అమానుష ఘటన: భార్యను విద్యుత్‌ స్థంబానికి కట్టి చితకబాది...వీడియో వైరల్‌ | Viral Video: Woman Tied To An Electric Pole And Beaten Up By A Man | Sakshi
Sakshi News home page

Viral Video: అమానుష ఘటన: భార్యను విద్యుత్‌ స్థంబానికి కట్టి చితకబాది...

Published Thu, Jul 21 2022 1:12 PM | Last Updated on Thu, Jul 21 2022 1:12 PM

Viral Video: Woman Tied To An Electric Pole And Beaten Up By A Man - Sakshi

భార్యను విద్యుత్‌ స్థంభానికి కట్టి చితకబాదుతున్న భర్త

ఉత్తరప్రదేశ్‌లో ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రబుద్ధుడు భార్యను నడిరోడ్డుపై దారుణంగా చితకొట్టాడు. చుట్టూ ఉన్నవాళ్లంతా ఈ ఘటనను వీడియో తీస్తూ కూర్చున్నారే తప్ప అడ్డుకోలేదు. సదరు మహిళను ఈడ్చుకుంటూ లాక్కెళ్లి మరీ హింసించాడు. ఈ ఘటన తాలుకా వీడియో ప్రస్తుతం సోషల్‌ మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతుంది. అతని దురుసు ప్రవర్తనను చూసి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

అసలేం జరిగిందంటే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...కుసుమా దేవి అనే మహిళను ఆమె భర్త శ్యాంబిహారి విద్యుత​ స్థంభానికి కట్టి దారుణాతి దారుణంగా చితకొట్టాడు. అక్కడితో ఆగకుండా ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మరీ కొట్టడం ప్రారంభించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అర్సేనా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని స్థానికుల సెల్‌ ఫోన్‌లో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

దీంతో ఈ వీడియోని చూసిన పోలీసులు రంగంలోని దిగి విచారించగా...బాధితురాలు కుసమా దేవి, నిందితుడు శ్యాంబిహారిగా  గుర్తించారు. ఈ మేరకు బాధితురాలు తన భర్త శ్యాంబిహారి, అతని తల్లి బర్ఫాదేశి తనను నిర్బంధించి మరీ హిసించారని పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐతే నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు.

(చదవండి: నిత్యపెళ్లికొడుకు మామూలోడు కాదు.. 13 మందిని శారీరకంగా వాడుకొని.. )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement