: పొరుగింటి మహిళపై పగతో ఆమె ఐదేళ్ల కొడుకుని హతమార్చిన మహిళను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వివరాల్లోకి వెళ్తే... ముజఫర్‌నగర్ జిల్లాలో తేవ్రా గ్రామానికి చెందిన ఆసిఫా అనే మహిళ.. పొరిగింట్లో ఉంటున్న దినిస్టా బేగంపై పగతో ఆమె ఐదేళ్ల కుడుకు అర్సలాన్‌ని కిడ్నాప్ చేసి హత్య చేసింది. నవంబర్ 11న బాలుడు అదృశ్యం కాగా మూడు రోజుల తరువాత కక్రౌలీ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామ శివార్లలో అడవిలో గోనె సంచిలో అర్సలాన్ మృతదేహం లభ్యమైంది. అర్సలాన్ను హత్య చేసినట్లు విచారణలో అసిఫా అంగీకరించిందని కేసు దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బయట ఆడుకుంటున్న అర్సలాన్ను ఆసిఫా కిడ్నాప్ చేసి తన ఇంట్లో బంధించింది. గ్రామమంతా వెతికిన బాలుడి తండ్రి షాజాద్ ఖాన్ ఆచూకీ దొరక్కపోవడంతో కక్రౌలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు గ్రామశివార్లలో బాలుడి మృతదేహాన్ని గుర్తించి గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసినట్లుగా కేసు నమోదు చేశారు. తర్వాత ఆసిఫా ఇంట్లో బాలుడి టోపీ, చెప్పులు, గొంతుకు బిగించేందుకు ఉపయోగించిన తాడును స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాను తమదైన శైలిలో పోలీసులు విచారించగా బాలుడిని చంపింది తానే అని ఒప్పుకుంది. అర్సలాన్ తల్లి దనిస్టా బేగం తనను అగౌరవంగా చూసేదని, తరచూ అవమానించేదని, అందుకు ఆమె కొడుకుని హత్య చేసినట్లు పోలీసులకు చెప్పింది. -
డ్రోన్లతో అటవీ భూమిలో 10 వేల సీడ్ బాల్స్.. మారుత్ డ్రోన్స్ ఒప్పందం
ఆగ్రా/ఫిరోజాబాద్: ’హరా బహారా’ నినాదం కింద అడవుల పెంపకం కార్యక్రమాన్ని విస్తృతం చేసేలా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ మారుత్ డ్రోన్స్ చేతులు కలిపింది. డ్రోన్ల ద్వారా ఆగ్రాకు సమీపంలో 10 ఎకరాల అటవీ భూమిలో 10,000 సీడ్ బాల్స్‌ను వెదజల్లింది. తమ సీడ్కాప్టర్స్ ద్వారా 2030 నాటికి 100 కోట్ల మొక్కలు నాటాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు ప్రేమ్ కుమార్ విస్లావత్ తెలిపారు. వృక్షారోపణ్ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే ప్రక్రియను నిర్వహించేందుకు ఔత్సాహిక ఎంట్రప్రెన్యూర్లు, డ్రోన్ టెక్నాలజీ తోడ్పడగలవని ఉత్తర్‌ప్రదేశ్ అటవీ శాఖ మంత్రి దారా సింగ్ చౌహాన్ తెలిపారు. -
కష్టపడి చదివి ఇంటర్ పాసైన ఎమ్మెల్యేలు.. డిగ్రీ పూర్తి చేయడమే లక్ష్యం
లక్నో: చదువుకోవాలనే తపన ఉంటే వయసుతో సంబంధం లేదు అని నిరూపించారు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వీరు కష్టపడి చదివి ఇంటర్లో ఉత్తీర్ణులయ్యారు. ఇపుడు డిగ్రీ పూర్తి చేయడమే తమ లక్ష్యమని, ఎలాగైనా పట్టుభద్రులం అవుతామని చెబుతున్నారు. బరేలి జిల్లా బిత్రి-చైన్పూర్ నుంచి 2017లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు రాజేశ్ మిశ్రా. మంగళవారం ప్రకటించిన యూపీ ఇంటర్ ఫలితాల్లో ఈయన 500కు గానూ 263 మార్కులు తెచ్చుకుని ఉత్తీర్ణులయ్యారు. రెండేళ్ల క్రితమే పదో తరగతి పాసయ్యారు. ఇప్పుడు ఇంటర్ కూడా పూర్తి చేసి చదువుపై తనకున్న మక్కువ చాటుకున్నారు. డిగ్రీ కూడా పూర్తి చేస్తానని చెబుతున్నారు. అయితే మార్కులుపై తాను సంతృప్తిగా లేనని మరోసారి తన ఆన్సర్ షీట్స్‌ను మూల్యంకనం చేయిస్తానని మిశ్రా చెప్పడం గమనార్హం. హస్తీన్పూర్ నుంచి ఎస్పీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభూదయాల్ వాల్మీకి కూడా ఇంటర్లో పాసయ్యారు. సెకండ్ క్లాస్‌లో ఆయన ఉత్తీర్ణులయ్యారు. చదవుకు వయసులో సంబంధం లేదని పేర్కొన్నారు. డా.బీఆర్ అంబేడ్కరే తనకు స్ఫూర్తి అని, డిగ్రీ కూడా పూర్తి చేస్తానని చెప్పారు. ఈయన 2002-2007 వరకు, 2012-2017వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. చదవండి: గుండెపోటుతో మంత్రి మృతి.. సీఎం దిగ్భ్రాంతి.. మూడు రోజులు సంతాప దినాలు.. -
Yogi Adityanath: గ్యాంగ్స్టర్ల ప్యాంట్లు తడిసిపోతున్నాయ్: సీఎం యోగి
లక్నో: యోగి అదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఉత్తర్‌ప్రదేశ్‌లో రౌడీషీట్లరు, గ్యాంగ్స్టర్లు హడలిపోతున్నారు. నిర్దాక్షిణ్యంగా ఆయన నేరస్థులపై ఉక్కుపాదం మోపడమే ఇందుకు కారణం. గ్యాంగ్‌స్టర్ కం పొలిటీషియన్ అయిన అతిక్ అహ్మద్ కూడా ఇటీవలే ఓ కిడ్నాప్ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు యోగి. ఒకప్పుడు యూపీలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బలవంతపు వసూళ్లకు పాల్పడిన మాఫియా, గ్యాంగ్స్టర్లు ఇప్పుడు ప్యాంట్లు తడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారు చేసిన నేరాలకు కోర్టుల్లో దోషులుగా తేలుతున్నారని చెప్పుకొచ్చారు. గతంలో శాంతిభద్రతలంటే గౌరవం లేకుండా చిన్నచూపు చూసిన వారు ఇప్పుడు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారని యోగి వ్యాఖ్యానించారు. శనివారం ఓ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈమేరకు మాట్లాడారు. 'ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడికి ఇవాళ యూపీ ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎవరూ ధిక్కరించలేరు. ప్రజలను భయపెట్టిన మాఫియానే ఇప్పుడు భయంతో వణికిపోతుంది. కోర్టులో శిక్షలు పడటం చూసి వారి ప్యాంట్లు తడిసిపోతున్నాయ్.' అని యోగి అన్నారు. ఆరేళ్ల క్రితం యూపీ అంటే అరాచకాలు, అల్లర్లకు గుర్తింపు ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని యోగి చెప్పుకొచ్చారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శ్రీరామ నవమి రోజు అల్లర్లు చెలరేగినా.. యూపీలో మాత్రం ప్రాశాంతంగా వేడుకలు జరిగాయని గుర్తుచేశారు. చదవండి: దేశంలో ఎన్ని పులులు ఉన్నాయంటే..? లెక్క చెప్పిన ప్రధాని మోదీ.. -
యూపీ పాఠశాలలో 9 మంది విద్యార్థులకు మంకీపాక్స్.. లక్షణాలివే..!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ బలియా జిల్లాలో చికెన్‌పాక్స్ కలకలం రేపింది. గోవింద్‌పూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు సహా 9 మంది విద్యార్థులు ఈ వ్యాధి బారినపడ్డారు. ఈ విద్యార్థుల్లో కొద్దిరోజుల క్రితం నుంచే చికెన్‌పాక్స్ లక్షణాలు కన్పించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఒంటిపై, మొహంపై దద్దుర్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. వీరందరికీ చికెన్‌పాక్స్ సోకిందనని శుక్రవారం నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. వెంటనే వారికి చికిత్స ప్రారంభించినట్లు చెప్పారు. ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా నియంత్రణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. చికెన్ పాక్స్ లక్షణాలు.. ► తీవ్రమైన జ్వరం ► గొంతులో ఇబ్బందిగా అన్పించడం ► ఒళ్లుమొత్తం ఎర్రటి దద్దుర్లు ► తలనొప్పి ► దురద చదవండి: పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన వధువు.. వీడియో వైరల్.. -
ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం వదిలి భారత జట్టుకు.. ఎవరీ సౌరభ్ కుమార్?
మధ్యప్రదేశ్‌కు చెందిన సౌరభ్ కుమార్ భారత తరపున అరంగేట్రం చేసేందుకు అతృతగా ఎదురు చూస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టులో సౌరభ్ కుమార్‌కు చోటు దక్కింది. అయితే అతడికి తుది జట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదు . ఇక తాజాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో సౌరభ్ కుమార్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ క్రమంలో భారత తరపున సత్తా చాటేందుకు సౌరభ్ కుమార్ ఊవ్విళ్లరూతున్నాడు. కాగా సౌరభ్ కుమార్ దేశీవాళీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్-'ఎ'తో అనధికార టెస్టు సిరీస్‌లో కూడా సౌరభ్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సౌరబ్‌ను బంగ్లాతో సిరీస్‌కు సెలక్టర్లు ఎంపికచేశారు. ఎవరీ సౌరభ్ కుమార్? 29 ఏళ్ల సౌరభ్ కుమార్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని భగ్పాట్లో జన్మించాడు. కాగా తన రాష్ట్ర సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించేముందు అతడు అండర్-19, అండర్-22 డివిజన్స్‌లో ఆడాడు. అనంతరం క్రికెట్‌పై మక్కువ ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితి దృష్ట్యా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగంలో చేరాడు. అయినప్పటికీ ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదగాలన్న తన పట్టుదలను మాత్రం వదలలేదు. ఈ క్రమంలో 2014లో సర్వీసెస్ తరపున హిమాచల్ ప్రదేశ్‌పై సౌరభ్ ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. అనంతరం 2015లో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం నుంచి వైదొలిగిన సౌరభ్ తన సొంత రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన రంజీ అరంగేట్ర సీజన్లోనే 17 వికెట్లతో పాటు 304 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్-2013 సీజన్లో సౌరభ్‌ను పుణే వారియర్స్ కొనుగోలు చేసింది. అయినప్పటికీ అతడు కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. చదవండి: ENG Vs PAK: పాకిస్తాన్ గడ్డపై ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర.. 22 ఏళ్ల తర్వాత తొలి సారిగా -
థ్రిల్లర్ సినిమాను తలపించే కథ...పాపం కొడుకు కోసం ఆ తల్లే..
ఎన్నో క్రైం స్టోరీలను విని ఉంటాం. ఆ కేసుల్లో చాలామటుకు హత్య చేయడం.. తప్పించుకునేందుకు రకరకాలుగా ట్రై చేసి చివరికి ఎక్కడో ఒక చోట దొరికపోవడం జరుగుతోంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు హత్య కేసులో ఇరికించి జైలు పాలు చేశారు. దీంతో తల్లే కొడుకును కాపాడేందుకు రంగంలో దిగి రక్షించుకునే తాపత్రయాన్ని.. చూస్తే సినిమానే తలిపించే కథలా ఉంటుంది ఈ క్రైం స్టోరీ. వివరాల్లోకెళ్తే...యూపీలోని అలీఘర్‌లో 2015లో 15 ఏళ్ల బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి గోండా పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విష్ణు అనే యువకుడిని అదుపులోకి తీసుకుని పెళ్లికి ప్రలోభ పెట్టి కిడ్నాప్ చేసినట్లుగా నేరాలు మోపి కేసు నమోదు చేశారు. కొంతకాలం తర్వాత ఆగ్రాలో ఒక బాలిక అనుమానస్పద మృతి వార్తను చూసి సదరు అమ్మాయి తండ్రి ఆ బాలిక తన కుమార్తెగా గుర్తించాడు. దీంతో విష్ణుపై హత్య నేరం కింద కేసు నమోదు జైలుకి పంపారు అధికారులు. ఐతే నిందితుడు విష్ణు తల్లి ఈ ఆరోపణలు అవాస్తవం అని నిరూపించి తన కొడుకును ఈ కేసు నుంచి బయటపడేలా చేయాలనకుంది. అందులో భాగంగా తానే స్వయంగా రంగంలోకి దిగి ఈ కేసును చేధించేందుకు పూనుకుంది. ఇక్కడే ఈ కేసులో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఈ మేరకు ఏ అమ్మాయి ఐతే కిడ్నాప్ అయ్యి హత్యకు గురయ్యిందన్నారో ఆ అమ్మాయి బతికే ఉందని ఈ తల్లి గుర్తించింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఈ క్రమంలో పోలీసులు సదరు బాధితురాలిని హత్రాస్‌లో ట్రాక్ చేసి అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపర్చి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఐతే ఈ కేసులో మరింత ముందకు వెళ్లాడానికి ఆమెకు డీఎన్ఏ టెస్ట్‌లు కూడా నిర్వహించనున్నట్లు పోలీస్ అధికారి సింగ్ చెప్పారు. ఆ తదనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐతే ఆ ఘటనలో ఆ అమ్మాయికి ప్రస్తుతం 22 ఏళ్లు కాగా, నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు విష్ణుకి 25 ఏళ్లు. దాదాపు ఏడేళ్ల తర్వాత గానీ ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. ఈ మేరకు విష్ణు తల్లి తన కొడుకు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ కేసులో ఇరుకిస్తున్నారని తెలిసి.. తానే స్వయంగా రంగంలోకి దిగి దర్యాప్తు చేసినట్లు తెలిపింది. అతడి నిర్దోషిత్వాన్ని నిరూపించేందకు తాను ఈ బాధ్యత తీసుకున్నాని చెప్పింది. (చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..) -
ఆర్యన్ అద్భుత శతకం.. హైదరాబాద్‌పై ఉత్తరప్రదేశ్ ఘన విజయం
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా హైదరాబాద్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. మికిల్ జైస్వాల్ (59 బంతుల్లో 73; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ బుద్ధి (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేయగా...శివమ్ మావి 3, సౌరభ్ కుమార్ 2 వికెట్లు తీశారు. అనంతరం యూపీ 48.4 ఓవర్లలో 3 వికెట్లకు 262 పరుగులు సాధించింది. ఆర్యన్ జుయాల్ (136 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) శతకం బాదగా...రింకూ సింగ్ (48 బంతుల్లో 78 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), మాధవ్ కౌశిక్ (92 బంతుల్లో 70; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. రోహిత్ రాయుడుకే 3 వికెట్లు దక్కాయి. చదవండి: IND Vs NZ 1st T20: ఆగని వర్షం.. భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 రద్దు -
తల్లి ఒడిలో నుంచి ఎత్తుకెళ్లిన పసికందు.. ‘బీజేపీ’ నేత ఇంట్లో ప్రత్యక్షం!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్లో నిద్రిస్తున్న తల్లి ఒడిలోనుంచి ఈనెల 23న 7 నెలల బాలుడిని ఎత్తుకెళ్లి సంఘటన ఇటీవల సంచలనంగా మారింది. కిడ్నాప్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీని కనుగొన్నారు. మథురాకు 100 కిలోమీటర్ల దూరంలోని ఫిరోజాబాద్‌లో ఓ బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో బాలుడిని గుర్తించారు. పిల్లలను ఎత్తుకెళ్లి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. కిడ్నాప్ గ్యాంగ్‌లో భాగమైన ఇద్దరు డాక్టర్ల నుంచి బాలుడిని రూ.1.8 లక్షలకు కొనుగోలు చేశారు బీజేపీ నేత వినిత అగర్వాల్, ఆమె భర్త. వారికి ఇదివరకే కూతురు ఉన్నప్పటికీ కొడుకు కావాలనే ఉద్దేశంతో కొనుగోలు చేశారు. ఈ కేసులో రైల్వే స్టేషన్లో పిల్లాడిని ఎత్తుకెళ్లిన వ్యక్తితో పాటు మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు పోలీసులు. చిన్నారిని ఆమె తల్లికి అప్పగించారు. వైద్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫికింగ్ గ్యాంగ్‌పై వివరాలు వెల్లడించారు సీనియర్ పోలీస్ అధికారి మహమ్మెద్ ముస్తాఖ్. ‘దీపక్ కుమార్ అనే వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లాడు. అతడితో పాటు హత్రాస్ జిల్లాకు సమీపంలో ఆసుపత్రి నిర్వహిస్తోన్న ఇద్దరు డాక్టర్లు ఈ గ్యాంగ్‌లో భాగస్వాములు. కొంత మంది ఆరోగ్య కార్యకర్తలకు సైతం ఇందులో భాగం ఉంది. చిన్నారి ఆచూకీ లభించిన ఇంటి సభ్యులను విచారించాం. వారికి ఒకే కూతురు ఉందని, కుమారుడు కావాలని చెప్పారు. అందుకే ఈ డీల్ కుదుర్చుకున్నారు.’ అని వెల్లడించారు ముస్తాఖ్. అయితే, ఈ అంశంపై అరెస్ట్ అయిన కార్పొరేటర్, బీజేపీ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ये व्यक्ति रे०स्टेशन मथुरा जं० से अपनी माँ के साथ सो रहे महज 7 माह के बच्चे को उठाकर ले गया। इस व्यक्ति को पकड़वाने में मदद कीजिये। आप सिर्फ Retweet कर इसके फ़ोटो/वीडियो को Groups में share कर दीजिये, विशेष कर कासगंज, बदायूँ और बरेली साइड में। मुझे भरोसा है ये अवश्य पकड़ा जाएगा। pic.twitter.com/fTnuGbSlsi — SACHIN KAUSHIK (@upcopsachin) August 27, 2022 ఇదీ చదవండి: CCTV Footage: తల్లి ఒడిలో నిద్రిస్తున్న పసికందును ఎత్తుకుపోయిన దుండగుడు -
పంట అమ్ముకుని వస్తుండగా నదిలో పడ్డ ట్రాక్టర్.. 20మంది రైతులు..!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 20 మంది రైతులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ వంతెనపై నుంచి గర్రా నదిలో పడిపోయింది. ఈ ప్రమాందంలో ఇప్పటి వరకు ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గల్లంతయ్యారు. మరో 14 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన బాధితుడు ముకేశ్‌గా గుర్తించినట్లు తెలిపారు హర్దోయ్ జిల్లా మేజిస్ట్రేట్ అవినాశ్ కుమార్. ‘ట్రాక్టర్ ట్రాలీలో వెళ్తున్న 20 మంది గర్రా నదిలో పడిపోయినట్లు సమాచారం అందింది. వారిలోంచి 14 మందిని సురక్షితంగా కాపాడారు. ముకేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. గల్లంతైన ఐదుగురి కోసం గాలిస్తున్నా’మని తెలిపారు అవినాశ్ కుమార్. సంఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పీఏసీ బలగాలను మోహరించినట్లు చెప్పారు. ట్రాక్టర్, ట్రాలీని స్వాధీనం చేసుకున్నామని, గల్లంతైన వారందరినీ వెలికితీసిన తర్వాతే ఆపరేషన్ పూర్తవుతుందన్నారు. ఏం జరిగింది? బెగ్రాజ్‌పుర్ గ్రామానికి చెందిన రైతులు తమ పంటను సమీపంలోని మార్కెట్లో విక్రయించి ట్రాక్టర్లో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పాలీ ప్రాంతంలో గర్రా నదిపై ఉన్న వంతెనపైకి రాగానే ట్రాక్టర్ టైర్ పేలింది. దీంతో అదుపు తప్పి ట్రాక్టర్ నదిలోకి దూసుకెళ్లింది. #UttarPradesh: Twenty people riding on a tractor-trolley fell into the #Garra river after the driver lost control of the vehicle and it fell off the bridge in #Hardoi on Saturday, officials said. Six people are missing in the tragedy. pic.twitter.com/sy5MYbfJmJ — Siraj Noorani (@sirajnoorani) August 27, 2022 ఇదీ చదవండి: భయానక రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి -
జిల్లా కలెక్టర్‌కే ఝలక్ ఇచ్చిన కోతి.. ఏం చేసిందంటే?
లక్నో: ఒక జిల్లాకు కలెక్టర్ అధిపతి. జిల్లాలో ఆయనను మించిన పవర్ఫుల్ వ్యక్తి మరొకరు ఉండరు. అయితే, అలాంటి వ్యక్తికే ఝలక్ ఇచ్చింది ఓ కోతి. చుట్టూ పదుల సంఖ్యలో పోలీసులు, స్థానికులు ఉన్నప్పటికీ కలెక్టర్ కంటి అద్దాలను ఎత్తుకెళ్లి తానేంటో చూపించింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్, మథురాలోని బృందావన్ నగరంలో వెలుగు చూసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. జిల్లా మెజిస్ట్రేట్ నవనీత్ చాహల్ గ్లాసెస్‌ను ఎత్తుకెళ్లిన వానరం దృశ్యాలను ట్విట్టర్లో షేర్ చేశారు భారత అటవీ సర్వీసెస్(ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద. కలెక్టర్ నవనీత్ చాహల్, పలువురు పోలీసులు ఓ భవనం వద్ద గుమిగూడి కోతి నుంచి గ్లాసెస్ ఎలా తెచ్చుకోవాలో ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ భవనం గోడలపై ఇతర కోతులు సైతం ఉన్నాయి. కొద్ది సేపు బుజ్జగించిన తర్వాత కంటి అద్దాలను తిరిగి ఇచ్చేసింది ఆ వానరం. ‘భారత్‌లోని ఓ జిల్లాలో డిస్ట్రిక్ట్ మెజిస్టేట్ను మించిన పవర్ఫుల్ వ్యక్తి ఉండడు. బృందావన్‌లో డీఎం నవనీత్ చాహల్ అద్దాలను కోతీ ఎత్తుకెళ్లింది. కొద్ది సమయం బుజ్జగించిన తర్వాత తిరిగి ఇచ్చేసింది’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు సుశాంత నంద. If you had not seen someone more powerful than District Magistrate of a District in India😊 Monkey snatches glasses from DM Navneet Chahal in Vrindavan, Mathura.After some pleading,the monkeys returned the glasses. pic.twitter.com/YTERfjh62G — Susanta Nanda IFS (@susantananda3) August 21, 2022 ఇదీ చదవండి: మెడలో విష సర్పంతో అతిచేష్టలు.. నిండు ప్రాణం బలి! -
కేంద్రంపై పోరుకు కదిలిన 10వేల మంది రైతులు!
లక్నో: కేంద్రానికి వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరీలో ఆందోళనలు చేపట్టేందుకు పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్ మోర్చా. మూడు రోజుల పాటు చేపట్టే ఈ నిరసనల్లో పాల్గొనేందుకు సుమారు 10,000 మంది రైతులు పంజాబ్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు బయలుదేరారు. లఖింపుర్‌ఖేరీ హింసాత్మక ఘటనలకు న్యాయం చేయాలంటూ గురువారం నుంచి 72 గంటల పాటు(ఆగస్టు 18 నుంచి 20వ తేదీ) ఈ ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి రైతు సంఘాలు. సీనియర్ రైతు నేతలు రాకేశ్ టికాయిత్, దర్శన్ పాల్, జోగిందర్ సింగ్ ఉగ్రాహన్ వంటి వారు ఈ ఆందోళనల్లో పాల్గొననున్నారు. ఆందోళనల్లో సుమారు 10వేల మంది రైతులు పాల్గొంటారని భారతి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు మంజిత్ సింగ్ రాయ్ తెలిపారు. కొందరు రైళ్లలో, మరికొందరు తమ సొంత వాహనాల్లో లఖింపుర్‌ఖేరీకి చేరుకుంటున్నారని చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న రైతులపై కేసులను ఎత్తివేయాలని కోరుతున్నారు. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం, పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో లఖింపుర్‌ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా అరెస్టయ్యారు. రైతులకు న్యాయం చేయాలని, కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది జులైలో ఆశిశ్ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది అలహాబాద్ హైకోర్టు. ఇదీ చదవండి: PM Modi Interview: ఎన్నికల వేళ.. లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని ఏమన్నారంటే.. -
గాడ్సే ఫొటోలతో తిరంగా యాత్ర!
ముజఫర్‌నగర్: పంద్రాగస్టు సందర్భంగా సోమవారం అఖిల భారతీయ హిందూ మహాసభ చేపట్టిన తిరంగా యాత్రలో నాథూరాం గాడ్సే ఫొటోలను ప్రదర్శించడం కలకలం రేపుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై పలు సంఘాల నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, దీన్ని సంస్థ జాతీయాధ్యక్షుడు యోగేంద్ర వర్మ సమర్థించుకోవడం విశేషం. ‘‘ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మేము తిరంగా యాత్ర చేపట్టాం. జిల్లా మొత్తం ఈ యాత్ర కొనసాగింది. ఇందులో ప్రముఖ హిందూ నేతలంతా పాల్గొన్నారు. మేము పలువురు స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలు పెట్టాం. తిరంగా యాత్రలో మా కార్యకర్తలు ప్రదర్శించిన సమర యోధుల ఫొటోల్లో గాడ్సే కూడా ఉన్నారు. గాంధీ జాతి వ్యతిరేక విధానాలపై గాడ్సే గళం విప్పారన్నది మా విశ్వాసం’’ అని చెప్పుకొచ్చారు యోగేంద్ర వర్మ. ఇదీ చదవండి: కర్ణాటక సీఎం బొమ్మైకి మరో తలనొప్పి.. రాష్ట్ర మంత్రి ఆడియో లీక్! -
జిల్లా కోర్టులో కాల్పుల కలకలం.. అండర్ ట్రయల్ ఖైదీ మృతి!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపుర్ జిల్లా కోర్టు వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. కొందరు గుర్తు తెలియని దుండగులు మంగళవారం ఉదయం అండర్ ట్రయల్ ఖైదీపై కాల్పులు జరిపారు. దీంతో తూటాలు తగిలి ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు, అండర్ ట్రయల్ ఖైదీ లఖన్‌పాల్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు హర్యానా నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఈ సంఘటనలో అండర్ ట్రయల్ ఖైదీతో ఉన్న హర్యానా పోలీసు అధికారికి సైతం గాయలయ్యాయి. అయితే, కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అండర్ ట్రయల్ ఖైదీనే లక్ష్యంగా ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. గాయపడిన పోలీసు అధికారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. కాల్పులకు పాల్పడిన దుండగులను ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అక్కడే ఉన్న పోలీసులు సైతం వారిని పట్టుకునే ప్రయత్నం చేయకపోవటం వల్ల దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు. ఇదీ చదవండి: బీజేపీ కార్యాలయం ఎదుట కారు కలకలం.. బాంబు స్క్వాడ్‌కు సమాచారం! -
సెక్యూరిటీ గార్డ్‌ను చితకబాదిన మహిళ.. వీడియో వైరల్!
లక్నో: వీధి శునకాలపట్ల క్రూరంగా ప్రవర్తించాడనే కారణంతో ఓ రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ గార్డ్‌పై ఆగ్రహంతో ఊగిపోయింది ఓ మహిళ. పెద్ద కర్రతో కొడుతూ తిట్ల వర్షం కురిపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ వీడియో పోలీసులకు చేరటంతో మహిళపై కేసు నమోదు చేసినట్లు ఆగ్రా పోలీసులు తెలిపారు. వీడియోలోని ఆ యువతి తాను జంతు హక్కుల కార్యకర్తగా చెప్పినట్లు వెల్లడించారు. ఈ వీడియోలో.. 20 ఏళ్లుపైబడిన ఓ మహిళ సెక్యూరిటీ గార్డుపై ఆగ్రహంతో ఊగిపోతోంది. పెద్ద కర్ర తీసుకుని చితకబాదుతూ తిట్ల వర్షం కురిపించింది. అంతే కాకుండా వీధి శునకాల పట్ల కూర్రంగా ప్రవర్తించావని భాజపా ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీకి ఫిర్యాదు చేస్తానని బెదిరించింది ఆ మహిళ. ఈ సంఘటనపై ఆగ్రా నగర ఎస్పీ వికాస్ కుమార్ వివరాలు వెల్లడించారు. ‘సెక్యూరిటీ గార్డును ఓ మహిళ కర్రతో కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో ఆధారంగా మహిళపై చట్టపరమైన చర్యలు చేపట్టారు ఆగ్రా పోలీసులు.’ అని తెలిపారు. మరోవైపు.. ఎల్ఐసీ ఆఫీసర్ కాలనీలో పని చేస్తున్న బాధితుడు అఖిలేశ్ సింగ్ తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు న్యూఆగ్రా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ విక్రమ్ సింగ్. వైరల్ వీడియోలో ఉన్న మహిళ నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఎల్ఐసీ ఆఫీసర్ కాలనీలో పని చేస్తున్న క్రమంలో అటుగా వచ్చిన వీధి కుక్కలను తరిమేసేందుకు షూను వినియోగించినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. తాను ఎక్స్ సర్వీస్‌మెన్‌గా తెలిపాడు బాధితుడు. Shocking video from UP's #Agra! Woman thrashes, abuses society security guard over 'bad behavior' with dogs. pic.twitter.com/XrDSIbT43V — Aman Dwivedi (@amandwivedi48) August 14, 2022 ఇదీ చదవండి: ఓలా డ్రైవర్‌పై రెచ్చిపోయిన గ్యాంగ్.. అరగంట ఆలస్యమైనందుకు దాడి.. రౌడీల్లా రాత్రంతా బంధించి.. -
యూపీలో ఘోర పడవ ప్రమాదం.. 20 మంది మృతి!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బాందా జిల్లాలోని యమునా నదిలో గురువారం ఓ పడవ మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బోటులో 50 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. మార్కా గ్రామంలోనే మార్కా ఘాట్ నుంచి ఫతేపూర్‌కు పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్లే ప్రమాదానికి గురైనట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు.. పడవలోని మహిళా ప్రయాణికులు రక్షాబంధన్ కోసం వెళ్తున్నట్లుగా స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలువురి ఆచూకీ గల్లంతైనట్లు చెప్పారు. ‘మార్కా గ్రామం నుంచి ఫతేపూర్ వెళ్తుండగా యమునా నదిలో పడవ బోల్తా పడింది. బోటులో ఎంతమంది, ఎవరెవరు ఉన్నారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.’ అని బాందా పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: అన్నమయ్య జిల్లా: కోడలి తల నరికిన అత్త.. వివాహేతర సంబంధమే కారణం? -
ఈ ఫుడ్ ఎవరైనా తింటారా? వెక్కి వెక్కి ఏడ్చేసిన కానిస్టేబుల్
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఒక పోలీస్ కానిస్టేబుల్ రద్దీగా ఉండే రోడ్డు పైకి వచ్చి ఒకటే ఏడుపు. పోలీస్ మెస్‌లో భోజనం క్వాలిటీగా ఉంటుందనుకుంటారు. కానీ అదంతా అబద్ధం ఎంత దారుణంగా ఉందో చూడండి అంటూ భోజనం ప్లేట్ తీసుకువచ్చి మరీ చెప్పాడు. అంతేకాదు ఆ ప్లేట్లోని చపాతీలు, అన్నం, పప్పు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి అంటూ ఏడూస్తూ పెద్దగా అరుస్తూ అక్కడ ఉన్న వారికి తన మనసులోని బాధను చెప్పకొచ్చాడు. పైగా తాను ఈ విషయమై పై అధికారులకు ఫిర్యాదు చేశానని కానీ ఎలాంటి చర్యలు తీసుకులేదని చెబుతున్నాడు. అంతేకాదు ఇలా ఫిర్యాదుల చేస్తున్నందుకు తన ఉద్యోగం తొలగిస్తానని అధికారులు బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆరోపణలు చేశాడు. అదీగాక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసుకు మంచి బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తామని చెప్పారని అన్నాడు. అయినప్పటికీ పోలీస్ మెస్‌లో ఇలాంటి ఆహారమే తమకు అందిస్తోందని, పైగా ఈ ఆహారం తిని ఎక్కువ సేపు విధుల నిర్వర్తించలేమని వాపోయాడు. ఈ ఆహారాన్ని జంతువుల కూడా తినవు అంటూ బోరు బోరున ఏడ్చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయమై ఫిరోజాబాద్ పోలీస్ అధికారులు వెంటనే స్పందించి....సదరు కానిస్టేబుల్ పై విధులకు హాజరుకాకపోవడం, క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించినందుకు గతంలో 15 సార్టు పనిష్మెంట్ పొందిన చరిత్ర ఉందని చెప్పుకొచ్చారు. అయిన ఈ ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని అధికారులు పేర్కొన్నారు. A UP police constable posted in Firozabad district protests against the quality of food served at the mess in police lines. He was later whisked away. A probe has been ordered. pic.twitter.com/nxspEONdNN — Piyush Rai (@Benarasiyaa) August 10, 2022 Here is an example… words of UP Police constable Manoj Kumar in Firozabad pic.twitter.com/YkzzJSOyBJ — The Fact Finder (@TheFactFindr) August 10, 2022 मैस के खाने की गुणवत्ता से सम्बन्धित शिकायती ट्वीट प्रकरण में खाने की गुणवत्ता सम्बन्धी जांच सीओ सिटी कर रहे है। उल्लेखनीय है कि उक्त शिकायतकर्ता आरक्षी को आदतन अनुशासनहीनता, गैरहाजिरी व लापरवाही से सम्बन्धित 15 दण्ड विगत वर्षो में दिये गये है । @Uppolice @dgpup @adgzoneagra — Firozabad Police (@firozabadpolice) August 10, 2022 (చదవండి: స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగుతూ సెల్ఫీ వీడియో.. కేసు నమోదు) -
సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. యూపీ పోలీస్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ వాట్సాప్‌కు ఈ సందేశం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. డయల్ 112 హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్‌కు షాహిద్ అనే వ్యక్తి ఆ మెసేజ్‌ను పంపించినట్లు గుర్తించామన్నారు. బాంబు పెట్టి ముఖ్యమంత్రిని హత్య చేస్తానని సందేశంలో రాశాడని పోలీసులు తెలిపారు. పోలీస్ ప్రధాన కార్యాలయం స్టేషన్ కమాండర్ సుభాష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై సైబర్ సెల్, నిఘా బృందాలు సైతం పని చేస్తున్నాయని చెప్పారు. ఇదీ చదవండి: ఏడాదిలో భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఆస్తులు.. ఎంతంటే? -
బాలుడి ముక్కు కొరికేసిన పొలిటికల్ లీడర్.. అంత కోపం దేనికో?
లక్నో: నలుగురికి మంచి చెడులు చెప్పాల్సిన నాయకులే ఒక్కోసారి వారు చేసే పనులతో నవ్వులపాలవుతుంటారు. ఓ రాజకీయ నాయకుడు కోపంతో తమ ఇంట్లో పని చేసే 16 ఏళ్ల బాలుడి ముక్కును కొరికేశాడు. తీవ్ర రక్త స్రావంతో ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌లో సోమవారం వెలుగులోకి వచ్చింది. అభయ్ నామ్‌దేవ్ అనే బాలుడు.. సచిన్ సాహూ అనే రాజకీయ నాయకుడి ఇంట్లో సహాయకుడిగా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం బాలుడు చిన్న తప్పు చేశాడని కోపంతో రగిలిపోయిన సాహూ అతడి ముక్కు కొరికేశాడు. తీవ్ర రక్తస్రావమైన బాలుడిని శనివారం రాత్రి స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఝాన్సీ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవటం వల్ల చర్యలు తీసుకోలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఎస్పీ నేత కారును ఢీకొట్టి.. 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు డ్రైవర్.. వీడియో వైరల్ -
‘నా భార్య అలిగి వెళ్లిపోయింది..3 రోజులు లీవ్ ఇవ్వండి సార్’
లక్నో: ఏదైనా పని ఉందనో, లేక ఆరోగ్యం బాగోలేదనో సెలవు తీసుకుంటారు ఎవరైనా. కానీ, తన భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని, బుజ్జగించి తిరిగి తీసుకొచ్చేందుకు మూడు రోజులు సెలవు కావాలని ఓ ప్రభుత్వ ఉద్యోగి కోరాడు. తన పరిస్థితిని వివరిస్తూ ఉన్నతాధికారులకు లేఖ రాశాడు. ప్రస్తుతం ఆ లీవ్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో జరిగింది. ప్రేమ్ నగర్ బ్లాక్ అభివృద్ధి అధికారి (బీడీఓ)కి మంగళవారం లేఖ రాశారు శాంషద్ అహ్మెద్. తనకు సెలవు ఎంత ముఖ్యమో వివరించారు. తన భార్యతో గొడవ జరిగిందని, దాంతో పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఆమెను బుజ్జగించి తిరిగి తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపారు అహ్మెద్. ‘నేను మానసికంగా బాధపడుతున్నా. ఆమెను బుజ్జగించి తీసుకొచ్చేందుకు వారి ఊరికి వెళ్లాలి. అందుకోసం ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు అత్యవసర సెలవు, నగరం విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను.’అని హిందీలో లేఖ రాశారు అహ్మెద్. క్లర్క్ అభ్యర్థనను బీడీఓ అధికారి ఆమోదించారు. Kanpur man seeks leave to make amends with wife, letter goes #viral pic.twitter.com/4RmVvL2JQh — Aaquil Jameel (@AaquilJameel) August 3, 2022 ఇదీ చదవండి: బాధలో ఉన్న వ్యక్తిని తల్లిలా ఓదార్చిన కోతి.. నెటిజన్లు ఫిదా! -
దారుణం.. కట్నం కోసం స్నేహితులతో కలిసి భార్యపై భర్త గ్యాంగ్ రేప్!
లక్నో: దేశంలో మహిళలపై అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అడిగినంత కట్నం ఇవ్వలేదని ఓ కిరాతకుడు.. తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం చేశాడు. ఈ అమానుష సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్పూర్ జిల్లాలో వెలుగు చూసింది. బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆమె భర్త, అతడి స్నేహితులపై ఛకేరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. 2020, మార్చి 6 నిందితుడితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె భర్త, ఆడపడుచు రూ.2 లక్షలు, కారు కట్నంగా ఇవ్వాలని వేధిస్తున్నారు. అయితే.. అడిగిన డబ్బు, కారు ఇవ్వలేకపోవటం వల్ల ఆమెను ఓ గదిలో పెట్టి తాళం వేశారు. ఒక రోజు ఆమె భర్త తన ముగ్గురు స్నేహితులను ఇంటికి తీసుకొచ్చాడు. నలుగురు కలిసి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తనను చంపేసేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు సైతం ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ మ్రిగాంక్ పతాక్ తెలిపారు. ఇదీ చదవండి: ‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక! -
దేశంలో మంకీపాక్స్ కలవరం.. మరో అనుమానిత కేసు నమోదు!
లక్నో: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నలుగురికి నిర్ధారణ కాగా.. తాజాగా మరో అనుమానిత కేసు బయటపడింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాకు చెందిన ఓ మహిళలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ మహిళలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. నమూనాలు సేకరించి లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి పంపించారు. అప్రమత్తమైన యూపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో అనుమానిత మంకీపాక్స్ కేసు బయటపడిన క్రమంలో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో మంకీపాక్స్ కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అన్ని ఆసుపత్రులు కట్టుబడి ఉండాలని పేర్కొంది. మరోవైపు.. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం మంకీపాక్స్‌పై నిఘా పెంచాలని అధికారులకు సూచించింది. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్.. ఇప్పటి వరకు దేశంలో నమోదైన నాలుగు కేసుల్లో మూడు కేరళలోనే వెలుగు చూశాయి. ఢిల్లీలో ఒక కేసు వచ్చింది. కేరళ, ఢిల్లీలలో కేసులు వచ్చిన క్రమంలో ఇతర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘా పెంచాయి. మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాల గుండా దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలపై జులై 18న కీలక సూచనలు చేసింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. ఇదీ చదవండి: Toxic Liquor: కల్తీ మద్యం తాగి 21 మంది కూలీలు మృతి -
విషాదంలో అద్భుతం..లారీ తొక్కి గర్భిణీ మృతి.. సజీవంగా శిశువు జననం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో విషాదంలో అద్భుతం జరిగింది. లారీ టైర్ల కిందపడి ఎనిమిది నెలల గర్భిణీ మృతి చెందగా ఆమె పొట్టలోని శిశువు మృత్యుంజయురాలిగా ప్రాణాలతో బయటపడింది. ఆ పసికందును హుటాహుటిన ఫిరోజాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ పాపకు కేవలం సాదారణ చికిత్స అవసరమని తెలిపారు. ఈ విషాద సంఘటన జిల్లాలోని బర్తపారా గ్రామంలో గురువారం జరిగింది. మృతురాలు ఆగ్రాకు చెందిన కామిని(26)గా పోలీసులు గుర్తించారు. తన తల్లిగారింటికి భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టినట్లు చెప్పారు. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపుతప్పి బాధితురాలి భర్త లారీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దాంతో కామిని రోడ్డుపై పడిపోయిందని, లారీ ఆమెపై నుంచి వెళ్లినట్లు చెప్పారు. తల్లి పొట్టలోంచి బయటపడిన చిన్నారి ప్రాణాలతో ఉండటం గమనించి ఆసుపత్రికి తరలించారని, ప్రస్తుతం శిశువు, ఆమె తండ్రి చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు లారీపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు ఎస్హెచ్ఓ. త్వరలోనే లారీ డ్రైవర్‌ను పట్టుకుంటామన్నారు. సంఘటన జరిగిన స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. లారీ టైర్ల కింద పడి తల్లి నుజ్జునుజ్జయినా.. పొట్టలోని శిశువు ప్రాణాలతో బయటపడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు స్థానికులు. ఇది ఒక అద్భుతంగా పేర్కొన్నారు. ఇదీ చదవండి: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు -
మనసున్న పోలీసు.. సెలవుల్లో టీచర్.. పేద పిల్లలకు ఉచితంగా పాఠాలు
లక్నో: పోలీసు ఉద్యోగం అంటేనే 24 గంటలు డ్యూటీ. క్షణం తీరిక లేని పని. ఎప్పుడైనా సెలవు దొరికితే కుటుంబంతో గడపాలనుకుంటారు. కానీ, ఓ పోలీసు అధికారి తన బాధ్యతలను నిర్వరిస్తూనే.. సెలవు రోజుల్లో టీచర్ అవతారమెత్తి పేద విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. సొంతంగా పాఠశాల ఏర్పాటు చేసి ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. వారికి కావాల్సిన పుస్తకాలు, స్టేషనరీ తానే అందిస్తున్నారు. ఆయనే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు చెందిన ఎస్సై రంజిత్ యాదవ్. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచితంగా పాఠాలు చెబుతున్నారు ఎస్సై రంజిత్ యాదవ్. ఉన్నత చదువులు చదవుకోవాలనే కోరికను వారిలో కలిగిస్తున్నారు. ఆయన చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటున్న చిన్నారులు.. తదుపరి తరగతులకు వెళ్తామని చెబుతున్నారు.' మేము ఇంకా చదువుకోవాలి. స్కూల్‌కు వెళ్లాలి. ఇక్కడ చదువుకోవడం వల్ల మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక్కడికి రోజూ వస్తాము.' అని ఓ చిన్నారి పేర్కొంది. బహిరంగ ప్రదేశంలో, ఓ చెట్టు నీడలో తరగతులు నిర్వహిస్తున్నారు. తాను నివాసముండే ప్రాంతంలో కొన్ని కుటుంబాలకు చెంది వారు, పిల్లలు బిచ్చమెత్తుకుంటూ కనిపించగా వారికి చదువు చెప్పించి మార్పు తీసుకురావాలనే ఆలోచన వచ్చినట్లు రంజిత్ యాదవ్ తెలిపారు. కొద్ది నెలల క్రితమే తరగతులు ప్రారంభించినట్లు చెప్పారు. ‘నా సొంత పాఠశాలను ప్రారంభించాను. నాకు సెలవు దొరికినప్పుడల్లా ఈ పిల్లలకు పాఠాలు బోధిస్తాను. వారి తల్లిదండ్రులు బిచ్చమెత్తుకుంటూ కనిపించటాన్ని చూసిన తర్వాత వారితో మాట్లాడాను. వారు పిల్లలను చదివించేందుకు ముందుకు వచ్చారు.’ అని తెలిపారు. ఆ పాఠశాలకు 50 మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వారికి అవసరమైన సామగ్రి, పుస్తకాలను పోలీసు అధికారే ఉచితంగా అందిస్తున్నారు. #Heartily #thanks 🙏✍️🙏@ANINewsUP @ayodhya_police @UpPolicemitra @igrangeayodhya @dubey_ips @navsekera @renukamishra67 @adgzonelucknow @dgpup @Uppolice शिक्षा है अनमोल रतन! https://t.co/lUphOUAjZn — Ranjeet Yadav 🇮🇳 (@RSupercop) July 21, 2022 ఇదీ చదవండి: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు -
అమానుష ఘటన: భార్యను విద్యుత్ స్థంబానికి కట్టి చితకబాది...వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లో ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రబుద్ధుడు భార్యను నడిరోడ్డుపై దారుణంగా చితకొట్టాడు. చుట్టూ ఉన్నవాళ్లంతా ఈ ఘటనను వీడియో తీస్తూ కూర్చున్నారే తప్ప అడ్డుకోలేదు. సదరు మహిళను ఈడ్చుకుంటూ లాక్కెళ్లి మరీ హింసించాడు. ఈ ఘటన తాలుకా వీడియో ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. అతని దురుసు ప్రవర్తనను చూసి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. అసలేం జరిగిందంటే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...కుసుమా దేవి అనే మహిళను ఆమె భర్త శ్యాంబిహారి విద్యుత స్థంభానికి కట్టి దారుణాతి దారుణంగా చితకొట్టాడు. అక్కడితో ఆగకుండా ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మరీ కొట్టడం ప్రారంభించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అర్సేనా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని స్థానికుల సెల్ ఫోన్లో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియోని చూసిన పోలీసులు రంగంలోని దిగి విచారించగా...బాధితురాలు కుసమా దేవి, నిందితుడు శ్యాంబిహారిగా గుర్తించారు. ఈ మేరకు బాధితురాలు తన భర్త శ్యాంబిహారి, అతని తల్లి బర్ఫాదేశి తనను నిర్బంధించి మరీ హిసించారని పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐతే నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. #WATCH उत्तर प्रदेश: आगरा में एक पति ने अपनी पत्नी को खंबे से बांधकर डंडे से पीटा। घटना का वीडियो वायरल हुआ। (20.07) pic.twitter.com/ND9CbIo9dP — ANI_HindiNews (@AHindinews) July 20, 2022 (చదవండి: నిత్యపెళ్లికొడుకు మామూలోడు కాదు.. 13 మందిని శారీరకంగా వాడుకొని.. ) -
యూపీలో పిడుగుల వర్షం.. ఒకే రోజు 14 మంది మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం పిడుగుల వర్షం కురిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. సహాయ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. బండా జిల్లాలో పడిన పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. ఫతేపూర్‌లో ఇద్దరు, బలరామ్‌పుర్, చందౌలీ, బలుందర్‌శహర్, రాయ్‌బరేలీ, అమేఠీ, కౌశాంబీ, సుల్తాన్‌పుర్, చిత్రకూట్ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. పిడుగుల ఘటనలపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి ఆర్థిక సాయం అందించాలని సూచించినట్లు చెప్పారు కమిషనర్. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఇదీ చదవండి: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు -
ఒకే చెట్టుకు 300 రకాల కాయలు.. ‘సచిన్’, ‘ఐశ్వర్య’లు ప్రత్యేకం!
లక్నో: ఒకే చెట్టుకు 300 రకాల మామడి కాయలు కాయడం సాధ్యమేనా.. అంటే అవుననే అంటున్నారు భారత మ్యాంగో మ్యాన్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కలీమ్ ఉల్లా ఖాన్. తన 120 ఏళ్ల మామిడి చెట్టుకు అంటుకట్టే పద్ధతి ద్వారా 300 రకాల మామిడి కాయలు కాసేలా చేసినట్లు చెబుతున్నారు. కొత్త మామిడి రకాలను అభివృద్ధి చేయడానికి ఈ పద్ధతి ఎంతగానే ఉపయోగపడుతుందని అంటున్నారు. అది ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం. ప్రతి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత ప్రార్థనలు చేసుకుని కిలోమీటరున్నర దూరంలోని తన పొలానికి వెళ్తారు కలీమ్ ఉల్లా ఖాన్. అక్కడ ఉన్న మామిడి చెట్టును చూసుకుంటారు. కొమ్మల్లో దాగి ఉన్న మామిడి కాయలను ప్రతిరోజు పరీక్షిస్తారు. 'దశాబ్దాలుగా మండే ఎండలో కష్టపడిన దానికి నా బహుమతి ఇది' అని చెబుతారు 82 ఏళ్ల వృద్ధుడు. ఆయన కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మలిహాబాద్‌లో నివాసం ఉంటోంది. ఆయన తోటలోని మామిడి చెట్టును చూస్తే మామూలుగానే కనిపిస్తుంది. కానీ, మనసుతో పరిశీలిస్తే.. అది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి కళాశాలగా తారసపడుతుంది. చదువు మధ్యలోనే మానేసిన కలీమ్ ఉల్లా ఖాన్.. యుక్త వయసులోనే మామిడి చెట్టుపై తన తొలి ప్రయోగం చేశారు. కొత్త రకాలను తయారు చేసేందుకు వివిధ రకాల మొక్కలను అంటుకట్టారు. తొలుత ఏడు కొత్త రకాలను ఉత్పత్తి చేసేలా మార్చారు. కాని అది తుపాను ధాటికి నేలకొరిగింది. అయితే.. 1987 సంవత్సరం నుంచి తన ప్రయోగాలను కొనసాగిస్తూ.. 120 ఏళ్ల నాటి చెట్టుపై 300 రకాల మామిడి కాయలు కాసేలా చేశారు. ఒక్కోటి ఒక్కో రకమైన రుచి, రంగు, ఆకారం ఉండటం వాటి ప్రత్యేకత. సచిన్, ఐశ్వర్యలు ప్రత్యేకం.. తన తొలి నాటి ప్రయోగంతో వచ్చిన కొత్త రకం మామిడి కాయలకు బాలీవుడ్ స్టార్, 1994 మిస్ వరల్డ్ విన్నర్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ పేరుతో ఐశ్వర్యగా నామకరణం చేశారు కలీమ్. ఇప్పటికీ ఆయన అభివృద్ధి చేసిన వాటిలో అవి ప్రత్యేకంగా నిలుస్తాయి. 'ఐశ్వర్యలాగానే ఆ మామిడి పండ్లు సైతం అందంగా ఉంటాయి. ఒక్క మామిడి కాయ కిలోకిపైగా బరువు ఉంటుంది. మందమైన తోలుతో ఎంతో తియ్యగా ఉంటుంది. ' అని పేర్కొన్నారు. మరికొన్నింటికి ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్ హీరో సచిన్ టెండూల్కర్, అనార్కళీ వంటి పేర్లు పెట్టారు. 'మనుషులు వస్తుంటారు పోతుంటారు. కానీ, మామిడి పండ్లు శాశ్వతం. కొన్నేళ్ల తర్వాత ఎవరైనా ఈ సచిన్ మ్యాంగోను తింటే.. క్రికెట్ హీరోను గుర్తు చేసుకుంటారు.' అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఆసుపత్రి నిరాకరణ.. రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ! -
హెల్మెట్ ధరించి బస్సు డ్రైవింగ్.. కారణం తెలిస్తే షాక్!
లక్నో: సాధారణంగా బైక్‌పై వెళ్తే హెల్మెట్ ధరిస్తాం. కానీ, కారు, బస్సు, ట్రక్కుల్లో హెల్మెట్ ధరించటం ఎప్పుడైనా చూశారా? ఓ డ్రైవర్ హెల్మెట్ ధరించి బస్సు నడిపిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగింది. లోని బస్ డిపోకు చెందిన ఆ బస్సు డ్రైవర్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అసలు హెల్మెట్ ధరించిన కారణం తెలిస్తే మీరు షాకవుతారు. రోడ్డుపై వెళ్తున్న బస్సును ఓ వ్యక్తి వెంబడించి మరీ వీడియో తీశాడు. ఆ దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. దీంతో గాయాలబారిన పడకుండా, వర్షం, గాలి నుంచి రక్షణ కోసం ఇలా డ్రైవర్ హెల్మెట్ ధరించినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం లోని బాగ్పత్ సరిహద్దులో ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన బస్సును డ్రైవర్ అలాగే డిపోకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో బస్సును ఢీకొట్టటం వల్ల ముందు అద్దాలు పగిలిపోయాయని డ్రైవర్ చెప్పినట్లు వెల్లడించారు. Picture of UP Roadways bus clicked in Baghpat pic.twitter.com/0hkJAimkfG — Piyush Rai (@Benarasiyaa) July 17, 2022 ఇదీ చూడండి: కదులుతున్న ట్రక్కుపై సూపర్ హీరోలా ఫీట్లు.. వీడియో వైరల్ -
స్పీడ్‌గా వెళ్తున్న ట్రక్కుపై 'శక్తిమాన్' స్టైల్లో ఫీట్లు.. పట్టుతప్పటంతో..!
లక్నో: రోడ్డుపై వేగంగా వెళ్తున్న చెత్త తీసుకెళ్లే ట్రక్కుపై ఓ వ్యక్తి పుషప్స్ చేస్తూ సూపర్ హీరోలా రెచ్చిపోయాడు. ట్రక్కుపై ఎలాంటి ఆధారంలేకుండా నిలబడి పోజులిచ్చాడు. కొద్ది సేపటికే పట్టు కోల్పోయి.. కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో కుయ్యో ముర్రో అంటూ మూలుగుతున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు సీనియర్ పోలీస్ అధికారి శ్వేత శ్రీవాస్తవా. శక్తిమాన్‌లా కాదు.. బుద్ధిమాన్‌లా ఉండు అంటూ ట్యాగ్ జత చేశారు. ఈ సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ట్రక్కుపై నుంచి కిందపడిపోవటం వల్ల ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. భుజాలు, కాళ్లు, వీపుపై గాయాలతో బెడ్‌పై పడుకున్న దృశ్యాలు సైతం ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. गोमतीनगर, लखनऊ का कल रात का दृश्य- बन रहे थे शक्तिमान, कुछ दिनों तक नहीं हो पाएंगे विराजमान! चेतावनी: कृपया ऐसे जानलेवा स्टन्ट न करें! pic.twitter.com/vuc2961ClQ — Shweta Srivastava (@CopShweta) July 17, 2022 'అతడు శక్తిమాన్‌లా మారేందుకు ప్రయత్నించాడు. కానీ, బొక్కబోర్లాపడి కనీసం కూర్చోలేకపోతున్నాడు. దయచేసి అలాంటి ప్రమాదకర స్టంట్లు చేయవద్దు.' అంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు అదనపు డిప్యూటీ కమిషనర్ శ్వేత శ్రీవాస్తవా. శక్తిమాన్ సూపర్ హిట్ సూపర్ హీరో టీవీ షో. అది 1997 నుంచి 2005 వరకు డీడీ నేషనల్ ఛానల్లో ప్రసారమైంది. శక్తిమాన్‌గా ముకేశ్ ఖన్నా అభిమానులను మెప్పించారు. ఇదీ చదవండి: ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. నెల క్రితమే నిర్మించారటా! -
చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాథ్ ఫోటోలు...వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో మధరలోని ఒక స్థానిక మున్సిపాలిటి ఉద్యోగి చెత్తను సేకరించుకుంటూ వెళ్తున్నాడు. ఐతే ఆ చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాద్ ఫోటోలు ఉన్నాయి. దీంతో అతనికేం సంబంధం లేదు. అతను తన పనిగా చెత్తను సేకరించుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాజస్తాన్‌కి చెందిన కొందరు వ్యక్తలు సదరు వ్యక్తిని ఆపి మరీ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆ చెత్తబండిలో అబ్దుల్ కలాం పోటో కూడా ఉంది. దీంతో సదరు వ్యక్తిని ఏంటి ఇది అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. తనకేం తెలియదని చెత్తబుట్టలో ఉన్నవాటిని సేకరించుకుంటూ వచ్చానని చెప్పాడు. ఈ ఘటనను అవమానంగా భావించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సదరు మున్సిపాలిటీ కాట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ఆ చెత్తబండిలో ఉన్న ఫోటోలను గుర్తించి ప్రశ్నించిన వ్యక్తి ఆయా ఫోటోలను సదరు వ్యక్తి నుంచి తీసుకోవడమే కాకుండా గౌరవంగా నిమజ్జనం చేస్తానని చెప్పాడు. ఐతే నెటిజన్లు మాత్రం ఇందులో అతని తప్పే ఏముంది, చెత్త బుట్లలో ఉంటేనేగా అతను సేకరించి తీసుకువచ్చిందని ఒకరు, పాడైన ఫోటోలను ఏం చేయాలో చెప్పండి అంటూ మరోకరు మండిపడుతూ ట్వీట్ చేశారు. A contractual worker at UP's Mathura Nagar Nigam was terminated after he was found carrying pictures of PM Narendra Modi and CM Yogi Adityanath among other dignitaries in his hand held garbage cart. pic.twitter.com/Jg2x3LW3Mk — Piyush Rai (@Benarasiyaa) July 17, 2022 (చదవండి: ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. నెల క్రితమే నిర్మించారటా!) -
యూపీలో 'బై బై మోదీ' హోర్డింగ్.. అది టీఆర్ఎస్ మద్దతుదారుల పనేనా?
లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన క్రమంలో 'చాలు మోదీ, చంపకు మోదీ' అంటూ పలు చోట్ల బ్యానర్లు, హోర్డింగ్‌లు వెలిసిన సంగతి తెలిసిందే. అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్ ఏర్పాటు చేయటం కలకలం రేపింది. యూపీ ప్రయాగ్ రాజ్ నగరం, బెలి రోడ్‌లోని రిజర్వ్ పోలీస్ లైన్‌కు సమీపంలో శనివారం 'బై బై మోదీ' అంటూ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన కోలోనెల్‌గంజ్ పోలీసులు ప్రింటింగ్ ప్రెస్ ఓనర్, కార్యక్రమ నిర్వహకుడు సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) మద్దతుదారు అది ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. అరెస్టయిన వారిలో ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ అభేయ్ కుమార్ సింగ్, కార్యక్రమ నిర్వహకుడు అనికేత్ కేసరి, కాంట్రాక్టర్ రాజేశ్ కేసర్వాని, కార్మికులు శివ, నంక అలియాస్ ధర్మేంద్రలుగా గుర్తించారు. కోలేనెల్‌గంజ్ డిప్యూటీ ఎస్పీ అజీత్ సింగ్ చౌహాన్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ' ప్రధాని మోదీపై వివాదాస్పద హోర్డింగ్ ఏర్పాటు చేసిన ఐదుగురిని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అరెస్ట్ చేశాం. తెలంగాణలోని సికింద్రబాద్‌కు చెందిన వ్యక్తి, టీఆర్ఎస్ మద్దతుదారు ఆధ్వర్యంలో ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. జులై 8-9 తేదీల మధ్య రాత్రి బెలి రోడ్డులో దీనిని ఏర్పాటు చేశారు. ఐపీసీలోని 153బీ, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.' అని తెలిపారు. ఈ వివాదాస్పద హోర్డింగ్ ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తిని సాయిగా గుర్తించినట్లు చెప్పారు డిప్యూటీ ఎస్పీ అజిత్ సింగ్. అతడు సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి, టీఆర్ఎస్ మద్దతుదారు అని తెలిపారు. సాయి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. జులై 7న తెలంగాణలోని సికింద్రాబాద్‌లో సైతం ఇలాంటి పోస్టర్లే వెలిచాయని, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారయన్నారు. టీఆర్ఎస్ మద్దతుదారు సాయి.. ప్రయాగ్‌రాజ్‌లోని కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి హోర్డింగ్‌లు ఏర్పాటు చేసే ప్రాంతాలపై ఆరా తీసినట్లు విచారణలో తేలిందన్నారు అజిత్ సింగ్. ఆయా ప్రాంతాల వివరాలు ఆర్గనైజర్ పంపించగా.. బెలి రోడ్డులో ఏర్పాటు చేయాలని, అందుకు రూ.10వేలు సైతం ఇచ్చినట్లు గుర్తించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సాయి డైహార్డ్ ఫ్యాన్‌గా చెప్పుకొచ్చారు. ఇదీ చూడండి: టోల్గేట్ వద్ద 'ది గ్రేట్ ఖలీ' హల్చల్.. సిబ్బందిపై పంచ్‌లు! -
46 మ్యాచ్‌లు.. 196 వికెట్లు.. ఏకంగా భారత జట్టులోకి ఏంట్రీ.. ఎవరీ సౌరభ్ కుమార్ ?
స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఉత్తర్ ప్రదేశ్ ఆల్ రౌండర్ సౌరభ్ కుమార్‌ను సెలెక్షన్ కమిటీ శ్రీలంకతో టెస్ట్‌లకు ఎంపిక చేసింది. 28 ఏళ్ల సౌరభ్ కుమార్ భారత జట్టు తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. అనూహ్యంగా భారత జట్టులోకి ఏంట్రీ ఇస్తున్న సౌరభ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు. సౌరభ్ ఇప్పటి వరకు 46 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 25 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సౌరభ్ అద్భుతంగా రాణిస్తోన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 46 మ్యాచ్‌లు ఆడిన సౌరభ్.. 196 వికెట్లు పడగొట్టాడు. ఈ లెప్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్.. గత ఏడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత-ఏ జట్టులో భాగమై ఉన్నాడు. అదే విధంగా గతఏడాది జరగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోను సౌరభ్ కుమార్ అద్భుతంగా రాణించాడు. ఇక రంజీ ట్రోఫీ 2019-20 సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 44 వికెట్లతో పాటు, 285 పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీలో కుల్ధీప్ యాదవ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 192 పరుగుల రికార్డు భాగస్వామ్యం కూడా నెలకొల్పాడు. భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కెఎస్ భరత్, ఆర్ అశ్విన్ , రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, సౌరభ్ కుమార్ చదవండి: Ind Vs SL: శ్రీలంకతో సిరీస్‌లకు జట్టు ప్రకటన.. కోహ్లి, పంత్ దూరం -
ఒకే పార్టీ టిక్కెట్టు కోసం పోటీపడుతున్న భార్యాభర్తలు
సాక్షి, న్యూఢిల్లీ: అధికారం కోసం కుటుంబ సభ్యులు పోరాడడం సహజం. అయితే, యూపీ ఎన్నికల్లో ఒకే నియోజకవర్గంలో ఒకే పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆలుమగలు పోటీపడడం ఆసక్తికరంగా మారింది. సరోజనీనగర్ సీటు కోసం సీఎం యోగి ఆదిత్యనాద్ మంత్రివర్గంలోని స్వాతి సింగ్, ఆమె భర్త పార్టీ ప్రదేశ్ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఫిబ్రవరి 23న నాలుగో దశలో ఈ నియోజకవర్గం ఎన్నిక జరగనుంది. దయాశంకర్ పార్టీ ఎన్నికల కమిటీలో సభ్యుడు కావడంతోపాటు ఇటీవల ములాయంసింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్‌ను పార్టీలో చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. స్వాతి సింగ్ ప్రస్తుతం పలు శాఖల సహాయ మంత్రిగా, స్వతంత్రహోదా మంత్రిగా ఉన్నారు. 2016లో పార్టీలో చేరిన స్వాతి సింగ్ 2017లో సరోజనీ నగర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2016లో బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏడాదిపాటు దయాశంకర్‌ను పార్టీ సస్పెండ్ చేసింది. అన్సల్ బిల్డర్స్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసు అధికారిని బెదిరించారంటూ స్వాతి సింగ్‌పైనా ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఓ పక్క భార్యాభర్తలు ఇద్దరూ సరోజనీనగర్‌లో హోర్డింగ్‌లతో హోరెత్తిస్తుంటే పార్టీ అధిష్ఠానం మూడో వ్యక్తిని పరిశీలించే అవకాశం లేకపోలేదని సీనియర్ నేతలు చెబుతున్నారు. మంత్రి మహేంద్ర సింగ్, మాజీ సీఎం కల్యాణ్ సింగ్ సన్నిహితుడు రాజేష్‌సింగ్ చౌహాన్, మాజీ కౌన్సిలర్లు గోవింద్పాండే, రామశంకర్త్రిపాఠిలతోపాటు సౌరభ్‌సింగ్, జిల్లా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామ్‌కుమార్ సింగ్ చౌహాన్ కూడా ఈ సీటును ఆశిస్తుండంతో అధిష్ఠానం వీరి పేర్లూ పరిశీలిస్తోంది. -
పార్టీ గెలుపోటములలో దళితులే నిర్ణేతలు!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములు నిర్ణయించడంలో దళితులు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. వీరికి రిజర్వ్ చేసిన స్థానాల్లో అధిక స్థానాలను దక్కించుకున్న పార్టీలే అధికార పీఠం ఎక్కిన నేపథ్యంలో అందరూ వీరిని తమవైపు తిప్పుకునే యత్నాల్లో మునిగితేలుతున్నారు. గత ఎన్నికల్లో 84 ఎస్సీ రిజర్వ్డ్ (రెండు ఎస్టీలకు రిజర్వు అయి ఉన్నాయి) స్థానాల్లో ఏకంగా 70 స్థానాలను గెలుచుకున్న బీజేపీ మరోమారు తమ ఓటుబ్యాంకు స్థిరంగా ఉంచుకునేందుకు నానాతంటాలు పడుతుండగా, వాటిని కొల్లగొట్టేందుకు సమాజ్‌వాదీ అనేక ఎత్తులు వేస్తోంది. ఇక తన సామాజిక వర్గానికే చెందిన సీట్లలో గత ఎన్నికల్లో తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్న బీఎస్పీ అధినేత మాయావతి తన బలాన్ని చూపేందుకు తహతహలాడుతున్నారు. 68 శాతం సీట్లు కొడితే అధికారమే... యూపీలో 15 కోట్లకు పైగా ఉన్న ఓటర్లలో కనీసంగా 21 శాతం మంది అంటే సుమారు 3.15 కోట్ల మంది దళితులు ఉన్నారు. ఇందులో అత్యధికంగా 2.25 కోట్ల మంది జాతవ్ వర్గానికే చెందిన వారు కాగా, 16 శాతం మందితో పాసీలు 70 నుంచి 80 లక్షల మంది వరకు ఉంటారు. మిగతా కులాల వారు మరో కోటి మందికి పైగా ఉన్నారు. మొత్తంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 84 ఉన్నాయి. ఇందులో 68శాతానికి మించి సీట్లు సాధించిన పార్టీనే అధికారంలోకి వస్తుందని గత గణాంకాలు చెబుతున్నాయి. 2007లో బీఎస్పీ 61 స్థానాల(69శాతం)ను సాధించి అధికారంలోకి వస్తే, 2012లో ఎస్పీ 58 స్థానాలు (68శాతం) సాధించి అధికార పీఠమెక్కింది. ఇక 2017లో అయితే బీజేపీ ఏకంగా 70 స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ కనీసంగా 58 స్థానాలను దక్కించుకునే పార్టీనే అధికారంలోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో అన్ని పార్టీలు వీరిని ఆకర్షించే పనిలో పడ్డాయి. ఆకర్షణ మంత్రాల్లో పార్టీలు... ముఖ్యంగా ఈ స్థానాల్లో తమ పట్టు ఏమాత్రం సడలకుండా చూసుకునేందుకు అధికార పార్టీ అనేక ఎత్తులు వేస్తోంది. 2012 ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు 14 శాతం మాత్రమే బీజేపీ దక్కించుకోగా, అది 2017లో ఏకంగా 40శాతానికి పెరిగింది. 84 రిజర్వ్డ్ స్థానాలకు గానూ 65 మంది జాతవేతర వర్గాల వారికే సీట్లు కేటాయించి ఆ స్థానాల్లో గెలిచి చూపించింది. నిజానికి జాతవ్‌లంతా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో ఉన్నప్పటికీ దోబీ, ఖాటిక్, పాసీ, వాల్మీకి వంటి జాతవేతర వర్గాలను ఆకర్షించి ఏకంగా 70 స్థానాలను దక్కించుకుంది. దక్కిన స్థానాలను దృష్టి పెట్టుకొనే యూపీ కేబినెట్లో ఏకంగా ఎనిమిది మందిని మంత్రులను చేసింది. ప్రస్తుతం ఆర్థికంగా అట్టడుగున ఉన్నవారు ప్రభుత్వ పథకాల నుండి పొందిన ప్రయోజనాలను నొక్కి చెప్పేలా పార్టీ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఎస్పీ వర్గాలు పొందుతున్న గృహాలు, మరుగుదొడ్లు, ఆరోగ్య సంరక్షణ, సబ్సిడీ సౌకర్యాలను ఎక్కువగా ప్రచారం చేస్తూ వారి ఓట్లకు గాలమేస్తోంది. దళితులకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చామని బీజేపీ చెప్పుకుంటున్నా ఓట్లను తెచ్చిపెట్టే నేతలు లేకపోవడం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీలో యోగికి ఉన్న ప్రజాదరణ, పథకాలతోనే ఎస్సీలను ఆకర్షించే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేస్తోంది. ఇక సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దళితులను ఆకట్టుకునేలా అంబేడ్కర్ జయంతిని ‘దళిత్ దివాళి’గా ప్రకటించాలని చేసిన వినతి పెద్ద చర్చకే దారితీసింది. దీనికి తోడు గడిచిన సెప్టెంబర్‌లో 15 రోజుల పాటు గ్రామీణ దళిత ఓటర్లే లక్ష్యంగా ‘గ్రామగ్రామాన దళితులతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని పార్టీ నిర్వహించింది. తాను ప్రకటించిన గృహాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి హామీలు ఎక్కువగా దళిత వర్గాలకే లాభం చేస్తాయని ఆయన పదేపదే తన సమావేశాల్లో అఖిలేశ్ ప్రస్తావిస్తున్నారు. మరోపక్క బీఎస్పీ 2007 ఎన్నికల్లో అమలు చేసిన ’బ్రదర్హుడ్’ విధానాన్ని అనుసరించేలా నిర్ణయాలు చేసింది. వివిధ మండలాల్లో సమావేశాల ద్వారా ప్రజలను సమావేశపరిచి సంప్రదాయ దళితుల ఓట్లతో పాటు బ్రాహ్మణ, వెనుకబడిన తరగతులు, ముస్లిం సమాజం మద్దతు కూడగట్టే ప్రణాళికలు అమలుపరుస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం సితాపూర్లోని సిధౌలీ, అజంగఢ్‌లోని లాల్గంజ్ స్థానాలను మాత్రమే పొందిన బీఎస్పీ ఈమారు తన సత్తా చాటుకునేలా వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమైంది. -
ఎంత బిజీగా ఉన్నా ఆ పని చేయిస్తా: ప్రియాంక గాంధీ
తన పిల్లలకు హోం వర్క్ చేయడం సహయపడతానని కాంగ్రెస్ కార్యదర్శి ప్రియాంక గాంధీ చెప్పారు. తాను ఎన్నికలో ప్రచారంలో ఉన్నప్పుడూ కూడా తన పిల్లలకు హోం వర్క్ చేయడంలో సహాయం చేస్తానని తెలిపారు. ఈ మేరకు ఫేస్ బుక్ వేదికగా జరిగిన లైవ్ చాట్ సెషన్లో ఒక నెటిజన్ మీ పిల్లలకు హోంవర్క్‌లో సహాయం చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ సమాధానం ఇచ్చారు. అంతేకాదు ప్రియాంక తన పిల్లలకు హోం వర్క్‌లో సహయం చేయడమే కాక ఆంటీ అంటూ వచ్చే తన పిల్లల స్నేహితులకు కూడా సహాయం చేస్తానని చెప్పారు. పైగా ఈ రోజు కూడా తాను తన కుమార్తె అసైన్‌మెంట్‌లో సహాయం చేశానని తెలిపింది. ఒక్కోసారి ఎన్నిఇకల ప్రచారం నుండి తిరిగి వచ్చినప్పుడూ తమ పిల్లల హోంవర్క్ పూర్తైయిందో లేదో నిర్ధారించడానికి తెల్లవారుజామున 3 లేక 4 గంటలకు కూర్చోవలసి వచ్చేదని చెప్పారు. అంతేగాక తన చిన్నతనంలో సోదరుడు రాహుల్ గాంధీతో తీవ్రంగా గొడవపడేదాన్ని అని అన్నారు. కానీ బయటివాళ్లు ఎవరైన జోక్యం చేసుకుంటే మాత్రం తాము ఒక్కటైపోయే వాళ్లం అని చెప్పుకొచ్చారు. అయితే కోవిడ్ కారణంగా రాజకీయ పార్టీలు ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధించిన నేపథ్యంలో చాలా పార్టీలు ఓటర్లను కనక్ట్ అవ్వడానికి వినూత్న రీతిలో ఇలా ఆన్లైన్ ఫ్లాట్ ఫాంలను ఆశ్రయించాయి. View this post on Instagram A post shared by Priyanka Gandhi Vadra (@priyankagandhivadra) (చదవండి: చైనా అక్రమ వంతెన: మోదీ ప్రారంభిస్తారని భయంగా ఉంది!) -
ఉత్తర్‌ప్రదేశ్ కెప్టెన్‌గా కుల్ధీప్ యాదవ్..
రంజీ ట్రోఫీలో పాల్గొనే 24 మంది సభ్యుల ఉత్తర్‌ప్రదేశ్ జట్టును బుధవారం ప్రకటించారు. ఈ జట్టుకు టీమిండియా స్పిన్నర్ కుల్ధీప్ యాదవ్ సారథ్యం వహించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా కరుణ్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రియమ్ గార్గ్, శివమ్ మావి వంటి యువ ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. ఈ ట్రోఫిలో ఎలైట్ గ్రూపు-ఈలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్, జనవరి 13న ఒడిషాతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక రంజీ ట్రోఫీ జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్ జట్టు: కుల్దీప్ యాదవ్ (కెప్టెన్) కరణ్ శర్మ (వైస్-కెప్టెన్) మాధవ్ కౌశిక్, అల్మాస్ షౌకత్, సమర్థ్ సింగ్, హర్దీప్ సింగ్, రింకూ సింగ్, ప్రియాం గార్గ్, అక్ష్దీప్ నాథ్, సమీర్ చౌదరి, కృతగ్య సింగ్, ఆర్యన్ జుయల్, ధ్రువ్ చంద్ర జురెల్, శివమ్ మావి, అంకిత్ రాజ్‌పూత్, యశ్ దయాల్, కునాల్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, రిషబ్ బన్సల్, షాను సైనీ, జాస్మర్, జీషన్ అన్సారీ, శివం శర్మ, పార్థ్ మిశ్రా చదవండి: ముంబై జట్టు కెప్టెన్‌గా పృథ్వీ షా! -
డిసెంబర్ 31 న అమిత్ షా అయోధ్య పర్యటన!
Amit Shah Ayodhya Campaign 2021 లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి కాషాయ పార్టీ సిద్ధమైంది. డిసెంబర్ 31న అయోధ్యాలో జరగనున్న ఎన్నికల ర్యాలిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్లొననున్నారు. పర్యటనలో భాగంగా అక్కడి రామ్లాల, హనుమాన్ గర్హి ఆలయాలను సందర్శించనున్నారు. ఈమేరకు షా అయోధ్య పర్యటనకు భాజపా సన్నాహాలు చేస్తోంది. మరోవైపు అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై ప్రతిపక్షాలు, అధికార బీజేపీ మధ్య వాగ్వాదం నడుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అయోధ్య కేంద్రంగా మారనుంది. కాగా హోంమంత్రి అయోధ్య పర్యటన రాష్ట్రంలో రాజకీయ రగడను మరింత పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్ 31న షా అయోధ్య పర్యటనపై సోమవారం కూడా బీజేపీ సమావేశం నిర్వహించింది. ఒకవైపు అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధి పనులకు యూపీలోని యోగి ప్రభుత్వం, కేంద్రంలోని మోదీ సర్కార్ బాధ్యతవహిస్తుందనే సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు అందించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే అయోధ్యను సాకుగా చూపి బీజేపీ మత పరమైన రాజకీయాలు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చదవండి: వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఒమిక్రాన్ కాటుకు బలి! మొదటిసారిగా.. -
హడలెత్తించిన మిలింద్..క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్
సుల్తాన్పూర్ (గురుగ్రామ్): సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 క్రికెట్ టోర్నీ లో హైదరాబాద్ జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘ఈ’లో భాగంగా మంగళవారం జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్‌లో హైదరాబాద్ 29 పరుగులతో ఉత్తరప్రదేశ్‌ను ఓడించింది. హైదరాబాద్ ఎడంచేతి వాటం పేసర్ సీవీ మిలింద్ ప్రత్యర్థి జట్టును హడలెత్తించాడు. 3.2 ఓవర్లు వేసిన మిలింద్ కేవలం 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి ఉత్తరప్రదేశ్‌ను దెబ్బ తీశాడు. దాంతో 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరప్రదేశ్ 19.2 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఈ గెలుపుతో హైదరాబాద్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 20 పాయింట్లతో గ్రూప్‌లో టాపర్‌గా నిలిచి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈనెల 18న జరిగే క్వార్టర్ ఫైనల్లో గుజరాత్ జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది. ఓవరాల్‌గా లీగ్ దశలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సీవీ మిలింద్ (16 వికెట్లు) నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (46 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్) ఈ టోర్నీలో నాలుగో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. చదవండి: IND Vs NZ: ఆ ముగ్గురు ఐపీఎల్ స్టార్లకు టీమిండియాలో చోటు దక్కలేదు.. అయినా..! -
నపుంసకుడివి అంటూ హేళన? మహిళా డాక్టర్ దారుణ హత్య..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళా డాక్టరును ఆమె బావ అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది. వివరాలు.. వారణాసిలోని మహమూర్గంజ్ ప్రాంతానికి చెందిన స్వప్న స్థానిక ఆస్పత్రిలో డాక్టరుగా పనిచేస్తుంది. మహమూర్గంజ్ ప్రాంతంలో బావతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో అనిల్ తనని నపుంసకుడంటూ నిత్యం వేధిస్తోందనే ఆగ్రహంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనిల్‌ను అరెస్ట్ చేశారు. మృతురాలు స్వప్న ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు, మాజీ ఎమ్మెల్యే రజనీకాంత్ దత్తా కోడలిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో స్వప్నను అనిల్ హత్య చేశాడనే విషయం దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామన్నారు. మరోవైపు సప్నపై తాను పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై మరణించిందని అనిల్ తన నేరాన్ని అంగీకరించాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో క్లిప్ బయటకు వచ్చింది. తాను అనారోగ్యంతో ఉన్నా, తల్లిదండ్రులను చూసేందుకు వెళతుండగా తనను చూసి పెద్దగా నవ్వుతూ నపుంసకుడంటూ ఎద్దేవా చేసిందని వీడియో క్లిప్‌లో నిందితుడు అనిల్ వాపోయాడు. గతంలో తన సోదరుడిని కూడా ఇలానే వేధించిందని చెప్పుకు రావడం గమనార్హం. -
పెళ్లి వేడుకలో గన్‌తో ఆటలు.. వరుడి సోదరుడు మృతి
లక్నో: సరదాగా సాగిపోతున్న వివాహ వేడుకలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి హాజరైన పదో తరగతి విద్యార్థి అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. ఆగ్రాలోని ఖండౌలి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. ఖండౌలిలో గురువారం వివాహ కార్యక్రమం జరుగుతోంది. ఆ సమయంలో అతిథిగా అక్కడకు వచ్చిన ఓ మాజీ ఆర్మీ ఉద్యోగి తన వెంట లైసెన్స్డ్ గన్ తెచ్చుకున్నాడు. వివేక్ అనే యువకుడు.. ఓసారి గన్ చూస్తానని ఆర్మీ అధికారిని కోరాడు. అయితే, ఆ గన్ లోడ్ చేసి ఉండటంతో... వివేక్ అనుకోకుండా ట్రిగ్గర్ నొక్కాడు. దాంతో ఒక బుల్లెట్ పెళ్లిలో ఉన్న ధర్మేంద్ర సింగ్ (16) ఛాతీలోకి దూసుకెళ్లింది. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో సందడిగా ఉన్న పెళ్లి వేడకలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే, ఇది అనుకోకుండా జరగిన ఘటన కాదని, కావాలనే తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. -
UP Elections 2022: పొత్తు పై అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని ఆయన ప్రకటించారు. 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో ప్రజాస్వామ్య విప్లవానికి దారి తీస్తాయని అన్నారు. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యూపీలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ పూర్తిగా మర్చిపోయిందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ చెత్తబుట్టలో పడేసిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 403 అసెంబ్లీ స్థానాలు గాను తమ పార్టీ 350 పైగా స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు. యూపీ ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 3050 పంచాయితీల్లో స్వతంత్ర అభ్యర్థులు 1081 స్థానాల్లో గెలుపొందారు. సమాజ్‌వాది పార్టీ మద్ధతుతో బరిలో నిలిచినవారు 851 పంచాయితీలు గెలుచుకోగా.. బీజేపీ మద్ధతుతో పోటీచేసిన వారు 618 పంచాయితీలు గెలుచుకున్నారు. బీఎస్పీ మద్ధతుపొందిన అభ్యర్థులు 320 పంచాయితీల్లో విజయం సాధించారు. -
కోడలిపై పోలీస్ మామ అత్యాచారం..
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఓ పోలీస్ కుటుంబంలో దారుణం చోటు చేసుకుంది. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కోడలిపై అదే శాఖలో పనిచేస్తున్న ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాలు.. మీరట్‌లో రిజర్వ్ ప్రోవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మహిళ, బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఆమె మామ నజీర్ అహ్మద్ ఇంట్లోకి ప్రవేశించి కోడలిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అయితే తనపై జరిగిన దారుణం గురించి భర్త అబిద్‌కు చెప్పింది. దీంతో తన భార్య చెప్పేది పూర్తిగా వినకుండానే ట్రిపుల్ తలాఖ్ ఇచ్చేశాడు. దీంతో ఆమె మీరట్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. నిందితుడు నజీర్‌పైనా, బాధితురాలి భర్త అబీద్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అబీద్‌తో మూడేళ్ల క్రితం బాధితురాలుకి వివాహమైంది. కోడలిగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టి నాటి నుంచీ అత్తింటివారు తనను అదనపు కట్నం కోసం వేధించేవారిని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. చదవండి: 57 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. రెండో భార్య ఏంచేసిందంటే. -
బీజేపీ ఎమ్మెల్యే ఇంటిపై బాంబు దాడికి యత్నం..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మిథాని ఇంటిపై సోమవారం అర్ధరాత్రి ముగ్గురు గుర్తుతెలియని దుండగులు బాంబు దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆ దుండగులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారిని అదుపులోకి తీసుకున్నపోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. సురేంద్ర మిథాని గోవింద్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కన్పూర్‌లోని పండునగర్ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాసం ఉంటున్నారు. దాడికి యత్నించిన ముగ్గరు నిందితులు కాన్పూర్‌కు చెందిన వారని పోలీసులు విచారణలో గుర్తించారు. ఘటనాస్థలంలో కొన్ని దేశవాళి బాంబులతోపాటు ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నామని పండునగర్ పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్చార్జ్ ఆనంద్ ప్రకాశ్ తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే సురేంద్ర మిథాని.. తన వ్యక్తిగత సిబ్బందిని అభినందించారు. అదే విధంగా ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. (చదవండి:కూతురితో బాలుడి ప్రేమ: హత్య చేసి గడియపెట్టిన తండ్రి) -
ఎన్నికల రిజర్వేషన్ మహిళకు రావడంతో... పెళ్లి!
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ మహిళకు రావడంతో కచ్చితంగా గ్రామంలో గెలవాలనే కోరికతో 45 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. దీంతో అతని భార్యను పోటీలోనికి దింపుతున్నాడు. ఈ సమయంలో పెళ్లిలకు మంచి ముహుర్తాలు లేనప్పటికీ మార్చి 26న పెళ్లి చేసుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే... బాలియా జిల్లాలోని కరణ్‌చప్రా గ్రామానికి చెందిన హథీ సింగ్(45) గత కొన్ని సంవత్సరాలుగా వారి గ్రామంలో సామాజిక సేవను చేస్తున్నాడు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆయనకు విజయం దక్కలేదు. గ్రామ అభివృద్ధికి ఎంతగానో పాటు పడుతున్న హథీ సింగ్ ఈ ఏడాది జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకునే సరికి రిజర్వేషన్ రూపంలో అతనికి ఆటంకం ఎదురైంది. ఆ గ్రామానికి సర్పంచ్‌గా మహిళను రిజర్వ్ చేశారు. దీంతో ఆయన మద్దతుదారులు, సహచరుల సూచన మేరకు పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా హథీ సింగ్ మాట్లాడుతూ.. తన గ్రామానికి మూడో దశలో భాగంగా ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 13 లోపు నామినేషన్ సమర్పించాలి. అందుకే మంచి ముహుర్తం లేనప్పటికీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. కానీ గ్రామ అభివృద్ధి కోసమే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని హథీ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: 'పవన్‌కల్యాణ్ బాటలో'.. రెండో పెళ్లిపై నాగబాబు రియాక్షన్ -
యూపీ మాజీ సీఎంపై కేసు నమోదు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జర్నలిస్టులపై దాడి చేశారనే ఆరోపణలతో మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, 20 మంది సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అఖిలేష్ యాదవ్ సమక్షంలో పార్టీ కార్యకర్తలు జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడి భద్రతా సిబ్బంది జర్నలిస్టులను నెట్టివేయడంతో వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇరు వర్గాలవారు వేరువేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారని యూపీ శాంతి భద్రతల ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. వారి ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఘటనను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు షలాబ్‌మణి త్రిపాఠి తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుతున్నారని సమాజ్ వాది పార్టీ కార్యకర్తలు వీధిరౌడీల మాదిరిగా జర్నలిస్టులపై దారుణంగా దాడి చేశారని ఆరోపించారు. అదే విధంగా ఈ ఘటనపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ.. భారతదేశ ప్రజాస్వామ్యానికి భావప్రకటనా స్వేచ్ఛ ప్రధానమైందని గుర్తుచేశారు. జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి:ట్రాక్టర్ ర్యాలీకి డీజిల్ నిషేధం బీజేపీ కుట్ర: అఖిలేష్ యాదవ్) -
ప్రభాస్ ‘ఆదిపురుష్’పై కోర్టులో పిటిషన్
లక్నో: ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రంపై ఉత్తప్రదేశ్‌కు చెందిన ఓ లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో రావణుడి పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలను వెనకకు తీసుకుంటూ సైఫ్ క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికి ‘ఆదిపురుష్’ సినిమా దర్శకుడు ఓం రౌత్, సైఫ్‌పై యూపీకి చెందిన న్యాయవాది హిమాన్షు శ్రీవాస్తవ బుధవారం జౌన్పూర్ కోర్టులో పిల్ వేశాడు. రావణుడిపై సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు హిందూ మత విశ్వసాలను దెబ్బ తీసేలా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. సైఫ్ అలీఖాన్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్ పేరును కూడా పిటిషన్లో చేర్చారు. ఇందులో రాముడిగా ప్రభాష్, రావణుడిగా సైఫ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సైఫ్ ఇటీవల ఓ ఇంటర్యూలో సినిమా గురించి మాట్లాడారు. (చదవండి: జనవరిలో ‘ఆది పురుష్’ షూటింగ్ ప్రారంభం!) ‘ఈ సినిమాలో రావణ పాత్ర చేయడం చాలా ఆసక్తికరంగా ఉంది. రావణుడు సీతను ఎందుకు అపహరించాడు. శ్రీ రాముడితో రావణుడు యుద్ధం చేయడం న్యాయమేనన్నాడు. అయితే రాముడితో ఎందుకు యుద్దం చేశాడనే కోణంలో సినిమా ఉండబోతుంది. రావణాసురుడిలోని మానవత్వ కోణాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సైఫ్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వివాదస్పదంగా మారాయి. హిందువులు రాక్షసుడిగా భావించే రావణాసురుడిని పోగుడూతూ చేసిన ఆయన వ్యాఖ్యలపై పలు హిందు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో సైఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్రోల్స్ చేయడంతో అతడు క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ పలువురు ఈ వ్యాఖ్యలను ఇప్పటికి ఖండిస్తుండటంతో ఈ వివాదం తరచూ తెరపై నిలుస్తోంది. (చదవండి: ప్రభాస్ మూవీపై కామెంట్.. సారీ చెప్పిన సైఫ్ అలీఖాన్) -
అత్యాచారం, హత్య.. ఆపై ఊపిరితిత్తులు తీసి
లక్నో: హథ్రాస్ దారుణం మరువకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. అక్కడితో ఊరుకోక బాధితురాలి ఊపిరితిత్తులను బయటకు తీసి వాటితో క్షుద్ర పూజలు నిర్వహించారు. వింటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణం యూపీలోని ఘతంపూర్లో ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలు.. మరణించిన చిన్నారి దీపావళి పండుగ నాటి సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు పండుగ హడావుడిలో ఉండగా.. బాలిక టపాకుల కోసం బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. చిన్నారి కోసం కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలన్ని గాలించారు. సమీపంలో ఓ అడవి ఉంటే అక్కడ కూడా వెతికారు. కానీ చీకటి పడటంతో సరిగా కనపడలేదు. ఆదివారం ఉదయం అడవి గుండా వెళ్తున్న కొందరికి అత్యంత దారుణ స్థితిలో బాలిక మృతదేహం కనిపించింది. కొద్ది దూరంలో ఓ చెట్టు దగ్గర బాలిక చెప్పులు, బట్టలు కనిపించాయి. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అంకుల్ కుర్లి, బీరన్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల దర్యాప్తులో నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. తమ బంధువు పరశురామ్ అనే వ్యక్తి సంతానం లేక బాధపడుతున్నాడని తెలిపారు. పిల్లల కోసం తాంత్రిక పూజ చేసేందుకు నిర్ణయించాడు. ఇందుకు గాను ఓ చిన్నారిని బలి ఇవ్వాలని భావించాడు. దీని గురించి బంధువులు అంకుల్ కుర్లి, బీరన్‌లకు తెలిపాడు. పరుశురామ్‌కు సాయం చేయాలని భావించిన నిందితులు శనివారం టపాకులు కొనడానికి బయటకు వచ్చిన చిన్నారిని కిడ్నాప్ చేసి సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ బాలికపై అత్యాచారం చేసి చంపేసి.. ఆమె ఊపిరితిత్తులను బయటకు తీసి పరశురామ్‌కు ఇచ్చారు. దాంతో అతడు తాంత్రిక పూజ నిర్వహించాడు. నిందితుల ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పరశురామ్, అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. తొలుత అతడు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు తమ స్టైల్లో విచారించేసరికి నేరం ఒప్పుకున్నాడు. ఇక విచారణంలో పరశురామ్ తనకు 1999లో వివాహం అయ్యింది కానీ ఇంతవరకు సంతానం లేకపోవడంతో తాంత్రిక పూజలు నిర్వహించానని.. అందులో భాగంగానే చిన్నారిని కిడ్నాప్ చేయాల్సిందిగా బంధువులు అంకుల్, బీరాన్‌లను కోరానని తెలిపాడు. పోలీసులు నిందితుల మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. (చదవండి: యూపీలోనే ఎక్కువ.. ఎందుకిలా?) ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ దారుణాన్ని తీవ్రంగా పరిగణించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. నిందితులకు త్వరగా శిక్ష పడటం కోసం కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. -
పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య
లక్నో: అధికారులు, పోలీసుల ముందే ఎమ్మెల్యే అనుచరుడు ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది. రేషన్ దుకాణాల కేటాయింపుల సందర్భంగా సభ్యుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. జయప్రకాశ్ (46) అనే వ్యక్తిపై బీజేపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ధీరేంద్ర సింగ్ కాల్పులకు తెగబడ్డాడు. వేదికపై అధికారులు ఉండగానే ఈ ఘటన జరగడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వివరాలు.. బల్లియాలోని దుర్జాపూర్ గ్రామంలో రేషన్ దుకాణాల కేటాయింపుల కోసం అధికారులు సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హాజరైన జయప్రకాశ్, ధీరేంద్ర సింగ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.దాంతో ధీరేంద్ర తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని ఎస్పీ దేవేంద్ర నాథ్ తెలిపారు. హత్య జరిగే సమయానికి అధికారులు, పోలీసులు అక్కడే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. (చదవండి: త్రిపుర బీజేపీ సర్కార్‌లో అసమ్మతి) (నిందితుడు ధీరేంద్ర సింగ్(బ్లాక్ డ్రస్ వేసుకున్న వ్యక్తి)తో ఎమ్మెల్యే సురేంద్ర సింగ్) నిందితుడు బల్లియా బీజేపీ ఎక్స్-సర్వీస్‌మెన్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నట్టు ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ధ్రువీకకరించారు. హతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు 15 నుంచి 20 మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే, ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కాల్పుల తర్వాత అక్కడ జనం భయంతో పరుగులు తీయగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీగా జనం గుమిగూడి ఉండగా.. నిందితుడు మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు వీడియోలో స్పష్టమవుతోంది. (చదవండి: యోగీ కాచుకో.. ఇదే నా చాలెంజ్!) #WATCH One person dead after bullets were fired during a meeting called for allotment of shops under govt quota, in Ballia. Devendra Nath, SP Ballia, says, "The incident took place after a clash erupted between two groups during the meeting. Probe on." (Note-abusive language) pic.twitter.com/sLwRgkr9s4 — ANI UP (@ANINewsUP) October 15, 2020 అధికారుల సమక్షంలో ఈ ఘటన జరగడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో ఉన్న అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనను సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఆర్డీఓ సహా అక్కడ ఉన్న పోలీస్ అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు హోంశా అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ కుమార్ అవస్థీ తెలిపారు. అధికారుల పాత్రపై దర్యాప్తు జరిపించి, నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు పేర్కొన్నారు. -
‘హథ్రాస్ బాధితురాలిగా నా భార్య ఫోటో’
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ ఉదంతంలో బాధితురాలి ఫోటో అంటూ చనిపోయిన తన భార్య ఫోటోను వాడుతున్నారంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదును పరిశీలించాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా జస్టిస్ నవీన్ చావ్లా మాట్లాడుతూ.. ‘సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు నిజమని తేలితే.. ప్రభుత్వం ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు ఆదేశాలు జారీ చేయడమే కాక వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పిటిషన్‌దారు సమర్పించిన దృష్ట్యా మొదటి ప్రతివాదిగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ మంత్రిత్వ శాఖ సదరు వ్యక్తి ఫిర్యాదుని పరిశీలించాలి. ఒకవేళ నిజమని తేలితే దానిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాలి. ఈ ఉత్తర్వు కాపీని స్వీకరించిన మూడు రోజుల వ్యవధిలో గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్లకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి’ అని తెలిపారు. ఇక ఈ ఫిర్యాదుకు సంబంధించి కోర్టు అక్టోబర్ 13న ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: వాళ్లందరికీ భద్రత కల్పిస్తున్నాం..) అంతేకాక సదరు వ్యక్తిని ఈ ఉత్తర్వు కాపీతో పాటు తన ఫిర్యాదుకు మద్దతుగా ఉన్న అవసరమైన పత్రాలను మంత్రిత్వ శాఖకు పంపాలని కోర్టు సూచించింది. తప్పుడు కంటెంట్ ఉన్న యూఆర్ఎల్ని గుర్తించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి తన స్పందనను తెలియజేయాల్సిందిగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్‌కి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో ఒక యువతిపై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించిన ఘటనలో బాధితురాలిగా.. చనిపోయిన తన భార్య ఫోటోను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తున్నట్లు విచారణ సందర్భంగా వ్యక్తి కోర్టుకు తెలిపాడు. ఇక అతడి న్యాయవాది అత్యాచార బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయడం భారత శిక్షాస్మృతి ప్రకారం నేరం అని.. పైగా ప్రస్తుతం తప్పుడు ఫోటో ప్రచారం అవుతుందని కోర్టుకు విన్నవించాడు. (చదవండి: అర్ధరాత్రి అంత్యక్రియలు ఉల్లంఘనే) ఇక ట్విట్టర్ తరపు న్యాయవాది ఈ వ్యక్తి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపాడు. కోర్టు ఉత్తర్వులను సూచించే సరైన ఛానెల్ ద్వారా తప్పుడు ఫోటో షేర్ అవుతున్న యూఆర్ఎల్కు సంబంధించిన సమాచారం తమకు పంపితే వాటిని తొలగిస్తామని తెలిపాడు. గూగుల్ కూడా ఇదే తెలిపింది. -
ఆమె మృత్యు ఘోషకు భయపడే..
సాక్షి, న్యూఢిల్లీ : ఒళ్లంతా ఛిద్రమై పక్షం రోజులపాటు ఆస్పత్రిలో అవస్థపడి అశువులు బాసిన 19 ఏళ్ల కూతురును కడసారి నుదిటి మీద ముద్దు పెట్టుకొని కాటికి పంపుదామనుకున్న ఆ కన్న తల్లి కల నెరవేరలేదు. పొంగి పొర్లుకొచ్చే కన్నీటి బిందువులు కనిపించకుండా ముఖాన కొంగు కప్పుకొని ఆఖరి సారి ఆప్యాయంగా ఆ చెంప నిమిరి పంపించాలనుకున్న కుటుంబ సభ్యుల ఆఖరి కోరిక తీరలేదు. అంబులెన్స్‌లో ఇంటికొచ్చిన మృతదేహాన్ని ఆపండంటూ ఇంటి ముందే గుమిగూడిన జనం అడ్డం పడినా....పట్టించుకోకుండా నేరుగా శ్మశానానికి పంపించి అర్ధరాత్రి దాటాక దహన సంస్కారాలు దగ్గరుండి జరిపించిన పోలీసులకు ఎన్ని శాపనార్థాలు పెడితే ఏం లాభం...? మృతదేహాన్ని ఇంటి వద్దనే ఉండనిస్తే మరుసటి రోజు పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగే ప్రమాదం ఉందని తెలిసే రాత్రికి రాత్రే దహన సంస్కారాలు జరిపించామని ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్ పోలీసులు స్వయంగా కోర్టు ముందే ఒప్పుకున్నారు. వారి చెబుతున్నది అబద్ధమని, నలుగురు నిందితులను అత్యాచారం నుంచి తప్పించేందుకు ‘రేప్ జరగలేదు’ అంటూ ఫోరెన్సిక్ నివేదిక తీసుకున్న పోలీసులు, మరోసారి అటాప్సీ చేయడానికి ఆస్కారం లేకుండా దేహాన్ని దగ్ధం చేశారని ఇటు కాంగ్రెస్, అటు దళిత పార్టీలతోపాటు సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. (మేమిద్దరం ఫ్రెండ్స్.. వాళ్లే చంపేశారు..) ఆలిగఢ్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సెప్టెంబర్ 22వ తేదీన సాక్షాత్తు మేజిస్ట్రేట్ నమోదు చేసిన దళిత యువతి మరణ వాంగ్మూలంలో నలుగురు యువకులు తనపై అత్యాచారం జరిపినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై దాడి జరిగిందని తప్ప రేప్ జరిగిందని ఆ దళిత యువతి ఆరోపించలేదంటూ బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేసిన వీడియో క్లిప్ ద్వారా కూడా వాస్తవం ఏమిటో తెలుస్తోంది. తనపై నలుగురు యువకులు ‘జబర్దస్థ్’ చేశారని ఆ వీడియోలో దళిత యువతి నాలుగు సార్లు ఆరోపించింది. దారుణంగా రేప్ చేశారని చెప్పడాని యూపీ హిందీ యాసలో ‘జబర్దస్థ్’ అని వాడడం అక్కడ సర్వసాధారణం. అత్యాచారం జరగలేదని ఢిల్లీ ఆస్పత్రి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదు. రేప్ జరిగిందని చెప్పడానికి ఆనవాళ్లు లేవని, లైంగికదాడి జరిగిన 15 రోజులకు వైద్య పరీక్షలు జరిపితే అలాంటి ఆనవాళ్లు దొరకవని వైద్య నిపుణులే తేల్చి చెప్పారు. (భయంతో బతకలేం.. ఊరొదిలి పోతాం!) తెల్లారితే మృతదేహం వల్ల పెద్ద ఎత్తున అల్లర్లు, హింస చెలరేగే అవకాశం ఉందని తెలిసే రాత్రికి రాత్రే శవాన్ని దహనం చేశామంటూ పోలీసులు కోర్టు ముందు చెప్పడంలోనే నిజముందని అనిపిస్తోంది. ఇదే కారణంగా కశ్మీర్లో అనాదిగా మిలిటెంట్ల మృతదేహాలను, భద్రతా బలగాల ఎన్కౌంటర్లలో మరణించిన వారి భౌతికకాయాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే దహన సంస్కారాలు జరుపతూ వస్తున్నారు. ఇక టెర్రరిస్టుల విషయంలోనైతే దహనం తర్వాత మిగిలే బూడిదను కూడా ఎవరికి దొరక్కుండా చేస్తున్నారు. దళిత యువతి మరణ వార్త ఇప్పటికే ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించగా, మృతదేహం రూపంలో ఆమె వినిపించే మృత్యుఘోష ఎంత మందిని కదిలిస్తుందో, ఎంత హింసను సృష్టిస్తుందోనన్న పోలీసుల భయంలో నిజం లేదనలేం! (హథ్రాస్ కేసు : గ్రామ పెద్ద సంచలన ఆరోపణలు) -
హథ్రాస్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ దారుణంలో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు తెలిశాయి. బాధితురాలు, ప్రధాన నిందితుడు ఏడాది నుంచి ఫోన్లో మాట్లాడుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన 20 ఏళ్ల యువతి దారుణ హత్య కేసులో అదే గ్రామానికి చెందిన సందీప్ సింగ్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు బాధితురాలి కుటుంబం, ప్రధాన నిందితుడి కాల్ రికార్డింగులను పరిశీలించారు. ఈ క్రమంలో బాధితురాలు ప్రధాన నిందితుడితో నిరంతరం ఫోన్ టచ్‌లో ఉన్నట్లు వారు గుర్తించారు. బాధితురాలి సోదరుడు సత్యేంద్ర పేరిట ఉన్న నంబర్ నుంచి సందీప్‌కు క్రమం తప్పకుండా కాల్స్ వచ్చినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. సత్యేంద్ర నంబర్ 989xxxxx, సందీప్ నంబర్ 76186xxxxx మధ్య ఫోన్ కాంటాక్ట్ 2019 అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి గ్రామమైన బూల్గారి నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోని చందపా ప్రాంతంలో ఉన్న సెల్ టవర్ నుంచి ఎక్కువ కాల్స్ వచ్చినట్లు తెలిపారు. రెండు ఫోన్ నంబర్ల మధ్య 62 అవుట్ గోయింగ్ కాల్స్, 42 ఇన్కమింగ్ కాల్స్ మొత్తం104 కాల్స్ ఉన్నాయని రికార్డులు చూపిస్తున్నాయని తెలిపారు. బాధితురాలు, ప్రధాన నిందితులు సన్నిహితంగా ఉన్నట్లు కాల్ రికార్డులు చూపిస్తున్నాయన్నారు పోలీసులు. (యూఎన్‌ఓవి అనవసర వ్యాఖ్యలు: భారత్) సెప్టెంబర్ 14న బాధితురాలు పొలంలో పని చేసుకుంటూ ఉండగా.. నిందితుడు ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేసి.. నాలుక కోసి తీవ్రగా హింసించినుట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెడ, వెన్నెముకకు తీవ్ర గాయాలయిన బాధితురాలిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమె రెండు వారాలపాటు ప్రాణాలతో పోరాడి చివరకు సెప్టెంబర్ 29న కన్ను మూసింది. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ప్రతిపక్షాలు యూపీ సర్కార్ మీద దుమ్మెత్తి పోశాయి. ప్రస్తుతం కేసును సీబీఐకి అప్పగించారు. (ఎన్నాళ్లిలా: చచ్చినా గౌరవం లేదు) -
యూఎన్‌ఓవి అనవసర వ్యాఖ్యలు: భారత్
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మృగాళ్లు మారడం లేదు. ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై దారుణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ వీటిపై స్పందించారు. మహిళలు, వెనకబడిన వర్గాల బాలికలపై హింస పెరిగిపోతుంది అన్నారు. అయితే యూఎన్ అధికారులవి అనవసర వ్యాఖ్యలంటూ భారత్ మండిపడింది. ఐక్యరాజ్యసమితి అధికారిని, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని.. "బయటి ఏజెన్సీ అనవసరమైన వ్యాఖ్యలను పట్టించుకోము'' అని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. "మహిళలపై ఇటీవల జరిగిన కొన్ని హింస కేసులకు సంబంధించి యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ కొన్ని అవాంఛనీయ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక విషయం తప్పక తెలుసుకోవాలి. ఏంటంటే ఈ కేసులను ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది" అని తెలిపారు. (చదవండి: హథ్రాస్ ఘటన.. రూ.50 లక్షలు ఇస్తామన్నారట!) అంతేకాక "దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున, బయటి ఏజెన్సీ చేసే ఏవైనా అనవసరమైన వ్యాఖ్యలు ఉత్తమంగా నివారించబడతాయి. రాజ్యాంగం భారతదేశ పౌరులందరికీ సమానత్వానికి హామీ ఇస్తుంది. ప్రజాస్వామ్యంగా, అందరికీ న్యాయం అందించే సమయం-పరీక్షించిన రికార్డు మా వద్ద ఉంది" అని తెలిపారు. భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని హథ్రాస్, బల్రాంపూర్ ప్రాంతాల్లో జరుగుతున్న అత్యాచార కేసులకు సంబంధించి ఈ రోజు యూఎన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ''హథ్రాస్, బల్రాంపూర్లో జరిగిన అత్యాచారం, హత్య కేసులను పరిశీలిస్తే.. భారత్‌లో మహిళలు, వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన బాలికలు లింగ ఆధారిత హింసకు ఎక్కువగా గురవుతున్నారని తెలుస్తుంది" అని యూఎన్ తెలిపింది. -
అందుకే అర్థరాత్రి దహనం చేశాం: యూపీ సర్కార్
న్యూఢిల్లీ: హథ్రాస్ మృతురాలికి అర్థరాత్రి దహన సంస్కారాలు నిర్వహించడంతో యూపీ పోలీసుల పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు గల కారణాలను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వివరించింది. మరుసటి రోజు భారీ స్థాయిలో శాంతిభద్రతలకు ముప్పు తలెత్తే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదిక కారణంగానే తాము ఆ విధంగా చేయాల్సి వచ్చిందని తెలిపింది. అర్ధరాత్రి 2.30 నిమిషాలకు ఎందుకు దహనం చేయాల్సి వచ్చిందో కూడా తన అఫిడవిట్లో యూపీ సర్కార్ వివరించింది. బాబ్రీ మసీదు తీర్పు నేపథ్యంలో జిల్లాలో హై అలర్ట్ విధించారని, ఆ నేపథ్యంలో అల్లర్లు జరిగే ప్రమాదం ఉందన్న భావనతో అర్థరాత్రి దహనం చేసినట్లు తెలిపింది. సఫ్దార్‌గంజ్ హాస్పిటల్లో సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన ధర్నా గురించి ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చిందని, ఆ ఘటనకు కులం రంగు పూశారని యూపీ సర్కార్ సుప్రీం కోర్టుకు తెలిపింది. మరోవైపు ఇవాళ యోగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం.. హత్రాస్ క్రైమ్‌సీన్‌కు వెళ్లి సమాచారం సేకరిస్తున్నది. (హత్రాస్ ఉదంతం: పోలీసుల ఎదుటే బెదిరింపులు) హత్రాస్ కేసులో సీబీఐ విచారణ చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలని యూపీ సర్కార్ తన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరింది. సుప్రీం పర్యవేక్షణలో సీబీఐ విచారణ కొనసాగాలని యూపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు విషప్రచారం నిర్వహించారని అఫిడవిట్లో యోగి ప్రభుత్వం ఆరోపించింది. హత్రాస్ ఘటన పట్ల ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించిన వివరాలను సుప్రీంకు సమర్పించారు. అర్థరాత్రి దహనం చేసేందుకు యువతి తల్లితండ్రులను జిల్లా అధికారులు ఒప్పించినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. -
హత్రాస్ ఉదంతం: ‘50లక్షలు డిమాండ్ చేయండి’
లక్నో: హత్రాస్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందుకు సంబంధించి రెండు ఆడియో క్లిప్‌లు తెగ వైరలవుతున్నాయి. దీనిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి బాధితురాలి కుటుంబంతో మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ఈ టేప్‌లో సదరు వ్యక్తి ఒకరు బాధితురాలి బంధువుతో ‘మీడియా ముందు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేంగా మాట్లాడాలని’ కోరడం వినవచ్చు. అంతేకాక ప్రియాంక, రాహుల్ గాంధీ వచ్చే వరకు ఆగి.. ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ప్రకటన చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అంతేకాక సదరు వ్యక్తి ప్రియాంక గాంధీ వచ్చే వరకు ఇంట్లో ఉండమని బాధితురాలి సోదరుడిని కోరడం వినవచ్చు. మరో ఆడియో క్లిప్‌లో సదరు వ్యక్తి 25 లక్షల రూపాయలు కాదు 50 లక్షల రూపాయల నష్ట పరిహారం డిమాండ్ చేయాలని సూచించినట్లు వినిపిస్తుంది. (చదవండి: రాహుల్ గాంధీ అరెస్ట్) ప్రస్తుతం వైరలవుతోన్న ఈ రెండు ఆడియో క్లిప్‌లు హత్రాస్ ఉదంతంలోని రాజకీయ కోణాన్ని బహిర్గతం చేస్తున్నాయి. అయితే ఇవి ఎంతవరకు వాస్తవం అనేది నిర్ధారించాల్సి ఉంది. ఇక బాధితురాలి కుటంబాన్ని పరమార్శించడానికి రాహుల్ గాంధీ మరి కొందరితో కలిసి హత్రాస్ వెళ్లాలని భావించారు. కానీ పోలీసులు వారిని అడ్డుకోవడమే కాక రాహుల్, ప్రియాంకతో సహా 201 మంది మీద కేసు నమోదు చేశారు. -
హత్రాస్ దోషులను ఉరి తీయాలి: సీఎం
న్యూఢిల్లీ: హత్రాస్ ఘటనలో నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, వారి మద్దతుదారులు ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. హత్రాస్ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీల నాయకులతో సహా వందలాది మంది ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్కడకు చేరుకుని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘మేమంతా ఎంతో బాధతో ఇక్కడ సమావేశం అయ్యాం. మా కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. దోషులను వీలైనంత త్వరగా ఉరి తీయాలని యూపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అన్నారు. (చదవండి: ‘వారు రైతుల పక్షాన పోరాడారు’) ఇక భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్.. ‘హత్రాస్‌ను సందర్శిస్తాను. యూపీ సీఎం రాజీనామా చేసేవరకు నా పోరాటం కొనసాగుతుంది. బాధితురాలికి న్యాయం జరిగే వరకు నేను వెనకడుగు వేయను. ఈ ఘటనను పరిశీలించాల్సిందిగా సుప్రీం కోర్టును కోరుతున్నాను’ అన్నారు. సూర్యాస్తమయం తర్వాత నిరసనకారులు కొవ్వొత్తులను వెలిగించి చీకటిలో పట్టుకుని నిలబడ్డారు. -
ఢిల్లీలో ప్రియాంకా గాంధీ ధర్నా
న్యూఢిల్లీ: హత్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు దీనిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని వాల్మీకి ఆలయంలో నిర్వహించిన ప్రార్థన సమావేశానికి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరయ్యారు. బాధితురాలి ఆత్మశాంతి కోసం ప్రార్థించారు. హత్రాస్ ఘటన పట్ల కేంద్రం, యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ప్రతి పక్షాలు దీన్ని మంచి అవకాశంగా మలుచుకుంటున్నాయి. ఇక గురువారం ప్రియాంక, రాహుల్ గాంధీలు బాధితురాలి కుటుంబాన్ని పరమార్శించాలని భావించి గ్రామానికి వెళ్లాడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రాహుల్ గాంధీని నెట్టడంతో ఆయన కిందపడ్డ సంగతి తెలిసిందే. (చదవండి: కోర్టు ఆదేశం ఆశాజనకంగా ఉంది) -
వాస్తవాలు వెలికి తీస్తే ఆశ్చర్యం కలుగుతుంది..
సాక్షి, గుంటూరు: జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా హిమని సెంటర్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, లక్ష్మణ్ రెడ్డి, యేసురత్నం తదితరులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. గాంధీ ఆలోచనలు నేడు దేశానికి అవసరం. మత సహనం,దళితుల, ముస్లింలు, పేదలపై దాడులను గాంధీజీ ఖండించారు. అన్నీ కులాలను కలుపుకుని ముందుకు నడిపిన సమగ్ర నాయకత్వం ఆయన సిద్దాంతాలలో ఉంది. దళితులు, దేవాలయాలపై దాడులు దేశానికి మంచిది కాదు. గాంధీజీ ఆలోచనలతో సమస్యలను పరిష్కరించుకోవాలి. యుపిలో దళిత మహిళను రేప్ చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అన్నారు. (చదవండి: మహాత్ముడికి సీఎం జగన్ నివాళి) ‘నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ సాధిస్తోంది. ఆ ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి దక్కుతుంది. మా ప్రభుత్వం వచ్చాక అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. వారిలో 85 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ దళితులపై ఏదో ప్రేమ ఉన్నట్లు ప్రవర్తిస్తోంది. వారి హయాంలో దళితులపై దాడి జరిగితే చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. జగన్ సీఎం అయ్యాక చట్టపరంగా సీఐ, ఎస్సై స్థాయి వారిపైనా చర్యలు ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలు, పార్టీలు దళిత ఎజెండాను అమలు చేస్తున్నాయి. దేవాలయాలపై దాడులు జరిగాయని టీడీపీ ఆందోళన చేసింది. వాస్తవాలు వెలికి తీస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభుత్వానికి అండగా ఉన్న దళితులను దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దళిత సంఘాలు వారి మాటలు నమ్మొద్దు. మీకు అండగా ఉండేది మా ప్రభుత్వం. ఆర్థిక వేత్తలు చెప్తున్న ప్రజల్లోకి మనీ ఫ్లో అనే సూత్రాన్ని ఒక్క జగన్ గారు అమలు చేస్తున్నారు’ అని మాణిక్య వరప్రసాద్ అన్నారు. ‘వైఎస్సార్ కుటుంబానికి కులం లేదు.. మతం లేదు. ప్రతిపక్షానికి దేవాలయాలపై, దళితులపై మీకు ప్రేమ లేదు. దళితులను రెచ్చగొట్టడం, మత కలహాలు సృష్టించడమే పని. ప్రభుత్వాన్ని, జగన్‌ను మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా అతని ఎజెండా ఎస్సీ, ఎస్టీ, బీసీల ఎజెండా నుంచి జగన్ ఎప్పుడూ పక్కకి వెళ్ళారు. ఆయా వర్గాలన్నీ జగన్ వెనుకనే ఉన్నాయి. చిత్తూరు సంఘటనలో ప్రభుత్వం చక్కగా పని చేస్తోంది. కొన్ని దళిత సంఘాలు వాస్తవాలను తెలుసుకోవాలి. పేదలకు, దళితులకు ఇల్లు ఇస్తామంటే అడ్డుకున్న వ్యక్తులెవరో అందరికీ తెలుసు. ఏదయినా సంఘటన జరిగినా రాజకీయాలకు అతీతంగా దళిత సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉంది’ అన్నారు. (చదవండి: ‘ఏడాది కాలంగా నిశ్శబ్ధ యుద్ధం జరుగుతోంది’) అలానే ‘కోర్టులు పరిపాలనలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత న్యాయ స్థానాలపై ఉంది. న్యాయ పరిపాలనను వదిలేసి ప్రజా పరిపాలనలో జోక్యం చేసుకుంటే రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చినట్టు అవుతుంది. కోర్టులు న్యాయ సమీక్ష ద్వారా ప్రజలకు న్యాయం అందించాలి. కాని కోర్టు పరిపాలన చేస్తామంటే రాజ్యాంగం అనుమతించదు. కోర్టుకు అలాంటి పోకడలు మంచిది కాదు గాంధీజీ విలువలకు అది విరుద్దం. మహానుభావులు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం కోర్టులు పని చేయాలి. హైకోర్టులో జరుగుతున్న ఘటనలు ప్రజలను కలచి వేస్తున్నాయి. ప్రభుత్వంలో జోక్యం చేసుకునే న్యాయ వ్యవస్థను ప్రజలు కోరుకోవడం లేదు. పరిపాలనలో జోక్యం చేసుకుంటే రాజ్యాంగం ఉద్దేశాలే కనుమరుగవుతాయి. దీనిపై న్యాయ వ్యవస్థలు ఆలోచనలు చేయాలి. కోర్టులు కూడా సహనం కోల్పోవడం సరికాదు ఓర్పుతో వ్యవహరించాలి’ అని డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. -
మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నాం
లక్నో: హత్రాస్ ఉదంతంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. విపక్షాలు యోగి ప్రభుత్వాన్ని గుండా రాజ్యం అంటూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన ప్రభుత్వంపై వస్తోన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘తల్లులు, సోదరీమణుల భద్రత, అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అక్కాచెల్లెమ్మలకు, తల్లులకు హానీ చేయాలని భావించే వారికి ఇదే నా హామీ.. మీరు తప్పక ఫలితం అనుభవిస్తారు. మీకు ఎలాంటి శిక్ష లభిస్తుంది అంటే.. అది చూసి భవిష్యత్తులో మరేవ్వరు ఆడవారికి హానీ చేయాలని కలలో కూడా అనుకోరు. యూపీ ప్రభుత్వం ఆడవారి భద్రతకు, అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఇదే మా నిబద్ధత, హామీ’ అంటూ యోగి ట్వీట్ చేశారు.(హత్రస్ నిరసనలు: అది ఫేక్ ఫోటో!) -
హత్రాస్ బాధితురాలిపై రేప్ జరగలేదు..
-
‘ఈ వీడియో చూపిస్తే కేసు క్లోజ్ అవుతుంది’
లక్నో: హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ దారుణం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది అంటూ యూపీ పోలీసు ఉన్నతాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాధితురాలి కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేస్తోన్న వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడం చూడవచ్చు. జిల్లా మేజిస్ట్రేట్ ఒకరు ‘మీ విశ్వసనీయతను పూర్తి చేయవద్దు. ఈ మీడియా వాళ్లు ఈ రోజు ఉంటారు.. రేపు వెళ్తారు. మేము మాత్రం ఇక్కడే ఉంటాం. స్టేట్మెంట్ను మార్చడం.. మార్చకపోవడం మీ ఇష్టం. కానీ మేం మార్చగలం’ అన్నారు. ఇంతలో బాధితురాలి బంధువు ఒకరు కెమరా వైపు చూసి ఏడుస్తూ.. ‘వారు మాపై ఒత్తిడి తెస్తున్నారు. మీ కుమార్తె కరోనాతో చనిపోయి ఉంటే కనీసం పరిహారం అయినా దక్కేది అంటున్నారు. మా తండ్రిని, మమ్మల్ని బెదిరిస్తున్నారు’ అంటూ వాపోయింది. (చదవండి: అమ్మను బాధపడవద్దని చెప్పండి..) అంతేకాక వారు ‘మా తల్లి వీడియోలు తయారు చేశారు. వీటిని చూపిస్తే.. కేసు క్లోజ్ అవుతుంది అంటున్నారు. వారు మమ్మల్ని ఇక్కడ బతకనివ్వరు. డీఎం మమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు. మాపై ఒత్తిడి తెస్తున్నారు.. బలవంతం చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్డీ టీవీలో ప్రసారం చేశారు. ఇక హత్రాస్‌కు చెందిన 20 ఏళ్ల దళిత యువతి పొలంలో పని చేసుకుంటూ ఉండగా.. నలుగురు వ్యక్తులు ఆమెను లాక్కెళ్లి దారుణంగా హింసించారు. బాధితురాలు రెండు వారాల పాటు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడి మంగళవారం కన్ను మూసింది. -
హత్రాస్ బాధితురాలిపై రేప్ జరగలేదు..
లక్నో: దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలించిన హత్రాస్ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోస్టు మార్టం నివేదిక విడుదలయ్యింది. ఇక ఫోరెన్సిక్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఈ నివేదిక వెల్లడించడం గమనార్హం. గత నెల 14న పొలంలో పని చేస్తున్న యువతిపై నలుగురు మృగాళ్లు పాశవీకంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో రెండు వారాల పాటు మృత్యువుతో పొరాడుతూ మరణించింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఏడీజీ లా అండ్ ఆర్డర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఫోరెన్సిక్ నివేదికలో వీర్యం కనుగొనడబలేదు. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇప్పటికే స్పష్టం చేసింది. దీన్ని బట్టి రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తప్పుడు సమాచారం ప్రచారం చేశారని స్పష్టం అవుతోంది. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం’ అన్నారు. (చదవండి: బాధితురాలిని చిత్రహింసలకు గురిచేశారు..) అలానే గురువారం నాడు బాధితురాలికి సంబంధించి ఓ వీడియో విడుదలయ్యిందని.. ఆమె నాలుక కత్తిరించబడలేదని దీనిలో స్పష్టంగా తెలుస్తుందన్నారు ప్రశాంత్ కుమార్. ఓ వైపు బాధితురాలిపై గ్యాంగ్‌రేప్ జరిగిందంటూ ప్రచారం జరుగుతుండగా.. ఏడీజీ ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇక పోస్టు మార్టం నివేదికలో యువతి ఒంటిపై తీవ్రమైన గాయాలున్నట్లు మాత్రమే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ఈ ఘటనను ప్రతిపక్షాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం మధ్యాహ్నం పాదయాత్రగా వెళుతున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రనేతల అరెస్ట్‌తో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. -
హత్రాస్ ఘటన: ‘కారు ఎప్పుడైనా బోల్తా పడవచ్చు’
లక్నో: ఈ మధ్య కాలంలో జరుగుతున్న అత్యాచార ఘటనలు చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. చట్టాలు ఎంత కఠినంగా మారితే.. మృగాళ్లు అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాము పాల్పడిన నేరానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఏకంగా ప్రాణాలే తీస్తున్నారు. దాంతో ఇలాంటి ఘటన పట్ల ప్రజల ఆలోచన తీరులో కూడా మార్పు వస్తోంది. తక్షణ న్యాయం అనే డిమాండ్ పెరుగుతుంది. తెలంగాణలో దిశ సమయంలో పోలీసులు అవలంభించిన తీరుపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురిసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎన్‌కౌంటరే మృగాళ్లకు సరైన శిక్ష అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటనలో కూడా ప్రజలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సదరు లీడర్ నిందితుల ఎన్కౌంటర్ జరగొచ్చనే హింట్ ఇచ్చారు. (చదవండి: అమ్మను బాధపడవద్దని చెప్పండి..) వివరాలు.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా బుధవారం హత్రాస్ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ.. ‘నిందితులను అరెస్ట్ చేశారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించారు. వారిని అరెస్ట్ చేస్తారు. యోగి ఆదిత్యనాథ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన రాష్ట్రంలో ఒక కారు ఎప్పుడైనా బోల్తా పడగలదని నాకు తెలుసు’ అంటూ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉందనే హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. (చదవండి: యూపీలో అత్యాచారాల పరంపర) #WATCH The accused have been arrested. The case has been sent to a fast-track court. The accused will be sent to jail... Yogi Ji jo wahan ke CM hain, main jaanta hun ki unke pradesh main kabhi bhi gaadi palat jati hai: BJP leader Kailash Vijayvargiya on #Hathras gang-rape case pic.twitter.com/ksSERx3nu0 — ANI (@ANI) September 30, 2020 ఇక ఈ ఘటనపై ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. యూపీలో గుండా రాజ్యం నడుస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇక కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హత్రాస్ ఘటనకు బాధ్యత వహిస్తూ.. యోగి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
మసీదు దానికదే కూలిపోయిందా?
సాక్షి, న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కేసులో అందరూ నిర్దోషులైతే.. మరి మసీదును ఎవరు కూల్చారు.. దానికదే కూలిపోయిందా అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నల వర్షం కురిపించారు. చరిత్రలో ఈ రోజు నిజంగా బ్లాక్ డే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులంతా నిర్దోషులేనని లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కోర్టు తీర్పు బాధ కలిగించింది. సరైన న్యాయం జరగలేదు. ఆధారాలు లేవని అందరిపై అభియోగాలు కొట్టేయడం సరైన నిర్ణయమా? మసీదును ఎవరు కూల్చారో యావత్ ప్రపంచం చూసింది. అందరూ నిర్దోషులైతే.. మరి మసీదును ఎవరు కూల్చారు.. దానికదే కూలిపోయిందా. ఉమాభారతి మసీదును కూల్చండి అంటూ నినాదాలు చేయడం నిజం కాదా’ అంటూ ఒవైసీ ప్రశ్నించారు. అంతేకాక ఈ తీర్పుపై యావత్ ముస్లిం లోకం, పర్సనల్ లా బోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుందన్నారు ఒవైసీ. (చదవండి: ‘ఆ వివాదం మళ్లీ తెరపైకి తెచ్చారు’) ‘ఈ వివాదానికి సంబంధించి సుప్రీం కోర్టు గతంలోనే ‘చట్ట నియమాలను అతిగా ఉల్లంఘించడం.. బహిరంగ స్థలంలోని ప్రార్థనా స్థలాన్ని నాశనం చేసిన చర్య’గా వర్ణించింది. కానీ సీబీఐ కోర్టు మాత్రం అందరిని నిర్దోషులుగా ప్రకటించింది. సీబీఐ ఛార్జిషీట్లో అనేక విషయాలు దాచిపెట్టింది. ఇందులో ఎలాంటి కుట్ర లేదని తీర్పు వెల్లడించింది. దయచేసి నాకు జ్ఞానోదయం చేయండి.. చరిత్రలోని ఒక చర్యను అనర్హమైనదానిగా ప్రకటించడానికి ఇన్ని రోజుల సన్నహాలు అవసరమా. నాకు సమాధానం చెప్పండి’ అంటూ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
లింగ నిర్ధారణ కోసం భార్య కడుపు కోసి..
లక్నో: ఎన్ని శతాబ్దాలు గడిచినా.. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. ఆడ పిల్లపై చిన్న చూపు మాత్రం పోవడం లేదు. అవసాన దశలో కొడుకులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో తెలిపే ఘటనలు ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. అయినా మార్పు రాదు. నేటికి కొందరు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి ఆడ పిల్ల అయితే అబార్షన్లు చేపిస్తున్నారు. ఎంత కఠిన చట్టాలు వచ్చినా పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య గర్భంలో ఉంది ఆడపిల్లో, మగ పిల్లాడో తెలుసుకునేందుకు ఏకంగా ఆమె పొట్టని చీల్చాడు. వింటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బుదాన్‌లో చోటు చేసుకుంది. పన్నాలాల్ అనే వ్యక్తికి ఇప్పటికే ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకును కనాలనేది అతడి కోరిక. ఈ క్రమంలో అతడి భార్య మరోసారి గర్భవతి అయింది. ఈసారి కూడా ఆడపిల్ల పుడితే ఎలాగని ఆందోళన చెందిన పన్నాలాల్ విపరీత చర్యకు దిగాడు. (చదవండి: కొట్టి చంపి.. గోతంలో వేసి..!) పొట్టలో ఉంది ఆడో, మగో తెలుసుకునేందుకు కొడవలితో భార్య పొట్ట చీల్చాడు. భర్త విపరీత చర్యకు ఆ గర్భవతి తల్లడిల్లిపోయింది. తీవ్ర రక్తస్త్రావంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. వెంటనే స్థానికులు ఆమెను బరేలీలోని ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొడుకు పుట్టాలని కోరుకుంటున్న పన్నాలాల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు పన్నాలాల్‌ను అరెస్ట్ చేశారు. -
తాజ్ సందర్శనకు అనుమతి
లక్నో, ఆగ్రా: కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా చారిత్రక కట్టడం తాజ్‌మహల్ సందర్శనను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే అన్‌లాక్ 4.0లో ఆరునెలల తరువాత సోమవారం నుంచి తాజ్‌మహల్ సందర్శనకు అనుమతించినట్టు పురావస్తుశాఖ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తూర్పు, పశ్చిమ ద్వారాల వద్ద శానిటైజేషన్‌తోపాటు థర్మల్ స్క్రీనింగ్, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసినట్లు తాజ్‌మహల్ సంరక్షణ అధికారి అమర్నాథ్ గుప్తా పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం తాజ్‌మహల్‌ను మూసివేస్తామని, కోవిడ్-19 నిబంధనలను పర్యాటకులు తప్పనిసరిగా అనుసరించాలని ఆగ్రా జిల్లా కలెక్టర్ ప్రభు ఎన్ సింగ్ తెలిపారు. అయితే, తాజ్‌మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకులు ముందుగానే ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశీయులకు టికెట్ ధర రూ.1,100 కాగా, స్వదేశీయులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఒక షిఫ్ట్‌లో 2,500 మంది చొప్పున రోజుకు 5,000 మందిని మాత్రమే అనుమతించనున్నారు. పర్యాటకుల మధ్య దూరం, తనిఖీలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది నిర్వహించనున్నారు. ఇక తాజ్‌మహల్‌లోనికి ఎలాంటి వస్తువులు అనుమతించరు.. అంబులెన్స్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ప్రసిద్ధ ఆగ్రా కోటను సందర్శనకు కూడా సోమవారం నుంచి అనుమతించనున్నారు. (చదవండి: పాక్షికంగా దెబ్బతిన్న తాజ్ మహల్) లాక్డౌన్ కారణంగా దేశంలో చారిత్రక కట్టడాల సందర్శనను నిలిపివేసిన విషయం తెలిసిందే. అన్‌లాక్ 2.0లో చారిత్రక కట్టడాల సందర్శనకు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో.. జులై 6 నుంచి తాజ్ మహల్‌కు పర్యాటకులను అనుమతిస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, చివరి నిమిషంలో దీనిని వాయిదా వేసింది. తాజ్‌మహల్ సందర్శన నిర్ణయాన్ని యోగి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సందర్శకుల రాకతో కరోనా వ్యాప్తి చెంది ఆగ్రా పట్టణం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అధికంగా ఉండటంతో ఈ మేరకు స్థానిక యంత్రాంగం మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో అప్పట్లో తాజ్ సందర్శన వాయిదా పడింది. ఆరు నెలల తర్వాత తాజ్‌మహల్ తెరుచుకోనుండటంతో స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని దుకాణాలు సైతం తెరుచుకోనున్నాయి. ఆరు నెలల తర్వాత దుకాణాలు తెరిచామని, వ్యాపారం స్తబ్దుగా ఉన్నా తాజ్‌మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకులనైనా చూడగలుగుతామని సమీపంలో మార్బుల్ వస్తువులు దుకాణం యజమాని మునావ్వర్ అలీ (50) అన్నారు. -
పోలీసుల ఎదుటే కొట్టి చంపారు
లక్నో: పాఠశాల ఉపాధ్యాయుడిని కాల్చి చంపిన వ్యక్తిని సోమవారం ఉదయం గ్రామస్తులు పోలీసుల సమక్షంలో కొట్టి చంపేశారు. ఉత్తరప్రదేశ్ కుషినగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిలో కొందరు వ్యక్తులు కర్రలతో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. ఈ దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్న పోలీసులు గ్రామస్తులను ఆపడానికి ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. దెబ్బల దాటికి తాళలేక బాధితుడు మరణించాడు. కానీ గ్రామస్తులు మాత్రం అతడిని కొడుతూనే ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గోరఖ్‌పూర్‌కు చెందినవాడు. కొద్ది రోజుల క్రితం అతడు తన తండ్రి తుపాకీతో ఓ ఉపాధ్యాయుడిని కాల్చి చంపాడు. అందుకు ప్రతీకారంగా గ్రామస్తులు అతడిని కొట్టి చంపేశారు. (చదవండి: ఈ అవమానాన్ని భరించలేను.. అందుకే) -
ఈ అవమానాన్ని భరించలేను.. అందుకే
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. దొంగతనం చేశాడనే నేపంతో ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. అవమానం భరిచలేక సదరు యువకుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ సంఘటన రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. వాసిద్ అనే యువకుడు మాదక ద్రవ్యాలకు బానిసగా మారాడు. ఈ క్రమంలో తమ ప్రాంతలోని ప్రభుత్వ కార్యాలయంలో కొన్ని వస్తువులను దొంగిలించాడని స్థానికులు ఆరోపించారు. ఈ మేరకు అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దాడి చేశారు. కొందరు యువకులు జరిగే తతంగాన్ని తమ సెల్ఫోన్లలో బంధించారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. వాసిద్ తమ దగ్గర నుంచి దొంగిలించిన వస్తువులను తీసుకున్నాము.. అతడి మీద ఎలాంటి కేసు ఫైల్ చేయకూడదని స్థానికులు పోలీసులకు తెలిపారు. అతడు చేసిన పనికి తామే వాసిద్‌ని శిక్షించామని.. కేసు పెట్టవద్దని కోరారు. (చదవండి: సినీ నటి ఇంట్లో బంగారం దోచేసిన నర్సు) దాడి సమయంలో వాసిద్కు చిన్న చిన్న గాయలే అయ్యాయంటున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియోలో తీవ్రంగా గాయపడిన వాసిద్ పోలీస్ స్టేషన్లో ఓ చెక్క బెంచీ మీద కూర్చుని ఉన్నాడు. అతడి కుడి మోకాలికి గాయం అయ్యింది. బట్టలు చిరిగి పోయి ఉన్నాయి. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరిన అనంతరం వాసిద్‌ని విడిచిపెట్టారు. పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిన గంటకే వాసిద్ ఆత్మహత్య చేసుకున్నాడు. జరిగిన అవమానాన్ని భరించలేకనే అతడు చనిపోయినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని, దాని ఫలితాలు వెలువడిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
కఫీల్ ఖాన్ విడుదల.. సంచలన వ్యాఖ్యలు
లక్నో: పౌరసత్వం (సవరణ) చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ప్రసంగించినందుకు కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద జైలు శిక్ష అనుభవిస్తోన్న ఉత్తరప్రదేశ్ వైద్యుడు కఫీల్ ఖాన్ మంగళవారం అర్ధరాత్రి మథుర జైలు నుంచి విడుదలయ్యారు. అలహాబాద్ హైకోర్టు ఆయన నిర్బంధాన్ని చట్టవిరుద్ధమని పేర్కొన్నది. ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఎవ్వరిని రెచ్చగొట్టే విధంగా లేదని, అతడిని వెంటనే విడుదల చేయాలని అలహాబాద్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో కఫీల్ ఖాన్‌ను మంగళవారం అర్ధరాత్రి మథుర జైలు నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా హైకోర్టుకు కఫీల్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘నా విడుదల కోసం గొంతెత్తిన వారందరికీ ధన్యవాదాలు. నన్ను రిలీజ్ చేయడానికి అధికారులు ఏమాత్రం సుముఖంగా లేరు. ప్రజల ప్రార్థనల ఫలితంగా విడుదలయ్యాను. రాజధర్మాన్ని పాటించాలని వాల్మీకి మహర్షి రామాయణంలో బోధించారు. రాజు ‘రాజధర్మం’ ప్రకారమే వ్యవహరించాలి. కానీ యూపీలో అలా లేదు. రాజ ధర్మాన్ని అనుసరించాల్సింది పోయి, చిన్న పిల్లల్లా మొండిగా ప్రవర్తిస్తున్నారు’ అంటూ కఫీల్ ఖాన్ అసహనం వ్యక్తం చేశారు. (చదవండి: ఢిల్లీ అల్లర్లు: జామియా విద్యార్థినికి బెయిల్) అంతేకాక ‘కోర్టు తన తీర్పును వెలువరించి ఎంతో మేలు చేసింది. అలా కాకుండా నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వానికే వదిలేస్తే నన్ను చంపేసేవారు. సిట్‌కు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను ముంబై నుంచి మథురకు తీసుకెళ్లేటప్పుడు ఎన్కౌంటర్ చేయలేదు’ అంటూ కఫీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ నిర్బంధంపై జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తన కుమారుడికి ఫిబ్రవరిలోనే కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, బెయిల్‌పై ఆయనను విడుదల చేయాల్సి ఉన్నా ఎన్ఎస్ఏ కింద నిర్బంధంలో ఉంచారని కఫీల్ ఖాన్ తల్లి పర్వీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డాక్టర్ విడుదల పట్ల ఆయన కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. తన కుమారుడు ఎప్పుడూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడని, చాలా మంచి వ్యక్తి అని కఫీల్ ఖాన్ తల్లి పేర్కొన్నారు. (చదవండి: ఆ తీర్మానం.. దేశ ద్రోహమే) అసలు కేసేంటి.. 2017లో గోరఖ్‌పూర్‌లో ఆక్సిజన్ అందక 60 మంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో డాక్టర్ కఫీల్ ఖాన్ పేరు తొలిసారి వెలుగులోకి వచ్చింది. చిన్నారులు చనిపోయిన బీఆర్డీ మెడికల్ కాలేజీలోనే పని చేసిన కఫీల్.. యోగి సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో చిన్న పిల్లల మరణాలకు సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయనపై ఈ ఏడాది తీవ్రమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదయ్యింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలు రావడంతో కఫీల్ ఖాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. 2020, ఫిబ్రవరి 13న అలీగఢ్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆయనను జాతీయ భద్రతా చట్టం 1980 సెక్షన్ 3 (2) ప్రకారం అరెస్టు చేశారు. అయితే, ఆయన నేరం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అలహాబాద్ హైకోర్టు ఎన్ఎస్ఏ ఆరోపణల్ని తోసిపుచ్చింది. అతడిని విడుదల చేయాలని ఆదేశించింది. -
పది గంటలపాటు గ్లౌజులు ధరిస్తే..
లక్నో: కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థ ఎంత హానికరంగా ఉందో తెలిసివచ్చింది. ముఖ్యంగా భారతదేశంలో వైద్యుల కొరత ఎంత తీవ్రంగా ఉందో కరోనా సమయంలో అర్థమయ్యింది. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తుండగా.. మన దగ్గర మాత్రం 10,189 మందికి ఒక వైద్యుడు ఉన్నారు. అంటే 6 లక్షల మంది వైద్యుల కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా విరుచుకుపడటంతో అరకొరగా ఉన్న వైద్య సిబ్బందిపై అదనపు భారం పడింది. అయినప్పటికి వారు వెనకడగు వేయలేదు. మహమ్మారిపై పోరాటంలో వారే ‘ఫ్రంట్‌లైన్ వారియర్స్’గా నిలిచారు. రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ.. అదనపు గంటలు పని చేస్తూ నిజమైన యోధులుగా నిలుస్తున్నారు. వైద్యం చేయడం ఒక ఎత్తయితే.. మహమ్మారి నుంచి రక్షణ కోసం పీపీఈ కిట్లు, గ్లౌజులు ధరించి గంటలపాటు విధులు నిర్వహించడం మరో ఎత్తు. (చదవండి: కరోనా వైరస్: ఆ విషయంలో మహిళలే బెటర్) ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వైద్యుడు షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం తెగ వైరలవ్వడమే కాక ప్రశంసలు పొందుతుంది. సయ్యద్ ఫైజాన్ అహ్మద్ అనే యువ వైద్యుడు ముడతలు పడిన తన చేతి ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘కోవిడ్-19 వార్డులో దాదాపు 10 గంటలపాటు గ్లౌజులు ధరించడంతో నా చేతులు ఇలా అయ్యాయి’ అంటూ షేర్ చేసిన ఈ ఫోటో నెటిజనులను ఆకట్టుకుంటుంది. వెలకట్టలేని సేవ చేస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఫైజాన్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఐదుగంటలకు ఒకసారి గ్లౌజులు మార్చాలి. ఇందుకు 5-7 నిమిషాల సమయం పడుతుది. కానీ చాలా సార్లు అది వీలుకాదు.. సమయం కూడా దొరకదు. ఎందుకంటే విధుల్లో మీరు ఒక్కరే ఉంటారు. పేషెంట్ దగ్గర ఇతర సిబ్బంది అందుబాటులో ఉండరు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మీరు వైద్యుడు, వార్డ్బాయ్, నర్స్ పాత్రలు కూడా పోషించాల్సి ఉంటుంది. నా షిఫ్ట్ అయిపోయింది.. ఇక నేను వెళ్తాను అనే పరిస్థితి కూడా ఉండదు’ అన్నారు సయ్యద్. (చదవండి: 26 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి) My hands after doffing #PPE due to profuse sweating in extremely humid climate.#COVID19 #Covidwarrior #Doctor pic.twitter.com/wAp148TkNu — Dr Syed Faizan Ahmad (@drsfaizanahmad) August 24, 2020 అంతేకాక ‘ఇదంతా ఒక ఎత్తైతే ఇక పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహించడం సవాలు వంటిది. చెమట పట్టి ముఖం మీదకు కారుతుంది. తుడుచుకోలేని పరిస్థితి. మాస్క్‌ను కూడా సరి చేసుకోలేం. ఇక తల మీద క్యాప్‌తో మరింత ఇబ్బంది. మొదట్లో పీపీఈ కిట్లు ధరించి పని చేయడం చాలా కష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం అలవాటయ్యింది. నేను సర్జన్‌ని. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కోవిడ్ డాక్టర్‌గా విధులు నిర్వహించాల్సిందే’ అన్నారు. ఎంత అలసిపోయినా.. ఇబ్బందులు ఎదుర్కొన్న పేషెంట్ల ప్రాణాలు కాపాడటంతో వాటన్నింటిని మర్చిపోతామన్నారు సయ్యద్. -
ఉత్తరప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. రెండు స్టేట్ రోడ్‌వేస్ బస్సులు ఒకదానికితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. 12 మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం. లక్నో నగర శివార్లలోని కకోరి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్‌వేస్ బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొట్టాయి. ఇంతలో ఒక ట్రక్కు అదుపు తప్పి వాటి సమీపంలోకి వెళ్లడంతో దాని డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి అని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని కింగ్‌జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కకోరి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్ ఎం ఖాసి అబిది తెలిపారు. (చదవండి: ఆ విషాదానికి ఆరేళ్లు; మా కోరిక అదొక్కటే!) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘లక్నో నుంచి వస్తున్న బస్సు, ట్రక్కును అధిగమించడానికి ప్రయత్నించింది. ఆ సయమంలో ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది’ అని తెలిపాడు. ప్రమాదం జరగినప్పుడు అక్కడే ప్రయాణిస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు కూడా గాయపడ్డాడు. రెండు బస్సులు ఒకదానికి ఒకటి ఢీకొట్టడం చూసి తనకు కళ్లు తిరగాయని.. నియంత్రణ కోల్పోవడంతో తనకు కూడా ప్రమాదం జరిగిందని ట్రక్కు డ్రైవర్ తెలిపాడు. -
వైరల్: జనాలపై విచక్షణారహితంగా దాడి
లక్నో: మాస్క్ డ్రైవ్ చెకింగ్‌లో భాగంగా ఓ సీనియర్ ఉద్యోగి, అతడి బృందం జనాలపై విచక్షణారహితంగా దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దాంతో సదరు సీనియర్ అధికారిపై వేటు వేశారు. ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లాలో ఈ సంఘటన జరగింది. వివరాలు.. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అశోక్ చౌదరి, అతని బృందం మాస్క్ ధరించిన ఇద్దరు వ్యక్తులను ఒక దుకాణం నుంచి బలవంతంగా బయటకు నెట్టి, కర్రలతో కొట్లారు. ఆ వ్యక్తులు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూనే.. కొట్టడానికి గల కారణం తెలపాల్సిందిగా హోం గార్డులను కోరారు. కానీ వారు ఇదేమి పట్టించుకోకుండా వ్యక్తుల మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో అధికారులు బల్లియా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అశోక్ చౌద్రేను పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వలు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్ వృద్ధురాలిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అధికారులు అతడిని విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. (80 ఏళ్ల వృద్ధురాలిపై దాష్టీకం) -
వైద్య విద్యార్థిని కిడ్నాప్, దారుణ హత్య
లక్నో: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వైద్య విద్యార్థిని దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపోతుంది. వివరాలు.. ఢిల్లీకి చెందిన డాక్టర్ యోగిత గౌతమ్(25) ఆగ్రా ఎస్ ఎన్ మెడికల్ కాలేజీలో గైనకాలజీ విభాగంలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. దాంతో పాటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించడం లేదు. దాంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆమె హత్యకు గురయినట్లు తెలిసింది. యోగిత మృతదేహం బమ్రోలి అహిర్ ప్రాంతంలో లభ్యమయ్యింది. ఢిల్లీ శివపూరి ప్రాంతానికి చెందిన యోగిత ప్రస్తుతం మాస్టర్ సర్జరీ చదవుతున్నారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఆమె సర్జన్‌గా క్వాలిఫై అయ్యారు. (ప్రాణాపాయంలో యువతి.. ఇదేం పని) ఆ మరుసటి రోజే ఆమె హత్యకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. యోగిత చివరి సారిగా మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కాలేజీలో ప్రాంగణంలో కనిపించినట్లు సమాచారం. బుధవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు ఆగ్రా ఎంఎం గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిలో యోగిత మోరదాబాద్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిందని తెలిపారు. యోగిత సీనియర్, కాన్పూర్‌కు చెందిన వివేక్ తివారి తనను వివాహం చేసుకోవాల్సిందిగా యోగితను వేధిస్తుండేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. యోగిత తనను వివాహం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని తివారి తమను బెదిరించాడని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మాటలతో భయపడిన తాము యోగితను తీసుకెళ్లేందుకు బుధవారం ఆగ్రా చేరుకున్నామని.. కానీ అప్పటికే ఆమె కనిపించకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యోగిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు వికాస్ తివారి మీద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. -
ప్రాణాపాయంలో యువతి.. ఇదేం పని
లక్నో: దాదాపు 20 ఏళ్లు ఉంటాయి ఆమెకు. సోమవారం సాయంత్రం కాలువ దగ్గర పడి ఉంది. ముఖం, గొంతు మీద పదునైన ఆయుధంతో దాడి చేశారు. విపరీతంగా రక్తం పోతుంది. సాయం చేసే వారి కోసం దీనంగా ఎదురు చూస్తోంది. ఇక్కడ దారుణమైన విషయం ఎంటంటే దాదాపు 10-20 మంది ఆమె చుట్టూ గుమికూడారు. చోద్యం చూస్తూ.. సెల్ఫోన్లలో వీడియో తీయడంలో మునిగపోయారు. ఒక్కరు కూడా బాధితురాలిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం మాత్రం చేయలేదు. మరి కొందరు మూర్ఖులు ఆమెను ప్రశ్నలతో మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు వచ్చి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కోలుకున్న తర్వాత ఆమె తన వివరాలు వెల్లడించింది. మీరట్‌కు చెందిన బాధిత యువతి తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంది. దాంతో కుటుంబ సభ్యులు ఆమె మీద ఇంత దారుణంగా దాడి చేశారని తెలిపింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి.. బాధితురాలి సోదరుడితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సంఘనట జరిగిన నాడే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, చిన్నారులపై నేరాలను తగ్గించడం కోసం ‘ఉమెన్ అండ్ చైల్డ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్’ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంకుకు చెందిన అధికారి ఈ విభాగానికి హెడ్‌గా ఉంటారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. (80 ఏళ్ల వృద్ధురాలిపై దాష్టీకం) ఇక మీరట్ సంఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ.. స్థానికలు ఎవరైనా సరే ఇలా ప్రమాదంలో ఉన్న బాధితులను గుర్తించినప్పుడు వీడియోలు తీయడం మీద కాక వారిని ఆస్పత్రికి చేర్చే అంశంపైన దృష్టి పెడితే మంచిదని కోరారు. బాధితుల విషయంలో ‘గోల్డెన్ అవర్’ అనేది చాలా కీలకమైన సమయం అన్నారు. బాధితులను ఆస్పత్రికి చేర్చేవారిని ప్రశ్నించవద్దని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు పోలీసులు. కాబట్టి ఎవరైనా సరే బాధితులను గుర్తిస్తే.. తాము వచ్చే వరకు వేచి ఉండకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కొన్ని నెలలుగా యూపీలో మహిళలు, బాలికలపై నేరాలు విపపరీతంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఇద్దరు మృగాళ్లు 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడమే కాక హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. -
హాపూర్ ఘటన.. పోలీసులు వచ్చేలోపు పరార్
లక్నో: ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యంత అమానుషంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోలీసులు మృగాళ్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వారి ఊహా చిత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలికపై దారుణానికి ఒడిగట్టిన వారిలో ఓ వ్యక్తి అమ్రోహాలోని తన సొంత గ్రామ శివార్లలో చేతిలో మద్యం బాటిళ్లతో తిరుగుతుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే వారు వచ్చేలోపే నిందితుడు తప్పించుకున్నాడు. స్థానికులు నిందితుడిని దల్పత్గా గుర్తించారు. అతడు అమ్రోహాలోని గజ్రౌలా ప్రాంతం మహమూద్‌పూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. దాంతో పోలీసులు అతడి ఇంటిని చుట్టుముట్టారు. గత ఆరు రోజులుగా పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం అమ్రోహాలోని గజ్రౌలా సమీపంలోని అటవి ప్రాంతంలో తీవ్రంగా గాలిస్తున్నారు. సోమవారం స్థానికులు నిందితులను గుర్తించి పోలీసులకు తెలిపారు. కానీ వారు వచ్చేలోపే నిందితులు తప్పించుకున్నారు. (బాలికపై అత్యాచారం: నిందితుల ఊహా చిత్రాలు!) ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో పోయిన గురువారం ఆరేళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీని గురించి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈలోపు శుక్రవారం ఉదయం పొలాల్లో ఒంటిపై తీవ్ర గాయాలతో బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు కనుగొన్నారు. అనంతరం ఆమెను మీరట్‌లోని ఆస్పత్రికి తరలించగా బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్దారించారు. బాలిక పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని.. నాటి భయానక సంఘటన నుంచి చిన్నారికి ఇంకా కోలుకోలేదని వైద్యులు తెలిపారు. -
80 ఏళ్ల వృద్ధురాలిపై దాష్టీకం
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. నిలువ నీడలేని ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో ప్రాంగణంలో తలదాచుకుంది. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డ్ ఆ వృద్ధురాలిని విచక్షణారహితంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. దాంతో ఆస్పత్రి యాజమాన్యం.. సదరు సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించడమే కాక అతడి మీద కేసు నమోదు చేసింది. వివరాలు.. 80 ఏళ్ల వృద్ధురాలు ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆస్పత్రి ట్రామా సెంటర్ వెలుపల పడుకుని ఉంది. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డు సంజయ్ మిశ్రా ఆమెపై దెబ్బల వర్షం కురిపించాడు. సదరు గార్డు ఏ మాత్రం కనికరం లేకుండా వృద్ధురాలిని కొట్టడమే కాక కాలితో తన్నాడు. పాపం ఆ ముసలవ్వ నొప్పికి తాళలేక సాయం కోసం కేకలు వేసింది. ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి చోద్యం చూస్తున్నారు తప్ప గార్డును అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. (కానిస్టేబుల్ సమయస్ఫూర్తిపై ప్రశంసలు) ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాంతో ఆస్పత్రి యాజమాన్యం వృద్ధురాలిని అదే ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం అందిస్తున్నారు. అంతేకాక సదరు గార్డ్ సంజయ్ మిశ్రాను విధుల నుంచి తొలగించడమే కాక అతడి మీద కేసు నమోదు చేశారు. సదరు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని ఆస్పత్రి యాజమాన్యం బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఈ ఘటనపై లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగడం శోచనీయం అన్నారు. అతడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
కానిస్టేబుల్ సమయస్ఫూర్తిపై ప్రశంసలు
లక్నో: ‘ఖాకీలంటే కాఠిన్యమే కాదు.. జనాలను కాపాడే మానవత్వం కూడా ఉంటుంది. మాలోని ఈ కోణానికి నిదర్శనం ఈ వీడియో’ అంటూ ఉత్తరప్రదేశ్ ఎస్పీ రాహుల్ శ్రీవాస్తవ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవ్వడమే కాక ప్రశంసలు కూడా పొందుతుంది. ఇందరి ప్రశంసలు పొందటానికి కారణం ఏంటంటే ఓ కానిస్టేబుల్ తన సమయస్ఫూర్తి, ధైర్యంతో ఓ ఇంటిని అగ్ని ప్రమాదం నుంచి కాపాడాడు. దాంతో నెటిజనులు సదరు కానిస్టేబుల్ని రియల్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన సంభాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. (రోడ్డుపై తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం) వివరాలు.. ఓ మతపెద్ద ఇంట్లో ఉన్న చిన్న సిలిండర్ నుంచి మంటలు వచ్చాయి. ఇది గమనించిన కానిస్టేబుల్ యోగేందర్ రాఠి వెంటనే స్పందించి లాఠీతో ఆ సిలిండర్‌ను కింద పడేస్తాడు. ఆ తర్వాత ఓ టవల్‌ను తడిపి సిలిండర్ మీద వేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ తతంగాన్ని సక్కనే ఉన్న వారు వీడియో తీశారు. దాదాపు ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోను ఎస్పీ రాహుల్ శీవాస్తవ తన ట్విట్టర్ అకౌంట్లో ‘కానిస్టేబుల్ ధైర్యం ఓ మత పెద్ద ఇంటిని కాపాడింది’ అంటూ షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. యోగేందర్ సమయస్ఫూర్తిని నెటిజనులు తెగ ప్రశంసిస్తున్నారు. రియల్ హీరో అంటూ మెచ్చుకుంటున్నారు. -
కోవిడ్ వారియర్స్ ఆహారంలో పురుగులు
లక్నో: కరోనాపై పోరులో వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయక.. రోజుల తరబడి కుటుంబానికి దూరంగా ఉంటూ పేషంట్లకు వైద్యం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి సరైన సౌకర్యాలు కల్పించకపోవడం నిజంగా క్షమార్హం. మంచి భోజనం అందించడం కనీస బాధ్యత. కానీ ఈ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) వైద్య సిబ్బందికి అందించిన ఆహారంలో పురుగులు రావడం స్థానికంగా కలకలం రేపింది. ఇలా జరగడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా అనేకసార్లు ఆహారంలో పురుగులు కనిపించాయి. దాంతో ప్రస్తుతం కేజీఎంయూ మెడికల్ సిబ్బంది దీని గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. (ఆస్పత్రి పడక.. తప్పుల తడక!) వివరాలు.. రెయిన్ బసేరా క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్న కేజీఎంయూ ఎమర్జెన్సీ మెడిసిన్ సర్వీస్ విభాగంలో పనిచేసే క్లీనింగ్ సిబ్బందికి అందజేసిన ఆహారం ప్యాకెట్లో పురుగులు వచ్చాయి. గతంలో కూడా రెసిడెంట్ వైద్యులు, నాన్ క్లినికల్ సిబ్బందికి అందించిన ఆహారంలోనూ పురుగులు కనిపించాయి. దీని గురించి చాలాసార్లు ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి స్పందన లేదు. దాంతో ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాక డ్యూటీ అవర్స్ అయిపోయాక విశ్రాంతి తీసుకోవడానికి రెసిడెంట్ డాక్టర్లుకు కేటాయించిన గదుల్లో ఫ్యాన్లు కూడా సరిగా పని చేయడం లేదని తెలిపారు. కోవిడ్-19 డ్యూటీలో ఉన్న వైద్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. నాణ్యతలేని ఆహారం తీసుకుంటే వైద్య సిబ్బంది కూడా అనారోగ్యం పాలవుతారని సూచిస్తున్నారు. (మాస్కు ధరించనందుకు మహిళపై..) బస్తి జిల్లా వైద్యులు కూడా ఆహారం నాణ్యత పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అందిస్తోన్న నాణ్యత లేని ఆహారం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కోవిడ్ పేషంట్లతో పాటు వారికి సేవలందించే వైద్యులకు మంచి భోజనం అందించడం కనీస బాధ్యత అని తెలిపారు. కుటుంబాలకు దూరంగా ఉండి పేషంట్లకు చికిత్స చేస్తున్న వైద్యులకు మంచి ఆహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. -
హత్య కేసులో ఐపీఎస్ అధికారిపై వేటు
లక్నో: ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో కలకలం సృష్టించిన ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ సంజీత్ యాదవ్ కిడ్నాప్, హత్య కేసులో పోలీసు డిపార్ట్మెంట్ నలుగురిని సస్పెండ్ చేసింది. వీరిలో ఐపీఎస్ అధికారి అపర్ణ గుప్తా కూడా ఉన్నారు. సంజీత్ యాదవ్‌ను గత నెల 22న కిడ్నాప్ చేసి రూ. 30లక్షలు ఇవ్వాల్సిందిగా నిందుతులు అతడి కుటుంబాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జూలై 13న పోలీసుల సమక్షంలో కిడ్నాపర్లు అడిగిన మొత్తం చెల్లించామని.. అయినా సంజీత్‌ను వదిలివేయలేదని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు గురువారం ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో సంజీత్ యాదవ్‌ను గత నెల 26న చంపి, నదిలో పడేసినట్లు వెల్లడించారు. అయితే సంజీత్ కుటుంబ సభ్యులు మాత్రం ఓ నెల రోజుల నుంచి కిడ్నాపర్లు తమకు ఫోన్ చేస్తున్నారని.. రూ. 30లక్షలు ఇస్తే సంజీత్‌ని వదిలేస్తామని చెప్పినట్లు తెలిపారు. (‘హత్య చేసి నదిలో పడేశారు’) ఈ క్రమంలో ఏరియా ఇన్చార్జ్ అపర్ణ గుప్తాను కలిసి కిడ్నాపర్లు డిమాండ్ చేసిన డబ్బును అందించామన్నారు. అంతేకాక డబ్బు సంచిన ఓ రైల్వేట్రాక్‌పై పడేశామని చెప్పారు. కానీ పోలీసులు కిడ్నాపర్లకు డబ్బు ముట్ట చెప్పి.. వారికి పారిపోయే అవకాశం ఇచ్చారని సంజీత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాక ఇంతవరకు సంజీత్ మృతదేహాన్ని కూడా కనుక్కోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి వాదన ఇలా ఉండగా పోలీసులు మాత్రం ఆ సంచిలో డబ్బు లేదని వెల్లడించారు. అంతేకాక సంజీత్ కుటుంబ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు అపర్ణ గుప్తాతో పాటు మరో ముగ్గురిని సస్పెండ్ చేశారు. అంతేకాక ‘సంజీత్ కుటుంబ సభ్యులు కిడ్నాపర్లకు డబ్బు చెల్లించామని చెబుతున్నారు. కానీ ఇంతవరకు జరిగిన దర్యాప్తులో డబ్బు చెల్లించినట్లు తెలియలేదు. ఏది ఏమైనా కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. డబ్బు చెల్లించినట్లు తెలిస్తే.. వారికి అందజేస్తాం. ఈ కేసుతో మా డిపార్ట్మెంట్ అధికారులకు సంబంధం ఉన్నట్లు తెలిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అన్నారు. (నటి కిడ్నాప్ ప్లాన్: ముఠా అరెస్టు) -
మెకానిక్ కొడుకు.. అమెరికన్ స్కూల్ టాపర్
లక్నో: కృషి, పట్టుదల, సాధించాలనే తపన ఉండాలేగాని పేదరికం మనల్ని ఏం చేయలేదు అనేది పెద్దల మాట. ఈ మాటల్ని రుజువు చేసే ఘటనలు మన ముందు కొకొల్లలు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లో చోటు చేసుకుంది. అమెరికన్ స్కాలర్షిప్ పొంది హై స్కూల్ విద్య కోసం ఆ దేశం వెల్లడమే కాక తన ప్రతిభతో అక్కడ కూడా టాపర్‌గా నిలిచాడు ఓ మెకానిక్ కొడుకు. ఆ వివరాలు.. అలీఘర్కు చెందిన ఓ మోటార్ మెకానిక్ కొడుకు మహ్మద్ షాదాబ్ చిన్నప్పటి నుంచి చదువులో బాగా చురుకుగా ఉండేవాడు. ఈ క్రమంలో గత ఏడాది అమెరికా ప్రభుత్వం ఇచ్చే ‘కెన్నడి లూగర్ యూత్ ఎక్స్చేంజ్ స్కాలర్షిప్’కు ఎంపికయ్యాడు. దీని ద్వారా షాదాబ్‌కు రూ. 20లక్షలు వచ్చాయి. దాంతో హై స్కూల్ చదువుల నిమిత్తం షాదాబ్ అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలో ఈ ఏడాది అక్కడి హై స్కూల్లో టాపర్‌గా నిలిచాడు. అంతేకాక దాదాపు 800 వందల మంది చదువుతున్న ఈ అమెరికన్ హై స్కూల్లో గత నెల షాదాబ్ ‘స్టూడెంట్ ఆఫ్ ది మంత్’గా నిలిచాడు. ఈ క్రమంలో షాదాబ్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు చాలా గొప్ప విజయం. అమెరికన్ స్కాలర్‌షిప్‌తో ఇక్కడ చదువుకోడానికి వచ్చిన నేను టాపర్‌గా నిలిచాను. అయితే దీని కోసం ఎంతో శ్రమించాను. ఇంటి దగ్గర పరిస్థితి ఏం బాగుండేది కాదు. నేను నా కుటుంబానికి మద్దతుగా నిలవాలనుకుంటున్నాను. వారిని గర్వపడేలా చేస్తాను’ అని తెలిపాడు. అంతేకాక విదేశాల్లో భారత జెండా ఎగరవేసే అవకాశం తనకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు.(చాలా సార్లు విన్నా: మేరీ ట్రంప్) షాదాబ్ తండ్రి గత 25 సంవత్సరాలుగా మోటార్ మెకానిక్‌గా పని చేస్తున్నారు. కొడుకు గురించి అతడు ఎంతో గర్వపడుతున్నాడు. తన కొడుకు కలెక్టర్ అయ్యి దేశానికి సేవ చేయాలని ఆశిస్తున్నాడు. కానీ షాదాబ్ మాత్రం ఐక్యరాజ్యసమితిలో మానవహక్కుల అధికారిగా పని చేయాలని ఉందని తెలిపాడు. -
రోడ్డుపై తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం
లక్నో: పోలీసుల నిర్లక్ష్యం తల్లీకూతుళ్లను ఆత్మహత్యకు ప్రేరేపించింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు బాధ్యులైన ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే వీరిద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వివరాలు.. అమేథి జామో ప్రాంతానికి చెందిన గుడియాకు పొరుగువారితో మురికి కాల్వకు సంబంధించి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో గత నెల 9న ఇద్దరికి గొడవ జరిగింది. దాంతో ఇరు పక్షాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా పొరుగువారు తమను బెదిరిస్తున్నారంటూ గుడియా పోలీసులకు తెలిపింది. కానీ వారు పట్టించుకోలేదు. దాంతో పోలీసులు పొరుగువారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని.. తన ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని గుడియా ఆవేదనకు గురయ్యింది. ఈ క్రమంలో శుక్రవారం కుమార్తెను తీసుకుని రాష్ట్ర అసెంబ్లీ సమీపంలోని లోక్ భవన్ దగ్గరకు వెళ్లింది. అక్కడే రోడ్డు మీద తల్లీకూతుళ్లిద్దరు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయలైన గుడియాను, ఆమె కుమార్తెను లక్నో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఇందుకు కారణమయిన జామో ఇంచార్జ్ పోలీసు అధికారితో పాటు మరొకరిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన పట్ల విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
కర్రలతో కొట్టి.. పిన్నులతో గుచ్చి
లక్నో: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా జంతువుల పట్ల హింస పెరిగిపోతుంది. కేరళలో ఏనుగు మృతి.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో కోతికి ఉరేసిన ఘటనల గురించి విన్నాం. ఈ దారుణాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి దారుణం మరొకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు ఓ కోతిని కింద పడేసి కర్రలతో కొడుతూ.. వెనక నుంచి పిన్నులతో గుచ్చుతూ ఆనందిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చివరకు కోతి మీద నలుపు రంగు పోసి ఆ తర్వాత వదిలేశారు ఆ సైకోలు. ఈ ఘటన పట్ల జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కోతిని హింసించిన నలుగురిని అరెస్ట్ చేశారు. వారికి రూ.60వేలు జరిమానా విధించారు.(వీళ్లు మనుషులు కాదు రాక్షసులు) -
వికాస్ దుబే వెనుకున్న వారెవరు?
కాన్పూర్: ఎన్నో నేరాలకు పాల్పడటమే కాక ఎనిమిది మంది పోలీసులను హతమార్చిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేని శుక్రవారం ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇప్పుడు కాస్తా ప్రశాంతంగా ఉందని తెలిపారు. వికాస్ దుబే చేతిలో హత్యకు గురయిన జితేందర్ పాల్ సింగ్ తండ్రి తీర్థ్ పాల్ మీడియాతో మాట్లాడారు. కొడుకు పోయిన బాధలో ఉన్న తనకు దూబే ఎన్కౌంటర్ వార్త కాస్తా ఊరటనిచ్చింది అన్నారు. ‘ఉత్తరప్రదేశ్ పోలీసులను చూస్తే.. చాలా గర్వంగా ఉంది. వారు చేసిన పనులు నాకు కాస్తా ఓదార్పునిచ్చాయి. యోగి ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అన్నారు. (రిపోర్టర్లపై దుబే భార్య ఆగ్రహం) మరణించిన ఎస్సై నెబ్యులాల్ బింద్ తండ్రి కలికా ప్రసాద్ బింద్ మాట్లాడుతూ.. ‘వికాస్ దుబేని హతమార్చారనే వార్త నాకు చాలా సంతోషం కలిగించింది. ఇకపోతే వికాస్ దుబేకి సాయం చేసిన డిపార్టుమెంట్ వ్యక్తులకు కూడా కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. మరణించిన సుల్తాన్ సింగ్ భార్య షర్మిలా వర్మ దుబే మృతి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉంది. కానీ అతడి వెనక ఉన్న వారి గురించి మనకు ఎలా తెలుస్తుంది’ అన్నారు.(ఒక్కసారిగా కుప్పకూలిన నేర సామ్రాజ్యం!) ఉజ్జయిన్లో పోలీసుల చేతికి చిక్కిన వికాస్ దుబేను కాన్పూర్ తీసుకువస్తుండగా పోలీసుల వాహనం రోడ్డు మీద బోల్తా పడింది. ఇదే అదునుగా భావించి వికాస్ దుబే పోలీసులను గాయపర్చి పారిపోయే ప్రయత్నం చేశాడు. దాంతో పోలీసులు అతడిని ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. -
‘తనిఖీ లేకుండా 700కిలోమీటర్లు ఎలా వెళ్లాడు’
లక్నో: వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మాస్కు పెట్టుకుని తిరుగుతున్న అతడిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం అతడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కాన్పూర్ ఎన్కౌంటర్ ఘటన తర్వాత పరారీలో ఉన్న వికాస్ దూబే దాదాపు 700కిలోమీటర్లు ప్రయాణించాడు. కారులో రోడ్డు మార్గం ద్వారా హరియాణాలోని ఫరిదాబాద్ చేరుకుని అక్కడ నుంచి రాజస్తాన్ కోటా మీదుగా ఉజ్జయిని ఆలయం చేరుకున్నాడు.(‘వాళ్లందరినీ చంపేయండి.. బతకొద్దు’) ఈ క్రమంలో వికాస్ దూబే అరెస్ట్‌పై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ స్పందించారు. ‘ఎలాంటి తనిఖీ లేకుండా వికాస్ దూబే 700 కిలోమీటర్లు ప్రయాణించాడు అంటే ఆశ్చర్యంగా ఉంది. దారుణమైన ఎన్కౌంటర్ తర్వాత యూపీ ప్రభుత్వం వికాస్ దూబే గురించి అప్రమత్తం చేయడంలో విఫలమయ్యింది. అందువల్లే అతను ఉజ్జయిని చేరుకోగలిగాడు. ఇది ప్రభుత్వ వైఫల్యాలనే కాక అతడికి గవర్నమెంట్‌తో కల సంబంధాలను సూచిస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. వికాస్ దూబేని అరెస్ట్ చేశారా లేక అతడే లొంగిపోయాడా అనే దాని గురించి వివరణ ఇవ్వాల్సిందిగా సమాజ్‌వాద్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అతడికి సంబంధించిన కాల్ రికార్డ్స్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని కోరింది. మరో ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ‘మేం వికాస్ దూబేను అరెస్ట్ చేయలేదు.. అతడు ఉజ్జయినిలో లొంగిపోయాడు. ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత అతడు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లకుండా తిరుగుతూనే ఉన్నాడు. దీని గురించి దర్యాప్తు చేయాలి’ అంటూ ట్వీట్ చేశారు. అయితే మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా మాత్రం వికాస్ దూబేను అరెస్ట్ చేశామని.. అతడు లొంగిపోలేదని స్పష్టం చేశాడు. బిట్టు, సురేష్ అనే ఇద్దరు అనుచరులతో కలిసి వికాస్ దూబే రాజస్తాన్ కోటా ద్వారా మధ్యప్రదేశ్‌లో ప్రవేశించాడని తెలిపారు. ఇందుకు గాను అతడు వికాస్ పాల్ అనే నకిలీ ఐడీని ఉపయోగించాడు అని తెలిపాడు. -
కాన్పూర్ ఎన్కౌంటర్.. 200 మంది పోలీసులపై విచారణ
లక్నో: కాన్పూర్ ఎన్కౌంటర్ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే పోలీసుల రాక గురించి వికాస్ దూబేకు ముందే సమాచారం అందిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసు శాఖకు చెందిన వారే వికాస్‌కు సమాచారం ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చౌబేపూర్ ఎస్హెచ్ఓ వికాస్ తివారీని ఇప్పటికే సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రసుత్తం 200 వందల మంది పోలీసు సిబ్బందిపై ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారందరిని ప్రత్యేకంగా విచారించనున్నారు. వీరిలో చౌబేపూర్ స్టేషన్‌కు చెందిన వారితో సహా ఇతర పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా ఉన్నారు. వీరందరికి వికాస్ దుబేతో మంచి సంబంధాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో చౌబేపూర్, బిల్హౌర్, కక్వాన్, శివరాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ల నుంచి 200 మందికి పైగా పోలీసులపై విచారణ చేపట్టారు. వీరందరి మొబైల్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే కాన్పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన 10 మంది సిబ్బందిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.(యూపీ గ్యాంగ్‌స్టార్ కేసులో కొత్తకోణం) అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వికాస్ దూబేను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గతవారం జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
‘ప్రభుత్వ అసమర్థతకు పోలీసులు బలి’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే తన అనుచరులతో కలిసి ఎనిమిది మంది పోలీసులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నేరాల విషయంలో యూపీ ప్రథమస్థానంలో ఉందని ఆరోపించారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాల నుంచి దేశ వ్యాప్తంగా నమోదవుతున్న నేరాల గురించి పరిశీలించినట్లయితే.. యూపీ దేశంలో టాప్‌లో కొనసాగుతుంది. ఇక్కడ ప్రతిరోజు సరాసరి 12 హత్యలు వెలుగు చూస్తున్నాయి. 2016-18 మధ్య కాలంలో పిల్లల మీద జరిగిన నేరాలు 24 శాతం పెరిగాయి. యూపీ హోం మంత్రిత్వశాఖ, ముఖ్యమంత్రి ఈ గణాంకాలను కవర్ చేయడం తప్ప ఇంకేమీ చేయడం లేదు’ అంటూ ప్రియాంక విమర్శలు చేశారు. అంతేకాక వికాస్ దూబేతో జరిగన ఘర్షణలో మరణించిన పోలీసు అధికారి దేవేంద్ర మిశ్రా అప్పటి ఎస్ఎస్పీకి రాసిన లేఖ గురించి ప్రియాంక గాంధీ ప్రస్తావించారు. ‘దేవేంద్ర మిశ్రా రాసిన లేఖ మిస్సయినట్లు చాలా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటన్నింటిని పరిశీలిస్తే.. యూపీ హోం శాఖ పని తీరుపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి’ అన్నారు. రాష్ట్రంలో నేరస్తులు స్వేచ్ఛగా సంచరిస్తుండగా.. అధికారం, శాంతిభద్రతలు వారి ముందు మోకరిల్లుతున్నాయని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థతకు అంకితభావంతో పని చేస్తున్న అధికారులు, పోలీసులు ఫలితం అనుభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై, మహిళలపై నేరాలు పెరుగుతున్నా పట్టించుకోకుండా రాష్ట్రంలో మహిళలపై నేరాలే జరగడం లేదని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించడం సిగ్గు చేటు అంటూ ప్రియాంక వరుస విమర్శలు చేశారు.(నేర సామ్రాజ్యం) అనేక నేరారోపణలు ఎదుర్కొంటున్న వికాస్ దూబేను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గతవారం జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనలో దూబే పారిపోవడానికి సహకరించిన చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారి వినయ్ తివారీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వికాస్‌తో పాటు ఇతర అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా పరారీలో ఉన్న వికాస్ దూబేను పట్టిస్తే రూ.2.5 లక్షలు బహుమతి ఇస్తామని యూపీ పోలీసులు ప్రకటించారు. తొలుత వికాస్ దూబేను అతని అనుచరులను పట్టిస్తే 50వేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. కానీ వికాస్ దూబే జాడ దోరక్కపోవడంతో నగదు బహుమతిని రూ. లక్షకు పెంచారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆ నగదు బహుమతిని ఏకంగా 2.5లక్షలు పెంచినట్లు ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్‌సీ అవస్థీ వెల్లడించారు -
వికాస్ దూబేకు సాయం.. పోలీస్ అధికారిపై వేటు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వికాస్ దూబే అనే గ్యాంగ్‌స్టర్‌ను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. అయితే పోలీసుల రాక గురించి వికాస్ దూబేకు సమాచారం ఇచ్చాడనే అనుమానంతో చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారి వినయ్ తివారీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అతడిపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులపై దాడిలో వికాస్ తివారీ ప్రమేయం ఉన్నట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ అంశాన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తామని.. ఆరోపణలు నిజమయితే వికాస్ తివారీపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వికాస్‌తో పాటు ఇతర అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే గతంలో కూడా వికాస్ తివారి ఇలానే ప్రవర్తించాడని.. వికాస్ దూబేపై కేసు నమోదు చేయడానికి నిరాకరించినట్లు సమాచారం. (‘నా కొడుకుని ఎన్కౌంటర్ చేయండి’) కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కరడుగట్టిన నేరగాడైన వికాస్ దూబేపై 60కి పైగా కేసులున్నాయి. ఈ కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు మృతిచెందారు. ఇద్దరు ఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు, మరో పౌరుడు గాయపడ్డారు. మృతిచెందిన, గాయపడిన పోలీసుల వద్ద ఉన్న ఏకే–47, ఇన్సాస్ రైఫిల్, గ్లాక్ పిస్టల్, రెండు .9 ఎంఎం పిస్టళ్లను వికాస్ దూబే అనుచరులు ఎత్తుకెళ్లారు. చనిపోయిన పోలీసులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం కాన్పూర్‌లో నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. -
‘నా కొడుకుని ఎన్కౌంటర్ చేయండి’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ముఠా జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై వికాస్ దూబే తల్లి సరళాదేవి స్పందించారు. పోలీసులు చనిపోయిన విషయాన్ని తాను టీవీలో చూసి తెలుసుకున్నానని ఆమె తెలిపారు. పోలీసులను చంపి తన కొడుకు చాలా చెడ్డపని చేశాడని, ఎనిమిది మంది పోలీసులను పొట్టనపెట్టుకున్న తన కుమారుడిని పోలీసులే చంపేయాలని కోరారు. పోలీసులకు అతడు ఎక్కడ ఉంటున్నాడో తెలిసినా ఎందుకు పట్టుకోవట్లేదని ఆమె ప్రశ్నించారు. వికాస్ తనంతట తాను లొంగిపోవాలని.. లేదంటే పోలీసులు తనను ఎన్కౌంటర్ చేయ్యాలని ఆమె కోరారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడిన తర్వాతే వికాస్ నేరస్తుడిగా మారాడని ఆమె తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచేందుకు మంత్రి సంతోశ్ శుక్లాను కూడా హతమార్చాడని అన్నారు. నాలుగు నెలలుగా తన కుమారుడిని కలవలేదని సరళా దేవి చెప్పారు. ప్రస్తుతం ఆమె తన చిన్న కొడుకుతోనే లక్నోలో నివాసం ఉంటున్నానని అన్నారు. ఇదిలావుంటే.. వికాస్ దుబే ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేల నగదు ఇస్తామని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ ప్రకటించారు. కాన్పూర్ పరిధిలోని బికారు గ్రామంలో పోలీసు లైన్ వద్ద జరిగిన ఎన్‌కౌంటరులో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం నివాళ్లర్పించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు.(ఉత్తరప్రదేశ్‌లో ఘోరం) వికాస్ దూబేని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై అతడి అనుచరులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. వారి ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. సాధారణ పౌరుడితో సహా ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. అనంతరం మరో ఎన్కౌంటర్లో ఇద్దరు నేరస్తులను పోలీసులు హతమార్చారు. కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కరడుగట్టిన నేరగాడైన వికాస్ దూబేపై 60కి పైగా కేసులున్నాయి. -
యజమానురాలి మృతి.. కుక్క ఆత్మహత్య
లక్నో: విశ్వాసం చూపడంలో కుక్కను మించిన జీవి ఈ భూ ప్రపంచం మీద మరోకటి ఉండదు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తాజాగా ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో చోటు చేసుకుంది. ఎంతో ప్రేమగా చూసుకున్న యజమానురాలి మృతిని తట్టుకోలేక ఓ కుక్క ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. పన్నేండేళ్ల క్రితం డాక్టర్ అనితా రాజ్ సింగ్ తన ఆస్పత్రి సమీపంలో గాయాలతో పడి ఉన్న ఓ కుక్క పిల్లను చూసింది. జాలితో దాన్ని చేరదీసి వైద్యం చేయించింది. గాయాలు మానిన తర్వాత డాక్టర్ అనిత ఆ కుక్క పిల్లను తనతో పాటు తీసుకెళ్లి.. జయ అని పేరు పెట్టి పెంచుకోసాగింది. ఈ క్రమంలో డాక్టర్ అనిత కిడ్నీ వ్యాధితో బాధపడుతూ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు బుధవారం మరణించింది. ఈ క్రమంలో అనిత మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. ఇన్ని ఏళ్లు తనను ప్రేమగా చూసుకున్న యజమానురాలు అలా విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ కుక్క తట్టుకోలేకపోయింది. బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి దూకి చనిపోయింది. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. -
దారుణం.. రూ.4వేల కోసం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కేవలం నాలుగు వేల రూపాయల బిల్లు కోసం ఆస్పత్రి యాజమాన్యం ఓ రోజు కూలీని దారుణంగా కొట్టి చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాలు.. అలీగఢ్‌కు చెందిన సుల్తాన్ ఖాన్(44) అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దాంతో అతడి బంధువు చమన్, సుల్తాన్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. వైద్యం కోసం ఎంత ఖర్చవుతుందని చమన్ డాక్టర్లును అడిగాడు. అయితే వారు అల్ట్రాసౌండ్ స్కాన్ చేశాక చెప్తాం ముందు రూ.5 వేలు కట్టమని చెప్పారు. చమన్ అలానే చేశాడు. ఆ తర్వాత ఆస్పత్రి వర్గాలు మరో నాలుగు వేలు చెల్లించాలని చెప్పారు. అప్పుడు చమన్ ముందే ఐదువేలు కట్టామని చెప్పడంతో అవి బెడ్ చార్జెస్ అన్నారు. దాంతో చమన్ తాము అంత డబ్బు చెల్లించలేమని.. డిశ్చార్జ్ చేయమని కోరాడు. అయితే ఆస్పత్రి యాజమాన్యం మిగతా నాలుగువేలు చెల్లిస్తేనే సుల్తాన్‌ను డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. దాంతో చమన్‌కి, ఆస్పత్రి సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో హస్పటల్ స్టాఫ్ సుల్తాన్‌పై కర్రలతో అమానుషంగా దాడిచేశారు. దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆస్పత్రి సీసీటీవీ కెమరాలో రికార్డయ్యాయి. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశాం.. దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
మహిళ ఎదురుగా ఎస్ఐ వికృత చర్య
లక్నో: భూ వివాదం గురించి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళ ఎదురుగా ఎస్సై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ దరిద్రాన్ని సదరు మహిళ రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడయాలో షేర్ చేయడంతో ఎస్సైని సస్పెండ్ చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ డియోరియాలోని భట్ని పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఓ మహిళ భూ వివాదం గురించి ఫిర్యాదు చేయడానికి భట్ని పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ పని చేసే ఎస్సై భీష్మ్ పాల్ సింగ్ ఫిర్యాదు గురించి సదరు మహిళతో మాట్లాడాలంటూ తన గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఎదురుగా హస్తప్రయోగం చేసుకుంటూ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఈ దరిద్రాన్ని సదరు మహిళ సీక్రెట్ కెమరాతో రికార్డు చేసి సోషల్ మీడయాలో అప్లోడ్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడం.. సదరు ఎస్సై ప్రవర్తన మీద ఆగ్రహం వ్యక్తం కావడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో సదరు మహిళ మాట్లాడుతూ.. ‘భూ సమస్య పరిష్కారం కోసం నేను ఇప్పటికి పలుమార్లు ఈ పోలీసు స్టేషన్‌కు వచ్చాను. గతంలో 2, 3 సార్లు ఆ ఎస్సై ఇలానే ప్రవర్తించాడు. దీని గురించి నా స్నేహితురాలికి చెప్పాను. అప్పుడు ఆమె గతంలో భీష్మ్ పాల్ సింగ్ తన ముందు కూడా ఇలానే ప్రవర్తించాడని చెప్పింది. అందుకే ఈ సారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పడు సీక్రెట్ కెమరా తీసుకెళ్లాను. అతడి నీచ బుద్ధిని అందరికి తెలియజేయాలని వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాను’ అన్నారు. -
15 గంటల నరకయాతన తర్వాత..
లక్నో: ఆస్పత్రి యాజమాన్యాల నిర్లక్షానికి ఓ నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. నొప్పులు రావడంతో గర్భిణీని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే, ఆస్పత్రి యాజమాన్యాలు ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించాయి. ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిది. అలా దాదాపు 15గంటలపాటు అంబులెన్స్‌లోనే నరకయాతన అనుభవించిన ఆ మహిళ చివరకు మరణించింది. ఈ విషాదకర సంఘటన వివరాలు.. గౌతమ్‌బుద్ధనగర్ జిల్లాలోని కోడా కాలనీలో నివాసముంటున్న విజేందర్ సింగ్, నీలమ్ భార్యాభర్తలు. ఎనిమిది నెలల గర్భిణీ అయిన నీలమ్(30)కు అనుకోకుండా నొప్పులు రావడంతో.. భర్త విజేందర్ సింగ్ ఆమెను అంబులెన్స్‌లో మొదట ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే నీలమ్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఈఎస్ఐ వైద్యులు సరిపడా బెడ్స్ లేవని మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దాంతో సెక్టార్ 30లోని చైల్డ్ పీజీఐ ఆస్పత్రికి, అక్కడి నుంచి షర్దా, జిమ్స్(గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్)లకు వెళ్లారు. కానీ ఎవరు వారిని పట్టించుకోలేదు. ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రులైన జేయ్‌పీ, ఫోర్టీస్, మ్యాక్స్ ఇన్ వైశాలికి వెళ్లామని.. వారూ నిరాకరించారని విజేందరన్ తెలిపాడు. ఇలా మొత్తం 15 గంటలపాటు 8 ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చివరకు నొప్పులు భరించలేక నీలమ్ అంబులెన్స్‌లోనే మరణించింది. విజేందర్ మాట్లాడుతూ.. ఎనిమిది ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని.. వైద్యులు నిర్లక్ష్యం వల్లే తన భార్య మరణించిందని కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ ఎల్వై విచారణకు ఆదేశించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో కూడా ఇలాంటి ఇలాంటి సంఘటనే ఒకటి ఈ జిల్లాలో చోటు చేసుకుంది. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో మే 25న పుట్టిన శిశువు మరణించాడు. -
‘దెయ్యాల పనే అంటారా?!’
లక్నో: ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోను చూస్తే.. ఒక్క క్షణం మనకు కూడా నిజంగానే దెయ్యాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉందంటే.. ఓ పార్కులోని జిమ్ పరికరం దానంతట అదే కదులుతుంది. దాని చుట్టూ చేరిన పోలీసులు ఈ అసాధరణ విషయాన్ని వీడియో తీయడంలో నిమగ్నమయ్యారు. నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. నెటిజనులు దీని గురించి రకరకాల వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఎక్కువ మంది మాత్రం ‘మానవ ప్రయత్నం లేకుండా ఈ పరికరం కదులుతుంది అంటే ఖచ్చితంగా ఇది దెయ్యాల పనే’ అంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ వార్తలు జోరుగా షికారు చేస్తుండటంతో ఝాన్సీ పోలీసులు రంగంలోకి దిగారు. ఇలా జరగడానికి గల కారణాన్ని వివరించారు. Fitness freak ghost 👻?@jhansipolice got a tip off about an open gym being used by ghosts!Team laid seige & soon found t real ghosts-Some mischievous person made video of moving swing & shared on #socialmedia. Miscreants will b hosted in a ‘haunted’ lockup soon #NoHostForGhost pic.twitter.com/JUaYt4IJMS — RAHUL SRIVASTAV (@upcoprahul) June 12, 2020 ‘ఓ పార్కులోని జిమ్ పరికరం దానంతట అదే కదులుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఝాన్సీ పోలీసులు ఇందుకు గల కారణాన్ని కనుగొన్నారు. గ్రీజు ఎక్కువ కావడంతో ఆ పరికరం దానంతట అదే కదులుతుంది. ఇది దెయ్యాల పని కాదు. దయచేసి ఇలాంటి పుకార్లను ప్రచారం చేయకండి ’అంటూ ఝాన్సీ పోలీసులు ట్వీట్ చేశారు. అసలు కారణం తెలియడంతో జనాలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. तेजी से वायरल हो रहे वीडियो जिसमें झूला अपने आप झूलता हुआ दिखाई दे रहा है, सत्यता की जाँच @COCityjhansi द्वारा मौके पर जाकर की गयी तो झूले में अधिक ग्रीस लगे होने से एक बार हिला देने पर कुछ समय तक हिलता रहता है। आप सभी से अपील है कि भूत आदि होने की अफ़वाह न फैलाएं #FakeNewsAlert pic.twitter.com/kvqpQCMCSv — Jhansi Police (@jhansipolice) June 13, 2020 -
కరోనా కట్టడిలో యూపీ భేష్.. పాక్ మీడియా
లక్నో: కరోనా కట్టడి కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తీసుకుంటున్న చర్యలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ పాక్ మీడియా ప్రశంసలు కురిపిస్తుంది. పాకిస్తాన్ 'డాన్' వార్తాపత్రిక సంపాదకుడు ఫహద్ హుస్సేన్, కరోనా కట్టడి కోసం ఉత్తర ప్రదేశ్ లాక్‌డౌన్‌ను ఎంత కఠినంగా అమలు చేసిందో.. పాక్ ఎలా వదిలేసిందో గ్రాఫ్లతో వివరిస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. పాకిస్తాన్ జనాభా 20కోట్లకు పైగా ఉండగా ఉత్తరప్రదేశ్ జనాభా సుమారు 22 కోట్లు. అయితే పాక్‌లో కరోనా మరణాల రేటు.. యూపీ కంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనా కట్టడిలో యూపీ పనితీరును మెచ్చుకున్న ఆయన.. మహారాష్ట్ర పనితీరును విమర్శించారు. (ఆస్పత్రి నిర్లక్ష్యం..400 మంది క్వారంటైన్) Here's another graphic comparison this time between Pakistan and Indian state of Maharashtra (prepared by an expert). This shows how terribly Maharashtra has performed in relation to Pakistan. Shows the outcome of bad decisions & their deadly consequences #COVIDー19 (1/2) pic.twitter.com/6AHenrznIs — Fahd Husain (@Fahdhusain) June 7, 2020 మరో ట్వీట్లో.. ‘భారత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో.. పాకిస్తాన్ కంటే తక్కువ మరణాల రేటు ఉంది. అలానే మహారాష్ట్రలో యువ జనాభా, జీడీపీ అధికంగా ఉన్నప్పటికి ఆ రాష్ట్రంలో మరణాల రేటు అధికంగా ఉంది. కరోనా కట్టడి కోసం యూపీ సరిగ్గా ఏమి చేసిందో.. మహారాష్ట్ర ఏమి చేయలేదో మనం తెలుసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకోనందున మహారాష్ట్ర, పాక్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. ఫహద్ యోగి ప్రభుత్వాన్ని ప్రశంసించడం పట్ల మిశ్రమ స్పందన వెలువడుతుంది. కొందరు ఫహద్‌ను మెచ్చుకోగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. -
‘ఉపాధి హామీ’ వైపు నిరుద్యోగ యువత చూపు
లక్నో : కరోనా సృష్టించిన విధ్వంసం బడుగు జీవులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై.. పొట్ట చేత పట్టుకొని పట్టణ బాట పట్టిన వలస జీవులు తిరిగి పల్లెలకు తిరిగివచ్చేలా చేసింది. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రిటైల్ తదితర రంగాలు కుదేలు కావడంతో ఉపాధి కోల్పోయి సొంతూరుకు చేరుకున్న నిరుద్యోగులు ‘ఉపాధి హామీ’ పనులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దశాబ్ధంలోనే అత్యధికంగా, ఏప్రిల్ 1 నుంచి దాదాపు 35 లక్షల మంది పనులు లేక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎమ్జీఎన్ఆర్ఈజీఏ)కింద దరఖాస్తు చేసుకున్నారు. లాక్డౌన్ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన 30 లక్షల మంది వలస కార్మికుల కుటుంబాలకు గ్రామీణ ఉపాధి పథకాన్ని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పెంచింది. అయితే వలస కార్మికులే కాకుండా నిరుద్యోగులు కూడా ఉపాధి హామీ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. యూపీ రాజధాని లక్నోకి150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జునైద్‌పుర్ గ్రామానికి చెందిన రోషన్ ఉపాధి హామీకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నాడు. పీజీ చదువుకున్న రోషన్ రోడ్డు పనులు, పూడిక తీయడం వంటి పనులు చేయడానికి ముందుకొచ్చాడు. లాక్‌డౌన్‌తో ఉద్యోగం కోల్పోవడంతో ఇంటికొచ్చానని ఎంఏ డిగ్రీ చేసిన కుమార్ అన్నాడు. బీబీఏ డిగ్రీ పట్టా ఉన్నా, సరైన పని దొరకలేదు. చివరకు 6నుంచి 7వేల జీతం వచ్చే ఉద్యోగం దొరికినా, లాక్‌డౌన్‌తో అదికూడా పోయింది. అందుకే తిరిగి ఇంటికి వచ్చానని తెలిపాడు. తాను ఎంఏ, బీఈడీ పూర్తి చేశానని, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగానే లాక్డౌన్ వచ్చిందని సుర్జిత్ కుమార్ అన్నాడు. దీంతో చేసేదేమీలేక ఉపాధి హామీ పథకానికి దరఖాస్తు చేసుకున్నానని చెప్పాడు. లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు కోల్పోయిన వారందరూ ఉపాధి హామీకి దరఖాస్తు చేసుకుంటున్నారని జునైద్‌పుర్ గ్రామపెద్ద వీరేంద్ర సింగ్తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 14 కోట్ల మందికి ఎమ్జీఎన్ఆర్ఈజీఏ కార్డులు ఉన్నాయి. వీరందరికీ 100 రోజుల పనిదినాలను కల్పించడానికి ఏడాదికి 2.8 లక్షల కోట్ల రూపాయలు అవసరం కానుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏడాదిలో వంద రోజులు ఉపాధి కల్పించడం కోసం ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005ను తీసుకొచ్చింది. -
కూరగాయల సంతలో ఎస్సై విధ్వంసం
లక్నో: పోలీస్ జీపుతో కూరగాయల మార్కెట్లో హల్చల్ చేసి భయాందోళనలు సృష్టించిన సబ్ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడమే కాక ప్రయాగ్‌రాజ్ జిల్లా నుంచి బదిలీ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లా గూర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నాడు చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సుమిత్ ఆనంద్ గురువారం నాడు జరిగిన వారాంతపు సంతలో పోలీస్ జీపుతో కూరగాయల మార్కెట్లో విధ్వంసం సృష్టించాడు. అమ్ముకునేందుకు పోసిన కూరగాయలను పోలీస్ జీపుతో అతివేగంగా వచ్చి వరుసగా తొక్కించాడు. అంతటితో ఆగక వెహికల్‌ను రివర్స్ చేసి మిగతా కూరగాయల పైనుంచి పోనిచ్చాడు. మార్కెట్ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లాలని, కూరగాయలు అమ్మొద్దన్న తన ఆదేశాలు పాటించని కారణంగా ఆగ్రహించిన ఎస్సై ఇలా చేసినట్లు సమాచారం. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఉన్నతాధికారులు సుమిత్‌పై చర్యలు చేపట్టారు. (సొంతంగా రెండు చక్రాల సవారీ..) ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్ ఎస్ఎస్పీ సత్యార్థ్ అనిరుద్ పంకజ్ శుక్రవారం నాడు మీడియా ఎదుట మాట్లాడుతూ... సదరు ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశాము. ఇది హేయమైన చర్య. దర్యాప్తుకు ఆదేశించాము’ అని పేర్కొన్నారు. వాస్తవానికి బుధవారం, శుక్రవారం నాడు సంతకు అనుమతి ఉంది. కానీ గ్రామస్తులు గురువారం సైతం సంతను నిర్వహించారు. దాంతో మార్కెట్‌ను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా సుమిత్ వారికి తెలిపాడు. వారు వినకపోవడంతో ఈ చర్యకు పాల్పడ్డట్లుగా తెలిసిందన్నారు. లాక్డౌన్ కొనసాగింపు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వారాంతపు సంతకు అనుమతి తెలపగా పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. (15 రోజుల్లోగా పంపేయండి) -
బ్లడ్ శాంపిళ్లను ఎత్తుకెళ్లిన కోతులు
మీరట్: ఒక ల్యాబ్ టెక్నీషియన్ నుంచి రక్తపు నమూనా కిట్స్‌ను కోతులు ఎత్తుకెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ బ్లడ్ శ్యాంపిల్ కిట్స్‌ను చెట్టుపై కూర్చుని ఆ కోతులు కొరికి చప్పరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ శ్యాంపిల్స్ కరోనా అనుమానితులవని, ఇక ఆ కోతుల ద్వారా కరోనా మరింత వ్యాప్తి చెందుతుందని వచ్చిన వార్తలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. అయితే, అవి కరోనా అనుమానితుల రక్త నమూనాలు కావని, మధుమేహం ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారివని మీరట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గార్గ్ చెప్పారు. -
దారుణం.. దిబ్బను తవ్వి చూస్తే
లక్నో: ఉత్తప్రదేశ్ సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని సోనౌరా గ్రామంలోని కొందరు ప్రజలకు ఓ హృదయవిదారకర ఏడుపు వినిపించింది. ఎవరో చిన్న బిడ్డ ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేక ఏడుస్తున్నట్లు తోచింది. దాంతో గ్రామస్తులు ఆ ఏడుపు వినిపించే దిశగా ప్రయాణం చేసి నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ దగ్గర ఆగారు. చుట్టూ పరికించి చూడగా ఇసుక, మట్టి కలిసిన ఓ దిబ్బ దగ్గర వారి చూపు ఆగిపోయింది. అక్కడ వారికి ఓ పసికందు కాలు కనిపించింది. దాంతో జనం జాగ్రత్తగా ఆ దిబ్బను తవ్వి చూడగా ఓ నవజాత శిశువు కనిపించింది. వెంటనే ఆ పసివాడిని వెలికి తీసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆ చిన్నారిని శుభ్రం చేసి తగిన చికిత్స చేశారు. ప్రస్తుతం పిల్లాడు క్షేమంగానే ఉన్నాడని.. కాకపోతే కాస్తా బురదను మింగాడని ప్రమాదం ఏం లేదని తెలిపారు వైద్యులు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కేసు నమోదు చేశారు. -
పొలాల మధ్యన డీజే, లౌడ్ స్పీకర్ల హోరు..
లక్నో: పెళ్లి ఊరేగింపు, విజయోత్సవ ర్యాలీ వంటి వేడుకల్లో డీజే పెట్టడం సాధారణంగా కనిపించే దృశ్యం. కానీ ఉత్తరప్రదేశ్ రైతులు మాత్రం మిడతల దండును తరిమి కొట్టడం కోసం డీజే, లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేశారు. అది కూడా పొలాల మధ్యన. వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఓ వైపు దేశం కరోనాతో అతలాకుతలమవుతోంటే.. మరోవైపు మిడతల దండు పొలాలపై దాడి చేసి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే లాక్డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు మిడతల రూపంలో మరో నష్టం కళ్ల ముందు కనిపిస్తుంది. (వణికిస్తున్న రాకాసి మిడతలు) గుంపులు గుంపులుగా మిడతలు పొలాల్లో స్వైర విహారం చేస్తూ.. అన్నదాతను అశాంతికి గురి చేస్తున్నాయి. ఆఫ్రికా, యెమెన్, ఇరాన్, పాకిస్తాన్ మీదుగా మిడతలు భారతదేశంలో ప్రవేశించాయి. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్తాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో మిడతల దండు వీర విహారం చేస్తుంది. ఇప్పటికే రాజస్తాన్‌లో ఈ మిడతల దండు 50,000 హెక్టార్ల పంటను నాశనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పంటలను కాపాడుకునేందుకు యూపీ రైతులు ఇలాంటి వినూత్న ఆలోచన చేశారు. మిడతలను తరిమేందుకు పొలాల మధ్యలో డీజే, లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేశారు.(రాకాసి మిడతల దండుపై కెమికల్ స్ప్రే) ఇప్పుడు గనక ప్రభుత్వాలు మిడతల సమస్యపై దృష్టి సారించకపోతే.. ముందు ముందు తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే రానున్నది వర్షా కాలం. వరి, గోధుమ, పత్తి, సోయాబీన్ వంటి పంటలు సాగు చేసిది ఈ కాలంలోనే. ఒక వేళ ప్రభుత్వాలు గనక ఇప్పుడు ఈ మిడతలను నివారించకపోతే.. రైతలు తీవ్రమైన పంట నష్టం చవి చూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
21 ఏళ్ల యువతికి ఆరో తరగతి బాలుడి వేధింపులు
లక్నో: పిదప కాలం.. పిదప బుద్ధులు అంటే ఇవే. ఆరో తరగతి చదివే పిల్లాడు.. 21 ఏళ్ల యువతిని లైంగికంగా వేధిస్తున్నాడంటే.. ఏమనుకోవాలి. యువతి మార్ఫ్డ్ చిత్రాలను ఉపయోగించి డబ్బులు ఇవ్వు.. లేదంటే సెక్స్ చాట్ చేయాలంటూ వేధింపులుకు గురి చేస్తున్నాడో పిల్లాడు. ఆ వివరాలు.. ఘజియాబాధ్‌కు చెందిన బాధిత యువతి, సదరు పిల్లాడు విద్యార్థులు క్రియేట్ చేసిన ఓ టెలిగ్రామ్ గ్రూప్‌లో మెంబర్లు. ఈ గ్రూప్‌లో అన్ని వయసులు విద్యార్థులు ఉంటారు. జూనియర్లకు, సీనియర్ విద్యార్థులు అనుమానాలు నివృత్తి చేస్తూ.. బాగా చదువుకునేందుకు సాయం చేస్తూంటారు. ఈ నేపథ్యంలో బీఎస్సీ పూర్తి చేసి.. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న యువతి ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యింది. 6వ తరగతి చదువుతున్న పిల్లాడు కూడా ఈ గ్రూప్‌లో మెంబర్.(ఆ వీడియోల కోసం యాహూ మాజీ ఉద్యోగి నిర్వాకం) అలా ఇద్దరికి పరిచయం. తొలుత పిల్లాడు, బాధిత యువతితో చదువుకు సంబంధించిన విషయాలు చర్చించేవాడు. అలా కొద్ది రోజుల పాటు చదువు గురించి మాట్లాడి మంచి వాడిగా నమ్మకం సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 17న ఉదయం 3.30గంటలకు సదరు పిల్లాడు, యువతి మొబైల్‌కు ఆమె మార్ఫ్డ్ చిత్రాలు పంపించాడు. ఇవి చూసి సదరు యువతి ఒక్కసారిగా బిక్క చచ్చిపోయింది. అంత చిన్న పిల్లాడు ఇలాంటి పాడు పనులు చేస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. ఈ మెసేజ్ గురించి ఆలోచిస్తుండగానే ఆ పిల్లాడు ఫోన్ చేసి.. ఆమె సోషల్ మీడియా అకౌంట్నుంచి ఫోటోలను తీసుకున్నాని.. తాను అడిగినంత డబ్బైనా ఇవ్వాలి.. లేదా తనతో సెక్స్ చాట్ చేయాలన్నాడు. లేదంటే యువతి మార్ఫ్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. అంతేకాక ఆమె ఫోన్‌ను హ్యాక్ చేశానని చెప్పాడు. దాంతో భయపడిన యువతి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంది. అనంతరం ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు సదరు పిల్లాడిని పిలిపించి మాట్లాడారు. కానీ వాడిలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.(ఆ హీరోయిన్‌కు సైబర్ షాక్) పిల్లాడిని, అతడి తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించగా.. మెసేజ్‌ల గురించి తనకు ఏం తెలియదని.. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేశారని తెలిపాడు. ప్రస్తుతం పోలీసులు సదరు సోషల్ మీడియా కంపెనీతో మాట్లాడి యువతి, పిల్లాడి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని పంపాల్సిందిగా కోరారు. సైబర్ టీం ఐపీ అడ్రెస్‌ను ట్రేస్ చేసే పనిలో ఉంది. ఈ క్రమంలో పోలీసులు చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వవద్దని.. ఇచ్చినా వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. -
మూడేళ్ల తర్వాత.. కరోనా కలిపింది
బెంగళూరు: కరోనా వల్ల అన్ని కష్టాలే కాదు.. కొంత మేలు కూడా జరిగింది అంటున్నాడు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కరమ్ సింగ్(70). ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ఉత్తరప్రదేశ్‌కు చెందిన కరమ్ సింగ్ మూడేళ్ల క్రితం కొడుకు వివాహానికి అవసరమైన డబ్బు సమకూర్చడం కోసం ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే రైల్వే స్టేషన్లో ఒక రైలు బదులు మరొకటి ఎక్కాడు. అలా కరమ్ సింగ్ బెంగళూరు చేరుకున్నాడు. కొత్త ప్రాంతం, భాష తెలియకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రోడ్ల వెంట నడుస్తూనే ఉన్నాడు. అలా మైసూరు చేరుకున్నాడు. అయితే ఈ కఠినమైన ప్రయాణం, ఆందోళన వల్ల అతడు మతి స్థిమితం కోల్పోయాడు. తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు తదితర వివారాలేం అతడికి గుర్తు లేవు. అలా మైసూర్ వీధుల వెంట తిరుగుతూ.. ఎవరైన ఏమైన ఇస్తే తింటూ.. ఫుట్‌పాత్ మీద జీవితం గడిపాడు. (భార్యపై అనుమానం.. కరోనాతో అవకాశం) ఇదిలా ఉండగా కరోనా ఎఫెక్ట్‌తో ఈ ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం వీధుల వెంట ఉండే వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు పంపించింది. ఈ క్రమంలోనే కరమ్ సింగ్‌ను కూడా నంజరాజా బహదూర్ వృద్ధాశ్రమానికి తీసకెళ్లారు అధికారులు. అక్కడ మానసికవవైద్యులు కరమ్ సింగ్‌కు చికిత్స చేశారు. కొంత కాలంలోనే అతడి ఆరోగ్యం మెరుగవ్వడమే కాక జ్ఞాపకశక్తిని తిరిగి పొందాడు. చికిత్స సమయంలో కరమ్ సింగ్ తాను ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చానని.. తన కుటుంబం వివరాలు తెలియజేశాడు. దాంతో మైసూర్ సిటీ కార్పొరేషన్ అధకారులు, పోలీసుల సాయంతో కరమ్ సింగ్ కొడుకును కాంటక్ట్ చేయగలిగారు. తండ్రి బతికే ఉన్నాడని తెలిసి అతను ఎంతో సంతోషించాడు. వెంటనే తండ్రిని ఇంటికి పంపిచాల్సిందిగా కర్ణాటక అధికారులను కోరాడు. (కరోనానీ, క్రిముల్నీ కడిగి పారేద్దాం!) ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ‘కరమ్ సింగ్ బతికి ఉన్నాడని తెలిసి అతడి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. మూడేళ్లుగా అతడు కనిపించకపోవడంతో.. చనిపోయాడని భావించారు. అతడిని కుటుంబంతో కలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే కరమ్ సింగ్‌ని ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉత్తరప్రదేశ్ పంపిస్తాము’ అన్నారు అధికారులు.(కరోనా: ఇంటి అవసరం.. ఇంకా పెరిగింది!) -
‘మాస్క్ లేదా.. పొర్లుదండాలే’
లక్నో: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో ప్రజలు అనవసరంగా బయటకు రాకుడదని.. వచ్చినా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. కానీ కొందరు మాత్రం ఈ ఆదేశాలను ఏ మాత్రం లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల పోలీసులు కూడా సీరియస్‌గానే స్పందిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో చోటు చేసుకుంది. మాస్క్ లేకుండా రోడ్డు మీదకు వచ్చిన ఇద్దరు యువకులను పోలీసులు కఠినంగా శిక్షించారు. మండుటెండలో నడి రోడ్డు మీద వారి చేత పొర్లు దండాలు పెట్టించారు. అది కూడా రైల్వే క్రాసింగ్‌కు సమీపంలోని రోడ్డు మీద సదరు యువకుల చేత ఇలా పొర్లు దండాలు పెట్టించారు. యువకులు మధ్యలో ఆగితే పోలీసులు లాఠీలకు పని చెప్పారు.(ఎందుకు రిస్క్? వేస్కోండి మాస్క్) In UP's Hapur district, cops ask two men to roll on the road in the scorching heat near a railway crossing, dangerously close to railway tracks. This was the punishment for not wearing mask. @Uppolice pic.twitter.com/4fbGA4Q0b8 — Piyush Rai (@Benarasiyaa) May 19, 2020 అయితే ఎవరో ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడమే కాక ట్విట్టర్లో యూపీ పోలీసులను ట్యాగ్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజనులు కొందరు యువకుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు పోలీసుల తీరును తప్పు పడుతున్నారు. విషయం పెద్దది కావడంతో యూపీ పోలీసు ఉన్నతాధికారుల దీనిపై విచారణ చేపట్టారు. ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. (వైరైటీ డిజైన్లతో వెండి మాస్క్‌లు) -
వలస కూలీల కోసం 1000 బస్సులు
లక్నో: ప్రతిపక్ష నాయకురాలు ప్రియాంక గాంధీ అభ్యర్థన మేరకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వలస కూలీల కోసం 1000 బస్సులు ఏర్పాటు చేసింది. ఈ మేరకు బస్సు నంబర్లతో పాటు డ్రైవర్లకు సంబంధించిన వివరాలను ప్రియాంక గాంధీ కార్యాలయానికి పంపించారు. ఈ నెల 16న ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వలస కూలీలు ప్రయాణిస్తున్న ట్రక్కు రాజస్థాన్ నుంచి యూపీ వస్తుండగా ఔరాయ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 24 మంది వలస కూలీలు మరణించగా.. 36మంది గాయపడ్డారు.(బారికేడ్లను బద్దలు కొడుతూ..) ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ వలస కూలీల కోసం బస్సులను ఏర్పాటు చేయాల్సిందిగా యూపీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ.. ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రియాంక అభ్యర్థనపై స్పందించిన యోగి ప్రభుత్వం వలస కూలీల కోసం 1000 బస్సులను ఏర్పాటు చేసింది.(చితికిన బతుకులు) -
ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులకు కరోనా
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లోని బస్తి జిల్లాలో ఏడుగురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ముంబై నుంచి స్వస్థలాలకు వచ్చిన కార్మికులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు ఉత్తర్ ప్రదేశ్‌లోని బస్తి జిల్లా మెజిస్ట్రేట్ అషుతోష్ నిరంజన్ తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ముంబైలో చిక్కుకున్న వలస కార్మికులను యూపీ ప్రభుత్వం బస్సులో స్వస్థలాలకు తీసుకువచ్చింది. మహారాష్ట్ర నుంచి ఝాన్సీ మీదుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో కార్మికులు బస్తీ జిల్లాకి చేరుకున్నారు. వీరికి పరీక్ష నిర్వహించగా ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిని క్వారంటైన్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.(లాక్డౌన్ ఎత్తివేస్తే ఇక అంతే: డబ్ల్యూహెచ్ఓ) దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లడానికి కేంద్రం అంగీకరించిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 1,008 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం మహారాష్ట్రాలో కరోనా బాధితుల సంఖ్య 11,506కి చేరుకుంది.(జిల్లాకు చేరుకున్న 11,621 మంది కూలీలు) -
ఘోర రోడ్డు ప్రమాదం; 14 మంది మృతి
-
యూపీ పోలీసులపై ప్రియాంకగాంధీ ఆగ్రహం
-
రైల్వేస్టేషన్లో కింగ్‌కోబ్రా కలకలం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కత్తగోడెం రైల్వే స్టేషన్లో ఓ నల్లత్రాచు పాము కలకలం సృష్టించింది. 10 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా(నల్లత్రాచు)ను అటవి అధికారులు పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఉత్తరాఖండ్ ‘కత్తగోడెం రైల్వే స్టేషన్లో రైలు కింది భాగంలో చుట్టలుగా చుట్టుకుని ఉన్న నల్లత్రాచు పామును చూసి ప్రయాణికులంతా బెంబెలేత్తిపోయారు. దీంతో రైల్వే అధికారుల ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పామును పట్టుకుని అడవిలో వదిలి పెట్టిన వీడియోను ధఖ్తే అనే ఓ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 28 సెకన్లు నిడివి ఉన్న ఈ వీడియోకు ఇప్పటి వరకు 5 వేలకు పైగా వ్యూస్ రాగా.. వందల్లో కామెంట్లు వస్తున్నాయి. అలాగే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పామును పట్టుకున్న ఆటవీ అధికారులను నెటిజన్లంతా అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపిస్లున్నారు. ఇక ‘కత్తగోడెం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలు కింది భాగంలో నల్లత్రాచును గుర్తించిన అధికారులు వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. రైల్వే అధికారులు, అటవీ అధికారులు కలిసి ప్రయాణికులను అప్రమత్తం చేసి పామును సునాయాసంగా పట్టుకున్న అటవీ అధికారులు దానిని అడవిలో వదిలిపెట్టారంటూ’ ధఖ్తే తన ఇన్‌స్టా పోస్టులో రాసుకోచ్చారు. -
పాపం చిట్టితల్లి.. బతికుండగానే
లక్నో: ఉత్తరప్రదేశ్ బరేలీలో దారుణం వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన చిన్నారిని బతికుండగానే కుండలో పెట్టి మరి పూడ్చిపెట్టిన సంఘటన ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది. వివరాలు.. హితేష్ కుమార్ సిరోహీ అనే వ్యాపారి భార్య వైశాలికి ఏడో నెల. అయితే రెండు రోజుల క్రితం ఆమెకు తీవ్రంగా నొప్పులు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైశాలి నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ దురదృష్టవశాత్తు పుట్టిన కొద్దిసేపటికే ఆ బిడ్డ మరణించింది. పసికందు మృతదేహాన్ని పూడ్చి పెట్టడానికి సిరోహీ శ్మశానికి వెళ్లాడు. మృతదేహాన్ని పూడ్చడం కోసం శ్మశానంలో గుంత తవ్వుతుండగా.. మూడు అడుగుల లోతున అతడికి ఓ మట్టికుండ అడ్డు తగిలింది. దాన్ని బయటకు తీసి, తెరచి చూసిన సిరోహీకి ఒక్క సారిగా షాక్ తగిలినట్టయ్యింది. ఎందుకంటే ఆ కుండలో అప్పుడే పుట్టిన ఓ చిన్నారి సజీవింగా ఉంది. ఊపిరితీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. దాంతో సిరోహీ వెంటనే చిన్నారిని సమీప ఆస్పత్రికి తరలించాడు. పోలీసులకు కూడా సమాచారం అందించాడు. బతికుండగానే చిన్నారిని కుండలో పెట్టి పూడ్చిపెట్టిన ఘటన బరేలీలో కలకలం రేపింది. మరోవైపు చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. అన్ని సదుపాయాలున్న మరో ఆస్పత్రికి తరలించారు వైద్యులు. ఈ సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా స్పందించడమే కాక ఆ చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చును భరించడానికి ముందుకు వచ్చాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. -
పవిత్ర స్నానాలకొచ్చి.. పరలోకాలకు వెళ్లారు
లక్నో: బులంద్‌షహర్‌లో దారుణం చోటు చేసుకుంది. పేవ్మెంట్ మీద నిద్రిస్తున్న వారి మీదకు మృత్యువు బస్సు రూపంలో దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ సంఘటన బులంద్‌షహర్ నరోరాలోని గంగాఘాట్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్ హత్రాస్‌కు చెందిన కొందరు గంగానదిలో పవిత్ర స్నానమాచరించడం కోసం నరోరా ఘాట్‌కు వచ్చారు. ఈ క్రమంలో వీరు గురువారం రాత్రి రోడ్డు పక్కనే ఉన్న పేవ్మెంట్ మీద నిద్ర పోయారు. శుక్రవారం తెల్లవారుజామున వైష్ణోదేవి ఆలయం నుంచి వస్తోన్న ఓ బస్సు వీరి మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరణించిన వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
‘నువ్వు ఫైల్స్ చూడు.. నేను పేలు చూస్తా’
లక్నో: కోతులు పేలు చూస్తాయనే సంగతి మనందరికి తెలిసిందే. కోతి, కోతికి పేలు చూడటం సహజం. కానీ వానరం, మనిషికి.. అందునా ఓ పోలీసు అధికారికి పేలు చూడటం అంటే.. నిజంగా విడ్డూరమే. ఓ కోతి.. పోలీసు అధికారికి పేలు చూస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లా, సదర్ కొట్వాలి పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్‌కు వచ్చిన కోతి, హౌజ్ ఆఫీసర్ శ్రీకాంత్ ద్వివేది భుజాలపైకి ఎక్కి అతని.. తలలో పేలు చూడటం మొదలు పెట్టింది. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే.. దాడి చేస్తుందనే ఉద్దేశంతో.. సదరు అధికారి కామ్‌గా తన పని తాను చేసుకుంటూ కూర్చున్నాడు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు స్టేషన్‌కు వచ్చి కోతిని పట్టుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ శ్రీవాస్తవ అనే అధికారి తన ట్విటర్లో షేర్ చేశాడు. ఈ వీడియోలో కోతి ద్వివేది భుజాలపై కూర్చుని.. పేలు చూస్తుండగా.. అతడు మాత్రం ప్రశాంతంగా తన పని చేసుకుంటూ కూర్చున్నాడు. స్టేషన్లో ఉన్న మిగతా సిబ్బంది దీని గురించి చర్చించుకుంటారు.. కానీ కోతిని తరిమే ప్రయత్నం మాత్రం చేయలేదు. ‘పని చేసేటప్పుడు మీరు ఇలాంటి అవంతరాలు ఎదుర్కొకుండా ఉండాలంటే.. శిఖాకాయ్, రీతా లేదా మరో మంచి షాంపు వాడితే.. ఫలితం ఉంటుంది’ అంటూ ట్వీట్ చేసిన ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఈ విషయం గురించి శ్రీకాంత్ ద్వివేది మాట్లాడుతూ.. ‘తొలుత వానరం ఓ మహిళా కానిస్టేబుల్ వెంట పడింది. ఆమె భయంతో పరుగులు తీసింది. తర్వాత అది నా మీదకు ఎక్కింది. కదిలిస్తే.. నాపై కూడా దాడి చేస్తుందనే ఉద్దేశంతో పట్టించుకోవడం మానేసి.. ఫైల్స్ చూస్తూ కూర్చున్నాను’ అని తెలిపారు. -
ఫోన్ మాట్లాడుతూ.. పాములపై కూర్చుంది
లక్నో: ఓ మహిళ ఫోన్లో మాట్లాడుతూ.. చూసుకోకుండా పాముల మీద కూర్చుని మృతి చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ గోరక్‌పూర్‌లో చోటు చేసుకుంది. రివాయ్ గ్రామానికి చెందిన జయసింగ్ థాయ్‌ల్యాండ్‌లో ఉంటాడు. అక్కడి నుంచి ఆయన తన భార్య గీతకు ఫోన్ చేశాడు. భర్తతో ఫోనులో మాట్లాడుతూ పక్కనే ఉన్న మంచంపై కూర్చుంది గీత. అయితే అప్పటికే ఆ మంచంపై రెండు పాములున్నాయి. ఆమె చూసుకోకుండా వాటిపైననే కూర్చుంది. దీంతో ఒక పాము ఆమెను కాటువేసింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. -
‘లతా జీ కోసం బ్రహ్మచారిగా మిగిలాను’
లక్నో: అభిమానుల గురించి తెలుసు.. వీరాభిమానుల గురించి తెలుసు.. కానీ ప్రస్తుతం చెప్పుకోబోయే వ్యక్తి వీరందరిని మించిన వాడు. ఏ పేరుతో పిలవాలో తెలియడం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మీద అభిమానంతో తన ఇంటిని మ్యూజియంలా మార్చడమే కాక.. ఏకంగా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ డై హార్డ్ ఫ్యాన్ కథేంటో చూడండి.. సాధారణంగానే లతా మంగేష్కర్‌కు అభిమానుల సంఖ్య ఎక్కువ. కానీ మీరట్‌కు చెందిన గౌరవ్ శర్మ అనే వ్యక్తి లతాజీ గాత్రానికే కాక ఆమె జీవితంలో పడిన కష్టానికి కూడా అభిమాని అయిపోయాడు. లతా మంగేష్కర్ పాడిన ప్రతి పాటను కలెక్ట్ చేశాడు. కేవలం పాటలు మాత్రమే కాక దేశవిదేశాల్లో ఆమె మీద వచ్చిన పుస్తకాలను కూడా సేకరించాడు. లతాజీ పేరు మీద ఉన్న ప్రతి దాన్ని సేకరించి తన ఇంటిని నింపేశాడు. మొత్తంగా తన ఇంటిని చిన్న సైజు లతా మంగేష్కర్ మ్యూజియంగా మార్చేశాడు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. లతా మంగేష్కర్ మీద ఉన్న అభిమానంతో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీని గురించి గౌరవ్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి లతాజీ పాటలు అంటే పడి చచ్చేవాడిని. నాతో పాటు ఆమె మీద నా అభిమానం కూడా పెరిగి పెద్దవసాగింది. నా జీవితం అంతా ఆమెని ఆరాధించడానికే సరిపోతుంది. ఆమె నా గురువు, దైవం. నేను ఆమెకు శిష్యుడిని, భక్తుడిని. ఇక వేరే స్త్రీకి నా హృదయంలో, జీవితంలో చోటు లేదు’ అని తెలిపారు. లతా జీకి సంబంధించిన పాటలు, పుస్తకాలు, వస్తువులు మాత్రమే కాదు ఆఖరికి ఆమె చేసిన ట్వీట్లను కూడా కలెక్ట్ చేశాడు గౌరవ్. -
ప్రాణం తీసిన రూ.180
లక్నో: డబ్బు.. మనుషులను రాక్షసులను చేస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. బిల్లు చెల్లించలేదనే కోపంతో ఓ హోటల్ యజమాని కస్టమర్‌ను చంపేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాదోమీ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. సూరజ్ సింగ్, విశాల్ దూబే అనే యువకులు భోజనం కోసం ఓ హోటల్‌కు వెళ్లారు. భోజనం తర్వాత వెయిటర్ వారికి రూ.180 బిల్లు ఇచ్చాడు. అయితే తాము తిన్న భోజనానికి ఎక్కువ బిల్లు వేశారంటూ సూరజ్, విశాల్‌లు హోటల్ యజమానితో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ కాస్తా పెద్దదై కొట్టుకొనేవరకు వెళ్లింది. ఆగ్రహించిన హోటల్ యజమాని గుర్మయిల్, అతడి కుమారుడు సురేంద్ర సింగ్‌లు, సిబ్బందితో కలిసి కర్రలు, ఇనుప రాడ్లతో విశాల్, సూరజ్‌లపై దాడి చేశారు. ఈ ఘటనలో విశాల్ అక్కడ నుంచి తప్పించుకోగా.. సూరజ్‌ను తీవ్రంగా కొట్టారు. గాయాలతో కదల్లేని పరిస్థితిలో ఉన్న సూరజ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్మయిల్, సురేంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన ఇద్దరు వెయిటర్లు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
అన్నం-ఉప్పు, రోటి-ఉప్పు
లక్నో: తినడానికి మూడు పూటలా తిండి దొరికితే చాలు అనుకునే కుటుంబాలు నేటికి మన దేశంలో కొకొల్లలు. ఈ క్రమంలో కనీసం ఓ పూటైనా కడుపు నిండా తిండి దొరుకుతుందనే ఉద్దేశంతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పేద విద్యార్థులకు సరైన పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చింది. దీని కోసం ప్రతి ఏడాది కొన్ని వేల కోట్ల రూపాయాలు ఖర్చు పెడుతోంది. కానీ నేటికి కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం కాదు కదా.. కనీస భోజనం కూడా సరిగా అందట్లేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ఓ దారుణమైన సంఘటన వెలుగు చేసింది. మీర్జాపూర్ జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పేరుతో కేవలం రొట్టెలు, కూరకు బదులుగా ఉప్పు ఇస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో చిన్నారులకు ప్రతిరోజు అన్నం, పప్పు, రొట్టె, కూరగాయాలు, పండ్లు, పాలు వంటి పోషకాహారం భోజనంగా ఇవ్వాలని అధికారులు ఈ పథకం తీసుకొచ్చారు. అయితే మీర్జాపూర్‌లోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మాత్రం ఇవేవీ కాకుండా కేవలం రొట్టెలు మాత్రమే పెడుతున్నారు. కనీసం కూర కూడా వండకుండా ఉప్పుతో తినమంటున్నారు. ఒకరోజు ఉప్పు, రొట్టెలు.. మరుసటి రోజు అన్నం, ఉప్పు ఇలా వారమంతా విద్యార్థులకు ఇదే భోజనం అందిస్తున్నారు. ఇలా ఓ ఏడాది నుంచి జరుగుతోంది. అయితే తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థ కథనంతో ఈ దారుణం వెలుగు చూసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. This clip is from a @UPGovt school in east UP's #Mirzapur . These children are being served what should be a 'nutritious' mid day meal ,part of a flagship govt scheme .On the menu on Thursday was roti + salt !Parents say the meals alternate between roti + salt and rice + salt ! pic.twitter.com/IWBVLrch8A — Alok Pandey (@alok_pandey) August 23, 2019 ‘గత ఏడాది కాలంగా ఈ పాఠశాలలో మా పిల్లలకు ఇదే భోజనం పెడుతున్నారు. పాలు ఎప్పుడో ఒక్కసారి వస్తాయి. వచ్చినా వాటిని పిల్లలకు ఇవ్వరు. ఇక అరటిపండ్లు ఇంతవరకూ పంచలేదు’అని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఇందుకు బాధ్యులైన గ్రామ పంచాయతీ సూపర్వైజర్, స్కూల్ ఇన్ఛార్జ్లను విధుల నుంచి సస్పెండ్ చేశామని వెల్లడించారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్‌లోని చిన్సురాలో గల ఓ బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది. అక్కడ కూడా పిల్లలకు ఉప్పు, అన్నం మాత్రమే పెడుతున్న వీడియో వైరల్ అయ్యింది. దాంతో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు. -
గుండు చేయించుకుని.. భక్తితో నమస్కరిస్తూ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం మరోసారి వెలుగు చూసింది. దాదాపు 150 మందికి పైగా జూనియర్ విద్యార్థులు గుండు చేయించుకుని.. సీనియర్లకు సెల్యూట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సైఫాయ్ గ్రామంలోని ఉత్తర ప్రదేశ్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ వీడియోలో 150 మంది వరకు ఫస్టియర్ విద్యార్థులు గుండు చేయించుకుని.. వరుసలో నడుస్తూ.. సీనియర్లకు భక్తితో నమస్కరిస్తున్నారు. ఆ సమయంలో ఓ సెక్యూరిటీ గార్డ్ అక్కడే ఉన్నాడు. కానీ అతడు దీన్ని ఆపడానికి ప్రయత్నించకపోవడం గమనార్హం. దీని గురించి కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. ‘మా కళశాలలో ర్యాగింగ్‌ని నిషేధించి చాలా కాలమవుతుంది. కాలేజీలో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాం. ఇందుకు కోసం ప్రత్యేకంగా ఓ అధికారిని కూడా నియమించాం. ప్రస్తుతం జరిగిన సంఘటన గురించి పూర్తిగా విచారణ జరుపుతాం. ఇందుకు బాధ్యులైన వారిమీద కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
రోజు లడ్డూలే... విడాకులు ఇప్పించండి
లక్నో: వరకట్న వేధింపులు.. అత్తింటి వారి ఆరళ్లు తట్టుకోలేక విడాకులు తీసుకునే వారి గురించి విన్నాము. అయితే ఈ మధ్య కాలంలో చాలా సిల్లీ కారణాలతో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే దంపతులు కూడా ఈ కోవలోకే వస్తారు. ‘ఆహారంలో భాగంగా నా భార్య ప్రతిరోజు కేవలం లడ్డూలు మాత్రమే పెడుతుంది. విడాకులు ఇప్పించండి’ అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ మీరట్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. బాధితుడికి పదేళ్ల క్రితం వివాహమయ్యింది. ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఇన్నాళ్లు బాగానే సాగిన వీరి దాంపత్యంలో ఓ తాంత్రికుడి వల్ల కలతలు రేగాయి. గత కొద్ది కాలంగా బాధితుడు తరచుగా అనారోగ్యం పాలవుతున్నాడు. దాంతో అతడి భార్య ఓ తాంత్రికుడిని ఆశ్రయించింది. అతని సూచన మేరకు బాధితుడికి ప్రతి రోజు ఉదయం 4, సాయంత్ర నాలుగు చొప్పున లడ్డూలు భోజనంగా పెడుతుంది. ఇక ఇతర ఏ పదార్థాలు ముట్టుకోనివ్వడం లేదు. దాంతో విసిగిపోయిన బాధితుడు, భార్య నుంచి తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం అధికారులు వీరిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు. అప్పటికి మనసు మార్చుకోకపోతే.. విడాకులు ఇప్పిస్తామని తెలిపారు. -
‘కుల్దీప్‌కిది కష్టకాలం.. తోడుగా నిలవాలి’
లక్నో: నియోజకవర్గ ప్రజలను కాపాడాల్సింది పోయి.. తానే వారి పాలిట కాలయముడిగా మారాడు. సాయం కోసం వచ్చిన బాలికపై అత్యాచారం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆమె తండ్రిని చంపేశాడు. చివరికి బాధితురాలిని కూడా చంపేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ చేయించడంతో.. ప్రసుత్తం ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి యాక్సిడెంట్ పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంటే.. నాయకులు మాత్రం ఇంకా కళ్లు తెరవడం లేదు. నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకుని అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకుడు ఆశిష్ సింగ్ అషు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉన్నావ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆశిష్ సింగ్ మాట్లాడుతూ.. ‘మన సోదరుడు కుల్దీప్ సింగ్ నేడు మన మధ్యలో లేకపోవడం బాధాకరం. ప్రస్తుతం కుల్దీప్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో మనం అన్నకు తోడుగా ఉండాలి. త్వరలోనే కుల్దీప్ ఈ కష్టాల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను. మనం ఎక్కడ ఉన్నా కుల్దీప్ క్షేమం గురించి ఆలోచించాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆశిష్ వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలతో పాటు మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘ఆడపిల్లకు అన్యాయం చేసి చంపడానికి చూసిన వాడిని వెనకేసుకు వస్తున్నారు. మీలాంటి నాయకుల ఉండటం మా ఖర్మ’ అంటూ జనాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ప్రతిపక్షాలు పార్లమెంట్లో బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ కుల్దీప్పై చర్యలకు సిద్ధపడింది. అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ అధిష్టానం గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పులిపై దాడి చేసి చంపేసిన గ్రామస్తులు
లక్నో : ఆరేళ్ల పులిని దారుణంగా కర్రలతో కొట్టి చంపేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. పిలిబిత్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలో ఉన్న మతైన గ్రామంలోకి బుధవారం ఓ పులి ప్రవేశించింది. గ్రామస్తుడిపై దాడి చేసి గాయపర్చింది. దాంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు కర్రలతో పులిని వెంబడిస్తూ.. చితకబాదారు. ఈ ఘటనలో దారుణంగా గాయపడిన పులి చనిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై స్పందించిన అటవీ అధికారులు పులిపై దాడి చేసి, చంపినందుకు గాను 31మంది గ్రామస్తుల మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పిలిబిత్ ప్రాంతంలో ఇలా జంతువులు మీద దాడి చేసి చంపడం ఇదే ప్రథమం అన్నారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. -
దారుణం: కుక్కల బారి నుంచి తప్పించుకోబోయి
లక్నో: తెల్లవారు జామున వీధి కుక్కల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఓ ఇంట్లో దూరి.. ప్రాణాలు కోల్పోయాడో యువకుడు. వివరాలు.. బారాబంకి, రాఘోపూర్ గ్రామం.. దేవా ప్రాంతానికి చెందిన సుజిత్ కుమార్ ఈ నెల 19 తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో తన మేనల్లుడి ఇంటికి వెళ్లాడు. పూర్తిగా తెల్లవారకపోవడం.. వెలుతురు సరిగా లేకపోవడంతో సుజిత్‌ని చూసిన వీధికుక్కలు అరుస్తూ అతడి వెంటపడటం ప్రారంభించాయి. కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు సుజిత్ ఓ ఇంట్లో దూరాడు. అయితే సుజిత్‌ని దొంగగా భావించిన సదరు కుటుంబ సభ్యులు అతడిని చితకబాదడమే కాక పెట్రోల్ పోసి నిప్పంటించారు. 40 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన సుజిత్ చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. సుజిత్ మీద దాడి చేసిన ఇద్దరు యువకుల మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పెళ్లైన 24 గంటలకే విడాకులు
లక్నో : వివాహం అయ్యి ఓ రోజైనా గడవకముందే నూతన వధువుకు తలాక్ చెప్పాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ జహీంగీరాబాద్లో చోటు చేసుకుంది. వివరాలు.. షాహే అలం అనే వ్యక్తికి ఈ నెల 13న రుక్సానా బానోతో వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందు అలంకు కట్నంలో భాగంగా బైక్ ఇస్తామని చెప్పారు బానో తల్లిదండ్రులు. కానీ పెళ్లి సమయానికి డబ్బు సర్దుబాటు కాకపోవడంతో బైక్ ఇవ్వలేదు. ఆగ్రహించిన అలం.. రుక్సానాకు ముమ్మార్లు తలాక్ చెప్పాడు. దాంతో రుక్సానా తండ్రి అలంతో పాటు అతని కుటుంబ సభ్యుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
‘మనది భారతదేశం.. అతడిని అభినందించాలి’
లక్నో : కొందరు మంత్రులు చెలాయిస్తున్న అధికార దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనం ఈ వీడియో. ప్రభుత్వాధికారి చేత షూలేస్ కట్టించుకోవడమే కాక రామయణాన్ని తెర మీదకు తెచ్చి మరి దాన్ని సమర్థించుకున్నాడో మినిస్టర్. వివరాలు.. ఉత్తరప్రదేశ్ మినిస్టర్ లక్ష్మీ నారాయణ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా షాజహాన్పూర్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో సదరు మినిస్టర్ షూ లేస్ ఊడిపోయింది. దాంతో పక్కనే ఉన్న ప్రభుత్వ ఉద్యోగి వెంటనే వెళ్లి అమాత్యుల వారి షూలేస్ కట్టి తన ప్రభు భక్తిని చాటుకున్నాడు. వారించాల్సిన మినిస్టర్ కాస్తా దర్జాగా నిల్చూని ప్రభుత్వ ఉద్యోగి చేత సేవ చేపించుకుని తరించారు. #WATCH: UP Minister Laxmi Narayan gets his shoelace tied by a government employee at a yoga event in Shahjahanpur, yesterday. pic.twitter.com/QbVxiQM7bI — ANI UP (@ANINewsUP) June 22, 2019 ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో లక్ష్మీ నారాయణ్‌ని, ఉద్యోగిని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ సంఘటన గురించి లక్ష్మీ నారాయణ్‌ని ప్రశ్నించగా.. ఆయన సిగ్గుపడకపోగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ‘షూ లేస్ కట్టి నాకు సాయం చేసిన వ్యక్తిని అభినందిస్తున్నాను. భారతదేశం చాలా గొప్ప దేశం. ఇక్కడ రాముని బదులు ఆయన పాదరక్షలు 14 ఏళ్ల పాటు పాలన చేశాయి. మన పురాణాల్లో పాద రక్షలకు చాలా ప్రాధాన్యం ఉంది. అలాంటి చెప్పులు ధరించే విషయంలో నాకు సాయం చేసిన వ్యక్తిని అభినందిస్తున్నాను’ అంటూ రామయణాన్ని తెరమీదకు తెచ్చి పొంతన లేని వాదనను వినిపించాడు. అయితే ఇలా తలా తోకా లేకుండా మాట్లాడటం సదరు మినిస్టర్‌కు కొత్త కాదు. గతంలో హనుమంతుడు జాట్ల తెగకు చెందిన వాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లక్ష్మి నారాయణన్. -
సామూహిక అత్యాచారం.. యువతి ఆత్మహత్య
లక్నో : పద్నాలుగేళ్లకే పెళ్లి.. ఓ బిడ్డ. తర్వాత భర్తతో విడాకులు. ఎక్కడికెళ్లాలో తెలియక పుట్టింటికి చేరింది. కానీ విధి మాత్రం ఆమెని పగబట్టింది. దాదాపు మూడేళ్ల పాటు మృగాళ్లు ఆమెను పీక్కు తిన్నారు. ఇక బతకలేననుకుని.. స్వయంగా తనకు తానే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. యూపీ హపూర్‌కు చెందిన 29 ఏళ్ల మహిళ మీద అదే గ్రామానికి చెందిన పలువురు యువకులు గత మూడేళ్ల నుంచి అత్యచారానికి పాల్పడుతున్నారు. సదరు మహిళ అప్పటికే భర్త నుంచి విడాకుల పొంది ఒంటరిగా జీవిస్తుంది. అలాంటి సమయంలో ఇలాంటి దారుణాల గురించి బయటకు చెప్తే సమాజం మరింత చులకన చేస్తుందని మృతురాలి భావించింది. దాంతో ఆ దారుణాలను భరిస్తూ వచ్చింది. ఏళ్లు గడుస్తున్నా.. మృగాళ్లు తనను విడిచి పెట్టకపోవడంతో.. ఇక ఇలాంటి జీవితం వద్దనుకుంది. దాంతో తనకు తానే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ సంఘటన పట్ల పోలీసుల వ్యవహరించిన తీరు దారుణంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలి మరణించిన తర్వాత కూడా పోలీసులు కేసు నమోదు చేయడానికి ముందుకు రాలేదు. ఢిల్లీ మహిళా కమిషన్ ఈ విషయం గురించి యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు లేఖ రాయడంతోపాటు నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పోలీసుల్లో చలనం మొదలైంది. మహిళ చనిపోయిన 14 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఇంతవరకూ ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయలేదు. ఈ విషయం గురించి ఓ పోలీసాధికారి మాట్లాడుతూ.. ‘ఈ కేసుకు సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులను అందరిని ప్రశ్నించాము. ఓ 16 మందిని నిందితులుగా భావిస్తున్నాం. కానీ ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకూ ఒక్క ఆధారం కూడా లభించలేదు. దాంతో ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేద’ని పేర్కొన్నారు. -
పట్టాలు తప్పిన హౌరా ఎక్స్‌ప్రెస్
లక్నో : హౌరా - న్యూఢిల్లీ పూర్వ ఎక్స్‌ప్రెస్ శనివారం పట్టాలు తప్పింది. కాన్పూర్ పట్టాణానికి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. హౌరా నుంచి ఢిల్లీ వెళ్తున్న పూర్వా ఎక్స్‌ప్రెస్.. కాన్పూర్ జిల్లాలోని రూమ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం 12.54 గంటలకు పట్టాలు తప్పింది. మొత్తం 11 బోగీలు పట్టాలు తప్పగా.. అందులో నాలుగు పూర్తిగా బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభంవించలేదని.. ఓ ఎనిమిది మంది ప్రయాణికులకు మాత్రం తీవ్ర గాయాలయ్యానని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిని వెంటనే సమీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో దాదాపు 900 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. వీరిని తరలించేందుకు ప్రత్యేక రైళ్లు, బస్సులు వినియోగిస్తున్నారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక పోలీసు బలగాలు, వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సేవలు అందిస్తున్నారు. బాధిత కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
హేమమాలిని, రాజ్‌బబ్బర్ భవితవ్యం తేలేది రేపే
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికలు ఊపందకున్నాయి. రెండో దశలో ఎన్నికలు జరిగే 8 లోక్‌సభ స్థానాలకు 85 మంది వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి హేమాహేమీలు పోటీపడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజ్‌బబ్బర్, నిన్నటితరం నటి, బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్‌గా పేరుగాంచిన హేమామాలిని మరోసారి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. నాగిన(ఎస్సీ), అమ్రోహ, బులంద్షార్(ఎస్సీ), అలీగడ్, హత్రాస్(ఎస్సీ), ఫతేఫూర్ సిక్రీ, మధుర, ఆగ్రా(ఎస్సీ) లోక్‌సభ స్థానాలకు రెండో దశలో రేపు పోలింగ్ జరగనుంది. ఫతేపూర్ సిక్రీలో రాజ్‌బబ్బర్(కాంగ్రెస్), రాజ్‌కుమార్ చాహర్(బీజేపీ), శ్రీభగవాన్ శర్మ(బీఎస్పీ) మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. టెంపుల్‌టౌన్ మధుర నియోజకవర్గంలో బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఆర్ఎల్డీ నుంచి కున్వర్ నరేంద్ర సింగ్, కాంగ్రెస్ నుంచి మహేశ్ పాఠక్ బరిలో ఉన్నారు. అమ్రోహ స్థానం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ కన్వర్ సింగ్ తన్వార్, బీఎస్పీ నుంచి నిలబడిన కున్వర్ డానిష్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. కున్వర్ దానిష్ ఇటీవలే జనతాదళ్(సెక్యులర్) పార్టీ జనరల సెక్రటరీ పదవిని వదిలేసి బీఎస్పీలో చేరారు. ఇప్పుడు జరుగుతున్న 8 లోక్‌సభ స్థానాలన్నీ 2014లో బీజేపీ గెలిచినవే. ప్రస్తుతం ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి నుంచి బీజేపీ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. రెండో దశలో జరుగుతున్న 8 స్థానాలకు గానూ 6 స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాగిన, అమ్రోహ, బులంద్షార్, అలీగడ్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తున్నది. ఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలు వరసగా హత్రాస్, మధుర స్ధానాల్లో అభ్యర్థులను నిలిపింది. రెండో దశలో జరుగుతున్న ఎన్నికలకు గానూ 8,751 పోలింగ్ సెంటర్లలో 16,162 పోలింగ్‌బూత్‌లను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. -
ఎస్పీ-బీఎస్పీ కూటమిలో బీటలు
లక్నో(ఉత్తర్ ప్రదేశ్): ఎస్పీ-బీఎస్పీ సారధ్యంలో ఏర్పడిన ‘గట్బంధన్’ నుంచి నిశాద్ పార్టీ వైదొలగింది. మహారాజ్ గంజ్ స్థానం నుంచి తన పార్టీ చిహ్నంపై పోటీచేయడానికి కూటమి నుంచి ఒక ఏకాభిప్రాయం రాకపోవడంతో పాటు కూటమిలో తమను పక్కకు పెడుతున్నట్లుగా నిశాద్(నిర్బల్ ఇండియన్ షోషిట్ హమారా ఆమ్ దళ్) పార్టీ అధ్యక్షులు సంజయ్ నిశాద్ భావించినట్లుగా తెలిసింది. ఈ పరిణామాలతో మహారాజ్‌గంజ్ స్థానం నుంచి పార్టీ సొంత గుర్తుపై పోటీ చేయాలని సంజయ్ నిశాద్ భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. నిశాద్ పార్టీ అధ్యక్షులు సంజయ్ నిశాద్, ఆయన కుమారుడు ప్రవీణ్ నిశాద్(ప్రస్తుతం గోరఖ్‌పూర్ ఎంపీ సమాజ్‌వాదీ పార్టీ నుంచి) శుక్రవారం సాయంత్రం ఉత్తర్‌ప్రదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను కలిశారు. ఈ పరిణామాలతో నిశాద్ పార్టీ బీజేపీ కూటమిలో చేరుతున్నట్లు తెలుస్తోంది. మూడు దశాబాద్దాలుగా గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ హవానే సాగింది. వరసగా ఏడుసార్లు బీజేపీ అధ్యర్థులే విజయం సాధించారు. ఐదుసార్లు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యానాథే గెలిచారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో 2018లో గోరఖ్‌పూర్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ స్థానంలో ఎస్పీ అభ్యర్థిగా నిశాద్ పార్టీ అధ్యక్షులు సంజయ్ నిశాద్ కుమారుడు ప్రవీణ్ నిశాద్ బరిలోకి దిగారు. నిశాద్ పార్టీ సహకారంతో ఎస్పీ ఈ స్థానం గెలుచుకోగలిగింది. ఈ విజయంలో నిశాద్‌పార్టీ కీలకపాత్ర పోషించింది. ఈ విజయం తర్వాత ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో బద్దశత్రువులుగా ఉన్న ఎస్పీ,బీఎస్పీ పార్టీలు కూటమిగా ఏర్పడటానికి అవకాశాలు ఏర్పడ్డాయి. కొత్తగా బీజేపీ, నిశాద్ పార్టీ మధ్య ఏర్పడిన మైత్రిపై ఎస్పీ గోరఖ్‌పూర్ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్ యాదవ్ స్పందించారు. బీజేపీ, నిశాద్‌పార్టీ కలిసి పోటీ చేసినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలో గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం గెలిచామే కానీ నిశాద్ పార్టీ నాయకత్వంలో కాదని వ్యాఖ్యానించారు. -
‘‘చౌకీదార్’ అని తగిలించుకోనందుకు టికెట్ ఇవ్వలేదు’
లక్నో : 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ‘మైభీ చౌకీదార్’ ప్రచారాన్ని ఉదృతం చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బీజేపీ నాయకులంతా ట్విటర్ అకౌంట్లో తమ పేరుకు ముందు చౌకీదార్ అని తగిలించుకుంటున్నారు. అయితే తాను పేరుకు ముందు ‘చౌకీదార్’ అని తగిలించుకోనందుకే పార్టీ తనకు టిక్కెట్ నిరాకరించిందని బీజేపీ ఎంపీ అన్షుల్ వర్మ ఆరోపించారు. బుదవారం బీజేపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన అన్షుల్ వర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ట్విటర్లో నా పేరుకు ముందు ‘చౌకీదార్’ అని తగిలించుకోలేదు. అదికాక ఈ మధ్య పార్టీ చేస్తోన్న కొన్ని పనులను వ్యతిరేకించాను. ఆలయ ప్రాంగణంలో బీజేపీ నాయకులు మద్యం సరఫరా చేయడాన్ని తప్పు పట్టాను. అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడాను. అందువల్లే నాకు టికెట్ ఇవ్వలేదు. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. దీని గురించి సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సైతం లేఖ రాశాను. కానీ ఆయన స్పందించలేద’ని అన్షుల్ వర్మ తెలిపారు. అంతేకాక బీజేపీలో నిరంకుశత్వం రాజ్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. తాను ఎస్పీలోకి ఎలాంటి షరతులు లేకుండా చేరానని అన్షుల్ తెలిపారు. అంతేకాక రానున్న ఎన్నికల్లో ఎస్పీ - బీఎస్పీ కూటమి విజయం సాధిస్తుందని అన్షుల్ ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో అన్షుల్ వర్మ హర్దోయ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున విజయం సాధించారు. అయితే ఈసారి మాత్రం బీజేపీ ఈ టికెట్‌ను జై ప్రకాశ్ రావత్‌కు కేటాయించింది. -
ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రియాంక గాంధీ
-
ప్రారంభమైన ప్రియాంక గంగా యాత్ర
లక్నో : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గంగా యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ప్రయాగ్‌రాజ్‌లోని హనుమాన్ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం త్రివేణి సంగమం వద్దకు చేరుకుని.. అక్కడి నుంచి ‘గంగా యాత్ర’ను ప్రారంభించారు. మూడు రోజుల పాటు స్టీమర్ బోట్ ద్వారా జరిగే 'గంగా యాత్ర' తొలి రోజున ప్రియాంక గాంధీ ప్రయాగ్ రాజ్‌లో పర్యటిస్తారు. దీనిలో భాగంగా నిర్వహించే ‘బోట్ పే చర్చా’ కార్యక్రమంలో విద్యార్థులతో సమావేశమవుతారు. అనంతరం గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఆమె పార్టీ తరఫున ప్రచారం చెయ్యనున్నారు. ఆ ప్రాంతాల ప్రజలతో సమావేశం అయి వారి పరిస్థితులను అడిగి తెలుసుకుంటారు. Priyanka Gandhi Vadra at Triveni Sangam, to start 3-day long 'Ganga-yatra' from Chhatnag in Prayagraj to Assi Ghat in Varanasi, today. pic.twitter.com/A6gjtbod33 — ANI UP (@ANINewsUP) March 18, 2019 మొత్తం 140 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర ప్రయాగ్ రాజ్ నుంచి వారణాశిలోని అస్సీ ఘాట్ వరకు కొనసాగుతుంది. బుధవారం వారణాసిలోని కాశీ విశ్వనాథున్ని దర్శించుకుని.. అక్కడి ప్రజలతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొనడంతో యాత్ర ముగుస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. (ప్రియాంక ఎంట్రీతో మాకెలాంటి నష్టం లేదు..!) -
కార్పెట్ ఫ్యాక్టరీలో పేలుడు.. 10 మంది మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్ భడోహి జిల్లాలోని ఓ కార్పెట్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం సంభవించిన ఈ ప్రమాదంలో 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. కార్పెట్ ఫ్యాక్టరీలో అక్రమంగా బాణసంచా తయారు చేయడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. వివరాలు.. ఈ మధ్యాహ్నం కార్పెట్ ఫ్యాక్టరీ లోపల రహస్యంగా బాణాసంచా సామాగ్రి తయారుచేస్తుండగా పేలుడు సంభవించింది. దాంతో ఇంతకు ముందే భవనం లోపల భద్రపరిచిన టపాకాయలకు నిప్పు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగనట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి కార్పెట్ ఫ్యాక్టరీ భవనం పేకమేడలా కుప్పకూలి పోగా.. చుట్టుపక్కల ఉన్న మరో మూడు ఇళ్లు కూడా నేలమట్టమైనట్టు తెలిసింది. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఫొరెన్సిక్ నిపుణుల బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొన్నాయి. -
‘ఆ శబ్దాన్ని నేను కూడా విన్నాను’
లక్నో : ఆర్మీ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన మెసేజ్ చూడగానే షాక్ అయ్యింది నీర్జా. ఇదేలా సాధ్యం.. రెండు నిమిషాల ముందు వరకూ తనతో మాట్లాడిన మనిషి ఇప్పుడు చనిపోవడం ఏంటని ఆలోచిస్తుంది. ఇదంతా అబద్ధమైతే బాగుండని కోరుకుంటుంది. కానీ ఆమె కోరిక నెరవేరలేదు. ముష్కరులు దాడిలో ఆమె భర్త మరణించాడు. దాంతో గుండెలవిసేలా విలపిస్తోంది నీర్జా. గురువారం పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లలో నీర్జ భర్త ప్రదీప్ కుమార్ కూడా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన ప్రదీప్(30) సీఆర్పీఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. గురువారం దాడి జరగడానికి ముందు వరకూ కూడా ప్రదీప్ తన భార్య నీర్జాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. తన గారల పట్టి మాన్య ఏం చేస్తుందని అడిగాడు ప్రదీప్. సమాధానం చెప్పేలోపే అవతలి వైపు నుంచి ఏదో పెద్ద శబ్దం వినిపించింది నీర్జాకు. రెండు సెకన్లలో ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయ్యింది. ఏదైనా సమస్య వచ్చిందేమో.. తర్వాత తనే కాల్ చేస్తాడు అనుకుంది నీర్జా. కానీ మరో రెండు నిమిషాల్లో ఆర్మీ కంట్రోల్ రూమ్ నుంచి ఆమెకు ఓ సందేశం వచ్చింది. ‘సీఆర్పీఎఫ్ జవాన్ ప్రదీప్ వీర మరణం పొందార’నేది దానిది సారాంశం. ఇది వినగానే ఒక్కాసారిగా షాక్ అయ్యింది నీర్జా. ఇదేలా సాధ్యం.. ఇప్పటివరకూ నాతో ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి కేవలం రెండు నిమిషాల్లో మరణించడం ఏంటనుకుంది నీర్జా. కాసేపట్లో న్యూస్ చానెల్స్‌లో ఎక్కడ చూసిన ఈ వార్తలే. దాంతో తాను విన్నది నిజమే అని గ్రహించిన నీర్జా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన భర్త ఇక రాడని తెలిసి కన్నీరుమున్నిరుగా విలపిస్తుంది నీర్జా. ‘ప్రదీప్‌కు చిన్న కూతరు మాన్య అంటే చాలా ఇష్టం. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మాన్య గురించే అడిగాడు. నేను సమాధానం చెప్పేలోపే ఫోన్ కట్టయ్యింది. ఇంత దారుణం జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదం’టూ ఏడుస్తోంది నీర్జా. 2004లో సీఆర్పీఎఫ్లో చేరిన ప్రదీప్ 115వ బెటాలియన్‌లో విధులు నిర్వహించేవాడు. -
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ శకం మొదలైంది
-
‘నా భార్య చావుకు పోలీసులే కారణం’
లక్నో : తనపై అత్యాచారం చేసిన నిందితులను పోలీసులు నిర్దోషులుగా విడుదల చేయడంతో మనస్తాపం చెందిన మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యూపీ గొండా జిల్లా కెర్నల్‌గంజ్ ప్రాంతానికి చెందిన ఓ 35 ఏళ్ల మహిళపై అదే ప్రాంతానికి చెందిన శంకర్ దయాల్ శర్మ, అతని సోదరుడు అశోక్ కుమార్ గతేడాది ఆగస్టులో అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఊరుకోక వీడియో తీసి బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ వారు సరిగా విచారించకుండానే నిందితులను వదిలేశారు. ఆగ్రహించిన బాధితురాలి భర్త తమకు న్యాయం చేయాలంటూ గతేడాది లక్నోలోని యూపీ విధాన్ భవన్ ముందు ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టాడు. దాంతో ఈ కేసును జిల్లా క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు. వారు కూడా 15 రోజుల క్రితం నిందితులు శంకర్ దయాళ్ శర్మ, అశోక్ కుమార్‌లను నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేశారు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేని సదరు మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ విషయం గురించి ఆమె భర్త మాట్లాడుతూ.. ‘పోలీసులు ముందు నుంచి మా కేసు విషయంలో నిర్లక్ష్యంగానే ఉన్నారు. సరిగా విచారణ చేయలేదు. ఇక న్యాయం జరగదని భావించిన నా భార్య ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు పోలీసులు కారణమం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయడమే కాక తదుపరి విచారణకు ఆదేశించారు. Gonda: Rape victim allegedly committed suicide after she didn't get justice. Husband of the rape victim says, "Police didn't conduct a thorough investigation, she didn't get justice."SP Gonda says, "Further probe will be conducted, 2 police personnel have been suspended" (14 Jan) pic.twitter.com/I20ZGoNlcN — ANI UP (@ANINewsUP) January 15, 2019 -
ప్రారంభమైన కుంభమేళా..
అలహాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం కుంభమేళా ప్రారంభమైంది. ప్రయగ్‌రాజ్‌లో మంగళవారం ఉదయం 5.15 గంటలకు రాజయోగ స్నానాలతో కుంభమేళా ఉత్సవం మొదలైంది. అర్ధ కుంభమేళాకు 15 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభామేళా పూర్తయ్యేసరికి 4,300 కోట్ల రూపాయల వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఈ సారి భక్తులకు అక్షయ్ వాత్, సరస్వతి కుప్ల వద్ద పూజల చేసుకునే అవకాశం కల్పించారు. కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం యూపీ ప్రభుత్వం 100 హెక్టార్లలో గుడారాలు ఏర్పాటు చేసింది. మకర సంక్రాంతి సందర్భంగా నేటి నుంచి అధికారికంగా ప్రారంభమయిన ఈ మహా జనయజ్ఞం మార్చి 4వ తేదీ వరకు అంటే మహాశివరాత్రి దాకా కొనసాగనుంది. 12 ఏళ్లలో రెండు పర్యాయాలు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అర్థ కుంభ్‌గా పిలుస్తుంటారు. కానీ, యూపీ ప్రభుత్వం ఇటీవల ఆ పేరును కుంభ్‌గా మార్చింది. ఈ కార్యక్రమంలో అందరినీ ఆకర్షించే అఖాడాలు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్నారు. తాత్కాలిక మహానగరి సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు 50 రోజులపాటు సాగే ఈ క్రతువులో 12 కోట్ల మంది వరకు పాల్గొంటారని అంచనా. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగినట్లుగా భారీ ఏర్పాట్లు చేపట్టాయి. గంగా–యమున నదీ తీరాన 32 వేల హెక్టార్లలో ఏర్పాటు చేసిన కుంభ్‌నగరి ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరంగా రికార్డు కెక్కింది. ఇందులో 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 20 వంతెనలు, ఇంకా ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు..ఇలా ఒక నగరంలో ఉండే అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. కుంభ్ నగరిలోకి అత్యవసర సేవలందించే వాటిని తప్ప మిగతా అన్ని రకాల వాహనాలను నిషేధించారు. ఇక్కడ 15 రాష్ట్ర ప్రభుత్వాలు 261 కార్యక్రమాలను చేపట్టాయి. యూపీ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు 28, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆరు విభాగాలు ఈ కుంభమేళా నిర్వహణలో పాలుపంచుకుంటున్నాయి. 2013లో జరిగిన పూర్ణ కుంభమేళా కంటే దాదాపు మూడు రెట్లు నిధులు అంటే రూ.4,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అప్పటి కంటే ఇప్పుడు ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కానీ, చాలా లోపాలున్నాయి. మా టెంట్లో లైట్లు బిగించటానికి రూ.200 లంచం ఇవ్వాల్సి వచ్చిందని జునా అఖాడాకు చెందిన ఓ సాధువు తెలిపారు.లౌడ్ స్పీకర్లలో వినిపించే ఆధ్యాత్మిక గీతాలు.. దిగంబర దేహ మంతటా విబూధి రేఖలు, గంజాయి నింపిన చిలుంలను పీలుస్తూ నాగా సాధువులు చేసే ఆనంద నృత్యాలు.. వీటన్నిటినీ ఆసక్తిగా తిలకిస్తూ ఫొటోలు తీసుకునే విదేశీ యాత్రికులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. దీంతోపాటు ఇక్కడ మత రాజకీయాల ప్రస్తావన కూడా కనిపిస్తుంది. మేళా సందర్భంగా అయోధ్యలో రామాలయంపై వివిధ హిందుత్వ సంస్థలు ‘ఇప్పుడు నీవు రామ మందిరం నిర్మించ లేకుంటే ముందు తరాల వారికి ఎలా మొహం చూపిస్తావు’ అంటూ హోర్డింగులు ఏర్పాటు చేశాయి. 13 అఖాడాలు 8వ శతాబ్దానికి చెందిన హిందూ గురువు ఆదిశంకరాచార్య సనాతన ధర్మాన్ని రక్షించే లక్ష్యంగా సాధువులకు చెందిన వివిధ సంస్థలను ఏకతాటిపైకి తెచ్చేందుకు అఖాడాలను నెలకొల్పారు. ఒక్కో అఖాడా ఒక్కో సిద్ధాంతం, ఆచార సంప్రదాయాలను పాటిస్తాయి. ఆరాధన విధానాన్ని బట్టి శైవ, వైష్ణవ, ఉదాసీన్ అనే మూడు ముఖ్యమైన అఖాడాలున్నాయని అఖిల భారతీయ అఖాడా పరిషత్(ఏబీఏపీ) అధ్యక్షుడు నరేంద్ర గిరి తెలిపారు. మొత్తం 13 అఖాడాల్లో ఏడు శైవ, మూడు వైష్ణవ, 2 ఉదాసీన, ఒక సిక్కు అఖాడాలున్నాయని తెలిపారు. అఖాడా అంటే అఖండం, విడదీయరానిదని అర్థం అని ఆయన వివరించారు. జునా అఖాడా అతి ప్రాచీనమైంది, అన్నిటి కంటే పెద్దదిగా చెబుతుంటారు. జన వాక్కు ‘సౌకర్యం, అసౌకర్యాల గురించి ఆలోచించొద్దు. ఆ గంగామాతను స్మరించుకోండి. మీ కష్టం, అలసట అంతా దూరమవుతుంది..’ అన్నారు కనౌజ్ నుంచి కుంభ్నగరికి చేరుకున్న ప్రమోద్ ప్రకాశ్(55) అక్కడున్న మిగతా వారిని చూపిస్తూ. ఈయన బరువైన మూడు బ్యాగులను మోసుకుంటూ స్థానిక రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడి దాకా నడిచి వచ్చారు. ‘స్వచ్ఛమైన భక్తిభావం ఇక్కడి వారిలో చూస్తున్నాం. కుంభమేళా నిర్వహణ కూడా చాలా బాగుంది. మేం మాటల్లో చెప్పలేం. ఈ అద్భుతాన్ని ఎవరైనా చూసి నమ్మాల్సిందే. ఇంతపెద్ద కార్యక్రమం, అసంఖ్యాక జనం, కొంత గందరగోళం అనిపించినా, ప్రతి ఒక్కటీ సజావుగా సాగిపోతోంది. వీటన్నిటి వెనుకా ఏదో అతీతశక్తి ఉంది’ అన్నారు ఇటలీ నుంచి వచ్చిన అలాసియో దంపతులు. పిల్లలు తప్పిపోకుండా ట్యాగ్లు కుంభమేళా సందర్భంగా తప్పి పోయిన పిల్లలను గుర్తించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్)ట్యాగ్‌లను అందజేస్తున్నారు. వొడాఫోన్ కంపెనీ సహకారంతో 40వేల ట్యాగ్‌లను సమకూర్చుకున్నట్లు డీఐజీ వివరించారు. అత్యంత పవిత్రమైన 6 త్రివేణీ సంగమంలో స్నానమాచరించేందుకు పవిత్రమైనవి ఆరు రోజులు. అవి మకర సంక్రాంతి పర్వదినం కాగా, పౌష్ పూర్ణిమ(జనవరి 21), మౌని అమావాస్య(ఫిబ్రవరి 4), వసంత పంచమి(ఫిబ్రవరి 10), మాఘి పూర్ణిమ (ఫిబ్రవరి 19), ఆఖరిది మార్చి 4వ తేదీ మహాశివరాత్రి. కాగా, వీటిలో మొదటి, ఆఖరి రోజులను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ రోజుల్లో వేకువజామున 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు స్నానం చేయడం శుభప్రదంగా చెబు తారు. భద్రత నీడలో కుంభమేళా సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు డీజీపీ అభినయ్ పాండే తెలిపారు. మేళాలో బందోబస్తు కోసం 20వేల పోలీసులు, 6 వేల హోంగార్డులు, 40 పోలీస్ స్టేషన్లు, 40 ఫైర్ స్టేషన్లు, 80 కంపెనీల కేంద్ర బలగాలు, ఇతర బలగాలను మోహరించినట్లు చెప్పారు. 30 మహిళా పోలీస్స్టేషన్లు, సంఘటన జరిగిన 10 నిమిషాల్లోనే చేరుకునేలా 317 పోలీస్ వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. డ్రోన్ కెమెరాలు, వాచ్ టవర్లు, బ్యాగేజీ స్కానర్లు, ఆధునిక సమాచార వ్యవస్థను నెలకొల్పామన్నారు. ‘1, 200 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర కమాండ్–కంట్రోల్ రూం నెలకొల్పాం. భారీగా జనం గుమికూడినా, తొక్కిసలాటలు జరిగే అవకాశమున్నా వెంటనే గుర్తించేందుకు వీడియో అనలిటిక్స్‌ను వినియోగిస్తున్నాం. ఉగ్రవాదులు, అనుమానితులను గుర్తించేందుకు త్రినేత్ర యాప్‌ను వాడుకలోకి తెచ్చాం’ అని అన్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సభ్యులు -
కుంభమేళా క్యాంప్ వద్ద అగ్ని ప్రమాదం
లక్నో : మరో 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళా ఉత్సవాలు ఘనంగా ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. అయితే కుంభమేళా ప్రారంభం కంటే ముందే ఓ అపశృతి చోటు చేసుకుంది. ప్రయాగ్ రాజ్ కుంభ మేళ క్యాంప్ వద్ద సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. వివరాలు.. దిగంబర్ అకాడ శిబిరంలో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అగ్ని ప్రమాదంతో అక్కడి తాత్కాలిక నిర్మాణాలు కొన్ని కూలిపోయాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రేపటి నుంచి కుంభమేళా ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. #WATCH Fire fighting operations underway at a camp of Digambar Akhada at #KumbhMela in Prayagraj after a cylinder blast. No loss of life or injuries reported. pic.twitter.com/qcbh8IPl5Y — ANI UP (@ANINewsUP) January 14, 2019 -
చనిపోయిన వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేశారు..!
లక్నో : చనిపోయిన వ్యక్తికి ట్రాన్సఫర్ ఆర్డర్ ఇచ్చి రికార్డ్ సృష్టించారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. వివరాలు.. సత్య నారాయణ సింగ్ అనే వ్యక్తి నెల రోజుల క్రితం మరణించాడు. అయితే చనిపోయే నాటికి అతను డీఎస్పీగా పని చేసున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం యూపీ పోలీసు ఉన్నతాధికారులు ట్రాన్సఫర్ లిస్ట్ తయారు చేశారు. అయితే ఇందులో మరణించిన సత్య నారాయణ సింగ్ పేరును కూడా చేర్చి.. జాబితాను ప్రకటించారు. పొరపాటును గుర్తించిన యూపీ డీజీపీ ట్విటర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ‘ఈ రోజు ప్రచురించిన ట్రాన్సఫర్ లిస్ట్‌లో మరణించిన డీఎస్పీ సత్యనారాయణ పేరు ఉండటం చాలా బాధకరం. దాన్ని క్యాన్సల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాను. కానీ ఇలాంటి తప్పులను సహించకూడదు. డిపార్ట్మెంట్ హెడ్‌గా ఈ విషయం గురించి క్షమాపణలు చెప్తున్నాను. ఇందుకు బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాక ఇక మీదట ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానం’టూ డీజీపీ ట్వీట్ చేశారు. -
భళా.. కుంభమేళా...
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మకర సంక్రాంతి నుంచి మహా శివరాత్రి వరకు సాగే ఈ కుంభమేళాకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. జనవరి 15 నుంచి మార్చి 4 వరకు జరిగే ఈ అర్ధ కుంభమేళాలో సాధారణ భక్తులతోపాటు వీఐపీలు, వీవీఐపీలు, ఎన్నారైల కోసం వేర్వేరుగా ఏర్పాట్లు చేసినట్లు ఉత్తరప్రదేశ్ సర్కారు ప్రకటించింది. అలహాబాద్‌ను పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన తర్వాత జరిగే తొలి అర్ధ కుంభమేళా ఇదే. దీంతో యోగి ఆదిత్యనాథ్ సర్కారు కూడా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలకు పూర్తిగా కార్పొరేట్ కళను అద్దింది. గంగ, యమున నది ఒడ్డున 100 హెక్టార్ల స్థలంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో ‘టెంట్ సిటీ’ని నిర్మించింది. 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 22 తాత్కాలిక వంతెనలు, 40 వేల ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసింది. ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్లు వెలిశాయి. కుంభమేళా భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా 1.25 లక్షల టాయిలెట్స్‌ను నిర్మించారు. కుంభమేళా జరిగే ప్రాంతం పరిశుభ్రంగా ఉండటం కోసం 20వేల చెత్తడబ్బాలను ఏర్పాటు చేశారు. ఈ పండుగను అపురూపమైన సాంస్కృతిక వారసత్వ ప్రతీకగా ఇప్పటికే యునెస్కో గుర్తించింది. దేశవ్యాప్తంగా 6 లక్షల గ్రామాలున్నాయని.. ఈ గ్రామాల నుంచి కనీసం ఒక్కొక్కరైనా ఈసారి అర్ధ కుంభమేళాకు హాజరవ్వాలని యోగి సర్కార్ పిలుపునిచ్చింది. మొత్తంగా 71 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఇప్పటికే త్రివేణి సంగమాన్ని సందర్శించి గంగానదీ తీరంలో తమ దేశాల జెండాలను ఎగురవేశారు. పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులే కాకుండా, పర్యాటకుల్ని కూడా ఆకర్షించేలా ఫైవ్‌స్టార్ హోటల్స్ ఉండే సదుపాయాలతో 2 వేల గుడారాలను ఏర్పాటు చేశారు. ఎన్నారైలు బస చేయడానికి విల్లాలు, మధ్యతరగతి వారికి కాటేజీలు, సామాన్య భక్తుల కోసం డార్మెటరీలు ఇలా అన్ని తరగతుల వారు బస చేసేలా టెంట్ సిటీని రూపొందించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ కుంభమేళా అంటే! ప్రతీ పన్నెండేళ్లకు ఒకసారి భక్తులంతా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించే పుణ్య కార్యక్రమమిది. కుంభరాశిలో ఈ ఉత్సవం జరుగుతుంది. అందుకే దీనిని కుంభమేళా అని పిలుస్తారు. ప్రతీమూడేళ్లకి ఒకసారి హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్‌లలో కుంభమేళా జరుగుతుంది. అంటే పన్నెండేళ్లకి ఒకసారి ఒక్కో పట్టణంలో నిర్వహించడానికి అవకాశం వస్తుంది. ఆరేళ్లకోసారి జరిగే వేడుకని అర్ధ కుంభమేళా అని, పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఉత్సవాన్ని పూర్ణ కుంభమేళా అని, 144 ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకల్ని మహా కుంభమేళా అని పిలుస్తారు. సూర్యుడు, బృహస్పతుల గతుల ఆధారంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. మేషరాశిలో బృహస్పతి, మాఘమాసంలో మకరరాశిలోకి సూర్యుడు, చంద్రుడు ప్రవేశించినప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతుంది. ఇప్పుడు నిర్వహిస్తున్నది ఆరేళ్లకి ఒకసారి జరిగే అర్ధకుంభమేళా. కుంభమేళా జరిగే సమయంలో మకర సంక్రాంతి, మాఘ పుష్య పౌర్ణమి, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో గంగ, యమున, సరస్వతి సంగమించే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని, పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. సంక్రాంతి, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి వంటి కొన్ని ప్రత్యేకమైన దినాల్లోనే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఒక రాత్రి బసకే రూ. 40 వేలు కుంభమేళా కోసం వచ్చే భక్తులు బస చేయడం కోసం ఇంద్రప్రస్థం, కల్పవృక్ష, కుంభ కాన్వాస్, వేదిక్ టెంట్‌సిటీ పేరుతో గుడారాలు నిర్మించారు. ఇంద్రప్రస్థం విల్లాలో ఒక రాత్రి బసకే రూ.40 వేలు వసూలు చేయనున్నారు. రెండు బెడ్రూమ్లు, ఒక లివింగ్ రూమ్, అటాచ్డ్ బాత్రూం సౌకర్యం ఉండే ఈ విల్లాల నుంచి గంగానది అందాలను వీక్షించవచ్చు. ఈ టెంట్ సిటీలో 200 లగ్జరీ టెంట్స్, 250 డీలక్స్ టెంట్స్ కూడా ఉన్నాయి. లగ్జరీ టెంట్స్‌లో ఒక రాత్రి బసకి రూ.16వేలు, డీలక్స్ టెంట్స్ రూ.12 వేలు వసూలు చేస్తారు. ఇక డార్మెటరీల్లో 650 రూపాయల నుంచి ఉన్నాయి. అడుగడుగునా భద్రత ప్రతీరోజూ లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 1,150 సీసీకెమెరాలు, 40 పోలీసు స్టేషన్లు, 62 పోలీసు పోస్టులు ఏర్పాటు చేశారు. 22,000– 24,000 మంది పారామిలటరీ జవాన్లు పహారా కాస్తారు. 11 తాత్కాలిక ఆసుపత్రులు భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా.. ఇబ్బందులు ఎదురుకాకుండా 11 తాత్కాలిక ఆసుపత్రులు నిర్మించారు. 100 పడకల ఆసుపత్రి, 30 పడకల ఆసుపత్రులు ఇందులో ఉన్నాయి. 170 మంది వైద్యులు, 100మంది నర్సులు సేవలందిస్తారు. 100 అంబులెన్స్‌లు, 4 ఎయిర్ అంబులెన్స్‌లు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. లాహిరి లాహిరిలో.. పర్యాటకరంగాన్ని ప్రోత్సహించేందుకు యోగి సర్కార్ ఈసారి కుంభమేళాలో ప్రత్యేకంగా పడవ ప్రయాణాన్ని ఏర్పాటు చేసింది. కాశీ నుంచి త్రివేణీ సంగమానికి భక్తులు పడవల్లోనే చేరుకోవచ్చు. గంగానదీ అందాలను ఆస్వాదిస్తూ 60 కిలోమీటర్ల దూరాన్ని గంటలోపే చేరుకోవచ్చు. ఇందుకోసం గంటకి 80 కిలోమీటర్ల వేగంతో నడిచే ఎయిర్‌బోట్లను ఏర్పాటు చేసింది. ఈ పడవల కోసం కాశీలో కాళీఘాట్, సరస్వతి ఘాట్, నైని బ్రిడ్జ్, సుజావన్ ఘాట్లను సిద్ధం చేసింది. సీఎల్ కస్తూర్బా, ఎస్ఎల్ కమ్లా అనే పెద్ద పడవలతో పాటు భక్తు ల రద్దీని బట్టి పలు చిన్న పడవలు రెండు పుణ్యక్షేత్రాల మధ్య తిరుగుతాయి. -
అక్రమ వేట కేసులో ప్రముఖ గోల్ఫ్ ప్లేయర్ అరెస్ట్
లక్నో : అక్రమంగా వేటాడుతున్నరనే కేసులో భారత గోల్ఫర్ జ్యోతి రంధావాను ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రంధావ వద్ద నుంచి ఏ - 22 రైఫిల్, వాహనం (హెచ్ఆర్26 డీఎన్ 5299)తో పాటు వేట సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కతెర్నియాఘాట్లోని మోతిపూర్లో రంధావకు వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ అనుమానాస్పదంగా వాహనం నడుతుపుతుండటంతో పోలీసులు రంధావాను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అతని వద్ద నుంచి అడవి పంది చర్మం, బైనాక్యులర్‌తో పాటు రంధావ పేరు మీద రిజిస్టర్ అయిన వాహనాన్ని కూడా సీజ్ చేశారు. రంధావాను ప్రస్తుతం కతెర్నియాఘాట్ జిల్లా అటవీ అధికారి విచారిస్తున్నారు. చట్ట పరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారత్ తరఫున ఒకప్పుడు అత్యుత్తమ గోల్ఫర్గా జ్యోతి రంధావ రికార్డులు సృష్టించారు. బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి బంధం ఎంతో కాలం నిలవలేదు. 2014లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది జ్యోతి రంధావ ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారారు. ఆసియా టూర్లో 8 టైటిళ్లు గెలిచారు. 2004లో యూరోపియన్ టూర్లో జానీ వాకర్ క్లాసిక్‌తో కలిసి అత్యుత్తమంగా రెండో స్థానంలో నిలిచారు. గోల్ఫ్ ప్రపంచకప్ టోర్నీల్లో 2005, 2007, 2008, 2009లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. -
‘సీతాదేవి అందుకు పూర్తి అర్హురాలు’
లక్నో : అఖండ భారతావనిని ఏకం చేసిన సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఐక్యతా విగ్రహం ఆవిష్కరణ అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ రాష్ట్రంలో శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. దాదాపు 221 మీటర్ల ఎత్తు ఉండే రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు యోగి తెలిపారు. రాముడి విగ్రహంతో పాటు సీతా దేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలంటూ యోగికి లేఖ రాశారు యూపీ కాంగ్రెస్ నాయకుడు కరణ్ సింగ్. ‘మీరు రాముడి విగ్రహాన్ని నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే నా అభ్యర్థన ఏంటంటే రాముడి విగ్రహం ఎత్తును తగ్గించడమే కాక శ్రీరామునితో పాటు సీతాదేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయండి. రామున్ని పెళ్లి చేసుకున్న తర్వాత సీతా దేవి అయోధ్య వచ్చారు.. కానీ కొద్ది రోజుల్లోనే శ్రీరామునితో కలిసి వనవాసం చేయడానికి అడవులకు వెళ్లారు. 14 ఏళ్లు అరణ్యవాసంలో ఉన్నారు. చివరకు రావణాసురుడు అమ్మను ఎత్తుకెళ్లాడు. ఆ రాక్షసుడి చెర నుంచి రాముడు సీతాదేవిని విడిపించాడు. కానీ అగ్ని పరీక్షలో నెగ్గినప్పటికి.. చివరకూ ఆ తల్లి మళ్లీ అడవుల పాలయ్యారు. అది గర్భవతిగా ఉన్న సమయంలో.. మొత్తంగా చాలా తక్కువ రోజులు మాత్రమే సీతాదేవి అయోధ్యలో ఉన్నారు. కానీ అయోధ్యలో ఉండటానికి ఆ తల్లికి పూర్తి అర్హత ఉంది. కనుక కేవలం రాముని విగ్రహాన్ని మాత్రమే కాక.. సీతారాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయండంటూ’ కరణ్ సింగ్ తన లేఖలో రాశారు. -
‘బులంద్‌షహర్ ఘటన ఓ ప్రమాదం మాత్రమే’
లక్నో : బులందషహర్‌లో జరిగింది మూక దాడి కాదు.. అది ఒక ప్రమాదం అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల కిత్రం బులంద్‌షహర్‌లో జరిగిన మూక దాడి ఘటనలో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనక రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తోన్న నేపథ్యంలో.. యోగి ఈ దాడిని ఒక ప్రమాదంగా ప్రకటించడమే కాక.. సరైన సమయంలో స్పందిచంలేదంటూ ఇద్దరు పోలీసు అధికారులను ట్రాన్సఫ్ర్ చేశారు. అడిషనల్ డీజీపీ ఎస్బీ షిరాద్కర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం యోగి ప్రభుత్వం సర్కిల్ ఆఫీసర్ సత్య ప్రకాష్ శర్మ, ఇన్ చార్జ్ ఆఫ్ ద పోలీస్ పోస్ట్ సురేష్ కుమార్‌లను ట్రాన్సఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గోరక్షక ముఠా రెచ్చిపోయింది. ఓ మతానికి చెందిన ప్రజలు ఆవును చంపేశారని ఆరోపిస్తూ రోడ్డును దిగ్బంధించి ఆందోళనకు దిగింది. ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి అక్కడకు చేరుకున్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా స్థానిక పోలీస్ ఔట్‌పోస్ట్‌తో పాటు పలు వాహనాలకు నిప్పంటించింది. ఈ ఘటనలో పోలీస్ ఇన్స్పెక్టర్తో పాటు మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. అయితే గతంలో ఈ దాడిని భారీ కుట్రగా పేర్కొన్న యోగి.. మాట మార్చి ఇది కేవలం యాక్సిడెంట్ అని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ దాడికి కారకులుగా భావిస్తూ పోలీసు అధికారులు 9 మందిని అరెస్ట్ చేశారు. కానీ ముఖ్యమైన కుట్రదారు యోగేష్ రాజా పరారీలో ఉండగా తాజాగా ఓ జవాను పేరు తెరమీదకు వచ్చింది. -
బీజేపీకి దళిత ఎంపీ రాం..రాం..
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. దళిత నాయకురాలు, న్యాయవాది, ఎంపీ సావిత్రి బాయి ఫూలే బీజేపీకి రాజీనామా చేశారు. సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని బహ్రెయిచ్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమాజాన్ని విభజించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, దేశ బడ్జెట్‌ను విగ్రహాలను నెలకొల్పడానికే ఖర్చుచేస్తోందని విమర్శించారు. గత కొంత కాలంగా బీజేపీ తీరుపై బహిరంగంగానే విమర్శిస్తున్న ఆమె.. అంబేద్కర్ వర్దంతి రోజునే ఆ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కూడా ఆరోపణలు చేశారు. హనుమంతుడు దళితుడంటూ యోగి వివాదానికి తెరదీశారని ఆగ్రహించారు. హనుమంతుడు కూడా మనిషేనని.. ఆయన కోతి కాదని.. దళితుడైనందుకు అవమానాన్ని ఎదుర్కొన్నారని తన అభిప్రాయాన్ని తెలిపారు. హనుమంతుడిని మనువాదులకు బానిసగా మార్చేశారు.. రాముడి కోసం ఆయన ఎంతో చేశారన్నారు. చివరికి హనుమంతుడికి ఓ తోకను తగిలించి ముఖానికి మసిపూసి కోతిగా ఎందుకు చిత్రీకరించారు అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో లబ్ది పొందేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ యోగిపై ధ్వజమెత్తారు. -
‘నా మాట అబద్ధమైతే ఉరి తీయండి’
లక్నో : అయోధ్య బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరాన్ని నిర్మించాలనే హిందూత్వ వాదుల కల ఇంకా వాస్తవ రూపం దాల్చనలేదు. ఈ లోపే ఢిల్లీలోని జామా మసీదును కూడా కూల్చివేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సాక్షి మహారాజ్. ఉత్తరప్రదేశ్ ఉన్నావోలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సాక్షి మహారాజ్ ‘నేను రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు చెప్పిన మొదటి మాట అయోధ్య, మధుర, కాశీలు ఒక్కటై ఢిల్లీలోని జామా మసీదును కూల్చివేయాలని చెప్పాను. ఎందుకంటే హిందూ ఆలయాలను నాశనం చేసి వాటి అవశేషాల మీదనే జామా మసీదును నిర్మించారు. కావాలంటే అక్కడ తవ్వి చూడండి.. మసీదు కింద మీకు హిందూ ఆలయ ఆనవాలు కనిపిస్తాయి. ఒకవేళ అలా జరగకపోతే నన్ను ఉరి తీయండం’టూ సంచలన వ్యాఖ్యలు చేశారు సాక్షి మహారాజ్. అంతేకాక మొఘలులు దేశంలోని హిందూ దేవాలయాలను కూల్చి వాటి స్థానంలో దాదాపు 3 వేల వరకూ మసీదులను నిర్మించారని ఆయన ఆరోపించారు. అయితే సాక్షి మహారాజ్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో హిందూ మహిళలను ఉద్దేశిస్తూ ఎక్కువమంది పిల్లలను కని మన మతాన్ని కాపాడండంటూ పిలుపునివ్వడమే కాక.. మూక దాడుల్లో ముస్లింలను చంపడాన్ని కూడా సమర్థించారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఇప్పటికే పార్టీలన్ని అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడుతున్నాయి. ఆర్ఎస్ఎస్, శివసేన పార్టీలు అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రారంభించే విధంగా ఆర్డినెన్స్‌ను పాస్ చేయాల్సిందిగా బీజేపీని డిమాండ్ చేస్తున్నాయి. -
కట్నం కోసం ఓ కసాయి భర్త..
లక్నో : కట్నం కోసం కట్టుకున్న భార్య నాలుకను కోసేశాడు ఓ ప్రబుద్ధుడు. 10 రోజుల క్రితం జరిగిన ఈ దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ జిల్లా బర్రా ప్రాంతానికి చెందిన ఆకాష్ అనే వ్యక్తి కట్నం కోసం భార్యను వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో చాలా రోజులుగా కట్నం విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే నవంబర్ 6న భార్యాభర్తల మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. ఆగ్రహంతో విచక్షణ కోల్పొయిన ఆకాష్ తన భార్య నాలుకను కోసేశాడు. ఈ విషయం బయటకు రాకుడదనే ఉద్దేశంతో.. 10 రోజుల పాటు ఆమెను ఇంట్లోనే నిర్భందించాడు. మొత్తానికి బాధితురాలి తండ్రి రావడంతో జరిగిన దారుణం వెలుగులోకొచ్చింది. అనంతరం తన తండ్రితో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆకాష్ తండ్రి పోలీసు హెడ్ కానిస్టేబుల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు ఆరోపించింది. దాంతో నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని ఎస్ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. -
ఆ నగరాల్లో మద్యం, మాంసం బంద్!
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో పలు నగరాల పేర్లు మార్చిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మరో సంచలనానికి సిద్దమయ్యాడు. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ను శ్రీ అయోధ్యగా మార్చిన యోగి ప్రభుత్వం ఇప్పుడు ఆ నగరాల్లో సంపూర్ణ మద్యం, మాంసం నిషేధం విధించడానికి సిద్దమైంది. ఈ మేరకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందిన ఆ రాష్ట్ర మంత్రి, శ్రీకాంత్ శర్మ మంగళవారం మీడియాకు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మధురలో ఈ తరహా నిషేదం విధించిందని, ఇప్పడు అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ల్లో కూడా నిషేదం విధించాలని ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయోధ్యలో మద్యం, మాంసం అమ్మడం శ్రీరామునికే అమర్యాదకమన్నారు. నగరాల పేర్లు మార్చడంపై దేశవ్యాప్తంగా యోగి ప్రభుత్వంపై విమర్శలొస్తున్నాయి. ప్రతిపక్షాలే కాకుండా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలు సైతం యోగిని తప్పుబడుతున్నాయి బీజేపీ పార్టీలో ఉన్న ముస్లిం ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు కూడా మారుస్తారా? అంటూ మిత్రపక్షం ఎస్బీఎస్పీ నేత, యోగి ఆదిత్యనాథ్ క్యాబినేట్లో మంత్రిగా పనిచేస్తోన్న ఓమ్ ప్రకాశ్ రాజ్‌భర్ సవాలు చేసిన విషయం తెలిసిందే. ఇక నగరాల పేర్ల మార్పుపై దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ కోర్టు కొట్టేసింది. పిటిషనర్ తొలుత రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది. -
ముస్లిం మంత్రుల పేర్లు మార్చగలరా..?
లక్నో : దేశవ్యాప్తంగా చారిత్రక నగరాల పేర్లను మార్చే సంప్రాదాయం ప్రారంభమయ్యింది. కొందరు దీన్ని స్వాగతిస్తుండగా.. ఎక్కువ మంది మాత్రం ఈ విషయం గురించి విమర్శలు చేస్తోన్నారు. ఈ క్రమంలో ముస్లిం పాలకుల పేర్ల మీద ఉన్న చారిత్రక నగరాల పేర్లు మారుస్తున్న బీజేపీ నాయకులు.. వారి పార్టీలో ఉన్న ముస్లిం ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు కూడా మారుస్తారా అంటూ బీజేపీ పార్టీ మిత్రుడు.. యోగి ఆదిత్యనాథ్ క్యాబినేట్లో మంత్రిగా పనిచేస్తోన్న ఓమ్ ప్రకాశ్ రాజ్‌భర్ సవాలు చేశారు. కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్ పేరును శ్రీ అయోధ్యగా మార్చిన సంగతి తెలిసిందే. ఇవేకాక అహ్మదాబాద్, ఔరంగబాద్, హైదరాబాద్, అగ్రా పేర్లను మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఓమ్ ప్రకాశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు అంశాల గురించి ప్రశ్నించారు. మొఘలుల పేర్లతో ఉన్నాయని చెప్పి మొఘల్‌సరాయి, ఫైజాబాద్ పేర్లను మార్చారు. మరి జాతీయస్థాయిలో ఉన్న కేంద్ర మంత్రులు, యూపీ మంత్రులైన షహ్నవాజ్ హుస్సెన్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, మొహ్సిన్ రాజాల వంటి ముస్లిం నాయకుల పేర్లను కూడా మార్చగలరా అంటూ సవాల్ విసిరారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడకుండా ఉండటానికి.. వారి దృష్టి మరల్చడానికే బీజేపీ ఇలాంటి డ్రామాకు తెరలేపిందంటూ విరుచుకుపడ్డారు. ముస్లింలు మన కోసం కొన్ని మహోన్నతమైన వాటిని వదిలి వెళ్లారు. ఎర్రకోట, తాజ్‌మహల్‌ను నిర్మించిందేవరు? అంటూ ఆయన ప్రశ్నించారు. -
‘నా దగ్గర గ్రెనేడ్ ఉంది.. ఎయిర్‌పోర్ట్‌ని పేల్చేస్తాను’
లక్నో : అమెరికా మియామి ఎయిర్‌పోర్ట్‌ని పేల్చేస్తానంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తోన్న 18 ఏళ్ల ఉత్తరప్రదేశ్ యువకున్ని ఆ రాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్(ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేశారు. వివరాలు.. యూపీకి చెందిన సదరు నిందుతుడు కొన్ని రోజుల క్రితం 1000 అమెరికన్ డాలర్లు విలువ చేసే బిట్ కాయిన్స్‌ని కొన్నాడు. ఈ క్రమంలో అతడు మోసపోయాడు. దాంతో ఈ విషయం గురించి అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేశాడు. కానీ వారి నుంచి అతనికి సరైన సమాధానం లభించలేదు. దాంతో విసుగు చెందిన సదరు యువకుడు మియామి విమానాశ్రయానికి బెదిరింపు ఫోన్ కాల్స్ చేయడం ప్రారంభించాడు. గత నెల 2, 31 తేదీలలో వరుస కాల్స్ చేశాడని అధికారులు తెలిపారు. ‘నేను మియామి విమానాశ్రయాన్ని పేల్చేస్తాను. నా దగ్గర ఏకే 47 గన్, గ్రెనేడ్, సూసైడ్ బెల్ట్ ఉన్నాయి. వాటితో మీ అందరిని చంపేస్తాను’ అంటూ మియామి విమానాశ్రయ అధికారులకు ఇంటర్నెట్ ద్వారా వాయిస్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం గురించి ఎయిర్పోర్ట్ అధికారులు యూపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐపీ అడ్రెస్ ట్రేస్ చేసి నిందితున్ని గుర్తించారు. బిట్‌కాయిన్స్ కొని మోసపోయిన తాను ఆ కోపంలో విమానాశ్రయానికి ఫోన్ చేసి బెదిరించినట్లు నిందుతుడు విచారణలో ఒప్పుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సదరు యువకుడి మీద కేసు నమోదు చేసినట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. -
వైరల్ వీడియో : ఎస్సైపై బీజేపీ నేత దాష్టీకం
లక్నో : ఇన్నాళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పోలీస్ అధికారుల మీద దాడి చేయడం చూశాం. కానీ ఈ మధ్య అధికార పార్టీ నాయకలు కూడా పోలీస్‌ల మీద దాడి చేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీడియోలో ఉన్న దాని ప్రకారం బీజేపీ పార్టీకి చెందిన కౌన్సిలర్ మనీష్ డ్యూటీలో ఉన్న ఎస్సై మీద చేయి చేసుకున్నారు. వివరాలు.. సదరు ఎస్సై ఓ మహిళా న్యాయవాదిని తీసుకుని మనీష్ హోటల్‌కి వచ్చాడు. ఆ సమయంలో ఎస్సైకి, వెయిటర్‌కి మధ్య వివాదం జరిగింది. దాంతో మనీష్ సదరు ఎస్సైపై పలు మార్లు చేయి చేసుకున్నారు. అంతటితో ఊరుకోక ఎస్సైని బూతులు తిట్టడం ప్రారంభించాడు. ప్రసుత్తం ఈ కౌన్సిలర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
బిగ్ బీ పెద్ద మనుసు
తెరపైనే కాదు నిజ జీవితంలోను సూపర్ స్టార్‌నే అని నిరూపించుకున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. రుణాల ఊబిలో కూరుకుపోతున్న రైతన్నలు ఆదుకునేందుకు ముందుకు వచ్చారు అమితాబ్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 850కి పైగా రైతుల రుణాలను తాను తీరుస్తానంటూ బిగ్ బీ ప్రకటించారు. ఈ సందర్భంగా అమితాబ్ ‘మన కోసం త్యాగాలు చేస్తున్న రైతన్నలను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలని కోరుకుంటున్నాను. గతంలో ఆంధ్ర, విదర్భకు చెందిన రైతుల రుణాలు మాఫీ చేశాను. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ రైతుల రుణాలు మాఫీ చేయాలని భావిస్తున్నాను అని తెలిపారు. అంతేకాక ‘యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుపేద రైతులను మేము గుర్తించాము. వారి మొత్తం రుణాలూ కలిసి రూ.5.5 కోట్ల రూపాయలుగా తెలిసింది. ఈ మొత్తాన్ని నేను చెల్లించాలని భావిస్తున్నాను. మనకోసం ఎనెన్నో త్యాగాలు చేస్తున్న అన్నదాతలకు నాకు తోచిన ఈ చిన్న సాయం చేయడం ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చే విషయం’ అని ఆయన తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. వ్యభిచార గృహాల్లో ఉన్న వారి కోసం... కేబీసీ కరంవీర్‌లో కనిపించిన అజీత్‌సింగ్‌కు కూడా సాయం అందచేస్తానని బిగ్ బీ తెలిపారు. ఎంతో మంది యువతులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టివేశారు. వారంతా చాలా దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. వారి పునరావాసం, రక్షణల కోసం పాటుపడుతున్న అజీత్‌సింగ్‌కు తాను శనివారం చెక్కును పంపనున్నట్లు అమితాబ్ ప్రకటించారు. -
శివ్‌పాల్ యాదవ్‌కు జడ్ క్యాటగిరి భద్రతా
లక్నో : సమాజ్‌వాది సెక్యులర్ మోర్చా స్థాపకుడు శివ్‌పాల్ యాదవ్‌కు జడ్ ప్లస్ క్యాటగిరి భద్రతా కల్పించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. శివ్‌పాల్ యాదవ్‌కు ముప్పు ఉందని ఇంటిలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చిన నేపథ్యంలో యోగి, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఖాళీ చేసిన బంగ్లాతో పాటు.. హై లెవల్ భద్రత కల్పించారు. ఇప్పటివరకూ యూపీలో ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి ప్రతిపక్ష నేతలకు మాత్రమే జడ్ ప్లస్ క్యాటగిరి భద్రతా కల్పిస్తున్నారు. ఇప్పుడు వీరి కోవలోకి శివ్‌పాల్ యాదవ్ చేరారు. ప్రతిపక్ష నేతకు అధికార బంగ్లాతో పాటు, జడ్ ప్లస్ కేటగిరి భద్రతాను కల్పించడంతో ప్రతిపక్షాలు సీఎం యోగిపై నిప్పులు చెరుగుతున్నారు. 2019 ఎన్నికల్లో శివ్‌పాల్‌ని బీజేపీలో చేర్చుకోవడం కోసమే యోగి ప్రభుత్వం ఇలాంటి గిమిక్కులు ప్రదర్శిస్తోందని విమర్శిస్తున్నాయి. ఈ విషయం గురించి శివ్‌పాల్ ‘నేను ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. మాజీ మంత్రిని కూడా. ఇంటిలిజెన్స్ బ్యూరో నాకు ముప్పు ఉందని ఇచ్చిన రిపోర్టు ప్రకారమే ప్రభుత్వం నాకు ఈ బంగళాను కేటాయించింది’ అని తెలిపారు. ప్రస్తుతం శివ్‌పాల్‌కు లాల్ బహదూర్ శాస్త్రీ మార్గ్‌లో ఉన్న బంగాళను కేటాయించారు. గతంలో ఈ బంగళాను మాయావతికి కేటాయించారు. -
‘డిగ్గి.. యూపీలో తెలుగు మాట్లాడతారా..?’
న్యూఢిల్లీ : బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విషయం అయితే చాలు.. అది నిజమో కాదో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఆనక అది కాస్తా తప్పుడు సమాచారం అని తెలడంతో విమర్శల పాలవ్వడం పరిపాటి అయ్యింది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌కి. తాజాగా మరోసారి నెటిజన్ల చేతిలో విమర్శల పాలవుతున్నారు దిగ్విజయ్ సింగ్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చేసిన ప్రయత్నం కాస్తా రివర్సవ్వడంతో తలపట్టుకున్నారు డిగ్గి రాజా. విషయం ఏంటంటే దిగ్విజయ్ సింగ్ తన ట్విటర్లో నిరుపయోగంగా పడి ఉండి శిథిలావస్థకు చేరుకున్న 108 వాహనాల ఫోటోను షేర్ చేశారు. ఫోటోతో పాటు యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశిస్తూ ‘యోగి జీ.. మీరు ఉత్తరప్రదేశ్‌కు ఏం చేశారు..? అఖిలేశ్ యాదవ్ హాయాంలో ప్రారంభించిన 108, 102 వాహనాలను మీరు ఇలా నిరుపయోగం చేసి దుమ్ము కొట్టుకుపోయే స్థితికి తీసుకోచ్చారు. ప్రజల ఆరోగ్యానికి మీరు ఇచ్చే ప్రాముఖ్యత ఇదేనా’ అంటూ ట్వీట్ చేశారు. ये उत्तर प्रदेश की हालत क्या कर दी योगी जी ने, अखिलेश यादव जी द्वारा चलवाई गई 108,102 एम्बूलेंस खड़ी जंग खा रही है और जनता अपने बीमार परिजनों को ठेलो पर अस्पताल ले जा रही है॥ #वाह_योगी_जी_वाह# #बेशरमी_की_भी_हद_होती_है# रजत यादव pic.twitter.com/zWJr8CugHY — digvijaya singh (@digvijaya_28) October 3, 2018 కానీ అసలు విషయం ఏంటంటే ఈ అంబులెన్స్‌లు ఆంధప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి. తొలుత రజత్ యాదవ్ అనే వ్యక్తి షేర్ చేసిన ఈ ఫోటోను కాస్తా దిగ్విజయ్ సింగ్ కాపీ చేసి తన ట్విటర్లో షేర్ చేశారు. యోగి ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామనుకుని ఆయనే నవ్వుల పాలయ్యారు. దిగ్విజయ్ ట్వీట్ చేసిన ఫోటో చూసిన నెటిజన్లు ‘ఉత్తరప్రదేశ్‌లో తెలుగు మాట్లాడతారా డిగ్గి’ అంటూ కామెంట్ చేశారు. అంతేకాకా ‘దిగ్విజయ్ ఒక అబద్దాల కోరు’ అంటూ విమర్శిస్తున్నారు. గతంలో కూడా దిగ్విజయ్ సింగ్ పగుళ్లు వచ్చిన ఓ మెట్రో పిల్లర్ ఫోటోను షేర్ చేస్తూ ‘భోపాల్ రైల్వే బ్రిడ్జి పరిస్థితి ఇది’ అంటూ ట్వీట్ చేశారు. ఆనక అది కాస్తా పాకిస్తాన్‌కు చెందిన మెట్రో పిల్లర్‌గా తెలడంతో తన పొరపాటుకు క్షమాపణలు చెప్పారు.