beaten up
-
కోల్‌కతా: పేషెంట్ కుమారుడిపై దాడి.. భద్రతపై జూడాల ఆందోళన
కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం హాస్పిటల్‌లోని ఓ రోగి కుమారుడిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఇవాళ(ఆదివారం) ఉదయం ఆస్పత్రిలోకి చొరబడి ఒక రోగి బంధువుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఆర్జీ కర్ ఘటనకు వ్యతిరేకంగా, డాక్టర్ల భద్రతా చర్యల గురించి జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేస్తున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.‘‘ఉదయం 8 గంటల సమయంలో 10-15 మంది వ్యక్తులు మోటారుబైక్‌లపై వచ్చి ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలోని ట్రామా కేర్ సెంటర్‌కు చొరబడి, ఈ రోజు డిశ్చార్జ్ కావాల్సిన బంకురాకు చెందిన రోగి కుమారుడు సౌరవ్ మోదక్పై దాడి చేశారు. మోదక్‌కు తీవ్రగాయాలవడంతో అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు’’ అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.Mob attack on patient's relatives at Trauma Care Centre of SSKM Hospital, Kolkata. Police once again mere spectators! This is the state of security and healthcare safety in a top government medical college like SSKM. Shame! What will the political slaves of TMC say now? Or are… pic.twitter.com/E71IpS34aq— Dr. Abhinaba Pal (@abhinabavlogs) October 13, 2024 జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేస్తున్న తరుణంలో.. ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేశామనే సీఎం మమమతా ప్రభుత్వ భరోసాపై ఈ దాడి ఘటన తీవ్ర అనుమానాలకు తావిస్తోందని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. ఆసుపత్రి భద్రతా వ్యవస్థ వైఫల్యానికి ఈ ఘటన స్పష్టమైన ఉదాహరణ అని ఓ జూనియర్ డాక్టర్ అన్నారు. ఎస్ఎస్కేఎం వంటి పెద్ద ఆసుపత్రిలో ఇటువంటి దాడి సంఘటన జరిగితే.. భద్రతను కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం నిబద్ధతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని తెలిపారు.ఇక.. ఈ దాడిలో గాయపడిన వ్యక్తి ట్రామా కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిపై జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
బీజేపీకి ఓటేసినందుకు దాడి.. భద్రతకు సీఎం భరోసా
భోపాల్: బీజేపీకి ఓటేసినందుకు బావ వరుస అయ్యే వ్యక్తి తనపై దాడి చేశాడని ఓ ముస్లిం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెహోర్‌లోని అహ్మద్‌పూర్ ప్రాంతానికి చెందిన సమీనా బీ అనే మహిళ డిసెంబ్ 4న బీజేపీ విజయం సాధించినందుకు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇదంతా గమనించిన జావేద్ ఖాన్ బీజేపీకి ఎందుకు ఓటు వేశావంటూ వేధించటం మొదలుపెట్టాడు. దుర్భషలాడిన తన బావ జావేద్‌ను ఆమె ప్రశ్నించగా.. అతడు ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆపై బీజేపీ మద్దతుగా నిలిస్తే ఊరుకోనని ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఇచ్చిన ఫిర్యాదుతో సెహోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అయితే ఆమె జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీన్ సింగ్‌ను కూడా కలిసి తనపై దాడి చేసిన జావేద్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తెలిసిన సీఎం శీవరాజ్ సింగ్ చౌహాన్ ఆమెను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారు. ఆమె తన పిల్లలతో సీఎం చౌహాన్ కలిసి.. తాను బీజేపీ ఓటు వేసినందుకు తన బావ జావేద్ దాడి చేసినట్లు తెలిపారు. జావేద్ నుంచి తమకు భద్రత కల్పించాలని ఆమె సీఎంను కోరారు. సీఎంను కలిసిన అనంతరం సమీనా బీ మీడియాతో మాట్లాడుతూ.. తనకు, తన పిల్లలకు భద్రత కల్పించాలని సీఎం కోరినట్లు తెలిపారు. దానికి సీఎం చౌహాన్ సానుకూలంగా స్పందిస్తూ.. తన పిల్లల పూర్తి భద్రతకు హామీ ఇచ్చారని తెలిపారు. ఓటు ఎవరికి వేయాలనేది తన హక్కు అని చెప్పారు. రాజ్యాంగం ఆ హక్కును కల్పించిందని అన్నారు. సీఎం శివరాజ్సంగ్ చౌహాన్.. ఎప్పుడూ తప్పు చేయరని, అందుకు ఆయన పార్టీ అయిన బీజేపీకి ఓటు వేశానని తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 163 స్థానాల్లో భారీ విజయం సాధిందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితమైంది. -
ఇన్‌స్టాలో మైనర్‌తో పరిచయం.. యువకుడిపై దాడి.. ట్విస్ట్ ఏంటంటే!
సాక్షి, బెంగళూరు: సోషల్ మీడియాలో పరిచయమైన 17 ఏళ్ల బాలికతో సన్నిహితంగా ఉంటున్నాడని ఓ యువుకుడిపై కొంతమంది యువకులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. బస్టాండ్‌లో మైనర్‌తో మాట్లాడుతుండగా గుంపుగా వచ్చిన యువకులు అతడ్ని కిడ్నాప్ చేసి దారుణంగా చితకబాదారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. సుబ్రమణ్యలోని కల్లుగుండకి చెందిన హఫీద్ అనే 20 ఏళ్ల యువకుడికి ఏడాది కిత్రం ఓ మైనర్ బాలికతో(17) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. చాటింగ్ ప్రారంభించడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. తరుచూ బస్టాప్‌లో కలిసి మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే జనవరి 5వ తేదీన సుబ్రమణ్య బస్‌స్టాండ్‌లో యువకుడు అమ్మాయితో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా వచ్చిన యువకుల గుంపు అతన్ని కిడ్నాప్ చేశారు. జీపులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. బాలిక జోలికి రావొద్దని, మరోసారి ఆమోను చూడటం, మాట్లాడటం చేయవద్దని కత్తితో బెదిరించారు. ఈ ఘటనలో భాధితుడి తలకు బలమైన గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై స్పందించిన పోలీసులు ఈ ఘటనలో రెండు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. యువకుడిపై దాడి చేసినందకు 12 మందిపై కేసు నమోదు చేయడంతోపాటు.. బాధిత బాలుడిపై కూడా కేసు నమోదైంది. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు తన కూతురిని వేధింపులకు గురి చేశాడని బాలిక తండ్రి హఫీద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: Crime News: దా.. బండెక్కు! అన్నాడు.. -
ఘోరం: నిండు గర్భిణిపై దారుణంగా దాడి: వీడియో వైరల్
నిండు చూలాలుపై కొందరూ గూండాలు ఘోరంగా దాడి చేశారు. అందుకు సంబంధించిన ఘటన నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ అయ్యి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..సందీప్ అనే యువకుడు, అతడి భార్య ఉపాసనపై కొందరూ దుండగులు ఘోరంగా దాడి చేశారు. కొందరూ వ్యక్తులు వచ్చి ఆ యువకుడిని అతడి మామ గురించి ఆరా తీశారు. ఐతే ఆ యువకుడు అతని మామ గురించి సరైన సమాచారం ఇవ్వడం లేదని వారంతా దుర్భాషలాడటం ప్రారంభించారు. దీన్ని సందీప్ వ్యతిరేకించడంతో అతడిపై దుండగలు దాడి చేయడం ప్రారంభించారు. దాడిని ఆపేందుకు సందీప్ భార్య ఉపాసన ప్రయత్నించగా.. ఆమెపై కూడా దారుణంగా దాడి చేశారు సదరు దుండగులు. దీంతో ఉపాసన స్ప్రుహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత వారి కేకలు విని స్థానికులు రావడంతో గొడవ సద్దుమణిగింది. ఈ మేరకు పోలీసులు నిందితులు రవీంద్ర, మన్మోహన్, మన్మోహన్ కుమారుడు ఆదేశ్‌లుగా గురించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు శైలేంద్ర బాజ్‌పాయ్ అన్నారు. #UttarPradesh | A video of a pregnant woman being beaten by some local goons surfaced on the internet They mercilessly beat a man and his wife for not giving information about their uncle, police said pic.twitter.com/uK94N59oJu — Hindustan Times (@htTweets) December 17, 2022 (చదవండి: భార్యతో మీద కోపంతో.. రెండేళ్ల కొడుకును భవనంపై నుంచి పడేసి..) -
బూట్లు వేసుకోలేదని విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపాల్
సాక్షి, వరంగల్: బూట్లు ఎందుకు వేసుకురాలేదు అంటూ విద్యార్థులపై ప్రిన్సిపాల్ తన ప్రతాపాన్ని చూపాడు. ఏకంగా కంక కట్టెతో విచక్షణ రహితంగా కొట్టడంతో విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్క నూర్ మోడల్ స్కూల్లో బుధవారం చోటు చేసుకుంది. విద్యార్థుల కథనం ప్రకారం...మోడల్ స్కూల్లో పదవ తరగతి వరకు మొత్తం 490 మంది విద్యార్థులున్నారు. బుధవారం పాఠశాలలో ప్రార్థన అనంతరం విద్యార్థులు తమ క్లాస్‌లోకి వెళ్తన్న క్రమంలో 10వ తరగతికి చెందిన హర్షిత్, చరణ్, శ్రావణ్, రాంచరణ్, అక్షయ్‌కుమార్, హనీఫ్, ఫరూక్ అబ్దుల్‌తోపాటు 12మంది విద్యార్థులు బూట్లు వేసుకురాలేదు. గమనించిన ప్రిన్సిపాల్ ప్రణయ్‌కుమార్ వారందరిని పక్కకు నిలబెట్టి బూట్లు ఎందుకు వేసుకురాలేదని అడుగుతూ కొట్టడం ప్రారంభించాడు. ‘రేపు వేసుకువస్తాం కొట్టకండి సార్’అంటూ కన్నీరు పెట్టుకున్నప్పటికి వినకుండా విచక్షణా రహితంగా చితకబాదాబడు. దీంతో విద్యార్థుల పిరుదల కిందబాగంలో కమిలిపోయి కొంతమంది విద్యార్థులు నడవలేని పరిస్థితికి చేరుకోవడంతో కొందరు ఉపాధ్యాయులు వారిని సమీపంలోని పీహెచ్‌సీకి తరలించి చికిత్స నిర్వహించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల పాఠశాలకు చేరుకొని తమ పిల్లల్ని ఈ విధంగా కొట్టడం తగదు అంటూ ప్రిన్సిపాల్‌ని నిలదీశారు. షూస్ వేసుకురాకుంటే క్రమశిక్షణలో భాగంగా కొట్టానని, కొట్టకుంటే వారు వినరు అని ప్రిన్సిపాల్ ప్రణయ్ కుమార్ వివరణ ఇచ్చాడు. -
వైరల్ వీడియో: ఆప్ ఎమ్మెల్యేను దారుణంగా కొట్టిన సొంత పార్టీ కార్యకర్తలు
-
కీచక ఉపాధ్యాయుడు.. ప్రత్యేక తరగతులని చెప్పి విద్యార్థినిని..
సాక్షి, హుస్నాబాద్: విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలానికి చెందిన ఓ యువతి స్థానికంగా ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జనగామ జిల్లా నర్మెట్టకు చెందిన ఏనుగు రవి ఈనెల 20న బాలికకు ఫోన్ చేసి ప్రత్యేక తరగతులు ఉన్నాయని, కాలేజీకి రావాలని చెప్పాడు. దీంతో ఆమె తన సోదరుడితో కలిసి బైక్‌పై కళాశాలకు వచ్చింది. ఆదివారం కావడం, కళాశాల మూసి ఉండడంతో వెంటనే ఉపాధ్యాయుడికి ఫోన్ చేసింది. తాను నర్మెట్ట నుంచి వస్తున్నాని, లద్నూరు వరకు రావాలని విద్యార్థినికి సూచించాడు. యువతి తన సోదరుడితో కలిసి లద్నూరుకు వెళ్లింది. ఉపాధ్యాయుడు చెప్పిన చోటుకు నడుచుకుంటూ వెళ్లగా, అతడు తన బైక్‌పై ఎక్కించుకొని లద్నూరు రిజర్వాయర్ పైకి తీసుకువెళ్లాడు. గమనించిన యువతి సోదరుడు మరికొంత మందితో కలిసి ఉపాధ్యాయుడిని వెంబడించి పట్టుకున్నారు. ప్రత్యేక తరగతుల పేరిట విద్యార్థిని ఎక్కడి తీసుకువెళుతున్నావని ప్రశ్నించగా, పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో యువతి సోదరుడు, మరికొంత మంది కలిసి ఉపాధ్యాయుడు రవికి దేహశుద్ధి చేశారు. ఈ విషయంపై ఎస్ఐ నారాయణను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. చదవండి: కానిస్టేబుల్ ఈశ్వర్.. ఇతని రూటే సెపరేటు.. దొంగలతో చేతులు కలిపి -
Video: ఆప్ ఎమ్మెల్యేపై సొంత పార్టీ కార్యకర్తల దాడి.. ఎందుకంటే!
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. పోటీలో మహిళల అభ్యర్థులే అధికంగా ఉన్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రత్యర్ధులపై విమర్శలు ఎక్కుపెడుతూ ఎవరికి వారే ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాగా మున్సిపోల్స్ ఎన్నికల వేళ ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌పై సొంత పార్టీ కార్యకర్తలే దాడి చేయడం కలకలం రేపుతోంది. మటియాలా ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌ను జనాలు తీవ్రంగా కొట్టారు. ఎమ్మెల్యే యాదవ్ సోమవారం శ్యామ్ విహార్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ విషయంలో వాగ్వాదం చెలరేగడంతో యాదవ్ పట్ల కొంతమంది ఆప్ కార్యకర్తలు ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. చదవండి: తిహార్ జైలులో ఆప్ మంత్రి మసాజ్ వీడియోలో ట్విస్ట్.. అతను ఫిజియో థెరపిస్ట్ కాదు.. రేపిస్ట్.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇందులో ఆప్ కార్యకర్తలు గులాబ్ సింగ్ యాదవ్‌ను కాలర్‌తో పట్టుకోవడం, చేతులతో దాడి చేయడం కనిపిస్తుంది. చివరకు తన సొంత పార్టీ కార్యకర్తల ఆగ్రహం నుంచి తనను తాను రక్షించుకోవడానికి పరుగులు తీయడం స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేపై దాడి ఘటనపై ఇప్పటి వరకు ఆప్ స్పందించలేదు. అయితే ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నందుకు సొంత పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యేలను కొట్టినట్లు బీజేపీ ప్రచారం చేస్తోంది. ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తన అవినీతి ఎమ్మెల్యేలందరికీ ఇక్కొక్కరిగా ఇదే జరుగుతుందని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే గులాబ్ సింగ్ కొట్టిపారేశారు. టికెట్లు అమ్ముకున్నారంటూ బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తుందన్నారు. తనపై దాడి చేసింది బీజేపీ కార్యకర్తలేనని ఆరోపించారు. తాను చావ్లా పోలీస్ స్టేషన్లో ఉండగా.. ఆ వార్డుకు చెందిన బీజేపీ కార్పొరేటర్, వారి అభ్యర్థిని పీఎస్‌లో చూసినట్లు తెలిపారు. भाजपा उम्मीदवार थाने के अंदर आरोपियों की पैरवी कर रहा है भाजपा बुरी तरह नगर निगम चुनाव हार रहीं है जितनी मर्जी साजिश कर ले। https://t.co/q2minYuvHq pic.twitter.com/rPY2EDxikC — Gulab Singh yadav (@GulabMatiala) November 21, 2022 -
Hyderabad: తండ్రి చేతిలో గాయపడిన చిన్నారి మృతి
సాక్షి, హైదరాబాద్: కన్న కూతురిని విక్షణారహితంగా కొట్టడమేగాక పైకెత్తి కింద పారవేడయంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. సైఫాబాద్ ఇన్స్‌స్పెక్టర్ సత్తయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గత శనివారం ఇంట్లో బాత్రూంలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి సకినా ఫాతిమాను ఆమె తండ్రి బాసిత్ ఖాన్ తీవ్రంగా కొట్టడమేగాక పాటు పైకెత్తి నేలకేసి కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తల్లి సనా ఫాతిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Telangana: ఆర్టీసీ కీలక నిర్ణయం.. వారికి ఉద్యోగాలకు ఓకే! -
వాహనదారుడిపై చేయిచేసుకున్న ట్రాఫిక్ సీఐ
-
అమానుష ఘటన: భార్యను విద్యుత్ స్థంబానికి కట్టి చితకబాది...వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లో ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రబుద్ధుడు భార్యను నడిరోడ్డుపై దారుణంగా చితకొట్టాడు. చుట్టూ ఉన్నవాళ్లంతా ఈ ఘటనను వీడియో తీస్తూ కూర్చున్నారే తప్ప అడ్డుకోలేదు. సదరు మహిళను ఈడ్చుకుంటూ లాక్కెళ్లి మరీ హింసించాడు. ఈ ఘటన తాలుకా వీడియో ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. అతని దురుసు ప్రవర్తనను చూసి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. అసలేం జరిగిందంటే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...కుసుమా దేవి అనే మహిళను ఆమె భర్త శ్యాంబిహారి విద్యుత స్థంభానికి కట్టి దారుణాతి దారుణంగా చితకొట్టాడు. అక్కడితో ఆగకుండా ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మరీ కొట్టడం ప్రారంభించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అర్సేనా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని స్థానికుల సెల్ ఫోన్లో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియోని చూసిన పోలీసులు రంగంలోని దిగి విచారించగా...బాధితురాలు కుసమా దేవి, నిందితుడు శ్యాంబిహారిగా గుర్తించారు. ఈ మేరకు బాధితురాలు తన భర్త శ్యాంబిహారి, అతని తల్లి బర్ఫాదేశి తనను నిర్బంధించి మరీ హిసించారని పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐతే నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. #WATCH उत्तर प्रदेश: आगरा में एक पति ने अपनी पत्नी को खंबे से बांधकर डंडे से पीटा। घटना का वीडियो वायरल हुआ। (20.07) pic.twitter.com/ND9CbIo9dP — ANI_HindiNews (@AHindinews) July 20, 2022 (చదవండి: నిత్యపెళ్లికొడుకు మామూలోడు కాదు.. 13 మందిని శారీరకంగా వాడుకొని.. ) -
తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అమానుషం.. ఫొటోలు, వీడియోలు తీసి
కాజీపేట: తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని పక్కా ప్లాన్‌తో ఇంట్లో బంధించి విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. యువకుడి తండ్రి, యువతి బంధువులు పోలీసులకు పరస్పర ఫిర్యాదులు చేయడంతో ఇరువర్గాలపై కేసు నమోదైంది. బాధితుడి తండ్రి శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన బైరపాక ప్రభుదాస్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ డీజిల్ కాలనీలో కుటుంబంతో అద్దెకు ఉండేవాడు. ఆయన కుమారుడు ప్రసాద్ ఇంటి యజమాని కూతురుతో ప్రేమగా ఉంటున్నాడనే అనుమానంతో గొడవలు జరిగాయి. దీంతో ప్రభుదాస్ కుటుంబం దూరంగా వేరే ఇంటికి మారింది. ఈ క్రమంలో బుధవారం అమ్మాయితో బంధువులు ప్రసాద్‌కు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు. ఇంట్లోకి తీసుకెళ్లి తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేస్తూ ఫొటోలు, వీడియోలు తీసి ప్రసాద్ మిత్రులకు పంపించడంతో విషయం వెలుగు చూసింది. (చదవండి: టోనీ వ్యవహారంలో మనీల్యాండరింగ్) బాధితుడి తండ్రి బంధువులు, మిత్రులతో వెళ్లి ప్రసాద్‌ను విడిచిపెట్టాలని వేడుకోగా మరోమారు అమ్మాయి జోలికి రావొద్దని రాయించుకుని వదిలేశారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా యువకుడితో పాటు అతడి కుటుంబసభ్యులపై అమ్మాయిని వేధిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్‌రెడ్డి శుక్రవారం విలేకరులకు తెలిపారు. వీరితోపాటు యువకుడిని చితకబాదిన మాచర్ల శేఖర్‌తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. (చదవండి: పెళ్లి చేసుకుంటానని.. పలుమార్లు లైంగికదాడి చేసి మోసం..) -
బెంగాలీ స్వర్ణకారులను చితకబాదిన గోల్డ్ వ్యాపారి
-
అరాచకం.. స్కూటర్‌ను ఢీకొట్టాడని చితకబాదారు; వీడియో వైరల్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒక వాహనదారుడిని, అతని మిత్రుడిని నడిరోడ్డుపైనే చితకబాదిన వీడియో ఆలస్యంగా వెలుగుచూసింది. తమ స్కూటర్‌ను ఢీకొట్టాడని కోపంతో సదరు బండి యజమాని, అతని బంధువులు వారిని రోడ్డుపైనే అడ్డగించి కర్రలతో చితకబాదుతూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇక వీడియో ఆధారంగా చూసుకుంటే చేతిలో హెల్మెట్ పట్టుకొని ఉన్న వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఒక వ్యక్తి కర్రతో దాడి చేయగా.. మరో వ్యక్తి అతనిపై ముష్టి యుద్దానికి దిగాడు. ఎవరు చెప్పినా వినిపించుకోకుండా అతనిపై పంచుల వర్షం కురిపించాడు. వాహనదారుడి స్నేహితుడిని కూడా చితకబాదారు. అక్కడే ఉన్న మహిళ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమెను పక్కకు తోసి మరి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ తర్వాత వారిద్దరిని పక్కన పడేసి వెళ్లిపోయారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ దాడిలో వాహనదారుడి తలకు గాయమవడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆలస్యంగా వెలుగు చూడడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల సమాచారం మేరకు గాయపడిన వ్యక్తి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి: గదిలో మూత్రం పోశాడని తిట్టింది.. పగ పెంచుకుని ప్రాణ భయంతో నూతన జంట పరుగు.. వెంటాడి వేటాడి దారుణం दिल्ली के पालम इलाके की साद कॉलोनी में मामूली बात पर रोडरेज में लड़के की पिटाई,बाइक सवार पर रॉड से हमला pic.twitter.com/wHtX3A3pAm — Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) June 27, 2021 -
కరోనా పేషెంట్ మృతి.. హెల్త్ వర్కర్లపై దాడి
ఇంఫాల్: కరోనా మహమ్మారిపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న హెల్త్ వర్కర్లపై భౌతిక దాడులు జరుగుతున్నాయి. మొన్న అస్సాంలో హెల్త్ వర్కర్లపై దాడి ఘటన మరువకముందే తాజాగా మణిపూర్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(జెన్‌ఐఎమ్‌ఎస్)లో కరోనా పేషెంట్ బంధువులు హెల్త్ వర్కర్లపై దాడికి దిగారు. దీంతో పాటు ఐసీయూ వార్డులోనూ మెడికల్ ఎక్విప్మెంట్ను నాశనం చేశారు. ఇవన్నీ అక్కడి ఆసుపత్రి సీసీటీవీలో రికార్డు అయ్యాయి. కాగా 33 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఆదివారం కన్నుమూయడంతో ఆమె బంధువులు ఆగ్రహంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సమాచారం. ఆసుపత్రి వర్గాలు అందించిన సమాచారం మేరకు.. మూడ్రోజుల క్రితం కరోనాతో సదరు మహిళ మా ఆసుపత్రిలో చేరింది. అప్పటికే ఆమెకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో ఐసీయూకు షిఫ్ట్ చేయాలని మహిళ బంధువులకు ఆసుపత్రి వర్గం తెలిపింది. కానీ వారు అందుకు ఒప్పుకోలేదు.. అయితే ఆదివారం ఆమె పరిస్థితి విషమించడంతో ఐసీయూలోకి షిఫ్ట్ చేసిన కాసేపటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆసుపత్రికి వచ్చి హెల్త్ వర్కర్లపై దాడికి దిగారు. అంతేగాకుండా ఐసీయూలోని మెడికల్ ఎక్విప్మెంట్ను నాశనం చేశారు. కాగా హెల్త్ వర్కర్లపై దాడిని జెన్‌ఐఎమ్‌ఎస్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ కేహెచ్ లోకేశ్వర్‌సింగ్ ఖండించారు. కరోనా మహమ్మారి కష్టకాలంలో పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్న వారిపై దాడికి దిగడం అవమానీయం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అని పేర్కొన్నారు. చదవండి: డాక్టర్‌పై భయానక దాడి.. వెంటాడి.. వేటాడి -
నడిరోడ్డుపై మహిళపై దాడి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రోజురోజుకు మహిళలపై అరాచకాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఘజియాబాద్ జిల్లాలో మహిళపై ఒక వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. ఆమెను నడిరోడ్డుపై దారుణంగా కొట్టాడు. ఆమె పైకి లేస్తుండగా కుర్చీతో ఆమెపై దాడి చేసి లేవనంతగా కొట్టాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలో నమోదయ్యాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆవ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎవరు అతని మీద ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. ఇక ఈ వీడియోను చూసిన వారందరూ ఆ మహిళపై దాడి జరుగుతుంటే ఎవరు కాపాడటానికి ముందుకు రాలేదని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కొట్టి వెళ్లిపోయిన తరువాత ఒక వ్యక్తి ఆమెకు కుర్చీ తీసుకువచ్చి సాయం చేశాడు. అయితే అప్పటి దాకా ఎవరూ ముందు వచ్చి ఆ నిస్సహాయ మహిళను ఆదుకోలేదంటూ మండిపడుతున్నారు. ఇది సమాజం సిగ్గుపడాల్సిన విషయం అంటూ ట్వీట్ చేస్తున్నారు. చదవండి: మొబైల్ చార్జర్ కేబుల్ మెడకు చుట్టి.. -
మామ ఉద్యోగం కోసం బావమరిదిపై..
సాక్షి, మంచిర్యాల : తన మామ సింగరేణి ఉద్యోగి కావడంతో ఎలాగైనా దానిని చేజిక్కించుకోవాలని భావించి అందుకు అడ్డుగా ఉన్న బావమరిదిపైనే ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీఐ కుమారస్వామి, ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం.. హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామానికి చెందిన నీలం తిరుపతికి కుమారుడు క్రాంతికుమార్, కుమార్తె ఉన్నారు. కూతురు ఏడాది క్రితం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రేణికుంట నవీన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటినుంచి నవీన్ తిరుపతి సింగరేణి ఉద్యోగంపై కన్నేశాడు. అయితే తన కుమారుడికే ఉద్యోగం పెట్టిస్తానని చెప్పడంతో ఎలాగైనా బావమరిదిని చంపాలని స్నేహితులతో కలిసి పన్నాగం పన్నాడు. గురువారం రాత్రి నవీన్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ముల్కల్లకు వచ్చాడు. ఎదురుగా వస్తున్న క్రాంతికుమార్‌పై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. క్రాంతికుమార్ కేకలతో కుటుంబ సభ్యులు వచ్చి నవీన్‌ను అడ్డుకున్నారు. క్రాంతికుమార్‌ను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నవీన్‌ను స్థానికులు పట్టుకున్నారు. నిందితులు ముగ్గురు కారులో పారిపోతూ.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో కారును అక్కడే వదిలి ఇద్దరు పారిపోయారు. మరొకరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రోడ్డు పక్కన నిందితులు పడేసిన మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
నెగిటివ్ రివ్యూ ఇచ్చిందని..
బీజింగ్: ఆన్లైన్ షాపింగ్‌లో చాలా మంది రివ్యూలను చూసే ఒక వస్తువును కొంటుంటారు. ఆన్లైన్ నుంచి ఏదైన కొన్నప్పుడు మనం కొన్న రేటుకు తగ్గట్టుగా ఆ వస్తువు క్వాలిటీ ఉందా, చెప్పిన తేదికి వస్తువును డెలివరీ చేశారా, వస్తువు ఏమైనా పాడైందా, రిటర్న్ పాలసీ ఎలా ఉంది ఇవన్నీ చూసి రేటింగ్ ఇస్తూ ఉంటాం. అయితే అలా రేటింగ్ ఇవ్వడమే ఒక కస్టమర్ పాలిట శాపంగా మారింది. నెగిటివ్ రివ్యూ ఇచ్చిన పాపానికి ఆమెను వెతుకుంటూ 850 కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఆమెను చావ గొట్టాడు ఒక షాపు యజమాని. చైనాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. (వాచ్.. తూచ్..) జియో డి అనే కస్టర్మర్ ఒక ఆన్‌లైన్‌స్టోర్ నుంచి 300 యువాన్ల విలువైన బట్టలను ఆర్డర్ పెట్టింది. అయితే మూడురోజుల్లో అవి వస్తాయని కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది. అయితే అనుకున్న తారీఖు నాటికి అవి డెలివరీ కాలేదు. దీంతో ఆమె ఆన్లైన్లో ఆ స్టోర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చింది. దీంతో స్టోర్ స్కోరు 12 పాయింట్లు పడిపోయింది. దీంతో కోపం వచ్చిన యజమాని జాంగ్ ఆమెను వెతుక్కుంటూ వెళ్లి నెగిటివ్ రివ్యూ ఇచ్చినందుకు ఆమెను రోడ్డు మీదే చితక్కొట్టాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తీవ్రంగా గాయాలపైన ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రతిఒక్కరూ షాపు యజమాని మీద తీవ్రంగా మండిపడుతున్నారు. (ఆన్లైన్ ద్వారా ఘరానా మోసం; యువకుల అరెస్టు) -
నీటి కొరత ఉంటే తలస్నానం చేస్తారా?
సాక్షి, రఘునాథపల్లి : హోలీ సందర్భంగా సోమవారం రంగులు చల్లుకున్న విద్యార్థినులు తలస్నానాలు చేశారు. నీటి కొరత ఉన్నప్పుడు తలస్నానాలు చేసి నీటిని వృథా చేశారంటూ ఆగ్రహంతో విద్యార్థినులను కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి చితకబాదింది. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కేజీబీవీలో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం ప్రత్యేకాధికారి సుమలత పాఠశాలకు వచ్చేసరికి సంపులోని నీరు ఖాళీ అయింది. దీంతో తలస్నానాలు చేసిన బాలికలందరినీ పిలిచి చేతి వేళ్లపై కర్రతో కొట్టింది.ఘటనపై సుమలతను వివరణ కోరగా.. ‘పాఠశాలలో నీటి సమస్య ఉంది.. కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున రంగులు చల్లుకోవద్దని చెప్పినా వినలేదు’ అని చెప్పారు. -
వరకట్నం కోసం భార్యకు నరకం చూపిన భర్త
-
ఆహా.. యూపీలో ఏమి సహనం?!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఎవరైనా అంటే.. అన్న వారిని పట్టుకొని చావ చితక్కొడుతారు అక్కడి అల్లరి మూకలు. బుధవారం నాడు ఒక్క రోజులో జరిగిన నాలుగు దైర్జన్య, హింసాత్మక సంఘటనలు అక్కడి ‘సహనానికి’ మచ్చుతునకలు. లక్నోలో బుధవారం పట్టపగలు రోడ్డు పక్కన డ్రైఫ్రూడ్స్ అమ్ముతున్న ఇద్దరు కశ్మీరీలను పట్టుకొని కాషాయ దుస్తులు ధరించిన యువకులు చితకబాదారు. పైగా వారే వీరోచితంగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. (యూపీలో కశ్మీరీలపై దుండగుల దాడి) అదే రోజు ముజాఫర్‌నగర్‌లో విద్యా, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఓ టీవీ కార్యక్రమంలో ప్రశ్నించినందుకు ఓ యువకుడిని వెతికి పట్టుకొని బీజేపీ కార్యకర్తలు చితక బాదారు. టెర్రరిస్టుగా ముద్ర వేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆన్లైన్లో సర్కులేట్ అవుతోంది. అదే రోజు సంత్ కబీర్ నగర్ జిల్లాలో బీజేపీ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే ప్రజల ముందే బహిరంగంగా కొట్టుకున్నారు. వారిద్దరు ఓ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. శంకస్థాపన పలకం మీద తన పేరు ఎందుకు లేదంటూ బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి ప్రశ్నించారు. పేర్లు పెట్టదల్చుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ బాఘెల్ సమాధానం చెప్పారు. దాంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. పట్టలేని ఆవేశానికి గురైన బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి ఒక్కసారిగా తన కాలికున్న బూటును లాగి దాంతో బాఘెల్ నెత్తిపై ఠపీ ఠపీమంటూ కొట్టారు. ఆ తర్వాత ఈ సంఘటనకు ప్రతీకారంగా జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలోకి ఎమ్మెల్యే అనుచరులు జొరబడి అక్కడున్న ఎంపీ శరద్ త్రిపాఠిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు లాఠీచార్జి జరిపి వారిని చెదరగొట్టారు. (ఎమ్మెల్యేను షూతో చితక్కొట్టిన బీజేపీ ఎంపీ) అదే రోజు మీరట్‌లో గుడిశెవాసులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు రాళ్లు విసురుకున్నారు. పోలీసులు వచ్చి దౌర్జన్యంగా తమ గుడిసెలను తగులబెట్టారంటూ గుడిశెవాసులు రోడ్డెక్కి ప్రైవేటు వాహనాలను, బస్సులను దగ్ధం చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఎంతటి ‘సహనం’ రాజ్యమేలుతుందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ మరుసటి రోజు అంటే, గురువారం నాడు ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వం ‘నయే భారత్ నయా ఉత్తరప్రదేశ్’ నినాదంతో ఇచ్చిన పూర్తి పేజీ యాడ్ అన్ని ప్రధాన పత్రికల్లో ప్రచురితమైంది. తన ప్రభుత్వం హయాంలో అన్ని నగరాల్లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగయిందని, నేరస్థులను అనుమాత్రం ఉపేక్షించమనే తమ విధానం విజయవంతం అయిందని కూడా ఆ యాడ్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఆ యాడ్ మధ్య భాగంలో శాంతి భద్రతల పరిస్థితి మెరగయిందన్న శీర్షిక కింద నేరాల పట్ల అణు మాత్రం సహించని విధానాన్ని అమలు చేస్తున్నామని, పోలీసు బృందాల ఎన్కౌంటర్ల వల్ల 69 మంది నేరస్థులు మరణించారని, 7043 మంది అరెస్టయ్యారని, ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పును గమనించి 11,981 మంది నేరస్థులు తమ బెయిళ్లను రద్దు చేసుకొని కోర్టుల ముందు హాజరయ్యారని చెప్పడంతో రాష్ట్ర పోలీసులు అందిస్తున్న సేవల గురించి, లక్ష మంది పోలీసుల నియామకానికి ప్రక్రియ కొనసాగుతోందని కూడా ఆ యాడ్‌లో పేర్కొన్నారు. బుధవారం జరిగిన నాలుగు, దౌర్జన, హింసాత్మక సంఘటనలకు సబంధించిన వీడియోలు అందుబాబులో ఉన్నా ఒక్క గుడిశెవాసులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి మినహా మిగతా మూడు సంఘటనల్లో పోలీసులు ఇంతవరకు ఏ చర్యా తీసుకోలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. అనవసరమైన పబ్లిసిటీ పేరిట లక్షల రూపాయలు తగిలేసే బదులు, శాంతి భద్రతల పరిరక్షణకు కేటాయిస్తే ఎప్పటికైనా ‘సహనం’ వస్తుందేమో! -
యూపీలో ఒక్క రోజులోనే నాలుగు హింసాత్మక సంఘటనలు
-
తమిళనాడులో రెచ్చిపోయిన పోలీసులు
-
డీజిల్ దొంగలించారని ఆరోపిస్తూ..
-
ప్రేమజంటను చితకబాదిన దుండగుల ముఠా
-
కీచక టీచర్‌కు దేహశుద్ది
-
భార్యను చెట్టుకు కట్టేసి భర్త అమానుషం..
-
వందమందిలో భార్యపై భర్త పైశాచికత్వం
సాక్షి, లక్నో : మానవత్వం మంటకలిసింది. ఒకరిని వేధిస్తుంటే మరొకరు చూసి ఆనందపడే పరిస్థితి తారా స్థాయికి వెళ్లింది. కనీసం జాలిపడకపోగా కళ్లప్పగించి చూసి వీడియోలు తీసుకోవడం షరా మాములు అయింది. ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొడుతుంటే చుట్టూ ఉన్న వందమందిలో ఏ ఒక్కరు కూడా అడ్డుకోలేదు. పైగా అదొక సినిమా చూసినట్లు చూశారు. వందమందిలో ఎక్కువశాతం పురుషులే ఉన్నారు. అయినప్పటికీ అలా చేయడం తప్పు అని ఏ ఒక్కరు చెప్పలేదు. ఇదంతా కూడా పంచాయతీ పెద్దలు నిర్వహించిన ఘనకార్యం. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంలోని మహిళపై పరాయి పురుషుడితో సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు కూడా భర్తే చేసి పంచాయతీ పెట్టించాడు. దాంతో ఓ వందమందికి పైగా ఓ చోట చేరి ఆమెను కట్టేసి కొట్టాలని శిక్ష విధించారు. అలా చేయడం తప్పు అని ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. వెంటనే ఆ మహిళ చేతులు తాడుతో కట్టి ఓ చెట్టుకొమ్మకు వేలాడదీసి కొట్టడం మొదలు పెట్టారు. ఓ సైకిల్ ట్యూబ్, టైరు తీసుకొని అందరూ చూస్తు నవ్వుతుండగా ఆమె భర్త దాదాపు చచ్చేన్ని దెబ్బలు కొట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక ఆమె స్పృహకోల్పోయింది. ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వేగంగా స్పందించిన పోలీసులు ఆమె భర్తను, పంచాయతీ ప్రధాన్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మరో 25మందిపై కూడా కేసులు పెట్టారు. -
బ్యాట్‌తో కొట్టిన స్నేహితులు: యువకుడు మృతి
పాడేరు: విశాఖ జిల్లా పాడేరు మండలం ఈరాడపల్లి గ్రామంలో క్రికెట్ మ్యాచ్‌లో ఘర్షణ ఒకరి నిండు ప్రాణాలు బలిగొంది. ఓ యువకుడిని అతడి స్నేహితులే క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నడ మాట్లాడలేదని....!
సాక్షి, బెంగళూరు : దేశంలో నెలకొన్న ప్రాంతీయ దురాభిమానాలు వ్యక్తుల్లో సంకుచితత్వాన్ని రెచ్చ గొడుతున్నాయి. కర్ణాటకలో కన్నడం మాట్లాడలేదని అన్నదమ్ములను కొందరు వ్యక్తులు చావగొట్టిన ఘటన బెంగళూరులో జరిగింది. దాదాపు ఐదేళ్లుగా కశ్మీర్‌కు చెందిన అన్నదమ్ములు బెంగళూరులో నివాసముంటున్నారు. ఎప్పటిలానే ఇద్దరు సోదరులు.. డిసెంబర్12 రాత్రి.. ఒక స్టార్ హోటల్లో భోజనం చేసి కారులో ఇంటికి వెళుతున్నారు. సంజయ్ నగర్‌లోని ఎన్టీఐ బస్టాండ్ దగ్గరకు వచ్చాక.. వారిని పదిమంది యువకులు అడ్డగించారు. కన్నడంలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. వారితో సోదరులిద్దరూ కన్నడంలో మాట్లాడకపోవడంతో.. దుండగులు భౌతిక దాడికి దిగారు. కన్నడంలో మాట్లాడ్డం వస్తేనే ఇక్కడ ఉండండి.. లేకపోతే.. కర్ణాటక నుంచి వెళ్లిపోండి అంటూ సోదరులను దుండగులు బెదిరించారు. మేం ఉత్తర భారతం నుంచి వచ్చాం.. మేము కన్నడం ఎలా మాట్లాడగలం అంటూ ఇద్దరు సోదరులు వారిని ప్రశ్నించారు. దీంతో మరింత ఆగ్రహించిన దుండగులు సోదరుల కారుపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనపై బాధితులు బెంగళూరు నార్త్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై బెంగళూరు నార్త్ డీసీపీ చేతన్ సింగ్‌రాథోడ్ మాట్లాడుతూ.. ఇది వాస్తమేనని చెప్పారు. నిందితుల్లో ఇద్దరిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. నిందితులపై సెక్షన్ 341, సెక్షన్ 504 కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. -
బీజేపీ కౌన్సిలర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టారు
వడోదర : గుజరాత్లో ఓ బీజేపీ కౌన్సిలర్‌కు ప్రజలు చుక్కలు చూపించారు. నిర్మాణాల కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెట్టుకు కట్టేసి కొట్టారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. హష్ముఖ్ పటేల్ అనే వ్యక్తి గుజరాత్లో బీజేపీ కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. అయితే, వడోదర మున్సిపల్ కమిషనర్ ఆఫీసు ఆదేశాల మేరకు స్ధానిక అధికారులు ఆ ప్రాంతాల్లోని ఇళ్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చి వేశారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఆ ప్రాంత వాసులంతా మున్సిపల్ కమిషనర్ వద్దకు వెళ్లగా తాము నోటీసులు పంపించామని, కౌన్సిలర్ వద్ద ఉన్నాయని చెప్పారు. దీంతో మరింత ఆగ్రహంతో అక్కడికి వెళ్లి ఆయనను ప్రశ్నించగా తనకు నోటీసులు అందలేదని తెలిపారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన వారంతా కూడా ఆయనపై చేయి చేసుకున్నారు. చెట్టుకు కట్టేసి చొక్కా చింపేసి పిడిగుద్దులు గుప్పించారు. తమ ఇళ్లను కూల్చి వేసే నోటీసులు వచ్చినా ఎందుకు తమకు సమాచారం ఇవ్వలేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద వైరల్‌గా కూడా మారింది. దీనికి సంబంధించి 30మందిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఉత్తరప్రదేశ్ లో మరో అమానుషం
లక్నో: ఉత్తరప్రదేశ్ లో మరో అమానుషం చోటు చేసుకుంది. తమను వేధిస్తున్న వారిని ప్రశ్నించిన పాపానికి ఓ దంపతుల పట్ల దుండగులు అమానుషంగా ప్రవర్తించారు. గుండాల్లో చెలరేగిన ఆ దుర్మార్గులు ఆ యువ దంపతులపై దారుణంగా దాడిచేసి కొట్టారు. ఉత్తరప్రదేశ్ లోని అగ్రా, మణిపురి జిల్లాలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ మొత్తం ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. వివరాల్లోకివెళితే.. ఓ జంట తాము వెళ్లాల్సిన అడ్రస్ వెతుక్కుంటున్న క్రమంలో స్థానికులు కొందర్ని సంప్రదించారు. ఇంతలో రద్దీగా మార్కెట్లో ఓ దుండగుడు వచ్చి ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె చున్నీని లాగి, అమానవీయంగా ప్రవర్తించాడు. దీన్ని గమనించి ఆమె భర్త వారించాడు. అంతే మరో ఇద్దరు దుండగులు సహా చెలరేగి పోయారు. కర్రతో దాడికి దిగారు. ఈ ఘటనలో యువతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి ఒక పాప కూడా ఉన్నట్టు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరిలో ఒకరిని ఆనంద్ యాదవ్ గా గుర్తించారు. మరోవైపు నిందితులను అరెస్ట్ చేయకపోతే తనను తాను కాల్చుకు చనిపోతానని బెదిరించినట్టుతెలుస్తోంది. -
160 మంది డాక్టర్లు గన్ లైసెన్స్ కోసం అప్లై చేశారు!
బీహార్ రాష్ట్రంలో వైద్యులపై దాడులు రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. వైద్యులకు ఫోన్లు చేస్తున్న రౌడీ మూకలు రూ.కోటి నుంచి 50 లక్షల వరకు డబ్బు డిమాండ్ చేస్తున్నారు. నెల నెల మామూలు ఇవ్వాలని లేకపోతే చితకబాదుతామని లేదా కాల్చి చంపుతామని బెదిరిస్తున్నారు. దీంతో ఉలిక్కిపడిన డాక్టర్లు రక్షణ కోసం ఆయుధాలు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో దాదాపు 23 కేసులు ఇలా నమోదయినవే అంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత అక్టోబర్ లో ఆరియా జిల్లాకు చెందిన డా.యోగేంద్ర ప్రసాద్ ను కొంతమంది దుండగులు నెల వారీ మామూలుగా 10వేలు ఇవ్వడం లేదని చితక్కొట్టారు. గోపాల్ గంజ్ కు చెందిన డా.ఓ.పీ.లాల్, శివన్ కు చెందిన డా. రాజ్ కిషోర్ సింగ్ లను డబ్బులు ఇవ్వనందుకు తుపాకీతో కాల్చారు. పాట్నాకు చెందని ప్రముఖ డాక్టర్లు డా. హేమంత్ కుమార్ వర్మ, డా.ఏ.కే. సింగ్ లకు రూ.కోటి, రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వెళ్లాయి. వరుస ఘటనలతో దిగ్భ్రాంతికి గురైన బీహారీ డాక్టర్లలో 160 మంది తమకు తుపాకీ లైసెన్స్ కావాలంటూ అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ విషయం డాక్టర్లందరూ రోడ్లెక్కి పోరాటం చేస్తారని భారతీయ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్ఏ) కార్యదర్శి డా. కేకే అగర్వాల్, డా. సచ్చిదానంద కుమార్,ఐఎమ్ఏ చైర్మన్ లు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసి పిటిషన్ అందిస్తామని వివరించారు. పాలిగంజ్ లో ఆర్ధోపెడిక్ సర్జన్ గా పనిచేసే డా.ప్రవీణ్ కుమార్ ను ఆరుగురు వ్యక్తులు ఆయుధాలతో అడ్డగించడంతో ఆయన తప్పించుకు పారిపోయారని, ప్రవీణ్ అసిస్టెంట్ మాత్రం కాల్చిచంపారని, డ్రైవర్ ను తీవ్రంగా కొట్టినట్లు వివరించారు. ఈ దాడులు 2005లో డాక్టర్ల మీద జరిగిన దాడులను గుర్తుకు తెస్తున్నాయని అప్పట్లో జరిగిన దాడుల్లో కొంత మంది డాక్టర్లను బలవంతంగా రాష్ట్రం నుంచి పంపివేసినట్లుగా పాట్నాకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ తెలిపారు. -
యువతిని వేధించిన కానిస్టేబుళ్లకు దేహశుద్ధి
ప్రకాశం: ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద ఒక విద్యార్థినిని వేధించిన ఇద్దరు కానిస్టేబుళ్లకు స్థానికులు దేహశుద్ధి చేశారు. రామాయపట్నం వద్ద పనిచేసే ఇద్దరు మెరైన్ కానిస్టేబుళ్లు నాగరాజు, ఖాదర్ మస్తాన్ చీరాల నుంచి రోజూ రైలులో వచ్చి పోతుంటారు. ఆదివారం ఉదయం అదే రైలులో తోటి స్నేహితురాళ్లతో కలసి ప్రయాణిస్తున్న విద్యార్థినిని వేధించారు. దీంతో బాధితురాలు తన తండ్రి రవిబాబుకు విషయం తెలిపింది. అనంతరం తండ్రి, కూతురు కారులో వెళ్తుండగా రైల్వేరోడ్డులోని ఓ హోటల్లో టిఫిన్ చేస్తున్న సదరు కానిస్టేబుళ్లు ఆమె వైపు చూస్తూ మాట్లాడుకుంటున్నారు. దీంతో రవిబాబు కారును ఆపి, వేధింపుల విషయమై ప్రశ్నించాడు. దీనిపై కానిస్టేబుళ్లు అతనితో దురుసుగా ప్రవర్తించారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని, కానిస్టేబుళ్లకు దేహశుద్ధి చేశారు. -
భర్తను చెప్పుతో చితక్కొట్టిన భార్య
-
జాతీయ కబడ్డీ క్రీడాకారిణిపై దాడి
కాన్పూర్: జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణిపై కొందరు వ్యక్తులు కిరాతకంగా దాడి చేశారు. పిడిగుద్దులు గుప్పించి ఆమె ముఖంపై తీవ్ర గాయాలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. గతంలో కొందరు వ్యక్తులు లైంగికంగా వేధిస్తుండటంతోపాటు.. తీవ్ర ఇబ్బందులు పెడుతుండగా డాలీ సింగ్ (జాతీయ కబడ్డీ క్రీడాకారిణి) అడ్డుకుంది. దీనిని కారణంగా చేసుకొని పది నుంచి పన్నెండు మంది వ్యక్తులు చేతిలో కర్రలు, తుపాకీలు ఇతర ఆయుధాలతో వచ్చి ఆమె ఇంట్లోకి చొరబడి దాడి చేసి గాయపరిచారు. కాగా, ఇంత జరిగినా ఏ ఒక్కరిపై పోలీసులు కేసు నమోదుచేయకపోవడంపట్ల ఆమె తండ్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'మేం పోలీసుల వద్దకు వెళ్లాం. అయితే, మీరు వెళ్లండి మేం కేసు నమోదు చేస్తామని చెప్పారు. కానీ అలా చేయలేదు. ఇక డీజీపీని కలిస్తే ఆయన మమ్మల్నే సముదాయించే ప్రయత్నం చేశారు' అని చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదైందని, నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కచ్చితంగా పోలీసులు అరెస్టు చేస్తారని సమాజ్ వాది పార్టీ నాయకుడు గౌరవ్ భాటియా తెలిపారు. -
మోరల్ పోలీసింగ్ పేరుతో.. ప్రేమజంటపై దాడి!
-
దొంగ అనే నెపంతో.. సర్వర్‌పై దాడి!
-
కీచక టీచర్‌కు.. దేహశుద్ధి!
-
8వ తరగతి విద్యార్ధి పై PET దాడి
-
సినిమా స్టైల్లో ట్రై చేశాడు... దెబ్బలు మిగిలాయ్ !